22, సెప్టెంబర్ 2021, బుధవారం

గులాబీ

 శీర్షిక. గులాబీ...నీకు సలామ్




వివిధ వర్ణశోభిత సౌందర్య గులాబీ 

నీకు ఈ ప్రకృతి గులామ్ 

నందన వనంలోని పుష్ప సముదాయంలో

మకుటాయమానం నీ స్థానం 

పుష్పజాతికి సింహాసనం నీ స్థానం 

ప్రకృతి నీకు ఆత్మీయ పలకరింపులతో

ప్రకృతికి నీవు ఇచ్చే ఆలంబనలే 

మానవాళికి నీతివాక్యాలు

గులాబీ నీకు ఈ విశ్వం గులామ్ 

నీ మౌన రాగం మాకు గుణపాఠాలు 

గుత్తులుగా వికసించి ఐక్యమత్యం నేర్పిస్తావు

రేక గులాబీలా ఒంటరిగా ఉంటూ ధైర్యంగా నడిపిస్తావు

శ్వేత వర్ణములో స్నేహబంధాన్ని అందరికీ అందిస్తావు 

రక్త వర్ణములో నీవు ప్రేమబంధాన్ని పంచిస్తావు  

పీత వర్ణములో సూచిస్తావు శుభములకు శ్రీ కారం

శాంతి సందేశాలకు స్వాగతం పలుకు అలంకారం

నీ సహజ వర్ణములో మురిపిస్తావు మహిన 

ముళ్ళ మధ్య పెరిగిన ఓ గులాబీ.... సమాజంలో శతృవులతో సహజీవన సామరస్యంతో శిక్షణ నిచ్చావు

సర్వ శుభాలకు నీకు ప్రధమాహ్వానము 

వికసించిన నీ దరహాసమే జగతికి శోభ

నిత్యం భగవంతుని చేరు నీ స్థాయి అజరామరం 

అందరి హృదయాలలో నీకు స్థిరాసనం 

నీకు సదా సలామ్, అన్య పుష్పాలన్నీ నీకు గులామ్

ఓ గులాబీ నీకు సదా సలామ్ సదా సలామ్...

నిత్య నూతన సౌందర్యం నీ సొంతం...సలామ్ 

ఓ గులాబీ నీకు నా సలామ్.


డాక్టర్ దేవులపల్లి పద్మజ, విశాఖపట్నం

కామెంట్‌లు లేవు: