*నిరుపమ*
*సాటిలేనిది శ్రీమాత అని అర్ధము. సృష్టియందు ఎవ్వరినీ శ్రీమాతతో సరిపోల్చలేరు. త్రిమూర్తులు గాని, త్రిశక్తులు గాని, ఆదిత్యులు గాని, రుద్రులు గాని, వసువులు గాని, ప్రజాపతులు, సప్త ఋషులు, కుమారులు గాని, మనువులు, మానవులు గాని ఇందెవ్వరునూ శ్రీమాతతో సరిపోలరు. వీరందరూ ఆమె నుండి దిగివచ్చిన వారే. ఆమెలోని భాగములు. వారికుండు శక్తి గాని, జ్ఞానము గాని, వ్యాపనము గాని మితమైనవే. శ్రీమాత అపరిమిత. ఆమెనుండియే వీరందరునూ దిగివచ్చిరి. మొత్తము సృష్టికూడ ఆమెలో ఒక భాగమే. ఈమెకు సాటిలేదు అని శ్రుతియందు చెప్పబడెను. ఉపమానము లేనిది. సర్వ వ్యాపకమైన చైతన్యముతో సరిపోల్చ గలిగినది మరియొకటి ఎట్లుండును?* (సేకరణ)
*🙏🙏శుభం భూయాత్ 🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి