24, జులై 2024, బుధవారం

జాషువా కవీంద్రుడు

 గుఱ్ఱము  జాషువా కవీంద్రుడు

(నేటి వర్థంతి సందర్భమున)


' కరుణామయుడు క్రీస్తు ' కమనీయ చరితంబు 

            దివ్యకావ్యంబుగా తీర్చిదిద్ది 

గబ్బిళం , ఫిరదౌసి , కాటిదృశ్యంబుల 

            పద్యంబులను జెప్పి హృద్యముగను

విశ్వనాథకవిచె వినుతించబడియును 

            సాహితీలోకాన సన్నుతొంది 

ధరణికోటందున దంతావళమునెక్కి 

            పురవీధి నూరేగి పొంది ఘనత 

చళపిళ్ల వేంకటశాస్త్రులు చేతితో 

            గండపెండేరంబు కాలి కొంది 

తెలుగు కవనంబు నందున తేజరిల్లి 

పద్మభూషణ బిరుదాన పరిఢవిల్లి 

చరిత కెక్కిన గుఱ్ఱము జాషువాకు 

వందనంబుల నొనరింతు వంచి శిరము.       


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

గురువారం / రాశి ఫలితాలు*

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


*25-07-2024 / గురువారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. దగ్గరి వారి  నుండి సమయానికి ఆర్ధిక సహాయం అందుతుంది.  దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సమాజంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.

---------------------------------------

వృషభం


ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు.చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి.  వృత్తి,వ్యాపారాలలో కీలక నిర్ణయాలు  అమలు చేస్తారు నిరుద్యోగులకు  నూతన అవకాశాలు వస్తాయి.

---------------------------------------

మిధునం


ఆలయ సందర్శన చేసుకొంటారు. సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. ఋణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------

కర్కాటకం


కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో అధికారుల  ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా  పనులు పూర్తి చేయలేరు.  ఇంటా బయట ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

సింహం


ఆర్ధిక  పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం  కలిగిస్తుంది. సంఘంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో  సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు. 

---------------------------------------

కన్య


సమయానికి తగిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో  మీ ప్రతిభకు అధికారుల నుండి మన్నలను అందుకుంటారు.

---------------------------------------

తుల


గృహమున విలువైన పత్రములు  విషయంలో  జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వంత  నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగమున   విధులు సరిగా నిర్వర్తించలేక పై వారి నుండి మాట పడవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు.

---------------------------------------

వృశ్చికం


నూతన  వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.  అవసరానికి ఆర్ధిక సహాయం అందక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.

---------------------------------------

ధనస్సు


అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.  కీలకమైన  పనులలో  ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.  నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకొంటారు.

---------------------------------------

మకరం


అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది.  ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.  ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. 

---------------------------------------

కుంభం


సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు ఉత్సాహంగా సాగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విషయాలు సంతృప్తినిస్తాయి.

---------------------------------------

మీనం


ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.  ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

Panchaag


 

శ్రీ చెలువనారాయణ ఆలయం*

 🕉 "మన గుడి : నెం 388"


⚜ *కర్నాటక  : మేల్కొటే - మండ్యా*


⚜ *శ్రీ చెలువనారాయణ ఆలయం*


💠 దక్షణ భారతదేశంలోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో కర్ణాటక రాష్ట్రంలో మెల్కోటే చెలువ నారాయణస్వామి ఆలయం ఒకటి. 


💠 వైష్ణవ, మతోద్ధారకులగు  శ్రీరామానుజులు చోళ చక్రవర్తిచే దండింపబడ్డాడు.

అప్పుడు రామానుజులు తప్పించుకుని చోళరాజ్యము నుంచి పారిపోయి మేల్ కోటలో తలదాచుకుని అక్కడ 10 సంవత్సరాల పాటు చెలువ నారాయణస్వామిని, యోగ నృసింహుని పూజించి ఉండుటవల్ల మెల్కోటే  వైష్ణవులకు 108 దివ్యదేశముల వలె ప్రముఖ వైష్ణవ క్షేత్రమైంది. 

ఈ ఆలయాన్ని తిరునారాయణ ఆలయం అని అంటారు.


🔆 *స్థలపురాణం*


💠 బ్రహ్మదేవుని కోరికపై  చెలువనారాయణ విగ్రహాన్ని సృష్టించాడు శ్రీమహావిష్ణువు.

బ్రహ్మ దేవుడు దానిని తన మానసిక పుత్ర సనత్కుమారకు అందించాడు, అతను దానిని మెల్కోటేలోని ఈ ప్రదేశంలో ప్రతిష్టించాడు. అందుకే ఇక్కడి ఉత్సవ విగ్రహానికి " సనత్కుమారులు"  అని పిలుస్తారు.


💠 బ్రహ్మ, విష్ణువును తన పూజ కోసం మరొక విగ్రహాల కోసం అభ్యర్థించాడు.

విష్ణువు పూర్వపు విగ్రహం యొక్క చిన్న రూపాన్ని బ్రహ్మకు సమర్పించాడు. త్రేతాయుగంలో , రాముడు  తన  పూజ కోసం ఒక విగ్రహం కోసం బ్రహ్మదేవుడిని అభ్యర్థించాడు, అందుకే ఈ విగ్రహం రాముడికి ఇవ్వబడింది.


💠 లవకుశులలో కుశుడు  ఈ విగ్రహాన్ని వారసత్వంగా పొందాడు మరియు దానిని యాదవ కుటుంబములో వివాహం చేసుకున్న అతని కుమార్తెకు అందించాడు. 

శ్రీకృష్ణుడు మరియు బలరాముడు, యాదవ యువరాజులు కావడంతో, ఈ విగ్రహాన్ని వారసత్వంగా పొందారు. 

ఈ విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా నేటికీ ఊరేగింపుగా తీసుకువెళతారు. 

అందుకే ఈ ప్రాంతాన్ని " యాదవాద్రి"  అంటారు .


💠 ఈ దేవాలయంలో శ్రీకృష్ణ విగ్రహం మిక్కిలి సుందరమైనది. దీనినే చల్లపిళ్ల రాయ దేవాలయం అని కూడా అంటారు.

శ్రీ రామానుజులకు శ్రీకృష్ణుడు స్వప్నంలో ప్రత్యక్షమై తనను ఢిల్లీసుల్తానులు తీసుకొని పోయిరి అని చెప్పగా శ్రీరామానుజులు సుల్తానును సందర్శించుటకు వెళ్లిరి.

అచ్చట మల్తాను కుమార్తె అందమైన శ్రీకృష్ణ విగ్రహాన్ని అలంకరించి సింహాసనంపై ఉంచి ఆడుకొనుచుండెను. రామానుజులు ఆ విగ్రహము తన కిమ్మని సుల్తానుని ఆర్థించెను. సుల్తాను ఇష్టపడలేదు.


💠 రామానుజులు ధ్యాన నిమగ్నుడై యోగ శక్తితో అందరూ చూచుచుండగా చల్లపిళ్ల రాయ కృష్ణా రమ్మని పిలువగా ఆ దివ్యసుందర మూర్తి నృత్యంచేస్తూ వచ్చి శ్రీరామానుజుల ఒడిలో చేరెను. సుల్తాను మెచ్చుకుని భక్తి పూర్వకముగా ఆ విగ్రహమును రామానుజుల కిచ్చెను.

శ్రీరామానుజులు ఆ విగ్రహమును మేల్కోటకు తీసుకువచ్చి అచ్చట దేవాలయంలో ఉత్సవ విగ్రహంగా ప్రతిష్టాపించారు.


💠 మేల్కోటేలోని యోగ నరసింహ ఆలయాన్ని ప్రహ్లాదుడు స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు. ప్రహ్లాదుడు తపస్సు చేసిన ప్రదేశం ఇదేనని కూడా నమ్ముతారు. 

అభిషేకం సమయంలో యాత్రికులు నృసింహుని శరీరంపై సాలిగ్రామ చక్రాలు చూడవచ్చు.

పూర్తి భక్తి మరియు విశ్వాసం ఉన్నవారు నృసింహుని మూడవ కన్ను చూస్తారని స్థానికులు నమ్ముతారు. 


🔆 *కల్యాణి పుష్కరిణి*


💠 ఈశ్వర సంహిత ప్రకారం, శ్రీమహావిష్ణువు వరాహ అవతారము ధరించి మహాసముద్రం నుండి భూమిని పైకి లేపినప్పుడు అతని శరీరంపైఉన్న నీటి బింధువులు  మేలుకోటేవద్ద కొండపై పడ్డాయి. దీంతో కల్యాణి చెరువు ఆవిర్భవించింది. పద్మపురాణంలో కల్యాణిపుష్కరిణి ప్రస్తావనఉంది.


🔆 ,*వైరముడి ఉత్సవం*


💠 ఈ ఆలయంలో  అట్టహాసంగా జరిపే వైరముడి ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. వైరముడి అంటే అర్ధం వజ్రాలు పొదిగిన కిరీటం అని.

ఈ కిరీటంలో పొదిగిన వజ్రాలకు వెల కట్టలేమంటారు. బంగారంలో ఈ వజ్రాలు పొదగ బడి వుండే ఈ కిరీటాన్ని స్వామి వారికి అలంక రించడాన్నే వైరముడి ఉత్సవం అంటారు.

ఈ కిరీటాన్ని పాల సముద్రంలో శయనించి వుండే విష్ణు మూర్తి ధరించిన కిరీటంగా భావిస్తారు.

ఈ కిరీటాన్ని సంవత్సరంలో ఈ ఉత్సవాలు జరిగే సమయంలో మాత్రమే స్వామి వారికి అలంకరిస్తారు. ఆ తర్వాత తీసివేస్తారు.


🔆 సూర్యకిరణాలు పడనివ్వరు


💠 వైరముడి ఉత్సవాలుగా పిలవబడే ఈ 

బ్రహ్మోత్సవాలలో మరొక విశేషం కూడా వుంది. ఈ కిరీటాన్ని సూర్యకిరణాలు తాకకూడదట. అందువల్లే సూర్యాస్తమయం అయిన తర్వాతే స్వామి వారికి ఈ కిరీటాన్ని అలంకరించి తిరువీధులలో ఊరేగిస్తుం టారు. 


💠 వైరముడి ఉత్సవంలో మరొక విశేషం వుంది. చెలువ నారాయణస్వామికి అలంకరించే వజ్రాలు పొదిగిన కిరీటాన్ని స్వామి వారికి అలంకరించే వరకూ ఎవ్వరూ చూడరాదట. చివరకు ప్రధాన అర్చకుడు సైతం స్వామి వారికి అలంకరించేవరకు కిరీటాన్ని నేరుగా కళ్లతో చూడరాదట.

అందువల్లే ఈ కిరీటాన్ని శ్రీవారికి అలంకరించే సమయంలో ప్రధాన అర్చకుడు ఒక వస్త్రాన్ని కళ్లకు గంతగా కట్టుకొని మరీ స్వామివారి తలపై అలంకరిస్తారు.  ఆ తర్వాతే ఆ కిరీటాన్ని చూసే అవకాశం అర్చకులకు లభిస్తుంది. 


💠  ఆనాడు ఈ కిరీటాన్ని ధరించి వుండే స్వామి వారిని దర్శించుకొన్నట్లయితే సాక్షాత్తు పాల కడలిలో శయనించి వున్న నారాయణుడుని చూసినంత ఫలితం లభిస్తుందంటారు. 


💠 మైసూరుకు సుమారు 50.కి.మీ, బెంగుళూరు నుండి 130 కి.మీ.

పద్యతాంబూలం

 పద్యతాంబూలం


కిటికీలెక్కడివక్కడ  

పనిఁజేయుచునున్నవేళ పరవశుడగుచున్, 

మనమిక నెగురఁగ వచ్చని  

తనచేతులనూపి చెప్పె తగు పైలెట్టే..😊


(కిటికీలు = Windows made by Microsoft and others)


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్

క్రొత్తపలుకు-2

 క్రొత్తపలుకు-2


శ్రద్ధబట్టి చదువ సార్థకమౌగాని 

మూసచదువులేల? బొంకులేల? 

మనసుబెట్టు చదువు మాగాణి పంటరా! 

మోసపోవవలదు నాసిచేత. 

*~శ్రీశర్మద*

జాషువా మహాకవి

 నేడు కవికోకిల శ్రీ గుర్రం జాషువా మహాకవి గారి 

వర్థంతి.....

తే.గీ|| షాజహాన ప్రభుని స్వప్న జగతి యందు

జాషువా కవి జీవిత సమరమందు

ఘనత దీపించు నొక స్వర్ణఘట్టమౌను

రమ్యమౌ తాజమహలు నిర్మాణ సృష్టి.


తే.గీ||షాజహానుని యెద కళాస్వాద తృష్ణ

గబ్బిలమున నభాగ్యు రక్తాశ్రు గాథ

తలచి ఫిరదౌసి దయనీయ దైన్య చరిత

జాషువా కావ్యదృష్టి కంజలి ఘటింతు...

సీ|| భవ్య భావావేశ పటిమకూపిరి వోసి

యుత్తేజమున కొక్క యూపు నిచ్చి

సంఘ సంస్కార వాసనల నల్గడ జల్లి

దేశభక్తికి వీర తిలకమద్ది

తియతియ్య నుడి తెల్గుతీరు తీయములకున్

జాతీయములకు లక్ష్యముగ నిల్చి

తరతరాలకు వెల్గు తన మూర్తి తెల్గు భా

వుక కోటి కనుదిన స్ఫూర్తి నించి

తే.గీ||శాంత వీరోజ్జ్వల కృపా మహాద్భుతముల

చిత్ర రసరాజ్య శిఖరాగ్ర సీమలందు

విడిసి కొలువున్న కవిశేఖరుడవు, గుండె

తలుపు దట్టిన జాతి వైతాళికుడవు

🙏🙏🙏🙏🙏🙏

ఎస్.ఏ.టి.ఎస్..ఆచార్య,

హైదరాబాద్..

మంత్ర పుష్పం

 *మంత్ర పుష్పం గురించి చిన్న వ్యాఖ్య*


ధాతా పురస్త్యాద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చ తస్రః

తమేవ నమృతం ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే

ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ సంభువం

విశ్వం నారాయణ దేవమక్షరం పరమం పదం

విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిం

విశ్వమే వేదం పురుష తద్విశ్వ ముపజీ వతి 

పతిం విశ్వశ్యాత్మేశ్వరగ్ం శాశ్వతుగ్ం శివమచ్యుతం

నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం

నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః 

నారాయణ పరంబ్రహ్మ తత్వం నారాయణ పరః

నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః

యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేஉపివా 

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః

అనంత మవ్యయం కవిగ్ం సముద్రేంஉతం విశ్వశంభువం

పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయంచాప్యథోముఖం

అథోనిష్ట్యా వితస్త్యాన్త్యే నాభ్యాముపరి తిష్ఠతి 

జ్వాలమాలాకులంభాతి విశ్వశ్యాయతనం మహత్

సంతతగ్ం శిరాభిస్తు లంబత్యా కోశసన్నిభం

తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం 

తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః 

సోஉగ్రభుగ్విభజంతిష్ఠన్నాహార మజరః కవిః

తిర్యగూర్ధ్వ మథశ్శాయీ రశ్మయ తస్య సంతతా

సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః

తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః

నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా

నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా 

తస్యాశిఖాయామధ్యే పరమాత్మా వ్యవస్థితః    

స బ్రహ్మ స శివః స హరిః సేంద్రఃసోஉక్షరః పరమస్వరాట్


ఇప్పుడు మనం ఈ రెండు మంత్రాలను విశ్లేషించి వాటిని అర్థం చేసుకుందాం.


వేద +అహం +ఏతం +పురుషం +మహాంతమ్ 

ఋషి ఇలా అంటాడు "ఈ గొప్ప పురుషుడు నాకు తెలుసు....

ఆదిత్యవర్ణం +తమసః +తుపారే 

 సూర్యుని రంగు మరియు చీకటికి మించిన వాడు

సర్వాణి +రూపాణి + విచిత్య ధీరః 

తెలివైన పురుషుడు వివిధ రూపాలను సంభావితం చేస్తున్నాడు


నామాని కృత్వా +అభివదన్ +యత్ + ఆస్తే 

వీటికి పేర్లు కూడా ఇచ్చారు మరియు వారిని పిలుస్తున్నారు


ధాతా+ పురస్తాత్ +యం + ఉదాజహార

“సృష్టికర్త, స్థాపకుడు (బ్రహ్మ) ఆదిలో ఎవరిని ఆరాధించాడో


శక్రః +ప్రవిద్వాన్ + ప్రదిశః + చతస్రః |

శక్రుడు (ఇంద్రుడు) నాలుగు దిక్కుల నుండి ఎవరిని ఆరాధించాడో ఆ పురుషుడు తెలుసుకున్నాడు


తం + ఏవం + విద్వాన్ + అమృతః + ఇహ భవతి | ఈ పద్ధతిలో పురుషుడు అమరత్వం ఇక్కడ సాధ్యమవుతుందని తెలుసుకొని…


న +అన్యః +పన్థా + అయనయ +విద్యతే |

… విముక్తికి వేరే మార్గం లేదు”

ఇక విషయంలోకి వెడితే.....

 పూజ చేసేటప్పుడు చిట్టచివర చేతిలో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాం. పూజ చేసేటప్పుడు కూర్చుంటాం. అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వులను మంత్రపుష్పం అంటారు. 

దివ్య పురుషుడిని తెలుసుకోవడం మరియు అనుభవించడం మాత్రమే అమరత్వానికి ఏకైక మార్గం అని ఋషి స్పష్టంగా ధృవీకరించాడు.

పువ్వు జ్ఞానమునకు గుర్తు. జ్ఞానం కలిగితే వికసనం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత. 

పువ్వు జ్ఞానమునకు గుర్తు. జ్ఞానం కలిగితే వికసనం కలుగుతుంది.జ్ఞానము చేత బుద్ధి వికసిస్తుంది  


అంటే మంత్రం అనే పుష్పం ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేటట్లు చేయమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు. అది మంత్రపుష్పం. 


మంత్రపుష్పంలో ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్తాం – ‘ నాన్యః పంథాయనాయ విద్యతే’ – ఈశ్వరుడిని తెలుసుకోవడానికి ఇంకొక మార్గం లేదు. నీ ఎదురుగుండా పెట్టి నువ్వు ఇప్పటివరకూ ఎవరిని పూజ చేశావో అసలు వాడు ఎక్కడ ఉంటాడో నువ్వు తెలుసుకుంటే అది ఒక్కటే వాడిని తెలుసుకొనే మార్గం. 


ఎక్కడ ఉన్నాడు అంటే ‘హృదయం చాప్యధోముఖం’ – యోగవిద్యను కలిగిన వాడు తెలుసుకుంటాడు. వంగిన తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ‘నాభ్యాం ఉపతిష్టతి’ – చిటికెన వ్రేలు బొడ్డుదగ్గర పెట్టుకుని బొటనవ్రేలు పైకి పెడితే బొటనవ్రేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన మొగ్గ అక్కడికి వస్తుంది. దాని చివర ఒక చిన్న బిందువు ఉంటుంది. ‘నీవార,... పీతాభా స్వస్త్యణూపమా’ ‘తస్య మధ్యే – మధ్యలో ఒక చిన్న ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కాంతి, ఆ వెలుగు ‘ఊర్ధ్వ మూల మధశ్శాయీ’ – దానికాంతి పైకి వ్యాపిస్తుంది , క్రిందకి వ్యాపిస్తుంది , ప్రక్కకు వ్యాపిస్తుంది . ఆ కాంతి ఏదో అది జీవాత్మ . 


‘స బ్రహ్మః స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్’ – ఏ పేరు పెట్టి పిలు అభ్యంతరం లేదు. కానీ ఆ వెలుగు ఉన్నదే అది పరమాత్మ. అది ఎక్కడ ఉంది? – అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’. కాబట్టి నిజంగా ఈశ్వరుడిని చూడాలంటే కళ్ళు తెరిస్తే కనబడడం కాదు. కళ్ళు మూతలుపడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు కనబడుతుంది. వాడు ఈశ్వరుడు. 

వాడు సమస్త ప్రాణికోటియందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు. 

అప్పుడు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఉన్నది ఒక్కటే అది ఎరుకలోకి వచ్చింది. అద్వితీయం – రెండవది లేదు. అద్వైతం – రెండు కానిది. ఒక్కటే. ఒక్కటి అంటే అది ఒకటి ఇది ఒకటి అని అంటారేమో అని రెండు కానిది అన్నారు.  అద్వితీయానుభూతిలోకి వెళ్ళడానికి ఇది ఒక్కటే సాధనం. అందుకు అది మంత్రపుష్పం.

ఆశీర్వాదo

 *పెద్దల ఆశీర్వాదo విలువ* 

                 ➖➖➖✍️

```

మీరు ఏదో ఒక పెద్ద పనికోసం బయటకు పోయినప్పుడల్లా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటారు.


ఎందుకంటే మనకు వారి ఆశీర్వాదం లభిస్తే ఆ పని విజయవంతమవు తుంది!


చాలా మంది ఇది అబద్ధం అనుకుంటారు. మరియు ఇదంతా పనికిరాని పని అని వారు భావిస్తారు.


మనం కూడా వారిలో ఒకరం. అoదుకే, ఈ రోజు మనం పెద్దల ఆశీర్వాదం ఎంత ప్రయోజనకరంగా మరియు ఫలవంత మైనదో  తెలియజేసే కథను తెలుసుకుందాం...



పూర్వం సదాచార వేద పండితుడు ఉండేవారు. సరస్వతి కటాక్షమే కానీ లక్ష్మీ కటాక్షం లేనివాడు. అతనికి ఒక్కడే కుమారుడు. పండితుడికి వాక్సుద్ధి కలవాడిగా పేరొందినవాడు.


అవసాన దశలో కొడుకుని పిలిచి, “నాయనా! నేను నీకంటూ ఏ ఆస్తిపాస్తులు కూడపెట్టలేదు. కానీ నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం ఆర్జించింది ఒక్కటే.

         

జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా,     విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది పట్టినా అది బంగారం అవుతుంది నాయనా!” అని చెప్పి ప్రాణాలు వదిలాడు.


తండ్రికి చేయవలసిన ఖర్మలన్నీచేశాడు. చేతిలో చిల్లి గవ్వ లేదు.


విచారంతో సముద్ర తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఊరికే కూర్చోక చేతితో దోసిలి నిండా ఇసుకను తీసుకొని క్రిందకు పోస్తున్నాడు. ఒకసారి పోసాడు. రెండో సారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదము గుర్తుకొచ్చింది.


“పట్టిందల్లా బంగారం అవుతుంది” ఈ ఇసుక బంగారం అయితే ఎంత బాగుంటుంది అని ఇసుకను క్రిందికి పోసి చూసాడు.


మూడో సారి ఇసుకను చేతిలోనికి తీసుకొని తలపైకెత్తితే చుట్టూ సైనికులు తమ ఆయుధాలు గురి పెట్టి నిల్చొని వున్నారు. ప్రక్కన రాజు గారు వున్నారు.

      

ఆయన తీవ్రంగా “ఏం చేస్తున్నావు? ఏం వెతుకుతున్నావ”ని అడిగారు.


దానికి తండ్రి మరణం, తన దుస్తితి వివరించాడు.


అప్పుడు సైనికులు దూరంగా తొలగారు.


రాజు గారు అన్నారు, “మా నాన్న గారు కూడా ఇలానే ఆశీర్వదించి నాకు  బహుమతిగా ఒక ఉంగరo ఇచ్చారు. అది రెండు రోజుల క్రితం ఇక్కడే ఎక్కడో పడి పోయింది. రెండు రోజులుగా వెతుకు తున్నాం. నీవు అవిషయం తెలుసుకొని వెతుకుతున్నావని మా సైనికులు అనుకొన్నారు.” అని చెప్పగానే చేతిలోని ఇసుక చటాలని క్రిందికి వదిలి లేచాడు.


తండ్రి వాక్భలం.ఆ ఇసుకలోనే రాజుగారి ఉంగరం దొరినది.

      

రాజుగారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే మూడు సoచుల బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు.


దానితో బంగారు నగల వ్యాపారం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి ఆ రాజ్యoలోని గొప్ప వ్యాపారస్తుల జాబితాలోకి చేరిపోయాడు.


తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సులకంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవo.✍️```


👉*సారాంశం…* 

*మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.*

*మాతృదేవోభవ..! పితృదేవోభవ...!!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కవితా చమత్కారం!

 శు  భో  ద  యం 🙏


కవితా  చమత్కారం!

-------------------------------- 


                  చ:  కలశ పయోధి  మీద  తరఁగల్  మరి 'హోయని'  మ్రోయ ,  వేయిభం


                        గుల  తలపాన్పు  పాము  బుసఁగొట్టఁగ ,  నేగతి  నిద్రఁ  జెందెదో ?


                        అలసత  తండ్రి !  చీమ చిటుకన్నను  నిద్దుర  రాదు  మాకు  , ఓ


                        బలవదరీ !  దరీకుహర  భాస్వదరీ !  యదరీ !  దరీ ! హరీ !


                          చాటుపద్యం-   అజ్ఙాత కర్తృకం ;


                          కవితా చమత్కారాలు  యెన్నిరీతులో?  ఒకొక్క  కవిది  ఒక్కొక్క  ఊహ! ఆవూహకు తగ్గ భావసంపద. దానిని ఆవిష్కరించే  చక్కని పద్యరచన!  అత్యద్భుత మనిపించక మానదు.


                          మనం నిద్ర పోతుంటే  అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. ఏమాత్రం చిన్నశబ్దమైనా మెళకువ వచ్చి ప్రక్క వారిపై విసుగు ప్రదర్శిస్తాం. అదే లోకేశ్వరునకు  ఆపరిస్థితే వస్తే  ఆయన కెంత బాధ? కానీ యివేవీ పట్టించుకోకుండా  ఓదేవాది దేవుడు

నిద్రపోతున్నాడట. ఆయన నిద్రను జూచి యీకవి యబ్బురపడుతున్నాడు.  పదండి ఆసంగతేమిటో చూద్దాం;


                  "  పాల  సముద్రంలో   కెరటాలు  హోరుమని మోత పెడు తుండగా, వేయితలల నాగు  ఆదిశేషుడు  బుసలు కొడుతుండగా ,   లోకపాలనతో అంతగా అలసిపోయిన నీవు  యెలా నిదురించినావయా ? నాయనా?  మాకైతే  చీమచిటుకన్నా

నిద్దుర రాదే ,  అబ్బో నీవు చాలా గొప్పవాడివేనయ్యా!  అంటూ తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడీ కవి.


                     అంత భయంకరమైన  చప్పుడవుతున్నా  నిమ్మకు నీరెత్తినట్లు  నిశ్చలంగా నిదురించటం ఇక్కడ ఆశ్చర్య జనక మైన

చమత్కారం. దాన్ని కవి బహు చక్కగా వర్ణించాడు.


                   కడలో కెరటాలు అనంతం వాటి మ్రోతలు కూడా నిర్విరామమే! ఇక  ఆది శేషునకున్నపడగలా  వేయి. ఒక్క పాము బుసకొడితేనేమనం

హడలిపోతాం. అలాటిది వేయిపాములొక్కసారిగా బుసలు సారిస్తే  యెంత శబ్దమో ? ఆశబ్దం  కర్ణ కఠోరంగదా? మరి ఆరొదలో కదలకుండా నిద్రపోవటం మాటలా? మహ దిట్టతనమో, మొండి తనమోకావాలి. ఆరెండూ నీకున్నాయయ్యా! లేకపోతే  చీమచిటుకు

మన్నామాకు మెలకువ వస్తుందే ?మరి నీకెందుకురాదు? అనికవి ప్రశ్న?


 

                   బలవదరీ!  దరీకుహర భాస్వదరీ! యదరీ!  దరీ!  హరీ!  ------  దీనివరుసచూస్తే  ఇదేదో శతకానికి మకుటంలాగ ఉంది.

కవి చాలా ప్రౌఢుడు." దరీ " శబ్దాన్ని వృత్యనుప్రాసంగా ప్రయోగించి  యర్ధభేదం సాధించటమేగాదు. తానెంత ప్రతిభావంతుడో మనకు

తెలియజేశాడు. అహోబలనృసింహ స్వామిని యీ సంబోధనలతో కవి సంభావిస్తున్నాడు.


              బలవదరీ- బలవంతుడైన శత్రువు గలవాడా( హిరణ్య కస్యపుడు బలవంతుడేగదా) దరీకుహర- పర్వత గుహలో; భాస్వదరీ!- ప్రకాశించు  నృసింహాకారా! ; అదరీ- చక్రము; దరీ- శంఖము ధరించెడువాడా ;హరీ- స్వామీ  శ్రీహరీ!


             బలవంతుడైన హిరణ్యకస్యపుని సంహరించినవాడా! శంఖ చక్రధారీ! పర్వత బిలమందు ( అహోబిలము) నివసించు నృసింహ స్వామీ! యని సంబోధనము.


                   మొత్తానికి  పాలకడలిలో  విష్ణమూర్తి నిద్ర కూడా కవితా వస్తువైనది.


                       ఇదండీ    విషయం!


                                                                   స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*సమయం వచ్చినప్పుడే

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


     శ్లో𝕝𝕝 *తావన్మౌనేన నీయన్తే*

           *కోకిలశ్చైవ వాసరాః* |

           *యావత్సర్వం జనానన్ద*

           *దాయినీ వాఙ్న ప్రవర్తతే* ||


తా𝕝𝕝 తనకు కూత వచ్చేవరుకు కోయిల మౌనంగా ఉండి రోజులు గడుపుతుంది.... కాలక్రమంలో మధురమైన స్వరంతో అందరినీ ఆకర్షిస్తుంది....అదే విధంగా *సమయం వచ్చినప్పుడే సందర్భోచితమైన మాట పలికి అందరినీ మెప్పించాలి... సమయం సందర్భం రానంతవరుకు మౌనం వహించడమే ఉత్తమం.*

24-07-2024 / బుధవారం / రాశి ఫలితాలు*

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


*24-07-2024 / బుధవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


ఆప్తుల  నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా  పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన విషయాలు తెలుసుకుంటారు.  వ్యాపారాలలో అంచనాలు  అందుకోవడానికి  చేసే  ప్రయత్నాలు సఫలమౌతాయి. దైవ చింతన పెరుగుతుంది. 

---------------------------------------

వృషభం


సన్నిహితులతో  ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు వేగంగా  పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహనాలు  కొనుగోలు చేస్తారు. వృత్తి  వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి.

---------------------------------------

మిధునం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి  ఖర్చులుంటాయి. చేపట్టిన పనులు  నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

కర్కాటకం


కుటుంబ విషయంలో ఆలోచనలు  స్థిరత్వం లోపిస్తుంది. బంధు  మిత్రులతో కలహా సూచనలున్నవి.  జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనులు  వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

సింహం


ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.  చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. దూరపు బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

కన్య


ముఖ్యమైన పనులు  సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో  పరిచయాలు విస్తృతమౌతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. నూతన వ్యాపార విస్తరణ  ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున అదనపు  బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది.

---------------------------------------

తుల


వృధా ఖర్చుల విషయంలో   పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత  మానసిక చికాకు కలిగిస్తుంది. ప్రారంభించిన  పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగాలలో వ్యయ  ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది.

---------------------------------------

వృశ్చికం


ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చిన్ననాటి మిత్రులతో  విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

ధనస్సు


ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా సాగుతాయి. బంధు మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు  లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది.

---------------------------------------

మకరం


బంధువుల ప్రవర్తన  కొంతచికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన  పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు అందక ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు.

---------------------------------------

కుంభం


ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు సానుకూల ఫలితాన్నిస్తాయి.  సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారములలో  స్వంతనిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తిఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

మీనం


సన్నిహితులతో  మాట పట్టింపులుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు రాణించక ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. చేపట్టిన  పనులలో జాప్యం కలుగుతుంది.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో అలోచించి మాట్లాడటం మంచిది.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

ఈ బ్లాగు మనందరిది

  ఈ బ్లాగు మనందరిది దీని అభివ్రుద్దికి మీ వంతుగా మీకు తొచిన ద్రవ్యం ఈ మొబైలు నంబర్కు 9848647145 డొనేటు చేయండి. 

విజయవాడలో వెలసిన

తే.గీ 

విజయవాడలో వెలసిన వేల్పులమ్మ

కష్ట సుఖములు కనవమ్మ కల్ప వల్లి

ఎదురు చూచెను భక్తాళి యెల్ల వేళ

కంటి కగుపింప రమ్ము మా కనక దుర్గ!:

 తే.గీ.

మోస మెరుగనివారికి ముదము గూర్చ

నీదు నామమే దిక్కని నిజమయినది

పరుగు లెత్తుదురుగ మూఢ భక్తితోడ

కంటికగుపింప రమ్ము,మా కనక దుర్గ!

అశ్వగంధ చూర్ణం

 అశ్వగంధ చూర్ణం దాని యొక్క ఉపయోగాలు - 


 *  చాలా మందికి సరిగ్గా మరియు సరైన నిద్ర ఉండదు . అటువంటి వారు సాదారణంగా మత్తు కలిగించే ట్యాబ్లేట్స్ వాడుతుంటారు. అవి క్రమక్రమంగా ఆరోగ్యం పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిద్రలేమి సమస్య తో బాధపడే వారు ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన మంచి ఫలితాలు పొందగలరు .


 *  దీనిని తెలుగులో పెన్నేరు అని కూడా అంటారు.దీని వేరు భాగంలో "samniferin " అనే రసాయనం ఉంది . ఇది మంచి నిద్ర కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.


 *  ఇది శరీరంలో వేడిని , వాతాన్ని తగ్గించును 


 *  జీర్ణక్రియ మీద దీని ప్రభావము ఉంటుంది. జీర్ణశక్తిని పెంచును. 


 *  పేగుల్లో మృదుత్వాన్ని తగ్గించును . 


 *  విరేచనం సాఫీగా అయ్యేలా చేయును . 


 *  విరేచనాలు అతిగా అవ్వకుండా చూస్తూ ప్రేగులకు హాని కలగకుండా కాపాడును.


 *  రక్తస్రావ సంబందించిన సమస్యలతో ఇబ్బందిపడేవారు మరియు రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడేవారు వారు వాడుతున్న మందులతో పాటు ఈ అశ్వగంధ వాడుతున్నట్లైతే తొందరగా ఫలితాలు వస్తాయి 


 *  వీర్యదోషాలకు కూడా మంచి మందుగా పనిచేయును . 


 *  శరీరంలో వేడిని మాత్రమే కాదు .జ్వరాన్ని కూడా తగ్గించును . 


 *  శరీరానికి అద్భుతమైన టానిక్ గా పనిచేయును . 


 *  వాతం , కీళ్లనొప్పులు , నడుమునొప్పి గలవారు వారు తీసుకునే మందులతో పాటు ఈ అశ్వగంధని వాడుకోవడం వలన శీఘ్రగతిన ఫలితాలు వస్తాయి. 


 *  థైరోయిడ్ గ్రంధి , గజ్జల్లో వచ్చే బిళ్లలు దాన్ని లింఫ్ గ్రంధుల వాపు వీటిపైన అశ్వగంధ బాగా పనిచేస్తుంది .


 *  మెదడు వ్యాధులు , నరాల జబ్బులు , వణుకుడు , మూర్చలు మొదలయిన జబ్బులతో బాధపడే వారు వైద్యుని సలహా మేరకు ఈ అశ్వగంధ వాడుకోవచ్చు . 


 *  తలతిరుగుడు , ఒళ్ళు తూలుడు , మగతగా ఉండటం , నిద్రపట్టక పోవడం , ఇవన్ని వాత సంబంధ సమస్యలు వీటికి అద్బుత ఔషదం ఈ అశ్వగంధ .


 *  గుండె జబ్బులు ఉన్నవారు , గుండె ఆపరేషన్ చేయిచుకున్న వారు , గుండెపోటు వచ్చి తగ్గి మందులు వాడుకుంటున్నవారు తెల్ల మద్ది చెక్క చూర్ణం , అశ్వగంధ చూర్ణం సమానంగా తీసుకుని ఆ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకొనిన మంచి ఫలితాలు వస్తాయి .


 *  స్త్రీల కుసుమ వ్యాదులు, తెల్లబట్ట , అతి రక్తస్రావం వంటి సమస్యల్లో స్త్రీలకు అశ్వగంధ చాలా ఉపయోగకరంగా ఉండును.


 *  చర్మవ్యాధుల్లో కూడా మంచి ఔషధంగా పనిచేయును . 


 *  క్షయవ్యాధి , పోలియో వ్యాధికి కూడా ఔషదాలతో పాటు ఇది వాడుకోవచ్చు . 


         పైన చెప్పినటువంటి యోగాలు మాత్రమే కాక మరెన్నో రోగములకు ఈ అశ్వగంధ చూర్ణం అత్యద్భుతంగా పనిచేయును. బయట షాపుల్లో దొరికే అశ్వగంధ చూర్ణం శుద్ధిచేయబడి ఉండదు. శుద్ధిచేయబడని చూర్ణం వాడటం వలన ఫలితాలు అంత తొందరగా రావు. ఫలితాలు త్వరగా రావలెను అనిన శుద్ధి చేయబడిన అశ్వగంధ చూర్ణాన్ని వాడవలెను. 


                మేలైన అశ్వగంధ గడ్డలను తీసుకొని వచ్చి శుభ్రముగా కడిగి బాగుగా ఎండించి స్వచ్ఛమైన దేశివాళి ఆవుపాలయందు ఉడికించి బాగుగా ఎండించవలెను. మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా 11 సార్లు ఉడికించి ఎండించి ఆ తరువాత మెత్తటి చూర్ణం చేయవలెను . 


          పైన చెప్పిన పద్ధతిలో తయారు చేసినటువంటి అశ్వగంధ చూర్ణం సంపూర్ణమైన ఫలితాలు అతి త్వరగా ఇచ్చును.  


       అవసరం ఉన్నవారికి మాత్రం చేసి ఇవ్వబడును.  మీకు ఈ చూర్ణం కావలెను అనినచో నన్ను సంప్రదించగలరు.  నా నెంబర్ 9885030034 కి ఫోన్ చేయగలరు. 


    ఈ అశ్వగంధ చూర్ణం 40 రకాల రోగాల మీద పనిచేయును . HIV సమస్యతో ఇబ్బంది పడుతున్న రోగులకు ఇది ఇచ్చినప్పుడు CD4 కౌంట్ పెరగడం జరిగింది . వారి శరీరం నందు వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా నీరసం , నిస్సత్తువ తగ్గాయి . ఈ చూర్ణముతో చాలా మందికి చికిత్స చేశాను . 


    కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

)నాడు* నేడు

 *🔵నాటి కాలం సినిమాల పేర్లు*


గుండమ్మ కథ,జయభేరి,లవకుశ, పాతాళ భైరవి,ఇల్లరికం, జగదేకవీరుని కథ,ఆరాధన,మిస్సమ్మ,బడి పంతులు,గుడి గంటలు,భక్త ప్రహ్లాద.



*🟣నేటి కాలం సినిమాల పేర్లు*


*రెండు రెళ్ళు ఆరు,ఆయన కిద్దరు,ఏమండీ ఆవిడొచ్చింది*,*ప్రేమించు కుందాం రా,మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది,నువ్వు నాకు నచ్చావు,కలిసుందాం రా,జంబ లకడి పంబ, కిత కితలు*


*⚫కాలాను గుణంగా మార్పులు సహజం.*.


*1)నాడు*...ఏమండీ,భోజనం చేశారా.

*నేడు*....తిన్నావా బాస్.


2) *నాడు*...ఏమోయ్,ఒక ప్లేట్ ఇడ్లీ,పెసరట్టు పట్టుకురా

*నేడు*.... బాస్,మంచూరియా,ఫ్రైడ్ రైస్.


3) *నాడు*..నమస్కారం అండి,బాగున్నారా.

*నేడు*.... హాయి,హౌ ఆర్ యు గురు.


✍✍మూర్తి's కలం.....

9985617100.

పంచాంగం 24.07.2024 Wednesday.

 ఈ రోజు పంచాంగం 24.07.2024 Wednesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస కృష్ణ పక్ష తృతీయా తదుపరి చతుర్ధి తిధి సౌమ్య వాసర: శతభిషా నక్షత్రం శౌభాగ్య యోగ: భద్ర తదుపరి బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


తదియ ఉదయం 07:30 వరకు తదుపరి చవితి రా.తె 04:39 వరకు.

శతభిషం సాయంత్రం 06:14 వరకు.


సూర్యోదయం : 05:57

సూర్యాస్తమయం : 06:48


వర్జ్యం : రాత్రి 12:07 నుండి 01:35 వరకు


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 11:57 నుండి 12:48 వరకు.


అమృతఘడియలు : పగలు 11:39 నుండి మధ్యాహ్నం 01:07  వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం  12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

పురముల గూల్చినాడ

 చం. పురముల గూల్చినాడనని భూతిధరా! శిఖరాననుంటివా

పురముల రూపధారులగు పోకిరులన్ దునుమాడమంచు నిన్ 

కరములనెత్తి లోకులిట కామద ! వేడుకొనంగ నీవు భీ 

కరులగు రాక్షసేంద్రులను కాలుని కంపితివీవె యీశ్వరా ! 8.


🙏🏻🙏🏻🙏🏻🙏🏻

✍️ కొరిడె విశ్వనాథ శర్మ ,

ధర్మపురి

గణనాథోద్భవము

 🙏 శ్రీ గణనాథోద్భవము!(మూలం: శ్రీ శివ మహాపురాణం.)

4.తే.గీ.

చెలియ మాటలతోనామె తలచె గతము, 

చాలహితకర మనుకొనెఁ చాన మదిని 

ముందరొకదిన మేకాంతమందు తాను, 

జలక మాడుచు నుండగా జరిగె వింత!!


భావము: చెలికత్తె మాటలు మంచివనితలచిన పార్వతికి గతము జరిగిన సంఘటనకూడా జ్ఞప్తి కివచ్చెను. ఒక దినము తానేకాంతమున స్నానము చేయుచున్నప్పు డొక వింత జరిగినది.

గురుదేవులు

 *గురుదేవులు*


సంధ్యావందనము 

చక్కగా నేర్పించి 

భువిలోన నడిపించు 

పూజ్యగురువు


శతకోటి గాయత్రి

శ్రద్ధగా నలవర్చి

మాన్యతన్ కాపాడు

మనిషి పరువు


ధర్మ వారధి తోడ 

మర్మ బోధలు జేసి

సత్య నిష్ఠను నిల్పు

నిత్య కొలువు


సామాజికాంశాలు

స్పష్ఠంబు లొనరించి

ప్రాణి కోటికి చూపు

బ్రతుకుతెరువు


పేర్మి గాయత్రి హవనమే పెద్ద చదువు


మండు సమిధలు  తొలగించు గుండె బరువు


ముక్తి నందించు మూర్తియే 

ముఖ్య గురువు


పరమ పావన స్ఫూర్తి!  సద్గురువు గురువు!


*ముత్య రామకృష్ణ*

*రాజమహేంద్రవరం*

తిరుగడు చిన్న సూరి చిన్న సూరి

 1417ఆ.

అల్ప విజయమైన నమితి యాడంబరి

గొప్ప యనుచు చాటు డప్పు కొట్టి

అధిక జయమునైన నతి నిరాడంబరి

చెప్పు కొని 1417ఆ.

అల్ప విజయమైన నమితి యాడంబరి

గొప్ప యనుచు చాటు డప్పు కొట్టి

అధిక జయమునైన నతి నిరాడంబరి

చెప్పు కొని తిరుగడు చిన్న సూరి చిన్న సూరి

నిత్యపద్య నైవేద్యం-1558 వ రోజు

 నిత్యపద్య నైవేద్యం-1558 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-193. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

ఆరోగ్యం విద్వత్తా 

సజ్జన మైత్రీ మహా కులే జన్మ:l

స్వాధీనతా చ పుంసాం 

మహదైశ్వర్యం వినాప్యర్ధై:ll


తేటగీతి:

సుఖపు స్వాస్థ్యము, విద్వత్తు, సుజనమైత్రి,

నెనరు కులమును, యింద్రియ నిగ్రహమును..

అయిదివి గలట్టి పేదవాడైనగాని 

అధికమగు ధనవంతుడే యవనిపైన.


భావం: ఆరోగ్యం, విద్వత్తు, సజ్జనమైత్రి, కులీనత అనగా కులం, ఇంద్రియ నిగ్రహం.. ఇవి ఉన్నవాడు పేదవాడైననూ మహా ఐశ్వర్యవంతుడే.

మహాభారత ప్రశస్తి

 మహాభారత ప్రశస్తి 


సీ. ధర్మస్వభావమ్ము దర్శించువారలు 

               సమ్మతింతురు  ధర్మశాస్త్ర మనుచు 

     పరమాత్మ జీవాత్మ లెరిగిన వారలు 

              దర్శింతు రిద్ది వేదాంత మనుచు

     నీతివిషయమందు నేర్పున్నవారలు 

               సన్నుతింతురు  నీతిశాస్త్ర మనుచు

     కవనమున్ జెప్పెడి కవిముఖ్యు లందఱు 

              గణియింతు రిది మహాకావ్యమనుచు 

     లక్ష్యంబు లెఱిగిన లాక్షణికవరులు

              నేర్తృ సకలలక్ష్యనిధి యటంచు 

     నైతిహాసిక బుద్ధులమరిన పండితు

              లరయుదు రిది యితిహాస మనుచు 

     సకల పురాణముల్ చదివెడి వారలు

               రహి చూతురు బహుపురాణ మనుచు 

ఆ. ఇట్లు సర్వ జనుల యిష్టంబు కొఱకును 

     విష్ణుసన్నిభుండు విమలమౌని 

     వివిధ తత్త్వ విషయ వేద్యుండు వ్యాసుండు 

     భారతమును జేసె భాసురముగ                   


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

దశరథాత్మజ శతకము (54)

 దశరథాత్మజ శతకము (54)


 సీ.భరతాగ్రజా !  రామ ! భానువంశ ప్రదీప !

                  నిరతమ్ము నినుగొల్తు నిగమవేద్య !

     తారకమంత్రమ్ము తలచిన మాత్రాన

                 పాపముల్ నశియించి పరము గల్గు  

     కౌసల్యనందనా ! కమనీయ గుణధామ !

                 కైవల్యమిచ్చినన్ గావు మయ్య

     భూమిజపతిరామ ! భువనైక మోహనా !

                 కోసలాధిప రామ ! కూర్మి  కొలుతు

తే.నీదునామమ్ము  దలచియు న్నిచ్చ లందు     

     బడసె కైవల్య పదము నా భక్త శబరి      

     భక్తితో నిన్ను  గొల్చిన ముక్తి గల్గు

     దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !


       జయలక్ష్మి  పిరాట్ల

పద్యతాంబూలం

 పద్యతాంబూలం


ఉచ్ఛనీచములను ఉత్తుత్తిగాజేయు  

సూత్రమంచు సుంత శుచియె లేక 

ఉమ్మి వేసినంత నుత్కృష్టమాయెనా? 

చెల్లుబాటు గాని సొల్లు కబురు..


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్


ఉత్పలమాల:

++++++

రాగలకార్యమెప్పటికి,రాకనుదప్పదుకాలవాహినిన్!

తీగగసాగుగానమది,తీయగ జేరును కర్ణమందునన్!!

సాగగదీయలేకనొక,చప్పుడుజేసెడుగార్ధభమ్ముకున్!!

“యీగలువడ్డపానకమెయెంతొ,హితంబొనఁగూర్చుగ్రోలినన్!!”


[24/07, 4:45 am] +91 94413 20381: ఉ.

శ్రీలు వరించు, సద్యశము చేకురు నాయతగౌరవంబు స

చ్ఛీలమహత్వయుక్తునకు జీవనమందున హర్షసంపదల్

మేలగు శక్తు లెప్డమరు మేదిని గావున మానవుండు సౌ

ఖ్యాలకు నర్రు చాచక శుభాత్మకుడౌ టుచితమ్ము మిత్రమా!


హ.వేం.స.నా.మూర్తి.

24.07.24.

[24/07, 4:50 am] +91 94411 49608: 2.

అతిసనాతన ధర్మమీ- యవనియందు

జగతికెల్లను పంచిన-జ్ఞానభూమి

భరతదేశంబు-విజ్ఞాన ప్రాభవంబు.

పతిత పావన!వేణుగోపాలదేవ!!



: శా॥

ఏమాలాస్యము కామునేర్చితిననియా యీశ్వర! నిక్కేలనో! 

కామాంధుల్ కలరెందఱో ప్రబలి ధిక్కారముం జేయుచున్ 

కామమ్మున్ ధనవృద్ధి స్వార్థతలపున్ గర్ముత్తు లర్థాలుగా 

మా మౌలిన్ విచలింతురయ్య పసన్ మాయించు నిన్మెచ్చెదన్ 

*~శ్రీశర్మద*

: *

లోక రీతి*60.

రచన: కీ.శే.గుడిసేవ నరసింహారావు గారు, ఉప్పల కలువగుంట*

గానం: కవి కోకిల కుమార సూర్యనారాయణ గారు విజయవాడ

60.ఉ.

విత్తులు మంచి వంగడమువిత్తుచు భూమిని విస్తరించుచున్

సత్తువ జూపుచున్ శ్రమల సాగును జేయుచు భూతలంబునన్

ఎత్తుగ ధాన్యరాసులను నేర్పడజేతురు కర్షకావళుల్

మొత్తము దేశ రక్షణకు మొమ్మదటన్

గల మేటి నాయకుల్

*క్రొత్త పలుకు-1*

 *క్రొత్త పలుకు-1*


అన్నదానమంత పున్నెము మరిలేదు 

ఉచితమంత చెఱుపులుర్వి లేవు 

శ్రమయె లేనినాడు సౌఖ్యమ్ము చేదౌను 

వినగ మంచిమాట వేదమౌను 

*~శ్రీశర్మద*

వరసమగుణాఢ్య

 ऊँ!

----

" కం.

--

వరసమగుణాఢ్య ఘనజవ 

విరసదనుజవిదరణ హరి వినుతకపివరా..

సరసిజముఖురఘుభక్తా

' సరగున రారమ్ముప్రోవజయహనుమంతా ' !!! "..23..

----

గురువు పద్యాలు

 డాక్టర్ దేవులపల్లి పద్మజ....గురువు పద్యాలు

విశాఖ,  9849692414


భవిత .....శ్రీ గురుదేవాయనమ:

గురువు నందు ధరణి కొలువు దీరు

(ఆట వెలది పద్యాలు)


తల్లి జన్మనిచ్చి చల్లగా పెంచును

తండ్రి వెంట నిలచి దన్ను నిచ్చు

గురువు విద్య నేర్పి గుణములు నేర్పును

గురువు నందు ధరణి కొలువు దీరు.


భోగ భాగ్యములను పొందుట కష్టము

తలచినంత రారు కుల దివిజులు

గురువు తలచినంత దొరకును సర్వము

గురువు నందు ధరణి కొలువు దీరు.


పసిడి తొడుగ రాయి పరమాత్మ రూపము

మట్టిలోని రాయి మలిన సమము

గురువులేని వాడు బరువగు నేలకు

గురువు నందు ధరణి కొలువు దీరు.


పూవులేని తొడిమ జీవరహితమగు

జలములేని కొలను విలువ లేదు

ఙ్ఞానరహిత నరుడు హీనుడై నిలచును

గురువు నందు ధరణి కొలువు దీరు.


కామధేనువు మరి కల్పవృక్షము కూడ

గురువు మనసునందు కొలువుదీరు

గురువునకు సరియగు గురుదేవులే సుమా

గురువునందు ధరణి కొలువు దీరు


కాకిపొదుగుచుండు కోకిల కూనను

వైరి పిల్లకైన పంచు ప్రేమ

గురువు సమత చూపి కరపును విద్యను

గురువు నందు ధరణి కొలువు దీరు