అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా
కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ
చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుఁ దాఁ
జింతాకంతయు జింత నిల్పఁడుగదా శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా, ఈప్రపంచమున కన్పించు ప్రతియొకటి వాస్తవమైనదిగ కన్పించుచున్నది. కాని వాస్తవము కాదు. వాస్తవమైనది కాదు కనుకనే అది అశాశ్వతమగుచున్నది. సత్యాసత్యములు ఎరుగగలిగిన ప్రతియొకడు తన భార్య/భర్త పుత్రులు, ధనము, శరీరము మొదలైనవి వాస్తవమని శాశ్వతమని తలచుచు వానికై మరియు వానివలన సుఖము పొందుటకు ప్రయత్నింతురు. ఈ మోహమను సముద్రమున పడి ఒడ్డు చేరక లోపలలోపలనే తిరుగుతున్నాడు. ఆలోచించినవారికి నీవు మాత్రమే పరమసత్యవస్తువని తెలుయును. అట్టి నీ విషయము చింతాకంతైన ధ్యానము చేయకున్నారు. ఇది చాల శోచనీయమగు విషయము కదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి