ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
10, అక్టోబర్ 2023, మంగళవారం
మహాభారతములో - ఆది పర్వము*
*మహాభారతములో - ఆది పర్వము*
*ద్వితీయాశ్వాసము*
*19*
*వినతా కద్రువల పందెం*
ఇంద్రుని ఉచ్ఛైశ్వం సముద్రతీరంలో తిరగటం చూసిన కద్రువ వినతతో అంతటి తెల్లని అశ్వం తోక మాత్రం నల్లగా ఉందని చెప్పింది. అందుకు వినత తోక తెల్లగా ఉంది కదా అని చెప్పింది. దీనితో సవతులకు పంతం పెరిగి పందెం కాచారు. ఆ పందెం ప్రకారం గెలిచిన వారు ఓడిన వారికి దాస్యం చేయాలని ఒప్పందం కుదుర్చు కున్నారు. వినత అప్పుడే కావాలంటే దగ్గరకి వెళ్ళి చూద్దామని చెప్పింది. కద్రువ వినతను వారించి మరునాడు చూద్దామని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన కద్రువ తన కుమారులను పిలిచి ఆగుర్రం తోక నల్లగా మార్చి తల్లిని దాస్య బాధ నుండి కాపాడమని అడుగింది. అది అధర్మమని చేయలేమని నిరాకరించిన కుమారులను జనమేజయుని సర్పయాగంలో పడి మరణించమని శాపం ఇచ్చింది. ఇది చూసి భయపడిన కర్కోటకుడు అశ్వం తోకకు చుట్టుకున్నందు వలన తోక నల్లగా ఉందని భ్రమపడిన వినత కద్రువకు దాస్యం చేయటం మొదలుపెట్టింది.
శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం,55వ శ్లోకం*
*శ్రీ భగవాన్ ఉవాచ*
*ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |*
*ఆత్మన్యే వాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ స్తదోచ్యతే || 55*
*ప్రతి పదార్థం*
పార్థ = ఓ పార్థా! ; యదా= ఎప్పుడైతే; మనోగతాన్ = మనస్సు నందున్న ; సర్వాన్ = సమస్తములైన ; కామాన్ = కోరికలను ; ప్రజహాతి = ( మనుజుడు ) పూర్తిగా త్యజించునో, (మరియు ); ఆత్మనా = ఆత్మ ద్వారా ; ఆత్మని ఏవ = ఆత్మయందే; తుష్టః = సంతుష్టుడగునో; తదా = అప్పుడే; స్థితప్రజ్ఞః =( అతడు ) స్థితప్రజ్ఞుడు ; ఉచ్యతే = అనబడును;
*తాత్పర్యము*
*శ్రీ భగవానుడు పలికెను:*
ఓ అర్జునా! మనసు నందలి కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టడైన వానిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని యందురూ.
*సర్వేజనాః సుఖినోభవంతు*
*హరిః ఓం🙏🙏*
రామాయణమ్ 350
రామాయణమ్ 350
...
హనుమంతుని మాటలు శ్రద్ధగా విన్నాడు రామచంద్రుడు .తన మనస్సులో మాట చెప్పటం మొదలు పెట్టాడు .
.
ప్రియబంధువులారా ఒక మాట ! నన్ను మిత్రుడుగా భావించి నా వద్దకు వచ్చిన వానిలో దోషములెన్ని ఉన్నా నేను విడువను ,విడువలేను .
.
రాముడు ఈ మాట పలుకగనే సుగ్రీవుడు ,రామా ! వీడు దుష్టుడా ,శిష్టుడా మనకు అనవసరం ! కానీ ఆపదలో ఉన్న అన్ననే విడిచి వచ్చిన వాడు రేపు మనలను విడువడని నమ్మకమేమిటి?
.
సుగ్రీవుని ఈ పలుకులకు చిరునవ్వు నవ్వుతూ ! లక్ష్మణుని వైపు తిరిగి శాస్త్రములు చదువని వాడు ఈ రకముగామాటలాడలేడు .కానీ ఇక్కడ ఒక సూక్ష్మ విషయమును పరిశీలన చేయవలెను .
.
అది లోకములోని రాజులందరకు అనుభవమే !....అనుచూ రాముడు చెప్పటం మొదలుపెట్టాడు.
.
వూటుకూరు జానకిరామారావు
ధర్మం కోసం
గౌరవ గ్రూప్ సభ్యులందరికీ జై శ్రీరామ్🙏🚩📿
హైందవ సనాతన ధర్మం కోసం పనిచేయడం ఎంత ముఖ్యమో సనాతన ధర్మం గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.
ఈరోజు నుండి మన సనాతన ధర్మం గురించి ప్రతిరోజు ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది.
తెలిసినవాళ్లు సమాధానం తెలియజేయగలరు.
నిన్న ఒక క్యూస్షన్ అడగడం జరిగింది అది ఏమిటంటే.
1) ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటి?
2) భౌతిక విద్య అంటే ఏమిటి?
దీనికి సమాధానం
1) భౌతిక విద్య అంటే భౌతికంగా కనిపిస్తున్న ఈ ప్రపంచం గురించి తెలుసుకోవడం భౌతిక విద్య అంటారు.
2) ఆధ్యాత్మిక విద్య అంటే ఈ కనిపించే భౌతిక ప్రపంచానికి ఏదైతే ఆధారంగా ఉందో దాని గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక విద్య
ఎవరికైనా సందేహాలు ఉంటే సంప్రదించండి 9986208460
ఈరోజు క్యూస్షన్
మన దేహంలో జ్ఞానేంద్రియాలు ఎన్ని? అవి ఏంటి?
తెలిసినవాళ్లు తెలిసింది తెలియజేయండి
తెలియని వాళ్లు కూడా తెలియదు అని తెలియజేయండి. జైశ్రీరామ్🚩📕📿
అమ్మ ఆశ్వీర్వదించి
*అమ్మ ఆశ్వీర్వదించి పిలిచింది.*
లలితా సహస్రనామ భావార్ధాలు రాస్తున్న వేళ తన ఆలయం విషయాలను తెలిపినట్టి ఆ లలితాపరాభట్టారిక తన దర్శనభాగ్యం కలిపించింది. తమిళనాట చిదంబరం నుంచి సుమారు 60 కి.మి దూరంలో, మైలదుత్తురై నగరానికి 19 కి.మి దూరంలో గల పేరలం గ్రామ సమీపంలో తిరుమెయిచూర్ లో ఈ లలితాదేవి ఆలయం ఉంది.
*సెప్టెంబర్ 28వ తేదీ, 29వ తేదీ రెండు రోజులు ఆ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేసుకున్న అదృష్టం నాకు కలిగింది.* ఇంతటి మహిమాన్వితమైన దేవాలయం గురించి పూర్తి వివరాలు అందజేయాలని ప్రయత్నం చేస్తున్నాను.
*లలితా సహస్రనామాలకు పుట్టినిల్లు తిరుమెయచ్చూర్...*
లలితాంబికాదేవి దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతోంది. మేఘనాథస్వామి పేరుతో పరమేశ్వరుడు, లలితాంబిక పేరుతో పార్వతీదేవి ఇక్కడ కొలువైవున్నారు. లలితాంబిక కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శివుని మందిరం ఆయుష్ హోమాలతో, అరవై, ఎనభై సంవత్సరాల వృద్ధుల జన్మదిన ప్రత్యేక పూజలతో, అభిషేకాలతో, అర్చనలతో అలరారుతుంటుంది. ఈ దేవాలయ దర్శనం సర్వపాప ప్రక్షాళన గావిస్తుందంటారు. అంతేకాదు, ఇక్కడి స్వామిని ప్రార్థిస్తే పెళ్లికాని యువతులకు వెంటనే కళ్యాణప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. శనీశ్వరుడు, గరుడుడు, సూర్యరథసారధి అయిన అరణుడు, యముడు, వాలి, సుగ్రీవులు ఇక్కడ జన్మించారని భక్తుల నమ్మకం.
సకల భువనేశ్వరుడు, మేఘనాథుడు మొదలైన నామాలతో ఇక్కడ విరాజిల్లుతున్న పరమేశ్వరుడికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక సందర్భాలలో విశేష పూజలు జరుగుతుంటాయి.ఎంతోమంది తమ షష్ఠిపూర్తి ఉత్సవాలను, సహస్ర పూర్ణ చంద్రదర్శన పండుగ సమయాలు, ఆయుష్ హోమాలు, మృత్యుంజయ హోమాలు తిరుమెయచ్చూరులోని పరమేశ్వరుని సన్నిధిలో నిర్వహించి ఆ దేవదేవుని ఆశీస్సులనందుకుంటారు. ఈ దేవాలయం కావేరీ దక్షిణ తీరంలోని 56వ శివాలయంగా ఎంపిక కాబడింది. భక్తగ్రేసరుడైన జ్ఞానసంబందర్ తన ‘తేవరమ్’ స్తోత్రాలతో ఇక్కడి పరమేశ్వరుని స్తుతించారు. తిరుమెయచ్చూర్ దేవాలయంలో శివ పూజలు, అభిషేకాలు, లలితాంబికకు అర్చనలు జరగడంతో పాటు ప్రత్యేకంగా ‘రథసప్తమి’ పండుగ గొప్పగా నిర్వహించబడుతుంది. తమిళ మాసమైన చితిరాయ్ (ఏప్రిల్-మే)లో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలను తాకుతాయి.
ఈ దేవాలయంలో ఎన్నో ఉపాలయాలను చూడొచ్చు. ఇక్కడి కాళికాదేవి మందిరం కూడా దర్శించదగింది. ఎనిమిది చేతులతో మహిషాసురమర్ధినిగా ఉన్న ఆమెను దుర్గాదేవిగా శుకమహర్షి స్తోత్రం గావించాడు. వేదవ్యాసుని కుమారుడైన శుకమహర్షి చిలుక ముక్కు కలిగిన వాడు. భక్తుల కోరికలను కాళికాదేవి చిలుక ద్వారా లలితాంబికకు తెలియజేస్తుందని, అందుకే ప్రతి నిత్యం ఒక చిలుక సాయం సమయాలలో లలితాంబిక గుడిపైన ఎగురుతుందని ఇక్కడ ప్రచారంలో ఉన్న కథ.
తిరుమెయచ్చూరు మరో ప్రత్యేకత ఏమంటే, ఈ దేవాలయంలో రెండు శివమూర్తులు, రెండు పార్వతీమూర్తులు పూజలందుకోవడం. ఈ విశేషం తమిళనాట తిరుమెయచ్చూరు. తిరువారూరు, తిరుప్పగతూరు దేవాలయాల్లో మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రదేశంలోనే సూర్యుడికి శాప విమోచనం కలిగిందని పెద్దలు చెబుతారు. సూర్య రథసారధి అయిన అరుణుని అవతారాన్ని సూర్యుడు హేళన చేయడంతో బాటు అతని శివపూజను అడ్డుకోవడంతో శివుడు కోపించి సూర్యుని శపించాడు. శాపవిమోచన కోసం సూర్యుడు అర్థించగా, 7 నెలలు శివపార్వతులను ఏనుగుపై అధిష్ఠింపజేసి మేఘాలపై నుంచి, అర్చనగావించాలని అప్పుడే శాపం నుంచి విముక్తి లభిస్తుందని శివుడు పలుకగా, అదేవిధంగా చేసిన సూర్యుడు శాపం నుంచి విముక్తి పొందాడని అంటారు. దాని గుర్తుగా గజవృష్ట వాహనంపై అధిష్ఠించినట్టు చెక్కబడిన శివపార్వతుల విగ్రహాలను ఇక్కడ దర్శించవచ్చు.
*దర్శన వేళలు ఇవీ..*
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు దేవాలయాన్ని దర్శించుకోవచ్చు.
*దేవాలయ విశేషాలు:*
తిరుమెయచ్చూర్ శ్రీ మేఘనాథస్వామి ఆలయంలోని ఈశ్వరుడు స్వయంభూనాధుడు. లలితాంబిక పేరుతో అమ్మవారు శ్రీ చక్రరాజ సింహాసనంపై అధిష్ఠించి భక్తులకు అభయమిస్తూ అభయముద్రలో ఠీవిగా మహారాణిలా ఆశీనురాలై, చిరునవ్వులు చిందిస్తూ కళకళలాడే మోముతో మనకు దర్శనమిస్తుంది. ఆమె ప్రాంగణంలో లలితా సహస్రనామాలు, లలితా నవరత్నమాలా పారాయణ చేసే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేయాలని భక్తులు కోరుకుంటారు.
*ఆలయ ప్రాశస్త్యం:*
తిరుమెయచూర్ ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతనమైనదని చరిత్రకారుల భావన. రాక్షసులు రుషులను, దేవతలను బాధిస్తుండగా వారంతా జగన్మాతకు విన్నవించుకున్నారు. వారి కోరికను మన్నించి ఆమె భండాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. రాక్షస వధానంతరం కూడా ఆమె కోపం తగ్గకపోవడంతో ఆమెను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించగా ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా కరుణామయిగా మారింది. ఆమె ఈ లలితాబింక అని పురాణకథనం. హయగ్రీవుడు లలితాదేవి భక్తుడు. లలితా సహస్రనామ మహత్యాన్ని అగస్త్య మహర్షికి తెలియజేశాడు హయగ్రీవుడు. అప్పుడు లలితా సహస్రనామ పారాయణకు అనువైన స్థలం తెలియజేయమని ఆగస్త్యుడు హయగ్రీవుని కోరాడు. హయగ్రీవుడు భూలోకంలో మనోన్మణి రూపంలో సౌందర్యనాయకి విరాజిల్లుతున్నదని అగస్త్యునికి తెలియజేస్తాడు. అనంతరం అగస్త్యుడు తన పత్ని లోపాముద్రతో కలసి తిరుమెయచ్చూర్ వచ్చి అక్కడ లలితాంబిక సన్నిధిలో లలితా సహస్రనామం, తను విరచించిన లలితా నవరత్నమాల పారాయణ గావించాడని ప్రాంతీయ కథనం.
*12 నాగమూర్తులు...*
ఈ దేవాలయంలో నవగ్రహాలు లేకపోయినా, 12 రాశులకు చిహ్నంగా, 12 నాగమూర్తులు ఇక్కడ పూజలందుకుంటారు. ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు సల్పితే అన్ని గ్రహదోషాల నుంచి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో పుష్కరిణి ‘సూర్య తీర్థం’ పేరుతో విలసిల్లుతున్నది. తిరుమెయచ్చూర్ దేవాలయంలో శిల్పకళ ఉట్టిపడుతుంది. ప్రాంగణంలోని ‘శివశక్తి’ శిల్పం సందర్శకులనెంతో ఆకట్టుకొంటుంది. శివుడు కోపంతో ఉన్న పార్వతిని అనునయిస్తున్నట్టు చెక్కబడిన ఈ శిల్పం, ఆమె మోములో ఒక వైపు క్రోధం, మరోవైపు చిరునవ్వు కనువిందు కలిగిస్తూ శిల్పాచార్యుల నైపుణ్యానికి దర్పణంగా నిలిచింది. తిరుమెయచ్చూరు లలితాంబిక విగ్రహమూర్తి అద్భుతంగా జీవకళ ఉట్టిపడుతుంటుంది. భక్తుల పాలిట పెన్నిధిగా, శివపార్వతుల సన్నిధికి ఆలవాలమై, తిరుమెయచ్చూరు లలితా సహస్రనామాలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతిగాంచింది.
ఇదిలా ఉంటె ఈ మధ్యకాలంలో అంటే సుమారు 1999లో అమ్మవారు ఓ భక్తుడి కలలో తన కాలిపట్టీలు పడిపోయాయని తనకు అవి ఇవ్వమని కోరిందిటా. ఆ భక్తుడు ఈ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకొని బంగారు కాలిపట్టీలు చేయించి ఇవ్వాలని సంకల్పించారు. కనీసం విగ్రహం వివరాలు లేని అతను చేయించాలనుకున్న క్షణం నుంచి అమ్మవారి పాదాలకు అలంకరణ వరకు స్వయంగా చూసినట్టుగా సరైన సైజులో రూపోందాయి. వాటిని తీసుకువచ్చి ఆలయపురోహితుడికి ఇచ్చి అలంకరించమంటే వాటిని పెట్టడం అసాధ్యం ఎందుకంటే కాలిభాగంలో ఎటువంటి ఖాళీస్ధలం లేదు అన్నారు. కాదు ఉంది చూడండి అంటే మీరు చూడండి అన్నారుట. అమ్మవారి కాళ్ళు పరిశీలించగా అంతకుముందు వరకు లేని ఖాళీస్ధలం కనపడటం అందులో సరిగ్గా అమరినట్టు పట్టీలు పట్టడం నిజంగా మహిమే కదా. ఈ అమ్మవారు శ్రీయంత్రంపై అధిష్టానమై ఉండటం విశేషం. ఇక్కడ అమ్మవారికి నేయి సమర్పించడం వలన భార్యభర్తల మధ్య స్పర్ధలు తొలగి అనోన్య దాంపత్యంతో ఉంటారని ప్రతీతి.
ఈ ఆలయం గ్రామీణ ప్రాంతంలో ఉండటంవల్ల మనం సమీపంలోని మాయవరం(మైలదుత్తురై) గాని కుంభకోణం లో గాని ఉండి దర్శించవచ్చు.
శ్రీ హనుమాన్ మందిర్
🕉 మన గుడి : నెం 204
⚜ ఢిల్లీ : ఝాన్డే వాలన్
⚜ శ్రీ హనుమాన్ మందిర్
💠 హనుమంతుడు అన్ని సమయాలలో మీ బాధలు మరియు ఉద్రిక్తతలను అతిక్రమించే శక్తికి చిహ్నంగా చూడబడ్డాడు.
అతని ఆశీర్వాదాలు ఆత్మను శుద్ధి చేస్తాయి మరియు అతని బోధన విజయానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది.
💠 ఢిల్లీలోని ఝండేవాలన్ హనుమాన్ దేవాలయం ఢిల్లీ అంతటా భక్తులను ఆకర్షిస్తుంది, భారీ 108 అడుగుల హనుమాన్ విగ్రహం పట్టణం యొక్క అత్యంత ప్రసిద్ధ కేంద్రంగా ఉంది, ఇది పొరుగున ఉన్న ప్రతి ఇంటి నుండి కనిపిస్తుంది.
💠 ఢిల్లీ యొక్క ప్రసిద్ధ సంస్కృతిలో ఈ విగ్రహం చాలా సాధారణం, ఇది ఢిల్లీలో ఉన్న ప్రతి ఇతర చలనచిత్ర, tv సిరీస్‌లో కనిపిస్తుంది మరియు తద్వారా ఢిల్లీ వారసత్వానికి పర్యాయపదంగా మారింది.
💠 ఈ అద్భుతమైన విగ్రహం హనుమంతుని శక్తితో పాటు రాముడు మరియు తల్లి సీత పట్ల ఆయనకున్న ప్రగాఢమైన గౌరవం రెండింటినీ ప్రదర్శిస్తుంది.
“నీ సమస్యలు ఎంత పెద్దవో హనుమంతునికి చెప్పకు; మీ హనుమంతుడు ఎంత పెద్దవాడో నీ సమస్యలు చెప్పు!"
💠 హనుమంతుని బోధనలు మరియు నైతికత నుండి ఉద్భవించిన సంస్కృతిని ప్రోత్సహించడానికి మరియు పెంపొందించడానికి రాజధానిలో హనుమంతునికి అంకితమైన ఆలయాన్ని నిర్మించాలని కోరుకునే బ్రహ్మలీన్ నాగబ్బ శ్రీ సేవాగిర్ జీ మహారాజ్ ఈ ఆలయాన్ని 2008 సంవత్సరంలో నిర్మించారు.
దాదాపు 13 సంవత్సరాలలో పూర్తయింది
💠 ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఇది ఒకటి. ఈ మందిరం 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహన్నీ
ఝండేవాలన్ మరియు కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ నుండి చూడవచ్చు.
⚜ చరిత్ర ⚜
💠 18వ శతాబ్దంలో పెద్ద ప్రార్థనా జెండాలు ఉన్నందున ఈ రాతి ప్రాంతానికి ఝండేవాలా అని పేరు పెట్టారు .
18వ శతాబ్దంలో బద్రీ దాస్ అనే వ్యాపారి ఆ ప్రాంతానికి తరచూ వచ్చేవాడు.
ఒక జలపాతం దగ్గర త్రవ్వినప్పుడు, జందేవాలి మాత విగ్రహం మరియు నాగ శిల్పాలతో కూడిన రాతి లింగం అతనికి కనిపించాయి. దాస్ అక్కడికక్కడే ఆలయాన్ని నిర్మించాడు. త్రవ్వకాలలో విగ్రహం చేతులు దెబ్బతినడంతో, వెండి చేతులను తయారు చేసి, మూల విగ్రహాన్ని ప్రతిష్టించారు .
గుహ నేలమాళిగలో "మా గుఫా వాలి" (గుహ యొక్క దేవత) అని పిలువబడింది.
అమ్మవారి విగ్రహం యొక్క కొత్త ప్రతిరూపం గ్రౌండ్ ఫ్లోర్‌లో స్థాపించబడింది, దీనిని "మా ఝండే వాలీ" (జెండా యొక్క తల్లి దేవత) అని పిలుస్తారు.
💠 హనుమాన్ విగ్రహం దాదాపు 108 అడుగుల పొడవు ఉంటుంది .
ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం
ఈ రోజుల్లో, నగరాన్ని చిత్రీకరించే అనేక పోస్టర్లు ఈ భారీ విగ్రహం యొక్క చిత్రాలను నగర చిహ్నంగా కలిగి ఉన్నాయి.
ఈ ఆలయం ఢిల్లీలోని అనేక బాలీవుడ్ సినిమాలు మరియు సీరియల్స్‌లో ప్రదర్శించబడింది.
💠 108 అడుగుల హనుమాన్ మందిర్‌ను సంకట్ మోచన్ ధామ్ అని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణం 1994లో ప్రారంభమైంది మరియు ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సుమారు 13 సంవత్సరాలు పట్టింది.
ఈ ఆలయం ఒక అద్భుతమైన కళ, ఇంజనీరింగ్ మరియు సాంకేతికత.
💠 ఈ ఆలయం 108 అడుగుల ఎత్తులో జమ్మూ & కాశ్మీర్‌లోని వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి సమానమైన గుహను కలిగి ఉంది.
ఈ గుహలో పిండి రూపంలో ఒక పవిత్రమైన ముద్ద మరియు గంగా నది రూపంలో పవిత్రమైన నీటి ప్రవాహం ఉంది.
💠 ఆలయ ప్రవేశం వద్ద హనుమంతుని పాదాల వద్ద పడుకున్న రాక్షస నోటిని పోలి ఉండే ప్రవేశ ద్వారం ఉంది. అన్ని రాక్షసులు మరియు దుర్గుణాలు హనుమంతుని శక్తికి వ్యతిరేకంగా ఎప్పటికీ నిలబడలేవు అనేదానికి ఇది ప్రతీక.
💠 ఈ ఆలయంలో వివిధ దేవతల విగ్రహాలు ఉన్నాయి. మొదటిది రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి . ఈ విగ్రహాల పక్కనే శివుడు మరియు పార్వతి దేవి కూడా ఉంది.
1వ అంతస్తులో మాతా మహిషాసుర మర్దాని విగ్రహం ఉంది .
2వ అంతస్తులో పంచముఖి హనుమంతుని విగ్రహం ఉంది .
ఇది చాలా అందంగా తయారు చేయబడింది. ఈ అంతస్తులో శ్రీకృష్ణుడు మరియు రాధ దేవత విగ్రహం ఉంది. తదుపరిది విష్ణువు మరియు లక్ష్మీదేవి విగ్రహం.
💠 ఆలయ ప్రాంగణం వారంలోని అన్ని రోజులలో ఉదయం 6 నుండి సాయంత్రం 10 గంటల వరకు తెరిచి ఉంటుంది.
మానవ జీవితంపై శని భగవానుడి ప్రభావం ఎక్కువగా ఉండే రోజులుగా పరిగణించబడే మంగళవారాలు మరియు శనివారాల్లో భారీ జనసమూహాన్ని గమనించవచ్చు, అందువల్ల హనుమంతుని ఆశీర్వాదం ఎవరైనా ఎదుర్కొనే నిరాశను నయం చేస్తుంది.
💠 ఆ రోజులలో మీరు ప్రత్యేక హారతి హాజరయ్యే అవకాశం ఉన్నందున ఇది సందర్శించడానికి ఉత్తమ సమయం.
💠 గమనిక:
సాయంత్రం ఆరతి సమయంలో; హనుమాన్ యొక్క భారీ విగ్రహం యొక్క చేతులు వెనుకకు కదులుతాయి, ఛాతీ తెరుచుకుంటుంది మరియు శ్రీరాముడు & సీత దేవి యొక్క అందమైన చిత్రాలు భక్తులందరికీ దర్శనం ఇవ్వడానికి పొడుచుకు వస్తాయి.
ఖచ్చితంగా చూసితీరవల్సిన అద్భుతమైన దృశ్యం!
💠 ఆలయంలో హనుమాన్ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
దసరా, దీపావళి, రామ నవమి మరియు జన్మాష్టమి గొప్పగా మరియు ఉత్సాహంతో జరుపుకునే ఇతర పండుగలు.
💠 ఝండేవాలన్ మెట్రో స్టేషన్ నుండి అతి తక్కువ దూరం
రుద్రాక్షల విశేషాలు
రుద్రాక్షల విశేషాలు - సంపూర్ణ వివరణ .
ఈ రుద్రాక్షలు అనేవి పలు పరిమాణాల్లో లభ్యం అగును . వీటిని పరిమాణాన్ని బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు . అవి
1 - ధాత్ర ఫల ప్రమాణము .
2 - బదరి ఫల ప్రమాణము .
3 - చణ మాత్రము .
రుద్రాక్షలు పలు రంగులలో కూడా లభ్యం అగును . తెలుపు , ఎరుపు , నలుపు రంగులు ప్రధానం అయినవి . ఈ రుద్రాక్షలు పలు ముఖాలను కలిగి ఉంటాయి. ఏకముఖం నుండి ఇరవై ఒక్క ముఖాలు కలిగిన రుద్రాక్షలు కూడా ఉంటాయి .
రుద్రాక్షల గురించి వ్యాసమహర్షి తన గ్రంథాలలో వివరించారు. ఈయన వివరణ ప్రకారం ఈ రుద్రాక్షలు అన్ని రకాలు ఒకే ప్రదేశములో లభ్యం అయ్యేవి కావు . ఒక్కోరకం ఒక్కో ప్రదేశములో విరివిగా వ్యాపించి ఉండేవి . తెలుపు లేదా పసుపు రంగు కలిగిన రుద్రాక్షలు కేవలం పశ్చిమ తీరప్రాంత పర్వత సాణువుల్లో పెరిగే వృక్షాల నుండి లభ్యం అగును . ఏకముఖి రుద్రాక్షలు కేవలం నేపాల్ లో మాత్రమె ఉన్నాయి . దశముఖ రుద్రాక్షలు కేవలం మలేసియా దేశములో గల వృక్షాల నుంచే లభ్యం అగును . ఇరవైఒక్క ముఖాలు కలిగిన రుద్రాక్షలు బయట బజారులో అమ్ముతుంటారు . కాని అవి ఎక్కడ నుంచి లభ్యం అగునో , ఆ వృక్షాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలీదు . ఇలా వేరువేరు ప్రదేశాలలో లభ్యం అయ్యే రుద్రాక్షల గురించి వ్యాస మహర్షి తన గ్రంథాలలో రాయటం చాలా ఆసక్తి కలిగిస్తుంది . అంతేకాదు భూమి మీద లభ్యం అయ్యే ఏ ఫలానికి లేక కాయకు లేని "అయస్కాంత క్షేత్రం" ఈ రుద్రాక్షలకు ఉంది .
ప్రస్తుతం ఈ అయస్కాంత క్షేత్రాన్ని నిర్ధారించుట ద్వారానే రుద్రాక్ష అసలైనదో , నకిలీదో తేల్చి చెప్పే విధానం ఇప్పుడు విస్తృతంగా వాడుకలో ఉంది . అసలైన రుద్రాక్షను గనుక రెండు రాగినాణాల మధ్య ఉంచి పట్టుకుంటే అది స్వయం చలనంతో పరిభ్రమిస్తుంది . ఇలాంటివే మరికొన్ని అద్భుతమైన భౌతిక లక్షణాలు రుద్రాక్షలకు ఉన్నాయి .
రుద్రాక్ష ధారణ వలన సుఖశాంతులు కలుగుతాయని , జ్ఞానం పెంపొందించునని , ఆధ్యాత్మిక వికాసం కలుగుతుందని , కుండలిని శక్తి పెరుగుతుందని , సకలసంపదలు లభిస్తాయని , ఆయురారోగ్యాలు వృద్ధిచెందుతాయని మన ప్రాచీన గ్రంథాలు ఉద్ఘోషిస్తున్నాయి .
తరవాతి పోస్టు నందు మరింత వివరణాత్మకంగా రుద్రాక్ష విశేషాలు వివరిస్తాను .
మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
మాంసాహారం
*మాంసాహారం "ఎందుకు" తినకూడదు ?*
*తింటే ఎలాంటి దుష్పరిమాణాలు ఎదుర్కోవాలో 😨*
*తెలియజేసే అద్భుత "ప్రసంగం",*
*🙏భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గారి "అమృత" వాక్కులు మీ కోసం.*
శారదా నవరాత్రులు
శారదా నవరాత్రులు ఎందుకు చేయాలి?
దేవీభాగవతము ఆశ్వయుజమాసము, చైత్రమాసము యమధర్మరాజుగారి యొక్క దంష్ట్రలుగా చెపుతుంది. ఆశ్వయుజమాసములో యమధర్మరాజుగారి ఒక దంష్ట్ర బయటికి వస్తుంది. అందువలన చాలా ప్రమాదములు జరిగి, చాలామంది మరణిస్తూ ఉంటారు. యమధర్మరాజుగారి దంష్ట్ర బారిన పడకుండా ఉండాలి అంటే ఆశ్వయుజమాసము, చైత్రమాసములలో శారదానవరాత్రులు, వసంత నవరాత్రులు అన్నపేరుతో లోకమున అమ్మవారి ఆరాధనను తీసుకుని వచ్చారు. ఆ జగన్మాతను ఆరాధన చేస్తే యమదంష్ట్ర యొక్క ప్రభావము లోకము మీద ఉండదు. కాబట్టి చేసే ఆరాధన కాలాంతర్గతముగా ఆయనముల రూపములో, పక్షముల రూపములో నైమిత్తిక తిథుల రూపములో ఎలా ఉండాలి అన్నదానిని ఋషులు నిర్ణయించారు. ఆ కారణము చేత ఋషిప్రోక్తము అయిన విధముగానే మనము అనుష్టానము చేస్తూ ఉంటాము.
హనుమానష్టకం
ॐ హనుమానష్టకం
1. బాల సమయ రబి భక్షి లియో తబ్
తీనహుఁ లోక భయో అంధియారో I
తాహి సోఁ త్రాస భయో జగ కో
యహ సంకట కాహు సోఁ జాత న టారో ॥
దేవన ఆని కరీ బినతీ తబ్
ఛాఁడి దియో రబి కష్ట నివారో I
కో నహిఁ జానత హైఁ కపి
సంకటమోచన నామ తిహారో ॥
2. బాలి కి త్రాస కపీస బసై గిరి
జాత మహాప్రభు పంథ నిహారో I
చౌఁకి మహాముని సాప దియో తబ్
చాహియ కౌన బిచార బిచారో ॥
కై ద్విజరూప లివాయ మహాప్రభు
సో తుమ దాస కె సోక నివారో I
కో నహిఁ జానత హై జగమేఁ కపి
సంకటమోచన నామ తిహారో II
3. అంగద కే సంగ లేన గయే సియ
ఖోజ కపీస యహ బైన ఉచారో I
జీవత నా బచిహౌ హమ సో జు
బినా సుధి లాఎ ఇహాఁ పగు ధారో ॥
హేరి థకే తట సింధు సబై తబ్
లాయ సియా సుధి ప్రాన ఉబారో I
కో నహిఁ జానత హై జగమేఁ కపి
సంకటమోచన నామ తిహారో ॥
4. రావన త్రాస దఈ సియ కో సబ్
రాక్షసి సోఁ కహి సోక నివారో I
తాహి సమయ హనుమాన మహాప్రభు
జాయ మహా రజనీచర మారో ॥
చాహత సీయ అసోక సోఁ ఆగి సు
దై ప్రభు ముద్రికా సోక నివారో I
కో నహి జానత హై జగమేఁ కపి
సంకటమోచన నామ తిహారో ॥
5. బాన లగ్యో ఉర లఛిమనకే తబ్
ప్రాన తజే సుత రావన మారో I
లై గృహ బైద్య సుషేన సమేత
తబై గిరి ద్రోన సు బీర ఉపారో ॥
ఆని సజీవన హాథ దఈ తబ్
లఛిమనకే తుమ ప్రాన ఉబారో I
కో నహిఁ జానత హైఁ జగమే కపి
సంకటమోచన నామ తిహారో ॥
6. రావన జుద్ధ అజాన కియో తబ్
నాగ కి ఫాఁస సబై సిర డారో I
శ్రీరఘునాథ సమేత సబై దల
మోహ భయో యహ సంకట భారో ॥
ఆని ఖగేశ తబై హనుమాన జు
బంధన కాటి సుత్రాస నివారో I
కో నహిఁ జానత హై జగమేఁ కపి
సంకటమోచన నామ తిహారో ॥
7. బంధు సమేత జబై అహిరావన
లై రఘునాథ పతాల సిధారో I
దేబిహిఁ పూజి భలీ బిధి సోఁ బలి
దేఉ సబై మిలి మంత్ర బిచారో ॥
జాయ సహాయ భయో తబ హీ
అహిరావన సైన్య సమేత సంహారో I
కో నహిఁ జానత హైఁ జగమే కపి
సంకటమోచన నామ తిహారో ॥
8. కాజ కియే బడ దేవన కే తుమ
బీర మహాప్రభు దేఖి బిచారో I
కౌన సో సంకట మోర గరీబ్ కో
జో తుమసోఁ నహిఁ జాత హై టారో ॥
బేగి హరో హనుమాన మహాప్రభు
జో కఛు సంకట హోయ హమారో I
కో నహిఁ జానత హైఁ జగమే కపి
సంకటమోచన నామ తిహారో ॥
లాల దేహ లాలీ లసే,
అరు ధరి లాల లంగూర I
బజ్రదేహ దానవ దలన,
జయ జయ జయ కపి సూర II
మహాభారతములో - ఆది పర్వము*
*మహాభారతములో - ఆది పర్వము*
*ద్వితీయాశ్వాసము*
*19*
*వినతా కద్రువల పందెం*
ఇంద్రుని ఉచ్ఛైశ్వం సముద్రతీరంలో తిరగటం చూసిన కద్రువ వినతతో అంతటి తెల్లని అశ్వం తోక మాత్రం నల్లగా ఉందని చెప్పింది. అందుకు వినత తోక తెల్లగా ఉంది కదా అని చెప్పింది. దీనితో సవతులకు పంతం పెరిగి పందెం కాచారు. ఆ పందెం ప్రకారం గెలిచిన వారు ఓడిన వారికి దాస్యం చేయాలని ఒప్పందం కుదుర్చు కున్నారు. వినత అప్పుడే కావాలంటే దగ్గరకి వెళ్ళి చూద్దామని చెప్పింది. కద్రువ వినతను వారించి మరునాడు చూద్దామని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన కద్రువ తన కుమారులను పిలిచి ఆగుర్రం తోక నల్లగా మార్చి తల్లిని దాస్య బాధ నుండి కాపాడమని అడుగింది. అది అధర్మమని చేయలేమని నిరాకరించిన కుమారులను జనమేజయుని సర్పయాగంలో పడి మరణించమని శాపం ఇచ్చింది. ఇది చూసి భయపడిన కర్కోటకుడు అశ్వం తోకకు చుట్టుకున్నందు వలన తోక నల్లగా ఉందని భ్రమపడిన వినత కద్రువకు దాస్యం చేయటం మొదలుపెట్టింది.
మీ ఖరీధైన ఓటుని
🍃🪷 మన భవిష్యత్ కోసం మన నాయకులు ఇవ్వబోయే ఉచిత పధకాలు 🤪🤦♂️
కండువా మార్చినంత సులభంగా
Venkaiah Naidu: కండువా మార్చినంత సులభంగా పార్టీలు మారుతున్నారు: వెంకయ్య
హైదరాబాద్: రాజకీయాల్లో రూ.కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని.. అది మారాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అభిప్రాయపడ్డారు..
భుజంమీద కండువా మార్చినంత సులభంగా నేతలు పార్టీలు మారుతున్నారన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సిటిజన్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, టీఎస్ ఎంఐడీసీ ఛైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్ సహా పలువురు ప్రమఖులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు.. ఓ వ్యక్తి పార్టీ మారితే ఆ పార్టీలో ఉండగా వచ్చిన పదవికి సైతం రాజీనామా చేయాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి చేసే రాజకీయాల వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో ఫలవంతమైన చర్చలు జరిగి ప్రజలకు ఉపయోగపడే చట్టాలు రావాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావటం ద్వారా భవిష్యత్తు తరాలకు మరింత ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదని.. అందులో రాణించేందుకు అధ్యయనం చేయాలన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలని చెప్పారు..
ఉపకారం
*1956*
*కం*
ఉపకారాపేక్ష విడిచి
యుపకారము చేయువారునుత్తములెపుడున్.
ఉపకారం బొకరికొనర
నుపకారిగ నీకునొకరు నుండును సుజనా.
*భావం*:-- ఓ సుజనా! తిరిగి ఉపకారం పొందాలనే కోరిక లేకుండా ఉపకారం చేసేవారు ఉత్తములు. ఒకరి కి ఉపకారం చేస్తే నీకు ఉపకారం చేయడానికి ఒకరు ఖచ్చితంగా ఉందురు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కాశీలో ఆశ్రమాల వివరాలు*
*కాశీలో ఆశ్రమాల వివరాలు*
*శ్రీరామ తారక ఆంధ్రాశ్రమమం* :
110 గదులు కలిగి విశాలమైన వరండాలతో నాలుగువైపుల మొట్లు కలిగి అన్ని సదుపాయాలతో ఉంటుంది. యాత్రికులతో ఎప్పుడూ కిటకిటలాడుతుంది. వర్ణభేదాలు లేకుండా హిందువులందరికీ వసతి సౌకర్యం కల్పిస్తారు.
*అడ్రస్* : శ్రీరామ తారక ఆంధ్రాశ్రమం, బి.14-92, మానస సరోవర్, బెంగాలీ టోలా, పాండేహవేలీ, వారణాసి. ఫోన్ : 0542-2450418
*భోజన సదుపాయం* :
ఆశ్రమంలో దిగిన వారందరికీ పగలు 12 గంటలకు భోజనం రాత్రి 7 గంటల నుండి 8 గంటలలోపు అల్పాహార పాకెట్లు ఉచితంగా ఇస్తారు. ఇందు కోసం ఉదయం 9 గంటలలోపు పేర్లు నమోదు చేయించు కోవాలి. విరాళాలు ఇవ్వవచ్చు. ఇతర వివరాలకు సత్రంలో ఉన్న ఆశ్రమం లోని ఉద్యోగస్తులను సంప్రదించటం మంచిది.
*భోలానంద సన్యాస ఆశ్రమం*
D.28 -181, పాండేహవేలి, వారణాసి ఫోన్ : 0542-2450416,
సెల్ : 9450707921
అటాచ్డ్ బాత్రూంలతో 10 రూములు, కామన్ బాత్ రూంలతో 8 రూములు కలవు.
*శ్రీ శృంగేరి శంకర్ మఠ్*
ది శృంగేరి జగద్గురు సంస్థానానికి చెందిన మఠం. కేదార్ ఘాట్ కుఎదురుగా కలదు. కామన్ బాత్రూంలతో 10 ఫర్నిష్ తో ఉన్న గదులు కలవు. రూముకు నలుగురు ఉండవచ్చు. రూములకు అద్దెలుండవు కానీ విరాళాలు స్వీకరిస్తారు. భోజనవసతి లేదు. ముందుగా ఫోన్ చేసి రూములు రిజర్వేషన్ చేసుకోవచ్చు.
బి 14.111 కేదార్ ఘాట్, వారణాసి
ఫోన్ : 0542-2452768
*ట్రావెన్ కోర్ సత్రం*
శృంగేరి మఠాన్ని ఆనుకొని ఉంది. కింద ఆరు, పైన ఆరు గదులు కలవు. పాతభవనం, పైన నీటివసతి లేదు. కింద మున్సిపల్ నీరు 8 గంటలు మాత్రమే వస్తుంది.
*సత్సంగ శివనామ సంకీర్తనా సదనం*
కామన్ బాత్ రూంలతో 9 గదులలో నలుగురు, చిన్నగదులలో ఇద్దరు ఉండవచ్చు. చాపలు, బల్లలు, కుర్చీలు మాత్రమే ఉంటాయి. లాకర్ సౌకర్యం కలదు. బెంగాలీ టోలా గల్లీలోనికి వెళితే వెల్లంపలి రాఘవయ్య, రాఘవమ్మ అన్నసత్రం దగ్గర ఈ సత్రానికి సంబంధించిన బోర్డు తెలుగులో కనబడుతుంది.
*మార్కండేయ ఆశ్రమం*
కేదార్ ఘాట్ లో, కేదారేశ్వరాలయానికి దగ్గరలో కలదు. ఆటోలు రిక్షాలు ఆశ్రమం దాకా వెళతాయి. 15 రూములు కలవు. నెలవారీగా లేక రోజువారీగా అద్దె ఉంటుంది.
అడ్రస్ : డి7-187 కేదార్ ఘాట్, వారణాసి డి7-187, కేదార ఘాట్
*అన్నపూర్ణా ప్రాంతీయ ఆశ్రమం*
కేదార్ ఘాట్ లో గుడి దగ్గరలో కలదు. హెడ్ ఆఫీస్, హైదరాబాద్ లో కలదు. అటాచ్డ్ బాత్ రూంల సౌకర్యాలతో రెండు రూములు, కామన్ బాత్ రూం ల సౌకర్యంతో రెండురూములు మాత్రమే కలవు. 15 మంది యాత్రికులు ఒకేసారి బసచేయవచ్చు.
అడ్రస్ : డి 6-112 కేదార్ ఘాట్, సోనార్ పురా, వారణాసి,
ఫోన్ : 0542-5535002.
సెల్ : 9839605344
*కాశీ వైశ్వసత్ర సంఘం*
ఈ సత్రం కేవలం వైశ్యులకు మాత్రమే. క్షేమేశ్వరఘాట్ కు అతి దగ్గరలో, శ్రీ శృంగేరీ మఠం, కేదార్ఘాట్ పోస్ట్ ఆపీస్ కు ఎదురుగా గలదు. మూడు నుండి అయిదు రోజుల వరకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు పొందవచ్చును. 2 గదులు పర్నిచర్ తో సహా కలవు.
*అడ్రస్* : డి14-15 క్షేమేశ్వరఘాట్, కేదార్ ఘాట్ పోస్టాఫీస్ ఎదుట వయా సోనాపురా, వారణాసి.
*ఆంధ్ర క్షత్రీయ సంఘం*
శ్రీ తారకరామ నిలయం, బి5-281 హనుమాన్ ఘాట్ పోస్టాఫీస్ ఎదురుగా మెయిన్రోడ్డులో కలదు.
హిందూ యాత్రికులందరికి వసతి కల్పిస్తారు.
*గంగా స్నాన ఘట్టాలకు ఒక కిలో మీటరు దూరంలో ఉన్న వసతి గృహాలు*
*శ్రీ నిర్మలానంద ఆశ్రమం* :
బెంగాలి టోలా ఇంటర్ కాలేజి పక్క మదన్ పురా పోస్టాఫీస్ ఎదురుగా మెయిన్ రోడ్డులో కలదు. హిందూ యాత్రికులందరికీ వసతి కల్పస్తారు
ఫోన్ : 0542-2450178,
సెల్ : 98390 36093.
అటాచ్డ్ బాత్ రూంలతో 6, కామన్ టాయ్ లెట్లతో 14 గదులు, 1 హాలు కలవు.
*కాశీజంగం మఠ్* :
గోదోలియా చౌరాహ్ నుండి బి.హెచ్. యు వైపు పోతుంటే సుమారు 150-200 మీటర్ల దగ్గరలో ఎడమచేతి పైపు పెద్ద గేటున్న విశాలమైన పురాతన మఠం ఇది. రైల్వే స్టేషన్ నుండి 6-7 కిలో మీటర్ల దూరంలో మెయిన్ రోడ్డులో కలదు. భారతదేశంలోని హిందువులందరికీ ప్రపవేశం కలదు.
*జంగమవాడి మఠ్* :
డి 35-77 వారణాసి.
75 రూములు కలవు.
ఒకేసారి వేయిమందికి సరిపోను వసతి కలదు అద్దెలు లేవు. విరాళాలు స్వీకరిస్తారు. బ్యాంకులు ఎటియం లు దగ్గరలో కలవు.
*హరసుందరి ధర్మశాల* :
గోధోలియా చౌరాహ నుంచి గిరిజాఘర్ చైరాహాకు వెళ్ళే దారిలో 30 అడుగుల దూరంలో భట్టాచార్య వారి హోమియోపతి మందుల షాపుల కలదు. అందరికీ ప్రవేశం కలదు.
*అడ్రస్*: హరసుందరి ధర్మశాల, గోదౌలియా, వారణాసి.
ఫోన్ 0542-2452446. 40
రూములు, 6 హాల్స్, అన్నిటికి కామన్ బాత్ రూంలు. సామాన్యులకు అందుబాటులో గల ధర్మశాల.
*వీరేశ్వర్ పాండే ధర్మశాల* :
గోదౌలియా చౌరాహాకు పడమరగా కొద్ది దూరంలో కనిపించే గిరిజాఘర్ చౌరాహాలో కార్పోరేషన్ బ్యాంక్ కు దగ్గరగా ఉన్న తరుణ్ గుప్తా హాస్పటల్ కు ఎదురుగా లక్సారోడ్ లో కలదు. 22 రూములు, కామన్ బాత్ రూంలు, 8 రూములు అటాచ్డ్ బాత్ రూంలతో కలవు.
అడ్రస్ : 47-200 అస్సి, వారణాసి.
ఫోన్ : 0542-245527.
*చౌడేశ్వర్ పాండే ధర్మశాల* :
47-200, పి. దూరంలో మెయిన్ రోడ్ మీద కాశీపట్టణానికి దక్షిణం వైపు అసీ ఘాట్ దగ్గర కలదు. 5 ఎకరాల విశాలమైన స్థలంలో ఉంది. అందరికీ ప్రవేశం కలదు.
*కాశీ ముముక్షు భవన్ సభ* :
రైల్వే స్టేషన్ కు 10కి.మీ దూరంలో మెయిన్ రోడ్ మీద కాశీపట్టణానికి దక్షిణం వైపు అసీ ఘాట్ దగ్గర కలదు. 5 ఎకరాల విశాలమైన స్ధలంలో ఉంది. అందరికీ ప్రవేశం కలదు. 150 నుండి 200 మందికి సరిపడు హాలు, 50 గదులు (కొన్నింటికి మాత్రమే అటాచ్డ్ బాత్ రూంలు కలవు)
*ఈశ్వర్ మఠం*
దండిస్వాములకు 150 రూములు ప్రత్యేకంగా కలవు. కాశీలో చరమదశ గడపాలన్న వారికి 60 రూములు కలవు. రూములకు అద్దెలుండవు. స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు స్వీకరిస్తారు. ప్రతి రోజూ బీదలకు అన్నసంతర్పణ జరుగుతుంది. దగ్గరలోనే స్టేట్ బ్యాంక్, బరోడా బ్యాంక్, సెంట్రల్ బ్యాంకులు కలవు. యజ్గ్నయాగాదులు జరుపుకునే సౌకర్యం కలదు.
*అడ్రస్* : కాశీ ముముక్షు భవన్ సభ (అన్నక్షేత్ర) గౌడిలియా చౌరాహ్ నుంచి బి హెచ్ యుకు వెళేళ దారిలో తులసీఘాట్ సమీపంలో మెయిన్ రోడ్ లో ముముక్షు భవన్ కు అరకిలోమీటరు దూరంలో కలదు.
*శ్రీ మార్వాడి సేవాసంఘ్*, భదైనీ (తులసి ఘాట్ దగ్గర) వారణాసి
*న్యూ హోటల్ బ్రాడ్ వే* :
రైల్వే స్టేషన్ నుండి 8 కి.మీ దూరంలో బి హెచ్ యు వెళ్ళే దారిలో విజయా సినిమా క్రాసింగ్ దగ్గర ఉన్నది. శివాలా ఘాట్ కు అరకిలోమీటర్ దూరంలో ఉంది.
*అడ్రస్* : విజయా సినిమా క్రాసింగ్ దగ్గర భేలుపూర్, వారణాసి.
ఫోన్ : 0542-2277097, 3090284
*షేర్ ఆనందరామ్ జైపురియా స్మృతిభవన్ సొసైటి (జైపురియా భవన్)* :
గదొలియా సెంటర్ నుండి జ్గ్నానవాసికి వెళ్ళే మెయిన్ రోడ్ లో ప్యాలెస్ హోటల్ క్లాక్ టవర్ దాటిన తరువాత మొదటి ఎడమ గల్లీలో ఉన్నది. మొత్తం 35 రూములు కలవు.
ఫోన్ : 0542-2412766, 24127709, 24122674
*శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవీ ఆర్యవైశ్య వృద్దాశ్రమమం మరియు నిత్యాన్నదాన సత్రం*:
ఈ సత్రం ఆర్యవైశ్యులకు మాత్రమే. రెండు సత్రాలు కలవు. మొదటిది అక్నా రోడ్డులో కెనరాబ్యాంక్ ఉన్న సందులో ఉన్నది. 5 అంతస్తుల భవనంలో లిఫ్ట్ తో సహా ఆధునిక సౌకర్యాలు కలవు.
ఫోన్: 0542-2400076, 2455087.
*రెండవ సత్రం ఇదేరోడ్ లో రామకృష్ణ మిషన్ హాస్పటల్ దగ్గర*
ఫోన్ : 0542-2411829.
*వీరు మూడు రోజుల పాటు ఉచిత వసతి,భోజన సౌకర్యం కల్పిస్తారు.*
- దేవి నవరాత్రుల మహోత్సవం*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల - దేవి నవరాత్రుల మహోత్సవం*
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల వద్ద ప్రతి సంవత్సరం శరదృతువులో వచ్చే దేవి నవరాత్రులను అత్యంత ఘనంగా నిర్వహించడం ఒక ఆనవాయితీ. దానికి కారణము లేకపోలేదు, ఈ క్షేత్రంలో మోక్ష ప్రాప్తి పొందిన మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, తమ సాధనా సమయ ఆసాంతం ఆ పార్వతీ పరమేశ్వరులను శ్రీ స్వామి వారు తల్లితండ్రుల లాగానే భావించేవారు. అంతే కాదు, శ్రీ స్వామి వారి సాధన లో అనేక కీలక ఘట్టాలను సైతం నిర్దేశించింది ఆ ఆదిదంపతులే అని శ్రీ స్వామి వారే స్వయంగా తెలిపారు. అందుకనే, మన దత్తక్షేత్రంలో ఆ గౌరీశంకరులకు సంబంధించిన ఏ విశేషమైన ఎంతో ఘనంగా, శోభాయమానంగా మరియు కన్నులపండుగగా జరపడం ఒక నియమంగా ఆచరిస్తున్నాము.
తొమ్మిది రోజుల పాటు మన మందిరంలో ఈ మహోత్సవంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అందులో మొదట మనం మాట్లాడుకోవాల్సింది అమ్మవారికి ఇక్కడ ఆ తొమ్మిది రోజులపాటు జరిగే కైంకర్యాల గురించి.. నవరాత్రుల ప్రారంభరోజున, అర్చక స్వాములు ప్రధాన మందిర మండపం లోనే ఉత్తర దిక్కున శాస్త్రోక్తంగా ఆ జగన్మాత మూర్తిని ప్రతిష్టాపన చేస్తారు. అది మొదలు, నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు ఆ దినం యొక్క ప్రాశస్త్యాన్ని బట్టి, 9 రకాల అలంకారాలతో, అలంకార ప్రాశస్త్యాన్ని తెలిపే పూజ విధానాలతో అమ్మవారిని పూజిస్తారు.
ఇక మరో విశేషం *భవానీదీక్ష*.. ఎంతో మంది భక్తజనులు ఆ అమ్మగలయమ్మ మీద తమకున్న భక్తిప్రపత్తులు చాటుకునేందుకు 11 రోజుల పాటు భవానీ దీక్షను శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దనే స్వీకరిస్తారు. అలా, స్వీకరించినవారు నిరంతరం ఆ జగన్మాతను స్తుతిస్తూ మందిరం వద్ద జరిగే అనేక కైంకర్యాలలో పాల్గొంటూ, మందిరం వద్దనే గడుపుతారు. అంతేకాదు, అనేక కారణాల వలన దత్తదీక్ష ల సమయం లో మండల లేదా అర్థమండల దీక్ష చేపట్టలేని భక్తులు సైతం ఈ 11 రోజుల భవాని దీక్షను తమకు ఆ తల్లి చూపిన మార్గంగా భావిస్తారు. ఇక ఎరుపు రంగు దుస్తులను ధరించిన భవాని దీక్షాధారుల వలన మొత్తం ఈ మందిరం అంతా ఒక ఎరుపు వర్ణాన్ని పులుముకుందా అన్నంత కళగా ఉంటుంది.
ఇక విజయదశమి రోజు సాయంత్రం అత్యంత శోభాయమానమైన పండుగ వాతావరణం నడుమ.. భవానీ దీక్షా ధారులు పండరి భజన చేసి.. ఆపై అగ్ని గుండం లో నడచి పునీతులు అవుతారు..ఆ ప్రక్కరోజు అనగా ఏకాదశి రోజున అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యం గా సమర్పించి.. తమ దీక్షను విరమిస్తారు.. అదేరోజు సాయంత్రం.. అత్యంత కోలాహలంగా.. బాణాసంచా వెలుగుల నడుమ..మేళతాళాలతో..అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి.. నిమజ్జనం చేస్తారు.. అంతటితో భవానీ దీక్ష సంపూర్ణ మైనట్లు గా భావించి.. అంతులేని సంతృప్తి తో వెనుదిరుగుతారు.
ఈ అక్టోబర్ మాసం 15వ తారీఖు నుంచి 24 వ తారీఖు వరకు, మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద జరిగే ఈ మహోత్సవానికి.. అన్ని ఏర్పాట్ల ప్రణాళిక రూపొందించడం కూడా మొదలుపెట్టాము . అంతేకాదు, ఈ దేవినవరాత్రుల అన్ని రోజులలో సామాన్య భక్తులకే కాక భవాని దీక్షాధారులకి సైతం అంటే రోజుకి షుమారు 700 నుంచి 800 మందికి మధ్యాహ్నం మరియు రాత్రికి ఉచిత అన్నప్రసాదం ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా.. విజయదశమి నాడు జరిగే ప్రత్యేక ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చే భక్తులు మరో మూడు, నాలుగు వేల మందికి కూడా ఆరోజు ఉచిత ఆహారం అందిస్తున్నాము..
మన మొగలిచెర్ల అవధూత ఆ దత్తాత్రేయని కృప, ఆ జగన్మాత చల్లని దీవెన మరియు నిర్విరామంగా మాకు లభించే దాతల సహకారంతో ఈ సంవత్సరపు దేవి నవరాత్రులు సైతం ఎప్పటిలాగానే ఎంతో ఘనంగా జరుగుతాయని ఆశిస్తున్నాం... ఉచిత అన్నప్రసాద కార్యక్రమంలో మీరు కూడా మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ..
సర్వం..
శ్రీ దత్త కృప!!
(శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలము.. SPSR నెల్లూరు జిల్లా.. పిన్ : 523 114.. సెల్ : 99089 73699 & 94402 66380).
నవగ్రహా పురాణం🪐* . *49వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *49వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*బుధగ్రహ జననం - 12*
*"బ్రహ్మదేవుల అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను !"* అంగీరసుడు. లేచి , ప్రకటించాడు.
*"సౌభాగ్యవతి తారను నేను ప్రశ్నిస్తాను. శిశువు జన్మ రహస్యాన్ని ఛేదిస్తాను !"* అంటూ బ్రహ్మ తార వైపు చూశాడు. *"తారా ! నీ కుమారుణ్ణి తీసుకొని... ఆ కక్ష్యాంతరం లోనికి రా !"*
తార లేచి , శిశువును రెండు చేతుల్తో ఎత్తుకుని , బ్రహ్మ వెంట వెళ్ళింది. అందరూ ఆసక్తిగా వాళ్ళిద్దరూ వెళ్ళిన వైపే చూస్తున్నారు. బృహస్పతీ , చంద్రుడూ ఇద్దరూ సగర్వంగా చిరునవ్వులు నవ్వుకుంటున్నారు.
క్షణాలు గడుస్తున్నాయి. తార ముందుగా వచ్చింది. ఆమె చేతులలో బాలుడు లేడు. బాలుణ్ణి తన చేతుల్తో , ఎత్తుకుని బ్రహ్మ నామకరణ వేదిక వద్దకు వచ్చి , నిలుచుని , అందర్నీ మౌనంగా కలియజూశాడు. గంభీరమైన కంఠంతో ఇలా అన్నాడు.
*"ప్రతీ శిశువుకూ తండ్రి ఎవరో సందేహరహితంగా నిరూపించబడాలి. ఆ ధర్మాన్ని తారకు వివరించాను. తన వొడిలోని శిశువు తండ్రి ఎవరో - నిర్భయంగా వెల్లడించ మన్నాను. ఈ బాలకుడు ఎవరు ? బృహస్పతి తనయుడా ? చంద్రుడి తనయుడా ? చెప్పమని ఆమెను ఆజ్ఞాపించాను. ఇప్పుడు మాతృమూర్తిగా ఉన్న తార తాను ప్రసవించిన బిడ్డడి తండ్రి ఎవరో ప్రమాణపూర్వకంగా విన్నవించింది..."* ఉత్కంఠతో చూస్తూన్న అందర్నీ కలియజూస్తూ బ్రహ్మ క్షణకాలం ఆగాడు.
*"ఈ బాలకుడి తండ్రి చంద్రుడు!"* బ్రహ్మ కంఠం అక్కడ ప్రతిధ్వనించింది. *"ఈ శిశువు చంద్రునికే సంక్రమించాలి. మీ అందరి సమక్షంలో ఈ బాలుడికి 'బుధుడు' అని నేనే నామకరణం చేస్తున్నాను. జనకుడైన చంద్రుడికి అప్పగిస్తున్నాను !”*
బృహస్పతి నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోయాడు. చంద్రుడు బ్రహ్మకు నమస్కరించి బాలుణ్ణి స్వీకరించాడు.
*"చంద్రా ! ఈ బుధుడు నీ కుమారుడు. భవిష్యత్తులో ఇతడు నవగ్రహాలలో ఒకడుగా నియమితుడవుతాడు. తీసుకువెళ్ళి పెంచు , పోషించు ; విద్యతో పెంపొందించు 0!"* అన్నాడు. బ్రహ్మ చంద్రుడితో.
*"బుధుణ్ణి విద్యాభ్యాసం కోసం , మా జనకులు అత్రిమహర్షికి అప్పగిస్తాను. అందుకు మీరు అనుమతించాలి”* చంద్రుడు బ్రహ్మను అభ్యర్ధించాడు.
*"అనుమతి లభించింది. ఇక వెళ్ళు !"* బ్రహ్మ ఆజ్ఞాపించాడు.
చంద్రుడు పురిటిబిడ్డతో వెళ్తున్నాడు. తార కన్నీళ్ళతో మసకబారిన చూపుల్ని పసివాడి మీదే నాటింది.
*"బృహస్పతీ !"* బ్రహ్మ పిలిచాడు. *"నిరాశ వద్దు ! నీ వంశం నీ సంతతితోనే వృద్ధి చెందాలి ; చెందుతుంది ! చంద్రుణ్ణి , బుధుణ్ణి మరిచిపో. తార నీకు వారసుల్ని బహూకరిస్తుంది."*
బృహస్పతి మౌనంగా నమస్కరించాడు. అప్పటి దాకా చలనం లేకుండా అందరూ అటూ ఇటూ కదిలారు.
*"ఇప్పుడు.. ఆదిత్యాయచ సోమాయ..." క్రమంలోకి వెళ్ళి నవగ్రహదేవతలలో మిగిలిన ముగ్గురి జన్మ వృత్తాంతాలు శ్రవణం చేద్దాం..."* శిష్యులను ఉద్దేశించి అన్నాడు. నిర్వికల్పానంద.
*"గురువు గారూ , అయితే మీరిప్పుడు శని జన్మవృత్తాంతం చెప్పాలి !"* సదానందుడు ఉత్సాహంగా అన్నాడు.
*"ఔను ! శని నవగ్రహాలలో ఎన్నికెక్కిన ఏడవ గ్రహం. ఆయన ఆవిర్భావ నేపథ్యం చిత్రవిచిత్రంగా ఉంటుంది. అబ్బురపరిచే సంఘటనల సమాహారం అది. శని సూర్యుడి కుమారుడు. అంచేత ఒక్కసారి సూర్య చరిత్రలోకి - వెనక్కి వెళ్దాం. సూర్యుడికి విశ్వకర్మ కూతురు సంజ్ఞతో వివాహం జరిగిన కథా , ఏకాంత మందిరంలో సూర్య దంపతులు కాపురం ప్రారంభించిన సంగతీ , తనకు ఇద్దరు కుమారుల్నీ , ఒక కుమార్తెను ప్రసాదించమని సంజ్ఞ కోరిన విషయం - మనం చెప్పుకున్నాం. సంజ్ఞ కోరినట్టుగానే సూర్యుడామెకు ముగ్గురు పిల్లలను అనుగ్రహించాడు...”*
*"ఓహో... ఆ ముగ్గుర్లో, మన శని ఒకడన్నమాట !"* శివానందుడు ఉత్సాహంగా అన్నాడు.
నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. *“కాదు , శివానందా ! వాళ్ళు ముగ్గురూ ఎవరంటే జ్యేష్ఠ పుత్రుడైన వైవస్వతుడు , రెండవవాడైన యముడూ , కుమార్తె 'యమి' అనే వాళ్ళు ! ఆ వైవస్వతుడే వైవస్వత మనువు. సూర్యుడి ద్వాదశ నామధేయాల్లో 'వివస్వంతుడు' అనేది ఒకటి. వివస్వంతుని పుత్రుడైన కారణంతో సూర్యుడి పెద్దకొడుకు 'వైవస్వతుడు' అయ్యాడు. ఇక్ష్వాకుడూ , నగుడూ , శర్యాతీ మొదలైన సూర్యవంశ పురుషులందరూ ఆ వైవస్వతుడి సంతతే ! సూర్యవంశపాలన. ఆయనతోనే ప్రారంభం!*
*"ఇక - రెండవ కుమారుడు యముడు. ఆయనే మన యమధర్మరాజు. మిగిలింది కుమార్తె యమి. ఆమే యమునా నదిగా మారిపోయింది..."*
*"గురువుగారూ , అయితే శని వాళ్ళ తమ్ముడుగా తదనంతరం జన్మించాడా ?"* విమలానందుడు అడిగాడు.
*"వినిపిస్తాను , వినండి ! తల్లిదండ్రుల పోషణలో వైవస్వతుడూ , యముడూ , యమీ పెరుగుతున్నారు. మన ప్రస్తుత కథాకాలానికి వాళ్ళింకా బాల్యావస్థలోనే ఉన్నారు. ఒకనాటి రాత్రి ఏమైందంటే..."* అంటూ చెప్పసాగాడు నిర్వికల్పానంద.
*రేపటి నుండి శనిగ్రహ జననం ప్రారంభం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
స్వార్థ మందు జనులు
సర్వేజనాః మహాలుబ్దాః
నమన్యంతి ప్రమాదాని
భారత రక్షణాదక్షః
త్వమేవహి హయానన!
స్వార్థ మందు జనులు చవటలై పోయిరి
దేశ రక్ష కింక దిక్కులేదు
భరత ధాత్రి మరల బానిస కాకుండ
హయముఖా! దయగని యాదరించు
చిలకమఱ్ఱి కృష్ణమాచార్యులు
మంగళ వారం* *భౌమ వాసరః* *10-10-2023* *రాశి ఫలితాలు*
*మంగళ వారం*
*భౌమ వాసరః*
*10-10-2023*
*రాశి ఫలితాలు*
*మేషం*
చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మాతృ వర్గీయలతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
*వృషభం*
ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది.
*మిధునం*
ధన విషయమై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన రుణయత్నాలు కలసిరావు.
*కర్కాటకం*
ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.
*సింహం*
వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటా బయట కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
*కన్య*
కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరమైన సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
*తుల*
ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు.
*వృశ్చికం*
సంతాన విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిర్ణయాలు కలసి వస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
*ధనస్సు*
ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది.
*మకరం*
గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.
*కుంభం*
ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకొని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
*మీనం*
దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వలన మానసిక ఇబ్బందులు తప్పవు. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
*🕉️
ఇందిర ఏకాదశి
🙏🌺ఈరోజు ఇందిర ఏకాదశి..🌺🙏 ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుడుని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి..సకల కష్టాలు తొలిగిపోతాయని పురాణాల కథనం. ఈ ఇందిర ఏకాదశి విశిష్టత గురించి శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో విర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు దేవదేవునితో “ఓ కృష్ణా! మధుసూదనా! భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమనిబంధనలు ఏమిటి? ఆ వ్రతపాలన వలన కలిగే లాభమేమిటి?” అని ప్రశ్నించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. “ఈ ఏకాదశి పేరు ఇందిర ఏకాదశి. దీనిని పాటించడము ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతే కాకుండ అతని సమస్త పాపాలు నశిస్తాయి
భార్య ఉన్నంత వరకే
🙏భార్య ఉన్నంత వరకే భర్త ఆనందము.
🙏భార్య ఉన్నంత వరకే భర్త ఆరోగ్యము.
🙏భార్య ఉన్నంత వరకే భర్త ఐశ్వర్యము.
🙏భార్యఉన్నంత వరకే భర్తకు ఉన్నతాలోచనలు.
కావున భార్య ఉన్నప్పుడు వాటి విలువలు పొకొట్టు కోకండి.
మీ భార్యను ఒక పసి పిల్లలా చూసుకోండి నీ చివరి దశలో ఒక తల్లిలా చూసుకునేది తనే అన్న విషయం మరువకండి.
నువ్వెక్కడ జన్మించావో, నేనెక్కడ జన్మించానో, మనం ఎవరికి, జన్మనిచ్చామో అవి మనతో ఉండవు.
పరిణయం నుండి చివరి ప్రయాణం వరకు నాకు నువ్వు నీకు నేనే ఒకరికొకరం ఆసరా.
ఆఖరి రోజుల్లో భర్తకు భార్య విలువ భార్యకు భర్త విలువ పూర్తిగా అర్ధం అవుతుంది, తెలుస్తుంది చాలా మందికి.
కాని వయసులో ఉన్నప్పుడే అర్ధం చేసుకుంటే ఆ బంధం ఇంకా మరింత గొప్పగా, సంతోషంగా ఉంటుంది కదా.
దేవుడు మనిషిలో ఉండలేడు. కావున భార్యనిచ్చాడు, తల్లిని ఇచ్చాడు. ఆ తల్లి సదా కొడుకుతో ఉండలేదు.
అందుకే భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే ఆ బంధం శాశ్వతం అవుతుంది.
భర్త మనసు అర్ధం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు.
భార్య ప్రేమ అర్థమైన భర్త తనను విడిచి ఉండలేడు. ఎవ్వరి పవిత్ర బంధానికి అయినా ప్రేమ నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు తల్లితండ్రులు కనుక ఉన్నట్లయితే భార్యతో పాటు వారిని కూడా చూసుకోవలెను.
*హంస వంటివాడు
🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*వందే హంసమతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం౹*
*వందే భూతగణేశమవ్యయమహం వందేఽర్థ రాజ్యప్రదం౹*
*వందే సుందరసౌరభేయ గమనం వందే త్రిశూలాయుధం౹*
*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹*
_/" *శివస్తుతి - 8* "_/
*హంస వంటివాడు, ఇంద్రియాలకు అతీతమైనవాడు, మన్మథుని నాశనం చేసిన వాడు, బేసి సంఖ్య కన్నులు కలవాడు (మూడు), భూత గణములకు అధిపతి, మార్పు లేని వాడు, రాజ్యము, సంపద ఇచ్చేవాడు, అందమైన నందీశ్వరుని వాహనముగా కలవాడు, త్రిశూలము ధరించు వాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.
ఈశ్వరుని శక్తి
అంభోధి: స్థలతాం,స్థలం జలధితాం,ధూళీ లవః శైలతాం మేరు: మృత్కణ తాం, తృణం కులిశ తాం వజ్రం తృణ ప్రాయతాం వహ్ని: శీతలతాం, హిమం దహనతాం ఆయాతి య స్యేచ్ఛయా లీలా దుర్లలితా ద్భుత వ్యసనే దేవాయ తస్మై నమః
'ఈశ్వరుని శక్తి ఎటువంటిదంటే, కేవలం ఆయన ఇచ్చామాత్రముచే సముద్రం యింకిపోయి స్థలంగా మారుతుంది, స్థలంగా వున్నది సముద్రంగా మారుతుంది, చిన్న దుమ్ముకణం కొండంత అవుతుంది, మేరుపర్వతం యిసుకరేణువు అయిపోతుంది, గడ్డిపోచ వజ్రాయుధమవుతుంది, వజ్రాయుధం గడ్డిపోచగా మారుతుంది, అగ్ని చల్లబడుతుంది, మంచు దహించివేస్తుంది. ఈ లీలలన్నీ చూపగల ఆ ఈశ్వరుడికి నమస్కారిస్తాను' అని దీని అర్థము.
వెలుగు రేఖలు
*1955*
*కం*
ఘృష్టంబులుండుచోటనె
సృష్టంబగు నీడవోలె స్థిరముగ నెపుడున్
కష్టంబులుండుకడలనె
యిష్టంబగు సుఖముగూడ యిరవును సుజనా.
*భావం*:-- ఓ సుజనా! వెలుగు రేఖలు(ఘృష్టములు) ఉండేచోటనే పుట్టే నీడలాగ కష్టము లుండేచోటనే సుఖములు కూడా నెలకొనును(ఇరవును).
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
డోలకల్
పూర్వం ఒకసారి పరుశురాముడికి,వినాయకుడికి మధ్య ఘోరయుద్ధం జరిగిందట.ఆ యుద్ధంలో ఎవరు గెలిచారో రహస్యం.ఎవరికీ తెలియదు. కానీ డోలకల్' అని పిలవబడే ఈ కొండ బస్తర్' జిల్లాలో 'దంతేవాడ'కు బైలదిళ్ళ'కొండవరుసలో ఉంది.ఈ కొండ దిగువున ఉన్న పల్లె పేరు 'ఫరసపాల్'' (పరశుపల్లె' అయిఉంటుంది). ఈ కొండ మీద అంటే సముద్రమట్టం నుండి 3000 అడుగుల ఎత్తున కొండమీద ఓపెన్ గా 'గణేశుని ప్రతిమ' ఉన్నది. 10 శతాబ్దంలో ఈ ప్రాంతాలను పరిపాలించిన 'నాగవంశ రాజులు ఈ వినాయకుని విగ్రహం స్థాపించినట్టు తెలుస్తుంది.ఆ వెనుక కొండలు,దట్టమయిన అడవులలో కొన్నాళ్ళు ఈ విగ్రహం కనుమరుగయింది.కేవలం స్థానిక ప్రజలకే తెలుసు.ఎనిమిదేళ్ళ క్రితం ఈ ప్రాంతం వెలుగులోనికివచ్చింది.సంవత్సరానికి ఒకసారి మూడురోజులపాటు జరిగే ఉత్సవాలకు అనేకమంది వచ్చి ఈ కొండమీద వినాయకుడిని పూజిస్తారు.
రమణ మహర్షి గారు
రమణ మహర్షి గారు జీవిత విశేషాలు ఏమిటి? బ్రింటన్ విదేశీ రచయిత్ర రమణాలను ఏ విధంగా కలిశారు?
రమణీయం..రమణుల తత్వం భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తనజీవితం ద్వారా మనకు చూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి.
మౌనంలో విశ్రమించు, మనస్సు మూలాల్ని అన్వేషించు, ‘నేను’అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది.
అదే మౌన తపస్సు అంటారు మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని చేసే మౌన సాధన వల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుంది అని ఉపదేశించేవారు అరుణాచల రమణులు.
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో 1879 డిసెంబర్ 30న వెంకటరామన్‌గా జన్మించిన రమణ మహర్షికి పదహారు సం"లున్నప్పుడు అంతు తెలియని జబ్బు చేసింది.
మరణం అంచుల దాకా వెళ్లి, భగవత్ కృపతో బతికి బయటపడ్డారు. ఆ సమయంలో తన మనసులో కలిగిన ప్రేరణతో ఇల్లు వదిలి ఎన్నో దివ్యస్థలాలకు నెలవైన అరుణాచల పర్వతాన్ని చేరారు.
అక్కడి కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ, మౌనస్వామిగా పేరు పొందారు.
విరూపాక్ష గుహలో ధ్యాన మగ్నుడై ఉన్న ఈ బాలయోగిని 'కావ్యకంఠ గణపతి ముని' సందర్శించుకుని, తనను చిరకాలంగా పట్టి పీడిస్తున్న ఎన్నో సందేహాలను తీర్చుకుని, ఆయనకు రమణ మహర్షిగా నామకరణం చేశారు.
అప్పటినుంచి దేహాన్ని చాలించే వరకు రమణ మహర్షి ఆ ప్రదేశాన్ని వీడి ఎక్కడకూ వెళ్లలేదు.
అరుణాచలంలో అడుగిడినప్పటినుంచి చాలాకాలం వరకు మౌనంలోనే ఉన్నారు మహర్షి.
భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలు రాసి చూపుతూ ఉండేవారు.
కొన్నాళ్ల తర్వాత జిజ్ఞాసువులైన భక్తులపట్ల ఆదరంతో పెదవి విప్పి పరిమితంగా మాట్లాడేవారు.
అవి భక్తుల సందేహాలను తీర్చేవి, వారి బాధలను రూపుమాపేవి.
అలా మౌనోపదేశం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు భగవాన్ రమణులు.
రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సమకా లీన భారతీయులకు తెలియజేసినవారిలో ముఖ్యులు కావ్యకంఠ గణపతి ముని కాగా పాశ్చాత్యులకు పరిచయం చేసిన వారిలో ప్రధానమైనవాడు "పాల్ బ్రింటన్."*********
రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్, అనంతర కాలంలో ఆయనకు శిష్యుడై, అమూల్యమైన తన పుస్తకాల ద్వారా భగవాన్ జ్ఞానసంపదను ప్రపంచానికి చేరువ చేశారు.
అద్వైత వేదాంతమే తన తత్వంగా నిరూపించుకున్న రమణ మహర్షి జంతువు లు, పక్షులు, సమస్త జీవులలోనూ ఈశ్వరుణ్ణి సందర్శించారు.
ఆయనే అనేక మంది భక్తులకు ఆరాధ్యదైవం గా దర్శనమిచ్చారు.
ఆయన అలా అగుపించింది కేవలం హిందూమతంలోని వారికే కాదు, బౌద్ధులకు బుద్ధ భగవానుడిగా, క్రైస్తవులకు జీసస్‌గా, ముస్లిములకు మహమ్మద్ ప్రవక్తగా కూడా దర్శనమిచ్చినట్లు అనేకమంది చెప్పుకున్నారు.
తన ఆశ్రమంలో యథేచ్ఛగా సంచరించే అనేకమైన ఆవులను, కోతులను, లేళ్లను, శునకాలను కూడా ఆయన అది,
ఇది అనేవారు కాదు. అతడు, ఆమె అనే సంబోధించేవారు. పక్షపాతం చూపడాన్ని, ఆహార పదార్థాలను వృథా చేయడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణించేవారు.
గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందు తుంది’’ అని చెప్పిన రమణులు అరుణాచలంలో అడుగిడినప్పటినుండి సిద్ధిని పొందేవరకు మౌనం అనే విలువైన సాధన ద్వారానే అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదను మనకందించారు.
1950, ఏప్రిల్ 14న తనువు చాలించేవరకు ఆయన కొన్ని వేల మందికి తన ఉపదేశాల ద్వారా ఉపశమనం కలిగించారు.
కొన్ని వందలమంది పై చెరగని ముద్ర వేశారు. కొన్ని తరాల వారిపై బలంగా ప్రభావం చూపారు.
ఇప్పటికీ కూడా అనేకులు రమణ మహర్షి నిజంగా భగవానులే అని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ వమ్ము చేయలేదు, చేయరు కూడా! ఎందుకంటే వారి నమ్మకమే ఎంతో రమణీయమైనది.
సూరి నాగమ్మ గారి లేఖల ద్వారా మనందరికీ సుపరిచితమైన భగవాన్ రమణలకు నమస్కరించుచున్నాను.
విలువ
ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు.. 💐శ్రీరామభక్త శ్రీ ఆంజనేయస్వామి వారు మరియు శ్రీవల్లి దేవసేనా సమేత తిరుత్తని సుబ్రహ్మణ్ణేశ్వర స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ.
🦜🦜🦜🦜🦜🦜
*కాలానికి* మనం ఇచ్చే విలువ మన *విలువను* పెంచుతుంది . *డబ్బుకు* మనం ఇచ్చే విలువ *ఆపదలో* ఆదుకుంటుంది , *మనిషికి* మనం ఇచ్చే విలువ *మనసులో సుస్థిర స్థానాన్ని* నిలుపుకుంటుంది .
జీవితంలో *ధనం* కోల్పోతే ధనం మాత్రమే కోల్పోయినట్లు, కానీ *వ్యక్తిత్వం* కోల్పోతే *సర్వస్వం* పోగొట్టుకున్నట్లే, *ఇతరులను* అదుపు చేయడం గొప్పవిషయమే, *కానీ తనను తాను అదుపు చేసుకోవడం* అంతకన్నా గొప్ప విషయం .
మనం ఇతరులకు *మేలు* చేయడం అనేది ఒక్క *కర్తవ్యం* మాత్రమే కాదు, అది మనకు *సంతోషం* కూడ,ఎందుకంటే అది నీ *ఆరోగ్యాన్ని ఆనందాన్ని* పెంపోందిస్తుంది .
.
. ఎదుటి *మనిషి* చేప్పే విషయాలు వినడంలో మనం తొందరపడాలి *కానీ* మనం *మాట్లాడటంలో* తోందర పడకూడదు,,*ఒక వ్యక్తి గురించి* పూర్తిగా తెలిస్తేనే మనం *మాట్లాడాలి* లేదా తెలుసుకుని మాట్లాడాలి .
తన వరకు వచ్చినప్పుడు మాత్రమే *మనిషికి బాధ* విలువ తెలుస్తుంది అప్పటి వరకు *ఎదుటి వారి బాధ చులకనగా* కనిపిస్తుంది అనుభవమే *మనిషికి గుణపాఠం* .
సేకరణ 🖊️ *మీ ... ఆత్మీయ బంధువు 💐🌹🌷🤝*
ఇందిర ఏకాదశి.
🙏🌺ఈరోజు ఇందిర ఏకాదశి..🌺🙏 ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుడుని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి..సకల కష్టాలు తొలిగిపోతాయని పురాణాల కథనం. ఈ ఇందిర ఏకాదశి విశిష్టత గురించి శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో విర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు దేవదేవునితో “ఓ కృష్ణా! మధుసూదనా! భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమనిబంధనలు ఏమిటి? ఆ వ్రతపాలన వలన కలిగే లాభమేమిటి?” అని ప్రశ్నించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. “ఈ ఏకాదశి పేరు ఇందిర ఏకాదశి. దీనిని పాటించడము ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతే కాకుండ అతని సమస్త పాపాలు నశిస్తాయి
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
నారదా! ఏమి చెప్పమంటావు. ఎంతని చెప్పమంటావు? మాయాదేవి త్రిగుణస్వరూప
అఖిలాధార. సర్వజ్ఞ. సర్వసమ్మత. అజేయ. అనేకరూప. సర్వవ్యాపిక. చూడాలనుకుంటున్నావుగదా! సరే.
గరుత్మంతుణ్ణి అధిరోహించు. ఇద్దరం కలిసివెడదాం. అజితాత్ములకు కనిపించని మాయామహాదేవిని
నీకు చూపిస్తాను. చూసిన తరవాత విషాదానికి లోనవుతావేమో. మనస్సుని దృఢపరచుకోవాలి సుమా!
అని విష్ణుమూర్తి నన్ను హెచ్చరించి, గరుత్మంతుణ్ణి స్మరించాడు. గరుడుడు ప్రత్యక్షమయ్యాడు.
ఇద్దరమూ అధిరోహించాం. వాయువేగంతో బయలుదేరాడు. మహారణ్యాలూ దివ్యసరస్సులూ పవిత్ర
నదీనదాలూ పర్వతశ్రేణులూ పల్లీపత్తనగ్రామాలూ ఆశ్రమాలూ వాపీతటాకాలూ నానావిధ పక్షి మృగజాతులూ
- అన్నింటినీ తిలకిస్తూ దాటుకుంటూ కాన్యకుబ్జ సమీపస్థలం చేరుకున్నాం. అక్కడ ఒక అతిలో
సుందరమైన సరస్సు కనిపించింది. నిండా వికసించిన రంగురంగుల పద్మాలు. హంసకారండవ
చక్రవాకాది జలపక్షి సమూహాల కోలాహలం. తుమ్మెదల ఝంకారాలు. స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్న
మధురజలం, క్షీరసముద్రోదకంతో పోటీపడుతుందనిపించింది. ఆ దివ్యసరోవరాన్ని చూసి శ్రీ మహావిష్ణువు
- ఇందులో స్నానం చేసి కాన్యకుబ్జ పట్టణంలోకి ప్రవేశిద్దామని గరుత్మంతుణ్ణి కిందికి దిగమన్నాడు.
గరుడుడు ఆ సరోవర తీరంలో మెల్లిగా వాలేడు. శ్రీహరి ముందుగా దిగి, నా చూపుడువేలు అందుకుని
నన్ను దింపాడు. సరోవర సౌందర్యాన్ని ప్రస్తుతిస్తూ ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక చెట్టువీడలో
విశ్రమించాడు. నారదా! ముందు నువ్వు స్నానం కానియ్యి, తరవాత నేను చేస్తాను - అన్నాడు. సరేనని
నేను సరోవరంవైపు చూపులు నిగుడించాను. సజ్జనుల హృదయాల్లాగా నీళ్ళు నిర్మలంగా ఉన్నాయి.
పంకజపరాగాలతో పరిమళిస్తున్నాయి
భోజనమునకు
భోజనమునకు ఉపయోగించదగిన పాత్రలు మరియు ఆకు విస్తళ్ళు -
* బంగారు పాత్ర యందు భోజనము మంగళప్రదమైనది . జఠరాగ్ని వృద్ది చెందును. వీర్యవృద్ధి కలుగచేయును . మంచి చూపును ఇచ్చును . పైత్యవికారాలను అణుచును . శరీరానికి గొప్ప మేలు చేయును .
* వెండిపాత్ర యందు భుజించిన పిత్తం ఎక్కువగును . శ్లేష్మాన్ని హరించును . వాతాన్ని చేయును . అరుచి ( ఏమి తిన్నా రుచి లేకుండా ఉండు సమస్య ) పోగొట్టును . శరీరానికి కాంతిని ఇచ్చును . వెండి ప్లేట్ మధ్యలో బంగారముతో తాపడం చేయించి అందులో భుజించుట కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును .
* కంచు పాత్రలో భుజించిన రక్తపైత్యము హరించును . హృదయానికి బలాన్ని ఇచ్చును . బుద్ధిని పెంచును . శరీరము నందు జఠరాగ్ని పెంచును . శరీరానికి కాంతిని కలుగచేయును . ఎముకల వృద్ది అగుటకు తోడ్పడును . ఎముకల బలానికి సహాయపడును .
* స్టెయిన్ లెస్ స్టీల్ , ఇనుము పాత్ర యందు భుజించిన శోధన ( Asitis ) , పాండురోగము ( Anemia ) సమస్యలను పోగొట్టును . కామిల వ్యాధి ( కామెర్లు ) నివారణ అగును . వీర్యవృద్ధి , జఠరాగ్ని పెంచును . ఈ పాత్రలను శుభ్రపరుచుట సులభము .
* అల్యూమినియం పాత్ర యందు వండుట మరియు భోజనం చేయుట అత్యంత ప్రమాదకరం . ఈ పాత్రల యందు వండు సమయము నందు దీని యందలి విషము కొంచం కొంచం వండిన ఆహారాల యందు కలిసి రక్తదోషాలు ఏర్పడి చర్మరోగాలు వచ్చుటయే కాక , జఠరాగ్ని మందగించి శరీరము విషతుల్యమై అనేక రోగాలు సంప్రాప్తించును .
ఆకు విస్తర్ల యందు భోజనం చేయుట వలన ఉపయోగాలు -
* అరటి ఆకు యందు భోజనము మిక్కిలి పరిశుభ్రముగా ఉండును . వాతాన్ని హరించును . బలము , ఆరోగ్యము వృద్ధిచెందును . శరీరకాంతి , సంభోగశక్తి పెంపొందించును . ఆకలిని మరియు దంతకాంతిని కలిగించును . పైత్యమును శాంతిప చేయును . శ్లేష్మవికారాలు , వొళ్ళు నొప్పులు తగ్గును . శరీరము నందలి క్రిములు నాశనం అగును . ఉదరము నందలి పుండ్లు ( peptic ulcers ) తగ్గించును .
* మోదుగ ఆకు విస్తరి యందు భుజించుట వలన గుల్మరోగము ,మహోదరము , క్రిమిరోగము , రక్తసంబంధ రోగములు , పిత్తరోగములు నివారణ అగును . బుద్దిని పెంచును . మోదుగ చంద్ర సంబంధ వృక్షము . చంద్రుడు మనః కారకుడు అందుచే ఈ విస్తరి యందు భుజించటం చేత సాత్విక గుణములు కలుగును .
* మర్రి ఆకుల విస్తరి యందు భుజించటం వలన క్రిమిరోగ నివారణ అగును. వ్రణములు , పైత్యం పొగొట్టును . కుష్ఠు రోగమును హరించును . నేత్రదోష నివారణ చేయును . వీర్యవృద్ధి కలిగించును .
* రావి ఆకు విస్తరి యందు భుజించిన పిత్తము , శ్లేష్మము నివారణ అగును . అగ్నివృద్ధి కలిగించును . జననేంద్రియ దోషములు నివారణ అగును . విద్యార్జనకు కావలసిన ఆసక్తిని కలుగచేయును .
* పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది , పిత్తహర గుణములు ఉండును .
* తామర ఆకు విస్తరి యందు భుజించిన విషహరముగా ఉండును . సరస్సులో ఉన్న ఆకు భుజించుటకు పనికిరాదని " అహ్నిక ప్రకాశం" అను గ్రంథములో ఉన్నది .
* వక్కపట్ట భోజనమునకు వాడుట కొన్ని ప్రదేశాలలో ఉన్నది. తిన్నతరువాత పళ్ళెము వలే కడిగి మరలా భుజించటం కూడా ఉన్నది . ఇది అగ్నివృద్ది చేయును . దీని నుంచి వాతపిత్తరోగములు హరించును .
శ్రీ జగన్నాథుడి మహా- ప్రసాదం
శ్రీ జగన్నాథుడి మహా- ప్రసాదం
ఒకప్పుడు నారదముని వైకుంఠానికి వెళ్ళి , భక్తితో లక్ష్మీదేవిని సేవించాడు. అతని సేవకు ఎంతో ప్రసన్నురాలైన లక్ష్మీదేవి, ఏదైనా వరం కోరుకొమ్మని అంటుంది. అప్పుడు నారదముని, “అమ్మా! అలా అయితే నేను ఏ వరం కోరినా ఇస్తానని మొదట మాట ఇవ్వు” అంటాడు. “దేనినైనా సరే, సంతోషంగా ఫలించేలా ఇస్తాను” అని మాట ఇస్తుంది ఆమె. నారద మహర్షి వెంటనే తన మనసులో ఉన్న కోరికను బయట పెడతాడు, “నేను శ్రీవారి మహాప్రసాదాన్ని అపేక్షిస్తున్నాను తల్లీ” అని.
ఆ మాట వినగానే లక్ష్మీదేవి ముఖం ఆందోళనతో నిండిపోతుంది. “కుమారా! దయచేసి ఈ వరం తప్ప మరేదైనా కోరుకో, కొద్దిరోజుల క్రితం తనకు అర్పించిన మహాప్రసాదాన్ని ఎవరికీ ఇవ్వొద్దని శీమన్నారాయణుడు నన్ను ఆజ్ఞాపించారు. అందువలన నేను నీకు మహాప్రసాదాన్ని ఇవ్వలేను నాయనా! ఆయన ఆనతిని నేను అతిక్రమించ లేననే విషయం నీవు గ్రహించు, ఇది తప్ప వేరే దేనిని నీవు ఆశించినా వెంటనే ఫలప్రదం చేస్తాను.” అయితే నారదముని తన మొండి పట్టుదల వదల్లేదు. “తల్లీ ! నీవు నాకు మాట ఇచ్చావు శ్రీమన్నారాయణుడికి ప్రియ సతివైన నీకు ఇది కష్టమైనదేం కాదు, ఎలాగో ఒకలాగ నాకు మహాప్రసాదాన్ని అనుగ్రహించ వలసిందే!” లక్ష్మిదేవికి గొప్ప చిక్కు వచ్చిపడింది, ‘ఇప్పుడు ఏం చెయ్యాలి?’ ఆమె నారదుడితో కొంత సమయం వేచి ఉండమని చెబుతుంది.
ఆ రోజు మధ్యాహ్నం ఆమె నారాయణుడికి చాలా శ్రద్ధగా , జాగ్రత్తగా భోజనం వడ్డిస్తూ ఉంది. ఎంతో అణుకువగా తన పని చేస్తున్నప్పటికీ ఆమె ఉదాసీనంగా ఉండడం శ్రీహరి గమనించాడు, ఆమె ముఖం నిరాశతో ముడుచుకుని పోయి ఉంది. ఆయన ఎంతో మృదువుగా ఆమె దుఃఖానికి హేతువేమిటని ప్రశ్నించాడు. ఆ లాలనకు కరిగిపోయిన లక్ష్మి, తనకు వచ్చిన ఇబ్బందిని గురించి గద్గదికంగాచెప్పుకుంది, నారాయణుడు ఆమెను ఓదార్చి ‘దుఃఖించకు, ఈ రోజుకు మాత్రం ఈ నియమాన్ని రద్దు చేస్తాను, నేను మిగిలించిన ప్రసాదాన్ని నీవు నారదుడికి ఇవ్వొచ్చు, అయితే నా కంట పడకుండా నీవు ఈ పని చేయాలి, నేను ప్రక్కకు తిరిగి ఉన్నప్పుడు నాకు తెలియనట్లుగా ఈ పళ్ళెం తీసుకుని వెళ్ళు’ అన్నాడు. శ్రీలక్ష్మికి పట్టరానంత ఆనందం కలిగింది. తన ప్రియమైన నాథుడు ఆదేశించినట్లుగానే చాలా నేర్పుగా ఆమె భుక్త శేషంతో కూడిన పళ్ళాన్ని ప్రక్కకు తీసేసింది.
లక్ష్మీదేవి వెంటనే మహాప్రసాదం ఉన్న పళ్ళాన్ని ఆనందంగా నారద మునికి అందించింది. నారదముని ఎంతో ఆత్రుతగా, వినమ్రంగా ప్రసాదాన్ని ఆరగించాడు. శ్రీమన్నారాయణుడి ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ భుజించిన నారదముని, తన ఆనందోద్వేగాన్ని, ఆపుకోలేకపోయాడు. ఒక్క క్షణం కూడా హరి నామస్మరణను ఆపకుండా పారవశ్యంతో నర్తించడం మొదలు పెట్టాడు. ఆ మైమరపు తారస్థాయికి చేరి తనను తాను నియంత్రించుకో లేక వీణను పట్టుకుని, ఉన్మత్తుడిలా, ఒక లోకం నుండి మరొక లోకానికి పరిగెడుతూ, చివరికి కైలాసాన్ని చేరాడు. శివుడు అతడి పరిస్థితిని చూసి ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు. విష్ణు-భక్తి తరంగాలలో ఈదులాడుతున్న నారదుడు శివుడిని గమనించలేదు. “నారదా! నిరంతరం నారాయణుడిని తలచుకుంటూ ఉండడం వలన, నీవు ఎప్పుడూ పరమానందంగానే ఉంటావు. అయితే ఇటువంటి స్థితిలో నిన్ను ఎన్నడూ చూడలేదు, ఏమయ్యింది నీకు?” నారదుడిని సమాధాన పరచడానికి ప్రయత్నిస్తూ శివుడు ప్రశ్నించాడు. నారదముని కాస్త స్థిమిత పడి, జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు. “భగవంతుడి మహా ప్రసాదం స్వీకరించిన ఆనందంలో ఆ తరువాత నన్ను నేను మరచిపోయాను, పారవశ్యంలో మునిగిపోయి స్వామివారి కీర్తన, నర్తనలో మునిగిపోయాను.” ఊపిరి తిప్పుకోకుండా నారదుడు తన అనుభవాన్ని వివరిస్తుంటే, శివుడు రెండు చేతులూ జోడించి, “ఓఁ నారదా! నీవెంతటి భాగ్య వంతుడివి?! నారాయణుడి మహా ప్రసాదాన్ని రుచి చూసే అదృష్టం నీకు లభించింది, ప్రియమైన నారదా! నా కోసం కాస్త ప్రసాదం తెచ్చే ఉంటావు కదా!” అంటూ చాలా నమ్మకంగా చిరు నవ్వు నవ్వాడు.
శివుడి కోసం తను ప్రసాదం తీసుకు రానందుకు నారదుడికి విచారం కలిగింది. తలవాల్చుకుని, చేతులు జోడించి, శివుడి ఎదుట నిలబడ్డాడు, అప్పుడతడికి తన చేతి వేలి గోటికి అంటుకుని ఉన్న ప్రసాదం కాస్త కనిపించింది. వెంటనే భారం తగ్గినట్లుగా ఊపిరి వదిలి, “నిజమే! ఇదిగో, నీకు మాత్రమే సరిపోయే ‘కనిక మ్రాత’ ప్రసాదం.” తన చేతిని చాలా జాగ్రత్తగా ముందుకు చాచి “నీవు చాలా అదృష్టవంతుడివి, ఇదిగో ప్రసాదం” అంటూ తన వేలిని శివుడి నోటిలో పెట్టాడు.
ఎప్పుడైతే అల్ప పరిమాణంలో ఉన్న ప్రసాద లేశం మహాదేవుడి జిహ్వకు తాకిందో వెంటనే తీవ్రమైన ఆనందంతో అతని ఒళ్ళు గగుర్పొడిచింది. వెంటనే ఆనందోద్రేకంతో తాండవం చెయ్యడం మొదలు పెట్టాడు, అతనిలో పారవశ్యం ఎక్కువవుతూ ఉంటే, నాట్యంలో ‘వడి’ కూడా పెరిగింది. రాన్రాను ఆ నాట్యం ప్రళయ తాండవంగా మారసాగింది. సమస్త జగత్తు కంపించడం ప్రారంభమయ్యింది, అందరూ భయంతో వణికి పోయారు, “ఏం జరుగుతూ ఉంది? జగత్తు అంతం కావడానికి ఇది సమయం కాదు, అకాలంలో ఈయన ఎందుకు నర్తిస్తున్నాడు?”
శివుడు చేస్తున్న విలయ తాండవాన్ని ఆపడానికి ఎవరికీ ధైర్యం చాల లేదు. దేవతలందరూ పార్వతీ దేవి దగ్గరకు వెళ్ళి, “ఆయనను శాంత పరచమనీ, లేదంటే విశ్వం అంతరించడం తప్పదని” మొరపెట్టుకున్నారు. పార్వతీ దేవి అక్కడకు వచ్చి ఆపడానికి శక్యం కానంతటి భావావేశంలో నర్తిస్తున్న శివుడిని చూసింది. ఆమె చొరవ తీసుకోవడంతో బాహ్యస్మృతిలోకి వచ్చాడు శివుడు. “ప్రాణనాథా! ఏం జరిగింది? మీ అదుపు తప్పిన పారవశ్యానికి కారణం ఏమిటి”? అని పార్వతీ దేవి పశ్నించింది.
సమాధానంగా శివుడు, నారద ముని నుండి నారాయణుడి మహా ప్రసాదాన్ని పొందిన విషయాన్ని గురించి వివరించాడు, ఆమె దిగ్భ్రమతో “నాథా! నా కోసం కాస్త ప్రసాదాన్ని ఉంచారా?” అంటుంది. శివుడు సమాధానం ఇవ్వలేక పోతాడు. ఎందుకంటే అతనికి దొరికిందే అణువంత, అందులో మళ్ళీ పార్వతి కోసం ఉంచడం ఎలా సాధ్య పడుతుంది? తనకు ప్రసాద భాగ్యం లేదని తెలియగానే ఆమెకు ఆవేశం ముంచుకొచ్చింది. ఆమె ఆగ్రహ జ్వాలలు అధోలోకాల నుండి ఊర్ధ్వలోకాల వరకు పాకాయి. ముల్లోకాలలోని సమస్త ప్రాణికోటీ దహించివేస్తున్న ఆ వేడిమిని భరించలేక పోయింది. ఋషులూ, సాధు పురుషులూ, ఆమె క్రోధాగ్నిలో సమస్తము అంతం కాబోతుందని అర్థం చేసుకున్నారు. శివుడితో సహా ఎవరూ ఆమె కోపాగ్నిని చల్లార్చలేక పోయారు.
చివరికి దేవతలందరినీ వెంట బెట్టుకుని, బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి పరిస్థితిని గురించి వివరించాడు. వెంటనే నారాయణుడు గరుడునిపై ఎక్కి కైలాసాన్ని చేరుకున్నాడు. ఆయనను చూడగానే పార్వతీదేవి ముందుకు వచ్చి గౌరవ ప్రణామాలు అర్పించింది. నారాయణుడు వాత్సల్యంతో ఆమెను ఆదరించి, “నీవు కోరినంత మహా ప్రసాదాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను, దయచేసి నీ కోపాన్ని వదిలేసి శాంతించు, లేకపోతే నీ బిడ్డలందరూ నశించి పోతారు” అని సముదాయించాడు.
అయితే పార్వతీ దేవి తన అసమ్మతిని తెలియజేస్తూ “నువ్వు నాకు మాత్రమే మహా ప్రసాదం ఇచ్చినప్పటికీ నాకు సంతృప్తి కలగదు. సమస్త ప్రాణికోటికీ నీ మహాప్రసాదం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రసాదం లభించక పోవడం వలన నేను అనుభవించిన నిరాశా, నిస్పృహలు ఇతరులు ఎవ్వరూ అనుభవించకూడదు. మనుష్యులే కాదు, కుక్కలు మొదలైన ఇతర ప్రాణులన్నీ కూడా ఈ మహాభాగ్యానికి నోచుకునేలా నీవు ఏదైనా ఏర్పాటు చేయాలి” అంటుంది.
నారాయణుడు చిరునవ్వు నవ్వి “తథాస్తు! అలాగే కానీ” అన్నాడు. “ప్రియమైన పార్వతీ, నీ కోరిక తీర్చడం కోసం నేను, నీలాచల ధామంలో అవతరిస్తాను. నా మందిరం ప్రసాద వితరణతో ప్రఖ్యాతి చెందుతుంది. నా ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళందరూ భవసాగరం నుండి బయట పడగలుగుతారు. నా ప్రసాదాన్ని మొట్టమొదట నీకే అర్పిస్తారు, అప్పుడే అది మహాప్రసాదంగా అంగీకరించ బడుతుంది. ఈ మహాప్రసాదం గొప్పవాళ్ళు, అల్పులు, ప్రాణులు, హీనులు అనే తారతమ్యాలు లేకుండా అందరికీ వితరణ చేయబడుతుంది. నీ మందిరం నా వెనుక వైపున ఆలయ ప్రాగణం లోపలనే ఉంటుంది. మహా-ప్రసాదం విషయంలో నిన్ను పట్టించుకోక పోవడం వలన, శివుడి మందిరం కాస్త దూరంలో నా ఆలయ ప్రాగణానికి వెలుపలి వైపున ఉంటుంది.”
పార్వతీ దేవికి మాట ఇచ్చినట్లుగానే భగవంతుడు జగన్నాథుడిగా పూరీ క్ష్రేతంలో వెలిశాడు. పార్వతీ దేవి ‘విమల’ అనే పేరుతో కొలువై ఉంది. జగన్నాథుడికి అర్పించిన తర్వాత ప్రసాదం అంతా మొదట విమలా దేవికి సమర్పిస్తారు. జగన్నాథ మహా ప్రసాదాన్ని పూరీ వాసులే కాకుండా, పూరీ క్ష్రేతాన్ని దర్శించడానికి వెళ్ళిన ప్రవాసులు అందరూ కూడా భక్తితో స్వీకరించి ధన్యులవుతున్నారు
--జై జగన్నాధ//జై జగన్నాధ--
--సర్వేజనాస్సూఖినోభవంతు--
హంస వంటివాడు
ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*వందే హంసమతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం౹*
*వందే భూతగణేశమవ్యయమహం వందేఽర్థ రాజ్యప్రదం౹*
*వందే సుందరసౌరభేయ గమనం వందే త్రిశూలాయుధం౹*
*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹*
_/" *శివస్తుతి - 8* "_/
*హంస వంటివాడు, ఇంద్రియాలకు అతీతమైనవాడు, మన్మథుని నాశనం చేసిన వాడు, బేసి సంఖ్య కన్నులు కలవాడు (మూడు), భూత గణములకు అధిపతి, మార్పు లేని వాడు, రాజ్యము, సంపద ఇచ్చేవాడు, అందమైన నందీశ్వరుని వాహనముగా కలవాడు, త్రిశూలము ధరించు వాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.
శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸
*🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం,55వ శ్లోకం*
*శ్రీ భగవాన్ ఉవాచ*
*ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |*
*ఆత్మన్యే వాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ స్తదోచ్యతే || 55*
*ప్రతి పదార్థం*
పార్థ = ఓ పార్థా! ; యదా= ఎప్పుడైతే; మనోగతాన్ = మనస్సు నందున్న ; సర్వాన్ = సమస్తములైన ; కామాన్ = కోరికలను ; ప్రజహాతి = ( మనుజుడు ) పూర్తిగా త్యజించునో, (మరియు ); ఆత్మనా = ఆత్మ ద్వారా ; ఆత్మని ఏవ = ఆత్మయందే; తుష్టః = సంతుష్టుడగునో; తదా = అప్పుడే; స్థితప్రజ్ఞః =( అతడు ) స్థితప్రజ్ఞుడు ; ఉచ్యతే = అనబడును;
*తాత్పర్యము*
*శ్రీ భగవానుడు పలికెను:*
ఓ అర్జునా! మనసు నందలి కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టడైన వానిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని యందురూ.
*సర్వేజనాః సుఖినోభవంతు*
*హరిః ఓం🙏🙏*
నవగ్రహ పురాణం - 76 వ అధ్యాయం*
*నవగ్రహ పురాణం - 76 వ అధ్యాయం*
🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷
*బుధగ్రహ చరిత్ర - 3*
మాటాడలేకపోతున్నాడు. హృదయాలు ద్రవిస్తూ , స్పందించే విశిష్ట క్షణాలలో మాటలు అవసరం లేదని ఆ 'వాక్పతి'కి తెలుసు , బృహస్పతి చిరునవ్వుతో బుధుణ్ణి చూశాడు. ఆ చిరునవ్వు ఆయన ముఖానికి ప్రశాంత ప్రకాశాన్ని పులుముతోంది. అనునయంగా తలపంకిస్తూ ఆశ్రమం వైపు చెయ్యి చూపించాడాయన.
బుధుడి ముఖం ఆనందంతో వికసించింది. అప్రయత్నంగా చేతులు జోడించి , ఆశ్రమం వైపు అడుగులు వేశాడతను.
అప్పటిదాకా మౌనంగా ఉండిపోయిన శిష్య బృందం వల్లె వేయడం ప్రారంభించింది.
ఆశ్రమం ద్వారం దాటి లోపలకి అడుగుపెట్టిన బుధుడు ఆగాడు. అతని కళ్ళు ఆతృతగా అంతటా కలయజూశాయి. ఎవ్వరూ లేరు. ఎదురుగా ఉన్న ద్వారం వైపు వెళ్ళబోతూ - తటాలున ఆగాడు బుధుడు.
ఎదురుగా ఉన్న ద్వారబంధం ముందు ఒక స్త్రీ మూర్తి ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో పూలసజ్జ ఉంది. అపరిచిత యువకుడిని ఆశ్రమంలో చూసిన ఆశ్చర్యం ఆమెను ద్వారబంధానికి బంధించింది. ఆమె తార !
చంద్రుడా ? చంద్రుడు మళ్ళీ వచ్చాడా ? ఒకదాన్నొకటి వెంటాడుతూ పుట్టుకొస్తున్న ఆలోచనలు ఆమెను అయోమయానికి గురిచేస్తున్నాయి.
బుధుడు అసంకల్పితంగా ముందుకు - ఆమె వైపు అడుగులు వేస్తున్నాడు. ఏదో అదృశ్య బంధం అతన్ని ఆమె వైపు లాగుతోంది. అతని అంతరాంతరాల్లోంచి ఏదో పిలుపు సంకల్ప రూపంలో జన్మించి , అదే క్షణంలో 'పరావాక్కుగా పరిణమించింది. ఆ పరావాక్కు 'పశ్శంతి వాక్కుగా పరిణమించింది. 'మధ్యవాక్కుగా ఎదిగింది. మధ్య 'వాక్కు 'వైఖరీవాక్కు'గా మారి , సశబ్దంగా వెలువడింది. బుధుడి అంతరాంతరాల్లోంచి దూసుకుంటూ వెలువడిన ఆ పిలుపు తార కర్ణపుటాలను స్పృశించి , ఆమెకు అలౌకికమైన శ్రవణానందాన్ని అందించింది. ఆ క్షణంలోనే వాత్సల్యతరంగంలా రూపాంతరం చెంది .ఆమె సర్వస్వాన్నీ కుదిపివేసింది.
చంద్రుడు కాదు. చంద్రుడి ప్రతిరూపం ! తన గర్భకలశంలో అంకురించిన అనురాగం ! తాను ప్రసవించిన ప్రణయఫలం ! తన కన్న కొడుకు ! తాను కడుపారా కన్న పాపడు ! బుధుడు !
*"అమ్మా..."* దగ్గరవుతూ తనను నోరారా పిలుస్తున్న బుధుడి వైపు తార మంత్రముగ్ధలా. అడుగులు వేసింది.
*"నాయనా !"* తార కంఠం ఉద్వేగంతో వణికింది. తను గర్భం ధరించి , నవమాసాలూ , భరించి , మహనీయ ప్రసవవేదనా మధురానుభూతిని అర్ధం చేసుకుంటూ ప్రసవించిన తన బిడ్డడు - ఇన్నాళ్ళకు , ఇన్నేళ్ళకు మొట్టమొదటిసారిగా తనను *'అమ్మా'* అని పిలుస్తున్నాడు. బిడ్డకి జన్మనిచ్చిన ఎన్నో ఏళ్ళకు... ఈనాడు... తాను మొట్ట మొదటిసారిగా 'అమ్మా' అన్న పిలుపును వింటోంది !
తారలో ఇంతకాలం ఘనీభవించి ఉండిపోయిన మాతృప్రోతస్విని ఒక్కసారిగా కరిగి , ప్రవహిస్తోంది. తార నేత్రాలను ఆనంద సరోవరాలుగా చేస్తున్న అశ్రుధారల్ని వెక్కిరిస్తూ. ఆమె నిలువును జలదరింపచేస్తూ , పావన స్తన్యం చిప్పిల్లింది.
బుధుడు తనకు తెలియకుండానే , అమ్మ కౌగిలిలో ఒదిగిపోయాడు. తార తనకు తెలియకుండానే బుధుణ్ణి ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. తల్లీ తనయుల తన్మయత్వంతో , ఆశ్రమంలో కాలం స్తంభించింది. తార ఆనందాశ్రువులు బుధుడికి అభ్యంగస్నానం చేయిస్తున్నాయి. తల్లి సున్నితంగా అద్దుతున్న బరువైన ముద్దులతో బుధుడి నుదురు కందిపోతోంది.
*"అమ్మా...”*
తార ఆవేశాన్నీ , ఉద్రేకాన్నీ నిగ్రహించుకుంటూ కొంచెం దూరంగా జరిగింది. బుధుణ్ణి నఖశిఖ పర్యంతం చూస్తూ ఉండిపోయింది. ఇన్నేళ్ళకు తన ఎదుట నిలుచున్న తన బిడ్డడికీ , తనకూ మధ్య తెరలా ఏర్పడుతున్న కన్నీటిని , ఆనందబాష్పాలను తుడుచుకుంది.
*“నాయనా ! తొమ్మిది నెలలు నిన్ను గర్భంలో మోశాను. పది రోజులు ఈ చేతుల్తో మోశాను"* తార తన చేతుల్ని చూపుతూ అంది. *"పది రోజుల పసిగుడ్డుగా ఉన్న నిన్ను... చిన్నారి పెదవులతో సున్నితంగా చీకుతూ నా స్తన్య భారాన్ని తగ్గిస్తున్న నిన్ను ఈ చేతులతోనే ఇచ్చివేశాను."*
*"అమ్మా..."* బుధుడి కంఠం బొంగురుపోయింది. కళ్ళు తడిగా మెరిశాయి.
*"ఔను నాయనా ! ఏడుస్తూ ఇచ్చివేశాను. ఇచ్చి వేశాక ఏడుస్తూ ఉండిపోయాను. బుధా , నేను నీ దగ్గరకు రాలేననుకున్నాను. నువ్వు నా వద్దకు రావనుకున్నాను. నువ్వెవరో తెలిసిన నేనే నీ కోసం రాలేనప్పుడు , రానప్పుడు , నేనెవరో తెలిసి నువ్వు ఎలా రాగలవు ? అందుకే నువ్వు ఇంక నా కళ్ళకు కనిపించవనుకున్నాను.
*“కానీ... కానీ... నువ్వు వచ్చావు. ఇన్ని సంవత్సరాల అనంతరం... ఈ అమ్మను 'అమ్మా !' అని పిలిచావు. తండ్రీ ! నా దౌర్భాగ్యాన్ని మహద్భాగ్యంగా మార్చావు నాన్నా !”*
*"అమ్మా ! నీ మాటలో , నీ కన్నీటి ఊటలో నాకు లభించే అమృతం కోసం ఇన్నాళ్ళు ఎదురుచూస్తూ కలలు కంటూ గడిపాను. నీ బంగారు దీవెన కోసం వచ్చాను !"* బుధుడు చిరునవ్వుతో అన్నాడు.
*"బంగారు తండ్రికి బంగారు దీవెనలు ఎందుకివ్వను ?"* తార బుధుడి చెంపలను అరచేతుల్తో సున్నితంగా నొక్కుతూ అంది.
*"స్వయం పోషణలో , స్వయం సాధనలో జీవించడానికి వెళ్తూ నీ దర్శనం కోసం వచ్చాను..."* బుధుడు తన కార్యక్రమాన్ని వివరించాడు.
*"తారా !"*
బృహస్పతి పిలుపు విని , ఇద్దరూ ద్వారం వైపు చూశారు. తార అశ్రుసిక్తమైన తన ముఖాన్ని తుడుచుకుంది. *"స్వామి..."*
*"బుధుడు ఈరోజు , ఇక్కడే , అమ్మచేతి అమృతం ఆరగిస్తాడు.'*
*"స్వామీ !”* తార కంఠంలో ఆశ్చర్యం , ఆనందం.
బృహస్పతి వెళ్ళబోతూ ఆగి చిరునవ్వుతో చూశాడు. *"కడుపారా కన్నావు కద ! కడుపారా అన్నం పెట్టు !"*
వెళ్ళిపోతున్న భర్త మీద నుంచి చూపులను బుధుడి వైపు తిప్పింది తార. అతని ముఖంలో ఏదో అవ్యక్తానందం తొణికిసలాడుతోంది. తార కళ్ళు కడిగిన అద్దాల్లా మెరుస్తున్నాయి. బుధుడు , తార చేతిలోంచి ఎప్పుడో జారిపడిన పూల సజ్జను తీసుకొని , నేల మీద చెల్లాచెదురుగా పడి ఉన్న పువ్వుల్ని ఏరసాగాడు.
బుధుడు తండ్రి నిర్దేశించిన అరణ్యం వైపు ప్రయాణం సాగిస్తున్నాడు. బృహస్పతి ఆశ్రమంలో తనకు ఎదురైన మధురానుభూతుల్ని మరిచిపోలేకుండా ఉన్నాడు తను.
తన కళ్ళ ముందు ఇంకా ఆ దృశ్యాలే ! తన చెవులలో ఇంకా అక్కడ ఆలకించిన మాటలే !
జన్మించి , బుద్ధి తెలిసిన అనంతరం మొట్టమొదటిసారిగా మాతృవాత్సల్యాన్ని రుచిచూశాడనతను ! పితామహి అనసూయాదేవి , పితామహుడు అత్రిమహర్షీ , తండ్రి చంద్రుడూ , ఇరవై ఏడుగురు తల్లులూ తన మీద ప్రేమానురాగాలు కురిపించారు. వాత్సల్యాన్ని వర్షించారు. కన్నతల్లి తారాదేవి కూడా తన మీద ప్రేమానురాగాలు కురిపించింది. వాత్సల్యాన్ని వర్షించింది.
అన్యులైన వాళ్ళ వాత్సల్యానికీ , అమ్మ అయిన తార వాత్సల్యానికి ఎంత అంతరం తన పితామహి అనసూయాదేవీ , తల్లులైన చంద్రపత్నులూ తన పట్ల వ్యక్తం చేసిన మమకారం... వీవనలతో విసిరిన గాలి !
కన్నతల్లి తార వ్యక్తం చేసిన మమకారం స్వచ్ఛందంగా పచ్చని ప్రకృతిలో స్వచ్ఛంగా వీచే గాలి , మలయమారుతం !
ఔను... వీవనతో విసిరేగాలికీ , మలయమారుతానికీ భేదం ఉంటుంది. బుధుడు చిరునవ్వు నవ్వుకున్నాడు. రెండింటితోనూ సేద తీరవచ్చు. అయితే *'వీవన పవనం"* ఇచ్చే విశ్రాంతి వేరు. మలయమారుతం అందించే విశ్రాంతి వేరు !
తన తల్లికి భర్తా , దేవగురువు అయిన బృహస్పతి ఆచార్యుడి ప్రవర్తనా , ఆయన మాట్లాడిన ఒకటి రెండు మాటలూ , బుధుణ్ణి ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. ఆయన ఒక్కసారి కూడా తన తండ్రి పేరు పలకలేదు ! అమ్మ కూడా అంతే ! చంద్రుడి క్షేమ సమాచారం కూడా కనుక్కోలేదు. అమ్మ గతాన్ని మరిచిపోయింది !
వృధ్ధులు జగతికి వరములు
*కం*
వృధ్ధులు జగతికి వరములు
వృద్ధుల యనుభవము భువికి విస్తృత సిరియౌ.
వృధ్ధుల నర్థించినచో
వృధ్ధికి తగుమార్గమెపుడు వెలివడు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! పెద్దలు ఈ ప్రపంచమునకే వరములు,పెద్దల అనుభవము ఈ భూలోకానికి పెద్ద ధనమవుతుంది,పెద్దలను అడిగితే అభివృద్ధికి తగుమార్గము తప్పకుండా లభిస్తుంది.
*సందేశం*:-- ఎందరో ముదుసలి తల్లిదండ్రులను దూరంలో ఉంచి రక్షించలేని,రక్షణ లేని ధనములవెంట బడుచున్నారు, కానీ ఆ ముసలివారి అనుభవం కంటే గొప్ప ధనములు ఉండవనీ,ధనార్జన అయినా ధనసంరక్షణ అయినా వారికంటే గొప్పగా మనకు తెలియవనీ తెలుసుకొనలేకపోతూ వారెప్పుడెప్పుడు చనిపోతారా అని ఎదురుచూస్తూ వారి మరణానంతరం దిక్కుతోచనప్పుడు వారి ఉనికి విలువలు తెలుసుకుని బాధపడుతున్నారు. పెద్దలు మనకు పెద్దదిక్కులనే నిజాన్ని గ్రహించి వారిని పూజించి వారి అనుభవాలసారాంశాలు పొందగలిగితే వర్ధిల్లగలరు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*కం*
పెద్దల విలువల నెరుగక
పెద్దల లనెడి సిరులనువిడు వెర్రిజనంబుల్,
పెద్దగ వెతలొందగ మరి
పెద్దగ శ్రీ మంతుల పడి వేడును సుజనా.
*భావం*:-- ఓ సుజనా! పెద్దల విలువలు తెలుసుకొనలేక పెద్దలు అనబడే సిరులను విడిచిపెట్టి వెర్రిజనాలు పెద్ద గా కష్టాలు కలిగి నప్పుడు గొప్ప ధనవంతుల వద్ద మోకరిల్లెదరు.
*సందేశం*:-- పెద్దగా కష్టాలు కలిగినప్పుడు మీ పెద్దల కంటే గొప్పగా మిమ్మల్ని రక్షించగలిగేవారు,తరుణోపాయాలు తెలుపగలిగేవారు ఉండరు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*కం*
పెద్దలొసంగిన సిరిగొని
పెద్దలు సమకూర్చు సరణి వెలుగుచు జనులా
పెద్దల నవమానపరచి
పెద్దలు గా నెగడనెంచు వెర్రిగ సుజనా.
*భావం*:-- ఓ సుజనా! పెద్దలు ఇచ్చిన సిరులను తీసుకుని, వారు ఏర్పరచిన మార్గం లో వెలుగుతూ ఆ పెద్దల ను అవమానించి పెద్ద లుగా వర్ధిల్లాలనుకుంటారు వెర్రి జనాలు.
*సందేశం*:-- పెద్దలు ఇచ్చిన వాటితో పెద్ద వారి గా వెలిగి వారి కంటే గొప్పవారమయ్యామని మిడిసిపడేవారు పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే పెద్దల విలువలు తెలుసుకుంటారు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కడియం పూల తోటలు
వ్యాస భారతం, వన పర్వము, 88వ అధ్యాయము
*ధౌమ్యుడు ధర్మ రాజుకు దక్షిణ దిక్కున ఉన్న తీర్థములు వర్ణించుట*
యస్యామాఖ్యాయతే పుణ్యా దిశి గోదావరీ నదీ । బహ్వారామా బహుజలా తాపసాచరితా శివా ॥
దక్షిణదిక్కున ఉన్న నదుల్లో గోదావరి ప్రసిద్ధం అయింది. ఆ నదిఒడ్డున ఎన్నో పూలతోటలు ఉన్నాయి. వాటికి బయట లోతు తెలియని జలరాశి ఉంది. చాలమంది ఋషులు గోదావరిని మంగళమైనదని సేవిస్తారు.
*దీనిని బట్టి కడియం పూల తోటలు మహా భారత కాలం నాటివి అని తెలుస్తోంది.*
పాటించవలసిన...* *గుణాలు...*
*ఎల్లప్పుడూ...*
*పాటించవలసిన...*
*గుణాలు...*
➖➖➖✍️
```
మనిషి జీవితంలో జన్మనిచ్చిన తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్న దమ్ములు, జీవితం పంచుకునే భార్య, వారసులైన కొడుకులు, కూతుళ్ళు,.... ఇలా ఎందరో బంధువులు తారసపడతారు. వీరందరూ ఎల్లప్పుడూ తనతో ఉంటారని, కష్ట సుఖాల్లో తోడు వస్తారని భావించడం మానవ సహజం.
కానీ ఈ బంధాలు అన్ని శాశ్వతం కాదు అని, మనకు జీవితంలోను, తరువాత కూడా తోడు వచ్చే బంధువులు ఎవరో, వారి గురించి చాణక్యుడు ఒక చిన్న శ్లోకంలో ఎంతో చక్కగా వివరించాడు...```
సత్యం మాతా, పితా జ్ఞానం, ధర్మో భ్రాతా, దయా సఖా।
శాంతిః పత్నీ, క్షమా పుత్రాః షఢెతె మమ బాంధవాః॥```
సత్యమే-తల్లి,జ్ఞానమే- తండ్రి, ధర్మమే- సోదరుడు,దయ - స్నేహితుడు,శాంతి-భార్య, ఓర్పే - పుత్రుడు. ఈ ఆరు మానవునకు నిజమైన బంధువులు అని అర్ధం.
ఏ జీవికైనా జన్మనిచ్చేది తల్లి. తల్లి స్థానం మారదు. ఎటువంటి పరిస్థితులలోనైనా, తల్లి ప్రేమ మారదు. అలాగే, సత్యం ఒక్కటే. అది ఎన్నటికి, మారదు.
జ్ఞానం తండ్రి. తండ్రి ఎలాగైతే విద్యా బుద్ధులు నేర్పించి జీవించే ఉపాయాలు నేర్పడం ద్వారా,సుఖవంతమైన జీవితానికి మార్గదర్శకుడు ఔతున్నాడో, జ్ఞానం కూడా మనిషికి సంతోషంగా జీవించడం నేర్పుతుంది. మనిషి పురోగతికి మూలం జ్ఞానమే.
సోదరుడు ఎలాగైతే ఎప్పుడూ అండగా నిలుస్తాడో, తోడుగా ఉండి,అభివృద్ధికి బాటలు వేస్తాడో, ధర్మం కూడా ఎప్పుడూ మనిషి వెంట నుండి ఆత్మీయతను, అనురాగాన్ని పంచి, ధర్మాన్ని పాటించిన వాడికి అమృత ఫలాలను అందిస్తుంది.
దయ మిత్రుని లాంటిది. మిత్రుని వలే మంచి చెడులను ప్రభోదిస్తుంది.
శాంతి భార్య వంటిది. భార్య సుగుణశీలి అయితే, ఆ మనిషి జీవితం పూలపాన్పులాగా ఉంటుంది. భార్య గయ్యాళి అయితే ఆ మనిషి జీవితం నరక ప్రాయం అవుతుంది. అలాగే జీవితంలో శాంతి ఉన్నవాడికి ఇంక ఏ లోటు ఉండదు. శాంతిని అలవరచుకోని మనిషి జీవితం నరకంతో సమానం.
ఓర్పు పుత్రుని లాంటిది. పుత్రుడు ఎలాగైతే నరకం నుండి రక్షిస్తాడు అని నమ్ముతామో, అలాగే ఓర్పు ఉన్న వ్యక్తి యొక్క జీవితం స్వర్గతుల్యమే.
పై శ్లోకం ద్వారా చాణక్యుడు ఒక మనిషి తన జీవితంలో బంధువులు ఎంత ముఖ్యం అని అనుకుంటాడో, అంతకన్నా, “సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పు" అనే ఆరు గుణాలు అంతే ముఖ్యం అని చెప్తాడు.
ఊహ తెలిసిన దగ్గరనుంచి, మరణించే వరకు ఎలాగైతే బంధువులను వీడి పోలేమో, అలాగే ఈ ఆరు గుణాలను ఆజన్మాంతం పాటించాలి అని ఉపదేశించాడు!✍️```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
అన్నమయ్య అక్షరవేదం
*అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 334*
*( నెరబిరుదిన్నిటాను నీ బంటు .. )*
🌺🍃 ------------------------- 🍃🌺
ఓం నమో వేంకటేశాయ. 🙏
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 334 కి శుభ స్వాగతం ..🙏
*ప్రార్థన ః--*🌹🙏
*ధారుణిలో నితని బిరుదు*
*"శ్రీ రాముని దాసు", పెక్కు చేష్టల వాఁడై*
*వీరాంజనేయునిగఁ దా*
*ధీరత్వములెన్నొ చూపె ,దేవుని బంటై !!*
🌹🙏🌹
✍️ *స్వీయపద్యము ( కందము )*🙏
🌹🌹
ఈ భువిపై ఇతడు గొప్పనైన బిరుదు సంపాదించాడు *"శ్రీ రాముని బంటు "* అని .🙏
అనేకమైన గొప్ప చేతలుచేసిన వాడై ఈ వీరాంజనేయుడు ,
ఆ దేవునికి దాసునిగా ఉంటూనే తన దిట్టతనములను ఎన్నెన్నో చూపినాడు !🙏
అట్టి హనుమంతునకు మంగళములు !🙏
🌹🙏🌹
🌺🍃 ------------------------- 🍃🌺
అన్నమాచార్యులవారు *ఆంజనేయ స్వామిని* శ్రీ వేంకటాద్రి రాముని బంటుగా పెక్కు సంకీర్తనలలో కీర్తించారు .🙏
ఇక్కడ ఆంజనేయుని విరాట్ స్వరూప వైభవాన్ని మనో నేత్రముతో సందర్శించి ఆ ఆజానుబాహుని రూపమును , స్వామికి వర్ణిస్తున్నారు బహు రమ్యముగా .🙏
మరి ఆ చక్కటి సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !🙏
🌺🍃 ------------------------- 🍃🌺
🌹🌹
స్వామీ ! అన్నిటికంటే గొప్పనైన బిరుదునే పొందియున్నాడు మీ బంటు .🙏
అదిగో అతడు ఎంతగా వ్యాపించియున్నాడంటే ఆ ఆకాశమును తాకి , అంతటా నిండిపోయాడు .🙏
🌹🌹
పెళపెళమని తన మేను పెంచి విజృంభించగా , తారామండలాన చుక్కలన్నీ చిన్నవిగా అయిపోయి ఈతని మొలత్రాడుకు కట్టిన పూసల వలె మిణుకు మిణుకు మంటున్నాయి .🙏
అన్ని మూలలకు ఇతడు వ్యాపించి హూంకరించగా ,ఆ శబ్దము, ఈ సమస్త భువన భాండమూ నిండిపోయినది !🙏
🌹🌹
ఇతడు అమితమైన వేగముతో తన పాదమణచి ఒక్కసారిగా పైకి ఎగురగా , ఆకాశమున ఉన్న లోకములన్నీ గడగడా వణికి పోయినవి ఆ తేజోవంతమైన వేగమునకు జడిసి .🙏
తన ప్రతాపమంతయూ ప్రకాశించుచుండగా , సంజీవినీ మూలికలు ఉన్న పర్వతము పై *కో......* అనుచు ఆవహించినాడయ్యా వాయువేగముతో నీ బంటు .🙏
🙏🙏
ఆనుకూల్యుడై శ్రీ రామునికీ , మనస్సును ఆహ్లాదపరచి సాంత్వననొసగి సీతాదేవికీ , ఇరువురకూ హితుడైనడయ్యా ఈ బంటు .🙏
ఇన్నిచేసిన పిదప ఇదిగో ఈ *శ్రీ వేంకటాద్రిపై* , నీ దాసునిగా అమరియుండి ,నీ అరచేతిలోననే ఉండే నిమ్మపండు మాదిరిగా ,సదా నీ ఆజ్ఞను పాలించు వాడై ,సర్వ సన్నద్ధుడై సదా నీ సేవకే నిలిచియున్నాడయ్య ఈ బంటు .🙏
🌹🙏🌹
*ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
*( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 334)*
✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏
🌹🌹 *సంకీర్తన* 🌹🌹
*॥పల్లవి॥*
నెరబిరుదిన్నిటాను నీ బంటు
వొరసె గగనమదివో నీ బంటు
*॥చ1॥*
ముంచిన చుక్కలు మొలపూసలుగాఁ
బెంచె మేను పెళపెళనార్చి
అంచులు మోవఁగ నబ్జభవాండము
నించె నార్భటము నీ బంటు
*॥చ2॥*
గగనలోకములు గడగడ వణఁకఁగ
నెగసె హుటాహుటి నీ బంటు
మగటిమి మెరయఁగ మందులకొండకు
నిగిడి కోయనుచు నీ బంటు
*॥చ3॥*
ఇమ్ముల రఘుపతి హితుఁడై సీతకు
నెమ్మన మలరిన నీ బంటు
కమ్మర నిదె వేంకటేశ నీచే
నిమ్మపండైన నీ బంటు
🌹🙏🌹