🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 50*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*కవీనాం సన్దర్భస్తబక మకరందైకరసికం*
*కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళమ్ |*
*అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ*
*అసూయా సంసర్గా దలికనయనం కించిదరుణమ్ ‖*
ఈ శ్లోకంలో అమ్మవారి విశాల నేత్రాలను చమత్కారంగా వర్ణించారు శంకరులు. సామాన్యంగా కవిత్వాన్ని ఆస్వాదించటానికి రసజ్ఞత కావాలి. అమ్మ *రసజ్ఞా, రసశేవధీ* కదా!
ఆమె ఎదురుగా కవులు అసలు ఆది శంకరుల కన్నా గొప్ప కవులున్నారా? ఆయన చేసిన ప్రతి స్తోత్రములోనూ తత్త్వ సౌందర్యమే కాక భాషాలంకార సౌందర్యము కూడా తొణికిసలాడుతూ ఉంటుంది. ఆయన అపర శంకరావతారం కదా! తమ కావ్యాలను వినిపిస్తుంటే ఆ కావ్య కమలముల గుత్తుల లోని మకరందమును ఆస్వాదిస్తున్నాయా అన్నట్లుగా వున్నాయి ఆమె కళ్ళు. అయితే, వినేది చెవులు కదా? కళ్ళు ఆస్వాదించటమేమిటి? అంటే, ఆ కవిత్వ మకరందమును మేము కూడా ఆస్వాదిస్తామన్నట్లుగా అమ్మవారి నేత్రాలు ఆమె చెవుల వరకూ వచ్చాయిట. అంటే, అమ్మవి *ఆకర్ణ దీర్ఘ నయనాల* ని చెప్పటం. *వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీనాభిలోచనా* అని అమ్మవారి సహస్రనామాల్లో ఒకటి.
శంకరులు అమ్మవారి పై చేసిన *లలితా పంచరత్న ప్రాతః స్మరామి* శ్లోకాల్లో మొదటి దానిలోనే అన్నారు.
*ప్రాతః స్మరామి లలితా వదనారవిందం*
*బిమ్బాధారం పృథుల మౌక్తిక శోభి నాసం*
*ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం* *మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్* అని.
అయితే, ఇప్పుడు ఆమె ఫాల నేత్రమునకు అసూయ కలిగిందట.ఆ కవితా మాధుర్యమును ఆస్వాదించటానికి తాను కూడా చెవుల వరకు వెళ్లలేకపోయానని. ఆ అసూయతో ఆమె ఫాలనేత్రము ఎర్రబడిందట.అమ్మవారి నుదుటిపైనున్నది అగ్ని నేత్రము కదా!
అట్టి లలితా పరమేశ్వరి, ఇంత మధురమైన శ్లోకమును చేసిన శంకరులు, మనను అనుగ్రహించెదరుగాక!
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి