ప్రశ్న పత్రం సంఖ్య: 36 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.
1) కొలుగులలో నివసించే జంతువును వాహనంగా కలిగిన వేల్పు ఎవరు
i ) వినాయకుడు ii ) సుబ్రమణ్యస్వామి iii )విష్ణుమూర్తి iv ) బ్రహ్మదేముడు
2) ఏదయినా కార్యక్రమం చేయించేటప్పుడు బ్రాహ్మడికి కావలసిన గడ్డి జాతి మొక్క
i ) దర్భ ii ) ఉత్తరేణి iii ) గడ్డి iv ) తుంగ
3) చర్మవ్యాధులు క్రింది నూనెతో నివారించ వచ్చు
i ) వేప నూనె ii ) సంపెంగి నూనె iii )పల్లి నూనె iv ) ఆవ నూనె
4) బాలానాం ______ బలం
i ) లవణం ii ) రోదనం iii ) క్షీరదం iv ) వదనం
5) మందహాసం అనగా
i ) జనాలు మందగావుండి నవ్వటం ii ) జనాల మందలో ఒకరు నవ్వటం iii ) చిరు నవ్వు iv ) పరిహాసం.
6) సత్య భామ ఎవరి కూతురు
i ) రావణాసురుని కూతురు ii ) విదుర రాజు కూతురు iii ) సత్రాజిత్తు కూతురు iv ) ప్రసేనుడి కూతురు.
7) లవ కుశలలో ఎవరి జన్మకు వాల్మీకి కారణం
i ) ఇద్దరి ii ) లవుని iii ) కుశుని iv ) ఇద్దరు రాముని కుమారులే
8) రామాయణ మహా భారతాలలో ముందుగా వ్రాసింది ఏది.
i ) మహా భారతం ii ) రామాయణం iii ) రెండు ఒకేసారి iv ) వేరు వేరు కవులు
9) అరిసెలు చేయటానికి ఈ పిండిని ఉపయోగిస్తారు.
i ) శనగ పిండి , ii ) గోధుమ పిండి iii ) మినప పిండి iv ) బియ్యపు పిండి
10) మనిషి ఉష్ణోగ్రత
i ) వాతావరణంతో పాటు మారుతుంది ii ) శీతాకాలంలో చల్లగావుంటుంది iii ) ఎప్పుడు స్థిరంగా ఉంటుంది iv ) వేసవిలో ఎక్కువగా ఉంటుంది.
11) మత్త గజం అనగా
i ) మత్తు మీద వున్నదున్నపోతు ii ) మత్తు మీద వున్న కుక్క iii ) మదించిన ఏనుగు iv ) మత్తులో వున్న ఏనుగు
12) కాశి యాత్ర చేసినవారు ఈ జంతువును పూజిస్తారు.
i )పిల్లి ii ) కుక్క iii ) తొండ iv ) తాబేలు
13) ఉంటె మనిషికి దండి ________పశువుకు దండి
i ) గడ్డి ii ) తింటే iii ) పరిగెత్తితే iv ) అడివికి పొతే
14) ఆకలి రుచెరుగదు నిద్ర _________ఎరుగదు
i )పరుపులు ii ) దుప్పటి iii ) నేల iv ) సుఖము
15) ఈ రోజుల్లో సాధారణంగా ప్రతివారి ఇంట్లో ఇది ఉండటం లేదు
i ) కుంపటి ii ) ఫాను iii ) వాషింగ్ మిషన్ iv ) గ్యాస్ స్టవ్
16) పరమ శివుడు ఈ పర్వతం మీద నివసిస్తాడు
i ) మేరుపర్వతం ii ) హిమాలయ పర్వతం iii ) కైలాస పర్వతం iv ) యాదాద్రి పర్వతం.
17) మనిషి శరీర ఉష్ణోగ్రత పెరిగితే దాని అర్ధం
i ) తలనొప్పి వచ్చిందని ii ) జలుబు చేసిందని iii ) జ్వరం వచ్చిందని iv ) ఆకలి వేసిందని.
18) భూమి సురులు అని వీరిని అంటారు
i ) బ్రాహ్మణులు ii ) క్షత్రియులు iii ) వైస్యులు iv ) తాపీ పనివారు
19) చిన్నపామునియేన __________ కొట్టాలి
i ) రోకలి తో ii ) చెప్పుతో iii ) రాయితో iv ) పెద్ద కర్రతో
20) ఏడ్చే దాని మొగుడొస్తే _____మొగుడొస్తాడు
i ) నీ ii ) నా iii ) మన iv ) ఆమె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి