20, ఫిబ్రవరి 2023, సోమవారం

సుభాషితమ్

  *శుభోదయమ్ - సుభాషితమ్*


 𝕝𝕝 *శ్లో* 𝕝𝕝 *మరణం మంగళం యత్ర*

*విభూతిశ్చ విభూషణం|*

*కౌశేయం  యత్ర కౌపీనం*

*సా కాశీ కేన మీయతే ||*


*తా𝕝𝕝 ఎక్కడ మరణం మంగళప్రదమైనదో,విభూతియే అలంకారమై ప్రకాశించుచున్నదో,* *కాషాయవస్త్రం కౌపీనమగుచున్నదో అట్టి* *కాశీపుణ్యక్షేత్రమును మించిన పవిత్ర క్షేత్రం మరొకటి కలదా* ??.... 


[ *ముల్లోకాల్లో కాశీ పుణ్యక్షేత్రమంతటి పవిత్రక్షేత్రం లేదని భావం* ].     


  *✍️ నిమ్మగడ్డ శ్రీధర్🙏*

: కాశీ లో నువ్వే

కాటి లో నువ్వే


శుభంలో నువ్వే

అశుభంలో నువ్వే


బ్రతుకునిచ్చేది నువ్వే

భస్మం చేసేదీ నువ్వే


కాలే చితి మంట నీ చెంతే

కార్తీక దీపమూ నీ ముందే


నీళ్ళు పోసినా సరే

పాలు పోసినా సరే


గంధం

బూడిదె

రెండూ సమానమే !


నెత్తిన గంగ

గొంతున గరళం


శిలో...

శిల్పమో

అర్థం కాదు

శివ లింగాకారం


చెంబుడు నీళ్లకే

చిన్న పిల్లాడివవుతావ్

చిటికెడు విభూతికి

చల్లబడతావ్


ఒక్క మారేడు దళంతో

మనసు నింపుకుంటావ్

చిన్న బిల్వపత్రంతో

కొలిచినంతనే కరుణిస్తావు


పరమ పావనమిది

పరమేశ్వరా...నా శంకరా !!


🙏🌹 శుభ సోమవారం శుభాాకాంక్షలు🙏 🌹

కామెంట్‌లు లేవు: