20, ఫిబ్రవరి 2023, సోమవారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏 నమస్కారం అండి

శుభోదయం

🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏


*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్


*శ్రీ స్వామివారు*-

*అలివిగాని జబ్బుల స్పెషలిస్టు* 


 టి. రంగబాబు, కల్పాకం, తమిళనాడు ఇలా వ్రాస్తున్నారు.


 రెండు సంవత్సరముల వయస్సుగల ప్రణీత్ అనే మా కుమారుడు జామకాయ తింటుంటే చిగుళ్ళ ద్వారా రక్తము వచ్చినది. ఆసుపత్రిలో చూపిస్తే మద్రాసు చైల్డ్ ట్రస్టు ఆసుపత్రికి పొమ్మన్నారు. అక్కడ చూపిస్తే దీనికి ఎలాంటి మందూ లేదని ప్లేట్లెట్స్ మరియు రక్తము ఎక్కించడము మరియు స్టెరాయిడ్స్ మందులు వాడడం మొదలుపెట్టారు. ఆవిధముగా రెండున్నర సంవత్సరములు వాడారు.


 మందులు వాడినపుడు ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. మందులు ఆపేస్తే మరలా ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. ఎప్పుడైనా చిన్న గాయం తగిలినా ఎక్కువగా రక్తము చాలా సేపు కారేది. రక్తము అందరి గాయాలవలె గడ్డ కట్టేది కాదు. ఈ స్టెరాయిడ్స్ అనే మందులు ఎక్కువ కాలము ఎక్కువ మోతాదులో వాడినందువలన రక్తము కక్కుతున్నాడు. జలుబు చేసినా, దగ్గినా రక్తము పడుతుంది. ఆక్యుపంక్చర్, ఆయుర్వేదము మొదలగు వైద్యాలెన్నో ప్రయత్నించాము.


అట్లా నాలుగు సంవత్సరములు గడిచాయి.   ఒక లక్షా యాభైవేలు ఉండవలసిన ప్లేట్లెట్స్ సంఖ్య  అరవై వేల లోపుగానే ఉంది. ఏ వైద్యాలవల్లా నయం కావడం లేదు. 2004 జనవరిలో ముక్కునుండి ఎక్కువగా రక్తము కారుతుంది. అందువలన మద్రాస్ చైల్డ్ ట్రస్టు ఆసుపత్రికి తీసుకొని వెళితే అక్కడకు వెళ్ళిన వెంటనే 1/2 లీటరు రక్తము కక్కుకున్నాడు. వాళ్ళు వెంటనే రాత్రికి రాత్రి రక్తము మరియు ప్లేట్లెట్స్ ఎక్కించారు. ఇప్పుడు అరికాళ్ళు మంటలు.. మోకాళ్ళు వాచి నొప్పులు మొదలైనాయి. డాక్టర్లు మోకాళ్ళ నొప్పులకు (ఆర్ధాయిట్స్) ముసలివారికి వాడే మందులు వాడాలన్నారు. దానిని నేను అంగీకరించలేదు.


మా స్నేహితుడు గొలగమూడికి వెళ్ళమని చెపుతున్నా పిల్లవాడు ఉండే ఈ అపాయ పరిస్థితులలో వైద్యసౌకర్యాలు లేని గొలగమూడికి వెళ్ళేందుకు ఆరు నెలలు జాప్యం చేశాము. పిల్లవానికి ఇంకా బాధలు ఎక్కువైనాయి. కొందరు డాక్టర్ల సలహామీద మానవ శరీరములో ఉండే ప్లీహము అనే అవయవము తొలగించాని కొందరు డాక్టర్లు చెపితే విదేశీయుడైన ఒక డాక్టరు ప్లీహము తొలగించవద్దని సలహా యిచ్చాడు.


అట్టి సంకట పరిస్థితులలో మా స్నేహితుని సలహాపై 22-04-04లో బిడ్డను గొలగమూడి తీసుకువచ్చాము. గొలగమూడి వచ్చేటప్పుడు బిడ్డను చేతులమీద ఎత్తుకొని కారులో కూర్చోబెట్టుకొని గొలగమూడి వచ్చాము. మోకాళ్ళ నొప్పులు, వాపుల వలన అప్పటికి రెండు నెలలుగా మా బిడ్డ మంచములోనే ఉన్నాడు.


*గొలగమూడి రాగానే చాలా చిత్రంగా రెండు నెలలుగా నడవలేని మా బిడ్డ చక్కగా నడవగలిగాడు.* నేను, నా భార్య స్వామి వారి మందిరానికి నిత్యము 108 ప్రదక్షిణలు చేస్తూ అవధూతలీల పారాయణ చేస్తూ 3 రోజులు ఉండి ఇంటికి వెళ్ళాము. మా మిత్రుని సలహా మీద నలభై రోజులు గొలగమూడిలో ఉండాలని మే 1వ తేదిన వచ్చాము. మేము వచ్చిన 4 రోజులకు *మా పిల్లవానికి స్వామి స్వప్నములో కనిపించి నీకు రెండు నెలలకు బాగవుతుంది* అని చెప్పారు. 


నా భార్య రోజూ 108 ప్రదక్షిణలు చేస్తూ అవధూతలీల పారాయణ చేస్తూ పిల్లవాని చేత వీలైనన్ని ప్రదక్షిణలు చేయిస్తూ రెండు నెలలు గొలగమూడిలోనే ఉన్నాము. *ఇప్పుడు బిడ్డకు ఏ బాధలు లేకుండా ప్లీహము తొలగించే పరిస్థితి లేకుండా శ్రీ స్వామివారే తప్పించారు.* మోకాళ్ళ నొప్పులు కానీ, ఏ ఇతర బాధలు లేక హాయిగా స్కూలుకు పోతున్నాడు.. కృతజ్ఞతతో నెలకొకసారి వచ్చి శ్రీ స్వామి వారికి 108 ప్రదక్షిణలు చేసి పోతున్నాము.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   భజనలో కించిత్తైనా బిడియం లేకుండా హృదయపూర్వకంగా పాల్గొంటున్నారు. ధూమపానం అలవాటు వున్నవారు అప్పుడప్పుడూ లేచి ఎంతో దూరంగా పోయి చెట్లచాటున అవసరాలు తీర్చుకొని రావటం చూచాను. ఆంధ్రులు వారినుండి లవలేశమైనా ఈ శ్రద్ధ నేర్చుకోగలిగితే నికృష్టమైన మన జీవితాలు ఎంత మధురంగా, పవిత్రంగా వుండగలవో గదా అనిపించింది. వేదిక మధ్య మహాత్ముల నడుమ కళ్ళజోడు పెట్టుకొని కూర్చున్న శ్రీ ఆనందమాయి గడ్డం క్రింద చెయ్యి పెట్టుకొని అత్యంత శ్రద్ధతో భాగవతం వింటున్నారు. 


*******************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

"ఓం సమర్థ సద్గురు శ్రీ సాయిరాధాయ నమః"

   -:శ్రీ సాయి లీలామృతం:-

శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మహారాజు.

     -:18 వ అధ్యాయం:-

        నాలుగవ భాగం.

    (శ్రీరామ నవమి మహోత్సవం ఉరుసు చక్కగా జరిగాయి జన సమూహం 75 వేల దాకా పెరిగింది)

      అయినా నేటి విద్యుత్ దీపాలకు అతీతంగా వెలిగే నక్షత్ర గ్రహ గోళలలాగా మహానగరాల సవ్వడి మాటనున్న అతి సామాన్యము, అపారము, అయిన ఆకాశంలో ఈ వైభవం చాటున సాయి మాత్రం మహత్తరము, అతి నిరాడంబరము అయిన జీవితాన్నే కొనసాగిస్తున్నారు.

        ఒక రామనవునికి మహానగరాల నుండి కోటీశ్వరులెన్నెన్నో మిఠాయిలు తెచ్చి అర్పించారు. కానీ సాయి నా భోజనం ఇంకా రాలేదన్నారు. కొంతసేపటికి ఆయన శ్యామతో ఈ జనంలో నెట్టుకు రాలేక ఒక ముసలి పేదరాలు రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చున్నది ,ఆమెను తీసుకురా అన్నారు. తీసుకురాగానే ఆమెతో బాబా నాకేం తెచ్చావు అన్నారు. ఆమె ముందు రోజు సాయి కోసం జొన్న రొట్టెలు చేసుకొచ్చింది. గాని మసీదులోని విలువైన నైవేద్యాలు చూచి సిగ్గుపడి ఏమి తేలేదు అన్నది. కానీ సాయి ఆయన దాచిపెట్టుకున్న మూట అడిగి తీసుకొని ఇది మన భోజనం అంటూ ఎంతో ఇష్టంగా తిన్నారు.

      గురు పూర్ణిమ:-1908 సంవత్సరంలో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణాజి చావడిలో ఉన్నాడు. బాబా సేవతో ఆ ముసలయ్య ను, అనగా నూల్కర్ ను, దుని వద్ద స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అని అతను చెప్పి రాగానే, మీరంతా కూడా చేసుకోరాదా! అన్నారు సాయి. దేవా మీకైతే చేస్తాం కానీ, స్తంభాన్ని ఎందుకు పూజిస్తాము. అన్నాడు శ్యామ. మొదట అంగీకరించని బాబా అతడు పట్టు పట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో పంచాంగం చూస్తే నాడు గురు పూర్ణిమ!!అనగా వ్యాస పూర్ణిమ. తాత్య, దాదా ఖేల్కర్, శ్యామ, మొదలగున వారు సాయికి దోవతలిచ్చి పూజించారు. అప్పటినుండి షిరిడిలో గురుపూర్ణిమ చేసుకోవటం ఆచారమైంది. సాయి నోటి మీదగా భక్తులు చేసుకోమని చెప్పిన ఉత్సవమిదొక్కటే.!

        అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు. భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువును సేవించు! అన్న భావాన్నే  సంకేతంగా సాయి చెప్పారు. గురు వెన్నడు నన్ను పూజించు అనడు. జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే! వారికి శిష్యులు ఎవరు ఉంటారు? తాను గురువునని తలచేవాడు ఆ పేరుకె తగడన్నాడురమణ మహర్షిఅలాఅనలేదు. కనుకనే సాయి సద్గురుడు. ఇంటికప్పులు మూసే ఆధారం స్తంభం. అది నేలలో దృఢంగా నాటుకొని ఉంటుంది అదే దాని బలం ఆ బలంతోనే అది ఆ భవనాశ్రయించే వారందరినీ రక్షిస్తుంది.అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మ నిష్ట లో గురుభక్తిలో నాటుకొని ఉంటారు. అంటే గురు భక్తి రూపమైన ఆత్మ నిష్ఠ వలన గురువు కూడా తమ నాశ్రయించిన వారిని రక్షిస్తారు. స్తంభంలాగే గురు రూపాన్ని తగురీతిన కొలవమని సాయి భావం. అంతేకాదు సాయి శరణానందులతో తాము మసీదులోని స్తంభం కిందనున్న గుహలో చాలాకాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు. చతుర్విధ పురుషోత్తలను శాసించుకోవడానికి సర్వజీవులకు ఆశ్రయము అవకాశము అయిన ( అనగా ద్వారకామాయి) అయిన ఈ జగత్తునే ద్వారకామాయికి ఆధారమైన మూల స్తంభమే. సకల విశ్వరూపుడైన సద్గురువు అందుకే అట్టి మహనీయుని ఇస్లాంలో కుతుబ్ అంటారు. అనగా ధర్మస్థంభమంటారు.

     ద్వారకామాయి అనే శరీరం మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న వెన్నెముక.!" అనగా మేరుదండము" అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆధ్యాత్మిక స్థితులను తనలో ఇముడుచుకున్న గురువుకది సంకేతం. నిరంతరం గురువును సేవించిన వారికి అప్రయత్నంగా ఆ మార్గం తెరుచుకొని యోగ విద్య సిద్ధిస్తుంది. సాయికి వారి గురువు వలన సిద్ధించినట్లు అదే సాయి చెప్పినది.

       గోపాల్ రావు  గుండ్ ఒకసారి శిథిలమైన మసీదును మరమ్మతు చేయించాలని రాళ్లు తెప్పించి చెక్కించాడు. ఆ తర్వాత పని నానా చందోర్కర్ కు, నేల చదును చేసి బండలు తీర్చడం కాక దీక్షిత్ కు, అప్పగించారు బాబా. మొదట శ్రీ సాయి ఎందుకు ఒప్పుకోలేదు. మహాల్సాపతి ఎలాగో ఒప్పించాడు. సాయి చావడిలో నిద్రించిన రాత్రి మసీదులో నేల బాగు చేసి, ఎత్తైన పీఠం అమర్చారు. నాటి నుండి సాయి గోనె మీద కూర్చుండడం మాని దానిపై కూర్చోనారంభించారు. 1914లో భక్తులు ఎంతో శ్రమపడి మసీదు ముంగిట బాగు చేశారు. మొదట అది చాలా చిన్నదిగా ఉండి భక్తులకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. దానిని పెద్దది చేసి పైన కనిపించాలని కాక దీక్షిత్ పని ప్రారంభించాడు. రాత్రంతా కష్టపడి భక్తులు కమ్ములు నాటారు. ఉదయాన్నే చావడి నుండి వచ్చిన సాయి అది చూచి కోపించి,ఆవేశంతో  ఇద్దరు ముగ్గురు కలిసి గాని నాటనలవి గాని ఆ కమ్మెలను ఒక్కరే పీకి పారేశారు. ఆయన ఒక చేత్తో కమ్మే పెరికేస్తూ మరొక చేత్తో సమీపంలోని తాత్య పాటిల్ గొంతు పట్టుకున్నాడు. అతని తలపాగా బలవంతన లాక్కొని దానికి నిప్పంటించి ఆ కమ్మె పాతిన గుంటలో వేశారు. కోపంతో సాయి కన్నులు ఎర్రగా అగ్ని కణాల లాగా వెలిగాయి అందరూ భయభ్రాంతులై చూస్తుండగా శ్రీ సాయి తమ జేబులో నుంచి ఒక రూపాయి నాణెం తీసి భగవ ద్వితమన్నట్లు గౌరవంతో ఆ గుంట లో వేశారు. అంతసేపు ఆయన తాత్య గొంతు విడిచిపెట్టలేదు. తాత్య భయంతో వణికిపోతున్నాడు. అతనికి ఏమి జరగనున్నదో ఎవరికి అంతు పట్టలేదు జోక్యం చేసుకోవడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. చివరకు ధైర్యం చేసి వారింప చూచిన బాగోజీని బలంగా నెట్టి అతని మీద ఇటుకలు విసిరారు.సాయి కొంతసేపటికి ఆయన శాంతించి ఒక భక్తుని దుకాణం నుండి జెర్రీ తలపగా తెప్పించి తాత్యతలకు చుట్టారు. అది చూచి భక్తుల ఆశ్చర్యపోయారు. చివరికి మసీదు మరమ్మత్తులన్నీ సక్రమంగా పూర్తయిన నాడు సాయి నీమ్ గావ్ వెళ్లారు. అక్కడి నుంచి ఆయనను భక్తుల మేళ తాళాలతో ఊరేగింపుతో పునరుద్ధరించిన మసీదుకు తీసుకొచ్చారు.  కట్టుబడి పని చేసిన వారిలో కొండాజి, గాబాజీ, తుకారాం అనే ముగ్గురు సోదరులు వడ్రంగి కుటుంబానికి చెందినవారు ప్రధాన పాత్ర వహించారు.

     18 వ అధ్యాయం సంపూర్ణం.

         'శుభం భవతు'

             🙏🙏🙏

కామెంట్‌లు లేవు: