23, జులై 2022, శనివారం

పరమాత్మ చెప్పిన సత్యం.

 🍁🍁🍁   బ్రహ్మ  పథం   🍁🍁🍁

నిర్వహణ:-గాజుల విష్ణువర్ధన్. M. A.

-------------------🙏-----------------

         పరమాత్ముడి   సందేశం

                   *******

     ద్వాపరయుగం  ఇంకా  కొద్ది రోజులలో   ముగిసిపోయి,  కలియుగం  రాబోతుందనగా   ఒక రోజు శ్రీ కృష్ణుడు   ఇచ్చిన   సందేశం    తెలుసుకుందాం.


    శ్రీకృష్ణుడు  బాలరాముడితో   "  అవతార  సమాప్తి  జరిగి పోతుంది.  మీరు  తొందరగా   ద్వారాకా నగరమును  విడిచి  పెట్టెయ్యండి "  అని చెప్పడాన్ని   ఉద్దవుడు  విన్నాడు.

ఉద్దవుడు శ్రీకృష్ణ   భగవానుడికి  అత్యంత   ముఖ్య సఖుడు,  మరియు  పరమ  ఆంతరంగిక  విశేష భక్తుడు.

ఆయన కృష్ణుడి  వద్దకువెళ్లి "  కృష్ణా"  మేము నీతోకలిసి  ఆడుకున్నాము,  పాడుకున్నాము, అన్నం తిన్నాము,  సంతోషంగా గడిపాము.  ఇలాంటి కృష్ణావతారం   ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను.  నిన్ను విడిచి  నేను ఉండలేను. కాబట్టి  నామనసు  శాంతించే టట్లు  నిరంతరమూ   నీతో ఉండేటట్లు  నాకేదైనా  ఉపదేశం  చెయ్యి " అన్నాడు.

అప్పుడు కృష్ణ  పరమాత్మ   కొన్ని అద్భుతమైన  విషయములను   ఉద్దవుడితో  ప్రస్తావన  చేశాడు.

ఇది మనం  అందరం కూడా  తెలుసుకుని   జీవితంలో   పాటించవలసిన  శ్రీకృష్ణ  పరమాత్మ  చిట్ట చివరి  ప్రసంగం.

దీని తరువాత  కృష్ణుడు  లోకోపకారం కోసం  ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును  ఉద్దరించడానికి   ఉద్దవుడిని  అడ్డుపెట్టి చెప్పాడు.


ఉద్దవా !  నేటికీ  ఏడవ రాత్రి  కలియుగ ప్రవేశం  జరుగుతుంది.  ఏడవరాత్రి  లోపల  ద్వారాకా పట్టణమును   సముద్రం  ముంచేత్తుతుంది.  సముద్ర గర్భంలోకి   ద్వారక  వెళ్లి పోతుంది. ద్వారాకలోఉన్న  వారందరూ  మరణిస్తారు. తదనంతరము   కలియుగం   ప్రవేశస్తుంది.

కలియుగం  ప్రవేశించిగానే   మనుష్యులయందు   రెండు లక్షణములు  బయలు  దేరుతాయి.   ఒకటి   అపారమైన   కోర్కెలు. రెండు  విపరీతమైన   కోపం.

ఎవ్వరు కూడా  తన  తప్పు  తాను  తెలుసుకునే  ప్రయత్నం   కలియుగంలో  చెయ్యరు.

కోర్కెల చేత, అపారమైన   కోపము చేత,  తమ  ఆయుర్ధాయాన్ని   తాము  తగ్గించుకుంటారు.  కోపము చేతను, అపారమైన  కోర్కెల చేతను   తిరగడం వలన   వ్యాధులు  వస్తాయి.   వీళ్లకు  వ్యాధులు    పొటమరించి   ఆయుర్ధాయాన్ని   తగ్గించి వేస్తాయి.

కలియుగంలో  ఉండే మనుష్యులకు  రాను రాను  వేదము   ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము  చేత, వేదము  ప్రమాణమని   అంగీకరించగల  స్థితిలో,  పుట్టిన వాళ్ళు కూడా   వేదమును  వదిలిపెట్టేసి, తమంత  తాముగా   పాషాండ   మతములను   కౌగలించుకుని,  అభ్యున్నతిని   విడిచిపెట్టి, వేరు మార్గములలో  వెళ్ళిపోతారు.


అల్పాయుర్ధాయంతో  జీవిస్తారు.  రాజయోగం  చేయడం  మరిచి పోతారు.  తద్వారా బ్రహ్మ యోగం   అనబడే   క్రియా యోగం  లేదా,  నేనున్న స్థితికి  చేర్చే  లయయోగం  ఒకటి   ఉండనేది  తెలుసుకునే  ప్రయత్నం  చేయరు. ఆడంబరాలకు   ప్రాధాన్యత నిస్తారు.  ఉపవాసములు  తమ  మనసును  సంస్కరించుకోవడానికి,  ఆచారమును   తమంత తాము   పాటించడానికి  వచ్చాయి. రానురాను  కలియుగంలో   ఏమవుతుందంటే,  ఆచారములు  విడిచి  పెట్టేయడానికి  ప్రజలు  ఇష్టపడతారు.


ఆచారం  అక్కర్లేదనే పూజలు  ఏమీ ఉంటాయో  వాటియందు  మక్కువ  చూపిస్తారు.  వాటి వలన  ప్రమాదము  కొని తెచ్చుకుంటున్నామని   తెలుసుకోరు.  అంతశ్శుద్ధి  ఉండదు.  చిత్త శుద్ధి ఏర్పడదు.


మంచి  ఆచారములు  మనస్సును  సంస్కరిస్తాయి  అని తెలుసుకోవడం  మానివేసి,  ఏపూజచేస్తే,  ఏరూపమును   ఆశ్రయిస్తే,  ఆచారం  అక్కర్లేదని  ప్రచారం ఉంటుందో,  అటువైపుకే   తొందరగా  అడుగు వేస్తారు. కానీ  దానివలన  తాము  పొందవలసిన  స్థితిని  పొందలేము  అని తెలుసుకోలేకపోతారు.


ఇంద్రియములకు  వషులు  అయిపోతారు. రాజులే  ప్రజల సొమ్ము దోచుకుంటారు.  ప్రజలు రాజుల మీద  తిరగబడతారు.


ఎవడికి పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి  గౌరవము ఉండదు.

కలియుగంలో  ఏ రకంగా  అర్జించాడన్నది   ప్రధానం అవుతుంది.


ఎవడికి  ఐశ్వర్యం  ఉన్నదో వాడే  పండితుడు. భగవంతుని  పాదములను  గట్టిగా  పట్టుకుని తరించిన   మహాపురుషులు  ఎందరో   ఉంటారు. అటువంటి  మహాపురుషులు  తీరుగాడిన   ఆశ్రమములు   ఎన్నో ఉంటాయి.


కలియుగంలో  ప్రజలు  అందరూ  గుళ్ల చుట్టూ  తిరిగేవాళ్ళే కానీ,  అటువంటి  మహాపురుషులు  తీరుగాడిన   ఆశ్రమాల  సందర్శనం  చేయడానికి  అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములో  కాలు పెట్టాలి, అటువంటి మహాపురుషుల  మూర్తులను   సేవించాలి.


కానీ అక్కడకు వెళ్లకుండా,  హీనమయిన   భక్తితో,  ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా  తీరగలవు  అని ఆలోచన  చేస్తారు. ఈశ్వరుని యందు  భేదమును  చూస్తారు.


కాబట్టి  నీకు  ఒకమాట  చెపుతాను.  ఈ వాక్యమును  నీవు  బాగా  జ్ఞాపకం  పెట్టుకో.  ఇంద్రియముల చేత  ఏది సుఖమును  ఇస్తున్నదో అది అంతా డొల్ల.  అది నీ మనుష్య జన్మను  పాడు చేయడానికి   వచ్చినదని  గుర్తు పెట్టుకో. దీనినుంచి  దాటాలని  నీవు  అనుకున్నట్లయితే  ఇక్కడి నుండి  బాధరికాశ్రమమునకు   వెళ్ళిపో !


కలియుగంలో గాని   ఏయుగంలో గాని  నీ శ్వాసను  గట్టిగా  పట్టుకోవడం  నేర్చుకో. ధ్యానం చేయడం  విడిచి పెట్టకు. నీ దారి శ్వాస దారి కావాలి.  శ్వాస   దారియే  నా దగ్గరకు  నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియ లోనూ  నేను  వున్నాను.   వుంటాను.  ఇది విశ్వసించు  ఉద్దవా !   ప్రయత్న  పూర్వకంగా   కొంతసేపు  మౌనంగా  ఉండడానికి  ప్రయత్నించు.  మౌనము, ధ్యానము, ఇంద్రియ నిగ్రహము చేయుట, నోటిలోని మౌనం    మనసులోని  మౌనంతో  ధ్యానంలో  కూర్చొనుట, ఈశ్వరుని  సేవించుట   మొదలగు   పనులను  ఎవరు   పాటించడం  మొదలు పెట్టారో వారు  మెట్లేక్కడం  మొదలు పెడతారు.


ఇది శ్రీకృష్ణ  పరమాత్మ  ఉద్దావుడికి ఇచ్చిన  చివరి సందేశం....


ఈ సందేశం  ఉద్దావుడికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం  పరమాత్మ  చెప్పిన  సత్యం.


సర్వేజనా సుఖినోభవంతు.

ఓం నమో వెంకటేశాయ.

ఊరగాయలు

 S A V Foods

స్వగృహ ఆకెళ్ల  ఊరగాయలు 


ఉసిరికాయ

చింతకాయ 

పండుమిర్చి

మామిడి తొక్కుపచ్చళ్ళు 

మామిడి ముక్కల పచ్చడి    

మెంతికాయ

ఆవకాయ 

పెసర ఆవకాయ 

బెల్లం ఆవకాయ 

మాగాయ

గోంగూర 

టమాటో 

నిమ్మకాయ

వంగపండు ఊరగాయ 

కొత్తిమీర ఊరగాయ  

ఉసిరి ఆవకాయ 

చింతకాయపండుమిర్చి


పుట్నాల  పొడి

కందిపొడి

ఇడ్లి కారంపొడి 

కరివేపాకు కారం పొడి 

వెల్లుల్లి కారంపొడి 

పల్లీలపొడి 

కూరపొడి 




అప్పడాలు

వడియాలు

గుమ్మడి పడియాలు 

చల్ల మిరపకాయలు



అన్ని రకాల ఊరగాయ పచ్చళ్ళు, పొడులు ఆర్డరుపైచేసి ఇవ్వబడును కావలసిన వారు సంప్రదించగలరు.

Phone no. 9441593152

Akella Savithri 

Malkajgiri

Hyderabad

ఆడి కృత్తిక_

 *🚩_23 వ తేదీన ఆడి కృత్తిక_🚩*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ 

(a forwarded one) 


ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు. ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు  ఈ రోజున సుర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ( చలిమిడి అంటే బియ్యప్పు పిండిని బెల్లంతో కలిపి ముద్దగా చేయాలి ) ఆవు నేతితో మూడు వత్తుల దీపం శివ కుటుంబం ( శివుడు , పార్వతీ దేవి , వినాయకుడు , సుబ్రహ్మణ్యుడు ) చిత్రపటం ముందు గానీ , శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి చిత్రపటం ముందు గానీ వెలిగించాలి.


ఆ తరువాత చిమ్మిలి ( తెల్ల నువ్వులు బెల్లం కలిపి చేస్తారు ), పచ్చి పాలు , వడపప్పు ( నానబెట్టిన పెసరప్పు ), అరటి పండ్లు , తాంబూలం ఇవన్నీ నివేదించి , సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు , సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని , సాయంత్రం వరకూ ఉపవసించి , సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదముగా పిండి దీపము , చిమ్మిలి , వడపప్పు , అరటి పండ్లు స్వీకరించాలి.


ముందు రోజు రాత్రి మరియూ ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు , జడులు , మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఇది తమిళ నాట ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం లేదు.

తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుతుంటారు


*అసలు ఎందుకు ఈ కృత్తికకు అంత ప్రత్యేకతో తెలుసుకుందాము*


తమిళులకు ఏ మాసమైన పౌర్ణమి రోజుతో మొదలవుతుంది , కనుక ఆషాడ పౌర్ణమి నుండీ వారికి ఆషాడ మాసం ప్రారంభమయ్యిందన్నమాట. మనకు ఆషాడ మాసంలో బహుళ ఏకాదశి నుండీ దక్షిణాయనం ప్రారంభమవుతుంది , అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృ దేవతల ఆరాధనకు ప్రీతికరమైనది. 


పార్వతీ దేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే  సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ , ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అనీ కూడా అంటుంటారు. అందుకే ఆషాడ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది. 


వీలైతే ఈ రోజు ఎవరైనా వేదవిధునికి కుదిరితే ( బాల బ్రహ్మచారి అయినా వేదవిధునికి ) షడ్రసోపేతమైన భోజనం పెట్టి , ఎర్రటి పంచ , పైపంచ , శక్తిమేరకు దక్షిణ , తాంబూలం , అరటి పండ్లు , గొడుగు , పాదరక్షలు , రాగి చెంబు ( లేదా పంచపాత్ర ఉద్దరిణ , అర్ఘ్య పాత్ర ) సమర్పించి , తానే సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే కలిగే ఫలితం మాటల్లో వర్ణించలేము.


ఒకవేళ బాల బ్రహ్మచారియైన వెధవిధుడు లేక గృహస్తు అయిన వెధవిధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైన ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహరం పెట్టినా మంచిదే.


ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశు పక్షాదులకు ఆహరం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్ధించినా ఉత్తమ ఫలితం ఉంటుంది , దీనికి ఒక నిదర్శనం కూడా చెబుతాను చూడండి. 


మా పిన్ని ఇది వరకు తమిళనాడు లోని తిరుప్పూరులో ఉండేవారు , ఒక ఆడి కృత్తిక రోజున ఎవరికైన మధ్యాహ్నం భోజనం పెట్టాలి అనుకుంది , కానీ రెండు రోజుల ముందు నుండీ తీవ్ర జ్వరం కారణంగా ఆడి కృత్తిక రోజున కనీసం లేచి నిలబడే శక్తి కూడా లేక ఎంతో బాధపడుతూ సుబ్రహ్మణ్యుని తలచుకుని దుఃఖిస్తుండగా ఉన్నట్లుంది ఒక నెమలి వచ్చి వాళ్ళ బాల్కనీలో వాలింది. మా పిన్ని సుబ్రహ్మణ్యుడే నెమలి రూపంలో వచ్చాడని ఎంతో సంతోషించింది. నిదానంగా లేచి తన తెచ్చుకున్న బ్రెడ్ నే ఆ నెమలికి పెట్టింది , ఆ నెమలి ఆ బ్రెడ్ తినింది , అప్పుడు మా పిన్ని సుబ్రహ్మణ్యుని స్తోత్రం చదువుతుంటే ఆ నెమలి అలానే కాసేపు బాల్కనీలో కుర్చుని , ఆ స్తోత్ర పారాయణ అయ్యాక కదిలింది. ఇది ప్రత్యాన్యామ పధ్ధతి అయినా భక్తికి భగవంతుడు వశుడే అని చెప్పటానికే ఈ లీల చెప్పాను.


కనుక వీలైన వారందరూ తమ శక్తివంచన లేకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ రోజు ఆరాధించండి. 


మరో ముఖ్య విషయం , కొంతమందికి కొన్ని అనుమానాలు వస్తుంటాయి , ఇది మా అత్తగారి ఇంట్లో లేదు కనుక చేయవచ్చా ? ఒకసారి చేసి మధ్యలో ఆపేస్తే ఆ దేవీ , దేవతలకు ఆగ్రహం వస్తుందా ? ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవలసినది ఒక్కటే , ఏ పూజయైన , వ్రతమైనా అందరూ ఆచరించాలనే మన మహర్షులు వాటిని మనకు అందించారు , ఇది వరకు తరాలలో ఎవరైనా ఏదైనా ఆటంకం వలనో , నాస్తికత్వం వలనో పాటించకపోయి ఉండచ్చేమో , మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టడం వలన మంచే జరుగుతుంది.


🙏  ఓం శరవణభవ 🙏 ఓం శరవణభవ 🙏

తల్లివలే రక్షించును

 శ్లోకం:☝️

*మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే*

*కాన్తేవ చాభిరమయత్యపనీయ ఖేదమ్ l*

*కీర్తిం చ దిక్షు వితనోతి తనోతి లక్ష్మీం*

*కిం కిం న సాధయతి కల్పలతేవ విద్యా ll*


భావం:విద్య తల్లివలే రక్షించును, తండ్రివలే ధర్మమునుపదేశించును, భార్యవలే శ్రమను శమింపచేయును, దశదిశలలో కీర్తిని కలుగజేయును, ఐశ్వర్యము సమకూర్చును, ఇన్ని మాటలేల? కల్పవృక్షమువలే సమస్త కోరికలను ఇచ్చునది విద్య యొక్కటే!🙏

నిరుపమ

 *నిరుపమ* 


*సాటిలేనిది శ్రీమాత అని అర్ధము. సృష్టియందు ఎవ్వరినీ శ్రీమాతతో సరిపోల్చలేరు. త్రిమూర్తులు గాని, త్రిశక్తులు గాని, ఆదిత్యులు గాని, రుద్రులు గాని, వసువులు గాని, ప్రజాపతులు, సప్త ఋషులు, కుమారులు గాని, మనువులు, మానవులు గాని ఇందెవ్వరునూ శ్రీమాతతో సరిపోలరు. వీరందరూ ఆమె నుండి దిగివచ్చిన వారే. ఆమెలోని భాగములు. వారికుండు శక్తి గాని, జ్ఞానము గాని, వ్యాపనము గాని మితమైనవే. శ్రీమాత అపరిమిత. ఆమెనుండియే వీరందరునూ దిగివచ్చిరి. మొత్తము సృష్టికూడ ఆమెలో ఒక భాగమే. ఈమెకు సాటిలేదు అని శ్రుతియందు చెప్పబడెను. ఉపమానము లేనిది. సర్వ వ్యాపకమైన చైతన్యముతో సరిపోల్చ గలిగినది మరియొకటి ఎట్లుండును?* (సేకరణ)

*🙏🙏శుభం భూయాత్ 🙏🙏*

 లంచము - శిక్ష


మహాస్వామివారికి న్యాయస్థానాల మీద అమితమైన విశ్వాసం, గౌరవం ఉండేవి. తప్పు చేసిన వానికి దండన అనే విషయంలో వారి వద్ద రాజీనే లేదు. తప్పు చేసినవాడు పశ్చాత్తపపడితే! అతడు నిజానికి మంచివాడై పొరపాటున తప్పు చేసి ఉంటే! ఇటువంటి క్లిష్టపరిస్థితులలో మహాస్వామివారి తీర్పు ఏ విధంగా ఉండేది? వారికి స్వామివారు ఇచ్చే సలహా ఏ విధంగా ఉండేది? 


మద్రాస్ లో తిరువెళ్ళిహేని పార్థసార్థి స్వామి ఆలయం దగ్గరగా ఒక బ్రాహ్మణభోజన హోటలు ఉండేది. దానిని నిర్వహించేవారు ఒక పాలఘాట్ అయ్యర్. మహాస్వామివారికి ఎంతో భక్తుడు. అప్పట్లో ద్రవిడ కళగం ఉద్యమం చాలా ఎక్కువగా ఉండేది. వారికి ఈ బ్రాహ్మణహోటల్ అన్నపేరు కంటగింపుగా ఉండేది. ఆ కాలంలో మన ప్రాంతాలలో వలె తమిళనాడులో కూడా శాఖాహార భోజనశాలలకు బ్రాహ్మణ భోజనశాలలనే పేరు. ఇప్పుడు శైవము - అశైవము అని మార్చారు. ఉత్తరాది వైష్ణవ భోజనశాలంటారు, సరి! 


ద్రవిడకళగం వారు ఒక గుంపుగా హోటల్ పై దoడెత్తారు. ఆ అయ్యర్ కి గుండె దిటవు ఎక్కువ. సలసల కాగే నూనె మూకుడు పెద్దది ఎత్తిపట్టి “కాలు ముందుకేస్తే మాడిపోతార”ని గర్జించాడు. గుంపు కకావికలమై పోయింది.


ఈయన దురదృష్టం - ఆ గుంపు నాయకుడు తరువాత అధికారంలోకి వచ్చిన పార్టీలో ముఖ్యుడైనాడు. ఎలాగైనా ఈ హోటల్ మూయించాలని దృఢసంకల్పంతో ఉన్నాడు. మరి నాయకులకు ప్రభుత్వంలో ఉండే పలుకుబడి గురించి మనకు తెలియంది కాదు కదా! 


హోటలు తనిఖీకి ఆరోగ్యశాఖ అధికారులు వచ్చారు. ఆరోగ్యశాఖ ప్రమాణాలకు ఈ రోజులలో కూడా బహుశః ఏ హోటల్ నిలువలేదనుకుంటాను. ఈయన హోటల్ లోని లొసుగులన్నిటితో ఒక నివేదిక తయారు చేసి ఉంచాడు. 


హోటల్ తాత్కాలికంగా మూయించి విచారణ ఆరంభించారు. ఇలాంటి సమయాలలో మామూలుగా అయితే ఆరోగ్యశాఖ అధికారులకు లంచం ఇచ్చి కేసు మూయించుకుంటారు కదా! ఈ అయ్యర్ ను ఇంకా ఇరికించాలనే ఉద్దేశంతో ఆ నాయకుడే ఇతని దగ్గరకు మనుషులను పంపాడు. ఆ అధికారికి లంచం ఇస్తే కేసు మాఫీ చేస్తారని నమ్మబలికారు. పాపం ఈ అయ్యర్ ఆ అధికారికి లంచం ఇచ్చాడు. ముందుగా వేసుకున్న ప్రణాలికకు అనుగుణంగా అక్కడ పోలీసులు అయ్యర్ ను అరెస్టు చేశారు. పోలీసు విచారణలో అయ్యర్ లంచం ఇచ్చిన విషయం ఒప్పుకున్నాడు. 


హోటల్ లొసుగుల కంటే ఈ కేసు బలీయమై కూర్చుంది. ఈ పరిస్థితిలో అయ్యర్ పరమాచార్య స్వామి వద్దకు వచ్చి బోరుమన్నాడు. 


“ఎందుకలా చేశావ”ని ప్రశ్నించారు స్వామి. 


”వాళ్ళ మాటలు నమ్మాను. ఇప్పుడేం చేయమంటా”రన్నాడు అయ్యర్. 


ఈ మాటలు ఆ సమయంలో దర్శనానికి వచ్చిన మద్రాసులో పేరుమోసిన క్రిమినల్ లాయర్ వింటున్నాడు. స్వామివారు అతనివంకకు తిరిగి, “పాపం! ఈ అమాయకుని విషయంలో నీవేమైనా చేయగలవా?” అన్నారు. 


”ఈతడే స్వయంగా జరిగినదంతా వ్రాసి సంతకం చేసి మరీ ఇచ్చాడు. ఈతనిని రక్షించడం నావల్ల కాదుకదా భగవంతునివల్ల కూడా కాద”న్నాడు లాయరు. 


స్వామివారు నవ్వి, “భగవంతుడు ఏమి చేయగలడో అది ఆయనకే వదులుదాము లే” అంటూ అయ్యర్ వంక తిరిగి, “కామాక్షీదేకి దర్శనం చేసుకుని ఆవిడకు విన్నవించుకొని ఇంటికి పో! ఆమె మీద భారం వేసి కోర్టులో నిజం మాత్రమే చెప్పు” అన్నారు. 


కోర్టులో కేసు విచారణకు వచ్చింది. అయ్యరు ఉన్నదున్నట్లుగా పూసగుచ్చినట్లు చెప్పాడు. సాక్షులందరినీ విచారించిన తరువాత న్యాయాధికారి అత్యాశ్చర్యకరమైన తీర్పు ఇచ్చాడు. 


“నా అనుభవంలో ఇంతవరకూ ఈ విధంగా శిక్షపడుతుందని తెలిసి కూడా కేవలం నిజమే చెప్పిన ముద్దాయిలను నేను చూడలేదు. ఈతడు చేసింది తప్పే. సాక్షులు ఒప్పుకోకపోయినప్పటికీ వారి మాటల ప్రభావంతో అమాయకంగా ఈ తప్పు చేశాడని నమ్ముతున్నాను. పశ్చాత్తాపంతో పవిత్రుడైన ఈతడు మరి ఇటువంటి తప్పులు చేయడని విశ్వసిస్తున్నాను. అతడు న్యాయస్థానం వారి క్షమకై చేసుకొన్న అర్జీని అంగీకరిస్తూ అతనిని విడుదల చేస్తున్నాను” అన్నది ఆ తీర్పు సారాంశం. 


తీర్పువిని అయ్యర్ నేరుగా స్వామివారి పాదాలను ఆశ్రయించి వెక్కి వెక్కి ఏడ్చాడన్న విషయం వేరుగా చెప్పనక్కర్లేదు. అయితే ఆరోజున భగవంతుడు కూడా శిక్ష తప్పించలేడని చెప్పిన లాయరు నేరుగా స్వామివారి ఎదురుగా చెంపలు వేసుకొని


“ఇది కేవలం స్వామివారి అనుగ్రహమే తప్ప వేరొకటి కాద”ని సాష్టాంగంగా నమస్కరించాడు. 


సత్యం బ్రూయాత్ ప్రియమ్ బ్రూయాత్ 

న బ్రూయాత్ సత్యమప్రియమ్

ప్రియం నానృతం బ్రూయాత్ 

ఏషః ధర్మ సనాతనః


--- శ్రీకార్యం చల్లా విశ్వనాథశాస్త్రి, ఋషిపీఠం ప్రచురణ


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం