22, సెప్టెంబర్ 2021, బుధవారం

సంస్కృత మహాభాగవతం

 *22.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*పార్థివేష్విహ దేహేషు ప్రవిష్టస్తద్గుణాశ్రయః|*


*గుణైర్న యుజ్యతే యోగీ గంధైర్వాయురివాత్మదృక్॥12466॥*


వాయువు తనతో సుగంధ-దుర్గంధములను మోసుకొనిపోవునేకాని, వాటితో అలిప్తమై ఉండును. అట్లే ఆత్మజ్ఞాని పార్థివశరీరమునందు ఉండునంతవరకు, శరీరపరమైన వ్యాధులను, బాధలను, ఆకలి-దప్పికలను మున్నగువాటిని వహింపవలసివచ్చును. కాని, తాను శరీరము కాదనియు, ఆత్మరూపుడనై ద్రష్టగా ఉండే తనకు శరీరముతోగానీ, దాని గుణములతోగానీ సంబంధము లేదనియు, నిర్లిప్తుడై ఉండవలయును.


*7.42 (నలుబది రెండవ శ్లోకము)*


*అంతర్హితశ్చ స్థిరజంగమేషు బ్రహ్మాత్మభావేన సమన్వయేన|*


*వ్యాప్త్యావ్యవచ్ఛేదమసంగమాత్మనో మునిర్నభస్త్వం వితతస్య భావయేత్॥12467॥*


స్థావర - జంగమాత్మకములు అన్నియును వేర్వేరు రూపములలో ప్రతీతములగుచున్నను వాస్తవముగా వాటిలో ఒకే ఆకాశము అపరిచ్ఛిన్న రూపములలో వ్యాప్తమై యుండును. బ్రహ్మ సకలవస్తువుల యందును అంతరాత్మగా విలసిల్లియున్నాడని *తత్త్వమసి* మొదలగు వాక్యములు సమన్వయపరచుచున్నవి. ఆకాశమువలె అది అవ్యవచ్చేదము. అనంగము. ఆ బ్రహ్మతత్త్వము చరాచరాత్మకములైన సకలభూతములయందును సంపూర్ణముగా వ్యాపించియున్నది. అది ప్రాణులలోపలను, వెలుపలను వ్యాప్తమైయున్నదని యోగి ఆకాశమునుండి గ్రహింపవలెను.


*7.43 (నలుబది మూడవ శ్లోకము)*


*తేజోఽబన్నమయైర్భావైర్మేఘాద్యైర్వాయునేరితైః|*


*న స్పృశ్యతే నభస్తద్వత్కాలసృష్టైర్గుణైః పుమాన్ ॥12468॥*


వాయువు ప్రేరణతో అగ్ని ప్రజ్వరిల్లును. వర్షము కురియును. అన్నము ఇత్యాది పంటలు పండును, నశించును. వాయువువల్లనే మేఘములు ఆకాశమునందు వచ్చి, పోవుచుండును. ఇవన్నీజరిగినప్పటికినీ ఆకాశము లేనిచో లిప్తము గాకుండును. ఇదేవిధముగా మననశీలుడగు సాధకుడు కాలముచే నిర్మింపబడిన గుణములు, ద్రవ్యములు వచ్చినను, పోయినను ఆకాశమువలె వాటితో ఎట్టి సంబంధము లేకుండా ఉండవలెను.


*7.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*స్వచ్ఛః ప్రకృతితః స్నిగ్ధో మాధుర్యస్తీర్థభూర్నృణామ్|*


*మునిః పునాత్యపాం మిత్రమీక్షోపస్పర్శకీర్తనైః॥12469॥*


జలము సహజముగా స్వచ్ఛమైనది, మధురమైనది, మానవులను పవిత్రమొనర్చు తీర్థరూపమైనది. అట్లే ముని (సాధకుడు) స్వాభావికముగా రాగద్వేషరహితుడు, అందరియెడ స్నేహభావముగలవాడు, తన దృష్టిద్వారా, స్పర్శద్వారా, మధురాలాపములద్వారా మానవులను పవిత్రమొనర్చువాడై ఉండవలెను.


*7.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*తేజస్వీ తపసా దీప్తో దుర్ధర్షోదరభాజనః|*


*సర్వభక్షోఽపి యుక్తాత్మా నాదత్తే మలమగ్నివత్॥12470॥*


మననశీలుడగు ముని అగ్నివలె తేజస్వియై, తపశ్శక్తిచే తేజరిల్లుచుండును. ఇతరులచే జయింప శక్యముగానివాడై యుండును. ఎట్టి సంగ్రహమునకు పాల్పడకుండా భిక్షామాత్రము స్వీకరించి తృప్తి చెందుచుండును. జితేంద్రియుడై నిత్యనిరంతరము అధ్యాత్మచింతనలో మునిగియుండును. తనయందు సమర్పింపబడే ఆహుతులను స్వీకరించే అగ్ని, దాని గుణ-దోషములతో అంటకుండునట్లుగా, మునియైనవాడు తనకు లభించిన ఆహారమును స్వీకరించుటవలన, అతనికి ఎట్టి దోషమును అంటదు (అభక్ష్య పదార్థములను అతడు తాకనే తాకడు అనుమాట గమనార్హము).


*7.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*క్వచిచ్ఛన్నః క్వచిత్స్పష్ట ఉపాస్యః శ్రేయ ఇచ్ఛతామ్|*


*భుంక్తే సర్వత్ర దాతౄణాం దహన్ ప్రాగుత్తరాశుభమ్॥12471॥*


అగ్ని ఒకచో దాగియుండును. మరియొకచో ప్రకటమగుచుండును. శ్రేయకాములు అగ్నిని ఉపాసించెదరు. వారికొరకు అగ్ని ప్రకటమగును. హోమము చేయువారల హవిస్సును భుజించును. దాతల భూతభవిష్యత్తులలోని పాపములను అగ్ని దహింపజేయును. అట్లే సాధుపురుషుడు అగ్నివంటివాడు. అతడు తన మహత్త్వమును ఒకచో గుప్తముగ నుంచును. వేరొకచో బహిర్గతమొనర్చును. శ్రేయస్సును కోరువారు అతనిని సేవించెదరు. తనను సేవించువారల పూర్వాపర (భూతభవిష్యత్తునందలి) పాపములను నశింపజేసి, వారికి శుభములను చేకూర్చును.


*7.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*స్వమాయయా సృష్టమిదం సదసల్లక్షణం విభుః|*


*ప్రవిష్ట ఈయతే తత్తత్స్వరూపోఽగ్నిరివైధసి॥12472॥*


పరమాత్మ తన మాయా ప్రభావముచే చిదచిదాత్మకమైన జగత్తునందు ప్రవేశించి, ఆయా స్వరూపములలో (దేవమనుష్యాది రూపములలో) ప్రతీతమగును. అట్లే అగ్నియు వివిధరూపములలో నున్న ఇంధనములయందు ఆయా రూపములలో ప్రకటితమగుచుండును. దాని సహజరూపములు అవి యెవ్వియును కావు. అగ్ని ఒక్కటే ఉన్నట్లుగా పరమాత్మ అంతటా ఒక్కడే ఉన్నాడు.


*7.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*విసర్గాద్యాః శ్మశానాంతా భావా దేహస్య నాఽఽత్మనః|*


*కలానామివ చంద్రస్య కాలేనాఽవ్యక్తవర్త్మనా॥12473॥*


కాలవేగప్రభావమున చంద్రునియొక్క కళలు పెరుగుచున్నట్లును, తరుగుచున్నట్లును ద్యోతకమగు చుండును. అట్లే పుట్టినది మొదలుకొని, మరణించుట వఱకును దేహమునకు బాల్యయౌవన కౌమార్యాద్యవస్థలు, షడ్వికారములు కాలప్రభావమున ఏర్పడుచుండును. కాని ఆత్మలో ఎట్టి మార్పులును ఉండవు. కావున సకల ప్రాణులకు వృద్ధిక్షయములు సహజములనియు, ధీరుడు వాటికి చలింపడనియు గ్రహింపవలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

Mumbaikars

 Dedicated to all the Mumbaikars


If you ask for directions in Mumbai, be prepared for this -


Someone from Lucknow asked politely:


State Bank ke main office ka Raasta bataiye-ga. 


Reply he got from a passerby in Mumbai:


*Churchgate mein utharneka*. 


*Bahar bridge girega*. 


*Bridge ke neechey se jaaneka*. 


*Signal girega*. 


*Udhar right maarneka*. 


*Petrol pump girega*. 


*Left maarneka*. 


*LIC building girega*. 


*Seeda tapkega tho SBI girega*.


Man: Itna sab kuch tapkegà aur girega, toh main pahchunga kaise.

శ్రీమద్భాగవతము

 *22.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2269(౨౨౬౯)*


*10.1-1389-*


*క. గోపాలకృష్ణుతోడను*

*భూపాలక! మున్ను తొడరి పొలిసినవారిన్*

*నీ పాల బుధులు చెప్పరె*

*కోపాలస్యములు విడిచి కొలువం దగదే."* 🌺 



*_భావము: ఓ కంసరాజా! గోపాలకుడగు ఈ శ్రీకృష్ణుని తో ఇంతకు ముందు ఎందరో వీరులు, రాక్షసులు తలపడి నశించిపోయారు కదా! నీ కొలువులోని పెద్దలు ఇంతకు ముందే ఈ విషయమును చెప్పి, క్రోధమును, తామస బుద్ధిని త్యజించి శ్రీకృష్ణుని శరణు వేడమని చెప్పలేదా??_* 🙏



*_Meaning: O King! Already many warriors and demons attacked this cowherd Sri Krishna and perished at His hands. Didn't the well wishers and elders in your court alert and warn you about this? Didnt they advise you to give up anger and wicked behaviour and seek refuge at the feet of Sri Krishna?_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

ప్రశ్న పత్రం సంఖ్య: 33

 ప్రశ్న పత్రం సంఖ్య: 33 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఇక్కడ అడిగే  ప్రశ్నలు నిజానికి ప్రశ్నలు కావు ఎందుకంటె ప్రతి ప్రశ్నకు ఒక నిర్దుష్ట జవాబు ఉండాలి కానీ కేవలం కొన్ని జరగని విషయాలు యాదృచ్చికంగా జరిగితే మనం ఎలా స్పందిస్తామని అలోచించి ఈ ప్రశ్నలు తయారు చేయటం జరిగింది. ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరు ఎలా ఆలోచిస్తారా అన్న తమషాను చూద్దాం. . 

 1) శిశువు పుట్టిన వెంటనే మాట్లాడితే ఎట్లావుండుంది. 

2)  ప్రపంచంలో వున్నమానవులందరికి నిశ్చయంగా నూరు సంవత్సరాల ఆయుర్దాయం స్థిరంగా (common)గా ఉంటే మనుషులు ఎలా ఆలోచిస్తారు. 

·3)  పశువుల లాగ మనుషుల పిల్లలు కూడా పుట్టిన వెంటనే నడిస్తే యెట్లా ఉంటుంది.  

4) మనం నరకం, స్వర్గం అని అంటున్నాం కదామనుషులు చేసే కర్మలకు ఒక నిర్దుష్ట సమయం అంటే ఒక సంవస్త్సర కాలం తరువాత దాని ఫలితం అంటే పాప, పుణ్యఫలితం వస్తే యెట్లా ఉంటుంది. 

 5) ప్రతి మనిషికి తన గత జన్మ గుర్తువుంటే ఏమి చేస్తారు. 

 6) మనం దివ్య ద్రుష్టి అని పురాణఇతిహాసాలలో చదువుకున్నాం కదా ఏదో ఒక విద్య వలన కొంత జ్ఞ్యానం వున్నవారు ఆ శక్తిని పొందితే ఎలా ఉంటుంది. 

7)  మన శరీరంలో అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో మనం చూడలేముకదా. ఆలా కాకుండా ఒక శక్తిని సంపాయిస్తే మనశరీరంలో ప్రతి అవయవాన్ని మనం చూసి దానిని నియంత్రించే శక్తి ఉంటే, ఉదాహరణకు మీరు ఏదో కొంచం ఎక్కువగా భుజించారనుకోండి అప్పుడు వెంటనే జీర్ణం కాక ఇబ్బంది పడతారు కానీ మీకు ఆశక్తివల్ల వెంటనే జీర్ణం చేయగలరు. ఇంకొకటి ఎవరికైనా ఏదైనా ఎముక విరిగినదనుకోండి దానిని తెలుసుకొని వెంటనే ఆ విరిగిన ఎముకను అతికించగల శక్రి. 

8) కనురెప్పలు పారదర్శకంగా అంటే ఒక గాజుపలకం లాగ ఇటునుంచి అటు కాంతి ప్రసరిస్తే ఎలావుంటుంది. 

9) ఎదుటి వారి మనసులో వున్నది ఏమిటో తెలుసుకుంనే శక్తి ఉంటే ఎలావుంటుంది. 

10) మనం అనారోగ్యవంతులం అయితే వెంటనే ఏది తింటే, తాగితే ఆ రోగం తగ్గుతుందో ప్రతివారికి తెలిస్తే ఎలావుంటుంది. 

11) మనుషులు కూడా పక్షుల లాగ గాలిలో ఎగరగలిగితే ఎలా ఉంటుంది. 

12) మనిషికి రెండు చేతులు కాకుండా నాలుగు చేతులు ఉంటే ఎలావుంటుంది. 

13)కోతులకు లాగ మనుషులకు కూడా దవడలు రెండువైపులా రెండు సంచులు ఉండి ఒకసారి ఎక్కువ ఆహరం తీసుకొని ఆ సంచులు నింపుకొని మరల ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొద్దికొద్దిగా తినే విధానం ఉంటే ఎలావుంటుంది. 

15).మనుషులు నీటిలో ముంగి చేపలలాగా ఈతకొట్టే శక్తి ఉంటే ఎలా ఉంటుంది.  

16) మనిషి తనకు కావలసినంత ఎత్తు మరియు కావాలంటే చిన్నగా అంటే కామరూపులుగా వుండే విద్య ఉంటే ఎలావుంటుంది. 

17) ఒకసారి ఆహరం తీసుకుంటే కొన్ని నెలలదాకా ఆకలి కాకుండా ఉంటే ఎలావుండుండి. 

18).ఒకేసారి బహుపనులు చేయగలిగితే అంటే ఒకవైపు మాట్లాడుతూ, ఒకవైపు తింటూ, వింటూ, చేతులతో వివిధపనులు చేస్తూ వుండే శక్తి ఉంటే ఎలా ఉంటుంది. 

19. తనుతలచిన వారితో మనసులో తలుచుకున్న వెంటనే ఎంతదూరంలో వున్నా చూసి మాట్లాడే శక్తి ఉంటే ఎలావుంటుంది. 

20  మనిషి తన ఆయుష్షును తానె నిర్ణయించుకునే అవకాశం ఉంటే ఎలావుంటుంది. 

ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వ దలచిన వారు ముందుగా follower గా అయ్యి క్రింద comment box లో మీ సమాదానాలు  వ్రాయగలరు. వాటిని ఇక్కడ పబ్లిష్ చేయబడును. 

ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడు మీ ఊహలకు పదును పెట్టండి. 


భారతదేశంలో ఏకైక గ్రామాలు:*

 *భారతదేశంలో ఏకైక గ్రామాలు:*

 ______________________________


 *01. శని శిగ్నాపూర్, మహారాష్ట్ర.*

 మొత్తం గ్రామంలోని అన్ని ఇళ్లు తలుపులు లేకుండా ఉన్నాయి.

 పోలీస్ స్టేషన్ కూడా లేదు.

 దొంగతనాలు లేవు.


 *02. షెట్‌ఫాల్, మహారాష్ట్ర.*

 గ్రామస్థులు తమ కుటుంబ సభ్యులుగా ప్రతి కుటుంబంలో SNAKES కలిగి ఉంటారు.


 *03. హైవే బజార్, మహారాష్ట్ర.*

 భారతదేశంలో అత్యంత ధనిక గ్రామం.

 60 మిలియనీర్లు.

 ఎవరూ పేదవారు కాదు

 అత్యధిక GDP.


 *04. పున్సారి, గుజరాత్.*

 అత్యంత ఆధునిక గ్రామం.

 CCTV & WI-FI ఉన్న అన్ని ఇళ్ళు.

 అన్ని వీధి దీపాలు సౌరశక్తితో ఉంటాయి.


 *05. జంబూర్, గుజరాత్.*

 గ్రామస్తులందరూ భారతీయులే, ఇంకా అందరూ ఆఫ్రికన్ లాగానే కనిపిస్తారు.

 ఆఫ్రికన్ గ్రామంగా మారుపేరు.


 *06. కుల్ధార, రాజస్థాన్.*

 హాంటెడ్ గ్రామం.

 అక్కడ ఎవరూ నివసించరు.

 గ్రామస్తులు లేని గ్రామం

 అన్ని ఇళ్లు వదిలివేయబడ్డాయి.


 *07. కోడిన్హి, కేరెల.*

 TWINS గ్రామం.

 400 కంటే ఎక్కువ కవలలు.


 *08. మాటూరు, కర్ణాటక.*

 100% సంస్కృతం మాట్లాడే గ్రామస్థులు వారి సాధారణ రోజువారీ సంభాషణలో.


 *09. బర్వాన్ కాలా, బీహార్.*

 బ్యాచిలర్స్ గ్రామం.

 గత 50 సంవత్సరాల నుండి వివాహం లేదు.


 *10. మవ్లిన్ నాంగ్, మేఘాలయ.*

 ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామం.

 అలాగే ఒక చిన్న రాతిపై అద్భుతమైన బ్యాలెన్సింగ్ భారీ రాతితో.


 *11. రాంగ్‌డోయ్, అస్సాం.*

 గ్రామస్తుల నమ్మకాల ప్రకారం, కప్పలు RAINS పొందడానికి వివాహం చేసుకుంటాయి.


 *12 .కోర్లాయ్ గ్రామం, రాయగడ, మహారాష్ట్ర.*

 గ్రామస్తులందరూ పోర్చుగీస్ భాష మాట్లాడే ఏకైక గ్రామం.


 మనలో చాలా మందికి ఈ ప్రదేశాల యొక్క ప్రత్యేకమైన విషయాలు తెలి. యవు ... !! కాబట్టి షేర్ చేస్తూ ఉండండి ...

గులాబీ

 శీర్షిక. గులాబీ...నీకు సలామ్




వివిధ వర్ణశోభిత సౌందర్య గులాబీ 

నీకు ఈ ప్రకృతి గులామ్ 

నందన వనంలోని పుష్ప సముదాయంలో

మకుటాయమానం నీ స్థానం 

పుష్పజాతికి సింహాసనం నీ స్థానం 

ప్రకృతి నీకు ఆత్మీయ పలకరింపులతో

ప్రకృతికి నీవు ఇచ్చే ఆలంబనలే 

మానవాళికి నీతివాక్యాలు

గులాబీ నీకు ఈ విశ్వం గులామ్ 

నీ మౌన రాగం మాకు గుణపాఠాలు 

గుత్తులుగా వికసించి ఐక్యమత్యం నేర్పిస్తావు

రేక గులాబీలా ఒంటరిగా ఉంటూ ధైర్యంగా నడిపిస్తావు

శ్వేత వర్ణములో స్నేహబంధాన్ని అందరికీ అందిస్తావు 

రక్త వర్ణములో నీవు ప్రేమబంధాన్ని పంచిస్తావు  

పీత వర్ణములో సూచిస్తావు శుభములకు శ్రీ కారం

శాంతి సందేశాలకు స్వాగతం పలుకు అలంకారం

నీ సహజ వర్ణములో మురిపిస్తావు మహిన 

ముళ్ళ మధ్య పెరిగిన ఓ గులాబీ.... సమాజంలో శతృవులతో సహజీవన సామరస్యంతో శిక్షణ నిచ్చావు

సర్వ శుభాలకు నీకు ప్రధమాహ్వానము 

వికసించిన నీ దరహాసమే జగతికి శోభ

నిత్యం భగవంతుని చేరు నీ స్థాయి అజరామరం 

అందరి హృదయాలలో నీకు స్థిరాసనం 

నీకు సదా సలామ్, అన్య పుష్పాలన్నీ నీకు గులామ్

ఓ గులాబీ నీకు సదా సలామ్ సదా సలామ్...

నిత్య నూతన సౌందర్యం నీ సొంతం...సలామ్ 

ఓ గులాబీ నీకు నా సలామ్.


డాక్టర్ దేవులపల్లి పద్మజ, విశాఖపట్నం

జీవగడియారం

 ⌚ *జీవగడియారం*⏰

మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి 

వస్తే,  4.00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. 

కానీ కొన్నిసార్లు మనం అలారం ముందు లేస్తాము. 

ఇది బయో-గడియారం. 


చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో 

చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 


50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు

వస్తాయని నమ్మి చాలామంది తమ సొంత బయోక్లాక్‌ను

ఏర్పాటు చేసుకున్నారు.  అందుకే సాధారణంగా 50-60 

వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  మనం మనకు 

తెలియకుండానే  బయోక్లాక్‌ను తప్పుగా సెటప్ చేస్తాము. 


*చైనాలో చాలా మంది ప్రజలు 100 సంవత్సరాల వరకు

జీవిస్తారు. వారి బయోక్లాక్ అలా ఏర్పాటు చేయబడింది.


కాబట్టి మిత్రులారా, 

*1. మనము బయో-గడియారాన్ని సర్దుబాటు చేసి, 

తద్వారా మనం కనీసం 100 సంవత్సరాల వరకు 

జీవించవచ్చు.


*2. 40 నుండి 60 సంవత్సరాల వయస్సులో ఎటువంటి 

వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి.


*3. డై ( తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి యవ్వనంగా 

చూడండి. వృద్ధాప్యం కనిపించడానికి అనుమతించవద్దు.


*4. చురుకుగా ఉండండి. నడవడానికి బదులుగా 

జాగింగ్ చేయండి. 


*5. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని

నమ్మండి. (ఇది నిజం).


*6. ప్రతిదానికీ కారణం మన మనస్సు. బయో క్లాక్ ని 

మీ  తక్కువ ఆయుర్దాయం కోసం సెట్ చేయవద్దు... కనీసం ఓ వంద సంవత్సరాల కైనా సెట్ చేయండి.

మొగలిచెర్ల

 *భక్తి తో కూడిన విశ్వాసం..*


"అన్నదానానికి మా అల్లుడు కూతురు విరాళం ఇద్దామనుముంటున్నారు.. ఇప్పుడే ఇవ్వమంటారా?..లేక రేపుదయం ఇవ్వొచ్చా?" అని నల్గొండ నుంచి వచ్చిన శ్రీ మాల్యాద్రి గారు ఒక శనివారం సాయంత్రం పల్లకీ సేవకు ముందు నన్ను అడిగారు..


"మీ ఇష్టం..రేపుదయమే ఇవ్వండి.." అన్నాను..


శ్రీ మదమంచి మాల్యాద్రి గారు, ఎన్నో ఏళ్లనుంచి..ఖచ్చితంగా చెప్పాలంటే..1981 నుంచీ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పరమ భక్తులు..శ్రీ స్వామివారిని అత్యంత భక్తి విశ్వాసాలతో కొలిచే కుటుంబాలలో వీరిది కూడా ఒకటి..


మాల్యాద్రి గారి తల్లిగారు కీర్తి శేషురాలు శ్రీమతి లక్షమ్మ గారికి ఆరోజుల్లో కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది..ఆరోజుల్లో అందుబాటులో ఉన్న పరీక్షలన్నీ చేయించారు.. చివరకు వైద్యులు, కడుపులో గడ్డ ఉందని తేల్చారు!.. మందులెన్నో వాడారు..ఫలితం కనబడలేదు..ఆపరేషన్ చేయాలని తీర్మానించారు!..లేకపోతే ప్రాణానికే ముప్పు ఉందని కూడా చెప్పారు..ఆవిడకు ఎటూ పాలుపోలేదు..


ఆ సమయంలోనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమం నిర్మించిన శ్రీ బొగ్గవరపు మీరాశెట్టిగారి బావమరిది రాములుసెట్టి గారు, లక్షమ్మ గారితో, "ఒకసారి, మొగలిచెర్ల వచ్చి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి వద్ద మొక్కుకో..నీకు ఆరోగ్యం కుదుటబడుతుంది!.." అని చెప్పారట!..లక్షమ్మ గారు, ఆ మాట పట్టుకుని, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వరుసగా మూడు వారాలు పాటు వచ్చారు..ఆవిడ భక్తి విశ్వాసాలు ఆ దత్తాత్రేయుడికి తాకాయి..ఆయన అనుగ్రహమూ లక్షమ్మ గారి మీద ప్రసరించింది..మరో వారానికల్లా, ఆవిడ నొప్పి నయమైంది..ఆ తరువాత మళ్లీ పరీక్షల కోసం డాక్టర్ గారి దగ్గరకు వెళ్లారు..ఎటువంటి అనారోగ్యమూ లేదని డాక్టర్ గారు తేల్చి చెప్పేసారు..


తల్లి ఆరోగ్యంగా ఉండటానికి కారణమైన శ్రీ దత్తాత్రేయుడిని, మాల్యాద్రి గారు పరిపూర్ణంగా నమ్మారు!..నల్గొండ లో ఇటుకబట్టీల వ్యాపారం చేస్తూ, తనకే కష్టం వచ్చినా, మొగలిచెర్ల దత్తుడిదే భారం అనుకున్నారు..ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా శ్రీ స్వామివారిని దర్శించుకోవడం ఒక నియమంగా పెట్టుకున్నారు..


"ఆ స్వామి చల్లగా చూడబట్టే..నా సంసారం బాగుంది..పిల్లలూ ఎదిగొచ్చారు..నిలదొక్కుకున్నారు..ఇదిగో ఈ అమ్మాయి డెంటల్ డాక్టర్, అల్లుడు బ్యాంక్ లో ఉన్నాడు..హైదరాబాద్ లో కూకట్పల్లి లో ఉంటారు..వీడు మనుమడు"!.అంటూ హాయిగా నవ్వారు..


మాల్యాద్రి గారి అల్లుడు గుర్రం వెంకట నారాయణ, ధనలక్ష్మి అనబడే ఆ దంపతులిద్దరూ..భక్తిగా శ్రీ స్వామి వారి వద్ద ఆరోజు అన్నదానం చేయించారు..అత్యంత నిరాడంబరంగా, అన్నదాన సత్రం వద్ద, అన్ని పనుల్లో పాలుపంచుకుని, మరోసారి దత్తాత్రేయుడికి నమస్కారాలర్పించి..మొగలిచెర్ల నుంచి కొండంత తృప్తితో తిరిగి వెళ్లారు..మాల్యాద్రి గారు మళ్లీ మొగలిచెర్ల త్వరగా వస్తానని చెప్పి వెళ్లారు!..


మొగలిచెర్ల దత్తాత్రేయుడి వద్దకు వచ్చే ఒక్కో భక్తుడిది ఒక్కో అనుభవం..ఎవరికి వారికే అది అనుభవం లోకి వచ్చే అనుభూతి!..ఎందరి అనుభవాలో మేము వింటూ ఉంటాము..కానీ..ప్రతిసారీ మాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది..మేము నిత్యమూ కొలిచే దత్తాత్రేయుడు, ఇంతమందికి ఇన్నిరకాలుగా అనుభూతులు పంచుతున్నాడా..అని..నిజానికి ఆ ఊహే అజ్ఞానం కదూ..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా.. పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

సంస్కృత మహాభాగవతం

 *22.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*7.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*పృథివీ వాయురాకాశమాపోఽగ్నిశ్చంద్రమా రవిః|*


*కపోతోఽజగరః సింధుః పతంగో మధుకృద్గజః॥12458॥*


*7.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*మధుహా హరిణో మీనః పింగలా కురరోఽర్భకః|*


*కుమారీ శరకృత్సర్ప ఊర్ణనాభిః సుపేశకృత్॥12459॥*


*7.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*ఏతే మే గురవో రాజన్ చతుర్వింశతిరాశ్రితాః|*


*శిక్షా వృత్తిభిరేతేషామన్వశిక్షమిహాత్మనః॥12460॥*


*7.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*యతో యదనుశిక్షామి యథా వా నాహుషాత్మజ|*


*తత్తథా పురుషవ్యాఘ్ర నిబోధ కథయామి తే॥12461॥*


మహారాజా! భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతము, కొండచిలువ, సముద్రము, మిడుత, తేనెటీగ (తుమ్మెద), ఏనుగు, తేనెను పట్టేవాడు, హరిణము, మీనము, *పింగళ* అను పేరుగల వేశ్య, *కురరము* అను పక్షి, బాలుడు, కన్య, బాణములను సిద్ధపరచువాడు, సర్పము, సాలెపురుగు, *భృంగి* అను కీటకము ఈ ఇరువది నాలుగు ప్రాణులను నేను గురువులనుగా ఆశ్రయించితిని. వీటి ఆచరణలను అనుసరించి నేను జ్ఞానమును పొందితిని. నహుషుని మనుమడవైన యదుమహారాజా! మహాపురుషా! వీటినుండి నేను పొందిన స్ఫూర్తిని విపులముగా తెలిపెదను ఆకర్ణింపుము.


*7.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*భూతైరాక్రమ్యమాణోఽపి ధీరో దైవవశానుగైః|*


*తద్విద్వాన్న చలేన్మార్గాదన్వశిక్షం క్షితేర్వ్రతమ్॥12462॥*


విధివశమున ఇతర ప్రాణులు తనను ఆక్రమించి బాధించినను ధీరుడు దానిని (ఆబాధను) విధివిలాసముగా భావించి, సహిష్ణువై తన మార్గమునుండి ఏమాత్రమూ చలింపడు. ఈ క్షమాగుణమును నేను భూమినుండి గ్రహించితిని.


*7.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*శశ్వత్పరార్థసర్వేహః పరార్థైకాంతసంభవః|*


*సాధుః శిక్షేత భూభృత్తో నగశిష్యః పరాత్మతామ్॥12463॥*


పర్వతము నిరంతరము ఇతరులకు ఉపకారమిచ్చెడి లక్షణము గలది, వృక్షములను, తృణములను, సెలయేళ్ళను భరించుచు వాటిద్వారా అది పరహితమునకే పాటుపడుచుండును. అట్లే సాధుపురుషుడు పర్వతమునుండి పరోపకార లక్షణమును అలవరచుకొనవలెను.


*7.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*ప్రాణవృత్త్యైవ సంతుష్యేన్మునిర్నైవేంద్రియప్రియైః|*


*జ్ఞానం యథా న నశ్యేత నావకీర్యేత వాఙ్మనః॥12464॥*


మననశీలుడగు సాధకుడు తన జీవనయాత్రకు తగిన ఆహారమును మాత్రమే తీసుకొని, సంతుష్టిని పొందవలెను. కాని, ఇంద్రియప్రీతికొరకు ఆరాటపడవద్దు. ప్రాణములు నిలుచుటకే ఆహారము అవసరము. అట్టి ఆహారమువలన జ్ఞానశక్తి నశింపదు. వాగింద్రియము, మనస్సు, చంచలము గాకుండును.


*7.40 (నలుబదియవ శ్లోకము)*


*విషయేష్వావిశన్ యోగీ నానాధర్మేషు సర్వతః|*


*గుణదోషవ్యపేతాత్మా న విషజ్జేత వాయువత్॥12465॥*


వాయువు పెక్కు స్థానములయందు ప్రసరించుచుండును. కాని వేటిపైనను ఆసక్తి కలిగియుండదు. వాటి గుణదోషముల యందు ఆసక్తముగాదు. అట్లే సాధకుడు ఇంద్రియములద్వారా వేర్వేరు విషయములను అనుభవించుచున్నను వాటి గుణదోషములయందు అనగా ప్రియ అప్రియములయందు ఆసక్తిని కలిగియుండరాదు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*997వ నామ మంత్రము* 22.9.2021


*ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః*


త్రిపురుడైన పరమేశ్వరుని భర్తగా గలిగిన త్రిపురుసుందరీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్రీమత్త్రిపురసుందరీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదాంబికను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి కొంగుబంగారమై, సర్వకాల సర్వావ స్థలయందును ఆపదలనునవి కలుగనీయక, జీవించినంతకాలము సిరిసందలకు గాని, శాంతిసౌఖ్యములకు గాని, భోగభాగ్యములకు గాని లోటురానీయక, నిరంతరమూ ఆ పరమేశ్వరీ నామ స్మరణమే జీవనావధిగాజేసి తరింపజేయును.


త్రిపురుడు అనగా పరమశివుడు. త్రిపురాసురులను జయించిన పరమశివుడు త్రిపురుడు అని పిలువబడ్డాడు. సృష్ట్యాది (మూలప్రకృతి) యందు పరమ శివుడు ఒక జ్యోతిస్వరూపుడు. ఆ జ్యోతిస్వరూపంనుండి బ్రహ్మవిష్ణురుద్ర యను మూడుస్వరూపములు ఆయాశక్తులతో ఉద్భవించినవి. మొదటి శక్తి (ఊర్ధ్వ భాగము) ఐదుముఖములు, నాలుగుచేతులు, గౌరవర్ణముగల బ్రహ్మస్వరూపముగాను, రెండవ శక్తి (మధ్యభాగము) నల్లనిదేహము, ఏకముఖము, నాలుగు చేతులయందు శంఖచక్రగదా పద్మములుగల విష్ణు స్వరూపముగాను, మూడవ శక్తి (అధోభాగము) ఐదుముఖములు, నాలుగు చేతులు, స్ఫటికమువలె తెల్లని దేహముగల చంద్రశేఖరుడు. పరమశివుడు ఒక్కడేయైనను ఈ మూడు శక్తులతో బ్రహ్మవిష్ణుశివ పురములు గలవానిగా (అనగా బ్రహ్మవిష్ణుశివుల శరీరములే మూడుపురములై) పరమశివుడు చెప్పబడినాడు. అందుచే ఆయన *త్రిపురుడు* అని యనబడినాడు. అట్టి త్రిపురుని భార్యయైన పరమేశ్వరి త్రిపురసుందరిగాను, సర్వమంగళస్వరూపిణి యగుటచే *శ్రీమత్త్రిపురసుందరీ* యని అనబడినది. ఆ జగదంబిక త్రికాలములకు (భూతభవిష్యద్వర్తమానములకు), మూడు ధామములకు (జాగ్రస్వప్నసుషుప్తులు అను మూడు అవస్థలకు), స్థూల, సూక్ష్మ, కారణదేహములకు ఆ అమ్మయే సాక్షీభూతురాలై యున్నది గనుక ఆ అమ్మ త్రిపురసుందరియనియు, *శ్రీమత్త్రిపురసుందరి* యనియు అనబడినది.


త్రిగుణములకు (సత్త్వరజస్తమోగుణములకు), త్రిలోక (ఊర్థ్వలోకములందలి మొదటి మూడులోకములు : 1. భూలోకము. 2. భువర్లోకము. 3. సువర్లోకము), త్రిస్థాయి (మందరం, మధ్యమం, తార, మందరానికి హృదయం, మధ్యమానికి కంఠం, తారకు మూర్ధము స్థానములు), త్రికాల (భూత, వర్తమాన, భవిష్యత్కాలములు), త్రిశరీర (స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు), త్రికూట (వాగ్భవ, కామరాజ, శక్తికూటములు), త్రినాడి (ఇడ, పింగళ, సుషుమ్న), త్రివర్గ (ధర్మము, అర్థము, కామము అను మూడు పురుషార్థములు - నాలుగవదైన మోక్షము ప్రసాదించునది పరమాత్మ), త్రివేద (ఋగ్యజుస్సామ వేదములు).... మొదలైన త్రివర్గముల విషయములకు సమన్వయించు శబ్దమే *త్రిపుర*. అట్టి త్రిపుర అను విశేషణము గలిగిన పరమేశ్వరి *త్రిపురసుందరి* యను శ్రీమాత నామము. గనుక ఆ పరమేశ్వరి *శ్రీమత్త్రిపురసుందరీ* యని అనబడినది. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

డస్ట్ అలర్జీ నివారణ

 డస్ట్ అలర్జీ నివారణ కొరకు అద్బుత యోగం - 


      కొంతమంది కి ఉదయం నిద్రలేవడం తోనే తుమ్ములతోనే దినచర్య ప్రారంభం అవుతుంది. విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి. వారికోసం ఈ అద్బుత యోగం .


    తులసి , పుదీనా , రెండు మిరియపు గింజలు నిమ్మరసం కలిపి కషాయం లాగా చేసుకొని ఒక కప్పు కషాయం తీసుకొండి నెలరోజుల్లో మీ సమస్య తీరిపోతుంది. మీ తుమ్ములు కూడా మాయం అయిపోతాయి. ఇవి అందుబాటులో లేనపుడు తుమ్ములు వస్తుంటే కొత్తిమీర వాసన చూస్తూ ఉండండి . తుమ్ములు ఆగుతాయి . ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది. పైన చెప్పిన కషాయం మీకు పూర్తి ఉపశమనం ఇస్తుంది. 


         నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కాశీ కి వెళితే

 కాశీ కి వెళితే...కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు.... అందులో మర్మమేమిటి ??


అసలు శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పలేదు..


శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు.


కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి " కాయాపేక్ష మరియు ఫలాపేక్ష" ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.


ఇక్కడ కాయాపేక్షా, ఫలాపేక్ష అన్నారు...అంటే...ఈ కాయము పై ( శరీరము పై అపేక్ష ని ) , ఫలాపేక్షా ( కర్మ ఫలము పై అపేక్ష ని) పూర్తిగా వదులుకొని...కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.


కాలక్రమేణా...అది కాస్తా కాయ, పండు గా మారిపోయింది.


అంతే కానీ... కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే...మనకు వచ్చు భక్తి కానీ, అందులో నిజమైన పుణ్యం ఎం ఉంటుంది.


కనుక.... శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని... ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే..నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది... అంతే కాని మామిడి పండుని, వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.


కనుక...ఈసారి మీరు కాశీ వెళితే....మనకి శత్రువులు అయిన ఈ శరీరం పై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని....ఆ విశ్వనాథ దర్శనం చేసి, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్దిదాం...

నా మాతృభాష ఏదో చెప్పగలరా?

 వి యార్ తెలుగుస్ ! లెట్స్ డు సం గుడ్ టు అవర్ లాంగ్వేజ్ !!

ఒకరోజు శ్రీ కృష్ణదేవరాయలు కొలువుకు ఒక నర్తకి వచ్చి,

"మహారాజా! నేను 9 భాషలలో పాడుతూ, లయబద్ధంగా

అడగలను...

మీ అష్టదిగ్గజాలలో ఎవరైనా సరే నా మాతృభాష ఏదో

చెప్పగలరా?" అని సవాల్ విసిరింది..

సరే అని రాజుగారు నృత్య ప్రదర్శనకి ఏర్పాటు చేయించారు...

కాసేపటికి నృత్య ప్రదర్శన పూర్తి అయింది...

"మీలో ఎవరైనా నా మాతృభాష ఏదో చెప్పగలరా?" అని

ఆ నర్తకి ప్రశ్నించగా.. అందరూ తెల్ల మొహం వేసారు...

రాజు గారు మన తెనాలి రామకృష్ణుడి వైపు చూసారు...

రామకృష్ణుడు " నాకు ఒక పది నిమిషాల సమయం కావాలి, అలా

తోటలోకి వెళ్లి వచ్చి సమాధానం చెపుతాను ప్రభూ!." అని

చెప్పి...బయటకు వెళ్తూ నర్తకి కాలు తొక్కాడు...

వెంటనే నర్తకి "idiot,are you blind? manner less

fellow " అని తిట్టింది ...

వెంటనే రామకృష్ణుడు "ప్రభూ! ఈమె మాతృభాష తెలుగు"

అని చెప్పాడు..

"అయ్యబాబోయ్, ఎలా కనిపెట్టారండి" అని విస్మయానికి

గురైంది ఆ నర్తకి...

ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడితే,తన మాతృభాష తెలుగు అని ఎలా

కనిపెట్టావ్ అని రాజు గారు కూడా అడిగితే,

"సహజంగా అందరు బాధలో,కోపంలో తమ మాతృభాషలో

మాట్లాడుతారు,

కానీ ఇంగ్లీష్ లో మాట్లాడితే వాడు మన తెలుగు వాడు మాత్రమే

అయి ఉంటాడు మహా ప్రభూ" అని తెనాలి రామకృష్ణుడు చెప్పారు..


కల్పితమో నిజంగా జరిగిందో తెలీదు కానీ మన తెలుగు వాళ్ళకి బాగా సరిపోతుంది 😊

భగవద్గీత

 🌹🙏🌹శ్రీ శివాయగురవే నమః.🌹🙏🌹

🌹🙏🌹 శ్రీ పరమాత్మనే నమః.🌹🙏🌹

           🌹🙏🌹భగవద్గీత🌹🙏🌹

ఏడవ అధ్యాయము, జ్ఞానవిజ్ఞానయోగము లోనుంచి

14వశ్లోకము,పదచ్ఛేద,టీకా, తాత్పర్యసహితముగా.

  🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ .🙏🙏


🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼


దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా

దురత్యయా ౹

మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం 

తరంతి తే ౹౹ ౹౹ 14 ౹౹


దైవీ , హి , ఏషా , గుణమయీ , మమ , మాయా ,

దురత్యయా ౹

మామ్ , ఏవ , యే , ప్రపద్యన్తే , మాయామ్ , ఏతామ్ ,

తరన్తి , తే ౹౹ ౹౹ 14 ౹౹


హి = ఏలననగా ;

ఏషా = ఈ ;

మమ , మాయా = నా మాయ ;

దైవీ = అలౌకికమైనది ;

గుణమయీ = త్రిగుణాత్మకమైనది ;

దురత్యయా = అధిగమింపసాధ్యముకానిది ;

యే = ఎవరైతే ;

మామ్ , ఏవ = కేవలము , నిరంతరము నన్నే ;

ప్రపద్యన్తే = భజించుచున్నారో ;

తే = వారు ;

ఏతామ్ , మాయామ్ = ఈ , మాయను ;

తరంతి = ఉల్లంఘించి , సంసార సముద్రమునుండి

               బయటపడుదురు .


తాత్పర్యము : ౼ నా మాయ త్రిగుణాత్మకమైనది.

అలౌకికమైనది . ఇది అధిగమించుటకు సాధ్యము 

కానిది . కాని కేవలము , నిరంతరము నన్నే భజిం

చువారు ఈ మాయను అధిగమించి , సంసారసము

ద్రమునుండి బయటపడగలరు . ౹౹ 14 ౹౹


🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺

కృష్ణం వందేజగద్గురుమ్. శ్రీకృష్ణం వందేజగద్గురుమ్.

    🌺🙏🌺సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.🌺🙏🌺

     అందరికీ శుభ శుభోదయం . తదుపరి శ్లోకముతో

     మళ్ళీకలుసుకుంద్దాం.


🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼

                             Yours.......mm

Yennapusa Bhagya Lakshmi Reddy Advocate AP High Court Amaravathi

చక్కటి విడిది*.. *రూ.200లకే

 *హైదరాబాద్ లో చక్కటి విడిది*.. *రూ.200లకే*


వసతిరూ. 40వేలకే పెండ్లి మండపంతో పాటు 15 గదులు 


సకల హంగులతో కాచిగూడ తుల్జాభవన్‌


వైద్యం కోసమని రోగులు, సిటీ అందాలను చూసేందుకు పర్యాటకులు నిత్యం నగరానికి వస్తుంటారు. ఒక్కోసారి ఇక్కడే విడిది చేయాల్సి ఉంటుంది. లాడ్జిల్లో రూమ్స్‌ తీసుకుంటే.. ఆర్థిక భారం తప్పదు. ఒక్కరోజు ఉండాలన్నా.. ఎక్కువ మొత్తంలో రుసుము చెల్సించాల్సి వస్తుంది. ఇది పేదలు, సామాన్యులకు కొంత ఇబ్బందే. అలాంటి వారి కోసం ఇంటిని మరిపించేలా చక్కటి వసతి కల్పిస్తున్నది కాచిగూడలోని తుల్జాభవన్‌. తెలంగాణ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ భవన్‌లో నామమాత్రపు ధరతో అంటే నలుగురికి రోజుకు రూ. 200కే వసతి కల్పిస్తున్నారు.  


ఇతర రాష్ట్రాల పర్యాటకులు..

నగరం నడిబొడ్డున ఉండటం, పార్కింగ్‌ రవాణా సౌకర్యం, తక్కువ చార్జీ ఉండటం వల్ల ఈ భవన్‌ మంచి ప్రాచుర్యం పొందింది. వివిధ రాష్ట్రాల నుంచి యాత్రికులు, వివిధ వైద్యశాలలకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులు నిత్యం ఇక్కడ బస చేస్తుంటారు. ఎక్కువగా ఏపీ, బెంగళూరు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ , పంజాబ్‌, కర్ణాటక, హర్యానా, గోవా తదితర రాష్ర్టాల నుంచి వచ్చే టూరిస్టులు ఇక్కడే విడిది చేస్తారు. అలా వచ్చే ఆదాయంతోనే భవనాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నారు. అయితే ఈ విడిది కేంద్రంలో తక్కువ చార్జీలతో సకల సౌకర్యాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా నగరానికి వచ్చే గ్రామీణ ప్రాంతాల వారికి ఈ భవనం గురించి తెలియకపోవడం వల్ల వసతి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. 


వివాహ వేడుకలకు.. 

శతాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనానికి కొత్త హంగులు సమకూర్చారు. మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. సకల సౌకర్యాలు కల్పించారు. టూరిస్టుల కోసం ప్రత్యేక వంటశాల గదిని నిర్మించారు. ప్రస్తుతం 18 గదులు అందుబాటులో ఉండగా, అన్నింటిల్లో బాత్‌రూంలను ఏర్పాటు చేశారు. ఇటీవలే పేదల సౌకర్యార్థ్ధం *తక్కువ ఖర్చుతో పెండ్లిళ్లు చేసుకోవడానికి టెంట్‌ సామాన్లు, 15 గదులను కేవలం రూ.40 వేల ప్యాకేజీతో ఇస్తుండటం విశేషం.*


ఆలయం.. గ్రంథాలయం.. 

ఈ తుల్జాభవన్‌లో పురాతన రామాలయం ఉంది. ఏటా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఇక యువత, నిరుద్యోగులు, పాఠకుల కోసం గ్రంథాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం పలు స్వచ్ఛంద సంస్థలు వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటాయి.   


ఎంతో మేలు...

పేద, మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ఖర్చుతో *పెండ్లిండ్లు చేసుకోవడానికి కేవలం రూ.40 వేల ప్యాకేజీ ఇవ్వడం శుభసూచికం.* కొన్ని నెలలుగా మధ్యతరగతి ప్రజలు ఈ భవన్‌లో పెండ్లిళ్ల్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు బయట లాడ్జిలతో పొల్చితే ఇక్కడ కేవలం రూ.200 చెల్లిస్తే నలుగురికి వసతి కల్పిస్తున్నారు -పట్లూరి సతీశ్‌, యాత్రికుడు 


అనేక సౌకర్యాలు అందుబాటులో..

నగరంలోని వివిధ ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులకు అందుబాటు ధరలో అంటే *నలుగురికి రోజుకు కేవలం రూ.200లకే తుల్జాభవన్‌లో వసతి కల్పిస్తున్నాం.* వివిధ పనుల కోసం వచ్చే పర్యాటకులు ఇక్కడ వసతి పొందడానికి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నగరం నడి బొడ్డున ఉండటం వల్ల ఇక్కడి నుంచి ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా ఉన్నది. వసతి పొందాలనుకునే వారు -9491000687, 8309481306 నంబర్లలో సంప్రదించవచ్చు. -ఎ.బాలాజీ(దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, కాచిగూడ తుల్జాభవన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)

రుచిదప్పి పోతోంది

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*జీవితం రుచిదప్పి పోతోంది ఎందుకని* 

(రచయిత/రచయిత్రి తెలియదు)

--------------------------------------------

రానురాను జీవితం లో మనసు, నాలుక రెండూ రుచి తప్పిపోతున్నాయి, టెక్నాలజీ అనూహ్యంగా పెరిగి ఎన్నో పరికరాలు అందుబాటులోకి వచ్చాయి, మనిషి కాలాన్ని దూరాన్ని జయించకపోయిన అదుపులోకి తెచ్చుకున్నాడు. అయినా ఎదో ఖాళీ అసంతృప్తి, ఏదో మిస్ అవుతోంది. ఏమిటది? స్కైప్ లో, వాట్సాప్ లో ఖండాంతరాలదూరంలో ఉన్నవారితో కూడా చూసి మాటాడుతున్నాం. కానీ ఒకప్పుడు నేనుక్షేమం. నువుకుశలమా? అంటూ అడిగే పదిహేను పైసల పోస్ట్ కార్డు ఇచ్చిన ఆనందం ఇప్పుడులేదు. రేడియోలో ఆదివారం వచ్చే నాటికల కోసం పనిముగుంచుకుని కూచునే రోజుల్లో ఉన్న ఉల్లాసం నలభయి వేల హోమ్ ధియేటర్ లో మూవీ చూసినప్పుడు లేదు.  

చింతగింజలు, వామనగుంటలు వైకుంఠపాళీలు ఆడి ఓడిపోయి తన్నుకునే సంరంభం ఈనాటి వీడియోగేమ్స్ లో ఉందా పిల్లలకు. వేపచెట్టుకింద నులకమంచం, తలకిందో దిండు వేసుకుపడుకుని దోస్తోవస్కీ నేరము శిక్ష చదువుతూ, రాస్కోల్నికోవ్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకునే రోజుల్లోని సంతృప్తి ఫేసుబుక్ లో పోస్టింగ్స్ చదువుతుంటే ఉండదెందుకనో?

మనసెందుకనో స్పందించడం మానేస్తోందా? నిజానికి గతంలో కంటే ఇప్పుడే మనిషి జీవితం సుఖంగా, రిలాక్స్ గా ఉండాలి. కానీ ఉందా? ఇక రుచుల మాటకొస్తే అప్పటికి ఇప్పటికి ఎంతోతేడా, అభివృద్ధి, కొత్తరుచులు, పిజ్జా బర్గెర్, మంచూరియా, కట్లెట్స్, పూర్వంవారు పేరుకూడా వినని కొత్తరుచులు. అయినా నాలుక రుచితప్పింది. కట్టెలపొగలో పొయ్యిముందుకూచుని ఒకే కూర, చెట్టునకాసిన ములక్కాడల చారు ఊరగాయ, గడ్డపెరుగు, వెన్నకరిగించిన నెయ్యి, అంతే చిన్నప్పటిమెనూ. ఎడ్లబండిలో వడ్లు మిల్లుకు వెళ్తుంటే గట్టిగ చెప్పేది అమ్మమ్మ, ఒక్కపట్టే పట్టించండి తెల్లగా ఉంటాయని రెండోపట్టు వేయొద్దు అని. పిచ్చుకలు వడ్లగింజ పొట్టు వలిచినట్టు గోధుమరంగులో ఉండేవి బియ్యం. అన్నంకూడా కొంచెం ఎర్రగాఉండేది. ఏకాలమూ ఇంట్లోనే కాసేవి కూరగాయలు. పిడకల గూడుమీదకు పాకిన సొరకాయలు పొడవుగా చేతిబారున ఉండేవి. లేలేత సొరకాయ ఉప్పులో పిండి తిరగమూతేసి, దింపేటప్పుడు గ్లాసుడుపాలు పోసిన కూర వేడిఅన్నంలో కలిపి నెయ్యి గుమ్మరించుకుని తింటే ఆరుచి అద్భుతం. చిక్కుడు, కాకర, బీర ఆకు కూరలు అందరి దొడ్లలో విరివిగా ఉండేవి. బటాణిగింజల్లాటి తెల్ల చిక్కుడుకాయలకూర ఎంతరుచో. ఒక్క కొమ్మకు కేజీ వంకాయలు వచ్చేవి. అల్లం పచ్చిమిర్చితో వంకాయకూర రుచి ఇప్పుడుందా? ఎందుకని ఇంతతేడా వచ్చేసింది. నేను ఇప్పుడుకూడా ఇంట్లోనే కొన్ని కూరలు కాయిస్తాను. అయినాసరే ఆ రుచిరాదు. అమ్మచేసే వంటల్లో నాకిష్టమైన చామదుంపల ఫ్రై, కందిపచ్చడి, పప్పుచారు మాత్రం చచ్చినా అలాకుదరవు. గుర్తు తెచ్చుకుని అచ్చం అమ్మలాగే చేస్తాను. అయినాసరే, ఆవకాయ, మాగాయ, పులిహోర, గోంగూర, వంకాయ, పండుమిరపకాయ ఇలా వేళ్ళ మీద లెక్కపెడితే పదిహేను రోజులు రోజుకోటి సరిపోయే పచ్చళ్ళు జాడి దగ్గరకు వెళ్తేనే కమ్మని వాసనలు చిన్నప్పుడు. ఇప్పుడు అన్ని వెరయిటీస్ వేయకపోయినా ఆవకాయ, మాగాయ అసలు ఆరుచి, ఘాటు ఉండట్లేదు. ఎక్కడ తేడా వస్తోందో తెలీదు. పుల్లమజ్జిగలో తిరగట్లో విసిరిన బరక బియ్యప్పిండి, పచ్చిశెనగపప్పు నానపెట్టి పచ్చిమిరప ముక్కలతో వేసిన చల్లట్లు, డబ్బాల్లో నిలవున్న అటుకుల తో ఉప్మా, చేలో పండిన పెసలు మినుములతో అట్లు, ఇడ్లి, గారెలు ఇవే అప్పటి ఫలహారాలు. అవిగాక పుస్తకం చదువుతూ పచ్చి వేరుశెనక్కాయలు, కాల్చిన మొక్కజొన్నకండెలు, వేసవిలో తాటిముంజెలు, తేగలు, కాల్చిన తాటికాయలు తెగ తినేవాళ్ళం చిన్నపుడు.

ఇవి ఇప్పుడు దొరకడమూ లేదు దొరికినా, ఆరుచి లేదు. మాయాబజారులో చిన్నమయ్య తల్పం, గిల్పం, కంబళి, గింబళి అన్నట్లు ఇవి తిండ్లుకాదు. గిండ్లు అనిపిస్తోంది. అసలు ఇలాంటి ఫీలింగ్స్ నాకేనా? అందరికి ఇలాగే ఉందా అని ఒక సందేహానుమాన సంశయం...

ఎవరు శిక్షార్హులు కారు

 మలమూత్రాలు దారిలో విసర్జిస్తే ఎవరు శిక్షార్హులు కారు.

__________________________________


శ్లోకం.

ఆతురే నియమో నాస్తి బాలే వృద్ధే తథైవ చ

సదాచారరతే చైవ హ్యేష ధర్మ స్సనాతన:


॥ మనుస్మ్రతి॥


భయపడినవాడు, వృద్ధుడు, గర్భిణి, బాలుడు వీరు దారిలో మలమూత్రాలు విసర్జిస్తే శిక్షార్హులు కారని చాణక్యనీతి. ఎందుకంటే వీరిలో గర్భిణికి తప్ప మిగిలినవారికి మనస్సు శరీరం వీరి ఆధీనంలో వుండవు. అలాగే గర్భిణికి కూడా శరీరం వశంలో వుండదు. అందుకని పై వారు పొరపాటున మలమూత్రవిసర్జన చేస్తే శిక్షించరాదని అర్థశాస్త్రం చెపుతోంది.

పై విషయాన్నిబట్టి చూస్తే ఆ రోజులలో గ్రామశుభ్రతకు ప్రాముఖ్యతనిచ్చేవారని, ఉల్లంఘించినవారు శిక్షార్హులని అవగతమైతోంది.


పై మనుస్మ్రతి శ్లోకం ఇదే విషయాన్ని తెలియచేస్తోంది. కాకపోతే బాలుడు వృద్ధుడు గర్భిణిలకు అదనంగా సదాచార సంపన్నుడిని చేర్చడం జరిగింది.


శ్లోకం.

కర్త కారయితా చైవ ప్రేరక శ్చానుమోదక:

సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన:


॥పరాశరస్మ్రతి॥


మంచికార్యమైనా చెడుకార్యమైనా దానిని ప్రేరేపించేవాడికి చేయించేవాడికి ఆమోదించేవాడికి చేసేవాడికి, ఈ నలుగురికి భాగస్వామ్యముంటుంది.

వీరు మంచిని చేస్తే మంచే దక్కుతుంది.

చెడును చేస్తే చెడే లభిస్తుంది.


॥సేకరణ॥

_____________________________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం