*గురుదేవులు*
సంధ్యావందనము
చక్కగా నేర్పించి
భువిలోన నడిపించు
పూజ్యగురువు
శతకోటి గాయత్రి
శ్రద్ధగా నలవర్చి
మాన్యతన్ కాపాడు
మనిషి పరువు
ధర్మ వారధి తోడ
మర్మ బోధలు జేసి
సత్య నిష్ఠను నిల్పు
నిత్య కొలువు
సామాజికాంశాలు
స్పష్ఠంబు లొనరించి
ప్రాణి కోటికి చూపు
బ్రతుకుతెరువు
పేర్మి గాయత్రి హవనమే పెద్ద చదువు
మండు సమిధలు తొలగించు గుండె బరువు
ముక్తి నందించు మూర్తియే
ముఖ్య గురువు
పరమ పావన స్ఫూర్తి! సద్గురువు గురువు!
*ముత్య రామకృష్ణ*
*రాజమహేంద్రవరం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి