8, అక్టోబర్ 2023, ఆదివారం

ఇజ్రాయెల్ లో జరుగుతున్నది మనకు ఒక పాఠం

 ఇజ్రాయెల్ లో ఎక్కువగా యువతులను, టీనేజ్ అమ్మాయిలను బంధీలుగా ఎత్తుకెళ్లారు పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు. నిజాం పాలనలో నాటి తెలంగాణ ప్రాంతంలో రజాకార్ల ముఠా చేసిన వికృత చేష్టలు, కాశ్మీర్ లో హిందూ పండిట్ల పై తీవ్రవాదులు జరిపిన మారణహోమాన్ని గుర్తుకుతెచ్చేలా నిన్నటి నుండి ఇజ్రాయెల్ లో హమాస్ తీవ్రవాదులు చేస్తున్న ఈ దారుణాలు ఉన్నాయి. 


ఇప్పుడు ఈ యువతులను ఆ రాక్షస మృగాలు ఎంత మానసిక, శారీరక హింసకు గురిచేస్తాయో అనేది ఊహించుకుంటేనే మన గుండె వేగం పెరుగుతుంది. భారత్ లో గత వేయి సంవత్సరాల చరిత్రలో సైతం భారతీయ రాజుల పై దురాక్రమణదారులు యుద్ధాలకు దిగిన అనంతరం మన రాజులు ఓడిపోతే, రాజుతో సహా సైనికుల వరకు ఎందరినో శిరచ్ఛేధం చేసి ఆ రాజ్యం లో ఉండే రాణితో సహా ఎందరినో మహిళలను, యువతులను ఎత్తుకెళ్లి బంధీలుగా పెట్టుకుని వారిని హింసించి వారిని భోగ వస్తువు వలె వాడుకుని అనంతరం బజారులో అమ్మాకానికి పెట్టడం లాంటి రాక్షస క్రీడ ఆడేవారు.


ఇజ్రాయెల్ లో జరుగుతున్నది మనకు ఒక పాఠం. మన ఇంట్లో ఆడవారు, బాలికలు ఉన్నారు వాళ్ల భద్రత కోసం మనం, రేపు వారికి ఏ హాని కలుగకుండా ఉండాలంటే ప్రస్తుతం ఏం చేస్తున్నాం అనేది స్వయం విశ్లేషణ చేస్కోవాలి. బతుకమ్మ చీర ఉచితంగా వచ్చిందనో, ఆసరా పింఛన్, కళ్యాణ లక్ష్మీ, ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి వాటికి ప్రాధాన్యతను ఇచ్చి దేశ భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యతను ఇవ్వకపోతే ఇజ్రాయెల్ లో జరిగింది రాబోయే రోజుల్లో మనం ఉండే ప్రాంతాల్లో సైతం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, కాస్త ఆలోచించండి 🙏

బ్రోచేవారెవరురా

 బ్రోచేవారెవరురా? నిను వినా రఘువరా!



బ్రోచేవారెవరురా? నిను వినా రఘువరా!


ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా!

నీ చరితము పొగడలేని నా చింత దీర్చి వరములిచ్చి వేగమె నను


సీతాపతే! నాపై నీకభిమానము లేదా?

వాతాత్మజార్చితపాద! నా మొరలను వినరాదా?

ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవె కదా

పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక నను 


మైసూర్ వాసుదేవాచార్యుల వారు 20వ శతాబ్దపు వాగ్గేయకారులలో ప్రముఖులు. త్యాగరాజస్వామి వారి శిష్యపరంపరకు చెందిన వీరు మైసూరులో జన్మించినా సింహభాగం కృతులు తెలుగు సంస్కృత భాషలలోనే రచించారు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు వద్ద సంగీతం నేర్చుకొని మైసూరు మహారాజుల సంస్థానంలో విద్వాంసులుగా ఎంతో పేరొందారు వీరు. వీరి కృతులలో బ్రోచేవారెవరురా ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. మైసూరు మహారాజా జయచామరాజ వడయార్ రచించిన ఎన్నో కీర్తనలకు ఆయన సంగీతం కూర్చారు. ఆయన సంస్కృతంలో, కర్ణాటక సంగీతంలోఎంతటి విద్వాంసుడో అంతే వినయ సంపన్నుడు. ఆయన తన చివరి సంవత్సరాలను చెన్నై రుక్మిణీదేవి అరుండేల్ కళాక్షేత్రలో గడిపారు. అక్కడ ఒకసారి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు వచ్చి బ్రోచేవారెవరురా కీర్తన అద్భుతంగా గానం చేస్తే "నేను నా కూతురని గుర్తు పట్టలేదు, ఇంత అందంగా ఆభరణాలతో అలంకరించుకొని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గళంలో వస్తే..." అన్నారుట.200కు పైగా కృతులను రచించిన ఆయన అభినవ త్యాగరాజుగా పిలువబడ్డాడు. తన ముద్రగా 'వాసుదేవ' అనే పదాన్ని ఉపయోగించారు.  బ్రోచేవారెవరురా అనే కృతిలో ఆయన రాముని ఇలా వేడుకుంటున్నారు:


"ఓ శ్రీరామా! నువ్వు కాక నన్ను కాపాడేవారు ఎవ్వరు? ఓ బ్రహ్మాది దేవతలచే పూజించబడిన రామా! నీకు పరాకు ఎందుకు? నీ వైభవాన్ని పొగడలేను నేను. నా చింతలను తీర్చి, వరాలిచ్చి త్వరగా నన్ను బ్రోవుము!


ఓ సీతాపతీ! నీకు నాపై అభిమానము లేదా? ఓ హనుమంతునిచే కొలువబడిన పాదాములు కలవాడా! నా ప్రార్థనల్ను వినుము! ఆ గజేంద్రుడు ప్రార్థించగానే ఆత్రముగా వచ్చి బ్రోచిన శ్రెహరివి నీవు కదా! నా పాపాలన్నిటినీ పోగొట్టి నా చేయిని గట్టిగా పట్టుకొని నన్ను విడువకుము!"





మానవుడు శరీరంలో శక్తి, వయసు ఉన్నంత కాలం అహంకారం విర్రవీగి భగవంతుడు గుర్తుకు రాడు. కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, శరీరం క్షీణించినప్పుడు, ధైర్యము కోల్పోయినప్పుడు పరమాత్మను తలచుతాడు. దీనికి చక్కని ఉదాహరణ భాగవతంలోని గజేంద్ర మోక్షం. మదగజం ఆడ ఏనుగులతో సరససల్లాపాలాడుతూ సరస్సులో క్రీడిస్తుండగా స్థానబలిమి కలిగిన మొసలి ఆ కరిరాజు కాలిని పట్టిన సన్నివేశంలో ఆ ఏనుగు శరీరంలో శక్తిని నశించి, ప్రాణములు పట్టుకోల్పోయి, మూర్ఛ వచ్చే పరిస్థితులలో పరమాత్మను దీనంగా ప్రార్థిస్తాడు. అపుడా అ హరి పరుగు పరుగున వచ్చే సన్నివేశాన్ని మహాకవి  పోతన ఎంతో అద్భుతంగా వివరించారు:


సిరికింజెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపడే

పరివారంబును జీరడభ్రగపతిం బన్నింపడాకర్ణికాం

తరధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో

పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై


"గజేంద్రుని ప్రాణములను రక్షింపవలెనను ఉత్సాహము ఉరకలు వేస్తుండగా ఆ శ్రీహరి, శ్రీదేవికైన చెప్పడు, శంఖచక్రములను ధరించడు, అనుచరులనెవ్వరిని పిలువడు, పక్షిరాజైన గరుడుని సిద్ధపడుమని తెలుపడు. చెవుల వరకు జాలువారిన కేశములనైనను సవరించడు. తనవ్రేళ్లకు చుట్టుకొనిన శ్రీదేవి యొక్క పైటచెంగును కూడా విడిచి పెట్టకుండా అట్లే లేచి వడి వడిగా ఆకాశ మార్గమున నడచి పోసాగెను"


ఆ విధంగా హరి వచ్చి మకరిని చక్రంతో సంహరించి కరిని కాపాడుతాడు. ఈ ఘట్టాన్ని కృతికర్త బ్రోచేవారెవరురాలో ప్రస్తావించారు. వాగ్గేయకారులు మన శ్రుతి స్మృతి పురాణాలను తమ సంకీర్తనలలో ప్రస్తావించటం వారి సనాతనధర్మ బద్ధతను, జ్ఞానాన్ని సూచిస్తుంది. వాసుదేవాచార్యుల వారి రచనా శైలి భక్తిమార్గాన్ని ప్రబోధించే భాగవతంలోని భక్తుల శైలికి సారూప్యత కలిగింది. గజేంద్రుని శ్రీహరి కాపాడిన వృత్తాంతము దాదాపుగా ప్రతి వాగ్గేయకారుడూ ప్రస్తావించాడు. త్యాగరాజ స్వామి తన కృతులు 'మరి మరి నిన్నే', 'ఈ మేను కలిగినందుకు ', 'మురిపెము కలిగ గద ', రామదాసు 'ఏమయ్య రామ ', 'పాహిమాం శ్రీ రామా ' అన్న కీర్తనలలో,  అలాగే అన్నమాచార్యుల వారు ఎన్నో సంకీర్తనలలో  దీనిని ప్రస్తావించారు. కారణం - అందులో జీవి ప్రవృత్తి, పరమాత్మ కరుణ చాలా అద్భుతంగా వివరించబడటం వలన. సారాంశం - వాసనలు తొలగి, వికారములు నశించి, భక్తితో కూడిన శరణాగతితో ప్రార్థించినపుడు పరమాత్మ తప్పక అనుగ్రహిస్తాడు. మన సంకల్ప లోపము, ప్రయత్న లోపము తప్ప ఆయన అనుగ్రహానికి లోపమే లేదు. బ్రోచేవారెవరురా అని ఇంత అద్భుతంగా నుతించిన వాసుదేవాచార్యుల వారిని కూడా శ్రీరాముడు అలాగే అనుగ్రహించాడు.


ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!


ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో బ్రోచేవారెవరురా.

*All LPG consumers

 *All LPG consumers should pay attention to this post -*

    *Especially women's group,*

This post is based on a woman's experience,


Last Sunday I got a useful information,


I had to change my gas cylinder, I removed the empty cylinder and installed a new filled cylinder,

As soon as I turned on the knob, I felt the smell of gas leaking, for safety reasons I immediately turned off the knob.

    I immediately informed my gas agency and asked for help.

   He replied that the agency is closed as it is Sunday, now our man will be able to solve your problem only tomorrow, sorry.

I sat down in despair, suddenly I thought that I should search on Google, maybe I will find some emergency number.


  Google shows a number *1906* in case of gas leakage.

 

When I called that number, *Gas Leakage Emergency* appeared on True Caller.

A lady picked up the phone, I told her my problem, she replied that the service man will reach your address within 1 hour, if your pipe is leaking then you will have to pay the charge for the new pipe, otherwise you will not have to pay anything,

  I was surprised when within half an hour a boy knocked at the door.

*That boy checked, and within 1 minute changed the washer inside the cylinder and turned on the gas,*

  When I tried to give him some money, he politely refused to take it.

*He said that this facility has been provided to him free of cost by the Central Government*

Within half an hour the lady who received the call called and asked whether your problem was resolved or not?

   *I checked the facts again on Google and saw that this facility is available 24×7 on services.india.gov.in, which is related to all gas companies*


*I request you all to share this message with all your acquaintances and groups so that it is useful for everyone*🙏💐

హైదరాబాద్ ప్రాంతంలో హై సెక్యూరిటీ అలర్ట్:*

 *హైదరాబాద్ ప్రాంతంలో హై సెక్యూరిటీ అలర్ట్:*

 బివేర్ & బి ఆన్ యువర్ గార్డ్...ఇంటిని దోచుకోవడానికి సరికొత్త మార్గం ఒక గుంపు(Group of peoples) ఇంటింటికీ తిరుగుతూ హోం వ్యవహారాల అధికారులుగా నటిస్తుంది.  వారు హోం వ్యవహారాల శాఖ నుండి పత్రాలు మరియు లెటర్‌హెడ్‌లను కలిగి ఉన్నారు మరియు రాబోయే జనాభా గణన కోసం ప్రతి ఒక్కరూ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును కలిగి ఉన్నారని ధృవీకరిస్తారు.  నిజానికి, వారు  ఇళ్ళని లూటీ చేసి దోచుకునే వాళ్ళు. ప్రభుత్వం అటువంటి చొరవ తీసుకోలేదని దయచేసి గమనించండి.  దయచేసి దీన్ని మీ పొరుగు గ్రూప్ చాట్‌కి పంపండి.  వారు ప్రతిచోటా ఉన్నారు మరియు వారు అందంగా కనిపిస్తారు.  దయచేసి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను అప్రమత్తం చేయండి.  ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఇలా అంటాడు: 'ఆయుష్మాన్ భారత్' పథకం కింద నేను మీ ఫోటో/బొటనవేలు ముద్ర వేయాలనుకుంటున్నాను.  వారి దగ్గర ల్యాప్‌టాప్, బయోమెట్రిక్ మెషిన్ మరియు దాని పేర్లన్నీ ఉన్నాయి.  లిస్ట్ చూపించి ఈ వివరాలన్నీ అడుగుతున్నారు.  ఇదంతా ఫేక్. దయచేసి అతనికి ఎలాంటి సమాచారం ఇవ్వకండి.  దయచేసి మహిళలకు చెప్పండి, ముఖ్యంగా వారు ID చూపిస్తే, దయచేసి వారిని ఇంట్లోకి రానివ్వకండి.   సమాచారం కోసం ఈ పోస్ట్ పంపుతున్నాను.  ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి మరియు  మీwhatsapp Group లేని వారికి కూడా చెప్పండి.

 అన్ని గ్రూపులకు ఫార్వార్డ్ చేయండి.🙏

Cure cateacts snd glycoma naturally


 

Swamiji


 

Panchaag


 . 

Chaar hajaar


 

Gaatram

 


శ్రీరాముని యుగంలో కనిపించిన జటాయు

 




ఇది ఒక అద్భుత సందేశం తప్పక చూడండి త్రేతా యుగంలో శ్రీరాముని యుగంలో కనిపించిన జటాయు ఇప్పుడు అయోధ్య రామ మందిరం పూర్తయిన సందర్భంగా అయోధ్య రామ మందిరానికి 200 కిలోమీటర్ల దూరంలో మళ్లీ వేల సంవత్సరాల నాటి ఈ జటాయు కనిపించి ప్రజల్ని ఉత్సాహపరుస్తుంది చూస్తూ ఉంటే మళ్ళీ రామ రాజ్యం వచ్చినట్టు అనిపిస్తుంది ఇదొక అద్భుతం అత్యంత అద్భుతం

Photo







 

పెళ్లి కి వచ్చిన అతిథులను

 



పెళ్లి కి వచ్చిన అతిథులను సాంప్రదాయబద్ధంగా కూర్చోపెట్టి బొట్టు పెట్టి హారతి ఇచ్చి సత్కరించింది భోజనం వడ్డిస్తున్నారు..  ఇప్పుడైతే కొందరు పెళ్లి కి పిలిచి భోజనం చేసి వెళ్ళండి అనే అడిగే వాళ్ళే లేరు..   పద్ధతులు అన్ని మారియిపోయి..

చందమామ పుస్తకాలు


Chandamaama Pustakaalu Pdf


 *🙏ఎవరో మహానుభావుడు 1947 జనవరి నుండి 2012 డిసెంబర్ వరకూ విడుదల అయిన అన్ని చందమామ పుస్తకాలను PDF రూపంలో తన వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. వీటిని ఎవ్వరమైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.*


*వీటిని మనం పిల్లలచే చదివించవచ్చు, లేదా మనమే చదివి వినిపించవచ్చు. దీనివలన పిల్లలకు తెలుగు చదవడం వస్తుంది, అలానే భాషపై పట్టు కూడా పెరుగుతుంది. మనం చంపేసిన ఎన్నో తెలుగు పదాలు ఈ కథలలో ఉంటాయి. కథల రూపంలో నేర్పడం కనుక, ఇది కొంత తెలికగానే ఉంటుంది.*


*అవకాశం ఉన్నవారు, మీ పిల్లలు చదువుకునే బడిలో తెలుగు బోధించే వారికి కూడా వీటిని పంపండి.*


*లింక్:-* http://granthanidhi.blogspot.com/2020/04/candamama.html?m=1


 pustakaalu PDf 💐 🦜 x

Types of switch


 

మృత్యువు జీవితంలో ఒకసారే వస్తుంది

 https://chat.whatsapp.com/FFh7mpNg6j66EOJ2nng39i

మనిషికి మృత్యువు జీవితంలో ఒకసారే వస్తుంది. భయమనే మృత్యువు జీవితమంతా వెంటాడుతూనే ఉంటుంది. మృత్యువు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే భయం కొత్తకొత్త సమస్యల్ని తెచ్చిపెడుతుంటుంది. అందుకే మృత్యువు కన్నా ప్రమాదకరమైంది భయం. జీవితంలో భయానికన్నా భయంకరమైంది లేదు. భయం దుఃఖాన్ని, బాధను, దిగులును, అశాంతినీ కలగజేస్తుంది. ఇది ఒక తీవ్రమైన భావోద్వేగ పరిణామం. అభద్రతా భావం ప్రధానంగా భయాన్ని ప్రేరేపిస్తుంది. భయం మన మనసులో చీకటిని ఆవరింపజేస్తుంది. ఆందోళన పెంచుతుంది. వందమంది మధ్య ఉన్నా మనల్ని ఒంటరిని చేస్తుంది. ఆ ఒంటరితనం మృత్యుతుల్యం. అది మానసిక బలహీనతకు ఉత్ప్రేరకమవుతుంది. పలాయనవాదానికి నాంది పలుకుతుంది. శారీరక ఆరోగ్యం మీదా దుష్ప్రభావం చూపుతుంది. ఎందరికో ముందున్న మనం, మరెందరి వెనకో పడిపోతాం. ఇతరుల్ని, చివరికి భగవంతుణ్ని సైతం నిందిస్తూ మన భయాన్ని కప్పిపుచ్చుకొంటాం. ఆత్మన్యూనతాభావం క్రమేణా అధికమవుతుంటుంది. మన అస్తిత్వ భావనకు విఘాతం ఏర్పడుతోందన్న అనుభూతి బలం పుంజుకుంటూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఆత్మస్త్థెర్యం దూరమవుతుంది.

          మనకు దైవం ఆలోచనా శక్తి ప్రసాదించాడు. యోగశక్తినీ, ధ్యానశక్తినీ ప్రసాదించాడు. వీటిని  సద్వినియోగపరచుకుంటే  భయాన్ని అవలీలగా దూరం  చేసుకోగలం. స్వామి  వివేకానంద  సందేశం   ఈ సందర్భంలో గుర్తొస్తుంది  మనకు. 'అద్భుతమైన పనులు   చేయగల  మీరు  దేనికీ భయపడవలసిన అవసరం లేదు. భయం వల్లనే బాధలు కలుగుతాయి. భయం వీడితే జయం మన సొంతం' అనే వాడాయన.మనం పరిగెత్తుతూంటే భయం మనల్ని వెంటాడుతుంది. ఎదిరించి నిలబడితే పారిపోతుంది. కురుక్షేత్రంలో బంధుమిత్రులను చంపడానికి భయపడిన అర్జునుణ్ని వాసుదేవుడు గీతాబోధ చేసి జాగృతం చేస్తాడు. శనికి శివుడు సైతం భయపడి ఏడు ఘడియలపాటు చెట్టు తొర్రలో దాక్కున్నాడు. గురువుల పట్ల భయభక్తులు కలిగివున్న శిష్యులు అపారశాస్త్ర పరిజ్ఞానం పొందగలిగారంటే- భక్తితో, గౌరవంతో భయం కలగడం వల్లనే. తనను, దైవాన్ని విశ్వసించినవాడు నిర్భయుడై ఉండగలడని ప్రహ్లాదుడంటాడు.

         చిత్తశుద్ధితో, పవిత్ర కార్యాచరణకు పూనుకొన్నవాడికి పరమాత్మ కృప లభించడంతో భయమనే బలహీనత దరికే చేరదు. మరణానికి సైతం వెరవకూడదని శుకుడు పరీక్షిత్తుకు ప్రబోధిస్తాడు. అచంచల కృష్ణ భక్తురాలు మీరాబాయి కారాగారంలో నిర్భీతితో విషం తాగి తన కృష్ణ ప్రేమను చాటుకుంది. బరువెక్కువైన ఓడ నీట మునిగినట్టే, అధిక భయం కలవారు శోకసముద్రంలో మునిగిపోతారంటాడు వాల్మీకి మహర్షి. నిర్భయుడు సునామీ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు. భయస్థుడు తాటాకు చప్పుళ్లకే బెదిరిపోతాడు.

       ప్రకృతి శక్తులకు భయపడక సుమతి సూర్యాస్తమయాన్ని తన పతి ప్రాణరక్షణ కోసం నిరోధించింది. సావిత్రి యముడి వెంట పడి తన భర్తను సజీవుణ్ని చేసుకోగలిగింది. ధ్రువుడు బాల్యంలోనే అరణ్యాల్లో క్రూర మృగాలకు సైతం వెరపు చెందక, తపస్సు చేసి ద్వాదశాక్షర మంత్రజపంతో ధ్రువతారగా వెలుగొందాడు.

     దైవానికి, గురువుకు, ధర్మానికి, నీతికీ, సమాజానికీ, చట్టానికీ భయపడటం అవసరమే. అది మితమై ఆదరణ, విశ్వాసం, శ్రద్ధతో కూడి ఉండాలి. అదే భయంతో నిరాశా నిస్పృహలు సృష్టించుకుని, బెంబేలెత్తి, కుంగిపోకూడదు. పెద్దలు పిల్లల్ని భయపెట్టడంలో ప్రేమ ఉండాలి, క్రోధం, ఆవేశం ఉండకూడదు. వారి వృద్ధే లక్ష్యమై ఉండాలి. అర్థం, అవసరం లేని భయం పిన్నల్ని పిరికివాళ్లను చేస్తుంది. అసమర్థుల్ని చేస్తుంది.

   భయమనే సంక్లిష్ట వికారం యువతను నిర్వీర్యం చేస్తుంది. అధార్మికుడు, నిత్యశంకితుడు, దుర్వ్యసనపరుడు, అనైతికుడు, శీలరహితుడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. జీవితమంతా చరిత్రహీనుడిగానే మిగిలిపోతాడు. ప్రతి చిన్న సమస్యకూ భయపడేవాడు జీవితంలో ఏదీ సాధించలేడు. మరణ సమయంలోనూ భయరహితుడే ఆధ్యాత్మిక చక్రవర్తి. వైక్లబ్యం వీడితేనే మోక్ష సౌలభ్యం. నిర్భయమనే పునాది పైనే జీవన సాఫల్య సౌధం దృఢంగా నిలబడగలుగుతుంది.

    భయపడటం, భయపెట్టడం- రెండూ ఆత్మద్రోహాలే. అదుపు తప్పిన భయం మనసును కుదిపివేస్తుంది. నిర్భీతితో మనిషి తలెత్తుకోగలిగే స్వేచ్ఛాప్రపంచంలో ఈ దేశాన్ని జాగృతం చెయ్యమని భగవంతుణ్ని ప్రార్థిస్తాడు రవీంద్రుడు 'గీతాంజలి'లో. మొహమాటం, సంకోచం, జంకు, బెదురు, అనుమానం మొదలైన అవలక్షణాలుగల భయాన్ని విసర్జిస్తే అఖిలేశుడి అభయహస్తం ఎప్పుడూ మనకు సమస్త సుఖశాంతులనే ఇస్తుంది.

తాను మాత్రం చిరంజీవినని

 'ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది?' అన్నది యక్షుడి ప్రశ్న. 'నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటూంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది?' బదులిస్తాడు యుధిష్ఠిరుడు.

         ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి మనిషికి క్షణం కూడా తీరికలేదు.

                  మనిషికి తన పుట్టుక గురించి తెలుసు. కాని, మరణం గురించి బొత్తిగా తెలియదు. దాన్నించి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు. చనిపోయాక ఏమవుతుంది? మరణం తరవాత మనిషి ఎక్కడికి వెడతాడు? అసలు మానవ జన్మకు ప్రయోజనమేమిటి? ఆత్మ అన్నది ఉన్నదా? శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెడుతుంది?

        జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికీ ఎదురయ్యే ప్రశ్నలివి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబుల గురించి అన్వేషించడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బుచేసినా, ఆఖరి క్షణాలు ఆసన్నమవుతున్నా- ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలా అన్న ఆలోచనే తప్ప, జన్మాంతర జీవితం గురించి తలంచడు.

              వాస్తవంగా తల్లి గర్భంలో పడినప్పటినుంచి మరణంవైపు మనిషి ప్రయాణం ఒక్కొక్క అడుగే సాగుతూంటుంది. ఓ క్షణం ముందుకు నడుస్తోందంటే ఆయుష్షులో ఓ క్షణం తరిగిపోతున్నట్టే కదా! బ్రహ్మ జ్ఞానులకు ఇది అసంబద్ధమనిపించదు. ఎందుకంటే, మరణానంతర జీవితం గురించి మన వేదాలు ఘోషిస్తున్నాయి కనుక. ఈ జీవితం ఎంత ముఖ్యమో, ఆ జీవితమూ అంతే అవసరం!

     కొన్ని మతాలు మరణానంతర జీవితం గురించి భయపెడుతుంటాయి. జీవితం ఎంత స్వేచ్ఛాసుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో ముగించవచ్చని మన వేదాలు చెబుతున్నాయి.

           కొందరు మతస్తులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని, మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్తు రూపేణా దొరికే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించేయాలని బోధిస్తారు. మనిషికొకే జన్మ అని అనుకోవటంలో ప్రమాదమే అది. రేపో, ఎల్లుండో ఎలాగా పోతాం కనుక త్వరత్వరగా అన్నీ అనుభవించేయాలని పిచ్చి పరుగులు పెడుతుంటారు వాళ్ళు.

          వేద పరిజ్ఞానమున్నవారిని మరణం భయపెట్టదు. వస్తురూపంగా చవిచూసే గుణాలకన్న మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం. జీవితం దారి జీవితానిదే! మరణం దారి మరణానిదే! మరణం జీవితానికి ఆఖరిమెట్టు. ఆత్మ జీవితం అనంత వాహిని. ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే! ఆత్మకు చావులేదు.

      భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 'అర్జునా! ప్రతి దేహంలో నివసించే దేహి లేక ఆత్మ నిత్యుడు. అవధ్యుడు. మరణమనగా దేహంనుంచి దేహి బయటికి వెళ్ళడం. దేహం ధరించే వస్త్రం లాంటిది. ఈ రెండింటి సంయోగం క్షణికమే! పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించటం వంటిదే! ఆత్మ తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది' అని స్పష్టంగా చెప్పాడు.

       ఏదో క్షణంలో ఈ జీవితం ముగిసిపోవచ్చు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరక్కుండానే సమయం అంతం అయిపోవచ్చు. అందుకే, వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. అప్పుడే ఈ మానవ జన్మకు ముక్తిమార్గం లభ్యమవుతుంది. దివ్యజ్ఞానం దక్కుతుంది. ఈ ఆత్మ పరమాత్మకెంతో దగ్గరని అర్థమవుతుంది.

ఆలోచనాలోచనాలు

 ;;;;; ఆలోచనాలోచనాలు ;;;;;          -----౦ సంస్కృత సూక్తి సుధ ౦----                            ***** దరిద్రాయ కృతం దానం, శూన్య లింగస్య పూజనమ్! అనాథ ప్రేత సంస్కారమ్, అశ్వమేధ సమం విదుః !!                        దరిద్రం తో బాధపడేవారికి చేయబడిన దానము, పూజాపునస్కారాలు లేని శివలింగానికి చెయ్యబడిన పూజ, దిక్కు లేని అనాథ శవానికి చెయ్యబడిన అంత్యక్రియలు ( ఈ మూడు పనులు) అశ్వమేధ యజ్ఞం చేసిన పుణ్యంతో సమానం.              ***** జనితా చోపనీతాచ, యశ్చ విద్యాం ప్రయచ్ఛతి,     అన్నదాతా, భయత్రాతా.       సచైతే పితర స్మ్రతాః!!         తనకు జన్మనిచ్చినవాడు, ఉపనయనం (వడుగు) చేసినవాడు, అన్నం పెట్టినవాడు, ఆపదలో ఉండగా భయాన్ని పోగొట్టి రక్షించినవాడు ఈ ఐదుగురు తండ్రులుగా పరిగణింపబడతారు.             ***** అతిథౌ తిష్ఠతి ద్వారే    హ్యాపో గృహ్ణాతియో నరః!      ఆపోశనం సురాపానం,           అన్నం గోమాంస భక్షణమ్!!    వాకిట్లో అతిథి ఆకలితో ఉండగా , అతణ్ణి విడిచి గృహస్థు అన్నం తినేముందు పట్టే ఆపోశనం కల్లు సేవనంతో సమానం. అతడు భుజించే ఆహారం గోమాంసంతో సమానం. అతిథిని విడిచి భోజనం చెయ్యడం పాపకృత్యమని పెద్దల వాక్కు.                                 ***** పితాచ ఋణవాన్ శత్రుః, మాతాచ వ్యభిచారిణీ! భార్యా రూపవతీ శత్రుః, పుత్రశ్శత్రురపండితః!!           ఋణవంతుడైన తండ్రి, వ్యభిచరించే తల్లి, మిక్కిలి రూపవతి అయిన భార్య, విద్యావంతుడుగాని కుమారుడు , వీరంతా శత్రువులవంటివారు.                 ***** జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ,   జిహ్వాగ్రే మిత్ర బాంధవాః!      జిహ్వాగ్రే బంధనం ప్రాప్తిః,       జిహ్వాగ్రే మరణం ధ్రువమ్!!    మంచిమాట వలన లక్ష్మీ ( సంపదలు) కలుగుతాయి. మంచి మాటలవలన మిత్రులు మరియు బంధువులు ఏర్పడతారు. సరియగు మాట లేమితో కారాగారవాసం లభించవచ్చు. చెడుమాట కారణంగా మరణం కూడా ప్రాప్తించవచ్చు. కాబట్టి మాటల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం.       చివరగా ఒక చమత్కార శ్లోకం తో ముగిద్దాం.                ***** వైద్యరాజ నమస్తుభ్యం, యమరాజ సహోదర! యమస్తు హరతి ప్రాణాన్, వైద్యః ప్రాణాన్, ధనానిచ!!                                యమధర్మరాజు సోదరుడవైన ఓ వైద్యరాజా! నీకు నమస్కారము. యమధర్మరాజు కేవలం ప్రాణాలు మాత్రమే కొనిపోగలడు. తమరు ధనాన్ని మరియు ప్రాణాన్ని రెండింటినీ తొలగించగల సమర్థులు.                            తేది 8--10--2023, ఆదివారం, శుభోదయం.

Photo

రామ మహాయంత్రం

 



అయోధ్య రాముడి గర్భాలయ మూలవిరాట్ కింద ప్రతిష్టించ బోతున్న రామ మహాయంత్రం తెనాలి ప్రజల అదృష్టవశాత్తు ఒక్క అరగంట ప్రజల సందర్శనార్థం అంగలకుదురు దాసకుటి లో ఉంచారు..

దాన్ని రేపు మధ్యాహ్నం కల్లా విమానంలో అయోధ్య చేరుస్తారు..

దేశంలో ఎవరికీ దక్కని తెనాలి కి దక్కడం రాముడి వరం మాత్రమే..

మీరు అయోధ్యలో రామ మందిరం ప్రారంభం తరువాత రాముడిని చూడగలరు కానీ మేము రాముడి పాదపీఠం క్రింద ప్రతిష్ట చేయబోయే రామయంత్రాన్ని దర్శించుకున్నాము..

అది ప్రతిష్ట చేసిన తర్వాత ఇక దాన్ని దర్శించడం దుర్లభం..దర్శించుకోండి...

జై శ్రీరాం..🙏🙏🙏🙏🙏

Notary documents


 

Purpecual motion


 

Stitching technique


 

మహా శివరాత్రి కి కాశీ యాత్ర.

 08.03.2024 తేదీ శుక్రవారం 

మహా శివరాత్రి కి కాశీ యాత్ర.


3000 రూ.లకే 10 రోజులు కాశీ యాత్ర.

( 9రాత్రులు కాశీ వాసం)


3.3.2024 నుండి 14.03.2024 వరకూ 


 రైలు టికెట్స్ కొరకు తేదీలు మార్చ బడును.


3rd A/C టికెట్స్ కావలసిన వారు

అదనంగా 3000 చెల్లించాలి.


ఈ యాత్రకు రాదలచిన వారు 

ఈ సమాచాారాన్ని చదువుకున్న తర్వాత మాత్రమే

వివరాలకు.. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు ఈ.. 98663 77208. పోన్ చేయండి.

        ###############


ఈ యాత్ర కు రాదలసివారు 30.10.2023 లోపు 

 టికెట్స్ బుక్ చేసుకో వలయును. అక్టోబర్ 30 లోపు

  ################


రైలు పేరు/నెంబరు. దానాపూర్/12791. ప్రతీ రోజు

సికింద్రబాద్ లో ఉ.9 గంటలకు రైలు బయలు దేరును.

            """"""""''"""’""""""""""""""""""''''"""'''"""""""'''''"'

బెంగుళూరు,గుంతకల్లు నుండి వచ్చువారీకి 

రైలు పేరు/నెంబరు. మైసూర్ ఎక్స్ 22687.

 మంగళవారం, గురువారం మాత్రమే  

    xxxxxxxxxxxxxxxxxxxxx 


తిరుపతి, కాట్పాడి,చెన్నయ్,గూడూరు, విజయవాడ,రాజమండ్రి,భీమవరం ల నుండి వచ్చు వారికి వివిధ మార్గాల్లో రైళ్లు ఉన్నవి. కాళీ ఉన్న రైలుకు టికెట్స్ తీయబడును.


*************************


ఈ యాత్రలో కల్పించు సౌకర్యాలు.....


1.కాశీకి రాను పోను స్లీపర్ రైలు టిక్కెట్లు

2.కాశి రైల్వే స్టేషన్ నుండి ఆశ్రమానికి వెళ్ళుటకు

 ఆటో చార్జీలు. (ఒక వైపు మాత్రమే)

3.వసతి.. కామన్ హాల్, నేలపై పడుకొనుటకు చాపలు ఇవ్వబడును.

4. పది రోజులు  శ్రీకంఠ ఋష్యాశ్రమం లో మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ ఏర్పాటు చేయబడును.

5.స్పెషల్ రూమ్ లు  , డార్మేటరి బెడ్స్ కావలసిన వారు  ఎగస్ట్రా  సొమ్ము చెల్లించి బుక్ చేసుకొనవచ్చును.

6.మీకు  రైలు ఎక్కు స్టేషన్ నుండి కాశీ కి టికెట్ ఇవ్వబడును.

7. మీరే రైలు ఎక్కి కాశీ చేరుకొనవలెను. కాశీ రైల్వే  స్టేషన్ నుండి వసతి గృహానికి మేమే తీసుకు వెళతాము.

          ##################


ప్రత్యేక రూములు,ఇతర సౌకర్యాలు కావలసిన వారు తగిన రుసుము చెల్లించి పొందవచ్చును.


ఒక రూమ్  (విత్ అటాచ్డ్ బాత్ రూం) ఒక రోజుకు 1000  రూపాయిలు.(4 గురికి మాత్రమే.)


6,8,10,మందికి సరిపడు రూమ్ లు కలవు. మనిషికి రోజుకు 200/-


చుట్టూ ప్రక్కల ఆలయాలు దర్శించుటకు వాహనములు ఏర్పాటు చేయబడును.

కాశీలో ఆలయాలు మీరే స్వయంగా వెళ్లి ఆలయాలు దర్శించుకుని రావలెను. 

గైడు కావలసిన వారికి ఏర్పాటు చేయగలము.

         ₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹


కాశీకి బయలుదేరు రైలు ఈ క్రింది స్టేషన్లో ఆగును 

మీకు దగ్గరగా ఉన్న స్టేషన్లో రైలు ఎక్కవచ్చును.


సామాన్య ప్రజలకు కూడా కాశీని చూపించాలని శ్రీకంఠ బాబాజీ వారు అతి తక్కువ ధరకు కాశీ యాత్రను సంకల్పించారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

               xxxxxxxxxxxxxxxxxxxxxx


హైదరాబాద్ నుండి వచ్చు వారికి.

సికింద్రాబాద్, కాజీపేట,పెద్దపల్లి, రామగుండం,మంచిర్యాల,

బెల్లంపల్లి,సిర్పూర్ కాగజ్ నగర్, బళార్ష,చంద్రపూర్ , సేవగ్రామ, నాగపూర్ లలో ఈ రైలు ఆగును.

                    ################

తిరుపతి , కాట్పాడి వైపు నుండి వచ్చు వారికి చెన్నయ్,పెరంబుర్, గూడూరు,నెల్లూరు,ఒంగోలు,తెనాలి,విజయవాడ,ఖమ్మం,వరంగల్, రామగుండం,స్టేషన్ లలో రైలు అగును.

                ####################

గుంతకల్లు వైపు నుండి వచ్చు వారికి 

బళ్ళారి,గుంతకల్లు,అదొని,మంత్రాలయం, రాయచూర్, యాదగిరి, వాడి, స్టేషన్ లలో రైలు అగును 

        ###############


కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దర్శన ప్రాప్తి రస్తు.

_తలెత్తి చూడు_*

 *_తలెత్తి చూడు_*

*_చేయెత్తి జైకొట్టు..!_*


✈️✈️✈️✈️✈️✈️✈️

 

*వాయుసేన దివస్*


🛫🛫🛫🛫🛫🛫🛫


*_నింగిని ముద్దాడు సగర్వంగా.._*

ఇదే స్ఫూర్తితో 

ఉద్భవించిన మహాశక్తి..

భారత సైనిక అఖండకీర్తి..

*_వాయుసేన_*

నేలపై కదం తొక్కే సైన్యానికి

*_నింగిలో దన్ను.._*

*_దేశానికి వెన్ను.._*

గగనతలం నుంచి 

*జాతిని కాచే గన్ను..!*


అమెరికా..చైనా..రష్యా

వీటితో సమానమైన పవర్

*భారత వాయుదళం..*

ఈ పేరు చెబితేనే

శత్రుదేశాలకు ఫీవర్..

సువిశాల భూమికి

నింగిలో కవర్..

*_పదునాలుగు వందల_*

*_విమానాల సూపర్ ఫైటర్!_*


ఎన్ని యుద్ధాలు..

ఇంకెన్ని విజయాలు..

రెండో ప్రపంచ 

యుద్ధం మొదలు..

*సినో ఇండియన్ వార్..*

*ఆపరేషన్ కాక్టస్..*

*ఆపరేషన్ విజయ్..*

*కాంగో క్రైసిస్..*

*ఆపరేషన్ పూమలై..*

*ఆపరేషన్ పవన్..*

అన్నిటినీ మించి

*_బంగ్లా విముక్తి..కార్గిల్_* సహా

దాయాది పాకిస్తానుపై

*ఎన్ని  యుద్ధాలో..*

*అన్ని విజయాలు..!*


సాక్షాత్తు రాష్ట్రపతి అధిపతిగా 

ఎగిరే దళం..

విజయయాత్రలు సాగించింది

తలఎత్తి చూసేలా భూగోళం..

యుద్ధ సమయంలోనే గాక

ప్రతి విపత్తులో కాచే 

మన వాయుసేన

మహావిజయాలకు

శిరసు వంచి మొక్కుదాం..

అద్భుత విన్యాసాలను

తల ఎత్తి చూద్దాం..!


_____________________


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

     9948546286

నవగ్రహా పురాణం🪐* . *47వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *47వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*బుధగ్రహ జననం - 10*


రాక్షసరాజు వృషపర్వుడి కొలువుకూటం. రాక్షస ప్రముఖులు , వాళ్ళ గురువు ఉశనుడు ఉన్నారు. రాక్షస చారుడు తిమిరాసురుడు వచ్చి , వృషపర్వుడికి నమస్కరించాడు.


*"తిమిరా ! వినదగిన వార్త తెచ్చావా ?"* వృషపర్వుడు ప్రశ్నించాడు..


*“మన కులానికి మహదానందం కలిగించే వార్త తెచ్చాను దేవరా ! చిత్తగించండి !"* తిమిరాసురుడు ఉత్సాహంగా అన్నాడు. అందరూ చెవులు రిక్కించారు.


*"దేవతల గురువు బృహస్పతి భార్య తారను ఆయన శిష్యుడు 'చంద్రుడు' అనే కుర్రవాడు అపహరించి తీసుకెళ్ళి , తన మందిరంలో పగలూ రేయీ ఆ వగలాడితో కులుకుతున్నాడు. తన భార్యను తిరిగి తన వద్దకు పంపమంటూ ఆ దేవగురువు పంపిన రాయబారాలు ఫలించలేదు. ఆ చంద్రుడు అడ్డం తిరిగాడు. గురువుకోసం ఇప్పుడు దేవేంద్రుడు రంగంలోకి దిగాడు. చంద్రుడితో యుద్ధం చేసి అయినా సరే గురుపత్నిని తెచ్చి అప్పగిస్తానన్నాడు..."*


*"చాలు !"* వృషపర్వుడు విసుగ్గా అన్నాడు. ఎవడో శిష్యుడు గురువు భార్యను చంకనెట్టుకుపోతే మనకేమిటిరా ? ఇతర వార్తలుంటే విన్నవించుకో !"* 


*"ఆగు వృషపర్వా ! ఒక్క క్షణం ఆగు"* ప్రక్కనే ఉన్న ఉశనుడు అన్నాడు. *"ఇది. మనం అతి జాగరూకతతో గమనించవలసిన కీలక సమాచారం. తిమిరా , విషయం పూర్తిగా విన్నవించు ! ఇంద్రుడు ఏం చేయబోతున్నాడు ?"*


*"చిత్తం గురూ ! దేవదూతను ఆ చంద్రుడి వద్దకు రాయబారం పంపిచారని అంటూంటే విని , పరుగెట్టుకొచ్చాను ?"* 


ఉశనుడు తటాలున ఆసనం మీద నుంచి లేచాడు. *"వృషపర్వా , నేను వెళ్ళాలి."*


*"ఎక్కడికి గురుదేవా ?"* వృషపర్వుడు ఆశ్చర్యంగా అడిగాడు. *"చంద్రుడి మందిరానికి !"* ఉశనుడు ముక్తసరిగా అన్నాడు.


*"చంద్రుడి మందిరానికా ? మీరా ?!"* వృషపర్వుడు ఆశ్చర్యంగా అడిగాడు.


*"ఎందుకు ? ఎందుకు గురుదేవా ?".*


*"ఇంద్రుడి దౌత్యానికి చంద్రుడు లోబడకుండా చేయడానికి...”* 


*"ఎందుకు ?"* వృషపర్వుడు కళ్ళు చిట్లించాడు..


*"చంద్రుడు తిరగబడితే, తన మాట వినకపోతే - ఇంద్రుడు ఏం చేస్తాడు ?".* ఉశనుడు ప్రశ్నించాడు. 


*"ఏం చేస్తాడు ? ఆ చంద్రుడి మీదికి యుద్ధానికి వెళ్తాడు.”*


*“ఆ సందర్భంలో మనం చంద్రుడికి బాసటగా నిలబడితే ?"* ఉశనుడు చిరునవ్వుతో అడిగాడు.


వృషపర్వుడు మాట్లాడకుండా కనుబొమలు ముడివేశాడు.


*"ఇంద్ర , చంద్రుల యుద్ధం - ఒక్కసారిగా దేవదానవ యుద్ధంగా మారిపోతుంది ! దేవతలకూ , మనకూ యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది వృషపర్వా ?”* 


*"దేవతలు ఛిన్నాభిన్నమైపోతారు !"* వృషపర్వుడు సగర్వంగా అన్నాడు.


*"ఫలితంగా ఆ 'సురవైభవం” అసురవైభవంగా , ఇంద్రభోగం వృషపర్వభోగంగా పరిణమిస్తాయి"* అంటూ ఉశనుడు ఠీవిగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు. రాక్షసులందరూ ఆయనను ఆశ్చర్యంగా చూస్తున్నారు.


*"మీరు... ఎవరు ?"* తన ముందు ఠీవిగా నిలుచున్న వ్యక్తిని చూస్తూ ప్రశ్నించాడు. చంద్రుడు.


*"అసుర గురువు ఉశనాచార్యులను నువ్వు దర్శిస్తున్నావు , చంద్రా !"* 


చంద్రుడి చేతులు అసంకల్పితంగా కదిలి , కలిసి , ఉశనుడికి వందనం చేశాయి. *"నాతో పని ఉండి దయచేశారా ?"*


*"ఆపద నుండి నిన్ను రక్షించడానికి వచ్చాను , చంద్రా !"* ఉశనుడు గంభీరంగా అన్నాడు..


*"ఆచార్య... ఆపదా ?!"* చంద్రుడు ఆందోళనగా అన్నాడు.


*"ఔను. నీకూ , నీ ప్రియురాలు తారకూ... ఏకాంతంలో మీ ఇద్దరికీ అంతా చెప్తాను. ఏదీ ఆ సాహస వనిత ?"* ఉశనుడు చొరవగా దారితీస్తూ అన్నాడు..


*"మీ ఇద్దర్నీ దుర్మార్గంగా విడదీసే ప్రయత్నం జరుగుతోంది...”* తన ఎదురుగా జంట పక్షుల్లా కూర్చున్న తారాచంద్రుల్ని చూస్తూ అన్నాడు ఉశనుడు. 


ఇద్దరి ముఖాల్లోనూ ఆందోళన జంట అద్దాల్లో ప్రతిబింబంలా ప్రత్యక్షమైంది.


*"గురుదక్షిణగా తారను బృహస్పతికి అప్పగించడానికి ఇంద్రుడు ప్రతిజ్ఞ చేశాడు. మిమ్మల్ని భయభ్రాంతుల్ని చేయడానికి త్వరలో ఒక దూతను పంపుతాడు..."* అంటూ చంద్రుడి వైపు ప్రత్యేకంగా చూశాడు ఉశనుడు.


*"మాట విని మర్యాదగా తారను అప్పగించకపోతే , దైవసైన్యం నీ మందిరం మీద దాడి చేసి , సర్వనాశనం చేస్తుందని హెచ్చరిస్తాడు దూత..."*


చంద్రుడు ఆందోళనగా తార వైపు చూస్తూ , ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశాడు.


*"చంద్రా ! ఆ హెచ్చరికలకూ , బెదిరింపులకూ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆశించి , అపహరించుకు వచ్చిన ఈ అందాలరాశిని ఆ సురగురువుకు అప్పగించాల్సిన అవసరం లేదు. ”*


*"ఆచార్యా... దేవ సైన్యాన్ని నేను...”*


*"ఎదిరించవలసిన పనిలేదు ! ఆ పనిని , నీ కోసం - నా ప్రియశిష్యుడూ , రాక్షసరాజ అయిన వృషపర్వుడి ఆధ్వర్యంలో అశేష అసురసైన్యం చేస్తుంది ! తారాచంద్రుల వైపు కన్నెత్తి చూడనివ్వకుండా సురసైన్యాన్ని తరిమికొడుతుంది ! భవిష్యత్తులో కూడా , నా ఆధ్వర్యంలో రాక్షసబలగం మీకు వెన్నుకాపుగా ఉంటుంది !"*


తారాచంద్రులు ఉత్సాహంగా , ధైర్యంగా చూశారు. అప్రయత్నంగా చేతులు జోడించారు.


*" ఆచార్యా ! మా ప్రేయసీ ప్రియుల మీద మీ ప్రేమ మమ్మల్ని కదిలించి వేస్తోంది ! మేం ధన్యులం !"* చంద్రుడు ఆవేశంగా అన్నాడు. 


*"ఈ ఉశనుడు ఎప్పుడూ సత్యమే పలుకుతాడు , ఆత్రేయా ! సమస్త దానవ సైన్యమూ నీ పక్షాన నిలవడానికి కారణం - మీమీద మమకారం కాదు. దేవతల మీద పగ !”* అంటూ ఉశనుడు పైకి లేచాడు.


తారాచంద్రులూ లేచారు. ఉశనుడు చంద్రుడి కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. *"చంద్రా ! ఇంద్రుడి మాటలకు లోబడకు. బెదిరింపులకు భయపడకు. చేవ ఉంటే యుద్ధం చేసుకొమ్మను. నిన్ను నమ్మి వచ్చిన ఈ కళ్యాణికి అన్యాయం చేయకు. విజయోస్తు !"* అంటూ మందిరంలోంచి నిష్క్రమించాడు.


ఉశనుడి మంత్రాంగం తారాచంద్రుల మీద వశీకరణ మంత్రంలా పనిచేసింది. ఇంద్రుడి దూత వచ్చాడు. చంద్రుడి చేత అవమానింపబడి , తల వాల్చుకుని వెళ్ళాడు. గురువుకు వాగ్దానం చేసిన విధంగానే ఇంద్రుడు సైన్యాన్ని సమాయత్త పరచి , చంద్రుడి మీద యుద్ధం ప్రకటించాడు. మాతలి సారధ్యంలోని తన రథం మీద బృహస్పతిని తీసుకుని , స్వయంగా చంద్రమందిరం వైపు బయలుదేరాడు. దేవేంద్రుని వెనక దేవసైన్యం సమరోత్సాహంతో ఉరకలు వేసింది.


చంద్ర మందిరాన్ని సమీపిస్తున్న ఇంద్రుడిని , ఆయన సైన్యాన్నీ అక్కడి దృశ్యం నిలువెత్తు ఆశ్చర్యంలో ముంచి వేసింది. తారాచంద్రులు విడిది చేసిన మందిరానికి చుట్టూ కట్టని గోడలా , పెట్టని కోటలా వేల సంఖ్యలో రాక్షస సేన మోహరించి ఉంది. భయం కలిగించే ఆ సైన్యం ముందు రాక్షసరాజు వృషపర్వుడూ , రాక్షసాచార్యుడు ఉశనుడూ ఉన్నారు.


దేవతల సైన్యం గోచరించగానే రాక్షసుల చేతులలోని రకరకాల మారణాయుధాలు ఒక్కసారిగా పైకి లేచాయి. వేలాది కంఠాలు ఒక్కసారిగా చేసిన యుద్ధనాదం... ఆకాశమంతటా గొలుసు ఉరుముల ధ్వనిలా మారు మ్రోగింది.


సరిగ్గా ఆ సమయానికి ఆకాశమార్గంలో వెళ్తున్న నారదుడు అదిరిపడి , చేస్తున్న నారాయణ నామగానాన్ని ఆపి , కిందికి సారించాడు , తన చూపుల్ని , దేవదానవ సైన్యాన్నీ , దానవ సైన్యం రక్షణలో ఉన్న చంద్ర మందిరాన్ని చూడగానే ఆయనకు అంతా అర్థమైపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతర్థానమై పోయాడు నారదుడు.


ఆకాశంలో అంతర్థానమైన నారదుడు మరుక్షణం బ్రహ్మదేవుడి ముందు నిలుచున్నాడు. తారాచంద్రులు కేంద్రబిందువుగా జరగబోతున్న దేవ దానవ యుద్ధమనే అవాంతరాన్ని వివరించాడు. బ్రహ్మ ఆందోళనతో తన పద్మాసనం మీంచి దిగాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-68🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-68🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

🌊 *తిరుమల పుష్కరిణి*🌊


శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానంచేసి, స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం అయిన తిరుమలకొండ మీదకు వేంకటేశ్వరుడు దిగివచ్చేవేళ, తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. 


తారకాసురుని వధించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది. 


ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు, ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నదీ గమనార్హం

తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారు నెలవై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో యేళ్ల చరిత్ర ఉంది.


స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతుంటుంది. ప్రతి యేడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తొమ్మిది తీర్థాలున్నాయి.


శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థం, గాలవతీర్థం, మార్కండేయ తీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, వశిష్ట తీర్థం, వరుణ తీర్థం, వాయు తీర్థం, సరస్వతి తీర్థం ఇలా మొత్తం ఏడు తీర్థాలున్నాయి. అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం.


*కుబేర తీర్థం..* శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన ధనద తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఇది కుబేర తీర్థం అని కూడా పిలువబడుతోంది. ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే చాలు సర్వపాపాలు నశించడమే కాదు ధన, ధాన్యాది సంపదలన్నీ సంప్రాప్తిస్తాయి.


*గాలవ తీర్థం..* స్వామి పుష్కరిణిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంది. ఇది గాలవ మహర్షిచే నిర్మితమైంది. ఈ భాగంలోని తీర్థాన్ని త్రాగినా, లేదా ఇందులో స్నానం చేసినా ఇహ, పర సుఖాలు రెండూ సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.


*మార్కండేయ తీర్థం...* శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిందే మార్కండేయ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుస్సు కలుగుతుంది.


*అగ్ని తీర్థం - యమతీర్థం...* వేంకటాచలం మీది స్వామి పుష్కరిణిలో ఆగ్నేయమూలలో అగ్ని దేవునిచే స్థాపించబడిన ఆగ్నేయ తీర్థం ఉంది. ఇందులో స్నానం చేసినట్లయితే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.

అలాగే యమతీర్థం దక్షిణ భాగంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే మానవునికి నరక బాధ తప్పుతుంది.


*వసిష్ట తీర్థం...* వసిష్ట మహర్షిచే నైరృతి దిశలో నిర్మింపబడిన వసిష్ట తీర్థం కూడా ఈ స్వామి పుష్కరిణిలో భాగంగానే ఆవిర్భవించింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగుతాయి.


*వరుణతీర్థం - వాయుతీర్థం..* స్వామి వారి పుష్కరిణిలో పడమట వరుణతీర్థం, వాయుమూలన వాయుతీర్థంలు ఉన్నాయి. ఈ తీర్థాలు ముక్తిని కలిగిస్తాయి.


*సరస్వతి తీర్థం...* కలియుగ వైకుంఠుని పుష్కరిణి మధ్య భాగంలో మహాపాతకాలను నాశనం చేసేటటువంటి సరస్వతి తీర్థం ఉంది.


ఈ తొమ్మిది తీర్థాలలో ఒకేరోజున స్నానం చేసిన తర్వాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో కొలువై ఉన్న శ్రీనివాస భగవానుని దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అంటే మోక్షం కలుగుతుంది.


స్వామి వారి పుష్కరిణి స్నానం, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం, విష్ణు సహస్ర నామ పారాయణం ఈ మూడు కార్యాలు అత్యంత ఉత్తమమైన తప ఫలాన్ని కలిగిస్తాయి. అందువల్ల తొమ్మిది తీర్థాల నెలవుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పక స్నానం చేస్తుంటారు భక్తులు. ఆ తర్వాత అక్కడే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటుంటారు. అలా ఒకవేళ చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినప్పటికీ అవన్నీ ఈ నిష్ఫలాలే అవుతాయని పురాణాలు చెబుతున్నాయి.


వేంకటాచలం మీది ఈ స్వామి పుష్కరిణి ఒకానొకప్పుడు దశరథ మహారాజు సేవించుకుని సంతానాన్ని పొందాడు. ఆ తర్వాత శ్రీరామ చంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని రావణాసురుని చేత అపహరింపబడిన సీతాదేవిని పొందాడు.


తీర్థాలన్నీ పుష్కరిణిలోనే ఉన్నాయి. పుష్కరిణిలో మూడుసార్లు మునకేస్తే చాలు సర్వం శుభమే


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 47*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 47*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*భ్రువౌ భుగ్నే కించిద్భువన భయ భంగవ్యసనిని*

*త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణమ్ |*

*ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః*

*ప్రకోష్టే ముష్టౌచ స్థగయతి నిగూఢాంతర ముమే ‖* 


అమ్మా ఉమా 

భ్రువౌ భుగ్నే కించిత్ = కొద్దిగా వంగిన నీ కనుబొమలు


త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ప్రకోష్టే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరమ్ = రెండు కనుబొమలు కలిసి వాటి మధ్యను సౌందర్యాధిపతియైన మన్మధుడు తన కుడిచేతితో పట్టుకొన్న చెరకు విల్లు వలె ఉన్నదట. 

ఆమె నేత్రములు మన్మధుడు వదలబోయే పుష్పబాణముల వలే వాటిలోని మధువు కొరకు తేనేటీగలు ఝుమ్మని ముసురుకొంటున్నట్లు ఉన్నదట.  


భువన భయ భంగవ్యసనిని = లోకముల భయమును తొలగించే వ్యసనము (అలవాటు) కల తల్లియట ఆమె. అమ్మవారి కన్నులు కరుణ రసాన్ని కురిపిస్తున్నాయని భావం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

మహాభారతములో - ఆది పర్వము* *ద్వితీయాశ్వాసము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *ద్వితీయాశ్వాసము*


                      *17*


*ద్వితీయాశ్వాసము లోని ప్రధానాంశాలు*


ఈ అశ్వాసమునందు, గరుడుని కథ, దేవదానవులు సముద్రము మదించి అమృతము సాధించుట, దేవదానవ యుద్ధం, వినతా దాస్యం, నాగుల శాపం, గరుడుని జననం, వినతా దాస్య విముక్తి, పరీక్షిత్తు మహారాజు శాపం, సర్పయాగ విశేషాలు వర్ణించ బడ్డాయి.


*నాగులకు శాపము*


కశ్యప ప్రజాపతి భార్యలైన వినతా, కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కోరారు. కశ్యపుడు వారిని మీకు ఎలాంటి పుత్రులు కావాలి అని అడిగాడు. కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు వెయ్యి మంది కావాలని కోరింది. వినత తనకు వారి కంటే బలవంతులైన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది. పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేసాడు. యాగ ఫలితంగా కద్రువకు వెయ్యి అండాలు వినతకురెండు అండాలు కలిగాయి. ముందుగా కద్రువ అండాలు పక్వం చెంది వెయ్యి మంది నాగ కుమారులు జనించాయి. అందుకు వినత ఉక్రోష పడి తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదమింది. దాని నుండి సగము దేహంతో జన్మించిన అనూరుడు ఎందుకు అమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు. నీ వలన నేను సగం దేహంతో పుట్టాను. ఈ దేహం కలిగినందుకు కారణమైన నీవు నీ సవతికి దాసివి అగుదువుగాక అని శపించాడు. ఆ తరువాత తాను సూర్యునికి సారథిగా వెళ్ళాడు. అనూరుడు వెళుతూ తన తల్లితో అమ్మా రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు. దాని నుండి పుట్టేవాడు మహా బల సంపన్నుడు. అతడి వలన నీకు దాస్య విముక్తి కాగలదు అని చెప్పి వెళ్ళాడు.

Vishnu sahasraanaama


 

యక్షుడి ప్రశ్న.

 *'ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది?'* అన్నది యక్షుడి ప్రశ్న. 


నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటూంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది?' బదులిస్తాడు యుధిష్ఠిరుడు.

         ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి మనిషికి క్షణం కూడా తీరికలేదు.

                  మనిషికి తన పుట్టుక గురించి తెలుసు. కాని, మరణం గురించి బొత్తిగా తెలియదు. దాన్నించి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు. చనిపోయాక ఏమవుతుంది? మరణం తరవాత మనిషి ఎక్కడికి వెడతాడు? అసలు మానవ జన్మకు ప్రయోజనమేమిటి? ఆత్మ అన్నది ఉన్నదా? శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెడుతుంది?

        జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికీ ఎదురయ్యే ప్రశ్నలివి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబుల గురించి అన్వేషించడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బుచేసినా, ఆఖరి క్షణాలు ఆసన్నమవుతున్నా- ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలా అన్న ఆలోచనే తప్ప, జన్మాంతర జీవితం గురించి తలంచడు.

              వాస్తవంగా తల్లి గర్భంలో పడినప్పటినుంచి మరణంవైపు మనిషి ప్రయాణం ఒక్కొక్క అడుగే సాగుతూంటుంది. ఓ క్షణం ముందుకు నడుస్తోందంటే ఆయుష్షులో ఓ క్షణం తరిగిపోతున్నట్టే కదా! బ్రహ్మ జ్ఞానులకు ఇది అసంబద్ధమనిపించదు. ఎందుకంటే, మరణానంతర జీవితం గురించి మన వేదాలు ఘోషిస్తున్నాయి కనుక. ఈ జీవితం ఎంత ముఖ్యమో, ఆ జీవితమూ అంతే అవసరం!

     కొన్ని మతాలు మరణానంతర జీవితం గురించి భయపెడుతుంటాయి. జీవితం ఎంత స్వేచ్ఛాసుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో ముగించవచ్చని మన వేదాలు చెబుతున్నాయి.

           కొందరు మతస్తులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని, మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్తు రూపేణా దొరికే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించేయాలని బోధిస్తారు. మనిషికొకే జన్మ అని అనుకోవటంలో ప్రమాదమే అది. రేపో, ఎల్లుండో ఎలాగా పోతాం కనుక త్వరత్వరగా అన్నీ అనుభవించేయాలని పిచ్చి పరుగులు పెడుతుంటారు వాళ్ళు.

          వేద పరిజ్ఞానమున్నవారిని మరణం భయపెట్టదు. వస్తురూపంగా చవిచూసే గుణాలకన్న మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం. జీవితం దారి జీవితానిదే! మరణం దారి మరణానిదే! మరణం జీవితానికి ఆఖరిమెట్టు. ఆత్మ జీవితం అనంత వాహిని. ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే! ఆత్మకు చావులేదు.

      భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 'అర్జునా! ప్రతి దేహంలో నివసించే దేహి లేక ఆత్మ నిత్యుడు. అవధ్యుడు. మరణమనగా దేహంనుంచి దేహి బయటికి వెళ్ళడం. దేహం ధరించే వస్త్రం లాంటిది. ఈ రెండింటి సంయోగం క్షణికమే! పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించటం వంటిదే! ఆత్మ తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది' అని స్పష్టంగా చెప్పాడు.

       ఏదో క్షణంలో ఈ జీవితం ముగిసిపోవచ్చు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరక్కుండానే సమయం అంతం అయిపోవచ్చు. అందుకే, వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. అప్పుడే ఈ మానవ జన్మకు ముక్తిమార్గం లభ్యమవుతుంది. దివ్యజ్ఞానం దక్కుతుంది. ఈ ఆత్మ పరమాత్మకెంతో దగ్గరని అర్థమవుతుంది.

ఆది వారం* *08-10-2023*

 *భాను వాసరః*

     *ఆది వారం* *08-10-2023*

    *రాశి ఫలితాలు*

*మేషం*

మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి.కొన్ని పనులలో శ్రమ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో  ప్రతిబంధకాలు తప్పవు. ఇంటాబయట ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

*వృషభం*

ఉద్యోగమున సమస్యలు నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు.  కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది.

*మిధునం*

విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. స్వల్ప  అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.  వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.

*కర్కాటకం*

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

*సింహం*

చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశములు అందుతాయి.

*కన్య*

స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.  వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. 

*తుల*

మొండి బాకీలు వసూలవుతాయి. దాయదులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు.

*వృశ్చికం*

బంధువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున నిరాశ తప్పదు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఉదర సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

*ధనస్సు*

కొన్ని వ్యవహారాలలో ఇతరులతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

*మకరం*

ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు  సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.

*కుంభం*

సోదరులతో స్థిరస్తి  ఒప్పందాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

*మీనం*

ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు.

🕉️

సూర్యుని నమస్కరించుచున్నాను.

 ద్యుమణిం భాస్కరం సూర్యం,

సస్యోత్పాదకకారకమ్।

అపామాయతనం సూరం,

ఉష్ణరశ్మిం నమామ్యహమ్ ।।

భావం-అంతరిక్షమునందు మణివలె ప్రకాశించేటటువంటి,ప్రకాశమును కలిగించేటటువంటి,పంటలు పండుటకు కారణభూతుడైనటువంటి,నీటికి మార్గమును కలిగించేటటువంటి,జగదుత్పత్తికి కారకుడైనటువంటి,వేడికిరణములు కలిగినటువంటి సూర్యుని నమస్కరించుచున్నాను.

*కంచినాథమ్*

శుభోదయం.🌷🍅🙏

Avcel piston pump


 

LED tube light repair


 

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - కృష్ణ పక్షం  -  నవమి - పుష్యమి -  భాను వాసరే* (08.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/-jrwR-jYkwE?si=bvFUvPslWvOvDXwL



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కులద్వేషి

 *సుభాషితం*- 

---------------


*విషదరోతోsఫ్యతివిషమః*

     *ఖల ఇతి న మృషా వదంతి విద్వాoసః ౹*

     *యదయం నకులద్వేషీ* 

*కులవిద్వేషి పునః పిశునః ౹౹🌺*


        *విషం నిండిన పాముకన్నా దుష్టుడు ఎక్కువ చెడ్డవాడు అని విద్వాంసులు అంటారు.ఎందుకంటే పాము నకుల ద్వేషి అయితే ముంగీసకు శతృ,తన కుల ద్వేషి కాదు.అయితే దుష్ట మనిషి కులద్వేషి.*

🌺✍🏼

Garuda gammana


 

నీకంటే అలవాటు



నీకంటే అలవాటు

తండ్రి: ఎందుకు ఏడుస్తున్నావురా? కొడుకు: అమ్మ కొట్టింది నాన్నా... తండ్రి: అమ్మే కదరా కొట్టింది... ఏడవకు...

 కొడుకు: నీకంటే అలవాటయ్యింది. నాన్నా... నాకు నొప్పిగా ఉంది మరి...

😁😄

AMRUTHA HASTAM BRAHMIN TRUST*

 *

My name is Rama Rao..iam a pharma distributor. Iam one of the trustee to *AMRUTHA HASTAM BRAHMIN TRUST*  Hyd zone.


We coordinate to provide the servises like


1. Cooks and caterers 

2. Brahmin male female care takers.

3. Matrimony services

4. Nursing services 

5. Oldage home requirements 

6. Other required services to members.

7. Legal assistance 


Our main motto is to strengthen the Brahmin community like other communities.. *all the service  requests are free.. we don't charge any membership fee also*.. we only request you to save our number in your contacts.. and tell about us in your near and dear groups so that they can also avail the trust services...all the activities we do..you can see in our status updates.. 

*Pls spend little time for our Brahmins unity* 🙏

Our number: *9182057592*

DEvaalayam

 


సుభాషితమ్


 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


*శ్లోకం*


*వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం౹*

 *వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహం౹*

 *వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం౹*

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹*


_" *శివస్తుతి - 6* "_


యముని హరించే వాడు, హరుడు, విషాన్ని ధరించే వాడు, దయామయుడు, పెద్ద ముళ్ళు వేయబడిన ఝూటములు కలవాడు, అంతటా వెళ్ళినవాడు, దయ అనే అమృతానికి నిధియైన వాడు, నరసింహ స్వామిని వశం చేసుకొన్నవాడు,  బ్రాహ్మణుల, దేవతలచే పూజించబడిన పాదపద్ములు కలవాడు,  భగుని కన్ను నాశనము చేసినవాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన *శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

🪷 శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,53వ శ్లోకం*


 *శ్రుతి విప్రతి పన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |* 

 *సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి || 53* 


 *ప్రతిపదార్థం* 


శ్రుతి విప్రతిపన్నా= నానావిధ వచనములను వినుటవలన విచలితమైన ; తే =నీ యొక్క ; బుద్ధిః = బుద్ధి; యదా = ఎప్పుడయితే ; సమాదౌ = పరమాత్మ యందు ; నిశ్చలా = నిశ్చలముగా; అచలా = స్థిరముగా; స్థాస్యతి = నిలుచునో; తదా = అప్పుడే; యోగమ్ = యోగమును ( భగవత్సాక్షాత్కారమును ); అవాప్స్యసి =( నీవు ) పొందగలవు;


 *తాత్పర్యము* 


నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన ( అయోమయమునకు గురియైన ) నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే, నీవు ఈ యోగమును పొందగలవు. అనగా, నీకు పరమాత్మ తో నిత్య ( శాశ్వత ) సంయోగము ఏర్పడును .


 *సర్వేజనః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

రామాయణమ్ 348

 రామాయణమ్ 348

...

అన్నా ! నీ కిష్టమైన మాటలు చెప్పేవారు ఎల్లవేళలా లభింతురు.

కానీ ప్రియము కాకపోయిననూ హితవు చెప్పువారు అరుదు.

.

రాముడు నిన్ను చంపుచుండగా నేను చూడజాలను అందుకే వెళ్ళిపోతున్నాను ఇక సెలవు అని ఆకాశమున నిలచి విభీషణుడు పలికెను.

.

వెనువెంటనే ముహూర్తకాలములో విభీషణుడు రామలక్ష్మణులు ఉన్నచోటికి వచ్చెను.

.

ఆకాశములో మెరుపు వలే మెరుస్తూ నిలుచొని యున్న విభీషణాదులను క్రిందున్న వానరులు చూసిరి.

.

ఎవడీ రాక్షసుడు ? మనలను చంపుటకు వాని అనుచరులతో వచ్చినాడా ఏమి !అని సుగ్రీవుడు హనుమంతుడు మొదలైన వారితో అనెను.

.

సుగ్రీవుని మాటలు వెలువడగనే అందరూ ఒక్కసారిగా మద్దిచెట్లను ,పర్వతములనుచేతపుచ్చుకొన్న వారై ,రాజా అనుజ్ఞ ఇమ్ము ఇప్పుడే వారిని నేలకూల్చెదము అని పలికిరి.

.

వానర సేనలో పుట్టిన కోలాహలము గమనించి క్రిందకు దిగకుండగనే పెద్ద కంఠస్వరముతో ,నేను రావణుని తమ్ముడు విభీషణుడను ,మా అన్న చేసిన చెడ్డపనికి ,అది తగదు అని నేను హితవు పలుకగా ఆతడు నన్ను అవమానించి వెడలగొట్టినాడు .నేను నా భార్యాపుత్రాదులను విడిచి రాముని శరణు జొచ్చినాను .

.

నా రాక మహానుభావుడైన రామునికి ఎరిగించండి అని బిగ్గరగా పలికెను.

.

వూటుకూరు జానకిరామారావు

భగవద్గీత ఎందుకు చదవాలి

 *భగవద్గీత ఎందుకు చదవాలి? చదివితే ఏమీ వస్తుంది?*



"మనిషి తన తల రాతను కచ్చితంగా మార్చుకోలేడు, తాను చేసిన కర్మ అనుభవించక తప్పదు" అన్న ఒక్క మాటను మనము పెద్దల నుంచి పదే పదే వింటూ ఉంటాము.. అలాంటప్పుడు ఈ భగవద్గీతలు లేదా ఇతర మత గ్రంథాలు ఎందుకు చదవాలి ?? అన్న భావన మనిషిలో కలిగే అతి సహజమైన ఆలోచన...దాని సమాధానం ఒక్కటే " భగవద్గీత మన జీవనగీతను, లేదా కర్మ భారాన్ని కచ్చితంగా మార్చదు.. కానీ మనము జీవితాన్ని చూసే పద్దతిని మటుకు కచ్చితంగా మార్చేస్తుంది ". ద్వాపరయుగం లో యుగం లో ఇంద్రుడినే జయించగలిగే బలం, తెగవు, అస్త్ర సంపద ఉన్న అర్జునుడు సైతం కురుక్షేత్రం లో తన వారిని చూసి మానసికముగా బలహీనుడు అయిపోతాడు.. దాదాపు అస్త్ర సన్యాసం చేసే పరిస్థితికి వస్తాడు. అలాంటి సమయంలోనే కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన గీతోపదేశం ఒక్క అర్జునుడికి కాదు, సమస్త మానవజాతికే మార్గదర్శకం అయింది.. ఇది మతాలకు సంబంధం లేని ఒక సందేశం, సమస్త మానవ జాతికి అది ఉపయోగ పడే విధంగా చెప్పబడింది.. అది ఎలానో చూద్దాము


1) భగవద్గీత మనలో ఉన్న బలాన్ని మనము గుర్తించేలా చేస్తుంది:

మనిషికి ఎప్పుడు కూడా గతం గురించి లేదా జరగబోయే దాని గురించి చింత ఉంటుంది. గీత లో ఉన్న సారాంశం మనిషి యొక్క ఆలోచన పద్దతిని ప్రభావితం చేసి ప్రస్తుత కాలంలో ఉండి, ఆలోచించేలా మనిషిని ముందుకు నడిపిస్తుంది.


2) భగవద్గీత కర్మ యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేస్తుంది. ఆత్మ బలం, దైవం యొక్క గొప్పతనాన్ని, చేసే కర్మ యొక్క ఫలాన్ని, గీత తెలియ చెప్తుంది. దాని వలన మనిషి యొక్క ఆలోచన దృక్పథం మారుతుంది.


3) భగవద్గీత మన మనసు ని కంట్రోల్ చేసుకునే మార్గం చూపిస్తుంది. నిత్యం మనలో చాల మంది అనవసరమైన ప్రాపంచిక సుఖాల మీద మోజుతో ఆనందాన్నికోలుపోతారు.. అట్లాగే అనవసరమైన ఆలోచనల వలన మన మనశాంతిని కోలుపోతాము .. అలాంటి పనికి రాని విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా మన మనసుని అదుపులో పెట్టుకొనే మార్గం గీత సారాంశం మనకు చూపిస్తుంది.


4) భగవద్గీత ఒంటరితనాన్ని జయించేలా చేస్తుంది:

మనలో చాల మంది వయసు పెరిగేకొద్దీ బాధ పడే అంశం ఏంటి అంటే ఒంటరితనం.. దాని నుంచి మనిషి తప్పించుకోవడం చాల కష్టం.. ఈ జీవాత్మకు, పరమాత్మ ఎప్పుడు తోడుగా ఉంటాడన్న సంగతి మనకు అర్ధం కాదు. ఆ విషయాన్నీ భగవద్గీత మనకు చాలా సరళంగా తెలియచెప్తుంది.


5) భగవద్గీత మనలో నిర్ణయాలు తీసుకునే సమర్ధత పెంచుతుంది:

మనలో చాల మంది ఒక నిర్ణయం తీసుకోడానికి భయపడుతూ ఉంటాము, దాని తరువాత వచ్చే పర్యవసానాలను ఎదురుకొనే ధైర్యం ఉండదు మనకు.. ఒక స్థిమితమైన ఆలోచన పద్దతిని మనకు అలవాటు చేసి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది భగవద్గీత .


6) భగవద్గీత మనల్ని మనము గుర్తించేలా చేస్తుంది. సమస్యలు అనేది మానవ జీవితంలో చాలా సాధారణమైనవి .. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనము ఢీలా పడిపోకుండా, కృష్ణుడు మనకు గీత రూపం లో చేయూతను ఇచ్చి కర్మను చేయమంటారు.


7) భగవద్గీత మనకు మంచి చెడు మధ్య తేడాను తెలియచేస్తుంది:

ఒక నిర్ణయం తీసుకునే ముందు అది మంచిదా చెడ్డదా అని అని మన మనసు మనకు చెప్తుంది. మనము తీసుకునే నిర్ణయం వలన ఇంకో మనిషికి సమస్య రాకుండా ఎలా తీసుకోవాలి అన్న ఒక దృష్టికోణాన్ని భగవద్గీత మనకు చెప్తుంది. మనకు తీసుకునే నిర్ణయాన్ని పక్క వారిని బాధిస్తే మటుకు దానికి మనమే పూర్తి బాధ్యులం అని కూడా తెలియచేస్తుంది.


8) భగవద్గీత భావోద్వేగాలకు, కర్మకు తేడా తెలియ చెప్తుంది.

అర్జునుడు భావోద్వేగాలకు లోనయ్యి యుద్ధం చేయను అంటాడు .. అట్లాగే మన అన్న ఒక భావనతో మనము కూడా చాల సార్లు మన వాళ్ళు చేసిన తప్పుని సమర్థిస్తాము. అది తప్పు అని అర్ధమయ్యేలా భగవద్గీత మనకు చెప్తుంది.


9) భగవద్గీత మనకు ఈ సమాజంలో ఉంటూనే ఆధ్యాత్మిక జీవితం ఎలా గడపాలో చెప్తుంది:

ఈ సమాజం లో ఉంటూనే, మనకు లోకం లో ఉన్న సంసార పరమైన రుచులు అంటకుండా, తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ జీవితాన్ని ఎలా గడపాలో భగవద్గీత మనకు నేర్పిస్తుంది.


10) భగవద్గీత మనకు తిండి యొక్క విశిష్టత గురించి చెప్తుంది:

ఒక రకమైన తిండి తినడం వలన మనలో ఉన్న భావోద్వేగాలు ఎలా మారుతాయి, మన జీవన శైలిని అది ఎలా నిర్దేశిస్తుంది.. అట్లాగే మనము తినే తిండి మన ఆరోగ్యం, ఆలోచన, జీవన శైలిని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న సారాంశం భగవద్గీత లో ఉంటుంది.


11) భగవద్గీత జీవితం యొక్క పరమార్థాన్ని తెలియచేస్తుంది:

తిన్నామా,, పాడుకున్నామా, తెల్లారిందా .. అన్నట్టు కాకుండా భగవంతుడిని ఎలా అన్వేషించాలి అని ఒక మార్గాన్ని మనకు భగవద్గీత చూపిస్తుంది.

నాకు భగవద్గీత లో బాగా నచ్చిన శ్లోకం ఏంటి అంటే

न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन ।

नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि

దీనికి అర్ధం ఏంటి అంటే " పార్థ .. ఈ ముల్లోకాల్లో నేను నిజంగా తల్చుకుంటే సాధించలేనిది ఏది లేదు.. అసలు నేను సాధించడానికి కూడా ఏమి మిగలలేదు. అయిన సరే నేను కర్మను చేస్తున్నాను .. అట్లా చేయకపోతే, కర్మ అనేది చేయక్కర్లేదు అని ఒక తప్పుడు ఉద్దేశాన్ని జీవులకు నేను చెప్పినట్టు అవుతుంది. దాని వలన వాళ్ళు కర్మ చేయడం మానేస్తారు.. కాల చక్రం అనేది దాని వలన ఆగిపోతుంది. జీవులో మేలు కోసమే నేను కర్మాణి చేస్తున్నాను.

భగవద్గీత మన నుదిటివ్రాత అని ఎవరో మహా కవి అన్నట్టు గుర్తు .. మతాలతో సంబంధం లేకుండా ఒక పుస్తకం పుస్తకం అనుకోని అందరూ దాన్ని ఒకసారన్నా అది చదివితే మన ఆలోచనలో వస్తుంది.


ఒక ముక్కలో చెప్పాలి అంటే జీవితం యొక్క పరమార్థాన్ని భగవద్గీత మనకు చెప్తుంది.

*కృష్ణం వందే జగద్గురుమ్*

సుభాషితమ్


 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


*శ్లోకం*


*వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం౹*

 *వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహం౹*

 *వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం౹*

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹*


_" *శివస్తుతి - 6* "_


యముని హరించే వాడు, హరుడు, విషాన్ని ధరించే వాడు, దయామయుడు, పెద్ద ముళ్ళు వేయబడిన ఝూటములు కలవాడు, అంతటా వెళ్ళినవాడు, దయ అనే అమృతానికి నిధియైన వాడు, నరసింహ స్వామిని వశం చేసుకొన్నవాడు,  బ్రాహ్మణుల, దేవతలచే పూజించబడిన పాదపద్ములు కలవాడు,  భగుని కన్ను నాశనము చేసినవాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన *శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

తల్లి భూమి కంటే బరువైనది

 శ్లోకం:☝️

*మాతా గురుత్తరా భూమేః*

  *ఖాత్ పితోచ్చతరస్తథా |*

*మనః శీఘ్రతరం వాతాత్*

  *చింతా బహుతరీ తృణాత్ ||*

  యక్ష-యుధిష్ఠిర సంవాదం, 

  వనపర్వ, మహాభారతం


భావం: తల్లి భూమి కంటే బరువైనది. తండ్రి ఆకాశం కంటే ఉన్నతుడు. మనస్సు గాలి కంటే వేగవంతమైనది. గడ్డి కంటే చింతలు చాలా ఎక్కువ.

పంచాంగం 08.10.2023 Sunday,

 ఈ రోజు పంచాంగం 08.10.2023  Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: నవమి తిధి భాను వాసర: పుష్యమీ నక్షత్రం సిద్ధ యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం.

నవమి పగలు 10:13 వరకు.

పుష్యమి రాత్రి 02:44 వరకు.

సూర్యోదయం : 06:11

సూర్యాస్తమయం : 05:56

వర్జ్యం : పగలు 08:53 నుండి మధ్యాహ్నం 10:40 వరకు

దుర్ముహూర్తం : సాయంత్రం  04:22 నుండి 05:09 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం : మద్యాహ్నం  12:00 నుండి 01:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

సుందరి చూపులో

 


సుందరి చూపులో  మదనుని  తూపులు !

                                          ------------------------------------------------------------- 


                చం:  " కొలకుల  కెంపు  సొంపు ,  రహిఁగుల్కెడు  తారల  నీలిమంబు ,  క


                           న్బెళకు  మెఱుంగులుం  , గలసి  , పెంపమరెన్  హరిణాక్షి  చూపు,  ల


                           వ్వలదొర , ముజ్జగంబుఁ  గెలువన్, నవ చూతదళంబు , మేచకో

                

                            త్పల , మరవింద ,  మొక్క మొగిఁ బట్టి   ప్రయోగము సేయు కైవడిన్;


                                      అనిరుధ్ధ చరిత్రము--ద్వి:ఆ:- 29వ: పద్యం; కనపర్తి అబ్బయా మాత్యుడు;


             అర్ధాలు:  కొలకులు-కన్నుల తుదలు; కెంపు -ఎరుపు; రహిగుల్కెడు- శోభలను ప్రసరంచు; తారలు-కనుగ్రుడ్లు;

బెళకు-చంచలము; పెంపమరెన్- అందగించెను; హరిణాక్షి: వనిత; వలదొర- మన్మధుడు;  చూతదళము-మామిడియాకు;

మేతకోత్పలము- నల్లకలువ; అరవిందము- పద్మము; 


                               ఇదియొక  అద్భుత మైన  చమత్కార పద్యము. ఇంతవరకు దీనిని బోలిన పద్యం రాలేదు.


                   మన్మధునకు  ముల్లోకాలను  జయించాలనే  కోరిక కలిగినదట! అదీ కేవలం  మూడేమూడు బాణాలతో.

మన్మధుడు  శృంగార రసానికి  అధినాయకుడు. కాబట్టి ఆమూడుబాణాలతో  యేమిచెయ్యదలచాడు? ముల్లోకాలలో

నివసించే  పురుషుల (యువకుల)  హృదయాలలో అలజడి లేపి  వారిని శృంగార పరాయణులను  చేయదలచాడన్నమాట!


                         జయించాలంటే  బాణాలు కావాలి. ఆయన కున్నవెన్ని? మొత్తం ఐదే  అయిదు బాణాలు."  అరవింద మశోకంచ,

చూతంచ, నవమల్లికా ,నీలోత్పలంచ, పంచైతే  పంచ బాణస్య సాయకాః" అని అమరం.  అరవిందము ,అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలములు. ఇందులో కేవలం  మూడేమూడు బాణాలతో  ముజ్జగాలను గెలవాలి. వెదికాడు లోకాలన్నీ  ,ఈమూడూ

ఒక్కచోట దొరికినాయి! ఎక్కడ  ఉషాసుందరి కంటిలో , అమ్మయ్య అనుకున్నాడు.


                       ఉషాసుందరి కన్నులలో  మూడు బాణాలు దొరికాయట! ఎలాగో  చూడండి!


              కొలకులకెంపు -కనుచివరలు యెర్రగా ఉన్నాయి. ఆయెరుపు నవచూత దళమువలె( మామిడాకు వలె)నున్నది.


              రహిగుల్కెడు తారల నీలిమంబు-  కనుగుడ్లు యొక్క నల్లదనం ,నీలోత్పలం  వలె  ఉన్నది. 


              కన్బెళకు మెఱుంగులు- కన్నులలోని  తరళమైన  కాంతులు  అరవిందము  వలె నున్నవి.


                                  ఇకనేం  చూతము  నీలోత్పలము  అరవిందము   యీమూటితో  ముజ్జగములను  సునాయాసంగా

గెలవ  గలమని  వాటిని మల్లోకముల మీద యెక్కుపెట్టెనా?  యనేరీతిగా  ఉషాసుందరి  కన్నులు , చూపులూ  ఉన్నాయని

కవి వర్ణన.  ముల్లోకాలలోనూ  ఇంత అందమైన  సుందరిలేదనీ, యెవరైనా ఆమెయందానికి, దాసోహ మనక  తప్పదనీ

కవిగారి యభిప్రాయం.  కంటిలో  మూడు  మన్మధబాణాలను  సృజించటం( ఊహించటం) ఇక్కడ కవితా చమత్కారం!


                                                                        స్వస్తి!🙏🙏🙏🙏

ధర్మం' అంటే ఏమిటి

 🕉️   *'ధర్మం' అంటే ఏమిటి?*   🕉️



ఇది చాల క్లిష్టమైన ప్రశ్న! 

వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న!  ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి 

చాలా లోతువుంది. 

చాలా సంక్లిష్టత ఉంది. 

చాలా నిగూఢత ఉంది. 

చాలా విశాలత ఉంది.


*‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’*


ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి.


ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్ధము. (ధృ – ధారణే). 

ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.


ధర్మము – సామాన్యధర్మం, 

విశేషధర్మం అని రెండు రకాలు.


*శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|*

       *హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||*


“ధృతి – 

క్షమ – 

దమం – 

అస్తేయం – 

శౌచం – 

ఇంద్రియ నిగ్రహం – 

హ్రీః (సిగ్గు) – 

విద్య – 

సత్యం – 

అక్రోధం”, 

ఈ పది లక్షణాలు కలిగియుండడమే ధర్మమని శాస్త్రం చెబుతోంది. 

అంటే;...


*1.* మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. 

తనకు సంబంధించినది కానివ్వండి, 

కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, 

సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. 

కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. 

కువిమర్శలు ప్రారంభమౌతాయి. 

ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. 

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి' చెడకుండా ముందుకి సాగిపోవాలి.

*‘ఇది ధర్మం’.*


*2.* మనిషి ఏ విషయంలోనైనా, 

ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. 

క్షమాగుణంతో ఉండాలి. 

ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కొనాలి. 

కోపగించుకోకూడదు. 

ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. *‘ఇది ధర్మం’.*


*3.* మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. 

ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ఇది ముఖ్యం. 

చదువుతున్నా, 

వింటున్నా, 

పని చేస్తున్నా, 

మాట్లాడుతున్నా, 

మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుంచాలి  *‘ఇది ధర్మం’.*


*4.* తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికొనలేక, 

నిస్తేజంగా..

నిర్వికారంగా, 

నిరాశగా, 

నిర్లిప్తతగా, 

నియమరహితుడుగా, 

ఉండకూడదు. 

*‘ఇది ధర్మం’.*


*5.* మనిషి ఎల్లప్పుడూ..

మనస్సునూ, 

శరీరాన్నీ, 

మాటనూ..

ఆలోచననూ, 

సంసారాన్ని, 

ఇంటినీ, 

పరిసరాన్నీ, 

ధరించే వస్త్రాలనూ 

పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. 

మనసు పరిశుభ్రంగా వుండాలి.  

మనిషి పరిశుభ్రంగా ఉండాలి.

*‘ఇది ధర్మం’.*


*6.* చదువు వున్నా, 

సంపదలున్నా, 

కీర్తివున్నా, 

బలంవున్నా 

ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. 

కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాన్ని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. 

*‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడినైనా గెలుస్తాడు’* మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారికి..

భూతప్రేతాలుగాని, 

దెయ్యాలు గాని, 

యక్షకిన్నెర కిమ్పురుషులుగాని, 

గ్రహాలు గాని, 

రోగాలు గాని, 

కష్టసుఖాలుగానీ, 

మరణంగానీ, 

వశంలో వుంటాయి. 

కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి .

*‘ఇది ధర్మం’.*


*7.* ప్రతి విషయానికీ సంకోచపడటం, 

సిగ్గుపడటం, 

అనుమానపడటం, 

తనను తాను తక్కువగా భావించటం కూడదు 

*‘ఇది ధర్మం’.*


*8.* మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. 

అకారణంగా, 

అనవసరంగా, 

ఒకరి మెప్పుకోసం, 

ఒకరిని మెప్పించటం కోసం, 

తన పనిని సాధించుకోవటం కోసం, 

తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం, తనవారిని తృప్తిపెట్టటంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. 

అబద్ధం మరొకనాటికి అవమానం పాలు చేస్తుంది. 

అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. 

మన శక్తినీ, మన కీర్తినీ, మన గొప్పదనాన్ని పాతాళానికి త్రొక్కివేస్తుంది. 

కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. 

*‘ఇది ధర్మం’.*


*9.* మానవునికి ఆహారం ఎంత ముఖ్యమో, 

వివేకం కూడ అంతే ముఖ్యం. 

వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. 

విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి.

 ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. 

మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, 

స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,

భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. 

*‘ఇది ధర్మం’.*


*10.* పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం 

ఇవన్నీ మనిషిని  పతనావస్థకు నెడతాయి. 

పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. 

తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, 

తాను జన్మనిచ్చిన వారికీ, 

తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది..

కాబట్టి వీటిని వదిలిపెట్టాలి. 

*‘ఇది ధర్మం’.*...🙏