14, ఫిబ్రవరి 2022, సోమవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 35 జవాబులు

 ప్రశ్న పత్రం సంఖ్య: 35 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  


జవాబులు

1) ఇంట్లో ఈగల మోత వీధిలో

i ) విమానాల మోత  ii ) విసనకర్రల మోత iii )పల్లకీల మోత✅ *పల్లకీ మోత* iv ) కార్ల మోత

2) ఏదయినా కార్యక్రమం చేయించేటప్పుడు బ్రాహ్మడికి ( *బ్రాహ్మణునికి* ) వీపు దురద పుడితే దీనితో గోక్కుంటారు.

i ) దర్భలతో   ii ) ఉద్దరాణితో  iii ) జంద్యంతో✅ *ఇలా జంధ్యమును వినియోగించుట తప్పు. గాయత్రి మంత్రమును జపించుటకొఱకు మాత్రమే జంధ్యమును ఉపయోగించాలి. ఇతర ప్రయోజనములకు ఉపయోగించరాదు.* iv ) పీటతో

3) తిన తిండిలేదు మీసాలకు

i ) వేప నూనె   ii ) సంపెంగి నూనె✅ *సంపెంగ నూనె* iii )పల్లి నూనె iv ) ఆవ నూనె

4) బ్రాహ్మణ ఇంటిలోకి దొంగలు రాకుండా ఇది కాపాడుతుందని అనుకునే వారు.

i ) చింపిరి పుల్ల   ii ) ప్రక్క వారింటిలోని కుక్క పిల్ల iii ) తిని పారేసిన విస్తరాకు iv ) దండెం మీది మడిబట్ట ✅

5)వింటే భరతం ( *భారతం* )వినాలి తింటే

i ) గారెలే తినాలి✅   ii ) మిర్చి బజ్జిలే తినాలి iii ) శనగలు తినాలి iv ) పరమాన్నం తినాలి

6) తాడి ( *తాడిని* ) తన్నేవాడుంటే వాడి .

i ) కాళ్ళు తన్నే వాడుంటాడు   ii ) చెయ్యి తన్నే వాడుంటాడు iii ) ముక్కు తన్నే వాడుంటాడు iv ) తల తన్నే వాడు ఉంటాడు✅

7) ధోవతి ఇంకొక పేరు

 i ) పైజామా    ii ) పంచ ✅  iii ) దుప్పటి  iv ) రుమాలు

8) రామాయణ మహా భారతాలను ఇలా కూడా అంటారు

i ) ఇతిహాసాలు✅   ii ) పరి హాసాలు iii ) హాసాలు  iv ) నవ హాసాలు

9) పూర్వం టేపు రేకార్ధరు రాక ముందు వినటానికి దీనిని పాటలు ఉపయోగించే వారు

i ) సెల్ ఫోను,   ii ) గ్రామఫోను✅ *గ్రాంఫోన్*  iii ) ల్యాండ్ ఫోను iv ) పెన్ డ్రైవ్

10) నోరు మంచిదయితే

i ) చెరువు మంచిదైతుంది   ii ) కారు మంచిదైతుంది iii ) ఊరు మంచిదవుతుంది✅ iv ) పేరు మంచిదవుతుంది.

11) పూర్వం మన దేశంలో స్త్రీ పురుషులు ఒకే రకమైన వస్త్రాన్ని ధరించే వారు అది

i ) కొక✅ *చీర*   ii ) పైజామా  iii ) పంజాబీ డ్రస్సు iv ) రుమాలు

12) పూర్వము ( *బియ్యము, గోధుమలు వంటి ధాన్యమును* )పిండి చేయటానికి ఈ సాధనం వాడే వారు

i )అట్లకాడ    ii ) మూకుడు iii ) విసుర రాయి✅ *విసురు ఱాయి లేక తిరగలి* iv ) పాట కారు

13) అనువుకాని చోట ఇలా అనరాదు

i ) ధనవంతుడ    ii ) అధికుల✅ *అధికులం*  iii ) జమిందార్  iv ) రాజు

14) ఉట్టి కెక్కలేనమ్మా ( *మ్మ* )

i ) కొండ ఎక్కినట్లు   ii ) స్వర్గానికి ఎక్కినట్లు✅ iii ) గోల్కొండ ఎక్కినట్లు iv ) నిచ్చెన ఎక్కినట్లు

15) ఈ రోజుల్లో సాధారణంగా ప్రతివారి ఇంట్లో ఇది ఉంటుంది

i ) కుంపటి   ii ) గ్యాసు స్టౌవు✅ iii ) పొట్టుపొయ్యి iv ) కట్టెల పొయ్యి

16) అన్నిదానముల కన్నా

i ) పెన్ను దానము మిన్న   ii ) సున్నం దానం మిన్న iii ) భూదానం మిన్న iv ) అన్నదానము మిన్న ✅

17) ఉపనయనం ఐన బ్రాహ్మలు ( *బ్రాహ్మణులు* ) విధిగా ఇది పట్టాలి

i ) చీపురు    ii ) ఔపోసన✅ *ఆపోశన*  iii ) శనగలు  iv ) రోకలి

18) అమృత మస్తు అని బ్రాహ్మలు ( *బ్రాహ్మణులు* )ఎప్పుడు అంటారు

i ) తినే ముందు ✅ *భోజనానికి మొదటిలో*  ii ) త్రాగే ముందు iii ) వాగే ముందు iv ) వాదులాడే ముందు

19) చెరపకురా

i ) పడవు   ii ) చేడేవు✅ *చెడేవు*   iii ) కడిగేవు  iv ) అడిగేవు

20) నం లక్ష్మి పూజ చేయాలంటే ముందుగా ఈ పూజ చేయాలి

i ) రాముని పూజ   ii ) సీతాదేవి పూజ  iii ) గణపతి పూజ✅ *ఏ పూజకైనా ముందుగా ఈ పూజ చెయ్యాలి* iv ) నైవేద్యం పూజ

*దరిద్రం తనోషీశ్వరం

 శ్లోకం:☝️హరస్తుతి

*దరిద్రం తనోషీశ్వరం సర్వభూమే*

*స్తథా సార్వభౌమం ముహూర్తాద్దరిద్రమ్ l*

*ధరనూర్ధ్వమేకం మహాదుఃఖమగ్నమ్*

*తథాఽథః క్షిపస్యన్య ముద్యత్సుఖేభ్యః ll*


భావం: ఈశ్వరా! నీవు దరిద్రుని ప్రభువుగాను ప్రభువును దరిద్రునిగాను క్షణంలో చేయగల సమర్థుడవు. దుఃఖంలో మునిగిపోయిన ఒకని ఉద్ధరిస్తావు. సుఖభోగాలతో ఉన్న ఒకని తలక్రిందు చేస్తావు. అంతా నీ ఇచ్ఛ!

excellent search engines


, there are still a large number of excellent search engines in the world that specialize in books, science, and other smart information.

Here a list of sites you've might never heard of.

 

www.refseek.com is a search engine for academic resources. More than a billion sources 

 

www.worldcat.org - search the content of 20,000 global libraries. 

 

https://link.springer.com - access to more than 10 million scientific documents: books, articles, 

 

www.bioline.org.br is a library of published bioscientific journals

 

http://repec.org - Volunteers from 102 countries collected nearly 4 million publications 

 

www.science.gov is a U.S. government search engine for more than 2200 scientific sites. 

 

www.pdfdrive.com is the largest website for free download of PDF books. Claim more than 225 million titles.

 

www.base-search.net is one of the most powerful search engines for academic research texts. More than 100 million scientific articles, 70% of which are free

ప్రశ్న పత్రం సంఖ్య: 36

 ప్రశ్న పత్రం సంఖ్య: 36 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) కొలుగులలో నివసించే జంతువును వాహనంగా కలిగిన వేల్పు ఎవరు 

i ) వినాయకుడు   ii ) సుబ్రమణ్యస్వామి  iii )విష్ణుమూర్తి  iv ) బ్రహ్మదేముడు 

2) ఏదయినా కార్యక్రమం చేయించేటప్పుడు బ్రాహ్మడికి కావలసిన గడ్డి జాతి మొక్క 

i ) దర్భ    ii ) ఉత్తరేణి  iii ) గడ్డి iv ) తుంగ 

3) చర్మవ్యాధులు క్రింది నూనెతో నివారించ వచ్చు  

i ) వేప నూనె   ii ) సంపెంగి నూనె iii )పల్లి నూనె iv ) ఆవ నూనె 

4) బాలానాం ______ బలం 

i ) లవణం    ii ) రోదనం   iii ) క్షీరదం  iv ) వదనం

5) మందహాసం  అనగా 

i ) జనాలు మందగావుండి నవ్వటం   ii ) జనాల మందలో ఒకరు నవ్వటం iii ) చిరు నవ్వు iv ) పరిహాసం. 

 6) సత్య భామ ఎవరి కూతురు 

i ) రావణాసురుని కూతురు   ii ) విదుర రాజు కూతురు iii ) సత్రాజిత్తు  కూతురు iv ) ప్రసేనుడి కూతురు. 

7) లవ కుశలలో ఎవరి జన్మకు వాల్మీకి కారణం

 i ) ఇద్దరి ii ) లవుని iii ) కుశుని iv ) ఇద్దరు రాముని కుమారులే 

8) రామాయణ మహా భారతాలలో ముందుగా వ్రాసింది ఏది. 

i ) మహా భారతం ii ) రామాయణం iii ) రెండు ఒకేసారి iv ) వేరు వేరు కవులు

9) అరిసెలు చేయటానికి ఈ పిండిని ఉపయోగిస్తారు.

i ) శనగ పిండి ,   ii ) గోధుమ పిండి   iii ) మినప పిండి  iv ) బియ్యపు పిండి 

10) మనిషి ఉష్ణోగ్రత

i ) వాతావరణంతో పాటు మారుతుంది   ii ) శీతాకాలంలో చల్లగావుంటుంది iii ) ఎప్పుడు స్థిరంగా ఉంటుంది iv ) వేసవిలో ఎక్కువగా ఉంటుంది. 

11) మత్త గజం అనగా

i ) మత్తు మీద వున్నదున్నపోతు ii ) మత్తు మీద వున్న కుక్క   iii ) మదించిన ఏనుగు  iv ) మత్తులో వున్న ఏనుగు 

12) కాశి యాత్ర చేసినవారు ఈ జంతువును పూజిస్తారు.

i )పిల్లి ii ) కుక్క iii ) తొండ iv ) తాబేలు 

13) ఉంటె మనిషికి దండి ________పశువుకు దండి

i ) గడ్డి ii ) తింటే iii ) పరిగెత్తితే iv ) అడివికి పొతే 

14) ఆకలి రుచెరుగదు నిద్ర _________ఎరుగదు

i )పరుపులు   ii ) దుప్పటి  iii ) నేల iv ) సుఖము 

15) ఈ రోజుల్లో సాధారణంగా ప్రతివారి ఇంట్లో ఇది ఉండటం లేదు

i ) కుంపటి   ii ) ఫాను  iii ) వాషింగ్ మిషన్ iv ) గ్యాస్ స్టవ్ 

16) పరమ శివుడు ఈ పర్వతం మీద నివసిస్తాడు

i ) మేరుపర్వతం    ii ) హిమాలయ పర్వతం  iii ) కైలాస పర్వతం  iv ) యాదాద్రి పర్వతం. 

17) మనిషి శరీర ఉష్ణోగ్రత పెరిగితే దాని అర్ధం

i ) తలనొప్పి వచ్చిందని ii ) జలుబు చేసిందని iii ) జ్వరం వచ్చిందని iv ) ఆకలి వేసిందని. 

18) భూమి సురులు అని వీరిని అంటారు

i ) బ్రాహ్మణులు    ii ) క్షత్రియులు  iii ) వైస్యులు  iv ) తాపీ పనివారు 

19) చిన్నపామునియేన __________ కొట్టాలి

i ) రోకలి తో ii ) చెప్పుతో iii ) రాయితో iv ) పెద్ద కర్రతో 

20) ఏడ్చే దాని మొగుడొస్తే _____మొగుడొస్తాడు

i ) నీ    ii ) నా   iii ) మన  iv ) ఆమె