*దీపావళి వెలుగులు - జ్ఞానం వైపు అడుగులు*
గాఢాంధకారమైతే వెలగాల్సిందే దీపం
దీపం వెలిగినప్పుడే ప్రసరించును ప్రకాశం
దీపకాంతి కలిగినప్పుడే వెలువడును కిరణం
ఆ కిరణమే వెలుగు రేఖ
ఆ కిరణమే మార్గదర్శి.
గాఢాంధకారమైతే వెలగాల్సిందే దీపం
జ్ఞానాంధకారమైతే తెలియాల్సిందే జ్ఞానం
జ్ఞాన తృష్ణ కలిగినప్పుడే జ్ఞానార్జన ఫలవంతం
జ్ఞానంతోనే సుగమం ఆధ్యాత్మిక మార్గం.
జ్ఞాన ప్రయోగమే విజ్ఞానం
జ్ఞానం విజ్ఞానం అయితేనే అన్నింటా విజయం
దీపంతో పాటు జ్ఞాన దీపాలు వెలిగిద్దాం
జీవితాలను వెలుగులతో నింపుదాము
ప్రపంచాన్ని వెలుగులోకి నడిపిద్దాం.
*శుభ దీపావళి*
🏮🎊🪄💥🎁🌀🎇🎉🏮
మీ తుమ్మ జనార్ధన్ (జ్ఞాన్)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి