24, జులై 2024, బుధవారం

నిత్యపద్య నైవేద్యం-1558 వ రోజు

 నిత్యపద్య నైవేద్యం-1558 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-193. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

ఆరోగ్యం విద్వత్తా 

సజ్జన మైత్రీ మహా కులే జన్మ:l

స్వాధీనతా చ పుంసాం 

మహదైశ్వర్యం వినాప్యర్ధై:ll


తేటగీతి:

సుఖపు స్వాస్థ్యము, విద్వత్తు, సుజనమైత్రి,

నెనరు కులమును, యింద్రియ నిగ్రహమును..

అయిదివి గలట్టి పేదవాడైనగాని 

అధికమగు ధనవంతుడే యవనిపైన.


భావం: ఆరోగ్యం, విద్వత్తు, సజ్జనమైత్రి, కులీనత అనగా కులం, ఇంద్రియ నిగ్రహం.. ఇవి ఉన్నవాడు పేదవాడైననూ మహా ఐశ్వర్యవంతుడే.

కామెంట్‌లు లేవు: