12, ఏప్రిల్ 2022, మంగళవారం

దాంపత్యం - సీతారాముల మనస్సులు

 ॐ    దాంపత్యం - సీతారాముల మనస్సులు 


    బాలకాండ చివరలో, సీతారాముల కళ్యాణానంతరం, అయోధ్యలో సీతారాముల దాంపత్యం గుఱించి వాల్మీకి మహర్షి చక్కగా చెప్పారు. 


   "ఉత్తమమైన మనస్సుగల రాముడు సీతయందే మనస్సు నిలిపెను. 

    ఆమె తన హృదయమునందు రామునే సర్వదా నిలుపుకొనెను. 

    ఈ విధముగ అన్యోన్యాసక్తులై సీతారాములు అనేక ఋతువులపాటు (చాలకాలము) విహరించిరి. 


    తండ్రి అంగీకరించిన సంబంధమగుటచే రామునకు సీతపై ప్రేమకలిగెను.  

    ఆమెయొక్క సద్గుణములచేతను, లోకోత్తర సౌందర్యముచేతను అతని ప్రేమ ఇంకను వృద్ధిచెందెను. 


    సీత హృదయములో భర్తయైన రాముడు రెండింతలుగా మసలుచుండెను. 

    లోలోపల నున్న భావములు గూడ ఒకరి హృదయము, మరొకరి హృదయముతో చెప్పుచుండెడిది." 


"రామస్తు సీతయా సార్థం విజహార బహూనృతూన్ I 

 మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః ॥ 


 ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి I 

 గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోఽభ్యవర్తత ॥ 


 తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే I 

 అన్తర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా ॥" 


              - బాలకాండ 77/28,29,30 


"The high-minded Sri Rama, whose heart was set on his spouse and who stood enthroned in her heart, enjoyed life with her for a long time.  


    Sita was dear to Sri Rama as a partner made available to him by his father, 

     Because of her manifold virtues and comeliness of form his affection for her grew all the more. 


    Her husband too, because of his excellences and lovely exterior gained doubly secure footing in her heart. 


    They could read in minute detail with their minds even that which existed in the inmost hearts of each other." 


విశేషం


    తండ్రి అంగీకరించి చేసిన సంబంధ మగుటచేతను, ఆమెకు గల రూపసద్గుణాలచేతను రామునకు సీతపై గాఢానురాగము కలుగగా, 

    సీతకు మాత్రము అట్టి బాహ్యనిమిత్తములతో పనిలేకుండగనే, భర్తయను ఒక్క కారణముచేతనే రామునిపై రెట్టింపు ప్రేమ యుండెడిది. 

    ఆ ప్రేమ ఎంత ఉత్కృష్టమైనదనగా, వారిరువురును నోటితో కాక హృదయములతోడనే మాటలాడుకొనెడివారు. 

    ఒకరి హృదయములో నున్న భావము నొకరు అనాయాసముగ గ్రహించి తదనుగుణముగ ప్రవర్తించుచుండెడివారు." 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

రామకల్యాణంబుప్రేమానురాగాల

 రామకల్యాణంబుప్రేమానురాగాల

     కాంచని జన్మంబు నెంచవృథయె ,

రామనామంబునోరారసంతృప్తిగా

      పలుకని జన్మంబు తలపవృథయె ,

పానకంబుకయి తాపత్రయాపేక్షల

     బడయని జన్మంబు నుడువవృథయె ,

పందిళ్ళఛాయలఫదినిమేషములైన

     నిలువని జన్మంబు తలపవృథయె ,


రామగాథామృతంబుగోరనిజనుండు

రామకర్ణరసాయనారాధనమున

గొననివీనులు,రామభక్తిని ముడువని

చేతులును,రామునెంచని చిత్తమున్నె!


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.


అశ్వధాటివృత్తం(శ్రీరామనవమిశుభాకాంక్షలతో)

---------------------

శ్రీరామపాదములె చేరంగ శ్రేయముల కారామసీమలగుగా!

శ్రీరామహస్తములె శ్రీరమ్యరాగముల సారప్రదమ్ములగుగా!

శ్రీరామవీక్షణలె పారాడసత్కృపల వీరాసనమ్ములగుగా!

శ్రీరామనామములె ఘోరాఘవేదనల దూరమ్ముసేయుగనగా!


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం .

శంకర విజయాలు -2*

 *#శంకర విజయాలు -2*



*ఆదిశంకరాచార్యుల జయంతి - 6 మే, 2022*


*శంకరులు లేక పోతే - ఈ రోజు మనకు సనాతన ధర్మం లేదు*


1) శంకరులు ఈ ప్రపంచానికి ఎంతో ఉపకారం చేసారు. 

2) ఎన్నో దేవాలయాలకు కుంభాభిషేకాలు చేసారు

3) ఎన్నో దేవాలయాలలో శ్రీచక్రాలు/యంత్రాలు వేసారు

4) ఎన్నో స్తోత్రాలు రచించారు 

5) ఎన్నో భాష్య గ్రంధాలు రచించారు

6) ఎన్నో ప్రకరణ గ్రంధాలు రచించారు

7) తన తల్లి కోసం పూర్ణా నది యొక్క దారి మళ్లించారు

8) తన తల్లి మరణించే సమయంలో ఆకాశం/యోగా మార్గమున వచ్చారు

9) భారత దేశంలో సనాతన ధర్మం కోసం 4 పీఠాలను స్తాపించారు

10) భారత దేశమంతటా 3 సార్లు సంచరించారు


*సాక్ష్యాత్తు కైలాస శంకరుడు  - కాలడి శంకరులుగా ఈ భూమి మీదకు అవతరించారు*


హర హర శంకర !!  జయ జయ శంకర !!

శంకర విజయాలు-1*

 *#శంకర విజయాలు-1*


*ఆది శంకరాచార్యుల జయంతి - 6 మే, 2022*


1) ప్రతి హిందువు శంకర విజయాలు చదవాలి/వినాలి

*2) ఈరోజు సనాతన ధర్మం బ్రతికి ఉండటానికి కారణం ఆదిశంకరాచార్యులు*

3) సాక్ష్యాత్తు కైలాస శంకరుడు - కాలడి శంకరులుగా ఈ భూమి మీదకు అవతరించారు

4) శంకరులు రాకముందు 70కి పైగా అవైదికమైన మతాలు సనాతన ధర్మాన్ని కబలిస్తున్నాయి

5) సనాతన ధర్మం చిన్న లేగ దూడ అయితే, 70కి పైగా అవైదికమైన మతాలు వేట కుక్కలుగా చుట్టు ముట్టాయి

6) శంకరులు ఎంతో శ్రమించి, ఎంతో ప్రేమగా అందరితో వాదించారు

7) శంకరులు యావత్తు భారత దేశం ఎన్నో సార్లు సంచరించి సనాతన ధర్మాన్ని రక్షించారు

8) శంకరులు లేక పోతే - ఈ రోజు మనకు


పూజలు లేవు

పండుగలు లేవు

నోములు లేవు

వ్రతాలు లేవు

దేవాలయాలు లేవు

ఏవీ లేవు


*9) ఆది శంకరాచార్యుల జయంతి మనం చేయక పోతే - మన జన్మం వృథా*


*ఈ రోజు నుండి, 6 మే వరకు ప్రతి రోజు శంకర విజయాలు తెలుసుకుందాం*

ప్రాణహితకు పుష్కరశోభ*

 *ప్రాణహితకు పుష్కరశోభ*


13-04-2022 నుండి  25-04-2022 వరకు ప్రాణహిత పుష్కరాలు.


ఎప్పుడూ ఎడతెగక పారే నదులున్నచోట నివసించమని శాస్త్రోక్తి. అందుకే పూర్వం మన మహర్షులు, పూర్వీకులు నదుల చుట్టూ తమ జీవనాన్ని ఏర్పరచుకొన్నారు. జీవ నదులు మనకు భగవంతుడు ప్రసాదించిన ప్రకృతి సంపదలు. సనాతన సంస్కృతీ, సంప్రదాయాలన్నీ నదులతో పెన వేసుకొన్నవే. ఆ నదుల వల్లనే మనం తినడానికి కావలసిన ధాన్యం లభిస్తోంది. అందుకుగాను నదులపై మనం చూపించే కృతజ్ఞతా భావ సమర్పణే పుష్కరం.


మన సంస్కృతిలో నదీ స్నానానికి విశేష స్థానం ఉన్నది. పర్వకాలాలలో, గ్రహణాదులలో, యజ్ఞయాగాది క్రతువుల ప్రారంభ, ముగింపు సందర్భాలలో ఇంకా అనేక చోట్ల నదీ స్నానాన్ని ఆచరించాలని ధర్మశాస్త్రం చెబుతోంది.


గురువు మేషరాశి మొదలుకొని పన్నెండు రాశులలో సంచరించే సమయంలో ఆయా నదులకు పుష్కరాలు ఏర్పడుతాయి. ఈ సమయంలో దేవతలకు గురువైన బృహస్పతితో పాటుగా పుష్కరుడు, మూడున్నర కోట్ల దేవతలందరూ ఆ నదిలో కొలువుంటారు. 


ఆ సందర్భంలో ఆయా నదులలో స్నాన, దాన, పిండ ప్రదానాది కర్మలను ఆచరించడం ద్వారా పాపాలన్నీ తొలగి పవిత్రతను పొందడమే గాక, పితృ దేవతలకు మోక్షాన్ని కలిగించినవారవుతారు. పుష్కర స్నానానికి అంతటి మహత్తు ఉన్నది.


ప్రస్తుతం గురువు మీనరాశిలో ప్రవేశించడం వలన ప్రాణహిత నదికి పుష్కరం ఏర్పడుతోంది. ఈ సందర్భంలో పుష్కర స్నానాన్ని ఆచరించి విశేష ఫలితాలను పొందుదాం.


*శుభంభూయాత్*

తిరుమలలో మీరు వాలంటీర్

 *తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..?*


అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా..?

వివరాలు తెలీక బాధ పడుతున్నారా..? అందరికి షేర్ చేయండి...!!


తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజుల పాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో?


తెలుసుకోండి మరి...!


నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..!


ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి.


ఏ కులం వారైనా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే.


హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి.


శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్‌లో అందించాలి.


వారి వయసు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి.


ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని (మెడికల్ సర్టిఫికెట్) గుర్తింపు పొందిన వైద్యునిచేత అటెస్ట్ చేయించి సమర్పించాలి.

కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.


సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి.


శ్రీవారి సేవాసదన్‌లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.


సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి.


గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి.


శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహాయం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు.


కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు.


" సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు."


నియమ, నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు సేవకు అనుమతించరు.


తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9 నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరుకావాల్సి ఉంటుంది.


సేవకులు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు.


*డ్రెస్ కోడ్ :*

సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.


*వివరాలు పంపాల్సిన చిరునామా..!*


*పౌరసంబంధాల అధికారి,*

*తిరుమల తిరుపతి దేవస్థానము,*

*కపిలతీర్థం రోడ్డు, తిరుపతి, పిన్ కోడ్ 517501.*


*మరిన్ని వివరాలకు: 0877-2263544, 0877-2264392 నంబర్లలో సంప్రదించవచ్చు.*


*ఓం నమో వేంకటేశాయ.. 🙏🙏*

.

.

*🕉️అందరూ తెలుసుకోవలసిన విషయం వీలైనంత వరుకు మన హిందువులందరికి షేర్ చేయండి 🕉*


🙏🙏🌹🌹🌷🕉️🕉️🕉️🌷🌹🌹🙏🙏

అతితృష్ణా న

 శ్లోకం:☝

    *అతితృష్ణా న కర్తవ్యా*

 *తృష్ణాం నైవ పరిత్యజేత్ |*

    *శనైః శైనశ్చ భోక్తవ్యం*

 *స్వయం విత్తమూపార్జితం ||*


భావం: అతి (extremes) ఎందులోనూ పనికిరావని చెప్పే శ్లోకం. అతిగా కోరకలు కలిగి ఉండకూడదు. అలాగని కోరికలను పూర్తిగా వదిలేయకూడదు. మనం కష్టపడి న్యాయంగా సంపాదించిన ధనాన్ని కొద్ది కొద్దిగా ఖర్చు పెడుతూ, జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి. కొందరు కోరికలే దుఃఖానికి మూలం అంటారు. మరికొందరు కోరికలన్నీ నెరవేర్చుకోవాలంటారు. మొదటి కష్టం. రెండవది వ్యక్తికి, సమాజానికి మంచిది కాదు. కనుక సమతౌల్యం (balanced) గా ఉండమని భావం.🙏

సంపాదన ఖర్చు చేసే విధానం

 *మన సంపాదన ఖర్చు చేసే విధానం*


"శ్లో:- ధర్మాయ యశసే అర్థాయ,

కామాయ స్వజనాయచ,

పంచథా విభజన్ విత్తం,

ఇహా ముత్రచ మోదతే"

*(ఎనిమిదవ స్కంధం, శ్రీమద్భాగవతం)*


ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానిని అయిదు భాగాలుగా విభజించాలి.


*మొదటి భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వినియోగించాలి. గుప్తదానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, ఈతి బాధల్లో ఉన్నవారికి ఆర్తులకు సహాయం, ప్రేత సంస్కారాలు  మున్నగు కార్యక్రమాలు, ప్రచారం కోసం కాకుండా చిత్తశుద్ధితో చెయ్యాలి. అన్నీ భగవత్పరంగా చెయ్యాలి. ఇవే మనిషిని కృతకృత్యుణ్ణి, ధన్యుణ్ణి చేస్తాయి.


*రెండవ భాగాన్ని మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే ప్రజోపయోగ శాశ్వత కార్యక్రమాలపై వెచ్చించాలి. ఆలయాలు, ధర్మశాలలు, అనాథ సేవాశ్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు విద్యా, వైద్య కార్యక్రమాలు, నిత్యాన్నదాన పథకాలు, పండిత సమ్మానాలు మున్నగునవి ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలను చిరకాలం నిలబెడతాయి.


*మూడవ భాగం తిరిగి తాను ధనం సంపాదించడానికి పెట్టుబడిగా పెట్టాలి. ఉద్యోగులైతే పొదుపు పథకాల్లోను, ఇళ్ళ స్థలాలు వీటిపై పెట్టుబడిపెట్టాలి.


*నాల్గవ భాగం తన స్వంత సుఖాలు, అవసరాల కోసం ఖర్చుపెట్టాలి.


*అయిదవ భాగం తనను ఆశ్రయించి ఉన్నవారి సుఖాలు, అవసరాలు, అభివృద్ధి కోసం ఖర్చుపెట్టాలి. 


*మన ధర్మ శాస్త్రాలు మనకు ఎంత చక్కని ప్రణాళిక ఇచ్చాయో కదా*!! 


మరి మనము  సంపాదించిన సొమ్ములో ఏ మాత్రం ఇలా విభజించి ఆచరణ లో పెడుతున్నాము...ఆలోచించండి.

పునర్జన్మలు - పరలోకాలు

 *పునర్జన్మలు - పరలోకాలు*



*నోట్ :- ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చెయ్యబడింది.*


👉 ఆత్మ ఒకటే . అదే జీవాత్మ ( జీవి యొక్క ఆత్మ) గా, పరమాత్మ ( భగవంతుని ఆత్మ..సర్వాత్మ) గా ఇలలో పిలవబడుతున్నది.


👉 పరిమిత తత్త్వం గల జీవాత్మ, అపరిమిత తత్త్వం గల పరమాత్మ లో కలవడమే లేక మార్పు చెందటమే మోక్షం అని ముక్తి అనీ చెప్పబడింది.


👉 ఆత్మ జీవాత్మ గా సుదీర్ఘ యాత్ర సాగించి చివరికి పరమాత్మ గా పరిణితి చెందటమే ప్రతీ ఆత్మ యొక్క ఏకైక లక్ష్యంగా ఉంది.


👉 ఆత్మ ( అద్వైత స్థితిలో) నిరాకారము, నిర్గుణమైనది. చేతనత్వం కలది. ఆత్మలోని తొలి మార్పు స్వయం జనితం. అదే ప్రేరణ. ప్రేరణే సంకల్పం ( ద్వైత స్థితి) . సంకల్పమే సృష్టి. సృష్టే ప్రకృతి ( స్త్రీ) - పురుషుల ( పురుషుడు) గుణములకు, ఉత్పత్తికి కారణం. వీటి విశాల స్వరూపమే విశ్వం. సమస్త దృశ్యాదృశ్య అండపిండ బ్రహ్మాండములకు నిలయం. అదే పరమాత్మ (ఆత్మ) విశ్వరూప సందర్శనం.


👉 పరమాత్మ నిరాకారం. నిర్గుణమైనప్పటికి పరిమిత తత్త్వం ( స్వయంజనితం) గల (పరమాత్మ అంశ అయిన) జీవాత్మ గా పరిణితి చెందినప్పుడు, జీవాత్మ సగుణమై ( పురుషత్వం) సాకారం ( శరీరం, ప్రకృతి తత్త్వం) పొంది ( స్వయంజనితం) జీవిగా బాసిస్తున్నది. 


👉 కనుక , ప్రతీ ప్రాణి ( ప్రాణం ఉన్న పదార్థం) కి ప్రాణం ( ఆత్మ) చేతనత్వం ( పురుషుడు) మరియు శరీరం అచేతన్వం ( స్త్రీ) ప్రకృతి. 


👉 శరీరానికి మూలం, ఆధారం ప్రాణమే. కారణం ప్రాణమే శరీరానికి ఉత్పత్తి చేయును. శిథిలమగునది శరీరం కాబట్టి శరీరం లేకున్నను ప్రాణం ఉంటుంది. కానీ ప్రాణం లేకుండా శరీరం ఉండదు. 


👉 జనించునది ( పుట్టునది) జన్మ. మారునది ( పరిణామం) మరణం. 


👉 పుట్టునది ప్రాణం. మారునది శరీరం, కానీ ప్రతీ ప్రాణికి మూలాధారమైన ఆత్మ మటుకు నిశ్చలం, నిర్వికారం అయి ఉంది.


👉 ప్రతీ జీవి జన్మించినప్పుడు నిరాకారమైన ప్రాణంతో ( చేతనత్వం) మరియు సాకారమైన శరీరంతో ( అచేతనత్వం) కూడి ఉండును. 


👉 ప్రతీ జీవి మరణించినప్పుడు శిథిలమైన స్థూల శరీరాన్ని వీడి, చైతన్యవంతమైన ప్రాణంతో ( ఆత్మతో) వెడలిపోవును.


👉 ఆత్మ బింబం. జీవాత్మ ప్రతిబింబం. ఆత్మ నిర్వికారము, జీవాత్మ సాకారం. ఆత్మ నిర్గుణం, జీవాత్మ సగుణము. ఆత్మ శాశ్వతం, జీవాత్మ అశాశ్వతం ( పరిణామం వలన) ఆత్మ మారనది, జీవాత్మ  మారునది (ఆత్మోన్నతి కోసం) . ఆత్మకు జన్మలేదు. జీవాత్మ కు జన్మకలదు. ఆత్మకు మరణం లేదు. జీవాత్మకు మరణం కలదు ( మార్పు) . ఆత్మ ప్రకృతికి లోబడదు. జీవాత్మ ప్రకృతికి లోబడుతుంది. ( సంకల్ప సహితం) 


👉 జీవి తనకు తాను స్మరించే నేను - యే జీవాత్మ, అదే ప్రకృతికి మూలాధారమైనది.


👉 నేను యే అహంభావం ( సగుణం) , అహంకారం ( దుర్గుణం) కు కారణం.


👉 నేను ( జీవాత్మ) లేనినాడు మిగిలింది నేనైన నేను ( జీవాత్మ గా ఉన్న పరమాత్మ) .


👉 నేను ( అహంభావం) ఆత్మ యొక్క నిజస్థితి ( పరమాత్మ తత్త్వం) .


👉 నేనే ( అహంకారం) ఆత్మ యొక్క మాయాస్థితి. అదే జీవాత్మ ( ప్రకృతి తత్త్వం) .


👉 జనన మరణ రూప శరీరం ( ప్రకృతి) ను తనకు తానుగా పొంది, నేను ( ఆత్మ- పురుషుడు- నిజస్థితి) నేనే ( జీవాత్మ- ప్రకృతి తత్త్వం- మాయా స్దితి) గా మారుతుంది. అదే జన్మ ( పుట్టుక).


👉 శరీరం (ప్రకృతి) ను తనకు తానుగా ఉత్పత్తి ( సంకల్పంతో) చేసుకొని జీవాత్మ (పురుషుడు) సశరీరధారియై జీవిగా సృష్టి లో విరాజిల్లుతోంది.


👉 అన్ని జీవములలో కెల్లా మానవ జీవమే శ్రేష్టంగా ఉండునది. ఆత్మోన్నతికి మానవ జన్మనే మూలాధారం. అదే మోక్షానికి సోపానం ముక్తికి మార్గం.

                       -:0:-