16, ఏప్రిల్ 2025, బుధవారం

అమృతం మజ్జిగ

 *భూలోకంలో *భూలోకంలో అమృతం మజ్జిగ సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు*

*అమరత్వం యథా స్వర్గం దేవానామమమృతాద్భవేత్‌! తక్రాద్భూమౌ తథా నృణామమరత్వం హి జాయతే!*

*సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు పరమాత్ముడు. మంచినీళ్లు అడిగితే మజ్జిగ ఇచ్చి పంపే సంస్కృతి మనది. మజ్జిగ లేదా చల్లకూ... తెలుగువారికీ అనుబంధం అనాదిగా ఉంది. క్షేమశర్మ తన ‘క్షేమకుతూహలం’ గ్రంథంలో మజ్జిగతో అనేక ప్రయోగాలు చెప్పాడు. మజ్జిగని సంస్కృతంలో ‘తక్రం’ అంటారు. ‘తక్రం’ ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకూ పనికొచ్చే ఔషధం. వాపుల్ని కరిగించే శక్తి ఉంది. మొత్తం జీర్ణాశయ వ్యవస్థని బల సంపన్నం చేస్తుంది. లివరు, స్ప్లీను లాంటి మృదువైన అవయవాలలో కలిగే వ్యాధుల్ని నివారిస్తుంది. రక్త పుష్టి ఇస్తుంది. తీసుకున్న ఆహారంలో పోషకాలు వంటబట్టేలా చేస్తుంది. వేసవిలోనే కాదు, అన్ని కాలాల్లో తీసుకోదగిన ఔషధం మజ్జిగ. నెయ్యి, నూనెలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు మజ్జిగ తాగితే ఆ దోషం పోతుంది. జఠరాగ్నిపెరుగుతుంది. కొందరికి మజ్జిగంటే పడదు. దాని వాసన సరిపడకపోవటం ఒక కారణం. ఇంకొందరికి మజ్జిగ తాగితే జలుబు చేస్తుందని భయం. మరికొందరికి మజ్జిగ అరగదనీ, త్రేన్పులు వస్తాయని అనుమానం. మజ్జిగలో నీళ్లు తప్ప ఏమీ లేవనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఇవన్నీ మజ్జిగ ఉపయోగాలు తెలియక పెంచుకున్న అపోహలు. ఒక గ్లాసు పెరుగుని చిలికి మూడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు కలిపి ఒక పూటంతా ఉంచాలి. ఆ పెరుగులో ఉన్న ఉపయోగపడే బాక్టీరియా ఆ నీళ్ల నిండా పెరుగుతాయి. ఈ ఉపయోగపడే బాక్టీరియా కోసమే మజ్జిగ. దీన్ని ప్రోబయాటిక్‌ ఔషధంగా చెబుతారు. జీర్ణశక్తి బలంగా ఉండాలంటే ఈ ప్రోబయాటిక్‌ కావాలి. అందుకు మజ్జిగే మంచి ఉపాయం. పాల కన్నా పెరుగు మంచిది. పెరుగు కన్నా చిలికిన మజ్జిగ తాగేవారి శరీరానికి వృద్ధాప్యం వచ్చినా పేగులకు రాదు. మెరుగైన ఆరోగ్యం కోసం ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు తగలబెట్టాల్సిన అవసరం లేదు. మన నిత్యం వంట గదిలో వాడే వాటినే సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక.. జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ఇక మన వంటింటిలో వాడే చాలా ఆహార పదార్దాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిలో మనకి నచ్చే శీతల పానీయం కూడా ఉంది.. అదే మజ్జిగ. మజ్జిగ అంటే పూర్ణచంద్రుడిలా, మల్లెపువ్వులా, శంఖంలా తెల్లగా ఉండాలి. బాగా చిలికితే తేలికగా అరుగుతాయి. ఫ్రిడ్జ్‌లో ఉంచిన మజ్జిగైతే దాని చల్లదనం పోయేదాకా బయటే ఉంచి తీసుకుంటే జలుబు చెయ్యదు. ఈ పెద్ద గ్లాసు మజ్జిగలో అరచెంచా నెయ్యి కలిపి, తగినంత సైంధవ లవణం, చిటికెడు ఇంగువ చేర్చి తాగితే అన్ని వ్యాధుల మీదా ఔషధంగా పని చేస్తుంది. అన్నంలో కూడా తినవచ్చు. పెరుగుని చిలికి, దానికి మూడు నుంచి ఎనిమిది రెట్లు నీళ్లు పోసి, రాత్రంతా ఫ్రిడ్జ్‌లో కాకుండా బయటే ఉంచాలి. ఉదయాన్నే అందులో సైంధవ లవణం, జీలకర్ర, కాల్చిన శొంఠి దంచి, ఆ పొడి తగుపాళ్లలో కలిపి రోజూ తాగితే వాతం, పైత్యం, కఫ దోషాలు పోతాయి. కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాసు, మంట తగ్గుతాయి. మొలల వ్యాధి కూడా తగ్గుతుంది. అజీర్తి పోతుంది. షుగరు, బీపీ, స్థూలకాయం, కీళ్లవాతం, చర్మ వ్యాధులు. సైనసైటిస్‌, మైగ్రేన్‌ తలనొప్పికి మంచి ఔషధం. ఈ అద్భుత పానీయం ప్రోబయోటిక్ గుణాలతో నిండి ఉంది, పెరిగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మీ పేగు ఆరోగ్యాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. ఎందుకంటే ఇంకా ఇది పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్‌లకు మంచి మూలం, మీ శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇంకా మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్ B12, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉండే లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.*

*శొంఠి, మిరియాలు, ఉప్పు, జీలకర్ర, కమలాపండు పైన తొక్కలను తగు పాళ్లలో తీసుకొని, దంచి, ఆ పొడిని చిలికిన మజ్జిగలో కలపాలి. ఇంగువ పొంగించిన నెయ్యితో తిరగమోత పెడితే ఆ మజ్జిగని ‘గౌరీ తక్రం’ అంటారు. దీన్ని పార్వతీదేవి శివుడి కోసం తయారు చేసిందన్నాడు క్షేమశర్మ. ఇది ఆకలిని పుట్టిస్తుంది. తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. సమస్త వ్యాధుల్లోనూ ఔషధం. దీని రుచి ‘దివ్యం’ అన్నాడు. పులిసిన మజ్జిగలో ఎనిమిది రెట్లు నీళ్లు కలిపి, ఔషధంగా మలుచుకోవచ్చు. వాత వ్యాధుల్లో సైంధవ లవణం (పింక్‌ సాల్ట్‌), పైత్య వ్యాధుల్లో చక్కెర, కఫ వ్యాధుల్లో శొంఠి, పిప్పలి, మిరియాల పొడి కలిపి తాగాలన్నాడు. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన’ అనే సామెత వినే ఉంటాం. సామెత గురించి తెలియదు కానీ పలుచటి మజ్జిగతో మాత్రం చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి మజ్జిగ చాలా అవసరం. ఈ పానీయం బాడీకి చేసే మేలు అంతా ఇంతా కాదు. కూల్‌ డ్రింక్స్‌ కంటే సహజ ఆహారం మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు. వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌గా తాగితే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి.*

*1. వేస‌విలో చ‌ల్ల చ‌ల్లగా మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎండ‌కు వెళ్లి వ‌చ్చే వారు ఇంటికి చేరుకోగానే చ‌ల్ల‌ని మ‌జ్జిగ‌లో నిమ్మ‌కాయ పిండుకుని తాగితే ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం తీరుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తూకంలో ఉంటాయి.* 

*2. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మ‌జ్జిగ‌లో ఉండే బ‌యోయాక్టివ్ సమ్మేళ‌నాలు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రిస్తాయి. అందువ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.* 

*3. కాల్షియం లోపం ఉన్న‌వారు మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కాల్షియం అందుతుంది. త‌ద్వారా ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి.* 

*4. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి. అలాగే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.* 

*5. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఏ, డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి. ఆరోగ్యకరమైన ప్రేగులు బలమైన రోగనిరోధక శక్తికి పునాది. మజ్జిగ ఆరోగ్యకరమైన పేగులకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది. ఇది జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు అన్నింటిని సెట్ చేస్తుంది. పెద్దపేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌ వ్యాధి నివారణలో మజ్జిగ సహాయపడుతుంది. అందులోని యాసిడ్ కారణంగా మీ పొట్టను క్లియర్ చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు.*

*6.పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగ మన జీర్ణవ్యవస్థకు ఒక వరం.  మజ్జిగలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది నిన్నటి మజ్జిగ మిగిలిపోతే ఒక వస్త్రంలో పోసి, మూటగట్టి, వడగట్టండి. సైంధవ లవణం, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పిప్పళ్లు, శొంఠి, ఇంగువ, ఆవాలు,మెంతులు దంచి, ఆ పొడిని తగినంత కలిపిన మజ్జిగని ‘అచ్చిక’ అంటారు. ఇది అన్ని దోషాల మీదా పని చేస్తుంది. ముఖ్యంగా అజీర్తిని పోగొడుతుంది. భోజనం చేసిన తరువాత పైన చెప్పిన పద్ధతుల్లో ఏదైనా మజ్జిగని ఎంచుకుని, రోజూ తాగుతుంటే భుక్తాయాసం కలగదు. తీసుకున్న ఆహారం తేలికగా అరుగుతుంది. అన్నంలో విష దోషాలు పోతాయి. చర్మానికి మంచి కాంతి వస్తుంది. స్థూలకాయం తగ్గుతుంది. నరాలకు ఉత్తేజం కలుగుతుంది. షుగరు రోగులు ఈ మజ్జిగని తాగితే షుగరు త్వరగా అదుపులోకి వస్తుంది.*

*అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది.  దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.* సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు*

*అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది.  దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.*

Panchaag

జానపద సాహిత్యం🙏

 🙏  జానపద సాహిత్యం🙏

                     మొదటి భాగము

 జనపదమనగా పల్లెసీమలు . జనపదమున నివసించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు  జానపద గీతాలు. వీటినే ఆంగ్లములో folk songs అని అంటారు. తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని ఛందస్సు కూడా ఉంటుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసారు

ఏ భాషలోనైనా ముందు జానపద సాహిత్యం పుడుతుంది.మౌఖికంగా ఒక తరము నుండి తరువాత తరమునకు అందుతుంది.

 ఉదాహరణను పొలం పనులు చేసేవారు శ్రమ కలగకుండా ఉండటానికి జానపద గేయాలు పాడుకునేవారు, గ్రామ దేవతను, ఇష్ట దేవతలను భక్తితో కొలిచి పాడుకునేవారు

ఓ గజముఖ

ఓ గజముఖ విఘ్నేశప్రభో* తొలి భోగము నీదయ్యా

మా పనులు సాగింపగదయ్యా!

నీ యనురాగం బిడుమయ్యా!

విఘ్నములు రానే రావయ్యా!

విఘ్నములు రానే రావయా౹౹ఓ *గజముఖ* ౹౹

ముందుగ నిన్నుపూజించెదమయ్యా! 

చేయుపనులందు సఫలమయ్యా!

తిండిలో లజ్జనెరుగవయ్యా!

విఘ్నములు రానే రావయ్యా౹౹ఓ *గజముఖ* ౹౹

 నీదు దయకు ప్రతి విద్యాధికులు నిలచియుందురయ్యా!

లేనిచో సాధకులెవరయ్యా!

విద్యలకు ఆదినుందువయ్యా౹౹ఓ *గజముఖ* ౹౹

దండియైన నీ కడుపు చూచి

చంద్రుండు నవ్వెనయ్యా!

అప్పుడు చంద్రునకు శాపమయ్యా!

అది నీ పండుగనాడయ్యా౹౹ఓ *గజముఖ*

ఇలా సందర్భోచితంగా జానపద సాహిత్యం వచ్చింది.(నేను చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడు శ్రామిక జనం ఊడుపులు ఊడుస్తూ, కోతలు కోస్తూ పాడుతూ పని చేసేవారు. )

జానపద కళలు: సంగీతం, నృత్యం, అభినయం ఉండే ప్రదర్శన కళలన్నీ ఈ విభాగంలో చేరతాయి. గాత్ర సంగీతం, వాద్య సంగీతం, తోలు బొమ్మలాటలు, యక్షగానం, వీధి భాగోతం, కోలాటం, పగటి వేషాలు, బహురూపుల గారడీ విద్యలు బుర్ర కథలు మొదలైనవి ఈ విభాగంలో వస్తాయి.

ఇప్పుడు మనం చూస్తున్న జానపద విజ్ఞానం హటాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినదేమీ కాదు. అది ఒక తరం నుంచి మరో తరానికి ఒక క్రమ పద్ధతిలో వివిధ రూపాల్లో అందుతూ వస్తున్నది. మౌఖిక, లిఖిత పద్ధతుల్లో ఇది పరివ్యాప్తమవుతూ వస్తున్నది.మౌఖిక రూపంలో ప్రచారం పొందిన జానపద విజ్ఞానం ఇటీవలి కాలంలో లిఖితరూపం సంతరించుకుంటోంది. క్షేత్ర సందర్శనలు, పరిశోధనల కోసం జానపద విజ్ఞానాన్ని సేకరించి ముద్రణా రూపంలోను, వస్తు రూపంలోను, ఫొటోలు, సీడీల రూపంలోను భద్రపరుస్తున్నారు. ఈ ముడి సరుకుల ఆధారంగా ఆయా ప్రాంతాల ప్రజా మూలాలను వెదుకుతున్నారు. లిఖిత సంప్రదాయం కన్నా మౌఖిక సంప్రదాయమే శక్తివంతమైనది. మౌఖిక జానపద విజ్ఞానంలో జానపద గేయాలు, కథాగేయాలు(బుర్ర కథ) , జానపద పురాణాలు, ఇతిహాసాలు(విరాట పర్వం జానపద కథ ), గద్యకథలు(సముద్ర గుప్తుని కథలు ), సామెతలు, పొడుపు కథలు, మాండలికాలు నుడికారాలు, తిట్లు, ఒట్టులు వంటివన్నీ ఉన్నాయి. వీటిలో కొన్ని సాహిత్యంలో ఎట్లా ప్రతిఫలించాయో చెప్పేదే ఈ వ్యాసం. పింగళి సూరన కళాపూర్ణోదయంలో అనేక జానపద సామెతలను ఉపయోగించాడు.

నన్నయ భారత అవతారికలో తాను ఎన్నో జానపద రూపకములు చూశానని తెలుపుటను బట్టి అప్పటికే తెలుగు జానపద సాహిత్యం బాగా వ్యాప్తి చెందినదని చెప్పవచ్చు .12 వ శాతాబ్ధికి వాడైన పాల్కురికి సోమనాథుడు దేశిసాహిత్య పితామహుడుగా ఉండి పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం అనే శైవసాహిత్య గ్రంథాలను దేశి సాహిత్యంలో రచించాడు. ద్విపద ఛందస్సు జానపద సాహిత్యనికి అత్యంత దగ్గరి రూపం. ఝటితిగా రచితమయ్యే చాలా జానపద గేయాలలో ఈ ఛందస్సు రూపాలు ఉంటాయి. అందుకే ప్రచారం అవసరం అనుకున్న విషయాలను ప్రజలకు విరివిగా అందించాలనుకున్న కథలను ఆనాటి కవులు జానపద సాహిత్యానికి చాలా దగ్గరిగా ఉన్న ద్విపద ఛందస్సును స్వీకరించి రచించారు. పాల్కురికి, శ్రీనాథుడు (పల్నాటి వీరచరిత్ర), రంగనాథ రామాయణ కర్త గోన బుద్దా రెడ్డి ఇందుకు మంచి ఉదాహరణలు. జానపద జీవితాన్ని విస్తారంగా వర్ణించిన సోమన జానపదులైన శివభక్తుల జీవితాలను కథలను విపులంగా వర్ణించిన సోమన వాటిలో భాగంగానే జానపద కళలను వివరంగా వర్ణించాడు. తన కాలం నాటికి తెలిసిన చాలా జానపద కళలను గురించి ఆచూకీ చెప్పడం మనకు ఇందులో బాగా కనిపిస్తూ ఉంది. పాల్కురికి రచనలలో ఉన్న జానపద కళల గురించి ఇప్పటికే చాలా మంది పండితులు చెప్పిఉన్నారు. వాటిని తిరిగి వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. కాని ఏ ఏ కళారూపాల ప్రసక్తి ఉందో చెప్పడం అవసరం. చాలామంది నాటకాలు ఆడుతున్నారని చెప్పాడు అవి జానపద నాటకాలే. రోకళ్ళ పాటలను గురించి చెప్పి వాటిని పాడే ఘట్టాల్ని చెప్పాడు. పిచ్చుకుంటి కళాకారులు శ్రీశైలం వెళ్తున్నట్లుగా వర్ణించాడు. పిచ్చుకుంటి కళాకారులు ఈనాటికీ  ఉన్నారు. వీరి కళారూపమైన పిచ్చుకుంటికథ ఇప్పటికీ బాగా తిరుగుతూ ఉంది. దీనిలో పల్నాటి వీర చరిత్ర ప్రసిద్ధం. మెరవణి ఉందని, బహురూపులు ఉన్నారని చెప్పాడు. బహురూపులు అంటే వివిధ వేషాలు వేసుకునే కళాకారులు అని పగటి వేషగాళ్ళు అని అర్థం. ఇప్పటికీ రాయలసీమలో కనిపించే మెరవణిని గురించి పాల్కురికి ఆనాడే ప్రస్తావించాడు. 'భారతాది కథల జీరమఱుగుల నారంగ బొమ్మల నాడించువారు గడునద్భుతంబుగ గంబసూత్రంబు లడరంగ బొమ్మల నాడించు వారు' అని స్పష్టంగా చెప్పి దీని ద్వారా ఆనాటికి తోలుబొమ్మలాట, చెక్క బొమ్మలాట ఉన్నాయని స్పష్టమైన చారిత్రక ఆధారాన్ని ఇచ్చాడు సోమనాథుడు. ‘నమరంగా గడలపై నాడెడు వారు’ అని చెప్పి దొమ్మరాటను గురించి చెప్పాడు. యక్షగానాన్ని చెప్పాడు. చిందువారి ప్రసక్తి ఉంది కాబట్టి అది చిందు యక్షగానం కావచ్చు. వెడయాట, కోడంగియాట, వెడ్డంగము అనే వాటిని గురించి చెప్పాడు. ఈనాడు ఈ కళారూపాలు కనిపించవు. కాలగతిలో అంతరించిపోయాయి. ఇంకా పక్షుల ఆటలు, జంతువులతో ఆడించే ఆటలు, బహురూపులు అంటే పగటివేషగాళ్ళ ఆటలు, పేరణి, కోలాటం, గొండ్లి నృత్యం మొదలైన కళారూపాలను గూడా ప్రస్తావించాడు పాల్కురికి సోమన. ఇంకా నటులకు సంబంధించిన వివరాలు చాలా ఇచ్చాడు. ఈ విధంగా ఆనాటి జానపదకళల విజ్ఞాన సర్వస్వంగా కనిపిస్తాయి పాల్కురికి పండితారాధ్య చరిత్ర, బసవపురాణ గ్రంథాలు. పాల్కురికి రాసిన ఆనాటి భక్తుల కథలు కూడా ఈనాడు జానపద సాహిత్య ప్రక్రియలోని పురాకథా ప్రక్రియ అవుతాయి. ఆనాటి చాలా జానపద కళలు ఈ నాడు జీవించిలేవు. ఇటీవలి 100 సంవత్సరాల లోపున కూడా ఉన్న వాలకం అనే కళా రూపం ఇప్పుడు అంతరించింది

                        సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ  

.

Panchaag

బుధవారం🪷* *🌷16, ఏప్రిల్, 2025🌷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        *🪷బుధవారం🪷*

  *🌷16, ఏప్రిల్, 2025🌷*

      *దృగ్గణిత పంచాంగం*                   

           *ఈనాటి పర్వం*      

       *సంకష్టహర చతుర్ధి* 

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం -వసంత ఋతౌః*

*చైత్ర మాసం - కృష్ణపక్షం*

*తిథి      : తదియ* మ 01.16 వరకు ఉపరి *చవితి*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : అనూరాధ* పూర్తిగా రోజంతా రాత్రితో సహా

*యోగం  : వ్యతీపాత* రా 12.19 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం   : భద్ర* మ 01.16 *బవ* రా 02.22 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 11.30 సా 03.00 - 05.30*

అమృత కాలం  : *సా 06.20 - 08.06*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం          : ఉ 07.38 - 09.25*

*దుర్ముహూర్తం  : ప 11.42 - 12.32*

*రాహు కాలం   : మ 12.07 - 01.41*

గుళికకాళం      : *మ 10.33 - 12.07*

యమగండం     : *ఉ 07.25 - 08.59*

సూర్యరాశి : *మేషం* 

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.52* 

సూర్యాస్తమయం :*సా 06.23*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.52 - 08.22*

సంగవకాలం         :*08.22 - 10.52*

మధ్యాహ్న కాలం    :     *10.52 - 01.22*

అపరాహ్న కాలం    : *మ 01.22 - 03.53*

*ఆబ్ధికం తిధి         : చైత్ర బహుళ చవితి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.23*

ప్రదోష కాలం         :  *సా 06.23 - 08.41*

రాత్రి కాలం         :  *రా 08.41 - 11.44*

నిశీధి కాలం          :*రా 11.44 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.19 - 05.05*

-------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

*🪷శ్రీ సరస్వతి స్తోత్రం🪷* 

       *(అగస్త్య కృతం)*

*పద్మజా పద్మవంశా చ*

*పద్మరూపే నమో నమః |*

*పరమేష్ఠ్యై పరామూర్త్యై*

*నమస్తే పాపనాశినీ*

*🌷ఓం సరస్వత్యై నమః🌷*

🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

       🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

యవ్వనమై ఉన్న జీవితం

 వృద్ధాప్యంలోనూ యవ్వనమై ఉన్న జీవితం

గోదావరి తీరంలోని ఒక చిన్న గ్రామంలో వెంకటరెడ్డి, లక్ష్మమ్మ దంపతులు నివసించేవారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు నిశ్చయించిన పెళ్లి, అదృష్టం కొద్దీ ఒకరినొకరు అర్థం చేసుకున్న దాంపత్య జీవితం, పిల్లల పెంపకం, బాధ్యతల నడుమ కాలం ఎలా గడిచిందో తెలియలేదు.

వయస్సు పెరిగేకొద్దీ పిల్లలు పెద్దవాళ్లయ్యారు, వాళ్లు వాళ్ల జీవితాల్లో స్థిరపడ్డారు. కొంతకాలానికి ఇద్దరూ మాత్రమే మిగిలిపోయారు. కానీ, వెంకటరెడ్డికి ఒక ప్రత్యేకమైన గుణం ఉండేది – జీవితాన్ని అతి తేలికగా తీసుకునే స్వభావం.

"లక్ష్మమ్మా, మన జీవితానికి ఎప్పుడైనా లక్ష్యాలు పెట్టుకున్నామా? ఏమైనా సాధించాలన్న కోరికలు పెట్టుకున్నామా?"

ఆమె నవ్వుతూ, "ఇద్దరూ కలిసుండటమే మాకు గొప్ప సాధన" అని చెప్పేది.

మరుపు, నడకలో బలహీనత, ఆరోగ్య సమస్యలు – ఇవన్నీ వచ్చాయి. కానీ, వారి మనసులో మాత్రం వృద్ధాప్యం ఆవరించలేదు. ఎందుకంటే, వాళ్లకు ఏ ఆశలూ, కోరికలూ లేవు. భగవంతుడు ఎలా నడిపిస్తాడో అలా ముందుకు సాగుతూ, "మనకు ఏం అవసరం, ఏం కోల్పోయాం" అనే ఆలోచనే లేకుండా జీవించారు.

ఒక్కోసారి ఊర్లో వాళ్లు అడిగేవారు, "నాయనా, మీకు పిల్లలు పట్టించుకోవడం లేదా?"

వెంకటరెడ్డి ఆహ్లాదంగా నవ్వేవాడు, "భగవంతుడు పెట్టాడు, ఆయనే చూసుకుంటాడు! పిల్లలు, మనమంతా కేవలం నిమిత్తమాత్రులం."

ఈ భావనతోనే, వారు నిత్యం నవ్వుతూ, చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని వెతుక్కుంటూ, బడలిక లేకుండా జీవించారు. వృద్ధాప్యం అంటే బాధ అనుకునే వాళ్లకూ, ఈ జంట జీవన విధానం ఒక సందేశంగా మారింది. వాళ్లను చూసిన వారందరూ ఆశ్చర్యపోయేవారు – వెంకటరెడ్డి, లక్ష్మమ్మ వయసు మీద పడినప్పటికీ బాల్య ఉత్సాహంతో ఉండేవారు.

ఒక రోజు ఒక యువకుడు అడిగాడు, "తాతయ్యా, మీలో ఈ నవ్వు ఎక్కడిది?"

ఆయన మెత్తగా నవ్వి చెప్పాడు – "మనసును బాధల నుండి స్వచ్ఛంగా ఉంచితే వయసు ఏమీ కాదు బాబు! మనం బాల్యంలో ఎలా నిర్లక్ష్యంగా ఆనందంగా ఉండేవాళ్లమో, అలాగే ఉండాలి. అప్పుడే వృద్ధాప్యమూ, క్షీణతా తాకదు."

ఆరోజు ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళినప్పటికీ, వెంకటరెడ్డి మాటలు వేదాంతమై పదిలమైపోయాయి.

"జీవితం అంటే తీపి-వగరు కలిసిన స్వాదం. ఏది ఎక్కువగా అనిపిస్తుందో అది మన దృష్టినే కాదు, మన జీవితాన్నీ నిర్ణయిస్తుంది."