నిత్యపద్య నైవేద్యం-1559 వ రోజు
సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-194. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి
ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు
సుభాషితం:
మన: ప్రీతి కర: స్వర్గ:
నరకస్తద్విపర్యయ:l
నరక స్వర్గ సంజ్ఞే వై
పాపపుణ్యే ద్విజోత్తమ:ll
తేటగీతి:
సతము మదికి సంతోషమే స్వర్గమనగ
ధరను తీరని దుఃఖమే నరకమనగ
అరయ నరక స్వర్గాలనే యార్యజనులు
పాపపుణ్యంబులందురు వరుసగాను.
భావం: మనసుకు సంతోషం కలిగించేదే స్వర్గం. ఎడతెగని దుఃఖమే నరకం. ఈ నరక స్వర్గాలకు పాపపుణ్యములని పేరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి