ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
4, జనవరి 2025, శనివారం
శ్రీ దత్త ప్రసాదం - 21
శ్రీ దత్త ప్రసాదం - 21 – దిక్కుతోచని స్థితిలో అక్కరకు వచ్చిన సర్వస్య శరణాగతి
2007వ సంవత్సరం డిసెంబర్ నెల లో నాపై నా ఋణదాతలు వేసిన ఒకానొక కేసు నిమిత్తం విశాఖపట్నం లోని కోర్టుకు హాజరు కావాల్సివున్నది...రేపుదయం వాయిదా అనగా విశాఖపట్నం లోని మా లాయర్..ముందురోజు మధ్యాహ్నం ఫోన్ చేసి..నన్ను తప్పకుండా హాజరు కమ్మని చెప్పివున్నారు..ఆ ఫోన్ వచ్చే సమయానికి నేను మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం లో వున్నాను..వాయిదా ఏమైనా తీసుకునే అవకాశం వున్నదా అని లాయర్ గారిని అడిగాను..ఒక నెల వాయిదా దొరికితే..వాళ్లకు కొంత నగదు జమ చేయొచ్చు అని నా ఆలోచన.. కానీ..ఆయన..కుదరదు అని తేల్చిచెప్పారు..పైగా హాజరు కాకపోతే..జడ్జి గారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తారేమో అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చారు..ఇక చేసేదేమీ లేదు..విశాఖపట్నం వెళ్లి తీరాల్సిందే అని నిర్ణయించుకొని..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..నమస్కారం చేసుకొని.."స్వామీ! నీదే భారం!.." అని మనసులో గట్టిగా అనుకొని వచ్చేసాను..
ఆరోజు రాత్రే విశాఖపట్నం కు రైలులో బయలుదేరి..మరుసటిరోజు ఉదయానికి చేరుకున్నాను..ఉదయం 10 గంటల కల్లా కోర్టు ఆవరణకు చేరి..మా లాయర్ గారిని కలిశాను.."ఈరోజు వాయిదా అడగాలని అనుకున్నాను కానీ..కుదరదండీ..జడ్జి గారు ఇటువంటి కేసులకు వాయిదాలు ఇవ్వటం లేదు..త్వరగా ముగించేయాలని చూస్తున్నారు.." అన్నారు..సరే..కానివ్వండి..జరిగేది జరుగుతుంది అని మాత్రం అన్నాను..
మరొక్కసారి శ్రీ స్వామివారి కి మనసులోనే నమస్కారం చేసుకొని ఓ ప్రక్కగా కూర్చున్నాను..ఎటువంటి ఆలంబన లేని పరిస్థితి లో ఆ దైవమే మనకు తోడుగా ఉంటాడు..కాకుంటే..మనం సర్వస్య శరణాగతి చెందాలి..ఆరోజు నేనున్న స్థితి లో నేను శ్రీ స్వామివారిని వేడుకోవడం తప్ప మరో మార్గం కనుపించలేదు..
మామూలుగా కోర్టు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుంది..నా వంతు కోసం ఎదురు చూస్తున్నాను..పదకొండు గంటలు గడిచినా కోర్టు లో కార్యకలాపాలు ప్రారంభం కాలేదు..విచారిస్తే..ఇంకా జడ్జి గారు రాలేదు..అన్నారు..మరి కొద్దిసేపటికే.."12 గంటల తరువాత అత్యవసర కేస్ లు మాత్రం విచారిస్తారు..మిగిలినవన్నీ వాయిదా వేయమన్నారు.." అని జడ్జి గారి దగ్గరుండే గుమాస్తా గారు చెప్పారు..నా తాలూకు కేస్ ను అత్యవసర జాబితా లోనే ఉంచారు కనుక..నేను కోర్టు లోనే ఉండిపోయాను..సరిగ్గా ఒంటిగంటకు జడ్జి గారు వచ్చారు..వరుస క్రమంలో పిలుస్తారు కనుక..నా వంతు వచ్చేసరికి..మధ్యాహ్నం మూడు గంటలు అవుతుందని చెప్పారు..భోజనం చేసి తిరిగి కోర్టు వద్దకు వచ్చాను..
మూడు గంటలకు నా కేస్ విచారిస్తారని ఎదురుచూస్తూ వున్నాను..మూడున్నర అయింది..నాలుగయింది..జడ్జి గారు వేరే కేసుల విచారణ లో వున్నారు కానీ..నన్ను మాత్రం పిలవలేదు..కోర్టు లోనే వేచి చూస్తూ వున్నాను..సాయంత్రం 5.30 గంటలకు కూడా నా కేసు విచారణ కు రాలేదు..జడ్జి గారు బెంచ్ దిగి వెళ్లి పోయారు..ఏమీ అర్ధం కాలేదు..గుమాస్తా వద్దకు వెళ్లి..మధ్యాహ్నం నుంచీ వేచి ఉన్నాననీ.. కేస్ పిలువలేదనీ..కారణం చెప్పమని అడిగాను..నన్ను అక్కడే వుండమని చెప్పి..జడ్జి గారి దగ్గరకు వెళ్లి కనుక్కుని వస్తాను..అన్నారు..ఇంకొక ఐదు నిమిషాల్లో..జడ్జి గారు నన్ను తన ఛాంబరుకు రమ్మన్నారని చెప్పారు..వెళ్ళాను..జడ్జి గారికి నమస్కారం చేసి..నిలబడ్డాను.."ఈరోజు మీ కేస్ తీసుకోలేదు.." అంటూ..ప్రక్కనే ఉన్న కేలండర్ చూసి..మళ్లీ మార్చి నెలకు వాయిదా వేస్తున్నాను..అప్పుడు విచారణ చేస్తాను.." అని చెప్పి..వాయిదా వేసేశారు..నేను నెల వాయిదా దొరికితే చాలు అనుకున్నాను..కానీ..ఏకంగా మూడు నెలలు ఇచ్చారు..నమస్కారం పెట్టి ఇవతలికి వచ్చేసాను..
అక్కడితో శ్రీ స్వామివారి లీల అయిపోలేదు..కోర్టు నుంచి బైటకు రాగానే..అనుకోని సంఘటన ఒకటి జరిగింది..కోర్టు బైట నాకోసం..నా మీద కేస్ వేసిన కంపెనీ ప్రతినిధులు..వాళ్ళ లాయర్ గారూ..మా లాయర్ గారూ అందరూ వేచి చూస్తున్నారు..మా లాయర్ గారు.."ప్రసాద్ గారూ మీతో మాట్లాడి కేస్ ఇంతటితో ముగిద్దామని వాళ్ళు అనుకుంటున్నారు..మీరొక మాట చెపితే..."అన్నారు..
ఇప్పటికిప్పుడు డబ్బు కట్టాలంటే...కష్టం కదా..అన్నాను..ఈసారి కంపెనీ ప్రతినిధే నేరుగా మాట్లాడాడు..ఒక అంగీకారానికి వచ్చాము..నేను ఇవ్వగలిగింది స్పష్టంగా చెప్పాను..అదికూడా ఒక నెల లోపు చెల్లిస్తానని చెప్పాను..వాళ్ళూ ఒప్పుకున్నారు..కేసు ఉపసంహరణకు కావాల్సిన సంతకాలు కూడా పూర్తి అయ్యాయి..అంతా ఒక గంటన్నర లోపలే జరిగింది..ప్రక్కరోజు ఆ కేసు మూసివేయడం కూడా చక చకా జరిగింది..వాయిదా దొరికితే చాలు అని అనుకున్న నాకు..అసలు కేసు కు హాజరే కాకుండా పూర్తి స్థాయి మినహాయింపు దొరుకుతుందని కలలో కూడా ఊహించలేదు..
సర్వం..
శ్రీ దత్తకృప!
రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్
(మందిర వివరముల కొరకు :
వివాహానికి
🎶 *HUSBAND FOR SALE*
సిటీ మార్కెట్‌లో ఒక ప్రత్యేకమైన దుకాణం పెద్ద సైన్‌బోర్డ్‌తో తెరవబడింది
*"ఇక్కడ మీరు భర్తలను కొనుగోలు చేయవచ్చు."*
దుకాణం తెరిచిన వెంటనే, లోపలికి వెళ్లడానికి ఆసక్తిగా మహిళలు గుమిగూడారు. కానీ దుకాణం వెలుపల ఒక హెచ్చరిక వ్రాయబడింది:
❤️ *"భర్తని కొనడానికి నియమాలు"*
- ప్రతి స్త్రీ ఒక్కసారి మాత్రమే దుకాణంలోకి ప్రవేశించవచ్చు.
- దుకాణంలో మొత్తం 6 అంతస్తులు ఉన్నాయి మరియు ప్రతి ఫ్లోర్‌లో వివిధ రకాల భర్తల గురించి వివరించబడింది.
- కస్టమర్లు ఏ అంతస్తు నుండి అయినా భర్తను ఎంచుకోవచ్చు.
- మీరు ఒక్కసారి పైకి వెళ్తే, దుకాణం నుండి నిష్క్రమించడం తప్ప, మీరు తిరిగి క్రిందికి రాలేరు.
ఓ యువతి ఉద్వేగంతో షాపులోకి ప్రవేశించింది.
🎁 *మొదటి అంతస్తు:*
సంకేతం ఇలా ఉంది:
"ఇక్కడ, భర్తలు ఉద్యోగం మరియు నిజాయితీగా ఉన్నారు."
ఇంకొంచెం చూస్తాను’’ అనుకుని ఆ అమ్మాయి ముందుకు కదిలింది.
🎁 *రెండవ అంతస్తు:*
సంకేతం ఇలా ఉంది:
"ఇక్కడ, భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీపరులు మరియు పిల్లలను ప్రేమిస్తారు."
“ఇంకా మంచిదేదో చూస్తాను” అని ఆ అమ్మాయి మళ్ళీ ఆలోచించి ముందుకు సాగింది.
🎁 *మూడో అంతస్తు:*
సంకేతం ఇలా ఉంది:
"ఇక్కడ, భర్తలు ఉద్యోగంలో ఉన్నారు, నిజాయితీపరులు, పిల్లలను ప్రేమిస్తారు మరియు చాలా అందంగా ఉన్నారు."
ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆగింది కానీ ముందుకు వెళ్లకుండా ఉండలేకపోయింది.
🎁 *నాల్గవ అంతస్తు:*
సంకేతం ఇలా ఉంది:
"ఇక్కడ, భర్తలు ఉద్యోగం, నిజాయితీ, అందమైన మరియు ఇంటి పనులలో సహాయం చేస్తారు."
“ఇంతకంటే ఏం బాగుంటుంది?” అనుకుంది ఆ అమ్మాయి. కానీ ఆమె హృదయం "ఇంకో అంతస్తు చూద్దాం" అని చెప్పింది.
🎁 *ఐదవ అంతస్తు:*
సంకేతం ఇలా ఉంది:
"ఇక్కడ, భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీపరులు, అందమైనవారు, ఇంటి పనులలో సహాయం చేస్తారు మరియు వారి భార్యలను గాఢంగా ప్రేమిస్తారు."
ఆ అమ్మాయి నమ్మలేకపోయింది. “అలాంటి భర్త ఉండగలడా?” అనుకుంది. కానీ ఉత్సుకత ఆమెను చివరి అంతస్తుకు తీసుకెళ్లింది.
🎁 *ఆరవ అంతస్తు:*
సంకేతం ఇలా ఉంది:
"మీరు ఈ అంతస్తుకు వచ్చిన 3339వ మహిళ. ఇక్కడ భర్తలు లేరు. మహిళలను పూర్తిగా సంతృప్తి పరచడం అసాధ్యమని నిరూపించడానికి మాత్రమే ఈ అంతస్తు. మా దుకాణాన్ని సందర్శించినందుకు ధన్యవాదాలు! ఎడమ వైపున ఉన్న మెట్లు బయటికి దారితీస్తాయి."
*ముగింపు:* 🙏🏻
నేటి కాలంలో, చాలా కుటుంబాలు మరియు అమ్మాయిలు *"అత్యుత్తమమైన"* అన్వేషణలో వివాహానికి సరైన వయస్సు మరియు అవకాశాన్ని కోల్పోతున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం గొప్ప జ్ఞానం.
శివాలయానికి సేవ చేయడం
*శివాలయానికి సేవ చేయడం వలన కలిగే విశేష ఫలితాలు!!*
శివాలయం రోజూగానీ, వారాని కోసారి కానీ, ఏదైనా పండుగలు, ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తాం.
ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటాం. అక్కడ విశేషమైన ఆర్జిత సేవలు జరిపించుకుంటాం.
అవకాశాన్ని బట్టి అక్కడి ఇతర ఆలయాలను, సందర్శనీయ స్థలాలను దర్శిస్తాం. క్షేత్రంలో నిద్రచేస్తాం. అంతవరకే చాలా మందికి తెలిసిన విషయం.
భక్తులకు తెలియాల్సిన మరో విషయం ఏంటంటే ఆలయంలో ఎన్నో సేవలను మనం స్వచ్ఛందంగా నిర్వహించవచ్చు.
అలా చేస్తే కలిగే ఫలితం చాలా విశేషంగా చెప్పబడింది.
శివాలయం నిర్మాణం చేస్తే..
నిర్వహణ చేస్తే.. పునరుద్ధరణ చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో దానితో సమానమైన ఫలితాలు శివాలయ సేవ ద్వారా పొందవచ్చని శివధర్మశాస్త్రంలో వివరించబడింది.
*దర్శిస్తే చాలు...*
*దూరతః శిఖరం దృష్ట్వా నమస్కుర్యాచ్ఛివాలయమ్ |*
*సప్తజన్మకృతం పాపం క్షిప్రమేవ వినశ్యతి ||*
దూరం నుండి ఆలయశిఖరాన్ని దర్శించిన వెంటనేనమస్కరించాలి. అలా చేస్తే ఏడుజన్మలలో తాను చేసిన పాపాలనుండి వెంటనే విముక్తుడౌతాడు.
*పరిశుభ్రం చేస్తే...*
*పశ్యన్ పరిహరన్ జంతూన్ మార్జన్యా మృదుసూక్ష్మయా |*
*శనైస్సమ్మార్జనం కుర్యాత్ చాంద్రాయణఫలం లభేత్ ||*
శివాలయానికి వెళ్లిన భక్తులు అక్కడ ఏవైనా ప్రాణులు, పశువులు తిరుగుతుంటే వాటిని హింసించకుండా బయటకు పంపి మెత్తటి మార్జని (చీపురు)తో ఆలయాన్ని తుడిచి పరిశుభ్రం చేస్తే చాంద్రాయణ వ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుంది.
*ఆవు పేడతో అలికితే..*
ఆవు పేడతో ఆలయాన్ని శుభ్రంగా అలికితే కూడా ఎంతో ఫలితం ఉందని చెప్పబడుతోంది.
ఆ ఆవు పేడను మంచి ఆవుల నుండి సేకరించాలి. తన ఇంటి నుంచి తీసుకురావాలి. లేదా పవిత్రమైన చోటునుండి తేవచ్చు.
ఆ గోమయాన్ని కూడా పైభాగం, కిందభాగం వదిలి మధ్యలో శుద్ధం, మలినం కాని ఆవుపేడనే తీసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది.
అలాంటి గోమయంతో శివాలయ పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే తమ పూర్వీకులు తరించి గోలోకం చేరుకుంటారు. అంతేకాక అలా చేస్తే సిరిసంపదలతో తులతూగుతారు.
*నీటితో శుభ్రపరిస్తే...*
*యః కుర్యాత్ సర్వకార్యాణి వస్త్రపూతేన వారిణా |*
*స ముని స్స మహాసాధు స్స యోగీ స శివం ప్రజేత్ ||*
వస్త్రంతో వడగట్టిన నీటితో ఆలయాన్ని పరిశుభ్రం చేసినవారు సజ్జనులు. అతడు యోగియై శివుని చేరుకుంటాడు.
అలాగే శివాలయం నేలను అద్దంలా.. అంటే నేలవైపు చూస్తే, తన ప్రతిబింబం కనపడేలా తుడిచినా ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది.
*పూలతో అలంకరిస్తే...*
*యావద్ధస్తా భవే ద్భూమిః సమన్తా దుపశోభితా*
*తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే*
శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించినా..
అందంగా తీర్చిదిద్దినా...
ఎంత ప్రదేశం తీర్చిదిద్దాడో దాన్ని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకంలో నివసిస్తారని చెప్పబడుతోంది. పుష్పవనాలను పాదుగొల్పినా... శివలోకం చేరతాడు.
*శివరూపాలను చిత్రిస్తే.*
*యావంతి రుద్రరూపాణి స్వరూపాణ్యపి లేఖయేత్ |*
*తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే ||*
చిత్రకారులను రప్పించి వారితో శివాలయంలో వేదపురాణాలలో పేర్కొనబడిన శివుని అవతారాలు, లీలలకు సంబంధించిన చిత్రాలు వేయించాలి.
అలా ఎన్ని బొమ్మలు చిత్రిస్తారో అంతకాలం రుద్రకాలంలో గొప్పగా ప్రకాశిస్తారు.
*వెల్ల వేయిస్తే...*
*సుధావిలిప్తం యః కుర్యాత్ సర్వయత్నైశ్శివాలయమ్ |*
*తావత్పుణ్యం భవేత్ సోపి యావదాయతనే కృతే |*
శివాలయానికి, ప్రాకారం గోడలకు సుధాకర్మ (సున్నం పూయించడం) చేయించినవారికి ఆలయనిర్మాణం చేసిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది.
అలాగే ప్రతి సంవత్సరం విడువకుండా, పాలవంటి తెల్లసున్నంతో లేదా వేరే రంగులతో అందంగా వెల్లవేయించినా అతడికి శివలోకవాసపుణ్యం లభిస్తుంది.
అలాగే ఆలయంలోని గోడలకు సుగంధాలు పూయడం, గుగ్గిలంతో ధూపం వేయడం, చక్కగా రంగురంగుల ముగ్గులు పెట్టడం, పూలతోటలను బాగుచేయడం, ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తీసివేయడం, దీపాలకు కావాల్సిన వత్తులను సిద్ధం చేయడం, తోటి భక్తులకు సాయం చేయడం, ఆలయంలో భక్తులకు మంచినీరు ఇవ్వడం, ప్రసాదవితరణ ఇలా ఎన్నో సేవలను భక్తులు ఆచరించవచ్చు.
ఈ అవకాశం మనం గ్రామాల్లో ఉండే ఎన్నో ఆలయాల్లో మనం నిర్వహించుకుంటే ప్రతీ దేవాలయం దివ్యమైన భవ్యమైన శోభతో అలరారుతుంది.
భక్తులకూ కల్పవృక్షమై నిలుస్తుంది.
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5125*
*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం - పంచమి - శతభిషం - స్థిర వాసరే* (04.01.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
సాహస యుక్తి గూర్చి
ఉ.సాహస యుక్తి గూర్చి మనసా వచనమ్ముల సన్నుతించి సం
దేహ నివృత్తి జేయగల ధీమతి నొప్పు విశేష రీతులీ
సాహితి యందు గూర్చగల శక్తి నొసంగుమ హంస వాహినీ
స్నేహపు వృత్తి నైజమును నెమ్మది నా కొసగంగ వేడెదన్౹౹ 115
శా. అమ్మా! శారద! లోకమాత! జననీ! ఆనందమున్ గూర్చరా
వమ్మా నిన్ను మనమ్మునన్ గొలిచి నా ఆత్మీయతం దెల్పుచున్
సమ్మానించుచు నుందు జీవనములో స్వారస్యమున్ గూర్చ చే
కొమ్మా నాదగు ప్రార్థనల్ నతులనే గూర్చంగ దీవించుమా!౹౹ 116
తామరాకు మీద నీటిబొట్టు..
తామరాకు మీద నీటిబొట్టు..
భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడితో ‘కర్మను చేయడంలోనే నీకు అధికారం... ఫలంపై లేదు. కర్మఫలానికి నువ్వు కారణం కారాదు. అలాగని కర్మల్ని చేయడం మానవద్దు’ అని బోధిస్తాడు.
అందుకే మన పెద్దలు తామరాకు మీద నీటిబొట్టులా మనిషి మసలుకోవాలని, కర్మకు బద్ధుడు కాకూడదని హితవు చెబుతారు. తామరాకుపై నీటిబొట్టు తామరాకును అంటుకోదు, పట్టుకోదు. అలాగే మనిషీ నిష్కామ బుద్ధితో, నిస్వార్థ బుద్ధితో కర్మలు నిర్వర్తించాలి.
కర్తవ్య నిర్వహణ పట్ల బాధ్యత ఉండాలి తప్ప బంధం, ఆశ పనికిరావు. బాధ్యతతో సక్రమంగా కర్తవ్య నిర్వహణ చేసినప్పుడు ఆ పరిపూర్ణత తప్పక తృప్తినిస్తుంది. కర్మఫలాలపై మనకెలాంటి అధికారం లేదు. కాబట్టి వాటిని భక్తితో, వినయంగా పరమాత్మకు అర్పించాలి.
కర్మబంధం వదిలించుకోవడానికి కర్మాచరణను మాననవసరం లేదు, ఫలాపేక్షను వదిలి నిస్సంగంగా విద్యుక్త కర్మను ఆచరించు- అని గీతాచార్యుడు బోధిస్తున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడి బోధనలు విన్న అర్జునుడు కర్మను వదిలేయలేదు. ఉత్సాహంగా గాండీవాన్ని చేపట్టాడు. విజయుడయ్యాడు.
‘గృహస్థుగా కర్తవ్య కర్మలు అనుష్ఠించి తామరాకు మీద నీటిబొట్టులా, నీటిమీద పయనిస్తున్న నావలా మసలుకునే వ్యక్తికి సంసారమనే బురద అంటదు. ఆ వ్యక్తి జీవన్ముక్తుడే’ అంటారు సద్గురువులు. దేహాభిమానం వదిలేసి వస్తు విశేషాలతో మానసిక సంబంధం పెట్టుకోకపోవడం వల్లే జనకుడు, నిష్కామ కర్మ ద్వారా అంబరీషుడు... ముక్తిని పొందారు.
మనం ఆచరించే సత్కర్మలు సత్ఫలితాన్ని, దుష్కర్మలు దుష్ఫలితాల్నీ ఇస్తాయి. అవి ఎప్పుడు ఎలా అందాలని ఆ భగవంతుడు నిర్దేశిస్తాడో అలాగే అందుతాయి. వాటికై ఎదురుచూడకూడదు. ఫలాపేక్ష విషయంలో ఎంత విరక్తి చూపగలిగితే కర్మను అంత సమర్థంగా, ప్రశాంతంగా ఆచరించగలుగుతాం.
తామరాకు మీద నీటి బిందువులెన్ని పడినా ఆకు తడవదు. అలాగే కష్టాలు ఎన్ని వచ్చినా మనిషి చలించరాదని పెద్దల మాట. ఇది చెప్పినంత తేలిక కాదు కదా అనిపిస్తుంది. పురాణ పురుషులే ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. శ్రీరాముడు సతీవియోగాన్ని తట్టుకోలేకపోయాడు. వేదవ్యాసుడు పుత్రశోకాన్ని భరించలేకపోయాడు. రావణబ్రహ్మ తన కుమారుల మరణానికి ఎంతగానో కుంగిపోయాడు. కష్టాలు వచ్చినప్పుడు దుఃఖం అనివార్యం. కాని దుఃఖ వివశత్వంతో మనల్ని మనం కోల్పోకూడదు. సుఖం ప్రతి ఒక్కరికీ సంతోషదాయకమే. కాని అది శాశ్వతమనే భ్రమలో పడకూడదు. ఈ సుఖదుఃఖాలకు అతీతంగా ఉండాలంటే మనిషి నిశ్చల మనస్కుడు కావాలి.
నిశ్చల మనస్తత్వం కలిగిన మనిషి నిందలకు భయపడడు. పొగడ్తలకు పొంగిపోకుండా అన్నింటినీ సమభావనతో చూస్తాడు. ఆ మనిషికి శోకం, సంతోషం ఉండవు. ఏ విపత్తు సంభవించబోతున్నదోనన్న భయం బాధించదు. ఆ మనిషి ఎలాంటి ప్రలోభాలకూ లొంగడు. ఎలాంటి పరిస్థితినైనా నిబ్బరంతో ఎదుర్కొంటాడు. ఆత్మతత్త్వం అలవరచుకుని ఆత్మజ్ఞానిలా ప్రకాశిస్తాడు. ఎల్లప్పుడూ తన మనసును, బుద్ధిని అంతర్యామిపై లగ్నం చేస్తాడు. సత్య నిష్ఠతో ముందుకు సాగి జీవితాన్ని తపస్సులా మార్చుకుంటాడు.