7, మే 2024, మంగళవారం

నవ్వడం

 నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం  అన్నారు జంద్యాల గారు.ఇదివరకు మనవాళ్ళు నవ్వు నాలుగు విధాలా చేటు అన్నారు. కాని ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.



నవ్వడం మూలాన జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలనుంచి దూరంగా ఉండొచ్చు.ఇప్పుడు మన దేశంలోకూడా నవ్వుల దినోత్సవాన్ని ఘనంగానే జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా నవ్వుల పండుగను ఆస్వాదిస్తున్నారు. 


నవ్వు గురించి బోలెడు విశ్లేషణలు ఉన్నాయి. ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా చిరునవ్వు విలువ చెబుతూ ఉంటారు. నవ్వులు ఎన్నో రకాలు. నవ్వుకూ చిరునవ్వుకూ చాలా తేడా ఉంది. నవ్వీ నవ్వనట్లుగా, పెదాల మధ్య స్వచ్ఛమైన పువ్వుల్లా విచ్చుకునేదే చిరునవ్వు. అమెరికాలోని బాల్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌ అనే సంస్థ 18 రకాల నవ్వులను గుర్తించింది.


నవ్వులు ఎన్ని ఉన్నా, చిరునవ్వు ప్రత్యేకతే వేరు. మనకు అత్యంత ఆత్మీయులు ఎదురైనప్పుడు మాటకన్నా ముందుగా మనసులోంచి ఉబికివచ్చే భావనే చిరునవ్వు. కొద్దిపాటి పరిచయాలను కూడా దృఢపరిచి, స్నేహంగా మార్చేశక్తి చిరునవ్వుకు సొంతం. ఇక నవ్వు విలువ తెలియక చాలా మంది నవ్వే తెలియనట్లు ఉండిపోతారు. కొందరు చీటికిమాటికి రుసరుసలాడుతూనే ఉంటారు. ప్రపంచాన్ని జయించే శక్తి అణ్వాయుధాల కన్నా, చిరునవ్వుకే ఉంది. ఇది శత్రువులైనా సులువుగా అర్థం చేసుకోగల శాంతి సంకేతం.


 ఏ వ్యక్తి అయినా నిరాశ, నిస్పృహలోంచి బయటపడాలంటే చిరునవ్వు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం చిందించే చిరునవ్వు ఇతరుల బాధలను కూడా మాయం చేస్తుంది. చిరునవ్వుతో ఉన్న మోము మానసిక ఆరోగ్యానికి ప్రతిబింబంగా ఉంటుంది. అలాగే అభిప్రాయ బేధాలను కూడా దూరం చేయగల శక్తి చిరునవ్వుకే సాధ్యం. శరీరంలో రోగనిరోధక శక్తిని మింగేసే కార్టిసోల్‌ అనే పదార్థంపై చిరునవ్వు ప్రభావం చూపి, దాన్ని అణిచివేస్తుందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.


వందసార్లు చిరునవ్వు నవ్వితే పది నిమిషాల వ్యాయామంతో సమానమవుతుందని అంటున్నారు. నగర జీవనంలో ఒత్తిళ్లతో కూడిన జీవనానికి చిరునవ్వు ఒక టానిక్‌లా పనిచేస్తుందని మనోవికాస నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు, యువకులు, గృహిణులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారికి నవ్వు ద్వారా రిలాక్స్‌ అయ్యే లాఫింగ్‌ థెరపీ అవసరం.


ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరిదీ ఉరుకులు పరుగుల జీవనం. గడియారంలోని ముళ్లలా క్షణం వృథా కాకుండా చూసుకోవాలి. నిత్యం ఒత్తిళ్లే. విద్యార్థులకు చదువు, గృహిణులకు వంటావార్పు, ఇల్లు చక్కబెట్టుకోవడం, ఉద్యోగులకు కార్యాలయాల్లో గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్లు...ఇలా అన్ని వర్గాల వారూ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ తరుణంలో ఇంట్లోని కుటుంబ సభ్యులను కూడా పరస్పరం చిరునవ్వుతో పలుకరించడం చాలా కుటుంబాల్లో మర్చిపోతున్నారు. పిల్లలైతే పాఠశాలకు ఆలస్యమైతే అసహనం, విసుగు, చిరాకు, భయం ముఖానికి అట్టిపెట్టుకుంటున్నారు.


 ఆఫీసుకు ఏమాత్రం ఆలసమైనా ఉద్యోగులు కుటుంబ సభ్యులను కసురుకుంటారు. చిరుబుర్రులాడుతారు. ఈ మానసిక ఒత్తిళ్లతో ఉదయం ఇంటినుంచి బయట పడుతున్నారు. దారిలో ఏ బాటసారి అడ్డు వచ్చినా, ఇతర వాహనాలు ముందు నిలిచి విసిగించినా తిట్లదండకం అందుకుంటారు. వీటిని అధిగమించేందుకే లాఫింగ్‌ థె రపీ అలవాటు చేసుకోవాలని యోగా నిపుణులు చెబుతున్నారు.


 ఎదుటివారు ఎంత మనసు గాయం చేస్తున్నా దాన్ని చిరునవ్వుతోనే సంతోషంగా జయించాలని వారు సూచిస్తున్నారు. ఒక చిన్న చిరునవ్వు వందమంది హిట్లర్లకు ఉన్నంత కోపాన్నికూడా జయిస్తుందని వారు చెబుతున్నారు. 


పెదవులపై విరిసీ విరియనట్లు మెరిసే చిరునవ్వుతో ఆత్మీయులకు మరింత ఆత్మీయంగా మెలగాలని వారు సూచిస్తున్నారు.చిరునవ్వులతో బతకాలి.ఎదుటి వారిని చిరునవ్వుతో పలుకరించి చూడండి. వారు మీకు ఆత్మీయులైపోతారు. ప్రశాంత వదనంతో ఉండి, సన్నటి స్మైల్‌ను మీ పెదవులపై జాలువార్చి చూడండి. నలుగురిలో మీరుంటే అక్కడ మీరే సెంట్రల్‌ అట్రాక్షన్‌గా మారిపోతారు. ద్వేషించే వారిని కూడా దగ్గరకు చేర్చే శక్తి ఈ ప్రపంచ భాషకు ఉంది. ముఖంపై చిరునవ్వు ఉంటే చాలు ప్రత్యేకంగా మళ్లీ మేకప్‌ వేసుకోవాల్సిన అవసరం రాదని అంటారు ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్‌. 


నవ్వు మన వ్యక్తిత్వాన్ని అద్దంలా చూపిస్తుంది. ఒక నవ్వు కళ్లతో లోతుగా పలుకరిస్తుంది. మరో నవ్వు ఆత్మీయతను ప్రేరేపిస్తుంది.

ఇంకోనవ్వు నేరుగా హృదయపు లోతుల్లోకి తొంగిచూస్తుంది. అవతలి వాళ్లు మూడీగా ఉంటే మీ చిరునవ్వే వాళ్లలో ఉత్తేజాన్ని నింపుతుంది. లోపల ఏదో వెలితి, కలత ఉంటే బహుశా మీ చిరునవ్వు వారికి భరోసా కలిగిస్తుంది. మానవ సమాజంలో చిట్టిచిట్టి పాపాయిల బోసి నవ్వుల నుంచీ ఆవిర్భమైన ఈ నవ్వుల ప్రక్రియ వారు ఎదిగే క్రమంలో మానవ సంబంధాలను కలుపుకునేందుకు ఒక ఆభరణంగా నిలుస్తుంది. ఇంకా మనలోని సకల ఒత్తిళ్లను వెలికి పంపుకునేందుకు ఒక వాహికగా నిలుస్తుంది.


 పిల్లలు తమ తల్లిదండ్రులను చిరునవ్వుతో పలుకరించడం, అలాగే పెద్దలు కూడా పిల్లలను చిరునవ్వుతో నిద్రలేపడం, విసుగు, అలసట, కోపం, చిరాకు వంటివి ఇంట్లో ఎవరూ ప్రదర్శించకపోతే ఆఇల్లు చిరునవ్వుల లోగిలిగా మారుతుంది. చిరునవ్వును ఆభరణంగా పెట్టుకొని బయటకు బయలుదేరితే ఆరోజంతా సంతోషకరమైన సందర్భాలే ఎదురవుతాయి.

కాబట్టి అందరం నవ్వుతూ ఉందాం. ఇతరులను కూడా నవ్విస్తూ ఉందాం.అంతేగానీ నవ్వులుపాలు మాత్రం కాకూడదు. నవ్వించే పేరుతో ఇతరులను అపహాస్యం చేయకూడదు.

ఇస్కాన్

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


**శ్రీ కృష్ణునీ పై కోర్టులో కేసు నమోదు చేసిన క్రిస్టియన్**


ఇస్కాన్ సంస్ధ మీద కేసు పెట్టిన కిరస్థాని నన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇస్కాన్ సంస్థ


ఎన్నో దేశాలలో తమ కార్యక్రమాల ద్వారా శ్రీకృష్ణతత్త్వాన్ని ప్రచారం చేస్తోన్న "ఇస్కాన్"

  సంస్థ యొక్క ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడానికి 


 పోలాండ్ దేశానికి చెందిన ఒక క్రైస్తవ నన్ అచ్చటి

"వార్సా"  కోర్టులో జూలై 2011లో ఫిర్యాదు చేసింది. 


"కృష్ణుడు పదహారు వేల మంది గోపికలను పెళ్ళి చేసుకున్నాడు"


అలాంటి కృష్ణుని గురించి ప్రచారం చేయడం ద్వారా


 "ఇస్కాన్" సంస్థ బహుభార్యాత్వాన్ని ప్రోత్సహిస్తోంది, కాబట్టి ఆ సంస్థను నిషేధించాలి" అంటూ ఆ నన్ తన ఫిర్యాదులో పేర్కొంది.


న్యాయాస్తానంలో హాజరైన "ఇస్కాన్" ప్రతినిధి 


గౌరవనీయులైన మెజిస్ట్రేటు గారూ, క్రైస్తవంలో ఒక మహిళను నన్ గా నియమిస్తున్నప్పుడు ఆమెచేత ఏమని ప్రమాణం చేయిస్తారో ఒకసారి ఆ నన్ తో చెప్పించగలరా ? 


అని కోరగా అందుకు తిరస్కరించింది.


అప్పుడు ఇస్కాన్ ప్రతినిధి న్యాయాధికారి అనుమతితో ఆ ప్రమాణాన్ని పైకి బిగ్గరగా చదివి వినిపించాడు.


క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఒక మహిళ నన్ గా మారుతున్నప్పుడు చేసే ప్రమాణం ఏమిటో తెలుసా ? 


"ఈమెను జీసస్ క్రీస్తుతో వివాహం జరిపించడ మైనది (The Nun is married to Jesus Christ)" అని.


అప్పుడు ఇస్కాన్ ప్రతినిధి, "గౌరవనీయులైన మేజిస్ట్రేటుగారూ! 


శ్రీ కృష్ణుడు పదహారు వేలమందినే పెళ్ళి చేసుకున్నట్లు చెబుతారు.


కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది నన్ లు క్రీస్తును వివాహం చేసుకున్నవారిగా ప్రకటింపబడుతున్నారు గదా!


అంతే కాదు, వివాహమైన క్రైస్తవ స్త్రీ ధరించే ఉంగరం వంటిదే నన్ లు కూడా ధరిస్తారు గదా!


మరి క్రైస్తవ మతం పుట్టినప్పటి నుంచి చూస్తే ఇలాంటి నన్ ల సంఖ్యకి లెక్కేలేదు. 


మరి జీసస్ క్రీస్తుకు ఎంతమంది భార్యలు ? 


ఎవరు బహు భార్యాత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ? 


శ్రీ కృష్ణుడు, జీసస్ క్రీస్తు - వీరిలో ఎవరు శీలభ్రష్టుడు ? 


 "ప్రపంచంలోని నన్ ల పరిస్థితి ఏమిటి ?" అని ప్రశ్నించాడు.


దెబ్బకు  న్యాయాస్థానంలో "ఇస్కాన్" కు వ్యతిరేకంగా న్యాయస్థానములొ నన్ వేసిన కేసు కొట్టివేయడమైనది.


పదిమందికీ పంపండి వాస్తవాలను అందరికీ తెలియనీయండి.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

వాగ్దేవతలు

 🙏తెలుగు భాషలోని వాగ్దేవతలు వారి అద్భుత శక్తులు🍀🍀🍀

🌸🌺🌸

తెలుగు భాషలో  వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :


🌸"అ నుండి అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని "చంద్ర ఖండం" అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు  అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం.


🌺"క"  నుండి  "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని " సౌర ఖండం " అంటారు. "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని " అగ్ని ఖండం" అంటారు.  ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.


🌺సౌర ఖండంలోని " క "నుండి "ఙ" వరకు  గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.


🌺"చ" నుండి "ఞ" వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత  "మోదిని"  అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది. 


🌺"ట" నుండి "ణ" వరకు గల ఐదు అక్షరాల  అధిదేవతా శక్తి "విమల". అంటే మలినాలను తొలగించే దేవత.


🌺"త" నుండి "న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ"  కరుణను మేలుకొలిపేదే అరుణ.


🌺"ప" నుండి "మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని". జయమును కలుగ చేయునది.


🌺అలాగే అగ్ని ఖండంలోని " య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత " సర్వేశ్వరి". శాశించే శక్తి కలది సర్వేశ్వరి. 


🌺ఆఖరులోని ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష లకు అధిదేవత "కౌలిని" 


🙏ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు. అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది. ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది. అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము. 


🌸మనం నిత్యజీవితంలో  సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి. అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి. 


🌺కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు. మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను  ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత. మనం చేసే శబ్దమే ఆ దేవత. మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత. ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత. ఎంత అద్భుతం. ఇది మన తెలుగు వైభవం.ఇది సనాతన ధర్మం. ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం...... శ్రీ సత్యనారాయణ చొప్పాకట్ల గారి post 🙏

👌డెత్ సర్టిఫికెట్

 *👌డెత్ సర్టిఫికెట్😊*

       ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది. 


     ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.

  

     “చూడు నాయనా! విద్యుత్ బల్బు లు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో  ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా. 

                                                                                                            అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.


     ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వే లో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావు గారు ఆర్మీలో లెఫ్నె౦ట్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివ  గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను" 

"మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటి కి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది  అయినా ఒకటే. 


     అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే. 

ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. 


       మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటి కి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము. 


     ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు..

 

     మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే.. 

అదే డెత్ సర్టిఫికేట్.

 *గౌ శ్రీ జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి*

పాదాభివందనం

 Jai Shri Ram 

Kancherla Venkata Ramana 

*పాదాభివందనం వలన ప్రయోజనం ఏమిటి ?*

=🙏👍👍👍👍🙏==============

శుభకార్యాలలో పెద్దల, ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.  వారి ఆశీర్వచనంలో, పరమాత్మనే తలుచుకొని, తగిన విదముగా ఆశీర్వాదము ఇచ్చుట మనము చూస్తాము.


🙏"కేవలం శుభకార్యాల లోనే కాక పెద్దవారు, కనిపించనప్పుడు, కూడా వారి పాదాలను, తాకుతారు చిన్నవారు.  బంధువులు ఇంటికి వచ్చినప్పుడు, వెడలు నప్పుడు, పండితులు కనబడినప్పుడు, అది "రైల్వే స్టేషన్ "ఆ "బస్టాండ్"  నా  అనేది చూడరాదు.

=================

*అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి?*

🙏🔥🔥🔥🔥🙏

=================

భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను, తాకడం అనేది గౌరవ సూచికంగా ఉన్న,   "పురాతనపద్దతి." అయితే, కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తారు.


🇮🇳" పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత, ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలున్నాయి.  మన సనాతన ధర్మం సూచిస్తుంది!


🙏"పెద్దవారి పాదాలను తాకాలంటే మన "అహంకారం"  వదిలి తల వంచాలి.   అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను "గౌరవించడంతో" సమానం.  


🙏"సాధారణంగా పెద్దవారి, పాదాలు తాకినప్పుడు, వారి ఆలోచనలు, స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా ఉంటం వల్ల చిన్నవారికి లాభం చేకూరుతాయి.  నార్త్ ఇండియన్స్ లో ఈ లక్షణం ఎక్కువ ఉంటుంది.


🔥"పెద్దవారి పాదాలను తాకడానికి నడుము వంచి కుడిచేతిని వారి, ఎడమ కాలిమీద పెట్టాలి.  అలాగే ఎడమచేతిని వారి, కుడి కాలి మీద ఉంచాలి. అప్పుడు పెద్దవారి చేతులు, మన మీద ఉంటాయి.::  ఇలా, చేయడం వల్ల ఒక "క్లోజ్డ్ సర్క్యూట్ ".  ఆకారాన్ని సంతరించుకుంటుంది.    ఆ సమయంలో వారి, శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవ్వుతాయి. అనుట లో ఎలాంటి సందేహం లేదు.


🙏"ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే  దీవెనలు ఫలిస్తాయి.


"🔥" పెద్దవారు ఈ భూమి మీద, నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం, వల్ల వారి పాద ధూళిలో, కూడా, ఎంతో జ్ఞానం దాగి, ఉంటుంది. ‘మేము కూడా, మీ మార్గంలో  నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని, సంపాదించడానికి, ఆశీర్వదించండి అని, చెప్పే సంప్రదాయానికి, ప్రతీకగా వారి పాదాలను, తాకుతాము. ✍️

🙏🏽💐💐💐💐🙏🏽

ప్రసిద్ధములగుపర్వతములు

 తా॥ శ్రీశైలము, హిమవంతము, మేరువు, మైనాకము, మల యము, ఋషభము, కూటశైలము, హేమకూటము, గోవర్ధనము, గోకర్ణము, నీలము, కకుభము, సహ్యము, వింధ్యము, మందరము, ఇవిప్రసిద్ధములగుపర్వతములు.

ఆప్యాయతలను,స్నేహాన్ని అందిద్దాం

 *త్వరలో అంతరించబోతున్న పాత తరం... 😢🙏*


        రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం  నుండి కనుమరుగు అవ్వబోతోంది.

             అవును ఇది ఒక చేదు నిజం ।

ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.  

రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !

ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !

నడక అలవాటు ఉన్నవాళ్ళు! 

మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు

 ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !

ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు! 

మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!

 పూజకు పూలు కోసే వాళ్ళు !

పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !

మడిగా వంట వండేవాళ్ళు !

దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు! 

దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !

దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!

మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!

 అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు! 

కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !

స్నేహంగా మెలిగే వాళ్ళు!

తోచిన సాయం చేసేవాళ్ళు !

చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !

ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !

ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !

పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు! 

ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు!

పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!

కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !

సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !

పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ! 

తీర్థయాత్రలు చేసేవాళ్ళు !

ఆచారాలు పాటించే వాళ్ళు !

తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !

పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !

చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !

లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు !

చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!

అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు !  

వాళ్ళు ....

తలకు నూనె రాసుకునే వాళ్ళు !

జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !

కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !

చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !

ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో స్నేహంగా గడిపిన తరం.....

.

ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు

మీకు తెలుసా ?

వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా  మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.

మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.

మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి 

.లేదంటే .....

.లేదంటే .....  

.లేదంటే .....

ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.

.వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో,స్నేహం తో కూడి ఉండే తరం...

సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!

 స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !

కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!

 ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం

ద్వేషం, మోసం లేని స్నేహ  జీవనం గడిపిన తరం అది!

సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అదే

 

లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !

ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!😊

 తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం

.

వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది 

మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .

సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..


*సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని  మార్చేయ్యకండి !!!*


తప్పులను సరిదిద్దగలది  సంస్కారమే

సర్కారు చేసే  చట్టాలు కాదు....🙏


*రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను,స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు..🤔*

కాశి ఆలయ విశేషాలు*

 *కాశి ఆలయ విశేషాలు*


👉 *కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.* 


👉 *కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.*


👉 *క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం*


👉 *క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన*


👉 *క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం*


👉 *క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు*


👉 *క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి*


👉 *క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్*


👉 *క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం*


👉 *క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు*


👉 *శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి*


👉 *క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు*


👉 *క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం*


👉 *క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం*


👉 *క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు*


👉 *క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్*


👉 *కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం*


👉 *ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు*


👉 *కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం*


👉 *184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన.* 


👉 *12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.*


👉 *కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.*


👉 *మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.*


👉 *కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.*


👉 *విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.*


👉 *ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.*


👉 *ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.*


👉 *2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.*

Perpetual motion


 

అల్లూరి సీతారామరాజు*

 *మే 7 - వర్ధంతి* 


 *అల్లూరి సీతారామరాజు* 


 *బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు.* 


అల్లూరి సీతారామరాజు, (1897 జూలై 4 - 1924 మే 7) భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.


అల్లూరి సీతారామరాజు జననం,

1897 జూలై 4, పాండ్రంగి, మద్రాసు ప్రెసిడెన్సీ, (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్)


మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.


గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటీషు అధికారులలో చింతపల్లికి తహసీల్దారు అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై, కూలీలకు సరైన కూలీ ఇవ్వక, ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసాడు. దానిపై ఏ చర్యా తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేసాడనే కోపంతో బాస్టియన్ రామరాజు పై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం మార్గంలో బ్రిటిష్ వారి మీద పోరాటం చేసిన యోధుడు.


1924 ఏప్రిల్ 17 న మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరుగలిగినవాడు.

తరువాత,1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేసి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు మృత దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు. కృష్ణదేవిపేట (కే.డి పేట) లో సీతా రామ రాజు సమాధి ఇప్పటికి ఉంది.

టైంపాస్

 ప్రతిరోజూ యిదే ప్రశ్న!! రిటైర్ అయ్యావుగా టైంపాస్ ఎలా అవుతోంది? 

అసలు ఇదేం ప్రశ్న?! 

టెలివిజన్ చూస్తాను... 

పుస్తకాలు చదువుతాను. 

నా తెలివితేటలకు యిదో పెద్ద పనా? ఇంకా కావలస్తే వివరంగా నిన్న జరిగిన సంఘటన వివరిస్తాను. 


బంగారం షాపుకి నేను నా భార్యతో బజారుకు వచ్చాం.

షాపులో పనైపోయి అక్కడే  పక్కనున్న కారుదగ్గర ఆగాము.. నన్ను చూసిన పోలీస్ కారు దగ్గరకు వచ్చి నన్ను చూస్తూ...


పోలీస్ : ఇక్కడ కారు పార్కింగ్ చేయకూడదు వెయ్యి రూపాయలు ఫైన్ కట్టండి.

నేనూ : మేము లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలు కూడా గడవలేదండీ

పోలీస్ : ప్రతి ఒక్కరూ అలానే చెపుతార్లేవయ్యా

నేను : సార్ నేను రిటైర్డ్ LFL HM ను. కనీసం నా వయసుకైనా మర్యాద యివ్వండి. 

పోలీస్ : సరే ఒక రెండు వందలు యివ్వండి

నేను : రశీదు యిస్తారా?

పోలీస్ : అదెలా కుదురుతుంది

నేను : యివ్వకపోతే ఎలా? చట్ఠప్రకారం రశీదు యివ్వాలి కదా

పోలీస్ : (బాగా ఇరిటేట్ అయ్యాడేమో) చట్టంగురించి నాకే చెప్తారా ! సరే చూడు ఈ కారుకి లెప్ట్ రేర్ వ్యూ మిర్రర్ పగిలి పోయింది. వెనుక నెంబర్ ప్లేటు సరిగా లేదు.. మొత్తం నాలుగు వేలు కట్టు.


నేను నిస్సహాయంగా నా భార్య వైపు చూసాను. 

ఆమె వాదులాట మొదలు పెట్టింది.   

అర గంటకు పైగా అన్నిరకాలుగా వాదన జరుగుతూనే వుంది. 


అప్పుడు వచ్చింది మేం ఎక్కవలసిన సిటీ బస్సు. 

వెంటనే ఆ బస్ ఎక్కేశాం..😜😀

పోలీస్ అలాగే మావైపు బిత్తరచూపులు చూస్తున్నాడు..


కారు నాది కాకపోయినా టైంపాస్ ఎంత బాగా అయిందో చూశారుగా! 😁😅

ఇలాంటివి కొన్ని వందలుంటాయి.

రిటైర్ అయ్యాక టైంపాస్ కాదని ఎవరూ చెప్పింది ... 

😄😆😂🤣

Not a story

 Does it mean 🚩Hindus are busy digging their own graves  .... 

🚩Hindus must read their recent last 1200 years own history ... 

... 

🚩Hindus must not be dumb

నిన్న ఆదివారం అంగట్లో చూసి జ్ఞాపకమొచ్చి మళ్లీ పెడుతున్నా ఈ పోస్ట్!


ఒక వ్యక్తి #చికెన్_వ్యాపారం చేసేవాడు. #పంజరం(Gril ) లో  కోళ్ళను పెట్టి ,


వినియోగదారుడు చికెన్ కొరకు రాగానే.. 


పంజరం నుండి ఒక కోడిని తీసి, దాని #గొంతుకోసి మాంసం కావలసినన్ని ముక్కలుగా చేసి అమ్మేవాడు.


ఆ వ్యక్తి  పంజరంలోకి ఎపుడు చేయిపెట్టి #కోడిని తీయబోయినా, అందులోని కోళ్ళు అరిచేవే #కాదు. 


తమకు,తాము #తలొంచుకుని ధాన్యం తింటుండేవి.వాటికి కావలసిన గిన్నెలో నీళ్లు #తాగుతుండేవి,  


అయితే ఏ కోడినైతే ఆ కసాయివాడు పట్టుకుంటాడో అది మాత్రం #అరిచి_గగ్గోలు పెట్టేది.

దాని రెక్కలు #చాచి_కొట్టుకునేది , మిగిలినవి తమకు #సంబంధం_లేనట్లు ప్రశాంతంగా #తమకేమీ_పట్టనట్లుండేవి. 


సాయంత్రానికల్లా... అన్ని కోళ్ళు మాంసం #ముక్కలుగా మారిపోయేవి.


ఒకరోజు ఆ కసాయివాడిని అతడి స్నేహితుడు ' ఇలా అడిగాడు.


నువ్వు ఆ కోళ్ళను గొంతు కోస్తావని తెలిసినా ,అవన్నీ ఎలా ప్రశాంతంగా ఉంటాయి? ' అని ప్రశ్నించాడు. 


అందుకు కసాయివాడు ఈ విధంగా చెప్పాడు .


నేను ఈ కోళ్ళ...తో ....


మీరంతా  ఎంతో గొప్పవారు,,,,. మీరుగానీ,,,,,, మీజాతి గానీ #ఎప్పటికీ_నశించదు. 


ప్రపంచంలో మీదే #శ్రేష్ఠమైన_జాతి. మీరు హాయిగా ఉండండి. 

ఏ కష్టమూ #మీకు_రాదూ . 


అలాంటిదేదైనా వచ్చినా అది మీ #పక్కింటి వారికి వస్తుందే తప్ప మీకు రాదు ' అని చెబుతుంటాను.


ఇవి #అదే_భ్రమలో తమకేమీ కాదు. ఏమైనా జరిగినా అది తన #ప్రక్కింటివాడికి అవుతుందంతే అనుకుంటాయి ' అన్నాడు.


"ఈ కథ ...ఈ దేశంలోని #మొద్దు_నిద్దురలో ఉన్న.....అందరి #హిందువులకు సరిగా అన్వయిస్తుంది".


*#లవ్_జిహాద్ అయినా, #అక్రమ_చొరబాట్లు అయినా, #రోహింగ్యాలైనా, మాయమాటలతో చేసే మతమార్పిడులైనా,ISIS అయినా....వాటి గురించి నిముషమైనా ఆలోచన చేసేంత సమయం హిందువుల #వద్ద_లేదు.


* వ్యాపారి అయితే తమ వ్యాపారం #బాగా_జరిగి_లాభాల_గడిస్తే_చాలు  


* ఉద్యోగి అయితే తన పై అధికారి తనకు ఎక్కువ పని అప్పగించక,జీతం సరిగా #ఇస్తే చాలు , తను తన #కుటుంబం_ప్రశాంతంగా ఉంటే చాలని భావిస్తున్నారు.


* అన్యమతస్థులు  ఒక్కక్కరినే మన హిందువులను మాయమాటలు చెప్పి వారి మతంలోకి మతమార్పిడుల ద్వారా  కలుపుకుంటే మనహిందూజాతిని #కనుమరుగు చేస్తున్నారు. 


*  రాజకీయనాయకుల మాట సరే సరీ ...వాడి #ఖజానా నిండితే చాలు ,వాడి వంశం మొత్తం #నాశనమైనా సరే వాడికి #పట్టదు .


* భవిష్యత్తులో రాబోయే విపత్తు  ప్రమాదాన్నిచాలామంది  #గుర్తించడం_లేదు"

జై భారత్ .!!.జై హిందూ !!.


ఇక్కడ "కేవలం కథ"  మూలం మాత్రం,నామిత్రుడు  Madhu   నుండి...మార్పులతో మీకోసం చాలాసార్లు అందించా.. మళ్లీ మీకోసం... *మీ క్యాతం భరత్*

అక్షయ తృతీయ

 అక్షయ తృతీయ ప్రాముఖ్యత:   10 5 2024 శుక్రవారం అక్షయ తృతీయ

1. పరశురాముని జన్మదినం

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం

3. త్రేతాయుగం మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం

5.

 వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో వ్రాయడం మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు వనవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం

అక్షయ తృతీయనాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలను చేయడం వల్ల, మామూలు దినములకన్నా, అనేకరెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి. బంగారం కొనమని ఎక్కడా చెప్పబడలేదు. అవన్నీ వ్యాపారస్తులు సృష్టించిన పన్నాగం. అమాయక జనాలచేత బంగారం కొనిపించి వారు అత్యంత ధనవంతులయ్యే దానికి వాళ్ళు అల్లిన కృత్రిమ ప్రచారం


                 *_🌻శుభమస్తు🌻_*

                             ఇట్లు

                              మీ

              అవధానుల శ్రీనివాస శాస్త్రి 

               ❀┉┅━❀🕉️❀┉┅━❀

          🙏 సర్వే జనాః సుఖినోభవంతు

         🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు

        🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*07-05-2024 / మంగళవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ముఖ్యమైన వ్యవహారాలలో  తొందరపాటు పనిచేయదు. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

వృషభం


ఆప్తుల నుండి శుభవార్తలు అవుతాయి. స్థిరాస్తి  కొనుగోలు  ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో  పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

మిధునం


దూరప్రయాణాలు ఊహించని మార్పులు కలుగుతాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. 

---------------------------------------

కర్కాటకం


దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి  శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

---------------------------------------

సింహం


నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు  హోదాలు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి. చిన్ననాటి  మిత్రులతో విభేదాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------

తుల


బంధుమిత్రులతో అకారణ  వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన  వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

---------------------------------------

వృశ్చికం


విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

ధనస్సు


అవసరానికి ధన సహాయం అంది దీర్ఘకాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు  ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

---------------------------------------

మకరం


బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

కుంభం


ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------

మీనం


ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కీలక  వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

హాస్యానందం

 శ్రీ అధరాపురపు మురళీ కృష్ణ  గారు .


ఆలు -మగల హాస్యానందం!


"ఏఁవోయ్ .... "


"ఆఁ .... "


"పులుసులో చిలగడ దుంపలు వేసావా, ఘుమఘుమలాడుతోంది?"


"కళ్ళు మూసుకుని పూజ్జేసుకుంటూ మళ్ళీ లౌకికాలు ఎందుకు?"


"కళ్ళు మూసుకున్నాను గానీ ముక్కు మూసుకోలేదుగా?"


"బానే ఉంది. ముందు పూజ కానివ్వండి".


"నైవేద్యానికి ముక్కల పులుసు బ్రహ్మాండంగా ఉంటుందనుకో. భగవంతుడికి ప్రీతికరమైనది".


"మరే .... మీకు కలలోకొచ్చి చెప్పాడాయన!"


"కలలోకే రావాలేఁవిటే రాజ్జం? మనకు ఇష్టమైనవన్నీ ఆ భగవంతుడికి నైవేద్యాలే. అలా నైవేద్య రూపంలో పెడితే మనం తినేవి పూర్తిగా వంటబడతాయ్ .... భక్తిగా తింటాం కాబట్టి".


"ఓహో .... అలాగా?"


"ఆంజనేయ స్వామికి అప్పాలు, వెంకన్నకు దధ్యోజనం, చక్ర పొంగలి, శివుడికి పాయసం, విఘ్నేశ్వరుడికి లడ్లు, కుమారస్వామికి తేనె, పాలు .."


"ఇంకా ....?"


"అసలు మహా నైవేద్యం అంటేనే మనకు ఇష్టమైనవి మనఃస్పూర్తిగా తినడానికేనే .... ఆ భగవంతుడి పేరు చెప్పి కళ్ళకద్దుకుని ఆరగించడఁవే".


"మరి అమ్మ వారికి ఇష్టమైనవి చెప్పలేదెందుకో?"


"దుర్గమ్మకు పులిహోర, శ్రీ మహా లక్ష్మీకి పూర్ణాలు ...."


"అవేఁవీ కావు .... "


"మరి .... ?"


"అమ్మ వారికి వడ్రాణ్ణం, గాజులు, కమ్మలు, వంకీలు, బుట్టలు, చంద్రహారం, జడలో చామంతి బిళ్ళ  ...."


"ఆపుతావా దండకం? నీకిష్టమైనవాటన్నిటికీ అమ్మవారి పేరు చెబుతావా?"


"మీకిష్టమైన వాటికి భగవంతుడి పేరు చెప్పుకోవడం లేదేంటి మరి?"


"నన్ను కాసేపు పూజ్జేసుకోనిస్తావా? అసలు నిన్ను కదిలించడం నాదీ బుధ్ధి తక్కువ".


"మీరా, నేనా కదిలించింది? శ్రావణ మాసానికి ఏం చేయించుకున్నావని అమ్మాయడుగుతోంది".


"శ్రీ మహా విష్ణోరాఙ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యః బ్రహ్మణః ద్వితీయ పదార్ధే శ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైఋతి ప్రదేశే ...."


"నైఋతి ఇక్కడ కాదు, ఈశాన్య ప్రదేశే .... అని చెప్పుకోవాలి".


"నీతో ఇంకొంచెం సేపు మాట్లాడితే ప్రవర కూడా మరచిపోతాను".


🤫🤫🤫🤫🤫🤫🤫🤫

విఘేశ్వరునికి పూజతో

 శ్లోకం!!

గణేశస్మరణా త్పశ్చాత్.

 శుభే షోడశవాసరైః!

గృహారంభే త్రిభిః వేశే !

నగచ్చేత్ అశుభాదిషు!!


*!!భావము!!*

విఘేశ్వరునికి   పూజతో మొదలు వివాహ ఉపనయనాది శుభకార్యాల అనంతరం పదహారురోజులు దాటువరకూ.... 

శంకుస్థాపన నూతన గృహప్రవేశం వీటికి ముందు వెనుకలు మూడు రోజులు అశుభాదులకు 

(శ్రాద్ధాన్న భోక్త.భోజన. శవానుగమన,

పరామర్శాదులకు) వెళ్ళ రాదు...

మంగళవారం,మే 7,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం,మే 7,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

చైత్ర మాసం - బహుళ పక్షం

తిథి:చతుర్దశి ఉ10.59 

వారం:మంగళవారం(భౌమవాసరే )

నక్షత్రం:అశ్విని మ3.15 

యోగం:ఆయుష్మాన్ రా9.05 

కరణం:శకుని ఉ10.59 వరకు

తదుపరి చతుష్పాత్ రా9.57 వరకు

వర్జ్యం:ఉ11.29 - 12.59 మరల రా12.22 - 1.53

దుర్ముహూర్తము:ఉ8.07 - 8.58 &

మరల రా10.48 - 11.33

అమృతకాలం:ఉ8.28 - 9.58

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:మేషం

చంద్రరాశి: మేషం 

సూర్యోదయం:5.35

సూర్యాస్తమయం:6.17


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

సంకల్పము

 *శుభోదయం*

*********

 సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.07.05.2024

మంగళ వారం (భౌమ వాసరే) 

************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ చైత్ర మాసే కృష్ణ పక్షే చతుర్దశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

చైత్ర మాసే కృష్ణ పక్షే చతుర్దశ్యాం. 

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.36

సూ.అ.6.17

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

చైత్ర మాసం 

కృష్ణ పక్షం చతుర్దశి ప. 10.59 వరకు.

మంగళ వారం. 

నక్షత్రం అశ్విని. 

సా.3.13 వరకు. 

అమృతం ఉ. 8.26 ల ల 9.56 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 8.07 ల 8.58 వరకు. 

దుర్ముహూర్తం రా. 10.48 ల 11.33 వరకు. 

వర్జ్యం ప. 11.27 ల 12.57 వరకు. 

వర్జ్యం రా. 12.20 ల 1.51 వరకు. 

యోగం ఆయుష్మాన్ రా.9.01 వరకు.  

కరణం శకుని వ. 10.59 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ.9.00 ల 10.30 వరకు.     

*****************    

పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ అమావాస్య. 

****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

మంగళవారం*🍁 🌹 *మే 7, 2024*🌹

 *ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ*

🍁 *మంగళవారం*🍁 

 🌹 *మే 7, 2024*🌹

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

       *చైత్ర మాసం - బహళ పక్షం*   

తిథి      : *చతుర్దశి* ఉ10.59 వరకు

వారం   : *మంగళవారం* (భౌమవాసరే )

నక్షత్రం  : *అశ్విని* మ3.15 వరకు

యోగం : *ఆయుష్మాన్* రా9.05 వరకు

కరణం  : *శకుని* ఉ10.59 వరకు

       తదుపరి *చతుష్పాత్* రా9.57 వరకు

వర్జ్యం   :  *ఉ11.29 - 12.59*

               మరల *రా12.22 - 1.53*

దుర్ముహూర్తము :  *ఉ8.07 - 8.58* &

                  మరల *రా10.48 - 11.33*

అమృతకాలం    :  *ఉ8.28 - 9.58* 

రాహుకాలం       : *మ3.00 - 4.30*

యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*

సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *మేషం*

సూర్యోదయం: *5.35* || సూర్యాస్తమయం:* *6.17*


🍒 శ్రీరామ రామ  రామేతి 

      రమే రామే మనోరమే  

     సహస్రనామ తత్తుల్యం   

     రామనామ వరాననే 🙏


🍁 *శ్రీ హనుమాన్నామము*  

     *శత విజయమస్థు*🍁

 👉 *కృష్ణాంగారక చతుర్దశి*

*సర్వేజనా సుఖినో భవంతు* 

        *శుభమమస్తు* 🙏

----------------------------------------

*_గోమాతను పూజించండి_* 

        *_గోమాతను సంరక్షించండి_*

            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

ఆవకాయ రుచిని

 ఈ క్రింది పద్యాలని చూడండి


కం.

కలిపెడిది ఆవకాయట

కలిపించెడి వారు మామగారట మరినే

కలిపిన రుచికరమగు నట

కలుపగ వేరొండు గాయ కలుపగ నేలా

----------------------------------------

కం.

ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!

------------------------------------------------

కం.

ఇందువల దందు బాగని

సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం

బెందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!

-------------------------------------------------

కం.

చారెరుగనివాడును, గో

దారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగు వాడు  కాడోయ్!

---------------------------------------------

కం.

శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

-----------------------------------------------

కం.

ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!

--------------------------------------------

కం.

బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!

------------------------------------------------

ఆవకాయ అవతరణ:


కం.

చప్పటి దుంపలు తినుచును,

తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో

గొప్పగు మార్గం బొక్కటి

చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్

-----------------------------------------------------

ఆవకాయ ఇష్టం లేదని ఎవరైనా అంటే వానిని ఒక కవి ఏకంగా శపించేస్తున్నాడు చూడండి


కం.

ముక్కోటి దేవులందరు

మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన

ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!

--------------------------------------------------

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:


కం.

చెక్కందురు డిప్పందురు

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్

డొక్కందురుగ  మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!

-----------------------------------------

మరొక మంచి గేయ కవితని చూడండి.


ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది

మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది

మెంతికాయ  మోజు పెంచేస్తుంది

తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది

కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది

బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది

పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది

పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది

------------------------------------------

చింతకాయ చింతించినా చూడరు

ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు

గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు

కొరివికారం కొరకొర చూసినా చలించరు

టమాటా టక్కుటమారాలు చేసినా పడరు

నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా

అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు

వంకాయ బండపచ్చడి బాధపడినా


నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా

దోసావకాయ దోరగా నవ్వినా

నారింజకారం కవ్వించినా 

కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా

పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా

క్యాబేజి పచ్చడి  ఘుమఘుమలాడినా

కొబ్బరిపచ్చడి  కూతపెట్టి పిలిచినా

బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా

కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా

వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా

వడగళ్ల జడివానలు కురుస్తున్నా

చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా

అన్ని ఋతువుల అమృతమనుచు

మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే

----------------------------------------------

అగ్ర తాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ

ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా

కంటికింపుకాదు నోటికి రుచికాదు

మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని

ఇంతటి మహత్తరమైన ఆవకాయని, ఇంతమంది అంతగా అందరూ పొగిడే ఆవకాయని మనం వదిలి పెట్ట గలమా! నిస్సందేహంగా వదలలేం.

-------------------------------------------------

పదార్థాలని తినేప్పుడు అందరూ ఆవకాయని నంజుకుని తిని ఆవకాయ రుచిని ఆస్వాదించండి. చక్కటి వరి బియ్యం అన్నంలో ఆవకాయని కలిపి కమ్మని ఆవు నేయితో నిజమైన ఆవకాయ రుచిని ఆస్వాదించండి. 

రచయిత పేరు తెలియదు. వారికి  నమస్సులు. 🌹💐🙏


*సేకరణ:- శ్రీ పురం వేంకటేశ్ ప్రసాద్ గారి పోస్టు.*

నేత్ర వ్యాధులు

 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

.            *🌹తాళపత్ర గ్రంధం🌹*

( అనేక గ్రంథాల్లో దాగి ఉన్న జీవన ఆచార... ఆరోగ్య సాంప్రదాయ రహస్యాలు... స్థూల అక్షరాలతో...)

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

.                    *భాగం 12*


*108. నేత్ర వ్యాధులు హరించుటకు?*


*ఓం కేశవ పుండరీకాక్ష నమో నమః.*

సాయంత్రపు ఎండలో కనులు మూసుకుని ఏకాంతప్రదేశంలో ధ్యానించుట ద్వారా కనులకి శక్తి, దృష్టి పెరిగి ఆనందం స్వంతమవుతుంది.


*109. అపమృత్యు భయం పోవాలంటే?*


గంధము, అక్షితలు, పుష్పములు వంటి

పూజాద్రవ్యములతో భరణీ నక్షత్రమునాడు యముణ్ని

పూజిస్తే అపమృత్యు భయం తొలగుతుంది.


*110. వంట ఇంటికీ, గృహానికి పరిమితమైతే మీ ఆయుషు పదేళ్ళు తగ్గినట్టే?*


ముఖ్యంగా భారత దేశంలో మహిళలు పై రెంటికే

పరిమితమవుతుంటారు. పూర్వకాలంలో గృహం పెద్ద

ఆవరణలో ఉండేది. దానితో వారు ఆ ఆవరణలో

ఇంటి పనులకు తిరగటం వల్ల సూర్య కిరణాల నుండి

వచ్చే 'డి' విటమిన్ అందేది. చర్మము పైనున్న అనేక

క్రిములు నశించిపోయేవి.

రాజపుత్ర స్త్రీలూ, ఇంకొంత మంది స్త్రీలు ఘోష

పద్ధతి వల్ల అనారోగ్యం పాలవుతారు. కేవలం నీడపట్టునే ఉండటం వల్ల భయంకరమైన టి.బి కూడా వచ్చే అవకాశము ఉంది. సూర్యరశ్మి శరీరానికి తగలకపోతే ఆయుర్వేద వైద్య రీత్యా రోగాల పాలవ్వక తప్పదు.


*111. నాగులచవితికి పుట్టలో పాలుపోస్తే సంతానం కలుగుతుందా?*


కార్తీక శుద్ధ చవితినాడు వచ్చే నాగపంచమి రోజు సంతానం కోసం పెట్టి మొలకెత్తిన

ధాన్యములతోనూ, పాలతోనూ నాగపుట్టను పూజించి ఈ

పాలు పోస్తారు. ఇలా చెయ్యటం భక్తితో పాటు

సంతానవంతులయ్యే విశేషం కూడా ఉంది. కొత్త ధాన్యముల ప్రసాదాన్ని స్వీకరించటం వల్లా, పుట్ట వద్ద పూజ చేస్తూ స్పందించటం వల్ల స్త్రీలలో నాడీమండలం ఉత్తేజం చెంది సంతానవంతులయ్యే అవకాశం కలిగిస్తుంది.


*112. ముక్కుపుడక కుట్టించుకోవటంలోని ఆరోగ్యము?*


వివాహ సమయంలో ఏడు అడుగులు వేసి ఒకరికి

ఇల్లాలైన ఆమెని పార్వతీ దేవితో సమానంగా భావించి

ముక్కుపుడకను అందివ్వటం మన సంప్రదాయం. పెళ్ళి

అయిన వారు ధరించటంలో అర్థం... భర్త

ఆయురారోగ్యాలతో, సకల ధనాలతో సంతోషంగా

ఉండాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ధరించటము. ముక్కుకి

రంధ్రం చేయటం ద్వారా ఆక్యుపంక్చర్ వైద్య విధానం

ద్వారా రక్తపోటు నివారణమవుతుంది.


*113. గృహస్థు తామరాకు, మోదుగ ఆకుల్లో భోజనం చేయరాదు. ఎందువలన?*


ఆ రెండు ఆకుల్లో భోజనము మునులూ, ఋషులూ, సన్యాసులూ మాత్రమే తినాలి. ఆ ఆకుల్లో భుజించటం వల్ల సత్వగుణం అలవడుతుంది. ఆ కారణంగానే గృహస్థు జీవితం గడుపుతున్నవారు ఆ ఆకుల్లో తినరాదు. అయితే మోదుగ ఆకుల్లో ఆహారం

తీసుకోవటం వల్ల కంటి సంబంధిత అనేక వ్యాధులు

తగ్గుతాయి.


*114. అకాల భయము తొలగిపోవుటకు?*


ఓం హృషీకేశ నమో నమః అని జపించ

వలయును. రాత్రి స్నానము అయ్యాక, ఇష్ట దైవాన్ని

తలుచుకొని 108సార్లు జపిస్తే భయవీడలు

తొలగిపోతాయి.


*115. ఆడ, మగ తేడా లేకుండా చెవులు కుట్టించటం ఎందుకు?*


చెవి మధ్య భాగంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది.

అది మెదడుకి అనుసంధానం కలిగి ఉంటుంది.

ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం వద్ద ఒత్తిడి తెస్తామో మెదడులో

ఉన్న జ్ఞాననేత్రం వికసించి బుద్ధి వికసిస్తుంది. ఈ కార్యాన్ని బంగారంతో చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అందువలననే బంగారు పోగులు ధరించలేని వారికి సైతం చెవి కుట్టే సమయంలో

బంగారు తీగతోనే రంధ్రం ఏర్పరచటం జరుగుతుంది.

పూర్వం చెవులు కుట్టించటం ఉపనయనం సమయంలో చేసేవారు. కానీ ఈ కాలంలో మూడు సంవత్సరాల వయస్సులోనే మగ, ఆడ బేధం లేకుండా చెవులు కుట్టించటం జరుగుతుంది.

విద్యాభ్యాసం చేసేటప్పుడు గురువులకూ, పెద్దలకూ చెవులను తమ్మె వద్ద పట్టుకుని శిష్యులు తమ గోత్రనామాలను చెప్పుకొనేవారు. ఈ విధానంలో అంతరార్థం ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి

తేవటం కొరకే.


*రచన* ✍️ *మైధిలి వెంకటేశ్వరరావు.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

సాక్షాత్తూ స్వర్గమే

 దృఢగాత్రత్వమానృరణ్యమఘమోచనమ్।అపారవశ్యం నైశ్చిన్త్యమాస్తిక్యం స్వర్గ ఏవ హి॥ భావము॥ మంచిఆరోగ్యం, గట్టిశరీరం, ఋణంలేకపోవడం, పాపముక్తి,పరతంత్రం లేకపోవడం,నిశ్చింతత,ఆస్తికత-ఇవన్నీ సాక్షాత్తూ స్వర్గమే.॥ వేదపురుషానుగ్రహసిధ్ధిరస్తు। నిరంతరం దేవబ్రాహ్మణ ప్రసాద సిధ్ధిరస్తు॥

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5125* *శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం  -‌ చతుర్ధశి  - అశ్వనీ -‌‌  భౌమ వాసరే* *07.05.2024.* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ*  గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*07-05-2024 / మంగళవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ముఖ్యమైన వ్యవహారాలలో  తొందరపాటు పనిచేయదు. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

వృషభం


ఆప్తుల నుండి శుభవార్తలు అవుతాయి. స్థిరాస్తి  కొనుగోలు  ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో  పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

మిధునం


దూరప్రయాణాలు ఊహించని మార్పులు కలుగుతాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. 

---------------------------------------

కర్కాటకం


దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి  శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

---------------------------------------

సింహం


నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు  హోదాలు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి. చిన్ననాటి  మిత్రులతో విభేదాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------

తుల


బంధుమిత్రులతో అకారణ  వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన  వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

---------------------------------------

వృశ్చికం


విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

ధనస్సు


అవసరానికి ధన సహాయం అంది దీర్ఘకాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు  ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

---------------------------------------

మకరం


బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

కుంభం


ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------

మీనం


ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కీలక  వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

విఫల ప్రయత్నం

 శు భో ద యం🙏


విఫల ప్రయత్నం!


             శా:  తృష్ణాతంతు  నిబధ్ధ  బుధ్ధులయి  రాధేయాదులం  గూడి   శ్రీ


                   కృష్ణుం గేవల  మర్త్యుగాఁ   దలచి ,బంధింపంగ   నుత్సాహ   వ


                   ర్ధిష్ణుండయ్యె , సుయోధనుం  డకట!  ధాత్రీనాధ!  యూహింపుమా?


                   ఉష్ణీషంబున   గట్టవచ్చునె ?మదవ్యూఢోగ్ర    శుండాగ్రమున్ ; 


                                   -  అధర్వణ  భారతము.- ఉద్యోగ పర్వము- అధర్వణుడు; 


                

            అర్ధములు:- తృష్ణాతంతువు- ఆశయనేదారము ;మర్త్యుడు-మానవుడు; ఉత్సాహ వర్ధిష్ణుడు- ఉత్సాహము(కోరిక)ను పెంచుకొనినవాడు;  ఉష్ణీషము- తలకుచుట్టుకొను వస్త్రము; మదవ్యూడోగ్ర- మదముతో మత్తెక్కిన; శుండాగ్రమున్-ఏనుగును;


     

              భావము:- ఆశయనే  దారముతో  బంధింప బడిన  బుధ్ధిగలవాడై  సుయోధనుడు  శ్రీకృష్ణుని  సాధారణ మానవుడనితలచి

బంధింప  నుత్సాహమును  జూపెను. అయ్యో ! ఏమనిచెప్పను? మదగజము  తలపాగ గుడ్డకు  గట్టువడునా? మూర్ఖుడు తెలియ నేరకున్నాడు. అనిభావము.


                   శ్రీ కృష్ణుడు  పాండవ రాయబారిగా  కౌరవ సభకేగినపుడు  అతనిని బంధిప  దుర్యోధనుడు యత్నించును. అపుడు సభలో  జరిగెడి  యలజడిని  ధృతరాష్ట్రునకు  విదురుడు  తెలుపు సందర్భము.


                         నన్నయ్యకు  కొంచెము  ముందో వెనకో  అధర్వణుడను  జైన  కవి యుండేవాడట. అతడుగూడా  భారతమును ఆంధ్రీకరించెననియు, కారణాంతరములచే  నది మరుగున పడి నశించిన దనియు చరిత్రకారులు వ్రాయు చున్నారు. అందుకు నిదర్శనముగా పైపద్యములను ప్రదర్శించు చున్నారు. చారిత్రికాంశము లెట్లున్నను అధర్వణుడు  గొప్పకవి యనుట నిర్వివాదము.


                  దుష్కర ప్రాసతో  పద్యారంభము. సుయోధనకార్యము దుష్కరమని  సూచించుటకు! 


                  తంతువు  అంటే  దారము. చాలాసులభముగా  తెంపవచ్చును. సుయోధనాదులు ఆశాపాశ బధ్ధులైనారట. తామే మొదలు కట్టుబడినారు. వారికిక యితరులను కట్టు శక్తియెక్కడిది? అయినను  వ్యర్ధప్రయత్నము. కృష్ణుని బంధించుట  మదపుటేనుగును తలగుడ్డతో  బంధించుట వంటిదట!  ప్రయత్నము విఫలమగుటయేగాదు. ప్రత్నించిన వారికే ప్రమాద మగును.


                ఈరీతిగా  భావ స్ఫోరకముగా  రసోచితముగా   సన్నివేశమునకు అనుగుణముగా  చక్కనిపద్యములను  రచించిన

యధర్వణుని  భారతము మనకు లభింపక పోవుట  మనదురదృష్టము. మరోపద్యం మరోసారి.


                                                      స్వస్తి!🙏🙏🌷🌷

పరుల మేలుకై

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 

*ధనాని జీవితం చైవ పరార్థే ప్రాజ్ఞ ఉత్సృజేత్*।

*తన్నిమిత్తో వరం త్యాగో వినాశే నియతే సతి*॥


తా𝕝𝕝 *"ప్రాఙ్ఞుడైనవాడు ధనాన్ని జీవితాన్ని పరుల మేలుకై త్యజించాలి*.... మరణం తప్పనిదై ఉండగా అట్లు త్యాగం చేయుట శ్రేష్ఠము గదా!"


*ఏది శాశ్వతం*?


     👇 //------ ( *భజగోవిందం* )-----// 👇


*కాతే కాంతా ధనగతచింతా*

*వాతుల కిం తవ నాస్తి నియంతా*

*త్రిజగతి సజ్జనసంగతిరేకా*

*భవతి భవార్ణవతరణే* ॥13॥


భావం: ఓరి వెఱ్ఱివాడా! ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటిని, అందరిని నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? *ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక*

పంచాంగం

 శుభోదయం, పంచాంగం                卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*మంగళవారం, మే 7, 2024*

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

 చైత్ర మాసం - బహళ పక్షం*   

తిథి చతుర్దశి* ఉ10.59 వరకు

వారం   : *మంగళవారం* (భౌమ్యవాసరే )

నక్షత్రం  : *అశ్విని* మ3.15 వరకు

యోగం : *ఆయుష్మాన్* రా9.05 వరకు

కరణం  : *శకుని* ఉ10.59 వరకుతదుపరి *చతుష్పాత్* రా9.57 వరకు

వర్జ్యం   :  *ఉ11.29 - 12.59*

  మరల *రా12.22 - 1.53*

దుర్ముహూర్తము :  *ఉ8.07 - 8.58* &

   మరల *రా10.48 - 11.33*

అమృతకాలం    :  *ఉ8.28 - 9.58* 

రాహుకాలం       : *మ3.00 - 4.30*

యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*

సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *మేషం*

సూర్యోదయం: *5.35* || సూర్యాస్తమయం:* *6.17*

 👉 *కృష్ణాంగారక చతుర్దశి*

*సర్వేజనా సుఖినో భవంతు* 

 

*_గోమాతను పూజించండి_*

*_గోమాతను సంరక్షించండి_*