.
*ధ్యానాది సాధనలు చేసినవారంతా ఎందుకు మహర్షులు కాలేకపోతున్నారు? ముక్తులు కాలేకపోతున్నారు?*
శ్లో॥
మీనః స్నానపరః ఫణీ పవనభుజ్మే మేషోస్తి పర్ణాశనః
నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః
భష్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూఢో బకః
ఏతేషాం ఫలమస్తి కిం నహి నహి జ్ఞానం పరం కారణమ్||
గంగయందే పుట్టిపెరిగిన జలచరములన్నియు, నిత్యమూ గంగా స్నానమే చేసియు, అందే నివసించి వున్ననూ, సర్పము వాయుభక్షణమును చేసినను, మేక ఆకులను తినినను, చాతకపక్షులుకు జలమే ఆహారమైనను,
ఎలుకలు సదా గుహలలో వున్ననూ, కుక్క బూడిద పూసుకున్ననూ, కొంగ మౌనమును శీలించినను, వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును ఉండదు. ఎందుకంటే వీటన్నిటికీ బాహ్యాచారమే కానీ, అంతరంగనిష్ఠ ఏమాత్రమూ ఉండదు.
పై వాటి వలె కాసేపు ధ్యానం, ఆహారనియమాలు, ప్రార్ధనలు, శాస్త్రపఠనాలు, ప్రవచనాలు వినడం... ఇత్యాది సాధనలు బాహ్యంగా ఆచరించినంత మాత్రమున ఫలితముండదు. అంతరంగనిష్ఠ ఉండాలి. సాధకునికి శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. ఎటువంటి అవరోధాలు కల్గినను, పట్టుదలతో, అనన్య దైవభక్తితో, సాగిపోవాలి, ఆత్మసాక్షత్కారం, ముక్తి లాంటి అత్యున్నత స్థితులను చేరుకోవాలంటే, హృదయ పరిశుద్ధత అత్యవసరం. అందుకు ఎంతో సాధన అవసరం..."!! "జ్ఞానాదేవతు కైవల్యం."
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి