1, ఫిబ్రవరి 2026, ఆదివారం

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🏹

*ఆదివారం 1 ఫిబ్రవరి 2026*

``

           *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                    1️⃣2️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


      *సంపూర్ణ మహాభారతము*      

      

                  *122 వ రోజు*                 

*వన పర్వము పంచమాశ్వాసము*


            *కుమారసంభవం* ```

వశిష్ఠుడు మొదలైన సప్తఋషులు అమావాస్య హోమం చేస్తున్నారు. హవిస్సులను స్వీకరించి దేవతలకు ఇవ్వడానికి అగ్ని దేవుని ఆహ్వానించారు. అగ్నిదేవుడు సర్వాలంకార భూషితలై భర్తల ప్రక్కన సప్త ఋషి పత్నులను చూసి మోహించాడు. వారిని తన జ్వాలలతో తాకాలని ఆరాటపడ్డాడు. హోమం ముగిసింది అగ్ని దేవుడు విరహంతో బాధపడ్డాడు. అగ్ని భార్య స్వాహాదేవి ఇది పసికట్టింది. తన భర్త కోరిక తీర్చడానికి అంగీరసుని భార్య శివ రూపంలో భర్త దగ్గరకు వచ్చి “నేను అంగీరసుని భార్యను. నా తోటి వారైన సప్త ఋషుల భార్యలపై నీకు వలపు ఏర్పడింది. మేమంతా నీ కోరిక తీర్చాలనుకున్నాము. నీ మనస్సు తెలుసు కోవడానికి నన్ను పంపారు” అన్నది. 


అగ్ని దేవుని ఆనందానికి అవధులు లేవు ఆమె యందు తన కోరిక తీర్చుకున్నాడు. స్వాహాదేవి గరుడ పక్షిగా మారి భర్త తేజస్సును వాయువేగంతో వెళ్ళి శ్వేతపర్వతంలో అక్కడ ఉన్న రెల్లు కుండలో దాచింది. ఇలా ఆమె ఆరు రూపాలలో భర్తను కూడి తేజస్సును కుండలో భద్రపరచింది. ఆమె ఒక అరుంధతి రూపం ధరించ లేక పోయింది.```


          *కుమార జననం*```


ఆ విధంగా ఆరు మార్లు కూర్చిన అగ్ని తేజస్సుతో కుమారస్వామి ఆరు ముఖాలతో అగ్ని తేజస్సుతో పన్నెండు చేతులతో జన్మించాడు. శుక్లపక్ష పాడ్యమిలో వీర్య సేకరణ, విదియలో గర్భం ధరించడం, తదియలో రూపం ఏర్పడటం, చవితిలో అన్ని అవయవాలు ఏర్పడి, పంచమి నాడు పూర్తి ఆకారంతో నిలబడి శివుని విల్లు ధరించడం జరిగింది. కుమారస్వామి విల్లు ఎక్కు పెట్టగానే ఆ ధ్వనికి ఐరావతం, సుప్రీతకం అనే ఏనుగులు కుమారస్వామి మీదకు లంఘించాయి. కుమారస్వామి వాటిని తన చేతులతో అణచి పెట్టాడు. ఒక చేత్తో తనకు సహజసిద్ధంగా లభించిన శక్తి ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఒక చేత్తో వినోదంగా కోడిని పట్టుకుని శంఖం పూరించాడు. బొటన వేలిని చప్పరిస్తూ ఆకాశాన్ని చేతులతో చరిచాడు. ఒక బాణంతో క్రౌంచ పర్వతాన్ని, శక్తి ఆయుధంతో శ్వేతపర్వతాన్ని భేదించాడు. ఆరు ముఖాలతో సింహనాదంచేసాడు. ఆ సింహనాదానికి పర్వతాలు చలించాయి, సముద్రాలు పొంగాయి, భూమి కంపించింది. ఆ ఉత్పాతాలకు భయపడి ఋషులు శాంతి హోమాలు చేసారు. అప్పుడు చైత్రరథం అనే అడవిలో ఉన్న జనం “సప్తఋషి పత్నులకు అగ్నిదేవుని వలన జన్మించిన బాలుని వలన ఈ ఉత్పాతాలు సంభవిస్తున్నాయి” అని ఆక్రోశించారు. 

ఈ అపనిందని భరించలేక ఋషులు తమ భార్యలను వదిలి వేసారు. కొందరు మాత్రం “ఇందులో ఋషిపత్నుల దోషం ఏమీ లేదు. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుని చేరింది” అని చెప్పుకున్నారు. 


స్వాహాదేవి "అయ్యా! ఈ బాలుడు నాకు నా భర్తకు జన్మించాడు. మీ పత్నులకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు. వారిని స్వీకరించండి" అని చెప్పింది. 


ఋషులు ఆమె మాటలు విశ్వసించ లేదు. తరువాత విశ్వామిత్రుడు అనే ముని అగ్ని కుమారునకు జాతక కర్మలు చేసాడు.```


              *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ఎక్కడుందో రహస్యం..

 ఎక్కడుందో రహస్యం..🙄


చిన్నప్పుడు

ఏ పండక్కో..పబ్బానికో

 Dress కుట్టిస్తే..

ఎంత ఆనందమో...👗👕


ఎప్పుడు పండగ

వస్తుందా, ఎప్పుడు

వేసేసుకుందామా

అన్న ఆతృతే...🥳


ఇంటికి చుట్టాలొచ్చి

వెళ్తో వెళ్తూ.. 

చేతిలో రూపాయో... 

అర్ధరూపాయో పెడితే

ఎంత వెర్రి ఆనందమో...😊


చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే

దుఃఖం తన్నుకు వచ్చేది...

ఇంకా ఉంటే బాగుండు

అన్న ఆశ...

ఎంత ఆప్యాయతలో...💞


సినిమా వచ్చిన ఏ

పదిహేను రోజులకో

ఎంతో ప్లాన్ చేసి

ఇంట్లో ఒప్పించి

అందరం కలిసి

నడిచి వెళ్లి..

బెంచీ టికెట్

కొనుక్కుని సినిమా

చూస్తే ఎంత ఆనందమో...🥰


ఇంటికొచ్చాకా 

ఒక గంటవరకూ

ఆ సినిమా కబుర్లే...

మర్నాడు స్కూల్ లో

కూడా...

ఆ ఆనందం ఇంకో పది

రోజులుండేది...💖


అసలు రేడియో విచిత్రం..

అందులోకి మనుషులు

వెళ్లి మాట్లాడతారా అన్న

ఆశ్చర్యం...అమాయకత్వం..🙄


పక్కింట్లో వాళ్లకి రేడియో

ఉంటే..ఆదివారం

మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం

ముందు కూర్చుని 

రేడియో లో సంక్షిప్త

శబ్ద చిత్రం (ఒక గంట కి

కుదించిన) సినిమాని

వింటే ఎంత ఆనందం...

మనింట్లో కూడా రేడియో

ఉంటే...అన్న ఆశ...😇


కాలక్షేపానికి లోటే లేదు...

స్నేహితులు

కబుర్లు, కధలు

చందమామలు

బాలమిత్రలు...🥰


సెలవుల్లో మైలు దూరం

నడిచి లైబ్రరీ కి వెళ్లి

గంటలు గంటలు

కథల పుస్తకాలు

చదివి ఎగురుకుంటూ

ఇంటికి రావడం....🏃🏻‍♂️


సర్కస్ లు, 

తోలు బొమ్మలాటలు

లక్కపిడతలాటలు...

దాగుడు మూతలు...

చింత పిక్కలు

వైకుంఠ పాళీ

పచ్చీసు..

తొక్కుడు బిళ్ళలు..

ఎన్ని ఆటలో...☺️


మూడు గదుల రైలుపెట్టి

లాంటి ఇంట్లో అంతమంది

ఎంత సంతోషంగా ఉన్నాం...

వరుసగా కింద చాపేసుకుని

పడుకున్నా ఎంత హాయిగా

సర్వం మరిచి నిద్రపోయాం...😴


అన్నంలో కందిపొడి..

ఉల్లిపాయ పులుసు

వేసుకుని తింటే

ఏమి రుచి...

కూర అవసరమే లేదు..🤷‍♂️


20/-రూపాయలు తీసుకెళ్లి

నాలుగు కిలోల 

బియ్యం తెచ్చేది...

ఇంట్లో, చిన్నా చితకా

షాపింగ్ అంతా నేనే...

అన్నీ కొన్నాకా షాప్

అతను చేతిలో గుప్పెడు

పుట్నాల పప్పో, పటికబెల్లం

ముక్కో పెడితే ఎంత

సంతోషం...

ఎంత బరువైనా

మోసేసేవాడిని..💓


ఎగురుతున్న విమానం

కింద నుండి 

కళ్ళకు చెయ్యి అడ్డం

పెట్టి చూస్తే ఆనందం...🥰


తీర్థం లో ముప్పావలా

పెట్టి కొన్న ముత్యాల దండ 

చూసుకుని మురిసి

ముక్కలైన రోజులు...


కొత్త పుస్తకం కొంటే

ఆనందం...వాసన

చూసి మురిపెం..

కొత్త పెన్సిల్ కొంటే

ఆనందం...

రిక్షా ఎక్కితే...

రెండు పైసల

ఇసుఫ్రూట్ తింటే

ఎంత ఆనందం..?🤩


రిక్షా ఎక్కినంత తేలికగా... 

ఇప్పుడు విమానాల్లో 

తిరుగుతున్నాం...✈️

మల్టీప్లెక్స్ లో ఐమాక్స్

లో సినిమా చూస్తున్నాం.

ఇంటర్వెల్ లో

ఐస్ క్రీం తింటున్నాం..🍧


బీరువా తెరిస్తే మీద పడి

పోయేటన్ని బట్టలు...

చేతినిండా డబ్బు...

మెడలో ఆరు తులాలనగ....

పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...

ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...

హోమ్ థియేటర్లు...

సౌండ్ సిస్టమ్స్, 

చేతిలో ఫోన్లు... 

అరచేతిలో స్వర్గాలు...

అనుకోవాలే గానీ క్షణంలో

మన ముందు ఉండే 

తిను బండారాలు.. 

సౌకర్యాలు...😍


అయినా చిన్నప్పుడు

పొందిన ఆ ఆనందం

పొందలేకపోతున్నాం

ఎందుకు ...?

ఎందుకు...? ఎందుకు...?🤔


చిన్నప్పుడు కోరుకున్నవి

అన్నీ ఇప్పుడు  

పొందాము కదా...

మరి ఆనందం లేదేం...

ఎందుకంత మృగ్యం

అయిపోయింది...

ఎండమావి 

అయిపోయింది..


మార్పు ఎందులో...?🤔

మనలోనా...?

మనసుల్లోనా...?

కాలంలోనా...?

పరిసరాల్లోనా...?

ఎందులో... ఎందులో...?

ఎందులో ...?

చెప్పవా తెలిస్తే....!!

నేస్తమా ఓ నేస్తమా

*శ్రీ హరి స్తుతి 96*

  *శ్రీ హరి స్తుతి 96* 

*కం. మది యందున కల్లోలము*

*వదలకయే నిండుచుండె బాధలు నెన్నో*

*యెదలోన స్వామి రూపము*

*పదిలముగా నిలిచిపోయె పరమాత్ముండై*

గాంధారి శ్రీ కృష్ణుణ్ణి శపించడంలో

  1.12d4.;291f5;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀


*గాంధారి శ్రీ కృష్ణుణ్ణి శపించడంలో 36 సంవత్సరాల ప్రసక్తి ఏమిటి? ఆ సంఖ్య ప్రత్యేకత ఏమిటి?*

               ➖➖➖✍️



*"ఋషీణాం పునరా ద్యానాం వాచం అర్థోఽనుధావతి "*```

అని భవభూతి మహాకవి అంటాడు (ఉత్తర రామచరితమ్).


మనమందరం ఒక విషయం అనుకొని దానికి తగినట్లే మాట్లాడుతాము. అయితే ఋషుల నోటివెంట వాళ్లు అనుకోకుండానే మాటలు వస్తాయి. దాని ప్రకారమే జరుగుతుంది..అని! (అవి భవితవ్య ద్వారాలు.)


శ్రావణుని తండ్రి శాపం— దశరథుడికి దుఃఖానికి బదులుగా ఆనందం కలిగించింది! ‘ముందు నాకు సంతానం కలుగుతుంది. తర్వాత గదా, పుత్ర వియోగంతో చావు!— అని ఆ సంతోషం.


శాపాలు అందరికీ తగలవు. వాటిని అవసరమైతే తప్పించివేసే శక్తి గలవారి ముందు ఆ మాటలు సాగవు. 

శ్రీకృష్ణుడు అలాంటి శక్తిగలవాడు..!


తన బిడ్డలందరూ మరణించారనే దుఃఖంలో ఉన్న గాంధారి పొలికలనిలో (యుద్ధం జరిగి శ్మశానమైన చోట) ఆగ్రహం పట్టలేక శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది. అంతకుముందే ధర్మరాజును, భీముణ్ణి చూచి ఆగ్రహం పొంది, వ్యాసమహర్షి మాటలతో కొంత శాంతించింది. దుర్యోధనాదుల శవాలను చూచిన ఆమె దుఃఖాన్ని, ఆమె కోడళ్ళు అనుభవిస్తూన్న నవ వైధవ్యవేదన ఇబ్బడి ముబ్బడి చేసింది.```


పొంగి వస్తూన్న ఆక్రోశంతో —*“నీకు చేతనై యుండి గూడా ఈ జ్ఞాతుల వైరాన్ని నీవు ఆపలేదు. వీళ్ళ చావుకు నీవే కారణం. మీ వంశం గూడా ఇలాగే దాయాదులు ఒకరినొకరు చంపుకొని,*


*నేటికి 36 సంవత్సరాలు దాటిన ఈ రోజుకు నాశనమౌతుంది!”*


*“నీవు గూడా దిక్కు లేని చావు చస్తావు”* అనింది గాంధారి.```


అంతకు ముందే పాండవుల విషయంగా ఆమెను వేదవ్యాసుడు అనునయించాడు:—


“నీవే దుర్యోధనుడు యుద్ధ విజయార్థియై నీ ఆశీర్వాదం పొందగోరి వచ్చి, నీకు మొక్కినపుడు..``` — *యతో ధర్మః తతో జయః*— ```

అన్నావు గదా! —నీ బిడ్డలు మీ మాట వినకుండా ఎప్పుడూ తమకు ఏ అపకారమూ తలపెట్టని సోదరులైన పాండవులను బాధించి తమ దుర్గతికి తామే కారణమైనారు. నీ మాట ప్రకారం చూచినా, పాండవుల వైపే ధర్మమున్నట్టు గదా!”— అని నచ్చ జెప్పాడు.


ఇపుడు మళ్ళీ ఆమె కృష్ణుణ్ణి శపించబోయింది!


శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ```

*"నీవు చేయ వలసినది చేయక, నీబిడ్డలను అదుపులో పెట్టుకొనక నన్ను ఆడిపోసుకున్నావు. మాకెట్లాగూ ఋషుల శాపముంది . అది జరిగి తీరుతుంది. నీ పాతివ్రత్యఫలమూ, నీ తపస్సుల ఫలమూ ఎందుకు వ్యర్థం చేసుకుంటావు ? ఇందువల్ల నీకేమి వచ్చింది!"* ```అన్నాడు.```


*కోపము తపమును జెరచును….క్రోధిగాన్ తపస్వికి జన్నే ?* అంటుంది భారతం.


*మా యాదవులను ఒకరు చంపలేరు. కాబట్టి వాళ్లే ఒకరినొకరు చంపుకోక తప్పదు*— ```అన్నాడు శ్రీకృష్ణుడు.


పోనీ! ఆ విధంగానైనా ఆమె దుఃఖ భారం తగ్గిందిలే అనుకుంటాడు ఆయన. ఆ శాపం ఆయన మీద ఏమీ పని చేయలేదు.


(ద్వారకకు ఆ 36 వ సంవత్సరం కృష్ణ దర్శనం కోసం వస్తూన్న కణ్వ, నారద విశ్వామిత్ర ఋషులను, చూచి —పోగాలం దాపురించి ఉన్నందువల్ల — జాంబవతికి కొడుకైన'సాంబుడికి' గర్భవతి వేషం వేసి, యాదవ యువకులు ఆ ఋషులకు అతడి చేత దొంగ దండాలు పెట్టించారు.```

*“స్వాములూ! ఈ నిండు చూలాలికి ఏ బిడ్డ పుడ్తాడు?”* ```అని ఎకసెక్కాలాడారు.```


*"మీ వంశం నాశనం చేసే ముసలం" పుడుతుంది!”* ``` అన్నారు ఋషులు. అట్లే జరిగింది.


ఈ సందర్భంలో 36 సంవత్సరాలు అని గాంధారి ఎందుకు అన్నది? పది, ఇరవై, ముఫ్ఫై అనకుండా 36 ఏమిటి?

ఈ ప్రశ్న చిరకాలం ఆలోచింప జేసింది.


యాదవ పాంచాలుర ప్రమేయంతోనే —-ద్రౌపదితో వివాహమై పాండవులు హస్తినకు వచ్చిన తరువాత— పాండవులకు వాళ్లు జయించుకొని వచ్చిన రాజ్యాలూ(అపుడే అర్జునుడికి “ధనం జయుడు” అనే బిరుదనామం వచ్చింది), పాండురాజు జయించిన రాజ్యాలు చేర్చి అర్ధరాజ్య విభాగం కొత్తగా చేసి ఇచ్చారు.


అది గూడా 5 సంవత్సరాలు తాత్సారం చేసి విధిలేని పరిస్థితిలో ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. 


వారణావతంలో లక్క యింట తగలబెట్టే పనికి ముందే```

*నిజమైన వారసుడైన ధర్మరాజును రాజును చేయవలెను*```

అనే ఒత్తిడి తన కులపెద్దల నుండి రాగా, విధిలేక నాడు "యువరాజు"ను మాత్రమే చేసి, కాలయాపన చేశాడు ఆ పెదతండ్రి.


పరస్పర వైరాలు కౌరవ పాండవుల మధ్య రోజు రోజుకూ పెరిగి పోతూన్నందువల్ల— ఈ అర్ధ రాజ్య విభాగం అపుడు అనివార్యమయింది. భీష్ముడు మొదలగు పెద్దలకు ఈ పని చేయక తప్పనిదయింది.


జూదంలో రాజ్యాలు పోయి, అరణ్యవాసం ప్రారంభమైన తొలిరోజులలో—శ్రీకృష్ణుడు వాళ్లను కలుసుకొన్నపుడు ఆగ్రహావేశంతో..```

*”ఇపుడే హస్తినకు వెళ్లి భీష్మాదులతో మాట్లాడి ధర్మరాజును పదస్థుణ్ణి చేస్తాను. ఒప్పుకోకుంటే యాదవ పాంచాలురతో కలిసి యుద్ధం చేసి, జయించి ధర్మం నిలుపుతాను"* అంటాడు..```


అర్జునుడు అప్పటికి ఆయనను ఆపుతాడు. (జూదంలో ఓడాము గాబట్టి 13 సంవత్సరాలు పూర్తి కాకుండా అందుకు పూనుకోగూడదని పాండవుల ఆలోచన). 

అందుచేత అపుడు కృష్ణుడు విరమించాడు.


కాబట్టి పాండవులకు ఏ కొంచెము రాజ్యమూ ఇవ్వడం —ఏనాడూ కౌరవ శతానికీ, వాళ్ల అమ్మ,అబ్బలకూ కించిత్తు గూడా ఇష్టం లేదు —అనేది నాటి పెద్ద వాళ్లకందరికీ తెలిసిన సత్యం.


తనకు పరాభవం జరగబోయే ముందు ద్రౌపది తనను రక్షించమని ఈ తల్లి వెనక భయంతో దాక్కున్నది.


అంతటి విపత్తులోనూ ఇంటి పెద్ద కోడలిని రక్షించబూనుకోలేదు ఈ గాంధారి..!


ఎట్లయినా సరే —నా బిడ్డలే రాజ్యానికి వారసులు కావాలి — అనే పేరాశ ఆ తల్లికీ లేక పోలేదు.


రాజసూయవైభవం పాండవులకు కలగడం, కృష్ణుడు అవన్నీ వాళ్లకు కలిగించడం —తన బిడ్డలకు ఆ గౌరవం కలగకపోయెనే— అనే బాధ —గూడా ఆ తల్లి హృదయంలో లేవనలేము.


ఇంద్ర ప్రస్థంలో 23 సంవత్సరాల పాండవ వైభవానికి శ్రీకృష్ణుడే మూలకారణం అని ఆమె ఆగ్రహం కావచ్చు. 


(ధర్మరాజు పుట్టాడని వినగానే— గర్భవిచ్ఛిత్తి స్వయంగా చేసుకున్న క్రౌర్యం వెనక — *తనకు ముందు బిడ్డ పుడితే— వాడు కౌరవ సామ్రాజ్యానికి ఉత్తరాధికారి అయ్యే అవకాశం కలుగుతుంది అనే —ఆశే కారణం.)


ఆ నాటికి రాజ్య విభాగం చేసి 36 సంవత్సరాలు అయింది.


రాజ్యవిభాగమే జరిగి ఉండక పోతే— యుద్ధమే వచ్చిఉండదు గదా! రాజ్య విభాగమూ, పాండవులకు వైభవమూ ఈ కృష్ణుడి వల్లనే అని ఆమె బాధ.


ఇంద్రప్రస్థంలో 23 సంవత్సరాలూ + అరణ్య అజ్ఞాతవాసాలు 13 సంవత్సరాలూ చేరి 36 సంవత్సరాలు!


అందుచేత 23+13= 36 సంవత్సరాలు తానూ, తన బిడ్డలూ కృష్ణుడు కారణంగా అనేక బాధలు పడ్డామనీ, ఈయనే ఇంత ఘోర కలికి కారణమనీ ఆమె పట్టరాని ఆగ్రహం పొందింది.


సంఖ్య వరకూ ఎట్లో సరిపెట్టుకున్నా —వెంటనే కాక —

'ఇంక 36 సంవత్సరాల నాటికి —అనడంలో ఆంతర్యమేమో ఊహకు అందలేదు.


ద్వాపర యుగాంతం 36 సంవత్సరాలలో కాబోతున్నదని వాళ్లు గణన చేసి ఉండరని అనుకోలేము. 

ఆ కాలంలో జ్యోతిష గణన విశేషంగా ఉన్నట్టు భారత గ్రంథ అంతర్గత సాక్ష్యాలున్నాయి.అది పాక్షిక వినాశమే!


అపుడు మీ వంశంలో ఎవరూ మిగల గూడదు,మీ యాదవకాంతలు గూడా మా వాళ్ల మాదిరిగానే ఏడ్చి అల్లాడాలి —అని ఆమె కోరిక కావచ్చు.


ఒకరి స్వభావాన్ని కష్ట కాలంలో చూడాలి అంటారు.


గాంధారీ ధృతరాష్ట్రుల స్వభావం ఆ వేళలో సుస్పష్టమయింది.


వీళ్ళ నైజం కృష్ణుడికి ఎపుడో తెలుసు. —ఉద్యోగపర్వంలో రాయబారానికి పోయే ముందు ధర్మరాజు — ’మా తండ్రి’ అంటూ రక్త సంబంధ స్నేహాన్ని బట్టి గౌరవం చూపిస్తూ, ‘దుర్యోధనుడి వల్లనే మాకిన్ని కష్టాలు’— అని అన్నపుడు ఒకే మాట అంటాడు 

శ్రీకృష్ణుడు.```


*ఆ ధృతరాష్ట్రుడున్ అట్టివాడ. తత్తనయుడ యేల?* అనీ —


*"వారెల్లరు పాముల యట్ల సర్వులకు వధ్యులు"* అనీ అంటాడు.```


శ్రీకృష్ణుణ్ణి భారత యుద్ధం అయిపోయి, ద్వారకకు మరలి పోతూన్నపుడు ఉదంకుడనే ఋషి ఇట్లనే శపించబోతాడు.


కృష్ణుడు జరిగింది చెప్పి, వరమిచ్చి ఆయనను శమింప చేస్తాడు. అత్యంత అధర్మంగా ప్రవర్తించిన అశ్వత్థామను ఒక బ్రాహ్మణుణ్ణి శపించగల యోగీశ్వరుడాయన.


అవతార ప్రయోజనం తీరిపోయి, యాదవులు ఆ విధంగా నిర్యాణం చెందవలసి ఉంది గాబట్టి, ఋషుల శాపాన్ని మరలించే యత్నం చేయదలపెట్టలేదు. రాబోయే విపత్తు తెలిసి, ముందే యాదవ వీరులనందరినీ ప్రభాస తీర్థానికి తరలించి వాళ్లకు సద్గతి కలిగించారు.✍️```

*యిది చదవినవారందరికీ ఆభగవానుడు సద్గతులు కలిగించుగాక!*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏



. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

చెడిపోతారని శాస్త్రం చెబుతోంది*

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝     *అసంతుష్టో ద్విజో నష్ట* 

           *స్సంతుష్ట ఇవ పార్ధివ:*!! 

           *సలజ్జా గణికా నష్టా* 

            *నిర్లజ్జేవ కులాఙ్గనా* !! 


      *నీతిశాస్త్ర ప్రకారం  ఇది చెడిపోయేవారి జాబితా*


తా𝕝𝕝     *1. తృప్తిలేని బ్రాహ్మణుడు* ,

           *2. తృప్తి చెందిన రాజు* ,      *3. సిగ్గు ఉన్న వేశ్య* 

           *4. సిగ్గులేని కులస్త్రీ* 


     *వీరు చెడిపోతారని శాస్త్రం చెబుతోంది* 


✍️💐🌹🌸🙏

చెవులు మంచి మనుషుల

  సజ్జనస్య హృదయం నవనీతం 

యద్వదంతి కవయస్తదలీకమ్ l

అన్యదేహవిలసత్సరితాపాత్

సజ్జనో ద్రవతి నో నవనీతమ్ ll 


చెవులు మంచి మనుషుల హృదయాలను వెన్నలా వర్ణిస్తాయి. ఇది అబద్ధం. 

మంచి మనుషులు ఎదుటివారి బాధలు చూసి కరిగిపోతారు. కానీ వెన్న కరగదు కదా.


....సుభాషితరత్నభాండాగారము

మహాభారతము

  మహాభారతము🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*శనివారం 31 జనవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                    1️⃣2️⃣1️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*       

     

                    *121 వ రోజు*                 

*వన పర్వము పంచమాశ్వాసము*


*అగ్ని సముద్రములో దాగుట*```


కార్యభారంతో అలసి పోయిన అగ్ని అధర్వునితో ఇలా చెప్పాడు.. 

“యజ్ఞయాగాదులలో సమర్పించే హవిస్సులను దేవతల కందించి నేను అలసి పోయాను. ఇకపై ఆ కార్యాన్ని నీవు నిర్వహించు!” అని చెప్పి అగ్ని సముద్రంలో దాక్కున్నాడు. 


దేవతలందరూ అగ్ని ఎక్కడున్నాడో తెలియక వెదక సాగారు. ఇంతలో సముద్రంలోని చేపలు అగ్ని సముద్రంలో దాక్కుని ఉన్న విషయం దేవతలకు అందించాయి. 


అగ్నిదేవుడు ఆగ్రహించి”మీ చేపజాతిని మానవులు నిర్ధయులై తినెదరు కాక!”అని శపించాడు. 


దేవతలంతా “అగ్నిదేవా! నీవు యధావిధి మాకు హవిస్సులను అందించు!” అని అడిగారు. 


కాని అందుకు అగ్ని సమ్మతించక శరీరాన్ని విడిచి భూమిలో ప్రవేశించాడు. భూమి పై పడిన అగ్ని నుండి అనేక ధాతువులు ఆవిర్భవించాయి. చీము నుండి గంధకం, ఎముకల నుండి దేవదారు వృక్షములు, కఫం నుండి కర్పూరం, పిత్తం నుండి పచ్చలు, వాతము నుండి నల్లటి పాషాణము, గోళ్ళనుండి అభ్రకము, రక్తనాళముల నుండి పగడములు ఏర్పడ్డాయి. 


అగ్ని దేవుడు భూగర్భంలో తపస్సు చేసుకుంటున్నాడు. అధర్వుడు అగ్ని కార్యములన్నీ నిర్వహిస్తున్నాడు. దేవతలంతా అధర్వుని పూజిస్తున్నారు. అధర్వుని కాంతిని దేవతలు అతనిచే తృప్తి పడటాన్ని ఓర్వలేక అగ్ని బయటకు వచ్చి మరల హవిస్సును అందిస్తానని ముందుకు వచ్చాడు. 

ధర్మరాజా ఆ విధంగా ఎందరో అగ్నులు ఉన్నా అందరిలో వెలిగే అగ్ని ఒకటే!” అన్నాడు మార్కండేయుడు. ```


           *కుమారస్వామి*```


ధర్మరాజు “మహర్షీ! మహాసేనాని అని పిలువబడే కుమారస్వామి అగ్నిదేవునికి, కృత్తికలకు, శివునకు కుమారుడెలా అయ్యాడు?” అని అడిగాడు.```


                  *దేవసేన*```


మార్కండేయుడు “ధర్మరాజా! పూర్వం దేవేంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసి ఓడి పోయాడు. రాక్షసులను గెలవడమెలా అని దేవేంద్రుడు మానస అనే కొండ మీద ఆలోచించే సమయంలో ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. దేవేంద్రుడు ఆ స్త్రీని రక్షించాలని వెళ్ళి కేశి అనే రాక్షసుడు ఒక స్త్రీని ఆకాశమార్గంలో తీసుకు వెళ్ళడం చూసాడు. దేవేంద్రుడు తనవజ్రాయుధంతో అతనిని వెంబడించాడు. అతడు తన గధాయుధాన్ని ఇంద్రుని మీద విసరగా ఇంద్రుడు వజ్రాయుధంతో గధను ముక్కలు చేసాడు. కేశి ఆస్త్రీని వదిలి పారిపోయాడు. ఇంద్రుడు ఆ కన్యను చూసి “నీవెవరు? ఈ రాక్షసుడికి ఎందుకు చిక్కావు?” అని అడిగాడు. 


ఆమె “అయ్యా! నాపేరు దేవసేన, 

నా అక్క పేరు దైత్యసేన. మేము అరిష్టనేమి అనే ప్రజాపతి పుత్రికలము. మేము ఇక్కడ విహరిస్తుండగా ఈ రాక్షసుడు కామచేష్టలతో మమ్ము వేధిస్తున్నాడు. నా సోదరి దైత్యసేనకు అవి నచ్చాయి ఆమె అతనితో వెళ్ళింది. నాకు నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. అతడు అంతటితో ఆగక తిరిగి వచ్చి నన్ను బలవంతంగా తీసుకు పోతున్నాడు. ఆ సమయంలో తమరు వచ్చి నన్ను రక్షించారు” అని చెప్పింది. ఇంద్రుడు మీ తల్లి,మాతల్లి దక్షుని పుత్రికలు. అందు వలన నీవు నాకు సోదరివి. నీకేం వరం కావాలో కోరుకో!” అని దేంద్రుడు అడిగాడు. 


ఆమె “దేవేంద్రా! మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహా పరాక్రమవంతుడు, కీర్తిప్రతిష్టలు కల వాడు భర్తగా రాగలడని చెప్పాడు. ఆ మాటను మీరు నిజం చెయ్యండి. దేవతలకు రాక్షసులకు గెలువ శక్యం కాని వాడు, భయంకరమైన రాక్షసులను సంహరించే వాడు, ముల్లోకాలను రక్షించే వాడు, నీకు ఇష్టమైన వాడిని నాకు భర్తగా ప్రసాదించు!” అని కోరింది. 


ఆమె మాటలు విని దేవేంద్రుడు.. 

“ఈ రోజు అమావాస్య. సూర్యచంద్రులు ఏక రాశిలో ఉంటారు. ఇది సూర్యోదయం. రౌద్ర ముహూర్తం. అగ్ని మునులు అర్పించిన హవిస్సులను తీసుకుని సూర్య మండలంలో ప్రవేశిస్తున్నాడు. కనుక సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజములతో జన్మించిన వాడు ఈమెకు భర్త కాగలడు” అని అనుకున్నాడు. 

దేవసేనను తీసుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు. 


బ్రహ్మదేవుడు “దేవేంద్రా! ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు. అతడు దేవసేనకు సేనాధిపతి కాగలడు. నీ కష్టములు తీర్చగలడు” అన్నాడు.```


              *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మాఘపూర్ణిమ

 🌹 *మాఘపూర్ణిమ , మహామాఘి*


నేడు మాఘపూర్ణిమ. ఇది విశేష పర్వదినం. 

స్నానానికి ప్రముఖ మైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) 

ఈ రోజు నైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి.

ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం.

తిథుల్లో ఏ పూర్ణిమ అయిని సంపూర్ణంగా దైవీశక్తులు దీపించే పుణ్యతిథే. 

ఈ తిథినాడు ఇష్టదేవతారాధన, ధ్యానజపాది అనుష్ఠానాలు మహిమాన్విత మైన ఫలాన్ని ఇస్తాయి. 

ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.

అన్ని పూర్ణిమల్లోకి మాఘ, 

కార్తిక, 

వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృష్ట మైనవి. 

వాటిని వ్యర్థంగా గడుపరా దని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

*వైశాఖీ కార్తికీ మాఘీ*

*తిథయో౭ తీవ పూజితాః!*

*స్నాన దాన విహినాస్తా*

*ననేయాః పాండునందన!*

స్నానదానజపాది సత్కర్మలు లేకు౦డా వృథాగా ఈ మూడు మాసాల పూర్ణిమలను గడుపరాదు.

మాఘపూర్ణిమ నాడు 

*అలభ్యయోగం* అని కూడా అంటారు. 

అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. 

 అది అంత తేలికగా లభించేది కాదు.


(సేకరణ)

    🌹🌹🌹🌹🌹

*ఈ పూర్ణిమ

  _*ఈ పూర్ణిమ సామాన్యమైనది కాదు.*_



*1. మాఘ పూర్ణిమ:*


 *చంద్రుని శక్తి గరిష్టంగా ఉండే పవిత్రమైన రోజు. నదీ స్నానం తప్పక చేయాలి, ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం కోటి జన్మల పాపాలు తొలగిస్తుంది అని శాస్త్ర వాక్యం. ప్రయాగ లో మాఘ పౌర్ణమి రోజున సమస్త దేవతలు స్నానం చేస్తారు,ఆ నీటిలో దైవ శక్తి అపరిమితంగా ఉంటుంది,కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం ఎంత గొప్పదో మాఘ పౌర్ణమి రోజున స్నానం అంతకు పది రెట్లు విశిష్టమైంది, వీలైతే నది, కుదిరితే సముద్రం, లేదా ప్రయాగ స్నానం చేయండి, లేదా ఇంట్లోనే గంగా యమున మొదలైన నదులను స్మరిస్తూ సూర్యోదయంలోగానే స్నానం చేయాలి.*


*2. రవి పుష్య యోగం (పుష్యార్క యోగం):* 


 *పుష్యమి నక్షత్రం ఆదివారం రావడం వల్ల ఏర్పడే ఈ యోగం గ్రహణముతో సమాన శక్తి కలది,ఈ సమయంలో చేసే స్నానం,దానం, జపం అక్షయమైన ఫలితం ఇస్తుంది.* 


*3. శ్రీ లలితా జయంతి:* 


 *జగన్మాత లలితా దేవి భండాసుర సంహారం కోసం దేవతలు చేసిన మహాయగం నుండి ఆవిర్భవించిన రోజు. సాధారణంగానే పౌర్ణమి రోజున లలితా ఆరాధన ఎంతో గొప్ప ఫలాలు ఇస్తుంది, అందులోనూ యోగం తో కూడిన, మాఘ పౌర్ణమి రోజున రాత్రి వేళ చంద్రబింబం పాలలో చూస్తూ అందులో లలితా దేవిని ధ్యానిస్తూ లలితా సహస్ర నామాలు చదివితే ఎలాంటి కోరిక అయిన వెంటనే తీరుతుంది, ఇది బ్రహ్మాండ పురాణం చెప్పిన గొప్ప రహస్యం.* 


*4. థైపూసం:* 


 *ఇది తమిళుల ఉత్సవం, తారకాసుర సంహారం కోసం జన్మించిన సుబ్రహ్మణ్య స్వామికి పార్వతి దేవుడు శక్తి ఆయుధాన్ని ఇచ్చిన రోజు. జ్ఞాన సిద్ధికి, ఈరోజున తమిళ నాట విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు.* 


5. *సర్వార్థ సిద్ధి & సిద్ధ యోగం:* 


 *మీరు చేసే ఏ ప్రయత్నానికైనా విజయాన్ని చేకూర్చే అద్భుత ఘడియలు ఇవి.* 


 *ఈరోజు చేసే చిన్న దానమైనా, పూజ అయినా, కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.* 


 *కనుక యథాశక్తి పూజ,ధ్యానం,జపం, స్నానం చేయడం ఉత్తమం.* 


 *ఈరోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం శుభ ప్రదం.* 


 *కనుక ఆధ్యాత్మికంగా ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ గొప్ప సమయాన్ని వినియోగించుకొని దైవానుగ్రహాన్ని పొందగలరు.*


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఆయుర్వేద వైద్య పితామహుడు

 మరుగున పడిన ఆయుర్వేద వైద్య పితామహుడు అయిన "జీవకుడి" జీవిత విశేషాలు - 

    

ఆయుర్వేదం అనగా అందరికి చరకుడు , వాగ్భాటాచార్యుడు , శుశ్రుతుడు మాత్రమే అందరికి గుర్తుకువస్తారు. కాని కాలగర్భంలో కలిసిపోయిన ఒక గొప్ప ఆయుర్వేద వైద్య పితామహుఁడు , శస్త్రచికిత్సా నిపుణుడు గురించి మీకు ఈ రోజు తెలియచేస్తాను. ఆ గొప్ప ఆయుర్వేద వైద్య పితామహుఁడు నామధేయం "జీవకుడు " ఇతను బుద్ధుని కాలం నాటి అనగా క్రీస్తూపూర్వం 6 వ శతాబ్దం నాటివాడు .ఈ వైద్యుని చరిత్ర మనకి ఆశ్చర్యం కొలుపుతుంది.

                 

  ఇతను గౌతమబుద్ధుని సమకాలికుడు ఆయనకు చికిత్స చేసెను. " కౌమార భృత్యం " అనగా బిడ్డల చికిత్స యందు మిక్కిలి చతురత కలవాడు అని ఇతనికి బిరుదు కలిగి ఉండెను. కాని జీవకుడు కాయచికిత్స యందు శస్త్రచికిత్స యందు గొప్ప ప్రజ్ఞ కలవాడు అని చారిత్రిక నిదర్శనములు కలవు. అతడు మగధరాజ్యమునకు ముఖ్య పట్టణం అగు రాజగృహ నగరము నుండి బింబిసార చక్రవర్తి యొక్క కుమారుడు అగు అభయునిచే అప్పటికే ప్రసిద్ది చెందిన తక్షశిలా నగరం నందలి వైద్యవిశ్వవిద్యాలయమునకు పంపబడెను. ఆ కాలము నందే వేయిమైళ్ల దూరం వైద్యవిద్యను సంపాదించు నిమిత్తం ఇతను పోయననిన ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు .

               

    తక్షశిలా విశ్వవిద్యాలయము నందు జీవకుడు ఏడు సంవత్సరాలపాటు వైద్యవిద్యను అభ్యసించి గురువువద్దకు సెలవు తీసుకొనుటకు వెళ్లగా గురువు ఇతనిని పరీక్షింపదలచి " ఈ గడ్డపార తీసుకుని తక్షశిలా నగరం చుట్టూ యోజనము దూరములో వైద్యమునకు పనికిరాని మూలికను తెమ్ము " అని పంపించెను . అతడు తిరిగి తిరిగి ఏదో ఒకరకమగు చికిత్సకు కాని , ఆహారంగా గాని పనికిరాని వస్తువు అంటూ ఏమి లేదు అని " న కించిత్ జగ త్యనౌషధం " అని చెప్పెననియు అందుకు ఆ గురువు సంతసించి అతని ప్రయాణ ఖర్చులకు కొంత ధనమును ఇచ్చి వీడ్కోలు పలికే అని పురాతన గ్రంథాలలో ఉన్నది. జీవకుడు సాకేత నగరముకు వచ్చు వరకు ప్రయాణ ఖర్చులకు ధనము లేక అక్కడే కొన్ని రోజులు వేచిచూడవలసిన వచ్చెను.


 * జీవకుడి చికిత్సలు - 

        

   సాకేత నగరమున ఒక ధనికుడు అగు శెట్టి భార్య ఏడు సంవత్సరముల నుండి తలలో ఏదో సమస్యతో భాధపడుచూ ఎందరు వైద్యం చేసినను కుదరక కష్టపడుచుండును. జీవకుని గురించి విని తన గృహమునకు ఆహ్వానింపగా ఇతడు కొన్ని మూలికలు సంపాదించి వానితో ఒక ఘృతము తయారుచేసి ముక్కుద్వారా నశ్యము చేయించెను. ఈ చికిత్సతోనే ఆమె రోగము నయం అయ్యెను. ఆ కాలములోనే వైద్యదక్షిణగా 16000 బంగారు రూపాయలు ఇచ్చెను . ఒక గుర్రపు బండిని , నౌకరులను ఆయనకు సమర్పించెను. దీనితో జీవకుడు రాజగృహమునకు చేరి తనపోషకుడు అగు అభయునకు తనకు సహాయం చేసిన ధనమును తిరిగి ఇచ్చివేసెను. ఆ తరువాత బింబిసార చక్రవర్తికి కలిగిన" భగంధర " రోగమును కొన్ని లేపనముల సహాయముతో చేసి కుదిర్చెను . ఆ తరువాత జీవకుడు రాజవైద్యుడిగా నియమించబడెను. ఆ తరువాత గౌతమబుద్ధునకు వారి బౌద్ధ సంఘమునకు వైద్యుడు అయ్యెను.

                    

    జీవకుడు చికిత్స చేసిన అత్యద్భుత చికిత్సలలో కొన్ని బౌద్ధ గ్రంధములలో వర్ణింపబడినవి. రాజగృహ నగరం నందు ఒక వైశ్యశిఖామణి కుమారునకు మితిమీరిన తలనొప్పి అనేక సంవత్సరముల నుండి భాదించుచుండెను. జీవకుడు శస్త్రచికిత్సచే తలలో నొకభాగం తొలచి రెండు పురుగులను తీసివేసి వ్రణమును ఎప్పటివలె కుట్టి ఏదో ఒక లేపమును పూసి కట్టు కట్టెను. ఇందువలన తలనొప్పి నిర్మూలనం అయ్యెను .

              

    కాశీపట్టణమునకు చెందిన ఒక వ్యక్తి కుమారుడు వ్యాయామము చేయుచుండగా పేగులలో మెలికపడి ఆహారం జీర్ణించుకోలేక మలబద్దకం కలిగి రక్తహీనుడు అయ్యి శల్యావశిష్టుడై యుండెను. అంతట వారు జీవకునిని పిలిపించగా ఇతడు శస్త్రచికిత్సచే సరిచేయుచూ మెలికపడిన పేగులను రోగి భార్యకు చూపించి పేగులను మెలికను విడకొట్టి తిరిగి ఎప్పటివలె ఉదరకుహరమున స్వస్థలమున నిలిపి పైన చర్మం కుట్టి ఏదో లేపనం పూసి మాన్పెను. 

                

    ఉజ్జయినీ మహారాజు అగు "ప్రద్యోత" చక్రవర్తి కామెర్ల వ్యాధిచేత భాధపడుతుండెను. ఆఖరు వైద్యముగా వారి సంస్థాన వైద్యులను బింబిసార చక్రవర్తి దగ్గరకు జీవకుని కోసం పంపిరి. రోగము కంటే రోగి మొండివాడు అని జీవకునకు తెలుసుకొనెను. ఈ వ్యాధికి ఘృతపానం చేయవలెను . (ఆయుర్వేదం నందు ఘృతము అనగా మూలికలను ఆవునెయ్యితో కలిపి వండుటను ఘృతము అందురు.) ఘృతం పేరుచెప్పగానే రోగికి వాంతి వచ్చుచుండెను. అందువల్ల ఘృతం పనికిరాదు అని రాజు శాసించెను . జీవకుడు కష్టపడి రంగు , రుచి అన్నియు మారునట్లు ఒక ఘృతమును తయారుచేసి ఒకవేళ మహారాజుకు వాంతి అయిన మహారాజు ఘృతం అని కనిపెట్టి ఏమి దండన విధించునో అను శంఖ చేత ఒక యుక్తిని పన్నెను . అదేమనగా మహారాజునకు మందు లొపలికి ఇవ్వగానే తాను ఒక పచ్చిమూలిక సంపాదించి వెంటనే విరుగుడుగా ఇవ్వవలెను అనియు అందుకు వేగముగా పరిగెత్తగల వాహనమును తయారుచేసి వీధిలో సిద్ధముగా నుంచవలెను అనియు ఏర్పాటు చేయించెను .

                

      మహారాజునుకు ఔషదం ఇచ్చి ఉపచారవిధానాదులు చేయుటకు తగినవారిని నియమించి వేగముగా నగరం విడిచిపోయెను. చక్రవర్తికి రోగము నివారణ అయ్యెను . కాని వైద్యుడు కనిపించలేదు . రాజు రహస్యం అంతా తెలుసుకుని జీవకునకు చేరవలసిన బహుమానమును బింబిసారుని రాజధానికి పంపెను. ఇలా జీవకుడు ఎన్నో కఠినమైన చికిత్సలు చేయుచుండెను అని " చుల్లవగ్గా " 5 -14 - 1 అనే గ్రంథము నందు కలదు . ఒకసారి బుద్ధునకు అనారోగ్యం కలిగెను. అప్పుడు విరేచనౌషధం ఇవ్వవలసి వచ్చెను. అతిగౌరముగా కాపాడుబడుచున్న పవిత్ర మునీశ్వరుడు అయిన గౌతమ బుద్దునకు లొపలికి తీసికొనుటకు అహితములైన మందులను లొపలికి ఇచ్చుట జీవకునకు ఇష్టం లేదు . అందుచే విరేచనౌషధములను పద్మములో ఇమిడ్చి వాసన చూచుటకు బుద్దునకు ఇచ్చెను. సుఖముగా విరేచనాలైన పిమ్మట వేడినీళ్లలో స్నానం చేయించి సంపూర్ణంగా ఆరోగ్యం కలుగు వరకు ద్రవపదార్థాలను ఆహారంగా ఇచ్చుచుండిరని వ్రాయబడినది . మరొకసారి ఒక భక్తురాలు విందు ఇచ్చినప్పుడు ఆహార దోషము వలన తినినవారందరికి అజీర్ణము పుట్టి దోషప్రకోపం వలన బాధలు పడుచుండిన సమయమున అందరికి చికిత్స చేసెను అని కలదు .

     

   

ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 



గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

  

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

మాఘ పురాణం - 14వ*

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷ఆదివారం 1 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 14వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *1వ తేదీ ఆదివారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

```

మాఘ పురాణం పధ్నాలగవ అధ్యాయములో…. పూర్వం, గంగానది ఒడ్డున నివసించిన ఒక బ్రాహ్మణుడు, సంతానం లేని లోటుతో బాధపడుతూ, శ్రీహరిని పూజించి వరం కోరుకున్నాడు. అతని నిష్టకు మెచ్చిన శ్రీహరి, కుమారుడిని వరంగా ఇచ్చాడు. కానీ, ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. నారదుడి ద్వారా కుమారుడు పన్నెండేళ్లకే మృతి చెందుతాడని తెలుసుకున్న బ్రాహ్మణుడు, భార్యతో కలిసి విచార సముద్రంలో మునిగిపోయాడు. అయితే, భార్య ధైర్యం చెప్పి, మరణం తప్పనిదని, శోకించడం వ్యర్థమని చెప్పింది. తన భక్తి నిజమని నిరూపించాలని బ్రాహ్మణుడు మళ్లీ శ్రీహరిని ఆరాధించాడు.


అతని భక్తికి మెచ్చిన శ్రీహరి, కుమారుడికి సుదీర్ఘ జీవితాన్ని వరంగా ఇచ్చాడు. ఈ కథ, ధైర్యం, భక్తి యొక్క ఫలితాలను చాటిచెప్పడమే కాకుండా, మాఘమాస వ్రతం యొక్క మహిమను కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే, ఈ వ్రతం ద్వారా ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు కలుగుతాయని పూర్వకాలపు ఋషులు చెప్పేవారు. అంతేకాకుండా, ఈ వ్రతం మనసుకు శాంతిని, ఆత్మకు తృప్తిని కలిగించి, జీవితంలోని కష్టాలను దాటే శక్తినిస్తుంది.```


        *విప్రుని పుత్ర ప్రాప్తి*```


గృతృనమద మహర్షిని చూసి జహ్నముని యిట్లనెను. “మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా?, నా సందేహమును తీర్చుమ”ని అడుగగా మహర్షి ఇట్లు చెప్పెను. 


“జహ్నమునీ! వినుము మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు, పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును, అందు వల్ల సంతుష్టుడైన మానవుడు ఇంకను హరి ప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞానియై సత్కర్మల నాచరించి ముక్తినందును. అటువంటి కథని ఓక దానిని చెప్పెదను వినుము అని ఇట్లు పలికెను..


‘పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. అతడు వేద వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయజ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారిరువురికి  సంతానము లేదను లోటు తప్ప మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచార పడుచున్న ఆ బ్రాహ్మణుడు ఓక నాడు భార్యతో “గుణవంతుడు అయిన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడు ఒక్కడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను”. 


అప్పుడు ఆమె ‘నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో? అందువలన మనకు సంతానము కలుగలేదు అని అనుకొందును’ అని సమాధానము ఇచ్చెను. 


అప్పుడు ఆ  బ్రాహ్మణుడు ‘ప్రియా కష్టతరమైన తపమును ఆచరించి  అయినను, శ్రీమన్నారాయణుని సంతుష్టి పరచెదను. పుత్ర వరమును కోరుదు’నని చెప్పెను. 


కష్టతరమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్ర వరమును కోరెదననియు పలికెను. 


ఆ దంపతులు ఇరువురు తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరి.


బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరినిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. 


కొంత కాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణి భూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితోనుండెను. శాంత భూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగ ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా అప్సర కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీసమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను.

తనను గమనించక తీవ్రతరమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వుతో  “విప్రా! నేను నీకు వరమునీయవచ్చితిని, నీ తపమునుమెచ్చితిని” అని పలికెను. ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై, బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. 


అతనికి ఎట్టి వరమునైన ఈయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా నా బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనంద పరవశుడైన అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ఇట్లు స్తుతించెను.```     


      *విప్ర కృత విష్ణు స్తుతి*


నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |

నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||

గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |

కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||

లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |

అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే ||

యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |

జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||

సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |

కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||

నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |

విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||

సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |

హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||

పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |

ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||

జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |

వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||

జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |

ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||

నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |

గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||

కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |

కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||

సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |

భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||

నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |

నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||```


శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము అందరు చదువుట శ్రేయస్కరము.


జహ్నుమునీ! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతిస్తూ ఆనంద పరవశుమై  నమస్కరించుచు నిలిచియుండెను, భగవంతుడు వరమును కోరుకొనమనెను.


శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు “స్వామీ! నీ పదములనందు నాకు నిశ్చలమైన భక్తిని ఇమ్ము, ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి, నాకు ముక్తినొసగుమని కోరెను. 


శ్రీహరి “నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదు”నని పలికి యంతర్థానయ్యెను. 


బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కిలి  లాభము అందినవానివలె సంతసింసించు తన ఇంటికి చేరెను. 


కొంత కాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.

కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములేయని చెప్పి తన దారిని తాను పోయెను. 


ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విశచుచుండెను. విచార వదనముతో ఆహారమును తీసికొనక విచారించుచుండెను. “నాధా నీవు త్రీవ్ర తపమొనర్చి వరముగా నీ పుత్రుని పొందితిని చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు పండ్రెండు సంవత్సరములు జీవించి విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా! నేనీ పుత్ర శోకము నెట్లు సహింపగలను?” అని భర్తతో పలికెను.


ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు నామెనోదార్చి నిశ్చయించెను. ఆమె నూరడించుచు యిట్లనెను. ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయేట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా! మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు కాని మృత్యువునకు లేదు కదా. కావున నీవును శోకింపకుము జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేల? నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు.

అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా? కావున శోకింపుము” అని ఆమెను ఊరడించెను మరియు నిరర్థకమైన దుఃఖమును విడువుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ ఉండుము” అని పలికి మరల గంగా తీరమున చేరి నియమ నిష్ఠలతో శ్రీహరిని సర్వ ఉపచారములతో పూజించుచుండెను. 


శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. 


శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను.```


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*మాఘపురాణం పధ్నాలగవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

మాఘపూర్ణిమ

 🌹 *మాఘపూర్ణిమ , మహామాఘి*


నేడు మాఘపూర్ణిమ. ఇది విశేష పర్వదినం. 

స్నానానికి ప్రముఖ మైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) 

ఈ రోజు నైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి.

ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం.

తిథుల్లో ఏ పూర్ణిమ అయిని సంపూర్ణంగా దైవీశక్తులు దీపించే పుణ్యతిథే. 

ఈ తిథినాడు ఇష్టదేవతారాధన, ధ్యానజపాది అనుష్ఠానాలు మహిమాన్విత మైన ఫలాన్ని ఇస్తాయి. 

ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.

అన్ని పూర్ణిమల్లోకి మాఘ, 

కార్తిక, 

వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృష్ట మైనవి. 

వాటిని వ్యర్థంగా గడుపరా దని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

*వైశాఖీ కార్తికీ మాఘీ*

*తిథయో౭ తీవ పూజితాః!*

*స్నాన దాన విహినాస్తా*

*ననేయాః పాండునందన!*

స్నానదానజపాది సత్కర్మలు లేకు౦డా వృథాగా ఈ మూడు మాసాల పూర్ణిమలను గడుపరాదు.

మాఘపూర్ణిమ నాడు 

*అలభ్యయోగం* అని కూడా అంటారు. 

అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. 

 అది అంత తేలికగా లభించేది కాదు.


(సేకరణ)

    🌹🌹🌹🌹🌹

*1. మాఘ పూర్ణిమ

 _*ఈ పూర్ణిమ సామాన్యమైనది కాదు.*_



*1. మాఘ పూర్ణిమ:*


 *చంద్రుని శక్తి గరిష్టంగా ఉండే పవిత్రమైన రోజు. నదీ స్నానం తప్పక చేయాలి, ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం కోటి జన్మల పాపాలు తొలగిస్తుంది అని శాస్త్ర వాక్యం. ప్రయాగ లో మాఘ పౌర్ణమి రోజున సమస్త దేవతలు స్నానం చేస్తారు,ఆ నీటిలో దైవ శక్తి అపరిమితంగా ఉంటుంది,కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం ఎంత గొప్పదో మాఘ పౌర్ణమి రోజున స్నానం అంతకు పది రెట్లు విశిష్టమైంది, వీలైతే నది, కుదిరితే సముద్రం, లేదా ప్రయాగ స్నానం చేయండి, లేదా ఇంట్లోనే గంగా యమున మొదలైన నదులను స్మరిస్తూ సూర్యోదయంలోగానే స్నానం చేయాలి.*


*2. రవి పుష్య యోగం (పుష్యార్క యోగం):* 


 *పుష్యమి నక్షత్రం ఆదివారం రావడం వల్ల ఏర్పడే ఈ యోగం గ్రహణముతో సమాన శక్తి కలది,ఈ సమయంలో చేసే స్నానం,దానం, జపం అక్షయమైన ఫలితం ఇస్తుంది.* 


*3. శ్రీ లలితా జయంతి:* 


 *జగన్మాత లలితా దేవి భండాసుర సంహారం కోసం దేవతలు చేసిన మహాయగం నుండి ఆవిర్భవించిన రోజు. సాధారణంగానే పౌర్ణమి రోజున లలితా ఆరాధన ఎంతో గొప్ప ఫలాలు ఇస్తుంది, అందులోనూ యోగం తో కూడిన, మాఘ పౌర్ణమి రోజున రాత్రి వేళ చంద్రబింబం పాలలో చూస్తూ అందులో లలితా దేవిని ధ్యానిస్తూ లలితా సహస్ర నామాలు చదివితే ఎలాంటి కోరిక అయిన వెంటనే తీరుతుంది, ఇది బ్రహ్మాండ పురాణం చెప్పిన గొప్ప రహస్యం.* 


*4. థైపూసం:* 


 *ఇది తమిళుల ఉత్సవం, తారకాసుర సంహారం కోసం జన్మించిన సుబ్రహ్మణ్య స్వామికి పార్వతి దేవుడు శక్తి ఆయుధాన్ని ఇచ్చిన రోజు. జ్ఞాన సిద్ధికి, ఈరోజున తమిళ నాట విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు.* 


5. *సర్వార్థ సిద్ధి & సిద్ధ యోగం:* 


 *మీరు చేసే ఏ ప్రయత్నానికైనా విజయాన్ని చేకూర్చే అద్భుత ఘడియలు ఇవి.* 


 *ఈరోజు చేసే చిన్న దానమైనా, పూజ అయినా, కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.* 


 *కనుక యథాశక్తి పూజ,ధ్యానం,జపం, స్నానం చేయడం ఉత్తమం.* 


 *ఈరోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం శుభ ప్రదం.* 


 *కనుక ఆధ్యాత్మికంగా ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ గొప్ప సమయాన్ని వినియోగించుకొని దైవానుగ్రహాన్ని పొందగలరు.*


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పంచాంగం



 

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం - పూర్ణిమ - పుష్యమి -‌‌ భానువాసరే* (01.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*