8, జనవరి 2023, ఆదివారం

ఎప్పుడూ విజేతే*

 *ఒక మంచి నీతి కథ*🙏   

🙏 *ధర్మో రక్షతి రక్షితః*🙏

     *మనకు ఎన్ని కష్టాలు... నష్టాలు... బాధలు వచ్చిన....మన నిజాయితీ.. మన ధర్మం తప్పకూడదు....ధర్మం మనల్ని....ఎప్పుడు..రక్షిస్తుంది....చెప్పే కథ ఇది*------------------ *యజ్ఞం జరుగుతోంది.

యజమానికి👶🏻 యజ్ఞకుండంలో🔥 బంగారం🏵 ముద్ద దొరికింది.

ఆయన ఆశ్చర్యపోయాడు 🤔. 

అప్పుడు భార్య🙅🏻 చెప్పింది. *"నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో 🔥 తాంబూలాన్ని 🍃ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద🏵 అయింది."*


         ఇంటి యజమాని👶🏻 పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో 🔥తాంబూలాన్ని🍃 ఉమ్మేశాడు.

మరుసటి రోజు మరో బంగారు ముద్ద 🏵దొరికింది.


          ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా👶🏻👶🏻👶🏻 యజ్ఞ కుండంలో 🔥ఊసేశారు🗣. బంగారు ముద్దలు 🏵🏵🏵పొందారు. ఒక్క *అర్క సోమయాజి*తప్ప. 


*"యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు"* అన్నాడాయన.


              ఊరు ఊరంతా🏘🏘🏘 ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.

*ఆయన భార్యకు ఇది నచ్చలేదు.* "మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం" అని నచ్చచెప్పింది.

అర్కసోమయాజి ససేమిరా అన్నాడు. 

చివరికి ఆమె కోపంతో *పుట్టింటికి పయనమైంది*.

ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు. 


        *ఊరి పొలిమేర🌾 దాటాడో లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు🏘 కాలిపోతున్నై. మనుషులు👥 చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు🏘 ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.

అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.* 


         అప్పుడే కలిపురుషుడు☝🏻 వారికి ఎదురు వచ్చాడు.

*"ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను."* అన్నాడు కలిపురుషుడు.


... *ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే*👏🏻👏🏻👏🏻


☘🙏 *ధర్మో రక్షతి రక్షితః*

2023 calendar













 





 

Calendar 2023


 

కామరూపిణి


 

MODI

🙏

*MODI*   *MODI*  *MODI*  

Everyone *MODI*
Everywhere *MODI*

 I Am A 

*M* ember
*O* f
*D* eveloping 
*I* ndia

Because It's A Question Of

*M* y
*O* wn
*D* estiny's 
*I* nterest

That's Why I Am With *MODI*
Who Is A

*M* an
*O* f
*D* ivine
*I* ntentions

He Is Also Blessed With The Abilities Known As

*M* aster
*O* f
*D* istinguished 
*I*  nstitutions

And Almighty Enables Him To

*M* ake
*O* dd
*D* ecisions 
*I*  ndependently

That's Why

*M* anifestation 
*O* f
*D* reams 
*I* ntelligently

Taking Place All Over 

So Come And Join *Camp MODI* And Render a *HELPING HAND* in 

*M* ultiplication 
*O* f
*D* ecency 
*I* nstantly

So That *Modi Ji Comes With The Thumping Majority* And We Help Establishing Again

*M* odel
*O* f
*D* iscipline And
*I* ntegrity

On The 

*M* ap
*O* f
*D* emocratic 
*I* ndia

Because *MODI JI* Is The One 
Who Can Bring Justice And Smile On The Faces Of

*M* illions
*O* f
*D* ignified 
*I* ndians

And Take India On The Top

Please share wisely and widely,, 🤷‍♂️🙋‍♂️

🌷🎾

పదవవాడు

పదవవాడు 

  పూర్వకాలంలో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాతానికి వెళ్లాలంటే చక్కటి రహదారులుకాని, వాహనాలు కానీ ఉండేవి కావు చాలా కొద్దిమంది ధనవంతులు మాత్రము రాధాలు, బండ్లు కలిగి ఉండేవారు. అటువంటి రోజులల్లో ఒక అరణ్యంలో పదిమంది ప్రయాణికులు వెళుతున్నారట. వారు కొంతదూరం ప్రయాణం చేసినతరువాత వారికి ఒక నది అడ్డంగా వచ్చింది వారిలో ఏ వక్కరికి కూడా ఈతరాదు. అందరు ఆ భగవంతుని మీద భారం వేసి జాగ్రత్తగా నదిని దాటాలని నిర్ణయించుకున్నారు. ఒకరి చేయి ఒకరు పట్టుకొని లోతయిన నదిని దాటారు.  అవతలి తీరం చేరగానే అందరికి ప్రాణం లేచివచ్చినట్లు అయ్యింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే తాము పదిమంది క్షేమంగా చేరామా లేక ఎవరైనా నదిలో మునిగి పోయారా, అని అనుకోని అందులో వారిని అందరిని లెక్కించమని చెప్పారు. అతను లెక్కించి తొమ్మిది మందే వున్నారు అని చెప్పారు. అప్పుడు ఇంకొకడు లెక్కించాడు అతనికి తొమ్మిది మందే వచ్చారు. అట్లా ప్రతి వక్కరు లెక్కించారు.  కానీ పదవవాని జాడ  తెలియలేదు. అప్పుడు అందరు కలిసి తమలో ఒకడు నదిలో మునిగినట్లు నిర్ధారణ చేసుకొని ఏడవటం మొదలు పెట్టారు. 

ఆ సమయంలో నది వడ్డున వెళుతున్న ఒక బాటసారి వారిని చూసి విషయం కనుక్కొని తన ముందు మళ్ళీ లెక్కించమని అన్నాడు అందులో ఒకడు తిరిగి లెక్కించి తొమ్మిదిమందే అని  తెలిచాడు. విషయం తెలుసుకున్న ఆయన ఈ సారి మీరంతా వరుసలో వుండండి నేను లెక్కిస్తాను అని చెప్పి గణిస్తే పదిమంది తేలారు. అప్పుడు వారంతా సంతోషించి తమకు ఒకడు తక్కువ ఎందుకు వస్తున్నాడు అని అడిగారు. నాయనలారా మీలో లెక్కించే వాడు తనను తాను లెక్కించుకోలేదు అందుకే ఒకడు తగ్గాడు అని చెప్పి వారాలకు వివరణ ఇచ్చి పంపించాడు. 

సరిగ్గా ఈ కధలో లానే మనంకూడా పదవ వాడిని తెలుసుకోవటం లేదు.  ఎంతసేపు బయట తొమ్మిది మందిని లెక్కిస్తూ పదవ వానిని లెక్కించకుండా పదవవాడు దొరకటం లేడని బాధపడుతున్నాము. నిజానికి ఆ పదవవాడిని నేనె అనే ఎరుక కలగటమే వేదాంత రహస్యంగా మనకు మన అద్వయిత గురువుగారు శ్రీ ఆదిశంకరా చార్యులవారు వారి అనేక గ్రంధాలద్వారా తెలియ చేశారు. మనం మనలో వున్న భగవంతుని తెలుసుకోక బయట గుడులలో గోపురాలతో వెతుకుతూ అజ్ఞ్యానంములో జీవనాన్ని  సాగిస్తున్నాము. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే క్షేత్రాలు, తీర్ధాలు కేవలం నీకు తాత్కాలిక మానసిక ఆనందాన్ని ఇచ్చే సాధనాలు మాత్రమే నిజానికి శాశ్విత ఆనందం కేవలం నాలోని పదవవాడిని తెలుసుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. ఫై కధలో వడ్డున ఉండి వాళ్ళను లెక్కించిన వాడు ఎవడో కాదు అతనే సత్గురువు ఆయన సాన్నిద్యంలోనే మనకు సాధనకు ఊతం లభిస్తుంది.  శ్రీ ఆది శంకరాచార్యుల వంటి సద్గురువు మనకు లభించటం మనం చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. ఆచార్యుల వారి బాటలో నడుద్దాము మన జన్మ తరిమ్పచేసుకుందాము. 

దయచేసి నేనే సద్గురువును నన్ను కొలవండి, ఆరాధించండి అని ఈ రోజుల్లో అనేకమంది తారసపడుతున్నారు. వారి వెంట వెళ్లి మీ అమూల్య జీవిత కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకోకండి. ముక్తికి మార్గం కేవలం అద్వైతము ఒక్కటె శ్రీ శంకరులను మించిన గురువు దేవులు లేరు.  ప్రతి సాధకుడు ముందుగా శ్రీకృష్ణ భగవానులు మనకు ఇచ్చిన అమూల్య సంపద ఐన శ్రీ భగవత్ గీతను పఠించి అర్ధం చేసుకొని గృహస్థాశ్రమాన్ని చక్కగా నిర్వహించి తరువాత ఆది శంకరుల వేదాన్త గ్రంధాలను పఠించి పాటించిన ముక్తి కలగటం తథ్యం. 

"మోక్షమ్ము ధనముతో రాదు"

ఉపనిషత్తులలో సారాన్ని మొత్తాన్ని జ్ఞ్యానామృతంగా మార్చి మనకు వసంగిన మహాను భావుడు.శ్రీ ఆది శంకరాచార్యుల వారు.  అయన బాటలో నడుద్దాము.   

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ