శారదా నవరాత్రులు ఎందుకు చేయాలి?
దేవీభాగవతము ఆశ్వయుజమాసము, చైత్రమాసము యమధర్మరాజుగారి యొక్క దంష్ట్రలుగా చెపుతుంది. ఆశ్వయుజమాసములో యమధర్మరాజుగారి ఒక దంష్ట్ర బయటికి వస్తుంది. అందువలన చాలా ప్రమాదములు జరిగి, చాలామంది మరణిస్తూ ఉంటారు. యమధర్మరాజుగారి దంష్ట్ర బారిన పడకుండా ఉండాలి అంటే ఆశ్వయుజమాసము, చైత్రమాసములలో శారదానవరాత్రులు, వసంత నవరాత్రులు అన్నపేరుతో లోకమున అమ్మవారి ఆరాధనను తీసుకుని వచ్చారు. ఆ జగన్మాతను ఆరాధన చేస్తే యమదంష్ట్ర యొక్క ప్రభావము లోకము మీద ఉండదు. కాబట్టి చేసే ఆరాధన కాలాంతర్గతముగా ఆయనముల రూపములో, పక్షముల రూపములో నైమిత్తిక తిథుల రూపములో ఎలా ఉండాలి అన్నదానిని ఋషులు నిర్ణయించారు. ఆ కారణము చేత ఋషిప్రోక్తము అయిన విధముగానే మనము అనుష్టానము చేస్తూ ఉంటాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి