22, సెప్టెంబర్ 2021, బుధవారం

భగవద్గీత

 🌹🙏🌹శ్రీ శివాయగురవే నమః.🌹🙏🌹

🌹🙏🌹 శ్రీ పరమాత్మనే నమః.🌹🙏🌹

           🌹🙏🌹భగవద్గీత🌹🙏🌹

ఏడవ అధ్యాయము, జ్ఞానవిజ్ఞానయోగము లోనుంచి

14వశ్లోకము,పదచ్ఛేద,టీకా, తాత్పర్యసహితముగా.

  🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ .🙏🙏


🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼


దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా

దురత్యయా ౹

మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం 

తరంతి తే ౹౹ ౹౹ 14 ౹౹


దైవీ , హి , ఏషా , గుణమయీ , మమ , మాయా ,

దురత్యయా ౹

మామ్ , ఏవ , యే , ప్రపద్యన్తే , మాయామ్ , ఏతామ్ ,

తరన్తి , తే ౹౹ ౹౹ 14 ౹౹


హి = ఏలననగా ;

ఏషా = ఈ ;

మమ , మాయా = నా మాయ ;

దైవీ = అలౌకికమైనది ;

గుణమయీ = త్రిగుణాత్మకమైనది ;

దురత్యయా = అధిగమింపసాధ్యముకానిది ;

యే = ఎవరైతే ;

మామ్ , ఏవ = కేవలము , నిరంతరము నన్నే ;

ప్రపద్యన్తే = భజించుచున్నారో ;

తే = వారు ;

ఏతామ్ , మాయామ్ = ఈ , మాయను ;

తరంతి = ఉల్లంఘించి , సంసార సముద్రమునుండి

               బయటపడుదురు .


తాత్పర్యము : ౼ నా మాయ త్రిగుణాత్మకమైనది.

అలౌకికమైనది . ఇది అధిగమించుటకు సాధ్యము 

కానిది . కాని కేవలము , నిరంతరము నన్నే భజిం

చువారు ఈ మాయను అధిగమించి , సంసారసము

ద్రమునుండి బయటపడగలరు . ౹౹ 14 ౹౹


🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺

కృష్ణం వందేజగద్గురుమ్. శ్రీకృష్ణం వందేజగద్గురుమ్.

    🌺🙏🌺సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.🌺🙏🌺

     అందరికీ శుభ శుభోదయం . తదుపరి శ్లోకముతో

     మళ్ళీకలుసుకుంద్దాం.


🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼

                             Yours.......mm

Yennapusa Bhagya Lakshmi Reddy Advocate AP High Court Amaravathi

కామెంట్‌లు లేవు: