7, జులై 2020, మంగళవారం

భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ

భగవంతుడు ద్వాపరయుగమునందు శ్రీకృష్ణునిగా అవతరించి, ధర్మమును పరిరక్షించి, కంసాది అనేక దుష్ట రాక్షసులను సంహరించి, శిష్టులను పరిరక్షించెను. అలాగే అర్జునుడిని నిమిత్తముగా చేసికొని సమస్తమానవజాతికీ
సకలవేదసారమైన భగవద్గీతను ఉపదేశించెను.

సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః ।
పార్థో వత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతం మహత్॥

అనే శ్లోకము -“శ్రీకృష్ణుడనే గోపాలకుడు ఉపనిషత్తులనే గోవులనుండి మనుష్యులకు ముక్తిమార్గమును చూపెడి భగవద్గీత అనే అమృతసమమైన క్షీరమును మొదట అర్జునుడనే దూడకు అందించి, అనంతరం సమస్తలోకమునకూ అనుగ్రహించెను” అని గీతయొక్క వైశిష్ట్యమునుతెలియజేస్తోంది. అందువల్లనే ఇటువంటి మహోపకారమును చేసిన శ్రీకృష్ణపరమాత్మను “కృష్ణం వందే జగద్గురుం” అని స్తుతిస్తాము. సచ్చిదానందరూపాయ కృష్ణాయాక్లిష్ట కారిణే ।
నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే॥

సచ్చిదానంద స్వరూపుడు, సకలవిధమైన కష్టములను పరిహరించెడివాడు, వేదాంతవేద్యుడు, సద్గురువూ అయిన శ్రీకృష్ణునికి నమస్కారము.

అప్రస్తుత ప్రసంగాలు

అవధానంల మన తెలుగు భాషలోనే వున్న ఒక గొప్ప సాహితి ప్రయోగం.  ఒక కవి ఆశువుగా అంటే అప్పటికప్పుడు నోటితో ఎటువంటి పెన్ను పేపర్ లేకుండా చెప్పే పద్యాలనూ ఆశుకవిత్వం అని అంటారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ప్రతి పద్యానికి ఒక ప్రత్యేకమైన నడక ఉంటుంది దానిని ఛందస్సు అంటారు. ఒక పద్యాన్ని ఒక ప్రత్యేక చందస్సుల్లో మాత్రమే వ్రాయాలి అంటే నాలుగు పాదాలు ఒకే విధమైన గణాలని కలిగి ఉండాలి.  అష్టావధానం అంటే 8మంది పృచ్ఛకులు అడిగే వారికి అవధాని సమాధానం చెప్పటం. ఇందులో అవధాని ఆలోచనలకి భంగం కలిగించటానికి వున్న పృచ్ఛకుడిని అప్రస్తుత ప్రసంగి అంటారు.  అంటే ఈ పృచ్ఛకుడు తన ఇష్టమైన ప్రశ్నను అడగవచ్చు.  అది ఎలాంటిది అయినా అయి ఉండవచ్చు.  ఇక్కడ ఆలా అడిగిన ప్రశ్నలకి అవధాని యెంత చాకచక్యంగా జవాబులు చెప్పారో చుడండి. 
*అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు* 

1 . రైలు పట్టాలకూ,
     కాలి పట్టాలకూ 
     అనుబంధం ఏమిటి?

రైలు పట్టాల మీద వుంటుంది,
కాలి మీద పట్టాలుంటాయి.

2 . కనలేని స్త్రీమూర్తి ఎవరు?

న్యాయస్థానములో వున్న
న్యాయదేవత. కళ్ళకు *గంతలు* కట్టి వుంటారు కదా!

3 . సోమవారాన్ని 'మండే'       అనెందుకంటారు?

ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా సోమవారం పొద్దున్నే
పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా! 
అందుకని 'మండే' అంటారు.

4 . ఒక పిల్లవాడు ఇంటినుండి పారిపోతే కనిపించుటలేదు అని ప్రకటిస్తారు కదా! దానికి పిల్లాడి స్పందన ఏమిటి?

*కని-పెంచుట* లేదు .

5 . ఈ రోజుల్లో పిల్లలు 
     తల్లిని Head Cook గా
     చూస్తున్నారు . 
     మరి తండ్రిని
     ఎలాచూస్తున్నారు?

*ATM* లాగా చూస్తున్నారు.

6 . సభలో ఎవరైనా 
      ఆవులిస్తే మీరేమి చేస్తారు?

పాలిచ్చేవైతే అవధానం
అయ్యాక యింటికి తోలుకెళ్తా .

7 . మనిషికి 
      ఆనందాన్నిచ్చే సిటీ ఏది?

*'పబ్లిసిటీ '*

8 . తుద+ తుద = తుట్టతుద,
      కడ  + కడ = కట్టకడ
      అవుతుంది కదా! 
      అరటి + అరటి 
      ఏమవుతువుంది?

అర టీ + అర టీ 
*ఫుల్ టీ* అవుతుంది.

9 . క్రికెట్ ప్లేయరుకీ, 
     అవధానికీ 
     సామ్యం ఉందా?

వాళ్ళు  *world play* కి వెళ్తారు , 
మేము  *words play* కి వెళ్తాము.

10 . 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నాడు వేమన, ఇప్పుడు మీరేమంటారు? 

"పురుషులందు
పుణ్యపురుషులు 
*ఏరయా?* అంటాను.

11 . దేవుని గుడికి 
        తాళం వెయ్యాలా?          

భజన జరిగే చోట 
*తాళం* తప్పనిసరి.

12 . అద్దం ముందున్న
        ఆడువారికీ,
        మైకు ముందున్న
        అమాత్యులకీ 
        తేడా ఏమిటి?

ఇద్దరికీ *సమయం* తెలియదు.
హోమాలు అంటే ఏంటీ..? 

ముఖ్య హోమాలు వాటి ప్రయోజనాలు .....

గణపతి హోమం :- విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తాము. ఈ గణపతి హోమం చేయడం వలన విజయము, ఆరోగ్యము, సంపద కార్య సిద్ధి కలుగుతాయి. హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ గణపతి హోమానికి అష్ట ద్రవ్యలు/ 8 రకాలు. దర్భ మొదలగునవి ఉపయోగించడం జరుగుతుంది.

రుద్ర హోమం:-పురాణ కథలను అనుసరించి రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్షుని పొందడం జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు. ఏ వ్యక్తి అయితే రుద్ర హోమం చేస్తారో ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడిన ముహూర్తానికి రుద్రహోమం జరపబడుతుంది. ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది.

చండీ హోమం:- హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తిస్వరూపిణి చండీ. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి, సిరిసంపదల కోసం చండి హోమం నిర్వహించడం జరుగుతుంది. చండి హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి. చండీ హోమం చేసేప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది.చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి, నవములలో చేయడం శ్రేష్టం. సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారంగా చండీహోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతుంది.

గరుడ హోమం:- మానవుని శరీరాకృతి, గరుడుని ముఖము కలిగి... శ్రీమహావిష్ణువు వాహనంగా పిలువబడే దైవ స్వరూపమే గరుడుడు. గరుడుడు అనంతమైన శక్తికి, జ్ఞానానికి స్వరూపం. గరుడార్, గరుడ భగవాన్ అని పిలిచుకొనే గరుడుడికి చేసే హోమమే గరుడ హోమం. సరైన విధివిధానాలతో కనుక గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం అలాగే అనేక విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించడం, శత్రువుల మీద విజయం, ప్రమాదాల నుంచి రక్షించబడడం, అన్ని శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం మొదలగునవి లభిస్తాయి. అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయడం వలన జ్ఞానము అలాగే జ్ఞాపకశక్తి వృద్ధి జరుగుతుంది.

సుదర్శన హోమం:- శ్రీమహావిష్ణుకు చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం.హిందూ పురాణాల ప్రకారం ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవ్వడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్టశక్తులను సంహరిస్తుంది. మానవుని జీవితంలో లేదా కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్టశక్తుల నుండి రక్షింపబడడానికి, నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గృహ ప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమం నిర్వహించబడుతుంది. హోమాగ్నికి అష్ట ద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేయడం జరుగుతుంది. మానవుని జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయింపబడిన ముహూర్తాన్ని అనుసరించి ఈ హోమం చేయడం జరుగుతుంది.

మన్యుసూక్త హోమం:- వేదాల ననుసరించి మాన్యు అనగా ఆగ్రహం అని, లేదా మరొక అర్థం లో తీవ్రమైన భావావేశము అని చెప్పబడుతుంది.మాన్యు దేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమము మన్యుసూక్త పాశుపత హోమం. ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేయడం జరుగుతుంది. కోర్టు కేసుల లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కోసం కూడా ఈ హోమాన్ని చేస్తారు. ఈ హోమాన్ని శనివారం చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది.

లక్ష్మీ కుబేర పాశుపతహోమం:- హిందూ ధర్మానుసారంగా... సంపదకి దేవతలుగా లక్ష్మీ దేవిని, కుబేరున్ని పూజిస్తాము.జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారికోసం సూచింపబడేదే లక్ష్మి కుబేర పాశుపతహోమం.జీవితంలో ఆర్థిక వృద్ధి, సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని కూడా ఈ హోమంలో పూజించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం శ్రేష్టం. ఎందుకనగా శుక్రవారాన్ని లక్ష్మీ వా పరిగణిస్తాము కనుక. హోమం చేసుకునే వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి నిర్ణయించబడిన ముహూర్తానికి ఈ హోమం చేయబడును. ఈ హోమం చేయడానికి కమలాలని వాడడం జరుగుతుంది.

మృత్యుంజయ పాశుపత హోమం:- మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయం.పేరులో ఉన్నట్టుగానే మృత్యువుపైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత హోమం నిర్వహిస్తారు. ప్రాణ హాని అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేయడం జరుగుతుంది. దుష్టశక్తులను అదుపుచేసి, సంహరించే భూత నాథుడిగా పిలవబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే హోమం చేస్తారు.ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని 21సార్లు జపించవలసి ఉంటుంది. ఈ హోమం చేయడానికి కావాల్సిన ప్రధాన వస్తువులు. దర్భ, అమృత మూలిక. దీర్ఘాయుష్షును కోరుతూ హోమము చేసే వారి జన్మదినం రోజున ఈ హోమాన్ని నిర్వహిస్తారు.

నవదుర్గ పాశుపత హోమం:- భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజింప బడుతుంది. జట దుర్గ, శాంతి దుర్గ, శూలిని దుర్గ,శబరి దుర్గ,లవణ దుర్గ,అసురి దుర్గ, దీప దుర్గా, వన దుర్గ, మరియు జ్వాలా దుర్గ. దుర్గామాతయొక్క ఈ తొమ్మిది రూపాలను పూజించడానికి చేసే హోమమే ఈ నవదుర్గ పాశుపత హోమం.ఈ హోమం చేయడం వలన దుష్ట శక్తుల నుంచి విముక్తి, శాంతి,సంపద, ఆరోగ్యం, ఆయుష్యు, సంతానం, విద్య మొదలైనవి లభించి ప్రతికూలమైన ఆలోచనలు, ప్రతికూలమైన అంశాలను నుండి విముక్తి కలిగుతుంది.

మౌని

అక్షరాంకపద్యములు

టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి 
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో 
త్కటపటహాదినిస్వన  వియత్తలదిక్తటతాటితార్భటో
ద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం!

డమరుగజాత డండడమృడండ
మృడండ మృడండ మృండమృం
డమృణ మృడండడండ మృణడండడ
డండ మృడం డమృం డమృం
డమృణ మృడండడంకృతి
విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ
త్ర్పమథన తాండవాటన 
"డ"కారనుత బసవేశ పాహిమాం!

ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం
మృణఢంమృణ ఢంఢణోద్ధణం
ధణనటన త్వదీయడమరూత్థ
మదార్భట ఢంకృతి ప్రజృం
భణ త్రుటితాభ్రతార గణరాజ 
దినేశముఖగ్రహప్రఘర్
క్షణగుణతాండవాటన
"ఢ"కారనుత బసవేశ పాహిమాం!

ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణ
ణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ
ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ
విక్రమ జృంభణ సంచలన్నభో
ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ 
ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన
ణ్ణ ణ్మృణ తాండవాటన 
"ణ"కారనుత బసవేశ పాహిమాం!

 *-మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు "అక్షరాంకపద్యముల" నుండి సేకరణ.*




మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ...  ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!! 

మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు .

🌷 *1* . *తల్లి* 

మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...  👩‍🦱తల్లి మొదటి అద్భుతం. 

🌷 *2* . *తండ్రి* 

మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు  
మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు 
దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ..😎 సంతోషాన్ని  మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం. 

🌷 *3* . *తోడబుట్టిన*  *వాళ్ళు* 

మన తప్పులను వెనుకెసుకురావాడానికి...  
మనతో పోట్లాడడానికి...  మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... 
తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 😥🥴☺

🌷 *4* . *స్నేహితులు*  

మన భావాలను పంచుకోడానికి..  
మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...
ఏది ఆశించకుండా..  మనకు దొరికిన స్నేహితులు  నాలుగో  అద్భుతం. 🌚🌝👨✈🕺

 *🌷5* . *భార్య* / *భర్త* 

ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా  చేస్తుంది 
కలకాలం తోడు ఉంటూ...🌛 ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది  🌜
భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  ఐదో అద్భుతం మన సొంతం .

🌷 *6* . *పిల్లలు* 

మనలో స్వార్థం మొదలవుతుంది..  
మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  
వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  
వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ  ఉంటుంది.. 
వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు  అసలు ఉండరు...  🙏
పిల్లలు ఆరో అద్భుతం 

అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?

🌷 *7* . *మనవళ్ళు* *మనవరాళ్లు* 

వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే  ఆశపుడుతుంది.. 
వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం 
మళ్ళీ పసిపిల్లలం...🏃🏃‍♀️👩🔧👨💼👨🎓👩🎓 అయిపోతాం  
వీరు మన జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం 🌹🌺🌷🥀

🌹ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... 
కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి  
చిన్న పలకరింపు  చాలు... మనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి.  
*అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం ...*🙏

అతిశక్తివంతమైన స్త్రోత్రం

*ఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టి అన్నింటిలో విజయాన్ని ఇచ్చే అతిశక్తివంతమైన స్త్రోత్రం
హనుమ లాంగూల స్తోత్రమ్.............!!*

హనుమంతుడి లాంగూలాన్ని పూజించడం కూడా 
అనేక సత్ఫలితాలను ఇస్తుంది.
 " లాంగూలం " అంటే తోక.
ఆంజనేయ స్వామీ తన తోకతో లంకా దహనం చేసిన విషయం, ఎందరో రాక్షసులను అంతమొందించిన విషయం అందరకూ తెలిసిందే! 

అటువంటి ఆంజనేయస్వామి వారి తోకను పూజించడం మంచిది. 
చిత్రపటంను ఏర్పాటు చేసుకుని, 
శనివారం నాడు గానీ, మంగళవారం నాడు గానీ 
పూజను ప్రారంభిచాలి. 

ప్రతిరోజూ ఆంజనేయ స్వామివారిని అష్టోత్తర శతనామాలతో పూజచేసి శక్తిమేరకు పండో, ఫలాన్నో నివేదన సమర్పించి సింధూరంతో తోకపైన ఒక బొట్టు పెట్టవలెను. 
ఈ విధంగా వరుసగా 41 రోజుల పాటూ పూజ చేయడం వల్ల ఎటువంటి పనైనా సానుకూలమవుతుందని, కష్టాలు తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 

అంతేకాకుండా "లాంగూల స్తోత్రం" కూడా ఎంతో మహిమాన్వితమైనది. 
ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల అన్నింటా విజయం లభిస్తుంది. 
ఈ స్తోత్రాన్ని రావి చెట్టు క్రింద కూర్చుని చదవటం మరింత ఫలాన్ని కలిగిస్తిందని నమ్మకం.

హనుమ లాంగూల స్తోత్రం........

శ్రీమంతం హనుమంత మాత్త రిపుభి ర్భూభృత్తరు భ్రాజితం|
చాల్ప ద్వాలధిబధ్ధ వైరినిచయం చామీకరాది ప్రభం|
రోషా ద్రక్త పిశంగ నేత్ర నలినం భ్రూభంగ మంగస్ఫుర|
త్ర్పోద్య చ్చండమయూఖ మాండల ముఖం దుఃఖాపహం దుంఖినాం||
కౌపీనం కటిసూత్ర మౌంజ్యజినయు గ్దేహం విదేహాత్మాజా|
ప్రాణాధీశ పదారవింద నిహిత స్వాం తం కృతాంతం ద్విషాం|
ధ్యాత్వైవం సమరాంగణ స్థిత మథానీయ స్వహృత్పంకజే|
సంపూజ్యాఖిల పూజనోక్తవిధినా సంప్రార్ధయే త్ర్పార్ధితమ్|| 

హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧ ||

మర్కటాధిప మార్తండమండలగ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨ ||

అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౩ ||

రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౪ ||

శ్రీరామచరణాంభోజమధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౫ ||

వాలిప్రమథక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౬ ||

సీతావిరహవారాశిభగ్న సీతేశతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౭ ||

రక్షోరాజప్రతాపాగ్నిదహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౮ ||

గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౯ ||

పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దగ్ధారిపత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౦ ||

జగన్మనోదురుల్లంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౧ ||

స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౨ ||

రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౩ ||

జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౪ ||

భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౫ ||

వైదేహీవిరహక్లాంతరామరోషైకవిగ్రహ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౬ ||

వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౭ ||

అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౮ ||

లక్ష్మణప్రాణసంత్రాణ త్రాతతీక్ష్ణకరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౯ ||

రామాదివిప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౦ ||

ద్రోణాచలసముత్క్షేపసముత్క్షిప్తారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౧ ||

సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౨ ||

ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారూతజప్రసాదాత్ || ౨౩ ||

శ్రీరామ జయరామ జయ జయరామ..!!*🙏

శ్రీ కాళహస్తీశ్వరా!

అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా
కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ
చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుఁ దాఁ
జింతాకంతయు జింత నిల్పఁడుగదా శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా, ఈప్రపంచమున కన్పించు ప్రతియొకటి వాస్తవమైనదిగ కన్పించుచున్నది. కాని వాస్తవము కాదు. వాస్తవమైనది కాదు కనుకనే అది అశాశ్వతమగుచున్నది. సత్యాసత్యములు ఎరుగగలిగిన ప్రతియొకడు తన భార్య/భర్త పుత్రులు, ధనము, శరీరము మొదలైనవి వాస్తవమని శాశ్వతమని తలచుచు వానికై మరియు వానివలన సుఖము పొందుటకు ప్రయత్నింతురు. ఈ మోహమను సముద్రమున పడి ఒడ్డు చేరక లోపలలోపలనే తిరుగుతున్నాడు. ఆలోచించినవారికి నీవు మాత్రమే పరమసత్యవస్తువని తెలుయును. అట్టి నీ విషయము చింతాకంతైన ధ్యానము చేయకున్నారు. ఇది చాల శోచనీయమగు విషయము కదా!

*సంధ్యావన్దనము*

ఇది మూడు భాగాలు కలది. మొదటిది అర్ఘ్య ప్రదానము, రెండువది గాయత్రీ జపము, మూడవది ఉపస్థానము. ఉపస్థానము అనగా పెద్దలను సేవించుట, హజరు చెప్పుకొని లేచి నిలబడి నమస్కారము చేయుట.

వీనిలో అర్ఘ్య ప్రదానము ప్రథమము, ప్రముఖము. గాయత్రీ జపానికి ఆలస్యమగుట వల్ల ఎక్కువ చేయవలెను అను ప్రాయశ్చిత్త విధి లేదు. అర్ఘ్య ప్రదానమునకు ఆలస్సమయినచో ప్రాయశ్చిత్తార్ఘ్యమున్నది. మరియు జాతాశౌచ మృతాశౌచములలో అర్ఘ్యప్రదానము వరకు చేసి తీరవలయిను. ఇంకను ఆలోచింపగా అర్ఘ్య ప్రదానములో ప్రధానము ‘అసావాదిత్యో బ్రహ్మా’ అనునది. ఇది సంపదుపాసనము. అనగా అల్పము నందు మహత్తరమును ధ్యానించుట. ఉదాహరణము సాలగ్రామమందు విష్ణు భావనము. ఇచట సౌరకుటుంబానికి పెద్దయై గ్రహరాజయిన సూర్యుని యందు బ్రహ్మండ సృష్టి స్థితి లయ కారణమగు పరంబ్రహ్మను ధ్యానించుట సంపదుపాసనము. దీని పర్యవసానము తైత్తిరీయ మందున్న “సయశ్చాయం పురుషో యశ్చాసా వాదిత్యే సయేకః” అను వాక్యబోధ. దూరము నందున్న సూర్యుని యందున్న పరమాత్మ, ఈ జీవుని యందున్న పరమాత్మ ఒక్కడే అను అవగతి సాధ్యము.

దీనికి కావలసిన చిత్తశుద్ధికి ఆరంభబములో పుండరీకాక్ష స్మరణం చెప్పబడినది. ఇక్కడ పుండరీక మనగా హృత్పుండరీకము హృదయ కమలము. అదియే అక్షము ఇంద్రియము. ప్రస్తుతము నేత్రముగా చూపుగా జ్ఞానముగా గలవాడను అర్థమున పెద్దలు చెప్పియున్నారు. అతనిని స్మరింపగా బయట, లోపల కూడా పరిశుద్ధడగును. తదుపరి ఆచమనములతో “ఆపోహిష్టా” అను మంత్రాలతో “హిరణ్యవర్ణా” మున్నగు మంత్రాలతో ప్రాణాయములతో ఉక్కరి బిక్కిరియై లోపలి పాపము బయట పడుటకు సిద్ధమగును. అప్పుడు “ద్రుపదాదివముంచతు” అను మంత్రముతో ఆ పాపమును నీళ్లలోనికి వదలి విసరివేయవలెను. ఇట్టి పరిశుద్థితో అర్ఘ్యప్రదానము చేసి అదిత్యోపాసన చేయవలయును. ఉపాసన యొక్క భావార్ధము జ్ఞానమందు లయించును. ఈ జ్ఞానమేమి? సృష్టి స్థతి లయ కారకమగు పరబ్రహ్మ, ఆత్మ కంటే వేరుకాదని తెలియుట. ఇట్లు బ్రహ్మధ్యానపరుడు క్రమంగా బ్రాహ్మణ శబ్ధానికి అర్హుడగుచున్నాడు. ఇందువల్ల బ్రాహ్మణ జాతికి సంధ్యావందనము ప్రధానమయింది.

అర్ఘ్య ప్రదానము నీళ్లతోనే ఎందుకు చేయవలె అనగా పూలు పండ్లు సూర్యుని దాకా ఆకాశములో ఎగురలేవు. కాని జలములు ఒక చుక్క అయినను ఎక్కడ పడినను అవి ఆవిరి అయి సూర్యుని చేరి తీరును.

కర్మ ఉపాసన జ్ఞానము మూడే వేదములందు చెప్పబడినవి. కర్మానుష్టానమునకుగా గృహస్థాశ్రమము. ఉపాసనకుగా వానప్రస్థము, జ్ఞానమునకుగా సన్యాసమును ఏర్పడినవి. వీనికి పునాదిగా ప్రథమ సోపానముగా బ్రహ్మచర్యము, వేదశాస్త్రాధ్యాయనము కొరకు నిలబడింది.

నిత్యనైమిత్తిక కామ్యా నిషిద్ధ శాన్తి వేష్టికాభ్యుదయ కర్మలలో మొట్టమొదటి నిత్య కర్మ సంధ్యావందనము. వేదములోని ఉపాసనాకాండ తరువాత తరువాత భక్తి పేరుతో ప్రకటమయింది. ఇక్కడ సూర్యునిపై శ్రద్ధా భక్తులు ప్రబుద్ధము లయినవి గనుక సంధ్యావందనములో భక్తి కలదు.

ఇది జ్ఞానమునకు అత్మజ్ఞానానికి బ్రహ్మత్మజ్ఞానానికి దోహదమయినది గనుక నిత్య కర్మకు ఈశ్వరభక్తికి జ్ఞానమునకు మూడిటికి ఆలవాలము.

ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అర్ధరాత్రి నాలుగు సంధ్యలున్నవి. సంధ్యావన్దనము కనీసము ఉదయాస్తమయాలలో తప్పనిసరి. మూడు వేళ్ల చేస్తే మధ్యమము. నాలుగు వేళల చేస్తే ఉత్తమము.

సంధ్యలలో అనుసన్ధానము చేయబడుచున్నది గనుక సంధ్య అన్నారు. వేదమంత్రవర్ణములు దేవుని తేజస్సును అర్థముగా మోయుచున్నవి గనుక గాయత్రి వేదమాత అనబడునది. English లో దీని usage Impregnant with knowledge అని కలదు. అనగా జ్ఞానమును వహించు వాక్కు స్త్రీ రూపము.

ఉపనిషత్తులలో అగ్రగమ్యమయిన ఈశావాస్యములో కర్మకు విద్యకు సముచ్చయము చెప్పబడినది. నిత్యకర్మ సుర్యోపాసనలకు ఇచట సముచ్చయమును నిరభ్యంతరముగా మనము భావించుకొనగలము. విద్యాపదము ఉపనిషత్తులలో ఉపాసనాపరముగా ప్రయుక్తమయినది. కాబట్టి వైదిక కర్మ అనునది విద్య అనునది ప్రప్రథమము సంధ్యావందనములో కలదు. అకర్మణ్యులు అబ్రహ్మణ్యులు అవిద్యలో పడి పోవుచున్నారు. కర్మభూమియైన భారతదేశములోని ప్రజలు అట్లు కాకుందురు గాక.

C. అశోక్ కుమార్

మిత్రలాభం


*సంహతిః శ్రేయసీ పుంసాం స్వకులైరల్పకైరపి ।*
*తుషేణాపి పరిత్యక్తా న ప్రరోహన్తి తండులాః ।।*

సుభాషితం-హితోపదేశం-మిత్రలాభం - నారాయణ పణ్డితుడు

*ప్రతిపదార్థం:*
పుంసాం = పురుషులందు (పురుష శబ్దం సంస్కృత భాషలో స్త్రీ పురుషులు ఇద్దరినీ సంబోధించే వాచకం), శ్రేయసీ = శ్రేయోభిలాష్ని, సంహతిః = కూడగట్టుకోని  అల్పకైః = అల్పులైనిట్టి లేక తక్కువ వారైనట్టి, స్వకులైః = స్వంత కులములోని వారిని లేదా స్వంత వారిని, అపి = కూడా,  
తుషేణా అపి = పొట్టుని కూడా, పరిత్యక్తా = తీసి పడేస్తే,  తండులాః = బియ్యపు గింజలు, న ప్రరోహన్తి = మొలకలెత్తవు,

*Meaning:*
To be together united lies prosperity among human beings, especially in their own respective clans and families just as the protective cover over the rice grains is essential for the rice to grow into paddy from the earth. All are equal. All human beings are equal. 

*తాత్పర్యం:*
తనవారిని అల్పులైన వారినిసైతం దూరం చేసికొనరాదు. అందరూ ఐకమత్యంగా వర్తిల్లితేనే శ్రేయస్సు కలుగును. వడ్లగింజలక పై పొట్టు పోయినచో మొలకలెత్తవు.
మనుషులలో సంఘీభావమే శ్రేయస్కరమైనది. తమ కులములోని వారు అల్పులైనప్పటికీ వారందరితో సంఘటితముగా ఉండడమే కులాభివృద్ధి, కుటుంబ వృద్ధియూ. 

వండుకుని తినడానికి అవసరమైనవి బియ్యపు గింజలే. పొట్టు అనవసరమైనది, వృథా అనుకుని విసర్జించడం సరియైనది కాదు. మరల మరల బియ్యం కావాలి అంటే, అవసరమైనవి పై పొట్టొతో కూడిన బియ్యపు గింజలే. అంటే ధాన్యం అత్యంత అవసరం. పైపొట్టులేనిచో బియ్యపు గింజలు మొలకెత్తవు. పొట్టుతోకూడిన బియ్యపు గింజలు అంటే ధాన్యమైతేనే అవి మొలకలెత్తుతాయి. 

పొట్టుని అనవసరమైనదిగా భావించి అల్పమైనదిగా తీసిపాడేయరాదు. ఆ పొట్టు కూడా, విడిగా తన ప్రయోజనాలు కలిగి ఉంటుంది కూడా. అల్పమైనది గా భావించి కించపరచరాదు.

అదేవిధముగా బంధుజనులలో, కుటుంబములో, తమ కులములో ప్రతివారూ ఏదో విధముగా పనికి వచ్చే వారే. ఎవరూ పనికి రాని వారు కాదు. ఎవరూ అల్పులూ కాదు. ఎవరూ అధికులూ కారు. ప్రతి ఒక్కరూ వారి వారికి అనుగుణమైన సమయాలలో వారి విధులు నిర్వర్తించుతూ అందరి శ్రేయస్సుకీ దోహదకారులౌతారు. అందరూ నారాయణ స్వరూపులే. అందరూ సమానమే!

విశ్వమానవ సౌభ్రాత్వాన్ని ప్రతిపాదించే దిశగా, ముదుగా తమ తమ బంధువర్గాలలో అందరూ సమానమే అనే సూక్తిని తెలియ పరచే ఒక మంచి సుభాషితము. 

ఇది నారాయణ పండితుడు రచించిన హితోపదేశములోని మిత్రలాభము అనే ప్రకరణము లోనిది

సాముద్రిక శాస్త్రం

జ్యోతిష్యం లో సాముద్రిక శాస్త్రం కూడా ఒక భాగం. దీనిలొ మనిషి యొక్క అవయవాలపొందికను, తీరును బట్టి అతని జీవితాన్ని చదవవచ్చు. దీనిలో హస్త సాముద్రికం ఒక విశిష్ట విద్య. వేళ్ళ అమరిక మనిషి మనస్తత్వాన్నితెలియచేస్తుంది. హస్త రేఖలు ఇంకా అనేక జీవిత వివరాలను తెలియ చేస్తాయి. జ్యోతిష్యం కంటే ఇది నేర్చుకోవటంతేలిక. కారణం ఏమంటే,దీనిలో విశ్లేషణలు ఉండవు. క్లిష్టమైన గ్రహ కారకత్వాలు ఉండవు. ఉన్న విషయం కళ్ళకు కట్టినట్లు చేతిలో కనిపిస్తూ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే, ప్రతి మనిషీ తన జాతకాన్ని తన చేతిలోనే ఉంచుకుని తిరుగుతూ ఉన్నాడన్నమాట.
ఉదాహరణకు, ఉంగరపు వేలు చూపుడు వేలుకన్నా పొడవుగా ఉంటె క్రియా శీలురు ధనికులు అవుతారు. ఇది హస్తసాముద్రికం లో ఒక సూత్రం. ఒక విదేశీ యూనివర్శిటీ లో స్టాటిస్టికల్ స్టడీ ద్వారా ఈ మధ్యనే పరిశోధన చేసి ఇది నిజమేనని తేల్చారు. ఈ వార్త ఈ మధ్యనే "ఈనాడు" లో వచ్చింది కూడా.
అయితే స్టాటిస్టికల్ పరిశోధకులు గణాంకాలను బట్టి ఇది నిజమే అని తేల్చారు గాని ఎందుకు ఎలా ఇది జరుగుతుంది అనేది వారి బుర్రలకు తట్టలేదు. శాస్త్రం దీనిని వివరించి చెప్పింది. ఉంగరపు వేలు సూర్యునికి సూచిక. చూపుడు వేలు గురువు గారికి సూచిక. ఉంగరపు వేలు పొడవుగా ఉన్నప్పుడు అతనికి ఉత్సాహం, దూసుకుపోయే తత్వం,క్రియేటివిటీ,ధైర్యం ఉంటాయి. తినడం కంటే పనిచెయ్యటం మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది. కనుక అలాటివాళ్ళు జీవితంలో త్వరగా ఎదుగుతారు. ధనాన్ని, ఇన్ప్లూయెన్స్ ను సంపాదిస్తారు. ఆయా వ్యక్తిత్వలక్షణాలు ఈవిధంగా ఆయా శరీరభాగాలలో ప్రతిబింబిస్తుంటాయి. డిడక్టివ్ మరియు ఇండక్టివ్ లాజిక్ ను ఉపయోగించి ఇలాటి పరిశీలన ద్వారా మనిషి మనస్తత్వాన్ని, అతని అలవాట్లను స్వభావాన్ని, దాన్నిబట్టి భవిష్యత్తును ఊహించవచ్చు. అది చాలావరకు నిజం అవుతుంది.
మొన్న ఆరో తేదీన మా స్నేహితునికి హార్ట్ ఎటాక్ వచ్చింది. నేను వెళ్లి పలకరించాను. మాటల సందర్భంలో అతనుచెప్పినది విని నేను ఆశ్చర్య పోయాను. "పదేళ్ళ క్రితం నా చెయ్యి చూచి నువ్వు చెప్పావురా. నీకు నలభై ఏళ్ల ప్రాంతంలో ప్రాణ గండం ఉంది.అది గుండెకు సంబంధించినదిగా ఉంటుంది.జాగ్రత్తగా ఉండు.అలవాట్లు,ఆహార విహారాదులలో జాగ్రత్త అని చెప్పావు.అలాగే జరిగింది." అన్నాడు. అప్పుడు నాకు గుర్తు వచ్చింది. ఒకసారి అతని చెయ్యి చూచి అలా చెప్పిన మాట నిజమే. "ఇప్పుడు నీ వయసెంత?" అడిగాను. "నలభై మూడు" చెప్పాడు.
మళ్లీ ఒకసారి అతని లైఫ్ లైన్ పరిశీలించాను.అది సరిగ్గా నలభై ఏళ్ళ ప్రాంతంలో తెగిపోయి ఉన్నది. కాని ఆ పక్కనుంచే మళ్లీ ఇంకొక రేఖ మొదలై పైకి ప్రయాణించింది. కనుకనే హార్ట్ ఎటాక్ వచ్చినా కూడా నిలదొక్కుకుని బయట పడ్డాడు.మెడికల్ పామిస్ట్రీ ఒక అద్భుతమైన శాస్త్రం అనడానికి ఇంతకంటే రుజువు ఏమి కావాలి? "నాకు బాధగా ఉందిరాదేవుడా" అని రోగి మొత్తుకుంటున్నా కూడా అన్ని టెస్ట్ లూ చేయించి నీకేమీ రోగం లేదు. నీకు సైకోసిస్ అనబడే మానసిక భ్రమ మాత్రమే పొమ్మని వైద్యులు చేతులు దులుపుకుంటున్న ఈరోజులలో పదేళ్ళ తర్వాత రాబోతున్న గుండెజబ్బును ముందే చెప్పిన శాస్త్రం గొప్పదా కాదా?
ప్రపంచ ప్రఖ్యాత సాముద్రికుడు "కీరో" ఒకరోజున రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా పక్కవారి హస్తరేఖలు పరిశీలించాడు.విచిత్రంగా అందరికీ లైఫ్ లైన్ అనబడే జీవనరేఖ తెగిపోయి ఉండటమూ, అది తెగిపోయిన వయసు దాదాపుగా ప్రస్తుతవయసుతో సరిపోతూ ఉండటమూ,గమనించి పక్క స్టేషనులో దిగిపోయాడు.ఆ తర్వాత కొద్దిదూరానికే ఆరైలు ప్రమాదానికి గురై ఆబోగీలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయారు.కీరో బతికి బయట పడ్డాడు.యూరోపియన్ అయిన కీరో,కాశీలో కొన్నేళ్ళు నివసించి, కాశీ పండితులవద్ద హస్తసాముద్రికశాస్త్రం నేర్చుకున్నాడు.అతను హస్తాంగులీమంత్రాన్ని ఉపాసించేవాడని కొద్ది మందికే తెలుసు.
మన ప్రాచీనవిజ్ఞానంలో ఒకటైన హస్తసాముద్రికం వల్ల ఇలాటి ఆశ్చర్యకరమైన ఫలితాలు తెలుసుకోవచ్చు.మన భవిష్యత్తు బ్లూప్రింట్ మన చేతిలోనే ఉంది.అయితే దానిని డీకోడ్ చేసి, అర్ధం చేసుకొని, తెలివిగా ప్రవర్తించేవారు భవిష్యత్తుని తదనుగుణం గా మార్చుకునేవారు తక్కువ. దానికి ఎవరేం చెయ్యగలరు ? బుద్ది కర్మానుసారిణి కదామరి.

మీ రెండు చేతులను ఇలా దగ్గరగా పెడితే ఆ మద్యరేఖ కలుస్తుందా? 
ఎన్నో వేల ఏళ్ల నాటి నుంచి హస్త సాముద్రికం (చేతి రేఖలను బట్టి జాతకం చెప్పడం) చలామణీలో ఉంది. అయితే కొన్ని ఏళ్ల పాటు అత్యంత కూలంకషంగా అధ్యయనం చేసిన నిపుణులైన కొందరు మాత్రమే దీన్ని సరిగ్గా చెప్పగలుగుతారు. ఇప్పటి రోజుల్లో మనలో అనేక మంది హస్తసాముద్రికాన్ని కూడా నమ్ముతున్నారు. చేతిలోని రేఖల తీరుతెన్నులను బట్టి మన జాతకాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని వారి విశ్వాసం. అయితే కొందరికి ఇది అంత ఆసక్తికరమైన విషయం అనిపించకపోవచ్చు. హస్తసాముద్రికమేంటి, నాన్‌సెన్స్ అని తీసిపారేస్తారు కూడా. ఇది పక్కన పెడితే అసలు ప్రేమ, వివాహం అనే కీలక అంశాలకు చెందిన రేఖలు మాత్రం చేతిలో ఎక్కడ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక వ్యక్తి చేతిలో ఉన్న రేఖలను బట్టి ప్రేమతో కూడిన అతని వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవచ్చు. హస్తసాముద్రికం నైపుణ్యం కలిగిన వారు దీన్ని అత్యంత కచ్చితంగా చెప్పగలరు. ఎల్లెన్ గోల్డ్‌బర్గ్ అనే మహిళ గత కొన్ని సంవత్సరాలుగా హస్తసాముద్రిక శాస్ర్తాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. చేతి రేఖలను బట్టి ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పగలిగే సామర్థ్యాన్ని ఇప్పుడామె సాధించింది. ఆమె ఏమంటుందంటే ఒక వ్యక్తి చేతిలో ఉండే ఆయా రేఖలు అతని జీవితంలోని పలు అంశాల గురించి వివరంగా తెలుపుతాయని చెబుతోంది.
బొటనవేలు దగ్గర ప్రేమ, వాత్సల్యం, అభిమానానికి సంబంధించిన రేఖలు ఉంటాయట. ఒక వ్యక్తి ఏదైనా ఒక నిర్దిష్ట వయస్సుకు రాగానే ఆ రేఖలు కనిపిస్తాయట. అప్పుడు వారికి తగిన వ్యక్తులు జీవిత భాగస్వాములుగా దొరుకుతారట.
చిటికెన వేలు కింద వివాహానికి సంబంధించిన రేఖ ఉంటుందట. రెండు చేతుల్లోనూ ఉండే ఈ రేఖలను కలిపి పక్క పక్కనే ఉంచి చూస్తే అవి సమానంగా జత కలవాలట. అలా కలిస్తే వివాహం త్వరగా అవుతుందట.

ఇద్దరు ప్రియురాళ్లు

మనం ఇద్దరు ప్రియురాళ్ల గూర్చి తెలుసుకుందాము. 
మొదటి ప్రియురాలు తన ప్రియుడి ఫోటో దగ్గర పెట్టుకొని ఆ ఫొటోలో తన ప్రియుడిని చూసుకుంటూ రోజు ఒక ప్రేమ లేఖ తనకు తెలిసిన అడ్రసుకు రాస్తూ వున్నది.  తన ప్రియుని ఫోటో ఎల్లప్పుడు తన చెంతనే ఉంచుకుంటుంది.  ఆ ప్రియుడి గూర్చి అనేక విధాలుగా స్తోత్రాలు చేస్తూ ప్రియుడు తనని వెతుకుంటూ వస్తాడు చేపడతారు అని ఎప్పుడు అనుకుంటుంది.  అది చూసి తన మితృరాళ్లు ఆమెను యెగతాళి చేస్తూవుంటారు.  అయినా ఆమె తన ప్రయత్నం మానకుండా నిరంతరం తన ప్రియుడిగూర్చి మాత్రమే ఆలోచిస్తూ కాలం గడుపుతుంది. ఏనాడైనా తన ప్రియుడి రాక పోతాడా అనేది ఆమెకు నిరంతరంగా వున్న ఆశ.  ఆమె ఆశ నెరవేరుతుందా? ఆమె ప్రియుడు వస్తాడా అనేది ఒక పెద్ద సమస్య.  ముందుగా తన ప్రియుడికి తాను వ్రాసిన ప్రేమ లేఖ అందిందో లేదో తెలియదు. అందితే తాను ఏ విధంగా స్పందిస్తారో తెలియదు. ఇన్ని ప్రశ్నలు ముందు వున్నా తాను  మాత్రం తన ప్రియుడికోసం ఎదురు చూడటం మాత్రం మానటం లేదు. జీవితాంతం ఎదురుచూసిన సరే తన ప్రియుడిని పొందాలి అన్నదే ఆమె భావన. 

ఇక రెండో ప్రియురాలు గూర్చి తెలుసుకుందాం.  ఈమె కూడా తన ప్రియుడి ఫోటో సంపాయించింది, అంతే కాదు ఎంతో మందిని కలిసి అతి కష్టం మీద తన ప్రియుడి అడ్రస్ తెలుసుకుంది.  అంతే కాదు తన ప్రియుడు ఎక్కడో అమెరికాలో ( చాలా దూరంలో) ఉంటాడు. తాను వున్న పరిస్థితిలో తను  అమెరికా వెళ్లే స్థితి లేదు ఏమిచేయాలి అని ఆలోచనల మీద ఆలోచనలు. చివరికి తన ఆస్తి పాస్తులు తన వద్ద వున్న ధనమంతా కూడగట్టి విమానం ఎక్కి అమెరికా చేరాలని ప్రయత్నం. తాను విమానం ఇంతవరకు ఎక్కలేదు అది ఎలా వుంతుందోకూడా తెలియదు కానీ తన పూర్తి శక్తిని అంతటిని కూడబెట్టుకొని ప్రయాణం మొదలు పెట్టింది. తోటివారు ఆమె ప్రయత్నం చూసి నవ్వుకున్నారు. కొందరు నీకు ఇది సాధ్యం కాదు అని అనటమే కాకుండా ఆమె ప్రయత్నానికి ఎన్నో విధాలుగా అవరోధాలు కలుగ చేస్తున్నారు. కానీ ఆమెకు ఒకటే లక్ష్యం అది తన ప్రియుడిని చేరాలి.  ఆ లక్ష్యం ముందు ఏ అవాంతరం కూడా ఆమెకు కనపడటం లేదు తాను తిన్నది తిననిది కూడా ఆమెకు తెలియటంలేదు. తాను ఏ వస్త్రం ధరించింది అది అందంగా ఉందా లేదా అనే ఆలోచన లేనే లేదు. కేవలం ఒకటే జాశ అది తన ప్రియుడిని చేరుకోవాలన్నది మాత్రమే. ఆ జాస తోటే ఆమె అమెరికా విమానం ఎక్కింది. అమెరికా చేరింది ప్రియుడి అడ్రసు చేరుకుంది ప్రియుడిని కలుసుకుంది. ఇప్పుడు ఆమెకు ప్రియుడు తన కళ్ళ ముందు వున్నాడు.  ఆమెకు ప్రియుడి ఫొటోతో అవసరం లేదు. కేవలం ప్రియుడు తనని కనికరించాలి. ఆమె మనసంతా ప్రియుడు, ప్రియుడు ఇంకోటి లేనే లేదు. 

ఇప్పుడు చెప్పండి పైన వున్న ఇద్దరు ప్రియురాళ్లలో ఎవరు తన ప్రియుడి మనస్సు గెలుచుకుంటారు. ఎవరైనా సరే రెండవ ప్రియురాలే అని వెనువెంటనే చెపుతారు. ఎందుకంటె అదే లోక రీతి. 

పదాల మార్పు: ఇప్పుడు మొదటి ప్రియురాలు అనే పదాన్ని "భక్తుడు' అని రెండవ ప్రియురాలు అనే పదాన్ని "జిజ్ఞాసి" అని ప్రియుడు అనే పదాన్ని "భగవంతుడు" అని మర్చి చదవండి. 

ఆలా చదివితే మీకు రెండు విషయాలు బోధ పడుతాయి. మొదటి ప్రియురాలు కేవలం ప్రియుడి ఫోటో పెట్టుకొని తన ప్రయత్నం చేస్తున్నది.  కాబట్టి ఆమెకు ఫోటో చాలా అవసరం. అంటే భక్తునికి దేముడి ఫోటో, దేముడి విగ్రహం తప్పకుండ కావాలి అవి లేకుండా భక్తుడు దేముడిని ధ్యానం చేయలేదు. షోడాచోపచార పూజలు, సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇవి అన్ని ప్రియుడికి వ్రాసే ప్రేమ లేఖలు.  వాటిని ప్రియుడు (భగవంతుడు) గ్రహించి ప్రియురాలిని(భక్తుడిని)  తన వద్దకు చేర్చుకుంటాడా లేదా అనేది ఒక పెద్ద ప్రెశ్న. దీనికి రెండు విధాల అవకాశం వుంది ఒకటి తన వద్దకు చేర్చుకోవచ్చు లేక చేర్చుకోక పోవచ్చు. మొదటి ప్రియురాలు (భక్తులు) లాంటి వారు అనేక మంది ఈ ప్రపంచంలో వుంటారు అందులో ఎవరిని ప్రియుడు (భగవంతుడు) ఎప్పుడు శ్వీకరిస్తాడు, అనేది కూడా అనుమానాస్పదం. కాబట్టి భక్తి మార్గం సుదూరమైనది. 

ఇక  రెండో ప్రియురాలు (జిజ్ఞాసి) గూర్చి ఆలోచిద్దాం. ఈ ప్రియురాలు అనేక కష్ట నష్టాలకు ఓర్చి ప్రియుడిని చేరుకుంది కాబట్టి తనకు ఫొటోతో పని లేదు విగ్రహారాధన షోడశ పూజలు (ప్రేమ లేఖలు) అవసరం లేదు ఎందుకంటె తాను  తన కళ్ళతో తన ప్రియుడిని (భగవంతుని) నిజ స్వరూపం చూస్తున్నది కాబట్టి. ఆ దర్శనంతో తన్మయం ఐపోయంది. ఇక తానూ అనే భావానే లేదు కేవలం ప్రియుడు (భగవంతుడు) ఈ స్థితినే "త్వమేవాహం" అని అంటారు.  ఈ భూమి మీద ఏ కొందరో ఈ స్థితిని చేరుకుంటారు.  వారు ఈ ప్రపంచంలో వుంటారు కానీ ప్రపంచంతో సంబంధంలేకుండా వుంటారు. ఇక్కడి వాళ్ళ దూషణ భిషణాలకు దూరంగా వుంటారు. 

ఏతా వాత తెలిసేది ఏమంటే భక్తి, జ్ఞాన మార్గాలు రెండు కూడా మంచివే కానీ జ్ఞాన మార్గం కష్టతరమైనది.  అయినా ఈ మార్గంతోటె మనం భగవత్ సాక్షాత్కారం పొందటం తొందరగా అవుతుంది.  
ఇప్పుడు మీరే ఆలోచించండి ఈ రెండిటిలో ఏది ఎవరికి ఆచరణీయం. 

గమనిక: ఇక్కడ అమెరికా, విమానం అనేవి కేవలం అవగాహనకు మాత్రమే కల్పించినవి. 

మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ఈ జగత్తు (ప్రపంచం)  మొత్తం స్త్రీ భగవంతుడు ఒక్కడే పురుషుకు. జగత్తులో వున్నాం కాబట్టి అందరమూ స్త్రీ అంశాలోనే వున్నాము. లింగ దేహం కేవలం ఐహికమైనది మాత్రమే.  అది కేవలం సమాజం కోసమే. భగవంతుని విషయంలో స్త్రీ, పురుష, కుల వర్ణ భేదం లేదు.  ఈ సమాజపు కట్టుబాట్లు కేవలం సమాజం కోసం మాత్రమే పరిమితం.   ఆయన ప్రపంచంలో అందరూ ఒకటే, అందరు సమానమే.  ఈ విషయం తెలుసుకోటానికి మనకు చాలా జ్జ్ఞానం కావలి.  ఆ జ్ఞానం మనకు సత్గురువులు మాత్రమే ఇవ్వగలరు.