31, డిసెంబర్ 2022, శనివారం

వైదిక యజ్ఞం - జీవ హింస

 వైదిక యజ్ఞం - జీవ హింస


1957లో పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు. అడయార్ థియోసొఫికల్ సొసైటి ఆధ్వర్యంలో శాఖాహార సదస్సు జరిగింది. ఆ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. కారణమేదైనప్పటికి జంతువులను చంపడం పాపం అని తీర్మానించారు. కాబట్టి మాంసాహారాన్ని వదలి అందరూ శాఖాహారులుగా మారాలి అని చెప్పారు. అహింస, శాఖాహార ప్రాముఖ్యతపై జనంలో అవగాహన కలిగించడానికి చర్యలు కూడా చేపట్టాలని సూచించారు. 


ఆ సదస్సు ముగిసిన తరువాత థియోసొఫికల్ సొసైటి అధ్యక్షుడు శ్రీ శంకర మీనన్ కొంతమంది పాశ్చాత్యులని పరమాచార్య స్వామి అనుమతితో వారి దర్శనానికి తీసుకుని వచ్చారు. స్వామి వారిని కలవాలని ఆ ప్రతినుధులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. 


శంకర మీనన్ అందరిని పేరు ఊరుతో సహా స్వామి వారికి పరిచయం చేసారు. వారిని పరిచయం చేసిన తరువాత స్వామివారి గురించి వారికి చెప్పబోతుండగా మహాస్వామి వారు వారించి, “నా గురించి నువ్వు ఏమి చెప్పనవసరం లేదు. నా గురించి వాళ్ళకు తెలిసింది చాలు” అని అన్నారు. 


కొంతమంది ప్రతినిధులు స్వామి వారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నారు. స్వామి వారు దానికి అంగీకరించగానే మొదటగా వచ్చిన ప్రశ్న “వైదిక యజ్ఞాలలో ఇచ్చే జంతుబలి ఎలా సమర్థిస్తారు? అది పాపం కాదా?”


అందుకు మహాస్వామి వారు “అవును అది చేయతగినదే. అది పాపం కాదు” అని బదులిచ్చారు. ఇది వినగానె వారందరూ ఫక్కున నవ్వారు. స్వామి వారిని అవమానపరిచారు అని మీనన్ గారికి కోపం వచ్చింది. వారివైపు తిరిగి ఆవేశంతో, “నేను మిమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చింది స్వామి వారి ఆశీస్సులకోసం. మీరు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తారు అని తెలిసుంటె నేను ఈ పనికి పూనుకునేవాణ్ణి కాదు” అని అరిచారు. 


స్వామివారు మీనన్ ను శాంతపరిచారు. “వాళ్ళపై కోపం పడవద్దు. వారు ఒక స్పష్టతతో ఇక్కడికి వచ్చారు. జీవహింస పాపం అని అది ఏ కారణానికి అమోదయోగ్యం కాదని నిర్ధారణకు వచ్చారు. కాని నా సమాధానం దాన్ని వ్యతిరేకించడం వలన వాళ్ళు నవ్వారు. నన్ను అవమాన పరచలాని వాళ్ళకు ఆలోచన లేదు. మనం వారికి అర్థం అయ్యే లాగా సమాధానం చెప్పాలి” అని శాంతంగా చెప్పారు. 


మీనన్ కోపం తగ్గిన తరువాత మళ్ళా స్వామి వారు ఇలా చెప్పారు “ఒక హంతకుడు ఒక వ్యక్తిని చంపుతాడు. కోర్టు ఆ విషయాన్ని నిర్ధారించి ఆ హంతకుడికి మరణ శిక్ష విధిస్తుంది. ఆ హంతకుడు పాపభీతి లేక ఆవేశంలో ఒకణ్ణి చంపాడు. మరి అతణ్ణి కోర్టు ఉరితీయడం జీవహింస కాదా? మరి న్యాయమూర్తి చెసినది పాపం కాదా?”


స్వామి వారి మాటలు వారిని అలోచనల్లో పడేసాయి. వారు చాలా విద్యావంతులు. సత్యప్రమాణములైన మాటలు స్వామి వారు చెప్తున్నారని అర్థం చేసుకుని వారి మాటలు వినడానికి ఉత్సాహం చూపారు. 


మరలా మహాస్వామి వారు “నాలుగు రోడ్ల కూడలిలో ఒక ఆంబులెన్స్ వస్తే, అందరిని ఆపి ప్రాణాలు నిలబెట్టే ఆంబులెన్సును ముందు పంపిస్తాము. అంటే అంతమంది ప్రయాణం కంటే ఒక ప్రాణం గొప్పది. వేరొక సందర్భంలో ఒక ఆంబులెన్సు, ఒక అగ్నిమాపక వాహనం వచ్చాయనుకుందాం. అప్పుడు ముందు అగ్నిమాకప యంత్రాన్ని పంపిస్తాం. అంటే ఒక్కడి ప్రాణం కంటే పది మంది ప్రాణాలు గొప్పవి. మరొక్క సంఘటనలో ఒక అగ్నిమాపక వాహనం, అత్యవసరంలో ఉన్న మిలటరి వ్యాను వస్తే ముందు మిలటరి వ్యానును పంపిస్తాం. కొంతమంది ప్రాణాల కంటే దేశ రక్షణ గొప్పది. కాబట్టి అలాంటి సందర్భంలో దేశరక్షణ కోసం కొంతమంది ప్రాణాలను లెక్కచెయ్యము.

 

రాజ్యాన్ని రక్షించుకోవడానికి రాజు యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమందిని చంపుతాడు. ఒకర్ని చంపితేనే మరణదండన విధిస్తే, మరి ఆ రాజుకు ఎన్ని మరణ దండనలు విధించాలి? కాని యుద్ధంలో గెలిస్తే పండగ చేసుకుంటారు. ఈ అన్ని సంఘటనల్లో మనం జీవహింసను అమోదిస్తాం. ఇలాంటి నియమాలణ్ణి మనం ఏర్పరుచుకున్నవే. అలాగే యజ్ఞాలలో ఇచ్చే జంతుబలులు పాపం కాదు. ప్రపంచశాంతి కోసం మానవాళి క్షేమం కోసం ఇలా చేసినా పాపం కాదని వేదాలు ఘోషిస్తున్నాయి.


వేదం అపౌరుషేయం. అది పరమాత్ముని ఊపిరి కాబట్టి ఈశ్వరునకు వేదాలకు అభేదం లేదు. వేదము శాశ్వతము, సత్య ప్రమాణము. ‘శాస్త్రాయ చ సుఖాయ చ’. వేదాలు, శాస్త్రాలు మంచినే బోధిస్తాయి. జగదాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు. 


దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః 

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ


మనం యజ్ఞ యాగాదులను చేసి దేవతలను సంతృప్తి పరిస్తే, దేవతలు మనకు సకాల వర్షమును మంచి జీవితాన్ని ఇస్తారు. కాబట్టి వైదిక యజ్ఞములలో చేసే జీవహింస సరిఅయినదే. దాని వల్ల పాపము లేదు. అంతేకాదు. సనాతన ధర్మంలో యజ్ఞము చేయిట హింస, పాపము అని కూడా చెప్పబడింది కాబట్టి చేయకూడదు. కాని ఎవరు చేయుకూడదు అనే విషయం మనం తెలుసుకొని ఉండాలి. 


వ్యాస భగవానుడు రచించిన భాగవతంలో దీనికి సంబంధించిన ఒక ఉపాఖ్యానము ఉంది. ‘ప్రాచీన బర్హి’ అను ఒక రాజు ఉండేవాడు. అతనికి ఆచార్యకాండ యందు విపరీతమైన అభిమానం మక్కువ. కాబట్టి లోకక్షేమం కోసం తరచుగా యజ్ఞయాగాదులు చేసేవాడు. తరువాత అతనికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయాడు. అటువంటి స్థితి పొందిన వాడు ఆ స్థాయిలో ఉన్న సన్యాసి యజ్ఞయాగాదులు చెయ్యరాదు. కాని అతనికి వాటిపైన ఉన్న ఇష్టం వల్ల చేస్తున్నాడు. నారదమహర్షి వచ్చి అతనికి అతనికి జ్ఞానోదయం కలిగించాడు. అప్పటినుండి అతను యజ్ఞయాగాదులు మానేసాడు. 


కాబట్టి, “ఏది హింస, ఏది కాదు, ఎవరు ఏమి చెయ్యాలి?, ఏమి చెయ్యకూడదు” అని చెప్పవలసినవి వేదాలు మాత్రమే నువ్వు నేను కాదు. మనకు వేదమే ప్రమాణం. చట్లకు కూడా ప్రాణం ఉందని ఈరోజు అందరికి తెలుసు. విత్తనం నుండి మొలకెత్తి చెట్టుగా మారి మళ్ళా ఎన్నో విత్తనాలను ఇస్తుంది. కాబట్టి విత్తనాలు తినడం కూడా హింసే. కాయగూరలు, ఆకుకూరలు కూడా జీవహింస కదా. అందుకే సన్యాసులు కూరగాయలు కూడా తీసుకోరు. జ్ఞానులు ఎండుటాకులు, నీరు, గాలి తీసుకుని బ్రతికేవారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. 


కాబట్టి వీటన్నిటి వల్ల మనకు తెలిసేదేమంటే కేవలం ఋషులు, సాధకులు తప్ప పూర్తి అహింస ఎవరూ పాటించలేరు. కాబట్టి అహింస అనేది వారి వారి ఆశ్రమాన్ని బట్టి పాటించాలి. కాబట్టి గృహస్తు చేసే యజ్ఞయాగాదుల వల్ల జరిగే హింస పాపం కాదు. ఇది వేదప్రమాణం. కాబట్టి ఈ నియమాలను మనం ఉల్లంఘించరాదు. 


--- థిల్లైనాథన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 4

అతడు డ్రైవరు 

అతడు డ్రైవరు 

ఒక కారు నడిపే చోదకుడిని కారు డ్రైవరు అని, ఒక లారీ నడిపే చోదకుడిని లారీ డ్రైవరు అని, అదే జీపుని నడిపే డ్రైవరుని జీపు డ్రైవరు అని పిలవటం మనం సాధారణంగా చూస్తూవుంటాము. అంతేకాదు మారుతి కారు, మహేన్ద్ర కారు, టాటా కారు అని ఇంకా కారుకు ముందు పెట్టి డ్రైవరు అని పిలుస్తారు. మారుతి కారు డ్రైవరు, మహేంద్ర కారు డ్రైవరు ఆలా ఇంకా కొన్ని సందర్భాలలో యజమాని పేరుతొ అంటే రామారావు కారు డ్రైవరు, కృష్ణారావు కారు డ్రైవరు ఇలా.  అతని ఎలా పిలిచినకాని నిజానికి ఆటను మాత్రం డ్రైవరు. 

ఒక డ్రైవరు చక్కగా తాను విధినిర్వహణ చేస్తున్న కారును చక్కగా నడిపి యజమాని అవసరానుకూలంగా అతనిని సరైన సమయానికి అతను కోరుకున్న ప్రదేశాలకు చేర్చుతూ, కారును మంచిగా చూసుకుంటూ ఉంటే ఆ డ్రైవరు ఆ యజమాని మెప్పుని పొంది అతని జీతంలో వృద్ధి మరియు ఇతర ఎలావన్సులు యజమాని నుండి పొందగలడు, అదేవిధంగా కారుని సరిగా చూసుకోక కారుకు ప్రమాదాలను కలగచేస్తూ, యజమానికి కారు ఎక్కాలంటేనే భయం వేసే విధంగా కారును నడిపితే ఆ కారు డ్రైవరు యజమాని కోపానికి గురి అయి వెంటనే ఉద్యోగంనుండి తొలగించటమే కాకుండా యజమాని అతని నుండి నష్టపరిహారం కారే విధంగాకూడా పరిస్థితులు  ఏర్పడవచ్చు. వీటన్నిటికీ కారణం డ్రైవరు తన విధులను నిర్వహించే విధానం మీద ఆధార పడివున్నదని వేరే చెప్పనవసరం లేదు.  మనం ఉపయోగించే ఏ వస్తువు అయినా మనం దానిని వాడే విధానం మీద ఆధార పడివుంటుందని వేరే చెప్పనవసరం లేదు. 

ఇద్దరు మిత్రులు ఒకే రోజు చెరొక కారు వకే మాడలుది కొన్నారనుకోండి ఆ ఇద్దరు కారులు వకే విధంగా పనిచేయాలని లేదు.  ఒకని కారు ఎలాంటి లోపంలేకుండా చక్కగా నడవ వచ్చు ఇంకొకని కారు కొన్న మరుసటి రోజే చెడిపోయి షడ్డుకు వేళ్ళ వచ్చు. కాబట్టి దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే తయారుచేసే వాడు రెండు ఒకేమాదిరిగా చేసినా కూడా దేని మన్నిక దానిది. మానవుడు ఎంతో నయపుణ్యంతో తయారుచేసిన వస్తువు ఎలా పనిచేస్తుందో చెప్పలేము, కానీ సరిగా పనిచేయటానికి తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు నిపుణులు తీసుకుంటారు. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మిత్రమా నీవు నేను అని దేనిని అంటున్నావో అది నీ శరీరంలో అందులో వున్న నీవే నీవు అంటే అర్ధం కాలేదు కదా అదేమిటంటే నేను అనుకునే శరీరాన్ని నియంత్రించే దివ్య చెతన్యం మాత్రమే నీవు కానీ ఏరకంగా ఐతే ఒక కారు డ్రైవరు ఆ కారుతో కలిపి తన ఉనికిని చెపుతాడో అదేరకంగా నీవు నీ శరీరంతో కలిపి నీ ఉనికిని చెపుతున్నావు.  అంతవరకూ అయితే పరవాలేదు చాలామంది తమ ఉనికే శరీరం అని భావించి శరీరంలోని నిఘాడమైన దివ్యమైన, సుద్ద చేతన్యాన్ని మారుస్తున్నారు.  దానితో వారి శరీరానికి అనేక విధాలుగా బంధాలను, సుఖాలను, పొందాలని ప్రయత్నిస్తూ ఒక అసమర్ధపు కారు డ్రైవరు తానూ కారుని సరిగా నడపలేక ప్రమాదాలకు గురుచేసినట్లుగా శరీరంతో అనేక పాపకృత్యాలను  సలుపుతున్నారు. దాని ఫలితంగా బాధలను, కష్ఠాలను, ఇబ్బదులను, అనుభవిస్తున్నారు.  అదే సత్యాన్ని తెలుసుకున్న సాధకుడు తన శరీరం కేవలం శుద్ధ చెతన్యమైన తనకు ఆశ్రయమిచ్చిన ఒక కారు లాగా భావించి ఏరకంగా ఒక సమర్థుడైన కారు డ్రైవరు లాగా శరీరాన్ని నియంత్రించి పుణ్య కార్యాలు చేసి పుణ్య ఫలితాన్ని పొంది దాని వల్ల సుఖాలను, ఆనందాలను అనుభవించి చివరకు మోక్షపదాన్ని చేరుతున్నాడు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ