పగలు నైటీ వేసుకుంటే
రెండు వేలరూపాయలు ఫైన్
===============///
మహిళలు పగలు నైటీలు వేసుకోకూడదని ఓ గ్రామంలో హుకుం జారీచేశారు. ఇదెక్కడో యుపి లేదా రాజస్తానో కాదు.. మన రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తోకలపల్లి గ్రామంలో మహిళలు, యువతులు పగటిపూట నైటీలను వేసుకోవటాన్ని గ్రామపెద్దలు నిషేధించారు. పగటిపూట వీటిని వేసుకొంటే రెండు వేలు జరిమానా, చూసి చెప్పిన వారికి వెయ్యి బహుమానం ఇస్తారట. .ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నిడమర్రు ఎమ్మార్వో ఎం.సుందర్రాజు ఎస్ఐ విజయకుమార్ గ్రామంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకొన్నారు. తెలుగు సాంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే ధ్యేయంతో పగటిపూట మహిళలు నైటీలను ధరించి రహదారులపైకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామ పెద్దలు పగటిపూట విధించిన నైటీలు ఆంక్షలను గ్రామంలో కొంత మంది మహిళలు సమర్థిస్తున్నారు.. ఇది తమ మంచికేనని చెబుతున్నారు.. మరికొంతమంది మాత్రం మూతివిసురుతున్నా బయటకు మాట్లాడలేకపోయారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి