5, సెప్టెంబర్ 2026, శనివారం

పంచాంగం 05.09.2026 Saturday,

  ఈ రోజు పంచాంగం 05.09.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస క్రిష్ణ పక్ష నవమి తిథి స్థిర వాసర మృగశిర నక్షత్రం వజ్ర యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

 


శ్రాద్ధ తిథి నవమి 



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము



శ్రీ భగవానువాచ ।

మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః ।

అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ।। 1 ।।




ప్రతిపదార్థ:



శ్రీ భగవాన్ ఉవాచ — భగవంతుడు ఇలా పలికెను; మయి — నా పట్ల; ఆసక్త-మనాః — ఆసక్తి కలిగిన మనస్సు తో; పార్థ — అర్జున, ప్రిథ పుత్రుడా; యోగం — భక్తి యోగము; యుంజన్ — అభ్యాసము చేస్తూ; మద్-ఆశ్రయః — నన్ను శరణుజొచ్చి ; అసంశయం — సందేహము లేకుండా; సమగ్రం — పూర్తిగా; మాం — నన్ను; యథా — ఎట్లా; జ్ఞాస్యసి — నీవు తెలుసుకొనగలవో; తత్ — అది; శృణు — వినుము.



తాత్పర్యము:

 


భగవంతుడు పలికెను: ఓ అర్జునా, నాయందు మాత్రమే మనస్సు నిలిపి, భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా, సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో, ఇప్పుడు వినుము.



వివరణ:



మనస్సు తన యందు అనన్య భక్తితో లగ్నం చేసి భక్తితో తనను సేవించువారు, యోగులలో శ్రేష్ఠులు అని 6వ అధ్యాయం ముగింపులో, శ్రీ కృష్ణుడు చెప్పి ఉన్నాడు. సహజంగా ఈ ప్రతిపాదన కొన్ని ప్రశ్నలకు దారితీయవచ్చు: భగవంతుడిని గూర్చి తెలుసుకునే మార్గం ఏమిటి? ఆయనపై ధ్యానం చేయటం ఎలా? భక్తుడు భగవత్ ఆరాధన ఎలా చేయాలి? అర్జునుడు ఈ ప్రశ్నలను అడగకపోయినా, తన కరుణచే, భగవంతుడు ముందే ఊహించి చెప్పటం ప్రారంభిస్తున్నాడు. ఆయన 'శృణు' అన్న పదం వాడాడు, అంటే ‘వినుము’ అని అర్థం, అంతేకాక మద్-ఆశ్రయః అని కూడా లక్షణం చేర్చాడు అంటే ‘నీ మనస్సు నాయందే లగ్నంచేసి’ అని అర్థం.

05సెప్టెంబర్26🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     🍁 *శనివారం*🍁

  *🌹05సెప్టెంబర్26🌹*  

   *దృగ్గణిత పంచాంగం*       

           

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి : నవమి* రా 09.53 వరకు ఉపరి *దశమి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : మృగశిర* రా 09.30 వరకు ఉపరి *ఆరుద్ర*

*యోగం : వజ్ర* మ 12.47 వరకు ఉపరి *సిద్ధి*

*కరణం  : తైతుల* ఉ 11.04 *గరజి* రా 09.53 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.30 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *మ 01.17 - 02.46*

అభిజిత్ కాలం  : *ప 11.41 - 12.31*

*వర్జ్యం    : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం :ఉ05.55-07.34*

*రాహు కాలం  :ఉ09.00 - 10.33*

గుళికకాళం      : *ఉ 05.55 - 07.27*

యమగండం    : *మ 01.39 - 03.12*

సూర్యరాశి : *సింహం*           

చంద్రరాశి : *వృషభం/మిధునం*

సూర్యోదయం :*ఉ 06.03* 

సూర్యాస్తమయం :*సా 06.27*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు;*

ప్రాతః కాలం     : *ఉ 05.55 -08.23*

సంగవ కాలం        : *08.23 -10.52*

మధ్యాహ్న కాలం    : *10.52 - 01.20*

అపరాహ్న కాలం : *మ 01.20-03.49*

*ఆబ్ధికం తిధి        : శ్రావణ బహుళ నవమి*

సాయంకాలం    : *సా 03.49 - 06.18*

ప్రదోష కాలం      : *సా 06.18 - 08.37*

రాత్రి కాలం        : *రా 08.37 - 11.43*

నిశీధి కాలం      :*రా 11.43 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

*🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


*🙏ఓం నమో వెంకటేశాయ🙏*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

కృష్ణనామ స్మరణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*


    *కృష్ణనామ స్మరణం*  

      *కలిదోష నాశనం*           

```

*శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. 

*‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు.

 

*కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. 


*పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది.


*మృత్యు సమయంలోకూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట.


*భగవానుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రం చేతనే పాపాలన్నీ సంపూర్ణంగా నశించుతాయని చెప్పబడింది. 


*ఒక జీవిత కాలంలో జరిగే పాపమంతటినీ కలిపినప్పటికీ, నామాగ్ని ముందు గడ్డిపోచతో సమం అని పురాణ వచనం. 


*పాపక్షయానికై నామస్మరణం ఏ ఇతర సాధనాలతోను సముచ్చయంగా ఉండవలసిన అవసరం లేదు.


*భగవన్నామ సంకీర్తన సాధనేతర నిరపేక్షంగానే పాపక్షయానికి సాధనమని పండితార్ధం కదా! కలియుగంలో నామ సంకీర్తనమే ముక్తికి సాధనంగా చెప్పబడింది.


*కలి వల్ల కలిగే దుష్ఫలితాలను పోగొట్టుకోవడం ఎట్లా అని ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని అడుగగా ‘సత్య యుగంలో ధ్యానంవల్ల, త్రేతాయుగంలో యజ్ఞాలవల్ల, ద్వాపర యుగంలో పూజలు, వ్రతాలవల్ల పొందే ఫలితాలన్నీ కలియుగంలో కేవలం నామస్మరణ వలన పొందుతారని ‘హరే రామ హరే రామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’ అనే నామ మంత్రం ఉపదేశించాడు.


*ఈ మంత్రంలోని రామ శబ్దం, హరి శబ్దం పరబ్రహ్మవాచకమైన శ్రీకృష్ణుణ్ణే సూచిస్తాయి.


*’కృష్ణః’ అంటే పాపాలు పోగొట్టేవాడు. ‘కృష్ణః’ అనే పదంలోని ‘క’కారం బ్రహ్మవాచకం, ‘ఋ‘కారం అనంత వాచకం. ‘ష’ కారం శివ సూచకం, ‘ణ’ కారం ధర్మబోధకం. చివర ఉన్న ఆ కారం శ్వేత ద్వీప వాసియైన విష్ణు వాచకం. విసర్గం నర నారాయణార్ధకం. కనుక కృష్ణుడు సమస్త దేవతల తేజోరాశి.


*‘కృష్ణస్తు భగవాన్ స్వయమ్’ అని కృష్ణ భగవానుని నామాన్ని నిత్యం స్మరించినంత మాత్రానికే పదివేల యజ్ఞాలు, కోటి తీర్థ స్నాన పుణ్యం లభిస్తుందని వ్రతాల వలన కూడా నశించని పాపాలు కృష్ణ అని నామోచ్చరణ చేయడంతో తొలగిపోతాయని, ‘కృష్ణ’ అంటూ కీర్తించే వారి శరీరం ఎన్నటికీ అపవిత్రం కాజాలదని, జన్మ జన్మల పాపాలన్నీ తొలగి కృష్ణునిపై మనసు లగ్నమవుతుంది. 


*శ్రీకృష్ణ నామ మహిమ గురించి సాక్షాత్తు శ్రీమహా విష్ణువే బ్రహ్మకు చెప్పే సందర్భం స్కందపురాణంలో ఉంది. 


*‘కృష్ణ నామోచ్ఛారణ చేయడం వల్ల నాకెంత ప్రీతికలగుతుందంటే, ఇతర నామాలు కోటిసార్లు చేసినా నాకు అంత సంతోషం కలగదు’ అన్నాడు.


*నామ స్మరణకే ప్రభావమున్నదని గ్రహించి, శ్రీకృష్ణ నామమునే సదా స్మరించి నారదాదులు ఆయన కృపకు పాత్రులయ్యారు. 


*కనుక కలియుగంలో జీవిస్తున్న మానవులందరికీ నామ మహిమను, లోక ధర్మాలని చెప్పిన కారణంగా శ్రీకృష్ణావతారము కలియుగ ప్రజలందరికీ గొప్పది. ఆచరణానికి అనువైనది. ‘భక్త దుఃఖ కర్షిం కృష్ణః’ అంటే భక్తుల దుఃఖాన్ని పోగొట్టేవాడు శ్రీకృష్ణుడు అని అర్ధం.


*మానవ జీవితంలోని పాపాల్ని పోగొట్టుకోడానికి శాస్త్రాలలో అనేక ప్రాయశ్చితాలు చెప్పారు.


*చాంద్రాయణాదివ్రతాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్ని చేసినా ఆ పాపం పోదు. కానీ శ్రీకృష్ణ నామం జపిస్తే ‘క్షోభం’ వల్ల కలిగిన పాపం కూడా నశిస్తుంది.


*అందుకు కారణం శ్రీకృష్ణ నామంలో క్లేశఘ్ని-పాపఘ్ని అనే బలవత్తరమైన శక్తులుండడమే నని-ఈ జగత్తులో పరమాత్ముడు ఎన్ని రూపాలతో విరాజిల్లుతున్నాడో అన్ని నామాలతో ఆయన పేర్కొనబడుతుంటాడు. కృష్ణ నామం పాపాన్ని నాశనం చేసి, పుణ్యాన్ని ఉత్పాదించి, భక్తిని తత్త్వజ్ఞానాన్ని, భగవతృప్తిని కలిగిస్తుంది. కృష్ణనామం జపం చేసేవారికి విపత్తియే సంపత్తిగా పరిణమిస్తుంది.


పురుషోత్తముడు, స్థితప్రజ్ఞుడైన శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క మహోన్నతావతారం. ‘పదారు కళల్లో మూర్త్భీవించిన పూర్ణావతారం. జీవులు తరించుటకు ఉపనిషత్సారమైన గీతామృతాన్ని పంచిపెట్టిన ప్రేమ మూర్తి.’ ద్వాపర యుగంలో రోహిణీ నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు. అష్టమియొక్క అర్ధరాత్రి సమయంలో ఆకాశమందు అర్ధ చంద్రుడు ప్రకాశించగా, పృధ్వియందు పూర్ణ చంద్రుడు ఉదయించిననట్టు శరణాగత వత్సలుడు దేవకీదేవికి జననం..


*శ్రీకృష్ణావతారం సంపూర్ణావతారమనీ, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేనని భాగవతం మనకు వెల్లడిస్తోంది. ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మకు భక్తి ప్రపుల్లాత్ములమై ప్రణమిల్లి మన జీవితాలను ధన్యం చేసుకుందాం.```


         *శ్రీ కృష్ణ శరణం మమ*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                     🌷🙏🌷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

శనివారం 5 సెప్టెంబర్ 2026*

  *శనివారం 5 సెప్టెంబర్ 2026*


*శ్రీమద్భాగవతం - 40/42* 


*రుక్మి వధ, బాణాసుర యుద్ధం, నృగ మోక్షం & బలరాముని గోకుల యాత్ర*


*మన భాగవత అధ్యయనం లో చిన్న మార్పు జరిగింది ..*

మొదట అనుకున్న ప్రకారం అయితే కృష్ణ అష్టమి తో మన అధ్యయనం పూర్తి అవుతుంది. కానీ కృష్ణ అష్టమి రోజు అందరి ఇంట స్వామి చిన్ని అడుగులు పడే శుభ సమయంలో మనం శ్రీ కృష్ణ అవతారము పరిసమాప్తి అయిన ఘట్టం అధ్యయనం చేసుకోవడం అంత సబబుగా అనిపించలేదు.(పాత షెడ్యూలు ప్రకారం అదే ఉంది అదే చివరి ఘట్టం కూడా)


దానికి తోడు ఈ మూడు రోజుల లో దాదాపు 80 అధ్యాయాలు పూర్తి చేయటం కూడా అసాధ్యం, ఇన్ని రోజులు సంపూర్ణంగా అధ్యయనం చేసుకుని చివర్లో ఇన్ని అధ్యాయాలు వదిలేసి ఏదో పూర్తయింది అనిపించుకుని మనం సాధించేది ఏమిటి ఏమీ లేదు కదా అనిపించింది, బహుశా స్వామి ఇచ్చిన సంకల్పం అనుకుంట..


*అందుకే మరో వారం రోజుల పాటు అధ్యయనం పొడిగించి 48 వ రోజు సంపూర్ణం చేసుకుందాం,* ఇలా అయితే అన్ని విషయాలు కనీసం తెలుసుకోగలుగుతాం.అందుకే నిన్న వదిలేసి ముందుకు పోయిన ఆ అధ్యాయాల లను ఈరోజు చదువుకుందాం,మిగతా లీలలు ఈ ఏడు రోజులు చదువుకుందాం, మరో ఏడు రోజులు స్వామీ తనతో గడిపే భాగ్యం ఇచ్చాడు అదృష్టవంతులం,ఇక కథలోకి వెళ్దాం.....


1.అనిరుద్ధుని వివాహము & బలరాముని చేతిలో రుక్మి వధ


శ్రీకృష్ణునికి అష్టమహిషుల ద్వారా ఒక్కొక్కరికి పదేసి మంది కుమారులు,ఒక కుమార్తె జన్మించారు.వారు రూపము, బలము, మొదలయిన లక్షణములలో తమ తండ్రియైన శ్రీకృష్ణభగవానునకు ఏమాత్రమూ తీసిపోరు.ముమ్మూర్తులా వారు తండ్రిని పోలియుండిరి.


రాజకుమార్తెలు(భార్యలు)అందఱు శ్రీకృష్ణప్రభువు తమ ఇంటినుండి బయటికి వెళ్లక తమ దగ్గరే ఉండటం గమనించి, 'నేను మాత్రమే ఆ స్వామికి ప్రియపత్నిని' అని ఎవరికివారు అనుకునే వారు.ఎందుకంటే వారు వాస్తవముగా పురుషోత్తమునియొక్కమహత్త్వమును ఎఱుగరు కదా(నిన్ననే చెప్పుకున్నాం కదా స్వామి ఒకే సమయంలో ఒకే రూపంలో అన్ని గృహాలలో ఉన్నాడు అని అందుకే అందరూ నేనే ఇష్టం నా స్వామికి అని అనుకుంటూ ఉండేవారు).


ఇక శ్రీకృష్ణ పరమాత్మ కు రుక్మిణీదేవి యందు పుట్టిన ప్రథమ ప్రథమ పుత్రుడైన ప్రద్యుమ్నుడు (మన్మథుని అవతారం).(మిగిలిన వారి పేర్లు ఇక్కడ చెప్పడం లేదు దాదాపు 80 పేర్లు ఉంటాయి)


ఈ ప్రద్యుమ్నుడు తనను సంహరించే వాడు అని తెలుసుకున్న శంబరాసురుడు, పుట్టిన పదవ రోజునే అతన్ని అపహరించి, సముద్రంలో పడవేశాడు,ఆ బాలున్ని చేప మింగితే జాలరులు ఆ చేపను వాడి అంతఃపురం లో ఉన్న రతి దేవి కి ఇస్తారు(మాయవతిగా జన్మిస్తుంది) ఆమె ఇతడే తన భర్త అని తెల్సుకుని సకల విద్యలు నేర్పుతుంది అతడే శంబరాసురునీ సంహరించి, ద్వారక లో రతి సహితంగా అడుగు పెడతాడు. ఆ తదుపరి


 పూర్వం శ్రీకృష్ణుని చేతిలో పరాభవం పొందిన రుక్మి, తన చెల్లెలైన రుక్మిణిని సంతోషపెట్టడానికి తన కుమార్తెయైన **రుక్మవతిని** ప్రద్యుమ్నునికి ఇచ్చి వివాహం చేశాడు. వారి కుమారుడే **అనిరుద్ధుడు**.


* ఆ తర్వాత అనిరుద్ధునికి రుక్మి మనవరాలైన **రోచనతో** వివాహం నిశ్చయమై భోజకట నగరంలో వైభవంగా వివాహం జరిగింది.


* **ద్యూత క్రీడ & రుక్మి మరణం:** 

వివాహానంతరం రుక్మి బలరాముడిని జూదానికి (పాచికలాటకు) ఆహ్వానించాడు. కళింగరాజు మొదలైన దుష్ట రాజుల ప్రోత్సాహంతో రుక్మి కపటంగా ఆడుతూ, బలరాముడు గెలిచినా "నేనే గెలిచాను" అని ఎగతాళి చేశాడు. కళింగరాజు పళ్లు చూపి నవ్వాడు. చివరకు పది కోట్ల వరాహాలు పందెం గా పెట్టీ ఆడారు, అందులో కూడా బలరాముడే గెలిచాడు కానీ రుక్మి నేనే గెలిచాను నేనే గెలిచాను అన్నాడు, ఆకాశవాణి కూడా బలరాముడే గెలిచాడు, రుక్మి వాక్యాలు అసత్యం అని చెప్పింది.


అయినా దుష్టులైన రాజకుమారుల ప్రేరణతో రుక్మి ఆయువు మూడినవాడై బలరాముని పరిహసించుచు ఇలా అన్నాడు '‘బలరామా! పశువులకాపరులై వనములలో తిరుగే మీవంటి యాదవులకు 'అక్షవిద్య' ఏమి తెలియును,బాణం వేయాలన్న, పందెం గెలవాలన్న మా వంటి రాజకుమారులకే చెల్లు అన్నాడు.(రుక్మికి బలరామ కృష్ణుల మీద ద్వేషం తొలగలేదు) దాంతో తీవ్రాగ్రహం చెందిన బలరాముడు అష్టపదమనే బంగారు స్తంభంతో రుక్మి తలపై కొట్టి సంహరించాడు; కళింగరాజు పళ్లు రాలగొట్టాడు. బలరాముని ధర్మవర్తనకు భయపడి మిగిలిన రాజులు పారిపోయారు.ఆ తర్వాత నవ దంపతులను తీసుకొని ద్వారకకు వచ్చాడు కృష్ణుడు.

(రుక్మిణి దేవి బాధపడుతుంది అని ఇక్కడ కృష్ణుడు తటస్థముగా ఉండి పోయాడు)


2. ఉషా-అనిరుద్ధుల ప్రణయం & చిత్రలేఖ మాయ


బలిచక్రవర్తి వందమంది కుమారులలో పెద్ద కుమారుడైన **బాణాసురుడు** శోణితపురాన్ని పాలించేవాడు. పరమశివుని భక్తుడైన బాణునికి వేయి చేతులు (సహస్ర బాహువులు) ఉండేవి. ఇంద్రాది దేవతలు కూడా ఆయనకు సేవలల లాగ ఉండేవారూ.ఒకానొకప్పుడు పరమశివుడు తాండవనృత్యము చేయుచుండగా తన వాద్యనైపుణ్యముతో ఆ కైలాసపతిని ప్రసన్నునిగా చేసికొనెను.అప్పుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా శోణితపురం లోనే ఉండి నన్ను రక్షించాలి అని కోరుకున్నాడు.


 ఒకనాడు బలగర్వం తో శంకరునే యుద్ధానికి పిలిచాడు, నాతో సమాన యోధుడు ఎవరు లేరు నీవొక్కడివే అని,దానికి శంకరుడు నీ రథం ధ్వజము తనకై తాని కూలిన రోజు నీకు యుద్ధం జరుగును నీ బాహుబల దర్పం అణచే వాడే ఆరోజు వస్తాడు అన్నాడు,అది శాపం లాంటిదే కానీ వాడు వరం అనుకుని ఆహా ధన్యుణ్ణి అనుకున్నాడు.


ఆ బాణాసురుడికి కుమార్తె ఉంది ఆమె పేరు ఉష ఆమెకు ఒకనాడు కలలో ఒక సుందర పురుషుడు కనిపించి ఆమె హృదయాన్ని దోచుకున్నాడు. నిద్రలేచి విరహంతో బాధపడుతుండగా, ఆమె ప్రియసఖి, మంత్రి బాణపుత్రుడైన కుంభాండుని కుమార్తె చిత్రలేఖ విషయం తెలుసుకుని,నేను నీ వేదన తీరుస్తాను అని సమస్త దేవ, గంధర్వ, యక్ష, నర వీరుల చిత్రపటాలను గీసి చూపించింది.


అవన్ని చూస్తూ అనిరుద్ధుని చిత్రాన్ని చూడగానే ఉష సిగ్గుపడి, చిరు నవ్వుతో,ఇతడే,ఇతడే నా మనోహరుడు" అని తెలిపింది.చిత్రలేఖ యోగశక్తితో ఆకాశమార్గాన ద్వారకకు వెళ్లి, శయనమందిరంలో నిద్రిస్తున్న అనిరుద్ధుడిని మంచంతో సహా ఎత్తుకొచ్చి ఉష అంతఃపురంలో ఉంచింది.


#3. బాణాసుర యుద్ధం – హరి-హర సమరం

ఉషా దేవి ముఖం ఆ అనిరుద్ధుని చూడగానే సంతోషంతో కోటికాంతులతో వెలిగిపోయింది,ఆమె అనేక సేవలతో తన ప్రియునీ ఆరాధించి,సేవించింది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. వారిద్దరు ప్రేమ పారవశ్యం లో మునిగి ఉండగా. రాజభటులు రాకుమారి లో కలిగిన మార్పులు పసిగట్టి రాజుకు తెలియచేశారు.


అంతఃపురంలో అనిరుద్ధుడు ఉన్న విషయం తెలిసి బాణాసురుడు నాగపాశాలతో అనిరుద్ధుడిని బంధించాడు. అది చూసి ఉషా దేవి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది.


అటు నాలుగు నెలల పాటు అనిరుద్ధుని జాడలేక ద్వారకలో అంతా దిగులు చెందారు,ఒకనాడు నారదుని ద్వారా అనిరుద్ధుడు బంధింపబడ్డాడు అన్న విషయం తెలుసుకున్న శ్రీకృష్ణ, బలరామ, ప్రద్యుమ్నాది యాదవ వీరులు గరుడారూఢులై శోణితపురాన్ని ముట్టడించారు.


* **శివుని రక్షణ:** తన భక్తుడైన బాణాసురుని రక్షించడానికి సాక్షాత్తు పరమశివుడు, కుమారస్వామి, ప్రమథగణాలతో కలిసి శ్రీకృష్ణునికి ఎదురుగా నిలిచాడు. లోకాలే భయపడేలా **హరి-హర యుద్ధం** జరిగింది.అది చూడటానికి దేవతలే దిగి వచ్చారు.


శ్రీకృష్ణుడు శివునిపై 'జృంభణాస్త్రం' ప్రయోగించి పరమశివునికి ఆవలింతలు తెప్పించి నిశ్చేష్టుడిని చేశాడు. ప్రద్యుమ్నుడు కార్తికేయుడిని, బలరాముడు కుంభాండుడిని ఓడించారు.


* **శివజ్వరం vs వైష్ణవజ్వరం:

 శివుడు మూడు తలలు, మూడు కాళ్లు ఉన్న 'శివజ్వరాన్ని' ప్రయోగించగా, శ్రీకృష్ణుడు 'వైష్ణవజ్వరాన్ని' ప్రయోగించాడు. వైష్ణవజ్వరం ధాటికి తాళలేక శివజ్వరం శ్రీకృష్ణుని స్తుతించి శాంతించింది.


* **సహస్ర బాహు ఖండన:** 

శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో బాణాసురుని వేయి చేతులలో నాలుగు చేతులు మిగిల్చి మిగిలిన 996 చేతులనుఖండించాడు. పరమశివుడు ప్రత్యక్షమై స్తుతించగా, కృష్ణుడు: "శివా! బాణుడు ప్రహ్లాదుని వంశీయుడు, నా భక్తుడైన బలి పుత్రుడు. కాబట్టి ఇతన్ని చంపను. చిరంజీవిగా ఉంటాడు" అని అభయమిచ్చి, అనిరుద్ధ-ఉషలను ద్వారకకు తోడ్కొని వచ్చాడు.


#4. నృగ మహారాజు వృత్తాంతం – తొండ రూప విమోచనం


ఒకరోజు సాంబాది యాదవ కుమారులు విహారానికి ఉపవానానికి వెళ్లి ఆడుకుంటూ దాహంతో ఒక పాడుబడ్డ బావి వద్దకు వెళ్లారు. అక్కడ నీరు లేదు కానీ పర్వతమంత పెద్దదైన ఒక ఊసరవెల్లి/తొండ (కృకలాసం) కనిపించింది. దాన్ని బయటకు తీయాలని ప్రయత్నం చేశారు కానీ తీయలేక కృష్ణునికి చెప్పారు.


* శ్రీకృష్ణుడు తన ఎడమ చేత్తో ఆ తొండను బయటకు లాగగానే, అది దివ్య దేవుని రూపంగా మారింది.


* ఆయన ఇక్ష్వాకు వంశపు రాజైన **'నృగ మహారాజు'**. కోట్లాది గోవులను బ్రాహ్మణులకు దానం చేసిన పరమ దాత. ఒకసారి ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన ఆవు పొరపాటున మరొక బ్రాహ్మణునికి దానం చేసిన గోవుల మందలో కలిసిపోయింది. ఆ వివాదంలో సమయానికి న్యాయం చేయలేకపోయినందుకు, "తొండవై పడివున్నాను .


 కృష్ణుని పాదస్పర్శతో పాపవిముక్తుడై దివ్యలోకాలకు వెళ్లాడు. అనంతరం శ్రీకృష్ణుడు తన పుత్రులకు: **"బ్రాహ్మణ ద్రవ్యాన్ని, పరుల సొమ్మును హరించడం హాలాహల విషం కంటే ప్రమాదకరం"** అని ఉపదేశించాడు.


#5. బలరాముని గోకుల యాత్ర & యమునా కర్షణ 


శ్రీకృష్ణుని అనుమతితో బలరాముడు తన బాల్య మిత్రులను, గోపగోపికలను, నందయశోదలను చూడటానికి రథంపై గోకులానికి వెళ్లాడు.


* **గోపికల ఆదరణ:** నందయశోదలు, గోపికలు బలరాముడిని ఆలింగనం చేసుకుని కృష్ణుని జ్ఞాపకాలతో కన్నీరుమున్నీరయ్యారు. బలరాముడు రెండు నెలల పాటు గోకులంలోనే ఉండి వారిని ఓదార్చాడు.


* **యమునా కర్షణ:** ఒక పౌర్ణమి రాత్రి వనవిహారం చేస్తూ వరుణుడు పంపిన 'వారుణీ' మధువును సేవించి, జలక్రీడలాడటానికి యమునా నదిని తన వద్దకు రమ్మని పిలిచాడు. యమున రాకపోవడంతో కోపించిన బలరాముడు తన **నాగలితో (హలాయుధంతో)** యమునా నదిని లాగాడు. యమునా దేవి భయపడి ప్రత్యక్షమై క్షమాపణలు వేడుకోగా శాంతించి నదిలో స్నానం చేశాడు. నాటి నుండి యమునా నది బలరాముడు లాగిన మార్గంలో కూడా ప్రవహిస్తోంది.


📝 నేటి ముఖ్య విషయాలు:


1. **హరి-హర అభేదం:** బాణాసుర యుద్ధంలో హరిహరులు తలపడినా, చివరికి ఇద్దరి తత్త్వం ఒకటేనని భాగవతం నిరూపించింది.


2. **దాన ధర్మ నిష్ఠ:** నృగ మహారాజు కథ ద్వారా తెలియజేసే సత్యం — ఎన్ని పుణ్యాలు చేసినా ఇతరుల ధర్మానికి భంగం కలిగించకూడదు; బ్రాహ్మణ/దేవాలయ ద్రవ్యాన్ని అపహరించరాదు.అది మహా దోషం.


3. **బలరామ భక్తవాత్సల్యం:** బలరాముడు స్వయంగా గోకులానికి వెళ్లి భక్తుల విరహతాపాన్ని పోగొట్టడం ఆయన భక్తసులభ తత్త్వానికి నిదర్శనం.


రేపు మరికొన్ని లీలలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు🙏


.....సశేషం

🙏🌹🙏

 

                *సేకరణ*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

మలేరియా జ్వరమునకు

 మలేరియా జ్వరమునకు తులసితో చికిత్స -


      మలేరియా జ్వరం వర్షాకాలం  నందు విపరీతంగా వ్యాప్తి చెందును. ఇది ఇప్పుడు సర్వసాధారణం అయినది. దీనికి ఇతర వైద్యులు "క్యూనైన్ "మందుగా వాడటం జరుగుతుంది. దీనిచే జ్వరం తగ్గును. కానీ తలనొప్పి , చెవులలో హోరుమను శబ్దం , తలతిరుగుట , చెవుడు మొదలుకొని హృదయసంబంధ కాంప్లికేషన్స్ అగుపిస్తున్నాయి. మన ఆయుర్వేద వైద్యం నందు తులసితో ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా ఈ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు. 


  నివారణోపాయాలు  - 


 *  7 మిరియాలు , 7 తులసి ఆకులు కలిపి నమిలి మ్రింగుచున్న  మలేరియా జ్వరం 3  రోజులలో హరించును . 


 *  మానిపసుపు , పిప్పిళ్ళు , వెల్లుల్లి , జీలకర్ర , శొంఠి , తులసి , నారింజ పిందెలు , వావిలి వ్రేళ్ళు , ఆకుపత్రి వీటిని సమాన భాగాలుగా కలిపి చూర్ణించి పూటకు అరతులం వంతున ఇచ్చుచున్న చలిజ్వరములు తగ్గును. 


 *  తులసి ఆకులు 60 గ్రా , కొద్దిగా మందార పుష్పదళములు , కొద్దిగా ఉమ్మెత్త పుష్పదళములు , మిరియాలు 10 గ్రా , కొద్దిగా నీరువేసి మర్దించి బఠాణి గింజంత పరిమాణంతో మాత్రలు చేసి చలిజ్వరం వచ్చుటకు గంట ముందుగా రెండు మాత్రలు తీసుకున్న చలిజ్వరం రాకుండానే పోవును.అలాగే రొజు మార్చి రొజు వచ్చు మలేరియా జ్వరం లందు మంచి ఫలితాన్ని ఇచ్చును . 


 *  మలేరియా జ్వరం మొండిగా ప్రతిసంవత్సరం వస్తూనే ఉండిన తులసీదళములు , మిరియాలు నీటిలో వేసి ఉడికించిన కషాయములో కొద్దిగా బెల్లం , నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే కాఫీ వలే తాగి రగ్గు కప్పుకొని పడుకోవలెను . ఇలా మూడు గంటలకు ఒకమారు చేయుచుండిన మంచి ఫలితం ఉండును. 


 *  తులసి వ్రేళ్ళ కాషాయం త్రాపిన బాగుగా చెమటపట్టి చలిజ్వరం వెంటనే తగ్గును. 


 *  మలేరియా జ్వరం ప్రతిసంవత్సరం భాదించుచున్న వ్యక్తికీ తులసిరసం , పుదీనా రసం , అల్లం రసం ఒక్కొక్కటి 5 గ్రాముల వంతున కలిపి తాగుచున్న మంచి ఫలితం కనిపించును.


  గమనిక  - 


      తులసి చెట్టు వైద్యం కొరకు కుండీలలో ఇంట్లో పెంచుకొనుట చాలా మంచిది.


  నా అనుభవం - 


         ప్రతిరోజు 2 స్పూన్స్ తులసి రసం ఇచ్చి టాబ్లెట్ లేకుండా రక్తపోటు 170 నుంచి 130 కి తీసుకొనివచ్చాను కేవలం 2 వారాలలోనే  ఇలా కొంతకాలం తులసిరసం వాడటం వలన రక్తపోటు పూర్తిగా పోతుంది.