శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
మహానుభావులారా! మీరు దేవతలు. సూర్యభగవానుడి పుత్రులు. సర్వజ్ఞులు. సురసమ్మతులు.
నావంటి సౌశీల్యవతిని మీరు ఇలా భావించడం తగదు. స్వయంగా ఇష్టపడి పెద్దల సమ్మతితో ఒక
యోగీశ్వరుణ్ణి పరిణయమాడాను. నేను అపమార్గం తొక్కలేను. సర్వలోకద్రష్ట సర్వకర్మసాక్షి అయిన
దివాకరుడికి పుత్రులై జన్మించిన మీరు ఇలా మాట్లాడకూడదు. సమంజసంకాదు. నేను కులస్త్రీని భర్తను
విడిచిపెట్టి పరుణ్ణి వరిస్తానా? ఈమాట అనడానికి మీకు నోరు ఎలావచ్చింది? అసారమైన ఈ సంసారంలో
ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో ఆమాత్రం తెలుసుకోలేకపోయారా? ఇక చాలు. సంతోషించాను మీ
తెలివితేటలకి. మర్యాదగా, వచ్చినదారిని వెళ్ళండి. లేదంటే శపిస్తాను. జాగ్రత్త. నేను సుకన్యను.
శర్యాతిమహారాజు కూతురిని. చ్యవనమహర్షి ఇల్లాలిని.
యథేచ్ఛం గచ్ఛతం దేవౌ శాపం దాస్యామి వానఘౌ |
సుకన్యాహం చ శర్యాతే: పతిభక్తిపరాగయణా॥
493
(5-6)
నాసత్యులు నివ్వెరపోయ ఈవిడే శపిస్తుందో చ్యవనుడే శపిస్తాడో అని భయపడ్డాడు.
తెలివిగా ఈవిడను ప్రసన్నురాలిని చేసుకుని తప్పించుకుందామని నిశ్చయించుకున్నారు.
+ దేవీమహిమతో పరీక్షలో నెగ్గిన సుకన్య
సాధ్వీమణీ! విజయం సాధించావు. నీ సౌశీల్యానికి ప్రసన్నులమయ్యాం. నీ శ్రేయస్సు కోరినవాళ్ళం.
ఏదైనా వరం కోరుకో. ఇస్తాం. మేము అశ్వినులం. దేవవైద్యులం. తెలుసుగదా! నీ భర్తను రూపయౌవన
సంపన్నుడైన యువకుడుగా మార్చేస్తాం. మాతో సమానుణ్ణి చేస్తాం. అప్పుడు మా ముగ్గురిలో నీ భర్తను
గుర్తుపట్టి నీ చాతుర్యం చూపించు. సంతోషిస్తాం.
ఇప్పుడు ఆశ్చర్యపోవడం సుకన్యవంతు అయ్యింది. త్వరత్వరగా వెళ్ళి ఈ అద్భుతాన్ని తన
భర్తకు విన్నవించింది. నాథా! ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? దేవమాయ దుర్భయమంటారు. ఇదేమన్నా
అశ్వినుల కపటోపాయమా? నాకేమీ తెలియడంలేదు. అంతా అయోమయంగా ఉంది. నువ్వు సర్వజ్ఞుడవు.
ఆజ్ఞాపించు. నువ్వు ఏమి చెయ్యమంటే అది చేస్తాను. నీ అభీప్సితమేమిటో తెలియజెయ్యి- అని అభ్యర్థించింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి