18, నవంబర్ 2023, శనివారం

పుక్కిటి పురాణాలు*

 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

*పుక్కిటి పురాణాలు*

 ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡              

రామాయణం, భారతం, భాగవతం లాంటి పురాణాలు చర్చకు వచ్చినపుడు, వాటిలోని వాస్తవాలు లేదా కల్పనలు ప్రస్తుత కాల పరిస్థితులతో పోల్చి చూసి, నమ్మశక్యంగా లేనపుడు వాటిని కొందరు "పుక్కిటి పురాణాలు" అని కొట్టిపారేస్తుంటారు. పుక్కిటి పురాణాలు అన్న పదప్రయోగం చేసినపుడు అవన్నీ వట్టి అబద్ధాలు అని చెప్పడం వారి ఆంతర్యం అయిఉంటుంది. పుక్కిటి పురాణాలు అంటే అసలు అర్ధం ఏమిటి?


రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, మరేదైనా చరిత్ర కావచ్చు. సాధారణంగా ఇవి గానం అనే ప్రక్రియ ద్వారా ప్రజలకు చేరేవి ఒకప్పుడు. సాధువులు, హరికథలు, బుర్రకథలు చెప్పేవారు, భట్రాజులు పల్లెల్లో తిరుగుతూ పురాణగాధలను గానం చేస్తూ వ్యాప్తి చేశారు. ఆ తరువాత ఎప్పుడో నాగరికత, సాంకేతికత పెరిగాక వీటిని అక్షరరూపంలో పెట్టి పుస్తకాలుగా మార్చారు. అప్పటివరకూ  కళాకారులు ఈ గాధలను తమ పుక్కిలి పట్టి ఆశువుగా గానం ద్వారా ఈ పురాణగాధలను ప్రాచుర్యంలోకి తెచ్చారు కాబట్టి "పుక్కిటి పురాణం" అనే వాడుక పదం ప్రసిద్ధం అయింది.  పుక్కిలి అనగా బుగ్గల లోపలిభాగం అని అర్ధం. అంతే తప్ప కల్పన, అబద్ధం అని కాదు.

(ఏదో పత్రికలో చదివిన గుర్తు )

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

కామెంట్‌లు లేవు: