25, జులై 2024, గురువారం

Panchaag


 

రాధాకృష్ణుల ప్రేమతత్వం*

 *రాధాకృష్ణుల ప్రేమతత్వం* 

దేహము లవ్వి వేరుకన తీరులవొక్కటె యెంచి చూడ,సం

దేహము లేదు కృష్ణునకు దివ్య వ్రజాంగనయైన రాధకున్

మోహము లేదు సత్ప్రణయ ముగ్ధ మహత్తర దివ్యభావ,దా

సోహమె జూడ వారికిని శుద్ధప దార్ధములంచు  మ్రొక్కెదన్ !!

పద్య ప్రతిభ

           పద్య ప్రతిభ


సీ. ఆదికవివరేణ్యు పాదున జనియించి

            భారత కావ్యాన పరిఢవిల్లి

  కవిబ్రహ్మ తిక్కన కావ్యమ్ము లందున

            బహుళ ఛందస్సుతో ప్రజ్ఞ పొంది

  ఆమాత్యు డెఱ్ఱన్న నందమౌ కవనాన 

          రమ్య  ప్రబంధమై రాణ కెక్కి 

  పోతన కవితలో పొంది లాలిత్యమ్ము

          భక్తవరుల నోట పలుక బడియు

  నాంధ్రభోజునిభవ్య నాముక్తమాల్యదన్ 

          జటిల రచన తోడ జగతి వెల్గి

ఆ. అష్ట దిగ్గజముల యాంధ్ర ప్రబంధాల

  ఘనత గలుగు శ్రావ్య కవన మందు

  నవని వెలుగు దివ్య యవధానముల యందు

  "పద్య కుసుమ" మవని పరిఢ విల్లె


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

వలువలు మాసినన్


: చం॥ 

వలువలు మాసినన్ విడరు పర్వున కార్యము లాచరించగా 

కలతలు లేవు భార్య యెడ గట్టిగ బాధ్యత లుండ వెన్నడున్ 

తలకును తైలముండదు నిదానము ముఖ్యవిధానమైన త 

ద్దలసుల జీవనమ్ము కడుహాయిగ సాగును సౌఖ్యదాయియై 

*~శ్రీశర్మద*

ఆటవెలది:

*********

తెలుగు భాషటన్న తేజరిల్లేఖ్యాతి

తెలుగు నందు మంచి తేనె లూరు

అమ్మ భాషటన్న యావకాయేనురా

తల్లితెలుగునెపుడు తలచు కొనుడు

*****************

రావెల పురుషోత్తమరావు

(అమెరికా)

నీ పాదమె

 కం.

నీ పాదమె భయహరణము 

నీ పాదమె భవతరణము నిజముగ నాకున్ 

నీ పాదమె సర్వసుఖము 

నీ పాదమె దలతు నెపుడు నేనిక శ్రీశ!


✍️యస్.కె.చక్రవర్తి

క్రొత్తపలుకు-4

 క్రొత్తపలుకు-4

శుద్ధి రెండువిధము లిద్ధరాతలిలోన 

నాత్మశుద్ధి యొకటి యాచరింప 

నాత్మశుద్ధి లేని యాచారవంతుడు 

శుద్ధమవడుగాక యుద్ధరింప 



బాహ్యశుద్ధి దేహబాహ్యమ్మునకు జెందు 

నదియ లేక నాత్మ యమల మవదు 

చిత్తశోధనమ్ము జేయగా జేకూరు 

నాత్మశుద్ధి మిగుల నమలమయ్య 5

*~శ్రీశర్మద*

నిత్యపద్య నైవేద్యం-

 నిత్యపద్య నైవేద్యం-1559 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-194. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

మన: ప్రీతి కర: స్వర్గ:

నరకస్తద్విపర్యయ:l

నరక స్వర్గ సంజ్ఞే వై 

పాపపుణ్యే ద్విజోత్తమ:ll 


తేటగీతి:

సతము మదికి సంతోషమే స్వర్గమనగ 

ధరను తీరని దుఃఖమే నరకమనగ 

అరయ నరక స్వర్గాలనే యార్యజనులు 

పాపపుణ్యంబులందురు వరుసగాను.


భావం: మనసుకు సంతోషం కలిగించేదే స్వర్గం. ఎడతెగని దుఃఖమే నరకం. ఈ నరక స్వర్గాలకు పాపపుణ్యములని పేరు.

గోరింటాకుపుణ్య స్త్రీలు

 _*ఆషాఢమాసమునందు అన్ని కులములలోని పునిస్త్రీలకు గో రింటాకు నూరి దానమిచ్చిన శు భఫలం!!.*_

>>>>>>>>>>>>(ॐ)<<<<<<<<<<<<<<<<<                                     


_*ఆషాఢంలో గోరింటాకుపుణ్య స్త్రీలు ఎందుకుపెట్టుకోవాలి?.*_ 


ప్రకృతిలోగ్రీష్మఋతువు తరువాత వర్షఋతువుగా మారుతుందిమన వాతావరణం ఆప్రకారంఆషాడమా సములో వర్షాలు పడుతూఉంటా యి,దీంతోవాతావరణంఅంతాచల్ల గా మారుతుంది. 

అంతేనా!, సూక్ష్మక్రిములుపెరిగిమ నకు అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే!, వర్షాలుఎక్కువగాపడట మువలన వాతావరణం చల్లబడు తుంది కానీ,ఒంట్లోవేడి ఇంకాఅలా నే ఉంటుంది. 

బయట వాతావరణానికి సమానం గా మనశరీరం మారదు. 

దీంతో సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. 

అందుకు గోరింటాకు పెట్టుకోవడం వల్లశరీరంలోని అధిక  వేడిని తీసే స్తుంది,అంతేకాకుండా రోగ నిరోధ క శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమం గా జరిగేలా చేస్తుంది ఈగోరింటికు. ఇది గొప్ప ఆయుర్వేద దివ్యఔషధ గుణములు కలిగినది గోరింటాకు.  అందుకే! ప్రతిఒక్కరూఈసమయం లో గోరింటాకును కోసి కొద్దిగాపసు పు కొద్దగా చింతపండు చాలా కొద్ది గా నీరుసున్నము వేసి మెత్తగానూ రి ఆనూరినది చిన్న చిన్న డబ్బాల లో నిమ్మకాయంత పెట్టి శక్తి ఉన్న వాళ్ళు,ముత్తయిదులకు, ఒక జా కీటు పీసులు,నాలుగులేకఆరు గా జులు,పసుపు,కుంకుమ,గంధము,కాటుక,పువ్వులలు తమలపాకు లు మూడు,రెండువక్కలు,రెండు పండ్లు,సిద్ధపరచుకొని,ముందు ముతైైదువునకుపసుపు,కుంకుమ,గంధము,కాటుక,గాజులుతాంబూ లముతోపాటు నూరిన గోరింటాకు ను ఇవ్వాలి.

ఇచ్చినవస్తువులు,గోరింటాకునుపెట్టుకోవాలని చెప్పాలి,అని పెద్దలు చెబుతారు. 

అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచా రం వెనుక ఆరోగ్యప్రయోజనాలుఉ న్నాయని చెబుతారు. 

అందుకే అ మ్మాయిలంతా ఈసమ యంలోగోరింటాకుపెట్టుకుంటారు. ఇప్పుడంటే!గోరింటాకుపెట్టుకోవడ ము ఆడవారు మాత్రమే! చేస్తారని చెబుతున్నారు.

పైవిధముగాస్త్రీదేవతలదేవాలయములలో చేసిన పునిస్త్రీలకు ఆ గౌ రీదేవిఅనుగ్రహమున నిండు ము తైదువుల ఆశీర్వకనములందుతా యి 3,5,9,మందికి ఇస్తే!దీర్ఘసౌమం

 ళ్యత్వము కలుగుతుంది.


కానీ, ఇది వరకైతే మగవారుకూడా పెట్టుకునేవారట వారువ్యవసాయ ముచేయుటపొలంపనులుచేయు వారుఎక్కువశాతమునీళ్ళల్లోనాన డం మూలనా!  గోళ్లకు జరిగే హాని కూడా నిరోధిస్తుంది అనిపెట్టుకునే వారు,దానివలన!వారిగోళ్ళుపుచ్చి పోకుండావుంటాయి,పెట్టుకున్నవా రికి భార్యపై ప్రేమకలుగుతుందని అర్ధనారీశ్వరతత్వమనిశాస్త్రవచనము. 

కాని కోన్ వాడకూడదు దానిలో ర హానికరసాయనాలు కలుపుతారు. 

గోరింటాకుఆకు సహజంగా ప్రకృతి సిద్ధంగా వచ్చినది. దీనినిమాత్రమే వాడాలి.


గోరింటాకునకు మంచికథకూడాచె బుతారుపెద్దలు. 

గౌరీదేవి (పార్వతీ దేవి) బాల్యంలో స్నేహతులతో, వనంలో ఆటలాడు కునే సమయంలో రజస్వలఅయిం దిట. 

ఆ రక్తపుచుక్కలునేలనుతాకినంత నే ఓమొక్క పుట్టిందట. 

అదేగోరింటమొక్క.ఈవార్తగౌరీదేవి తండ్రి పర్వతరాజుకుతెలిసి ఆవిం  తనుచూసేందుకు సతీసమేతంగా, గోరింట మొక్క దగ్గరకు వెళ్తాడు.


అంతలోనే ఆ మొక్క పెద్ద  గోరింట చెట్టై యిలా అంది. "నేను సాక్షాత్ పార్వతీదేవి రుధిరాంశతోజన్మించా ను. కాబట్టి నావలన లోకానికి ఏవి ధమైన ఉపయోగం ఉంటుందో! చె ప్పమ"ని పర్వతరాజుని అడిగింది.


అపుడు గౌరీదేవిసహజమైనబాల్య చాపల్యంతో గోరింట చెట్టు ఆకును కోస్తుంది. ఫలితంగాగౌరీదేవిచేతివే ళ్లు ఎర్రబారిపోతాయి.

అది చూసిన పర్వతరాజు కూతురి చేయికందిపోయిఉంటుందనిబాధప డతాడు.

తనకేవిధమైన బాధా లేదని, పైగా చాలాఅందంగాఉండి,అలంకారం గా అగుపిస్తోందని గౌరీదేవి తండ్రికి చెబుతుంది.సంతోషించిన పర్వత రాజు యిలా చెబుతాడు.

"స్త్రీ"సౌభాగ్యానికి చిహ్నంగా గోరిం టాకు, యిక నుండి భూలోకంలో ప్రసిద్ధమవుతుంది. 

తన రంగు వలన గోరింటాకు పెట్టు కున్న చేతులకు కాళ్ళకు అందాన్ని స్తుంది. 

అందరూ పెట్టుకునే అలంకారవస్తు వుగా,గోరింటాకుగా,గౌరవంపొందుతుంది. ఇదే గోరింట చెట్టు జన్మకు సార్థకత"ఈఆకును నూరి పుణ్య స్త్రీలకు వాయనముగా ఇచ్చిన వా రికీ సుఖము,ఆనందము,సౌభాగ్య ముకలుగుతా యని పర్వతరాజు చెబుతాడు. 

అప్పుడు గౌరీదేవితోసహాఅందరూ ఆ చెట్టు ఆకు పసరుతోచేతులుకా ళ్ళుఅందంగాఅలంకరించుకుంటారు.అప్పుడు కుంకుమకు ఓ సందే హం కలిగింది. 

ఈ ఆకుతో నుదుటన కూడాబొట్టు దిద్దుకుంటే,అప్పుడు తనప్రాధాన్య త తగ్గిపోతుందనికుంకుమబాధప డింది. కుంకుమ గౌరీదేవికి తన బా ధచెప్పుకోగా, *'ఈ ఆకు నుదుట దగ్గర పెడితే!పండదు'* అనిగౌరీ దేవి చెబుతుంది.

గౌరీదేవి కుంకుమకు యిచ్చిన మా ట కారణంగానే, గోరింటాకు నుదు రున పండదని పెద్దలు చెబుతారు. గౌరి ఇంటి ఆకు కాబట్టి గోరింటాకు అసలు పేరు *"గౌరింటాకు".* అని  పేరు,గోరింటాకుకూడా,సంవత్సరానికి ఓమారు ఆషాఢ మాసంలో పు ట్టింటికి(పార్వతీదేవిదగ్గరకు)వెళ్తుం దిట. 

ఆషాఢ మాసంలో తను పుట్టింట ఉన్నపుడు కూడా తనను తప్పక అందరూ పెట్టుకోవాలని గోరింటా కు కోరుకుందట.

ఆషాఢ మాసంలో చేతినిండాగోరిం టాకుపెట్టుకుంటేకష్టాలుఉండవని, సీతమ్మ గోరింటాకు ఇతరులకుయి చ్చినవరమే సీతారాముల అనురా గమనియిందుకుగోరింటాకుకారణ మని పురాణాలు చెబుతున్నాయి.


*గౌరీ ఇంటాకుస్త్రీమూర్తికదానం గౌరవమైన సౌభాగ్య జీవనము నకు మార్గము.*


  *సర్వేజనాఃసుఖీనోభవంతు.*

ఆచార్య సద్భోదన*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

నేటి...


                *ఆచార్య సద్భోదన*

                   ➖➖➖✍️`




  భావనామాత్ర సంత్యుష్టయే నమః

```


*భగవన్నామ స్మరణ చేసేటపుడు భావం భగవంతునిపై ఉండేలా చూసుకోవాలి.* ```


నామమునకు తగిన రూపం ప్రత్యక్షం కావాలి. అంతేకాని నోటితో నామము పలుకుతూ మనసులో ఏవో ఆలోచనలు చేస్తుంటే అది స్మరణ అనిపించుకోదు.


ఇలా ఎంత సమయం చేసినప్పటికీ ఏ కొంచెం కూడా ప్రయోజనం లేదు. రేడియో/టేప్ రికార్డర్  ఉంటుంది చూడండి, దానికో టేపు వేస్తే చక్కగా పాడుతూ ఉంటుంది. అంత మాత్రమున ఆ పాటలకు భగవంతుడు కదలి వస్తాడా!?


మనం నేడు రేడియో మాదిరిగానే చేస్తున్నాం కనుకనే అనుగ్రహాన్ని అందుకోలేకపోతున్నాం. భగవంతుడు బాహ్య ఆడంబరములకు లొంగేవాడు కాదు. ఆయనకు భావమే ప్రధానం. భావం సరిగా ఉన్నపుడే ఆయన పలుకుతాడు. ప్రార్థనకు సమాధానమిస్తాడు.✍️```

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

శ్రీనాధ కవితా వైభవం!



శ్రీనాధ కవితా వైభవం!


            

             ఉ:  ఎక్కడ లేరె  వేల్పులు సమీప్సిత దాతలు,  ముద్దుకూన !  నీ


                   వెక్కడ ?  ఘోర వీర  తపమెక్కడ ? యీపటు  సాహసిక్యమున్


                   తక్కు ,'శిరీషపుష్ప మవధాన పరత్వమునన్    మధువ్రతం


                  బెక్కిన  నోర్చునో?  విహగ  మెక్కిన  నోర్చునొ ?  నిశ్చయింపుమా?


                    హరవిలాసం--  4: ఆ:   శ్రీనాధ మహాకవి!


                        ఓముద్దుకూనా!పార్వతీ !కోరిన కోర్కెలు  దీర్చుటకు,   దేవత  లెందరోగలరుగదా! పరమేశ్వరుని గూర్చియే తపమేల? సుకుమారివి నీవిక్కెడ?  ఘోర మైన  యీకఠోర తపమెక్కడ?   ఈదుస్సాహసమును  వీడుము, దిరిసెనపూవుపై  తుమ్మెద వ్రాలిన  నోర్చునుగాని, గ్రద్దవ్రాలిన నోర్వ నేరదుగదా!  యని దీనిభావము.


                    పార్వతి  పరమేశ్వరుని  భర్తగా బడయఁ గోరి  తపమాచరింపఁ  బోవుచు ,తండ్రి హిమవంతుని  యనుజ్ఙ బడయుటకేగ, గిరిజ నిశ్చయమును విని,  సుకుమారివి  నీవు తపమొనరింపలేవు. ఈదుస్సాహసమున  వీడుమని  హిమవంతుడామెకు నచ్చజెప్పు సందర్భము. 


                "దిరిసెన పూవు  మిగుల మృదువైనది. అది తుమ్మెద సోకు నోర్చునుగాని, బలమైన పక్షి సోకు నోర్వజాలదని చెప్పుచు, అన్యాపదేశముగా  శంకరునితో  నీకు  పొందు అనుచితము. అనిసూచించెను.


                  పార్వతిని  శిరీషపుష్పముతో బోల్చి  యామె సుకుమార ప్రకృతిని, శంకరుని యందు విహంగోపమమును, జెప్పి యతని మొఱటుతనమును  కవి నిరూపించెను.


                             ఈరీతిని శ్రీనాధుని కవిత్వము  వ్యంగ్య  వైభవ  విలసితమై  యొప్పారును!


                                                  నిదర్శనాలంకారము.


                                                           స్వస్తి!

క్షమా మంత్రం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️

        *క్షమా మంత్రం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్*


*తథ్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే ।*


*విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ*


*న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమః ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*స్వస్తిః ప్రజాభ్యః పరిపాలయంతాం*


*న్యాయేన మార్గేణ మహీం మహీశాః*


*గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం*


*లోకాస్సమస్తా స్సుఖినోభవంతు!*


*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

మహావైణికుడు

 మహావైణికుడు....మహోన్నతుడు..

సీ..

వీణియచేబట్టి విహరింప రాగ ర

    మ్యాకాశ వీథీసుధాంశుడనగ

వీణాసునాదాల విజయింప నారదు     

      డేతెంచె మహతితో నిలకుననగ

పీఠికాపురమందు వీణాశ్రవణమది

    హృదిరసప్లావితరీతి గనగ

విశ్వకవీశు రవీంద్రనాథు నతులు

   గొని మన్ననయుగన్న గురువనంగ 

సంగీత సామ్రాట్టు సంగమేశ్వరశాస్త్రి

     తుమరాడ వంశాబ్ధి హిమవలమన

గండపెండేరముల్ ఘనబిరుదంబులన్ 

   మెండుగానందిన మేటియనగ

తేగీ..

అమ్మ యా పరాభట్టారికాశిషముల

శాస్త్రి సాధించె సంగీత శాస్త్ర విద్య

వినయశోభితవైణికవీరుడగుర!

యట్టి యబ్బురంబగుమూర్తికంజలింతు.


వారికి ఘనమైన అక్షర నివాళి

రాయప్రోలు జగదీశచంద్రశర్మ.. తెనాలి

డొనేషన్లు కట్టలేము

 ⭐*


*తెలంగాణ లోని వివిధ ప్రాంతాల ను తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల వేరకు సంప్రదాయ కళాశాల లో అడ్మిషన్స్ కు అవకాశం కల్పించడం జరిగింది*


*తెలంగాణ బ్రాహ్మణ బంధువులందరికి ప్రత్యేక విజ్ఞప్తి*

 

*మీ పిల్లలు 10th పాస్ అయ్యారా. ఏ కాలేజీలో చేర్పించాలని ఆలోచిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం*. *డొనేషన్లు కట్టలేము అత్యధిక ఫీజులు చెల్లించుకోలేమని బాధపడుతున్నారా* *వీటన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడి లేకుండా మీ పిల్లలు ఉన్నతంగా చదువు కోవాలని కోరుకుంటున్నారా* 


అయితే ఇది మీకు గొప్ప అవకాశం

 

*ఎలాంటి ఫీజు ఉండదు ఎలాంటి డొనేషన్స్ ఉండవు*

 

    పూర్తిగా ఉచితం


 అమ్మాయిలకు మాత్రమే 



పరిమిత సీట్లు కలవు కొద్దిమందికే అవకాశం


 చదువుతోపాటు సంగీతము సాహిత్యము స్తోత్రాలు యోగా కుట్లు అల్లికలు ఇలాంటి ఎన్నో విద్యలను అందిస్తుంది. 


అప్లై చేసుకోవడానికి చివరి తేది 31.07.2024.


*సంప్రదాయ కళాశాల పాలమూరు నందుఇంటర్ మొదటి సంవత్సరానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి కావున ఆసక్తిగల బ్రాహ్మణ విద్యార్థినిలు ఎవరైనా ఉంటే దయచేసి తొందరగా తెలపగలరు*  




*Mpc 10 సీట్లు* 

*Bipc 15 సీట్లు* మాత్రమే అవకాశం కలదు*. 

 

కావున ఈ సమాచారం బ్రాహ్మణులందరికీ తెలియజేసి అమ్మాయిలకు ఒక గొప్ప భవిష్యత్తుకు ఇవ్వడానికి మీ వంతు సహాయాన్ని చేయగలరని మనవి.


 విలువలతో కూడుకున్న చదువు ఒక్క సాంప్రదాయ పాఠశాలల్లో మాత్రమే సాధ్యం.

 

*సాంప్రదాయ విద్యతో పాటు ఆధునిక విద్య అందిస్తున్న ఏకైక సంస్థ*  


 *ఒత్తిడి లేకుండా చదువుతూ గత రెండు సంవత్సరాలుగా జిల్లా స్థాయి ఉన్నత ర్యాంకులను సాధించినటువంటి ఏకైక విద్యాలయం ఏదైనా ఉంది అంటే అది మన సాంప్రదాయ కళాశాల మాత్రమే*



 కావున బ్రాహ్మణోత్తములారా ఇటువంటి సదవకాశాన్ని వినియోగించుకోగలరు 


త్వరపడండి.


వివరాలకు.

కుప్పా జగన్నాథ శర్మ

+919849658030


 గొండ్యాల రాఘవేంద్ర శర్మ

9705838686


తోటపల్లి శ్రీకాంత్ శర్మ.

9059902877


తాటిపర్తి వేణుగోపాలరావు.

+919440831549.


సరిత కులకర్ణి.

+919849375365

తపస్సులని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


     శ్లో𝕝𝕝    *దేవద్విజగురుప్రాజ్ఞ*

              *పూజనం శౌచమార్జనమ్* |

              *బ్రహ్మచర్యమహింసా చ*

              *శారీరకం తప ఉచ్యతే* || 

   

తా|| *దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట, శరీరశుద్ధి కలిగియుండుట* *మరియు ఋజుత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శరీరముచే చేయదగిన తపస్సులని చెప్పబడుచున్నవి.*,


 ✍️🌹💐🌷🙏

సుందరకాండము

           సుందరకాండము 

      ముప్పది ఏడవ సర్గము


శ్రీరామచంద్రుని శీఘ్రముగా తీసికొని రమ్మని 

        సీత హనుమంతుని కోరుట

                  

తే.

అనిలనందను డైనట్టి హనుమ వలన 

విభుడురాముని కుశలముల్ వినిన సీత

సంతసిల్లియు మిక్కిలి స్వాంతమందు

మారు తా బల్కె నీరీతి మధురముగను       866*


తే.

"రామచంద్రుండు నిరతమ్ము ప్రేమతోడ

మదిని నిను దల్చుచున్నాడు మఱపులేక"

యనెడి మధురపు వచనముల్ హనుమ ! యిప్పు 

డయ్యె నమృతపు సదృశము లరయ వినగ.            867*


తే.

"విభుడు నిరతమ్ము తా కూడి విరహమందు 

శోకమున నున్నవాడదె శూరుడయ్యు"

ననెడి మాటలు ములుకులై యంతరమున

బాధ కల్గించు చుండెను బహువిధముల.        868*


ఆ.

అంతులేని విరివి యైశ్వర్యమున గాని

మహితమైన దుఃఖమందు గాని

ధరను రజ్జుపగిది దైవమ్ము బంధించి 

లాగుచుండు నరుని వేగముగను               869*


తే.

అరయ విధివల్ల నాపదలందు బడిన

నన్ను లక్ష్మణు మరియు నా నాథు గనుమ 

ప్రాణి విధి దాటజాలడు బ్రతుకునందు 

విధిని దప్పింప లేడుగా వేధ యైన         870*


తే.

భయద తోయధి నన్నావ బ్రద్ద లవగ

నీదుచున్ డస్సిపోయిన జోదు వంటి 

రామచంద్రుండు శోక నీరధిని నుండి

పరమ శాంతిని యెపుడు తా బయట పడునొ ?      871*


ఆ.

రామచంద్రు డెపుడు రక్కసులను జంపి

యసురు లంకపతిని హత మొనర్చి

దనుజపట్టణమును ధరపాలు గావించి 

చేరు నెపుడు నన్ను చీరు టకును?             872*


ఆ.

దానవుండు గడువు ద్వాదశమాసముల్ 

నిర్ణయించ పదియునెలలు గడచె

చివరి రెండునెలలె జీవించి నే యుందు  

విన్నవించు హనుమ ! విభున కిపుడు.       873*


మం.ద్వి.

“సీత నర్పించుమా శ్రీరామునకును 

వైరమ్ము వానితో  వలదునీ కంచు”

శ్రీవిభీషణుడెంత చెప్పినన్ వినక 

కడు మూఢతన్నుండె ఖలుడు రావణుడు 

ఆయువు మూడిన యా దైత్యపతిని

కబళించ మృత్యువు కడునుత్సుకతను 

నెదురు చూచుచు నుండె కదనరంగమున   874*


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

ఆంధ్ర భారతము

 ఆంధ్ర భారతము 


సీ. కవి నన్నపార్యుని ఘనపద్య కవితతో 

             గౌతమీ తటమద్ది గణుతికెక్కె 

     కవిధాత తిక్కన కమనీయ ఘంటాన 

             నెల్లూరుపురి విలసిల్లె  కీర్తి 

     శివదాసు డెఱ్ఱన శ్రీకర కవితతో 

             అద్దంకి జగతి విఖ్యాతి నందె 

     పదునెన్మిదైనట్టి పర్వాల భారత 

             మితిహాసమాంధ్ర జగతికి నందె 

తే. అఖిల కావ్యమ్ము లందున శిఖర మయ్యు 

     నిఖిల ధర్మసూక్ష్మంబుల నిలయ మయ్యు

     సకల వేదోపనిషదీయ సార భరిత

     మాంధ్రభారతమ్మది దక్కె వ్యాసు కరుణ    


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

మేలుంగాంచి యుదారతం

 శా॥

మేలుంగాంచి యుదారతం జనకు డేమీ మెచ్చబోవండు నీ 

వాలించం దన బల్కులందు నొకచో నానంద ముప్పొంగగా 

కేలంబట్టి యథార్థవాక్యముల నిన్ గీలించు లోకమ్ముతో 

మాలిన్యమ్మును వీడి తండ్రి యగుటన్ మార్గాన నిన్ బెంచెడిన్ 

*~శ్రీశర్మద*

కొండ కోన దిరిగి కోసితెచ్చితి పూల

 స్వామీ!

          -------------

సీ||

కొండ కోన దిరిగి కోసితెచ్చితి పూల

      నింపైన వేవియో యేరుకొనుము;

బహువిధ ఫలముల బరికించి తెచ్చితి

         ననువైన వేవియో యారగించు;

పారెడు సెలయేళ్ల బట్టితెచ్చిన నీరు

          దాహమ్ము దీరగా ద్రావుమయ్య!

చివురు జొంపములతో చేసిన వీవనన్

            విసెరద నోప్రభూ!విశ్రమించు!

ఆ.వె.

ఊరువులను జేర్చి యూయల నూపెద,

పనుల కేమి లెమ్ము!పవ్వళించు!

కాళ్లు బట్టుచుంటి కనుమూసి నిదురపో!

ఎంత యలసినావొ యేమొ స్వామి!


-------కోడూరి శేషఫణి శర్మ

కృష్ణకిశోరు గాత్రమున

 ఉ.  కృష్ణకిశోరు గాత్రమున  కృష్ణుని వేణువు గానమట్టు లం

జిష్ణు మనోజ్ఞతేజమది చిత్ప్రభగొల్పుచు పొంగె పద్య మా

విష్ణు కృపాకటాక్షమున విన్బడెనేడిటు, ధనైతి నో

కృష్ణకిశోర!మిమ్ములను కృష్ణుఁడు కాచుత యెల్లవేళలన్.

🙏🏼

చింతా రామకృష్ణారావు.

పంచచామరము

 #పంచచామరము జ ర జ ర జ గ యతి పదవ అక్షరము



అపర్ణ నీదు చింతనే యహర్నిశంబు ధ్యానమౌ ,

సుపర్ణమధ్య నీదు నెమ్మి సోక జన్మ ధన్యమౌ !!

సుపర్ణియౌను మ్రోడు నీవు చూచినంత చాలునే ,

ప్రపూర్ణురాలవమ్మ నిన్ను ప్రస్తుతింప శాంభవీ !!


🌹🙏🌹


✍️వేణుగోపాల యెల్లేపెద్ది


🌹☘️------------☘️🌹


ఓ అపర్ణా ! నీమీద తలపునుంచుటే నిజమైన ధ్యానమౌను !


తామరతీగ వంటి నడుము గల ఓ సింహమధ్యా ! నీ దయ సోకటమే ఈ జన్మకు నిజమైన ధన్యతౌను !


మ్రోడునైనా సరే చిగురింపచేసి పచ్చని మరకతమణివలే మెరిసేటట్లు చేయగలదానవమ్మా నీవు , ఒక్క సారి అలా నీ క్రీగంటి చల్లని చూపే చాలును !


కొరత అన్నది లేని సంపూర్ణ స్వరూపమవు నీవు !

నిన్ను కీర్తించుటకు ఈ ఒక్క మాటయే చాలు ఓ శాంభవీ !


🌹☘️------------☘️🌹

క్రొత్తపలుకు-3

 క్రొత్తపలుకు-3 


రాశి కోరుకొన్న నాశియే నీదౌను 

వాసి కోరుకొన్న బాగుపడుదు 

వందు నేదిమంచి యనిజూచి నడువంగ 

వాసిరాశు లందు వాసిమేలు 

*~శ్రీశర్మద*

హరి వరశయ్యగా మరి సహస్రఫణీంద్రుని నెంచెనే రహిన్

 చం. హరి వరశయ్యగా మరి సహస్రఫణీంద్రుని నెంచెనే రహిన్ 

గరళగళా ! గళాన నురగంబుల భూషల నెన్నుకొంటివా

గరళధరమ్ములే గరముఁ  గంఠమునందిట కాటువేసినన్

హర! విషమద్ది కంధరపు హాలహలంబును మీఱదీశ్వరా  ! 9.


🙏🏻🙏🏻🙏🏻🙏🏻

✍️కొరిడె విశ్వనాథ శర్మ , 

ధర్మపురి .

భగవంతుడే ఆశ్వర్య పోయే భక్తులు.

 🔔 *సరదాగా* 🔔


భగవంతుడే ఆశ్వర్య పోయే భక్తులు.

1.భంగు భక్తులు:

వీరు భంగు,గంజాయి మొదలైన మత్తు తీసుకొని దేవుడి కోసం వెతుకుతుంటారు. దేవుడిని చూడాలనిపించినప్పుడు ఒక దమ్ము లాగి పైకి చూస్తారు.

2.రంగు భక్తులు:

వీరు తమ భక్తిని రంగు రూపంలో ప్రదర్శిస్తారు. డ్రెస్ కోడ్ కి importance ఇస్తారు. ఈ రకమైన భక్తులు మాలలు వేసుకుంటారు.

3.హంగు భక్తులు:

వీరికి తమ భక్తిని రిచ్చిగా చూపించాలనే పిచ్చి ఎక్కువగా ఉంటుంది. వీళ్లు బాగా వైభవంగా ఉండే ఆలయాలని మాత్రమే ఇష్టపడతారు.

4.మింగు భక్తులు:

ఈ టైప్ భక్తులు తమ తిండిపిచ్చినే భక్తి అనే భ్రమలో బతికేస్తుంటారు. గుడి గురించి వీళ్లని అడిగితే వీరు అక్కడ దొరికే “ప్రసాదం” గురించి చెప్పేటప్పుడు వాళ్ల కళ్లల్లో ఒక మెరుపు కనపడుతుంది.

5.పొంగు భక్తులు:

ఈ టైప్ భక్తులు ప్రతిదానికి పొంగిపోతూ ఉంటారు. టెంకాయలో పువ్వొచ్చినా, దండంపెట్టేటప్పుడు గంట మోగినా చాలు పొంగిపోతుంటారు.

6.లొంగు భక్తులు:

వీరికి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. అందుకని వీరు భక్తి లో పీక్స్ కి వెళ్లిపోతారు. మతం పేరుతో జరిగే కొన్ని దురాచారాలకి వీరు కొంత కారణం.

7.ఒంగు భక్తులు:

వీరు కూడా లొంగుభక్తుల లాంటి వాళ్లే. అంతకుమించి వీరు ఎక్కువగా దొంగబాబాలని నమ్ముతారు. ఎక్కువ మతదురాచారాలకి వీళ్లే ఎక్కువ కారణం.

8.సాంగు భక్తులు:

వీళ్లకి భక్తి పాటల పిచ్చి. కీర్తనలు,స్తోత్రాలు.

9.పింగ్ పాంగు భక్తులు:

వీళ్లని చూస్తే ఎవరూ భక్తులనుకోరు. బాగా స్టైలిష్ గా టాటూలతో ఉంటారు. అల్ట్రామోడర్న్ భక్తులు. భక్తిలో technology వాడతారు.

10.కొంగు భక్తులు:

దరిద్రపు భక్తులు వీళ్లు, కేవలం అమ్మాయిలని చూడటానికి మాత్రమే గుడికి వెళతారు.

11.రాంగు భక్తులు:

వీళ్లకి ఏ దేవుడిని ఎలా పూజించాలో తెలీదు. అందుకని తెలిసిన ప్రతిదాన్ని తమకిష్టమైన పద్ధతిలో మొక్కుతారు.

12.కింగు భక్తులు:

వీరికి రాజుల్లాగా మందిరాలు నిర్మించడం అంటే ఇష్టం. వీరిలో మందిరాలు కట్టలేని వారు విరాళాలు ఇచ్చి తమ ఆనందం తీర్చుకుంటారు. ప్రసాదాలని వేలం వేసినప్పుడు ఎక్కువ ఖర్చు చేసి కొంటారు.

13.వాకింగు భక్తులు:

పుణ్యక్షేత్రాలకి మైళ్లకి మైళ్లు నడిచి వెళ్లే బ్యాచ్. పాద యాత్రలు చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని వీళ్ల నమ్మకం.

14.జాగింగు భక్తులు:

ప్రదక్షిణల పిచ్చి ఎక్కువ. 100+ ప్రదక్షిణలు చేసే భక్తులు ఈ కేటగిరి కిందకి వస్తారు.

15.ట్రెక్కింగు భక్తులు:

భక్తిలో పీక్స్ చూడాలంటే కొండలెక్కాలని నమ్మే భక్తులు.

16.సఫరింగు భక్తులు:

వీళ్లు దేవుని ముందు ఏడ్చి భక్తిని ప్రదర్శిస్తారు.

17.కటింగు భక్తులు:

వీరికి శాస్త్రసంబంధ విషయాల్లో బాగా గ్రిప్ ఉందని తామే గొప్ప భక్తులమని అందరికీ తెలిసేలా ప్రదర్శనలు చేస్తుంటారు.

18.మీటింగు భక్తులు:

వీరికి సమారాధనలు,

ప్రవచన ప్రసంగాలు అంటే చాలా ఇష్టం. చెవులు కోసేసుకుంటారు.

19.కేర్ టేకింగు భక్తులు:

మిగతా భక్తుల కన్నా రెండాకులు ఎక్కువే చదివిన బ్యాచ్. వీరు ప్రవచనకర్తలుగా, మతగురువులుగా ఉండి తమ ప్రసంగాలతో మతాన్ని, దేవుళ్లని బతికిస్తూ ఉంటారు.

20.షాకింగు భక్తులు:

వీరు తమ భక్తిని విచిత్రంగా చాటుకుంటూ ఉంటారు. నాలుక కోసుకోవడం, నిప్పుల మీద నడవడం లాంటివి చేస్తుంటారు.

21.బెగ్గింగు భక్తులు:

వీళ్లు చాలా మంది ఉన్నారు. దేవుడిని అడుక్కుంటూ ఉంటారు అదివ్వు, ఇదివ్వు అని. దేవుళ్లకి లంచం ఇచ్చి పనులు జరగాలని కోరుకునే బ్యాచ్. ముడుపులు,బలులు etc. ఇస్తారు.

22.షిఫ్టింగు భక్తులు:

వీళ్లు మతం మారిన భక్తులు. వీళ్లు మనశ్శాంతి, లేదా డబ్బు, లేదా అమాయకత్వం, లేదా అజ్ఞానం, లేదా వివక్ష వగైరా కారణాల వల్ల వేరే దేవుడికి షిఫ్ట్ అవుతారు.

23.కేటరింగు భక్తులు:

వీళ్లు ప్రసాదాలు పంచి తమ భక్తిని చాటుకుంటారు. వీరి భక్తి కొంత మంది కడుపు నింపుతుంది.

24.రీజనింగు భక్తులు:

వీళ్లు దేవుడున్నాడని నిరూపించడం కోసం లాజిక్కులు చేసి నాస్తికులని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ‘గాలి చూపించు? చూపించలేవ్ కదా! కాబట్టి దేవుడున్నాడు’ ఇలా ఉంటాయి వీళ్ల లాజిక్కులు.

26. డౌట్ భక్తులు:

ఇవన్నీ తెలిసీ, దేవుడిని నమ్మలా వద్దా. పూజలు చెయ్యాలా వద్దా. రాయా, సిలువా, గోరీ నా అని డౌట్

27.సగం భక్తులు :

వీళ్లు సైన్సు చదివిన జ్ఞానం వలన దేవుని మహిమలు నమ్మక ,చదివిన సైన్సు లో ఆయన ఉనికి తెలుసుకోలేక ధ్యానాలు ,సత్ సంఘాలకు పోతుంటారు





🙏🏻🙏🏻🙏🏻🙂🙂🙂🙏🏻🙏🏻🙏🏻

సమస్య పూరణ.

 *కూతురు వయ్యెదో యనుcగు గోడలి వయ్యెదొ పౌత్రివయ్యెదో*

ఈ సమస్యకు నాపూరణ. 


 *భీష్మాచార్యులు*


పూతచరిత్ర నీకె తగు పుణ్యపు పంటవు  యాజ్ఞసేనివే 


చేతన మొంద పాండవులు, శ్రీవయి వైభవ రాజ్యలక్ష్మివై


ప్రీతిగ వర్తిలన్ కలుగు పెద్దన దీవన లిందు, గుంతికిన్


కూతురు వయ్యెదో యనుcగు గోడలి వయ్యెదొ పౌత్రివయ్యెదో


తాతల మైన మాకిచట ద్రౌపది! ధర్మము నిల్పు నిచ్చలున్.



*పల్లవాధరి ప్రల్లదంబది భర్త కెంతయొ హర్షమౌ*

ఈ సమస్యకు నాపూరణ. 


*మత్తకోకిలా వృత్తం.* 

చల్లగాలికి నారుబైటనె సంచరించెడి వానికై


మెల్ల మెల్లగ సద్దు సేయుచు మించుc బోడియె రమ్మనెన్


వల్లగాదిక మర్మకేళికి ప్రాణనాథుడు రాడనున్


పల్లవాధరి ప్రల్లదంబది భర్త కెంతయొ హర్షమౌ.


అల్వాల లక్ష్మణ మూర్తి.

నిర్ణయం

 నిర్ణయం

యోచనతో!

అవకాశం

కృషితో!

అనుభవం

అపజయం తో!

మూర్తీభవించిన

మానవత్వం తో!

వచ్చే అభిమానం!

నిలుస్తాయి

చిరస్థాయిగా!

ఈ సృష్టి ఉన్నంత వరకూ!

దోస పాటి.సత్యనారాయణ మూర్తి

సామర్లకోట

9866631877

స్వధర్మ రక్షణకు

 *దేశ వాసుల ప్రస్తుత కర్తవ్యం*


సభ్యులకు నమస్కారములు.


ఉదారము, నిర్మలమైన మన వైదిక ధర్మమును అధిక శాతం దేశవాసులు అనుసరించక పోవడం వల్లనే మన మతము దుర్భలమై, మనము (జనులు)  కష్టనష్టముల పాలగుచున్నాము. ఇతర మతములు పుట్టక మునుపే వైదిక ధర్మం లోకమంతటికి  మేలు చేసేమార్గం ఉపదేశించిన విషయం చారిత్రక సత్యం. వేదముల యందు ఏ మాత్రం భక్తి కల్గి ఉన్నా  మనకందరికీ  (కుల మరియు వర్గ రహితంగా) ఈ సనాతన ధర్మమే విహితమైన ధర్మము. 


ఇతర మత గ్రంథాలన్ని వేదముల తర్వాతనే ఆవిర్భవించాయి ఇది విశ్వ వ్యాప్త సత్యము. ఎవరు, ఏ మార్గం అనుసరించినా అవన్నీ ఒకే గమ్యం చేరుతాయని వేదం ఒక్కటే చెబుతున్నది. ఇతర మతాలు తమ మార్గమే సత్యమని, తక్కినవన్ని నరక హేతువులని చెప్పుచున్నవి. *హిందు ధర్మము మాత్రమే ఇతర ధర్మాల గురించి ప్రకటనలు చేయడం లేదు*. 


హిందూ మతస్తులను ఇతర మతాలు తమలో చేర్చుకుంటున్నా, హిందూ మతం ఇతరులను తనలో చేర్చుకోకపోయినా హిందూ మతం ఇంకా బాగానే ఉన్నది కదా!. దీనికి కారణమేమిటని ఆలోచిస్తే , మత సంప్రదాయాలను అనుష్టించడం వలన మాత్రమే మతాలు సజీవంగా ఉంటాయి కాని, అన్యులకు ప్రవేశమిచ్చి సంఖ్యలు పెంచడం వల్ల కాదని స్పష్టమవుతున్నది. 


*అధిక శాతం* అన్యమతస్తులు....పిల్లలు, పెద్దలు అను తేడా లేకుండా క్రమశిక్షణగా తమ తమ సంప్రదాయాలు పాటిస్తూ తమ నిర్దేశిత జీవన విధానానికి కట్టుబడి ఉండడము,  ముఖ్యంగా పాశ్చాత్య ధోరణులకు మొగ్గు చూపకపోవడం గమనిస్తూనే ఉన్నాము. మనలో *అధిక శాతం* స్వంత సంప్రదాయాలకు, విధానాలకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్న భావన సర్వత్రా ఉన్నది. *ఈ భావన వాస్తవ దూరం కాకపోవచ్చును కూడా*. ఇందువల్ల మనము మన దేశంలోనే ఉనికిని కోల్పోయే ప్రమాదమున్నది. *కనుక ఈ తరం యువత మన సంప్రదాయ మరియు ఆచార వ్యవహారాల పాటింపు విషయాలలో ఇతర మతస్తులను ఆదర్శంగా తీసుకోవాలి.*


కొన్ని తరాల క్రితం అని అనుకునే అవసరం లేదు...మూడు తరాల క్రితం పెద్దలు ఇంట్లో పిల్లలకు చిన్నప్పటి నుండి రామాయణ, మహాభారత మరియు భాగవత కథలు వినిపించేవారు అందువల్ల పిల్లలకు సంప్రదాయ, సంస్కారాలు అబ్బేవి. జాతి గూడా బలంగా మరియు క్రమశిక్షణగా ఉండేది. 


హిందూ జాతి బలంగా ఉండి తన ఉనికిని కోల్పోవద్దు అని భావిస్తే... మనమంతా (కుల మరియు వర్గ రహితంగా) పూర్వకాలం లాగా ఆచార వ్యవహారాలను కట్టుదిట్టంగా పాటించాల్సి ఉంటుంది. 


జ్ఞాన బోధ చేసే ప్రవచనకారులు, ఆశ్రమ అధిపతులు, పీఠాధి పతులు మరియు ఇతర పెద్దలు హిందూ జాతి జాగృతి మరియు స్వధర్మ రక్షణకై పూనుకోవాలి.


*కాబట్టి మనమందరం (కుల మరియు వర్గ రహితంగా) మన మత సంప్రదాయాల అనుష్టాన పరులం కావల్సిఉన్నది*.  పెద్దలు విధించిన ధర్మాలను ఆచరిస్తూ ఉంటేనే ఏ మతమైనా నిలదొక్కుకుని ఉంటుంది. మనకు మతైక్యం కావాలి *ఇతరుల లాగా ఏక మత సిద్ధాంతము కాదు*. ఎవరి మతములలో వారుండి స్వధర్మాచరణ చేస్తూ ఆ సర్వవేశ్వరుని ఉపాసిద్దాము. కుల మరియు వర్గాలకు అతీతంగా అందరం కల్సి ఐకమత్యంగా భగవత్ ఆరాధనతో బాటు హిందూ సంప్రదాయ పరిరక్షణకు పూనుకుందాము. 


*స్వధర్మ రక్షణకు మాత్రమే*


ధన్యవాదములు.

🙏🙏🙏


(భారత ఋషి పీఠం మాస పత్రిక ఆధారంగా)

నాహం కర్తా, హరిః కర్తా'

 T. T. D  పూర్వ I . A. S. అధికారి  శ్రీ  P.V.R.K. ప్రసాద్  గారి  రచన.


తిరుమల కొండమీద వేంకటేశ్వరుని    ఆలయంలో                                                                                                                     ధ్వజస్తంభం మాను పుచ్చిపోయింది! 

 

శ్రీవారి ఆలయంపై వున్న ఆనంద నిలయం విమానాన్ని పాలిష్‍ చేయడం సహా అనేక మరమ్మత్తు పనులు చేపట్టాం. 


అకస్మాత్తుగా ఒక రోజు ఇంజనీర్ వచ్చి, ఖంగారు ఖంగారుగా చెప్పాడు.

"ధ్వజస్థంభం పుచ్చిపోయింది."


...  మెల్లగా బంగారు తొడుగులు తీస్తుంటే,  ఆ మాను క్రిందకంటా పుచ్చిపోయి ఉంది.


  మరి ఎలా నిలబడింది ? 


ధ్వజస్థంభంపై నున్న  బంగారు తొడుగులు ఆధారంగా మాత్రమే. ...


పుచ్చిపోయిన ధ్వజస్థంభంతో స్వామికి సేవలా? … అపచారం జరిగిపోతోంది.  

నాకు ఆందోళన ... ఆదుర్దా ... ఆరాటం ... భయం ... 

రికార్డుల ప్రకారం చూస్తే, పాత మాను ఎప్పుడు పెట్టారో ఆధారాలు లభించలేదు... 

మాకు లభ్యమైన గత 180-190 సంవత్సరాల రికార్డ్సులో ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు. అంటే ఇది ఎంతపాతదో? ఇప్పుడేమిటి చేయాలి? ... 


50-75 అడుగుల ఎత్తయిన టేకు మ్రానుని  సంపాదించి  ప్రతిష్టించాలి.  

ఆ మ్రానుకి తొర్రలు ఉండకూడదు. 

కొమ్మలు ఉండకూడదు. 

ఎలాంటి పగుళ్ళు వుండకూడదు.

దానికి వంపు ఉండకూడదు. నిటారుగా ఉండాలి. 

... నిస్పృహ వస్తోంది. ఇది జరిగేదేనా?  


అయినా ఆశ చావలేదు. క్షణాల మీద మన రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారుల్ని సంప్రదించాను. ‘‘ఇలాంటి లక్షణాలుండే టేకు చెట్లు మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం’’ అని తేల్చారు. కర్నాటకలోగానీ, కేరళలోగానీ పడమటి కనుమల అడవుల్లో దొరకవచ్చు అని కూడా స్పష్టం చేశారు. 

... ఇవన్నీ వినేసరికి నాకు నీరసం వచ్చేసింది.  ఈ లోపల ధ్వజస్థంభం క్రింద నిధి ఉందని మీడియా మిత్రుల ప్రచారం !! 


ఒక నిర్వేదం చుట్టుముట్టేసింది... దిక్కు తోచని ఆ స్థితిలో ఆ శ్రీనివాసుడే శరణ్యం అనుకున్నాను…

అలా ఆలోచిస్తూనే ఆ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇక ఆలయం నుండి బయల్దేర బోతుండగా, బెంగుళూరు నుంచి హెచ్‍. ఎస్‍. ఆర్‍. అయ్యంగార్‍ అనే భక్తుడు నాకోసం టెలిఫోన్‍ కాల్‍ చేశారు. అసహనంగానే ఆ ఫోన్‍ అందుకొని నేను మాట్లాడగానే, ఆయన ప్రవాహంలాగా చెప్పుకుంటూ పోతున్నాడు.... ‘‘అయ్యా, మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నారని రేడియాలో విన్నాను. అలాంటి ధ్వజస్తంభానికి మాను కావాలంటే కనీసం 280-300 సంవత్సరాల వయసున్న టేకు చెట్టు కావాలి. కర్నాటకలోని దండేలి అడవుల్లో మాత్రమే అది దొరికే అవకాశంవుంది.... ఇక్కడి అటవీశాఖ ఛీఫ్‍ కన్సర్వేటర్‍ నాకు చాలా మిత్రుడు.... మీరు అనుమతిస్తే, నేను నా మిత్రుడి సహాయంతో అడవుల్లో గాలించి అలాంటి చెట్టుని ఎంపిక చేయిస్తా. మీరు లాంఛనప్రాయంగా ఒక లెటర్‍ ఆయనకి వ్రాయండి. మిగతా సమన్వయం బాధ్యత అంతా నాకు వదిలేయండి…..’’


అంతే, మరుక్షణం నేను అక్కడే ఆలయంలో కూర్చునే, కర్నాటక ఛీఫ్‍ సెక్రటరీతో, ఛీఫ్‍ కన్సర్వేటర్ తో  లాంఛనప్రాయంగా టెలిఫోన్‍లో మాట్లాడి, వాళ్ళ హామీ కూడా తీసుకున్నాను. ఇదంతా అయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటింది....  

……..

బెంగుళూరులో అయ్యంగార్‍ ప్రోద్బలంతో ఛీఫ్‍ కన్సర్వేటరూ, వారి సిబ్బందీ గాలింపు జరిపి, ఒక వందచెట్లు పరీక్షించాక, దండేలి ప్రాంతంలోని కొండవాలుల్లో ఒక పదహారు టేకుచెట్లు వరకూ మాకు పనికి రావచ్చని తేల్చారు. సరిగ్గా అదే వారంలో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు సకుటుంబంగా తిరుమలకు రావడం, నేను ఈ ధ్వజస్తంభం విషయం వారికి చెప్పడం, ఆయన వెంటనే ‘‘నూతన ధ్వజస్తంభం మానుని టిటిడికి కర్నాటక విరాళంగా తీసుకోండి’’ అని ప్రకటించడం జరిగిపోయాయి. 


ఆ వారాంతంలో నేను, మా ఇంజనీర్లతో కలిసి వెళ్ళి, అయ్యంగార్‍, ఛీఫ్‍ కన్సర్వేటర్‍ వెంటరాగా, ఆ 16 టేకు చెట్లు పరీక్షించాం. చివరకి వాటిల్లో మా కంటికి కనుపించినంతవరకు ఆరు చెట్లు మాత్రమే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా వున్నాయి. వాటిల్లో రెండు మా అవసరానికి మించిన ఎత్తులో వున్నాయి. నేను టిటిడి అవసరాలు దృష్టిలో వుంచుకొని, మొత్తం ఆరు చెట్లూ మాకే కావాలన్నాను.


అద్భుతం ! బెంగుళూరుకు తిరిగివచ్చి, ముఖ్యమంత్రిని, ఛీఫ్‍ సెక్రటరీని కలిసి మాట్లాడితే, ఆ ఆరు చెట్లూ విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే, చెట్లు నరకడం ఆరంభమైంది. కానీ అప్పుడే ఎదురైంది - మరో జటిలమైన సమస్య.... ఆ ఎత్తుపల్లాల అడవుల్లో కొన్ని కిలోమీటర్ల దూరం వస్తేగాని మెయిన్ రోడ్డు రాదు. అంతదూరం వాటిని మోసుకుంటూ తేవటం ఎలా ?


విచిత్రం! ఆ అడవిలో సోమానీ వారి పేపర్‍ మిల్లుకోసం కలప నరికే వాళ్ళకి తెలిసింది మా హడావుడి అంతా. ఆ మిల్లు యాజమాన్యం, సిబ్బందీ వచ్చేశారు. ‘‘అయ్యా! ఈ పని మాకు వదిలేయండి. ఇది శ్రీనివాసునికి మా సేవగా భావించండి’’ అంటూ ఆ కార్యభారం వాళ్ళు తలకెత్తుకున్నారు. ఇంక చెప్పేదేముంది. 


వారం రోజుల్లో చెట్లు నరకటం, వాటిని సోమానీ మిల్లు సిబ్బంది - తాళ్ళు, కప్పీలు, గొలుసులు వగయిరా సామగ్రి వుపయోగించి రోడ్డు మీదకు చేర్చటం పూర్తయిపోయింది. ఈ లోపల అయ్యంగార్‍ మళ్ళీ చొరవ తీసుకుని, ఒక 16 చక్రాలుండే పొడవాటి ట్రక్‍ని మాట్లాడాడు.

రెండురోజుల్లో ఆరుమానుల్నీ తీసుకుని ఆ ట్రక్‍ బెంగుళూరు వచ్చింది. అక్కడ విధానసౌధ దగ్గర చిన్న పూజా కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి వాటిని టిటిడికి విరాళంగా ఇస్తున్నట్లు లాంఛనప్రాయంగా ప్రకటించి, నా చేతికి అప్పగించారు. వేలాది ప్రజల సమక్షంలో జరిగిన ఆ అప్పగింతలో ఆ మానుల్ని తాకగానే అనిర్వచనీయమైన ఆనందంతో నా ఒళ్ళు పులకించింది. (ఎందుకలా?)....... 


ఆ మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకే ట్రక్‍ తిరుపతి చేరుకుంది. వూరి బయట డెయిరీ ఫారం దగ్గర వేలాది స్త్రీ, పురుషులు గుమికూడారు. ఆ మానులు రాగానే హారతులిచ్చారు. ‘గోవిందా, గోవిందా’ అనుకుంటూ తన్మయత్వంతో నినాదాలు చేశారు. మరో గంటలో ఆ ట్రక్‍ ఘాట్‍ రోడ్డు మొదలుకి (అలిపిరి) చేరుకుంది. 

అక్కడిదాకా అంతా ఆనందమే. డ్రైవర్‍ ట్రక్‍ దిగాడు. కొండకేసి చూశాడు. ఘాట్‍రోడ్డు 18-19 కిలోమీటర్ల దూరం.... ఏడెనిమిది సంక్లిష్టమైన మలుపులు.... నా దగ్గరకు వచ్చాడు.


‘‘సర్‍, ఇది నా జీవితంలో ఒక గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్‍ ఆపకుండా కొండమీదకు నడపగలగాలి. అలా నడిపితేనే నాకు సంతృప్తి. మధ్యలో ఘాట్‍రోడ్డు పిట్టగోడలు దెబ్బతినొచ్చు.... ట్రెయిలర్‍ తగిలి బండరాళ్ళు దొర్లిపడొచ్చు.... ఎన్నిరోజులు పడుతుందో తెలీదు. ఏమైనా కానీ, నేను ఇది చేసి తీరాలి.....’’ 

నేను హామీ ఇచ్చాను - ‘‘బండలు విరిగిపడినా, పిట్టగోడ కూలిపోయినా, నీకు బాధ్యతలేదు. అదంతా మేం చూసుకుంటాం....’’ (అక్కడికేదో అంతా మేమే చేస్తున్నట్లు, మా శక్తితోనే అంతా నడిచిపోతున్నట్లు ఆత్మవిశ్వాసం. నిజమా?)

ఈ లోపల తిరుమలకి వెళ్లే  ట్రాఫిక్ ని కూడా (క్రిందకి దిగే) పాత ఘాట్ రోడ్డు మీదకి మళ్లించాము.  


మొత్తంమీద ఆ సంధ్యా సమయంలో అరుణ కాంతుల వెలుగులో ఆ టేకుమానులు భగవంతుని ముంగిట్లో ధ్వజస్తంభాలుగా మారటం కోసం ఆ ట్రక్‍మీద ఘాట్‍ రోడ్డులో ప్రయాణం సాగించాయి....

భయపడినట్లుగానే ట్రక్‍ మలుపుతిరిగినప్పుడల్లా కొన్నిచోట్ల ట్రెయిలర్‍ పైన మానులు కొండని కొట్టుకుని బండలు పడ్డాయి...

కొన్ని మలుపుల్లో లోయవైపున్న పిట్టగోడకూలిపోయింది....

మరికొన్ని మలుపుల్లో ట్రెయిలర్‍ వెనకాల ఒకవైపు చక్రాలు పిట్టగోడని గుద్దేసి, లోయ మీంచి దూకేశాయి....

వెనకాల కారులో వెళ్తున్న నాకూ, మా ఇంజనీర్లకీ ఈ ఫీట్లు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. ఒకటి రెండు మలుపుల్లో సగం ట్రెయిలర్‍ లోయ అంచుమీంచి గెంతినట్లే అయింది.                            

‘‘ఆఁ ఆఁ..’’ అనుకుంటూ వెనకాల కార్లలో మేం ఆందోళనతో వూగిపోతున్నాం.

ఏ మలుపులో నయినా ట్రెయిలర్‍ క్రిందపడిపోతే.... ! ఇలాంటి ఆలోచనలు నాలో టెన్షన్‍ పెంచేస్తున్నాయి. క్షణాలు- నిముషాలు - గంటలు దొర్లిపోయాయి. "గోవిందా ... గోవిందా ..."

... గంటలు కాదు.   ఒక గంట దొర్లేలోపలే, అంటే 55 నిమిషాల్లోనే ఫీట్లు చేసుకుంటూ, మా సంభ్రమాశ్చర్యాలమధ్య ధ్వజస్తంభాల మానులతో ట్రక్‍ తిరుమలకి చేరిపోయింది. 


ఒక్కసారిగా వందలాది భక్తులు, టిటిడి ఉద్యోగులు ఆనందోత్సాహాలతో చేస్తున్న ‘‘గోవిందా-గోవిందా’’ పిలుపులతో తిరుమల గిరులు ప్రతిధ్వనించాయి.

నా కళ్లని నేనే నమ్మలేకపోతున్నాను.

నాలో ఆనందపు అలలు పొంగి ఆకాశాన్ని తాకుతున్నంత ఉద్వేగం కలిగింది. నాకు తెలీకుండానే నా కంట్లోంచి ఆనంద (భక్తి) బాష్పాలు రాలుతున్నాయి. ఆ ఆనంద రసానుభూతిలో కొన్ని క్షణాలపాటు చేష్టలుడిగి అలా వుండిపోయాను!!


ఏమిటా అద్భుతం! సూర్యాస్తమయం ఆరంభమయ్యే సమయంలో అలిపిరిలో బయల్దేరిన ట్రక్‍, సూర్యుడు పశ్చిమాద్రిన పూర్తిగా అస్తమించే సమయానికి కొండకి చేరిపోయింది. ఇంకా విచిత్రం, ట్రక్‍ యజమాని మా వెనకాలే కారులో వచ్చి నమస్కారం పెడుతూ అన్నాడు - ‘‘స్వామి వారికి ఇంత గొప్ప సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం. అందుకే నేను ఒక్క నయాపైసా కూడ రవాణా ఛార్జీలు తీసుకోవటం లేదు’’. (అతనికా ప్రేరణ ఎక్కడ్నుంచి కలిగింది?) 


- అయ్యంగార్‍ ని, ట్రక్‍ యజమానిని, డ్రైవర్‍ ని వేదపండితుల ఆశీర్వచనాలమధ్య, ప్రత్యేక దర్శనంతో, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించాం. 


మరి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం ఎలా? ఎలా? - అలా రోజంతా నేనూ, మా ఇంజనీర్లు, అధికారులూ తలలు బద్ద్లయ్యేలా అర్ధరాత్రిదాకా చర్చలు జరిపి, ఇక జరిపే శక్తిలేక మర్నాటికి వాయిదా వేసుకుని వెళ్లిపోయాం. నాకు ఒక పట్టాన నిద్ర రాలేదు. మూడు వారాల పాటు అష్టకష్టాలు పడి టేకు మానులు తీసువచ్చాక, వాటి ప్రతిష్ఠ ఎలా చేయాలీ అన్నదానిమీద ఇంత తర్జనభర్జన ఎందుకు జరుగుతోంది? ఇంతమంది ఇంజనీర్లు, మేధావులం కలిసి కూడా ఈ చిన్నపని చేయలేకపోతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాం... ? 

అలా ఆలోచిస్తుంటే, అప్పుడే మళ్లీ స్ఫురించింది - ‘‘ఏ శక్తి ఇంతపని చేయించిందో, ఆ శక్తి మిగతా పనికూడా చేయించదా?... ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేసే ప్రాప్తం నాకుంటే నా చేతుల మీదుగా జరుగుతుంది. లేకపోతే లేదు..’’ 


ఈ ఆలోచన రాగానే మనసు కుదుటపడింది. ప్రశాంతంగా నిద్రపోయాను. 

అందుకు భిన్నంగా జరగలేదు. ఉదయం చర్చల్లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఎవరో అన్నారు - ‘‘ఎందుకండీ ఇదంతా, మానుని మహద్వారంలోంచి మోసుకువచ్చేటప్పుడే దాని తలభాగం వీలైనంత ఎత్తుకి లేపి వుంచుతూ, మొదలు భాగం నేలమీదకే వుంచుతూ, ఏతాం ఆకారంలో తీసుకువద్దాం. అది సరిగ్గా మంటపం క్రిందకు వచ్చేసరికి, దాన్ని ఆ రంధ్రంలోంచి పైకి దోపుదాం. మన పాపనాశనం డామ్‍ కడుతున్న ఇంజనీరింగ్‍ సిబ్బంది, అక్కడి కళాసీల సహాయం తీసుకుందాం..’’- 


బ్రహ్మాండమైన ఆలోచన. (ఎక్కడిదీ ప్రేరణ?) ఆగమేఘాల మీద ఇంజనీర్లు కొలతలు వేసి, మహద్వారంలోపల్నుంచి బలిపీఠం వరకు నేలని లోతుగా తవ్వుకుంటూ వెళితే, ఈ ప్లానుని అమలు చేయటం సాధ్యమవుతుందని తేల్చారు. పైగా మహద్వారానికీ, బలిపీఠంకీ మధ్య ఎంత తవ్వినా, ఏం చేసినా యాత్రికుల వరుసలకి  ఏమాత్రం అవరోధం వుండదనికూడా స్పష్టం చేశారు. 

ఇంక ఆలస్యం చేయలేదు. ముహూర్తం చూసి, హెచ్‍సిఎల్‍ ఇంజనీరింగ్‍ సిబ్బంది, కళాసీల సాయంతో ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకు మానుని సన్నిధి వీధిలోంచి, గొల్లమండపంలోంచి, మహద్వారంలోంచి ఆలయంలోకి ప్రవేశపెట్టాం. అక్కడ్నుంచి మానుశిఖర భాగం మంటపం పై కప్పును చూస్తూ లేచేలా ఎక్కడికక్కడ సర్వే బాదులతో స్టాండ్‍లు ఏర్పాటు చేశారు. మెల్లగా కళాసీలు మానుని ముందుకు తోస్తుంటే, అది అలా అలా లేచి సరిగ్గా మంటపం పై కప్పులో రంధ్రాన్ని క్రిందనుంచి చేరుకుంది. మహద్వారం దగ్గర్నుంచి బలిపీఠం దాకా నేలమీద గోతిలో మాను మొదలుని ముందుకు తోసుకు వెళ్తుంటే, ఇంజనీర్ల నైపుణ్యం ఫలించి, ఆ మాను శిఖరం మంటపం పైన రంధ్రం లోంచి పైకి, ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మంటపం ఏ మాత్రం దెబ్బతినకుండా ఆ సాయంత్రానికల్లా దండేలీ అడవుల్లోని టేకుచెట్టు తిరుమలేశుని ఆలయంలో ధ్వజస్తంభంగా ప్రతిష్ఠకు సిద్ధంగా నిలబడింది. 

అద్భుతం ! … ఏమా శ్రీనివాసుడి కరుణ….. ?


అప్పుడే ఓ చిన్న కొసమెరుపు !  

ధ్వజస్తంభం క్రింద శాస్త్రానుసారంగా నవరత్నాలు, నవ ధాన్యాలు వగైరా వుంచాలన్నారు. అవి రెండు పెట్టెల్లో పెట్టి ధ్వజస్తంభం క్రింద పునాది భాగంలో పెట్టాం. అకస్మాత్తుగా నాకు ఏదో తోచింది. వెంటనే నా మెడలో శ్రీనివాసుని డాలర్‍తో వున్న గోల్డ్ చైన్‍ తీసి ఒక పెట్టెలో వేశాను. క్షణాల్లో చుట్టూ చేరివున్న అర్చకులు, మిరాసీదార్లు, విఐపిలు, ఇతర భక్తులు కూడా ముందుకు వచ్చారు - శ్రీవారి ధ్వజస్తంభానికి తమ భక్తి పూర్వక బహుమానం ఇవ్వటానికి. అంతే! ఉంగరాలు, చైన్‍లు వగయిరా ఆభరణాలతో మరో పెట్టె నిండిపోయింది. అలా ఆ పెట్టెల్ని నిక్షిప్తం చేసి, వాటిపై కాంక్రీట్‍ పోశాక, దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశాం. (పాత ధ్వజస్తంభం మానుని పాపనాశనం డామ్‍లో వేదోక్తంగా విశ్రమింపజేశాం) ఒక నెల రోజులకి నూతన ధ్వజస్తంభానికి ప్లాట్‍ఫారమ్‍ నిర్మాణం, పైన బంగారు ప్లేట్లు తొడగటం, శిఖర భాగాన పతాకాన్ని నిలబెట్టడం, ధ్వజస్తంభానికిముందు బలిపీఠం నిర్మించడం పూర్తయ్యాయి. 


ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి (మిగతా అన్ని మరమ్మతులు, బంగారు ప్లేట్లకు మెరుగు పెట్టడాలు వగయిరా అన్నీ పూర్తిచేశాక), ఆ బ్రహ్మోత్సవంలో భాగంగా ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య, వేద మంత్రోచ్చారణలతో తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్‍ 10న ధ్వజస్తంభాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేశారు. 

ఇది జరిగిన ఆరో రోజున (జూన్‍ 16న) నేను మరొకరికి పదవీబాధ్యతలు అప్పగించి, బదిలీ అయి వెళ్లిపోయాను. 


ఆ ఉదయం అలా బదిలీ అయి వెళ్లిపోతూ, దండకారణ్యం నుంచి వచ్చి ఆలయంలో స్థిరపడిన టేకు చెట్టు (ఇప్పుడది ధ్వజస్తంభం) కేసి చూశాను. పతాక భాగంలో గంటలు నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా చిరు సవ్వడులు చేస్తూ వూగుతున్నాయి. ఏదో వింత అనుభూతి ...! 


అక్కడే వున్న ఒక వృద్ధ పండితుడు చిరునవ్వు నవ్వి, ఒక శ్లోకం చదివారు : 

‘‘నాహం కర్తా హరిః కర్తా

తత్పూజా కర్మ చాఖిలం

తదాపి మత్కృతా పూజా

తత్ప్రసాదేన నా అన్యథా’’


“నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే. నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు.”


(Source: పూర్వ ఐఏఎస్ అధికారి  పివిఆర్ కె ప్రసాద్ రచన  'నాహం కర్తా, హరిః కర్తా')

 ------- -———— ————- ————- 

This happened on June 10, 1982 i.e 42 years ago.

అనువాద పద్యం

 నిత్యపద్య నైవేద్యం-1559 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-194. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

మన: ప్రీతి కర: స్వర్గ:

నరకస్తద్విపర్యయ:l

నరక స్వర్గ సంజ్ఞే వై 

పాపపుణ్యే ద్విజోత్తమ:ll 


తేటగీతి:

సతము మదికి సంతోషమే స్వర్గమనగ 

ధరను తీరని దుఃఖమే నరకమనగ 

అరయ నరక స్వర్గాలనే యార్యజనులు 

పాపపుణ్యంబులందురు వరుసగాను.


భావం: మనసుకు సంతోషం కలిగించేదే స్వర్గం. ఎడతెగని దుఃఖమే నరకం. ఈ నరక స్వర్గాలకు పాపపుణ్యములని పేరు.

కాశీపురి వర్ణన

 కాశీపురి వర్ణన 🙏



 సీ. కాశీపురమ్మును కాంచిన చాలును

                  తొలగిపోవును కదా ! దురిత రాశి

      విశ్వేశ్వరస్వామి విశ్వమున్ గాచును

                 కనినంత పాపముల్ కరిగిపోవు

      అన్నపూర్ణమ్మయు న్నాహార మిడునిల

                 సకల జనాళికి సాకుచుండి

      గలగలపారెడు గంగానదీమాత

                 పాపాళి నెల్లను పరిహరించు

 తే.  కాలభైరవుడు మనల కనికరించ

       డుంఠి విఘ్నేశు డెప్పుడు నండ గుండ

    కరుణతోవిశాలాక్షియు కాచు మనల

       వరములకు నిలయము గదా వారణాసి 🙏🙏


జయలక్ష్మి

కప్పలు వానల నెప్పుడు

 కప్పలు వానల నెప్పుడు

చప్పుడు చేయునొ బెకబెక 

          సంరంభముతో 

అప్పుడు కోయిల గొంతును 

విప్పదు సందర్భ మెఱుగు 

          విజ్ఞత వలనన్.

ఉదయ మల్పాహార

 సీ||

ఉదయ మల్పాహార ముత్సాహమున గొంచు

      జిహ్వ యెంతయు దృప్తి జెందినపుడు,

కమ్మని విందును కడుపార భుజియించి

       బ్రేవ్ మని త్రేన్చెడు వేళలందు,

సాయంతనమ్మున స్నాక్సు పేరిట కొన్ని

        చిరుతిండ్ల బంటను గొరికినపుడు,

వెరసి ముప్పూటల వెలితి లేనట్లుగ

         కుక్షినింపెడు నట్టి యా క్షణముల,


ఆ.వె||

కర్షకుడనువాని కరగిన కండలన్,

చేల జిమ్మినట్టి స్వేదములను,

భారముగను సాగు బడుగు జీవితమును

దలచుకొనుట మనకు ధర్మ మగును!


------------కోడూరి శేషఫణి శర్మ

సమస్య

 సమస్య

యతి స్థానములో వరుసగా

 సీ తా రా మ అనే అక్షరాలు రావాలి


ఆ. పూత చరితయైన 'సీ'తను హరియించ

     తరలె రావణుండు 'తా'పసిగను

     రక్ష నున్న పక్షి 'రా'క్షసు నెదిరించి

     మహితరణము జేసి 'మ'రణ మొందె


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

భగవత్ ప్రసాదం

 🙏🙏🙏🙏🙏

భగవత్ ప్రసాదం

🤲🤲🤲🤲🤲భగవంతుడు మనకు కష్టములను కలిగించి బాధలకు గురిచేస్తున్నాడని మనం అంటూ ఉంటాం. కానీ ఈ కష్టముల వలన భగవంతుడు మనలను కాపాడుకుంటున్నాడని ఆయన అంటున్నాడు.


వజ్రమైనా మెరవాలంటే సానపెట్టాలి కదా!  


ఎంతో కష్టపడి చదివితేనే కదా పరీక్షలో పాసవుతున్నాం!   


అసలు కష్టములులేనిదే సుఖమెక్కడిది! చీకటి ఉంటేనే కదా వెలుగు ఉండేది.. కష్టసుఖములు ద్వంద్వములు. ఒకటి ఉందంటే మరొకటి ఉండి తీరుతుంది. 


ఈ విషయంలో మనం సుఖాలే కావాలనుకోవడం వెర్రితనం!  కష్టమో సుఖమో అంతా భగవంతునికే వదిలేయాలి.


ఏదిచ్చినా భగవత్ ప్రసాదముగా స్వీకరించాలి. ఈ స్థితిలో ఉన్నపుడు ఎంతటి కష్టమైనా సరే తేలికైపోతుంది.  వచ్చిన కష్టములు వాటంతటవే మాయమైపోతాయి.

🌟🌟🌟🌟🌟          

రోగం కలిగించేది

 🌷🌷🌷🌷🌷


🌷మానవునకు రోగం కలిగించేది ----- *పాపం!* 


🌷మానవునకు భోగం కలిగించేది ----- *పుణ్యం!* 


🌷మానవుని భవిష్యత్తు నిర్ణయించేది ----- *కర్మ!* 


🌷మానవునకు లాభం కలిగించేది ----- *సేవ!* 


🌷మానవునకు సంపాదన  నిలిపేది ----- *పొదుపు!* 


🌷మానవుని విలువ పెంచేది       ------- *దానం!* 


🌷మానవునకు నష్టం కలిగించేది -------- *హింస!* 


🌷మానవునకు అశాంతి కలిగించేది ---- *ఆశ!* 


🌷మానవునకు శాంతి కలిగించేది ----- *తృప్తి!* 


🌷మానవునకు దుఃఖం కలిగించేది ---- *'కామం!* 


🌷మానవుని పతనం చేసేది  ------ *అహంకారం !* 


🌷మానవునకు అందరిని దగ్గర చేసేది ----- *ప్రేమ !* 


🌷మానవునకు అందరినీ దూరం చేసేది ----- *అసూయ !* 


🌷మానవుని స్థితిని సూచించేది ----- *గుణం !* 


🌷మానవుని దైవంగా మార్చేది ------- *దయ !* 


🌷మానవుని ఆత్మస్థితి తెలిపేది ------ *వాక్కు !* 


🌷మానవునకు విజయం చేకూర్చేది ---- *ధర్మం !* 


🌷మానవుని గొప్పవాడిగా చేసేది ------ *జ్ఞానం !* 


🌷మానవునకు- ముక్తి'ని ఇచ్చేది ----- *సత్యం !*

సనాతన ధర్మం

 *🕉️🙏🕉️*


*🕉️🙏"సనాతన ధర్మం - పునర్జన్మ"🕉️🙏*

                 

*🕉️🙏ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు, పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు.🕉️🙏*


*🕉️🙏అతను కొన్ని సందేహాలను అడగాలని అనుకున్నాడు. వెంటనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు.🕉️🙏*


*🕉️🙏”స్వామిజీ , నేను మీ "సనాతన ధర్మం" యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ "పునర్జన్మ సిద్ధాంతం" నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.🕉️🙏*


*🕉️🙏”ఎందుకంటే మా ధర్మం ప్రకారం- ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు.   కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెప్పాడు.🕉️🙏*


*🕉️🙏అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర ‘కారు ఉన్నదా అని అడిగి ఈ కాంచీపురంలోకి వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా?’ అని అడిగారు.🕉️🙏*


*🕉️🙏అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు, అని అనుకున్నాడు.🕉️🙏*


*🕉️🙏”సరే స్వామిజీ , ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు.🕉️🙏*


*🕉️🙏అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు.🕉️🙏*


*🕉️🙏ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు,” అని తన కారులో వెళ్ళిపోయాడు. 🕉️🙏*


*🕉️🙏సాయత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందుకు వచ్చాడు. ఆ వివరాలను స్వామి వారికి చెప్పాడు.🕉️🙏*


*🕉️🙏“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చేసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు.🕉️🙏*


*🕉️🙏"స్వామివారు అతన్ని చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు.."*

*”వీరు పుట్టిన ఈ రెండు రోజులలో వారు నిజాయితీగా ఉండడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”🕉️🙏*


*🕉️🙏“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి 'పాపము పుణ్యము' అనేది ఏమి లేదు.” అని చెప్పాడు.🕉️🙏*


*🕉️🙏మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది ఆరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు.🕉️🙏*


 *🕉️🙏ఇదే "పునర్జన్మ సిధ్ధాంతం” అని చెప్పారు.🕉️🙏*


*🕉️🙏"ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే "పునర్జన్మ సిద్ధాంతం" నిజం అనేది తేటతెల్లమవుతోంది.🕉️🙏*


*🕉️🙏 "ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు".🕉️🙏*


*🕉️🙏"ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వు నవ్వుతోంది."🕉️🙏*


*🕉️🙏"సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం".🕉️🙏*


*🕉️🙏"పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం"||*🕉️🙏


*🕉️🙏అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥🕉️🙏*


*🕉️🙏కంచిపరమాచార్యవైభవం🕉️🙏*


                       

*🕉️🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🕉️🙏*

నిజంగా జీవిస్తున్నారు.

 శ్లోకం:☝️

*ఆలస్యేన గతం దీర్ఘ*

 *జీవితం న హి జీవితం |*

*క్షణమేకం సుయత్నేన*

 *యో జీవతి స జీవతి ||*


భావం: పని-పాట లేకుండా గడిపే సోమరి జీవితం నిజమైన జీవితం కాదు, వాళ్ళు మరణించిన వారితో సమానం. ఎవరు ఒక క్షణమైనా బాగా మనస్పూర్తిగా ప్రయత్నిస్తారో, వారే నిజంగా జీవిస్తున్నారు.

పంచాంగం 25.07.2024

 ఈ రోజు పంచాంగం 25.07.2024 Thursday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస కృష్ణ పక్ష పంచమి తిధి బృహస్పతి వాసర: పూర్వాభాధ్ర నక్షత్రం శోభన తదుపరి అతిగండ యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పంచమి రాత్రి 01:59 వరకు.

పూర్వాభాద్ర  సాయంత్రం 04:17 వరకు.


సూర్యోదయం : 05:57

సూర్యాస్తమయం : 06:48


వర్జ్యం : రాత్రి 01:11 నుండి 02:40 వరకు


దుర్ముహూర్తం : పగలు 10:14 నుండి 11:05 వరకు తిరిగి మధ్యాహ్నం 03:22 నుండి 04:14 వరకు.


అమృతఘడియలు : పగలు 08:56 నుండి 10:24  వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం  01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.



శుభోదయ:, నమస్కార: