12, సెప్టెంబర్ 2021, ఆదివారం

ఋతువులు ఆహార విహార నియమాలు -

 ఋతువులు , ఆయా సమయాల్లో పాటించవలసిన ఆహార విహార నియమాలు - 


 * వసంత ఋతువు - 


       వసంత ఋతువు నందు కఫము ప్రకోపించి అనేక రోగములను కలుగజేయును . అందువలన అట్టి కఫముని వాంతి , ముక్కు ద్వారా , విరేచనం ద్వారా కఫాన్ని పోగొట్టి కఫాన్ని తగ్గించవలెను .  


             ఈ సమయంలో పాతవి అయిన గోధుమలు , శొంటి, వేగిసచెక్క , చందనము , తుంగముస్తలు కాచబడిన నీళ్ళనిగాని , తేనె కలిపిన నీళ్ళని గాని పానము చేయవలెను .


       ప్రాతఃకాలం సమయమున శరీరం మర్దించుకొని నలుగుపెట్టుకొని స్నానం చేయవలెను . మధ్యాహ్నమున నీటికాలువుల యందు , చెట్లు ఎక్కువ ఉన్న తీగలు గల చెట్లు ఉన్న ఉద్యాన వనాల యందు గడపవలెను . 


              వసంత ఋతువు యందు చల్లటి పదార్థాలు , మధురపదార్థాలు , సేవించరాదు . పగలు నిద్రించరాదు.


 * గ్రీష్మ ఋతువు - 


       ఈ గ్రీష్మ ఋతువు నందు తీక్షణమైన సూర్యప్రకోపం వలన శరీరం నందు కఫం తగ్గిపోయి వాతం పెరుగును . ఈ ఋతువు నందు ఉప్పు , కారం , పులుపు కలిగిన పదార్థాలు , వ్యాయామం , సూర్యకిరణాల యందు కూర్చోవడం నిషేదించవలెను . 


              ఈ కాలం నందు మధురపదార్థాలను మాత్రమే వాడవలెను . పంచదారతో కూడిన పేలాల పిండి మొదలగు పదార్థాలు తినవలెను . రాత్రిసమయంలో వెన్నెలలో ఆరుబయట ఉంచబడిన గేధ పాలలో పంచదార వేసుకొని అవి తాగవలెను .


       మధ్యాహ్న సమయం నందు చెట్లు ఉండి నీడ ఎక్కువ గల ప్రదేశాలలో పైనుంచి నీరు జాలువారే విధంగా జలగృహము నిర్మించుకొని అందు నివసించవలెను . రాత్రి సమయంలో మేడ పై భాగాల్లో వెన్నెల లో లేదా ఆరుబయట ఉండవలెను . 


 * వర్షఋతువు - 


         వర్షఋతువు నందు ఆకాశం మేఘాలతో ఆవరించబడి ఉండినప్పుడు జలకణములతో కూడి ఉండునట్టియు , వేసవికాలం తరువాత చల్లాగా అయినట్టి గాలి వలన లోపల ఉండు వాతం దోషం పొందును. భూమి యొక్క ఉష్ణం కాల స్వభావం చేత ఆమ్ల స్వభావం పెరిగినటువంటి జలం తాగుట చేత శరీరం నందలి పిత్తం దోషం పొందును. సాలెపురుగులు మొదలగు విష మూత్రాదులతో కలిసి ఉన్న వర్షపు నీరు సేవించుట చేత కాలస్వభావం చేత మందంగా ఉన్న జఠరాగ్ని వలన కఫం దోషం పొందును. 


                 ఈ విధంగా ఒకే కాలం నందు వాత, పిత్త, కఫాలు మూడు ఒకేసారి దోషం పొందుట వలన వాటిని శమింపచేయునట్టి మరియు జఠరాగ్ని పెంచే ఆహారాలు ఉపయోగించవలెను . 


           ఈ కాలం నందు పాతవైన యావలు , గొధుమలు , నేతితోను , శొంఠితోను చేయబడిన మాంసరసం , పెసరకట్టు , చాలా కాలం నుంచి నిలువ ఉంచబడిన మద్యం , వర్షం నుంచి పడిన నీరు , బావినీరు , కాచిన నీరు వీటిని ఉపయోగించాలి . ఈ ఋతువునందు అధిక శ్రమ చేయక శరీరం నందు గంథం పూసుకొని , సుగంధ ద్రవ్యముల ధూపమును వేసుకొని మేడ యందు నివశించవలెను . 


                    ఈ వర్షాకాలం నందు నదీజలం , కడుపు నిండా తినడం , పగటినిద్ర , శ్రమ ఎక్కువుగా ఉండే పనులు , ఎండ వీటిని చేయరాదు . 


 * శరదృతువు - 


         శరదృతువు నందు పిత్త దోషం ప్రకోపించును . ఈ కాలం నందు చేదు , తీపి , వగరు కలిగినటువంటి ఆహారాలు లొపలికి తీసికొనవలెను . ఆకలి అయినప్పుడే పదార్థాలు తీసికొనవలెను . శాలి ధాన్యం , పెసలు, పంచదార, ఉసిరికాయ , చేదుపోట్ల , తేనె , హంసలు తిరిగే తటాకం నందలి నీరు ఉపయోగించవలెను . 


                   చందనం , వట్టివేరు , పచ్చకర్పూరం , ముత్యాల హారం , పుష్పాల దండలు , పట్టుబట్టలు వీటిని వాడవలెను . మేడ పైభాగం నుండి సూర్యాస్తమయం అయిన సమయం లో వెన్నెలని సేవించవలెను . ఈ ఋతువు నందు మంచు , యావక్షారం వంటి లవణాలు , పెరుగు , నూనె , వస , ఎండ , ఘాటుగా ఉండు మద్యములు, పగటి నిద్ర , తూర్పుగాలి వీటిని వదిలివేయవలెను . 


 * హేమంత ఋతువు - 


        హేమంతఋతువు యందు మధురరసం , ఆమ్లరసం , లవణ రసం గల పదార్థాలు భుజించవలెను . ప్రాతఃకాలం నందు ఆకలిగా ఉన్నచో కొంచమే భుజించవలెను . వాతాన్ని 

హరించే తైలములతో అభ్యంగనం, శిరస్సు తైలముతోమర్దించుకొనుట, మల్లయుద్ధం , శరీరమునకు మర్దనం చేయించుకొనుట చేయవలెను . స్నానం చేసినతరువాత కుంకుమపువ్వుని , కస్తూరిని కలిపినూరి శరీరంకి పూసుకుని అగరుచెక్కతో దూపం వేసుకొనవలెను . 


                 ఈ కాలం నందు బలకరమైన మాంసరసం , మాంసములు , బెల్లంతో చేసిన మద్యం , మధుర మద్యం , గోధుమపిండి , మినుములు , చెరుకుపాలు వీనితో చేయబడిన పదార్థాలు , నూతనమైన అన్నం , వస , తైలం వీటిని ఉపయొగించవలెను . స్నానం కొరకు వేడినీటిని మాత్రమే ఉపయొగించవలెను . చలిబాధ లేకుండా ఉండటం కొరకు దుప్పటి, కంబళి , శాలువ వీటిని కప్పుకొనవలెను . కొంతసమయం సూర్యకిరణముల యందు ఉండి చెమట పట్టే విధంగా చూసుకొనవలెను . భూగృహముల యందు నివశించవలెను . 


 * శిశిరఋతువు - 


           హేమంత ఋతువు నందు పాటించే నియమాలను ఈ ఋతువు నందూ పాటించవలెను . 


          పైన చెప్పిన విధంగా ఆయా ఋతువుల్లో ఆయా ఆహారపదార్థాలని తీసుకోవడం , ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం వలన వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు . 


              మరిన్ని రహస్య యోగాలు నేను రాసిన గ్రంథాలలో ఇచ్చాను.

  

          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

సీనియర్ సిటిజన్స్ గమనించండి*

 *సీనియర్ సిటిజన్స్ దయచేసి గమనించండి*


_యునైటెడ్ స్టేట్ లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం 51% పైగా వృద్ధులు మెట్లు ఎక్కేటప్పుడు పడిపోతారు._

_ప్రతి సంవత్సరం, చాలా మంది అమెరికన్లు మెట్లు ఎక్కేటప్పుడు పడి చనిపోయారు._


 *నిపుణుల రిమైండర్:*


*_60 సంవత్సరాల తరువాత, ఈ 10 చర్యలకు దూరంగా ఉండాలి._*


 *1. మెట్లు ఎక్కవద్దు.*

_మీరు తప్పక ఎక్కితే, మెట్ల కేసు రైలింగ్‌లను గట్టిగా పట్టుకొని ఎక్కండి_

 

 *2. మీ తలను వేగంగా తిప్పకండి.*

*కళ్ళు బైర్లు కమ్మి మీరు క్రింద పడిపోవచ్చు•*


_3. మీ కాలి బొటనవేలును తాకడానికి మీ శరీరాన్ని వంచవద్దు.🤸🤸_

 _మొదట మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి_


 *4. మీ ప్యాంటు ధరించడానికి నిలబడకండి.* 

*కూర్చుని మీ ప్యాంటు ధరించండి•*


 _5. నిలబడి ఒక్కసారి గా పడుకోకుండా మీ శరీరం యొక్క ఒక వైపు (ఎడమ చేతి వైపు, లేదా కుడి చేతి వైపు) నుండి కూర్చోని పడుకోండి._


 *6. వ్యాయామానికి ముందు మీ శరీరాన్ని ట్విస్ట్ చేయవద్దు. మొదట మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి•*


 _7. వెనుకకు నడవకండి._

 _వెనుకకు పడటం వలన తీవ్రమైన గాయం అవుతుంది._


 *8. భారీ బరువును ఎత్తడానికి నడుము వంచవద్దు. మీ మోకాళ్ళను వంచి, సగం చతికిలబడినప్పుడు వస్తువును పైకి ఎత్తండి. 🏋‍♀*


 _9. మంచం మీద నుండి వేగంగా లేవకండి. మంచం నుండి లేవడానికి ముందు కొన్ని నిమిషాలు వేచి ఉండండి._


 *10. వాష్‌రూమ్‌లో అధిక శక్తిని ఉపయోగించవద్దు. ఇది సహజంగా రావనివ్వండి.*


 ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి మరియు


          🥀🌹🥀అన్ని బాలకి దివ్య ధo 

                         చిరునవ్వు ఒకటే🥀🌹🥀


       🥀🌹🥀ఎన్ని కష్టాలు వచ్చినా సరే 

                     గుండె నిబ్బరంతో ఉంటూ🥀🌹🥀


        🥀🌹🥀పెదవులపై నీ చిరునవ్వు 

                ఎప్పటికి చెదరనివ్వకు నేస్తం🥀🌹🥀


           🥀🌹🥀నీ చిరునవ్వు కి నీ కష్టాలు

                దాసోహం అవుతాయి నేస్తం 🥀🌹🥀


                  

 దయచేసి అందరూ సీనియర్లకు ఫార్వార్డ్ చేయండి 💐🙏

రెండు విషయాలు

 రెండు విషయాలు 

మనకు ఈ జగత్తులో రెండు విషయాలు అనుభవంలోకి వస్తున్నాయి. ఒకటి మన కంటికి కనపడే జగత్తు అది అందరు గమనిస్తారు.  ఇక రెండోవిషయం ఏమిటంటే కనపడే ప్రతిదాని వెనుక ఏదో శక్తి వున్నది.  సామాన్యు దృష్టిలో మనం ఈ విషయాన్నీ కొన్ని వస్తువుల్లోనే చూస్తాము కానీ సూక్ష్మంగా వెళ్లి పరిశీలిస్తే మనకు కనపడే ప్రతి వస్తువులో నిగుడంగా ఒక శక్తి ఆ వస్తువు పరిమాణంకు, స్వభావానికి  అనుగుణంగా నిక్షిప్తమై ఉన్నది. ఆ శక్తిని మన మహర్షులు వారి వారి జ్ఞనంతో దర్శించారు. 

సముద్రం మన కంటికి కనపడుతున్నది.  అది మొత్తం నీరు అంటే నీరు అనే వస్తువు.  మరి దానిలో మనం అలలను కూడా చూస్తున్నాము.  ఈ అలలు ఎక్కడినుంచి వస్తున్నాయి.  దీనికి కారణం ఏమిటి అంటే భౌతిక శాస్త్రం ఏదో ఒక సూత్రాన్ని చెప్పవచ్చు, కానీ ఆ సూత్రప్రకరమే జరగాలని ఎవరు నిర్ణయిస్తున్నారు. సముద్రంలో  వరుసగా అలలు నిర్విరామంగా వస్తువున్నాయి.  మరి నీవు ఒక చిన్న పాత్రలో ఆ సముద్రపు నీటిని తీసుకొని పక్కన పెట్టిచూడు.  అందులో అలలు లేవు.  ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అలలకు కారణం నీరా కాదా నీరు అంటే అదే నీరు పాత్రలోకూడా వున్నాయికదా మరి అందులో కూడా అలలు రావలికదా కానీ రావటంలేదు. 

ఒక చిన్న గ్లాసులో నీటిని తీసుకొని మనం టేబులు మీద ఉంచామనుకోండి.  ఆ గ్లాసులో నీరు ఏ చలనం లేకుండా స్థిరంగా ఉంటాయి. అంటే నీటికి ఏ శక్తి లేదనుకోవాలా  అదే ఆ గ్లాసుకు ఒక చిన్న రంద్రం వున్నదనుకోండి. అందులోంచి నీరు కొంచం కొంచంగా కారుతూ గ్లాసులోని నీరు మొత్తం అయి పోతాయి. ఇప్పుడు నీటికి శక్తి ఉందనుకోవాలా లేదా. 

నీవు వీధిలో వెళుతున్నావు. అనేక రాళ్ళూ కదలకుండా అక్కడ వున్నాయి.  నీ వెంట ఒక కుక్క పడిందనుకో దానిమీద నీవు ఒక రాయి తీసుకొని  విసిరావనుకో అది దానికి తాకి గాయాన్ని చేసింది.  ఇప్పుడు మనం ఆలోచించాలసింది ఏమిటంటే కదలకుండ వున్నరాయి యెట్లా దానికి గాయాన్ని చేసింది.  నీవు విసిరావు కాబట్టి.  మరి నీవు రాయిలేకుండా కేవలం చేతిని ఊపితే కుక్కకు గాయం కాదె. నీ చేతి శక్తితో రాయి వేగంగా వెళ్లి దానికి తగిలిందంటే నీ శక్తిని తీసుకొని వెళ్లే శక్తి రాయికి ఎక్కడిది. 

గింజలు ఇంట్లోనో గోదాములోనో ఉంటే మొలకెత్తవు మరి భూమిలో వేసి తగినంత నీటిని అందిస్తే ఎలా మొలకెత్తుతున్నాయి. ఇలా మనం అనేక విషయాలు చూస్తున్నాము. కానీ వాటిగూర్చిన విషయాలను అర్ధం చేసుకోలేక పోతున్నాము. సైన్సు మీకు యేవో థీరీలు చెప్పవచ్చు కానీ ఆ థీరీ ఎలా పనిచేస్తున్నది అంటే మాత్రం సైన్సు జవాబు చెప్పదు . 

ఈ సృష్టిలో వున్న శక్తినే మన మహర్షులు ప్రాణశక్తిగా పేర్కొన్నారు.  ఆ ప్రాణశక్తే  అనేక ప్రేదేశాలల్లో అనేక విధాలుగా గోచరిస్తుంది. జడంగా వున్న పెట్రోలు నీ మోటారుసైకిలుని వేగంగా పరుగెత్తించే విధంగా శక్తిని ఇస్తున్నది.  అదే పెట్రోలు కారులో పోసితే దానిని చలింపచేస్తున్నది. అంటే పెట్రోలుకు వాహనంతో పనిలేదు.  అంతేకాక దానిని అంటిస్తే మంటగా దాని శక్తిని చూపెడుతున్నది. 

జగత్తులో వస్తువులు అనేకంగా ఎలా మనకు కనపడుతున్నాయో అదేవిధంగా శక్తికూడా అనేకరూపాలతో మనకు అనుభవంలోకి వస్తున్నది. ఈ శక్తే మనకు కనపడే జగత్తుని చేతన్యవంతం చేస్తున్నది. జీవులలో వుంది జీవుల మనుగడకు కారణం అవుతున్నది. నిర్జీవులలో ఉండి వాటిలో అప్పుడప్పుడు అనేక విధ శక్తిరూపంగా బహిర్గతం అవుతున్నది. 

దీనిని బట్టి మనకు ఒక విషయం జ్యోతకమౌతున్నది అదేమంటే శక్తీ మన కంటికి కనపడటంలేదు కానీ అది జడపదార్ధమైన భౌతిక పదార్ధాలను సహితం  చెతన్యవంతంగా చేస్తున్నది.  ఆ శక్తే భగవంతుడు. 

భౌతిక మైన జగత్తు తన తన రూపాలను మార్చుకొంటున్నది. నిన్న విత్తుగా వున్నది నేడు మొలకగా వున్నది రేపు మ్రానుగా మారుతుంది తరువాత కాలగర్భంలో రూపాలన్నీ నశించి ప్రకృతిలో లయం అయిపోతుంది. ఈ నిఘాడ రహస్యాన్ని మన మహర్షులు వారి అపారజ్ఞ్యనంతో  ఆవిష్కరించారు. ఒక్కవిషయం మనకు స్పష్టంగా కనపడుతున్నది. మనం చూస్తూవున్నది ఏది కూడా స్థిరంగా ఉండటంలేదు కాలానుగుణంగా మార్పుచెందుతున్నది తరువాత కాలంలో లయం అవుతున్నది. 

వేదాలు కర్మజ్ఞనాన్ని  తెలియచేస్తాయి. అంటే ఏ ఏ కర్మలు చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అని చెపుతాయి. వేదాంతం జ్ఞ్యానమార్గాన్ని ప్రభోదిస్తున్నది. 

మన కళ్ళముందు వున్న జగత్తుకి సంబందించిన విషయాలు తెలుసుకోవటం కొంత సులువు ఎందుకంటె మనం చూడగలుగుతున్నాం.  కానీ జ్ఞ్యాన మార్గం బహు దుర్లభం ఎందుకంటె ఇక్కడ ఎవరి అనుభవం వారిది. అరటిపండు నీవు తిన్నావు నేను తిన్నాను తియ్యగా ఉందని నీవు అన్నావు అప్పుడు నాకు దాని రుచిని తీపి అంటారని తెలిసింది. నిజానికి తియ్యదనానికి సంబందించిన అనుభూతి నీది వేరు నాది వేరు. అదే విధంగా వేదాంతానికి సంబందించిన అనుభూతులు ఎవరికి వారికి వారి వారి స్థాయిని బట్టి యోగ్యతను బట్టి  ప్రత్యేకంగా ఉంటాయి. కంటికి కనపడే విషయానికి సంబందించిన జ్ఞ్యానం పొందటం తేలిక ఎందుకంటె అక్కడ నీకు నిరూపణగా ప్రత్యక్ష విషయం వుంది. కానీ ఆత్మజ్ఞానాన్ని సంబందించినది తెలుసుకోవటానికి నీ కళ్ళముందు ఏ రకమైన భౌతిక విషయం లేదు, కేవలం అనుభవాన్ని సాదించాలి.  కొన్ని సందర్భాలలో ఇది నిజామా కాదా అనే సందేహంకూడా సాధకునికి రావచ్చు. 

వేదాంతం కేవలం మోక్ష మార్గదర్శనం  చేస్తుంది. మార్గంలో పయనించాల్సిన భాద్యత కేవలం సాధకునిదే. సాధకుడు అకుంఠిత దీక్షతో, నిరంతర కృషితో, ఏకాగ్రతతో, మనస్సుని పూర్తిగా స్వాధీనపరచుకొని చిత్త వృత్తులను నిరోధించి తనను తానూ అనుభూతి పొందటమే ఆత్మ సాక్షాత్కారం. ఎవరి అనుభూతి, అనుభవము వారిది.  దానికి బాహ్యంగా ప్రకటించే శక్తి ఎవ్వరికీ లేదు. ఇటీవల కొందరు తమకు తాము దివ్యపురుషులమని చెప్పుకొంటూ వారికి ఆత్మ సాక్షాత్కారం అయినట్లు చెప్పటం నేను ఒక వీడియోలో చూసాను.  సాధకులారా ఆత్మసాక్షాత్కారం చెందినవారు ఈ సభ్యసమాజంలో వుండరు. ఎవ్వరితోటి వారికి నిమిత్తం లేదు. వారికి ధన,కీర్తి వ్యామోహాలు వుండవు.  నేను ఆత్మసాక్షాత్కారం పొందాను అని ఎవరైనా అంటే కేవలం అది వారి మూర్ఖత్వంగానే భావించాలి. ఇటీవలి కాలాలలో సత్పురుషులు అనదగిన వారు నాకు తెలిసి శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ రామనామహర్షులు అయి ఉండవచ్చు ఎందుకంటె వారు ఎరకమైన ఐహిక ప్రలోభాలకు లోనుకాకుండా కేవలం కైవల్య ప్రాప్తికై జీవించినట్లు మనకు చరిత్ర చెపుతున్నది. 

ఎటువంటి ఐహిక ఆపేక్ష లేకుండా బోధించేవారే అసలైన సద్గురువులు.  అరిషడ్వార్గాలను పూర్తిగా విడనాడి కేవలం జీవించటానికి మాత్రమే తింటూ, ఇతరులకు ఇబ్బందికాకుండా మాత్రమే వస్త్రధారణ చేస్తూ వుండే సర్వ సంగ పరిత్యాగులు మాత్రమే నిజమైన గురువులు.  మనం ఈ నియమాలను పాటిస్తున్నవారిని ఎక్కడ చూస్తున్నాము అన్నది ప్రశ్న. 

ప్రస్తుతం మనం సమాజాల్లో అనైక బాబాలను, మహానుభావులుగా చెప్పుకునే వారిని చూస్తున్నాము. వారు సాధారణ సంసారులకన్నా అనేకవిధాలుగా భోగాలను అనుభవిస్తూ మనకు కనపడుతున్నారు.  వారిని యోగులుగా ఎలా పరిగణలోకి తీసుకోవాలి. జుట్టుకు, మీసాలకు, గడ్డాలకు రంగులు వేసుకొని ప్రవచనాలు చేసే వారుకూడా లేకపోలేదు. 

రోడ్డు మీద ప్రయాణం చేస్త్తున్న నీకు రెండు రోడ్లుగా చీలినప్పుడు అక్కడి సైను బోర్డు నీకు దోవ యిక్కడి పోతుందో మాత్రమే చెపుతుంది.  కానీ ప్రయాణం చేయాలసింది మాత్రం నీవే.  మన శాస్త్రాలు, గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు మాత్రమే.  గమ్యాన్ని చేరుకోవటం కేవలం మన కృషి. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

బుధజనవిధేయుడు 

భార్గవ శర్మ. 






శ్రీమద్భాగవతము

 *12.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2259(౨౨౫౯)*


*10.1-1376-*


*క. తమగమున కెగురు యదు స*

*త్తమగణ్యునిఁ జూచి ఖడ్గధరుఁడై యెదిరెం*

*దమ గమివారలు వీరో*

*త్తమగణవిభుఁ డనఁగఁ గంసధరణీపతియున్.* 🌺



*_భావము: కంసుడు తాను కూచున్న మంచె మీదికి దూకుతున్న యదుకులశ్రేష్ఠుడగు శ్రీకృష్ణుని చూచి, కత్తి దూసి ఎదుర్కొన్నాడు. ఆతని అనుచరులు మారాజు కంసమహారాజు మహావీరుడని పొగడసాగారు._* 🙏



*_Meaning: As Kamsa saw Sri Krishna leaping on to his throne, He pulled out his sword and attacked Him. Pleased with the alertness of Kamsa, his associates started praising their king._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

సంభాషణ

 😁😁


సరదాగా నవ్వుకోవటానికి.


భార్య, భర్తల మధ్య జరిగిన సంభాషణ 


భార్య: 


మీకు ఏమి పని లేదా? మొదట చాగంటి గారి మహా భాగవతం విన్నారు, అది అయిపోంగానే మాడుగుల వారిది విన్నారు, తరువాత గరికిపాటి వారిది, ఇప్పుడు సుందర చైతన్యానంద స్వామి వారిది. ఎవరు చెప్పినా అదే మహా భాగవతం కథ కదా! ఒకరిది వింటే సరిపోదా?


భర్త: 


నువ్వు మినప్పిండి రుబ్బి...


 మొదటి రోజు కొంచెం పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీలు వేస్తావు, 


రెండో రోజు గారెలు,


 మూడో రోజు వడలు,


 నాలుగవ రోజు సాదా దోశలు, 


అయిదో రోజు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లి దోశ, 


ఆరో రోజు పొటాటో కూర వేసి మసాలా దోశ, 


ఏడో రోజు ఇంత టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఊతప్పమ్, 


ఎనిమిదో రోజు అదే పిండితో గుంట పునుగులు,

 

తొమ్మిదో రోజు పుల్ల మజ్జిగ కలిపి పుల్లట్లు వేస్తూ ఉంటే


 నేను రేపు అనేది ఉందో లేదో అని ఆత్రంగా తినటం లేదా!


వీటన్నిట్లో ఉన్నది మినప్పిండి అని తెలిసినా ఎంజాయ్ చేస్తున్నామా లేదా? 


మహా భాగవతం కూడా అంతే! 


చాగంటి వారు చెప్పేదాంట్లో భక్తి పాలు ఎక్కువ - అందుకు వినాలి, 


మాడుగల వారిది ఎందుకంటే - ఆయన అమృత తుల్యమైన కంఠం లో పోతన గారి పద్యం వినటానికి,


గరికిపాటి వారు ప్రస్తుతo సమాజం లో జరుగుతున్న వాటిని మేళవిస్తారు కాబట్టి ఆయనది వినాలి, 


చివరకు సుందర చైతన్యానందుల వారిది వినాలి - ఎందుకంటే కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు ఆయన చెప్పే దాంట్లో పైన చెప్పినవి అన్నీ ఉంటాయి. 


ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పంథా. అన్నీ ఎంజాయ్ చేయాలి.


భార్యకు ఏమి అర్థం కాలా. తను చేసే పనిని భాగవతం తో పోల్చి పొగిడారా లేక ఒకే పిండితో వారం రోజులు టిఫిన్ చేసి పెడుతున్నాను అని ఎత్తి పొడుపుగా అన్నారా! ఆలోచనలో పడింది.


😃😀😄

శ్రీరమణీయం* *-(238)*_

 _*శ్రీరమణీయం* *-(238)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"దేహాత్మభావన పోతే ఆధ్యాత్మిక ఫలం పొందినట్లేనా ?"*_


_*ఆధ్యాత్మికత అంటే దేహాత్మభావనను, (నేను ఈ దేహాన్ని అనే భావన) దేహస్పృహను (పంచేంద్రియాల ఎరుకను) పోగొట్టుకోవటం కాదు ! అవి పోవటం మాత్రమే ధ్యానం అయితే అది రోజూ నిద్రలో జరుగుతూనేవుంది కదా ! నేను దేహానికి అతీతమైన సత్యవస్తువునని తెలుసుకోవాలి. అంతే గాని నేను దేహాన్ని కాదని అనుకోనఖ్ఖర్లేదు. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలనుకొనే సత్యవస్తువు ప్రస్తుతం ఈ దేహంగానే కదా వ్యక్తమవుతోంది. దేహస్పృహ, దేహాబుద్ధిని రోజూ నిద్రలో నువ్వు కోల్పోతూనేవున్నావు. ఆస్థితిలో కూడా నువ్వున్నావు. అప్పుడు ఎలా ఉన్నావో తెలుసుకోవటమే మన సత్యస్వరూపాన్ని తెలుసుకోవటం !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'ఆలోచించేది ఎవరో తెలుసుకోవటమే ధ్యానం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

ఆచార్య సద్బోధన

 *ఆచార్య సద్బోధన*


మనలో ప్రేమ, స్ఫూర్తి లేనిదే దివ్యానుగ్రహమునకు మనం నోచుకోలేము. మనకు మనం హృదయంలో నుంచి వచ్చిన భావనతో భగవంతుని సేవ ఒనర్చితే మనల్ని ఏదీ అడ్డుకోలేదు.


"నేను" ను పక్కనపెట్టి ఏ పని చేసినా దానికి తిరుగులేదు. మనలో దయార్ద్రత, భక్తి భావన ఉంటే మన ప్రయత్నంలో విజయం తప్పక చేకూరుతుంది.


ఆధ్యాత్మికత నిగూఢ రహస్యాలను వెలికితీస్తుంది. అది కేవలం మత గురువులకి, బోధకులకి మాత్రమే కాదు, అణకువ, సహనం, నిస్వార్థత కలిగిన భక్తులకు కూడా అన్వయిస్తుంది.


మనలో ఆధ్యాత్మిక దృక్పథం ఉంటే తప్ప ప్రాపంచిక కష్టాలను ఎదుర్కొనలేము. అందువలన జ్ఞానకవచం ధరించి మనల్ని మనం కాపాడుకోవాలి.


అది శాశ్వతంగా కాపాడుతుంది. సదా నిలిచి ఉంటుంది.


*శుభంభూయాత్*

అక్షరాభ్యాసం కథ

 సంస్కృతి : 

బళ్లో పడెయ్యడం అను అక్షరాభ్యాసం కథ 

-కర్లపాలెం హనుమంతరావు 


ఇప్పుడంటే బిడ్డ తల్లి కడుపులో ఎదుగుతుండగానే.. కన్నవాళ్లు యమకంగారుగా ఏ కాన్వెంటులో సీటు దొరుకుతుందా అని వేట మొదలుపెడుతున్నారు. అర్థశతాబ్దం కిందట పిల్లల చదువులకు తల్లిదండ్రులు మరీ ఇంతలా తల్లడిల్లడం కనిపించదు. 


బిడ్డను అయిదేళ్ల వరకు ఇంటా బయటా హాయిగా ఆడుకోనిచ్చేవాళ్లు. నడుముకు నిక్కరు గుండీలు సొంతంగా పెట్టుకునే అయిదేళ్ళ వరకు ఆగి ఆ నిక్కరు బిగించే చేతికే పలకా బలపం ఇచ్చి బళ్లో కుదేసివచ్చేవాళ్లు. సామాన్యులు ఇంత సాధారణంగా జరుపుకునే పిల్లల అక్షరాభ్యాస కార్యక్రమం కలిగినవాళ్ల ఇళ్లల్లో ఇంకాస్త ఆర్భాటంగా చేయడం రివాజు. డబ్బుండి చేసినా, లేకుండా చేసినా ఇద్దరు నిర్వహించేదీ ఒకే కార్యకలాపం. దాని పేరే అక్షరాభ్యాసం. గతంలో మన తెలుగునాట పిల్లలను పాఠశాలలో ఎట్లా వేసేవారో.. ఆ తతంగం, దానికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయం .. వాటిని గురించి సూక్ష్మంగా తెలుసుకొనేందుకే ఇక్కడ ఈ వ్యాసం. 

 

ధర్మశాస్త్రాలు బిడ్డకు అక్షరాలు దిద్దబెట్టే ఈ తతంగానికి రకరకాల పేర్లు నిర్దేశించాయి. తెలుగువాళ్ల మూలరుషిగా భావించే విశ్వామిత్రుడు బిడ్డను బళ్లోవేసే తంతును విద్యారంభం అన్నాడు. అదే సంస్కారం, గోపీనాథభట్టు విరచిత ' సంస్కార రత్నమాల ' ప్ర్రకారం- అక్షరారంభం! అక్షర స్వీకరణగా వశిష్టుడు పేర్కొంటే, మార్కెండేయుడు 'అక్షర లేఖనం'అనే పేరు ఖాయం చేశాడు. ఎవరే పేరుతో పిలుచుకున్నా పిల్లలకు అక్షరాలు దిద్దబెట్టే శుభకార్యంలో తంతు మాత్రం దాదాపు ఒకటే!


తమాషా ఏమిటంటే, వీరమిత్రోదయ, స్మృతిచంద్రిక, సంస్కార రత్నమాల, యాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యానం చెప్పిన అపరార్క వ్యాఖ్య లాంటి అర్వాచీన గ్రంథాలలో ప్రముఖంగా ప్రస్తావనకొచ్చిన అక్షరాభ్యాస సంస్కారం అసలు గృహ్యసూత్రాలలోనే కనిపించకపోవడం! విశ్వామిత్ర, బృహస్పతి వంటి రుషుల పేర్లు ఈ వ్యవహారంలోకి లాగడం కేవలం దీనికి పురాతన సంప్రదాయవాసన అంటగట్టడానికేనంటూ పి.వి. కాణే వంటి ఆధునికులు విమర్శిస్తున్నారు. 


ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా గ్రంథం రాసిన డాక్టర్ అ.స. అత్లేకర్ అభిప్రాయం ప్రకారం భారతీయుల అక్షర జ్ఞానాన్ని క్రీ.శ. ఏడు, ఎనిమిది శతబ్దాలకు ముందు కాలానికి మించి ముందుకు తీసుకుపోలేం. 


ఇండియన్ యాన్టిక్వెరీ గ్రంథ కర్త డాక్టర్ బూలర్ లెక్క ప్రకారం అయితే మన దేశస్తులకు వర్ణమాలను గురించి తెలియడం క్రీ.పూ 800 తరువాతే! ఎట్లాంటి పరిస్థితుల్లోనూ అంతకన్నా ముందైతే కాదు. ప్రాచీన లిపి మాల అనే మరో గ్రంథం ఉంది. దాని కర్త పండిత గౌరీశంకర్ హీరాచంద్ర. ఈ దేశవాసులకు అక్షరాలు రాసే లేఖనకళ వంటబట్టిందే క్రీ.పూ 16 -12 శతాబ్దాల ప్రాంతంలో అంటారాయన. అందరికి అందరూ పండితులే. అందరివీ శాస్త్రీయ పరిశోధనలే! కానీ ఏటి కొకరు కాటి కొకరు ! ఇహ రథం ముందుకు కదిలేదెట్లా? అందుకే ఆ గందరగోళాల జోలికి పోకుండా ఇంచక్కా మనవైన సంప్రదాయాలు ఈ అక్షరాభ్యాస తతంగాన్ని గూర్చి ఏ వింతలూ విశేషాలూ చెబుతున్నాయో.. రవ్వంత తెలుసుకుందాం!


 ఏ విషయం తెలిసినా , ఎంతటి గొప్పవారైనా ఆరు నెలలు గడిస్తే అంతా మరుపుకొస్తుందని శాస్త్రం. అట్లాంటి మతిమరుపు జాడ్యానికి మందు కింద బ్రహ్మదేవుడు అక్షరమాలను సృష్టించాడని బృహస్పతి స్మృతి ఉవాచ. 

' షాణ్మాసికే తు సంప్రాప్తే భ్రాంతిస్సంజాయతే యతః ।

ధాత్రాక్షరాణి సృష్టాని పత్రా రూఢాన్యతః పురా॥- అనే శ్లోకానికి అర్థం ఇదే! 


కృష్ణయజుర్వేద సంహిత రెండో కాండంలో అంతకు మించిన తమాషా మంత్రం ఇంకోటుంది. 

 'యాప్ర లిఖతే తస్యైఖలతిః' అని ఆ మత్రం. అంటే ఆడవాళ్లు ఈడేరిన తరువాత గాని పలకా బలపం చేతబడితే .. ఆ పాపానికి పరిహారంగా బట్టతల గల బిడ్డ పుడతాడని హెచ్చరిక. ఆడవాళ్లు చదువుకోరాదని చెయ్యి చుట్టి ముక్కు చూపించే పద్ధతి అన్న మాట. ఆ లెక్క నిజమే అయితే, ఇప్పుడు ఎక్కడ చూసినా అర్థ బోడిగుండు శాల్తీలే దర్శనమీయాలి న్యాయంగా కదా! ఏదో .. అప్పటి నమ్మకాలు అప్పటివి అని సరిపెట్టుకునేవాళ్లలో ఏ పేచీ ఉండదనుకోండి! 


కాలం గురించి ఎన్ని కయ్యాలు జరిగినా, హిందువుల మనోభావాల ప్రకారం, ప్రప్రథమ లేఖకుడు వినాయకుడు. వ్యాసమహర్షి చెప్పుకుపోతుంటే మహా భారతం మొత్తం పూసపోకుండా రాసుకుపోయింది ఆ మహాదేవుడే కదా! మరి వ్యాసుడి కాలం సుమారు 5000 ఏళ్ల కిందటిదేనా అని అడిగితే ఇప్పుడున్న శాస్త్రవేత్తల్లో సగం మంది అవునన్నట్లే తలలాడిస్తారు. ఇహ మన అక్షరజ్ఞాన కాలం గురించి ఇంతలా కుస్తీలింకా అవసరమా? 

అని సందేహం. సమాధానం చెప్పే దెవరు? 


చౌలం అంటే ఉపనయనం ముందు జరిగే తంతు . అది ముగించుకున్న తరువాతనే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం! అలాగని మరి సాక్షాత్తూ కౌటిల్యుడంతటి రాజగురువే నియమం విధించాడు. 


రాజకుమారుడు 'వృత్త చౌల కర్మా లిపిం సంఖ్యానం చ ఉపయంజీత, వృత్తోపనయనస్త్రయీ మాన్వీక్షికీం చ శిష్టేభ్యో నార్యా మధ్యక్షేభ్యో దండనీతిం, వక్తృ ప్రవక్తభ్యః, బ్రహ్మచర్యం చా షోడశాద్వర్షాత్, అతో గోదానం దారకర్మ చ'-అన్నాడు. 


వడుగు అయిన తరువాత అక్షరాలు నేర్చుకోవడం, గణితం.. ఉపనయనం అయిన తరువాత వేదాధ్యయనం చేయడం, అన్వీక్షకి, వార్త, దండనీతులు అనే మూడు రాజవిద్యలు పదహారో ఏడు వరకు (అంటే గోదానవ్రతం అయే వరకు)అభ్యసించడం ! అవన్నీ సక్రమంగా పూర్తి చేసుకున్న తరువాతనే పెళ్లి ముచ్చట. 


ఇలాంటి ఏదో నియమం ఉండబట్టే వాల్మీకి కాలంలో కూడా ఉండబట్టే ఆ గురువు లవకుశులకు ఒక్క వేదం మినహాయించి సమస్త విద్యలు చౌలం అయిన తరువాతనే నేర్పించాడని ఉత్తర రామాయణంలో భవభూతి చెప్పిన మాట. 


'నివృత్త చౌల కర్మణోశ్చ త్రయోస్థయీవర్జ మితరాస్తి స్రోవిద్యాః సావధానేన మనసా పరినిష్ఠాపితాః'

లిపి పరిజ్ఞాతుడైన తరువాతనే రఘువంశ మహారాజు అజుడు సాహిత్యసముద్రంలోకి ప్రవేశించినట్లు కాళిదాసు రఘువంశంలో అనే మాట. 


చంద్రాపీడ మహారాజు ఆరేళ్లకు విద్యామందిర ప్రవేశం చేసి పదహారేళ్ల వరకు ఎట్లా గడిపాడో, ఎన్ని రకాల కళలు అభ్యసించాడో బాణుడు కాదంబరిలో వివరంగా చెప్పుకొస్తాడు.  


చదువులు నేర్చుకోవడం సరే, ఏ వయస్సు నుంచి నేర్చుకోవాలన్న విషయం మీద కూడా కీచులాటలే మళ్లీ! విశ్వామిత్ర నీతి ప్రకారం ఐదవ ఏట నుంచి విద్యారంగ ప్రవేశం చేయాలి. పండిత భీమసేన్ వర్మ రాసిన 'షోడశ సంస్కార విధి' అనే గ్రంథంలో పేరు తెలియని ఒక స్మృతికర్త మతాన్ని బట్టి ఐదు నుంచి 

ఏడు సంవత్సరాల వరకు ఎప్పుడైనా నిక్షేపంగా అక్షరాభ్యాస కార్యక్రమం ముగించుకోవచ్చు. ఇదే ఆ రోజుల్లో 'పంచమే సప్తమేవాబ్దే' సిద్ధాంతంగా ప్రసిద్ధి. 


ఉపనయనం ఆర్షధర్మం దృష్టిలో రెండో జన్మ. ఆ సందర్భంలో విద్యాభ్యాస కార్యక్రమం కూడా శుభంగా ముగించుకోవచ్చని బృహస్పతి అభిభాషణ. 


మార్గశిరమాసం మొదలు జ్యేష్ఠమాసం వరకు మధ్యలో ఎప్పుడైనా అక్షరాలు దిద్దబెట్టవచ్చని చెబుతూనే ఆషాఢం నుంచి కార్తీకం మధ్య కాలం మొత్తాన్నీ నిషిద్ధ కాలంగా విశ్వామిత్ర నీతి నిర్దేశించింది.

  

  'అప్రసుస్తే నిద్రాం త్యజతి కార్తిక్యాం తయోః సంపూజ్యతే హరిః' అని విష్ణు దర్మోత్తరం. సూర్యభగవానుడు ఉత్తరాయన పుణ్యకాలంలో ఉన్నప్పుడు చేసే అక్షరాభ్యాసం శుభదాయకమని వశిష్ఠుని వాక్కు.  


అపరార్కుడు, స్మృతిచంద్రిక కర్తలిద్దరూ మార్కండేయ పురాణోక్తులను పేర్కొంటూ ఐదో ఏట కార్తీక శుద్ధ ద్వాదశి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి లోపలే ఈ కర్యక్రమాన్ని కడతేర్చుకోవాలని హితవు చెప్పారు. కాకపోతే ఒకటే షరతు. పాడ్యమి, షష్ఠి, అష్టమి, పూర్ణిమ, అమావాస్య, రిక్త తిధులైన చవితి, నవమి, చతుర్దశులను వదిలిపెట్టడం క్షేమకరమని హెచ్చరించడం.  


శని మంగళ వారాలు కూడా చదువుల ఆరంభానికి శుభదాయకం కాదన్నది నాటి కాలపు సమాజంలోని గాఢవిశ్వాసాలలో ఒకటి. రవి, కుంభ రాశులకు చదువుల ప్రారంభానికి కలసిరావు. లగ్నాత్తు ఆష్టమంలో గ్రహాలేమీ లేకుండా చూసుకొని ముహూర్తం నిర్ణయించుకోవాలని పెద్దలు నిర్దేశించేవాళ్లు. ఈ తరహా జ్యోతిష సంబంధ నియమాలు ఒకటా.. రెండా! పట్టించుకొనేవాళ్లు పట్టించుకొనేవాళ్లు. పట్టింపులేని వాళ్లు పిల్లల చేతిలో ఓ మార్కాపురం పలకా.. నరసాపురం బలపం పెట్టి బడికి తోలేసేవాళ్ళు.  


ముహూర్తం చూసుకుని గానీ, అక్షరం నేర్పించని పెద్దల ఇళ్లల్లో ఎంత మంది చదువు సాములు నేర్చి పండిత ప్రకాండులయ్యారో.. ఆ లెక్కలు అవీ తీసేవాళ్లు అప్పుడూ లేరు. ఇప్పడు అసలే లేరు. 


ఇహ అక్షరాభ్యాసం జరిపించే విధానం గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం. ఓం ప్రధమంగా బిడ్డకు తలారా స్నానం చేయించి , ఆపైన వస్త్ర భూషణాదుల అలంకరణ చేసి , విఘ్నేశ్వరునికి పూజ, సరస్వతీదేవికి అర్చన పూర్తి చేయించేవారు ! అటు పిమ్మట వెదురు చేట నిండానో, వెండి పళ్లెం నిండుగానో సన్నబియ్యం పోసి దానిని రెండే రెండు గీతలతో మూడు భాగాలుగా విభజన చేసి పై భాగంలో 'ఓమ్' .. రెండో భాగంలో 'నమఃశివాయ' .. మూడో గడిలో 'సిద్ధం నమః' అని మూడేసి సార్లు పురోహితుడు బిడ్డ చేత రాయించి నమస్కారం చేయించేవాడు. విఘ్నేశ్వర, సరస్వతీ శ్లోకాలు బిడ్డుచేత ముద్దుగా చదివించేవాడు. 


ఇక్కడి ఈ ' ఓం నమశ్శివాయ' మంత్రం జైన సంప్రదాయం నుంచి పుట్టుకొచ్చిన తతంగమన్నట్లు కొందరి భావన. కాదు.. పరమేశ్వరుడికి 'సిద్ధ' అనే నామాంతరం ఉంది. కాబట్టి 'ఓం నమశ్శివాయ సిద్ధం నమః' అనే ప్రార్థన వ్యవహారంలో 'ఓం నమః శివాయ సిద్ధం నమః' గా మారిందనే ప్రతివాదన తెచ్చేవాళ్లూ కద్దు.  


నృసింహపురాణం ప్రకారం దైపప్రార్థనల అనంతరం గురుపూజ ఒక విధి. గర్గ వచనం ప్రకారం, అజ్యాహుతులతో సరస్వతి, హరి, లక్ష్మి, విఘ్నేశ, సూత్రకారులకు స్వవిద్యను ఉద్దేశించి హోమం చేయడం మరో విధి. ఇప్పుడీ ఆచారాలకు సమయమేదీ? ఉన్నా శ్రద్ధ ఏదీ? బిడ్డకు మంచి పబ్లిక్ పాఠశాలలో అడ్మిషన్ సాధించడమే వంద యజ్ఞాలు నిర్వహించిన పెట్టు. అంత తలకిందులుగా ఉంది నేటి వ్యాపార చదువుల వ్యవహారం.


ఇస్లాం మతంలో కూడా ఈ విద్యారంభానికి దీటుగా 'బిస్మిల్లాఖాని' అనే శుభకార్యం ఉంది. ముసల్మాన్ సంప్రదాయవాదులూ ఐదో ఏట, నాలుగో నెల, నాలుగో రోజు బిడ్డ చేత అక్షరాభ్యాసం చేయిస్తారు. 

'ఏసియాటిక్ బెంగాల్ ' అనే గ్రంథంలో (శాహజహాం) మొగల్ చక్రవర్తి హుమయూన్‌ కు ఈ తరహా అక్షరాభ్యాసం, తదనంతరం ఉత్సవం జరిపినట్లు ఒక ప్రస్తావన కనిపిస్తుంది. 


'శూద్ర కమలాకరం' లో సైతం రాజవిద్యలైన ధనుర్విద్య, ఛురికాబంధనాల ప్రస్తావన వచ్చినప్పుడు శుభదినాలలో ప్రారంభించాలనే నియమం కనిపిస్తుంది. పునర్వసు, పుష్యమి, భరణి, హస్త, స్వాతి, చిత్ర, కృత్తిక, మఘ, రోహిణి, ఉత్తరాత్రయం, శ్రవణ, ధనిష్ఠ, మూల, మృగశిర, పుబ్బ, రేవతి-ఈ నక్షత్రాలలో ధనుర్విద్యారంభం శుభదాయకమని 'ధనుర్విద్యాదీపిక' నిర్దేశిస్తుంది. 


'సర్వాయుధనగామాత్ర..' లాంటి మంత్రాలు కొన్ని మంత్రాలు ఉన్నాయి. వీటితో లక్ష్మీ నారాయణులను పూజించి తొట్టతొలుత ఒక బాణమో, ఛురకత్తో తూర్పు దిశకు వదలడం ఆయుధ విద్యలకు సంబంధించిన కింద లెక్క. 


ఇప్పుడైతే బాణాలు, భురకత్తులు గట్రా విసరడాలు లేవు కానీ .. వాటి స్థానంలో రాళ్లు విసరటం.. ఏసిడ్ బాటిళ్లు నెత్తిన పొయ్యడాలు వంటి విధ్యంసకర విద్యల ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. ఆ విద్యలకు ఏ ఆరంభ ముహూర్తాలు అక్కరలేదు. గురవులతో అయితే అసలు బొత్తిగా అవసరమే లేదు. ప్రతీ ఆకతాయి విద్యార్థి ఎవరికి వాడే ఏకలవ్యుడు ! 


-కర్లపాలెం హనుమంతరావు

09 -09 -2021

బోథెల్, యూ.ఎస్.ఎ

(మూలఃభారతీయ సంస్కారములు -అక్షరాభ్యాసము)

అత్యాశ

 *అత్యాశ*

👉ఒక ఆవిడ విచారంగా కుర్చుని బాధపడుతున్నది 

అటు వైపు వచ్చిన ఓ సన్యాసీ ఆమె దుఃఖం కి కారణం తెలుసుకోవాలనుకున్నాడు .

😃సన్యాసీ :- ఓ స్త్రీ ! ఏమిటి నీ బాధ ?

😌ఆమె :- జీవితం లో సంతోషమే లేదు స్వామి .

😃వెంటనే ఆ సన్యాసీ తన చూపుడు వేలును అక్కడున్న రాయి

కేసి చాచాడు .

ఆ రాయి బంగారు రాయి గా మారిపోయింది .

😃సన్యాసీ :- ఇప్పుడు సంతోషమేన ?

😟ఆమె :- ఆఆ ...అదొక రాయే కదా !

ఈ సారి తన చూపుడు వేలుతో ప్రక్కనే ఉన్న చెట్టును బంగారు చెట్టు గా మార్చేసాడు .

సన్యాసీ :- ఇప్పుడేమంటావు ?

☹️ఆమె :- అదొక చెట్టే కదా !

మల్లి చూపుడు వేలును ఇంటివైపు చూపించాడు . ఇల్లు బంగారు ఇల్లు గా మారిపోయింది .

😃సన్యాసీ :- ఇది చాలా ?

😟ఆమె :- అదొక ఇల్లే కదా !

😃సన్యాసీ :- ఇంత బంగారాన్నిచినా నీకు సంతోషం కలగలేదే ! అయితే నీకేం కావాలి ?

😃ఆమె :- నీ చూపుడు వేలు కావాలి స్వామి .!       

☹️సన్యాసి..

ప్రశ్న పత్రం సంఖ్య: 30

  ప్రశ్న పత్రం సంఖ్య: 30 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  


 తత్వ వేదాంత సంబంధిత ప్రశ్నలు. 


జీవకోటిలో దుర్లభము, ఉత్తమము అయిన మానవజన్మ కలిగి మనం ఉన్నామంటే అది కేవలం మనం గతజన్మలలో చేసుకున్న సుకృతం మాత్రమే. ఈ జన్మను మనము జన్మ రాహిత్యానికి అంటే మోక్షానికి మాత్రమే ఉపయోగించాలని మన ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. ముముక్షువులారా క్రింది ప్రశ్నలను పూరించటానికి ప్రయత్నించండి.   


1. ధృతరాష్ట్రునికి భగవత్గీతను వినిపించింది ఎవరు. 


2. యుద్ధవీరుడు, ధనుర్విద్యా పారంగతుడు అయిన అర్జనుడు యుద్ధం చేయటానికి ఎందుకు వెనుకాడడు. 


3. తత్త్వం అంటే ఏమిటి. 


4. వేదాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది. 


5. సాధకునికి తానూ చేసే సాధనకు మూడు విధాల విజ్ఞాలు కలుగవచ్చని అంటారు అవి ఏవి. 


6. మహావాక్యాలు అంటే ఏమిటి. 


7. అరిషడ్వార్గం అంటే ఏమిటి. 


8. అహం బ్రహ్మాస్మి అనే మహా వాక్యం ఏ ఉపనిషతులోనిది. 


9. మోక్షము సిద్ధవస్తువా లేక సాద్యవస్తువా. 


10. ప్రస్నోపనిషత్తులో ప్రశ్నలకు సమాదానాలు తెలిపిన మహర్షి పేరు ఏమిటి. 


11. త్రిగుణాలు అంటే ఏమిటి. 


12. తమోగుణవంతులు మోక్షానికి అర్హులా 


13. కృష్ణ భగవానులు అన్నిధర్మాలు పరిత్యజించి ఏమి చేయమన్నారు. 


14. సంసారం, సన్యాసం రెంటిలో మోక్షసాధకుడు దీనిని ఎంచుకుంటారు. 


15. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు. 


16. సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటి. 


17. అహమాత్మా బ్రహ్మా అంటే అర్ధం ఏమిటి. 


18. తత్వమసి ఏ ఉపనిషత్తులోది 


19. పంచేంద్రియాలు ఏవి. 


20. నాలుగు మహావాక్యాలు ఏవి 


21. ప్రస్థానత్రయం అని వీటిని అంటారు 


22. శ్రీ ఆదిశంకరాచాయులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. 


23. శ్రీ రామానుజాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. 


24. శ్రీ మద్వాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. 


25. చారువాకవాదం ఏమిటి 


26. షడ్ దర్శనాలు అంటే ఏమిటి. 


27. నిర్వాణ షట్కామ్ వ్రాసింది ఎవరు. 


28. జనక మహారాజుకు వేదాంతాన్ని బోధించింది ఎవరు 


29. భగవత్గీత ప్రకారం కర్మలు చేయాలా లేక చేయవలదా. 


30. మోక్షం అంటే ఏమిటని మీరనుకుంటున్నారు. 

భగవద్గీత

 🌹🙏🌹శ్రీ శివాయగురవే నమః.🌹🙏🌹

🌹🙏🌹శ్రీ పరమాత్మనే నమః.🌹🙏🌹


           🌹🙏🌹భగవద్గీత🌹🙏🌹

ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞానయోగము నుంచి

3వ శ్లోకము, పదచ్ఛేద, టీకా, తాత్పర్యసహితముగా.

   🌹🙏ఓం నమో భగవతే వాసుదేవాయ.🙏🌹


🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ౹

యతాతమపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ౹౹

                                                     ౹౹ 3 ౹౹


మనుష్యాణామ్ , సహస్రేషు , కశ్చిత్ , యతతి , 

సిద్ధయే ౹

యతతామ్ , అపి , సిద్ధానామ్ , కశ్చిత్ , మామ్ , 

వేత్తి , తత్త్వతః ౹౹ ౹౹ 3 ౹౹


మనుష్యాణామ్ , సహస్రేషు = వేలకొలది    

                                           మనుష్యులలో ;

కశ్చిత్ = ఒకానొకడు మాత్రమే ;

సిద్ధయే = భగవత్ప్రాప్తి సిద్ధించుటకై ;

యతతి = ప్రయత్నించును ;

యతతామ్ = (అట్లు) ప్రయత్నించినట్టి ;

సిద్ధానామ్ , అపి = యోగులలోగూడ ;

కశ్చిత్ = ఒకానొకడు మాత్రమే( మత్పరాయణుడై) ;

మామ్ = నన్ను ;

తత్త్వతః = నా యథార్ధ స్వరూపమును ;

వేత్తి = ఎఱుంగును .


తాత్పర్యము : ౼ వేల మనుష్యులలో ఎవడో ఒకడు

మాత్రమే నన్నుగూర్చి తెలిసికొనుటకు ప్రయత్నించు ను . అట్లు ప్రయత్నించినవారిలో గూడ ఒకానొకడు

మాత్రమే మత్పరాయణుడై నా తత్త్వమును అనగా

నా యథార్ధ స్వరూపమును ఎఱుంగును . ౹౹ 3 ౹౹


🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹కృష్ణం వందేజగద్గురుమ్. శ్రీ కృష్ణం వందేజగద్గురుమ్.

    🌹🙏🌹సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.🌹🙏🌹


🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺

   అందరికీ శుభ శుభోదయం . తదుపరి శ్లోకముతో

    మళ్ళీకలుసుకుంద్దాం.. జై శ్రీ మన్నారాయణ.


🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼

                         Yours.....

Yennapusa Bhagya Lakshmi Reddy Advocate AP High Court Amaravathi and State President Legal Cell AP Reddy Sangam and Chairman AP Advocates Associations JAC Andhra Pradesh State

ప్రశ్న పత్రం సంఖ్య: 30

 ప్రశ్న పత్రం సంఖ్య: 30  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 తత్వ వేదాంత సంబంధిత ప్రెశ్నలు. 

జీవకోటిలో దుర్లభము, ఉత్తమము అయిన మానవజన్మ కలిగి మనం ఉన్నామంటే అది కేవలం మనం గతజన్మలలో చేసుకున్న సుకృతం మాత్రమే.  ఈ జన్మను మనము జన్మ రాహిత్యానికి అంటే మోక్షానికి మాత్రమే ఉపయోగించాలని మన ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. ముముక్షువులారా క్రింది ప్రశ్నలను   పూరించటానికి ప్రయత్నించండి.   

1. ధృతరాష్ట్రునికి భగవత్గీతను వినిపించింది ఎవరు. 

2. యుద్ధవీరుడు, ధనుర్విద్యా పారంగతుడు అయిన అర్జనుడు యుద్ధం చేయటానికి ఎందుకు వెనుకాడడు. 

3. తత్త్వం అంటే ఏమిటి. 

4. వేదాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది. 

5. సాధకునికి తానూ చేసే సాధనకు మూడు విధాల విజ్ఞాలు కలుగవచ్చ అని అంటారు అవి ఏవి. 

6. మహావాక్యాలు అంటే ఏమిటి. 

7. అరిషడ్వార్గం అంటే ఏమిటి. 

8. అహం బ్రహ్మాస్మి అనే మహా వాక్యం ఏ ఉపనిషతులోనిది. 

9. మోక్షము సిద్ధవస్తువా లేక సాద్యవస్తువా. 

10. ప్రస్నోపనిషత్తులో ప్రశ్నలకు సమాదానాలు తెలిపిన మహర్షి పేరు ఏమిటి. 

11. త్రిగుణాలు అంటే ఏమిటి. 

12. తమోగుణవంతులు మోక్షానికి అర్హులా 

13. కృష్ణ భగవానులు అన్నిధర్మాలు పరిత్యజించి ఏమి చేయమన్నారు. 

14. సంసారం, సన్యాసం రెంటిలో మోక్షసాధకుడు దీనిని ఎంచుకుంటారు. 

15. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు. 

16. సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటి. 

17. అహమాత్మా బ్రహ్మా అంటే అర్ధం ఏమిటి. 

18. తత్వమసి ఏ ఉపనిషత్తులోది 

19.  పంచేంద్రియాలు ఏవి. 

20. నాలుగు మహావాక్యాలు ఏవి 

21. ప్రస్థానత్రయం అని వీటిని అంటారు 

22. శ్రీ ఆదిశంకరాచాయులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. 

23. శ్రీ రామానుజాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. 

24. శ్రీ మద్వాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. 

25. చారువాకవాదం ఏమిటి 

26. షడ్ దర్శనాలు అంటే ఏమిటి. 

27. నిర్వాణ షట్కామ్ వ్రాసింది ఎవరు. 

28. జనక మహారాజుకు వేదాంతాన్ని బోధించింది ఎవరు 

29. భగవత్గీత ప్రకారం కర్మలు చేయాలా లేక చేయవలదా. 

30. మోక్షం అంటే ఏమిటని మీరనుకుంటున్నారు. 

పరమాచార్య స్వామి వారి సమీక్ష

 ॐ గాణపత్యం పై కాంచి పరమాచార్య స్వామి వారి సమీక్ష 


    వినాయకుణ్ణి ధారణచేసి మనం కొంచెం యోచిస్తే, ప్రతి చిన్న విషయంలోనూ అయనను గూర్చి మన కొక తత్త్వం నయన పర్వంగా దీపిస్తుంది.


    వినాయకునికి మనం కొబ్బరికాయలు కొడతాం. ఎందుకు? 

    ఒకప్పుడు విఘ్నేశ్వరుడు తండ్రియైన పరమశివుని చూచి, 'నాకు నీ తలను బలిగా ఇవ్వు' అని అడిగాడట. 

    తలను ఉత్తమాంగం అని అంటారు. మనకున్న వస్తువులో పరమ శ్రేష్ఠమైన వస్తువును త్యాగంచేసి అర్చిస్తే కదా అది భక్తి.  

    ఈశ్వరుడు త్రయంబకుడు - మూడుకళ్ళవాడు. తన తలకు ఈడైన వస్తువునొకటి ఈశ్వరుడు సృష్టించాడు. ఆ వస్తువే మూడుకళ్ళుకల కొబ్బరికాయ.     

   "వినాయకునికి మీరు కూడా మూడుకళ్ళ కొబ్బరికాయ కొట్టండి" అని ఈశ్వరుడు అనుగ్రహించినట్లున్నది. 

    తమిళనాడులో కొబ్బరికాయ జుట్టును పూర్తిగా తీసివేసి ఒక్కవ్రేటులో పగిలేటట్లు కొట్టడం ఒక అలవాటు. దానిని వాళ్ళు "సిదిర్ తేంగాయ్" అని వ్యవహరిస్తారు. 


    ఒకప్పుడు నేను చాతుర్మస్యదీక్షలో నాగపట్నంలో ఉన్నాను. అక్కడ వినాయకుని ముందు విస్తారంగా కొబ్బరికాయలు కొట్టేవారు. ఆలయం ముందు ఒకటే పిల్లల సందడి. కాయను కొట్టీ కొట్టకముందే పిల్లలు మూగి చెదిరే కొబ్బరిముక్కలకై పోట్లాడుకునేవారు. కొందరు పెద్దలు వారిని గద్దించారు. 

   "కొబ్బరి ముక్కలను ఏరుకోవద్దని గద్దించారు. "కొబ్బరి ముక్కలను ఏరుకోవద్దని గద్దించడానికి మీకేవరు అధికారం ఇచ్చారు?" అని పిల్లలు తిరగబడ్డారు .

    ఔను, ఆ చిట్టిదైవానికి ఆ చిట్టిపిల్లలే సొంతం అని నాకు అనిపించింది. 

    కొబ్బరికాయను పగలకొడితే అందులొని నారికేళ జలం లభించినట్లు, అహంకారం అణిగితే ఆత్మానుభూతి కల్గుతుంది.  


    గణపతిది స్థూలదేహం. ఆయన నామాలలో స్థూలకాయుడు అన్నదొకటి. అయన పర్వతంవలె ఉన్నాడు. కాని అతడేమో చిన్నబిడ్డ. 

    బిడ్డలకు పుష్టియే అనందం. చిక్కిపోయిన శిశువూ, బొద్దుగా వున్న సన్యాసీ ఒక విరోధాభాసం. వయసు ముదిరే కొద్దీ ఉపవాసం వుండి శరీరాన్నికొంచెం శుష్కింపచేయడం మంచిది. 

    చిన్న బిడ్డలు ఉపవాసముండనక్కర్లేదు. 


    గణపతి వాహనం ఎలుక. ఈయన ఎంత స్దూలకాయుడో, అది అంత సూక్ష్మమైన దేహం కలది. ఈయనకు వాహనం వలన వచ్చే గౌరవం ఏమిలేదు. 

    స్థూలకాయుడైనా, తన వాహనానికి ఏ విధమైన శ్రమా ఉండరాదని, అయన లఘిమాసిద్ధితో బెండువలె తేలికగా ఉంటాడు. అదొక విశేషం. 

    

    ఒక్కొక్కప్రాణికీ, ఒక్కొక్క విషయంలో ప్రీతి. 

    చమరీమృగానికి తోక అంటే ప్రీతి. 

    నెమలికి దాని ఫింఛమే బంగారం. 

     ఏనుగుకు దంతాలంటే ప్రాణం.   

     కానీ మన గణపతి మహాభారత రచనా సందర్భంలో తన ప్రాణప్రదమైన దంతాన్ని ఊడబెరికి, దానిని కలంగా చేసుకొని, వ్యాసులవారు గంగా స్రవంతిలా భారతాన్ని కవనం చేస్తుంటే, పద్దెనిమిది పర్వాలు చకచకా వ్రాసిముగించి వేశాడు.         


"ఆనందాద్థ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే"             

    పార్వతీ పరమేశ్వరుల ఆనందార్ణవంలో నుంచి ఉద్భవించిన వీచికలాంటివాడు మన గణపతి. 


    శ్రీదేవి సేనలను ప్రతిఘటించడానికి భండాసురుడు ఒక విఘ్నయంత్రాన్ని రణమధ్యంలో స్థాపించాడు. 

    ఆ సమయంలో లలితాదేవి కామేశ్వరుని చూచి ఆనందంగా ఒక చిరునవ్వు నవ్వింది. ఆ హాసచంద్రికలనుంచి ఒక దేవుడు, మదజలాక్త కుంభస్థలంతో గజానుడై పుట్టాడు. ఆ దేవుడు ఇరువదెనిమిది అక్షరములు మంత్రానికి అధిపతి. 

    ఆయన భండాసురుని విఘ్నయంత్రాలను క్షణంలో భగ్నంచేసి తల్లికి ఎనలేని సహాయం చేశాడు. 


    ఏకార్యం తలపెట్టినా మనం ముందు, విఘ్నేశ్వరుని తృప్తి పరచాలి. ఆయన అనుగ్రహం ఉంటే ,అన్నీ అనుకూలంగా సమాప్తమౌతాయి. అన్నిటికీ ఆది దైవం ఆయనే. గణపతినే ప్రధానమూర్తిగా ఉపాసించేవారిని గాణపత్యులని అంటారు.  


    వినాయకుని ముందు మనం గుంజిళ్ళు తీస్తాం. సంస్కృతంలో దానిని 'దోర్భి:కర్ణ'మని అంటారు. దోర్భి: అంటే చేతులు. కర్ణమంటే చెవులు.దోర్భి:కర్ణమంటే చేతులతో చేవులని పట్టుకొని గుంజిళ్ళూ తీయటం. 

    ఒకప్పడు మహావిష్ణువు వైకుంఠం నుండి కైలాసానికి వెళ్ళారట. అక్కడ మేనల్లుడైన గణపతి కనపడి ఆయన సుదర్శన చక్రాన్ని లాక్కోని ఎంతవేడినా తిరిగి ఇవ్వలేదట. మహవిష్ణువుకు ఏమి చేయడానికీ తోచక తన రెండు చెవులనూ, నాలుగు చేతులతో పట్టుకొని గుంజిళ్ళు తీశారట. 

    ఈ విచిత్ర చర్యకు వినాయకుడు దొర్లిదొర్లి నవ్వాడట. చిన్నబిడ్డకదా!సుదర్శన చక్రం విషయం మఱచిపోయాడు! అంతటితో అమ్మయ్యా! అని చక్రం తో బాటు విష్ణువు బయటపడ్డాడట. 


    ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగాలంటే, 

    విఘ్నేశ్వరుని అనుగ్రహం జరగాలంటే, 

    విఘ్నేశ్వరుని అనుగ్రహం అక్షయంగా ఉండాలి. 

    అందుకే ఆయనకు, 

"యన్నత్వాకృతకృత్యాశు తం నమామి గజాననం" అన్న ప్రశస్తి.