11, అక్టోబర్ 2023, బుధవారం

100 నిత్య సత్యాలు

 ॐ తెలుగు భక్తి సత్సంగం ॐ:

💐100 నిత్య సత్యాలు - ధర్మఆచారములు💐


1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.


2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.


3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.


4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి


5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.


6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు.


7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.


8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.


9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.


10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.


11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.


13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.


14. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.


15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.


16. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు .


17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.


18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.


19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.


20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.


21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.


22. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా, తడి కాళ్ళతో భోజనం చేయరాదు.


23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.


24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.


25. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు


26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.


27. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు.


28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.


29. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.


30. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.


31. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.


32. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా మనం స్వర్గానికి పోతాము.


33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.


34. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.


35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.


36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.


37. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.


38. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.


39. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు.


40. వికలాంగులను వేళాకోళం చేయరాదు.


41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.


42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.


43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.


44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.


45. ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి.


46. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు.


47. పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామ గారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి.


48. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.


49. ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు.


50. అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.


51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం

.

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.


53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.


54. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం.


55. ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక, వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు

.

56. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు.


57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.


58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.


59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషికం ఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.


60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.


61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు

.

62. ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు.


63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.


64. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.


65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.


66. పాడయిపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని, చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను.


67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.


68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.


69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.


70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


71. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లైతే తండ్రితో పాటు అందరూ కట్టు బట్టలతో స్నానం చేయాలి.


72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాక్ భంగం చాలా దోషం.


73. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.


74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.


75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.


76. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.


77. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.


78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.


79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.


80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


81. నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం, కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని వారికి ఆహారం పెట్టాలి.


82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.


83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.


84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.


85. రేపు చేయవలసిన పనిని ఈ రోజు, ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు.


86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.


87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.


88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.


89. పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే.


90. ప్రదక్షిణలు చేసేటపుడు, మంత్ర పుష్పం ఇచ్చేటపుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహా పాపాలు.


91. గణపతి గరికపూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు(వినాయక చతుర్థినాడు కుడా తులసిని సమర్పించరాదు.


92. మనుష్యుని పాపం వాడి అన్నం లోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.


93. జపమాల మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు.


94. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని, లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి.


95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.


96. భోజనసమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు.


97. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు.


98. శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు.


99. విశిష్ట వ్యక్తులను, మహాత్ములను అగౌరవపరచి, నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు


100. దేవాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు


చదవండి. పిల్లలతో చదివించండి ఇంతకు మంచిన గొప్ప సంపద పిల్లలికి ఇవ్వలేమేమో..!

(సేకరణ)

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న నిధులు_*

 🍁🍁🍁🍁🍁🏵️🏵️

*_తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న నిధులు_*


_1) Nursery._


_2) వైకుంఠ ధమాలు._


_3) గ్రామంలో_ *_పారిశుధ్యం_*


_4) గ్రామాల్లో_ *_LED లైట్స్_*


_5) అర్హులైన ప్రతి *ఇంటికి బాత్రూములు* నిర్మాణం._


_6) రైతులకు *రైతు వేదికలు*, రైతులకు *కల్లాలు* ఏర్పాటు._


_7) డబుల్స్ బెడ్రూం లు,_


_8) ట్రిపుల్ తలక్ రద్దు, *370 ఆర్టికల్* రద్దు._


_9) PMJJY ద్వారా *2 లక్షల* సాధారణ మరియు ప్రమాద భీమా సౌకర్యం._


_10) *భేటీ బచావ్ భేటీ బడవ్* మహిళలకు సౌకర్యం._


_11) brs పార్టీ పంచాయతీల అకౌంట్లు *ఫ్రీజ్* చేస్తే గ్రామాల స్వయం అభివృద్ధి కోసం *నూతన అకౌంట్ ఓపెన్* చేయించడం. కేంద్రం నిధులు నేరుగా గ్రా.ప. అకౌంట్లో వేయడం జరుగుతుంది._


_12) అసంఘటిత కార్మికులకు *2 లక్షల* ప్రమాద భీమా సౌకర్యం._


_13) *సుకన్య సమృద్ధి యోజన.* (ఆడపిల్లకు)_


_14) రైతులకు *ఫసల్ భీమా* యోజన (ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే)_


_15) ఉచితంగా_ *_రేషన్ బియ్యం_.*


_16) గర్భిణీ మహిళలకు అంగన్వాడీల ద్వారా *పౌష్టిక ఆహారం* అందిస్తుంది._


_17) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు *మధ్యాన్నం భోజన సౌకర్యం* కల్పిస్తుంది._


_18) ఆయుష్మాన్ భారత్ ద్వారా *5 లక్షల వరకు* వైద్యం అందిస్తుంది._


_19) పీఎం కిసాన్ యోజన (ఎకరాకు  *రూ.6000/-* ఒక సం.రానికి)_


_20) కరోన వ్యాక్సిన్ ఉచితం._


_21) గ్రామీణ *ఉపాధి హామీ* పథకం._


_22) *అటల్ పెన్షన్* యోజన పథకం. (వృధాప్యంలో పెన్షన్)_.


_23) *జాన్ ధన్ ఖాతా* (జీరో అకౌంట్) ఓపెన్._


_24) యువత స్వశక్తి పై ముందుకు వెళ్లాలని ఎలాంటి పూచీకత్తు లేకుండా అర్హత ఉన్న వారికి *ముద్ర లోన్స్* ఇస్తుంది కేంద్రం._


_25) మత్స్యకారులు కొరకు *చేప పిల్లల పంపిణీ* చేస్తుంది కేంద్రం._


_26) మహిళల కోసం_ *_ఉజ్వల గ్యాస్ యోజన._*


_27) వర్షపు నీరు నిల్వ ఉండడానికి గ్రామంలో *ఇంకుడు గుంతల* ఏర్పాటు._


_28) కేంద్రం నిధులతో_ *_గొర్రెల పంపిణీ_.*


_29) *మన ఊరు-మన బడి* కార్యక్రమానికి కేంద్రం నిధులు. (నూతన పాఠశాలలు, బెంచిలు, వంట గదులు, భోజన శాలలు నిర్మాణం)._


_30) కేంద్రం ప్రభుత్వం రైతులకు ఒక యూరియా బ్యాగ్ పై దాదాపుగా *రూ.3000/-* గ్రోమార్ బ్యాగ్ పై దాదాపుగా *రూ.2500/-* రాయితి ఇస్తుంది._


_ఇలా అనేక పథకాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ, తెలంగాణ  అభివృద్ధికి సహకరిస్తుంది. రైతులకు అనేక రాయితీలు ఇస్తున్న *బీజేపీ సర్కార్* నరేంద్ర మోడీ (కర్మయోగి) గారికి ధన్యవాదాలు...🙏_


*_జై శ్రీరామ్!_*

Panchaag


 

మానవ సేవే మాధవ సేవ

 మానవ సేవే మాధవ సేవ.. దైవానాం మానుష రూపేణ.. 

గరికపాటి వారు వొక సమయము లో వేదాలలో కానీ పురాణాలలో  ఎక్కడైనా  దైవపూజ కు నియమాలు  కానీ ప్రసాదాల వివరణలు కానీ ఎక్కడా కనిపించలేదు. 

పత్రం పుషం ఫలం తోయం ........ .

అని అన్నారు సామాన్య మానవుని దృషి లో ఉంచుకొనే వీటికి పెద్ద ప్రాధాన్యత యివ్వలేదు. 

మనస్సే ముఖ్యం. ధనమూలం  మిదం జగత్ అన్నారు .దాని వెంబడే ధర్మార్థము ధర్మ కామము ధర్మ మోక్షము .అని చెప్పారు. 

రెచ్చగొట్టే ప్రవచనాలు, బాహ్యాడంబరాల అధిక వుచ్చాహాలు 

సామాన్యుని కృంగ తీస్తున్నవి 

వైరాగ్యము త్యాగ నిరతి పరోపాకారము 

వీటి గూర్చి పదిమందికి తెలియజేస్తూ నిజమైన సన్యాశ్రమము  కు ప్రజలు అలవాటు పడేటట్లు తెలియజేసి ప్రజలను ముక్తి మార్గము  లో నడిచే టట్లు చేయగలిగి తే అదే సనాతన ధర్మార్గ ము నకు త్రోవ చూపించిన వారు అవుతారు. 

పరోపకారాయ పున్యాయపాపాయ

పరపీడ నమ్. 

దరిద్రనారాయుడికోసం బ్రతికిన వారే ధాన్య జీవులు. నారాయుడి కోసం బ్రతికిన వారే ధాన్య జీవులు. 

ఓం నమఃశివాయ.

Karra pendalam fry


 

Knots


 

Seeding


 

Msjik trick


 

Chain making


 

Coller point tips


 

USB fan


 

Bhojanam


 

స్వయంపాకం దానం

 *స్వయంపాకం దానం అంటే ఏమిటీ...?*


*పరిస్థితుల కారణం చేత మనం వండిన భోజనం  పెట్టలేకపోయినప్పుడు,  సాధారణంగా బ్రాహ్మణులు బయటి భోజనం తినరు.  వారుచేసే అనుష్టానం వల్ల  వారు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చెయ్యరు. (అనుష్ఠానం అంటే  ఆచారం, నడవడి, వివిధ ధర్మ కర్మలు) అందుకోసం వారిని ఇబ్బంది కలిగించకుండా బ్రాహ్మణుడినే స్వయంగా  తయారుచేసుకోమని ప్రార్ధిస్తూ ఇచ్చేదే స్వయంపాకం.*


*స్వయంపాకంకు కావలసినవి.*


*దోసకాయ, బీరకాయ, పచ్చి అరటి కాయలు, దొండకాయలు, చామగడ్డలు, కంద గడ్డ, ఆకుకూరల్లో  తోటకూర. ఇందులో మీకిష్టమైనవి కనీసం 4 రకాల కూరలు ఉండాలి.*


*వాటితో పాటు బియ్యం, చింతపండు, పప్పులు, బెల్లం, గట్టి ఉప్పు, ఎండు మిరపకాయలు, నెయ్యి, పెరుగు ఇలా భోజనానికి సరిపడా అన్ని పదార్ధాలు ఒక ఆకులో పెట్టి ఇవ్వాలి.*


*కూరగాయలతో పాటు తోటకూర తప్పనిసరిగా వుండాలి అని చెప్తారు మనపెద్దలు.*


*ఇవే కాకుండా దానం చేసుకోవడానికి ఏ వస్తువూ అనర్హం కాదు.*


*విస్తరిలో బియ్యం కనీసం 1-1/4 కేజీ ఉండాలి. తీపి గుమ్మడికాయ కూడ ఇవ్వొచ్చు.*


*మధ్యలో రెండు తమలపాకులు, వక్కలు నల్లవి, రెండు అరటిపండ్లు, తాంబూలం మీకు తోచిన దక్షిణ (51/- లేదా 116/- ) ఉంచివారికి అందించాలి.*


*దానితో వారు కూడా  ఎంతో సంతసించి మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని ఆశీర్వచనం  పలకుతారు.( దీవిస్తారు)*


*సౌఖ్యమైన జీవనం కోసం  మంచి గుమ్మడికాయ దానం చేసుకోవచ్చు.*


*అన్ని కలగాపులగంగా  కలిపేసి ఇవ్వకుండా, వేటికీ అవి ప్రత్యేకంగా ఒక కవరు లాంటి దాంట్లో వేసి ఇస్తే వస్తువులు పాడుకాకుండా ఇంటికి తీసుకువెళ్లి వండుకుంటారు.*


*విస్తరిలో అన్ని ఉంచిన తరువాత బియ్యం పిండితో చేసిన దీపాన్ని ఉంచి ప్రత్యేకంగా కార్తీకమాసంలో దీపదానం కూడా చెయ్యొచ్చు. దానికి విశేష ఫలితం పొందుతారు.🙏*

సహజ సిద్ద వైరాగ్యం

 సహజ సిద్ద వైరాగ్యం అంత తేలిగ్గా పుట్టదు.  ఎంతో సాధన చేస్తేనే వైరాగ్యం క్షణం కూడా నిలువదు. "భజ గోవిందం" అన్నది ఓ నిరంతర వ్యాపకంగా ఉంటే..ఎప్పటికో ఎన్ని జన్మలకో పరమాత్మ అనుగ్రహంతో వైరాగ్యం సహజ సిద్ధంగా కలుగుతుంది. అప్పటి వరకూ ఎం చెయ్యాలి??అన్నీ వొదిలేయాలా?? అలా చెప్పలేదు శంకరుల వారు. సహజంగా వైరాగ్య భావం కలిగే వరకూ ధర్మ ఆచరణ చేయాల్సిందే. అదెలా? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పారుగా..అన్నీ ఈయనకే అర్పించాలి. బృందావనంలో గోపికల్లా. వారు అన్ని పనులూ చేసుకుంటారు..అంతటా కృష్ణుడునే చూస్తారు. అన్నీ వొదలమంటే సంధ్యావందనం, దేవతార్చన...వొదిలేసి భజన చేయమని కాదు. దేహమున్నంత వరకూ ధర్మాన్ని ఆచరిస్తూనే..క్రమంగా వైరాగ్యాన్ని అలవరచుకోవాలి. వైరాగ్యం తోనే ఆత్మ విచారం సాధ్య పడుతుంది. భగవద్గీత లో స్వామి చెప్పినదే.. భజగోవిందం శ్లోకాలలో శంకరుల వారు చెప్పారు. ధర్మాన్ని విడిచిపెట్టమని వొదిలేయమని గోవిందుడు చెప్పలేదు. శంకరులు చెప్పలేదు.🙏

Sneha Bandham

Sneha badham 

బ్రాహ్మణ వృధ్ధాశ్రమం :-

 బ్రాహ్మణ వృధ్ధాశ్రమం :-


జంటకు ఐతే : రూ 25000

ఒకరికి ఐతే నెలకు రూ 15000 


సపరేటు రూము 

వెస్టర్ను బాత్ రూము 

వేడినీళ్లు 

అల్పాహారం 

మంచి వేడి వేడి భోజనం 

రాత్రికి తిరిగి అల్పాహారం లేదా భోజనం 

మంచం ,బీరువా 

కేవలం బట్టలు తీసుకుని వస్తే చాలు 

టీవీ , ఫ్రిడ్జ్ 

ఉదయం సాయంత్రం 

కాఫీ లేదా పాలు 

బట్టలు ఉతుకుతారు 

ఉల్లిపాయలు వాడము 

సంప్రదాయాలను పాటించేవారికే అవకాశం 

బెడ్ రిడన్ వారికి అవకాశం లేదు 


చిరునామా : 

నల్లకుంట , హైదరాబాద్ 

వివరాలకు మెసేజి పెట్టండి : 

9701609689


or 

DIAL 

SMT DURGARANI

6304921292

💐💐💐💐💐


మీకు తెలిసిన బ్రాహ్మణులకు మెసేజ్ పంపండి


పేద మధ్యతరగతి బ్రాహ్మణ ఆడపిల్లల పెళ్ళికి మా సహకారం : 

బాధ్యతతో ప్రకటన : తేదీ : 9 డిసెంబర్ 2020 : 


నిశ్చితార్థం రోజు 

కేవలం 15 లేదా 20 మంది లోపు 

వచ్చేది ఉంటె , హాజరు అవుతారు అంటే .. 


హాలు , భోజనాలు , వీడియో గ్రఫీ ఉచితం .. 


ఇది హైదరాబాద్ నల్లకుంట లో .. 


ఆడపిల్ల పెళ్లి అంటే 

తల్లి తండ్రులు వచ్చి దరఖాస్తు పెట్టుకుంటే 

పెళ్ళికి బంగారు తాళిబొట్టు 

పట్టు చీరలు 

రూ 5 వేలు నగదు సహాయం చేయబడును .. 


ఆడపిల్లకు తండ్రి  లేరు 

చాల పేదరికంలో ఉన్నారు 

అనుకుంటే , పై మూడుతో పాటు 

వంద మంది వరకు భోజనాలు 

క్యాటరింగ్ కూడా ఉచితం .


రెండు నెలల ముందే తెలియ చేస్తే, 

దిల్ షుక్ నగర్ , హైదరాబాద్ లో 

హాలు కూడా ఉచితంగా ఇవ్వబడును .


బ్రాహ్మణ సంక్షేమ భవన్ :-

9701609689


వివరాలకు పై number ki call cheyandi


*ధన్యవాదములు* (వాట్సప్ మెసేజ్)

*క"సాయి రామాలయాలు

 *క"సాయి రామాలయాలు" వచ్చి చిన్న చిన్న గ్రామాలలో కూడా రామాలయాలు నిత్యధూపదీపనైవేద్యాలు లేకుండా ఆ ఆలయాన్ని నమ్ముకున్న అర్చకులకు పూటగడవక వేరే వృత్తి చేసుకునే లా దిగజార్చేసాయి.కానీ హిందువులు వారి క"సాయి" బలహీనత వంటి అనేక వ్యాధులతో నిత్యం వెలుగు తూనే ఉన్నారు.* అసలు ఈ క"సాయిబాబా " మనకు ఏ విధంగా దేవుడు అంటే ఒక్క సాయిరోగి కూడా సరైన సమాధానం చెప్పలేడు. బాబా ని పూజించాకా చక్కగా మా అత్తమామలు పోయారు, మా ఆయన నుండి విడాకులు లభించాయి,చక్కగా మా ఆవిడ పోయింది, చక్కగా నన్ను ఎదిరించే నా కొడుకు పోయాడు.... ఇలాంటి సమాధానాలే ఎక్కువ. రాముడి ని గాలికొదిలేసే ఈ గాలిగాళ్ళని రక్షించడానికి మాత్రం రాముడే కావాలి. ఆ షిర్డీ సాయి సంస్థాన్ వారు అర్ధరూపాయికూడా అయోధ్య రామాలయ నిర్మాణానికి ఇవ్వకపోగా మసీదు ల నిర్మాణానికి విస్తృతంగా నిధులిస్తూ ఉన్న నూ ఈ రోగులు మాత్రం మారరు.ఏదో ఒకరోజు వీళ్ళని కూడా హలాల్ చేస్తూ ఉంటే అప్పుడు నమ్ముతారేమో!!!

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


అని ఆ జలాలను మెచ్చుకుంటూ నా మహతీవీణనూ, మృగాజినాన్ని తీసి శ్రీహరి సన్నిధిలో

ఉంచి క్రొత్త రేవుగదా అని సంశయిస్తూ మెల్లగా సరోవరంలోకి దిగాను. కాళ్ళూ చేతులూ కడుక్కుని, శిఖ

విదిల్చి, ఆచమించి ఇంకొంచెం లోతుకి వెళ్ళి స్నానానికి ఉపక్రమించాను. విష్ణుమూర్తి గట్టున కూర్చుని

అంతా తిలకిస్తూనే ఉన్నాడు. అలా మునిగానో లేదో నాకు పురుషరూపం పోయి స్త్రీ రూపం వచ్చేసింది.

ఆశ్చర్యంతో కళవళపడ్డాను. రవ్వంత తేరుకుని గట్టువైపు చూద్దునుగదా శ్రీహరి నా వీణనూ కృష్ణాజినాన్నీ

తీసుకుని గరుత్మంతుణ్ణి అధిరోహించి తుర్రుమన్నాడు.

సాధూవామివ చేతాంసి జలాని నిర్మలాని చ

సురభీణి పరాగైస్తు పంకజానాం విశేషతః

.

నారద తాళధ్వజుల పరిణయం

సర్వాలంకారభూషితమైన స్త్రీరూపం రాగానే నాకు పూర్వపు పురుషరూప స్మృతి క్షణంలో

మటుమాయమయ్యింది. జగన్నాథుణ్ణి మర్చిపోయాను. మహతినీ కృష్ణాజినాన్నీ మరిచిపోయాను.

మోహినీరూపంతో సరోవరం నుంచి బయటకి వచ్చాను. గట్టుమీద నిలబడి ఆ సరస్సును

మరొక్కసారి పరిశీలనగా చూశాను. స్వచ్ఛంగా నిర్మలంగా ఏమీ ఎరగనట్టే ఉంది. ఈ వింత ఏమిటి చెప్మా

అని ఆశ్చర్యపోతూ నిలబడ్డాను. ఏమి చెయ్యాలో ఎటుపోవాలో తోచక దిక్కులు చూస్తున్నాను.

తాళధ్వజ మహారాజు అటువైపు వస్తూ కనిపించాడు. గజాశ్వరథబృందాలు వెంటరాగా తానొక

రథంమీద విజయం చేస్తున్నాడు. కోడెవయస్సులో సువర్ణ దివ్యాభరణ విభూషితుడై మళ్ళీ పుట్టిన మన్మథుడిలావిరాజిల్లుతున్నాడు.

గజాశ్వరథబృందైశ్చ సంవృతో రథసంస్థితః ।

యువా భూషణసంవీతో దేహవానివ మన్మథః ॥

11

(28-49

ఉద్ధవగీత


ఉద్ధవగీత

శ్లో),వస్త్రోపవీతాభరణపత్ర స్రగ్గంధ లేపనైః |

అలంకుర్వీత సప్రేమ మద్భక్తో మాం యథోచితమ్


అ)నా భక్తుడు నన్ను వస్త్రము, ఉపవీతము, ఆభరణము, పత్రరచన తులసీమాల, పుష్పమాల, గంధము, అనులేపనము అనువానిద్వారా ప్రేమతో దగినవిధముగ నలంకరింపవలెను


విదురనీతి

శ్లో)విరోచనోఽథదైతేయస్తదా తత్రాజగామహ

ప్రాప్తుమిచ్ఛంస్తత స్తత్ర దైత్యేంద్రం ప్రాహకేశని॥ 


అ)అప్పుడు విరోచనుడనే పేరు గల రాక్షస జాతివాడు ఆమెను పొందటానిఅక్కడకి వచ్చినాడు. ఆసమయంలో కేశిని అతనితో ఇట్టన్నది

Vigraham


 

మధువని క్యాటరింగ్

 *మధువని క్యాటరింగ్ వారు దసరా ప్రసాదాలతో మీముందుకు వస్తున్నారు*

మధువని క్యాటరింగ్ విజయవాడ

అన్ని రకాల శుభకార్యాలకు క్యాటరింగ్ చేయబడును *నోములకు పండుగలకు మడితో ప్రసాదాలు చేసి ఇవ్వబడును* మెము ప్రతి సంవత్సరంలాగా  ఈ సంవత్సరం కూడా దసరా ప్రసాదాలు ఆఫర్ పెట్టాము

మీ ఎవరికైనా ఈ తొమ్మిది రోజుల ప్రసాదాలు కావాలనుకుంటే 9182554800,7396881404 ఈ నెంబర్లను సంప్రదించగలరు


*స్వర్ణ కవచాలున్క్రుతకనకదుర్గా దేవి;పులిహోర,రవ్వకేసరి*  


*బాలత్రిపురసుందరిఅమ్మవారు:పరమాన్నం,దధ్యోజనం*


*గాయత్రీదేవి;కొబ్బరిఅన్నం,శనగలు*


*అన్నపూర్ణ దేవి;కట్టే పొంగలి,పాయసం*


*లలితా త్రిపుర సుందరి దేవి; బెల్లంపరమ్మన్నం,పెరుగు వడ* 


*సరస్వతి దేవి;దధ్యోజనం,బొబ్బర్లు*


*మహాలక్ష్మి దేవి; పులిహోర,చక్రపొంగలి*


*దుర్గ దేవి;పులిహోర,చక్కర పొంగలి*


*మహిషాసుర మర్దని దేవి;కారం గారెలు,పరమాన్నం*


*రాజరాజేశ్వరి దేవి; పూర్ణాలు,కదంబం*


*ముఖ్యగమనిక దయచేసిఆర్డర్ విజయవాడవారికిమాత్రమేప్రయాణికులకు విజయవాడలో భోజనాలు అందించబడును*

వివరాలకు9182554800 7396881404 ఈ నెంబర్లను సంప్రదించగలరు


 

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *ద్వితీయాశ్వాసము*


                      *20*


*వినత దాస్య విముక్తి*


తరువాత వినత రెండవ అండం నుండి అతి బలవంతుడైన  గరుత్మంతుడు  జన్మించాడు. గరుత్మంతుడు తల్లితో చేరి దాస్యం అనుభవిస్తున్నాడు. ఒక రోజు  కద్రువ గరుడా ! నీ తల్లి నాకు దాసి నీవు దాసీ పుత్రుడవు. కనుక నీవు రోజూ నీ సోదరులైన నాగులను రెక్కలమీద విహారానికిని వెళ్ళు" అన్నది. ఒక రోజు గరుత్మంతుడు నాగులను రెక్కలమీద ఎక్కించుకుని సూర్య మండల సమీపానికి వెళ్ళాడు. వేడికి తట్టుకోలేని నాగులు సొమ్మసిల్లి పడిపోయాయి.  కద్రువ ఇంద్రుని ప్రార్ధించి వర్షం కురిపించి పుత్రులను సేద తీర్చింది. పుత్రుల అవస్థకు కారణమైన గరుత్మంతుని తీవ్రంగా దూషించింది. అది సహించలేని  గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం ఏమిటని వినతను అడిగి తెలుసుకున్నాడు. తల్లి దాస్యాన్ని తాను తీర్చగలనని తెలుసుకున్నాడు.  గరుత్మంతుడు తమ దాస్య విముక్తి చేయడానికి ఏమి కావాలని  కద్రువను  అడిగాడు. ఆమె తన కుమారులకు అమృతం తెచ్చి ఇస్తే దాస్య విముక్తులు కాగలరని చెప్పింది.  గరుత్మంతుడు అమృతం తీసుకు రావడానికి బయలు దేరాడు. మార్గమధ్యంలో తనకు తీవ్రంగా ఆకలి అయింది. ఆకలి తీర్చమని తండ్రిని అడిగాడు. కశ్యపుడు " కుమారా విభావసుడు సుప్రీతకుడు అనే అన్నదమ్ము ఉన్నారు. తమ్ముడు ఆస్తిలో భాగం అడిగినందుకు కోపించి అతడిని ఏనుగువు కమ్ము అని విభావసుడు శపించాడు. తమ్ముడు కోపించి అన్నను తాబేలువు కమ్ము అని ప్రతి శాపం ఇచ్చాడు. అప్పుడు వారిరువురు మూడు యోజనములు పొడవు పది యోజనము వెడల్పు గల తాబేలు గానూ, ఆరు యోజనముల పొడవు పన్నెండు యోజనముల వెడల్పు కలిగిన ఏనుగుగానూ మారి పోయారు. కానీ ఇప్పటికీ కలహించుకుంటూ ఉన్నారు. నీవు వారిరువురిని పట్టి తిని ఆకలి తీర్చుకో ". గరుడుడు సంతోషించి విభావసుడు అనే ఏనుగుని సుప్రతీకుడు అనే తాబేలును తీసుకుని రోహణుడు అనే వృక్షపు కొమ్మ మీద కూర్చున్నాడు. ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది. ఆ వృక్షపు శాఖలో తపసు చేసుకుంటున్న మునులను చూసాడు. వారు క్రింద పడతారని భావించి ఆ కొమ్మను పట్టుకుని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏమి చేయాలి అని అడిగాడు.  కశ్యపుడు మునులను చూసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకొమ్మని ప్రార్ధించాడు. మునులు అంగీకరించి కొమ్మను విడిచి వెళ్ళారు. గరుత్మంతుడు ఆహారాన్ని భుజించి దేవలోకానికి చేరాడు. దేవలోకానికి చేరిన గరుత్మంతుడు అమృతం కోసం దేవతలను ఓడించి అమృతాన్ని తీసుకు వెళుతున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి గరుడుని వద్దకు వచ్చి " నీ సాహసానికి మెచ్చాను వరం ఏమి కావాలి " అని అడిగాడు. అందుకు గరుత్మంతుడు " దేవా అమృతం సేవించకుండానే చిరంజీవిగా ఉండాలి,  విష్ణుమూర్తికి వాహనం కావాలి " అని కోరుకున్నాడు. ఇంతలో ఇంద్రుడు గరుత్మంతునపై వజ్రాయుధాన్ని వేసాడు. తనపై వేసిన వజ్రాయుధాన్ని గౌరవించి ఒక ఈకను మాత్రం తుంచమని చెప్పాడు. ఇంద్రుడు  గరుడుని బలానికి అశ్చర్యము చెంది అతనితో మైత్రి చేసుకున్నాడు. గరుడా క్రూరులైన నాగులకు అమృతాన్నిచ్చి లోకాలకు కీడు చేయవద్దని వేడుకొన్నాడు. అందుకు సమ్మతించిన గరుత్మంతుడు "నేను అమృతాన్నిచ్చి నా తల్లితో సహా దాస్య విముక్తులము అవుతాము. ఇంద్రా నీవు వారు అమృతం సేవించే లోపు తిరిగి తీసుకొని వెళ్ళు" అని చెప్పాడు. అలాగే చేసి తల్లిని దాస్య విముక్తి చేసి తన రెక్కలపై పెట్టుకొని తీసుకు వెళ్ళాడు. అమృతం త్రాగే ముందు నాగులు శుచి అగుటకు నదిలో స్నానమాచరించే సమయంలో ఇంద్రుడు  అమృతాన్ని తీసుకు వెళ్ళాడు. నిరాశ పడిన నాగులు అమృతం ఉంచిన దర్భలు నాకాయి. ఆ కారణంగా వాటి నాలుకలు రెండుగా చీలి పోయాయి. ఆనాటి నుండి నాగులు ద్విజిహ్వులు అయ్యారు. అమృతం పెట్టిన కారణంగా దర్భలు పవిత్రం అయ్యాయి. ఇదంతా చూసిన ఆదిశేషుడు తల్లి మీద తమ్ముల మీద అసహ్య పడి వారిని విడిచి వెళ్ళి బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. అతని సత్య సంధతకు ధర్మనిష్టకు మెచ్చిన బ్రహ్మ దేవుడు భూభారాన్ని మోసే భారాన్ని ఆది శేషునకు అప్పగించాడు.

Hanuman

 https://youtu.be/ftVOE1P3JsE?feature=shared


రాయల వర్ణనా వైభవము

 


రాయల వర్ణనా వైభవము!


గోవర్ధనగిరిధారి మురారి!

   

ఆయత యుష్మదాకృతి కరాగ్ర నగాంచల వాంత వారి ధా

రాయుత చంద్రకాంత ఫలకావళి బింబితయై వెలుంగ నా

రాయణమూర్తిమ త్కవచ రత్నముచే బరిరక్ష గాంచె నా

నో యదువీర వృష్టి బసి యూరడ బ్రోవవె సప్త రాత్రముల్;

ఆముక్తమాల్యద-4-ఆ.వర్షావర్ణనము.


          యాదవులపైకోపించి దేవేంద్రుడు రాళ్ళవానగురియిమచుచుండ వారిని రక్షించుటకయి కన్నయ్య గోవర్ధన ధారియయ్యెను.

      యాదవులందరు సపరివారముగా

నాపర్వతఛత్రముక్రిందకుఁజేరి ప్రాణభయవిముక్తులైనారు.

        అదీ ఇక్కడిదృశ్యము.


కృష్ణా !!నీవుగోవర్ధనమెత్తిపట్టఁగా భయంకరమైన యావానకు జారిపడుతున్న చంద్రకాంతశిలాఖండములలోను, ఆవర్షధారలలోనూ,నీరూపే ప్రతిఫలింప,

నారాయణ కవచధారులై గోకుల సహితముగా సర్వులురక్షింపబడుచున్నారో ?యనునట్లున్నదయ్యా! ఆదృశ్యము!!

కన్నయ్యా!నీమహిమలనంతములు.అని,

         చక్కని యుత్ప్రేక్షతో నా గోవర్ధనగిరిధారి దృశ్యమున కూపిరులూదెను.

     అనిదంపూర్వమైన ఇట్టివర్ణనలు రాయలకు వెన్నతో బెట్టినవిద్య!

                                     స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - కృష్ణ పక్షం  -  ద్వాదశి - మఘ/ పూర్వాఫల్గుణి - సౌమ్య వాసరే* *(11-10-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/e3WRd8_1OME?si=zV6-xCe1jVXU8peq


🙏🙏. 

Ganapati prardhana

 *శ్రీ విఘ్నేశ్వరుని అనుగ్రహం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ, శుభోదయ శుభాకాంక్షలతో, మీ శ్రేయోభిలాషి, నిష్ఠల సుబ్రహ్మణ్యం.* 


https://youtu.be/FlgFRVHprfs?si=1PJFKIor9zfUDn2e


Hara hars ksetram

 https://youtu.be/t-zCzognOx0?si=uoiMIwO5kkfNKdG_


దేవతార్చన మానవాళికి

 దేవతార్చన మానవాళికి ముఖ్యమైన కర్తవ్యంగా చెప్పబడుతున్నది. ప్రతివారూ వారి ఇంట్లో రెండు పూటలా దేవతా సన్నిధిని కల్పించుకొని దీపాలు వెలిగించుకోవడం అనేది సంస్కృతిలో ప్రధానమైనటువంటి భాగం.  ఏదో అందరం కలిసి గుడికి వెళ్తున్నాం, దణ్ణం పెడుతున్నాం సరిపోతుంది, ఇంట్లో పూజలు అక్కరలేదు అని అనరు. 

ఇంట్లో దేవతారాధన తప్పకుండా జరగాలి అని చెప్పబడుతున్నది. గృహం అంటూ ఉన్నాక గృహదేవతలు ఉంటూ ఉంటారు. ఆ గృహదేవతలందరూ శాంతించాలంటే ఇంట్లో ఇష్టదేవతను ఆరాధిస్తూ పెద్దలు చెప్పినటువంటి, 

సనాతన సంప్రదాయంలో వస్తున్నటువంటి దేవతలను ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ఎంత ఇష్టదేవతా నిష్ఠ ఉన్నా ఇతర దేవతలను కూడా ఆరాధించుకుంటూ ఉంటాం. ఇష్టదేవతలు ఇతర దేవతల యొక్క మరొక రూపాలు అనే భావనతో ఆరాధించుకోవాలి. అది భావనతో సరిపోతుంది. 

ఇంట్లో పూజించినప్పుడు భావము, భగవన్నామము లేదా మనకు తెలిసిన పురాణాలలోను, ఇతర స్తోత్ర వాజ్ఞ్మయంలోను ఉన్నటువంటి శ్లోకాలతో భగవంతుడిని ఆరాధించినా సరిపోతుంది. ఎక్కువ సేపు కష్టపడనక్కరలేదు. 

స్నానం చేసిన తరువాత ఒక్క అయిదు/పది నిమిషాలు శుద్ధిగా భగవంతుడి దగ్గర ధూపము, దీపము, నైవేద్యము, కుసుమాలు ఇత్యాదులు సమర్పణ చేసుకుంటూ ప్రీతిపాత్రమైన ఒక శ్లోకాన్నో, మంత్రాన్నో జపం చేసుకున్నా సరిపోతుంది. సామాన్యుల విషయం ఇది. అయితే ఇంట్లో ఆరాధించే దేవతలపట్ల ఒక భావం ఉంటే చాలు. ఆ భావానికి ఈ శ్లోక, నామరూపమైన శబ్ద శక్తి జతకలిస్తే అక్కడ తప్పకుండా ఆ దేవతా సన్నిధి ఉంటుంది. అది ఇంటినంతటినీ రక్షించుకుంటూ ఉంటుంది. అలాంటి దేవతా సన్నిధి ఇంట్లో ఉంటుంది గనుక ఇంటిని కూడా పవిత్రంగా ఉంచుకోవడం అనేది మన సంప్రదాయంలో కనబడుతూ ఉంటుంది. ఇళ్ళల్లో భావన సరిపోతుంది. పెద్దలు ఒక మాట చెప్తారు -

న దేవో విద్యతే కాష్ఠే న పాషాణే న మృణ్మయే!

భావే హి విద్యతే దేవస్తస్మాత్ భావోహి కారణం!!

దేవత కర్రలోనో, రాయిలోనో ఉండదు. భావంలో ఉంటుంది.  భావంలో భగవంతుడు ఉంటాడు కనుక బయట పూజలు అక్కరలేదు అని చెప్పరాదు.  భావంలో భగవంతుడు ఉంటాడు గనుక నీ భావంతో ఏ విగ్రహమునందు, ఏ పటము నందు భావిస్తే అందులో భగవచ్ఛక్తి కేంద్రీకరింపబడి కాపాడుతూ ఉంటుంది అని దీని యొక్క భావం.

అయితే ఆలయాలలో కొచ్చేటప్పటికి అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి. ఏదో విగ్రహం పెట్టుకొని, ఏదో పూజ జరుగుతోందని బయట చూసే వాళ్ళకి అనిపించవచ్చు. కానీ అక్కడ జరిగే ప్రక్రియ చాలా విశేషంగా ఉంటుంది. 

ఉదాహరణకు ఒక ఊరిలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ విద్యుచ్ఛక్తిని వాళ్ళు ఏవిధంగా దాచిపెడతారు, ఏవిధంగా పంచుతారు అనే వ్యవస్థ అందులో పనిచేసేటటువంటి ఆ శాస్త్రవేత్తలకి, కార్మికులకి తెలుస్తుంది తప్ప సామాన్యులకి చెప్పినా అర్థం కాదు. అదేవిధంగా ఆలయాలలో కూడా దైవశక్తిని ఏవిధంగా జాగ్రత్త చేసుకోవాలి? ఏవిధంగా దానిని పరిరక్షించుకుంటూ ప్రసారం చేయాలి? ఈ ప్రక్రియలన్నీ ఆగమ శాస్త్రాలలో చెప్తూ ఉంటారు. 

అందుకే ఆలయ అర్చకులు తప్పకుండా శాస్త్రాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆ శాస్త్రాలు చెప్పినట్లు వాళ్ళు జీవిస్తూ ఉండాలి. కనీసం త్రిసంధ్యలు చేయనప్పుడు అర్చకత్వానికి అర్హతే ఉండదు. సంధ్యావందనాది కృత్యాలు చేయగలిగితేనే వాని మంత్రం ఫలిస్తుంది. మంత్రోచ్ఛారణ చేయడానికి తగిన అర్హత అనుష్ఠానం వల్ల వస్తుంది. 

అంతేకానీ కేవలం అర్చకత్వం కడుపు నింపుకోవడం చేసే వృత్తి అనే భావన కాకుండా ప్రధానంగా అతడు అనుష్ఠాన పరుడై ఉండాలి. తాను ఆరాధించే దేవతయందు తాను ముందు విశ్వాసం కలిగి ఉంటూ శాస్త్రం చెప్పిన ప్రక్రియను తు. చ. తప్పకుండా జరపాలి. ఎందుకంటే ఆ ప్రక్రియ ఇవాళ ఆరంభమైనది కాదు. యుగయుగాలనుంచి ఉన్నటువంటి ఆలయాలలో క్షేత్రాలలో పద్ధతులు ప్రాచీనులు చేస్తూ వచ్చారు. వాటిని మార్చేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఆ దైవశక్తిని ఎలా కాపాడుకోవాలి? ఎలా అర్చించాలి? అక్కడ ఉన్న దేవత క్రింద పెట్టిన యంత్రం ఏమిటి? ఆ యంత్రంలో ఆవరణ దేవతలు ఎవరు? వారికి ఏయే పదార్థాలు నివేదన చేయాలి? అక్కడ గర్భగుడిలో, అంతరాలయంలో, ధ్వజస్తంభం దగ్గర, పరివార దేవతలు, ద్వారపాలకులు, - వాళ్ళని ఎలా ఆరాధించాలి? వంటి పద్ధతులు తెలియాలి. 

అందుకే పరంపరాగతమైనటువంటి ఒకానొక సంప్రదాయం ప్రతి ఆలయ అర్చనా విధానాలలోను, ఆలయ నిర్వహణలోను ఉంటూ ఉంటుంది. ఏ సమయంలో ఏవి నివేదన చేయాలి? ఏ సమయంలో ఏయే మంత్రములు నియోగించాలి? ఎప్పుడెప్పుడు ఏ ఉత్సవాలు చేయాలి? ఇవన్నీ ప్రతి ఆలయానికీ అనాదిగా చక్కగా భద్రపరచబడి ఉన్నాయి, నిర్దేశింపబడి ఉన్నాయి. ఆ నిర్దేశించినటువంటి ఆగమ పద్ధతులు అతిక్రమించకుండా చూడడమే నిర్వహణ. అంతేకానీ క్రొత్త పథకం పెడితే మరింత రాబడి వస్తుంది అంటూ ప్రాచీనమైన పద్ధతులను దెబ్బతీయరాదు. అటువంటివి గానీ దెబ్బతీస్తే క్రమంగా కొన్ని ప్రమాదాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఎందుకంటే ఒక ఆలయంలో జరిగిన ప్రక్రియలు ఆ ఊరిలో ఉన్న పంచభూత వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి. ఆ పద్ధతులను తేడా చేస్తే పంచభూత వ్యవస్థలో తేడా చేసి ఉత్పాతాలు కూడా వస్తున్నాయి. కొద్దికాలం క్రితం ఒక ఆలయంలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. అది ప్రతిష్ఠిత ఆలయమే. తండ్రి ప్రతిష్ఠ చేశాడు. అందులో ఆయన ఒక శివలింగాన్ని పెట్టి అటు, ఇటు దుర్గా, కాళీ విగ్రహాలను పెట్టాడు. కొంతకాలానికి తరువాతి తరం మారగానే అర్చకుడిగా ఉన్న వాడు సౌకర్యం కోసం శివలింగాన్ని తీసి పైన ఎత్తుగా అరుగు మీద పెట్టాడు. ఆశ్చర్యం ఆరోజు రాత్రినుంచి అతనికి తల తిరుగుతున్నట్లు అనిపించడం, మెదడు ఒకవైపు వాలిపోతున్నట్లు అనిపించడం,మొదలైనవి జరిగాయి. తరువాత అక్కడికి ఒక సిద్ధ పురుషుడు వచ్చినప్పుడు ఎందుకో ఇలా ఉంటోంది ఆరోగ్యం బాగోలేదు అంటే ఆయన నాయనా! నువ్వు ఈ శివుడిని తీసుకెళ్ళి పైకి పెట్టావు. కానీ శివుడు అక్కడే ఉండాలి. ఎందువల్ల అంటే దుర్గ, కాళి ప్రక్కన పెట్టడంలో అక్కడి శివుడి పేరు శరభేశ్వరుడు. శరభేశ్వరునికి దుర్గ, కాళి రెండు రెక్కలు. నువ్వు దానిని కదిలించి పైకి పెట్టగానే రెక్కలనుంచి దూరమైన పక్షిలాగా పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే నీ తాతలు ప్రతిష్ఠ చేశారో ఆ దేవత యొక్క శక్తి నీ జీవులతో అనుబంధం కలిగి ఉంటుంది. 

కనుక అక్కడ ఎక్కడైనా తేడా జరిగితే అవి మీ శరీరాలలో తేడా చూపిస్తాయి. ఊరిలో కూడా తేడా చూపిస్తాయి. అందుకే మన సౌకర్యాల కోసం కట్టడాలు కానీ, విగ్రహాలు కానీ స్థానభ్రంశం చెందరాదు. జరిగితే ప్రమాదము. ఎందుకంటే అక్కడ విగ్రహంకంటే గొప్పది ఆ క్షేత్రంలో ఉన్న శక్తి. ఆ శక్తిని ఉద్దేశించి అక్కడ విగ్రహం పెడతారు. అది మనం తరలించితే ఆ శక్తికి విగ్రహ ఆధారం దొరకదు. 

అందుకే ఆగమ శాస్త్రము, పెద్దలను సంప్రదించకుండా మార్పులు చేయరాదు. మహా మహిమాన్వితమైన ఆలయాలు, క్షేత్రాలు ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనకు ఉన్నది.  అందుకే కాపాడుకొనే పద్ధతులు చెప్పుకున్నాం. అలా మహా అర్చకుడు రామకృష్ణపరమహంస వంటి యోగులు కూడా ఉన్నారు అర్చకులలో. ఇటువంటి వ్యవస్థ కలిగిన భారతీయ దేవాలయ స్వరూపాలకు నమస్కరిస్తూ స్వస్తి.

సంపూర్ణ శ్రీ శివమహాపురాణం

 సంపూర్ణ శ్రీ శివమహాపురాణం - ఉమా సంహిత - అధ్యాయం - 17  


జంబూద్వీప వర్ణనము


సనత్కుమారుడు ఇట్లు పలికెను-


ఓ పరాశరపుత్రా! ఏడు ద్వీపములు మొదలగు వాటితో కూడియున్న భూమండలమును గురించి చక్కగా నేను సంగ్రహముగా చెప్పెదను. నీవు వినుము (1). జంబూ-ప్లక్ష-శాల్మలి -కుశ -క్రౌంచ -శాకక-పుష్పకములను ఏడు ద్వీపములను గలవు. ఇవి ఏడు సముద్రములచే చుట్టువారబడి యున్నవి (2). అవి క్రమముగా ఉప్పునీరు, చెరుకు రసము, నెయ్యి, పెరుగు, పాలు, మంచి నీరు అను వాటితో నిండియుండును. ఈ ఏడు ద్వీపములలో జంబూద్వీపము మధ్యలో నున్నది (3). ఓ వ్యాసా! దానికి మధ్యలో బంగరు మేరు పర్వతము గలదు. అది భూమి లోపలికి పదునారు, పైకి ఎనభై నాలుగు యోజనములు వ్యాపించి యున్నది. అగ్రమునందు దాని నిడివి ముప్పది రెండు యోజనములు గలదు. భూమిపై చాల ఎత్తులో ఉన్న ఈ పర్వతము అన్ని వైపులకు విస్తరించి యున్నది (4, 5). అది మూలమునందు పదునార వేల యోజనముల విస్తారమును కలిగియున్నది. అది పద్మముయొక్క బీజకోశమును పోలియున్నది. దానికి దక్షిణములో హిమవాన్‌, హేమకూటము మరియు నిషధము అను పర్వతములు గలవు (6). ఉత్తరమునందు నీలము, శ్వేతము మరియు శృంగీ అనే వర్ష(భూఖండమును నిర్దేశించే) పర్వతములు గలవు. పదివేల యోజనముల విస్తీర్ణము గల ఈ పర్వతములు రత్నములతో నిండి ఎర్రని కాంతులు కలిగి యుండును (7). ఇవి వేయి యోజనములు ఎత్తు, అంతే నిడివి కలిగి యున్నవి. మొదటి ఖండము భారతము. రెండవది కింపురుషమనబడును (8). ఓ మునీ! తరువాతిది హరివర్షము. అది మేరుపర్వతమునకు దక్షిణములో గలదు. మేరువునకు ఉత్తరభాగమునందు రమ్యకవర్షము గలదు. హిరణ్మయవర్షము దానిలో భాగమే (9). ఓ మహర్షీ! ఉత్తరమునందు కురుదేశము గలదు. భారతవర్షములో సహా ఈ భూభాగములు అన్నియు ఒక్కొక్కటి తొమ్మిదివేల యోజనముల నిడివి కలిగి యున్నవి (10).


దాని మధ్యలో ఇలావృతవర్షము గలదు. దాని మధ్యలో ఎత్తైన మేరు పర్వతము గలద. మేరువు అచట నాలుగు దిక్కులయందు తొమ్మిదివేల యోజనముల ఎత్తు ఉండును (11). ఓ మహర్షీ! ఇలావృతము ఇట్టిది. దీనియందు మేరువునకు నాలుగు వైపులయందు నాలగు ఎత్తైన పర్వతములు మేరువునకు బలమునిచ్చే స్తంభముల వలె నిలబడి దానితో జతగూడి యున్నవి (12). తూర్పునందు మందరము, దక్షిణములో గంధమాదనము, పశ్చిమదిక్కునందు విపులము, మరియు ఉత్తరమునందు సుపార్శ్వము అను పర్వతములు గలవు (13). కడిమి చెట్టు, జంబూవృక్షము, రావి చెట్టు మరియు మర్రిచెట్టు ఆ పర్వతమునకు ధ్వజముల వలె నున్నవి. వాటి ఎత్తు పదకొండు వందల మానములు గలదు (14). ఓ మహర్షీ! జంబూద్వీపము అను పేరు వచ్చుటకు గల కారణమును వినుము. అచట మహావృక్షములు ప్రకాశించుచున్నవి. వాటిస్వభావమును గురించి నీకు చెప్పెదను (15). జంబూవృక్షముయొక్క ఫలములు పెద్ద ఏనుగుయొక్క పరిమాణమును కలిగియుండును. అవి ఆ పర్వతముపై పడి పగిలి అంతటా చెల్లాచెదరు అగుచుండును (16). వాటి రసముచే అచట జంబు అని ప్రసిద్ధిని గాంచిన నదిఏర్పడి అచట పర్వతము చుట్టూ ప్రవహించుచున్నది. అచట నివసించు జనులు ఆ జలమును త్రాగుచుందురు (17). ఆ నదియొక్క తీరమునందు నివసించు జనులకు చెమట పట్టదు. శరీరమునకు దుర్గంధము ఉండదు. ముసలిదనము ఉండదు. వారికి ఇంద్రియముల పటుత్వము తగ్గదు (18). ఆ నదీతీరమనందలి మట్టిని తీసుకని నోటితో గాలి ఊది పొడిగా చేసినచో, అది బంగారమగును. సిద్ధులు ఆ బంగారము యొక్క ఆభరణములను ధరించెదరు. కావుననే, బంగారమునకు జాంబూనదము అను పేర వచ్చినది (19). ఓ మహర్షీ! మేరుపర్వతమునకు తూర్పునందు భద్రాశ్వము, పశ్చిమమమునందు కేతుమాలము అను రెండు భూఖండములు గలవు. ఇలావృతము వాటి మధ్యలో గలదు (20).


తూర్పు దిక్కునందు చైత్రరథము, దక్షిణమునందు గంధమాదనము, పశ్చిమమునందు విభ్రాజము, ఉత్తరమునుందు నందనము అనే ఉద్యానవనములు గలవు. (21). అరుణోదము, మహాభద్రము, శీతోదము, మానసము అనే ఈ నాలుగు సరస్సులయందు సర్వకాలములలో దేవతలు విహరించెదరు (22). పద్మాకారములోనున్న మేరుపర్వతమునకు కేసరముల స్థానములో తూర్పు దిక్కులో శీతాంజనము, కురుంగము, కురరము మరియు మాల్యవాన్‌ అనే పర్వతములు గలవు. ఇవి అన్నియు చాల ముఖ్యమైన పర్వతములు (23). త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషధము, కపిలము మొదలైనవి దక్షిణదిక్కునందలి కేసరపర్వతములు (24). పద్మమునకు కేసరమువలె, మేరువునందు ఆ స్థానములో నుండే పర్వతములు కేసరపర్వతములనబడును. సినీవాసము, కుసుంభము, కపిలము, నారదము, నాగము మొదలైనవి పశ్చిమమునందలి కేసరపర్వతములు (25). శంఖచూడము, ఋషభము, హంసము, కాలంజరము మొదలగునవి ఉత్తరమునందలి కేసరపర్వతములు (26). మేరుపర్వతముయొక్క అగ్రభాగమునందు మధ్యలో బ్రహ్మపురము గలదు. బంగారముతో నిర్మించబడిన ఆ నగరము పదు నాలుగు వేల యోజనముల నిడివి కలిగియున్నది (27). దానిని చుట్టువారి అష్టదిక్పాలకుల నగరములు గలవు. ఆ ఎనిమిది నగరములు క్రమముగా ఆయా దిక్కులలో ఆ దిక్పాలకుల రూపములకు తగినట్లుగా ఉన్నవి (28). విష్ణువుయొక్క పాదములనుండి పుట్టిన గంగానది చంద్రమండలము గుండా ప్రవహించి ఆ బ్రహ్మపురములో పడుచుండును (29). ఆ గంగ అచట నాలుగు దిక్కులలో పడి వరుసగా సీత, అలకనంద, చక్షుస్సు, భద్ర అనే నాలుగు పాయలుగా ప్రవహించును(30). ఆ పర్వతమునకు తూర్పుదిక్కు గుండా సీత, దక్షిణములో నంద, పశ్చిమములో చక్షుస్సు, ఉత్తరదిక్కు గుండా భద్ర ప్రవహించుచున్నవి (31).ముల్లోకములో ప్రవహించే ఆ గంగానది ఈ విధముగా నాలుగు పాయలై నాలుగు దిక్కుల గుండా ప్రవహించి పర్వతములను అన్నింటినీ దాటి మహాసముద్రములో కలియుచున్నది (32).


సునీల-నిషధ-మాల్యవత్‌-గంధమాదన పర్వతముల మధ్యలో పద్మముయొక్క బీజకోశమును పోలి మేరుపర్వతము గలదు (33). పద్మమును పోలిన ఈ భువనమునకు భారత--కేతుమాల-భద్రాశ్వ-కురువర్షములు (భూభాగములు) రేకల వంటివి. ఈ లోకమునకు హద్దు లోకపర్వతములు (34). ఈ లోకమునకు జఠరస్థానములో దేవకూటము గలదు. ఈ లోకము దక్షిణమునుండి ఉత్తరము వరకు వ్యాపించి యున్నది. గంధమాదనకైలాసపర్వతములు తూర్పునుండి పశ్చిమము వరకు వ్యాపించి యున్నవి (35). మేరువునకు తూర్పునుండి పశ్చిమము వరకు నిషధనీలపర్వతములు వ్యాపించి యున్నవి. అవి దక్షిణమునుండి ఉత్తరము వరకు విస్తరించి బీజకోశము (పద్మమునకు మధ్యభాగము) అనదగిన స్థానములో కలియుచున్నవి (36). మేరువుయొక్క జఠరస్థానముతో మొదలిడి శ్వేతము మొదలైన జంట పర్వతములు పద్మకేసరముల వలె మిక్కిలి సుందరముగా నున్నవి (37). ఈ పర్వతములకు ఉత్తరమునందు సిద్ధులచే మరియు చారణులచే సేవించబడే జలాశయములు గలవు. ఆ జలాశయములను అనుకొని మిక్కిలి సుందరమగు అడవులు మరియు నగరములు గలవు (38). దేవతలు, యక్షులు, గంధర్వులు మరియు రాక్షసులు అందరికీ ఈ నగరములు చెంది యుండును. ఆ పర్వతప్రాంతములలో దేవతలు మరియు దైత్యులు రాత్రింబగళ్లు క్రీడించుచుందురు (39). ధర్మాత్ములకు నిలయమగు ఈ స్థానములు భూమిపై వెలసిన స్వర్గములని కీర్తించబడినవి. అచటకు పాపాత్ములు వెళ్లలేరు. వారు ఆ సమీపములో కానరాదు (40). ఓ మహర్షీ! కింపురుషము మొదలైన ఎనిమిది భూభాగములలో జనులకు శోకము, ఆపదలు, ఆదుర్దాలు, ఆకలిబాధ మరియు ఇతరభయములు లేవు (41). జనులు ఆరోగ్యవంతులై భయమునుండి మరియు సర్వదుఃఖములనుండి విముక్తులై, పది పన్నెండు వేల సంవత్సరముల ఆయుర్దాయము గలవారై ఉందురు (42). అచట జనులు కృతత్రేతాయుగములందలి జనులవలె ధర్మపరాయణులై ఉందురు. అచట చక్కగా ప్రకాశించే స్వచ్ఛ జలములతో నిండిన జలాశయములు అంతటా గలవు. అచట ఇంద్రుడు వర్షించడు. వర్షించనక్కరలేదు. అచటి సౌందర్యము ఊహాగోచరము మాత్రమే (43). ఈ ఏడు వర్షములయందు బంగరు ఇసుకతిన్నెలు గల అందమైన చిన్న నదులు వందల సంఖ్యలో గలవు. జనులు వాటియందు క్రీడించుటలో అభిరుచిని కలిగియుందురు (44).


శ్రీశివమహాపురాణములోని ఉమాసంహితయందు జంబూద్వీపవర్ణనమనే పదునేడవ అధ్యాయము ముగిసినది (17).

కల్మషం లేని భక్తుడిని

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

హరిఓం  , 

                                                                                                                                                                                 *కల్మషం లేని భక్తుడిని ఆదుకొన్న కృష్ణుడి లీల!*


ఉత్తరప్రదేశ్ లో యాభై ఏళ్ళ క్రితం గంగానది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో పడవ నడుపుకొనే ఒక వ్యక్తి వుండేవాడు. ఆయనకు ముగ్గురు సంతానం - ఒక అమ్మాయి , ఇద్దరు అబ్బాయిలు. అతను చాలా అమాయకుడు. 


*"చదువు లేని వాడిని అని నన్ను దూరం పెట్టకు. నేను నీవాడిని, నీవు నావాడివి'*' అని దేవుడికి చెప్పుకొనే వాడు. అందరూ అతని మాటలకు నవ్వుకొనేవారు. అతను పట్టించుకొనేవాడు కాదు. ఎవరు ఏమి అడిగినా '*'నాకేమి తెలుసు, అంతా గోపాలుడికే తెలుసు'* అనేవాడు. 


కూతురికి పెళ్ళి చేయడానికి డబ్బు అవసరం అయ్యి ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకొని, పెళ్ళి చేసి, రెండు సంవత్సరాలు కష్టపడి, డబ్బు కూడబెట్టి, అప్పు తీర్చడానికి వ్యాపారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఇతను అమాయకుడు అని తెలిసిన వ్యాపారి, అప్పు తీరిపోయింది అని చూపే పత్రం తన దగ్గరే పెట్టుకొని, ఇంకా ఇన్ని రూపాయల అప్పు వుంది అని చెప్పే ఒక నకిలీ పత్రాన్ని తయారుచేసి దాన్ని ఇతనికి ఇచ్చిపంపాడు. నెల రోజుల తరువాత అప్పు తీర్చడం లేదని ఇతని మీద ఫిర్యాదు చేసి కోర్టు నుండి నోటీసులు వచ్చేలా చేసాడు వ్యాపారి. ఇతను కోర్టు బోనులో నిలుచున్నాడు.


*''అప్పు తీర్చలేదా?''* లాయరు ప్రశ్న.


*''తేర్చేసాను.''*

                                                                                                                                                                                                *''అందుకు సాక్ష్యంగా కాగితాలు వున్నాయా?''*

                                                                                                                                                                                                *''ఇదిగో''*

                                                                                                                                                                                                                            *''ఇందులో నీవు అప్పు వున్నావని వ్రాయబడింది.''*


*''ఏమో నాకేం తెలుసు? అంతా గోపాలుడికే తెలుసు.''*

                                                                                                                                                                                                                                                               *''నీవు అప్పు తీరుస్తున్నప్పుడు ఎవరైనా దగ్గరున్నారా?''*

                                                                                                                                                                                                                                                            *''అంతా గోపాలుడికే తెలుసు.''*


కోర్టు హాల్లో నవ్వులు. 


జడ్జి మనసులో అనుమానాలు. ఆయనకు అనిపించింది. 


*'ఈ వ్యక్తి అమాయకుడు. అతను అబద్ధం చెప్పడంలేదు. కచ్చితంగా ఏదో జరిగింది."* 


అపుడు ఆయన *''ఈవ్యక్తి అప్పు తీర్చిన సమయంలో 'గోపాల్' వున్నాడని, అతనికి అంతా తెలుసు అంటున్నాడు కదా! అతని పేరుతోనే సమన్లు పంపండి"* అని చెప్పాడు. 


అలానే చేసారు కోర్టువాళ్ళు. సమన్లు తీసుకొని *''ఇక్కడ గోపాల్ ఎవరు?''* అని గ్రామానికివెళ్లిన కోర్టు వ్యక్తికి గోపాల్ పేరుతో ఎవరూ లేరని తెలుస్తుంది. 


అపుడు ఎవరో *'ఇక్కడ గోపాల్ జీ మందిరం ఒకటుంది. అక్కడ పూజారిని అడగండి'* అని చెప్పారు. 


వాళ్ళు వెళ్ళి ఆ సమన్లను ఆ పూజారికిచ్చి వెళ్ళిపోయారు. 


పూజారి దాన్ని చదివి ఏరోజు *'గోపాల్'* అనే వ్యక్తిని సాక్షిగా కోర్టుకు రమ్మని వుందో, ఆరోజు గుడిలోని గోపాలకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి, ఆ సమన్లను ఆయన పాదాలవద్ద పెట్టి, *'ప్రభూ, ఈ అమాయక భక్తుడిని నీవే కాపాడాలి'* అని ప్రార్థిస్తాడు. 


కోర్టు హాల్లో విచారణ మొదలైనప్పుడు *'' గోపాల్''* అనే వ్యక్తి వచ్చి వుంటే ఆయన్ని సాక్షిగా ప్రవేశపెట్టండి అని జడ్జి చెప్పారు. 


అపుడు ఒక ముసలాయన వచ్చి బోనులో నిలుచొన్నాడు.


*''ఈ వ్యక్తి, ఆ వ్యాపారికి డబ్బు ఇస్తున్నప్పుడు నీవు చూసావా?''*

                                                                                                                                                                                                                                                                                                                                                                    *''అవును, చూసాను.''*


 *''మరి ఈపత్రంలో అప్పు తీర్చాలి అని వుంది?''*

 

*''అది అసలు పత్రం కాదు. నకిలీది. అసలు పత్రం వేరే చోట వుంది.''*

 

*''ఎక్కడుంది?''*

 

*''వ్యాపారి ఇంట్లో, ఫలానా గదిలో, ఫలానా బీరువాలో, ఫలాన సంచిలో.''*

 

వ్యాపారిని అక్కడే వుండమని , ఆ గ్రామానికెళ్ళి వ్యాపారి ఇంట్లోని పత్రం తీసుకురమ్మని మనుషుల్ని పంపాడు ఆ జడ్జి. 


వాళ్లు వెళ్ళి పత్రం తెచ్చారు. అందులో అప్పు తీర్చేసినట్టు వ్రాయబడివుంది. అమాయకుడిని మోసగించినందుకు వ్యాపారికి జరిమానా విధించారు. 


సాక్ష్యం చెప్పిన ముసలాయన కోర్టు బయటికివెళ్ళి, మళ్ళీ కనిపించలేదు. జడ్జి గబ గబా వెళ్ళి ఆ అమాయకుడిని ఆపి *'ఎవరు ఆ ముసలాయన?'* అని అడిగితే మళ్ళీ అదే సమాధానం *"నాకేమి తెలుసు? అంతా గోపాలుడికే తెలుసు.''*


జడ్జి తన గదిలోకెళ్లి ఏడుస్తున్నాడు. గమనించిన లాయర్లు, ఇతరులు పరుగెత్తికెళ్లి ఆయన్ని *'సర్, మీరెందుకు ఇలా దు:ఖిస్తున్నారు?'* అని అడిగితే ఆయన అన్నారట. 


*''నేను జడ్జిగా దర్జాగా కుర్చీలో కూర్చొని, జగదీశ్వరుడిని బోనులో నిలబెట్టి ప్రశ్నించానే? ఈ ఘోర పాపానికి ప్రాయశ్ఛిత్తం వుంటుందా?''*

 

*ఆ తరువాత ఆ జడ్జిగారు ఏమి చేసారో తెలిస్తే మనం ఆశ్ఛర్యపోతాం.*


ఆయన తన కుటుంబపోషణను తన పెద్ద కొడుక్కి అప్పగించి, తన పదవికి రాజీనామా చేసి, బృందావనం వెళ్ళి, అక్కడ ఒక సన్యాసి లాగా భిక్షాటన చేస్తూ, బృందావనపు మట్టిని కళ్ళకద్దుకొంటూ, రాధా కృష్ణ మందిరం [బాంకే బిహారీ ప్రేం మందిర్] వచ్చే భక్తులు ప్రదక్షిణం చేసే దారిని రోజూ శుభ్రం చేస్తూ, బృందావనం లోనే వుండిపోయాడు. అందరూ ఆయన్ని *'జడ్జి స్వామీ'* అనేవారట. 


*డిజిటల్ యుగంలో ఈ మాయలు, చమత్కారాలు ఏమిటి? అని ప్రశ్నించే వారితో వాదించను.*


*నమ్మని వారికి గుడిలో వున్నాడు.*


*నమ్మిన వారికి గుండెలో వున్నాడు.*


*"మొత్తానికి ఖచ్ఛితంగా వున్నాడు."*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 50*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 50*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*కవీనాం సన్దర్భస్తబక మకరందైకరసికం*

*కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళమ్ |*

*అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ*

*అసూయా సంసర్గా దలికనయనం కించిదరుణమ్ ‖* 


ఈ శ్లోకంలో అమ్మవారి విశాల నేత్రాలను చమత్కారంగా వర్ణించారు శంకరులు. సామాన్యంగా కవిత్వాన్ని ఆస్వాదించటానికి రసజ్ఞత కావాలి. అమ్మ *రసజ్ఞా, రసశేవధీ* కదా!


ఆమె ఎదురుగా కవులు అసలు ఆది శంకరుల కన్నా గొప్ప కవులున్నారా? ఆయన చేసిన ప్రతి స్తోత్రములోనూ తత్త్వ సౌందర్యమే కాక భాషాలంకార సౌందర్యము కూడా తొణికిసలాడుతూ ఉంటుంది. ఆయన అపర శంకరావతారం కదా! తమ కావ్యాలను వినిపిస్తుంటే ఆ కావ్య కమలముల గుత్తుల లోని మకరందమును ఆస్వాదిస్తున్నాయా అన్నట్లుగా వున్నాయి ఆమె కళ్ళు. అయితే, వినేది చెవులు కదా? కళ్ళు ఆస్వాదించటమేమిటి? అంటే, ఆ కవిత్వ మకరందమును మేము కూడా ఆస్వాదిస్తామన్నట్లుగా అమ్మవారి నేత్రాలు ఆమె చెవుల వరకూ వచ్చాయిట. అంటే, అమ్మవి *ఆకర్ణ దీర్ఘ నయనాల* ని చెప్పటం. *వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీనాభిలోచనా* అని అమ్మవారి సహస్రనామాల్లో ఒకటి.


శంకరులు అమ్మవారి పై చేసిన *లలితా పంచరత్న ప్రాతః స్మరామి* శ్లోకాల్లో మొదటి దానిలోనే అన్నారు. 

*ప్రాతః స్మరామి లలితా వదనారవిందం*

*బిమ్బాధారం పృథుల మౌక్తిక శోభి నాసం*

 *ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం* *మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్* అని.


అయితే, ఇప్పుడు ఆమె ఫాల నేత్రమునకు అసూయ కలిగిందట.ఆ కవితా మాధుర్యమును ఆస్వాదించటానికి తాను కూడా చెవుల వరకు వెళ్లలేకపోయానని. ఆ అసూయతో ఆమె ఫాలనేత్రము ఎర్రబడిందట.అమ్మవారి నుదుటిపైనున్నది అగ్ని నేత్రము కదా!

అట్టి లలితా పరమేశ్వరి, ఇంత మధురమైన శ్లోకమును చేసిన శంకరులు, మనను అనుగ్రహించెదరుగాక!


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-71🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-71🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

 *తిరుమామణి మండపం* 


తమిళంలో మణి అంటే గంట.మామణి అంటే పెద్ద గంట.తిరుమంగళవాచకం.పవిత్రమయిన గంటలని అభిప్రాయం.స్వామికి నివేదన సాగేవేళా వాయిoచే గంటలున్న మండపం తిరుమామణి మండపం


సాదారణంగా దేవాలయంలో ఒకే గంట ఉంటుంది.కానీ శ్రీవారి ఆలయంలో రెండు గంటలున్నాయి.ఒకప్పుడు ఈ గంటలు చెరోవైపు ఉండేవని ప్రతీతి. మొదటి గంట పేరు నారయణ గంట. రెండోవ గంట పేరు గోవింద గంట . కాని ప్రస్తుతం ఈ గంటలు ఒకే చోట ఉన్నాయి.


తిరుమామణి మండపాన్ని క్రి.శ 1417 లో మాధవదాసు నిర్మించాడు. ఈ మండపంలో స్వామికి ఎదురుగా గరుడుడు వుంటే ,జయ విజయ విగ్రహాలు (చండ ప్రచండ).బంగారు వాకిలికి ఇరువైపులలోనూ, కుడివైపు శ్రీవారి హుండీలు కనిపిస్తాయి. ఈ మండపం 43x40 అడుగుల విస్తిర్ణం కలది.16 స్తంభాలున్నాయి. వీటిఫై రమణీయమయిన శిల్పాలున్నాయి, చతుర్బుజుడుయిన మహా విష్ణువు గజారూడుడై కనిపించే శిల్పం అరుదైయిన దృశ్యం.


శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహ పురాణం🪐* *50వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

        *🪐నవగ్రహ పురాణం🪐*  

               *50వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*శనిగ్రహ జననం - 1*


మందిరంలో నిశ్శబ్దం తాండవిస్తోంది. వైవస్వతుడూ , యముడూ , యమీ పడుకున్నట్టున్నారు. సూర్యుడు తన శయనాగారం వైపు అడుగులు వేశాడు.


సంతానం ముందు నిలబడి ఆకాశంలోకి చూస్తోంది. ఆమె పైట - ఆమె అందానికి కట్టిన పతాకంలా గాలిలో చలిస్తోంది. సూర్యుడు భార్యను సంతృప్తిగా చూస్తూ సమీపించి , వెనుకవైపు దగ్గరగా నిలుచున్నాడు. సంజ్ఞ భుజాల మీద రెండు చేతుల్నీ వేశాడు.


ఎందుకో సంజ్ఞ ఉలిక్కిపడింది. ఏదో దెబ్బ తగిలినట్టు ప్రతిస్పందిస్తూ తటాలున దూరంగా జరిగి , సూర్యుడి వైపు తిరిగింది. ఆమె ముఖంలో చిరునవ్వే లేదు. చూపులు పక్కకు తిరిగాయి.


*“సంజ్ఞా... భయపడ్డావా ?”* సూర్యుడి కంఠంలో అనురాగం పలికింది.


*“భయపడుతున్నాను...”* అంది సంజ్ఞ.ఇ


*“ఏం జరిగింది ? ఎందుకు భయం ? ఎవర్ని చూసి , దేన్ని చూసి భయపడుతున్నావు , దేవీ ?"* సూర్యుడు ఆందోళనతో అడిగాడు. ధైర్యం చెపుతున్నట్టు ఆయన శరీరం ఆమె దగ్గరగా జరిగింది.


సంజ్ఞ కళ్ళకి చేతిని అడ్డం పెట్టుకుంటూ , దూరంగా జరిగింది. *“ఎవర్ని చూసి భయపడుతున్నానో చెప్పనా ?”* అంది మెల్లగా.


*“చెప్పు ! వాడు ఎవడైనా సరే... నిన్ను భయ పెట్టినందుకు...”* సూర్యుడు ఆవేశంతో చెప్పుకు పోతున్నాడు. 


*“ముందు - వినండి !”* సంజ్ఞ ఆయనను వారిస్తూ అంది. *“నేను భయపడుతోంది మిమ్మల్ని చూసే !"*


*"సంజ్ఞా !"* సూర్యుడు ఆశ్చర్యంతో అరిచాడు.


*"ఔను ! మిమ్మల్ని చూడగానే నా శరీరం వణికిపోతోంది...”* 


*"సంజ్ఞా !"* అంటూ సూర్యుడు ఆమె దగ్గరగా జరిగాడు.


*"దయచేసి దూరంగా ఉండండి !"* అంటూ సంజ్ఞ ఎడంగా జరిగింది. నివ్వెరపోయి చూస్తున్న భర్తతో ఇలా అంది. *"నిజం చెప్తున్నాను. మన్నించండి ! మీ శరీరం వెదజల్లే కాంతినీ , వేడిమినీ భరించలేకుండా ఉన్నాను...”*


సూర్యుడు తాత్కాలికంగా మూగవాడైపోయాడు. నమ్మలేనట్టు సంజ్ఞ వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.


సంజ్ఞ అరచేతిని కళ్ళకు అడ్డంగా ఉంచుకునే ఉంది. 


*"సంజ్ఞా ! పరిహాసానికా ఇది !"* సూర్యుడు ఆశగా అడిగాడు. *"అపరాధం చేశానా ? నొప్పించానా ? ఇది...ఇది... ప్రణయ కోపమా , దేవీ ?”*


*"ప్రణయ కోపం కాదు, ప్రణయ శాపం !"* సంజ్ఞ కంఠంలో ఆవేదన ధ్వనించింది. *" మన్నించండి ! నేను నిజమే చెప్తున్నాను. మీ శరీరం ప్రసరించే కళ్ళు చెదిరే కాంతినీ , మీ శరీరం వెదజల్లే చెమటలు పట్టించే వేడిమినీ భరించడం ఇక నా వల్ల కాదు...”*


సూర్యుడు దెబ్బతిన్నట్టు చూశాడు. *"అయితే ఇంతకాలం ఎలా భరించావు ?”*


*“భరించాను... భరించక చేయగలిగింది ఏముంది ? అపార్థం చేసుకోకండి ! మీ సామీప్యంలో నేను... చిత్రహింస అనుభవిస్తున్నాను... దయచేసి దూరంగా జరగండి”* సంజ్ఞ తనే దూరంగా జరుగుతూ అంది.


ఆశ్చర్యం నుండి కోలుకున్న సూర్యుడు చిన్నగా నవ్వాడు. *“గతం మరిచావా , సంజ్ఞా ? నా వెచ్చదనం నీకు ఎంతో ఇష్టం అంటూ ఆనాడు...”*


*"అది ఆనాడు ! మన దేహాల ఐక్యత ప్రారంభమవుతున్న ప్రాథమిక క్షణాలు. ఆ ఆకర్షణ వేరు , ఆ ఆవేశం వేరు. ఉరకలెత్తే ఉత్సాహం మనలోని ఆధిక్యతలనూ , న్యూనతలనూ గుర్తించనివ్వలేదు !"*


*"నీ ధోరణితో , అర్థం లేని భయంతో నన్ను - నీ పతిదేవుణ్ణి అస్పృశ్యుడు నీ చూస్తున్నావు సంజ్ఞా !"*


*"స్వామీ ! అలా అనకండి. నా కోసం... ఒక పని చేయండి... చేస్తారా ?".*


*"కోరుకో !"*


*"నా కోసం...మీ వెలుగునూ , వేడిమినీ తగ్గించుకోండి !"* 


*"అసంభవం !"* సూర్యుడు వెంటనే అన్నాడు.


*"స్వామీ !"* సంజ్ఞ ఆశ్చర్యంతో అంది. *"నేను మీ అర్ధాంగిని , ప్రేయసిని ! మీ మాటల్లో చెప్పాలంటే మీ సర్వస్వాన్ని. నా మాటల్లో చెప్పాలంటే - నా సర్వస్వాన్నీ మీ సర్వస్వంగా మార్చిన మీ ప్రణయదాసిని !"* సంజ్ఞ ఆవేశంగా అంది.


*"ఔను ! నువ్వు చెప్పినవన్నీ నాకు కూడా వర్తిస్తాయి సంజ్ఞా ! కానీ...నీ కోరిక తీర్చలేను. నా ప్రకాశాన్నీ , ప్రతాపాన్నీ తగ్గించడం అసాధ్యం !"*


*"స్వామీ !"*


*"ఔను సంజ్ఞ... నీ శరీరకాంతినీ , ఉష్ణాన్నీ నువ్వు మార్చుకోలేవు. నేను కూడా అంతే ! గతంలోలాగా ఆవేశాన్ని , ఆకర్షణనూ కవచాలుగా చేసుకుని , నువ్వు సర్దుకుపోవాల్సిందే ; భరించాల్సిందే !"*


సంజ్ఞ అయోమయంగా , ఆందోళనగా చూసింది. *"స్వామీ...”*


*"ఆలోచించు , సంజ్ఞా ! జన్మతో సంక్రమించిన శరీర ధర్మాన్ని గౌరవించాల్సిందే. ఆలోచించు ! నిన్ను నువ్వు సిద్ధపరుచుకో ! భర్త దేహధర్మాన్ని భరించే శక్తిని కూడదీసుకొని , నువ్వే నన్ను సమీపించాలి సుమా ! అప్పటి దాకా నా ప్రతాపం , నా ప్రకాశం నీకు దూరంగానే ఉంటాయి !”* ధైర్యం చెప్తున్నట్టు నవ్వుతూ , సూర్యుడు శయ్యా మందిరం లోంచి అవతలకి నడిచాడు.


సంజ్ఞ బలహీనంగా కూర్చుంది.


*“స్వామీ...”*


సంజ్ఞ పిలుపు విని , సూర్యుడు వెనుదిరిగి ఆమె వైపు చూశాడు.


*“నన్ను... ఆలోచించమన్నారు. నన్ను... సన్నద్ధం చేసుకోమన్నారు. నేను... నేను.. మీ దగ్గరగా ఉంటూ మీకు దూరంగా ఉండలేను...”*


*"సంజ్ఞా..."* సూర్యుడి కంఠంలో ప్రేమావేశం పలికింది. *“నా పుట్టినింటికి వెళ్తాను. కొంత కాలం మీకు దూరంగా , దూరంగా ఉండి , నను నేను సిద్ధం చేసుకొని తిరిగి వస్తాను. అనుమతిస్తారా ?”* 


సూర్యుడి ముఖం మీద చిరునవ్వు వెలిగింది. *"దూరంగా వెళ్ళి , నాకు దగ్గరయే నీ రాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను సంజ్ఞా ! వెళ్ళిరా !"*


*“నేను తిరిగి వచ్చేదాకా వైవస్వతుడినీ , యముడినీ , యమినీ మీరే చూసుకోవాలి సంజ్ఞ అభ్యర్థిస్తూ అంది. 


*“అలాగే సంజ్ఞా ! చూసుకుంటాను. నీ జన్మస్థల ప్రవాసం త్వరగా పూర్తి చేయ సుమా !”* సూర్యుడు నవ్వాడు. సంజ్ఞ కూడా నవ్వింది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 50*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 50*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*కవీనాం సన్దర్భస్తబక మకరందైకరసికం*

*కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళమ్ |*

*అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ*

*అసూయా సంసర్గా దలికనయనం కించిదరుణమ్ ‖* 


ఈ శ్లోకంలో అమ్మవారి విశాల నేత్రాలను చమత్కారంగా వర్ణించారు శంకరులు. సామాన్యంగా కవిత్వాన్ని ఆస్వాదించటానికి రసజ్ఞత కావాలి. అమ్మ *రసజ్ఞా, రసశేవధీ* కదా!


ఆమె ఎదురుగా కవులు అసలు ఆది శంకరుల కన్నా గొప్ప కవులున్నారా? ఆయన చేసిన ప్రతి స్తోత్రములోనూ తత్త్వ సౌందర్యమే కాక భాషాలంకార సౌందర్యము కూడా తొణికిసలాడుతూ ఉంటుంది. ఆయన అపర శంకరావతారం కదా! తమ కావ్యాలను వినిపిస్తుంటే ఆ కావ్య కమలముల గుత్తుల లోని మకరందమును ఆస్వాదిస్తున్నాయా అన్నట్లుగా వున్నాయి ఆమె కళ్ళు. అయితే, వినేది చెవులు కదా? కళ్ళు ఆస్వాదించటమేమిటి? అంటే, ఆ కవిత్వ మకరందమును మేము కూడా ఆస్వాదిస్తామన్నట్లుగా అమ్మవారి నేత్రాలు ఆమె చెవుల వరకూ వచ్చాయిట. అంటే, అమ్మవి *ఆకర్ణ దీర్ఘ నయనాల* ని చెప్పటం. *వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీనాభిలోచనా* అని అమ్మవారి సహస్రనామాల్లో ఒకటి.


శంకరులు అమ్మవారి పై చేసిన *లలితా పంచరత్న ప్రాతః స్మరామి* శ్లోకాల్లో మొదటి దానిలోనే అన్నారు. 

*ప్రాతః స్మరామి లలితా వదనారవిందం*

*బిమ్బాధారం పృథుల మౌక్తిక శోభి నాసం*

 *ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం* *మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్* అని.


అయితే, ఇప్పుడు ఆమె ఫాల నేత్రమునకు అసూయ కలిగిందట.ఆ కవితా మాధుర్యమును ఆస్వాదించటానికి తాను కూడా చెవుల వరకు వెళ్లలేకపోయానని. ఆ అసూయతో ఆమె ఫాలనేత్రము ఎర్రబడిందట.అమ్మవారి నుదుటిపైనున్నది అగ్ని నేత్రము కదా!

అట్టి లలితా పరమేశ్వరి, ఇంత మధురమైన శ్లోకమును చేసిన శంకరులు, మనను అనుగ్రహించెదరుగాక!


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Ye kannu

 https://youtu.be/M7yNYFKodP4?si=VFeSnw4BnZc6f39D


లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

శ్రీనివాససిద్ధాంతి9494550355


*ప్రభుత్వ ఉద్యోగం*


ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది జాతకరీత్యా పరిశీలన చేయవచ్చు. చదువుకునే వారు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరిక నూటికి నూరు శాతం ఉంటుంది అయితే ప్రభుత్వ ఉద్యోగం ఏ జాతకులకు లభిస్తుంది. ఏ సమయంలో వస్తుంది అనేది పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రధాన కారక గ్రహం రవి భగవానుడు రవి భగవానుడు క్షత్రియ గ్రహంగా జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది రవి భగవానుడు బలంగా ఉన్నప్పుడు రాజాశ్రయం లభిస్తుంది అనగా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని చెప్పవచ్చు. రవి భగవానుడు కర్మ స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి భగవానుడి దశ అంతర్దశలోనూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు చేయాలి. మరియు పంచమాధిపతి దశ, అంతర్దశలోను కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు చేసినప్పుడు సఫలీకృతం అవుతారు. పంచమ స్థానం అనేది ఆలోచన బుద్ధి, ప్రణాళిక విధానం, తనకు తాను గుర్తింపును పొందడానికి పంచమ స్థానం ఎంతగానో సహకరిస్తుంది కావున ఏ లగ్నానికి అయినా పంచమ స్థానం అనేది జాతకుడిని సమాజంలో గుర్తింపును తీసుకొస్తుంది. కావున పంచమ స్థానం కూడా ప్రభుత్వ ఉద్యోగం లభించడంలో సహకారం ఉంటుంది కావున లగ్నానికి పంచమాధిపతి ఎవరైనా సరే వారి యొక్క దశ అంతర్దశలలో ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేయాలి.శుక్ర భగవానుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం లభించడానికి కారణం అవుతారు. శుక్ర భగవానుడు సుఖ జీవితానికి, విలాసవంతమైన జీవితం గడపడానికి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కారకుడు. ప్రైవేటు ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు శ్రమ తక్కువ ఉండే అవకాశం ఉంది మనసుకు సంతోషాన్ని ఇస్తుంది ఒక విధమైన లగ్జరీ లైఫ్ అనుభవించే అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం లభించే విషయంలో శుక్ర భగవానుడి యొక్క పాత్ర కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం రావడానికి మరొక గ్రహం బుధుడు. బుధుడు పోటీ తత్వానికి కారకుడు ప్రభుత్వ ఉద్యోగం అనగా కాంపిటీషన్ తో కూడుకున్న వ్యవహారం. బుధ గ్రహం యొక్క దశ అంతర్దశలలో కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు జరిగినప్పుడు ఉద్యోగం వస్తుంది. జాతకంలో పై గ్రహాల యొక్క దశ అంతర్దశలలో ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అవుతారు. పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ వింగ్, డిఫెన్స్ అకాడమీ, ఎలక్ట్రిసిటీ, అగ్నిమాపక దళం ఇటువంటి రంగాలలో ఉద్యోగాలు లభించాలంటే కుజుడు యొక్క పాత్ర కూడా కీలకంగా ఉంటుంది.


జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*

*9494550355*


PlZ Forward the message

గోజాతులు ఉన్నంతసేపే

 ఇది రాజమహేంద్రవరం లో క్వారీ మార్కెట్ నుండి లాలా చెరువుకు వెళ్ళేదారిలో వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ప్రక్కన ఉంది. ఇలాంటి గోమాంస(బీఫ్) బిర్యానీ, సమోసా,పకోడీ వగైరా షాపులు రాజమహేంద్రవరం లో చాలా చోట్ల ఉన్నాయి. హిందూ బంధువు లారా కళ్ళు తెరవంఢి.గోజాతులు ఉన్నంతసేపే మన మనుగడ. కరోనా కాలంలో కూడా గోజాతులు ఎంతో మందిని రక్షించాయి. నిరంతరం లక్షల గోమాతలను క్రూరవధచేసి తినేవారు ఎంతో శ్రధ్ధ గా వారి పనులుచేసుకుంటూ వారి కి ఆఫర్ లిచ్చే పార్టీ లను గెలిపించుకుంటూ దర్జాగా గోవధలు,హిందూ ధర్మ విఘాతుకాలు చేయుచున్నారు. కానీ హిందువులు మాత్రం ధనార్జన, విలాసవంతమైన ఇళ్ళు, లక్షల విలువైన వాహనాలు ఇలాంటి వాటిపై మాత్రమే దృష్టి పెడుతూ కనీసం ఒక్క ఆవు దూడ సైతం ఇంటి లోనికి రానీయక,కుక్క లను మాత్రం వంటింటినుండీ ఒంటిమీద విసర్జనాలు చేయించుకునే వరకూ పోషించుకుంటూ బాధ్యతారహితంగా బతికేస్తున్నారు.ప్రతి హిందూ తన ఇంటి లో ఒక్క ఆవునైనాదూడనైనా పోషించుకుంటే అసలు బయట ఆవు లే కనబడవు. గృహప్రవేశం ఆవుతో చేయమని వేదశాస్త్ర సంప్రదాయాలు చెబితే ఆవుబొమ్మతోనూ,ఇంటి లో ఆవును నీ ఇంటిల్లిపాదీ ఆరోగ్యం కోసం పోషించుకొనమంటే ఆవుబొమ్మపెట్టుకుని,గోమయాన్నిహేళన చేస్తున్నారు. ఇప్పటికైనా మారండి.

బుధవారం, అక్టోబరు 11, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


బుధవారం, అక్టోబరు 11, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - బహుళ పక్షం

తిథి:ద్వాదశి సా5.12 వరకు  

వారం:బుధవారం(సౌమ్యవాసరే)

నక్షత్రం:మఖ ఉ9.38 వరకు

యోగం:శుభం ఉ10.35 వరకు

కరణం:తైతుల సా5.12 వరకు 

వర్జ్యం:సా6.29 - 8.15

దుర్ముహూర్తము:ఉ11.23 - 12.10

అమృతకాలం:ఉ6.58 - 8.45 &

తె5.06నుండి

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి; కన్య

చంద్రరాశి: సింహం 

సూర్యోదయం:5.55

సూర్యాస్తమయం: 5.41


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

శివస్తుతి

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లోకం*


*_వందే సూక్ష్మమనంతమాద్యమభయం వందేఽంధకారాపహం_౹*

*_వందే రావణనందిభృంగివినతం వందే సువర్ణావృతం_౹*

*_వందే శైలసుతార్ధభాగవపుషం వందేఽభయం త్ర్యంబకం_౹*

*_వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం_౹౹*


#_ *శివస్తుతి* - 9_#


*సూక్ష్మమైనవాడు, అనంతమైన వాడు, మొదటి వాడు, భయము లేని వాడు, అంధకాసురుని చంపిన వాడు, రావణుడు, నంది, భృంగి చే వందితుడు, స్వర్ణ పుష్పముల రేకులు చుట్టూ కలవాడు, పార్వతిని అర్ధ భాగముగా కలవాడు, త్ర్యంబకుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు*.....


🧘‍♂️🙏🪷 ✍️🙏

కుమారుడి కాపురం

 *కుమారుడి కాపురం..*


ఒక ఆదివారం నాటి సాయంత్రం ఐదున్నర గంటలకు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వచ్చే బస్సులో నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చారు..ఇద్దరిలో ఒకరు డెబ్భై ఏళ్ల పై బడిన తల్లి..ఆమెను జాగ్రత్తగా చేయిపట్టి నడిపిస్తూ వస్తున్న కుమారుడు..ఇతని కి కూడా దాదాపు యాభై ఏళ్ల వయసు వుంటుంది..ఇద్దరూ స్వామివారి మందిరం లోకి వచ్చారు..మా సిబ్బంది వద్దకు వెళ్లి.."మేము చెన్నై నుంచి వస్తున్నాము..మూడురోజులు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాము..మేము ఉండటానికి ఏదైనా రూము దొరుకుతుందా?.." అని అడిగారు..మా సిబ్బంది రిజిస్టర్ చూసి.."రూము ఖాళీ ఉన్నదండీ..కాకుంటే మళ్లీ శుక్రవారం నాటికి మీరు ఆ రూము ఖాళీ చేసి మాకు అప్పచెప్పాలి..ఆరోజు వేరే వాళ్లకు కేటాయించాము.." అన్నారు.."అయ్యో..అన్నిరోజులు అక్కరలేదండీ..బుధవారం సాయంత్రమే మీకు అప్పచెప్పి..మేము చెన్నై వెళ్లిపోతాము.." అన్నారు..వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని..ఒక గదిని వాళ్లకు కేటాయించారు..ఇద్దరూ తమ గది వద్దకు వెళ్లారు..


మరో గంట తరువాత..ఆ తల్లీకుమారులు స్వామివారి మందిరం లోకి వచ్చారు..ఇద్దరూ స్వామివారి మంటపం లోకి వచ్చి..అక్కడినుంచి స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నారు..ఆ పెద్దావిడ అక్కడే మంటపం లో కూర్చున్నారు..ఆమె కుమారుడు భక్తిగా ప్రదక్షిణాలు చేసాడు..ఆ రాత్రికి ఇద్దరూ మంటపం లోనే పడుకున్నారు..సోమవారం నాడు ఉదయం ఐదు గంటలకే స్నానం చేసి..ఇద్దరూ మంటపం లో కూర్చున్నారు..స్వామివారికి ప్రభాతసేవ లో భాగంగా ఇచ్చే హారతులు కళ్లకద్దుకొని..అర్చకస్వామి ఇచ్చిన తీర్ధాన్ని స్వీకరించి..మళ్లీ మంటపం లో కూర్చున్నారు..ఆరోజు, ఆ ప్రక్కరోజు కూడా దాదాపుగా ఇదే విధంగా..స్వామివారికి ఇచ్చే అన్ని హారతుల ను చూసి..కళ్లకద్దుకొని..తీర్ధాన్ని తీసుకొని..మంటపం లో కూర్చుని ధ్యానం చేసుకోసాగారు..


బుధవారం నాటి ఉదయం ప్రభాతసేవ పూర్తి అయిన తరువాత..స్వామివారి తీర్ధాన్ని తీసుకొని..ఆ తల్లీకుమారులిద్దరూ నేను కూర్చున్న చోటుకి వచ్చారు.."అయ్యా..నా పేరు భానుమూర్తి..మీతో ఈరోజే మాట్లాడటం..ఈరోజు సాయంత్రం నాలుగు గంటల బస్సుకు వెళ్లిపోతామండీ..గత మూడు రోజుల నుంచీ ఇక్కడ చాలా ప్రశాంతంగా గడిపాము..స్వామివారి సన్నిధిలోనే ఎక్కువ సేపు ఉన్నాము..కనీసం మూడు నాలుగు సార్లు స్వామివారి సమాధిని దర్శించుకున్నాము..ఒక తీవ్రమైన సమస్య చుట్టుముట్టి మమ్మల్ని కలవరబెడుతున్నది..ఏ రకంగానూ పరిష్కారం కనబడలేదు..చివరిగా ఈ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి మనస్ఫూర్తిగా మొక్కుకుంటే..స్వాoతన లభిస్తుంది అని మనసుకు తోచింది..దానికీ కారణం ఉన్నది..గత ఆరు నెలలుగా స్వామివారి లీలలు సోషల్ మీడియా లో వస్తున్నాయి..ప్రతిరోజూ చదువుతున్నాను..అందువల్ల ఇక్కడికి వద్దామని అనిపించింది...ఈవిడ మా అమ్మగారు..నేను ఒక్కడినే కుమారుడిని..నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది..నాకూ ఒక అబ్బాయి వున్నాడు..ప్రస్తుతం చెన్నై లోనే ఉద్యోగం చేస్తున్నాడు..వాడికి ఆరు నెలల క్రితం వివాహం చేసాము..కొన్నాళ్ళు వాళ్లిద్దరూ బాగానే వున్నారు..ఏమైందో తెలీదు..పోయిన నెలలో మా కోడలు తన పుట్టింటికి వెళ్ళిపోయింది..మా వాడు తన తప్పేమీ లేదంటాడు..ఆ అమ్మాయి కూడా తాను సరిగ్గానే ఉన్నానంటుంది..నాకూ మా అమ్మకూ ఇంట్లో ఈ పరిస్థితి చూడలేక క్షోభగా ఉన్నది..వాడి సంసారం బాగు చేయడానికి మా వియ్యపు వాళ్ళతో కూడా మాట్లాడాను..వాళ్ళూ సుముఖం గానే వున్నారు..ఎటొచ్చీ పిల్లలిద్దరూ పంతాలకు పోతున్నారు..వాళ్ళ మనసు మార్చమని ఈ స్వామివారిని వేడుకోవడానికి నేను వద్దామని అనుకున్నాను..కానీ మా అమ్మకూడా పట్టుబట్టి ఇక్కడకు వచ్చింది..ఈ వయసులో నువ్వు ఎందుకు అని మా అమ్మతో అంటే..స్వామివారి సమాధి ని దర్శించుకుంటాను..నీతోబాటు నేనూ స్వామిని వేడుకుంటాను..ఈ ముసలి దాని ప్రార్ధన వింటారేమో స్వామివారు అని నాతో పాటు వచ్చిందండీ..మా విన్నపాలు స్వామివారు విని..మా అబ్బాయి సంసారం  చక్కబడితే..అందరమూ ఇక్కడికి వచ్చి..ఒక శని ఆదివారాల్లో అన్నదానం చేయిస్తానండీ.." అన్నాడు..


మరో పదిహేనురోజుల తరువాత..."ప్రసాద్ గారూ నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను..నా పేరు భానుమూర్తి..పోయిన నెలలో మా అమ్మగారితో కలిసి స్వామివారి మందిరం వద్ద మూడురోజులు వున్నాను..గుర్తుపట్టారా?..స్వామివారి దయవల్ల మా సమస్య తీరిపోయిందండీ..వచ్చేవారం నేనూ మా అమ్మా మా అబ్బాయి కోడలు..అందరం అక్కడికి వస్తున్నాము..ఒక రాత్రి నిద్ర చేస్తాము..ఆ శని ఆదివారాలు అన్నదానానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను..అంతా స్వామిదయ..నేను అక్కడికి వచ్చి అంతా వివరంగా మీతో చెప్పుకుంటాను.." అని ఫోన్ చేసాడు..


భానుమూర్తి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు..అతనికి సంతోషం కలుగచేసి..అతని కుమారుడి కాపురం చక్కదిద్ది..అతని చేత అలా చెప్పించింది స్వామివారే అని నాకు అర్థమైపోయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

Muddugaare


 

Nee nerla


 

అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది

 'ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది?' అన్నది యక్షుడి ప్రశ్న. 'నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటూంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది?' బదులిస్తాడు యుధిష్ఠిరుడు.

         ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి మనిషికి క్షణం కూడా తీరికలేదు.

                  మనిషికి తన పుట్టుక గురించి తెలుసు. కాని, మరణం గురించి బొత్తిగా తెలియదు. దాన్నించి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు. చనిపోయాక ఏమవుతుంది? మరణం తరవాత మనిషి ఎక్కడికి వెడతాడు? అసలు మానవ జన్మకు ప్రయోజనమేమిటి? ఆత్మ అన్నది ఉన్నదా? శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెడుతుంది?

        జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికీ ఎదురయ్యే ప్రశ్నలివి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబుల గురించి అన్వేషించడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బుచేసినా, ఆఖరి క్షణాలు ఆసన్నమవుతున్నా- ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలా అన్న ఆలోచనే తప్ప, జన్మాంతర జీవితం గురించి తలంచడు.

              వాస్తవంగా తల్లి గర్భంలో పడినప్పటినుంచి మరణంవైపు మనిషి ప్రయాణం ఒక్కొక్క అడుగే సాగుతూంటుంది. ఓ క్షణం ముందుకు నడుస్తోందంటే ఆయుష్షులో ఓ క్షణం తరిగిపోతున్నట్టే కదా! బ్రహ్మ జ్ఞానులకు ఇది అసంబద్ధమనిపించదు. ఎందుకంటే, మరణానంతర జీవితం గురించి మన వేదాలు ఘోషిస్తున్నాయి కనుక. ఈ జీవితం ఎంత ముఖ్యమో, ఆ జీవితమూ అంతే అవసరం!

     కొన్ని మతాలు మరణానంతర జీవితం గురించి భయపెడుతుంటాయి. జీవితం ఎంత స్వేచ్ఛాసుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో ముగించవచ్చని మన వేదాలు చెబుతున్నాయి.

           కొందరు మతస్తులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని, మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్తు రూపేణా దొరికే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించేయాలని బోధిస్తారు. మనిషికొకే జన్మ అని అనుకోవటంలో ప్రమాదమే అది. రేపో, ఎల్లుండో ఎలాగా పోతాం కనుక త్వరత్వరగా అన్నీ అనుభవించేయాలని పిచ్చి పరుగులు పెడుతుంటారు వాళ్ళు.

          వేద పరిజ్ఞానమున్నవారిని మరణం భయపెట్టదు. వస్తురూపంగా చవిచూసే గుణాలకన్న మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం. జీవితం దారి జీవితానిదే! మరణం దారి మరణానిదే! మరణం జీవితానికి ఆఖరిమెట్టు. ఆత్మ జీవితం అనంత వాహిని. ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే! ఆత్మకు చావులేదు.

      భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 'అర్జునా! ప్రతి దేహంలో నివసించే దేహి లేక ఆత్మ నిత్యుడు. అవధ్యుడు. మరణమనగా దేహంనుంచి దేహి బయటికి వెళ్ళడం. దేహం ధరించే వస్త్రం లాంటిది. ఈ రెండింటి సంయోగం క్షణికమే! పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించటం వంటిదే! ఆత్మ తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది' అని స్పష్టంగా చెప్పాడు.

       ఏదో క్షణంలో ఈ జీవితం ముగిసిపోవచ్చు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరక్కుండానే సమయం అంతం అయిపోవచ్చు. అందుకే, వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. అప్పుడే ఈ మానవ జన్మకు ముక్తిమార్గం లభ్యమవుతుంది. దివ్యజ్ఞానం దక్కుతుంది. ఈ ఆత్మ పరమాత్మకెంతో దగ్గరని అర్థమవుతుంది.

ఆలోచనాలోచనాలు

 ~~~ ఆలోచనాలోచనాలు ~~~ అవధాన మధురిమలు ~~~ శతావధాని శ్రీ పోకూరి కాశీపతి ~~~.                      సమస్యాపూరణములు ;--- సమస్య---"" గౌరికిఁ గేశవుండు పతిగావలె, శంకరుఁడన్న గావలెన్.""         పూరణము---- "ఉ. వారణవైరి యేసతికి వాహనమౌ, సిరికిన్ విభుండెవం / డారయ వాణికిన్ జలరుహాసనుఁ డేమియు గావలెన్, ఫణిన్ / హారముగా నెవండు గొనెనా హలి కృష్ణునకేమి గావలెన్ / గౌరికిఁ, గేశవుండు, పతిగావలె, శంకరుఁ, డన్నగావలెన్." (క్రమాలంకారము)                                   2* "" కనులలో చన్నులమరె కాంతామణికిన్"" పూరణము ;----" కం. చెన్నులర బెస్త చేడియ / క్రన్నన వల వల్లెవాటుగాఁ గొని వేడ్కన్ / మున్నీటికి జనునెడ వల / కన్నులలో చన్నులమరె కాంతామణికిన్."                   3* "" కొడుకున్ రమియించి యొక్క కొమరుని గాంచెన్."" పూరణము ;----    "కం. పడఁతులను నమ్మనగునే / కడువలపున తార యనెడు కామిని వేడ్కన్ / జడదారిఱేని ముద్దుల / కొడుకున్ రమియించి యొక్క కొమరుని గాంచెన్."                                    దత్తపదులు;---- 1* " రోహిణి--ఉత్తర -- రేవతి -- హస్త అను పదములతో భాగవతార్థములో పద్యము. "" తే. గీ. రోహిణీ ధవసన్నిభ రూపుఁడైన / ఉత్తరావల్లభుని తన యూరువుపయి / రేవతీ విభుఁడిడుకొని ప్రేమమీర / హస్తమస్తకసంయోగ మాచరించె.""                         2* " కడవ -- కుండ -- మూకుడు -- మంగలము అను పదములతో భారతార్థములో పద్యము.      "" ఆ. వె. కడవచూలి యొద్ద గఱచిన విలువిద్దె / బలిమి జూపి తౌర కలఁగకుండ / ఎఱుక నైతి నేను నేదాయె మూకుఁడు / క్షమను మంగలము కిరీటి.""                              భీష్మ -- ద్రోణ -- కృప -- శల్య పదములతో రామాయణార్థముతో పద్యము. "" తే. గీ. మారుతీ భీష్మముగను లక్ష్మణుఁడు మూర్ఛ / పొందె నిక ద్రోణగిరి కేగి తొందరగను / కృప దలిర్పగ సంజీవి నెసఁగ దెచ్చి / యిడఁ గదే నీదు కౌశల్యమిపుడు జూతు.""     మరికొన్ని సమస్యాపూరణములు ;--- " రాముఁడు పెండ్లాఁడె శైలరాజకుమారిన్." పూరణము;---- "" కం. భీముఁడు సమధిక సుగుణ / స్తోముడు మౌళిధృతబాలసోముఁడుక్ష్మాభృ / ద్ధాముఁడు పెండ్లాడె శైలరాజకుమారిన్.""               2* "దూలము చెలరేగి కొన్ని దున్నలఁ జంపెన్."         సమస్యాపూరణము "" కం. శైల ప్రాంతంబున నొక / బాలుడు మహిషము మేపు పట్లన్ గనియున్ / వాలం బాడించుచు శా/ ర్దూలము చెలరేగి కొన్ని దున్నలఁ జంపెన్.""              "" ఒకే ఒక పద్యంలో 30 అర్థాలుండే త్రింశదర్థ పద్య రత్నం""                                 ఆ. వె. భూరిజఠర గురుడు నీరజాంబకభూతి / మహితకరు డహీనమణికలాపు / డలఘుసద్గణేశు డగ్రగోపుడు మహా / మర్త్యసింహుడేలు మనల నెపుడు.""                                 (డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యాసర్వస్వం సౌజన్యంతో)                          తేది 11--10--2023, బుధవారం, శుభోదయం.

పంచాంగం 11.10.2023 Wednesday,

 ఈ రోజు పంచాంగం 11.10.2023  Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: ద్వాదశి తిధి సౌమ్య వాసర: మఘా నక్షత్రం శుభ యోగ: తైతుల కరణం ఇది ఈరోజు పంచాంగం.


ద్వాదశి సాయంత్రం 05:36 వరకు.

మఘా పగలు 08:44 వరకు .

సూర్యోదయం : 06:11

సూర్యాస్తమయం : 05:54

వర్జ్యం : సాయంత్రం 05:40 నుండి 07:28 వరకు

దుర్ముహూర్తం : పగలు 11:39 నుండి 12:26 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం : పగలు 07:30 నుండి 09:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,56వ శ్లోకం*


 *దుఃఖేష్వనుద్విగ్న మనాః  సుఖేషు విగత స్పృహః |* 

 *వీతరాగ భయక్రోధః స్థితధీర్ముని రుచ్యతే|| 56* 


 *ప్రతి పదార్థం* 


దుఃఖేషు = దుః ఖములు పాప్టించినప్పుడు ; అనుద్విగ్నమనాః = మనసునందు ఉద్వేగమునకు లోను కాని వాడును ( క్రుంగి పోని వాడును ); సుఖేషు = సుఖములు కలిగినప్పుడు ; విగత స్పృహః = ఆసక్తిరహితుడును (పొంగిపోనివాడును ); వీతరాగ భయ క్రోధః = (అట్లే ) రాగభయ క్రోధములను తెగించువాడును అగు ; మునిః = ముని ( మనన శీలుడు ); స్థితధీః = స్థితప్రజ్ఞుడు ; ఉచ్యతే = అనబడును;


 *తాత్పర్యము* 


 దుఃఖములకు క్రుంగిపోననువాడును, సుఖములకు పొంగిపోను వాడును, ఆసక్తిని,భయ క్రోధములను వీడిన వాడును అయినట్టి మననశీలుడు (ముని ) స్థితప్రజ్ఞుడనబడును.


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

రామాయణమ్ 351

 రామాయణమ్ 351

...

రాజులకు రెండువిధాలుగా శత్రువులు ఉంటారు. ఒకరు తన ఇంటిలోని జ్ఞాతులు రెండు తన దేశాన్ని ఆనుకుని ఉన్న సరిహద్దు రాజ్యమువారు.వీరుఇరువురూ సమయము కోసము ఎదురుచూస్తూ ఉంటారు .ఎప్పుడయితే రాజుకు సంకటపరిస్థితి ప్రాప్తించిందో అదను చూసి పదునైన దెబ్బ వేస్తారు .

.

రావణుడు కూలిపోక తప్పదు అతని వ్యసనము అతనిని కూల్చబోవు చున్నది .ఆ సంగతి బాగుగా గ్రహించినవాడు కావున విభీషణుడు మనతో జట్టు కట్టుటకు వచ్చినాడు .

.

అన్ననే వదలినవాడు మనలను వదలడా అని సుగ్రీవుని సందేహము .అది జరుగుటము ఆస్కారములేదు ఏలనగా

మనతో భవిష్యత్తులో కూడా అతనికి శత్రుత్వము ఏర్పడే అవకాశము లేదు ఏలనన మనము ఆతని సరిహద్దు రాజ్యము వారలము కాము ! అతని జాతి వారమూ కాము.

.

కావున ఇంతకన్న మంచి అవకాశము అతనికిఎప్పుడు లభించును ?ఇతనికి రాజ్యమందు కోరిక ఉన్నది.

.

రాక్షసుడే కదా ఈతడు ! బుద్ధిహీనుడేమో అని శంకించంకండి. 

.

కులమును బట్టి బుద్ధిని నిర్ణయింపలేము .వారిలో కూడా గొప్ప మేధో సంపన్నులు పండితులు కలరు . కావున ఈతడు మిత్రుడుగా గ్రహింపదగినవాడే !

.

జ్ఞాతులెవ్వరూ భయములేక సంతోషముగా కలిసి ఉండజాలరు .

.

నా వంటి పుత్రుడు 

సుగ్రీవుని వంటి మిత్రుడు

భరతుని వంటి సోదరులు ఎక్కడా ఉండరు !

.

 ( శ్రీరాముడు ఇలా ఎందుకన్నారో రేపటి కొరకు చూడవలసినదే)

.

జానకిరామారావు వూటుకూరు

Nuvvulu

 https://youtu.be/0YaBhm3WZ48?feature=shared


వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - కృష్ణ పక్షం  -  ద్వాదశి - మఘ/ పూర్వాఫల్గుణి - సౌమ్య వాసరే* (11.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/e3WRd8_1OME?si=zV6-xCe1jVXU8peq



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*