3, మార్చి 2025, సోమవారం

03, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     *🕉️సోమవారం🕉️*

*🌹03, మార్చి, 2025🌹*

   *దృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  శుక్లపక్షం*


*తిథి       : చవితి* సా 06.02 వరకు ఉపరి *పంచమి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : రేవతి* ఉ 06.39 ఉపరి *అశ్వినీ పూర్తి రోజంతా*


*యోగం  : శుక్ల* ఉ 08.57 ఉపరి *బ్రహ్మ* (04) తె 05.25 వరకు

*కరణం   : వణజి* ఉ 07.30 *భద్ర* సా 06.02 ఉపరి *బవ* రా 04.37 తె వరకు ఆపైన *బాలువ*


*సాధారణ శుభ సమయాలు:* 

 *ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*

అమృత కాలం: *రా 09.56 - 11.24*

అభిజిత్ కాలం  : *ప 11.56 - 12.43*


*వర్జ్యం             : రా 12.51 - 02.18*

*దుర్ముహూర్తం  : మ 12.43 - 01.30 & 03.05 - 03.53*

*రాహు కాలం   : ఉ 07.53 - 09.22*

గుళికకాళం      : *మ 01.48 - 03.17*

యమగండం    : *ఉ 10.51 - 12.19*

సూర్యరాశి : *కుంభం*

చంద్రరాశి : *మీనం/మేషం*

సూర్యోదయం :*ఉ 06.24* 

సూర్యాస్తమయం :*సా 06.15*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.24 - 08.46*

సంగవ కాలం         :      *08.46 - 11.08*

మధ్యాహ్న కాలం    :      *11.08 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ చవితి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.15*

ప్రదోష కాలం         :  *సా 06.15 - 08.41*

రాత్రి కాలం           :  *రా 08.41 - 11.55*

నిశీధి కాలం          :*రా 11.55 - 12.44*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.46 - 05.35*

________________________________

🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*

*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*అకంపమనుకంపిత రతిం సుజన మంగలనిధిం గజహరం పశుపతిం*

*ధనంజయ నుతం ప్రణత రంజనపరం పర చిదంబర నటం హృది భజ*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*క్రింద చెప్పిన సాధనాల్లో ఏయొక్క దాని చేతనైనా  ఈశ్వర సేవ చేస్తే మోక్షము సులభముగా లభిస్తున్నప్పుడు, ఈశ్వరుని కాదని ఇతర దేవతలను సేవించడం వల్ల ప్రయోజనం లేదనీ, ఆదేవతలను కోరదగినది గూడా ఏమీ లేదనీ, శంకరులు చెప్పారు.*


*శ్లోకం: 33*     


*నాలం వాసకృదేవ దేవ హభవతస్సేవానతిర్వా నులతిః*


*పూజా వా స్మరణం కథాశ్రవణ మప్యాలోకనం మాదృశామ్।*


*స్వామి న్నస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే*

                          

*కావా ముక్తిరితః కుతో భవతి చేత్కిం ప్రార్థనీయం తదా !!*


*పదవిభాగం:~*


*న_ అలం _ వా _ సకృత్ _ ఏవ _ దేవ _ భవతః _ సేవా _ నుతిః _ పూజా _*

*వా _ స్మరణం _ కథాశ్రవణమ్ _  అపి _ ఆలోకనం _ మాదృశామ్ _ స్వామిన్ _*

*అస్థిరదేవతానుసరణాయాసేన _ కిం _ లభ్యతే _ కా _ వా _  ముక్తిః _ ఇతః _*

*కుతః _ భవతి _ చేత్ _ కిం _ ప్రార్థనీయం _ తదా.॥*


*తాత్పర్యము:~*


*దేవా!  స్వామీ ! శివా !  నిన్ను ఒక్కమారు సేవించినా, నమస్కరించినా, పూజించినా, స్మరించినా, దర్శించినా, నీ కథను విన్నా చాలు,.  దీని కంటే ముక్తి మఱియొకటి లేదు.  మా వంటి వారికి , పై చెప్పిన వాటిల్లో ఏ ఒక్కదానివల్ల నైనా ముక్తి కల్గుతూ వుండగా, అశాశ్వతులైన ఇతర దేవతలను కష్టపడి సేవించడం వల్ల ఏమి లభిస్తుంది ?*


*వివరణ :~*


*శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు.  ఈశ్వరా!  నిన్ను స్వామి అని పిలుస్తున్నారు. ఎందుకంటే నీవు సర్వ భూతములకూ అధ్యక్షుడవు. నీవు స్వప్రకాశ స్వరూపుడవు. అందువల్ల దేవుడవు . నిన్ను ఒక్కసారి సేవిస్తే చాలు.  మాకు ముక్తి లభిస్తుంది. ఆసేవ నమస్కార రూపం, షోడశోపచార రూపం, లేదా నిన్ను స్మరించడం అనే మానసిక అర్చన కావచ్చు. నిన్ను స్తోత్రం చేయడమనే వాచిక సేవ కావచ్చు.  ఈవిధంగా త్రికరణాలతో చేసే సేవ కాకుండా  నీ కథలను ఆలకింపవచ్చు, దేవాలయాల్లో కృపావృష్టిని కురిపించే నీ మంగళమూర్తిని కన్నులారా తిలకింప వచ్చు. ఈ పైన చెప్పిన సేవలలో ఏ ఒక్కటి చేసినా  నీవు మాకు మోక్షాన్ని అనుగ్రహిస్తావు.*


*శంకరులు తమ విష్ణుసహస్రనామ భాష్యంలో కృష్ణ నామస్మరణ గురించి ఇలా వ్రాశారు.*


*ఏకోపి  కృష్ణస్య కృతః ప్రణామః*

*దశాశ్వమేధావబృధేన తుల్యః*

                           

*దశాశ్వమేధీ పునరేతి జన్మ*

*కృష్ణప్రణామీ న పునర్భవాయ!!"*


*అర్థం ఏమంటే కృష్ణుడికి ఒక్కసారి నమస్కారం చేస్తే , అది పది అశ్వమేధయాగములు చేసిన దానితో సమానం . పది అశ్వమేధయాగములు చేసినవాడు తిరిగీ జన్మను పొందవచ్చు.  కానీ కృష్ణనామాన్ని  ఒక్కసారి ఉచ్ఛరించినవాడు మరలా జన్మింౘడు.*


*అలాగే  శంకరుల వారు తమ భజగోవింద శ్లోకంలో ఇలా వ్రాశారు.*


"*భగవద్గీతా కించి దధీతా, గంగా జలలవ కణికా పీతా*

                 

*సకృదపి యేన మురారి సమర్చా, క్రియతే తస్యయమేన నచర్చా।*"


*ఎవడు భగవద్గీతను కొంచమైనా చదువుతాడో, గంగాజలాన్ని కొంచమైనా ఆచమనం చేస్తాడో, శ్రీ హరిని ఒక్క సారైనా అర్చిస్తాడో, అతణ్ణి గుఱించి యముడు పట్టించుకోడు. ( అంటే అతడికి జనన మరణ భయం ఉండదు. అంటే ముక్తి లభిస్తుంది).*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(65వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

      *పరశురాముడి ప్రతిజ్ఞ*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కృతవీర్యుని పుత్రుడు కార్తవీర్యార్జునుడు. హైహయ వంశానికి చెందిన వాడు. వేయి చేతులతనికి. మాహిష్మతీపురం అతని రాజధాని. దత్తాత్రేయుని భక్తుడతను. ఆ దేవుని అనుగ్రహంతో కార్తవీర్యార్జునుడు గొప్ప శక్తిసంపన్నుడయ్యాడు. అనేక శస్త్రాస్త్రాలు సాధించాడు. ఆ కాలంలో అతన్ని ఎదిరించగలిగిన వీరుడే లేడు. రావణాసురుణ్ణే బంధించిన ఘనత అతనిది.*


*అలాంటి కార్తవీర్యార్జునుడు ఒకనాడు సైన్యసమేతంగా వేటకి వెళ్ళి, దోవలో జమదగ్ని ఆశ్రమాన్ని సందర్శించాడు. వచ్చిన రాజుని సాదరంగా ఆహ్వానించాడు జమదగ్ని. తన వద్దగల కామధేనువు ప్రభావంతో రాజుకీ, అతని సైన్యానికీ షడ్రసోపేతమయిన విందు ఏర్పాటు చేశాడు. విందు బాగుంది. కామధేనువు ప్రభావాన్ని మెచ్చుకున్నాడు రాజు. దానిని కావాలన్నాడు.*


*ఇవ్వలేనన్నాడు జమదగ్ని. ముని వాకిట ఉండాల్సిన గోవు కామధేనువంటూ నచ్చజెప్పజూశాడు. అతని మాటలకి కోపం వచ్చింది కార్తవీర్యార్జునునికి. భటులతో బలవంతంగా గోవుని తోలుకుని పోయాడు. ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు.*


*వచ్చిన తర్వాత జరిగిందంతా తెలుసుకున్నాడతను. ఆగ్రహంతో ఊగిపోయాడు. ధనుర్బాణాలూ, పరశువూ ధరించి, కార్తవీర్యార్జునుని మీద యుద్ధం ప్రకటించాడు. ఇద్దరికీ పెద్ద యుద్ధమే జరిగింది. కార్తవీర్యార్జుని బలపరాక్రమాలేవీ పరశురాముని ముందు పని చెయ్యలేదు.*


*విష్ణ్వంశతో జన్మించిన పరశురాముడు, తన పరశువుతో కార్తవీర్యార్జుని వేయి చేతులూ ఖండించాడు. అతని శిరస్సును కూడా తుంచి వేశాడు.*


*కామధేనువును చేజిక్కించుకుని, తీసుకుని వచ్చి, తండ్రికి సమర్పించాడు.  రాజుని చంపడం మహాపాపం అని జమదగ్ని చెబితే, ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకు ఓ సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేశాడు పరశురాముడు.*


*రేణుక ఒకనాడు నీరు తెచ్చేందుకు గంగానదికి వెళ్ళింది. అక్కడ ఆమెకు చిత్రరథుడు అనే గంధర్వుడు కనిపించాడు. అతను, అప్సరసలతో జలక్రీడలాడడం చూడముచ్చటనిపించి, చూస్తూ ఉండిపోయింది రేణుక. కాస్సేపటికి నీరు తీసుకుని ఆశ్రమానికి చేరుకుంది. ఆలస్యంగా ఆశ్రమానికి చేరిన రేణుకను గమనించి, కోపించాడు భర్త జమదగ్ని.*


*ఆమెను చంపమని కుమారులను ఆజ్ఞాపించాడు. తల్లిని చంపడం పాపమని, తమ వల్ల కాదని కుమారులంతా వెనుకడుగువేశారు. పరశురాముడు మాత్రం తండ్రి ఆజ్ఞను పాటించాడు. తల్లిని వధించాడు. తన ఆజ్ఞను పాటించి, తల్లిని వధించినందుకు పరశురాముణ్ణి మెచ్చుకున్నాడు జమదగ్ని.*


*వరం కోరుకోమన్నాడు. తల్లిని బ్రతికించమని కోరాడు పరశురాముడు. పరశురాముని కోరిక మేరకు రేణుక బ్రతికింది. జమదగ్ని ఆమెను పునర్జీవింపజేశాడు. తమ తండ్రి కార్తవీర్యార్జుని చంపినందుకు అతని కొడుకులు హైహయులు, పరశురాముని మీద కసి తీర్చుకునేందుకు సమయం కోసం వేచి చూశారు. సమయం చిక్కింది.*


*ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో లేని వేళ, తపస్సు చేసుకుంటున్న అతని తండ్రి జమదగ్ని తల నరికి వెళ్ళిపోయారు హైహయులు. పతివియోగాన్ని తట్టుకోలేకపోయింది రేణుక. కంటికీ మంటికీ ఏకధారగా ఏడ్చింది. అప్పుడు అక్కడకి వచ్చాడు పరశురాముడు. తండ్రిని తెగ నరికిన హైహయుల గురించి తెలుసుకుని, ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ క్షణమే క్షత్రియుడు అన్నవాడే లోకంలో ఉండకుండా చేస్తానని శపథం పట్టాడు.*


*మహిష్మతీపురంపై విరుచుకు పడ్డాడు. హైహయులందరినీ వధించాడు. ఆ పట్టణాన్ని భస్మీపటలం చేశాడు. అక్కడితో ఊరుకోలేదు. క్షత్రియుల మీద పగబట్టి ఇరవై ఒక్కసార్లు భూమి మీద నలువైపులా ఉన్న రాజయినవారినల్లా అంతమొందించాడు.*


*పరశురాముడి నుంచి తప్పించుకునేందుకు కొందరు రాజులు గాజులు తొడిగించుకుని, స్త్రీల మధ్య దాగున్నారు. మరికొందరు పశువులమందలో కలసిపోయారు.*


*అలా ప్రాణాన్ని కాపాడుకున్న వారిలో దశరథుడు ఒకడు. అతని కొడుకే శ్రీరాముడు. క్షత్రియులను సంహరించి, వారి రక్తాన్ని మడుగులు కట్టించాడు పరశురాముడు. అలా ఏర్పడినదే శమంతక పంచకం. దీని సమీపంలో గల కురుక్షేత్రంలోనే పాండవులకూ కౌరవులకూ యుద్ధం జరిగింది.*


*తండ్రి జమదగ్ని శిరస్సును మొండానికి అమర్చి, గొప్ప యజ్ఞం చేశాడు పరశురాముడు. ఆ యజ్ఞఫలంగా జమదగ్ని బ్రతికాడు. సప్తర్షుల్లో ఒకడై ఆకాశంలో విరాజిల్లసాగాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

లక్కకు పుట్టిల్లు

  

లక్కకు పుట్టిల్లు భారతభూమి. లక్కను మహాభారతంలో చెప్పబడిన, పాండవులు వసించుటకై కౌరవులు నిర్మించిన లాక్షా గృహము ను బట్టి లక్కయొక్క పురాతనత మనకు తెలుస్తుంది. సంస్కృత శబ్దమైన లక్ష నుండి ఉత్పత్తి అయింది లక్క అనే పదం. లక్షలకొలదీ లక్క పురుగులచే స్వేదించబడిన మూలమునకో లేక, అధర్వణ వేదం లో, లక్కను పండించు మోదుగ చెట్టు లక్షతరువు గా నెన్నబడిన కారణం చేతనో లక్కయను పదం వాడుకలోనికి వచ్చింది

కాళిదాసు కాలం లో ఉన్న జన బాహుళ్య భాష ప్రాకృతం. ప్రాకృతన్ని సంస్కరిస్తే సంస్కృతం అయింది 


అసలు ప్రాకృతం అంటే అదే భాష?

ఈ విషయంలో ఒక శ్లోకం ఉంది.


షడ్విధేయం ప్రాకృతిశ్చ శూరసేనీచ మాగధీ

పైశాచీ చూళికా పైశాచ్యపభ్రంశ ఇతిక్రమాత్


అని. అంటే ప్రాకృతం అనేది ఆరు రకాలుగా ఉంది. ఈ భాషలు


ప్రాకృతం

శూరసేని

మాగథి

పైశాచి

చూళిక

అపభ్రంశ పైశాచి 


అనేవి. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ప్రాకృతం అంటే అప్పటికి వ్యవహారంలో ఉన్న వాడుక భాష. దీనికి మరొక ఐదురకాల మాండలికాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఆరు విధాలుగా వ్యావహరిక భాష ఉండేది. కాని ఇలా సంస్కృతంలో అదనంగా కొన్ని అచ్చులూ హల్లులూ‌ చేరాయని చెప్పటం‌ బదులుగా, ఈ బాలవ్యాకరణం సూత్రక్రమాన్ని అనుసరించి ప్రాకృతంలో కొన్ని తగ్గాయి అని చెప్పుకోవటం.


ఈ ప్రాకృతాన్ని సంస్కరించటం ద్వారా ఒక సమగ్రభాషాస్వరూపం ఏర్పడింది. అలా ఏర్పడిన భాషకే సంస్కృతం (సంస్కరించబడినది) అని పేరు.


ప్రాకృత భాషలోనూ కవిత్వం ఉంది. అది మర్చిపోకూడదు.

అలాగే గుణాఢ్యుడు అనే మహాకవి బృహత్కథ అనే గొప్ప గ్రంథాన్ని ప్రాకృతంలోనీ పైశాచీ మాండలికంలో వ్రాసాడు.


ఈ సూత్రానికి వివరణ వ్రాస్తూ సూరిగారు ఇలా అన్నారు.

కొందఱ మతంబున హ్రస్వ వక్రంబులును బ్రాకృతమునందుఁ గలవు. 

కొందఱ మతంబున వక్రతమంబులుం గలవు.

ఎ ఏ ఒ ఓ లు వక్రములని, ఐ ఔ లు వక్రతమంబులని, ప్రాచీనులు వ్యవహరింతురు.


( హ్రస్వవక్రములు అంటే వక్రములలోని ఎ ఒ లు. )


ప్రాకృతంలో కనిపిస్తున్న ఎక్కో, కైతవం, కైఱవం వంటి కొన్ని మాటల ఆధారంగా ఇలాంటి వాదనలు ఉన్నాయి.


ఈ హ్రస్వవక్రములు, వక్రములు వక్రతమములు అనే మాటలను నన్నయాదులు వాడారు. ఈ సంజ్ఞలు ఆంధ్రశబ్ద చింతామణిలో కనిపిస్తున్నాయి. ఈ ఆంధ్రశబ్ద చింతామణి అన్నది సంస్కృతంలో వ్రాయబడిన తెలుగు వ్యాకరణం. దీనిని విరచించింది నన్నమభట్టు గారు. ఈ ఆంధ్ర శబ్ద చింతామణికి నన్నయభట్టీయము అనీ, శబ్దాను శాసనము అనీ, వాగనుశాసనీయము అనీ కూడా వ్యవహార నామాలున్నాయి. నన్నయగారికి వాగనుశాసనుడనీ, శబ్దశాసనుడనీ బిరుదులున్నాయి కాదా, అవి ఈ వ్యాకరణం వ్రాయటం వలన వచ్చి ఉండవచ్చును. లేదా ఆయనకు ఉన్న బిరుదుల కారణంగా ఆంధ్రశబ్ద చింతామణికే ఆ బిరుదులూ వ్యవహార నామాలు కావచ్చును. మనకి స్పష్టంగా తెలియదు.


ఈ ఆంధ్రశబ్ద చింతామణిలో 270దాకా శ్లోకాలున్నాయి. వివరాలు అప్రస్తుతం కాని ఒక్క మాట. అతిప్రసిధ్దమైన నానుడి


విశ్వ శ్రేయః కావ్యమ్‌


అన్న మాట ఉందే అది ఆంధ్రశబ్ద చింతామణిలోనిదే. అది ఆ గ్రంథంలో మొదటి సూత్రం! విశ్వానికి శ్రేయస్సు కూర్చేదే కావ్యం అని దీని భావం. ఎంత ఉదాత్త భావన!


అంతే కాదు మరిక అందమైన అందరికీ, ముఖ్యంగా నేటి తరాల తెలుగువారికి బాగా నచ్చే ముక్కనూ ఆ నన్నయ్యగారి ఆంద్రశబ్ద చింతామణి గ్రంథమే మొట్టమొదటగా ప్రకటించింది.

హిందీ భాష ఒక ప్రకృతభాష 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కాళిదాసు 🙏 రెండవ భాగం

 🙏కాళిదాసు 🙏

                రెండవ భాగం 

కాళిదాసు భారతీయ కవితకి ఆత్మ వంటివాడు. కవిత ఏ రూపాన్నైనా పొంది ఉండవచ్చు. కావ్యం కావచ్చు నాటకం కావచ్చు.కవితాత్మ పాలు కొంతైనా దానిలో ఉంటుంది. ఇలా కాళిదాసప్రభావం తరువాత తరాల కవుల్లో ఉంటూనే వచ్చింది. కాళిదాసు భారతసంతతికి కేవలం కవిత్వాన్నే ఇవ్వలేదు. ఇంకా కొన్ని మౌలిమైన, మేధాపరమైన, సాంస్కృతిక పరమైన ఉపాధుల్ని సమకూర్చాడు. అవేమిటి? కాళిదాసు కవికులగురువు ఎందుకయ్యాడు? 


కవితాత్మలో కొన్ని భాగాల్ని కాళిదాసు ఎలా పండించి పోషించాడు? ఏ విధంగా అతడు మనకి అధ్యాపకుడు? అన్నది స్థూలంగా చర్చించడమే మిగిలిన వ్యాసం యొక్క ముఖ్యోద్దేశ్యం. కాళిదాసు కవిత్వంలో రసజ్ఞత గురించి వేరే చెప్పక్కర్లేదు. అది అన్నివేళలా తొణికిసలాడుతూనే ఉంటుంది. ఇక మిగిలిన విషయాలకొస్తే, ఇంత చిన్న వ్యాసంలో అన్నీ కూలంకషంగా చర్చించడం సాధ్యం కాదు కాబట్టి, కొన్నింటిని కాస్త విశదంగా, కొన్నింటిని స్థాలీపులాకంగా, కొన్నింటి గురించి సూక్ష్మం గానూ చెప్పి ముగిస్తాను.


1. భాష

భాషని నాదయోగంగా భావించినవాడు కాళిదాసు. పలికే మాట (శబ్దం), దానికున్న అర్ధం, వీటి మధ్యనున్న విడదీయరాని అర్థనాదేశ్వరబంధం అర్ధనారీశ్వరబంధంలాంటిదని పూర్తిగా తెలిసినవాడు. కాబట్టే రఘువంశాన్ని,


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ  


అని మొదలు పెట్టాడు. పైగా వాగర్థప్రతిపత్తి (శబ్దం, అర్థం రెండింటికీ సంబధించిన జ్ఞానం అబ్బడం) కోసమే జగత్తుకి తల్లిదండ్రులైన (పితరౌ) పార్వతిని, పరమేశ్వరుణ్ణీ ప్రార్థిస్తున్నానన్నాడు. పార్వతీపరమేశ్వరౌ = పార్వతీప + రమేశ్వరౌ అని విడదీస్తే శివుడు, విష్ణువు అనే అర్థం వస్తుంది. సంస్కృతభాషలో పితరౌ అంటే ఇద్దరు తండ్రులు అని కూడా అర్థం ఉంది. అందువల్ల ప్రపంచానికి తండ్రులైన శివవిష్ణువులను కూడా ప్రార్థిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. మొదటి శ్లోకంలోనే, వాగర్థప్రతిపత్తికోసం ప్రార్థిస్తున్నా (వందే) అనగానే అది పుష్కలంగా దొరికేసినట్టుంది, వెంటనే పార్వతీపరమేశ్వరౌ అనే గొప్ప శ్లేష చూపాడు.


రమ్యమైన పదాల్తో పూలజల్లులు కురిపించడం, కోమలమైన పదబంధాల్తో కట్టిపారెయ్యడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. సంస్కృతభాషతో పరిచయం తక్కువ ఉన్న (లేదా అసలు లేని) వాళ్ళకి కూడా హృద్యంగా తోచే విధంగా కూడా వ్రాశాడు. కేవలం పదనాదం ద్వారా రమ్యతను సృష్టించాడు. ఋతుసంహార కావ్యంలో కాళిదాసు ఆరు ఋతువుల్నీ ఆరు సర్గల్లో వర్ణించాడు. మచ్చుకి ఋతుసంహారం లోని మూడు శ్లోకాలు చూడండి.


సదా మనోఙ్ఞం స్వనదుత్సవోత్సుకం వికీర్ణ విస్తీర్ణ కలాపి శోభితం

ససంభ్రమాలింగనచుంబనాకులం ప్రవృత్తనృత్యం కులమద్యబర్హిణామ్ – (వర్ష ఋతువు)


(ఎప్పుడూ మనోజ్ఞంగా, శబ్దాలతో కూడిన మహోత్సవంలో తేలియాడుతూ, విస్తరించి విసరబడిన పింఛంతో శోభిస్తూ ఉన్న నెమళ్ళ గుంపులు ఇప్పుడు ముప్పిరిగొన్న ఆనందంలో ఒకదాన్నొకటి కౌగిలించుకుంటూ, ముద్దులాడుకుంటూ నాట్యం చెయ్యడం మొదలుపెట్టాయి. పైన చెప్పిన శబ్దాలు నెమళ్ళ కేకలు కావచ్చు లేదా మేఘాల గర్జనలు కావచ్చు.)


నితాంత లాక్షారసరాగరంజితైః నితంబినీనాం చరణైః సనూపురైః

పదే పదే హంసరుతానుకారిభిః జనస్య చిత్తం క్రియతే సమన్మథమ్ – (గ్రీష్మ ఋతువు)


(దట్టంగా పూసిన లాక్షారసం రంగు వల్ల ఎర్రబడి, అందెలతో కూడిన స్త్రీల పాదాలు అవి వేసే ప్రతీ అడుగులోనూ హంసల ధ్వనులను అనుకరిస్తున్నట్టుగా ఉన్నాయి. అది విన్న జనులందరి మనస్సులూ మన్మథప్రభావాన్ని పొందుతున్నాయి.)


ఆమ్రీ మంజులమంజరీ వరశరః సత్కింశుకం యద్ధనుః

జ్యా యస్యాలికులం కలంకరహితం ఛత్రం సితాంశుః సితం

మత్తేభో మలయానిలః పరభృతా యద్ద్వందినో లోకజిత్

సోఽయం వో వితరీతరీతు వితనుర్భద్రం వసంతాన్వితః – (వసంత ఋతువు)


(ఎవడి గొప్ప బాణాలు అందమైన ఆకర్షణీయమైన మామిడిపూల గుత్తులో, ఎవడి విల్లు మోదుగపువ్వో, ఎవడి వింటినారి తుమ్మెదల బారో, ఎవడి మచ్చలేని తెల్లని గొడుగు తెల్లని కిరణాల్తో కూడిన చందమామో, ఎవడి మదపుటేనుగు గంధపుచెట్లున్న మలయపర్వతపు వాయువో, ఎవడి వంది జనం (స్తోత్రపాఠాలు చేసేవాళ్ళు) కోకిలలో, అటువంటి లోకాల్ని జయించే మన్మథుడు, తన స్నేహితుడైన వసంతుడితో కలిసివచ్చి (అంటే వసంతకాలంలో) మీ అందరిమీదా సుఖభాగ్యాల్ని వెదజల్లుగాక! )


ఋతుసంహారం కాళిదాసు తొలిరోజుల్లో వ్రాసినది. రాను రాను, పదలాలిత్యానికి గాఢమైన భావాల్ని కూడా జోడించి తన భాషకీ, పదనాదానికీ కొత్త రంగులు దిద్దాడు. తరువాత వ్రాసిన రఘువంశ, కుమారసంభవ, మేఘదూత కావ్యాల్లో ఇది బాగా కనిపిస్తుంది. ఆ కావ్యాలు చదివి ఆనందించాలంటే సంస్కృతభాష నేర్చుకోవాలి. శ్రీమద్రామాయణం చదవాలంటే కొద్దిగా భాష తెలిస్తే చాలు. ఒక విధంగా చెప్పాలంటే, ఏ భాషవాళ్ళకి, ఆ భాషలో వాల్మీకి మహర్షి వ్రాసిన పాటలా ఉంటుంది. శ్లోకంలో ఉన్న పదాల్ని గద్యక్రమంలో (కర్త-కర్మ-క్రియ వరసలో) పేర్చుకుని అర్థం చేసుకోవడం చాలా సులువు. కాళిదాసు కావ్యాలకొస్తే, ఋతుసంహారంలో తప్ప మిగిలిన కావ్యాల్లో శ్లోకాల్ని గద్యక్రమంలో పేర్చుకోవడం, కొన్ని పదబంధాలకి అర్థాన్ని తెలుసుకోవడం అంత సులువు కాదు. భాషను ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి. ఆ పరిణామాన్ని పై మూడు శ్లోకాల్లోనే చూడవచ్చు. వీటిలో మూడవ శ్లోకం ఋతుసంహారంలో ఆఖరి సర్గ అయిన వసంతర్తువులో ఆఖరి శ్లోకం.


ఇలా భాషను నేర్వగా, నేర్వగా ఈ క్రింద చెప్పిన లాంటి శ్లోకాల్లో, గీతరచయిత వేటూరి చెప్పినట్టుగా ‘ఆరు ఋతువులూ ఆహార్యములై’ కనిపిస్తూంటే, భావాల విందు, నాదాల పసందు రెండింటినీ అనుభవిస్తాం.


అది కుబేరుడి అలకానగరం అవడం వల్ల అన్ని ఋతువులూ అన్ని వేళలా ఉంటాయి. అందువల్ల అక్కడి వనితలు అన్ని ఋతువుల పువ్వుల్నీ అన్ని వేళలా దేహమంతా ధరిస్తారని మేఘుడికి (మబ్బుకి) యక్షుడు చెప్తున్నాడు.


హస్తే లీలాకమల మలకే బాలకుందానువిద్ధం

నీతా లోధ్రప్రసవరజసా పాండుతామాననే శ్రీః

చూడాపాశే నవకురువకం చారు కర్ణే శిరీషం

సీమంతే చ త్వదుపగమజం యత్ర నీపం వధూనామ్ – (మేఘసందేశః 2-2)

ఇక్కడ భావం కంటే ప్రతి పదార్థం తెలుసుకోవడం బాగుంటుంది.

[యత్ర= ఏ (అనగా ఆ కుబేరుని అలకానగరంలో); వధూనామ్ = స్త్రీల యొక్క; హస్తే = చేతిలో; లీలా కమలమ్ = విలాసం కోసం పట్టుకున్న తామరపువ్వు (ఇది శరదృతువులో లభిస్తుంది); అలకే = ముంగురుల్లో; బాలకుందానువిద్ధమ్ = తురుముకోబడ్డ అప్పుడే విరిసిన మల్లెలు (ఇది హేమంత ఋతువులో లభిస్తుంది); ఆననే = ముఖం మీద; లోధ్రప్రసవరజసా = లొద్దుగ పువ్వుల పుప్పొడిచేత నీతా= ఇవ్వబడిన; పాండుతామ్ శ్రీః= గౌరవర్ణపు శోభ (లొద్దుగ శిశిర ఋతువులో లభిస్తుంది); చూడాపాశే = కొప్పు ముడిలో; నవకురువకం = ఎర్ర గోరింట పువ్వు (ఇది వసంత ఋతువులో లభిస్తుంది); కర్ణే = చెవియందు; చారు శిరీషం = అందమైన దిరిసెన పువ్వు (ఇది గ్రీష్మ ఋతువులో లభిస్తుంది); సీమంతే = పాపటలో; త్వత్ =నీ; ఉపగమజం = రాక వల్ల పుట్టిన (వర్షాకాలం లో లభించే); నీపం చ = నీపకుసుమమూ ఉంటాయి


ఈ విధమైన భాషావికాసమే కాళిదాసుని కవికులగురువుగా మాత్రమే కాదు, సంస్కృతగురువుగా కూడా నిలబెట్టింది. సంస్కృతం నేర్చుకోవడంలో మొదటి భాగం పంచకావ్యాలు గురువు దగ్గర కూర్చుని చదివి అర్థం చేసుకోవడం. పంచకావ్యాలంటే రఘువంశం (కాళిదాసు), కుమారసంభవం (కాళిదాసు), కిరాతార్జునీయం (భారవి), శిశుపాలవధం (మాఘుడు), నైషధీయ చరితం (శ్రీహర్షుడు). దాక్షిణాత్యులు కొందరు నైషధీయ చరితం బదులు మేఘసందేశం (కాళిదాసు) అని అంటారు. ఏ లెక్కన చూసినా, అధ్యయనం విషయానికొస్తే, కాళిదాస గ్రంథాలకే పెద్దపీట. భాష నేర్వాలన్నా, భాషాసౌందర్యాన్ని అనుభవించాలన్నా కాళిదాసే.


ఆ కావ్యాల్ని చదవడం కూడా పైన చెప్పిన వరస లోనే చదవాలి. అప్పుడే భాషని సవ్యంగా నేర్చుకోగలుగుతాం. రఘువంశంలో భాష సరళంగా ప్రారంభమై, ఒక కావ్యాన్నుండి మరో కావ్యానికి వెడుతూంటే సంక్లిష్టంగా మారుతూ విద్యార్థుల మెదడుకి పరీక్షలు పెడుతుంది. అందుకే, నైషధం విద్వదౌషధం అనే సామెత. ఈ పాఠ్యప్రణాళికలో, కాళిదాసు విద్యార్ధులకిచ్చిన గొప్ప బహుమతి రఘువంశం నుంచీ కూడా కవితాసువాసనల్ని వెదజల్లడం. ఒకప్రక్క భాషని నేర్చుకుంటూండగానే, అద్భుతమైన భావసంపదలో చదువుకునే వాళ్ళని ముంచి తేల్చడం. భాషావిషయమైన అంతరార్ధాల్ని తెలియజెప్పడం. (రఘువంశం మొదటి శ్లోకంలోనే చూడండి. పదానికీ, దానికుండే అర్థానికీ గల సంబంధంతో మొదలు పెట్టాడు కావ్యాన్ని.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - చతుర్థి - రేవతి -‌‌ ఇందు వాసరే* (03.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కల్పవృక్షం..🌳 #మునగ…🌿

 సేకరణ 👇


`

#కల్పవృక్షం..🌳 #మునగ…🌿


మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్‌ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం.

 

భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు.


 

ఆనోటా ఈనోటా ఇది మనవరకూ వచ్చింది. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాద’న్నట్లు నిన్నమొన్నటివరకూ మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. తలపైకెత్తి దానివైపే చూడలేదు- సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప. కానీ అమెరికాకి చెందిన ‘ద ట్రీస్‌ ఫర్‌ లైఫ్‌’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలుగా చెప్పడం ప్రారంభించాయి.


ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దాంతో మన దృష్టీ అటు మళ్లింది. న్యూట్రిషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ సి.గోపాలన్‌, డాక్టర్‌ కమలా కృష్ణస్వామిలు మునగాకు లోగుట్టుని విప్పారు. వారికి ఆయుర్వేద వైద్యులూ తోడయ్యారు. అంతా కలిసి మరీ ‘మునగ’ మహత్యాన్ని కొనియాడుతున్నారు.


ఏముంది మునగాకులో..?

 

‘బతికుంటే బలుసాకు తినొచ్చు’... ఓ పాత నానుడి. ఆ బలుసాకు ఏమోగానీ, ‘రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే...

 

వంద గ్రా. తాజా మునగాకుల్లో... నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్‌, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్‌, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్‌- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి.


అంటే ఇరవై గ్రా.మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ,సి-విటమిన్లూ, వంద గ్రా.ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్‌, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి.

 

అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు. 

ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్‌ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి, ఆ కాయల్ని రోజూ తినేవాడట. ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు... మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ...పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి, పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్‌ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. కానీ ఆకుని తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే.

 

నిజానికి ప్రాచీన కాలం నుంచీ ఆఫ్రికా దేశాల్లోనూ భారత్‌లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై, మళ్లీ తెరమీదకొచ్చింది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘ద నెక్స్ట్‌ క్వినోవా’గా అభివర్ణించింది. దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలూ సలాడ్ల మీద చల్లుకోవడం, టీ, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. 

ఎందుకంటే... 


100 గ్రా. ఎండిన ఆకుల్లో... పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్‌-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్‌... ఇలా చాలా లభిస్తాయి. 

మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలం. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగ పెంచేవారు కాదు. కాలం మారింది. పట్టింపూ పోయింది. దాంతో కాయలకోసం చాలామందే పెంచుతున్నారు. కాబట్టి ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్‌ వెరైటీలూ కోఫ్తాలూ... అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో... ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ. కాబట్టి కుక్కర్‌లో ఉడికించాలన్నది నిపుణుల సలహా.


ఔషధగుణాలెన్నో... 

మరే చెట్టు ఆకులకీ లేనంత మహత్తు మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగనిరోధకశక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లూ అనేకానేక బయోయాక్టివ్‌ పదార్థాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిమీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్‌ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దరి చేరడానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్‌.

 

అంతేనా... రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈరోజుల్లో పసివయసు దాటకుండానే కంటిజబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్‌ నివారిస్తుందని ఇంటర్నేషనల్‌ ఐ ఫౌండేషన్‌ అంటోంది.

 

ఇంటాబయటా అంతటా ధూళిమేఘాలే... కాలుష్యకాసారాలే. మరి ఆస్తమా, బ్రాంకైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తీసుకుంటే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, ఆ వ్యాధులన్నీ పారిపోతాయి. 

రజస్వలానంతరం అమ్మాయిలకి ఎన్ని కష్టాలో... కొందరిలో నెలసరి సమయంలో గడ్డలు పడుతుంటాయి. అప్పుడు ఆకులతో చేసిన సూపుని 21 రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే సరి. మునగాకు రసం తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది. పాలుపడని బాలింతలకి కాసిని నీళ్లలో ఉప్పు, మునగాకులు వేసి కాసేపాగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది. పొడి రూపంలో ఇచ్చినా పాలు పుష్కలమే. 

డయేరియా, కామెర్లూ, కలరా బాధితుల బాధ కాదు. ఒకటే దాహం. నీరసం. అప్పుడు రోజుకి రెండుమూడుసార్లు గ్లాసు కొబ్బరినీళ్లలో టీస్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకీ మునగ బెస్ట్‌ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్‌ రసంలో కలిపి పదిగంటలకోసారి తీసుకుంటే హానికర బాక్టీరియా, వైరస్‌లన్నీ తొలగిపోతాయి.

 

ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలమచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మవ్యాధులు, ఆందోళనలకి 

మునగాకు టీ రుచికరమైన పరిష్కారం.


వహ్వా... మునక్కాడ! 

సీజన్‌లో చిటారుకొమ్మ వరకూ చిగురు కనబడకుండా కాసిన కాయలు చూసేవాళ్లకి కన్నులపండగ అయితే, ఆ కాయల రుచి తెలిసినవాళ్లకి విందుభోజనమే. దక్షిణాదిన సాంబారు, పులుసు, అవియల్‌ వంటల్లో మునక్కాడ కనిపించాల్సిందే. ఇక, బియ్యప్పిండి, బెల్లం లేదా అల్లంవెల్లుల్లి వేసి వండే మునగగుజ్జు కూర ఎవరికైనా నోరూరాల్సిందే. మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహారుచి. మటన్‌లో మునక్కాడ పడితే నాన్‌వెజ్‌ ప్రియులకి పండగే. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఎక్కువే. 

‘ఈ ఒక్క మునక్కాడ తినవూ బోలెడు బలం’ అంటూ బామ్మలు బతిమిలాడి తినిపించడం చాలామందికి అనుభవమే. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నిజమే. మునక్కాడల్లోని యాంటీబయోటిక్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే; కాల్షియం, ఐరన్‌లు ఎముకబలాన్నీ బరువునీ పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్నీ తగ్గిస్తాయి. పిత్తాశయం యమా జోష్‌గా పనిచేస్తుంది.

 

శస్త్రచికిత్సానంతరం మునగాకునీ, మునక్కాడలనీ తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం తెలిసిందే. దానిక్కారణం మరేంటో కాదు, మునక్కాడల్లోని ఐరన్‌వల్ల హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుందట. మునక్కాడల్ని మరిగించిన నీళ్లతో ఆవిరిపట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలూ తగ్గుతాయి. వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట.

 

‘తరచూ జలుబు చేస్తోందా... జ్వరమొస్తోందా... అయితే రోజూ మునక్కాడలు తినండొహో’ అంటూ చాటింపు వేస్తున్నారు ఆధునిక వైద్యులు. వాటిల్లోని విటమిన్‌-సి జలుబూ ఫ్లూ జ్వరాలకి ట్యాబ్లెట్‌లా పనిచేస్తుందట. వీటిని ఎక్కువగా తినేవాళ్లకి పొట్టలో నులిపురుగుల బాధ ఉండదు. ఈ ముక్కలను ఉడికించిన సూప్‌ డయేరియాకి చక్కని నివారణోపాయం. కీళ్లనొప్పులయితే పరారే. కాలేయం, ప్లీహ సంబంధిత వ్యాధులన్నీ హాయ్‌ చెప్పడానికే సందేహిస్తాయి. 

‘ఏమోయ్‌... ఇంకా పిల్లల్లేరా... అమ్మాయిని మునక్కాయ కూర వండమనోయ్‌...’ అని ఏ పెద్దాయనో అంటే సరదాగా తీసుకోవద్దు. వీటిల్లోని జింక్‌ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది. వీర్యం చిక్కబడుతుంది.


 

నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పైరిడాక్సిన్‌ వంటి బి-కాంప్లెక్స్‌ విటమిన్లు మునక్కాడల్లోనూ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండిపదార్థాలూ ప్రొటీన్లూ 

జీర్ణమయ్యేలా చేస్తాయి.

 

ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినేవాళ్లలో రోగనిరోధకశక్తి ఎక్కువ. శ్వాససంబంధ సమస్యలు తక్కువ. వీటిల్లోని ప్రొటీన్లూ పీచూ కారణంగా పోషకాహార లోపమూ ఉండదు. నాడీవ్యవస్థా భేషుగ్గా పనిచేస్తుంది.


పూలు... తేనెలూరు..! 

పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులూ కాయలే కాదు, సువాసనభరితమైన తెల్లని పూలూ ఔషధ నిల్వలే. ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే. పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్రవ్యాధుల నివారణకూ దోహదపడుతుంది. ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను సెనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు, కూరలూ చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి, తేనె ఉత్పత్తికీ తోడ్పడతాయి.


విత్తనంతో నీటిశుద్ధి..! 

విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా... ఫరవాలేదు, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. విటమిన్‌-సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లీల్లా తినొచ్చు. నూనె తీయొచ్చు. దీన్ని వంటనూనెగానూ సౌందర్యసాధనంగానూ ల్యూబ్రికెంట్‌గానూ వాడుతుంటారు. 

రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటిశుద్ధి పరికరాలు. కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సూడాన్‌, ఇండొనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి, ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి, వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను బిందెలోని నీళ్లలో కలిపి, ఓ ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరవాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా చేస్తుంది.ఇంకా... ఇంకా...! 

మునగాకు మనుషులకే కాదు, పశువులకీ బలవర్థకమైనదే. పశువుల మేతగానూ పంటలకు ఎరువుగానూ వాడతారు. చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు. ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చక్కగా సరిపోతుంది. ఈ మొక్కల్ని కంచె చుట్టూ పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్నా మునగ పంటలో మనదేశమే ఫస్ట్‌. ఏటా 13 లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం. రాష్ట్రాలకొస్తే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మునగ ఉత్పత్తుల విలువ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.27వేల కోట్లు. వాటిల్లో 80 శాతం మనవే. కాయలతోబాటు పొడినీ 

ఎగుమతి చేస్తున్నాం. కాయల్ని శీతలీకరించి చక్కెరపాకంలో వేసి ఎగుమతి చేస్తారు. 

మునగలో రకాలనేకం. కుండీల్లో కాసే హైబ్రిడ్‌ రకాలూ ఉన్నాయి. జాఫ్నా రకం కాయలు 60 నుంచి 120 సెం.మీ. వరకూ కాస్తే, ఆరునెలలకే పూతొచ్చి, కాయలు కాసే కెఎం-1, పీకేఎం-1, పీకెఎం-2, పీఏవీఎం రకాలూ వస్తున్నాయి. నేలతీరు, వాతావరణాన్ని బట్టి ఆయా రకాలని ఎంపికచేసుకుని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం లక్ష రూపాయల లాభాన్ని పొందుతున్నారు రైతులు. వ్యవసాయపరంగానే కాదు, 

ఇంటి అవసరాలకోసం పెరట్లోనో లేదంటే కుండీల్లోనో మునగను పెంచితే, రోజూ ఓ గుప్పెడు తాజా ఆకుల్ని కూరల్లో వేస్తే మీ ఆహారంలో సూపర్‌ఫుడ్‌ చేరినట్లే, మీకు డాక్టరుతో పనిలేనట్లే..!