24, అక్టోబర్ 2021, ఆదివారం

చనుబాలు వృద్ది అగుటకు

 చనుబాలు వృద్ది అగుటకు సులభ యోగాలు -


 * ఆవుపాలలో బియ్యం వేసి వండి అందు పటికబెల్లం పొడి కూడా కలిపి ప్రతినిత్యం తినుచుండిన యెడల స్త్రీలకు చనుబాలు వృద్ది అగును. నాటు ఆవుపాలు శ్రేష్టం .


 * గోధుమ పిండితో చేసిన పూరీలను నేతిలో ఉడికించి తీసి పాలలో నానబెట్టి తినుచుండిన బాలింతలకు పాలు వృద్ది అగును. ఆవునెయ్యి శ్రేష్టం.


 * వాము కషాయం ఇచ్చిన రొమ్ములలో చనుబాలు సిద్ధం అగును.


 * ఆకుపత్రి కషాయం సేవించిన చనుబాలు పడును .


 * చిట్టాముదపు ఆకులకు ఆముదం రాసి రొమ్ములపై వేసి కట్టిన రొమ్ములలో చనుబాలు సిద్దం అగును.


 * బొప్పాయి కాయ కూరగా చేసుకుని తినుచుండిన యెడల స్త్రీలకు చనుబాలు వృద్ది అగును.


 * ముళ్లతోటకూర ఆకులను పప్పులో వేసుకొని తినుచుండిన బాలింతలకు పాలు వృద్ది అగును.


 * తెల్ల జీలకర్ర చూర్ణం , పటికబెల్లం చూర్ణం రెండింటిని సమానంగా తీసుకుని కలిపి ఉదయం , సాయంత్రం 10 గ్రాముల చూర్ణమును అరకప్పు మంచినీటిలో కలుపుకుని తాగుచుండిన యెడల 15 రోజుల్లొ చనుబాలు వృద్ది అగును.


 * అతిమధురం చూర్ణం 5 గ్రాములు తీసుకుని అరకప్పు ఆవుపాలలో కలిపి 20 గ్రాములు పటికబెల్లం పొడిని కలిపి ప్రతినిత్యం తాగుచుండిన యెడల చనుబాలు వృద్ది చెందును .


      పైన తెలిపిన యోగాలలో మీకు సులభమైన వాటిని ఉపయోగించుకుని సమస్యని పరిష్కరించుకోగలరు.


పంకజం

 రాత్రి మూడు గంటల సమయంలో అలికిడికి నిద్ర లేచింది పంకజం ,ఆమె చుట్టు నలుగురు దొంగలు చేతిలో కత్తులతో నిలుచుని ఉన్నారు...


భయంతో పతి దేవుడు కుటుంబరావు కోసం చూస్తే అతనిని అప్పటికే మంచానికి తాళ్లతో కట్టి వేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఉంచారు..పిల్లలను వేరే రూములో బంధించి గడియ పెట్టారు...దొంగలు బీరువా,కప్ బోర్డు,అన్నీ వెతుకుతున్నారు....


ఇది అంతా చూసి పంకజం గజగజ వణికిపోతూ...

"మా ఇంట్లో ఏమి ఉంచుకోము అన్నీ బ్యాంకు లాకరులోనే ఉంటాయి" అంది....


దానికి ఆ దొంగల నాయకుడు "ఆ విషయం మాకు తెలుసు కాని, మొన్న మీ తమ్ముడు అమెరికా నుండి పంపిన 1.5 లాక్స్ ఆపిల్ ఫోను, నిన్న మీ పెళ్ళిరోజుకి మీ భర్త గిఫ్ట్ గా ఇచ్చిన డైమండ్ నెక్లెసూ,పట్టుచీర ఎక్కడా..? అవి ఇవ్వు చాలు" అన్నాడు...


పంకజం అవి అన్నీ తీసి అతనికి ఇస్తూ "ఇవ్వన్నీ నా దగ్గర ఉన్నట్టు అంత ఖచ్చితంగా మీకు ఎలా తెలుసు అండి..?" అంది...


దానికి ఆ దొంగ చిన్నగా నవ్వుతూ "నేను నీ పేస్ బుక్ ఫ్రెండుని మీ ప్రతి పోస్టుకి లైక్ కొడుతూ మిమల్ని ఫాలో అవుతూ ఉంటాను..మీరేగా మొన్నా,నిన్నా ఈ డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేసారు..సరే కానీ పొద్దుట నెయ్యి వేసి ఘమ ఘమలాడుతున్న రవ్వ కేసరి చేసా అని పోస్ట్ పెట్టారు.. చూస్తేనే నోరు ఊరిపోయింది..అదేమైనా కొంచం మిగిలి ఉంటే తీసుకురండి తినేసి వెళ్ళిపోతాం...."అన్నాడు..


పంకజం 😇😇😇😇


😂😂😂😂😜😜😜

శ్రీమద్భాగవతము

 *24.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2301(౨౩౦౧)*


*10.1-1439*


*క. సందేహము మానుం డర*

*విందాననలార! మిమ్ము విడువను వత్తున్*

*బృందావనమున కని హరి*

*సందేశము పంపె" ననుము సంకేతములన్."* 🌺



*_భావము: శ్రీకృష్ణుడు ఉద్ధవునితో - నీవు రహస్య సంకేతస్థలమునకు వెళ్ళి పద్మవదనలగు గోపికలతో "మిమ్మల్ని శ్రీకృష్ణుడు విడువడు, ఎలాటి సందేహాలు పెట్టుకోవద్దు. తప్పక బృందావనానికి వస్తాడు”, అని చెప్పి విశ్వాసము కలిగేటట్లు చెయ్యి._*🙏  



*_Meaning: Sri Krishna told Uddhava to go to the appointed place and reassure the womenfolk of Vrepalle by saying these soothing words: ”Sri Krishna will not abandon you. Believe in Him. He would certainly come to Brindavan and see you all.”_*🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

ఆలోచించేది ఎవరో తెలుసుకోవటమే ధ్యానం !'*-

 _*శ్రీరమణీయం* *-(232)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"ధ్యానం గురించి చాలా మంది చాలా రకాలుగా చెపుతున్నారు, అసలు ధ్యానం అంటే ఏమిటి ?"*_


_*ధ్యానం అంటే ఆలోచించటం లేదా ఆలోచనలు ఆపటం కాదు. 'ఆలోచించేది ఏమిటో ' దానిని తెలుసుకొని ''అదిగా'' ఉండటం. అనుకున్న దాన్ని మాత్రమే ఆలోచించగలగటం మనం ధ్యానం అనుకుంటున్నాం. ఆలోచించే వస్తువుపై అవగాహన లేకుండా ఏది చేసినా అది ధ్యానం కాదు. ఆలోచించే వస్తువు ఏదో, ఏమిటో తెలుసుకున్న తర్వాత ఎంత ఆలోచించినా అది ధ్యానమే అవుతుంది. ఆ ధ్యానం సద్గుణ సంపత్తితోనే సాధ్యం. అందుకే బుద్ధ భగవానుడు గుణం తరువాత ధ్యానం అని బోధించారే తప్ప ముందుగా ధ్యానం ఆచరించమని చెప్పలేదు. సద్గుణంతోనే ధ్యానం శోభిల్లుతుంది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'ఆలోచించేది ఎవరో తెలుసుకోవటమే ధ్యానం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

మగాడి జీవితం.


"ఆమె" లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం


_ఆమెలేని అతడు వట్టి మోడు ఇది వాస్తవం.. భార్య విహీనులైన చాలా మంది భర్త లు చరమాంకంలో పలు బాధలు పడినవారు చాలా మంది ఉన్నారు.. --వారికి రోజులు గడవడం కష్టం అవుతూంది--_


--భర్త దూరమైనా భార్య 

తట్టుకుని జీవించగలదు... 

కానీ పురుషులు కుటుంబసభ్యులతో 

కలిసిపోలేరు..                                                                                                                                                                               


--2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. 

అందులో ఒక ఆసక్తికరమైన 

అంశం వెల్లడైంది...


--సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. 

తన కన్నా చిన్నదైన భార్య

 చనిపోతుందనే సన్నద్ధత

 పురుషుల్లో ఉండదట. 

భార్య చనిపోతే భర్త 

కుంగుబాటుకు గురవడానికి 

ఇది కూడా ఒక ప్రధాన 

కారణమని వారు విశ్లేషించారు._

                                                                                                            --భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు... 

కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో 

కొడతారు కూడా ! 

ఆమె శాశ్వతంగా దూరమైతే

 మాత్రం తట్టుకొని బతికేంత

 మానసిక బలం పురుషులక ఉండదు --


_‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం !!'

అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ 

ఆమె విలువ తెలుసుకోలేని మగానుభావులు..

 ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక.. 

అందరితో కలవలేక.. 

మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు !!_

                                                                                                                                                                                      _'‘ నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు.

పైనున్న భగవంతుడికి తెలుసు.

 ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. 

‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు. 

ఆ తర్వాత నా సంగతి చూడు’ 

అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని.

 ‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా అని అనుకోకు... వుంటారు. 

నాకు మీ మావయ్యంటే 

చచ్చేంత ఇష్టంరా. 

ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. 

చీకటంటే భయం. 

ఉరిమితే భయం. 

మెరుపంటే భయం. 

నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ? 

అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని 

లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ?’’...ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది !_

                                                _

          నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా ? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన ! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు._

                                                                                                                                                 _ప్రముఖ చిత్రకారుడు, 

దర్శకుడు బాపు సైతం.. 

భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు._

                                                                                                                                                                                                                                                                                                                                                       _సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది.

 భార్య తన మీద ఆధారపడి ఉందని.. 

తాను తప్ప ఆమెకు 

దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. 

కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. 

చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.

 

భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది.

 వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. 

భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. 

భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.


_ స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. 

తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. 

అదే తనకు ఏదైనా అయితే 

ఎవరి కోసం ఎదురుచూడదు. 

తనకు తానే మందులు వేసుకుంటుంది. 

ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. 

ఆ మనోబలమే... 

భర్త లేకపోయినా 

ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది._

                                                                                                                                                                                                                             _భావోద్వేగ బలం ఆమెదే :-_


_పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, *స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది*. 

సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. 

ఒక విధంగా చెప్పాలంటే.. 

ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. 

ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. 

ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది..


 -- *అందుకే ఆడదే మగాడికి సర్వస్వం*...యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత...


🙏🙏🙏🙏

పెళ్ళి భోజనాలు-వడియాలు

 కనుమరుగవుతున్న ఆనాటి పెళ్ళి ముచ్చట్లు.


పెళ్ళి భోజనాలు-వడియాలు


పెళ్ళిలో భోజనాలంటే ఒక పెద్ద యఙ్ఞంలా వుండేది, సరదాగానూ వుండేది. భోజనాలకి పిలుపుల దగ్గరనుంచి భోజనాలు కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక. ఐదురోజుల పెళ్ళిలో చెప్పేదేముంది, పూట పూటా సంబరమే…


పెద్దపెద్ద మండువా లోగిళ్ళుండేవి. మండువాలో ఒక పక్క ఆకులేస్తే ఒక పాతిక మందికి భోజనానికి సరిపడేది. ఇలా నాలుగుపక్కలవేస్తే దగ్గరగా వొక వంద మంది ఒక సారి భోజనం చేయడానికి వీలుండేది. ఇలా వీలు లేక పోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరివేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషి పై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసే వారు. అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కళ్ళాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు. భోజనాలకి కూచోడానికి ఈతాకుగాని, తాటాకు చాపలుగాని వేసేవారు. కింద కూచుని భోజనం చేసేవారు.


సాధారణంగా అరటి ఆకులు వుపయోగించే వారు. అత్యవసర పరిస్థితులలో అడ్డాకులు వాడేవారు. ఇక్కడ కూడా ఒకసారి వంద మంది పైగా ఒక సారి భోజనాలు చేసేందుకు సావకాశం ఉండేది.


పంక్తులుగా ఆకులేసి, అందరూ కూచున్న తరవాత వడ్డన ప్రారంభించేవారు. భోజనానికి, వడ్డనకి ఒక క్రమం ఉంది. నేటి ప్రోటోకోల్ లాగా! ముందు పప్పు, కూరలు, పచ్చళ్ళు, వూరగాయ, పిండివంటలు అన్నీ అయిన తరవాత అన్నం పెట్టేవారు. వడ్డన ప్రారంభించిన వెంటనే పెట్టినవి తినెయ్యకూడదు. అందరూ ఒక సారి తినడం మొదలు పెట్టాలి. వడ్డన అంతా పూర్తి అయినతరవాత గోవిందనామ స్మరణతో భోజనం ప్రారభమయ్యేది. అసలు సిసలు వడ్డన ఆ తరవాత ప్రారంభమయ్యేది,తినడం ప్రారంభించిన తరవాత. యువకులు యువతులు వడ్డన చేసేవారు. పంచకట్టి ఆపైన తువాలు మొలకి గట్టిగా బిగించేవారు యువకులు. యువతులు పమిట పూర్తిగా వేసుకుని ఆ కొంగు మొలలో దోపుకును వడ్డనకి ఉపక్రమించే వారు.


వడ్డన సామానుల పేర్లే మరిచిపోతున్నారు,ఇప్పుడు. పులుసు వడ్డించడానికి వాడేపాత్రని గోకర్ణం అనేవారు. మొదటిది పప్పు, ఇది పట్టుకుని ఒకరు, నెయ్యి పట్టుకుని ఒకరూ బయలుదేరేవారు. పప్పు వేసే అతను పప్పండి, మీకండి, పప్పండి,పప్పండి,పప్పండి అని వడిగా అంటు కదిలేవాడు. వెనకాల వచ్చే నెయ్యి తెచ్చినతను నెయ్యండి, నెయ్యండి,నెయ్యండి అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ మాటలు గబగబా అంటే మరొక అర్ధం స్ఫురిస్తుంది. అని చూడండి. ఆ తరవాతది కూర. కూర తెచ్చినతను కూరండి, కూరండి, కూరండి అంటూ కావలసిన వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలో అన్నం బుట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు. వేడిఅన్నం తాటాకు బుట్టలో పెట్టుకుని, బుట్ట చేతిమీద పెట్టుకుని, కాలకుండా బుట్ట కింద అరటాకు వేసుకుని ఒక హస్తంలాటి దానితో అన్నం వడ్డించేవారు. వీరు అన్నమండి తో ప్రారంభించి, మీకన్నమండి,మీకన్నమండి, మీకన్నమండి అంటూ సాగిపోయేవారు. మీకు+అన్నమండి=మీకన్నమండి అయిపోయింది. ఈ మాటలన్నీ వడిగా అంటేనే ఆ అందం అర్ధం స్ఫురిస్తాయి. పప్పుతో పులుసు వడ్డించేవారు. ఈ పులుసుని పులుసండి నుంచి పులసండి, పులసండి అనుకుంటూ వెళ్ళేవారు. పులసండి కి అర్ధం పులవమని. ఈ మాటలని కొంతమంది యువకులు ఆటపట్టించడానికి కూడా వాడే వారు, గబగబా అంటూ. పప్పుతో కాకుండా పులుసు వేరేగా కలుపుకుని తినేవారు. అప్పుడు నంజుడుకి వుండటానికి వడియాలు, అప్పడాలు వేసేవారు. ఒక కొంటె యువకుడు పంక్తిలో ఒక తాతగారి దగ్గరకెళ్ళి తాతగారు వడియాలు కావాలా అని అడిగేవాడు. ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు! ఒరేయ్ సుబ్బన్నా! ఇక్కడ తాతగారికి వడియాలు కావాలి పట్రా అని. అంటే తాతగారికి పడుచుపెళ్ళాం కావాలంటున్నాడురా అని ఎద్దేవా అన్న మాట. నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు కాని అసలు కొంటె తనం వుంది. తాతగారు కొద్ది ఘటికుడైతే మరొకలా సాగేది. కావాలని వడియాలు తెచ్చినతరవాత ఇదేమిటి ఇవితెచ్చేవూ అనేవాడు. మీరేగా వడియాలుకావలన్నారని అనేవాడు, యువకుడు.అప్పుడు తాతగారు ఒర్నీ! వడియాలంటె పడుచుపెళ్ళాన్ని తెస్తావనుకున్నారా అనేవాడు. మరోలా కూడా సాగేది. ఏమిటీ అన్నారూ అనేవాడు, ముసలాయన. వడియాలుకావాలా అని మళ్ళి అడిగేవాడు, యువకుడు. ఈ తాతగారు ఘటికుడు కనక వడియాలు నాకెందుకూ అనేవాడే కాని వద్దనేవాడు కాదు. తాతా! పెళ్ళిచేసుకుంటావా అంటే పిల్లనిచ్చేవాడెవడురా! అనేవారుకాని వద్దనేవారు కాదు!. అది ఒక సరదా.! వడియాలు నేనేమి చేసుకోనూ అనేవాడు. అంటే నమలడానికి పళ్ళు లేవనీ అర్ధం, పడుచు పెళ్ళాంని నేనేమి చేసుకోనూ అని కూడా అర్ధం వచ్చేది. పోనీ అప్పడాలు కావాలా అంటే, అప్పడాలు ఇప్పటిదాకా నాదగ్గరే వుండాలి, ఎక్కడుందో చూడునాయనా అనేవాడు. ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే వుందిగా అనేవాడు.


ఇప్పుడర్ధమైనదనుకుంటాను, అప్పడాలు ( అప్పటి+ ఆలు= అప్పటాలు, అప్పటియాలు, అప్పడాలు అనగా పాత భార్య) వడియాలు అనగా ( వడి+ఆలు= వడియాలు వడి అనగా వేగం, విసురు అని అర్ధాలు, అనగా పడుచు భార్య). ఒక్క మంచినీళ్ళు పోసేవారు మాత్రమే మాట్లాడకుండా ఖాళీ గ్లాసుల్లో మంచినీళ్ళుపోసేవారు. ఇక చివరిది పెరుగు, పెరుగు తెచ్చినవారు పెరుగండి నుంచి పెరగండి నుంచి వడిగా అనడం లో జరగండి దాకా వెళ్ళిపోయేది. అంటే ఇక తిన్నది చాలు లేవండి అన్నట్లుగా.భోజనాల దగ్గరనుంచి అంతా ఒక సారి లేచేవారు, గోవింద నామ స్మరణ చేస్తూ. పంక్తి లో ఎవరేనా తినడంలో వెనక పడితే వారికోసం అందరూ వారి భొజనం పూర్తి అయ్యేదాకా కూచుని వుండేవారు. ఇది వారి పట్ల చూపే గౌరవం. మన వాళ్ళు భోజనాలలో కూడా ఇలాసరదా చూపేవారు. అలా సందడి సందడిగా భోజనాలు ముగిసేవి.


ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని క్యూలో నుంచుని కావల్సినవి వేసుకుని/వేయించుకుని కొండొకచో ఒంటి కాలిమీద నిలబడి/ ఎక్కడో ఒకచోట కూచుని భోజనం కానిచ్చేస్తున్నాం మరి. మాధాకోళం బ్రతుకులైపోయాయని ఒక పెద్దాయన వాపోవడం విన్నాను . అందం, హాస్యం చచ్చిపోయాయి.


మీరేమంటారు ! 

ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం

 


ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 


(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

                ----------------------- 


      3. శ్రీమద్రామాయణం - భూగోళ శాస్త్రం 


    భూమిమీద నదులు, పర్వతాలు, జనావాసాలుగా గ్రామ/పట్టణ/నగరాలు, అరణ్యాలు, గనులు, సముద్రాలు భంటి అన్నిటి వివరాలనీ తెలిపేదే "భూగోళ శాస్త్రం". 


    శ్రీమద్రామాయణంలో కిష్కింధ కాండలో 

  - నలుదిశల వ్యాపించిన భూగోళ వివరాలు అత్యంత విపులంగా వివరించబడ్డాయి. 


    సీతాన్వేషణకై వానరులను నలుదిక్కులకీ పంపుతూ సుగ్రీవుడు, ఒక్కొక్క దిశలోనూ ఏ ఏ ప్రాంతాలు ఉంటాయో చక్కగా వివరించాడు. 

    అందులో కొన్ని భాగాలని ఇప్పుడు చూద్దాం. 


తూర్పు దిక్కు 


    గంగా సరయు కౌశిక యమున మొదలైన నదులూ, 

    యామునగిరి సరస్వతి సింధు శోణ నదీ తీరాలూ, 

    బ్రహ్మమాల విదేహ మాళవ కాశి కోసల మగధ మొదలైన దేశాలూ, 

    వెండి గనులు గల భూములూ, సముద్రాలూ, వాటిలోని పర్వతాలూ, వాటిమధ్య ద్వీపాలయందలి నగరాలూ, 

    ఆవలి తీరంలో ఘృత దధి క్షీర మధురజల సముద్రాలూ, 

    అతినీలలోహిత కిరణరశ్మి ప్రదేశం, లయముఖమనే బడబాగ్ని, 

    ఊర్ధ్వలోకవాసులు భూలోకానికి ప్రవేశించే ద్వారంగా ఉదయాద్రి, 

    ఆ పైన అగమ్యంగా ఉండే విషయాలు వివరంగా తెలిపాడు. 


దక్షిణ దిక్కు 


    నర్మద గోదావరి మహానది కృష్ణవేణి వరద మహాభాగ నదీ తీరాలూ, 

    మేఖల ఉత్కళ దశార్ణ విదర్భ ఋషిక మాహిషిక వంగ కళింగ కౌశిక మొదలగు దేశాలూ, 

    దండకారణ్యం, 

    ఆంధ్ర పుండ్ర చోళ పాండ్య కేరళ మొదలైన దేశాలూ, 

    మలయ పర్వతమూ, కావేరి నదీ, అగస్త్య నివాసం, తామ్రపర్ణి నది, 

    సముద్రం - దాని మధ్యలో అంగారక నీడ, 

    కుంజర పర్వతం, భోగవతీ పురం, వృషభ పర్వతం, పితృలోకం, చిమ్మచీకటి అని ఆ దిశలోనివాటి వివరాలు తెలిపాడు. 


పశ్చిమ దిక్కు 


    సౌరాష్ట్ర ప్రాంతాలూ, బాహ్లిక దేశాలూ, శూర భీమ ప్రదేశాలూ, 

    మురచీ పట్టణం, 

    సింధునదం సముద్రాన కలిసే ప్రదేశాన హిమగిరీ, దాని విషయాలూ, 

    సముద్ర మధ్యన 24 కోట్ల గంధర్వుల నివాస స్థానమూ, 

    పారియాత్ర పర్వతమూ, 

    సుదర్శన చక్రంగా "చక్రవంత" పర్వతం, 

     60 వేల బంగారు కొండలూ, వాటి మధ్య పర్వతాలకి రాజైన మేరుగిరి, 

     విశ్వకర్మ నిర్మిత వరుణ నివాస స్థానం, 

     ఆపైన సూర్యప్రకాశంగానీ, ఏ దేశపు సరిహద్దుగానీ కనబడని ప్రదేశమూ అని ఆ దిశలో ఉన్నవాటిని వివరించాడు. 


ఉత్తర దిక్కు 


    మ్లేచ్ఛదేశాలూ, పుళిందుల భూములూ, శూరసేనుల రాజ్యాలూ, 

    ఇంద్రప్రస్థం, కురుక్షేత్రం, మద్రక దేశం, కాంభోజ రాజ్యం, టంకణదేశ ప్రదేశాలూ, చీన పరమచీన భూములూ, 

    హిమవత్పర్వత ప్రాంతాలూ, ఆపైన వంద యోజనాలు కొండలుగానీ - నదులుగానీ - వృక్షాలుగానీ లేని, ఏ ప్రాణీ నివసింపని శూన్యమూ, తరువాత దుర్గమారుణ్యమూ, 

    కైలాస శిఖరం, విశ్వకర్మ నిర్మిత కుబేర భవనమూ, క్రౌంచగిరి, వైఖానసం సరస్సూ  

    ఆపైన సూర్య చంద్ర - నక్షత్ర దర్శనం లేని - మేఘాలు కనబడని - మెఱుపులు వినబడని - కేవలం శూన్యమైన ఆకాశ ప్రదేశమూ, 

    శైలోదకమనే నదీ, ఉత్తర కురు భూములూ - లవణ సముద్రం - దాని మధ్యలో సోమగిరి అనే మహాపర్వతం, 

    దేవతలకు సైతం అసాధ్యమైన బ్రహ్మ - విష్ణు - శంకరుల నివాస స్థానాలూ తెలుపుతాడు. 


దిశా పరిమితులు 


    తూర్పు దిక్కున ఇంద్రుని స్వర్గలోక/ఊర్థ్వలోక మార్గం వరకూ, 

    దక్షిణ దిక్కకు అధిపతి అయిన యముని పితృలోకం వరకూ, 

    పశ్చిమ దిక్కున ఆ దిక్కుకు అధిపతియైన వరుణుని నివాస స్థానం వరకూ, 

    ఉత్తరాన ఉత్తరదిక్కుకు పాలకుడైన కుబేరుని భవనంతోపాటు, త్రిమూర్తుల నివాస స్థానాల వరకూ ఇచ్చిన విశ్లేషణాత్మక వివరణ ఎంతో సమగ్రంగాఅద్భుతమైనదిగా తెలుస్తుంది. 

    నదుల వివరణ భూగోళంలో నీటి వనరులగూర్చి అవగాహన కలిగించేదిగా తెలుస్తోంది కదా! 


    ఆ కాలంలో తెలిపిన వివరాలు, అత్యధిక కాలవ్యవధిలో, కాలక్రమేణ కొన్న మార్పులకు గురవుతాయి. 

    ఆనాటికీ ఈనాటీకీ కాలంలో వ్యత్యాసం అత్యధికం కావడం వల్ల ఈ మార్పులను గణిస్తే, ఆ వివరాలన్నీ చక్కగా సరిపోతాయి. 


ప్రస్తుత భూగోళశాస్త్ర నిర్మాణం


    ఈనాటి కాలంలో కొలంబస్ భారతదేశాన్వేషణకై బయలుదేరి, త్రోవ మారి, అమెరికా చేరుకున్నాడు. 

    అదే ఇండియా అనుకుని భ్రమపడ్డాడు. అది భారతదేశం కాదనుకున్నాక, అక్కడి ప్రజలు రెడ్ ఇండియన్స్ అయ్యారు. 

    అనంతరం వాస్కోడిగామా భారతదేశానికి మార్గం కనుగొన్నాడు. 

    ఈ విధానంలో వెతుకుతూ వెతుకుతూ చిత్రపటాన్ని తయారుచేయడం జరిగింది. 


రామాయణ ప్రత్యేకత 


      కానీ రామాయణం మనకి ఎటువంటి పరిశోధనగానీ - అన్వేషణగానీ అవసరంలేకనే, సమగ్రమైనదీ - పరిపూర్ణమైనదీ అయిన భూగోళశాస్త్రాన్ని చక్కగా అందించింది. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

శ్రీమద్భాగవతము

 *23.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2300(౨౩౦౦)*


*10.1-1438-*


*క. "లౌకిక మొల్లక నన్నా*

*లోకించు ప్రపన్నులకును లోఁబడి కరుణా*

*లోకనములఁ బోషింతును*

*నా కాశ్రితరక్షణములు నైసర్గికముల్.”* 🌺



*_భావము: "భౌతికవాంఛలను అపేక్షించక, నాపైనే చూపులు నిలిపి నన్నే ఆశ్రయించి ఉండెడి భక్తులకు నేను అధీనుడను. కరుణారసదృష్టిని వారిపై ప్రసరించి వారిని కాపాడతాను. నన్ను శరణన్నవారిని రక్షించుట నా సహజస్వభావము."_*🙏



*_Meaning: Sri Krishna declares His magnanimous gesture towards humanity: ”I remain captaive to those, who believe in Me, without wishing for material things. I protect them by projecting generous glance at them. It is My nature to stand by those who seek refuge in Me.”_*🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*