2, జూన్ 2026, మంగళవారం

బాదరాయణ సంబంధం:

 బాదరాయణ సంబంధం:

 

మనకి "వేలు విడిచిన సంబంధాలు ", "బీరకాయ పీచు సంబంధాలు" లాగానే "బాదరాయణ సంబంధం" ఒకటి ఉంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బాదరాయణ సంబంధం మీద కొన్ని కథలున్నాయి. అందులో ఒకటి ఇదిగో....

 

కోనసీమలో కేశనకుర్రు అనే గ్రామం ఒకటుంది. ఆ గ్రామం లో అమాయక బ్రాహ్మణ కుటుంబం ఒకటి. భార్య, భర్త- ఇద్దరే కుటుంబ సభ్యులు. మరీ సంపన్నులు కాక పోయినా కాస్త సంపన్నులే! దేనికీ లోటు లేదు. అతిథి మర్యాదలు సాదరంగా చేస్తారని ఆ పరిసర ప్రాంతాల వారందరికీ తెలుసు. యజమాని పేరు కామయ్య. 


 

ఓరోజు కామయ్య గారి ఇంటి ముందు ఓ గుర్రబ్బండీ ఆగింది. నిగనిగలాడుతూ జరీ పంచె, కండువాతో ఉన్న ఓ పెద్ద మనిషి దిగేడు. బండి తోలే మనిషి పెట్టె తెచ్చి హాల్లో పెట్టేడు. వెనుకనే హుందాగా నడచి వచ్చాడీ పెద్ద మనిషి. బండి తోలే మనిషి తిరిగి వచ్చి గుర్రానికి గడ్డి వేసి బండి లోనే కూర్చున్నాడు. కామయ్య ఏదో పని మీద పై ఊరుకెళ్ళేడు. పెరట్లో పని చేసుకుంటున్న భార్య సీతమ్మ ఈ పెద్దమనిషి ని చూసి హడావుడిగా హాల్లోకొచ్చింది కొంగుతో చేతులు తుడుచుకుంటూ. 


"అబ్బాయి ఇంట్లో లేడేమిటమ్మా?" అన్నాడు పెద్ద మనిషి సావకాశంగా కాళ్ళు జాపుకుని కండువా తీసి కుర్చీ మీద పెట్టి. 

"పై ఊరు పని మీద వెళ్ళారు. వచ్చేస్తారు." అని వినయంగా చెప్పి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు తేవడానికి వెళ్ళింది. 


ఆమె వివాహమై కొద్ది కాలం మాత్రమే అయింది. పెళ్ళి లో చూడని భర్త తరుఫు బంధువనుకుంది ఆమె. 


కాళ్ళు కడుక్కుని, ఆమె పెట్టిన పలహారం సుష్టుగా తాను సేవించడమే కాకుండా బండివాడికి కూడా పెట్టించాడు పెద్ద మనిషి. 


ఇంతలో కామయ్య తిరిగి వచ్చాడు." ఇదిగో, ఆయన వచ్చారు. " ఆమె లేచి నిలబడింది అంతవరకు పిచ్చాపాటి కబుర్లు చెప్తున్న సీతమ్మ .

"రావోయ్, అల్లుడూ. ఉదయమే ఎక్కడికో వెళ్లి పోయావ్!" అంటూ చనువుగా పలుకరించాడు. 


 

"అర్జెంటుగా పని పడింది. పక్కూరు వెళ్ళేను. కాఫీ, పలహారం సేవించారా?" అని అభిమానంగా అడిగేడు కామయ్య. 


"అన్నీ చక్కగా పెట్టింది అమ్మాయి. అమ్మాయి ఎవరనుకున్నావు? సాక్షాత్తూ అన్నపూర్ణ!" అన్నాడు సీతమ్మ ని మెచ్చుకోలుగా చూస్తూ. 


"నేను మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళవలసి ఉంది. మీరు కాస్త విశ్రమించండి. భోజనం వేళకు వచ్చేస్తాను. కలసి భోంచేద్దాం. ఏమీ అనుకోకండి. " అని నొచ్చు కుంటూ లేచాడు కామయ్య. 


"భలే వాడివే! నిరభ్యంతరంగా వెళ్ళి రా. " నీతో కలసి భోంచేసాక నేను కచేరీ పని చూసుకొని వెళ్ళి పోతాను." అన్నాడు పెద్ద మనిషి పత్రిక తిరగేస్తూ. 


అతని బాధ్యత భార్య కప్పజెప్పి వడివడిగా బయటకెళ్ళిపోయాడు కామయ్య. అతడు దినపత్రిక తిరగేస్తూ కూర్చోగా సీతమ్మ వంట పనిలో పడింది. 


ఆమె వంట పూర్తి అయ్యేసరికీ బయటకెళ్ళిన కామయ్య తిరిగి వచ్చేసాడు. 

ఇద్దరికీ వెండి కంచాలలో వడ్డన చేసింది సీతమ్మ. సుష్టుగా భోజనం చేశాడు పెద్ద మనిషి. అరుగు మీద బండీవాడు కూడా భోంచేశాడు. 


పెద్ద మనిషి గదిలో బయలుదేరడానికి సిద్ధమౌతూండగా, "మీ బంధువు మంచి భోజన ప్రియుడే సుమీ. " పెరట్లో మెల్లగా అన్నాడు భార్య తో కామయ్య. 

"మా బంధువు అంటారేమిటి? ఆయన మీ తరుఫు వారు కాదూ?" అంది సీతమ్మ విస్తుపోతూ. 

 

"అబ్బే, మావైపు వారు కాదు. " అన్నాడు కామయ్య. 


దంపతులు ఇద్దరూ హాల్లోకి వచ్చే సరికి పెద్ద మనిషి పెట్టె బండి లోనికి చేర్చడమూ, అతను బయలుదేరడానికి సిద్దంగా ఉండడమూ గమనించారు. 


"వస్తానోయ్. కచేరీ పని చూసుకొని వెళ్ళి పోతాను. వస్తాను తల్లీ. మంచి భోజనం పెట్టేవు. " అని బండి వైపు నడిచాడు పెద్ద మనిషి. 


అతడి వెనుకనే నడచి వెళ్ళి, "అయ్యా, తమరు ఎవరో పోల్చుకోలేకపోయాను. మన సంబంధం....." నసుగుతూ సందేహం వెలిబుచ్చాడు కామయ్య. 


గట్టిగా ఓ నవ్వు నవ్వి, "మనది బాదరాయణ సంబంధమోయ్. " అన్నాడు పెద్ద మనిషి. ఇతడు తెల్ల ముఖం పెట్టడం చూసి, "అర్థం కాలేదూ? బదరి అంటే రేగు. నీ ఇంటి ముందు రేగు చెట్టు ఉంది కదా. నా బండి చక్రాలు రేగు చెట్టు తో చేసినవే! అదే మన సంబంధం!" అని బండి ఎక్కేసాడు పెద్ద మనిషి. అంతే కాదు, కొసమెరుపు గా...


"శ్లో: అస్మాకం బదరీ చక్రం 

       యుష్మాకం బదరీ తరుః

       బాదరాయణ సంబంధాత్ 

       యూయం యూయం వయం వయం. " 

 

అని ఓ శ్లోకం కూడా వదిలేడు. బండి కదిలింది. బండి మలుపు తిరిగే వరకూ నిర్ఘాంతపోయి నిలిచి చూస్తూ ఉండిపోయారా అమాయక దంపతులు!

అర్థం అయ్యింది కాదా ఎలాంటి చుట్టారికజం లేకపోయినా ఇంటికి వచ్చిన అతిధికి మర్యాదలు చెయ్యకుండా పంపించేవారు కాదు. అలాంటి మర్యాదలు, ఉన్నాయా ఇప్పుడు?

మూకపంచశతి — పాదారవిందశతకము*

  💐💐💐💐💐💐

*మూకపంచశతి — పాదారవిందశతకము*

*శ్లోకము : 002*

*గలగ్రాహీ పౌరందరపురవనీ పల్లవరుచాం*

💐💐💐💐💐💐

శ్రీ మూకశంకర భగవత్పాదులు పాదారవిందశతకములో రెండవ శ్లోకంలో అమ్మవారి చరణారవిందాల నుండి వెలువడే అరుణకాంతి యొక్క అసాధారణమైన వైభవాన్ని వర్ణిస్తున్నారు. మొదటి శ్లోకంలో దేవి పాదముల మహిమ అనిర్వచనీయమని చెప్పిన కవి, ఇప్పుడు ఆ మహిమలోని ఒక అంశమైన చరణకిరణాల అరుణిమను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాడు.


ఈ శ్లోకంలో కవి ఒక అద్భుతమైన కవిసమయాన్ని ఉపయోగించాడు. సాధారణంగా ఉదయసమయంలో కనిపించే అరుణోదయ కాంతి ప్రపంచానికి తొలి వెలుగు అని మనం భావిస్తాము. సూర్యుని అరుణకిరణాలు భూమిని మేల్కొలిపి, చీకట్లను తొలగిస్తాయి. కానీ మూకకవి దృష్టిలో ఆ అరుణోదయానికి కూడా ఒక మూలం ఉంది. ఆ మూలమే కామాక్షీదేవి పాదారవిందాల నుండి ప్రసరించే అరుణకాంతి.


  *"ధృతప్రాథమ్యానాం అరుణమహసాం ఆదిమగురుః"* 

అనే పదబంధం ఈ శ్లోకానికి హృదయం వంటిది. ప్రపంచం సూర్యోదయ కాంతినే మొదటిదిగా భావిస్తుంది. కాని కవి చెబుతున్నది ఏమిటంటే — అది కేవలం కనిపించే ప్రాథమ్యం మాత్రమే. అసలు ప్రాథమ్యం, అసలు ఆదిత్వం, అసలు మూలం అమ్మవారి పాదకిరణాలదే. అందుకే ఆయన సూర్యకాంతిని శిష్యునిగా, దేవి పాదకాంతిని గురువుగా చిత్రించాడు.


శ్రీ పోలా నరసింహ మూర్తి గారి వ్యాఖ్యాన దృష్టిలో ఈ శ్లోకము కేవలం రంగుల వర్ణన కాదు. ఇది పరాశక్తి సర్వకాంతులకు మూలమని తెలియజేసే తాత్త్విక ప్రకటన. మనం ప్రపంచంలో చూసే ప్రతి కాంతి, ప్రతి సౌందర్యం, ప్రతి ఆకర్షణ — అన్నీ ఆ పరాశక్తి మహిమలోని చిన్న ప్రతిబింబాలే. మూలప్రకాశం దేవియే.


ఉపనిషత్తులలో చెప్పబడిన ఒక మహావాక్యసమానమైన భావం ఇక్కడ గుర్తుకు వస్తుంది:


*"న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం*

*నేమా విద్యుతో భాంతి కుతోऽయమగ్నిః ।*

*తమేవ భాంతమనుభాతి సర్వం*

*తస్య భాసా సర్వమిదం విభాతి ॥"*


అక్కడ సూర్యుడు ప్రకాశించలేడు, చంద్రుడు ప్రకాశించలేడు; ఆ పరమజ్యోతి ప్రకాశించడం వల్లనే అన్నీ ప్రకాశిస్తున్నాయి.


ఈ ఉపనిషత్తు వాక్యానికి దేవీ ఉపాసనా దృష్టితో వ్యాఖ్యానం చేస్తే, ఆ పరమజ్యోతి కామాక్షీ చరణారవిందాల నుండి వెలువడే తేజస్సేనని ఈ శ్లోకం సూచిస్తున్నట్లు అనిపిస్తుంది.


ఈ శ్లోకంలో స్వర్గంలోని నందనవనము ప్రస్తావన కూడా ఎంతో అర్థవంతమైనది. నందనవనంలో ఉన్న కల్పవృక్షముల చిగుళ్ళు అసాధారణ సౌందర్యంతో ఉంటాయని పురాణాలు చెబుతాయి. వాటి ఎర్రటి కాంతి దేవలోకానికే అలంకారంగా భావించబడుతుంది. అయితే ఆ చిగుళ్ళ కాంతి కూడా అమ్మవారి పాదకిరణాల ముందు నిలవలేకపోతుందని కవి చెప్పాడు.


ఇది కేవలం అతిశయోక్తి కాదు. శ్రీవిద్య సంప్రదాయంలో దేవి చరణములు అనేవి కరుణకు, అనుగ్రహానికి, మోక్షానికి ద్వారములుగా భావించబడతాయి. అందువల్ల చరణకాంతి అంటే కేవలం భౌతిక కాంతి కాదు. అది జ్ఞానకాంతి, కరుణాకాంతి, చైతన్యకాంతి.


అందుకే లలితాసహస్రనామంలో అమ్మవారిని


*"భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతిః"*


అని స్తుతిస్తారు. భక్తుల హృదయాలలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే సూర్యకిరణ సమూహమే అమ్మవారి కృప అని ఈ నామం చెబుతోంది.


ఈ శ్లోకంలో *"బంధూకస్తబక సహయుధ్వా"* అనే పదప్రయోగం కూడా చాలా అందమైనది. బంధూకపుష్పం (మంకెనపువ్వు) అత్యంత ఎర్రని వర్ణానికి ప్రసిద్ధి. కవి భావనలో దేవి పాదారవిందాల కాంతి, బంధూకపుష్పాలతో పోటీ పడుతోంది. కాని ఆ పోటీలో విజయం దేవి పాదకాంతిదే.


ఇక్కడ ఒక అంతర్ముఖ భావనను కూడా గ్రహించవచ్చు.


మన జీవితంలో ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. ధనం, పదవి, కీర్తి, విజ్ఞానం, సంబంధాలు — ఇవన్నీ మనసును ఆకర్షిస్తాయి. ఇవి అన్నీ బంధూకపుష్పాల వంటివే. అందమైనవే, ఆకర్షణీయమైనవే. కాని దేవి చరణస్మరణ ద్వారా లభించే అంతరానందం, ఆత్మప్రకాశం, భక్తిరసం వాటన్నింటికంటే ఉన్నతమైనవి. ఈ శ్లోకం భక్తుని దృష్టిని బాహ్యసౌందర్యం నుండి అంతరంగ దైవసౌందర్యం వైపు మళ్లిస్తుంది.


శ్రీవిద్య ఉపాసనలో అరుణవర్ణానికి ప్రత్యేక స్థానం ఉంది. లలితాత్రిపురసుందరి స్వరూపమే అరుణము. అందుకే ధ్యానశ్లోకంలో


*"అరుణాం కరుణాతరంగితాక్షీమ్"*


అని వర్ణిస్తారు. ఇక్కడ అరుణము అంటే కేవలం ఎరుపు రంగు కాదు. అది ప్రేమ, కరుణ, జీవశక్తి, చైతన్యం, అనుగ్రహం, జ్ఞానోదయం — ఈ సమస్తాల సంకేతం.


అందువల్ల ఈ శ్లోకంలో వర్ణింపబడిన అరుణిమను బాహ్య రంగుగా మాత్రమే చూడకూడదు. అది దేవి కృపా ప్రవాహానికి ప్రతీక. ఆ కృపా కిరణాలు భక్తుని హృదయంలో ప్రసరించినప్పుడు అజ్ఞానం తొలగిపోతుంది, భక్తి వికసిస్తుంది, జ్ఞానం ఉదయిస్తుంది.


మొత్తానికి ఈ శ్లోకం దేవి పాదారవిందాల అరుణకాంతిని వర్ణిస్తున్నట్లు కనిపించినా, అంతరార్థంలో పరాశక్తి సర్వకాంతులకు మూలమని, సర్వసౌందర్యాలకు ఆదికారణమని, సర్వజ్ఞానాలకు మూలప్రకాశమని ప్రకటిస్తోంది. సూర్యుడు, సంధ్యారాగము, కల్పవృక్ష చిగుళ్ళు, బంధూకపుష్పములు — ఇవన్నీ ఆమె చరణారవిందాల కాంతి ముందు తమ తేజస్సును సమర్పిస్తున్నట్లుగా మూకకవి మనకు ఒక దివ్య దృశ్యాన్ని ఆవిష్కరించాడు.

💐💐💐💐💐💐

*కుమార శర్మ*

*న్యాయవాది & ఆధ్యాత్మికవేత్త*

*జగద్గురు జ్ఞానపీఠం*

*9063939567*

💐💐💐💐💐💐

దేశాన్ని* *బాగుపరచడం*

 ✍️

    *దేశాన్ని*

        *బాగుపరచడం*


మా ఇంటి పక్కన వెంకట్రావు గారని

ఒక పెద్దాయన రిటైర్ అయ్యాక,

ఉన్న కాస్తపొలం కౌలుకిచ్చి

పెన్షన్/కౌలు డబ్బులతో

కాలక్షేపం చేస్తున్నారు 


 ఒకటో తారీఖు.., పొద్దున్నే

 సందు చివర షాప్ కి వెళ్లి

 500 రూపాయల

 సరుకులు కొన్నారు.


ఆ షాప్ అబ్బాయికి కూడా

ఒకటో తారీఖు కదా.,

తనకు వచ్చిన ₹.500 తో

పక్కన బిరియానీ పాయింట్ లో బిరియానీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు.


  బిరియానీ షాపాయనేమో

  రోజూ బిరియానీ

  ఏం తింటాం

  అనుకున్నాడేమో,

  పక్కన కర్రీ పాయింట్లో

  కూరలు కొనుక్కుని

  ఇంటికి వెళ్ళాడు.


ఆ కర్రీ పాయింట్ అబ్బాయి

ఆ పక్కన ఉన్న

 కూర గాయాల షాపులో ఆ డబ్బులతో కూరగాయలు కొన్నాడు.


  కూరగాయల

  షాప్ అబ్బాయి

  సాయంత్రం రైతుకి

  కూరగాయల డబ్బులు

  ఇచ్చి లెక్క రాసుకున్నాడు.


రైతేమో వెంకట్రావు గారి పొలం కౌలుదారు.,

పొలం కౌలు డబ్బులు తెచ్చి వెంకట్రావు గారికి ఇచ్చేశాడు.


*కథ ఐపోయింది..!*

*ఐతే.,*


ఒక్క నిమిషం :

ఈజీ లెక్క కోసం,

అందరూ తమ దగ్గరికి వచ్చిన 500 పూర్తిగా ఖర్చుపెట్టారు;

వాళ్లకు అదే ఆధారం అనుకుంటే.,


ఈ కథ లో మొత్తం ఎకనామిక్ ఆక్టివిటీ వచ్చేసి

500x6 = 3000 రూ ( GDP అంటారే., అదే ఇది )


ఆ 500 రూపాయలు

మళ్లీ వెంకట్రావు గారి జేబులోకే వచ్చేసినా, ఊరులో కనీసం 6 కుటుంబాలు లాభ పడ్డాయన్న మాట.


*ఇదే వెంకట్రావు అదే 500 రూపాయలు తీసుకెళ్ళి ఏ ఫారిన్ కంపెనీ వస్తువు కొన్నారనుకోండి., ఆ మిగిలిన 5 కుటుంబాలు ఆ రోజుకు తిండి లేక పస్తు ఉండాలి అన్న మాట.*


"చైనా వాడి GDP మనకన్నా ఎక్కువ ఉంది. అమెరికా is very developed. What is India doing?" అని బాధ పడకుండా..,


వీణ్ణీ వాణ్ణీ తిట్టక్కర లేకుండా..,


దేశాన్ని బాగు పరచటం ఎలాగో తెలిసింది కదా..!*

```

  Be Indian!

  Buy Indian made !!

```

*స్వదేశీ వస్తువులను వాడదాం* స్వాభిమానంతో జీవిద్దాం 🚩🙏🙏🙏🙏

పంచాంగం 02.06.2026 Tuesday,

 ఈ రోజు పంచాంగం 02.06.2026 Tuesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధికజ్యేష్ఠ మాస కృష్ణ పక్ష విదియ తిథి భౌమ వాసర మూల నక్షత్రం సాధ్య యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: విదియ 


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప ।

సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ।। 33 ।।


ప్రతిపదార్థ:


తత్ — సత్యమును; విద్ధి — నేర్చుకొనుటకు ప్రయత్నించుము; ప్రణిపాతేన — ఆధ్యాత్మిక గురువుని చేరుకొని; పరిప్రశ్నేన — వినయ పూర్వక ప్రశ్నలతో; సేవయా — సేవ చేసి; ఉపదేక్ష్యంతి — ఉపదేశము చేయగలరు; తే — నీకు; జ్ఞానం — జ్ఞానము; జ్ఞానినః — జ్ఞానులు; తత్త్వ-దర్శినః — పరమ సత్యమును తెలుసుకొన్నవారు.



 తాత్పర్యము : 


ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు.



వివరణ:


యజ్ఞము అనేది జ్ఞానముతో కూడి చేయాలన్న విషయం విన్నతరువాత, సహజంగానే వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా సముపార్జించుకోవాలి? అని. శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు, ఆయన అంటున్నాడు: 1) ఆధ్యాత్మిక గురువు దరిచేరండి 2) ఆయనని వినయంతో అడగండి 3) ఆయనకి సేవ చేయండి.


పరమ సత్యము అనేది మన స్వంత ఆలోచన/విచారణ ద్వారా అర్థమయ్యే విషయం కాదు. భాగవతంలో ఇలా పేర్కొనబడినది:


అనాద్యవిద్యా యుక్తస్య పురుషస్యాత్మ వేదనం

స్వతో న సంభవాద్ అన్యస్ తత్త్వ-జ్ఞో జ్ఞాన-దో భవేత్


(11.22.10)


 


‘ఆత్మ యొక్క బుద్ధి అనంత జన్మల పాటూ అజ్ఞానంచే కప్పివేయబడి ఉంది. అవిద్యచే ఆవరింపబడి ఉండటంచే, బుద్ధి తన అజ్ఞానాన్ని తన స్వంత ప్రయత్నంచే జయించలేదు. పరమ సత్యాన్ని ఎరిగిన భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ముని ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకోవాలి.’


ఆధ్యాత్మిక పథంలో గురువు యొక్క ప్రాముఖ్యాన్ని, వైదిక గ్రంథాలు పదేపదే మనకు ఉపదేశిస్తున్నాయి.


ఆచార్యవాన్ పురుషో వేదః (ఛాందోగ్య ఉపనిషత్తు 6.14.2)


‘గురువు ద్వారా మాత్రమే నీవు వేదములను అర్థం చేసుకొనగలవు’. పంచదశీ ఇలా పేర్కొంటున్నది:


తత్పాదాంబురు హద్వంద్వ సేవా నిర్మల చేతసాం

సుఖబోధాయ తత్త్వస్య వివేకో ఽయం విధీయతే (1.2)


‘గురువు గారిని స్వచ్ఛమైన మనస్సుతో, సందేహములు విడిచి సేవించండి. తదుపరి ఆయన మీకు శాస్త్ర జ్ఞానాన్ని మరియు వివేచనాత్మకత ఉపదేశించి, గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు.’ జగద్గురు శంకరాచార్య ఇలా పేర్కొన్నాడు: యావత్ గురుర్న కర్తవ్యో తావంముక్తిర్న లభ్యతే, ‘గురువుకి శరణాగతి చేయకుండా నీకు భౌతిక మాయ నుండి ముక్తి లభించదు.’


జీవాత్మను నిజమైన గురువు సన్నిధిలోనికి చేర్చటం అనేది భగవంతుని యొక్క గొప్ప ఉదారమైన కృపలలో ఒకటి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రక్రియ ప్రాపంచిక జ్ఞానాన్ని ఆపాదించే ప్రక్రియ కన్నా విభిన్నమైనది. ప్రాపంచిక విద్యకోసం గురువు పట్ల అత్యంత గౌరవ భావం అవసరం లేదు. ఆ విద్య కోసం కేవలం బోధకుని ఫీజు/రుసుము చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అనేది శిష్యునికి యాంత్రికమైన బోధనా పద్ధతి ద్వారా ఆపాదించబడదు, లేదా దాన్ని ఏదో ఫీజు చెల్లించి కొనుక్కోలేము. శిష్యుడు ఎప్పుడైతే వినయము, నమ్రత పెంపొందించుకుంటాడో, శిష్యుని సేవా దృక్పథంచే గురువు ప్రసన్నమౌతాడో, గురుకృపచే అది శిష్యుని హృదయంలో ప్రకటించబడుతుంది. అందుకే ప్రహ్లాద మహారాజు అన్నాడు:


నైషాం మతిస్తావద్ ఉరుక్రమాంఘ్రిం


స్పృశత్యనర్థాపగమో యదర్థః

మహీయసాం పాదరజోఽభిషేకం


నిష్కించనానాం న వృణీత యావత్ (భాగవతం 7.5.32)


 


‘మనలను మనం ఒక మహాత్ముని పాద ధూళిలో తడిపివేసుకోకపోనంతవరకు, మనం అలౌకిక ఆధ్యాత్మిక స్థాయిని అనుభవించలేము.’ కాబట్టి, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, గురువు గారిని మర్యాదతో చేరుకొని, పరమ సత్యము గురించి వినయంతో అడిగి, సేవ ద్వారా ఆయనకు --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప ।

సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ।। 33 ।।


ప్రతిపదార్థ:


తత్ — సత్యమును; విద్ధి — నేర్చుకొనుటకు ప్రయత్నించుము; ప్రణిపాతేన — ఆధ్యాత్మిక గురువుని చేరుకొని; పరిప్రశ్నేన — వినయ పూర్వక ప్రశ్నలతో; సేవయా — సేవ చేసి; ఉపదేక్ష్యంతి — ఉపదేశము చేయగలరు; తే — నీకు; జ్ఞానం — జ్ఞానము; జ్ఞానినః — జ్ఞానులు; తత్త్వ-దర్శినః — పరమ సత్యమును తెలుసుకొన్నవారు.



 తాత్పర్యము : 


ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు.



వివరణ:


యజ్ఞము అనేది జ్ఞానముతో కూడి చేయాలన్న విషయం విన్నతరువాత, సహజంగానే వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా సముపార్జించుకోవాలి? అని. శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు, ఆయన అంటున్నాడు: 1) ఆధ్యాత్మిక గురువు దరిచేరండి 2) ఆయనని వినయంతో అడగండి 3) ఆయనకి సేవ చేయండి.


పరమ సత్యము అనేది మన స్వంత ఆలోచన/విచారణ ద్వారా అర్థమయ్యే విషయం కాదు. భాగవతంలో ఇలా పేర్కొనబడినది:


అనాద్యవిద్యా యుక్తస్య పురుషస్యాత్మ వేదనం

స్వతో న సంభవాద్ అన్యస్ తత్త్వ-జ్ఞో జ్ఞాన-దో భవేత్ప్రీ


(11.22.10)


 


‘ఆత్మ యొక్క బుద్ధి అనంత జన్మల పాటూ అజ్ఞానంచే కప్పివేయబడి ఉంది. అవిద్యచే ఆవరింపబడి ఉండటంచే, బుద్ధి తన అజ్ఞానాన్ని తన స్వంత ప్రయత్నంచే జయించలేదు. పరమ సత్యాన్ని ఎరిగిన భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ముని ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకోవాలి.’


ఆధ్యాత్మిక పథంలో గురువు యొక్క ప్రాముఖ్యాన్ని, వైదిక గ్రంథాలు పదేపదే మనకు ఉపదేశిస్తున్నాయి.


ఆచార్యవాన్ పురుషో వేదః (ఛాందోగ్య ఉపనిషత్తు 6.14.2)


‘గురువు ద్వారా మాత్రమే నీవు వేదములను అర్థం చేసుకొనగలవు’. పంచదశీ ఇలా పేర్కొంటున్నది:


తత్పాదాంబురు హద్వంద్వ సేవా నిర్మల చేతసాం

సుఖబోధాయ తత్త్వస్య వివేకో ఽయం విధీయతే (1.2)


‘గురువు గారిని స్వచ్ఛమైన మనస్సుతో, సందేహములు విడిచి సేవించండి. తదుపరి ఆయన మీకు శాస్త్ర జ్ఞానాన్ని మరియు వివేచనాత్మకత ఉపదేశించి, గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు.’ జగద్గురు శంకరాచార్య ఇలా పేర్కొన్నాడు: యావత్ గురుర్న కర్తవ్యో తావంముక్తిర్న లభ్యతే, ‘గురువుకి శరణాగతి చేయకుండా నీకు భౌతిక మాయ నుండి ముక్తి లభించదు.’


జీవాత్మను నిజమైన గురువు సన్నిధిలోనికి చేర్చటం అనేది భగవంతుని యొక్క గొప్ప ఉదారమైన కృపలలో ఒకటి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రక్రియ ప్రాపంచిక జ్ఞానాన్ని ఆపాదించే ప్రక్రియ కన్నా విభిన్నమైనది. ప్రాపంచిక విద్యకోసం గురువు పట్ల అత్యంత గౌరవ భావం అవసరం లేదు. ఆ విద్య కోసం కేవలం బోధకుని ఫీజు/రుసుము చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అనేది శిష్యునికి యాంత్రికమైన బోధనా పద్ధతి ద్వారా ఆపాదించబడదు, లేదా దాన్ని ఏదో ఫీజు చెల్లించి కొనుక్కోలేము. శిష్యుడు ఎప్పుడైతే వినయము, నమ్రత పెంపొందించుకుంటాడో, శిష్యుని సేవా దృక్పథంచే గురువు ప్రసన్నమౌతాడో, గురుకృపచే అది శిష్యుని హృదయంలో ప్రకటించబడుతుంది. అందుకే ప్రహ్లాద మహారాజు అన్నాడు:


నైషాం మతిస్తావద్ ఉరుక్రమాంఘ్రిం


స్పృశత్యనర్థాపగమో యదర్థః

మహీయసాం పాదరజోఽభిషేకం


నిష్కించనానాం న వృణీత యావత్ (భాగవతం 7.5.32)


 


‘మనలను మనం ఒక మహాత్ముని పాద ధూళిలో తడిపివేసుకోకపోనంతవరకు, మనం అలౌకిక ఆధ్యాత్మిక స్థాయిని అనుభవించలేము.’ కాబట్టి, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, గురువు గారిని మర్యాదతో చేరుకొని, పరమ సత్యము గురించి వినయంతో అడిగి, సేవ ద్వారా ఆయనకు ప్రీతి కలిగించ వలసిన ఆవశ్యకత గురించి వివరిస్తున్నాడు.

.తి కలిగించ వలసిన ఆవశ్యకత గురించి వివరిస్తున్నాడు.

.

మంగళవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

02-06-2026 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


ఇంటా బయట పని ఒత్తిడులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమానంతరం పనులు పూర్తి అవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి.  

---------------------------------------


వృషభం


చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. 

---------------------------------------


మిధునం


సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులుంటాయి. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. 

---------------------------------------


సింహం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు.

---------------------------------------


కన్య


దూరపు బంధువులు కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

---------------------------------------


తుల


ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.  

---------------------------------------


వృశ్చికం


వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు.

---------------------------------------


ధనస్సు


కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తికావు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


మకరం


చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

---------------------------------------


కుంభం


ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది.

---------------------------------------


మీనం

 

కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

---------------------------------------

కుటుంబ వ్యవస్థ

 *కుటుంబ వ్యవస్థ కూలిపోతే… మనిషి అన్నవాడు మిగులుతాడా?* 


ఈ ప్రపంచంలో మనిషికి మొదటి దేవాలయం కుటుంబం…

మొదటి గురువు తల్లి…

మొదటి భరోసా తండ్రి…

మొదటి స్నేహితుడు అన్న లేదా తమ్ముడు…

మొదటి ప్రేమ అక్క లేదా చెల్లెలు…

కానీ ఈరోజు అదే కుటుంబం నెమ్మదిగా కూలిపోతుంటే…

 మనిషి బతికున్నా జీవితం చనిపోతుంది.

ఎందుకో తెలియదు…

ఎప్పుడు మొదలైందో తెలియదు…

కానీ ఇంట్లో నవ్వులు తగ్గిపోయాయి…

మాటలు తగ్గిపోయాయి…

మనసులు దూరమయ్యాయి…


ఒకప్పుడు తల్లి చేతి అన్నం కోసం పిల్లలు ఎదురు చూసేవారు…

ఇప్పుడు అదే తల్లి కొడుకుతో రెండు నిమిషాలు మాట్లాడాలన్నా భయపడుతోంది.

“ఏం మాట్లాడితే ఏం కోపపడతాడో…” అని తల్లి గుండె వణుకుతోంది.

ఒకప్పుడు తండ్రి ఇంటికి వస్తే పిల్లలు పరుగెత్తి కౌగిలించుకునేవారు…

ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నా… పిల్లలు ఫోన్లలోనే బతుకుతున్నారు.

ఆ తండ్రి కళ్లలో ఒకే ప్రశ్న 

“ *నేను డబ్బు సంపాదించి,  ప్రేమని కోల్పోయానా…?* ” 

 *నేను వీళ్ళకి just ATM మిషన్ నా..?* అని 


అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చిన రోజులు పోయాయి…

ఇప్పుడు ఒక గజం భూమి కోసం రక్తాలు కారేలా తన్నుకు చస్తున్నారు .

అక్కాచెల్లెళ్లు ఒకరి బాధకి ఒకరు కన్నీళ్లు పెట్టుకునే రోజులు మాయమైపోయాయి…

ఇప్పుడు పండుగ రోజున కూడా ఫోన్ చేయడానికి సమయం లేదు.

భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాల్సిన చోట…

అహంకారం రాజ్యమేలుతుంది


“క్షమించు” అనే ఒక్క మాట చనిపోవడంతో…

ఎన్నో కుటుంబాలు శ్మశానాలుగా మారుతున్నాయి.

ఎంత దారుణమంటే…

కన్న తల్లి కూడా బిడ్డలపై కక్ష పెంచుకుంటోంది…

కన్న కొడుకే తండ్రిపై చేయి చేసుకునే స్థితికి చేరుకున్నాడు…

ఈ దృశ్యాలు చూస్తుంటే…

మనిషి ఎదిగాడా… లేక మానవత్వం చనిపోయిందా అనిపిస్తోంది.


ఇంట్లో అందరూ ఉన్నారు…

కానీ ఆప్యాయత లేదు.

డైనింగ్ టేబుల్ ఉంది…

కానీ కలిసి భోజనం చేసే మనుషులు లేరు ఉన్నా వారికి ఆ మనసు లేదు

వేల రూపాయల ఫోన్లు ఉన్నాయి…

కానీ “అమ్మా ఎలా ఉన్నావు?” అని అడిగే ప్రేమ లేదు.


 *ఈరోజున మనం మన పిల్లలకు అన్నీ నేర్పిస్తున్నాం* …

 *కానీ “కుటుంబం విలువ” మాత్రం నేర్పించడం మరిచిపోయాం.* 

ర్యాంకులు తెప్పిస్తున్నాం …

కానీ రక్త సంబంధాలు నిలబెట్టుకోనే సిలబస్ నేర్పించడం మర్చిపోతున్నాం 

డబ్బు సంపాదించడం నేర్పించాం…

కానీ మనుషుల మనసులని ఎలా గెలుచుకోవాలో నేర్పించలేదు


ఇప్పుడు పెద్ద ఇళ్లు ఉన్నాయి 

కానీ అందులో మనుషులు ఉండరు.

ఖరీదైన మంచాలు ఉంటాయి…

కానీ ప్రశాంతమైన నిద్ర ఉండదు.

పుట్టినరోజుకి వందల మెసేజ్లు వస్తాయి…

కానీ కళ్లలోకి చూసి ఆశీర్వదించే తల్లిదండ్రులు ఉండరు.

ఆ రోజు మనిషి ఏడుస్తాడు…

కానీ ఆ కన్నీళ్లు తుడిచే చేయి ఉండదు.

కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు…

మనసులు కలిసే పవిత్ర స్థలం.

అది కూలిపోతే దేశం కాదు… ప్రపంచమే కూలిపోతుంది.

అందుకే…


ఈరోజు నుంచైనా

తల్లిదండ్రులతో ఐదు నిమిషాలు ప్రేమగా మాట్లాడండి…

అన్నదమ్ములను కౌగిలించుకోండి…

అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించండి…

భార్యాభర్తలు గెలవడానికి కాదు… కలిసి జీవించడానికి ప్రయత్నించండి.

ఎందుకంటే…

చనిపోయాక శవపేటికను మోసేవాళ్లు చాలామంది దొరుకుతారు…

కానీ బతికున్నప్పుడు మనసును మోసేవాళ్లు కుటుంబ సభ్యులే…!

కుటుంబాన్ని కాపాడుకుందాం…

మనసులను బ్రతికిద్దాం…

లేకపోతే రేపటి తరానికి ఇళ్లు మిగులుతాయి…

కానీ “ఇంటివాళ్లు” మిగలరు…!


కుటుంబం అనేది పూలదండలాంటి ది 

ఏ పువ్వు కా పువ్వు ని దండనుండి వేరు చేసి 

ఆ దండకున్న విలువని . గౌరవాన్ని తీయకండి

దానికున్న అందాన్ని చెడగొట్టకండి

 కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు లేకపోతే ఆ కుటుంబానికి విలువ ఉండదు.


దయచేసి  చిన్న చిన్న EGO లకి, గొడవలకి పోయి 

బంధాలను తెంచుకోకండి,

 ఏకాకిగా మిగిలి పోకండి ప్లీజ్🙏

మన ఆరోగ్యం…!

 

*మన ఆరోగ్యం…!



*ఆయుర్వేదం ప్రకారం తప్పక పాటించాల్సిన నియమాలు!!* 

                ➖➖➖✍️



*1. అజీర్ణే భోజన విషం.*```

గతంలో తీసుకున్న భోజనం జీర్ణం కాకపోతే.. రాత్రి భోజనం తీసుకోవడం విషం తీసుకున్నట్లు అవుతుంది. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణమైందని సూచించే ఒక సంకేతం.

```

*2. అర్ధరోగహరి నిద్ర.*```

సరైన నిద్ర సగం వ్యాధులను నయం చేస్తుంది..```


*3 ముద్గదాలి గదవ్యాలి.*```

అన్ని పప్పుధాన్యాలలో, పచ్చ పెసర్లు ఉత్తమమైనవి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇతర పప్పుధాన్యాలు అన్నీ ఒకటి లేదా మరొక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. 

```

*4.  భగ్నాస్థి-సంధానకరో లశునః.*```

వెల్లుల్లి విరిగిన ఎముకలను కూడా కలుపుతుంది.``` 


 *5.  అతి సర్వత్ర వర్జయేత్.*```

రుచిగా ఉన్నంత మాత్రాన ఏదైనా అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా ఉండండి. 

```

*6.  నాస్తి మూలమనౌషధం.*```

శరీరానికి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు లేవు. ```


 *7.  న వైద్యః ప్రభురాయుషః*```

ఏ వైద్యుడూ దీర్ఘాయువు ఇవ్వలేడు.  (వైద్యులకు పరిమితులు ఉన్నాయి)

```

*8.చింతా వ్యాధి ప్రకాశాయ*```

ఆందోళన అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది. ```


*9.  వ్యామశ్చ శనైః శనైః.*```

ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి.(వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు.) ```


 *10.  అజవత్ చర్వణం కుర్యాత్.*```

మీ ఆహారాన్ని మేక లాగా నమలండి.

(ఎప్పుడూ తొందరపడి ఆహారాన్ని మింగకండి. లాలాజలం జీర్ణక్రియలో మొదట సహాయపడుతుంది.) 

```

 *11.   స్నానం నామం మనఃప్రసాధనకరందుః స్వప్న-విధ్వంసనం ।*```

స్నానం కుంగుబాటు(డిప్రెషన్‌) ను దూరం చేస్తుంది. చెడు కలలను దూరం చేస్తుంది.

```

 *12.  న స్నానమాచరేద్ భుక్త్వా.*```

ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయ కూడదు.(జీర్ణక్రియ ప్రభావితమవుతుంది). ```


 *13.  నాస్తి మేఘసమం తోయం.*```

స్వచ్ఛతలో వర్షపు నీటికి ఏ నీరు సరిపోదు.. 

```

 *14.  అజీర్ణే భేషజం వారి.*```

అజీర్ణం ఉన్నప్పుడు సాధారణ నీటిని తీసుకోవడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది.```


 *15.  సర్వత్ర నూతనం షష్టం, సేవకాన్నే పురాతనే ।*```

ఎప్పుడూ తాజాగా ఉండేవాటికే ప్రాధాన్యత ఇవ్వండి.. 

అయితే అన్నం మరియు సేవకుడు మాత్రం పెద్ద వయస్సులో ఉన్నప్పుడు మాత్రమే మంచివి.```


 *16.  నిత్యం సర్వ రస భక్ష్యః॥*```

మొత్తం షడ్రుచులు (ఆరు) రుచులు ఉన్న ఆహారాన్ని తీసుకోండి.(అనగా: ఉప్పు,తీపి,చేదు,పులుపు,వగరు (ఆస్ట్రింజెంట్)మరియు ఘాటు (పంజెంట్). ```


 *17.  జఠరం పూరాయెదర్ధం అన్నార్, భాగం జలేన్ చ ।*

 *వాయోః సంచరణార్థాయ చతర్థమవశేషయేత్॥*```

మీ కడుపులో సగభాగాన్ని ఘనపదార్థాలతో నింపండి, 

పావు వంతు నీరు మరియు మిగిలిన దానిని ఖాళీగా ఉంచండి.```


 *18.  భుక్త్వా శతపథం గచ్ఛేద్ యదిచ్ఛేత్ చిరజీవితమ్ ।*```

ఆహారం తీసుకున్న తర్వాత ఎప్పుడూ ఖాళీగా కూర్చోవద్దు. కనీసం అరగంట పాటు నడవండి. ```


 *19.  క్షుత్సాధుతాం జనయతి।*```

ఆకలి ఆహారం యొక్క రుచిని పెంచుతుంది.. ఇంకా చెప్పాలంటే, ఆకలిగా ఉన్నప్పుడే తినండి.. 

```

*20. చింతా జరా నామం మనుష్యాణాం* ```

ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.. ```


*21.  శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్ ।*```

ఆహారంకోసం సమయం వచ్చినప్పుడు, 100 పనులను కూడా పక్కన పెట్టండి (ఫోనుతో సహా).```


 *22.  సర్వధర్మేషు మధ్యమామ్.*```

ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి. ఏదైనా విషయంలో అతిగా వెళ్లడం మానుకోండి.

```

*ఇవి మన ఋషులచే సంస్కృతంలో చెప్పబడిన  సువర్ణ జ్ఞాన పదాలు.*✍️

.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...                  87121 84465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```