6, నవంబర్ 2023, సోమవారం

కృతజ్ఞత

 *కృతజ్ఞత*



“కృతజ్ఞత” అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచిపోకుండా ఉండటం. 


మనం, 

ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, 

ఏదో ఒక సహాయం మనకు అవసరమైనపుడో, 

మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. 


మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదారులు కొందరుంటారు. 


వీరికెప్పుడూ, 

మనం కృతజ్ఞులమై ఉండాలి. 


కృతజ్ఞత అనేది నాగరిక సంస్కారం.


వాల్మీకి, రాముణ్ణి వర్ణిస్తూ “ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ” అన్నాడు. 


సీతమ్మను అపహరించు కొనిపోతున్న రావణునితో పోరాడి ఆ సమాచారాన్ని రామునికి చెప్పి ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు రాముడు కృతజ్ఞతతో అంతిమసంస్కారం చేశాడు.


రావణ సంహారంలో తనకు తోడ్పడిన వానరుల కోసం,


ఈ వానరులు, ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధురఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్లు, 

అక్కడి నదులలో నిరంతరం స్వాదుజలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వవలసిందిగా, 

రాముడు ఇంద్రుణ్ణి కోరాడు.


ఇదీ ఆయన కృతజ్ఞతా లక్షణం.


మహాభారతం లో,


దగ్ధమైన లాక్షాగృహం లోంచి ప్రాణాలతో బయటపడి,


ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో, 

తన కుమారులతో తల దాచుకుంటున్న కుంతి, 


తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా, 

అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించిన సందర్భంలో కుంతీదేవి తన ఒక కుమారుడను రాక్షసుడుకు ఆహారముగా పంపడం ద్వారా కృతజ్ఞత తెలియజేసింది.


ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, 


దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, 


వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం అంటుంది ధర్మం.


“ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం”

అనే చందంగా కాకుండా, 


మన ఉనికికి, ఉన్నతికి కారకులైన వారిపట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. 


ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి , 

విధివశాత్తూ ఒక కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే,


అతని యందు సకాలంలో, 

అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే, 

అది కృతఘ్నత ఔతుంది. 


ఈ విషయాన్ని మహాభారతం అనుశాసనికపర్వంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు చెప్పాడు.


ఒక బోయవాడు వేటకు వెళ్ళి "ఘనతర విషదగ్ధ శరం" తో ఒక మృగాన్ని కొట్టబోయాడు. 

అది గురి తప్పి ఒక చెట్టును తాకింది. 

పువ్వులతో, కాయలతో పచ్చగా ఉన్న ఆ వృక్షం, విష శరాఘాతం వల్ల నిలువునా శుష్కమైపోయింది. 


ఆ చెట్టే ఆశ్రయంగా, 

దాని తొర్రలో నివాసముంటున్న ఒక మహాశుకం, 

దానిని వదలలేక దాని మీదనే ఉండిపోయింది. 


దీనిని గమనించిన ఇంద్రుడు మానుషరూపంలో దాని దగ్గరకు వెళ్ళి,


ఓ కీరమా! ఈ వృక్షం బెండువారి పోయింది. 


ఫలసంపద గల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో ఉండగా, 

ఇంకా దీనినే అంటిపెట్టుకున్నావెందుకు..?

అని అడిగాడు.


అపుడా శుకం, 

ఈ చెట్టు తాను మధురఫలాలతో నిండిఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చింది.


ఈవేళ ఇది ఎండిపోయిందని, నేను దీనిని వదలి వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా! అనిమిషనాథా! అంది. 


తాను మానుషరూపంలో వచ్చినా 

"పురాకృత సంజనిత విశేషము" చేతనే, 

ఈ మహాశుకం తనను ఇంద్రునిగా పోల్చుకోగలిగిందని ఆశ్చర్యపోయి,


నీ మాటలకు మెచ్చాను, నీకేం కావాలో కోరుకో, 

అన్నాడు ఇంద్రుడు. 


అపుడా మహాశుకం,

ఈ వృక్షానికి మేలు చెయ్యి, చాలు. అంది. 


ఇంద్రుడు సంతోషించి, 

అమృతసేచనంతో ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను, ఫలసంపదను కలుగజేశాడు.


ఈ కథ వల్ల, 

ఉత్తములైన ఆశ్రితులు, 

ఆశ్రయదాత క్షేమాన్ని కోరుకోవాలని,

కృతజ్ఞత ఉత్తమలక్షణమని తెలుస్తోంది. 


సజ్జనులు, 

ఇతరులు తమకు చేసిన ఉపకారాన్ని మరచిపోరు.


🙏 సర్వే జనా సుఖినోభవంతు🙏

అనన్తపారం

 అనన్తపారం నవనీతకుమ్భం,

పరాత్మతత్త్వార్థసుబోధమార్గమ్।స్పృహానుసారం తు హి దీయమానం,

రసాలయం భాగవతం మహాన్తమ్।।(కంచినాథమ్)

భావం-అంతులేనటువంటిది శ్రీమద్భాగవతనవనీతకుంభము.పరబ్రహ్మతత్త్వార్థాన్ని సులభముగా బోధించు మార్గము .ఎవరికి ఎంతకావాలంటే అంతనవనీతజ్ఞానామృతము ఇచ్చేటటువంటిది శ్రీమద్భాగవతము.నవనీతామృతజ్ఞానరసాలయం శ్రీమద్భాగవతము.

        అటువంటి మహత్తరమైన ఎంతతోడినా తరగని జ్ఞానామృతసాగరాన్ని మాబోటివారలకు పంచిపెట్టినందులకు ఇస్కాన్ కృష్ణభక్తపరంపరకు,దాతలకు హృదయపూర్వకకృతజ్ఞతాభివందనములు.

Panchaag


 

శ్రీ సిద్ది వినాయక గణేష్ మందిర్


 🕉 మన గుడి : నెం 231



⚜ గోవా : కండోలిమ్


⚜ శ్రీ సిద్ది వినాయక గణేష్ మందిర్


💠 గోవా యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక రత్నాలను అన్వేషించే విషయానికి వస్తే, శ్రీ సిద్ధివినాయక్ గణేష్ దేవాలయం ఉత్తర గోవాలో తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశంగా నిలుస్తుంది. 

మీరు ఓదార్పు కోరుకునే ప్రయాణీకుడైనా లేదా ఉల్లాసమైన ఉత్సవాల్లో మునిగితేలాలని చూస్తున్న సాంస్కృతిక ఔత్సాహికులైనా, 

ఈ ఆలయం మరెవ్వరికీ లేని అనుభూతిని ఇస్తుంది.


💠 ఉత్తర గోవా నడిబొడ్డున నెలకొని ఉన్న శ్రీ సిద్ధివినాయక్ గణేష్ దేవాలయం పంజిమ్ సిటీ సెంటర్ నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ఆలయం సందర్శకులను ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకునివెళ్తుంది.


💠శ్రీ సిద్ధివినాయక్ గణేష్ ఆలయంలో ఉత్సాహభరితమైన పండుగలను అనుభవించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, గణేష్ చతుర్థి సమయంలో సందర్శించడానికి ఉత్తమ సమయం . 

ఇది సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో వస్తుంది . 


💠 ఆలయం ప్రశాంతతను వెదజల్లుతుండగా, పండుగ సీజన్లలో రంగురంగుల వేడుకల కేంద్రంగా  మారుతుంది. 


💠 శ్రీ సిద్ధివినాయక గణేష్ దేవాలయంలో ఉత్సవాల సాక్ష్యం మరెక్కడా లేని సాంస్కృతిక అనుభూతి. 

ప్రజల ఉత్సాహం మరియు భక్తి మీ సందర్శనకు ఒక ప్రత్యేక ఆకర్షణను జోడిస్తాయి. సంప్రదాయాలలో మునిగిపోండి, ఉల్లాసమైన ఊరేగింపులను చూసుకోండి మరియు ఈ సమయాల్లో ప్రసరించే సామూహిక ఆనందాన్ని అనుభవించండి.


💠 రంగుల ఊరేగింపులు: 

గణేష్ చతుర్థి సందర్భంగా, ఆలయం మరియు దాని పరిసరాలు వీధుల గుండా గణేశ విగ్రహాన్ని తీసుకువెళ్ళే రంగురంగుల ఊరేగింపులతో ముస్తాబు చేస్తారు.

సాంప్రదాయ సంగీతం, నృత్య ప్రదర్శనలు మరియు ఉత్సాహభరితమైన కవాతులను చూసేందుకు భక్తులు మరియు చూపరులు గుమిగూడుతారు.


💠 ఆచారాలు మరియు నైవేద్యాలు: 

పండుగ అంతటా, ఆలయం ప్రత్యేక ప్రార్థనలు, ఆర్తి (దీపాలతో పూజించడం), మరియు భజనలు (భక్తి పాటలు) సహా వివిధ ఆచారాలు మరియు వేడుకలను నిర్వహిస్తుంది. 

భక్తులు గణేశుడికి తమ భక్తికి చిహ్నంగా మోదకం (తీపి ప్రసాదం), పువ్వులు మరియు కొబ్బరికాయలు వంటి నైవేద్యాలను తీసుకువస్తారు.


💠 మీరు గోవాకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ ప్రయాణంలో శ్రీ సిద్ధివినాయక్ గణేష్ ఆలయాన్ని తప్పకుండా చేర్చుకోండి. 


💠 పంజిమ్‌కి సామీప్యత కారణంగా దీనిని సులభంగా చేరుకోవచ్చు మరియు 12 కిలోమీటర్ల ప్రయాణం ఈ ప్రాంతం యొక్క సుందరమైన అందాలను చూసేందుకు ఒక అవకాశంగా ఉంటుంది.

విదురనీతి

  విదురనీతి

శ్లో)కిం వై సహైవం చరథో న పురాచరథః సహ 

విరోచనైతత్ పృచ్ఛామి కింతే సఖ్యం సుధన్వనా॥


అ)మీరు ఇదివరకెప్పుడు కలిసి తిరుగలేదు. ఇప్పుడిలా కలిసి తిరుగుతున్నారు. విరోచనా! నీకు సుధన్వునితో స్నేహం కలిసినదాయేమి?

 ఉద్ధవగీత

శ్లో)యః స్వదత్తాం పరైద్దత్తాం హరేత సురవిప్రయోః 

 వృత్తిం స జాయతే విడ్భుగ్వర్షాణామయుతాయుతమ్ ॥ 


అ)స్వదత్తము లేదా పరదత్తము నగు దేవతావృత్తిని, బ్రాహ్మణ వృత్తిని హరించువాడు కోట్లకొలది సంవత్సరముల వఱకు మలమును భక్షించు క్రిమియై జన్మించును.

దేవుడు అంతటావున్నాడు

 

 *దేవుడు అంతటావున్నాడు*

                   ➖➖➖✍️


*”భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు?”*


*ఒకసారి వివేకానందుడు ఇప్పుడున్న రాజస్తాన్ లో వున్న అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళాడు.*


*విగ్రహారాధానని వెక్కిరించడానికి ఆ రాజు వివేకానందునితో…  ‘నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు, రాయినీ, రాప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు, కేవలం సమయం వృధా చేసికుంటున్నారు’ అన్నాడు.*


*స్వామీజీ నవ్వుతూ స్పందించారు.*


*రాజు సహాయకుడిని అక్కడ గోడకి వ్రేలాడుతూ వున్న రాజు చిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు.*


*అయోమయం లో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేసారు.*


*అప్పుడు స్వామీజీ ఆ పటం పై వుమ్మివేయమని రాజు సహాయకుడిని ఆదేశించారు.*


*నిర్ఘాంత పోయిన సహాయకుడు రాజు వైపూ, స్వామీజీ వైపూ చూస్తూ ఉండిపోయాడు.*


*స్వామీజీ మళ్ళీ, మళ్ళీ ఆదేశించారు. ప్రతీ సారీ మరింత తీవ్రంగా ఆదేశించ సాగారు.*


*రాజు ఆగ్రహోద్రకుడవుతున్నాడు, సహాయకుడు వణికి పోతున్నాడు.*


*చివరికి సహాయకుడు ‘నేను ఈ పటం పై ఎలా ఉమ్మగలను? పటం లో వున్న చిత్రం లో    మా రాజు వున్నారు అంటూ అరిచాడు.*


*అప్పుడు స్వామీజీ ‘రాజు నీ ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చుని వున్నారు. ఆ పటం లో వున్నది ఒక కాగితం మాత్రమే అది మాట్లాడలేదు, వినలేదు, కదలలేదు. కానీ నువ్వు ఆ పటం పై ఉమ్మి వేయనంటు న్నావు, ఎందుకంటే నువ్వు ఆ పటం లో నీ రాజు ని చూసుకుంటున్నావు కాబట్టి ఉమ్మి వేయనంటు న్నావు. ఆ పటం మీద ఉమ్మితే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు’ అన్నారు.*


*స్వామీజీ ని చూసిన రాజు సామీజీ ముందర సాష్టాంగ పడ్డాడు, స్వామీ చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్ధమయిందని ఆ రాజు చెప్పాడు.*


*ఇదే విగ్రహారాధన యొక్క సారము.*


*భగవంతుడు అన్నిచోట్లా వున్నాడు. కానీ మనం ఆయనని పూజించాలను కుంటాము, కోరికలను కోరాలను కుంటాము, నివేదన చేద్దామను కుంటాము, కధలు చెప్పాలని అను కుంటాము, స్నానం చేయించాలని అనుకుంటాము, ఆడుకోవాలను కుంటాము.*


*మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము.*


*విగ్రహం రూపంలో వున్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడు గానూ, మార్గ దర్శకునిగానూ, స్నేహితుని గానూ, రక్షకునిగానూ, ప్రసాదించే వానిగానూ, సాటి మనిషి గానూ భావించుకుంటూ ఉంటాము.*


*విగ్రహము మనం చూడగలిగే యదార్ధ  ప్రతినిధి.*


*నేను ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు, నాకది రాయిలాగానో, లోహం లాగానో కనిపించదు. మరొక జత కన్నులు  ప్రేమతో నన్ను  నవ్వుతూ  చూస్తున్నట్లు అనిపిస్తుంది.*


*అద్భుతమైన సందేశం, దయచేసి చదవండి మరియూ పంచండి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


: విగ్రహారాధన వ్యతిరేకించే వారికి ఈ msg ఒక కనువిప్పు కలగాలి

గుండెదడ , నీరసము

 గుండెదడ , నీరసము హరించుటకు సులభ ఔషధ యోగము  - 


       క్యారెట్ మెత్తగా దంచి రసము తీసి , 50 రసము నందు 20 గ్రాముల పటికబెల్లం చూర్ణము కలిపి పూటకు ఒక మోతాదు చొప్పున ఉదయము మరియు సాయంత్రం రెండు పూటలా తాగుచున్న గుండె దడ , నీరసం , నిస్సత్తువ హరించును . 


       పైన చెప్పిన సులభ యోగము వలే మరెన్నో అద్భుత సులభయోగాలు నేను రచించిన గ్రంథాల యందు సంపూర్ణముగా ఇచ్చాను. 


 

   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034 


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


            9885030034

పండుగల గొప్పతనం

 _*మన పండుగల గొప్పతనం తెలుసుకోండి..........!!*_

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


 *ఉగాది:-*  కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.


 *శ్రీరామ నవమి:-* భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.


 *అక్షయ తృతీయ:-* విలువైన వాటిని  కూడబెట్టుకోమని.


 *వ్యాస (గురు) పౌర్ణమి :-*  జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.


 *నాగుల చవితి;-* ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.


 *వరలక్ష్మి వ్రతం :-*  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.


 *రాఖీ పౌర్ణమి:-* తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.


 *వినాయక చవితి ( నవరాత్రులు ) :-*  ఊరంతా ఒక్కటిగా కలవడానికి.


 *పితృ అమావాస్య:-* చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.


 *దసరా ( ఆయుధ పూజ)  :-* ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.


 *దీపావళి :-*  పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.


 *కార్తీక పౌర్ణమి :-*  చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.


 *సంక్రాంతి :-*   మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.


 *మహాశివరాత్రి :-*  కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.


 *హోలీ :-*   వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు,  పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.


ఇవే కాక, ప్రతీ నెల వచ్ఛే

*👉రెండు ఏకాదశిలు*,

*👉సంకష్ట హర చతుర్థి*,

*👉మాస శివరాత్రి,*

*👉ప్రాదోశ వ్రతం,*

ఇలా చిన్న పెద్ద అన్ని పండుగలు, వ్రతాలు, మొదలగునవి..... 


 *👉ప్రతి హిందువు, ప్రతి పండక్కి, కష్టమైనా, తీరిక చేసుకొని, హిందూ సంప్రదాయాన్ని, భావితరాలకు, మీ పిల్లలకు గుర్తుండే విధంగా, వాళ్లతో కలిసి మెలిసి పండగ చేసుకోవాలని, మన పెద్దల ఆచారాన్ని, నమ్మకంతో పాటిస్తాం, తప్పకుండా జరుపుకుంటాం.*

 

*ఇదే మన ధర్మం గొప్పతనం*. *హిందువులమని గర్విద్దాము .* *హిందువులుగా జీవిద్దాము* .

🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐

సిరిసంపదలతో తులతూగేటప్పుడు

 *1978*

*కం*

సిరులను తులతూగునపుడు

సరిగానగుపడ దు జగము( రు హితులు) జనులకు నెపుడున్.

సిరిదరివీడగ జనులను

మరిగానక రాదు జగము(రారెవరును) మహిలో సుజనా.

*భావం*:-- ఓ సుజనా! సిరిసంపదలతో తులతూగేటప్పుడు జనులకు ప్రపంచం(శ్రేయోభిలాషులు) సరిగా కనబడదు(రు). అదే సిరిసంపదలు పోయినప్పుడు ఈ భూలోకంలో ఆ జనులను చూడటానికి ప్రపంచం రాదు ( ఎవ్వరూ రారు).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



మహానుభావులారా! మీరు దేవతలు. సూర్యభగవానుడి పుత్రులు. సర్వజ్ఞులు. సురసమ్మతులు.

నావంటి సౌశీల్యవతిని మీరు ఇలా భావించడం తగదు. స్వయంగా ఇష్టపడి పెద్దల సమ్మతితో ఒక

యోగీశ్వరుణ్ణి పరిణయమాడాను. నేను అపమార్గం తొక్కలేను. సర్వలోకద్రష్ట సర్వకర్మసాక్షి అయిన

దివాకరుడికి పుత్రులై జన్మించిన మీరు ఇలా మాట్లాడకూడదు. సమంజసంకాదు. నేను కులస్త్రీని భర్తను

విడిచిపెట్టి పరుణ్ణి వరిస్తానా? ఈమాట అనడానికి మీకు నోరు ఎలావచ్చింది? అసారమైన ఈ సంసారంలో

ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో ఆమాత్రం తెలుసుకోలేకపోయారా? ఇక చాలు. సంతోషించాను మీ

తెలివితేటలకి. మర్యాదగా, వచ్చినదారిని వెళ్ళండి. లేదంటే శపిస్తాను. జాగ్రత్త. నేను సుకన్యను.

శర్యాతిమహారాజు కూతురిని. చ్యవనమహర్షి ఇల్లాలిని.


యథేచ్ఛం గచ్ఛతం దేవౌ శాపం దాస్యామి వానఘౌ |

సుకన్యాహం చ శర్యాతే: పతిభక్తిపరాగయణా॥

493

(5-6)

నాసత్యులు నివ్వెరపోయ ఈవిడే శపిస్తుందో చ్యవనుడే శపిస్తాడో అని భయపడ్డాడు.

తెలివిగా ఈవిడను ప్రసన్నురాలిని చేసుకుని తప్పించుకుందామని నిశ్చయించుకున్నారు.

+ దేవీమహిమతో పరీక్షలో నెగ్గిన సుకన్య

సాధ్వీమణీ! విజయం సాధించావు. నీ సౌశీల్యానికి ప్రసన్నులమయ్యాం. నీ శ్రేయస్సు కోరినవాళ్ళం.

ఏదైనా వరం కోరుకో. ఇస్తాం. మేము అశ్వినులం. దేవవైద్యులం. తెలుసుగదా! నీ భర్తను రూపయౌవన

సంపన్నుడైన యువకుడుగా మార్చేస్తాం. మాతో సమానుణ్ణి చేస్తాం. అప్పుడు మా ముగ్గురిలో నీ భర్తను 

గుర్తుపట్టి నీ చాతుర్యం చూపించు. సంతోషిస్తాం.

ఇప్పుడు ఆశ్చర్యపోవడం సుకన్యవంతు అయ్యింది. త్వరత్వరగా వెళ్ళి ఈ అద్భుతాన్ని తన 

భర్తకు విన్నవించింది. నాథా! ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? దేవమాయ దుర్భయమంటారు. ఇదేమన్నా

అశ్వినుల కపటోపాయమా? నాకేమీ తెలియడంలేదు. అంతా అయోమయంగా ఉంది. నువ్వు సర్వజ్ఞుడవు.

ఆజ్ఞాపించు. నువ్వు ఏమి చెయ్యమంటే అది చేస్తాను. నీ అభీప్సితమేమిటో తెలియజెయ్యి- అని అభ్యర్థించింది

Bhagavthgeeta yenduku


 

జ్ఞానమార్గంలో

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ప్ర: జ్ఞానమార్గంలో ఉన్నవారు క్షేత్ర తీర్థయాత్రలు చేయాలా?

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

జ: 'మార్గం'లో ఉన్నారు కనుక, గమ్యాన్ని చేరడానికి తీర్థక్షేత్రయాత్రలు సహకరిస్తాయి. చిత్తశుద్ధి కలిగితే కానీ జ్ఞానం లభించదు. చిత్తశుద్ధికి తోడ్పడే నిత్యనైమిత్తికాది కర్మలతోపాటు, తీర్థక్షేత్ర యాత్రలు కూడా ప్రాముఖ్యాన్ని వహిస్తున్నాయి.

అంతేకాదు జ్ఞానసిద్ధిని పొందిన తరువాత కూడా జీవన్ముక్తులు పవిత్రభూముల్లో సంచరిస్తుంటారు. వారివలన తీర్థాలకు మరింత శక్తి కలుగుతుంది. జ్ఞాన, ధ్యాన, భక్తి సాధనల్లో దేనికైనా తీర్థక్షేత్రయాత్రలు సహకరిస్తాయి. పవిత్రక్షేత్రాదులలో సహజంగా ఉండేశక్తి, శీఘ్రంగా పాపక్షయం చేసి, సాధనను త్వరగా, పూర్ణంగా ఫలింపజేస్తుంది.

జ్ఞానమార్గగాములు, జ్ఞానసిద్ధిని పొందిన వారు మహాత్ములు శ్రీరమణమహర్షి అరుణాచల క్షేత్రానికి చేరడం, అక్కడే జ్ఞానసిద్ధినీ, నిర్యాణాన్నీ కూడా పొందడం- ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. యుగాలనుండి వివిధ ఆధ్యాత్మిక మార్గాల్లో సాధన చేసినవారు, సిద్ధి పొందినవారు - ఎందరో యోగులు, మహర్షులు, తపస్సులు తీర్థ క్షేత్రాలను ఆశ్రయించిన పురాణగాథలు ఎన్నో ఉన్నాయి. చారిత్రకంగా నేటికీ అందుకు తార్కాణాలున్నాయి. ఏ విధమైన ఆధ్యాత్మిక సాధనకైనా పుణ్యక్షేత్ర, తీర్థ యాత్రలు బలాన్నిస్తాయి, ఫలాన్నిస్తాయి అనడంలో సందేహం లేదు. దీనికి శాస్త్ర ప్రమాణమూ, మహాత్ముల అనుభవ ప్రమాణములూ ఉన్నాయి.

అతిథికి స్వాగతం

 *_𝕝𝕝ॐ𝕝𝕝 - సుభాషితమ్- 𝕝𝕝卐𝕝𝕝_* 


శ్లో𝕝𝕝 స్వాగతేనాగ్నయ స్తృప్తా ఆసనేన శతక్రతుః। 

పాదశౌచేన పితరః అర్ఘ్యాచ్ఛమ్భుస్తథాతిథేః॥


*--- _పఞ్చతన్త్రమ్_ ---*


తా𝕝𝕝 అతిథికి స్వాగతం పల్కడంతో అగ్ని, ఆసనదానంతో ఇంద్రుడు, పాదాలు కడుగడంతో పితృదేవతలు, అర్థ్యంతో (ఫల, పుష్ప నైవేద్యాదులచే) పరమేశ్వరుడు సంతోషం పొందుదురు...

Rendu naadulu


 

ప్రపంచం సరిగా కనబడదు

 *1978*

*కం*

సిరులను తులతూగునపుడు

సరిగానగుపడదు జగము జనులకు నెపుడున్.

సిరిదరివీడగ జనులను

మరిగానక రారెవరును(రాదు జగము) మహిలో సుజనా.

*భావం*:-- ఓ సుజనా! సిరిసంపదలతో తులతూగేటప్పుడు జనులకు ప్రపంచం సరిగా కనబడదు. అదే సిరిసంపదలు పోయినప్పుడు ఈ భూలోకంలో ఆ జనులను చూడటానికి ఎవరూ (ప్రపంచం) ఉండరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Yedi raadu


 

Mokalla noppulaku vidyam


 

Naama smarans


 

Vaaminta for cough


 

Mothers love


 

Manisamudra


 

Yestari platlu


 

Bhagavantudu isthaadu


 

Dantaalu gattigaa vuntaayi


 

Yemi tinasli


 

Vantakam


 

_నవంబరు 6, 2023_*

 ॐశుభోదయం, పంచాంగం ॐ 

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

   *_నవంబరు 6, 2023_* 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం**శరదృతువు*

*ఆశ్వయుజ మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *నవమి* మంగళవారం

తె5.18 వరకు 

వారం: *ఇందువాసరే*

(సోమవారం)

నక్షత్రం: *ఆశ్లేష* మ2.09

యోగం: *శుక్లం* సా4.03

కరణం: *తైతుల* సా4.18

*గరజి* తె5.18

వర్జ్యం: *తె3.27-5.13*

దుర్ముహూర్తము: *మ12.06-12.51*

*మ2.22-3.07*

అమృతకాలం: *మ12.23-2.09*

రాహుకాలం: *ఉ7.30-9.00*

యమగండం: *ఉ10.30-12.00*

సూర్యరాశి: *తుల*

చంద్రరాశి: *కర్కాటకం*

సూర్యోదయం: *6.04*

సూర్యాస్తమయం: *5.24*

  లోకాః సమస్తాః*

 *సుఖినోభవంతు*

Two ladies in a man's life


 

Very exciting experience in China


 

06-11-2023* *రాశి ఫలితాలు

 *06-11-2023*

*రాశి ఫలితాలు*

*సోమవారం ఇందు వాసరః*

*మేషం*

ముఖ్యమైన  కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాదిక్యాతతో దూరప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మిత్రులతో  చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

*వృషభం*

ప్రయాణాలలొ మార్గావరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిదికాదు. ప్రత్యర్థుల నుంచి ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచనాలు కలుగతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

*మిధునం*

దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి  శుభవార్తలు అందుతాయి.  ఆర్థిక పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 

*కర్కాటకం*

ఆదాయనికి మించి ఖర్చులుంటాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. బంధువులతో ఆకారణ విభేదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చికాకు పరుస్తాయి. మానసిక ప్రశాంతతకు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు మండకొడిగా సాగుతాయి.

*సింహం*

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వాహన  కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి.

*కన్య*

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమధిక్యత పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు.  మిత్రులతో కలహా సూచనలున్నవి. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

*తుల*

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ సభ, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలొ శుభవార్తలు అందుతాయి.

*వృశ్చికం*

నిరుద్యోగ  ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

*ధనస్సు*

కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ముఖ్యమైన పనులలో కార్యాటంకములు కలుగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి.

*మకరం*

వ్యయప్రయాసలతో పనులు పూర్తి కావు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. వృథా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

*కుంభం*

ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆకస్మిక ధనలాభలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

*మీనం*

నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. విందువినోదాది కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు.

🕉️

కాలభైరవుని నేను భజిస్తున్నాను

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 


*శ్లోకం*


*_ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశనం_*

*_కర్మపాశమోచకం సుశర్మధాయకం విభుమ్_*

*_స్వర్ణవర్ణశేషపాశ శోభితాంగమండలం_*

*_కాశికాపురాధినాథకాలభైరవంభజే......_*


_ *_శ్రీ కాలభైరవాష్టకమ్ - 05_* _


 *భా:  ధర్మమనే సేతువును పాలించేవాడు, అధర్మ మార్గములను నాశనము చేసే వాడు, కర్మ బంధములనుండి తప్పించే వాడు, మనము చేసే తప్పులను తెలియచేసి మనకు సిగ్గును కలిగించే వాడు, బంగారు రంగులో ఉన్న పాశము, సర్పములు దేహ భాగములకు ఆభరణములుగ కలిగిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

అనంతగిరి కొండల్లో

 https://youtu.be/yMdDbwA8sP0?si=W4hNWnc5GORgrnhJ


 అనంతగిరి కొండల్లో అభయమిచ్చే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దివ్య చరిత్ర మన అఖండ జ్యోతి ఛానల్లో👆👆

Photo













 

పరమశివుడు నాట్యం

 


శ్లోకం:☝️

*నృత్తావసానే నాటరాజ రాజో*

  *ననాద ఢక్కాం నవ పంచవారం |*

*ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్*

  *ఏతద్విమర్శే శివ సూత్రజాలం ||*


భావం: పూర్వం పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు (నవ=తొమ్మిది. పంచ=ఐదు కలిపితే =14) పర్యాయాలు మ్రోగించగా, ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను ‘పాణిని’ అనే ఋషి గ్రహించి, వ్యాకరణ సూత్రాలుగ రచించెను. ఈ సూత్రాలే ‘మాహేశ్వర’ సూత్రాలుగా పిలువబడుతున్నాయి. ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు.


*వాక్యకారం వరరుచిం*

  *భాష్యకారం పతంజలిం |*

*పాణినిం సూత్రకారం చ*

  *ప్రణతోస్మి మునిత్రయం ||*


భావం: అక్షరాలని సృష్టించి సూత్రీకరించింది పాణిని ఐతే, వాటికి వార్తీకం వ్రాసినది ‘వరరుచి’. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది ‘పతంజలి మహర్షి.’🙏

పంచాంగం 06.11.2023 Monday

 ఈ రోజు పంచాంగం 06.11.2023  Monday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: నవమి తిధి ఇందు వాసర: ఆశ్రేష  నక్షత్రం శుక్ల యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం.


నవమి రా.తె 05:50 వరకు.

ఆశ్రేష మధ్యాహ్నం 01:22 వరకు.

సూర్యోదయం : 06:20

సూర్యాస్తమయం : 05:39

వర్జ్యం : రాత్రి 02:52 నుండి 04:40 వరకు.

దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:22 నుండి 01:07 వరకు తిరిగి మధ్యాహ్నం 02:38 నుండి 03:23 వరకు.


రాహుకాలం : ఉదయం 07:30  నుండి 09:00 వరకు 


యమగండం : పగలు 10:30 నుండి 12:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

పూజాకార్యక్రమాల సంకల్పము.

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు

 ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 06.11..2023

సోమ వారం (ఇందు వాసరే) 

**************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే నవమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

ఇందు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  కృష్ణ పక్షే నవమ్యాం

ఇందు వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.04

సూ.అ.5.26

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

కృష్ణ పక్షం నవమి రా.తె.5.15 వరకు. 

సోమ వారం. 

నక్షత్రం ఆశ్రేష మ.2.10 వరకు. 

అమృతం  ప. 12.24 2.10 వరకు. 

దుర్ముహూర్తం ప. 12.07 ల 12.52 వరకు. 

దుర్ముహూర్తం మ.2.23 ల 3.08 వరకు. 

వర్జ్యం రా. తె.3.27 ల‌ 5.13 వరకు .

యోగం శుక్లం సా. 4.44 వరకు.

కరణం  తైతుల సా.4.14 వరకు.

కరణం గరజి రా.తె.5.15 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం ఉ. 7.30 ల 9.00  వరకు. 

గుళిక కాలం మ. 1.30 ల 3.00 వరకు. 

యమగండ కాలం ఉ. 10.30 ల 12.00 వరకు. .

.***********

పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ నవమి. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

*శ్రీ స్వామివారి ఆహారపు పద్దతి..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*శ్రీ స్వామివారి ఆహారపు పద్దతి..*


*(పంతొమ్మిదవ రోజు)*


ఫకీరు మాన్యం భూమి ని చూసివచ్చిన తరువాత శ్రీ స్వామివారు శ్రీధరరావు గారి ఇంటికి తిరిగివచ్చేశారు..వెంటనే ఆయన ధ్యానం చేసుకోవటానికి వెళ్లిపోయారు..ప్రభావతి గారు వంట పని మొదలెట్టి..తమ ఇంటికి సిద్ధపురుషుడు వచ్చాడని సంబరపడుతూ..రెండు రకాల కూరలు, పప్పు, పులుసు, పచ్చడి పాయసం వగైరాలతో చిన్నపాటి విందుభోజనం వండిపెట్టారు..


కొద్దిసేపటి తరువాత శ్రీ స్వామివారు ఇంట్లోకి వచ్చారు.."నాయనా..భోజనం వడ్డించమంటారా?.." అడిగారు ప్రభావతి గారు.."అన్నం పెట్టు తల్లీ..త్వరగా వెళ్లిపోతాను!.." అన్నారు శ్రీ స్వామివారు..


శ్రీ స్వామివారు పీట మీద కూర్చున్నారు..ఆయన ముందు విస్తరి వేసి, అందులో తాను చేసిన కూరలు, పప్పు వడ్డించి అన్నం కూడా పెట్టి ఆపై నెయ్యి కూడా వేసి ఆయన వైపు చూసారు ప్రభావతి గారు..ఆ ప్రక్కనే శ్రీధరరావు గారు కూర్చుని వున్నారు..శ్రీ స్వామివారు విస్తరిలో వడ్డించిన పదార్ధాల వైపు ఒక్కసారి తేరిపారా చూసి..


"అమ్మా!..ఇంకా ఏమైనా ఉన్నాయా ?..వుంటే అవికూడా వడ్డించమ్మా.." అంటూనే..అప్పటిదాకా విస్తరిలో ఉన్న పదార్ధాలన్నీ అన్నంలో ఒకటిగా కలిపేశారు.."అమ్మా!..ఆ పెరుగో..మజ్జిగో..అదికూడా తీసుకురామ్మా.."అన్నారు..


ప్రభావతి గారు నొచ్చుకున్నారు..ప్రక్కనున్న శ్రీధరరావు గారు మౌనంగా చూస్తున్నారు.."అది కాదు నాయనా..మీకోసమని రుచిగా, శుచిగా చేసాను..మీరు..ఇలా.." ఆవిడ మాట పూర్తికాకముందే..


"అమ్మా..నేను సన్యాసిని..మా సన్యాసులకు రుచులు ఉండకూడదు తల్లీ!..అలా రుచికి అలవాటు పడితే..జిహ్వ అదే రుచి..అంతకంటే ఇంకా మంచిదేదన్నా వుంటే..ఆ రుచి కావాలని కోరుకుంటుంది..ఇప్పుడు నువ్వు చేసావే..ఈ బెండకాయ కూర బాగుందనుకో.. ప్రభావతమ్మ చేసిన బెండకాయకూర బాగుంది..మరోసారి తినాలనిపిస్తుంది..ఇంకొకరు చేసిన చారు మహత్తరంగా ఉందని దానినీ కోరుకుంటుంది..అందుకనే యోగులు, సిద్ధులు.. సాధకులూ..సన్యాసులూ..తమ అహాన్ని చంపుకొని..నాలుగైదు ఇళ్లలో "భిక్ష" స్వీకరించి..దానిని ఒకే ముద్దగా చేసుకొని ఆహారంగా తీసుకుంటారు..జిహ్వ ను అరికట్టటం సాధకుల మొదటి లక్షణం..ఈరోజు మీ ఇంట్లో ఉన్నానని ..నీవు చేసిన ప్రతి పదార్ధాన్నీ విడి విడిగా రుచి చూస్తూ భుజిస్తే...రేపటినుండి ఈ నాలుక నా మాట వింటుందా?..వేసేయ్ తల్లీ..నీవు చేసిన అన్ని పదార్ధాలూ ఒకేసారి వడ్డించు!.." అన్నారు..


ప్రభావతి గారు ఇక చేసేదేమీ లేక..తాను చేసిన పాయసం..కూడా తెచ్చి, పెరుగు తో సహా విస్తరిలో వడ్డించారు..శ్రీ స్వామివారు అన్నీ కలిపేసి తినేశారు..


ఆ తరువాత శ్రీధరరావు గారు, "ప్రభావతీ నీకు గుర్తుందా?..మనం కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య గారి గురించి విని వున్నాము..వారు కూడా ఇలాగే జిహ్వ ను అదుపులో పెట్టుకోవడానికి..ఒకసారి గోమయంతో తమ నాలుకను శుద్ధి చేసుకున్నారు.. ఆ అనుభవాన్నే మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము..మన అదృష్టమేమిటంటే..ఒకానొక సాధకుడీకి కొంతకాలం పాటు ఆశ్రయం ఇచ్చి సేవ చేసుకోగలగడం!.."అన్నారు..ప్రభావతి గారు కూడా మనసులో సమాధాన పడ్డారు..


శ్రీ స్వామివారు ఆహారం స్వీకరించిన తరువాత, ఈ దంపతులను పిలచి.."మీకు లభ్యమైన శివలింగం పూజాపీఠం లో ఉందన్నారు కదా?..ఒకసారి  చూపించండి"అన్నారు..శ్రీధరరావు దంపతులు, శ్రీ స్వామివారిని తమ పూజగదిలోకి తీసుకొని వెళ్లి, పూజా పీఠం లో ఉన్న శివలింగాన్ని చూపారు..శ్రీ స్వామివారు ఆ శివలింగాన్ని చేతిలోకి తీసుకొని..దానిని తన హృదయానికి ఆనించుకొని ఒకానొక సమాధి స్థితిలోకి వెళ్లారు..సుమారు పది పదిహేను నిముషాల పాటు శ్రీ స్వామివారు అలా నిశ్చలంగా ఉండిపోయి..తిరిగి జాగ్రత్తగా పూజాపీఠం లో యధాస్థానంలో ఉంచారు..


"మీఇంటికి ఈశ్వరుడొచ్చాడు..నేనూ వచ్చాను..అమ్మా!..నీది వైష్ణవ భక్తి..ఆ లక్ష్మీనృసింహుడినే కొలుస్తున్నావు..ఇక ఆలస్యం చేయకుండా..ఉదయం మనం చూసిన పొలంలో బావి  త్రవ్వించే కార్యక్రమం చేద్దాము..మీరే మొదలు పెట్టాలి.." శ్రీ స్వామివారు అప్పుడు మాట్లాడిన మాటల్లో శ్రీధరరావు ప్రభావతి గార్లకు పొంతన ఉన్నట్లు అనిపించలేదు..సగం సగం మాట్లాడేరేమో..అని సరిపెట్టుకొని.."బావి ఎక్కడ త్రవ్వించాలి నాయనా?.." అని మాత్రం ప్రభావతి గారు అడిగారు..


"రేపుదయాన్నే స్థల నిర్ణయం చేసి, నేను తిరిగి మాలకొండ వెళ్లిపోతాను..గృహస్తుల వద్ద ఎక్కువకాలం మాలాటి సన్యాసులు ఉండరాదు.."అన్నారు..అన్నవిధంగానే.. మరుసటిరోజు పొద్దున్నే..బావి త్రవ్వడానికి స్థలాన్ని చూపారు..


"స్వామీ!..ఈ పొలంలో నీటి లభ్యత తక్కువ!..జల పడదేమో?.." అన్నారు శ్రీధరరావు గారు..


"పాతాళ గంగ కూడా పైకి వస్తుంది శ్రీధరరావు గారూ..మీరు పని మొదలుపెట్టండి..అన్నీ సమకూరుతాయి!.." అన్నారు నవ్వుతూ.."ఇక నేను మాలకొండ వెళతాను.." అన్నారు..


శ్రీధరరావు దంపతులు సరే నని చెప్పి..శ్రీ స్వామివారిని మాలకొండకు తమ బండిలో పంపారు..మళ్లీ ఆ దంపతుల మనసులో సందేహం మొదలైంది.."స్వామివారికి స్వంత పొలం వుందికదా..మన భూమి అడిగి, అందులో మనచేత బావి త్రవ్వించి..ఆశ్రమ నిర్మాణం చేయడమెందుకు?.." ఈసారి ఆయనను కలిసి ఈ సందేహనివృత్తి చేసుకుందామని అనుకొని ఇంటికొచ్చేశారు..


సందేహనివృత్తి...రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                 🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం  - నవమి -  ఆశ్రేష - ఇందు వాసరే* *(06-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/8EBDtIVsxvk?si=3z7dELV1gPswEfJ0


🙏🙏