10, జులై 2023, సోమవారం

సచ్చిదానందఘనము

 శ్లోకం:☝️

*న నిరోధో న చోత్పత్తిర్*

  *న బద్ధో న చ సాధకః |*

*న ముముక్షుర్న వై ముక్త*

  *ఇత్యేషా పరమార్థతా ||*


భావం: సచ్చిదానందఘనము, అద్వితీయమగు నాత్మ వస్తువునకు ఉత్పత్తి (పుట్టుక)లేదు. "జాతస్య హి ధృవో మృత్యుః" అను నుక్తిని బట్టి యుత్పన్నమైన వస్తువునకే మరణము లేక నాశముండును గాన ఉత్పత్తి లేని ఆత్మకు నాశము ఉండనేరదు. మరియు పుట్టిన వస్తువుకే (వ్యక్తికే) అహంకారాది బంధములుండును గాని ఆత్మకు బంధము లేదు. బంధమే లేని యడల దాని నుండి విడుదల కోరుకొనుట (మోక్షేచ్ఛ) మరియు మోక్షము కొరకు సాధన (ప్రయత్నము) ఉండవు.🙏

వైరాగ్యమే అభయం*--

 *భోగే రోగభయం-కులే చ్యుతిభయం*!

*విత్తే నృపాలాద్భయం-శాస్త్రేవాది భయం*!

*గుణే ఖిలభయం-రూపే జరాయ భయం*!

*మానే దైన్యభయం-బలే రిపుభయం*!

*కాయే కృతాన్తా భయం-సర్వం వస్తుభయావహం*!

*భువి నృణాం-వైరాగ్యమేవాఽభయం* !


_-భావము-_


భోగాలనుభవిస్తే రోగాలొస్తాయని భయం-

గొప్ప కులాలలో పుట్టినవాడికి కుల ధర్మం నుండి జారి కుల ప్రతిష్ట పోతుందేమో అన్న భయం-

ధనం సంపాదించినవాడికి ప్రభుత్వం(రాజుల పాలౌతుందని) దాడి చేస్తుందని భయం-

శాస్త్రాలు చదివిన వాడికి వాదన లో ఓటమి భయం-

గుణవంతుడికి ఎక్కడ దుర్గుణాలు వస్తాయో అన్న భయం-

అందంగా ఉన్నవారికి ముసలితనం  వస్తుందన్న భయం-

గౌరవం పొందుతున్నవారికి అగౌరవం అంటే భయం-

బలం ఉన్నవాడికి శత్రు భయం-

శరీరదారులకి మృత్యు భయం-

మొత్తం మీద అన్నీ భయాన్ని కలిగించేవే-

*భూమండలంలో నరులకి వైరాగ్యమే అభయం*----

రింగులు రింగులు (కథ)

 రింగులు రింగులు (కథ)

(ప్రభాకర్ పెదపూడి).


అరవిందరావు ఆరువందలోచుట్ట కాలుస్తూ పొగమేఘాలు తయారు చేస్తున్నాడు. చాలా ఏళ్లక్రితం కరివేపాకు మొక్క దగ్గర మొదటి చుట్ట వెలిగించాడు. ఇప్పుడా మొక్క పెరిగి పెద్దదయ్యి కరివేపాకు చెట్టు అయ్యింది. గతంలో చుట్టుపక్కల ఇళ్ళవాళ్లు కరివేపాకు కోసుకుపోయేవారు. ఇప్పుడు కరివేపాకు కోసం ఒక్క పిట్టకూడా రావడంలేదు, ఇంట్లోవాళ్లు కూడా కూరల్లో, చారులో, పులుసుల్లో బయటినుంచి తెచ్చుకుంటున్నారు కానీ ఆ చెట్టు ఆకులు వాడటం లేదు. ఎందుకంటే వంటకాలన్నీ చుట్ట వాసన వస్తున్నాయి. చెట్టు దగ్గరకి వెడితే గతంలో కరివేపాకు సువాసన వచ్చేది, ఇప్పుడు అరవిందరావు దయవల్ల చుట్ట వాసన వస్తోంది.

అరవిందరావుకు ఎంతో గర్వంగా ఉంది,  ఆరువందల చుట్టలు కాల్చడమంటే తమాషానా అనుకుంటాడు అదే మాట జనంతో అంటూ ఉంటాడు. గతంలో చుట్టతో సావాసం చేసిన అతని స్నేహితులు పట్నంనుంచి ఓడాక్టర్ని తీసుకొచ్చి అరవిందరావుని చూపించి చూడమన్నారు. ఆయన రకరకాల పరీక్షలు చేసి “ఈయన ఊపిరితిత్తులు ఫ్యాక్టరీ గొట్టాల్లా మసిబారిపోయాయి, చుట్ట మానేసినా చస్తాడు, కాల్చినా చస్తాడు కనుక అంతా ఆయన ఇస్టమ్” అని వెళ్లిపోయాడు.

ఆరోజు ఆదివారం, సెలవు దినం. అరవిందరావు నేలకు సెలవు తీసుకుని నింగికి చేరుకున్నాడు. శవంతోపాటు ఊరంతా శ్మశానానికి గుప్పు గుప్పుమని చేరుకున్నారు. ఎంత సేపు ప్రయత్నించినా కింద కర్రలు కాలాయి కానీ శవం పిసరంతకూడా కాలలేదు. చివరికి ఓముసలాయన ఓ చుట్టని వెలిగించి శవం నోట్లో పెట్టాడు. పదినిమిషాల్లో శవం గుప్పు గుప్పుమని కాలి బూడిద అయ్యింది. పొగ రింగులు రింగులుగా ఆకాశంలోకి ఎగిరింది.

విలువైన పాఠాలను నేర్పిస్తాయి.

 🌹🌹 *సుభాషితమ్* 🌹🌹

--------------------------------------------



*శ్లోకం*


క్షుధాకుక్షీ తథా రిక్తం

స్యూతం భగ్నమనస్తథా|

శిక్షయన్తి ప్రమాణాంశ్చ

జీవనే తవ సర్వదా||



*తాత్పర్యం*


ఆకలితో ఉన్న కడుపు, ఖాళీ జేబు, విరిగిన మనసు - ఇవి నీకు జీవితంలో విలువైన పాఠాలను నేర్పిస్తాయి.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 112*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 112*


రాక్షసుడు తలత్రిప్పి నలువైపులా కలయాజూసి ఓ మూలనున్న వృక్షము వద్ద ఎవరో నిలబడివున్నట్లు గమనించి వడివడిగా అటువైపు అడుగులు వేశాడు. 


"అయ్యో ! దైవమా ! నేడెంత దుర్ధినం... నిండు నూరేళ్లు జీవించవలసిన నేను... ఆ ద్రోహి ... రాక్షసుని కారణాన ఆత్మహత్య చేసుకుని అకాలమరణం పాలుకావల్సివస్తున్నది గదా... హతవిధీ .... ఇది ఏ జన్మలో చేసిన పాపమో గదా...." అంటూ బిగ్గరగా రోధిస్తున్నాడు మారువేషంలో ఉన్న శార్జరవుడు. 


రాక్షసుడు గబగబా అతన్ని సమీపించాడు. ఆ వృక్షపు కొమ్మకి బిగించి కట్టబడిన త్రాటినీ, దాని చివరనున్న ఉరిని చూసి విచలితుడవుతూ "బాబూ.... ఎవరయ్యా నీవు ? ఆత్మహత్య మహాపాపమని నీకు తెలియదా ?" అని అడిగాడు. 


"నాకు తెలుసయ్యా .... కానీ, ఇదంతా నా ఖర్మ .... ఏజన్మలోనో ఏ మిత్రునికో ద్రోహం చేసివుంటాను. ఈ జన్మలో నా మిత్రుని కోసం ప్రాణత్యాగం చేసి, ఆ పాపం బావుకుంటున్నా.... మిత్రమా... విష్ణువర్మా.... నేనూ నీ వెంటేవస్తా .... నీవులేని ఈ లోకం, ఈ జీవితం నాకు వృథా..." అంటూ బిగ్గరగా రోదించసాగాడు శార్జరవుడు. 


రాక్షసునికి విషయం ఏమీ అర్థం కాలేదు. ఆ వ్యక్తిని వూరడిస్తూ "చూడు బాబూ... అసలు విషయం ఏమిటో చెబితే చేతనైన సహాయం చేస్తా..." అన్నాడు. 


శార్జరవుడు బిగ్గరగా విలపిస్తూ "అయ్యా... ! ఏం చెప్పమంటారు నా బాధ.... కుసుమపురంలోని వ్యాపారి విష్ణువర్మ నాకు ప్రాణమిత్రుడు. నా మిత్రునికి ప్రముఖ రత్నాలవ్యాపారి చందనదాసు అత్యంత ప్రియమిత్రుడు. ఆ చందనదాసుకు సంభవిస్తున్న ఆపదను భరించలేక నా మిత్రుడు విష్ణువర్మ అగ్ని ప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. నా ప్రాణమిత్రుడు లేనప్పుడు ఇక నా బ్రతుకు ఎందుకు ? అందుకే విష్ణువర్మ కంటే ముందుగా నేనీ ఆత్మహత్యా ప్రయత్నానికి వొడిగట్టాను. చెప్పండి. చందాన దాసు కోసం నా మిత్రుడు ఆత్మత్యాగం చేస్తున్నప్పుడు, నా మిత్రుని కోసం నేను ప్రాణత్యాగం చెయ్యడం తప్పంటారా ?" అని ప్రశ్నించాడు. 


రాక్షసుడు కంగారుపడుతూ "చందనదాసుకి ఆపదా...? చెప్పు నాయనా... ఆతనికేమీ ఆపద సంబంధించింది ?" అని అడిగాడు ఆందోళనగా. 


"అయ్యా...! అది మామూలు ఆపదకాదు. చందనదాసు తనకి ప్రాణమిత్రుడైన రాక్షసామాత్యుని భార్యాబిడ్డలను ఎక్కడో దాచి పెట్టాడు. అది రాజద్రోహంగా భావించాడు చాణక్యుడు. "రాక్షసకుటుంబాన్ని అప్పగిస్తారా ? ఉరిశిక్షకు సిద్ధపడతావా ?" అని చాణక్యుడు నిలదీశాడు. మిత్రద్రోహము చెయ్యడానికి చందనదాసు ఇష్టపడక మరణమునకే సిద్ధపడ్డాడు. రాక్షసుని కోసం తను ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు ఆ స్వామి భక్తుడైన చందనదాసు. అతన్ని విడిచి బ్రతకలేని నా మిత్రుడు అగ్నిప్రవేశం చెయ్యనున్నాడు. వానిని విడిచి నేనూ జీవించలేను... మిత్రులారా... మీకంటే ముందుగా నేనే .... నేనే ...." అని బిగ్గరగా విలపిస్తూ ఉరిత్రాడును మెడకి తగిలించుకోబోయాడు శార్జరవుడు. 


రాక్షసుడు అతన్ని వారిస్తూ "ఆగుబాబూ.... ఆగు... తొందరపడకు... మీ ఆపదను నేను తొలగిస్తాను... మీ అందరి దుఃఖాలకి కారకుడయిన ఆ రాక్షసుడ్ని నేనే...." అన్నాడు బాధగా. 


"ఆ ! తమరేనా, రాక్షసామాత్యుల వారు ? అయ్యా ... ! త్వరపడండి. చందనదాసుని శూలరోహణం చేయించడానికి తలారులు ఇప్పుడే వధ్యస్థానానికి తీసుకుపోయారు. ఆలస్యం చేస్తే ఆఖరి చూపు కూడా దక్కదు..." అంటూ తొందరపెట్టాడు శార్జరవుడు. 


"భయంలేదు బాబూ ... నా ప్రాణం ఇచ్చి అయినా నా మిత్రుడు చందనదాసుని కాపాడుకుంటాను. నువ్వు వెళ్ళి యీ విషయం చెప్పి నీ మిత్రుడు అగ్నిప్రవేశం చెయ్యకుండా కాపాడుకో...." అని అతనికి అభయమిచ్చిన రాక్షసుడు "నా ప్రాణమిత్రమా చందనదాసూ... వస్తున్నానయ్యా..." అంటూ దుఃఖోద్వేగంతో వధ్యస్థానంవైపుకి పరిగెత్తాడు. 


శార్జరవుడు కన్నీళ్లును తుడుచుకుంటూ "ఆర్యా... చాణక్యదేవా ... ! మానవుల మానసిక దౌర్భాల్యాలను అంచనా వేసి దానికి తగ్గట్టు పావులు నడపగలిగిన మీ రాజకీయ విజ్ఞతకి జేజేలు... గురుదేవా .... మీకు మీరే సాటి..." అనుకున్నాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నిర్గుణోపాసన

 నిర్గుణోపాసన


పరమాచార్య స్వామివారు అప్పుడప్పుడు ఒక విలక్షణమైన పూజ నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా మహాప్రదోష సమయంలో. త్రయోదశి ఘటియలు సాయంత్రం వ్యాపించి ఉంటే ఆ సమయం మహాప్రదోషమని పిలవబడుతుంది. 


శ్రీవారు తమ ఎదురుగా ఆవుపేడతో అలికి ముగ్గు వేయబడి ఉన్న ప్రదేశంలో ఒక ఆకు పరచి దానిపై దేవతావాహన చేసేవారు. విగ్రహాలు ఏవీ ఉండేవికావు. కానీ మానసికంగా జరుగుతున్న ఆ పూజలో శ్రీవారి ముద్రలు హావభావాలు అక్కడ త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరులు విరాజమానులయి ఉన్నారన్న విషయం చూసేవారికి అవగతమయ్యేది. 


అభిషేకం చూసిన జ్ఞాపకం లేదుకాని ఉపచారములన్నీ వివిధ ముద్రలలో వారికి మాత్రమే కనిపించే జగత్పితరులను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించడం నేను అనేక పర్యాయములు చూసిన అదృష్టాన్ని నోచుకున్నాను. భక్తులలో పండితులు రుద్రత్రిశతి చెబుతుంటే స్వామివారు అతిలాఘవంగా లేత బిల్వదళాలతో అర్చన చేసేవారు. దోసెళ్ళతో తుమ్మెపూలు సమర్పించేవారు. అనేక ఫలజాతులతో నైవేద్యం జరిగేది. ఈ పూజకు తుమ్మిపూలు, బిల్వదళాలవంటి సంభారాలు సమయ మెరిగి తీసుకొనివచ్చే మాతృమూర్తులు, శిష్యులు ఉండేవారు. 


పూజ ముగించి ప్రదక్షిణ చేసి మహాస్వామివారు నమస్కారం చేసేటప్పటి వారి ముఖంలో ఆర్ద్రతతో కూడిన భక్తిభావం ఈ రోజుకూ నాకనులకు కట్టినట్లు కనిపిస్తోంది. అంతటి స్వామికి ఎంతటి వినయం? ఎంతటి భక్తి? మా కనులకు దురదృష్టమావహించి స్వామి ఎదుటనున్న త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరులు మాకు కనిపించలేదు. కానీ ఆ సమయంలో పరివార దేవతలందరితో కూడిన చంద్రమౌళీశ్వరుడిక్కడ విరాజమానుడయి ఉన్నాడని నా ప్రగాఢ విశ్వాసం. 


స్వామివారి కృపాదృష్టి మాపై సోకిఉంటే పౌర్ణమినాటి రాత్రి మాంగాడు కామాక్షీ దర్శనాన్ని తమ పారిషదులకు అనుగ్రహించినట్లు మాకనుగ్రహించకపోదురా!


అది మాంగాడు కామాక్షీదేవి కుంభాభిషేకం సమాయం - స్వామివారు కుంభాభిషేకం చేయడానికి అక్కడ వేంచేసి ఉన్నారు. ఆ రోజు పౌర్ణమి. పౌర్ణమి రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒక ఝాముకాలం చంద్రుని చూస్తూ లలితాసహస్రనామం పారాయణం చేయడం స్వామివారి అలవాటు. ఆరోజుకూడా అలానే పారాయణం జరుగుతోంది. ప్రక్కన పన్నెండుగంటలకు గాలిగోపురం నెత్తిమీదకు చంద్రుడు వచ్చాడు. పారాయణం చేస్తున్న స్వామి ఆనంద సంభ్రమాలతో నిలుచుని చేతులు జోడించి పారిషదులతో ‘చూడరా అమ్మ’ అన్నారట. వారికి అర్థమయింది. స్వామికి అమ్మ కామాక్షి సగుణరూపంలో దర్శనం ఇస్తోంది. చేతులు జోడించి “ఎక్కడ” అన్నారు. అదిగో అన్నారు స్వామి. అంతే! ఆ పారిషదునికి గోపురమంతా అమ్మగా దర్శనమిచ్చింది. అప్పటి ఆ పారిషదుని హృదయస్థితి ఎలా ఉండి ఉంటుంది? 


అయ్యయ్యో! మహాపెన్నిధిని అతి దగ్గరగా పెట్టుకొని వారిని ఉపయోగించుకొని అమ్మను చూడలేకపోయానే అని దుఃఖం కమ్ముకొని వస్తుంది నాకు. అంతలో ఆ అమ్మ ఈ స్వామికదా! ఇప్పటికీ నాలో లేదా అనిపిస్తుంది. చదువరులలో ఉన్న మహాతపస్సంపన్నులారా నా స్వామిని నాలో నిరంతరం నిరంతరాయంగా దర్శించుకొనే అనుగ్రహం చేయరూ? 


కొంతమంది అనుకుంటారు. భక్తి అనేది ద్వైతభావంలోనిది. జ్ఞానికి కర్మ, భక్తి, పూజ అనేవి లేవని ఉద్ఘాటిస్తూ ఉంటారు. స్వామివారు జ్ఞాని కూడా భక్తిభావంలో లీనమయి ఉంటారని నిరూపించారు. వీరికి ముందే శుకాచార్యులు వారు, సదాశివబ్రహ్మేంద్రులు, మధుసూదనానంద సరస్వతి స్వామివంటి వారు కూడా ఈ విషయాన్ని తాము భక్తిభావంలో లీనమయి రూఢిపరచారు. 


శుకాచార్యులవారు జ్ఞాని కాని భక్తుడు పరమేశ్వరుణ్ణి ముక్తికోసం ఆరాధిస్తుంటే ముక్తుడైన జ్ఞాని భక్తిని భక్తికోసమే పెంపొందించుకుంటాడంటారు. జ్ఞానికి ఇటువంటి విశిష్టమైన భక్తి ప్రసాదించడం అంబికలీల అంటారు మహాస్వామివారు. నిజానికి జ్ఞానికి ఇటువంటి భక్తిని నెరపడం వలన ప్రయోజనముండకపోవచ్చు. ఆచార్య పదంలో ఉన్న స్వామివారివంటి జ్ఞానులు ఇటువంటి భక్తి కలిగిఉండటం మన మార్గదర్శకత్వానికే కావచ్చు. 


మహాస్వామివారు తుదినాళ్ళలో కేవల సమాధ్యవస్థలో ఉంటూ కూడా బాహ్యస్మృతిలోనికి వచ్చినప్పుడు సంధ్యావందనాద్యనుష్టానములు గతి తప్పక నిర్వహిస్తూ ఉండేవారు.


--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం