ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
18, నవంబర్ 2023, శనివారం
వనబోజన మహిమ*
🎻🌹🙏*కార్తీకపురాణం 5 వ అధ్యాయము*
🌸🌿🌸🌿🌸🌿🌸
*వనబోజన మహిమ*
ఓ జనక మహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజాన౦తరమున శివాలయమున న౦దు గాని విష్ణాలయము న౦దు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకు౦టమునకు
వెళ్ళుదురు. భగవద్గీత కొంత వరకు పఠి౦చిన వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క ప దమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో ని౦డి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యదోచిత౦గా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షణ తా౦బూలములతో సత్కరించి నమస్కరించ వలయును.
వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను- యని వశిష్టుల వారు చెప్పిరి. అది విని జనక రాజు ' ముని వర్యా ! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను? దానికి గల కారణమేమి యని' ప్రశ్ని౦చగా వశిష్టుల వారు ఈ విధంబుగా చెప్పనారంభి౦చిరి.
*🌷కిరాత మూషికములు మోక్షము నొందుట🌷*
రాజా! కావేరి తీర మ౦దొక చిన్ని గ్రామమున దేవశర్మ యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ . చిన్న తనము నుండి భయ భక్తులు లేక అతి గారాబముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి ' బిడ్డా! నీ దురాచారములు కంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొను చున్నారు. నన్ను నిలదీసి అడుగు చున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను. కాన, నువ్వు కార్తిక మాసమున నదిలో స్నానం చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన, నీవు అటులచేయు'మని భోదించెను. అంతట కుమారుడు' తండ్రీ! స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కదా?' అని వ్యతెరేకర్ధములతో పెడసరంగా సమాదాన మిచ్చెను. కుమారుని సమాధానము
విని, తండ్రీ ' ఓరి నీ చుడా! కార్తిక మాస ఫలము నంత చులకనగా చుస్తునావు కాన, నీవు అడవిలో రవి చెట్టు తొర్ర యందు యెలుక రూపములో బ్రతికేదవుగాక' అని కుమారుని శాపెంచెను. ఆ శాపంతో కుమారుడగు శివ శర్మ కు జ్ఞానోదయమై బయపడి తండ్రీ పాదములపై బడి ' తండ్రీ క్షమి౦పుము. ఆ జ్ఞానా౦ధ కరములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకన చేసి వాటి ప్రభాములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నక శాపవిమోచన మోప్పుడే విదముగా కలుగునో దానికి తగు తరుణోపాయ మెమో వివరింపు'మని ప్రాదేయ పడెను. అంతట తండ్రీ ' బిడ్డా ! నాశపమును అనుభవి౦చుచు మూషికము వై పది యుండగా నివెప్పుడు కార్తిక మహత్యమును వినగాలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొ౦దు దువు ' అని కుమారుని వూరడించెను. వెంటనే శివ శర్మ యెలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవి౦చుచు౦డెను.
ఆ యడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానర్ధమై నదికి వెళ్ళు వారు అక్కడ నున్న య పెద్ద వట వృక్షము నీడను కొంత సేపు విశ్రమించి, లోకబి రామాయణము చర్చి౦చుకొనుచు నదికి వెళ్ళు చుండెడి వారు. ఇట్లు కొంత కాలమైన తరువాత కార్తిక మాసములో నొక రోజున మహర్షి యను విశ్వా మిత్రులవారు శిష్యాసమేతముగా కావేరి నదిలో స్నానర్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము వున్న ఆ వుత వృక్షం క్రినకు వచ్చి శిష్యులకు కార్తిక పురాణమును వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము విరి దగ్గరనున్న పూజద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందే మోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు విరి జాడ తెలుసుకొని' విరు బాటసరులై వుందురు. విరి వద్ద నున్న ధనమపహరించ వచ్చు'న నెడు దుర్భుద్ది తో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునిశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికీ నమస్కరించి' మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శన౦తో న మనస్సులో చెప్పారని ఆనందము కలుగుచున్నది? గణ, వివరింపుడు' అని ప్రదేయపడెను. అంత విశ్వా మిత్రుల వారు ' ఓయి కిరాతక ! మేము కావేరి నది స్నానర్దామై ఐ ప్రాంతమునకు వచ్చితిమి. స్నాన మాచరి౦చి కార్తీక పురాణమునకు పతిన్చుచున్నాము. నీవును యిచట కూర్చుంది సావడనుడవై యలకి౦పుము' అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్దగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మ వృత్తంత మంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణ న౦తరము వారికీ ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణ మంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణా రూపము నొంది ' ముని వార్య ! ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడ నైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక జనకా! ఇహములో సిరి సంపదలు, పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించావలెను.
*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*
*ఐదవ అధ్యయము - ఐదవ రోజు పారాయణము సమాప్తం.*..
*రాశి ఫలితాలు 18-11-2023
*18-11-2023*
*స్థిర వాసరః శని వారం*
*రాశి ఫలితాలు*
*మేషం*
సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూ సంభందిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు.
*వృషభం*
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం. ఆకస్మిక ధనవ్యయ సూచనలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోలేరు.
*మిధునం*
ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
*కర్కాటకం*
బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగము న ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
*సింహం*
కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.
*కన్య*
దీర్ఘ కాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
*తుల*
ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారా, ఉద్యోగాలు ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
*వృశ్చికం*
చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆత్మ విశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ధైర్యముగా నిర్ణయాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది.
*ధనస్సు*
ఇతరుల ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటాయి.
*మకరం*
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదుల తో భూ సంభందిత వివాదాలు కొలిక్కి వస్తాయి. సనిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి.
*కుంభం*
చేపట్టిన పనులు నత్త నడక సాగుతాయి. కత్తులు తగినంత ఆదాయం లభించదు. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారమున భాగస్తులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు కలిగే సూచనలున్నవి.
*మీనం*
అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహయ సహకారాలు అందుతాయి.ధనదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతాన విద్యా విషయాలు పట్ల సంతృప్తికరంగా సాగుతాయి.
🕉️
పరమేశ్వర పూజార్హములు
శు భో ద యం🙏
మణులు పరమేశ్వర పూజార్హములు కావా?
-------------------------------------------------------------- చ
చ: " ఉనికి శిలోచ్చయంబు , నిజయోష శిలోచ్చయ రాజపుత్రి , నీ
ధనువు శిలోచ్చయంబు ,పురదాహ! రథీకృత రత్నగర్భ! నీ
మనమున కీ శిలాశకల మండలమెట్లు ప్రియంబు సేసె ? నే
మనగలవాఁడ నిన్ను ? వ్రత హాని యొనర్చు దురాత్ముఁడుండగన్ .
శ్రీ కాళహస్తీశ్వరమాహాత్మ్యము- 2 ఆ-- 122 పద్యము. ధూర్జటి మహాకవి ;
అర్ధములు: ఉనికి- నివాసము; ( నిజరూపము) శిలోచ్చయంబు- రాళ్ళసముదాయము; నిజయోష: నీభార్య ; శిలోచ్చయరాజపుత్రి- పర్వత రాకుమారి; రథీకృతము: రథముగా నుపయోగించునది; రత్నగర్భ- భూమి (రత్నములు కడుపులోకలది)
శిలాశకలములు-రాతిముక్కలు; మండలము- సముదాయము; వ్రతహాని- నియమమును పాడుచేయు;
సందర్భము: పరమేశ్వరునకు శ్రీ ,కాళము ,హస్తి , వరుస గాపూజచేసిపోతున్నాయి. ఒకరిపూజ మరియొకరికి నచ్చటంలేదు.
ఒకరోజున పాము పూజించిన తదుపరి ఏనుగు పూజకు వచ్చింది. అంతకు ముందే పాము మణులతో పరమేశ్వరుని యర్చించి
వెళ్ళింది. అక్కడి దృశ్యంచూచి ఏనుగు చాలా బాధపడింది. యెందుకు? మణులైనా రాళ్ళేగదా యవి. అందుకని. ఇప్పుడు పద్యభావం వినండి యేనుఁగు ఆంతర్యం మీకు బోధపడుతుంది.
" పరమేశ్వరా! నీకు రాళ్ళకి కొదవైనదనే యీరాతిముక్కలను నెత్తికెత్తుకున్నావా?
అసలు నీరూపమే రాయికదా',(శివలింగం రాతితోతయారు చేస్తారు) నీవుండేదే రాళ్ళగుట్టపై (హిమగిరి) యిక నీభార్యేమో
పర్వత రాజపుత్రిక ( పెద్దరాతికి పుట్చినది రాచిప్పతో సమానం) పోనీ నీవిల్లుచూదామా మేరుపర్వతం .( అదికూడా రాళ్ళగుట్టే) నీవు
రథంగా చేసికొన్నది కూడా రత్న గర్భయే ( శివునిరథం భూమి. ఆమెను రత్నగర్భ యంటారు.రత్నాలు రాళ్ళేకదా) యిన్నిరాళ్ళు నీచుట్టూ ఉండగా నీకు రాళ్ళకి కొదవైనదనా ? ఈరాతిముక్కలను నెత్తిని బెట్టుకున్నావు? స్వామీ! నిన్నేమన గలనయ్యా! నాపూజా వ్రతమును పాడుచేయుటకు జూచే దుర్మార్గుని నిందింపవలెను. "
అని యేనుఁగు తనమనస్సులోని బాధను శంకరునితో చెప్పుకొన్నది. ధూర్జటి చాతుర్యమును జూచితిరా? శివుని సర్వస్వమును శిలామయముగా నిరూపించినాడు. స్తుతి నిందాలంకారము.
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కార్తీక మాసం విశేషాలు —4
కార్తీక మాసం విశేషాలు —4
ప్ర : కార్తిక మాసంలో ఎలాంటి వ్రతం చేస్తే మంచిది. ఏ ఏ నియమాలు పాటించాలి?
జ : కార్తికంలో స్నానం,జపం,దానం పారాయణ ఏదైనా మహోన్నత ఫలాన్నిస్తుంది. ఎవరికి వీలైన వ్రతాన్ని వారు పాటించవచ్చు. ముఖ్యంగా దీపదానానికి సమానమైన దానం లేదు.
అవ్రతః కార్తికో యేషాం
గతో మూఢధియా మిహ l
తేషాం పుణ్యస్యలేశోపి
న భవేత్.....
" కార్తిక మాసంలో ఏ వ్రతమూ చేయకుండా గడిపే మూఢులకు పుణ్యం లేశమైనా లభించదు. అట్టివారి జన్మ నీచజన్తు జన్మకు సమానమని ధర్మశాస్త్రం కొంచెం గట్టిగానే ఘాటుగానే చెప్పింది.
కార్తిక మాసంలో రామాయణ, సుందరకాండాది పురాణాలను పారాయణం ప్రారంభించి, మాసాంతంలోగా పూర్తి చేయడం కూడా ధర్మశాస్త్రాలు విధించాయి. ఉత్తముడైన పండితుని ద్వారా ఈ మాసం దివ్య పురాణాలను శ్రవణం చేయడం గొప్ప ఫలితాన్నిస్తుందని పురాణవచనం. తాంబూలం, కేశఖండనం వంటివి విసర్జించడం ఉత్తమం. ఆకాశదీపాన్ని విష్ణు ప్రీతికై ఏర్పాటు చేస్తారు కొందరు. కార్తికంలో ఉల్లి, ఇంగువ,పుట్టుకొక్కు,గంజాయి,ముల్లంగి, ఆనపకాయ, మునగ కాడలు, వంగకాయ, గుమ్మడికాయ, వాకుడు,పుచ్చకాయ, వెలగపండు,నూనె, లవణశాకం,చద్ది మొదలైనవీ రెండు మార్లు వండిన అన్నం, మాడిన అన్నం,మినుములు, పెసలు,సెనగలు, ఉలవలు, కందులు మొదలైన ద్విదళ ధాన్యాలువాడరాదు. సప్తమి నాడు - ఉసిరిక,తిలలు,
అష్టమినాడు - కొబ్బరి, ఆదివారం - ఉసిరికపప్పు కార్తికంలోనే కాక ఏ మాసమందూ ఉపయోగించరాదు.(బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ)
శుభం భూయాత్ !
పుక్కిటి పురాణాలు*
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*పుక్కిటి పురాణాలు*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
రామాయణం, భారతం, భాగవతం లాంటి పురాణాలు చర్చకు వచ్చినపుడు, వాటిలోని వాస్తవాలు లేదా కల్పనలు ప్రస్తుత కాల పరిస్థితులతో పోల్చి చూసి, నమ్మశక్యంగా లేనపుడు వాటిని కొందరు "పుక్కిటి పురాణాలు" అని కొట్టిపారేస్తుంటారు. పుక్కిటి పురాణాలు అన్న పదప్రయోగం చేసినపుడు అవన్నీ వట్టి అబద్ధాలు అని చెప్పడం వారి ఆంతర్యం అయిఉంటుంది. పుక్కిటి పురాణాలు అంటే అసలు అర్ధం ఏమిటి?
రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, మరేదైనా చరిత్ర కావచ్చు. సాధారణంగా ఇవి గానం అనే ప్రక్రియ ద్వారా ప్రజలకు చేరేవి ఒకప్పుడు. సాధువులు, హరికథలు, బుర్రకథలు చెప్పేవారు, భట్రాజులు పల్లెల్లో తిరుగుతూ పురాణగాధలను గానం చేస్తూ వ్యాప్తి చేశారు. ఆ తరువాత ఎప్పుడో నాగరికత, సాంకేతికత పెరిగాక వీటిని అక్షరరూపంలో పెట్టి పుస్తకాలుగా మార్చారు. అప్పటివరకూ కళాకారులు ఈ గాధలను తమ పుక్కిలి పట్టి ఆశువుగా గానం ద్వారా ఈ పురాణగాధలను ప్రాచుర్యంలోకి తెచ్చారు కాబట్టి "పుక్కిటి పురాణం" అనే వాడుక పదం ప్రసిద్ధం అయింది. పుక్కిలి అనగా బుగ్గల లోపలిభాగం అని అర్ధం. అంతే తప్ప కల్పన, అబద్ధం అని కాదు.
(ఏదో పత్రికలో చదివిన గుర్తు )
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
జనమేజయా ! వీళ్ళు వెళ్ళేసరికి ఎవరో గంధర్వుడు ఏదో విన్నవిస్తున్నాడు బ్రహ్మదేవుడికి. అది
ముగిశాక రేవతుడు చతుర్ముఖుడికి నమస్కరించి తన కూతురును చూపించాడు. ఈ అమ్మాయిని
ఎవరికిచ్చి వివాహం చెయ్యాలో దయచేసి తెలియజెప్పమని అడిగాడు. చాలామంది రాకుమారులను
పరిశీలించాను. కానీ ఏ ఒక్కడూ నా మనస్సుకు పూర్తిగా నచ్చలేదు. ఏ నిర్ణయమూ చెయ్యలేక నిన్ను అడిగి
చేద్దామని ఇలా వచ్చాను. యోగ్యుడు, బలశాలి, సర్వలక్షణ సంయుతుడు, దానశీలి, ధర్మశీలి అయిన
రాకుమారుణ్ణి వరుడుగా ఆజ్ఞాపించు. ఆ ప్రకారం అతడికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అభ్యర్థించాడు.రేవతీ బలరాముల వివాహం
బ్రహ్మదేవుడు క్షణకాలం చిరునవ్వులు చిందించాడు. జరుగుతున్నదీ జరుగబోయే
ఆలోచించాడు. రాజేంద్రా! నువ్వు చూసిన రాకుమారులందరూ కాలచోదితులై త్వరలోనే
అస్తమించబోతున్నారు. దుష్టరాజ సైన్యాలను సంహరించి భూదేవికి భారాన్ని తగ్గించడంకోసం శ్రీమహావిష్ణువు
యదువంశంలో కృష్ణుడుగా అవతరించాడు. అవతార లక్ష్యాన్ని అప్పుడే ఆరంభించాడు. ఇప్పుడు
ద్వారకలో ఉంటున్నాడు. అతడికి ఒక అన్నగారున్నాడు. అతడి పేరు బలరాముడు. శేషాంశసంభూతుడు,
మహావీరుడు. ముసలాయుధధారి. హలాయుధధారి. వెంటనే వెళ్ళి మీ అమ్మాయి రేవతిని అతడికిచ్చి
వివాహం జరిపించు. శుభోదర్కంగా ఉంటుంది. అటు పైని నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకో
- అని చతుర్వదనుడు సలహా చెప్పాడు.
రేవతుడు వెంటనే బయలుదేరాడు. సరాసరి ద్వారకకు వచ్చాడు. బలరాముడికిచ్చి రేవతీ
కల్యాణం జరిపించాడు. అటునుంచి అలాగే బదరికకు వెళ్ళిపోయి తీవ్రంగా తపస్సు చేసి శరీరం
చాలించాడు. స్వర్గలోకం చేరుకున్నాడు.
రేవతుడు కూతురితోపాటు వెళ్ళి బ్రహ్మలోకంలో కొన్ని క్షణాలో నిముషాలో ఉన్నాడు కదా ! ఆది
మానవలోక కాలప్రమాణం ప్రకారం శతమో అష్టోత్తరశతమో యుగాలు అవుతుంది కదా! మరి వీళ్ళు
వృద్ధులు కాలేదా ? వృద్ధురాలైన రేవతిని బలరాముడు వివాహం చేసుకున్నట్టా ? రేవతుడు ఇంకెంతటి
ముసలివాడైనట్టు ? అసలు ఇంతకాలంపాటు వాళ్ళకి ఆయుఃప్రమాణం ఎలా నిలిచింది ?
కన్యా వృద్ధావ సంజాతా రాజా వాతితరాం న కిమ్ ।
ఏతావంతం తథా కాలమాయుః పూర్ణం తయోః కథమ్ । (8-48)
జనమేజయా ! బ్రహ్మలోకంలో ముసలితనం, ఆకలి, దప్పిక, మరణం, భయం, అలవట
ఇటువంటివి అసలు ఉండవు.
న జరా క్షుత్పిపాపా వా న మృత్యుర్న భయం పునః ।
న తు గ్లానిః ప్రభవతి బ్రహ్మలోకే పదావఘ ॥
(8-49)
అదిసరే శర్యాతి సంతతియైన రేవతుడు బ్రహ్మలోకానికి వెళ్ళిన సందర్భంగా, రాక్షసులు
అదునుచూసి కుశస్థలిమీద దండెత్తి అతడి సంతానాన్ని అంతటినీ సంహరించారు. చావగా బతికినవాళ్ళు
భయపడి పలాయనం చిత్తగించారు.
దీపావళి వెలుగులు
*దీపావళి వెలుగులు - జ్ఞానం వైపు అడుగులు*
గాఢాంధకారమైతే వెలగాల్సిందే దీపం
దీపం వెలిగినప్పుడే ప్రసరించును ప్రకాశం
దీపకాంతి కలిగినప్పుడే వెలువడును కిరణం
ఆ కిరణమే వెలుగు రేఖ
ఆ కిరణమే మార్గదర్శి.
గాఢాంధకారమైతే వెలగాల్సిందే దీపం
జ్ఞానాంధకారమైతే తెలియాల్సిందే జ్ఞానం
జ్ఞాన తృష్ణ కలిగినప్పుడే జ్ఞానార్జన ఫలవంతం
జ్ఞానంతోనే సుగమం ఆధ్యాత్మిక మార్గం.
జ్ఞాన ప్రయోగమే విజ్ఞానం
జ్ఞానం విజ్ఞానం అయితేనే అన్నింటా విజయం
దీపంతో పాటు జ్ఞాన దీపాలు వెలిగిద్దాం
జీవితాలను వెలుగులతో నింపుదాము
ప్రపంచాన్ని వెలుగులోకి నడిపిద్దాం.
*శుభ దీపావళి*
🏮🎊🪄💥🎁🌀🎇🎉🏮
మీ తుమ్మ జనార్ధన్ (జ్ఞాన్)
భక్తిసుధ
🕉️🪔 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️
🪔 ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔
*శ్లోకం*
*_విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలన తత్పరం_*
*_సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినం_*
*_క్రీడయంత మహర్నిశం గణనాథయూథ సమన్వితం_*
*_చన్ద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః_*
_ *_శ్రీ చన్ద్రశేఖరాష్టకం -08_* _
సృష్టి, స్థితి, ప్రళయ కారకుడై, ప్రతి ప్రాణిలో ఉండేవాడు, ప్రాణులతో నిరంతరం క్రీడలో ఉండేవాడు, గణ నాథుడై, గణములో ఒకడైన, *చన్ద్రుని శిరమున ధరించిన ఆ చన్ద్రశేఖరుడను పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?*.........
*_ శ్రీ చన్ద్రశేఖరాష్టకం సంపూర్ణం_*
పెరియ పురాణం⚜️*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *⚜️పెరియ పురాణం⚜️*
. *నాయనార్ల చరిత్ర - 03*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*3. ఇళయాంగుడి మార నాయనారు*
ఇళయాంగుడి అనే శైవక్షేత్రంలో మారన్ అనే పేరుతో ఒక శివభక్తుడు జన్మించాడు.
అతడు తన ఇంటికి వచ్చిన శివభక్తులను సాదరంగా
ఆహ్వానించి షడ్రసోపేత భోజనంతో వారిని సంతుష్టులను గావిస్తూ వచ్చాడు.
మార నాయనారు పేదరికం వచ్చినపుడు కూడ భక్తులను సంతృప్తి పరచే
దాన స్వభావి అని అందరికీ తెలియజేయడానికి అన్నట్లు పరమేశ్వరుడు
అతన్ని నిరుపేదగా మార్చాడు.
పేదరికంలోనూ అతడు శివభక్తులకు అతిథి
సత్కారాలను కొనసాగిస్తూ వచ్చాడు. ఒకరోజు వర్షాకాలం రాత్రివేళలో అణచుకోలేని ఆకలిని ఎలాగో అణచుకొని మారనాయనారు, అతనిభార్య
ఇరువురూ పడుకోనుండగా అతని భక్తిని పరీక్షించడానికై ఒక మునివరుని
వేషంలో పరమేశ్వరుడు వచ్చాడు.
అతనికి ఏదైనా పెట్టాలనే ఉద్దేశంతో "ఈ శివభక్తునికి భోజనం పెట్టడానికి ఏదైనా మార్గముందా?” అని మార నాయనారు తన భార్యను
నాయన్మారులు
అడిగాడు. ఆమె తన భర్తను చూసి “ఇంట్లో ధాన్యపుగింజ ఒక్కటీ లేదు.
ఇరుగుపొరుగువాళ్లు కూడ ఇచ్చేట్లుగా తోచలేదు.
మీరు ఈరోజు పగలు
పొలంలో విత్తిన సంబావరి గింజలను ఏరి తీసుకు వచ్చారంటే నేను
ప్రయత్నించి అన్నం వండుతాను” అని చెప్పింది. భార్య ఈ మాటలను
చెప్పగానే పెన్నిధి దొరికిన వాడివలె సంతోషించి మారనాయనారు తన
పొలానికి బయలుదేరాడు. మెరుపులు నిండిన ఆకాశం నుండి వర్షం
ధారలుగా కురుస్తోంది. అంతటా గాఢాంధకారం వ్యాపించి ఉంది.
మారనాయనారు తన తలమీద ఒక తట్టను బోర్లించుకొని పొలం లోపలికి
ప్రవేశించాడు. కాళ్లతో తడుముకుంటూ తన చేతులతో పొలంలో మొలకెత్తి
నీటిలో తేలుతున్న వరి విత్తనాలను తట్టనిండుకూ ఎత్తుకొని ఇంటికి వచ్చాడు.
మారన్ భార్య ఆ వరి విత్తనాలను నీళ్లలో బాగా కడిగింది. పొయ్యి
అంటించడానికి కట్టెలు లేవని చెప్పగా నాయనారు తన ఇంటి పైకప్పులో
ఎండిన పొడవాటి కర్రలను కత్తితో నరికి భార్యకు అందించాడు.
ఆమె ఆ కట్టెలను పొయ్యిలో పెట్టి వరి విత్తనాలను పక్వంగా వేయించి వాటిని
బియ్యంగా దంచి అన్నం వండింది. పొలంలో మొలకెత్తి ఉన్న ఆకుకూరలను
కోసుకొని ఇంటికి వచ్చి భార్యకందించగా ఆమె దానిని కూరగా వండింది.
తన ఇంటికి వచ్చిన అతిథి సత్తముని దగ్గరికి వెళ్లి ఆహారం
స్వీకరించవలసిందిగా నాయనారు మునివరుని ప్రార్ధించాడు.
సమయంలో ఇళయాంగుడి మారనాయనారు దంపతులకు శివగామి వల్లీ
సమేతుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై "మీరు నా అనుగ్రహానికి
పాత్రులయ్యారు. మీరిరువురూ శివలోక పదవిని అందుకొని సంతోషంగా
ఉండగలరు" అంటూ వాళ్లను ఆశీర్వదించాడు.
*మూడవ చరిత్ర సంపూర్ణం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
నవగ్రహా పురాణం🪐* *80వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
*🪐నవగ్రహా పురాణం🪐*
*80వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*బుధగ్రహ చరిత్ర - 7*
బుధుడి వెంట వచ్చిన ఇలకు ఆశ్రమంలోని లేళ్ళు , కుందేళ్ళు తమ విధానంలో స్వాగతం చెప్పాయి. బుధుడు సాత్వికాహారంతో ఇలాకన్యకకు ఆతిథ్యం ఇచ్చాడు.
ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూడటానికి , సరోవరం తెరుస్తున్న అందమైన కళ్ళలాగా తామరలు విచ్చుకుంటున్నాయి. కొలనులో బుధుడు స్నానం చేస్తున్నాడు. అతను ఆశ్రమం నుంచి రాకముందే జలక్రీడ ముగించిన ఇల కొలనుగట్టు మీద కూర్చుని , గురువిందపూల మాల గుచ్చుతోంది. రూపం మారిన వెంటనే , ఆ రూపానికి తగిన విద్యలన్నీ తమంత తామే తనను ఆశ్రయించినట్టున్నాయి.
సరస్సులోంచి గట్టు మీదికి వచ్చిన బుధుడు ఇల దగ్గరగా కూర్చున్నాడు. కోసి తెచ్చిన కెందామరను ఆమెకు అందించాడు. ఏదో చెప్పదలచుకున్నట్టు ఇల ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు.
ఇల అతని కళ్ళల్లోకి చూసింది. *"మీ కళ్ళు ఏదో చెప్తున్నట్టున్నాయి”* అంది. నవ్వుతూ.
*“అలాగా ! కళ్ళు - అంతే ! అవి మనసు తొంగిచూసే గవాక్షాలు ! కళ్ళే కాదు... ఇలా... నా పెదవులు కూడా నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాయి.”* బుధుడు ఆమెనే చూస్తూ అన్నాడు.
*"చెప్పమనండి , మీ పెదవుల్ని ,"* ఇల నవ్వింది.
*"ఒంటరిగా , స్వతంత్రంగా జీవిస్తూ సాధన చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఆశ్రమంలో విడిది చేశాను. ఎప్పుడూ లేని ఏదో వెలితి నాలో కాపురం ప్రారంభించింది. దేనికోసమో ఎదురు చూస్తున్న వెలితి ! ఎవరి కోసమో ఎదురు చూస్తున్న వెలితి ! ఆ వెలితి నన్ను అసంతృప్తిలో పడవేసింది. అర్ధం లేని , అర్థం కాని అసంతృప్తి అది !"*
*"అలాగా..."* ఇలా కనుబొమలు కదిలాయి.
*"ఆ వెలితి ఇప్పుడు లేదు. ఆ అసంతృప్తి విచిత్రంగా అంతర్థానమైపోయింది !"* బుధుడు చిరునవ్వు నవ్వాడు.
*“అలాగా !"*
*"ఆ వెలితి , అసంతృప్తి ఎప్పుడు మాయమయ్యాయో తెలుసా ?"* బుధుడు భావావేశంతో అన్నాడు. *“నువ్వు నాకు కనిపించిన ఆ మధుర క్షణం నుంచీ !”*
ఇల రెప్పలు కిందికి వాలాయి.
*“నిన్ను చూసిన క్షణంలోనే , అసంతృప్తి స్థానంలో ఏదో అలజడి ప్రారంభమైంది. ఇంత వరకూ ఏ స్త్రీ కూడా నాలో , నా సర్వస్వంలో ఇలాంటి అలజడిని పుట్టించలేదు !”*
ఇల రెప్పలెత్తి అతన్ని చూసింది. *"నిజంగా ! నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉంది ! నా జీవితంలో మీరు కనిపించేదాకా ఏ పురుషుణ్ణి నేను... అలా... చూడలేదు. మీలాగా ఏ పురుషుడూ నన్ను ఆకర్షించుకోలేదు !”*
*"నిజమా ?”* బుధుడు ఉత్సాహంగా అడిగాడు.
*"మీరిచ్చిన ఈ పద్మం మీద ఒట్టు"* ఇల నవ్వుతూ అంది.
*"స్వయం పోషణలో , స్వయం సాధనలో , స్వేచ్ఛగా , స్వతంత్రంగా జీవించమంటూ పెద్దలు నన్ను దీవించి పంపించారు. ఒకరికి రక్షణ ఇచ్చే వయసు వచ్చిందన్నారు నా పితామహులు. ఆయన మాటను నిజం చేయాలనిపిస్తోంది ?"* బుధుడు ఆగి , ఆమె కళ్ళల్లోకి చూశాడు.
*"ఏ విధంగా ?”* ఇలా ప్రశ్నించింది.
*"నీకు... నీకు... రక్షణ కల్పించడం ద్వారా. ”*
*“ఏ విధంగా ?”* ఇల చిరునవ్వు నవ్వింది.
*"నీ నుండి నేను రక్షణ పొందడం ద్వారా.”*
*“ఏ విధంగా ?”* ఇల మళ్ళీ నవ్వింది.
*“నిన్ను... భార్యగా స్వీకరించడం ద్వారా.”*
*"ఏ విధంగా ?"*
బుధుడు మౌనంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ , చిరునవ్వు నవ్వాడు. ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. ఆమె పెదవులు నవ్వుతున్నాయి. బుధుడు లోపల్లోపలే ఇల ప్రశ్నకు సమాధానం వెతకసాగాడు.
*"ఈ విధంగా !"* అంటూ ఆమె మెడ చుట్టూ తన చేతుల్ని దండలా అల్లి , ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. దగ్గరవుతున్న బుధుడి అందమైన ముఖాన్ని చూస్తూ ఇల పారవశ్యంతో , సిగ్గుతో కళ్ళు మూసుకుంది.
కొలనులో తామరలన్నీ వాళ్ళ ఐక్యతను ఆమోదిస్తూ మెచ్చుకుంటున్నట్టు పుష్ప శిరస్సులను ఊపుతున్నాయి.
*"ఇలా... మనం బార్యాభర్తలుగా ఆశ్రమంలో జీవించుదాం. ”* ఆ రోజు సాయంత్రం ఆశ్రమ ప్రాంగణంలో ఆశ్రమ ప్రాణుల మధ్య తిరుగాడుతూ , అన్నాడు బుధుడు. ఇలా ఆగి , అతని ముఖంలోకి కాసేపు తదేకంగా చూసింది. తటాలున పక్కకు తిరిగి , ఆశ్రమం వైపు పరుగెట్టింది. ఆమె ప్రవర్తన బుధుణ్ణి తత్తరపాటుకు గురి చేసింది. ఆశ్చర్యంతో నోరు తెరిచి , ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు.
ఇలా ఎందుకలా ప్రవర్తించింది ? భయపడిందా ? తనతో వివాహం ఇష్టం లేదా ? ఆలోచనలు బుధుడి అంతరంగంలో సలుపు పుట్టిస్తూ సాగుతున్నాయి. తాను ఆవేశంతో తొందరపడలేదు కద ! అప్రయత్నంగా ఆశ్రమం వైపు రెండడుగులు వేసిన బుధుడు తటాలున ఆగాడు. ఇల ఆశ్రమంలోంచి తన వైపు వస్తోంది. ఆమె ముఖం మీద చిరునవ్వు. నడకలో వేగం బుధుడి ఆందోళనను తగ్గుముఖం పట్టిస్తున్నాయి.
ఇల అతని ఎదురుగా నిలుచుంది. పైట కొంగు చాటున దాగి ఉన్న ఆమె కుడి చెయ్యి ఇవతలకి వచ్చింది. ఆ చేతిలో ఆమె అల్లిన మాల ఉంది. ఇల ఆ మాలను రెండు చేతుల్తో పట్టుకుంది. తల కొద్దిగా ఎత్తి భావావేశంతో బుధుడి కళ్ళల్లోకి చూసింది. ఆమె చేతులు మెల్లిగా పైకి లేచాయి. మాల బుధుడి కంఠసీమను అలంకరించింది.
*"ఇలా...”* రెండోసారి ఆశ్చర్యం నుంచి కోలుకున్న బుధుడు ఉద్వేగంతో అన్నాడు. కొద్దిగా వణుకుతున్న చేతులతో తన మెడలోని దండను తీసి , ఇల కంఠంలో వేశాడు. ఇల కళ్ళు చెమ్మగిల్లాయి. ఉద్వేగంతో నిట్టూర్పు విడిచింది. ఆమె లోంచి పొంగుతున్న భావావేశాన్ని కళ్ళకు కట్టుతున్నట్టు మాల స్పందిస్తోంది అందంగా.
ఇల చూపులు మెల్లిగా బుధుడి రిక్త కంఠం మీద వాలాయి. తన కంఠం మీద నుంచి కిందకి వేళ్ళాడుతున్న మాల చివరి భాగాన్ని రెండు చేతులతో పట్టుకొని , పైకెత్తి సున్నితంగా బుధుడి మెడలో సర్దింది. అనురాగ శృంఖలలాగా ఇద్దరి కంఠాల్నీ కలుపుతూ , బంధించిన మాలికను బుధుడు ఆనంద పారవశ్యంతో చూశాడు. మెల్లిగా అతని చూపులు ఇల చూపులను ఎదుర్కొన్నాయి.
ఆత్మపరంగా సతీపతులుగా రూపొందిన ఇలా బుధులు ఇద్దరూ ఒకరినొకరు దగ్గరగా తీసుకున్నారు. ప్రథమ పరిష్వంగంలో మైమరచిన వధూవరుల చుట్టూ ఆశ్రమ జంతువులు ఉల్లాసంగా గంతులు వేయడం ప్రారంభించాయి. రకరకాల పక్షులు మంగళ వాద్యాలలాగా బృందగానం ప్రారంభించాయి. వాన కారు కాకపోయినా , కారుమేఘాలు లేకపోయినా , ఉరుముల మృదంగ నాదం వినిపించకపోయినా , నెమళ్ళు పురులు విప్పి దంపతుల చుట్టూ కల్యాణ నాట్యం చేయసాగాయి.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 90*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 90*
*శ్రీరామకృష్ణులు నిష్క్రమిస్తున్నారు:*
ఆగస్ట్ 16వ తేదీ ఏ రోజు రాకూడదని భక్తులు పరితపించారో ఆ రోజు రానే వచ్చింది. నాడు ఆదివారం. శ్రీరామకృష్ణులు వ్యాధి అంతదాకా లేనంత తీవ్రరూపం దాల్చింది. ఆయన నాడి అస్తవ్యస్తంగా ఉంది. అతుల్ అనే భక్తుడు ఆయన నాడిని పరీక్షించి, ఆయున పరిస్థితి విషమిస్తున్నదని గ్రహించాడు. చుట్టూ వున్న వారితో ఇక ఆయన బ్రతకడం కష్టమని తెలిపాడు.
సూర్యాస్తమయం కాబోతున్నది. శ్రీరామకృష్ణులు శ్వాసించడంలో బాగా ఇబ్బందిపడుతున్నారు. భక్తులు వెక్కివెక్కి ఏడ్వ సాగారు. తమ జీవితాలలో ఇంతవరకు ఏ దివ్యప్రకాశం ఆనందాన్ని నింపుతూ వచ్చిందో, అది ఆరిపోతున్నదని గ్రహించిన అందరూ ఆయన చుట్టూచేరారు. కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు తనకు ఆకలిగా ఉందన్నారు. ద్రవాహారం ఇచ్చారు. కాని ఆయన త్రాగలేకపోయారు. ఎంతో శ్రమతో కాస్త త్రాగగలిగారు. మూతి తుడిచి మెల్లగా ఆయనను పడుకోబెట్టారు. ఇద్దరు విసరసాగారు. పడుకొని ఉన్నవారు హఠాత్తుగా అట్లే సమాధిమగ్నులయ్యారు. దేహం శిలలా నిశ్చలమయిపోయింది, శ్వాస స్తంభించింది.
ఇన్ని రోజులుగా రేయింబవళ్లు ప్రక్కనే ఉండి సేవలు చేస్తూవచ్చిన శశికి ఈ సమాధిస్థితి మామూలుగా కలిగే సమాధి స్థితిలా తోచలేదు. ఏదో పెద్ద మార్పు ఉన్నట్లు అనిపించి విలపించసాగాడు. అప్పుడు నరేంద్రుడు అందరిని, "హరిః ఓం తత్సత్" అని ఉచ్చరించమన్నాడు. చాలాసేపు ఆ మంత్రాన్ని ఉచ్చరించారు.
అర్ధరాత్రి గడిచాక శ్రీరామకృష్ణులకు బాహ్యస్మృతి కలిగింది. ఆకలిగా ఉందన్నారు. భక్తులు పట్టుకోగా లేచి కూర్చున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా ఒక గ్లాసు జావ సునాయాసంగా త్రాగారు. ఇంత ఆహారం ఆయన పుచ్చుకొని చాలా రోజులయింది. జావ త్రాగాక ఒంట్లో కాస్త సత్తువ వచ్చినట్లుగా ఉందన్నారు. ఆయన నిద్రపోతే మంచిదని నరేంద్రుడు సూచించాడు.
నొప్పి కారణంగా ప్రక్కనే ఉన్నవారికి సైతం వినపడనంత అతిమెల్లగా మాట్లాడే శ్రీరామకృష్ణులు హఠాత్తుగా బిగ్గరగా, "అమ్మా, కాళీ!" అంటూ మూడుసార్లు పిలిచి మెల్లగా పడుకొన్నారు. పిదప నరేంద్రుడు క్రిందికి వెళ్లాడు.
రాత్రి ఒంటి గంట రెండు నిమిషాలు. మంచం మీద పడుకొని ఉన్న శ్రీరామకృష్ణుల శరీరంలో హఠాత్తుగా పారవశ్యస్థితి జనించింది. రోమాంచిత మయింది. దృష్టి నాసికాగ్రంలో ఏకాగ్రమయింది. పెదవులపై దరహాస చంద్రికలు వెల్లివిరిసాయి. ఆయన సమాధిమగ్నులయ్యారు. ఇంతకాలంగా ఆయన అనుభవిస్తూ వచ్చిన సమాధి కాదది, మహాసమాధి; కాళీమాత ఒడిలో ఆమె అనుంగు పుత్రుడు శాశ్వతంగా నిద్రించిన ప్రగాఢ సమాధి! ఈ సమాధి తదుపరి ఆయన ప్రాణం శరీరంలోకి తిరిగి రాలేదు. అది 1886 ఆగస్ట్ 16వ తేదీ.
అప్పుడు మాతృమూర్తి శ్రీశారదాదేవి ఆయన ప్రక్కన లేరు. కబురు అందగానే ఒక్క పరుగున మంచం ప్రక్కకు వచ్చి, "అమ్మా కాళీ! ఎక్కడికి వెళ్లిపోయావు తల్లీ!" అంటూ బిగ్గరగా విలపించారు. అందరి హృదయాలూ ద్రవించిపోయాయి. శ్రీరామకృష్ణుల పావన భౌతికకాయం కాశీపూర్ శ్మశాన వాటికలో దహించబడింది. ఒక కంచు పాత్రలో అస్థికలు సేకరించి గురుదేవుల పడక మీద ఉంచారు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కార్తీకపురాణం 5 వ అధ్యాయము*
🎻🌹🙏*కార్తీకపురాణం 5 వ అధ్యాయము*
🌸🌿🌸🌿🌸🌿🌸
*వనబోజన మహిమ*
ఓ జనక మహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజాన౦తరమున శివాలయమున న౦దు గాని విష్ణాలయము న౦దు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకు౦టమునకు
వెళ్ళుదురు. భగవద్గీత కొంత వరకు పఠి౦చిన వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క ప దమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో ని౦డి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యదోచిత౦గా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షణ తా౦బూలములతో సత్కరించి నమస్కరించ వలయును.
వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను- యని వశిష్టుల వారు చెప్పిరి. అది విని జనక రాజు ' ముని వర్యా ! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను? దానికి గల కారణమేమి యని' ప్రశ్ని౦చగా వశిష్టుల వారు ఈ విధంబుగా చెప్పనారంభి౦చిరి.
*🌷కిరాత మూషికములు మోక్షము నొందుట🌷*
రాజా! కావేరి తీర మ౦దొక చిన్ని గ్రామమున దేవశర్మ యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ . చిన్న తనము నుండి భయ భక్తులు లేక అతి గారాబముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి ' బిడ్డా! నీ దురాచారములు కంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొను చున్నారు. నన్ను నిలదీసి అడుగు చున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను. కాన, నువ్వు కార్తిక మాసమున నదిలో స్నానం చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన, నీవు అటులచేయు'మని భోదించెను. అంతట కుమారుడు' తండ్రీ! స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కదా?' అని వ్యతెరేకర్ధములతో పెడసరంగా సమాదాన మిచ్చెను. కుమారుని సమాధానము
విని, తండ్రీ ' ఓరి నీ చుడా! కార్తిక మాస ఫలము నంత చులకనగా చుస్తునావు కాన, నీవు అడవిలో రవి చెట్టు తొర్ర యందు యెలుక రూపములో బ్రతికేదవుగాక' అని కుమారుని శాపెంచెను. ఆ శాపంతో కుమారుడగు శివ శర్మ కు జ్ఞానోదయమై బయపడి తండ్రీ పాదములపై బడి ' తండ్రీ క్షమి౦పుము. ఆ జ్ఞానా౦ధ కరములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకన చేసి వాటి ప్రభాములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నక శాపవిమోచన మోప్పుడే విదముగా కలుగునో దానికి తగు తరుణోపాయ మెమో వివరింపు'మని ప్రాదేయ పడెను. అంతట తండ్రీ ' బిడ్డా ! నాశపమును అనుభవి౦చుచు మూషికము వై పది యుండగా నివెప్పుడు కార్తిక మహత్యమును వినగాలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొ౦దు దువు ' అని కుమారుని వూరడించెను. వెంటనే శివ శర్మ యెలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవి౦చుచు౦డెను.
ఆ యడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానర్ధమై నదికి వెళ్ళు వారు అక్కడ నున్న య పెద్ద వట వృక్షము నీడను కొంత సేపు విశ్రమించి, లోకబి రామాయణము చర్చి౦చుకొనుచు నదికి వెళ్ళు చుండెడి వారు. ఇట్లు కొంత కాలమైన తరువాత కార్తిక మాసములో నొక రోజున మహర్షి యను విశ్వా మిత్రులవారు శిష్యాసమేతముగా కావేరి నదిలో స్నానర్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము వున్న ఆ వుత వృక్షం క్రినకు వచ్చి శిష్యులకు కార్తిక పురాణమును వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము విరి దగ్గరనున్న పూజద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందే మోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు విరి జాడ తెలుసుకొని' విరు బాటసరులై వుందురు. విరి వద్ద నున్న ధనమపహరించ వచ్చు'న నెడు దుర్భుద్ది తో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునిశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికీ నమస్కరించి' మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శన౦తో న మనస్సులో చెప్పారని ఆనందము కలుగుచున్నది? గణ, వివరింపుడు' అని ప్రదేయపడెను. అంత విశ్వా మిత్రుల వారు ' ఓయి కిరాతక ! మేము కావేరి నది స్నానర్దామై ఐ ప్రాంతమునకు వచ్చితిమి. స్నాన మాచరి౦చి కార్తీక పురాణమునకు పతిన్చుచున్నాము. నీవును యిచట కూర్చుంది సావడనుడవై యలకి౦పుము' అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్దగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మ వృత్తంత మంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణ న౦తరము వారికీ ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణ మంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణా రూపము నొంది ' ముని వార్య ! ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడ నైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక జనకా! ఇహములో సిరి సంపదలు, పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించావలెను.
*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*
*ఐదవ అధ్యయము - ఐదవ రోజు పారాయణము సమాప్తం.*..
సద్బుద్ధీ
🕉️ *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 🕉️
శ్లో𝕝𝕝
సతతం పరహితవృత్తి ర్భవతు
సదా సత్యధర్మ మార్గే ప్రీతిః
సర్వత్ర సంపదాం వృద్ధిః
సోదర సద్భావనాస్తు లోకే సతతమ్.
తా𝕝𝕝 ఎల్లపుడూ ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన, మానవ ధర్మాన్నీ, సత్యభాషణను అనుసరిస్తూ, అంతటా సంపదల వృద్ధీ, సోదరభావంతో మెలిగే సద్బుద్ధీ అందరికీ కలుగుగాక.
*రాశి ఫలితాలు 18-11-2023
*18-11-2023*
*స్థిర వాసరః శని వారం*
*రాశి ఫలితాలు*
*మేషం*
సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూ సంభందిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు.
*వృషభం*
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం. ఆకస్మిక ధనవ్యయ సూచనలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోలేరు.
*మిధునం*
ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
*కర్కాటకం*
బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగము న ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
*సింహం*
కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.
*కన్య*
దీర్ఘ కాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
*తుల*
ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారా, ఉద్యోగాలు ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
*వృశ్చికం*
చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆత్మ విశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ధైర్యముగా నిర్ణయాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది.
*ధనస్సు*
ఇతరుల ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటాయి.
*మకరం*
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదుల తో భూ సంభందిత వివాదాలు కొలిక్కి వస్తాయి. సనిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి.
*కుంభం*
చేపట్టిన పనులు నత్త నడక సాగుతాయి. కత్తులు తగినంత ఆదాయం లభించదు. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారమున భాగస్తులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు కలిగే సూచనలున్నవి.
*మీనం*
అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహయ సహకారాలు అందుతాయి.ధనదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతాన విద్యా విషయాలు పట్ల సంతృప్తికరంగా సాగుతాయి.
🕉️
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం - పంచమి - ఉత్తరాషాఢ - స్థిర వాసరే* *(18-11-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/mCUcVr_kLVg?si=gR8cwf-ipmyqLKcz
🙏🙏

రివర్స్ ఏజింగ్
FLASH FLASH . ...... రివర్స్ ఏజింగ్
అందరికీ ఒక శుభవార్త. వృద్ధాప్యం రాకుండా.. బయోలాజికల్ ఏజింగ్ ప్రాసెస్‌ని ఆపొచ్చని ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు చెప్పారు. వయసును ఆపడమే కాదు.
మీ వయసును తగ్గించవచ్చని నిరూపించారు. మన శరీరాల్లో టెలోమేర్ ఉంటుంది. టెలోమెర్ అంటే డీఎన్‌ఏకు సంబంధించిన ఓ స్ట్రక్చర్. అది మన షూ లేస్‌లా ఉంటుంది.
రెండువైపులా క్రోమోజోములు ఉంటాయి. అవి నెమ్మదిగా కరిగిపోవడం వల్ల మనకు వృద్ధాప్యం వస్తుంది. దానివల్ల డీఎన్‌ఏ చిన్నగా మారుతుంది. అయితే..
ఈ టెలోమేర్ ఎడ్జ్‌లను రిపేర్ చేసి. ఆ క్యాప్స్‌ను దృఢపరిస్తే మళ్లీ యవ్వనంలోకి వెళ్లిపోవచ్చు. కానీ.. దాన్ని కేవలం ఆక్సిజన్ వాడి రిపేర్ చేయొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
ఆ ట్రీట్‌మెంట్ పేరు.. హెచ్‌బీఓటీ (హైపర్‌బారిక్ ఆక్సిజన్ ట్రీట్‌మెంట్). దీని కోసం 65ఏళ్లు దాటిన 35 మందిని ఒక ఆక్సిజన్ ఛాంబర్‌లో కూర్చోబెట్టి ప్రతిరోజూ గంటన్నర చొప్పున వారానికి ఐదుసార్లు ఆక్సిజన్ ఇచ్చారు.
ఇలా వాళ్లకు మూడు నెలల పాటు ఆక్సిజన్ ఇస్తే వాళ్లందరూ పాతికేళ్లు తగ్గి 40ఏళ్ల వ్యక్తుల్లా అయిపోయారు.
ఈమూడు నెలలల్లో కేవలం ఆక్సిజన్ వల్ల వాళ్ల టెలోమేర్స్ ఎండ్‌క్యాప్స్ స్ట్రాంగ్ అయిపోయాయి. క్రోమోజోమ్‌లు రీబిల్ట్ అయ్యాయి.
టెలోమేర్స్ మళ్లీ పొడుగ్గా తయారయ్యాయి. ఇది ఋజువైంది’’ అని పూరి అన్నారు.
‘‘ఈ ట్రీట్‌మెంట్‌తో వయసు తగ్గడమే కాదు. రాలిపోయిన జట్టు కూడా తిరిగి వస్తుందట. చాలా మంది పండగ చేసుకునే వార్త ఇది.
తెల్ల రక్తకణాలు తయారై ఊడిపోయిన జుట్టు కూడా వస్తే.. అంతకంటే ఏం కావాలి జీవితానికి. అతి త్వరలో ఈ చికిత్స అందుబాటులోకి వచ్చేస్తుంది. సైంటిస్టులు చెప్పేదేంటంటే.. వృద్ధాప్యం అనేది ఓ రోగం. దాన్ని మనం నివారించవచ్చు. అదికానీ నిజమై.. ఇప్పుడు 60ఏళ్లు దాటిన గొప్పవాళ్లంతా మళ్లీ పాతికేళ్లు వెనక్కి వెళితే ఎలా ఉంటదో తెలుసా.. వాళ్లు అద్భుతాలు సృష్టిస్తారు.
అమితాబ్‌బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ వాళ్లంతా పాతికేళ్లు వెనక్కి వెళితే సినిమా స్క్రీన్లు మరోసారి చిరిగిపోతాయి.
రాజకీయ నాయకులు, సైంటిస్టులు, వ్యాపారవేత్తలు వీళ్లందరికీ మరొక్క అవకాశం వస్తే కుమ్మేస్తారు. కేవలం ఆక్సిజన్ వల్ల మనలో ఇంత మార్పు వచ్చే అవకాశం ఉందంటే..
ఆక్సిజన్ ఎంత విలువైందో ఆలోచించాలి. ప్రతిరోజూ కాలుష్య వాతావరణంలో బతుకుతున్నాం. అందుకే మన శరీరాలు క్షీణించిపోతున్నాయి.
మనకు ఇలాంటి ట్రీట్‌మెంట్ అక్కర్లేదు. కాస్త స్వచ్ఛమైన గాలిలో తాజా ఆక్సిజన్ పీలిస్తే చాలు. అందుకే కొండలపై బతికేవాళ్లు మనకంటే దృఢంగా ఉంటారు.
మనకంటే ఎక్కువకాలం బతుకుతారు.
బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రాణాయామం నడక
తేలిక పాటి పరుగు
చిన్న చిన్న వ్యాయామాలు
సూర్యనమస్కారాలు ఎక్కువ ప్రాణవాయువు ( ఆక్సిజన్) తీసుకోవటానికి బాగా సహకరిస్తాయి
అందరూ తప్పకుండా చేయండి
సరైన మార్గాన్ని మనమే గ్రహించేలా చేస్తుంది.
శ్లోకం:☝️
*నాకేశగ్రహణాచ్ఛాస్త్రం*
*ప్రవర్తయతి కఞ్చన ।*
*ఉన్మీలయతి తచ్చక్షుర్*
*యేన్ మార్గం స పశ్యతి॥*
భావం: శాస్త్రం ఎవరినీ జుట్టు పట్టుకుని నిర్దేశించదు. అది కేవలం మన కళ్ళు తెరుస్తుంది. తద్వారా సరైన మార్గాన్ని మనమే గ్రహించేలా చేస్తుంది.🙏
పంచాంగం 18.11.2023 Saturday,
ఈ రోజు పంచాంగం 18.11.2023 Saturday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు కార్తీక మాస శుక్ల పక్ష: పంచమి తిధి స్థిర వాసర: ఉత్తరాషాఢ నక్షత్రం గండ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.
పంచమి పగలు 09:17 వరకు.
ఉత్తరాషాఢ రాత్రి 12:05 వరకు.
సూర్యోదయం : 06:26
సూర్యాస్తమయం : 05:36
వర్జ్యం : పగలు 08:52 నుండి 10:23 వరకు తదుపరి రా.తె 03:52 నుండి 05:23 వరకు.
దుర్ముహూర్తం : ఉదయం 06:26 నుండి 07:55 వరకు.
రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.
యమగండం : మద్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.
శుభోదయ:, నమస్కార: