5, జనవరి 2024, శుక్రవారం

Hanuman temple


 

Prbhpaadulavaaru


 

Petrol on off lock


 

Vartana


 

Puri jagannath


 

Petrol bunk in malasis


 

Tirumala samaacharaml


 

Female bus driver


 

Venkateshwar swami darshan


 

Roof water technique


 

Free water pumping from well


 

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


అంతలోకీ - యమధర్మరాజులాగా విశ్వామిత్రుడు వచ్చిపడ్డాడు. నీళ్ళు చల్లి హరిశ్చంద్రుణ్ణి

మూర్ఛదేర్చాడు. లే.లే. నా దక్షిణ నాకియ్యి. అప్పు తీర్చకపోతే ఇలాగే ఉంటుంది. రోజురోజుకీ దుఃఖం

పెరుగుతుంది అన్నాడు.


ఉత్తిష్ఠోత్తిష్ఠరాజేంద్ర స్వాం దదస్వేష్టదక్షిణామ్ |

ఋణం ధారయతాం దుఃఖమహన్యహని వర్ధతే

(21-3)

హరిశ్చంద్రుడు స్పృహలోకి వచ్చాడు. ముఖంమీద చల్లని నీళ్ళు జల్లిన మహర్షి వైపు

ఆప్యాయంగా చూశాడు. గుర్తుపట్టి హఠాత్తుగా మళ్ళీ మూర్ఛిల్లాడు. విశ్వామిత్రుడికి వొళ్ళు మండింది.

రాజా ! ధైర్యంగా బతకాలనుకుంటే ముందు నా అప్పు తీర్చు. సత్యానికి కట్టుబడి ఉండటమంటే

మాటలనుకొంటున్నావా? సత్యంవల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సత్యంవల్లనే భూగోళం నిలబడింది.

సత్యంలోనే ఉత్తమధర్మం ఉంది. సత్యంలోనే స్వర్గమూ ఉంది. నూరు అశ్వమేధాలనీ ఒక సత్యాన్నీ

చెరొకవైపూ వేసి తూచితే సత్యంవైపే మొగ్గు ఉంటుంది.


సత్యేనార్కః ప్రతపతి సత్యే తిష్ఠతి మేదినీ

సత్యే ప్రోక్తః పరో ధర్మః స్వర్గస్సత్యే ప్రతిష్ఠితః

అశ్వమేధసహస్రం తు సత్యం చ తులయా ధృతమ్ ।

అశ్వమేధసహస్రాద్ది సత్యమేకం విశిష్యతే ॥

(21-7, 8)

అయినా ఈ ప్రసంగాలతో నాకేమి పని. సూర్యుడు అస్తమించేలోగా నా దక్షిణ నాకివ్వకపోయావో

శపించానన్నమాటే - అని బెదిరించి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు భయంతో వణికిపోయాడు. బేలగా

విలపించాడు.

అంతలోకీ వారాణసీ వేదవండితు డొకడు బ్రాహ్మణబృందంతో తన ఇంటిలోనుంచి వీథిలోకి

వచ్చాడు. అతడిని చూసి మాధవీదేవి తన భర్తతో ఇలా అంది

నాథా ! మూడు వర్ణాలవారికీ బ్రాహ్మణుడు తండ్రిలాంటివాడు అన్నారు. తండ్రి ధనాన్ని కొడుకు

నిస్సంకోచంగా తీసుకోవచ్చు. అందుచేత మనం వీరిని ప్రార్థిద్దాం.

దేవీ ! నేను క్షత్రియుణ్ణి. ఒకరి దగ్గర చెయ్యిజాపను. దానం పట్టను. అప్రతిగ్రహం నా నియమఁ

నీకు తెలుసుగదా ! యాచన అనేది విప్రులకేకానీ మన క్షత్రియులకు కాదు. విప్రుడు సకలవర్ణాలవారికీ

గురువు. పూజనీయుడు. అందుచేత గురువును అసలు యాచించకూడదు. అందునా క్షత్రియులకు ఆది

సుతరామూ తగదు. యజన అధ్యయనదాన శరణాగతరక్షణ ప్రజాపాలనలు మాత్రమే క్షత్రియ

ధర్మాలు. దేహి అనే దీనాలాపం మననోట రాకూడదు. దదామి అనేదే మనమాట కావాలి. అదే ఎప్పుడూ

నా హృదయంలో ఆడుతూ ఉంటుంది.

-

న చాస్యేనం తు వక్తవ్యం దేహీతి కృపణం వచః

దదామీత్యేవ మే దేవి హృదయే విహితం వచః

(21-17)

పోతనామాత్యులవారి భాగవతము

 👆🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*ద్వితీయ స్కంధము*



*గోవిందనామ కీర్తన గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరి*

*త్రీవిభుడు సూఱ గొని యెను కైవల్యము తొల్లి రెండు గడియలలోనన్*


పరీక్షిన్మహారాజా! పూర్వం ఖట్వాంగుడనే మహారాజు ఉండేవాడు . ఆయన గోవిందుని నామాన్ని జపించి, సంసారభయాన్ని పోగొట్టుకొని రెండు గడియల కాలంలోనే ముక్తిని పొందాడు. ముక్తి అంటే పుట్టటం, చనిపోవటం అనే చక్రం మళ్ళీమళ్ళీ తిరుగుతూ ఉండటం అనే దానినుండి విడుదల పొందటం. దానినే కేవలత్వం, కైవల్యం అని కూడా అంటారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం  -‌ నవమి -  చిత్ర   -‌ భృగు వాసరే* *(05-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/6x8xDwiwYYg?si=6q60JKjumi4TLeNQ


🙏🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*05-01-2024 / శుక్రవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో  పదోన్నతులు పెరుగుతాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

వృషభం


సోదరులతో  ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

---------------------------------------

మిధునం


ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

కర్కాటకం


 కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. 

---------------------------------------

సింహం


గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార  విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

---------------------------------------

కన్య


నిరుద్యోగ ప్రయత్నాలు  మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోక నష్టాలు ఎదుర్కొంటారు.

---------------------------------------

తుల


నిరుద్యోగ ప్రయత్నాలు  మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోక నష్టాలు ఎదుర్కొంటారు.

---------------------------------------

వృశ్చికం


కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట చికాకులు అధికమవుతాయి. స్వంత ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వ్యాపారాలలో భాగస్వాములతో బేధాభిప్రాయాలు కలుగుతాయి. 

---------------------------------------

ధనస్సు


ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో మరింత  గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. 

---------------------------------------

మకరం


దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగమున మీప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు మిత్రులతో  ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------

కుంభం


దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు.

---------------------------------------

మీనం


ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.  దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు తప్పవు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

నవగ్రహా పురాణం

 .        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *126వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*నవగ్రహాల పట్టాభిషేకం - 7*


"నవగ్రహాలలో ప్రథముడూ , గ్రహాల అధినేత అయిన సూర్యుడు - కళింగ దేశాధిపతి ! 

చంద్రుడు - యామున దేశానికి అధిపతి ! అంగారకుడు అవంతీ దేశాధిపతి ! 

బుధుడు - మగధ దేశానికి అధిపతి ! గురువు - సింధుదేశానికి అధిపతి ! 

శుక్రుడు - కాంభోజదేశానికి అధిపతి ! 

శనైశ్చరుడు - సౌరాష్ట్ర దేశాధిపతి ! 

రాహువు - బర్బరదేశాధిపతి ! కేతువు - అంతర్వేది దేశానికి అధిపతి !"


*"తమ ఆధిపత్యంలో ఉన్న దేశాల మానవుల మీదా , ప్రాణుల మీదా ఆయా గ్రహదేవతల ప్రభావం ప్రముఖంగా ఉంటుంది ! అంతరిక్షంలో నక్షత్రాల కలయికతో ఏర్పడిన రాసులు పండ్రెండున్నాయి ! ఆ ద్వాదశ రాసుల మీద మీ ఆధిపత్యాన్ని చతుర్ముఖులు వివరిస్తారు !"* శివుడు బ్రహ్మ వైపు చూస్తూ ముగించాడు.


*"జన్మ పరంగా ప్రాణులు ముఖ్యంగా మానవులు ఈ ద్వాదశ రాశులకూ సంబంధించి ఉంటారు. ఆయా రాశులు ఆయా నవగ్రహదేవతల ఆధిపత్యాలకు లోబడి ఉంటాయి. జన్మించిన నక్షత్రాల ఆధారంగా ప్రాణుల రాశులు నిర్ణయమవుతాయి. రాశ్యాధిపతులైన మీ ప్రభావం - తదనుగుణంగా ఉంటూ , మానవుల , ప్రాణుల జీవితాలను నిర్దేశిస్తాయి !".* బ్రహ్మ ఉపోద్ఘాత రూపంలో అన్నాడు. *"మీ , మీ ఆధిపత్యాలలో ఉండే రాశుల వివరాలు ఆలకించండి !"*


*"సూర్యుడు సింహరాశికి అధిపతి. చంద్రుడు కర్కటరాశికి అధిపతి. అంగారక కుజుడు మేషరాశికీ , వృశ్చిక రాశికీ అధిపతి. బుధుడు కన్యారాశికీ , మిథున రాశికీ అధిపతి. గురువు ధనూరాశికీ , మీన రాశికీ ఆధిపత్యం కలిగి ఉంటాడు. శుక్రుడు తులారాశికీ , వృషభరాశికీ అధిపతి. శనైశ్చరుడు మకర రాశికీ , కుంభరాశికీ ఆధిపత్యం కలిగిఉంటాడు. రాహువు శుక్రుడి ఆధిపత్యంలోని తులారాశి మీదా , కొన్ని సందర్భాలలో బుధుడి ఆధిపత్యంలోని కన్యారాశి మీదా ఆధిపత్యం కలిగి ఉంటాడు. కేతువు బుధుడి ఆధిపత్యం ఉన్న మిథున రాశి మీదా , గురువు ఆధిపత్యంలోని మీన రాశి మీదా ఆధిపత్యం కలిగి ఉంటాడు.


*సూక్ష్మంగా చెప్పాలంటే ప్రాణి మీద రాశి ప్రభావం , రాశి మీద గ్రహప్రభావం ఉంటాయన్నది సారాంశం !"* బ్రహ్మ ముగించాడు.


*"ఆదిత్య , సోమ , మంగళ , బుధ , గురు , శుక్ర , శని , రాహు , కేతువులకు ఒక సందేశం !"* శ్రీమహావిష్ణువు నవగ్రహాలను కలయజూస్తూ అన్నాడు.


*"లోకాలలోని ప్రాణుల - ప్రముఖంగా మానవుల ఆరాధనలకు అందివచ్చే విధంగా సూక్ష్మ తేజోరూపాలతో ఉన్న నవగ్రహాలు , దివ్యశరీరాలతో ఆవిర్భవించాలని నేను ఆశించి , తదనుగుణంగా సంకల్పించాను. ఆదర్శ దంపతుల సంతితిగా మీరు సశరీరులుగా అవతరించారు. గ్రహదేవతలుగా అభిషిక్తులయ్యారు. మీ దృష్టులకూ , ప్రభావాలకూ లోబడి జీవ యాత్రలు సాగించే నరులు , ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో మిమ్మల్ని భావిస్తారు ; సంభావిస్తారు ; సేవిస్తారు ! భవిష్యత్తులో ఆగమోక్తంగా ఆలయాలు నిర్మించి మిమ్మల్ని ప్రతిమారూపంలో ప్రతిష్ఠించి , ప్రతిమలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి , దానిలోకి మీ శక్తులను ఆవాహనం చేస్తారు. అభిషేకాలతో , అర్చనలతో మిమ్మల్ని ఆరాధిస్తారు. ఆ ఆరాధనలను స్వీకరించండి. ఆరాధకులను అనుగ్రహించండి. దివ్యరూపాలతో మిమ్మల్ని ఆవిర్భవింపజేసిన మా సంకల్పాన్ని నెరవేర్చండి. ఇక మీ స్థానాలకు తరలి వెళ్ళండి ! శుభం భూయాత్ !”* శ్రీమహావిష్ణువు ఆశీర్వాదపూర్వకంగా అన్నాడు.


*“శుభం భూయాత్ !"* పరమేష్టి , పరమేశ్వరులు ఏకకంఠంతో అన్నారు దీవిస్తూ. *“తథాస్తు !"* సప్తర్షుల కంఠాలూ , మానసపుత్రుల కంఠాలూ , దేవతల కంఠాలూ ఉత్సాహంగా ఉచ్చరించాయి.


త్రిమూర్తులకూ , తల్లిదండ్రులకూ , పెద్దలకూ సూర్యుడు చేతులు జోడించి నమస్కరించాడు. అనూరుడు అశ్వాలను సున్నితంగా అదలించాడు. సూర్య రథం కదిలి , ముందుకు సాగింది.


ఇతర గ్రహ దేవతలు కృతజ్ఞతా సూచకంగా చేతులెత్తి , నమస్కారాలు చేశారు. ఉత్సాహంగా తమతమ రథాల అశ్వాలను అదలించారు.


ఒకేసారి సాగుతున్న నవగ్రహాల నవరధోత్సవాన్ని అందరూ నేత్రపర్వంగా తిలకిస్తున్నారు. తమ మండలాలూ , మందిరాలూ ఉన్న నిర్దేశిత దిశల వైపు రథాలను పోనిస్తున్నారు నవగ్రహదేవతలు.


అంతరిక్షంలో జ్యోతిర్మండలాల వైపు సాగిపోతున్న 'నవరథాలు' క్రమంగా దూరమైపోతూ , కాంతిపుంజాలలాగా దర్శనమిస్తున్నాయి.


**************************


కథనం ముగించి , శిష్యులను చిరునవ్వుతో చూశాడు , నిర్వికల్పానంద. *“ఇప్పటి దాకా మనం నవగ్రహాల చరిత్రలను శ్రవణం చేశాం. పురాణ శ్రవణం చేసేటప్పుడు సందేహాలు కలగడం సహజం. ఏదైనా సందేహం ఉందా , సదానందా ? ఉంటే అడుగు !"*


*"చిన్న సందేహం గురువు గారూ !"* సదానందుడు అన్నాడు. *"నవగ్రహాలలో సూర్యుని నుండి శనైశ్చరుడి దాకా ఏడు గ్రహాలకూ వివిధ రాశుల మీద విడి విడిగా - ఆధిపత్యాలున్నాయి. రాహుకేతువులకు మాత్రం ఆ విధంగా ప్రత్యేకాధిపత్యం ఏ రాశి మీదా లేదు ! వాళ్ళు ఇతర సప్తగ్రహాలతో సమానులే కదా !”*


*"మంచి ప్రశ్న !”* నిర్వికల్పానంద అన్నాడు. *"ద్వాదశ రాసులలో ప్రత్యేకమైన ఆధిపత్యంలో తప్పించి , రాహుకేతువులిద్దరూ అన్నింటా , అందరితోనూ సమానులే. అయినప్పటికీ ఆ ఇద్దర్నీ జ్యోతిష సిద్ధాంత వేత్తలూ , మహర్షులూ - ఛాయగ్రహాలుగానే గుర్తించారు. ప్రత్యేకంగా 'రాశి - ఆధిపత్యం' లేకపోవడానికి అదే కారణం కావచ్చు. మరొక అంశమేమిటంటే , రాహుకేతువులకు రాసుల మీద ఉన్న ఆధిపత్య విషయంలో ప్రాంతీయభేదాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి , మన తెలుగునాట రాహువుకు తులా రాశి మీదా , కేతువుకు మిథున రాశి మీదా ఆధిపత్యం ఉన్నట్టు భావిస్తారు. అయితే , మౌలికంగా తులారాశి మీద ఆధిపత్యం శుక్రుడిది. మిధున రాశి మీద ఆధిపత్యం బుధుడిది ! ఇంక మన పొరుగు దేశమైన కర్నాటకలో రాహుగ్రహానికి కన్యా రాశి మీదా , కేతువుకు మీన రాశి మీదా ఆధిపత్యం ఉన్నట్టు పరిగణిస్తారు ! అయితే మౌలికంగా కన్యారాశికి బుధుడూ , మీన రాశికి గురువూ అధిపతులు ! రాసులకు సంబంధించి , రాహుకేతువుల ఆధిపత్యాలలో ఉన్న వైరుధ్యాల విషయం తేల్చాల్సింది జ్యోతిష విద్వాంసులు ! మనం కాదు !"* నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                  *శ్లోకము 19*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*స ఘోషో ధార్తరాష్ట్రాణాం*

*హృదయాని వ్యదారయత్ ।*

*నభశ్చ పృథివీం చైవ*

*తుములో ఽభ్యనునాదయన్ ।।*


సః — అట్టి; 

ఘోషః  — శబ్దము; 

ధార్తరాష్ట్రాణాం — ధృతరాష్ట్రుని పుత్రుల యొక్క; 

హృదయాని  — గుండెలను; 

వ్యదారయత్  — బ్రద్దలు చేసెను; 

నభః — ఆకాశము; చ — మరియు; 

పృథివీం — భూమి; చ — మరియు; 

ఏవ — నిజముగా; 

తుములో — భీకరమైన శబ్దం; 

అభ్యనునాదయన్  — ప్రతిధ్వనింపచేయుచు.

 

*భావము:*

ఓ ధృతరాష్ట్రా, ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను; అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను.


*వివరణ:* 

పాండవ సైన్యం పూరించిన శంఖ నాద శబ్దానికి కౌరవుల గుండెలు బ్రద్దలయినాయి. అయితే, కౌరవులు తమ శంఖాలను పూరించినప్పుడు పాండవులపై అలాంటి ప్రభావం ఏమీ పడినట్లు చెప్పబడలేదు. పాండవులు భగవంతుని ఆశ్రయించి ఉండటం వలన వారికి తాము సంరక్షిపబడుతాము అన్న విశ్వాసం ఉంది. అటుపక్క, తమ స్వీయ బలం మీదనే ఆధారపడ్డ కౌరవులు, మనఃసాక్షిలో నేరం చేసాము అన్న వేదన వల్ల,  ఓటమి భయానికి లోనయ్యారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

- *శ్రీ రామరక్షా స్తోత్రం - 16* -

 🪷🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️🪷

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


𝕝𝕝 *శ్లో* 𝕝𝕝  

*ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్* |

*అభిరామ స్త్రిలోకానామ్ రామః శ్రీమాన్సనః ప్రభుః* ||


   - *శ్రీ రామరక్షా స్తోత్రం - 16* -


*తా* 𝕝𝕝  కోరిన కోర్కెలు తీర్చు కల్ప వృక్షముల సమూహము వంటివాడు, సమస్త ఆపదలను రూపుమాపువాడు, మూడు లోకములకు అభిరాముడు, శ్రీమంతుడు అయిన శ్రీరామ చంద్రుడే మనకు ప్రభువు. అనేక కల్ప వృక్షాలతో కూడిన వనం వంటివాడు, అన్ని ఆపత్తులను పోగొట్టేవాడు, మూడు లోకాలలో అతి సుందరుడు అయిన శ్రీ రామ చంద్రుడు నాకు భగవంతుడు. *రాముడు కల్పవృక్షముల ఆరామము (తోట) వంటివాడు, సకల ఆపదలను రూపుమాపెడువాడు, మూడు లోకములలోను అతిలోక సుందరుడు శ్రీరాముడే అట్టి శ్రీరాముడే మాకు ప్రభువు. (దేవుడు).*