*ఒక కథ!*
*Amma Katha*
కొన్ని నెలల క్రితం, కొత్తగా ఒక పనిమనిషి చేరింది, నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు, మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా, ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఊయోగించను. ఆవిడ పేరు.......
మూడు నాలుగు రోజుల తరువాత అడిగా..
అమ్మా! ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు అని.
ముగ్గురు అమ్మాయిలు అండి,
పెళ్లిళ్లు అయ్యాయా, లేదండి ఇంకా చదువుకుంటున్నారు.
O.K, ఏం చదువు కుంటున్నారు అని క్యాజువల్ గా అడిగా, పెద్ద అమ్మాయి M.Sc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తోంది,
ఆ అంటూ నోరు తెరిచా,
రెండో అమ్మాయి M.Sc Computers మొదటి సంవత్సరం,
మూడో అమ్మాయి ఎంబీబీస్ రెండో సంవత్సరం.
ఆ అని నోరు వెళ్ల బెట్టా. నర్సింగా అన్నా,
కాదు సార్ M.B.B.S అంది.
నాకు అర్థం కావటం లేదు, ఈవిడ ఏమంటోంది,
ఏం మాట్లాడుతోంది. ఈవిడకు ఏం మాట్లాడుతోందో అర్థం అవుతోందా?
మళ్ళీ అడిగా, అవే సమాధానాలు,
M.B.B.S ఫ్రీ సీటా అని అడిగా, అవును సార్,
ఫ్రీ సీట్ యే,
అదేదో బిల్డింగ్ ఫీజ్ అంటా, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి.
ఏ స్కూలులో చదువుకున్నారు అమ్మా మీ పిల్లలు అని అడిగా?
ఇక్కడే, మన ఊరి బడి లొనే 10 వ తరగతి వరకు.
లాంగ్ టర్మ్ గట్రా వెళ్లిందా ఎంబీబీస్ అమ్మాయి అని అడిగా, ఏం లేదయ్యా, మన ఊరి కాలేజ్ యే, నాకు ఈ చదువుల గోల ఏం తెలీదయ్యా, ఇప్పుడు ఇప్పుడే కాస్త నోరు తిరుగుతోంది.
ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు అని అడిగా,
రెండులో మానేశానయ్యా, నాకు కూడికలు, తీసి వేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకు రావటానికి.
మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా,
ఆయనా అందరి లాగే, ఇంటి విషయాలు ఏం పట్టవు.
ఆయన త్రాగుతాడు,
100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడు ఇప్పుడు కొంచం మారుతున్నడు, పాప డాక్టర్ కోర్స్ లో చేరిన తరువాత.
మా పెద్ద అమ్మాయిని ఏడో తరగతిలో చదువు మానిపించేసా, కానీ వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి, నన్ను మందలించి, మంచి తెలివి గల అమ్మాయి, చక్కగా చదువు కొంటోంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థం అయ్యింది నాకు, నా పిల్లలు తెలివి గల వాళ్ళు అని, నా పిల్లల చదువులు ఆగ కూడదు అని ఇంకో రెండు ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలు పెట్టా.
ఇంట్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు, మూడు మూడు నెలలు బిల్ కట్టలేక పోయే దాన్ని, పిల్లలు ఆలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు.
ఇప్పుడు కాస్త పర్వాలేదు, పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కిందా మీదా పడుతున్నాను అంది.
నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ,
భర్త త్రాగుబోతు, ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా.
లక్షలు, లక్షలు ఫీజులు పోస్తుంటే నాపిల్లలు అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా.
అంతే, నాకు అర్జంట్ గా వీళ్ళ ముగ్గురు పిల్లలని కలవాలి అనిపించింది.
నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయ్యాలి అని అడిగా, అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అన్నా.
నేను ఆడిగినట్లే, ముగ్గురిని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది ........
ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంతగానో బ్రతిమాలితే గాని, కుర్చీలపై కూర్చో లేదు.
ఆమె నేల పైనే. నాకు అలవాటే సారూ అంది,
నా పిల్లలు నాలా మిగిలి పోకూడదు అనే ఈ నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు, అంది కళ్ళ నీళ్లతో.....
నేను కాదు, వీళ్లు కాదు,
నువ్వూ ... గొప్ప దానివి అన్నా.
మొదటి పది నిమిషాలు ముగ్గరు ముడుచుకు కూర్చున్నారు, తరువాత కొంచం కొంచం మాట్లాడ్డం మొదలు పెట్టారు.
తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకొంది, ఎంతో కొంత స్కాలర్షిప్ లు రావటం, అవి సహాయ పడ్డం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు.
వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా.
ఏం కావాలి అని అడిగా,
ఎంత అనుకువగా ఉన్నారో, అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా, ఆహా వద్దు అనే సమాధానం.
నేను, నా అర్ధాంగి అడగంగా, అడగంగా, ఒక Two వీలర్ ఇప్పించండి, ముగ్గరము కలిసి ఊయోగించు కుంటాం, మీకు నెల నెలా ఇస్తాం, మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. Two వీలర్ ఉంటే, కాస్త సౌలభ్యoగా ఉంటుంది, సగం డబ్బులు ఆటోలకు అయి పోతున్నాయి, మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు, దొరికే స్టాప్ వరకు నడచి అలిసిపోవటం, సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి. Two వీలర్ ఉంటే అలిసిపోము, మిగిలిన సమయాన్ని చదువు కునేందుకు ఉపయోగించు కుంటాము అన్నారు.
Two వీలర్ ఇప్పించా డబ్బులు కట్టి,
ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు, ఒక పది వేలు ఉంచుకోండి అని అన్నా వినకుండా.
పెద్ద అమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తరువాత తన కాలేజ్ కు వెళ్లి పోతుంది. మళ్ళీ ఇద్దరని పికప్.
పెద్ద అమ్మాయి J.L పోస్టులకు సన్నద్ధం అవుతోంది. రెండో అమ్మాయి Software ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని.
చెప్పటం మరిచా ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతి రోజు రెండు గంటలు.
ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో, మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాళ్లు ఎందరో..
ఒకసారి ఆమె తో అన్నా, ఇంకో రెండు సంవత్సరాలు కష్టం మీకు, తరువాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని,
ఏం సారూ నన్ను పనిలో నుంచి తీసేయ్యాలి అనుకుంటున్నారా, నా ఒంట్లో శక్తి ఉన్నoత వరకు నేను నా పని మానను.
ఆమెను అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని,
లేదు అన్నది, పిల్లలకు ఉంది, అయినా వీళ్లు తమ చదువులు అయిపోయి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లి పోతే తను నేనే కదండి, కోపాలు, తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడి పోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం.
ఒక సారి పెద్ద అమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురుంచి గొప్పగా చెబుతుంటాడు, అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టం అని......
ఎందరో అమ్మల నిజమైన కథ..!!!
🌼🌺🏵️🌻🌸🥀💐🌹🌷🏵️🌺
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకు .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*యువ న్యూస్*
కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి. కనీసం చదువు కున్న వాళ్లకు అర్థం అవుతుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏