7, జులై 2020, మంగళవారం

మిత్రలాభం


*సంహతిః శ్రేయసీ పుంసాం స్వకులైరల్పకైరపి ।*
*తుషేణాపి పరిత్యక్తా న ప్రరోహన్తి తండులాః ।।*

సుభాషితం-హితోపదేశం-మిత్రలాభం - నారాయణ పణ్డితుడు

*ప్రతిపదార్థం:*
పుంసాం = పురుషులందు (పురుష శబ్దం సంస్కృత భాషలో స్త్రీ పురుషులు ఇద్దరినీ సంబోధించే వాచకం), శ్రేయసీ = శ్రేయోభిలాష్ని, సంహతిః = కూడగట్టుకోని  అల్పకైః = అల్పులైనిట్టి లేక తక్కువ వారైనట్టి, స్వకులైః = స్వంత కులములోని వారిని లేదా స్వంత వారిని, అపి = కూడా,  
తుషేణా అపి = పొట్టుని కూడా, పరిత్యక్తా = తీసి పడేస్తే,  తండులాః = బియ్యపు గింజలు, న ప్రరోహన్తి = మొలకలెత్తవు,

*Meaning:*
To be together united lies prosperity among human beings, especially in their own respective clans and families just as the protective cover over the rice grains is essential for the rice to grow into paddy from the earth. All are equal. All human beings are equal. 

*తాత్పర్యం:*
తనవారిని అల్పులైన వారినిసైతం దూరం చేసికొనరాదు. అందరూ ఐకమత్యంగా వర్తిల్లితేనే శ్రేయస్సు కలుగును. వడ్లగింజలక పై పొట్టు పోయినచో మొలకలెత్తవు.
మనుషులలో సంఘీభావమే శ్రేయస్కరమైనది. తమ కులములోని వారు అల్పులైనప్పటికీ వారందరితో సంఘటితముగా ఉండడమే కులాభివృద్ధి, కుటుంబ వృద్ధియూ. 

వండుకుని తినడానికి అవసరమైనవి బియ్యపు గింజలే. పొట్టు అనవసరమైనది, వృథా అనుకుని విసర్జించడం సరియైనది కాదు. మరల మరల బియ్యం కావాలి అంటే, అవసరమైనవి పై పొట్టొతో కూడిన బియ్యపు గింజలే. అంటే ధాన్యం అత్యంత అవసరం. పైపొట్టులేనిచో బియ్యపు గింజలు మొలకెత్తవు. పొట్టుతోకూడిన బియ్యపు గింజలు అంటే ధాన్యమైతేనే అవి మొలకలెత్తుతాయి. 

పొట్టుని అనవసరమైనదిగా భావించి అల్పమైనదిగా తీసిపాడేయరాదు. ఆ పొట్టు కూడా, విడిగా తన ప్రయోజనాలు కలిగి ఉంటుంది కూడా. అల్పమైనది గా భావించి కించపరచరాదు.

అదేవిధముగా బంధుజనులలో, కుటుంబములో, తమ కులములో ప్రతివారూ ఏదో విధముగా పనికి వచ్చే వారే. ఎవరూ పనికి రాని వారు కాదు. ఎవరూ అల్పులూ కాదు. ఎవరూ అధికులూ కారు. ప్రతి ఒక్కరూ వారి వారికి అనుగుణమైన సమయాలలో వారి విధులు నిర్వర్తించుతూ అందరి శ్రేయస్సుకీ దోహదకారులౌతారు. అందరూ నారాయణ స్వరూపులే. అందరూ సమానమే!

విశ్వమానవ సౌభ్రాత్వాన్ని ప్రతిపాదించే దిశగా, ముదుగా తమ తమ బంధువర్గాలలో అందరూ సమానమే అనే సూక్తిని తెలియ పరచే ఒక మంచి సుభాషితము. 

ఇది నారాయణ పండితుడు రచించిన హితోపదేశములోని మిత్రలాభము అనే ప్రకరణము లోనిది

కామెంట్‌లు లేవు: