24, జులై 2024, బుధవారం

మంత్ర పుష్పం

 *మంత్ర పుష్పం గురించి చిన్న వ్యాఖ్య*


ధాతా పురస్త్యాద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చ తస్రః

తమేవ నమృతం ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే

ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ సంభువం

విశ్వం నారాయణ దేవమక్షరం పరమం పదం

విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిం

విశ్వమే వేదం పురుష తద్విశ్వ ముపజీ వతి 

పతిం విశ్వశ్యాత్మేశ్వరగ్ం శాశ్వతుగ్ం శివమచ్యుతం

నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం

నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః 

నారాయణ పరంబ్రహ్మ తత్వం నారాయణ పరః

నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః

యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేஉపివా 

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః

అనంత మవ్యయం కవిగ్ం సముద్రేంஉతం విశ్వశంభువం

పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయంచాప్యథోముఖం

అథోనిష్ట్యా వితస్త్యాన్త్యే నాభ్యాముపరి తిష్ఠతి 

జ్వాలమాలాకులంభాతి విశ్వశ్యాయతనం మహత్

సంతతగ్ం శిరాభిస్తు లంబత్యా కోశసన్నిభం

తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం 

తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః 

సోஉగ్రభుగ్విభజంతిష్ఠన్నాహార మజరః కవిః

తిర్యగూర్ధ్వ మథశ్శాయీ రశ్మయ తస్య సంతతా

సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః

తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః

నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా

నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా 

తస్యాశిఖాయామధ్యే పరమాత్మా వ్యవస్థితః    

స బ్రహ్మ స శివః స హరిః సేంద్రఃసోஉక్షరః పరమస్వరాట్


ఇప్పుడు మనం ఈ రెండు మంత్రాలను విశ్లేషించి వాటిని అర్థం చేసుకుందాం.


వేద +అహం +ఏతం +పురుషం +మహాంతమ్ 

ఋషి ఇలా అంటాడు "ఈ గొప్ప పురుషుడు నాకు తెలుసు....

ఆదిత్యవర్ణం +తమసః +తుపారే 

 సూర్యుని రంగు మరియు చీకటికి మించిన వాడు

సర్వాణి +రూపాణి + విచిత్య ధీరః 

తెలివైన పురుషుడు వివిధ రూపాలను సంభావితం చేస్తున్నాడు


నామాని కృత్వా +అభివదన్ +యత్ + ఆస్తే 

వీటికి పేర్లు కూడా ఇచ్చారు మరియు వారిని పిలుస్తున్నారు


ధాతా+ పురస్తాత్ +యం + ఉదాజహార

“సృష్టికర్త, స్థాపకుడు (బ్రహ్మ) ఆదిలో ఎవరిని ఆరాధించాడో


శక్రః +ప్రవిద్వాన్ + ప్రదిశః + చతస్రః |

శక్రుడు (ఇంద్రుడు) నాలుగు దిక్కుల నుండి ఎవరిని ఆరాధించాడో ఆ పురుషుడు తెలుసుకున్నాడు


తం + ఏవం + విద్వాన్ + అమృతః + ఇహ భవతి | ఈ పద్ధతిలో పురుషుడు అమరత్వం ఇక్కడ సాధ్యమవుతుందని తెలుసుకొని…


న +అన్యః +పన్థా + అయనయ +విద్యతే |

… విముక్తికి వేరే మార్గం లేదు”

ఇక విషయంలోకి వెడితే.....

 పూజ చేసేటప్పుడు చిట్టచివర చేతిలో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాం. పూజ చేసేటప్పుడు కూర్చుంటాం. అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వులను మంత్రపుష్పం అంటారు. 

దివ్య పురుషుడిని తెలుసుకోవడం మరియు అనుభవించడం మాత్రమే అమరత్వానికి ఏకైక మార్గం అని ఋషి స్పష్టంగా ధృవీకరించాడు.

పువ్వు జ్ఞానమునకు గుర్తు. జ్ఞానం కలిగితే వికసనం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత. 

పువ్వు జ్ఞానమునకు గుర్తు. జ్ఞానం కలిగితే వికసనం కలుగుతుంది.జ్ఞానము చేత బుద్ధి వికసిస్తుంది  


అంటే మంత్రం అనే పుష్పం ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేటట్లు చేయమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు. అది మంత్రపుష్పం. 


మంత్రపుష్పంలో ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్తాం – ‘ నాన్యః పంథాయనాయ విద్యతే’ – ఈశ్వరుడిని తెలుసుకోవడానికి ఇంకొక మార్గం లేదు. నీ ఎదురుగుండా పెట్టి నువ్వు ఇప్పటివరకూ ఎవరిని పూజ చేశావో అసలు వాడు ఎక్కడ ఉంటాడో నువ్వు తెలుసుకుంటే అది ఒక్కటే వాడిని తెలుసుకొనే మార్గం. 


ఎక్కడ ఉన్నాడు అంటే ‘హృదయం చాప్యధోముఖం’ – యోగవిద్యను కలిగిన వాడు తెలుసుకుంటాడు. వంగిన తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ‘నాభ్యాం ఉపతిష్టతి’ – చిటికెన వ్రేలు బొడ్డుదగ్గర పెట్టుకుని బొటనవ్రేలు పైకి పెడితే బొటనవ్రేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన మొగ్గ అక్కడికి వస్తుంది. దాని చివర ఒక చిన్న బిందువు ఉంటుంది. ‘నీవార,... పీతాభా స్వస్త్యణూపమా’ ‘తస్య మధ్యే – మధ్యలో ఒక చిన్న ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కాంతి, ఆ వెలుగు ‘ఊర్ధ్వ మూల మధశ్శాయీ’ – దానికాంతి పైకి వ్యాపిస్తుంది , క్రిందకి వ్యాపిస్తుంది , ప్రక్కకు వ్యాపిస్తుంది . ఆ కాంతి ఏదో అది జీవాత్మ . 


‘స బ్రహ్మః స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్’ – ఏ పేరు పెట్టి పిలు అభ్యంతరం లేదు. కానీ ఆ వెలుగు ఉన్నదే అది పరమాత్మ. అది ఎక్కడ ఉంది? – అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’. కాబట్టి నిజంగా ఈశ్వరుడిని చూడాలంటే కళ్ళు తెరిస్తే కనబడడం కాదు. కళ్ళు మూతలుపడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు కనబడుతుంది. వాడు ఈశ్వరుడు. 

వాడు సమస్త ప్రాణికోటియందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు. 

అప్పుడు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఉన్నది ఒక్కటే అది ఎరుకలోకి వచ్చింది. అద్వితీయం – రెండవది లేదు. అద్వైతం – రెండు కానిది. ఒక్కటే. ఒక్కటి అంటే అది ఒకటి ఇది ఒకటి అని అంటారేమో అని రెండు కానిది అన్నారు.  అద్వితీయానుభూతిలోకి వెళ్ళడానికి ఇది ఒక్కటే సాధనం. అందుకు అది మంత్రపుష్పం.

కామెంట్‌లు లేవు: