ఆధ్యాత్మికం

1. మానవ ప్రయాణం: 
మన  వేదాలు, వేదాల తరువాత ఉపనిషత్తులు. పురాణ ఇతిహాసాలు ఒక్కొక్క హిందూ గ్రంధం మనిషిని ఆధ్యాతిమిక వైపు దృష్టిని మళ్లించటానికి మాత్రమే. కానీ చివరి లక్ష్యం మాత్రం మోక్షం మాత్రమే. వేరే ఏ ఇతర మతాలలో కనీసం మాట వరుసకు కూడా లేని విచారణ మన హిందూ ధర్మంలోని వున్నా అతి ఉన్నతమైన, పవిత్రమైన భావన ఈ మోక్షం. 
వేదాల తరువాత వచ్చినవి వేదాల చివరలో వున్నవి ఉపనిషత్తులు, అందుకే వేదాంతం అని అన్నారు.  నిజానికి ఉపనిషత్తులు వేదాల కన్నా భిన్నమైనవి, ఎందుకంటె వేదాలు కర్మ కాండని తెలుపుతే ఉపనిషత్తులు జ్ఞానాన్ని అంటే జ్ఞాన కాండని తెలుపుతాయి. కర్మలు చేయటం వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి వేదాలు ఉపదేశిస్తే, ఉపనిషత్తులు యెట్లా తెలుసుకోవాలి, మనిషి తానె యెట్లా భగవంతుడు గా కావలి అని చెప్పేవి ఇవి. 
ఉపనిషత్తులు చాలా వున్నాయ్ అని అన్నారు, కానీ అందులో 108 ప్రముఖంగా అంతకన్నా ప్రముఖంగా 10 ఉపనిషత్తులు అని పండితులు ప్రస్తావిస్తున్నారు. అన్ని ఉపనిషత్తులు మహా ఋషుల తో జరిగిన సంవాదాలే. అంటే మహర్షులు వారి శిస్యులకు ఇచ్చిన జ్ఞాన సంపద మాత్రమే. 
మనం ఒక విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఏ ఒక్క మహర్షి కూడా యెంత జ్ఞానాన్ని ప్రసాదించిన దానికి తానూ కర్తనని ఎక్కడ పేర్కొనలేదు. తానూ మహాపురుషుల వద్ద నుండి విన్నది, తెలుసుకున్నది మీకు తెలియ చేస్తున్నాను అని నుదువుతారు. దీనిని బట్టి మన మహర్షులు యెంత నిస్వార్ధంగా ఇతరులకు జ్ఞాన బోధ చేసారో తెలుస్తున్నది. ఏ వక్కటి తన గొప్పతనం కాదని వారు నిరాడంబరులుగా వున్నారు. వారి ధ్యేయం కేవలం జ్ఞాన విస్తరణే కానీ తమకు ఖ్యాతి రావాలని ఏ మహర్షి కోరుకోలేదు. 
ఈ రోజుల్లో ఏదో చిన్న విషయం తెలిసినా అది తన ప్రతిభ అని తనకన్నా గొప్పవాళ్ళు లేరనే విధంగా మనుషులు ప్రవర్తిస్తున్నట్లు మనం చుస్తువున్నాం. 
ఉపనిషత్తులలో ఉన్న గొప్ప గొప్ప విషయాలను సూక్షంగా చెప్పే వాక్యాలను మహావాక్యాలు అన్నారు. ఈ వాక్యాలు రెండు లేక మూడు పదాలతో ఉండి భగవత్ శక్తిని తెలియ చేస్తుంటాయి. 
ఉదా : 1) అహం బ్రహ్మస్మి: రెండు పదాలతో వున్నా ఈ మహా వాక్యం నేను బ్రహ్మను ఐ వున్నాను అని తెలుపుతుంది. 
2) తత్ త్వమసి : ఈ మహావాక్యం కూడా చాల ప్రముఖంగా వినబడేది. దీని భావం నీవు వెతికే బ్రహ్మ పదార్ధం నీవే అయి వున్నావు అని చెపుతున్నది. ఈ విధంగా అనేక మహా వాక్యాలు చోటుచేసుకున్నాయి. 
ఉపనిషత్తులు అన్ని కూడా అద్వయిత జ్ఞానాన్ని మనకు తెలియ చేస్తున్నాయ్. అంటే దేముడు జీవుడు వేరు కాదు ఒకటే వివరంగా చెప్పాలంటే ఈ చరా చార సృష్టిని నియంత్రించే శక్తీ ఆయన భగవంతుడు జ్ఞానీ ఒకటే కానీ వేరు కాదు అనే మహోన్నత జ్ఞానం మనకు తెలుపు తున్నాయి. 
ఆది శంకరా చర్య ఈ అద్వియేత జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అప్పటి బౌద్ధ వాదాన్ని నివారించి భారతావనిలో 
హిందువాన్ని పునరుద్దించారు. బౌద్ధ వాదం నుండి చార్వాక వాదం వెలువడింది ఒక రకంగా చెప్పాలంటే ఇది నాస్తిక వాదం లాంటిదే. 
తరువాత కాలంలో మనకు విశిష్ట అద్విఏతము, ద్వయితం లాంటివి  వచ్చినట్లు మనకు చరిత్ర చెప్పుతున్నది. తరువాత తరువాత ఇప్పుడు నాస్తిక వాదం కూడా వ్యాప్తి చెందుతున్నది. 
కాల గమనంలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని గనుక మనం పరిశీలిస్తే 1) నేను, దేముడు వేరు కాదు నేనే దేముడిని అనే అద్విఏత వాదం 2) నేను దేవుడితో సన్నిహితంగా వుంటాను అనే విశిష్ట అద్వియతః జ్ఞానం, 3) దేముడు వీరు నేను వేరు అనే ద్విఏత జ్ఞానం 4) నాకు దేముడితో పని లేదు నేను చూసే, నేను చేసే దానికి నేనే కర్తను అనే నాస్తిక వాదం. ఇది చార్వాకుడి సిధాంతానికి దగ్గరలో ఉంటుంది. 
ఇవ్వన్నీ పరిశీలిస్తే మనకు ఒక విషయం బోధ పడుతుంది. 
మనిషి పరిణామం ఏ దిశలో వున్నది అన్నది ప్రశ్నర్ధకంగా వున్నది. 
రాను రాను దైవత్వం సన్నగిల్లి మూఢ భక్తి ప్రబలుతున్నది. దేముడి గుడికి వెళితే చాలు నా జన్మ ధన్యమైనది, నేను తిరుపతి దేముడిని దగ్గర నుండి రెకమండేషన్తో చూసాను చాలా ఆనందంగా వుంది, నాకు జన్మ సార్ధకం అయంది. ఫలానా బాబా నాతొ మాట్లాడాడు, అయన కళ్ళకు నేను మొక్కాను నా తలమీద చేయి వేసి నన్ను నిమిరాడు, దీవించాడు, ఫలానా స్వామి నాకు ఉపదేశం చేసాడు ( డబ్బులు తీసుకొని) నేను ధన్యుడిని అయ్యాను. నా కోరికలు తప్పకుండా తీరుతాయి. ఫలానా ఆయనకు, ఆమెకు దేముడు వంటిమీదికి వస్తాడు తాను అడిగినది (డబ్బులు, ఇతరములు) ఇస్తే మన కస్టాలు తీరుతాయి. ఫలానా సమాధి వద్దకు వెళ్లి మొక్కుతె నా కోరికలు తీరుతాయి. ఫలానా బాబా గుడికి వెళ్లి మొక్కితే నాకు మంచి జరుగుతుంది. ఇటువంటి మూఢ భక్తి రోజు రోజుకి పెరుగుతున్నది. దీనికి ఆనకట్ట వేయవలసిన అవసరం వున్నది. 

మనం మన భారత చరిత్రలో ఎంతో శక్తీ గలిగిన మహర్షులని, దేవర్షులని చూసాము. వారు చూపిన అద్భుత శక్తులు మనకు పురాణ ఇతిహాసాలలో కనపడుతున్నాయి. 

సృష్టికి ప్రతి సృష్టి చేసిన బొందితో త్రిశంకుని స్వర్గానికి పంప ప్రయత్నించిన విశ్వామిత్రుడు, చనిపోయిన భార్యను తన కుమారుడైన పరశురాముని కోరికతో బతికించిన జమదగ్ని, కుశుడిని సృష్టించిన వాల్మీకి మహర్షి, తన భార్యను రాయిని చేసిన గౌతమ మహర్షి ఇలా చెప్పుకుంటూ పొతే అనేక మహర్షులు మన భారతావనిలో కనపడతారు. 

నిజానికి అంత గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారిని ఎవ్వరిని కూడా దేముడు అని కొలవ లేదు. అది మన సాంప్రదాయం ఎందుకంటె అప్పుడు భూమిమీద వున్న జనులు అందరు గొప్ప వాళ్ళు శాపాలు ఇవ్వ గలవారు. ఎంతో కొంత తప్పశెక్తి వున్నవాళ్లు. అంతే కాదు ఇప్పటికి కూడా మనం ఆ మహర్షులను దేముళ్ళగా చూడటం లేదు. వాళ్ళకి ఆలా చూడాలి అనే కోరిక కూడా లేదు. 

నేనే దేముడిని: 
నేనే దేముడిని అనే వాదం మొదటి సారిగా మనం హిరణ్యకశ్యపుని చూస్తాము. తాను నేనే దేముడిని అని అనటంలో నిజానికి అర్ధం వుంది కూడా యందు కంటే   హిరణ్యకశ్యపుడు మహా బలవంతుడు, మహా తపోశక్తి వంతుడు. ఇంద్రాది దేవతలని, నవగ్రహాలని తన స్వాధీనంలో తెచ్చుకున్న ధీశాలి. అంత శక్తీ వంతుడు తన శక్తీ వల్ల వచ్చిన గర్వంతో తానూ దేముడిని అని అనుకున్న కొంత అర్ధం వుంది. 

మరి ఇప్పుడు ఎలాంటి శక్తి లేని సామాన్యు మానవులు తాము బాబా లమని సాక్షాతూ ఫలానా దేముడి అవతారలమని, మేము ఆ మాయలు చేస్తాము ఈ మాయలు చేస్తాము  అని సామాన్యు ప్రజలని మభ్య పెట్టి అనేక విధాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంటే. అమాయక ప్రజలు వారి మాటలు నమ్మి వారి పూజలు, వ్రతాలు, వారికి అస్ట్తోతరాలు, సహస్ర నామ పూజలు, భజనలు, హారతులు ఇచ్చి తమ మూఢ భక్తిని చాటుకుంటున్నారు. అంతే కాదు ఎవరైనా పండితులు, జ్ఞానులు మీరు చేసేది పొరపాటు అట్లా మన హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలని పాడు చేయవద్దని అంటే వారిని ఇష్టమొచ్చినట్లు విమర్శించటం చేస్తున్నారు.

మన సమాజంలో సరైన మార్గ నిర్దేశం చేసే వారు లేక పోవటమే  దీనికి కారణం. మనం దేముడిని తాత్కాలికమైన ఐహిక మైన తుచ్చమైన వాంచితాలని కొరకుడదని అది అసురత్వం అవుతుందని మనలో చాలా మందికి తెలియదు. దానికి కూడా కరణం లేక పోలేదు. మనలో చాలా మంది శ్రీమత్ భగవత్ గీత జీవితంలో ఒక్క సారి కూడా చదవక పోవటమే. 

శ్రీమత్ భగవత్ గీత లో కృష్ణ భగవానుడు 16 అధ్యాయంలో దివాత్వాన్ని గూర్చి అసురత్వాన్ని గూర్చి నిశితంగా విశదీకరించారు.  ఏ మానవుడు శ్రీమత్ భగవత్ గీత చదువుతాడో అతను తప్పక జీవితంలో ఒక క్రమశిక్షణా పరుడు దేముడి మీద ఒక స్థిర భావం కలిగిన వాడు అవుతాడు. అతను తప్పక మన ముందు కనిపించే ఇతర మనుషులను దేముడిగా అంగీకరించాడు. గీతా జ్ఞానం సంపూర్ణంగా అలవవరచుకున్న మానవుడు సాక్షాత్తు తానే భగవంతుడు అవుతాడు అందుకు సందేహం లేశమంతయినా లేదు. 

ఇప్పటి కాల పరిస్థితుల్లో ప్రతి మనిషికి శ్రీమత్ భగవత్ గీత చదివే ఒక మంచి అలవాటుని చేయాలి. ఏ ఆహరం భుజించే వాడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, త్రిగుణాలు ఏమిటి అందులో సత్వ గుణం ఎలా గొప్పది, సత్వ గుణ వంతుడు యెట్లా ప్రవర్తిస్తాడు, రోజా గుణవంతుడు యెట్లా ప్రవర్తిస్తాడు, తమోగుణవంతుడి నడవడి యెట్లా ఉంటుంది లాంటి అనేక విషయాలు ప్రతి మనిషి శ్రీమత్ భగవత్ గీత వల్ల మాత్రమే తెలుసుకోగలరు. 

ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీమత్ భగవత్ గీత మానవాళికి అందించిన ఒక మహా వరం 

మీరు, రామాయణ, మహా భారతాదులు వేదాలు, అష్టా దశ పురాణాలు చదవక పోయిన ఏమి నష్టం లేదు వాటి వల్ల మనకు జ్ఞానం వస్తే రావచ్చు కానీ ఒక్క శ్రీమత్ భగవత్ గీత చదివితే మీకు మంచి నడవడిక వస్తుంది. ఇప్పుడు సమాజంలో లోపిస్తుంది వినయము విధేయత, గౌరవము, మర్యాద. అదే గీత చదివి ఆకళింపు చేసుకునే వాడి వల్ల ఈ సమాజం ఉద్దరించ బడుతుంది. ఏది సత్యం ఏది అసత్యం అనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మిత్రులారా మీరంతా తప్పక గీతను ముందుగా  చదవండి, చదివించండి. మారె ఇతర హిందూ గ్రంధాన్ని ఆయన గీత చదివిన తరువాత చదవండి. మన హిందూ వాగ్మయం చాలా ప్రశస్తమైనది ప్రతి గ్రంధం అపార జ్ఞానాన్ని మనకు ఇస్తుంది. మన వాగ్ముయం చదవటం కాదు దానిని గూర్చి తెలుసుకోవటానికి ఒక జీవిత కాలం సరిపోదు. అటువండి ఈ మహా వట వృక్షన్ని గడ్డి పరకకన్నా చిన్న గున్న మతాల వాళ్ళు విమర్శిస్తూ ఉంటే మనం చూస్తూ వున్నాము. యెందుకు మనకు మన ధర్మం మీద అవగాహన లేకపోవటం వల్ల శ్రీమత్ భగవత్ గీత గూర్చి ఏమాత్రం తెలియని మూర్ఖులు శ్రీకృష్ణ భగవానుని నీచంగా విమర్శిస్తూ ఉంటే మనం ఏమి చేయటంలేదు. ఎందుకు మనకు శ్రీమత్ భగవత్ గీత గూర్చి తెలియక పోవటం వల్ల.  ఇలా వ్రాసుకుంటూ పోతే ఏమైనా వ్రాయవచ్చు. ఎంతయినా వ్రాయవచ్చు. మన ధర్మం అపారం, ఇది నిరంతరంగా సాగే ఒక ఝరి. అనంతమైనది.  
ఓం తత్సత్ 
ఓం శాంతి శాంతి శాంతిః 
సర్వే జన సుఖినో భవంతు.
******************
శ్రీకృష్ణలీలలు ౼ 3
౼౼౼౼౼౼౼౼౼౼
పడగలపయినిల్పి పాదాలునర్తించు
ఆర్తి ఏమి వచ్చె నయ్య కృష్ణ!
ఆర్తి కానెకాదె! ఆదరంబునుచూపు
నృత్యలీల యద్ది యెరుగుడయ్య!

చీరె లేలనయ్య! కోరి యెత్తుకుపోవ
కొంటెచేష్ట  కృష్ణ! కూడదయ్య
అనగ కొంటెచేష్ట మనసునాకట్టుగా
అట్లె సతులగావ నదియెగోల?

పర్వతంబు కేలపట్టి యెత్తుటయేల!
చిన్నికృష్ణ! మాను చిలిపిచేష్ట
లనిన నాదు లీల లరయ బూనుండయ్య
కృష్ణ తత్వమద్ది తృష్ణ తీర్చు.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం
***************
శ్రీగోదాష్టకం
1) శ్రీకృష్ణదేవరాయవిరచితఆముక్తమాల్యదప్రథాననాయికాం
   నిరంతరశ్రీవిష్ణునామస్మరణతత్పరశ్రీవిష్ణుచిత్తతనూజాం
   శ్రీరంగనాథహృత్కమలస్థితశోభాయమానశ్రీరంగనాయకీం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||

2) రత్నమణిమాణిక్యకేయూరవైఢూర్యభూషోజ్జ్వలాం
   చందనహరిద్రాకుంకుమచర్చితభవ్యాంఘ్రితేజోమయీం
   సాంద్రానందకరుణాప్రపూర్ణదివ్యమంగళవిగ్రహాం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||
3) సంభ్రమాశ్చర్యజనకవిచిత్రకిరీటవేషధారిణీం
   బ్రహ్మజ్ఞానప్రదాయకప్రపన్నార్తిహరకమలనయనాం
   సంతతశ్రీరంగనాథగుణగానమత్తచిత్తమహాపతివ్రతాం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||

4) త్రిభువనైకపాలకసంసారార్ణవతారకమోక్షమార్గనిశ్శ్రేణికాం
   భక్తజనావళిసముద్ధరకారణశ్రీతులసీకాననసముద్భవాం
   భూదేవీస్వరూపఅష్టాక్షరమంత్రరాజభవ్యోపాసినీం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||
5) యజ్ఞహవ్యకవ్యఫలదాయకస్వాహాస్వధాస్వరూపిణీం
   సంగీతసాహిత్యవేదశాస్త్రజ్ఞానప్రదాయకకుశాగ్రబుద్ధిం
   అష్టైశ్వర్యప్రదాయకసత్సంతానదాయకమహారాజ్ఞీం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||

6) సంక్షోభకల్లోలదుఃఖభరితజనజీవనశాంతిప్రదాయినీం
  శాకసస్యప్రదాయకబలోత్సాహప్రదకరుణాంతరింగిణీం
  సకలగ్రహపీడానివారకసత్ఫలప్రదాయకవిశ్వమాతరం
 యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||
7) గార్హపత్యఆహవనీయదక్షిణాత్యశ్రౌతాగ్నిస్వరూపిణీం
   సహస్రకిరణప్రజ్వలతేజోమయద్వాదశాదిత్యస్వరూపిణీం
   నిరంతరఆరోగ్యభాగ్యదాయకఅశ్వినిదేవతాస్వరూపిణీం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||
8) బ్రహ్మతేజప్రదాయకత్రికాలసంధ్యాస్వరూపిణీం
   మృదుమంజులభాషణమందగజగామినీం
   గోపీచందనతిలకాంచితబహుసుందరవదనాం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||
   సర్వం శ్రీగోదాదేవిదివ్యచరణారవిందార్పణమస్తు
************************
పగిలిన పెదవులు :

వేద స్వరూపమైన పరమాచార్య స్వామివారు వేదాంత సారమైన అద్వైతాన్ని లీలగా ప్రదర్శించిన వేళ.

చాలా సంవత్సరాల క్రితం శీతాకాలంలో తీవ్రమైన చలి వల్ల పరమాచార్య స్వామివారి పెదవులు ఎండిపోయి, పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడ్డాయి. శ్రీవారు మాట్లాడితే ఆ పగుళ్ళ వల్ల చాలా బాధ కలిగేది. కానీ, ఆ దయామయుడు దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారిని అనుగ్రహించేవారు.

చలికాలంలో పెదవులు ఎండిపోయి పగుళ్ళు ఏర్పడినప్పుడు, పెదవులకు వెన్న రాయడం వల్ల అవి తగ్గి ఉపశమనం కలిగిస్తుంది. మరలా పెదవులు కోమలంగా అవుతాయి. తరతరాలుగా మనవాళ్ళు పాటిస్తున్నది ఇదే.

కాని సాంప్రదాయం పాటించే స్వామివారు బయట అంగళ్ళలో అమ్మే వెన్నను వాడారు, దాన్ని పెదవులకు పూసుకోరు. మరి ఏమి చెయ్యాలి?
ఒక ముసలావిడ దీన్ని గ్రహించి ఐదు శేర్ల ఆవుపాలు తీసుకుని, వాటిని మరిగించి, మజ్జిగ చేసి బాగా చిలికి వెన్నను తీసింది. దాన్ని పరమాచార్య స్వామివారికి సమర్పించి, “పెరియవా పెదవులు పగిలి ఇబ్బంది పెడుతున్నాయి. నిష్ఠతో మడిగా పాలు చిలికి ఈ వెన్నను తీసాను. పెరియవా పెదవులకు ఈ వెన్న పూసుకోవలసింది” అని ప్రార్థించింది.

మహాస్వామివారు ఆ వెన్నను ఒకసారి చూసారు. బహుశా వారికి ద్వాపర యుగపు సంఘటనలు గుర్తుకు వచ్చాయి ఏమో, చూడగానే చిన్నగా నవ్వారు.

ఆ వెన్నని కేవలం పరమాచార్య స్వామివారి కళ్ళే కాదు మరో రెండు కళ్ళు కూడా అంతే అమితానందాలతో చూస్తున్నాయి. అప్పుడు బహుశా స్వామివారి దర్శనానికి వచ్చిన ఒక బాలుడు ఆత్రుతగా స్వామివద్దకు వచ్చి వెన్న కావలన్నట్టుగా తన చిన్ని చేయి చాచాడు. బాలగోపాలుడే అక్కడకు వచ్చి వెన్న కావాలని అడుగుతున్నాడేమో.

అడగకుండానే మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన కరుణాసముద్రులైన మహాస్వామివారు వెంటనే ఆ వెన్న జాడిని ఆ బాలునికి ఇచ్చేశారు. ఇది చూసిన అక్కడివారందరూ కాస్త ఖేద పడ్డారు. “ఎంత పిల్లాడే అడిగినా నిమ్మపండంత వెన్నను ఇచ్చుంటే సరిపోయేది కదా మొత్తం వెన్నను ఇచ్చేయ్యకుండా” అని అనుకున్నారు.

వారి ఆలోచనల్ని పసిగట్టిన మహాస్వామివారు అక్కడున్న వారితో, “ఎందుకు అందరూ అంత చింతిస్తున్నారు? ఆ వెన్నను ఆ బాలుడు తింటే నా పెదవులు సరిపోతాయి. దిగులు పడకండి” అన్నారు. ఆ సాయంత్రానికే స్వామివారి పెదవుల పగుళ్ళు నయమై మునుపటి వలె అయ్యాయి. బహుశా బాలగోపాలుడు ఆ వెన్నాను తినేశాడేమో.

శరీరములు వేరైనా ఆత్మా ఒక్కటే కదా. అదే కదా అద్వైతం.

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
**********************

*ఆమిషీకృత మార్తాండం;
గోష్పదీ కృత సాగరం|
తృణీకృత దశగ్రీవం
ఆంజనేయం నమామ్యహం*

 సూర్యుడిని మాంసపు ముక్కగా చేసినవానిని, సముద్రాన్ని ఆవు గిట్టతో ఏర్పడిన గుంట మాదిరి చేసినవానిని, రావణాసురుడిని గడ్డి పోచ వలె చూసిన ఆంజనేయునికి నమస్కరించుచున్నాను.
***************

*సప్తమాతృకలు*

 సప్తమాతృకలంటే ఎవరో చూద్దాం. ఈ సప్తమాతృకలకే ఏడుమంది అక్కా చెల్లెల్లని, అక్కమ్మ గారని, ఏడు శక్తిస్వరూపాలని పిలుస్తారు.

వారు
(1) హంసవాహనంగా కల బ్రాహ్మణి, బ్రహ్మ అంశం
(2) గరుడవాహనంగా గల వైష్ణవి, విష్ణువు అంశం
(3)  నెమలివాహనంపై కౌమారి సుబ్రహ్మణ్య స్వామి అంశం
(4) ఐరావతం మీదనున్న ఇంద్రాణి, యింద్రుని అంశం
(5) మహిష వాహనంగావున్న వారాహి, యజ్ఞ వరాహస్వామి అంశం
(6) శవవాహనంగా గల చాముండి, అమ్మవారి భ్రుకుటి మధ్యనుండి వెలువడిన అంశం
(7)  వృషభ
వాహనంగా కల మహేశ్వరి, ఈశ్వరుని అంశం.
********************
శ్రుత్వా సాగరబన్ధనం దశశిరాః సర్వైః ముఖైః ఏకదా
తూర్ణం పృచ్ఛతి వార్తికం స చకితో భీత్యాకులః సంభ్రమః
వద!స్సత్యం అపాంనిధి స్సలిలధిః కీలాలధి స్తోయధిః
పాదోధిః ర్జలధిః పయోధిః ఉదధిః వారాంనిధిః వారిధిః
*********************

శ్రీరామ సేతుబంధన వార్త విన్న 10 తలల రావణుడు ఆశ్చర్యంగా పది తలలతో తొట్రుబాటుతో పలికినది. ఇది హనుమద్రామాయణం లోనిది. ఎంతైనా స్వామి హనుమ నవవ్యాకరణవేత్త కదా. రావణుని తొట్రుపాటు పది తలలతో పలకడం మంచి ఊహ కదా.
************************

*పూర్ణమదః పూర్ణమిదం అర్థం*

*ఓం పూర్ణమదః పూర్ణమిదం పుర్ణాత్పూర్ణముదచ్యతే |*పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||*

మాములుగా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చుస్తే *"అది పూర్ణం, ఇది పూర్ణం. పూర్ణంనుండి పూర్ణం ఉద్భవిస్తుంది. పూర్ణం నుండి పూర్ణం తీసివేసినా పూర్ణమే మిగులుతుంది." ఇది భగవంతుని పూర్ణ తత్వాన్ని చెప్పే శ్లోకం.* భగవంతుని నుండి ఈ ప్రపంచమంతా ఉద్భవించినా ఆయనయొక్క పూర్ణత్వానికి ఏ లోటు లేదని చెపుతుంది. కానీ ఈ శ్లోకం మామూలు మన బుద్ధులకు అర్థం చేసుకోవటం కష్టం.
అందుకే గురువులు ఈ శ్లోకానికి రెండు చక్కని ఉదాహరణలు చెబుతారు....

*ఒక దీపం ఉందనుకోండి. ఆ దీపంనుండి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. ఒక దీపం నుండి ఇలా వెలిగించబడిన మిగిలిన దీపాలు కూడా అంతే కాంతిని కలిగిఉంటాయి. కానీ ఇలా ఎన్ని దీపాలు వెలిగించినా మొదటి దీపానికి వచ్చే లోపం ఏదీ లేదు. అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది.*

*అలాగే మనం ఒక అక్షరం చక్కగా నేర్చుకున్నామనుకోండి, ఆ అక్షరాన్ని మనం ఎంతమందికైనా నేర్పించవచ్చు. అలాగే ఆ అక్షరాన్ని మనం ఎన్నిసార్లైనా వాక్కు ద్వారా, వ్రాత ద్వారా ఉపయోగించవచ్చు. కానీ మనలో ఇమిడిపోయిన ఆ అక్షరానికి ఎటువంటి లోటు రాదు. అది ఎప్పుడూ పూర్ణంగానే మనలో నిలిచి ఉంటుంది.ఇలాంటిదే మనం లెక్కలలో అనంతంని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
***************************

हसता क्रियते कर्म रुदता परिभुज्यते।
दुःखदाता न कोऽप्यस्ति सुखदाता न कश्चन॥

स्वकर्मणा भवेद्दुःखं सुखं तेनैव कर्मणा।
तस्माच्च पूज्यते कर्म सर्वं कर्मणि संस्थितम्॥

హసతా క్రియతా కర్మ
రుదతా పరిభుజ్యతే।
దుఃఖదాతా న కోఽప్యస్తి
సుఖదాతా న కశ్చన॥

స్వకర్మణా భవేద్దుఃఖం
సుఖం తేనైవ కర్మణా।
తస్మాచ్చ పూజ్యతే
సర్వం కర్మణి సంస్థితమ్॥

"మానవుడు కర్మలను నవ్వుతూ చేసి ఏడుస్తూ అనుభవిస్తాడు. అంతేగాక వేరుగా యెవడూ దుఃఖదాతా లేడు. సుఖదాతా లేడు.
మానవుడికి తన పనుల మూలంగానే దుఃఖము, సుఖము కూడా కలుగుతాయి.
అందుచేతనే కర్మ అందరిచేత పూజించబడుతుంది. కర్మలోనే సమస్తమూ గర్భితమై ఉన్నది."
***************************
సంస్కృతం మరియు తెలుగులో మహా మృత్యుంజయ మంత్రం
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् |
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ||

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||

ఈ మంత్రానికి అర్ధం
అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు,సుగంధ భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము.
పండు తొడిమ నుండి వేరుపడు విధముగా, మేము కూడా మరణము నుండి, మర్త్యత్వము నుండి విడుదల పొందాలి.
***************

360 కామెంట్‌లు:

360లో 1 – 200   కొత్తది»   సరి కొత్తది»
Unknown చెప్పారు...

*కాశీ క్షేత్రంలో వినాయక దేవాలయాలు*

కాశీలో విరాజిల్లుతున్న 56 వినాయక దేవాలయాలు
గణేశుడు కాశీ క్షేత్రాన్ని, విశ్వనాధ మందిరాన్ని అష్టదిక్కులా, సప్తవలయ రక్షణవ్యవస్ధ ద్వారా రక్షిస్తూ ఉంటాడు. ఈ సప్త వలయ రక్షణలో ముఖ్యమైన ఎనిమిది వినాయక అవతారములు కలవు. ఒక్కొక్క వలయము, వాటిలోని వినాయక దేవాలయములు ఇక్కడ ప్రస్తావించ బడినవి.

*ఒకటవ వలయము*:
1. శ్రీ అర్క వినాయకుడు,
2. శ్రీ దుర్గా వినాయకుడు,
3. శ్రీ భీమచండ వినాయకుడు,
4. శ్రీ డేహ్లివినాయకుడు,
5. శ్రీ ఉద్దండ వినాయకుడు,
6. శ్రీ పాశపాణి వినాయకుడు,
7. శ్రీ ఖర్వ వినాయకుడు,
8. శ్రీ శిద్ద వినాయకుడు.
ఈ అష్ట వినాయకులు కాశీ క్షేత్ర వెలుపలి పరిక్రమమములో ఉండి భక్తులకి సిద్ధిని ప్రసాదిస్తూ, నాస్తికులని శిక్షిస్తూ కాశీని కాపాడుతూ ఉంటారు.

*రెండవ వలయము*:-

రెండవ వలయములో కూడా అష్టవినాయకులు కాశీపురవాసుల సమస్త విఘ్నాలను తొలగిస్తూ రక్షణ కల్పిస్తారు.
9. శ్రీ లంబోదర వినాయక,
10. శ్రీ కూట దంత వినాయకుడు
11. శ్రీ శాల కంటక వినాయకుడు
12. శ్రీ కూష్మాండ వినాయకుడు
13. శ్రీ ముండ వినాయకుడు
14. శ్రీ వికట దంత వినాయకుడు
15. శ్రీ రాజ పుత్రా వినాయకుడు
16. శ్రీ ప్రణవ వినాయకుడు

*మూడవ వలయము* :-
ఇక మూడవ వలయములోని అష్ట వినాయకులు కాశీ క్షేత్రాన్ని అంతటినీ అత్యంత శ్రద్ధతో పరిరక్షిస్తూ ఉంటారు.
17. శ్రీ వక్రతుండ వినాయకుడు
18. శ్రీ ఏక దంత వినాయకుడు
19. శ్రీ త్రిముఖ వినాయకుడు
20. శ్రీ పంచాశ్వ వినాయకుడు
21. శ్రీ హేరంబ వినాయకుడు
22. శ్రీ విఘ్న రాజ వినాయకుడు
23. శ్రీ వరద వినాయకుడు
24. మోదకప్రియ వినాయకుడు

*నాల్గవ వలయము*:-
25. శ్రీ అభయప్రద వినాయకుడు
26. శ్రీ సింహ తుండ వినాయకుడు
27. శ్రీ కూడితాక్ష వినాయకుడు
28. శ్రీ క్షిప్ర ప్రసాద వినాయకుడు
29. శ్రీ చింతామణి వినాయకుడు
30. శ్రీ దంత హస్త వినాయకుడు
31. శ్రీ పిఛిoడల వినాయకుడు
32. శ్రీ ఉద్దండ ముండ వినాయకుడు

*ఐదవ వలయము* : -
33. శ్రీ స్ధూల దంత వినాయకుడు
34. శ్రీ కాళీ ప్రియ వినాయకుడు
35. శ్రీ చాతుర్దంత వినాయకుడు
36. శ్రీ ద్విదంత వినాయకుడు
37. శ్రీ జ్యేష్ట వినాయకుడు
38. శ్రీ గజ వినాయకుడు
39. శ్రీ కాళ వినాయకుడు
40. శ్రీ నాగేశ్ వినాయకుడు

*ఆరవ వలయము*:- ఈ వలయములోని వినాయకుల నామ స్మరణ మాత్రముచే భక్తుడు ముక్తిని పొందును.
41. శ్రీ మణికర్ణి వినాయకుడు
42. శ్రీ ఆశ వినాయకుడు
43. శ్రీ సృష్టి వినాయకుడు
44. శ్రీ యక్ష వినాయకుడు
45. శ్రీ గజ కర్ణ వినాయకుడు
46. శ్రీ చిత్రఘంట వినాయకుడు
47. శ్రీ స్ధూల జంఘ / మిత్ర వినాయకుడు
48. శ్రీ మంగళ వినాయకుడు

*ఏడవ వలయము* :- ఈ వలయములోని ఐదు వినాయకులు ప్రసిద్ధులు:
49. శ్రీ మొద వినాయకుడు
50. శ్రీ ప్రమోద వినాయకుడు
51. శ్రీ సుముఖ వినాయకుడు
52. శ్రీ దుర్ముఖ వినాయకుడు
53. శ్రీ గణనాధ వినాయకుడు
ఇక 54. శ్రీ జ్ఞాన వినాయకుడు, 55. శ్రీ ద్వార వినాయకుడు కాశీపురి ముఖ్య ద్వారం పై ఉన్నారు.
56. శ్రీ అవిముక్త వినాయకుడు – ఈ అవిముక్త క్షేత్రములోని భక్తుల అన్ని కష్టాలనూ దూరంచేసి, భాధలనుండి విముక్తము చేస్తాడు.

సేకరణ.

Sarma చెప్పారు...

బరువు గదా ధన గర్వము
బరువు గదా బంధనములు బరువౌ సిరి నా
బరువు తులసి సమమా న
శ్వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా

Sarma చెప్పారు...

జీవుడు దేవుని వెదుకును

గావుమనుచు; కడకు తానె గాంచగ మదిలో

ఆ వెలుగును; యింక నతడు

కేవల వేదాంతివోలె నెల్లెడ తిరుగున్

Sarma చెప్పారు...

కాశి బోవ తలవ కలిగె గొప్ప భయము
వదలి రాగ మధుర వస్తు వొకటి
నిన్ను మించి లేదు నీలకంఠ ప్రియము
నీవు లేక నేను నిలువ లేను

Sarma చెప్పారు...

కపిని గాదు నేను గానగ హృదిలోన
ఉడత గాదు నేను యూరడించ
గోవు గాదు నేను గోకులమున యుండ
మానవాధముడను మహిమ జూపు🌹🙏

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*85వ నామ మంత్రము*

*ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః*

పంచదదశీ విద్యలో తొలి ఐదక్షరము *(క ఏ ఈ ల హ్రీం)* లను వాగ్భవకూటమని అందురు. అట్టి వాగ్భవకూటమే తన ముఖపద్మముగా తేజరిల్లు జగదీశ్వరికి నమస్కారము.

అమ్మవారి ముఖపద్మము స్థూల స్వరూపము కాగా, వాగ్భవకూటము సూక్ష్మస్వరూపము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ జగన్మాత కరుణచే ఆతల్లి స్థూల, సూక్ష్మ స్వరూపములను తన మనోనేత్రములందు భావించుచూ ఆత్మానందముననుభవించును. మరియు భౌతిక జీవనమందు ఆనందమయమైన మార్గముననుభవించును.

మన జగన్మాతకు స్థూలము, సూక్ష్మము,సూక్ష్మతరము, సూక్ష్మతమము అను నాలుగుస్వరూపములుగలవు. మన విగ్రహములు, చిత్రములు, అమ్మవారి కాళ్ళుచేతులు, ఇంతకు ముందు నామ మంత్రాలలో జగన్మాత కేశములు, కిరీటము, ముఖకమలము,లలాటము, కనుబొమలు, నాసాదండము, చెక్కిలి, పెదవులు, చుబుకము, కపోలము, దంత పంక్తులు ఇలాంటి వర్ణనలు చేసినదంతా *స్థూలస్వరూపము*. పంచదశీ మంత్రాక్షరములు (క, ఏ, ఈ, ల, హ్రీం, హ, స, క, హ,ల, హ్రీం, స, క, ల హ్రీం) జగన్మాత *సూక్ష్మస్వరూపము*. దీనినే మంత్రాత్మకమందురు. కామకళాక్షరము *సూక్ష్మతర శరీరము* కుండలినీ రూపము *సూక్ష్మతమ శరీరము*.

పంచదశీ విద్యలో మొదటి ఐదక్షరముల (క, ఏ, ఈ, ల, హ్రీం) సముదాయమునకు *వాగ్భవకూటము* అని అందురు. ఈ కూటము వలన సకలవిద్యలు సంభవించును. జ్ఞానము మొదలగు మహిమలు గలది. అట్టి వాగ్భవకూటమే జగన్మాత ముఖపద్మము. సూక్ష్మశరీరములోని మంత్రాక్షరములే స్థూలములోని ముఖపద్మమును వర్ణించుటచే స్థూల, సూక్ష్మములకు అభేదము గ్రహించదగును. జగన్మాత శరీరమంతయు మంత్రమయము. అందుకే ఆ తల్లిని *మూలమంత్రాత్మికా* అనికూడా స్తుతిస్తున్నాము

ఇక ఈ పంచదశీవిద్యలోని పదిహేను మంత్రాక్షరములలో మొదటి ఐదక్షరములు (క, ఏ, ఈ, ల, హ్రీం) వాగ్భవకూటము కాగా తరువాత పది అక్షరములు జగన్మాత స్థూల శరీరములోని ఏయే అవయవములో తరువాత రాబోయే నామ మంత్రములలో తెలుసుకుంటాము.

జగన్మాత్ర వాగ్భవకూటమను సూక్ష్మశరీరమే ఆ తల్లి ముఖపద్మమను స్థూలశరీరము. అటువంటి తల్లికి నమస్కరించు నపుడు *ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః* అని అనవలెను.
������������������������
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
������������������������
��నేడు శని (స్థిర) వారము������ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము������శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక������ ఓం నమో వేంకటేశాయ.
������������������������

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు��������������������������������
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319����������������

PVD Subrahmanyam చెప్పారు...

*5.9.2020 ప్రాతఃకాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - ఇరువది రెండఅధ్యాయము*

*బలిచక్రవర్తి భగవంతుని స్తుతించుట - భగవంతుడు ఆయనయెడ ప్రసన్నుడగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*22.6 (ఆరవ శ్లోకము)*

*యస్మిన్ వైరానుబంధేన వ్యూఢేన విబుధేతరాః|*

*బహవో లేభిరే సిద్ధిం యాము హైకాంతయోగినః॥7134॥*

నీవు మాకు ఒనర్చిన ఉపకారము వర్ణింపనలవి కానిది. యోగులు అనన్యభావముతో యోగసాధస చేసి సిద్ధిని పొందగలరు. కాని, లోగడ పెక్కుమంది అసురులు నీ పట్ల దృఢమైన శత్రుభావమును వహించి యోగులకు ప్రాప్తించు సిద్ధినే పొందిరి.

*22.7 (ఏడవ శ్లోకము)*

*తేనాహం నిగృహీతోఽస్మి భవతా భూరికర్మణా|*

*బద్ధశ్చ వారుణైః పాశైర్నాతివ్రీడే న చ వ్యథే॥7135॥*

నీ లీలలు, మహిమలు, అనంతములు, నన్ను శిక్షించుటకుగాని, వరుణపాశముచే బంధించుటకుగాని నీ లీలలలోని భాగములే. దీనివలన నేను ఏ మాత్రము సిగ్గుపడను. ఎట్టి వ్యథకును లోనుగాను.

*22.8 (ఎనిమిదవ శ్లోకము)*

*పితామహో మే భవదీయసమ్మతః ప్రహ్లాద ఆవిష్కృతసాధువాదః|*

*భవద్విపక్షేణ విచిత్రవైశసం సంప్రాపితస్త్వత్పరమః స్వపిత్రా॥7136॥*

ప్రభూ! నా పితామహుడైన ప్రహ్లాదుని కీర్తి జగత్ప్రసిద్ధము. అతడు నీ భక్తులలో మిగుల ఉత్తముడని పరిగణింపబడెను. అతని తండ్రియైన హిరణ్యకశిపుడు నీపై గల వైరభావ కారణముగా ప్రహ్లాదుని పెక్కువిధముల బాధించెను. కాని, అతడు నిరంతరము నిన్నే స్మరించుచు తన జీవితమును నీకే అంకితమొనర్చెను.

*22.9 (తొమ్మిదవ శ్లోకము)*

*కిమాత్మనానేన జహాతి యోఽన్తతః కిం రిక్థహారైః స్వజనాఖ్యదస్యుభిః|*

*కిం జాయయా సంసృతిహేతుభూతయా మర్త్యస్య గేహైః కిమిహాయుషో వ్యయః॥7137॥*

మరణధర్మము గలిగిన మనిషికి ఈ దేహముతో పనియేమి? చివరకు ఏదో ఒకనాడు ఆ దేహమును విడిచిపెట్టవలసినదేకదా! నా వారు అనుకొనే స్వజనులు కూడా ఆస్తిపాస్తులను అనుభవించెడు దోపిడీదొంగలు సుమా! అట్టి వారితో గల ప్రయోజనమేమి? ఇక సంసారసాగరములో ముంచివేయునట్టి భార్యతో పని యేమి? గృహాదులయందు మోహపడుట వలన ఆయుక్షీణమేగాని, వేరొకలాభమే లేదు కదా! అందువలన మరణధర్మము గలిగిన శరీరముద్వారా శాశ్వతుడైన ఆ పరమాత్మను పొందుటయే అన్నింటికంటె మీదు మిక్కిలి లాభము.

*పోతనా మాత్యుల వారి పద్యము*

*సీస పద్యము*

చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు;
కాంతలు సంసార కారణములు;
ధనము లస్థిరములు; దను వతి చంచల;
గార్యార్థు లన్యులు; గడచుఁగాల
మాయువు; సత్వర మైశ్వర్య మతి శీఘ్ర;
మని కాదె తమ తండ్రి నతకరించి
మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు;
నీ పాదకమలంబు నియతిఁ జేరె

*తేటగీతము*

భద్రుఁ డతనికి మృతి లేని బ్రతుకుఁ గలిగె
వైరులై కాని తొల్లి మా వారుఁ గాన
రర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్ల
బద్మలోచన! నా పుణ్య ఫలము గాదె?

*తాత్పర్యము*

పురాణపురుషా! “చుట్టాలు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు. భార్యలు ముక్తిని దూరంచేసేవారు. సంపదలు నిలకడ లేనివి. శరీరం స్థిరం కాదు. ఇతరులు తమప్రయోజనాన్నే కోరుతారు. కాలం నిలువదు. ఆయుష్షు త్వరగా గడుస్తుంది. ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది” అనుకున్నాడు పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు. ఆయన తన తండ్రిని విడనాడి నీపాదాలను సేవించాడు. అదృష్టవంతుడైన అతనికి మరణంలేని మనుగడ దొరికింది. పూర్వం మావారు శత్రువులుగా మారితే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. నీవు బిచ్చగాడు వలె వచ్చి నన్ను దేహి అనడం మా పూర్వ పుణ్య ఫలమే కదా స్వామీ!”

*22.10 (పదియవ శ్లోకము)*

*ఇత్థం స నిశ్చిత్య పితామహో మహానగాధబోధో భవతః పాదపద్మమ్|*

*ధ్రువం ప్రపేదే హ్యకుతోభయం జనాద్భీతః స్వపక్షక్షపణస్య సత్తమ॥7138॥*

అని ఇట్లు నిశ్చయించుకొనిన మహాత్ముడగు మా తాతగారైన ప్రహ్లాదుడు సమస్త భయముల నుండి నిత్యము రక్షణ కల్పించు నట్టి నీ పాదపద్మములను శరణు పొందెను కదా! ఎందుకనగా, నీవు తన సోదరుడైన హిరణ్యాక్షుని వధించుటచే, తన పక్షమువారైన ఇతర రాక్షసులను మట్టుబెట్టుటచే, నిన్ను తన శత్రువుగా లెక్కించిన తన తండ్రిని, తన బంధుమిత్రులను సంహరించిన నిన్ను శత్రుభావముతో చూడక, శాశ్వతమైన భయమును పారద్రోలెడు నీ చరణకమలములనే ఆశ్రయించెను. నిజమునకు ఆయన ఉదారహృదయుడు. అగాధ జ్ఞానసంపన్నుడు, సాధుసత్తముడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*663వ నామ మంత్రము*

*ఓం అజాజైత్ర్యై నమః*

సత్త్వరజస్తమో గుణాత్మురాలగు అవిద్య (మాయ) కు అజ అని పేరు వేదములో గలదు. అట్టి అవిద్య అనగా అజ్ఞానమును జయించు జ్ఞానస్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అజాజైత్రీ* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామమంత్రమును *ఓం అజాజైత్ర్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ తల్లిని ఉపాసించు సాధకుడు తనలోని అరిషడ్వర్గములను, అజ్ఞానమును జయించి, సత్యమైన, నిత్యమైన బ్రహ్మానందమును పొందుదిశగా తన బుద్ధిని నడిపించుకుంటూ పరమేశ్వరీ పాదసేవలో నిమగ్నుడై తరించును.

*అజా* అంటే మాయ. *జైత్రీ* అనగా జయించునది. జగన్మాత మాయ లేదా అవిద్య లేదా అజ్ఞానమును జయించి, తన భక్తులలోని అభద్రత, అవిద్యాభావమైన ఆలోచనలు నశింప జేయునదని భావము.

మాయ అంటే ఒక చిన్నమాట చెప్పుకుందాం: మేకపిల్ల తన తల్లిపాలను ఎక్కడ త్రాగుతుంది. మెడక్రింద వ్రేలాడే స్తనం వంటి అవయవము వద్దనా లేక వెనుక కాళ్ళ సందున ఉన్న పొదుగులోనా? అంటే వెనుక ఉన్న పొదుగులో అనే చెప్పాలి. ఆ మెడక్రిందనున్నది పొదుగు కాదని ఆ మూగ జీవికి నిశ్చయంగా తెలుసు. కాని మాయను జయించలేని మానవుడు , అవిద్యాసంబంధమైన ఆలోచనలు ఉన్న మానవుని సహజలక్షణం కంటికి కనబడే ఈ జగత్తు సత్యమని, నిత్యమని అంతకన్నా మించినవి ఇంకేలేవని భావిస్తాడు. జగన్మాత పాదసేవలో నిమగ్నుడైన సాధకుడు ఆ తల్లి కరుణచే అట్టి అవిద్యా సంబంధిత భావాలను జయించుతాడు.

కొందరు *అజా* మరియు *జైత్రి* అనునవి రెండునామ మంత్రాలుగా భావిస్తారు. అది సాంప్రదాయం కాదు. ఎందుకంటే లలితా సహస్ర నామావళిలో సహస్రనామాలు ఉంటాయి.కాని, అజా, జైత్రి అని రెండుగా చెబితే ఒకవెయ్యి ఒక నామాలు అవుతాయి. అందుచేత *అజాజైత్రి* అని చెప్పుకోవడమే సంప్రదాయము.

అయినను, అజాజైత్రీ అన్నది రెండు నామాలుగా చెబితే ఎలా ఉంటుందో పరిశీలిద్దాము.

*అజా* అంటే పుట్టుక లేనిది. *ఓం అజాయై నమః* అని ఉచ్చరించవలెను. పుట్టడం అనేది మరణం ఉన్నవాడికి మాత్రమే. నిత్యము, సత్యము అయిన జగన్మాతకు - పుట్టకకు ముందు, పుట్టినపుఢు, మరియు పోయినపుడు అను స్థితులు లేవు. జగన్మాత ఆద్యంతములేని ఆత్మస్వరూపిణి. పుట్టడం, పెరగడం, ఉండడం, కృశించడం, నశించడం వంటి షడ్వికారాలు ఆమెకు లేవు. అందుకే ఆ జగదీశ్వరి *అజ* అని సార్థకనామధేయురాలు అయినది.

ఇక *జైత్రీ* అను రెండవ నామాన్ని *ఓం జైత్ర్యై నమః* అని ఉచ్చరించవలెను. *జైత్రీ* అంటే జయించు శీలము గలది. దుష్టశిక్షణ, అజ్ఞాన నిర్మూలన, పంచకృత్య పరాయణత్వము - వీటిని సాధించి జైత్రయాత్ర నడుపునది అమ్మవారు కనుక *జైత్రీ* అని నామము గలిగినది. అమ్మవారిని స్తుతించునపుడు *ఓం జైత్ర్యై నమః* అని అంటాము.

ఏమైనా సంప్రదాయానుసారం జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అజాజైత్ర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻🌻నేడు ఆది (భాను) వారము🌹🌹🌹ఆదివారమునకు దినాధిపతి సూర్యుడు🌻🌻🌻సూర్య వంశమునకు చెందిన రఘురాముని ఆరాధించు శుభదినము🌹🌹🌹ఓం నమో రామభద్రాయ🕉🕉🕉ఓం శ్రీసూర్యనారాయణాయ నమః
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*86వ నామ మంత్రము*

*ఓం కఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః*

పంచదశీ విద్యలో మధ్యలోని *హ, స, క, హ, ల, హ్రీం* అను ఆరు బీజాక్షరాలను మధ్యకూటము లేదా కామరాజకూటము అందురు. దీనినే హాదికూటమని కూడా అంటారు. కంఠము దిగువభాగం నుండి కటి పర్యంతము కామరాజకూటముతో సూక్ష్మ స్వరూపిణిగా విరాజిల్లు జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం కఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ అఖిలాండేశ్వరిని ఉపాసించు సాధకునకు జగన్మాత కరుణచే ఆత్మానందమును పొంది తరించును.

కామరాజు అనగా కామేశ్వరుడు. పరమశివుడు. సృష్టి ప్రక్రియను సూచించే కామాన్ని *మహాకామం* అంటారు. ఈ మహాకామానికీ అధిపతి మహాకామేశ్వరుడు. దహరాకాశం అనేది మనహృదయంలోనే ఉంటుంది. ఆ హృదయం కంఠమునకు, కటికి మధ్యనే హృదయం ఉంటుంది. అందుకే శ్రీమాత సూక్ష్మరూపం *కంఠాధఃకటిపర్యంత* ప్రదేశంలో ఉంటుందని చెప్పబడీనది. శ్రీవిద్యలో మధ్యనున్న ఆరు బీజాక్షరములు మధ్యకూటమనియు ఆ మధ్యకూటము కంఠాధఃకటిపర్యంతమనియు వివరించడం జరిగింది. కోరికలు, అనురాగాలు, ప్రేమలు, వీటన్నిటికి కేంద్రమే హృదయము. అందుకే ప్రేమకు చిహ్నం ❤️ ఈ హృదయమేకదా. నాటినుంచి నేటి యువతరం వరకూ ప్రేమకు సంకేతంగా ఈ చిహ్నము (హృదయం) ను చూపించుతారు కదా!

జగన్మాత కంఠం నుండి కటివరకు గల స్థూల శరీరమునకు పంచదశీ మంత్రంలోని మధ్యగల ఆరు బీజాక్షరముల *(హ, స, క, హ, ల హ్రీం)* ను మధ్యకూటము జగన్మాత సూక్ష్మరూపమైన కామరాజకూటము.
కామరాజైన కామేశ్వరునికి (పరమశివునికి) స్థానమైన - ఆపేక్ష, అనురాగాలకు కేంద్రమైన, దహరాకాశస్థానమైన హృదయము *కంఠాధఃకటిపర్యంత* భాగామై, జగన్మాత మధ్యకూటస్వరూపిణిగా లేదా కామరాజకూట స్వరూపిణిగా విరాజిల్లుచున్నది.

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌻🌻🌻నేడు ఆది (భాను) వారము🌹🌹🌹ఆదివారమునకు దినాధిపతి సూర్యుడు🌻🌻🌻సూర్య వంశమునకు చెందిన రఘురాముని ఆరాధించు శుభదినము🌹🌹🌹ఓం నమో రామభద్రాయ🕉🕉🕉ఓం శ్రీసూర్యనారాయణాయ నమః
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*22.11 (పదకొండవ శ్లోకము)*

*అథాహమప్యాత్మరిపోస్తవాంతికం దైవేన నీతః ప్రసభం త్యాజితశ్రీః|*

*ఇదం కృతాంతాంతికవర్తి జీవితం యయాధ్రువం స్తబ్ధమతిర్న బుధ్యతే ॥7139॥*

అట్టి లౌకిక దృష్టితోడనే నీవు నాకును శత్రుడవు. విధాత నన్ను నా ఐశ్వర్యములనుండి దూరముచేసి, నీకు దగ్గరచేసెను. ఇది నాకు ఎంతో మేలు కలిగించెను. ఏలయన, ఐశ్వర్యముల కారణముగా జీవుని బుద్ధి మందగించును. అతడు 'ఈ నా జీవితము అనిత్యమైనదనియు, మృత్యుపాశముతో బంధింపబడినదనియు ఎంతమాత్రము ఎరుగనే ఎరుగడు సుమా!'

*శ్రీశుక ఉవాచ*

*22.12 (పండ్రెండవ శ్లోకము)*

*తస్యేత్థం భాషమాణస్య ప్రహ్లాదో భగవత్ప్రియః|*

*ఆజగామ కురుశ్రేష్ఠ రాకాపతిరివోత్థితః॥7140॥*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! బలిచక్రవర్తి ఇట్లు మాట్లాడుచుండగా భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు ఉదయించుచున్న పూర్ణిమనాటి చంద్రునివలె అచటికి విచ్చేసెను.

*22.13 (పదమూడవ శ్లోకము)*

*తమింద్రసేనః స్వపితామహం శ్రియా విరాజమానం నలినాయతేక్షణమ్|*

*ప్రాంశుం పిశంగాంబరమంజనత్విషం ప్రలంబబాహుం సుభగం సమైక్షత॥7141॥*

బలిచక్రవర్తి తన పితామహుడగు ప్రహ్లాదుని చూచెను. సౌందర్యమూర్తియగు అతడు సిరిసంపదలతో తులతూగుచుండెను. ఆయన నేత్రములు పద్మములవలె కోమలములై విశాలముగా నుండెను. ఆజానుబాహుడైన ప్రహ్లాదుడు పట్టు పీతాంబరములను ధరించియుండెను. ఆయన శరీరము ఉన్నతమై శ్యామలవర్ణముతో శోభిల్లుచుండెను.

*22.14 (పదునాలుగవ శ్లోకము)*

*తస్మై బలిర్వారుణపాశయంత్రితః సమర్హణం నోపజహార పూర్వవత్|*

*ననామ మూర్ధ్నాశ్రువిలోలలోచనః సవ్రీడనీచీనముఖో బభూవ హ॥7142॥*

ఆ సమయమున బలిచక్రవర్తి వరుణ పాశబద్ధుడై యుండెను. కనుక ప్రహ్లాదుని ఎప్పటివలె పూజింపలేకుండెను. ఆయన నేత్రములు అశ్రుపూరితములై యుండెను. సిగ్గుతో తల వంచుకొని ఆయనకు నమస్కరించెను.

*22.15 (పదునైదవ శ్లోకము*

*స తత్ర హాసీనముదీక్ష్య సత్పతిం సునందనందాద్యనుగైరుపాసితమ్|*

*ఉపేత్య భూమౌ శిరసా మహామనా ననామ మూర్ధ్నా పులకాశ్రువిక్లవః॥7143॥*

భక్తవత్సలుడైన శ్రీహరి అచటనే విరాజిల్లుచుండుటను ప్రహ్లాదుడు గమనించెను. నంద, సునందాది పార్షదులు ఆ ప్రభువును సేవించుచుండిరి. భక్త్యావేశముతో ప్రహ్లాదుని శరీరము పులకితమయ్యెను. కనుల ఆనందాశ్రువులు నిండెను. వెంటనే అతడు శిరస్సువంచి, నేలపై సాగిలపడి, మ్రొక్కెను.

*ప్రహ్లాద ఉవాచ*

*22.16 (పదహారవ శ్లోకము)*

*త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం హృతం తదేవాద్య తథైవ శోభనమ్|*

*మన్యే మహానస్య కృతో హ్యనుగ్రహో విభ్రంశితో యచ్ఛ్రియ ఆత్మమోహనాత్॥7144॥*

*ప్రహ్లాదుడు వచించెను* "ప్రభూ! బలికి వైభవోపేతమైన ఇంద్ర పదవిని ఇచ్చి, అనుగ్రహించినది నీవే. తిరిగి ఈ నాడు అతని నుండి లాగికొనుట మరింత శ్రేయోదాయకము. దీనిని నీ యొక్క గొప్ప అనుగ్రహముగా భావించెదను. ఏలయన, ఈ రాజ్యలక్ష్మి జీవుని మోహమునందు పడవేసి ఆత్మస్వరూపమును కప్పివేయును. అదే రాజ్యలక్ష్మిని దూరము చేయుటవలన నీ కృపతో అతడు సునాయాసముగా నీ భక్తిభావమును పొందగలడు.

*22.17 (పదిహేడవ శ్లోకము)*

*యయా హి విద్వానపి ముహ్యతే యతస్తత్కో విచష్టే గతిమాత్మనో యథా|*

*తస్మై నమస్తే జగదీశ్వరాయ వై నారాయణాయాఖిలలోకసాక్షిణే॥7145॥*

స్వామీ! సంపదలకు గర్వితులైన విద్వాంసులు గూడ మోహితులు అగుచుందురు. సంపదలవలన వారు తమ వాస్తవస్వరూపమును తెలిసికొనజాలరు. కనుక, అట్టి సంపదలను హరించి, నీవు గొప్పమేలే ఒనర్చితివి. నీవు జగదీశ్వరుడవు. అందరి హృదయములలో విరాజిల్లు చుందువు. సకల లోకములకు సాక్షివైన నారాయణుడవు. నీకు నమస్కారము".

*శ్రీశుక ఉవాచ*

*22.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*తస్యానుశృణ్వతో రాజన్ ప్రహ్లాదస్య కృతాంజలేః|*

*హిరణ్యగర్భో భగవానువాచ మధుసూదనమ్॥7146॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! ప్రహ్లాదుడు అంజలి ఘటించి నిలుచుండెను. అచటనేయున్న బ్రహ్మదేవుడు, భక్త శిరోమణియగు ప్రహ్లాదుడు వినుచుండగా శ్రీహరితో ఏదో చెప్పదలచెను.

*22.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*బద్ధం వీక్ష్య పతిం సాధ్వీ తత్పత్నీ భయవిహ్వలా|*

*ప్రాంజలిః ప్రణతోపేంద్రం బభాషేఽవాఙ్ముఖీ నృప॥7147॥*

మహారాజా! ఇంతలో పరమసాధ్వియు, బలిచక్రవర్తి భార్యయు ఐన వింధ్యావళి పాశబద్ధుడైన తన పతిని చూచి, ఆమె భయవిహ్వలయై శ్రీహరి పాదములకు ప్రణమిల్లెను. అనంతరము ప్రాంజలియై తలవంచుకొని ఇట్లనెను-

*వింధ్యావలిరువాచ*

*22.20 (ఇరువదియవ శ్లోకము)*

*క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతం తే స్వామ్యం తు తత్ర కుధియోఽపర ఈశ కుర్యుః|*

*కర్తుః ప్రభోస్తవ కిమస్యత ఆవహంతి త్యక్తహ్రియస్త్వదవరోపితకర్తృవాదాః॥7148॥*

*వింధ్యావళి పలికెను* ప్రభూ! నీవు నీలీలలను కొనసాగించుటకై ఈ ముల్లోకములను సృష్టించితివి. కాని మందబుద్ధులు ఈ జగత్తుకు తామే అధిపతులైనట్లు భావింతురు. ఈ లోకములకు కర్తయు, భర్తయు, సంహర్తయు నీవే ఐనప్ఫుడు, నీ మాయను మోహితులై, సిగ్గువిడిచిన వారు తామే కర్తలమైనట్లు భావింతురు. అట్టి వారు నీకు ఏమి సమర్పింపగలరు?

PVD Subrahmanyam చెప్పారు...

*బ్రహ్మోవాచ*

*22.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*భూతభావన భూతేశా దేవదేవ జగన్మయ|*

*ముంచైనం హృతసర్వస్వం నాయమర్హతి నిగ్రహమ్॥7149॥*

*బ్రహ్మదేవుడు వచించెను* దేవాది దేవుడవైన ప్రభూ! నీవు సకల ప్రాణులకును జీవనదాతవు. వారికి నీవే ప్రభుడవు. జగత్స్వరూపుడవు. ఇతనిపై కృపజూపి, బంధవిముక్తుని గావింపుము. అతని సర్వస్వమును నీవే లాగికొంటివి. కావున, అతడు శిక్షార్హుడుగాడు.

*22.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*కృత్స్నా తేఽనేన దత్తా భూర్లోకాః కర్మార్జితాశ్చ యే|*

*నివేదితం చ సర్వస్వమాత్మావిక్లవయా ధియా॥7150॥*

బలిచక్రవర్తి తన సమస్త భూమండలమును, తన పుణ్య కర్మలచే ఆర్జించిన స్వర్గాదిలోకములను, తన సర్వస్వమును నీకే సమర్పించెను. కడకు అతడు తనను గూడ నీకే అర్పణ గావించెను. అట్లు చేయునప్పుడు అతని బుద్ధి స్థిరముగా ఉండెను. ధైర్యము ఏ మాత్రమూ సడలలేదు".

*బమ్మెర పోతనార్యుని పద్యము*

*శార్దూల విక్రీడితము*

బద్ధుండై గురుశాపతప్తుఁడయి
......తా బంధువ్రజత్యక్తుఁడై
సిద్ధైశ్వర్యముఁ గోలుపోయి
......విభవక్షీణుండునై పేదయై
శుద్ధత్వంబును సత్యముం గరుణయున్
......సొంపేమియుం దప్పఁ డు
ద్బుద్ధుండై యజయాఖ్యమాయ
......గెలిచెం బుణ్యుం డితం డల్పుఁడే.

*తాత్పర్యము*

ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు. గురువు శాపంవలన పరితాపానికి గురయ్యాడు. బంధువులనుండి విడువబడ్డాడు. ప్రాప్తించిన అధికారాన్ని ఐశ్వర్యాన్నీ కోల్పోయి పేదవాడు అయ్యాడు. ఐనా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని దయనూ సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞానియై గెలవడానికి సాధ్యంకాని అజయ అని పేరు పడ్డ మాయను గెలిచాడు. ఇతడు చాలా గొప్ప మహానీయుడు.

*22.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*యత్పాదయోరశఠధీః సలిలం ప్రదాయ దూర్వాంకురైరపి విధాయ సతీం సపర్యామ్ |*

*అప్యుత్తమాం గతిమసౌ భజతే త్రిలోకీం దాశ్వానవిక్లవమనాః కథమార్తిమృచ్ఛేత్॥7151॥*

ప్రభూ! నీవు దయామయుడవు. ఎప్పుడైనను కపటములేనివాడై పవిత్రహృదయముతో నీ పాదపద్మముల యందు కొన్ని నీళ్ళను, గరికలను సమర్పించి పూజించిన చాలును. అతడు (ఇక ఒక్కసారి నీ నామమును ప్రేమతో స్మరించినంతనే నీవు పొంగిపోయి వానిని కృపతో ఉద్ధరించెదవు) ఉత్తమ గతులను పొందును. ఇక బలిచక్రవర్తి మిక్కిలి ప్రసన్నచిత్తముతో ధైర్యముగా స్థిర బుద్ధితో ముల్లోకములను నీకే ధారపోసెను. అట్టివాడు దుఃఖములను ఎట్లు పొందగలడు?

*శ్రీభగవానువాచ*

*22.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*బ్రహ్మన్ యమనుగృహ్ణామి తద్విశో విధునోమ్యహమ్|*

*యన్మదః పురుషః స్తబ్ధో లోకం మాం చావమన్యతే॥7152॥*

*శ్రీమన్నారాయణుడు వచించెను* బ్రహ్మదేవా! నేను అనుగ్రహింపదలచిన వాని సంపదలను పూర్తిగా హరింతును. ఏలయన, మానవుడు ధనగర్వముచే మదాంధుడై నన్ను మరియు లోకములను గూడ తిరస్కరించును.

*22.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*యదా కదాచిజ్జీవాత్మా సంసరన్ నిజకర్మభిః|*

*నానాయోనిష్వనీశోఽయం పౌరుషీం గతిమావ్రజేత్॥7153॥*

జీవుడు తాను చేసిన కర్మల ఫలితముగా పలు యోనుల యందు జన్మించును. నా కృపకు పాత్రుడైన వానికి మానవజన్మ లభించును.

*22.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*జన్మకర్మవయోరూపవిద్యైశ్వర్యధనాదిభిః|*

*యద్యస్య న భవేత్స్తంభస్తత్రాయం మదనుగ్రహః॥7154॥*

మనుష్య జన్మను పొందినవాడు వంశము, కర్మలు, వయస్సు, రూపము, విద్య, అధికారము, ధనము మొదలగు వాటి కారణముగ గర్వితుడు కానిచో, అతడు నా కృపకు పాత్రుడగును.

*22.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*మానస్తంభనిమిత్తానాం జన్మాదీనాం సమంతతః|*

*సర్వశ్రేయఃప్రతీపానాం హంత ముహ్యేన్న మత్పరః॥7155॥*

వంశము మొదలగు పెక్కు కారణములవలన గర్వము, మూర్ఖత్వము మున్నగునవి ఉత్పన్నమగును. అవి మనుష్యుని సకల శ్రేయోసాధనముల నుండి దూరము చేయును. కాని, నన్ను శరణుజొచ్చినవాడు వీటిచే మోహితుడుగాడు.

*22.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*ఏష దానవదైత్యానామగ్రణీః కీర్తివర్ధనః|*

*అజైషీదజయాం మాయాం సీదన్నపి న ముహ్యతి॥7156॥*

దేవా! ఈ బలిచక్రవర్తి దానవ, దైత్యవంశములలో అగ్రగణ్యుడు. ఇతడు ఆ రెండు వంశముల కీర్తిని ఇనుమడింపజేసెడివాడు. ఇతడు అజేయమైన మాయను జయించినాడు, ఇంతటి క్లేశములు వచ్చినను, ఇతడు మోహితుడు కాకుండుటను నీవును చూచియున్నావు గదా!

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*664వ నామ మంత్రము*

*ఓం లోకయాత్రా విధాయిన్యై నమః*

చతుర్దశ భువనములలోని వైవిధ్యభరితమైన సృష్టిస్థితిలయలు, జీవుల జీవన సరళి, మానవాళి వర్ణాశ్రమ ధర్మములు మొదలైన వాటికి తగినట్లుగా విధానములను, పద్ధతులను విధించి, సంరక్షించు స్వభావము గలిగిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లోకయాత్రా విధాయనీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) *ఓం లోకయాత్రా విధాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునికి ఆ తల్లి కరుణతో వర్ణాశ్రమ, పురుషార్థ (ధర్మార్థకామమోక్షములు) ధర్మముల జ్ఞానమును ప్రసాదించి, భౌతికపరమైన సుఖసంతోషములతోబాటు, ఆధ్యాత్మికానందమును ప్రసాదించును.

పదునాలుగు లోకాలలో తానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకియై , పదునాలుగు లోకాలలో సృష్టిస్థితిలయకార్యములయందు అత్యంత సామర్థ్యతాపరమైన నిర్వహణకు, ఆయా లోకాలలో ఉన్న జీవులకు చేయవలసిన పనుల విధానాన్ని ముందుగానే నిర్ణయిస్తూ, మానవాళికి వర్ణాశ్రమధర్మములను, విధులను విధించుతూ, సంచితకర్మల ఫలములను మున్ముందు రాబోవు జన్మలలో అనుభవించునట్లు నింబంధనలేర్పరచి, కర్మల ఫలితముల కనుగుణంగా జీవులకు శరీరాలను నిర్ణయిస్తూ లోకాలన్నిటినీ పర్యవేక్షణా కార్యముపై యాత్రయనునట్లుగా పర్యటించు *లోకయాత్రా విధాయని* ఆ పరమేశ్వరి.

పదునాలుగు లోకముల యాత్ర (ప్రళయ సంరక్షణములు) చేయు స్వభావము గలిగినది జగన్మాత అని భాస్కరరాయలువారు అన్నారు. యాత్ర అనగా ప్రళయముగాని, సంరక్షణముగాని యని భాస్కరరాయలువారు (సౌభాగ్య భాస్కరంలో) చెప్పారు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం లోకయాత్రా విధాయిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 *ఓం నమశ్శివాయ* అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము

*22.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*క్షీణరిక్థశ్చ్యుతః స్థానాత్క్షిప్తో బద్ధశ్చ శత్రుభిః|*

*జ్ఞాతిభిశ్చ పరిత్యక్తో యాతనామనుయాపితః॥7157॥*

నేను ఇతని సంపదలను హరించితిని. రాజ్యభ్రష్టుని గావించితిని. తిరస్కరించితిని. వరుణ పాశములచే బంధించితిని. బంధుమిత్రులు ఇతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయిరి. పెక్కు యాతనలను అనుభవింపవలసి వచ్చినది.

*22.30 (ముప్పదియవ శ్లోకము)*

*గురుణా భర్త్సితః శప్తో జహౌ సత్యం న సువ్రతః|*

*ఛలైరుక్తో మయా ధర్మో నాయం త్యజతి సత్యవాక్॥7158॥*

అంతేగాదు, ఇతని గురువైన శుక్రాచార్యుడు ఇతనిని మందలించి శపించెను. కాని, దృఢవ్రతుడైన ఇతడు తన ప్రతిజ్ఞను వీడలేదు. నేనుగూడ ఎన్నియో మోసపు మాటలను పలుకుచు ధర్మోపదేశములను చేసితిని. ఐనను, సత్యవ్రతుడైన ఇతడు ధర్మమును విడిచిపెట్టలేదు.

*22.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*ఏష మే ప్రాపితః స్థానం దుష్ప్రాపమమరైరపి|*

*సావర్ణేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయః॥7159॥*

అందువలన దేవతలకుగూడ పొందుటకు సాధ్యముగాని పదవిని ఇతనికి అనుగ్రహించుచున్నాను. ఇతడు రాబోవు సావర్ణిమన్వంతరమున నాకు పరమభక్తుడైన ఇంద్రుడు కాగలడు.

*22.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*తావత్సుతలమధ్యాస్తాం విశ్వకర్మవినిర్మితమ్|*

*యన్నాధయో వ్యాధయశ్చ క్లమస్తంద్రా పరాభవః|*

*నోపసర్గా నివసతాం సంభవంతి మమేక్షయా॥7160॥*

అంతవరకును ఇతడు విశ్వకర్మచే నిర్మింపబడిన సుతలలోకము నందు ఉండగలదు. అచట నివసించువారికి నా కృపా దృష్టి ప్రభావమున శారీరక, మానసిక రోగములు, అలసట, సోమరితనము, అంతర్బహిశ్శత్రువులవలన పరాజయమువలన పరాజయము, ఏవిధమైన విఘ్నములును కలుగవు.

*22.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*ఇంద్రసేన మహారాజ యాహి భో భద్రమస్తు తే|*

*సుతలం స్వర్గిభిః ప్రార్థ్యం జ్ఞాతిభిః పరివారితః॥7161॥*

ఇంద్రసేన మహారాజా! నీకు శుభమగుగాక! నీవు నీ బంధుమిత్రులతో గూడి సుతల లోకమునకు వెళ్ళుము. సుతలలోకము, స్వర్గలోకమున కన్న మిన్నయైనది. స్వర్గవాసులైన దేవతలుగూడ దానిని కోరుచుందురు.

*22.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*న త్వామభిభవిష్యంతి లోకేశాః కిముతాపరే|*

*త్వచ్ఛాసనాతిగాన్ దైత్యాంశ్చక్రం మే సూదయిష్యతి॥7162॥*

అక్కడ గొప్ప లోకపాలురుగూడ నిన్ను ఓడింపలేరు. ఇంక ఇతరుల సంగతి చెప్పనేల? నీయాజ్ఞను శిరసావహింపని దైత్యులను నా సుదర్శన చక్రము సంహరింపగలరు.

*22.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*రక్షిష్యే సర్వతోఽహం త్వాం సానుగం సపరిచ్ఛదమ్|*

*సదా సన్నిహితం వీర తత్ర మాం ద్రక్ష్యతే భవాన్॥7163॥*

ఆ సుతలము నందు నేను నిన్ను, నీ అనుచరులను, నీ భోగసామాగ్రిని గూడ అన్ని విధములుగా రక్షించుచుందును. మహావీరా! అచట నీకు సర్వవిధముల తోడుగా నీ వెంటనంటి ఉన్నటువంటి నన్ను నీవు నిరంతరము దర్శించుచుండగలవు.

*22.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*తత్ర దానవదైత్యానాం సంగాత్తే భావ ఆసురః|*

*దృష్ట్వా మదనుభావం వై సద్యః కుంఠో వినంక్ష్యతి॥7164॥*

దానవుల, దైత్యుల సాంగత్యముచే నీలో ఏమాత్రమూ అసురప్రవృత్తి మిగిలియున్నను అది, వెంటనే నశించి పోవును.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ధ్వావింశోఽధ్యాయః (22)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు ఇరువది రెండవ అధ్యాయము (22)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*23.1 (ప్రథమ శ్లోకము)*

*ఇత్యుక్తవంతం పురుషం పురాతనం మహానుభావోఽఖిలసాధుసమ్మతః|*

*బద్ధాంజలిర్బాష్పకలాకులేక్షణో భక్త్యుద్గలో గద్గదయా గిరాబ్రవీత్॥7165॥*

*శ్రీశుకుడు వచించెను* పురాణపురుషుడైన శ్రీహరి బలిచక్రవర్తిని పరిపూర్ణమైన కృపతో అనుగ్రహించి సుతలలోక ఆధిపత్యమును ప్రసాదించి, "నేను స్వయముగా ద్వారపాలకుడనై నీ కోటముందు నిలిచియుందును. అంతేగాదు, నిరంతరము నీ వెంటనే నీకు తోడుగా ఉన్నటువంటి నన్ను ఎల్లప్పుడు నీవు దర్శించుచుండగలవు" అని పలికినంతనే మహాత్ముడు, సత్పురుషలోకెల్ల సర్వశ్రేష్ఠుడగు సర్వస్వాత్మ నివేదనపరుడైన ఆ బలిచక్రవర్తి హృదయము భక్త్యావేశముతో ఉప్పొంగిపోయెను.అతని శరీరము పులకరించిపోయెను. అంతులేని ఆనందముతో అతని కనులనుండి ప్రేమపూరిత అశ్రుధారలు ప్రవహింప సాగెను. అందుకు అతని కంఠము మూగబోయెను. అంతట ఆ మహానుభావుడు చేతులు జోడించి, వినయముతో తలను వంచి, గద్గదస్వరముతో ఇట్లు పలికెను-

*బలిరువాచ*

*23.2 (రెండవ శ్లోకము)*

*అహో ప్రణామాయ కృతః సముద్యమః ప్రపన్నభక్తార్థవిధౌ సమాహితః|*

*యల్లోకపాలైస్త్వదనుగ్రహోఽమరైరలబ్ధపూర్వోఽపసదేఽసురేఽర్పితః॥7166॥*

*బలి ఇట్లు పలికెను* "ప్రభూ! దయామయా! నాపై కురియుచున్న నీ కృపాదృష్టిని నేను ఏమని, ఎంతని వర్ణింపగలను. స్వామీ! వరుణపాశముచే బంధింపబడి యుండుటచే నేను, నీకు వందనమును కూడ చక్కగా చేయలేకపోయితిని. కేవలము నమస్కరించుటకు మాత్రమే ప్రయత్నించితిని. అందులకే నీవు మిగుల ప్రసన్నుడవై, నీ పాదపద్మములకు శరణాగతులైన వ్యక్తులకు ప్రసాదించే గొప్ప ఫలమును నా యెడల అనుగ్రహించితివి. స్మరణమాత్రముననే నీవు కరుణ కురిపించువాడవని నాకు తోచుచున్నది. గొప్ప గొప్ప లోకపాలకులపై, దేవతలపై చూపని కృపను నాపై ప్రసరింపజేసితివి. నావంటి హీనదైత్యునకు సహజముగా ఈ అదృష్టము లభించినది. నీకు చేసిన నమస్కారము ఎంత గొప్ప ప్రభావము కలిగియున్నదో అని అబ్బురపడక తప్పదుసుమా!"

బలిచక్రవర్తి విశ్వజిత్ యజ్ఞమును చేయుచుండెను. అతని గురువు శుక్రాచార్యుడు.అతడు బ్రహ్మవేత్త. బలి బ్రాహ్మణ భక్తుఢు. యజ్ఞముద్వారా యజ్ఞపురుషుడగు ఆ భగవంతుని తృప్తిపరచుటద్వారా ఆరాధించుచుండెను. ఈ విధముగా బలిచక్రవర్తి చక్కని సత్కార్యమునందు నిమగ్నుడైయుండెను. స్వర్గలోకముపై దండెత్తి దేవతలను ఓడించి, ఇంద్రపదవిని తన కైవశము చేసికొనెను. పిదప అదితి చేసిన పయోవ్రతముయొక్క శుభఫలితముచే శ్రీమహావిష్ణువు వామనునిగా అవతరించెను. *యాచ్ఞామృతే పథిచరన్ ప్రభు భిర్ న జాల్యః॥* ఎవరైనను ఎంతటి సమర్థుడైననూ, సన్మార్గమునందు చరించువానిని తమ బలపరాక్రమములచే అణచకూడదు. అట్టివారి నుండి యాచించుటద్వారానే తమ పనిని నెరవేర్చుకొనుట యుక్తముగా నుండును. కావున, భగవానుడు స్వయంగా వామనుడై యాచించుటద్వారా బలినుండి ఇంద్రపదవిని గ్రహించి తిరిగి ఇంద్రునకు కట్టబెట్టెను. అందుకు బదులుగా బలికి సుతలలోకాధిపత్యమును ప్రసాదించెను. కాని,బలి తన సర్వస్వమును దానము జేసి, తుదకు ఆత్మనివేదనము చేసెను. ఇందుకు భగవంతుడు బలిచక్రవర్తి ఇచ్చిన దానమును విశేషముగా, ఉత్కృష్టమైనదిగా భావించెను. బలియొక్క సర్వసమర్పణమునకు శ్రీహరి ఎంతగానో ముగ్ధుడయ్యెను. అందుకుగాను పరమదయాళువైన ఆ ప్రభువు బలిచక్రవర్తికి తనను తాను సమర్పించుకొని, అతని కోటముందు ద్వారపాలకుడై నిలిచెను. ఎంతైనా అతడు భక్తపరాధీనుడు కదా! ఇచట శ్రీధరస్వామివారు అంటారు - *సమర్పిత తనూచిత్త నిర్మలాచల భక్తితః| ఛలితో బలినా చిత్రం స్వమేవార్పయదచ్యుతః॥* బలి తనయొక్క నశ్వరమైన, తుచ్ఛమైన భౌతిక సంపదలను, రాజ్యమును, క్షణభంగురమైన దేహమును సమర్పించెను. అందుకు బదులుగా అవినాశియైన, శాశ్వతమగు పరమపదమును పొందెను. ఈ విధముగా బలిని వంచించుటకై వామనుడై వెళ్ళిన భగవానుడు స్వయంగా తానే బలిచేత వంచింపబడినాడు. ఈ వృత్తాంతముద్వారా భగవంతుని దయాళుత్వమును, భక్తపరాధీనతను, భక్తవాత్సల్యమును గమనింపవలెను. తద్ద్వారా స్మరణమాత్రముననే ప్రసన్నుడయ్యే భగవానుని స్మృతిని, స్మరణమును నిరంతరము కలిగియుండవలెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*88వ నామ మంత్రము*

*ఓం మూలమంత్రాత్మికాయై నమః*

సర్వసిద్ధిప్రదమైనది,సర్వమంత్రాలకూ మూలమైనది అయిన పంచదశాక్షరీ మంత్రమే ఆత్మస్వరూపముగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మూలమంత్రాత్మికా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రముసు *ఓం మూలమంత్రాత్మికాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకుడు పంచదశాక్షరీ మంత్రములోని బీజాక్షరాలను శరీరంలోని ఆయా బీజాక్షరాలకు నిర్దేశించినశరీరంలోని ఆయా స్థానాలతో న్యాసం చేస్తూ మంత్రదేవతా ఐక్యరూపాన్ని భావించితే తానుగూడా మంత్రదేవతాస్వరూపుడౌతాడు, చతుర్విధ పురుషార్థములలోని పరమార్థాన్ని గ్రహించి తరిస్తాడు.

పంచదశీ మంత్రంలోని క,ఏ,ఈ,ల,హ్రీం,హ,స,క,హ,ల,హ్రీం,సకలహ్రీం పదిహేనక్షరములు శ్రీమాతకు ఆత్మస్వరూపం కనుకనే ఆ తల్లిని *మూలమంత్రాత్మికా* అని నామప్రసిద్ధమైనది. పంచదశీ మంత్రం కనుకనే ఆ మూలమంత్ర స్వరూపిణి అయిన శ్రీమాత *మూలమంత్రాత్మికా* అని నామ ప్రసిద్ధమైనది.

*చతుర్విధపురుషార్థమూలకారణత్వాత్ మూలం పంచదశాక్షరీ* చతుర్విధపురుషార్థములకు సంప్రాప్తింపజేసే మూలమంత్రం.
*మననాత్ త్రాయత ఇతి మంత్రః* మననము చేయుట వలన సాధకుని రక్షించును. *ఆత్మా స్వరూపం యస్యాః తదుక్తం* ఆత్మసాక్షాత్కారం చేయగలిగేది ఈ పంచదశీ మంత్రం. *పూర్ణాహంతానుసంధ్యాత్మాస్ఫూర్జన్మననధర్మత సంసారక్షయకృత్త్రాణధర్మతో మంత్ర ఉచ్యత* పూర్ణాహంత యొక్క సంధిస్వరూప జీవసమిష్టి శ్రీమాత స్వరూపమును మాటిమాటికి మననముజేసినచో సంసారనాశము అను రక్షణము జరుగును. ఈ మంత్రోపాసనవలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. శ్రీవిద్యాసాంప్రదాయానికీ ఈ పంచదశీమంత్రం గాయత్రీ మంత్రం వంటిది.

మూలమంత్రమైన పంచదశాక్షరీ మంత్రమే స్వరూపంగా గలిగిన జగన్మాతకు నమస్కరించునపుడు
*ఓం మూలమంత్రాత్మికాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం.

*23.3 (మూడవ శ్లోకము)*

*ఇత్యుక్త్వా హరిమానమ్య బ్రహ్మాణం సభవం తతః|*

*వివేశ సుతలం ప్రీతో బలిర్ముక్తః సహాసురైః॥7167॥*

*శ్రీశుకుడు నుడివెను* మహారాజా! ఈ విధముగా పలికినంతనే బలిచక్రవర్తి వరుణపాశమునుండి విముక్తుడాయెను. పిమ్మట అతడు శ్రీహరిని, బ్రహ్మదేవునకును, పరమశివునికిను నమస్కరించి, మిగుల సంతోషముగా తోడి అసురులతో గూడి సుతల లోకమునకు వెళ్ళెను.

*23.4 (నాలుగవ శ్లోకము)*

*ఏవమింద్రాయ భగవాన్ ప్రత్యానీయ త్రివిష్టపమ్|*

*పూరయిత్వాదితేః కామమశాసత్సకలం జగత్॥7168॥*

ఈ విధముగా శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తి నుండి స్వర్గరాజ్యమును గ్రహించి, ఇంద్రునకు ఇచ్చివేసెను. అదితి యొక్క అభిలాషనుగూడ పూర్తిగా నెరవేర్చి, స్వయముగా ఉపేంద్రుడై జగత్తును పాలించెను.

*23.5 (ఐదవ శ్లోకము)*

*లబ్ధప్రసాదం నిర్ముక్తం పౌత్రం వంశధరం బలిమ్|*

*నిశామ్య భక్తిప్రవణః ప్రహ్లాద ఇదమబ్రవీత్॥7169॥*

ఈ విధముగా తన వంశోద్ధారకుడైన బలిచక్రవర్తి శ్రీహరి కృపకు పాత్రుడై, బంధవిముక్తుడగుటను ప్రహ్లాదుడు తిలకించెను. అంతట అతడు భక్తిపరిపూర్ణుడై శ్రీహరిని ఇట్లు స్తుతించెను.

*ప్రహ్లాద ఉవాచ*

*23.6 (ఆరవ శ్లోకము)*

*నేమం విరించో లభతే ప్రసాదంన శ్రీర్న శర్వః కిముతాప రే తే|*

*యన్నోఽసురాణామసి దుర్గపాలో విశ్వాభివంద్యైరభివందితాంఘ్రిః॥7170॥*

*ప్రహ్లాదుడు పలికెను* ప్రభూ! ఇట్టి నీ అనుగ్రహము బ్రహ్మదేవునకు గాని, లక్ష్మీదేవికిగాని, శంకరునకుగాని, ఎన్నడును లభింపలేదు. ఇంక ఇతర దేవతల విషయమును గూర్చి చెప్పనేల? విశ్వవంద్యులైన బ్రహ్మాదులుగూడ నీ పాదపద్మములకు ప్రణమిల్లుచుందురు. అట్టి నీవు అసురులపైన మాకు ద్వారపాలకుడవైతివి.

*23.7 (ఏడవ శ్లోకము)*

*యత్పాదపద్మమకరందనిషేవణేన బ్రహ్మాదయః శరణదాశ్నువతే విభూతీః|*

*కస్మాద్వయం కుసృతయః ఖలయోనయస్తే దాక్షిణ్యదృష్టిపదవీం భవతః ప్రణీతాః॥7171॥*

ప్రభూ! నీవు శరణాగతవత్సలుడవు. బ్రహ్మాదిలోకపాలురు నీ పాదారవిందముల మకరందమును గ్రోలుటవలన సృష్టిరచనాశక్తి మొదలగు అనేక విభూతులను పొందగలిగిరి. మేము మాత్రము పుట్టుకతోనే నీచులము, చెడు మార్గములో సంచరించెడి వారము. ఈ విధమైన నీ అనుగ్రహపూర్ణ దృష్టి మావంటి అసురులకు ఎట్లు లభించినచో, మాకు అంతుపట్టకున్నది?

*23.8 (ఎనిమిదవ శ్లోకము)*

*చిత్రం తవేహితమహోఽమితయోగమాయా లీలావిసృష్టభువనస్య విశారదస్య|*

*సర్వాత్మనః సమదృశోఽవిషమః స్వభావో భక్తప్రియో యదసి కల్పతరుస్వభావః॥7172॥*

నీవు నీ యోగమాయచే అవలీలగా లోకములను సృష్టించుచుందువు. నీవు సర్వజ్ఞుడవు, సర్వాత్ముడవు, సమదర్శివి. ఐనను, నీ లీలలు విలక్షణమై కనబడుచుండును. నీ స్వభావము కల్పవృక్షము వంటిది. ఏలయన, నీవు నీ భక్తుల యెడ మిగుల కృపను ప్రసరింపజేయుచుందువు. అందువలననే అప్పుడప్పుడు ఉపాసకులయెడ పక్షపాతవైఖరిని, విముఖులయెడ నిర్దయను అవలంబించినట్లు, గోచరించుచుండును.

*శ్రీభగవానువాచ*

*23.9 (తొమ్మిదవ శ్లోకము)*

*వత్స ప్రహ్లాద భద్రం తే ప్రయాహి సుతలాలయమ్|*

*మోదమానః స్వపౌత్రేణ జ్ఞాతీనాం సుఖమావహ॥7173॥*

*శ్రీహరి పలికెను* నాయనా! ప్రహ్లాదా! నీకు శుభమగుగాక, నీవు గూడ సుతలలోకమునకు వెళ్ళుము. అచట నీ మనుమడైన బలితోగూడి, సంతోషముగా నుండుము. నీ బంధుమిత్రులకు సౌఖ్యమును ప్రసాదింపుము.

*23.10 (పదియవ శ్లోకము)*

*నిత్యం ద్రష్టాసి మాం తత్ర గదాపాణిమవస్థితమ్|*

*మద్దర్శనమహాహ్లాదధ్వస్తకర్మనిబంధనః॥7174॥*

అచట ప్రతిదినము గదాపాణినైన నన్ను తిలకించుచుందువు. నా దర్శనజనిత పరమానంద మగ్నుడవగుటచే నీ కర్మ బంధనములన్నియును తొలగిపోవును.

*23.11 (పదకొండవ శ్లోకము)*

*ఆజ్ఞాం భగవతో రాజన్ ప్రహ్లాదో బలినా సహ|*

*బాఢమిత్యమలప్రజ్ఞో మూర్ధ్న్యాధాయ కృతాంజలిః॥7175॥*

*23.12 (పండ్రెండవ శ్లోకము)*

*పరిక్రమ్యాదిపురుషం సర్వాసురచమూపతిః|*

*ప్రణతస్తదనుజ్ఞాతః ప్రవివేశ మహాబిలమ్॥7176॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! సమస్త దైత్యసేనలను స్వామియు, పరమభక్తుడైన ప్రహ్లాదుడు "మీ ఆజ్ఞ" అని పలికి ప్రాంజలియై, భగవంతుని ఆదేశమును శిరసావహించెను. పిమ్మట బలిచక్రవర్తితో గూడి బాదిపురుషుడైన భగవానునకు ప్రదక్షిణపూర్వకముగ నమస్కరించెను. ఆ ప్రభువు యొక్క అనుమతితో సుతలలోకమునకు వెళ్ళెను.

*23.13 (పదమూడవ శ్లోకము)*

*అథాహోశనసం రాజన్ హరిర్నారాయణోఽన్తికే|*

*ఆసీనమృత్విజాం మధ్యే సదసి బ్రహ్మవాదినామ్॥7177॥*

మహారాజా! ఆ సమయమున బ్రహ్మవేత్తలైన ఋత్విజుల సభలో, తన యొద్దనే కూర్చొనియున్న శుక్రాచార్యునితో శ్రీహరి ఇట్లు పలికెను-

*శ్రీభగవానువాచ*

*23.14 (పదునాలుగవ శ్లోకము)*

*బ్రహ్మన్ సంతను శిష్యస్య కర్మచ్ఛిద్రం వితన్వతః|*

*యత్తత్కర్మసు వైషమ్యం బ్రహ్మదృష్టం సమం భవేత్॥7178॥*

*శ్రీభగవానుడు పలికెను* "బ్రాహ్మణోత్తమా! మీ శిష్యుడైన బలి యజ్ఞమును ఆచరించుచుండెను. అందు కలిగిన లోపమును నీవు పూర్తి చేయుము. ఏలయన, కర్మానుష్ఠానము నందు జరిగిన లోపములు బ్రాహ్మణుల యొక్క కృపాదృష్టిచే సవరింపబడును. అనగా బ్రహ్మదృష్టి, బ్రాహ్మణదృష్టి సమానమని భావము"

*యజమానం వినా కథం సంధాతవ్యమితి న వాచ్య మిత్యాహ - యత్తదితి. బ్రహ్మదృష్టం బ్రాహ్మణైర్ దృష్టమేవ. సమం భవేత్ కిం పునరనుష్ఠిత మిత్యర్థః॥* - (శ్రీధరీయమ్) అనగా యజమాని లేకుండా ఎట్లు నిర్వహించవలెనని చెప్పవలసిన పనిలేదు. బ్రహ్మదృష్టి, బ్రాహ్మణదృష్టి సమానముగనే ఉండును.

*శుక్ర ఉవాచ*

*23.15 (పదునైదవ శ్లోకము)*

*కుతస్తత్కర్మవైషమ్యం యస్య కర్మేశ్వరో భవాన్|*

*యజ్ఞేశో యజ్ఞపురుషః సర్వభావేన పూజితః॥7179॥*

*23.16 (పదహారవ శ్లోకము)*

*మంత్రతస్తంత్రతశ్ఛిద్రం దేశకాలార్హవస్తుతః|*

*సర్వం కరోతి నిశ్ఛిద్రం నామసంకీర్తనం తవ॥7180॥*

*శుక్రాచార్యుడు నుడివెను* ప్రభూ! యజ్ఞపురుషుడవగు నీవే కర్మలను ప్రవర్తింపజేసే యజ్ఞపురుషుడవు. బలి తన సర్వస్వమును నీకు అర్పించి, నిన్ను పూజించినాడు. అట్టి కర్మలో లోపము ఎట్లు సంభవించును? దేవయజ్ఞములో మంత్రము. అనుష్ఠానక్రమము, దేశము, కాలము, దానమునకు పాత్రత మరియు ద్రవ్యములలో వచ్చినలోపములు అన్నియును నీ నామ సంకీర్తన చేతనే తొలగిపోవును.

*23.17 (పదునేడవ శ్లోకము)*

*తథాపి వదతో భూమన్ కరిష్యామ్యనుశాసనమ్|*

*ఏతచ్ఛ్రేయః పరం పుంసాం యత్తవాజ్ఞానుపాలనమ్॥7181॥*

ఐనను, అనంతా! నీవు చెప్పిన రీతిగనే నీ ఆదేశమును పాటింతుము. మానవులకు నీ ఆజ్ఞను ఖచ్చితముగ పాలించుటయే పరమ శ్రేయోదాయకము.

*శ్రీ శుక్ర ఉవాచ*

*23.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*అభినంద్య హరేరాజ్ఞాముశనా భగవానితి|*

*యజ్ఞచ్ఛిద్రం సమాధత్త బలేర్విప్రర్షిభిః సహ॥7182॥*

*శ్రీశుకమహర్షి పలికెను* పూజ్యుడైన శుక్రాచార్యుడు శ్రీహరి ఆజ్ఞను శిరసావహించి, ఇతర బ్రహ్మర్షులతో గూడి, బలి యొక్క యజ్ఞములో ఏర్పడిన లోపమును సవరించి ఆ యజ్ఞమును పూర్తిచేసెను.

*23.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*ఏవం బలేర్మహీం రాజన్ భిక్షిత్వా వామనో హరిః|*

*దదౌ భ్రాత్రే మహేంద్రాయ త్రిదివం యత్పరైర్హృతమ్॥7183॥*

పరీక్షిన్మహారాజా! ఈ విధముగా వామనమూర్తి బలినుండి భూమి యాచించి శత్రువులైన దైత్యులు లాగికొనిన స్వర్గరాజ్యమును తన సోదరుడైన ఇంద్రునకు తిరిగి అప్పగించెను.

*23.20 (ఇరువదియవ శ్లోకము)*

*ప్రజాపతిపతిర్బ్రహ్మా దేవర్షిపితృభూమిపైః|*

*దక్షభృగ్వంగిరోముఖ్యైః కుమారేణ భవేన చ॥7184॥*

*23.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*కశ్యపస్యాదితేః ప్రీత్యై సర్వభూతభవాయ చ|*

*లోకానాం లోకపాలానామకరోద్వామనం పతిమ్॥7185॥*

అనంతరము ప్రజాపతులకు ప్రభువైన బ్రహ్మదేవుడు, దేవర్షియైన నారదుడు, పితృదేవతలు, రాజైన దక్షుడు, భృగువు, అంగిరసుడు, సనత్కుమారుడు, మనువు, పరమశివుడు మున్నగువారితోగూడి, అదితికశ్యపుల ప్రీతికొరకు ప్రాణుల అభ్యుదయము కొరకై సకలలోకములకు లోకపాలురకు ప్రభువుగా వామనమూర్తిని అధిపతిగా అభిషేకించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*666వ నామ మంత్రము*

*ఓం భూమరూపాయై నమః*

వేరొకటి కనబడని, మరింకేదీ వినబడని తురీయావస్థలో ఉంటూ, అదే పరమసుఖావస్థగా, పరబ్రహ్మరూపముగా, సర్వాధార స్వరూపంగా చెప్పబడుచూ, ఇంద్రియములు మనసునందు, ఆ మనసునందు బుద్ధి, ఆ బుద్ధి పరిపూర్ణమైన ఏకాగ్రతతో ఆత్మయందు లయమైన భూమరూపిణిగా విలసిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భూమరూపా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భూమరూపాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని పూజించు భక్తులకు సర్వాభీష్టసిద్ధిగలుగును.

*ఏ పరమాత్మకంటె రెండవ పెద్ద వస్తువును చూడలేమో, ఇతరములేవీ వినలేమో లేక మరే ఇతరమును తెలియలేమో అదే భూమపదార్థమని చెప్పబడును. ఏది భూమమో అదే సుఖస్వరూపము* అని ఛాందోగ్యోపనిత్తులో చెప్పబడినది. *భూమమనగా పరబ్రహ్మస్వరూపము* అని సూత్రభాష్యములో భూమాధి కరణమునందు నిర్ణయింపబడినది. *ఏకాకినీ* అను (565వ) నామ మంత్రములో శ్రీమాత అద్వితీయురాలు అనగా తానే ప్రథమం అని చెప్పబడినది. ఆమె అద్వితీయురాలైనను ఉపాధులనుబట్టి, లోకస్థులకోసం బహురూపములను పొందినది. అందులో ముఖ్యంగా నవదుర్గలు ఉన్నారుకదా! ఉదాహరణకు స్ఫటికమాణిక్యము ఒక్కటే అయినను దగ్గరగా ఉన్న చిత్రముల వర్ణములచే అనేక వర్ణములు గలిగినట్లుగా సత్త్వాదిగుణముల వలన శ్రీమాత బహురూపిణి. అందుకే *భూమరూపా* అనగా బహురూపములు కలిగినదని ఆ నామముతో ప్రసిద్ధిచెందినది. గుణవిశేషముచేత మేఘము ఒక్కటే. కాని చిన్నమేఘము, పెద్ద మేఘము, ఎఱుపు, తెలుపు, నలుపు, దూది పింజలవలెను అనేక రూపములలో కనబడుచున్నది. అలాగే శ్రీమాత గుణములను బట్టి, అవతారములను బట్టి అనేకరూపములు గలిగినది. వాయువు అంటే అర్థం ఒకటే. ఒకటి ప్రాణవాయువు, మరొకటి మనం విడిచిన బొగ్గుపులుసు వాయువు..అలాగే ప్రాణ, వ్యాన, అపాన, ఉదాన, సమాన వాయువులు మరియు మల్లెసుగంధములు, అపాన దుర్గంధములు అనేక విధములుగా తోచునట్లే దేవికూడా ఒకపరి ఉగ్రురాలిగా, మరియొకపరి భయంకరమైన కాళిగా,దుర్గగా, ఇంకొక సారి బాలగా, ధూమావతిగా, లక్ష్మీస్వరూపురాలిగా ఆ అమ్మ బహురూపులను దాల్చినది. అలాగే గార్హస్పత్యాగ్ని ఒక్కటే అయినను దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అని అనేక నామములను పొందుచున్నట్లే శ్రీమాత బ్రహ్మ, క్షత్రియ, వైశ్యాది నామములు గలిగినది. ఈ విధముగా ఆలోచించితే *భూమరూపా* అను నామసార్థకతకు ప్రమాణములెన్నియోగలవు. జగన్మాతయందు భక్తి గలిగిన వారికి అన్నికోరికలు నేరవేరును. కూర్మపురాణమందు గూడ *కామేశ్వరీ శక్తి మాత్రమే పరమాత్ముని సన్నిధియందు అనేక ఉపాధులను పొంది అనేకరూపములతో మెలగినది* అని కలదు. అందుకే *భూమరూప* అనగా బ్రహ్మరూపిణి.

అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భూమరూపాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻ఈ రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు ఈ రోజు చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్.

*23.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*వేదానాం సర్వదేవానాం ధర్మస్య యశసః శ్రియః|*

*మంగలానాం వ్రతానాం చ కల్పం స్వర్గాపవర్గయోః॥7186॥*

*23.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ఉపేంద్రం కల్పయాంచక్రే పతిం సర్వవిభూతయే|*

*తదా సర్వాణి భూతాని భృశం ముముదిరే నృప॥7187॥*

మహారాజా! వేదములు, సమస్తదేవతలు, ధర్మము, యశస్సు, సంపదలు, మంగళకార్యములు, వ్రతములు, స్వర్గము, మోక్షము మొదలగువాటి రక్షణకై బ్రహ్మదేవుడు సర్వశక్తిమంతుడైన వామన భగవానునకు ఉపేంద్ర పదవిని అప్పగించెను. ఆ సమయమున సకల ప్రాణులు మిగుల ఆనందించిరి. *బోలో! శ్రీఉపేంద్ర భగవాన్ కీ జై!!*

*23.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*తతస్త్వింద్రః పురస్కృత్య దేవయానేన వామనమ్|*

*లోకపాలైర్దివం నిన్యే బ్రహ్మణా చానుమోదితః॥7188॥*

అనంతరము దేవేంద్రుడు బ్రహ్మదేవుని అనుమతితో లోకపాలురతోగూడి వామన భగవానుని దేవ విమానములో ముందు భాగమున ఆసీనుని గావించెను. పిదఫ ఆయనను తనతో స్వర్గలోకమునకు తీసికొని వెళ్ళెను.

*23.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*ప్రాప్య త్రిభువనం చేంద్ర ఉపేంద్రభుజపాలితః|*

*శ్రియా పరమయా జుష్టో ముముదే గతసాధ్వసః॥7189॥*

ఇంద్రునకు ముల్లోకములపై రాజ్యాధికారము లభించెను. పైగా వామన భగవానుని రక్షణగూడ ప్రాప్తించెను. వనితలలో తలమానికమైన లక్ష్మీదేవి అనుగ్రహముతో అతనికి సకల సంపదలు చేకూరెను. అతడు నిర్భయముగా అనందములో ఓలలాడెను.

*23.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*బ్రహ్మా శర్వః కుమారశ్చ భృగ్వాద్యా మునయో నృప|*

*పితరః సర్వభూతాని సిద్ధా వైమానికాశ్చ యే॥7190॥*

*23.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*సుమహత్కర్మ తద్విష్ణోర్గాయంతః పరమాద్భుతమ్|*

*ధిష్ణ్యాని స్వాని తే జగ్మురదితిం చ శశంసిరే॥7191॥*

బ్రహ్మదేవుడు, శంకరుడు, సనత్కుమారుడు, భృగువు మొదలగు మునులు, పితృదేవతలు, సకల ప్రాణులు, సిద్ధులు ఇంకను విమానములో ఉన్న దేవగణములు శ్రీహరి భగవానుని యొక్క పరమాద్భుత లీలలను కీర్తించిరి. వారు అందరు అదితిని ప్రశంసించుచు తమ తమ లోకములకు వెళ్ళిపోయిరి.

*23.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*సర్వమేతన్మయాఽఽఖ్యాతం భవతః కులనందన|*

*ఉరుక్రమస్య చరితం శ్రోతౄణామఘమోచనమ్॥7192॥*

పరీక్షిన్మహారాజా! మిగుల పరాక్రమ శాలియైన శ్రీహరి అద్భుతలీలను నీకు వినిపించితిని. దీనిని వినిన వారి పాపములు అన్నియును తొలగిపోవును.

*23.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*పారం మహిమ్న ఉరువిక్రమతో గృణానో యః పార్థివాని విమమే స రజాంసి మర్త్యః|*

*కిం జాయమాన ఉత జాత ఉపైతి మర్త్య ఇత్యాహ మంత్రదృగృషిః పురుషస్య యస్య॥7193॥*

శ్రీహరి భగవానుని యొక్క లీలలు అనంతములు. ఆయన మహిమ అపారము. ఆ భగవానుని గుణములను లెక్కించుట, పృథ్వి యొక్క పరమాణువులను లెక్కించుట వలె అసాధ్యము- 'భగవంతుని మహిమలను తెలిసికొనగల మానవుడు ఇంత వఱకును జన్మింపలేదు ఇప్పుడు లేడు, ఇకముందు ఉండబోదు' అని మంత్ర ద్రష్టయైన వసిష్ఠమహర్షి వేదములలో నుడివెను.

*23.30 (ముప్పదియవ శ్లోకము)*

*య ఇదం దేవదేవస్య హరేరద్భుతకర్మణః|*

*అవతారానుచరితం శృణ్వన్ యాతి పరాం గతిమ్॥7194॥*

*23.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*క్రియమాణే కర్మణీదం దైవే పిత్ర్యేఽథ మానుషే|*

*యత్ర యత్రానుకీర్త్యేత తత్తేషాం సుకృతం విదుః॥7195॥*

దేవతలకును ఆరాధ్యుడైన వామన భగవానుని యొక్క అవతారమునందలి ఈ అద్భుత లీలలను వినిన మానవునకు పరమగతి (మోక్షము) ప్రాప్తించును. దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము మున్నగు కర్మలను అనుష్ఠించు సమయమున భగవానుని ఈ లీలలు కీర్తించినచో ఈ కర్మసఫలముగును. ఇది గొప్ఫ, గొప్ప మహాత్ముల అనుభవము.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే త్రయోవింశోఽధ్యాయః (23)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు ఇరువది మూడవ అధ్యాయము (23)

PVD Subrahmanyam చెప్పారు...

*రాజోవాచ*

*24.1 (ప్రథమ శ్లోకము)*

*భగవన్ శ్రోతుమిచ్ఛామి హరేరద్భుతకర్మణః|*

*అవతారకథామాద్యాం మాయామత్స్యవిడంబనమ్॥7196॥*

*పరీక్షిన్మహారాజు ప్రశ్నించెను* మహాత్మా! శ్రీహరి లీలలు పరమ అద్భుతములు. ఆ ప్రభువు తన యోగ మాయద్వారా మత్స్యావతారమును ధరించి, ఒక ఆశ్చర్యకరమైన లీలను నడిపెను. ఆ ఆది అవతార కథను నేను వినగోరుచున్నాను.

*24.2 (రెండవ శ్లోకము)*

*యదర్థమదధాద్రూపం మాత్స్యం లోకజుగుప్సితమ్|*

*తమఃప్రకృతిదుర్మర్షం కర్మగ్రస్త ఇవేశ్వరః॥7197॥*

మత్స్యజన్మ లోకనిందితమైనది. అది తమోగుణ ప్రధానము. పరతంత్రయుక్తము. భగవంతుడు సర్వశక్తిమంతుడైనను కర్మబంధమునకు వశమైన జీవునివలె, ఈ మత్స్యరూపమును ఏలధరించెను?

*24.3 (మూడవ శ్లోకము)*

*ఏతన్నో భగవన్ సర్వం యథావద్వక్తుమర్హసి|*

*ఉత్తమశ్లోకచరితం సర్వలోకసుఖావహమ్॥7198॥*

మహాత్మా! లోకములో ప్రశంసింపదగిన భగవంతుని గాథ సకల ప్రాణులకు సుఖావహము. కనుక, దయచేసి, నీవు ఆ వృత్తాంతమును పూర్తిగా వినిపింపుము.

*సూత ఉవాచ*

*24.4 (నాలుగవ శ్లోకము)*

*ఇత్యుక్తో విష్ణురాతేన భగవాన్ బాదరాయణిః|*

*ఉవాచ చరితం విష్ణోర్మత్స్యరూపేణ యత్కృతమ్॥7190॥*

*సూతుడు పలికెను* శౌనకాదిమహర్షులారా! పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ఇట్లు ప్రశ్నింపగ, అతడు శ్రీమహావిష్ణువు మత్స్యావతారమును ధరించి చేసిన ఘనకార్యములను ఇట్లు వర్ణింపసాగెను.

*శ్రీశుక ఉవాచ*

*24.5 (ఐదవ శ్లోకము)*

*గోవిప్రసురసాధూనాం ఛందసామపి చేశ్వరః|*

*రక్షామిచ్ఛంస్తనూర్ధత్తే ధర్మస్యార్థస్య చైవ హి॥7200॥*

*శ్రీ శుకుడు వివరించెను* పరీక్షిన్మహారాజా! విష్ణుభగవానుడు అందరికిని ఏకైక ప్రభువు. ఐనను, గోవులు, బ్రాహ్మణులు, దేవతలు, సాధువులు, వేదములు, ధర్మములు, అర్థములు మున్నగువానిని రక్షించుటకై ఆయన అవతారములను దాల్చుచుందును.

*24.6 (ఆరవ శ్లోకము)*

*ఉచ్చావచేషు భూతేషు చరన్ వాయురివేశ్వరః|*

*నోచ్చావచత్వం భజతే నిర్గుణత్వాద్ధియో గుణైః॥7201॥*

శ్రీమహావిష్ణువు సర్వశక్తిమంతుడు. అతడు వాయువు వలె పెద్ద, చిన్న ప్రాణులన్నింటిలోను అంతర్యామియై లీలలను నెఱపుచుండును. కాని, ఆయాప్రాణుల బుద్ధికి సంబంధించిన గుణములచే అతడు గొప్పదనమును, అల్పత్వమును పొందడు. ఏలయన, అతడు ప్రాకృత గుణరహితుడు. నిర్గుణుడు.

*24.7 (ఏడవ శ్లోకము)*

*ఆసీదతీతకల్పాంతే బ్రాహ్మో నైమిత్తికో లయః|*

*సముద్రోపప్లుతాస్తత్ర లోకా భూరాదయో నృప॥7202॥*

మహారాజా! గత కల్పాంతమునందు బ్రహ్మదేవుడు నిద్రించుటవలన *బ్రాహ్మము* అను పేరు గల నైమిత్తిక ప్రళయము సంభవించెను. అప్పుడు భూలోకములు అన్నియును సముద్రమునందు మునిగిపోయెను.

*24.8 (ఎనిమిదవ శ్లోకము)*

*కాలేనాగతనిద్రస్య ధాతుః శిశయిషోర్బలీ|*

*ముఖతో నిఃసృతాన్ వేదాన్ హయగ్రీవోఽన్తికేఽహరత్॥7203॥*

*24.9 (తొమ్మిదవ శ్లోకము)*

*జ్ఞాత్వా తద్దానవేంద్రస్య హయగ్రీవస్య చేష్టితమ్|*

*దధార శఫరీరూపం భగవాన్ హరిరీశ్వరః॥7204॥*

ప్రళయకాలము సమీపించుటవలన బ్రహ్మదేవునకు నిద్ర ఆవహింపగా, అతడు నిద్రింపగోరెను. అప్పుడు అతని ముఖమునుండి వేదములు జారిపడెను. ఆ సమీపమున నున్న బలశాలియైన హయగ్రీవుడు అను అసురుడు యోగబలముచే వాటిని అపహరించెను. సర్వశక్తిమంతుడైన శ్రీహరి దానవరాజైన హయగ్రీవుని ఈ చేష్టను తెలిసికొనెను. అందువలన ఆ ప్రభువు మత్స్యావతారము నెత్తెను.

*24.10 (పదియవ శ్లోకము)*

*తత్ర రాజఋషిః కశ్చిన్నామ్నా సత్యవ్రతో మహాన్|*

*నారాయణపరోఽతప్యత్తపః స సలిలాశనః॥7205॥*

మహారాజా! ఆ సమయమున సత్యవ్రతుడు అను రాజు కలడు. అతడు మిక్కిలి ఉదారుడు. భగవత్పరాయణుడు. అతడు కేవలము నీటిని మాత్రమే ఆహారముగా గొనుచు తపమాచరించెను.

మహారాజా! ఆ సమయమున సత్యవ్రతుడు అను రాజు కలడు. అతడు మిక్కిలి ఉదారుడు. భగeవత్పరాయణుడు. అతడు కేవలము నీటిని మాత్రమే ఆహారముగా గొనుచు తపమాచరించెను.

PVD Subrahmanyam చెప్పారు...

**24.11 (పదకొండవ శ్లోకము)*

*యోఽసావస్మిన్ మహాకల్పే తనయః స వివస్వతః|*

*శ్రాద్ధదేవ ఇతి ఖ్యాతో మనుత్వే హరిణార్పితః॥7206॥*

ఆ సత్రవ్రతుడే వర్తమాన మహాకల్పమునందు వివస్వంతుని పుత్రుడైన శ్రాద్ధదేవుడు అనుపేరఖ్యాతి వహించెను. అతనిని భగవంతుడు వైవస్వతమనువుగా నియమించెను.

*24.12 (పండ్రెండవ శ్లోకము)*

*ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణమ్|*

*తస్యాంజల్యుదకే కాచిచ్ఛఫర్యేకాభ్యపద్యత॥7207॥*

రాజా! ఒకనాడు ఆ రాజర్షి కృతమాల అను నదియందు జలతర్పణమును ఒసంగుచుండెను, అదే సమయమున అతని దోసిలిలోని నీటియందు ఒక చిన్న చేపపిల్ల వచ్చెను.

*24.13 (పదమూడవ శ్లోకము)*

*సత్యవ్రతోఽఞ్జలిగతాం సహ తోయేన భారత|*

*ఉత్ససర్జ నదీతోయే శఫరీం ద్రవిడేశ్వరః॥7208॥*

పరీక్షిన్మహారాజా! ద్రవిడదేశపురాజైన సత్యవ్రతుడు తన దోసిలిలోనికి వచ్చిన చేపపిల్లను నీటితో సహా నదీజలము లోనికి వదలెను.

*24.14 (పదునాలుగవ శ్లోకము)*

*తమాహ సాతికరుణం మహాకారుణికం నృపమ్|*

*యాదోభ్యో జ్ఞాతిఘాతిభ్యో దీనాం మాం దీనవత్సల|*

*కథం విసృజసే రాజన్ భీతామస్మిన్ సరిజ్జలే॥7209॥*

అప్పుడు ఆ చేప మిక్కిలి దైన్య స్వరముతో పరమదయాళువు ఐన సత్యవ్రతునితో పలికెను "మహారాజా! నీవు ఎంతయు దీనవత్సలుడవు. ఈ నీటిలో నివసించు జంతువులు తమ జాతి ప్రాణులను గూడ భక్షించునని నీకు తెలియును. వాటి వలని భయముచే నేను మిక్కిలి వ్యాకులపాటును పొందియున్నాను. నీవు నన్ను మరల ఈ నదీజలములలోనికి ఏలవదలుచున్నావు?"

*24.15 (పధునైదవ శ్లోకము)*

*తమాత్మనోఽనుగ్రహార్థం ప్రీత్యా మత్స్యవపుర్ధరమ్|*

*అజానన్ రక్షణార్థాయ శఫర్యాః స మనో దధే॥7210॥*

స్వయముగా శ్రీహరియే తన యెడల ప్రసన్నుడై చేపరూపములో వచ్చినాడని ఆ సత్యవ్రతుడు ఎరుగడు. కనుక, అతడు ఆ చేపను రక్షించుటకు మనస్సులో సంకల్పించుకొనెను.

*24.16 (పదహారవ శ్లోకము)*

*తస్యా దీనతరం వాక్యమాశ్రుత్య స మహీపతిః|*

*కలశాప్సు నిధాయైనాం దయాలుర్నిన్య ఆశ్రమమ్॥7210॥*

సత్యవ్రతమహారాజు మిక్కిలి దైన్యముతో గూడిన ఆ చేప పలుకులను విని, దయతో దానిని తన జలపాత్రలోనికి చేర్చుకొనెను. పిమ్మట అతడు దానిని తన ఆశ్రమమునకు తీసికొని వెళ్ళెను.

*24.17 (పదిహేడవ శ్లోకము)*

*సా తు తత్రైకరాత్రేణ వర్ధమానా కమండలౌ|*

*అలబ్ధ్వాఽఽత్మావకాశం వా ఇదమాహ మహీపతిమ్॥7212॥*

ఆశ్రమమునకు తీసికొనిపోయిన పిదప ఒకే రాత్రిలో ఆ చేప ఆ కమండలవు నిండ పెరిగెను. అందుండుటకు చోటు చాలక చేప రాజుతో ఇట్లనెను-

*24.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*నాహం కమండలావస్మిన్ కృచ్ఛ్రం వస్తుమిహోత్సహే|*

*కల్పయౌకః సువిపులం యత్రాహం నివసే సుఖమ్॥7213॥*

'రాజా! ఈ కమండలువునందు ఉండుటకు చోటు చాలక ఇబ్బంది పడుచున్నాను. కనుక, నా కొరకు ఒక పెద్ద స్థానమును ఏర్పాటు చేయుము. అచట సుఖముగా ఉండగలను"

*24.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*స ఏనాం తత ఆదాయ న్యధాదౌదంచనోదకే|*

*తత్ర క్షిప్తా ముహూర్తేన హస్తత్రయమవర్ధత॥7214॥*

సత్రవ్రత మహారాజు ఆ చేపను తీసికొని జలపూర్ణమైన ఒక కుండలోనుంచెను. వెంటనే (అట్లుంచినంతనే) అది ఆ కుండలో మూడుమూరలు పెరిగెను.

*24.20 (ఇరువదియవ శ్లోకము)*

*న మ ఏతదలం రాజన్ సుఖం వస్తుముదంచనమ్|*

*పృథు దేహి పదం మహ్యం యత్త్వాహం శరణం గతా॥7215॥*

మరల అది ఆ రాజుతో ఇట్లనెను- "మహారాజా! ఈ కుండలో గూడ నాకు చోటు చాలకున్నది. నేను దీనిలో ఉండలేకున్నాను. నేను నిన్ను శరణుజొచ్చుచున్నాను. కనుక నేను ఉండుటకు పెద్ద చోటును కల్పించుము.

PVD Subrahmanyam చెప్పారు...

*24.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*తత ఆదాయ సా రాజ్ఞా క్షిప్తా రాజన్ సరోవరే|*

*తదావృత్యాత్మనా సోఽయం మహామీనోఽన్వవర్ధత॥7216॥*

*24.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*నైతన్మే స్వస్తయే రాజన్నుదకం సలిలౌకసః|*

*నిధేహి రక్షాయోగేన హ్రదే మామవిదాసిని॥7217॥*

రాజా! అంతట ఆ సత్యవ్రతుడు ఆ చేపను తీసికొనిపోయి, ఒక సరోవరమునందు ఉంచెను. కాని అది కొలది సమయములోనే మహా మత్స్యముగా మారి ఆ సరోవరజలములను ఆక్రమించి ఇట్లు పలికెను- "రాజా! నేను జలములలో జీవించుప్రాణిని. ఈ సరోవర జలములు గూడ నేను నివసించుటకు సరిపోవు. కనుక, నా రక్షణకొరకై నన్ను ఏదైనా ఒక అగాధమైన సరస్సులో ఉంచుము".

*24.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ఇత్యుక్తః సోఽనయన్మత్స్యం తత్ర తత్రావిదాసిని|*

*జలాశయేఽసమ్మితం తం సముద్రే ప్రాక్షిపజ్ఝషమ్॥7218॥*

ఆ చేప ఇట్లు పలుకగా సత్యవ్రతుడు జలసమృద్ధి గల వేరువేరు తటాకముల యందు ఆ చేపను వేయసాగెను. కాని, ఎచ్చటను అది ఉండుటకు తగినంత చోటు లభ్యము కాకపోయెను.అంతట అతడు ఆ లీలామత్స్యమును సముద్రమునందు వదలెను.

*24.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*క్షిప్యమాణస్తమాహేదమిహ మాం మకరాదయః|*

*అదంత్యతిబలా వీర మాం నేహోత్స్రష్టుమర్హసి॥7219॥*

దానిని సత్యవ్రతుడు సముద్ర జలములలో వదలుచుండగా ఆ మత్స్యము అతనితో ఇట్లు అనెను- "మహావీరా! సముద్రములో మిక్కిలి బలముగల మొసళ్ళు మొదలగునవి ఉండును. అవి నన్ను తినివేయును. కనుక నన్ను సముద్రజలములలో వదలకుము"

*24.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*ఏవం విమోహితస్తేన వదతా వల్గుభారతీమ్|*

*తమాహ కో భవానస్మాన్ మత్స్యరూపేణ మోహయన్॥7220॥*

*24.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*నైవం వీర్యో జలచరో దృష్టోఽస్మాభిః శ్రుతోఽపి చ|*

*యో భవాన్ యోజనశతమహ్నాభివ్యానశే సరః॥7221॥*

ఆ మత్స్యము యొక్క మధురమైన పలుకులను విని సత్యవ్రతమహారాజు మోహమునకు వశుడాయెను. అప్పుడు అతడు ఇట్లు వచించెను- "మత్స్యరూపములో నన్ను మోహములో ఉంచిన నీవు ఎవరు? నీవు ఒకే దినములో వందయోజనముల విస్తీర్ణముగల సరస్సును ఆక్రమించితివి. నేను ఇంత వరకును ఇంతటి శక్తిమంతమైన జలచరమును కనలేదు, వినలేదు".

*24.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*నూనం త్వం భగవాన్ సాక్షాద్ధరిర్నారాయణోఽవ్యయః|*

*అనుగ్రహాయ భూతానాం ధత్సే రూపం జలౌకసామ్॥7222॥*

నీవు తప్పక సాక్షాత్తు సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి, శాశ్వతుడు ఐన శ్రీహరివే. జీవులకు అనుగ్రహించుటకే నీవు ఇట్లు జలచరరూపమును ధరించితివి.

*24.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్యప్యయేశ్వర|*

*భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో॥7223॥*

పురుషోత్తమా! నీవు జగత్తుయొక్క ఉత్పత్తి స్థితిలయములకు కారణుడవైన నారాయణుడవు. ప్రభూ! నీకు నమస్కారము. శరణాగతులమైన మా వంటి భక్తులకు నీవే ఆత్మవు, ఆశ్రయుడవు.

*24.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః|*

*జ్ఞాతుమిచ్ఛామ్యదో రూపం యదర్థం భవతా ధృతమ్॥7224॥*

నీ లీలావతారములు అన్నియును ప్రాణుల అభ్యుదయముల కొరకే సంభవించును. ఐనను, నీవు ఈ మత్స్య రూపుమును ఏ ఉద్దేశ్యముతో ధరించితివో, నేను తెలిసికొన గోరుచున్నాను.

*24.30 (ముప్పదియవ శ్లోకము)*

*న తేఽరవిందాక్ష పదోపసర్పణం మృషా భవేత్సర్వసుహృత్ప్రియాత్మనః|*

*యథేతరేషాం పృథగాత్మనాం సతామదీదృశో యద్వపురద్భుతం హి నః॥7225॥*

ప్రభూ! అరవిందాక్షా! దేహము మొదలగు అనాత్మ వస్తువులను తనవిగా భావించి, అభిమానము గల సాంసారిక పురుషుని ఆశ్రయించుట వ్యర్థము. నీ పాదములను శరణుజొచ్చుట ఎన్నడును వ్యర్థము గాదు. ఏలయన నీవు అందఱికిని అవ్యాజకరుణామయుడవు, పరమ ప్రియతముడవు; ఆత్మవు- ఇప్ఫుడు నీవు ఈ రూపమును ధరించి మాకు దర్శనమిచ్చుట ఎంతయు ఆశ్చర్యకరము.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*24.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*ఇతి బ్రువాణం నృపతిం జగత్పతిః సత్యవ్రతం మత్స్యవపుర్యుగక్షయే|*

*విహర్తుకామః ప్రలయార్ణవేఽబ్రవీచ్చికీర్షురేకాంతజనప్రియః ప్రియమ్॥7226॥*

*శ్రీ శుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! జగన్నాథుడైన శ్రీహరి తన అనన్య భక్తులయెడ మిక్కిలి ప్రీతిగలవాడు. వారికి ప్రియమును, హితమును చేకూర్చువాడు. కల్పాంతమున ప్రళయకాల సముద్రమందు విహరింపగోరుచుండెను. రాజర్షియైన సత్యవ్రతుని ప్రార్థనను ఆలకించి, ఆ మత్స్యభగవానుడు అతనితో ఇట్లు పలికెను-

*శ్రీ భగవానువాచ*

*24.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*సప్తమేఽద్యతనాదూర్ధ్వమహన్యేతదరిందమ|*

*నిమంక్ష్యత్యప్యయాంభోధౌ త్రైలోక్యం భూర్భువాదికమ్॥7227॥*

*24.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*త్రిలోక్యాం లీయమానాయాం సంవర్తాంభసి వై తదా|*

*ఉపస్థాస్యతి నౌః కాచిద్విశాలా త్వాం మయేరితా॥7228॥*

*శ్రీభగవానుడిట్లు పలికెను* సత్యవ్రతా! నేటి నుండి ఏడవ దినమున భూలోకము మొదలగు ముల్లోకములును ప్రళయ కాల సముద్రమున మునిగిపోవును. ముల్లోకములును ప్రళయకాల జలముల యందు మగ్నమైపోవుచుండగా నా ప్రేరణచే నీ యొద్దకు ఒక విశాలమైన నౌక రాగలదు.

*24.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*త్వం తావదోషధీః సర్వా బీజాన్యుచ్చావచాని చ|*

*సప్తర్షిభిః పరివృతః సర్వసత్త్వోపబృంహితః॥7229॥*

ఆ సమయమున నీవు సకలప్రాణుల సూక్ష్మ శరీరములను వెంటబెట్టుకొని, సప్తర్షులతో గూడి ఆ పడవను అధిరోహింపవలెను. సమస్త ధాన్యములను, ఓషధులను, బీజములను అందు చేర్చవలెను.

*24.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*ఆరుహ్య బృహతీం నావం విచరిష్యస్యవిక్లవః|*

*ఏకార్ణవే నిరాలోకే ఋషీణామేవ వర్చసా॥7230॥*

ఆ సమయమున ఆ నావకు అన్నివైపుల మహాసాగరజలములే యుండును. ఏ మాత్రమూ వెలుతురు ఉండదు. కేవలము ఋషులయొక్క దివ్యకాంతుల సహాయమున ఎట్టి తడ బాటూ లేకుండ నీవు ఆ నావపైన ఎక్కి నలువైఫుల విహరించుచుండవలెను.

*24.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*దోధూయమానాం తాం నావం సమీరేణ బలీయసా|*

*ఉపస్థితస్య మే శృంగే నిబధ్నీహి మహాహినా॥7231॥*

ప్రచండ వాయువుల కారణముగా ఆ నావ ఇటునటు కదలుచుండును. అప్పుడు నేను ఈ మత్స్యరూపమున అచటికి రాగలను. మీరు వాసుకి సర్పముతో ఆ నావను నా కొమ్మునకు కట్టవలెను.

*24.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*అహం త్వామృషిభిః సాకం సహనావముదన్వతి|*

*వికర్షన్ విచరిష్యామి యావద్బ్రాహ్మీ నిశా ప్రభో॥7232॥*

మహారాజా! బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయము ముగియునంత వరకు ఋషులతోసహా నిన్ను ఆ నావను లాగుచు సముద్రమున విహరించెదను.

*24.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*మదీయం మహిమానం చ పరం బ్రహ్మేతి శబ్దితమ్|*

*వేత్స్యస్యనుగృహీతం మే సంప్రశ్నైర్వివృతం హృది॥7233॥*

ఆ సమయమున నీ ప్రశ్నకు సమాధానముగా ఉపదేశము చేయగలను. నా అనుగ్రహమున పరబ్రహ్మమైన నా యొక్క వాస్తవిక మహిమ నీ హృదయము నందు ప్రకటితమగును. దానిని నీవు చక్కగా అవగాహన చేసికొనగలవు.

*24.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*ఇత్థమాదిశ్య రాజానం హరిరంతరధీయత|*

*సోఽన్వవైక్షత తం కాలం యం హృషీకేశ ఆదిశత్॥7234॥*

సత్యవ్రత మహారాజును ఇట్లు ఆదేశించి, శ్రీహరి అంతర్ధానమయ్యెను. భగవంతుడు ఆదేశించిన ఆ సమయము కొరకు సత్యవ్రతుడు నిరీక్షింపసాగెను.

*24.40 (నలుబదియవ శ్లోకము)*

*ఆస్తీర్య దర్భాన్ ప్రాక్కూలాన్ రాజర్షిః ప్రాగుదఙ్ముఖః|*

*నిషసాద హరేః పాదౌ చింతయన్ మత్స్యరూపిణః॥7235॥*

సత్యవ్రతుడు, దర్భల కొనలు తూర్ఫుదిశగా ఉండునట్లు పరచి, వాటిపై ఈశాన్య దిక్కునకు అభిముఖముగా కూర్చొనెను. మత్స్యరూపమున ఉన్న శ్రీహరి పాదములను ధ్యానింపసాగెను.

PVD Subrahmanyam చెప్పారు...

*24.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*తతః సముద్ర ఉద్వేలః సర్వతః ప్లావయన్ మహీమ్|*

*వర్ధమానో మహామేఘైర్వర్షద్భిః సమదృశ్యత॥7236॥*

ఇంతలో భగవానుడు పేర్కొనిన సమయము రానే వచ్చెను. సముద్రము తన చెలియలికట్టను దాటెను. ప్రళయకాలమునందలి భయంకర మేఘములు వర్షింపసాగెను. చూచుచుండగనే భూ మండలము అంతయు జలమయము అయ్యెను.

*24.42 (నలుబది రెండవ శ్లోకము)*

*ధ్యాయన్ భగవదాదేశం దదృశే నావమాగతామ్|*

*తామారురోహ విప్రేంద్రైరాదాయౌషధివీరుధః॥7237॥*

సత్యవ్రతుడు శ్రీహరి ఆజ్ఞను స్మరించుచుండగ ఒక నావ ఆయన యొద్దకు వచ్చుచుండుట గమనించెను. అంతట అతడు ధాన్యములను, ఓషధులను, బీజములను తీసికొని, సప్త-ఋషులతోగూడి ఆ నావలోనికి వచ్చెను.

*24.43 (నలుబది మూడవ శ్లోకము)*

*తమూచుర్మునయః ప్రీతా రాజన్ ధ్యాయస్వ కేశవమ్|*

*స వై నః సంకటాదస్మాదవితా శం విధాస్యతి॥7238॥*

సప్తర్షులు ప్రసన్నులై సత్యవ్రతునితో ఇట్లు నుడివిరి. 'రాజా! నీవు శ్రీహరి భగవానుని ధ్యానింపుము. ఆయనయే మనలను ఈ సంకట స్థితినుండి రక్షింపగలడు. మనకు శుభములు చేకూరును.

*24.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*సోఽనుధ్యాతస్తతో రాజ్ఞా ప్రాదురాసీన్మహార్ణవే|*

*ఏకశృంగధరో మత్స్యో హైమో నియుతయోజనః॥7239॥*

వారి ఆజ్ఞానుసారము మహారాజు భగవానుని ధ్యానింపసాగెను. అదే సమయమున శ్రీహరి ఒక మహామత్స్యరూపమున సముద్రమునందు ప్రకటితుడయ్యెను. ఆ మత్స్యభగవాసుని శరీరము లక్ష యోజనముల విస్తీర్ణము గలిగి బంగారమువలె మెఱయుచుండెను. ఆ మత్స్య శరీరమునకు ఒక గొప్ప కొమ్ము గూడ కలదు.

*24.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*నిబధ్య నావం తచ్ఛృంగే యథోక్తో హరిణా పురా|*

*వరత్రేణాహినా తుష్టస్తుష్టావ మధుసూదనమ్॥7240॥*

లోగడ భగవంతుడు ఆదేశించిన విధముగ సత్యవ్రతుడు వాసుకి సర్పమును త్రాడుగా జేసి, నావను చేప కొమ్మునకు కట్టెను. పిమ్మట సంతోషముగా మధుసూదనుని ఇట్లు స్తుతించెను.

*రాజోవాచ*

*24.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*అనాద్యవిద్యోపహతాత్మసంవిదస్తన్మూలసంసారపరిశ్రమాతురాః|*

*యదృచ్ఛయేహోపసృతా యమాప్నుయుర్విముక్తిదో నః పరమో గురుర్భవాన్ ॥7241॥*

*రాజు పలికెను* "ప్రభూ! ఈ సంసారమున జీవుల ఆత్మ అనాదికాలమునుండి అజ్ఞానముచే కప్పబడి యున్నది. ఆ కారణముచే వారు పెక్కు సాంసారికక్లేశములతో సతమతమగు చున్నారు. అనాయాసముగ నీ అనుగ్రహమునకు పాత్రులైనప్పుడు వారు శరణువేడి, నిన్ను పొందుచున్నారు. వాస్తవముగా మమ్ములను ఈ బంధములనుండి ముక్తులను జేసి మోక్షమును ప్రసాదించునట్టి పరమగురుడవు నీవే.

*24.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*జనోఽబుధోఽయం నిజకర్మబంధనః సుఖేచ్ఛయా కర్మ సమీహతేఽసుఖమ్|*

*యత్సేవయా తాం విధునోత్యసన్మతిం గ్రంథిం స భింద్యాద్ధృదయం స నో గురుః॥7242॥*

ఈ జీవుడు అజ్ఞానియై తాను చేసికొనిన కర్మలతోనే బంధింపబడుచున్నాడు. సుఖమును గోరుచు పెక్కు కర్మలను ఆచరించి, ఇంకను దుఃఖములను మూటగట్టు కొనుచున్నాడు. నిన్ను సేవించుట ద్వారా అతని అజ్ఞానము తొలగిపోవును. అప్పుడే పరమగురుడవైన నీవు మా హృదయగ్రంథిని ఛేదింపగలవు.

*24.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*యత్సేవయాగ్నేరివ రుద్రరోదనం పుమాన్విజహ్యాన్మలమాత్మనస్తమః|*

*భజేత వర్ణం నిజమేష సోఽవ్యయో భూయాత్స ఈశః పరమో గురోర్గురుః॥7243॥*

అగ్నియందు తప్తమగుట వలన బంగారము, వెండి మొదలగు వాటిలోని మాలిన్యము తొలగిపోవును. అప్పుడు అవి నిజస్వరూపముతో మెరసిపోవును. అట్లే నీ సేవలద్వారా జీవుని అంతఃకరణము నందలి అజ్ఞానమను మాలిన్యము తొలగిపోయి, అతడు తన వాస్తవరూపములో నిలుచును. సర్వశక్తిమంతుడవు, శాశ్వత ప్రభుడవైన నీవే గురువులకు గూడ పరమగురుడవు. అందువలన మాకును గురుడవై, జ్ఞానమును ప్రసాదింపుము.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*667వ నామ మంత్రము*

*ఓం నిర్ద్వైతాయై నమః*

సమస్త బ్రహ్మాండములు, అందుజీవులు, ఆ జీవుల జీవన ప్రవృత్తులకు అన్నిటికీ తానే కారణమై, అన్నియు తననుండే ఉద్భవించినదై, సర్వస్వరూపములలో తాను తక్క అన్యమేదియు లేక, సమస్తమూ ఆ పరబ్రహ్మ స్వరూపములుగా ద్వైతమన నేదియు కాని నిర్ద్వైతా స్వరూపిణియైన జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్ద్వైతా* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నిర్ద్వైతాయై నమః* అని ఉచ్చరించుచూ భక్తిశ్రద్ధలతో ఆ లోకేశ్వరిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఉపాసించు సాధకునకు జగమంతయు ఆ జగదీశ్వరి తక్క అన్యమేమియు కాదనియు, ఆ జనని నామ మంత్ర జపమే సమస్త పాపకర్మల ఫలితములనుపశమింప జేసి, సత్కర్మలయాందాసక్తినేర్పరచి, నిత్యము ఆ కామేశ్వరి పాదసేవయందే నిమగ్నమొనర్చి తరింపజేయును.

జీవుడు వేరు దేవుడు వేరు అనునది ద్వైతము. ఇంతకు ముందు నామ మంత్రములో *(భూమరూపా)* తానుదక్క అన్యమయినది మరొక్కటి లేనిది అఖండముగా, శాశ్వతముగా విరాజిల్లు పరబ్రహ్మమే భూమమనియు,ఆ భూమమయినది సుఖస్వరూపమనియు చెప్పబడినది. ద్వైతము నిత్యమైతే అద్వైతము శాశ్వతము. ద్వైతము అనిత్యము, అసత్యము, మరణశీలమైనది, అటువంటి ద్వైతము లేనిది శ్రీమాత కనుక *నిర్ద్వైతా* అను నామాంకిత అయినది.

జీవులు ఎన్నో ఉన్నాయి. పులి, సింహము, పిల్లి, కుక్క మరియు మనుష్యుడు కూడా. జీవించి ఉన్నంతవరకే ఆ శరీరములోని ఆత్మకు ఆ శరీరముపేరు ఉన్నది. కాని మరణించిన తరువాత ఆత్మ తప్ప ఇంక ఆ జీవికి వేరే గుర్తింపు ఉండదు. ఆ శరీరము నుండి వేరు అయిన ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇప్పుడు జీవుడు దేవునిలో చేరితే జీవుడు, దేవుడు ఒకటే అని చెప్పడమవుతుందికదా. ఇదే అద్వైతము. అజ్ఞానంలో ఉన్న జీవాత్మ తాను వేరు అనుకుంటాడు. బంధాలు తెగిన తరువాత పరమాత్మలో చేరిన జీవాత్మ కూడా పరమాత్మ అవుతుంది. అజ్ఞానపు పొరలు తొలగిన జీవాత్మ తానే పరబ్రహ్మ అని తెలియవస్తుంది. బ్రహ్మము నెరుగుట కూడా బ్రహ్మమే. ఈ ప్రపంచం వివిధరకాల జీవులతో వివిధ రకాల ప్రవృత్తులతో బ్రహ్మ వేరు జగత్తు వేరు అనిపించవచ్చు. ఆత్మజ్ఞానం ద్వారా, శాస్త్రజ్ఞానంద్వారా జీవుడు, దేవుడు అనేది తెలుసుకోవచ్చు. అమ్మవారు *ఏకాకినీ* అన్నాము. తనకన్నా అధికమైనదేదీ లేక తానే ఏకాకిని అనిపించించుకుంది. అంటే అద్వితీయమేకదా. రెండుభావాలకు చోటులేదుకదా. *భూమరూపా* బ్రహ్మస్వరూపురాలు. అంటే బ్రహ్మమంటేనే పరమాత్మ. అంతకన్నా మించినదేదీ లేని అద్వితీయమైన పరమాత్మ. ఈ నామ మంత్రములో ద్వైతభావమూనకు అవకాశములేని *నిర్ద్వైతా*

అటువంటి పరమాత్మయైన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్ద్వైతాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*668వ నామ మంత్రము*

*ఓం ద్వైతవర్జితాయై నమః*

జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, అన్ని తానే, తానే అన్నీ అంటూ జీవుడికి దేవుడికి భేదముందనే ద్వైతాన్నిలేనిదిగా విరాజిల్లు భువనేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ద్వైతవర్జితా* అను అదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం ద్వైతవర్జితాయై నమః* అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిప్రపత్తులతో శ్రీమాతను పూజించు భక్తులకు ఆ తల్లి సకలాభీష్టసిద్ధినొసగి, అధ్యాత్మికానందముతో తరింపజేయును.

జగన్మాతకు జీవుడు వేరు, పరమేశ్వరుడు వేరు అను భావములు లేనిది. ఇంతకు ముందు నామ మంత్రములలో *(ఏకాకినీ, భూమరూపా, నిర్ద్వైతా)* లో జగన్మాతకు ద్వైతభావము పోయినది అని చెప్పబడినది. కాని ఆ తల్లికి ఆ భావము వచ్చుట, మరియు పోవుట అనేదే లేదు. ఆ జగన్మాతకు ఉన్నదే అద్వైతభావన. ద్వైతభావన అనగా జీవుడు వేరు, దేవుడు వేరు అన్నటువంటి భావన శ్రీమాతకు మొదటి నుండియు లేదు. అందుకే ఆ జగదీశ్వరిని *ద్వైతవర్జితా* అని స్తుతిస్తున్నాము. ద్వైతంలో స్వతంత్రత పరతంత్రతా అను రెండుభావములు కలవు. జీవి పరతంత్రుడు అన్నందుకు ఒక మాట. మరణానంతరము జీవి అంగుష్టమాత్ర శరీరుడై శ్రీమన్నారాయణుని సన్నిధిలో ఉంటాడు. దీనినే సామీప్యముక్తి అని చెప్పారు. కాని అద్వైతంలో సాయుజ్యం సంప్రాప్తిస్తుంది. జీవాత్మ పరమాత్మలో లీనం అవడం జరుగుతుంది. అందుకే జగన్మాతను *ద్వైతవర్జితా* అని అన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ద్వైతవర్జితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*91వ నామ మంత్రము*

*ఓం కులసంకేత పాలిన్యై నమః*

కులశాస్త్ర, కులాచార రహస్యములను, అర్హులైన ఉపాసకులకు మాత్రమే బోధించు కులసంకేతములను, సాంప్రదీయుకులకు మాత్రమే బోధించు సమయ లేక నియమపాలనను నిర్వహించు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కులసంకేత పాలినీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం కులసంకేత పాలిన్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు ఆ తల్లి కృపాకటాక్ష వీక్షణములకు పాత్రుడై బ్రహ్మజ్ఞాన సంపన్నుడై తరించును.

కులశాస్త్ర కులాచార రహస్యములను ఉపాసకులు కానివారికి కాకుండా సాంప్రదాయము ఉండి అర్హత ఉన్నవారికి మాత్రమే బోధించుచున్నట్టి సమయము, నియమము పరిపాలించునది శ్రీమాత.

కులము అంటే కేవలం శ్రీకృష్ణభగవానుడు చెప్పిన వృత్తులననుసరించి ఏర్పడిన నాలుగు వర్ణములవారు కాదు. ఉపాసింపబడు దేవత, ఉపాసన చేయుసాధకుడు, ఉపాసనకు ఉపయోగించు హోమద్రవ్యములను బోధించు శాస్త్రమునే కులము అందురు. భవిష్యోత్తర పురాణాలలో కులము అంటే వంశం కాదు. ఆచారవ్యవహారముల కట్టుబాట్లు కలదే కులము అని చెప్పబడినది. *కులపుస్తకాని చ గోపయేదితి* అని కల్పసూత్రాలలో చెప్పబడినది. అనగా కులాచారసాంప్రదాయములకు సంబంధించి *కుల పుస్తకములను రక్షింపవలెను* రక్షించుట అంటే అజ్ఞానులకు, సాంప్రదాయాలకు నీళ్ళువదిలి, పుక్కిటి పురాణాలతో సంపాదనకోసమే శాస్త్రాలు చదువుతామని చెప్పు బుద్ధిహీనులకు ఈ శాస్త్రములను బోధించకూడదు. సద్గురువుఎప్పుడును మంత్రోపదేశము చేయునపుడు ఆ జిజ్ఞాసి ఇచ్చిన మంత్రమును కాపాడగలడా, సద్వినియోగం చేయగలడా అని ఆలోచిస్తాడు. ఇదే *కులసంకేతపాలనము* జగన్మాత కులసంకేతపాలనము చేయువారినే గురువులుగా కటాక్షించింది. అటువంటి వారే శిష్యసంతతిని ప్రవర్తింపజేయుదురు. అట్టివారిలోని వారే ఆదిశంకరులు వంటివారు. వారిద్వారా కులసంకేతరక్షణము చేయుచున్నది గనుక ఆ తల్లి *కులసంకేత పాలినీ* అను నామముతో స్తుతిస్తున్నాము.

ఆచారములు జ్ఞానులకు చెప్పవలసిన పనిలేదు. వారు వారి జ్ఞానమార్గములో పోవుచునే యుందురు. నేను సాంప్రదాయాన్ని అనుసరిస్తాను, కాపాడతాను అంటూ ఐహికమైన కోర్కెలు ఉన్నవారికి ఈ శాస్త్రరహస్యములు చెప్పబడ్డాయి. ఆగమములలో

1) చక్రసంకేతము, 2) మంత్రసంకేతము, 3) పూజాసంకేతము అని త్రిపురాదేవి సంకేతములు మూడువిధములుగా ఉన్నవి అనిగలదు. చింతామణి స్తవములో

*శ్లో. కులాంగనైషా ప్యథరాజవీథీః ప్రవిశ్య సంకేతగృహాంతరేషు|*

*విశ్రమ్య విశ్రమ్య పరేణ పుంసా సంగమ్య సంగమ్య రసం ప్రసూత॥*

దీని అర్థం పరిశీలించుదాము- కులాంగన (కుండలినీ శక్తి) రాజవీధులందు (సుషుమ్నా మార్గములో) ప్రవేశించి, రహస్య గృహములందు (షట్చక్రములందు) విశ్రమించి విశ్రమించి, శ్రేష్ఠపురుషునితో (సహస్రారంలో పరమేశ్వరునితో) సంగమించి, సంగమించి, రసోత్పత్తి చేయుచున్నట్టిది (అమృథధారలను స్రవింపజేయుచున్నది)

కౌళాచారములో అంతయు రహస్యముగా ఉంచాలని శాస్త్రములు ఘోషిస్తున్నవి. అన్నియు రహస్యముగా తెరచాటునే జరపవలయునని చెప్పబడినది. ఉపాస్య,ఉపాసక, ఉపాసనలు చైతన్యస్వరూపములని భావించాలి. సాధకుడు యోగసాధనలో (అంతర్యాగమున) కుండలినీ శక్తిని సుషుమ్నా మార్గమున గొనపోవుచు, షట్చక్రములందు (మూలాధారము - గుదస్థానమున, స్వాధిష్ఠానము - లింగస్థానమునందు, మణిపూరము - నాభి స్థానమునందు, అనాహతము - హృదయము నందు, విశుద్ధిచక్రము - కంఠస్థానమునందు, ఆజ్ఞాచక్రము - భృకుటి స్థానమునందు) విశ్రాన్తి గొలుపుచూ సహస్రారము చేరి అమృతమును వర్షింపజేయవలెనని పై శ్లోకంలోని భావము. ఇలా ఉండగా కులస్త్రీ, రహస్యస్థానము, సంకేతము, పరపురుషుడు, సంగమము అనుమాటలను వికృతార్థములుగా తీసికొని వామాచారపరముగా వ్యాఖ్యానించుచున్నారు.

పరశురాముడు కల్పసూత్రము 1 నుండి 30 లో ఇతరవిద్యలు అన్నియు వేశ్యలవలె ధారాళంగా ప్రకటితములు, బహిర్గతములు. శ్రీలలితాంబిక పాతివ్రత్యాది గుణశీల. సర్వాంతర్యామియగు శ్రీవిద్య కులస్త్రీవలె మిక్కిలి గోప్యమైనది. కాన గురువునుండి మాత్రమే గ్రహింపదగు శ్రీవిద్య కోరువారు అత్యంతరహస్యముగా ఉపదేశము తీసికొనవలెను. అందరికీ బహిర్గతము చేయరాదు. ఈ విధమైన కులసంకేతములను పాలనచేయునది శ్రీమాత కనుక ఆ మహాతల్లిని *కులసంకేత పాలినీ* అని భక్తితో స్తుతిస్తున్నాము. ఈ నామమందలి భావమిది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కులసంకేతపాలిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🀼󞐼󞐼󞐊
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235

SRI SARMADA చెప్పారు...

పరమేశ్వరుడు -తృతీయనేత్రము
----------------__
పరమేశ్వరునకు తృతీయ నేత్రమున్నట్లు పురాణములువర్ణిస్తున్నవి. అతడా నేత్రముతో జగత్తును భస్మీభూతం చేస్తాడనే సంప్రదాయం చెప్పుచున్నది.
కుమార సంభవం కావ్యములో పార్వతీదేవి ఈశ్వరునకు ప్రేమాతిశయాన్ని వర్ధిల్ల జేయడానికి ఇంద్రుడు పంపగా మన్మథుడు ఈశ్వరుని సమీపిస్తాడు.
ఆ సందర్భమున మహాకవి కాళిదాసు
" సదేవదారుద్రుమ వేదికాయాం
శార్దూలచర్మవ్యవధానవత్యాం
ఆసీనమసన్న శరీరపాత
స్త్రీయంబకం సంయమి నంద దర్శ " ( కుమా 3-44) దేవదారు వృక్షపుటరుగుమీద వ్యాఘ్రాసనా సీనుడై సమాధి నిష్టుడై యున్న త్రియంబకుని మన్మధుడు చూచెను. యిచట ఈశ్వరుని చూచెను అనకుండా త్రినేత్రుని చూచెను అని మహాకవి సాభిప్రాయంగా వర్ణించుట గమనింపవచ్చు.
" తతః పరామర్శ వివృద్ధమన్యో
ర్భూ భంగ దుప్రేక్ష్య ముఖస్య స్ఫుర
న్ను దీర్చి : సహసా తృతీయా దక్షిణః కృశాను : రిల నిష్ఫపాత "
( కుమా -3-71)
మన్మథుడు ఈశ్వరునకు తపోభంగము కావించి నందున కుపితుడైన ఈశ్వరుని తృతీయ నేత్రమునుండి బయలుదేరిన అగ్నిచేమన్మధుడు భస్మావశేషుడై నాడు
ఈ వర్ణన లలాట స్థాన మగ్నికి నిలయమని. తెలియజేయుచున్నాది.
ఆ అగ్ని సాధకులైన మహాత్ముల దృష్టిలో యపరంజ్యోతి సాధకుడు లలాటస్థ పరంజ్యోతి నుపాసించునపుడు అతడు జ్ఞాని యగుచున్నాడు. ఆ జ్ఞానాగ్ని కామక్రోధాద్యరిషుడవర్గ మును భస్మము చేయు చున్నది. అనగా జ్ఞాని యైనపుడాతని అవిద్య నశించుచున్నది. ఇదియే కుమారసంభవమున కామదహన కథా తాత్పర్యము.
ఈ పై విచారణవలన లలాటము పరంజ్యోతి స్థానమని స్పష్టమగుచున్నది. తపస్సమాధి యందున్నవారు తమ దృష్టిని నాసాగ్రమున నిలిపి పరంజ్యోతి ఉపాసించుతూ వుంటారు. అందుకనే , నాసాగ్రమునదృష్టిని నిలిపి దేవుని ధ్యానింపమని పెద్దలు చెప్పుతారు.

SRI SARMADA చెప్పారు...

రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు
రామాయణం ఒక భూగోళ శాస్త్రము.
సీత జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నాకు నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి ఆలోచించండి. ఒకసారి అప్పుడు సుగ్రీవుడు చెప్పిన వివరాలు అవలోకించండి.
తూర్పు దిక్కునకు వినతుడి ఆధ్వర్యంలో వానర సైన్యాన్ని పంపుతూ అటు వైపు వివరాలిలా చెబుతాడు:
ముఖ్యమైన నదులు : గంగ, సరయు, కౌశికి, యమునా నది, యామునగిరి , సరస్వతి , సింధు;
నగరాలు : బ్రహ్మమాల , విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ నగరాలు, పుండ్ర, అంగ,
అవి దాటాక సముద్రములో గల పర్వతములు, వాటి మధ్య ద్వీపములు, ( నేటి మన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి పరికించండి)
తరువాత శిశిరము అను పర్వతము పిమ్మట సముద్రము (అండమాన్ సీ)
యవద్వీపము, సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపం, – బంగారు వెండికు నెలవైనవి (బర్మా, లాఓస్, ఇతరత్రా) ఇక్కడ చేపలను పచ్చిగా తింటారు. కొన్ని నేడు సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చును.
తరువాత శోననదము, అటుపై నల్లగా వుండే ఇక్షు సముద్రం ( నేడు ఒక సారి చూడండి ముదురు ఆకుపచ్చ రంగులో – సుమారు నలుపు రంగులో కనబడుతుంది సౌత్ చైనా సి )
అటుపై లోహితము, మధు సముద్రము (ఈస్ట్ చైనా సి)
తరువాత శాల్మలీ ద్వీపము (తైవాన్)
ఋషభము అని పర్వతము
మధుర జలధి (జపనీస్ సి )
ఔర్వుడు వలన హయముఖము (అగ్నిశిఖరం) (కొరియా)
13 యోజనాల దూరం లో బంగారు పర్వతము – జాత రూప శిలము
ఉదయాద్రి (ల్యాండ్ of రైసింగ్ sun ) (జపాన్ )
తరువాత క్షీరోదము అను సముద్రము (నార్త్ పసిఫిక్ ఓషన్)
అక్కడ వరకు మాత్రమె అతను చెప్పగలిగాడు. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్ పరికించి చూడమని మనవి.
దక్షిణ దిక్కుకు అంగదుడు, హనుమంతుడు వంటి వీరులను పంపుతూ అక్కడి వివరాలిలా చెబుతాడు.
నదులు : గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద , మహాభాగా
దేశాలు : మేఖల, ఉత్కళ, దశార్ణ , అవంతి, విదార్ధ, మూషిక, వంగ, కాలింగ, కౌశిక దండకారణ్యం, గోదావరి పాయఆంద్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, మలయ పర్వతం అటుపై కావేరి,
పాండ్య దేశానంతరం మహా సముద్రం (బే of బెంగాల్ ) దానిలో మహేంద్రగిరి అటుపై 100 యోజనాల దూరంలో లంక
మరొక 100 యోజనాల దూరంలో పుష్పితకము (ఆస్ట్రేలియా ) , అటుపై 14 యోజనాల దూరంలో సూర్యవంతము(న్యూ జీలాండ్) ,విఅడుత్యము , కుంజరము, భోగవతి ,వృషభ పర్వతము (అంటార్క్టిక)
అది దాటాక భూమి సరిహద్దు
పశ్చిమ దిక్కుకు సుషేణుడు
వున్న రాజ్యాలు : సౌరాష్ట్ర, బాహ్లిక, శూరా, భీమ, అటుపై మరుభూమి మిట్ట నెలలు ( ఎడారులు ) ఆఫ్ఘనిస్తాన్ తరువాత సముద్రము
మురచీ , అవంతి , అటుపై సింధు నదము (మనలను సింధు నాగరికత పేరుతో నేడు ఆంగ్లేయులు హిందూ అని పిలుస్తున్నారు), అటుపై హేమగిరి, పారియాత్రము, చక్రవంతము – కొండ
60 యోజనాల దూరంలో వరాహగిరి – ప్రాగ్జోతిష పురము (భారతంలో చెప్పిన ప్రాగ్జోతిష్ పురము వేరు), సర్వ సౌవర్ణ పర్వతము, మరి కొన్ని పర్వతాలు
మేరు పర్వతము ( ఇతః పూర్వం మనము ముచ్చటించుకున్న మేరు పర్వతం మన భూగోళానికి రిఫరెన్స్ గా వున్న పాయింట్)
10000 యోజనాల దూరంలో అస్తాద్రి ( యునైటెడ్ కింగ్డమ్) (రవి అస్తమించని దేశం )
తరువాత సరిహద్దు
ఉత్తర దిక్కుకు శతవాలి
ముందుగా హిమవత్పర్వతము అటుపై మ్లేచ్చ దేశములు, పులిందులు, ఇంద్రప్రస్థ, Tankana, చీనా, పరమ చీనా,(నేటి చైనా ) కాల ప్రవతము,(కజాక్స్తాన్ ), హేమగర్భము (మంగోలియా) సుదర్శనము
దేవసాఖ శైలము అటుపై శూన్య ప్రదేశము (రష్యా) తరువాత తెల్లని హిమం తో కూడుకున్న పర్వతము – కైలాసము, అటుపై క్రౌన్చగిరి, ఇంకా హిమం తో వున్నా మరి కొన్ని పర్వతాలు (రస్యా )
లవణ సముద్రము ( కార సి), సోమగిరి (బోల్షెవిక్) పిమ్మట సరిహద్దు
అంతకు మునుపు టపాలలో మనకున్న టెక్టోనిక్ ప్లేట్ లు కదులుతున్నాయని ప్రస్తావించడం జరిగింది. కాలగర్భంలో ఎన్నో భౌగోళిక మార్పులు జరిగాయి. కొన్ని ఖండాలకు ఖండాలు సముద్ర గర్భంలో కాలిపోయాయి, కొత్తవి వెలికి వచ్చాయి. కానీ కొన్ని మార్పు లేకుండా వున్నాయి.
ఇక్కడ మనం గమనించ వలసినది ఏమిటంటే ఇంత టెక్నాలజీ లేకుండా ఎప్పుడో రచించ బడిన రామాయణంలో ఇంత ప్రస్ఫుటంగా భౌగోళిక వివరాలు పొందు పరచబడి వున్నాయి.
SRI SARMADA COLLECTION

PVD Subrahmanyam చెప్పారు...

*24.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*తతః సముద్ర ఉద్వేలః సర్వతః ప్లావయన్ మహీమ్|*

*వర్ధమానో మహామేఘైర్వర్షద్భిః సమదృశ్యత॥7236॥*

ఇంతలో భగవానుడు పేర్కొనిన సమయము రానే వచ్చెను. సముద్రము తన చెలియలికట్టను దాటెను. ప్రళయకాలమునందలి భయంకర మేఘములు వర్షింపసాగెను. చూచుచుండగనే భూ మండలము అంతయు జలమయము అయ్యెను.

*24.42 (నలుబది రెండవ శ్లోకము)*

*ధ్యాయన్ భగవదాదేశం దదృశే నావమాగతామ్|*

*తామారురోహ విప్రేంద్రైరాదాయౌషధివీరుధః॥7237॥*

సత్యవ్రతుడు శ్రీహరి ఆజ్ఞను స్మరించుచుండగ ఒక నావ ఆయన యొద్దకు వచ్చుచుండుట గమనించెను. అంతట అతడు ధాన్యములను, ఓషధులను, బీజములను తీసికొని, సప్త-ఋషులతోగూడి ఆ నావలోనికి వచ్చెను.

*24.43 (నలుబది మూడవ శ్లోకము)*

*తమూచుర్మునయః ప్రీతా రాజన్ ధ్యాయస్వ కేశవమ్|*

*స వై నః సంకటాదస్మాదవితా శం విధాస్యతి॥7238॥*

సప్తర్షులు ప్రసన్నులై సత్యవ్రతునితో ఇట్లు నుడివిరి. 'రాజా! నీవు శ్రీహరి భగవానుని ధ్యానింపుము. ఆయనయే మనలను ఈ సంకట స్థితినుండి రక్షింపగలడు. మనకు శుభములు చేకూరును.

*24.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*సోఽనుధ్యాతస్తతో రాజ్ఞా ప్రాదురాసీన్మహార్ణవే|*

*ఏకశృంగధరో మత్స్యో హైమో నియుతయోజనః॥7239॥*

వారి ఆజ్ఞానుసారము మహారాజు భగవానుని ధ్యానింపసాగెను. అదే సమయమున శ్రీహరి ఒక మహామత్స్యరూపమున సముద్రమునందు ప్రకటితుడయ్యెను. ఆ మత్స్యభగవాసుని శరీరము లక్ష యోజనముల విస్తీర్ణము గలిగి బంగారమువలె మెఱయుచుండెను. ఆ మత్స్య శరీరమునకు ఒక గొప్ప కొమ్ము గూడ కలదు.

*24.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*నిబధ్య నావం తచ్ఛృంగే యథోక్తో హరిణా పురా|*

*వరత్రేణాహినా తుష్టస్తుష్టావ మధుసూదనమ్॥7240॥*

లోగడ భగవంతుడు ఆదేశించిన విధముగ సత్యవ్రతుడు వాసుకి సర్పమును త్రాడుగా జేసి, నావను చేప కొమ్మునకు కట్టెను. పిమ్మట సంతోషముగా మధుసూదనుని ఇట్లు స్తుతించెను.

*రాజోవాచ*

*24.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*అనాద్యవిద్యోపహతాత్మసంవిదస్తన్మూలసంసారపరిశ్రమాతురాః|*

*యదృచ్ఛయేహోపసృతా యమాప్నుయుర్విముక్తిదో నః పరమో గురుర్భవాన్ ॥7241॥*

*రాజు పలికెను* "ప్రభూ! ఈ సంసారమున జీవుల ఆత్మ అనాదికాలమునుండి అజ్ఞానముచే కప్పబడి యున్నది. ఆ కారణముచే వారు పెక్కు సాంసారికక్లేశములతో సతమతమగు చున్నారు. అనాయాసముగ నీ అనుగ్రహమునకు పాత్రులైనప్పుడు వారు శరణువేడి, నిన్ను పొందుచున్నారు. వాస్తవముగా మమ్ములను ఈ బంధములనుండి ముక్తులను జేసి మోక్షమును ప్రసాదించునట్టి పరమగురుడవు నీవే.

*24.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*జనోఽబుధోఽయం నిజకర్మబంధనః సుఖేచ్ఛయా కర్మ సమీహతేఽసుఖమ్|*

*యత్సేవయా తాం విధునోత్యసన్మతిం గ్రంథిం స భింద్యాద్ధృదయం స నో గురుః॥7242॥*

ఈ జీవుడు అజ్ఞానియై తాను చేసికొనిన కర్మలతోనే బంధింపబడుచున్నాడు. సుఖమును గోరుచు పెక్కు కర్మలను ఆచరించి, ఇంకను దుఃఖములను మూటగట్టు కొనుచున్నాడు. నిన్ను సేవించుట ద్వారా అతని అజ్ఞానము తొలగిపోవును. అప్పుడే పరమగురుడవైన నీవు మా హృదయగ్రంథిని ఛేదింపగలవు.

*24.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*యత్సేవయాగ్నేరివ రుద్రరోదనం పుమాన్విజహ్యాన్మలమాత్మనస్తమః|*

*భజేత వర్ణం నిజమేష సోఽవ్యయో భూయాత్స ఈశః పరమో గురోర్గురుః॥7243॥*

అగ్నియందు తప్తమగుట వలన బంగారము, వెండి మొదలగు వాటిలోని మాలిన్యము తొలగిపోవును. అప్పుడు అవి నిజస్వరూపముతో మెరసిపోవును. అట్లే నీ సేవలద్వారా జీవుని అంతఃకరణము నందలి అజ్ఞానమను మాలిన్యము తొలగిపోయి, అతడు తన వాస్తవరూపములో నిలుచును. సర్వశక్తిమంతుడవు, శాశ్వత ప్రభుడవైన నీవే గురువులకు గూడ పరమగురుడవు. అందువలన మాకును గురుడవై, జ్ఞానమును ప్రసాదింపుము.

PVD Subrahmanyam చెప్పారు...

*24.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*న యత్ప్రసాదాయుతభాగలేశమన్యే చ దేవా గురవో జనాః స్వయమ్|*

*కర్తుం సమేతాః ప్రభవంతి పుంసస్తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే॥7244॥*

దేవతలు, గురువులు, ఇంకను లోకమునందలి ఇతరజనులు అందరు కలిసియైనను లేక ఎవరికి వారుగను కృప జూపినచో, అది నీవు చూపే కృపలో పదివేల అంశములో ఒక అంశముతో గూడ సరిసమానముగాదు. నీవే సర్వశక్తిమంతుడవు. కావున నిన్ను శరణు వేడుచున్నాను.

*24.50 (ఏబదియవ శ్లోకము)*

*అచక్షురంధస్య యథాగ్రణీః కృతస్తథా జనస్యావిదుషోఽబుధో గురుః|*

*త్వమర్కదృక్సర్వదృశాం సమీక్షణో వృతో గురుర్నః స్వగతిం బుభుత్సతామ్॥7245॥*

ఒక గ్రుడ్డివాడు మరియొక గ్రుడ్డివానిని మార్గదర్శిగా చేసికొన్నట్లు, అజ్ఞానులైన జీవులు, మరియొక అవివేకిని గురువుగా చేసికొందురు. నీ వైతే సూర్యుని వలె స్వయంప్రకాశకుడవు. సమస్త ఇంద్రియములకు ప్రేరకుడవు. ఆత్మతత్త్వమును తెలిసికొనగోరు మేము నిన్నే మా గురువుగ ఎన్నుకొనుచున్నాము.

*24.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*జనో జనస్యాదిశతేఽసతీం మతిం యయా ప్రపద్యేత దురత్యయం తమః|*

*త్వం త్వవ్యయం జ్ఞానమమోఘమంజసా ప్రపద్యతే యేన జనో నిజం పదమ్॥7246॥*

ఒక అజ్ఞాని ఇతర అజ్ఞానులకు జ్ఞానోపదేశమును చేసినచో, అది సంసారరూప ఘోర-అంధకారమునకే దారి తీయును. కాని, నీవు శాశ్వతమైన అమోఘమైన జ్ఞానమును ఉపదేశింతువు. దానివలన మానవుడు అనాయాసముగా తన వాస్తవ స్వరూపమును పొందగలరు.

*24.52 (ఏబది రెండవ శ్లోకము)*

*త్వం సర్వలోకస్య సుహృత్ప్రియేశ్వరో హ్యాత్మా గురుర్జ్ఞానమభీష్టసిద్ధిః|*

*తథాపి లోకో న భవంతమంధధీర్జానాతి సంతం హృది బద్ధకామః॥7247॥*

నీవు సకలలోకములకు ప్రభుడవు, హితమును గోరువాడవు. ప్రియతముడవైన ఆత్మవు. గురుడవైన నీ ద్వారా ప్రాప్తించు జ్ఞానము, అభీష్టసిద్ధి గూడ నీ స్వరూపమే. ఐనను, జనులు కోరికలు అనెడు బంధములలో చిక్కుకొని, అంధులగుచున్నారు. వారి హృదయములలోనే విరాజిల్లుచున్న నిన్ను తెలిసికొన లేకున్నారు.

*24.53 (ఏబది మూడవ శ్లోకము)*

*తం త్వామహం దేవవరం వరేణ్యం ప్రపద్య ఈశం ప్రతిబోధనాయ|*

*ఛింధ్యర్థదీపైర్భగవన్ వచోభిర్గ్రంథీన్ హృదయ్యాన్ వివృణు స్వమోకః॥7248॥*

ప్రభూ! నీవు దేవతలకు గూడ ఆరాధ్యుడవు. పరమపూజ్యుడవైన పరమేశ్వరుడవు. ఆత్మజ్ఞానమును పొందుటకై నేను నిన్ను శరణు వేడుచున్నాను. పరమాత్మతత్త్వమును ప్రకాశింపజేయు నీ వాణి ద్వారా నా హృదయము నందలి సాంసారిక బంధములను ఛేదించి, నీ స్వరూపమున ప్రకాశింపచేయుమని నా ప్రార్థన".

*శ్రీశుక ఉవాచ*

*24.54 (ఏబది నాలుగవ శ్లోకము)*

*ఇత్యుక్తవంతం నృపతిం భగవానాదిపూరుషః|*

*మత్స్యరూపీ మహాంభోధౌ విహరంస్తత్త్వమబ్రవీత్॥7249॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! సత్యవ్రతమహారాజు ఇట్లు ప్రార్థింపగా మత్స్యరూపధారియైన పురుషోత్తముడు ప్రళయసముద్రము నందు విహరించుచు అతనికి ఆత్మతత్త్వమును ఉపదేశించెను.

*24.55 (ఏబది ఐదవ శ్లోకము)*

*పురాణసంహితాం దివ్యాం సాంఖ్యయోగక్రియావతీమ్|*

*సత్యవ్రతస్య రాజర్షేరాత్మగుహ్యమశేషతః॥7250॥*

భగవంతుడు రాజర్షియైన సత్యవ్రతునకు తన స్వరూపము యొక్క సంపూర్ణ రహస్యమును వర్ణించెను. జ్ఞాన, భక్తి, కర్మ యోగములచే పరిపూర్ణమైన ఆ దివ్యపురాణమును *మత్స్యపురాణము* అని యందురు.

*24.56 (ఏబది ఆరవ శ్లోకము)*

*అశ్రౌషీదృషిభిః సాకమాత్మతత్త్వమసంశయమ్|*

*నావ్యాసీనో భగవతా ప్రోక్తం బ్రహ్మ సనాతనమ్॥7251॥*

సత్యవ్రతుడు మహాత్ములతో గూడి నావయందు కూర్చొనియే సంశయ రహితుడై భగవంతుడు ఉపదేశించిన సనాతన బ్రహ్మస్వరూపమైన ఆత్మతత్త్వమును శ్రవణము చేసెను.

PVD Subrahmanyam చెప్పారు...

*24.57 (ఏబది ఏడవ శ్లోకము)*

*అతీతప్రలయాపాయ ఉత్థితాయ స వేధసే|*

*హత్వాసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహరద్ధరిః॥7252॥*

అనంతరము ప్రళయకాలము సమాప్తమయ్యెను. బ్రహ్మదేవుడు నిద్రనుండి మేల్కొనెను. అప్పుడు శ్రీహరి హయగ్రీవాసురుని సంహరించి, వాడు అపహరించిన వేదమును తీసికొని వచ్చి బ్రహ్మదేవునకు అప్పగించెను.

*24.58 (ఏబది ఎనిమిదివ శ్లోకము)*

*స తు సత్యవ్రతో రాజా జ్ఞానవిజ్ఞానసంయుతః|*

*విష్ణోః ప్రసాదాత్కల్పేఽస్మిన్నాసీద్వైవస్వతో మనుః॥7253॥*

భగవంతుని కృపచే సత్యవ్రతునకు జ్ఞాన విజ్ఞానములతో గూడిన ఆత్మజ్ఞానము ప్రాప్తించెను. అతడు ఈ కల్పమునందు వైవస్వతమనువుగా ఖ్యాతికెక్కెను.

*24.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)*

*సత్యవ్రతస్య రాజర్షేర్మాయామత్స్యస్య శార్ఙ్గిణః|*

*సంవాదం మహదాఖ్యానం శ్రుత్వా ముచ్యేత కిల్బిషాత్॥7254॥*

*24.60 (అరువదియ శ్లోకము)*

*అవతారో హరేర్యోఽయం కీర్తయేదన్వహం నరః|*

*సంకల్పాస్తస్య సిధ్యంతి స యాతి పరమాం గతిమ్॥7255॥*

శ్రీమహావిష్ణువు తన యోగమాయచే మత్స్యావతారమును దాల్చి రాజర్షియైన సత్యవ్రతునకు ఆత్మజ్ఞానమును ఉపదేశించెను. శ్రీహరికిని, సత్యవ్రతునకును మధ్య జరిగిన సంవాదముగల శ్రేష్ఠమైన ఈ వృత్తాంతమును వినిన వారు సకల పాపముల నుండి ముక్తులయ్యెదరు. భగవంతుని యొక్క ఈ మత్స్యవతార వృత్తాంతము ప్రతిదినము కీర్తించిన వారి సంకల్పములన్నియును నెరవేరును. వారు పరమపదమును (మోక్షమును) పొందుదురు.

*24.61 (అరువది ఒకటవ శ్లోకము)*

*ప్రలయపయసి ధాతుః సుప్తశక్తేర్ముఖేభ్యః శ్రుతిగణమపనీతం ప్రత్యుపాదత్త హత్వా|*

*దితిజమకథయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం తమహమఖిలహేతుం జిహ్మమీనం నతోఽస్మి॥7253॥*

ప్రళయకాల సముద్రమునందు బ్రహ్మదేవుడు నిద్రించుచుండగా అతని సృష్టిశక్తి లుప్తమాయెను. అప్పుడు అతని ముఖమునుండి వెలువడిన వేదములను హయగ్రీవుడు అను దైత్యుడు అపహరించిన పాతాళమునకు వెళ్ళిపోయెను. శ్రీమహావిష్ణువు వానిని సంహరించి తిరిగి వేదములను బ్రహ్మదేవునకు అప్పగించెను. అట్లే సత్యవ్రతునకు, సప్తర్షులకు బ్రహ్మతత్త్వమును ఉపదేశించెను. సకలజగత్తునకు శుభంకరుడైన మహామాయియైన మత్స్యభగవానునకు నేను నమస్కరించుచున్నాను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే చతుర్వింశోఽధ్యాయః (24)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు ఇరువది నాలుగవ అధ్యాయము (24)

*అష్టమస్కంధము సమాప్తము*

*🙏🙏🙏హరయే నమః🙏🙏🙏*

PVD Subrahmanyam చెప్పారు...

*రాజోవాచ*

*1.1 (ప్రథమ శ్లోకము)*

*మన్వంతరాణి సర్వాణి త్వయోక్తాని శ్రుతాని మే|*

*వీర్యాణ్యనంతవీర్యస్య హరేస్తత్ర కృతాని చ॥7257॥*

*పరీక్షిన్మహారాజు శుకమహర్షితో ఇట్లు నుడివెను* "మహాత్మా! సమస్త మన్వంతరములను గూర్చియు, ఆయా మన్వంతరములలో దివ్యమహిమోపేతుడైన శ్రీమన్నారాయణుడు నెఱపిన అద్భుతలీలలను గురించియు చక్కగా వివరించియుంటిని. వాటిని నేను భక్తిశ్రద్ధలతో ఆలకించియుంటిని".

*1.2 (రెండవ శ్లోకము)*

*యోఽసౌ సత్యవ్రతో నామ రాజర్షిర్ద్రవిడేశ్వరః|*

*జ్ఞానం యోఽతీతకల్పాంతే లేభే పురుషసేవయా॥7258॥*

*1.3 (మూడవ శ్లోకము)*

*స వై వివస్వతః పుత్రో మనురాసీదితి శ్రుతమ్|*

*త్వత్తస్తస్య సుతాశ్చోక్తా ఇక్ష్వాకుప్రముఖా నృపాః॥7259॥*

*1.4 (నాలుగవ శ్లోకము)*

*తేషాం వంశం పృథగ్బ్రహ్మన్ వంశ్యానుచరితాని చ|*

*కీర్తయస్వ మహాభాగ నిత్యం శుశ్రూషతాం హి నః॥7260॥*

*1.5 (ఐదవ శ్లోకము)*

*యే భూతా యే భవిష్యాశ్చ భవంత్యద్యతనాశ్చ యే |*

*తేషాం నః పుణ్యకీర్తీనాం సర్వేషాం వద విక్రమాన్॥7261॥*

"పూర్వకల్పాంతమున *సత్యవ్రతుడు* అను రాజర్షిగలడు. అతడు ద్రవిడదేశమునకు ప్రభువు. అతడు పరమపురుషుడైన శ్రీమన్నారాయణుని సేవించి, జ్ఞానమును పొందెను. వివస్వంతుని (సూర్యభగవానుని) కుమారుడైన ఆ ప్రభువు వైవస్వతమనువుగా ఖ్యాతి వహించెను. ఇక్ష్వాకు మున్నగు ప్రముఖ నరేంద్రులు ఆయన పుత్రులే'. ఈ విషయములను అన్నింటిని నేను మీ వలననే తెలిసికొనియుంటిని. మహానుభావా! మేము ఎల్లప్పుడు భక్తిశ్రద్ధలతో నిన్ను సేవించుచుంటిమి. కనుక, మహాత్మా! ఆ ఇక్ష్వాకు ప్రభువుల వంశమును గుఱించియు, ఆ వంశమునందు పుట్టినవారి వంశానుచరితములను గూర్చియు దయతో వేర్వేరుగా వివరింపుము. ఆ వైవస్వత మనువంశమునకు సంబంధించిన పుణ్యపురుషులలో సుప్రసిద్ధులైన పూర్వీకులను గురించియు, ప్రస్తుతము ఖ్యాతికెక్కిన మహాత్ములను గూర్చియు, మున్ముందు వాసిగాంచెడి మహానుభావులను గురుంచియు, వారివారి పరాక్రమ వైభవములను గూర్చియు కృపతో తెలుపుము".

*ఈ విషయమున పోతన మహాకవి ఇట్లు స్పష్టముగా పేర్కొనెను*

*కంద పద్యము*

చెవులార నేఁడు వినియెద
రవివంశమునందుఁ గలుగు రాజుల కీర్తుల్
వివరింపు వరుసతోడను
భువిఁ బుణ్యుల కీర్తి వినినఁ బుణ్యము గాదే!

*తాత్పర్యము*

చెవులారా వింటాను; సూర్యవంశములోని రాజుల యశస్సులను వివరముగా తెలుపుము. లోకమునందు పుణ్యాత్ముల గొప్పచరిత్రలు వినడం పుణ్యము కదా.

*సూత ఉవాచ*

*1.6 (ఆరవ శ్లోకము)*

*ఏవం పరీక్షితా రాజ్ఞా సదసి బ్రహ్మవాదినామ్|*

*పృష్టః ప్రోవాచ భగవాంఛుకః పరమధర్మవిత్॥7262॥*

*సూతుడు ఇట్లు పలికెను* పరీక్షిన్మహారాజు బ్రహ్మవేత్తల సభలో ఇట్లు కోరగా పరమధర్మజ్ఞుడైన శుకమహర్షి ఈ విధముగా బదులు పలికెను.

*శ్రీశుక ఉవాచ*

*1.7 (ఏడవ శ్లోకము)*

*శ్రూయతాం మానవో వంశః ప్రాచుర్యేణ పరంతప|*

*న శక్యతే విస్తరతో వక్తుం వర్షశతైరపి॥7263॥*

*శ్రీ శుకమహర్షి ఇట్లు నుడివెను* "మహారాజా! మనువంశ విశేషములను గూర్చి సంగ్రహముగా తెలిపెదను వినుము. వాటి వైభవములను సాకల్యముగా వివరించుటకు వందలకొలది ఏండ్లును చాలవు.

*1.8 (ఎనిమిదవ శ్లోకము)*

*పరావరేషాం భూతానామాత్మా యః పురుషః పరః|*

*స ఏవాసీదిదం విశ్వం కల్పాంతేఽన్యన్న కించన॥7264॥*

పరమపురుషుడైన ఆ దేవదేవుడే పిపీలికాది బ్రహ్మపర్యంతముగల సకలప్రాణులకును ఆత్మస్వరూపుడు. కల్పాంతమునందు ఆ పరమాత్ముడు ఒక్కడే కలడు. అప్ఫుడు ఆ పరమాత్మతప్ప ఈ విశ్వముగాని, తదితరముగాని ఏదియు లేకుండెను.

*1.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తస్య నాభేః సమభవత్పద్మకోశో హిరణ్మయః|*

*తస్మిన్ జజ్ఞే మహారాజ స్వయంభూశ్చతురాననః॥7265॥*

*1.10 (పదియవ శ్లోకము)*

*మరీచిర్మనసస్తస్య జజ్ఞే తస్యాపి కశ్యపః|*

*దాక్షాయణ్యాం తతోఽదిత్యాం వివస్వానభవత్సుతః॥7266॥*

మహారాజా! పిదప ఆ పరమపురుషుని నాభినుండి ఒక బంగారు పద్మము ఉద్భవించెను. ఆ సువర్ణ కమలము నుండి చతుర్ముఖుడైన బ్రహ్మ స్వయముగా ఆవిర్భవించెను. బ్రహ్మదేవుని మనస్సునుండి మరీచి పుట్టెను. ఆ మరీచి కుమారుడు కశ్యపుడు. దక్షుని కూతురైన అదితియందు ఈ కశ్యపుని వలన సూర్యుడు అవతరించెన

PVD Subrahmanyam చెప్పారు...

*1.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఏవం వ్యవసితో రాజన్ భగవాన్ స మహాయశాః|*

*అస్తౌషీదాదిపురుషమిలాయాః పుంస్త్వకామ్యయా॥7277॥*

రాజా! మహానుభావుడైన వసిష్ఠుడు ఇట్లు నిర్ణయించుకొని, ఇలా కన్యను పురుషునిగా చేయుటకై పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని స్తుతించెను.

*1.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*తస్మై కామవరం తుష్టో భగవాన్ హరిరీశ్వరః|*

*దదావిలాభవత్తేన సుద్యుమ్నః పురుషర్షభః॥7278॥*

అంతట సర్వేశ్వరుడైన శ్రీమహావిష్ణువు ఆ మహర్షి స్తోత్రములకు సంతుష్టుడై, అతడు కోరిన వరమును ప్రసాదించెను. తత్ఫలితముగా ఇలా కన్య *సుద్యుమ్నుడు* అను పేరుతో పురుషశ్రేష్ఠుడుగా మారెను.

*1.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*స ఏకదా మహారాజ విచరన్ మృగయాం వనే|*

*వృతః కతిపయామాత్యైరశ్వమారుహ్య సైంధవమ్॥7279॥*

పరీక్షిన్మహారాజా! ఆ సుద్యుమ్నుడు ఒకానొక సమయమున శ్రేష్ఠమైన అశ్వమును అధిరోహించి, కొంతమంది మంత్రులతోగూడి వేటాడుచు అరణ్యమున సంచరింపసాగెను.

*1.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*ప్రగృహ్య రుచిరం చాపం శరాంశ్చ పరమాద్భుతాన్|*

*దంశితోఽనుమృగం వీరో జగామ దిశముత్తరామ్॥7280॥*

*1.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*స కుమారో వనం మేరోరధస్తాత్ప్రవివేశ హ|*

*యత్రాస్తే భగవాన్ శర్వో రమమాణః సహోమయా॥7281॥*

కవచధారియైయున్న ఆ సుద్యుమ్నవీరుడు చక్కని ధనుస్సును, మిగుల అద్భుతములైన బాణములను చేబూని, వన్యమృగములను వెంటాడుచు ఉత్తరదిశగా సాగెను. ఆ రాజకుమారుడు తిన్నగా ముందునకు సాగి మేరుపర్వతమునకు దిగువభాగమునగల ఒక వనమున ప్రవేశించెను. సర్వేశ్వరుడైన పరమశివుడు ఉమాదేవితోగూడి ఆ వనమునందు విహరించుచుండును.

*1.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*తస్మిన్ ప్రవిష్ట ఏవాసౌ సుద్యుమ్నః పరవీరహా|*

*అపశ్యత్స్త్రియమాత్మానమశ్వం చ వడవాం నృప॥7282॥*

*1.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*తథా తదనుగాః సర్వే ఆత్మలింగవిపర్యయమ్|*

*దృష్ట్వా విమనసోఽభూవన్ వీక్షమాణాః పరస్పరమ్॥7283॥*

పరీక్షిన్మహారాజా! శత్రువులను దెబ్బతీయుటలో సమర్థుడైన ఆ సుద్యుమ్నుడు ఆ వనమున ప్రవేశించిన పిమ్మట తాను స్త్రీగా మాఱిపోవుటను గమనించెను. ఆ విధముగనే అతని అనుచరులు అందరును తాము స్త్రీలుగా మారిపోవుటను గ్రహించి, ఒకరిని మరియొకరు చూచుకొనుచు మనస్తాపమునకు లోనైరి.

*రాజోవాచ*

*1.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*కథమేవంగుణో దేశః కేన వా భగవన్ కృతః|*

*ప్రశ్నమేనం సమాచక్ష్వ పరం కౌతూహలం హి నః॥7284॥*

*అంతట పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను* - "శుకమహర్షీ! ఆ ప్రదేశమున ఇట్టి విచిత్రస్థితి ఎట్లు ఏర్పడినది? దీనికి కారకులెవ్వరు? దయతో ఈ సందేహమును దీర్పుము. అందులకై నేను మిగుల కుతూహలపడుచున్నాను.

*శ్రీశుక ఉవాచ*

*1.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*ఏకదా గిరిశం ద్రష్టుమృషయస్తత్ర సువ్రతాః|*

*దిశో వితిమిరాభాసాః కుర్వంతః సముపాగమన్॥7285॥*

*1.30 (ముప్పదియవ శ్లోకము)*

*తాన్ విలోక్యాంబికా దేవీ వివాసా వ్రీడితా భృశమ్|*

*భర్తురంకాత్సముత్థాయ నీవీమాశ్వథ పర్యధాత్॥7286॥*

*1.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*ఋషయోఽపి తయోర్వీక్ష్య ప్రసంగం రమమాణయోః|*

*నివృత్తాః ప్రయయుస్తస్మాన్నరనారాయణాశ్రమమ్॥7287॥*

*శుకమహర్షి ఇట్లు నుడివెను* ఒకానొక సమయమున వ్రతపరాయణులైన మహర్షులు తమ తేజస్సులతో సకలదిశల చీకట్లను పారద్రోలుచు (దివ్యతేజస్సులను విరాజిల్లుచు) పరమశివుని దర్శించుటకై అచటికి విచ్చేసిరి. వారిని చూచి వెంటనే పార్వతీదేవి మిగుల సిగ్గుపడుచు తన భర్తయొక్క (శివుని) ఒడినుండి లేచి, వస్త్రములను సవరించుకొనెను. అంతట ఋషులు పార్వతీ పరమేశ్వరుల ప్రణయరీతులను గమనించినంతనే వెనుదిరిగి, ఆ ప్రదేశమును వీడి నరనారాయణ ఆశ్రమమునకు వెళ్ళిపోయిరి.

*1.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*తదిదం భగవానాహ ప్రియాయాః ప్రియకామ్యయా|*

*స్థానం యః ప్రవిశేదేతత్స వై యోషిద్భవేదితి॥7288॥*

పిమ్మట పరమేశ్వరుడు తన భార్యయగు పార్వతీదేవికి ప్రీతిని గూర్చుటకై 'ఈ ప్రదేశమున ప్రవేశించినంతనే ఏ పురుషుడైనను స్త్రీగా మారును' అని పలికెను.

PVD Subrahmanyam చెప్పారు...

*1.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*తత ఊర్ధ్వం వనం తద్వై పురుషా వర్జయంతి హి|*

*సా చానుచరసంయుక్తా విచచార వనాద్వనమ్॥7289॥*

*1.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*అథ తామాశ్రమాభ్యాశే చరంతీం ప్రమదోత్తమామ్|*

*స్త్రీభిః పరివృతాం వీక్ష్య చకమే భగవాన్ బుధః॥7290॥*

*1.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*సాపి తం చకమే సుభ్రూః సోమరాజసుతం పతిమ్|*

*స తస్యాం జనయామాస పురూరవసమాత్మజమ్॥7291॥*

అప్పటి నుండియు పురుషులు ఆ వనమున ప్రవేశించుట మానిరి. ఇళాదేవి (స్త్రీగా మారిన సుద్యుమ్నుడు) తన అనుచర స్త్రీలతోగూడి అచటి వనములయందు అంతటను సంచరింపసాగెను. ఒకానాడు ఇళాదేవి తనతోటి చెలులతో గూడి చంద్రుని కుమారుడగు బుధుని ఆశ్రమ సమీపమున విహరించుచుండెను. అప్పుడు మహాత్ముడగు బుధుడు ఆమెను గాంచి మోహపడెను. అంతట చక్కని సౌందర్యవతియైన ఇళాదేవియు, బుధుని జూచి మోహపడుటతో ఆ ఉభయులును దంపతులైరి. బుధుని వలన ఆమెయందు పురూరవుడు జన్మించెను.

*1.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*ఏవం స్త్రీత్వమనుప్రాప్తః సుద్యుమ్నో మానవో నృపః|*

*సస్మార స్వకులాచార్యం వసిష్ఠమితి శుశ్రుమ॥7292॥*

*1.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*స తస్య తాం దశాం దృష్ట్వా కృపయా భృశపీడితః|*

*సుద్యుమ్నస్యాశయన్ పుంస్త్వముపాధావత శంకరమ్॥7293॥*

*1.38 (ముప్పది ఎనిమిదివ శ్లోకము)*

*తుష్టస్తస్మై స భగవాన్ ఋషయే ప్రియమావహన్|*

*స్వాం చ వాచమృతాం కుర్వన్నిదమాహ విశాంపతే॥7294॥*

పరీక్షిన్మహారాజా! నరేంద్రుడైన సుద్యుమ్నుడు ఇట్లు స్త్రీగా మారిన పిమ్మట తనవంశగురువగు వసిష్ఠుని స్మరించెనని వింటిమి. అంతట వసిష్ఠ మహర్షి సుద్యుమ్నుని పరిస్థితిని జూచి, అతనిపై మిగుల జాలిపడెను. పిమ్మట ఆ మహర్షి సుద్యుమ్నుడు పురుషుడగుటకై శంకరుని ఆరాధించెను. అప్ఫుడు పరమేశ్వరుడైన శంకరుడు వసిష్ఠుని సేవలకు సంతుష్టుడై ఆయనకు ప్రియమును గూర్పదలంచెను. అంతట ఆ స్వామి తన వచనము వమ్ముగాకుండునట్లు ఆ మహర్షితో ఇట్లు నుడివెను.

*1.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*మాసం పుమాన్ స భవితా మాసం స్త్రీ తవ గోత్రజః|*

*ఇత్థం వ్యవస్థయా కామం సుద్యుమ్నోఽవతు మేదినీమ్॥7295॥*

"మహామునీ! మీ వంశమువాడైన సుద్యుమ్నుడు ఒకమాసము పురుషరూపమును, మఱియొక మాసము స్త్రీరూపమును పొందుచు ప్రజలను చక్కగా పరిపాలించుచుండును.

*1.40 (నలుబదియవ శ్లోకము)*

*ఆచార్యానుగ్రహాత్కామం లబ్ధ్వా పుంస్త్వం వ్యవస్థయా|*

*పాలయామాస జగతీం నాభ్యనందన్ స్మ తం ప్రజాః॥7296॥*

కులగురువైన వశిష్ఠుని అనుగ్రహమువలన పురుషరూపమును పొందిన సుద్యుమ్నుడు తన రాజ్యమును యథాప్రకారము పాలింపసాగెను. కాని, ప్రజలు మాత్రము ఆయనపట్ల సంతృప్తిచెందకుండిరి.

*1.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*తస్యోత్కలో గయో రాజన్ విమలశ్చ సుతాస్త్రయః|*

*దక్షిణాపథరాజానో బభూవుర్ధర్మవత్సలాః॥7297॥*

*1.42 (నలుబది రెండవ శ్లోకము)*

*తతః పరిణతే కాలే ప్రతిష్ఠానపతిః ప్రభుః|*

*పురూరవస ఉత్సృజ్య గాం పుత్రాయ గతో వనమ్॥7298॥*

పరీక్షిన్మహారాజా! ఆ సుద్యుమ్నుడు క్రమముగా ఉత్కలుడు, గయుడు, విమలుడు అను సుతులను పొందెను. ఆ రాజకుమారులు ధర్మనిరతులై దక్షిణాపథమునకు పాలకులైరి. క్రమముగా వార్ధక్యము ప్రాప్తించుటతో ప్రతిష్ఠానుపురమునకు ప్రభువైన సుద్యుమ్నుడు తన కుమారుడైన పురూరవునకు రాజ్యభారమును అప్పగించి, తాను తపస్సు చేసికొనుటకై వనమునకు వెళ్ళెను.

SRI SARMADA చెప్పారు...

It's my collection

🌺 ఆశ్ఛర్య పరచే మన దేవాలయల విశేషాలు 🌺

సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయo*
హాసంబా దేవాలయం , హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

నీటితో దీపం వెలిగించే దేవాలయం

మధ్యప్రదేశ్. ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇకనుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయం

1. కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయన మందిరం.

12 ఏళ్లకు ఒకసారి
*పిడుగుపడే తిరిగి అతుక్కునేదేవాలయం*

బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.

సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.

నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:
1. మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా

నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్.
3. మంజునాథ్.

శ్వాస తీసుకునే
కాళహస్తీశ్వర్

సముద్రమే వెనక్కివెళ్లే
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్.
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

స్త్రీవలె నెలసరి అయ్యే
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,
2. కేరళ దుర్గామాత.

రంగులు మారే ఆలయం.
1. ఉత్తరాయణం, దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు
1. కాణిపాకం,
2. యాగంటి బసవన్న,
3. కాశీ తిలభండేశ్వర్,
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

స్వయంభువుగా
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
ఆరునెలలకు ఒకసారి తెరిచే
1. బదరీనాథ్,
2. కేదారనాథ్ ( ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది )
3. గుహ్యకాళీమందిరం.

సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు
హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

ఒంటి స్తంభంతో
యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

రూపాలు మారే
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

మనిషి వలె గుటకలు
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.

ఛాయా విశేషం
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం

నీటిలో తేలే విష్ణువు (టన్నుల బరువుంటుంది ), నేపాల్

ఇంకా...
తిరుమల వెంకటేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి, రామేశ్వర్, కంచి,
చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం etc

పూరీ
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడపడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడే పూరి ప్రసాదం.

ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే . ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి నమ్మండి దేవుడు నడయాడే నేల ఇది.🕉🌺🙏🙏

SRI SARMADA చెప్పారు...

collection....

అరుంధతి నక్షత్రం కథ

పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతిపై అగ్నిదేవుడు కన్నేస్తాడు,

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటిస్థానంలో ఉంటారు. అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె. మహాపతివ్రత.

ఇసుకను అన్నంగా తయారు చెయ్యగలరా?

అరుంధతి గురించి చాలా కథలున్నాయి. అందులో కొన్ని...

వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వసిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు.

ఇసుక అన్నంగా మారింది

పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలపడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వడింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్టుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు. ఆమెనే అరుంధతి.

పెళ్లి చేసుకుంటేనే తింటాను

తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు.

అరుంధతికి ఎంతో ఏకాగ్రత

ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది. చాలా ఏళ్లు గడిచినా వశిష్టుడు రాడు. అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది.

పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత
అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు అమ్మా అరుంధతి మీ ఆయన ఇన్నేళ్లు అయినా తిరిగిరాలేదు. కాస్త ఇటు చూడమ్మా అంటారు. అయినా ఆమె చూపు మరల్చదు. కొన్ని ఏళ్ల తర్వాత వశిష్టుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది. తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి.

అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది
ఇక అగ్ని దేవుడి ఎదుట సప్త రుషులు యజ్ఞం చేపడుతారు. ఆ రుషుల భార్యలపై అగ్ని దేవుడు మోజు పడతాడు. ఈ విషయాన్ని అగ్ని దేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది. ఆ ఏడుగురి భార్యల మాదిరిగా తానే రోజుకొక అవతారం ధరించాలనుకుంటుంది. రోజుకొక రుషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది.

అరుంధతి పెద్ద ప్రతివత
ఇక చివరి రోజు తాను అరుంధతి అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించిన అరుంధతి అవతారంలోకి మారలేదు. అరుంధతి పెద్ద ప్రతివత కావడమే ఇందుకు కారణం. అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆందర్శంగా నిలిచింది. అరుంధతికి శక్తి అనే కుమారుడున్నాడు. శక్తి కమారుడే పరాశరుడు. పరాశరుడి కుమారుడే వ్యాసుడు. అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం. 🌟

SRI SARMADA చెప్పారు...

ప్రదోషము
--------

దోషము అనే పదానికి ప్ర అనే ఉపసర్గ చేరి ప్రదోషము అని అయింది.

సంస్కృతంలో ప్ర, పర, వి మొదలైన ఉపసర్గలు ఉన్నాయి. కొన్ని పదాలముందు ఆ ఉపసర్గలు ఉపయోగించబడినఫ్పుడు ఆ పదం యొక్క అర్థాన్ని ఎక్కువ చేస్తాయి. కొన్నిసార్లు తక్కువ చేస్తాయి.

ఇక్కడ ప్రదోషము పదంలో అర్థాధిక్యత కలుగుతోంది. అందువలన దోషము పదం యొక్క అర్థం ఎక్కువ అవుతోంది.
అంటే, ప్రదోషము అనగా తీవ్రమైన దోషము ఉన్న సమయం అని దాని అర్థం

మన శాస్తాలు దోషభూయిష్టమైన సమయాలలో ఏ పనులూ చేయకుండా భగవదారాధన చేయమని ప్రబోధిస్తున్నాయి.

గమనించండి. గ్రహణాది సమయాలు దోషభరితాలు. అటువంటి సమయాలలో దైవారాధపలు చేయమనే కదా శాస్త్రాలు చెప్పంది!

అదేవిధంగా ఈ ప్రదోషసమయం కూడా.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*87వ నామ మంత్రము*

*ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః*

పంచదశీ మంత్రములో శక్తికూటమనబడే చివరి నాలుగు బీజాక్షరములను *(స, క, ల, హ్రీం)* కటి నుండి పాదముల వరకూ ధరించిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ* అను పదహారక్షరములు (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు సృజనాత్మకమైన శక్తితో తాను చేపట్టిన వృత్తిలో లేదా ఉద్యోగములో రాణించును. ఆ జగన్మాత కరుణతో సుఖసంతోషములతో జీవించుచూ ఆధ్యాత్మికసంపన్నుడై భగవదారాధనలో తరించును.

*కామస్తే హృదివసతీతి కామరాజం*

*స్రష్టృత్వాత్తదను తవాంబ శక్తికూటమి* తి అనగా నీ హృదయ ముందు ఉన్న కాముడు కామరాజును సృష్టించుటచే అది నీ శక్తికూటము అయినది అని భాస్కరరాయలువారు చెప్పారు.

పంచదశీ మంత్రము యొక్క చివరి నాలుగు బీజాక్షరములు (స, క, ల, హ్రీం) శక్తికూటము అని అందురు. ఇందు మొదటి రెండు బీజాక్షరములను మణిపూరము మరియు స్వాధిష్టాన చక్రముల మధ్యన, మూడవ బీజాక్షరమును మూలాధార చక్రమునందు, నాలుగవ బీజాక్షరము స్వాధిష్టాన చక్రమునందు భావించుచూ సాధకుడు ఉపాసించవలెను. అలా చేయడం వలన తనలో గల భావములకు దైవత్వసిద్ధి ఏర్పడుతుంది.

పంచదశీ మంత్రంలోగల మూడుకూటములను (వాగ్భవకూటము, కామరాజ కూటము, శక్తికూటములను) వరుసగా సువర్లోకము, భువర్లోకము, భూలోకములతోను, దేవలోకము, మర్త్యలోకము, పాతాళలోకాలతోను కూడా సమన్వయించవచ్చును.

జగన్మాత కటినుండి పాదముల వరకు గల శరీరము స్థూలశరీరము అని చెపితే శక్రికూటము (స, క, ల, హ్రీం) శ్రీమాత సూక్ష్మరూపము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః*
అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 *ఓం నమశ్శివాయ* అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
.🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 *ఓం నమశ్శివాయ* అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*664వ నామ మంత్రము*

*ఓం లోకయాత్రా విధాయిన్యై నమః*

చతుర్దశ భువనములలోని వైవిధ్యభరితమైన సృష్టిస్థితిలయలు, జీవుల జీవన సరళి, మానవాళి వర్ణాశ్రమ ధర్మములు మొదలైన వాటికి తగినట్లుగా విధానములను, పద్ధతులను విధించి, సంరక్షించు స్వభావము గలిగిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లోకయాత్రా విధాయనీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) *ఓం లోకయాత్రా విధాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునికి ఆ తల్లి కరుణతో వర్ణాశ్రమ, పురుషార్థ (ధర్మార్థకామమోక్షములు) ధర్మముల జ్ఞానమును ప్రసాదించి, భౌతికపరమైన సుఖసంతోషములతోబాటు, ఆధ్యాత్మికానందమును ప్రసాదించును.

పదునాలుగు లోకాలలో తానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకియై , పదునాలుగు లోకాలలో సృష్టిస్థితిలయకార్యములయందు అత్యంత సామర్థ్యతాపరమైన నిర్వహణకు, ఆయా లోకాలలో ఉన్న జీవులకు చేయవలసిన పనుల విధానాన్ని ముందుగానే నిర్ణయిస్తూ, మానవాళికి వర్ణాశ్రమధర్మములను, విధులను విధించుతూ, సంచితకర్మల ఫలములను మున్ముందు రాబోవు జన్మలలో అనుభవించునట్లు నింబంధనలేర్పరచి, కర్మల ఫలితముల కనుగుణంగా జీవులకు శరీరాలను నిర్ణయిస్తూ లోకాలన్నిటినీ పర్యవేక్షణా కార్యముపై యాత్రయనునట్లుగా పర్యటించు *లోకయాత్రా విధాయని* ఆ పరమేశ్వరి.

పదునాలుగు లోకముల యాత్ర (ప్రళయ సంరక్షణములు) చేయు స్వభావము గలిగినది జగన్మాత అని భాస్కరరాయలువారు అన్నారు. యాత్ర అనగా ప్రళయముగాని, సంరక్షణముగాని యని భాస్కరరాయలువారు (సౌభాగ్య భాస్కరంలో) చెప్పారు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం లోకయాత్రా విధాయిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 *ఓం నమశ్శివాయ* అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*87వ నామ మంత్రము*

*ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః*

పంచదశీ మంత్రములో శక్తికూటమనబడే చివరి నాలుగు బీజాక్షరములను *(స, క, ల, హ్రీం)* కటి నుండి పాదముల వరకూ ధరించిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ* అను పదహారక్షరములు (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు సృజనాత్మకమైన శక్తితో తాను చేపట్టిన వృత్తిలో లేదా ఉద్యోగములో రాణించును. ఆ జగన్మాత కరుణతో సుఖసంతోషములతో జీవించుచూ ఆధ్యాత్మికసంపన్నుడై భగవదారాధనలో తరించును.

*కామస్తే హృదివసతీతి కామరాజం*

*స్రష్టృత్వాత్తదను తవాంబ శక్తికూటమి* తి అనగా నీ హృదయ ముందు ఉన్న కాముడు కామరాజును సృష్టించుటచే అది నీ శక్తికూటము అయినది అని భాస్కరరాయలువారు చెప్పారు.

పంచదశీ మంత్రము యొక్క చివరి నాలుగు బీజాక్షరములు (స, క, ల, హ్రీం) శక్తికూటము అని అందురు. ఇందు మొదటి రెండు బీజాక్షరములను మణిపూరము మరియు స్వాధిష్టాన చక్రముల మధ్యన, మూడవ బీజాక్షరమును మూలాధార చక్రమునందు, నాలుగవ బీజాక్షరము స్వాధిష్టాన చక్రమునందు భావించుచూ సాధకుడు ఉపాసించవలెను. అలా చేయడం వలన తనలో గల భావములకు దైవత్వసిద్ధి ఏర్పడుతుంది.

పంచదశీ మంత్రంలోగల మూడుకూటములను (వాగ్భవకూటము, కామరాజ కూటము, శక్తికూటములను) వరుసగా సువర్లోకము, భువర్లోకము, భూలోకములతోను, దేవలోకము, మర్త్యలోకము, పాతాళలోకాలతోను కూడా సమన్వయించవచ్చును.

జగన్మాత కటినుండి పాదముల వరకు గల శరీరము స్థూలశరీరము అని చెపితే శక్రికూటము (స, క, ల, హ్రీం) శ్రీమాత సూక్ష్మరూపము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః*
అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 *ఓం నమశ్శివాయ* అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
.🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 *ఓం నమశ్శివాయ* అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*88వ నామ మంత్రము*

*ఓం మూలమంత్రాత్మికాయై నమః*

సర్వసిద్ధిప్రదమైనది,సర్వమంత్రాలకూ మూలమైనది అయిన పంచదశాక్షరీ మంత్రమే ఆత్మస్వరూపముగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మూలమంత్రాత్మికా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రముసు *ఓం మూలమంత్రాత్మికాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకుడు పంచదశాక్షరీ మంత్రములోని బీజాక్షరాలను శరీరంలోని ఆయా బీజాక్షరాలకు నిర్దేశించినశరీరంలోని ఆయా స్థానాలతో న్యాసం చేస్తూ మంత్రదేవతా ఐక్యరూపాన్ని భావించితే తానుగూడా మంత్రదేవతాస్వరూపుడౌతాడు, చతుర్విధ పురుషార్థములలోని పరమార్థాన్ని గ్రహించి తరిస్తాడు.

పంచదశీ మంత్రంలోని క,ఏ,ఈ,ల,హ్రీం,హ,స,క,హ,ల,హ్రీం,సకలహ్రీం పదిహేనక్షరములు శ్రీమాతకు ఆత్మస్వరూపం కనుకనే ఆ తల్లిని *మూలమంత్రాత్మికా* అని నామప్రసిద్ధమైనది. పంచదశీ మంత్రం కనుకనే ఆ మూలమంత్ర స్వరూపిణి అయిన శ్రీమాత *మూలమంత్రాత్మికా* అని నామ ప్రసిద్ధమైనది.

*చతుర్విధపురుషార్థమూలకారణత్వాత్ మూలం పంచదశాక్షరీ* చతుర్విధపురుషార్థములకు సంప్రాప్తింపజేసే మూలమంత్రం.
*మననాత్ త్రాయత ఇతి మంత్రః* మననము చేయుట వలన సాధకుని రక్షించును. *ఆత్మా స్వరూపం యస్యాః తదుక్తం* ఆత్మసాక్షాత్కారం చేయగలిగేది ఈ పంచదశీ మంత్రం. *పూర్ణాహంతానుసంధ్యాత్మాస్ఫూర్జన్మననధర్మత సంసారక్షయకృత్త్రాణధర్మతో మంత్ర ఉచ్యత* పూర్ణాహంత యొక్క సంధిస్వరూప జీవసమిష్టి శ్రీమాత స్వరూపమును మాటిమాటికి మననముజేసినచో సంసారనాశము అను రక్షణము జరుగును. ఈ మంత్రోపాసనవలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. శ్రీవిద్యాసాంప్రదాయానికీ ఈ పంచదశీమంత్రం గాయత్రీ మంత్రం వంటిది.

మూలమంత్రమైన పంచదశాక్షరీ మంత్రమే స్వరూపంగా గలిగిన జగన్మాతకు నమస్కరించునపుడు
*ఓం మూలమంత్రాత్మికాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*89వ నామ మంత్రము*

*ఓం మూలకూటత్రయ కళేబరాయై నమః*

పంచదశీ (మూల) మంత్రములోగల వాగ్భవ, కామరాజ, శక్తికూటములే శరీరముగా ఒప్పారు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మూలకూటత్రయ కళేబరా* అను పది అక్షరముల (దశాక్షరీ) నామ మంత్రమును *ఓం మూలకూటత్రయ కళేబరాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా ఉపాసించు సాధకుడు ఈ *మూలకూటత్రయ కళేబరా* అను ఈ నామమే మనస్సును నడిపే చైతన్యం వలె పనిచేసి, పరిశుద్ధమనస్కుడై జీవించును.

ఏ మంత్రాన్నైనా మూడుగా విభజించ గలిగితే ఆ మూడు భాగాలను మూడుకూటాలుగా తెలుసుకోవాలి. అలాగే ఇంతకు ముందు పంచదశాక్షరీ మంత్రంలో వాగ్భవ, కామరాజ, శక్తి కూటములు ఉన్నాయనుకున్నాము. ఆ మూడుకూటములే శ్రీమాతకు శరీరముగా ఒప్పారుచున్నది. ఇంతకు ముందు నామ మంత్రంలో *మూలమంత్రాత్మికా* అన్నాము.అంటే మూడుకూటములై ఉన్న పంచదశీ (మూల) మంత్రమే ఆత్మగా విరాజిల్లుచున్నది. అక్కడ సూక్ష్మరూపంగా అనుకుంటే ఇక్కడ *(మూలకూటత్రయ కళేబరా)* శ్రీమాత స్థూలరూపంగా అన్నాము. అంటే మూలమంత్రమే ఇంతకుముందు మంత్రంలో *ఆత్మ* అయితే ఇక్కడ *శరీరం* గా కూడా సమన్వయంచేసుకోవచ్చు.

పంచదశీ మంత్రంలోని వాగ్భవ, కామరాజ, శక్తి కూటములే ఆ మంత్రానికి బీజము, శక్తి, కీలకము.

గణపతి మంత్రానికి ఇలా చెబుతాము

అస్యశ్రీ మహాగణపతి మహామంత్రస్య గణక ఋషిః| నిఛృద్గాయత్రీ ఛందః | శ్రీ మహాగణపతిర్దేవతా| *గం బీజం| స్వాహా శక్తిః | ఓం కీలకం* ...అని చెబుతాము.

పంచదశీ మంత్రానికి దక్షిణామూర్తి ఋషిః| పంక్తిఛందః | శ్రీసౌభాగ్యవిద్యేశ్వరీత్రిపురసుందరీ దేవతా| *ఐం బీజం| సౌః శక్తిః | క్లీం కీలకం* ...

పంచదశీ మహామంత్రాన్నే సౌభాగ్యవిద్య అని కూడా అంటారు.

ఈ విధంగా పంచదశీ మంత్రంలోని మూలకూటత్రయమే శ్రీమాత శరీరమని చెప్పడానికి *మూలకూటత్రయ కళేబరా* అని అన్నాము.

85వ నామ మంత్రంలో *శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా* అని అమ్మ ముఖపద్మాన్ని(స్థూల రూపము) వాగ్భవకూటము (సూక్ష్మతర రూపము) అని చెప్పాము.

86వ నామ మంత్రంలో *కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ* అన్నాము. అంటే కంఠము నుండి కటి ప్రదేశం వరకూ (స్థూల రూపము) మధ్యకూటము అనగా కామరాజకూటము (సూక్ష్మతర రూపము) అని చెప్పాము.

87వ నామ మంత్రములో *శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ* కటినుండి పాదములవరకూ (స్థూలరూపము) శక్తి కూటము (సూక్ష్మతర రూపము) అని చెప్పాము.

88వ నామ మంత్రములో *మూలమంత్రాత్మికా* అని పంచదశీమంత్రమే ఆత్మయని 85, 86, 87 నామమంత్రములలోని వాగ్భవ, కామరాజ, శక్తికూటములను మరియొకసారి అమ్మవారి సూక్ష్మతర శరీరమును చెప్పుకున్నాము.

ఇక ఈ (89వ) నామ మంత్రము లో *మూలకూటత్రయ కళేబరా* అని 85, 86, 87 నామాలలో చెప్పిన శ్రీమాత ముఖకమలము, కంఠము క్రిందినుండి కటి ప్రదేశం వరకూ, కటినుండి పాదముల వరకూ గల జగన్మాత స్థూల రూపమును చెప్పుకున్నాము.

85, 86, 87 నామ మంత్రములలో వాగ్భవ, కామరాజ, శక్తి కూటములనే సూక్ష్మతర రూపములు ఆయా స్థూలరూపములతో విడివిడగా చెపితే, 88వ నామమంత్రములో పరాశక్తి సూక్ష్మతర రూపమును, 89వ నామ మంత్రములో ఆ పరమేశ్వరి స్థూల శరీరమును చెప్పుకున్నాము.

మొత్తానికి 85వ నామమంత్రము నుండి 89వ నామ మంత్రము వరకూ అమ్మవారి స్థూల,సూక్ష్మరూపములను మనోనేత్రములందు అవలోకించాము. అనగా పంచదశీ మహామంత్రానికి వివరణ క్లుప్తముగా తెలుసకొనగలిగాము.

పంచదశీ మంత్రజపానుష్ఠానము వలన ఆయుష్షు, పుష్టి, వశీకరణము, విద్యాప్రదము, కీర్తికరము, కవిత్వప్రదము, సంపత్ప్రదము, భోగప్రదము, సౌఖ్యప్రదము మరియు సర్వాభీష్టప్రదము.

ఇదంతా మనం అర్థంచేసుకున్నామంటే సామాన్యవిషయంకాదు. మన పూర్వజన్మసుకృతము ఉన్నది కనుకనే అమ్మవారిని ఈ ఐదు నామ మంత్రములతో స్తుతించాము. ఇందులో నాకు కూడా (వివరణకర్త *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*) భాగం ఉన్నందకు మహదానందంగా ఉన్నది.

ఈ మాటను ఆదిశంకరాచార్యులవారు సౌందర్యలహరిలో ప్రథమ శ్లోకంలో ఏమి అన్నారో పరిశీలిద్దాము.

*ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యఃప్రభవతి?*

పంచదశీ మంత్రము శ్రీమాత సూక్ష్మరూపము కదా! అలాంటి పంచదశీ మంత్రోపాసన చేయడానికి ఎంత పుణ్యం మనకు ఉండాలి?

అలాగే లలితా త్రిశతి ఫలశృతిలో 83వ శ్లోకంలో

*యస్యనో పశ్చిమం జన్మ యది వా శంకరస్స్వయమ్|*

*తేనైన లభ్యతే విద్యా శ్రీమత్పంచదశాక్షరీ|*

పంచదశీ మంత్రోపాసన చేయడమంటే మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి లేదా సాక్షాత్తు పరమేశ్వరుడైనా అయి ఉండాలి.

లలితా త్రిశతి అంటే మూడు వందల నామాలు. లలితా త్రిశతి పంచదశిలోని 15 అక్షరములకు ఒక్కొక్క అక్షరమునకు 20 నామాలు చొప్పున మొత్తం 300 నామాలు గలవు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మూలకూటత్రయ కళేబరాయై నమః* అని అనవలెను.
������������������������

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*96వ నామ మంత్రము*

*ఓం అకులాయై నమః*

కులము, వంశము, జాతి వంటివి కేవలం ఇంద్రియములు, ప్రాణము ఉన్న శరీరమునకు గాని ఇటువంటి కులశబ్దమలేవియు లేని జ్ఞానస్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అకులా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం అకులాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు బ్రహ్మజ్ఞానము సంప్రాప్తించి ఆత్మానందానుభూతిని పొందును.

అకులా అనగా కులము లేనిది. కులము, వంశము, జాతి వంటివి అన్నియు కేవలము ఇంద్రియములు, ప్రాణము ఉన్న శరీరమునకు మాత్రమే. జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. జ్ఞానస్వరూపిణి. కులశబ్దములకన్నిటికీ ఆ తల్లి అతీతురాలు అందుచే జగన్మాత *అకులా* అను నామ మంత్రముతో సాధకుడు ఆరాధిస్తాడు.

షట్చక్రములను దాటిన తరువాత సహస్రదళ పద్మముగలదు. దీనినే అకులము అందురు. సహస్రదళ పద్మంలో ఎనిమిది పెద్దదళములు గలవు. ఈ అష్టదళములు అష్టదిక్కులకు ఉండగా, ప్రతీ దళమునకు 125 చిన్నచిన్న దళములు ఉండును. ఆ విధంగా సహస్రార పద్మములో మొత్తము వేయిదళములు ఉండును. మానవ శరీరంలో రెండు సహస్రదళ పద్మములు ఉండగా, ఒకటి ఆధారచక్రమునకు క్రిందను, ఇంకొకటి ఆజ్ఞాచక్రానికి పైన ఉండును. దిగువన ఉన్న సహస్రదళ పద్మమును కులమనియు,ఆజ్ఞాచక్రమునకు పైన ఉన్న సహస్రదళ పద్మమునకు అకులమని అందురు. కుండలినీ శక్తి సహస్రారమునకు (సుషుమ్మానాడి ఎగువ కొసవద్ద) క్రింద భాగంలోను, లలాటమునకు పైన షట్చక్రములను దాటి, వాటితో సంబంధంలేకుండా అక్కడ ఉన్న సుధాసాగరంలో కుండలినీ శక్తి రూపంలో ఉన్న శ్రీమాత ప్రవేశించి విహరిస్తూ ఉంటుంది. అక్కడ ప్రవేశించి, పరమేశ్వరునితో అంతర్లీనమై శివశక్త్యైక్య స్వరూపిణి అగుట చేత పరమేశ్వరిని *అకులా*, అని అంటారు.

పరబ్రహ్మస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి యగు జగన్మాతకు కులసంబంధమైన శబ్దమేదియు సమన్వయించదు గనక ఆ తల్లిని *అకులా* అని అన్నారు.

పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అకులాయై నమః* అని అనవవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులైన కీ.శే శ్రీ కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతుడను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*673వ నామ మంత్రము*

*ఓం బృహత్యై నమః*

బృహత్సామ స్వరూపిణిగాను, ముప్పది ఆరు అక్షరముల బృహతీ ఛందోరూపిణిగాను, జ్యేష్ఠసామస్వరూపిణిగాను విరాజిల్లు పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బృహతీ* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం బృహత్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ అఖిలాండేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణతో ఎంతటి బృహత్తరమైన సమస్య అయినను పరిష్కరింపబడి మానసిక ప్రశాంతననొందగలరు.

జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. పిండాండము నుండి బ్రహ్మాండము వరకూ తాన యునికినే విస్తరింపజేసి ఎంతో గొప్పది అనుకుని, అంతకన్నా మరేదీ గొప్పది ఉండు అనాలంటే అంతటి బృహత్తమమైనది పరమేశ్వరి మాత్రమే. సర్వజగత్తుల సృష్టికి మూలకారణమైనది జగన్మాతయే. సృష్టికి మూలకారణమైనది జగన్మాత అంటే ఆ తల్లి కంటె గొప్పవి ఇంకేమి ఉండును? అందుకే శ్రీమాత *బృహతీ* అని స్తుతిస్తున్నాము.

వేద ఛందస్సులలో *బృహతీ* అను ఛందస్సు ఒకటి. ఈ ఛందస్సులో ఒకపాదమునకు తొమ్మిదక్షరముల చొప్పున నాలుగు పాదములకు ముప్పది ఆరక్షరములు ఉండును. అందుచే జగన్మాత వేదస్వరూపిణిగాన, 36 అక్షరముల *బృహతీ* ఛందోరూపురాలిగా కూడా భావించడమైనది.

వేదాలలో ముఖ్యంగా అనుష్టుప్ (8 అక్షరములు), బృహతి (9), పంక్తి (10), త్రిష్టుప్ (11), జగతి (12) అనబడు ఛందములను ఉపయోగించారు. మిక్కిలి ప్రఖ్యాతి గడించిన ఛందస్సు త్రిపద గాయత్రీ ఛందస్సు. అది *తత్సవితుర్వరేణియం భర్గోదేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్*. కొందరు మొదటి పాదములో వరేణ్యం అంటారు. అప్పుడు గాయత్రి ఛందస్సుకు 23 అక్షరాలే. ఇది గాయత్రిలో ఒక ప్రత్యేకత.

కూర్మ పురాణము నందు దేవియొక్క విశ్వరూప వర్ణనమందు *సామలలో జ్యేష్ఠసామ నా స్వరూపము* అని చెప్ప బడినది గనుక శ్రీమాత *జ్యేష్ఠ సామ స్వరూపురాలు* అని గ్రహించగలము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం బృహత్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
iమహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులైన కీ.శే శ్రీ కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతుడను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*4.1 (ప్రథమ శ్లోకము)*

*నాభాగో నభగాపత్యం యం తతం భ్రాతరః కవిమ్|*

*యవిష్ఠం వ్యభజన్ దాయం బ్రహ్మచారిణమాగతమ్॥7371॥*

*4.2 (రెండవ శ్లోకము)*

*భ్రాతరోఽభాంక్త కిం మహ్యం భజామ పితరం తవ|*

*త్వాం మమార్యాస్తతాభాఙ్ క్షుర్మా పుత్రక తదాదృథాః॥7372॥*

*4.3 (మూడవ శ్లోకము)*

*ఇమే అంగిరసః సత్రమాసతేఽద్య సుమేధసః|*

*షష్ఠం షష్ఠముపేత్యాహః కవే ముహ్యంతి కర్మణి॥7373॥*

*4.4 (నాలుగవ శ్లోకము)*

*తాంస్త్వం శంసయ సూక్తే ద్వే వైశ్వదేవే మహాత్మనః|*

*తే స్వర్యంతో ధనం సత్రపరిశేషితమాత్మనః॥7374॥*

*4.5 (ఐదవ శ్లోకము)*

*దాస్యంతి తేఽథ తాన్ గచ్ఛ తథా స కృతవాన్ యథా|*

*తస్మై దత్త్వా యయుః స్వర్గం తే సత్రపరిశేషితమ్॥7375॥*

*శ్రీ శుకుడు వచించెను* వైవస్వత మనువుయొక్క కుమారుడు నభగుడు. నభగుని పుత్రుడు నాభాగుడు. అతడు సోదరులందరిలో చిన్నవాడు. అతడు విద్యాభ్యాసమునకై గురుకులమునకు వెళ్ళి చాలకాలము అచటనే యుండెను. అప్పుడు అతని సోదరులు ఆస్తిలో అతనికి భాగము మిగల్చక దానిని తమలో తాము పంచుకొనిరి. నాభాగుడు విద్యాభ్యాసా నంతరము పండితుడై ఇంటికి చేరెను. పిమ్మట అతడు ఆస్తిలో తన భాగమును గూర్చి సోదరులను అడిగెను. అప్పుడు వారు "నీ భాగమును గూర్చి తండ్రిని అడుగుము. అతడు నీకు భాగమిమ్మని తెల్పినచో, అట్లే ఇత్తుము' అని పలికిరి. అప్పుడు నాభాగుడు తండ్రికడకేగి, 'తండ్రీ! ఆస్తిలో నా భాగమును గూర్చి నిన్నే అడుగుమని నా సోదరులు తెలిపిరి' అని నుడివెను. అప్పుడు నభగుడు ఇట్లనెను "నాయనా! వారి మాటలను పట్టించుకొనవద్దు. ఇదిగో అంగిరసగోత్రజులైన ఈ బ్రాహ్మణులు మిగుల ప్రతిభావంతులు. వారు ఒక యాగమును దీక్షతో నిర్వహించుచున్నారు. వారు ప్రతి ఆరవ రోజున చేయవలసిన యజ్ఞకర్మను గూర్చి సమగ్రమైన అవగాహన లేక తికమక పడుదురు. నీవు వారి దగ్గఱకు వెళ్ళి, ఆ మహాత్ములకు వైశ్వదేవమునకు సంబంధించి రెండు సూక్తములను వివరింపుము. అప్పుడు వారు ఆ యాగమును పూర్తిగా నిర్వహించి, స్వర్గప్రాప్తికి అర్హులగుదురు. యాగానంతరము మిగిలిన ధనమునంతయును వారు నీకే ఇచ్చెదరు. కావున, నీవు వెంటనే వారికడకు వెళ్ళుము". అంతట నాభాగుడు తండ్రిచెప్పిన ప్రకారము చేసెను. అంగిరస గోత్రజులైన ఆ బ్రాహ్మణులు తమ యజ్ఞమును పూర్తియైన పిదప మిగిలిన ధనమునంతయును నాభాగునకు సమర్పించి స్వర్గమునకు వెళ్ళిరి.

*4.6 (ఆరవ శ్లోకము)*

*తం కశ్చిత్స్వీకరిష్యంతం పురుషః కృష్ణదర్శనః|*

*ఉవాచోత్తరతోఽభ్యేత్య మమేదం వాస్తుకం వసు॥7376॥*

*4.7 (ఏడవ శ్లోకము)*

*మమేదమృషిభిర్దత్తమితి తర్హి స్మ మానవః|*

*స్యాన్నౌ తే పితరి ప్రశ్నః పృష్టవాన్ పితరం తథా॥7377॥*

నాభాగుడు యజ్ఞావశిష్ట ధనమును స్వీకరించు సమయమున అచటికి ఒక నల్లని పురుషుడు ఉత్తరదిశ నుండి వచ్చి 'ఈ యజ్ఞావశిష్ట ధనమంతయును నాదే, అని నుడివెను. అంతట నాభాగుడు ఈ ధనమును నాకు ఋషులు సమర్పించిరి. కావున, ఇది నాదే' అని వచించెను. అప్పుడు ఆ పురుషుడు 'మన వివాదవిషయమును మీ తండ్రియగు నభగుడే పరిష్కరింపగలడు. కనుక, ఆయననే అడుగుము' అని పలికెను. అంతట నాభాగుడు ఆ వివాదవిషయమును తన తండ్రికి నివేదించెను.

*4.8 (ఎనిమిదవ శ్లోకము)*

*యజ్ఞవాస్తుగతం సర్వముచ్ఛిష్టమృషయః క్వచిత్|*

*చక్రుర్విభాగం రుద్రాయ స దేవః సర్వమర్హతి॥7378॥*

అప్పుడు నాభాగుడు తన కుమారునితో ఇట్లు వచించెను - "ఇదివరలో దక్షప్రజాపతి ఒనర్చిన యజ్ఞమునందు 'యజ్ఞావశిష్ఠ ధనమంతయును రుద్రునికే చెందును అని ఋషులు నిర్ణయించిరి. కావున ఈ ధనము ఆ మహాదేవునికే చెందును"

*'ఉచ్ఛేషణభాగోవై రుద్రః' ఇతి శ్రుతేశ్చ* అనునది శ్రుతి ప్రమాణము. - శ్రీధరీయ వీరరాఘవీయ వ్యాఖ్యానములు

*4.9 (తొమ్మిదవ శ్లోకము)*

*నాభాగస్తం ప్రణమ్యాహ తవేశ కిల వాస్తుకమ్|*

*ఇత్యాహ మే పితా బ్రహ్మంఛిరసా త్వాం ప్రసాదయే॥7379॥*

అంతట నాభాగుడు అ మహాపురుషునకు (పరమశివునకు) శిరసా ప్రణమిల్లి 'మహాత్మా! ఈ (మిగిలిన) యజ్ఞవస్తువులన్నియును మీవే' అని మా తండ్రిగారు తెలిపిరి. నా తప్పును మన్నింపుడు' అని ఆయనను వేడుకొనెను.

*4.10 (పదియవ శ్లోకము)*

*యత్తే పితావదద్ధర్మం త్వం చ సత్యం ప్రభాషసే|*

*దదామి తే మంత్రదృశే జ్ఞానం బ్రహ్మ సనాతనమ్॥7380॥*

*4.11 (పదకొండవ శ్లోకము)*

*గృహాణ ద్రవిణం దత్తం మత్సత్రే పరిశేషితమ్|*

*ఇత్యుక్త్వాంతర్హితో రుద్రో భగవాన్ సత్యవత్సలః॥7381॥*

అప్ఫుడు ఆ సత్పురుషుడు (పరమేశ్వరుడు) "నాభాగా! మీ తండ్రి ధర్మమును (యథార్థమును) వక్కాణించెను. నీవును సత్యమునే పలికితివి. అందువలన వేదార్థములను ఎఱిగిన (మంత్రవేత్తవైన) నీకు సనాతనమైన బ్రహ్మజ్ఞానమును అనుగ్రహించుచున్నాను. యజ్ఞపరిశిష్టమైన ఈ ధనమును నీవే తీసికొనుము" అని పలికి, సత్యవాత్సల్యముగల ఆ మహాదేవుడు అంతర్హితుడయ్యెను.

PVD Subrahmanyam చెప్పారు...

*4.12 (పండ్రెండవ శ్లోకము)*

*య ఏతత్సంస్మరేత్ప్రాతః సాయం చ సుసమాహితః|*

*కవిర్భవతి మంత్రజ్ఞో గతిం చైవ తథాఽఽత్మనః॥7382॥*

నాభాగుని ఈ వృత్తాంతమును ప్రాతఃకాలమునందును, సాయం సమయమునందును ఏకాగ్రచిత్తుడై సంస్మరించినవానికి వేదార్థములు కరతలామలకములగును, చక్కని పాండిత్యం అబ్బును. అంతేగాక, అతడు ఆత్మజ్ఞానియగును.

*4.13 (పదమూడవ శ్లోకము)*

*నాభాగాదంబరీషోఽభూన్మహాభాగవతః కృతీ|*

*నాస్పృశద్బ్రహ్మశాపోఽపి యం న ప్రతిహతః క్వచిత్॥7383॥*

నాభాగుని కుమారుడు అంబరీషుడు. అతడు మిగుల దైవభక్తి సంపన్నుడు (భాగవతోత్తముడు). తనయెడ అపరాధమొనర్చిన వారికిని ఉపకారము చేయువాడు. ఎంతటి బ్రాహ్మణ శాపమైనను ఆయనను తాకనే తాకదు. ఎట్టి ఉపద్రవములు వచ్చి పడినను, అతడు ఏమాత్రమూ తొణకడు.

*రాజోవాచ*

*4.14 (పదునాలుగవ శ్లోకము)*

*భగవన్ఛ్రోతుమిచ్ఛామి రాజర్షేస్తస్య ధీమతః|*

*న ప్రాభూద్యత్ర నిర్ముక్తో బ్రహ్మదండో దురత్యయః॥7384॥*

*పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ఇట్లడిగెను* "మహాత్మా కృత్యారూపమైన దుర్వాసుని బ్రహ్మదండముగూడ అంబరీషునియెడ నిరర్ధకము ఐనదిగదా! అట్టి ప్రజ్ఞాశాలియైన ఆ రాజర్షి వృత్తాంతమును వినగోరు చున్నాను.

*శ్రీశుక ఉవాచ*

*4.15 (పదునైదవ శ్లోకము)*

*అంబరీషో మహాభాగః సప్తద్వీపవతీం మహీమ్|*

*అవ్యయాం చ శ్రియం లబ్ధ్వా విభవం చాతులం భువి॥7385॥*

*4.16 (పదహారవ శ్లోకము)*

*మేనేఽతిదుర్లభం పుంసాం సర్వం తత్స్వప్నసంస్తుతమ్|*

*విద్వాన్ విభవనిర్వాణం తమో విశతి యత్పుమాన్॥7386॥*

*శ్రీశుకుడు ఇట్లు నుడివెను* పరీక్షిన్మహారాజా! పూర్వకాలమున అంబరీషుడు అను ఒక మహాత్ముడు గలడు. అతడు ఏడు ద్వీపములతో ఒప్పుచున్న భూమండలమును పరిపాలించెను. ఆ ప్రభువుయొక్క సిరిసంపదలకు అంతులేదు. భూతలమునగల ఆయస వైభవము సాటిలేనిది. సామాన్య మానవులకు దుర్లభములైన ఈ అంతులేని ఐశ్వర్యములను అన్నింటిని అతడు స్వప్న తుల్యములుగా (అశాశ్వతములని) భావించెడివాడు. ఏలనన, 'ధనవైభవముల లోభములో (ఉచ్చులో) పడిన మానవునకు నరకయాతనలు తప్పవు' అని ఎఱిగినవాడతడు.

*4.17 (పదిహేడవ శ్లోకము)*

*వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు|*

*ప్రాప్తో భావం పరం విశ్వం యేనేదం లోష్టవత్స్మృతమ్॥7387॥*

షడ్గుణైశ్వర్యసంపన్నుడైన శ్రీమన్నారాయణుని యందును, తద్భక్తులయెడలను, సాధుపురుషులయందును నిండైన భక్తి తాత్పర్యములు గలవాడు. అతడు ఈ సమస్త విశ్వమును ఒక ధూళికణముతో సమానముగా తలంచు చుండును.

*4.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*స వై మనః కృష్ణపదారవిందయోర్వచాంసి వైకుంఠగుణానువర్ణనే|*

*కరౌ హరేర్మందిరమార్జనాదిషు శ్రుతిం చకారాచ్యుతసత్కథోదయే॥7388॥*

*4.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*ముకుందలింగాలయదర్శనే దృశౌ తద్భృత్యగాత్రస్పర్శేఽఙ్గసంగమమ్|*

*ఘ్రాణం చ తత్పాదసరోజసౌరభే శ్రీమత్తులస్యా రసనాం తదర్పితే॥7389॥*

*4.20 (ఇరువదియవ శ్లోకము)*

*పాదౌ హరేః క్షేత్రపదానుసర్పణే శిరో హృషీకేశపదాభివందనే|*

*కామం చ దాస్యే న తు కామకామ్యయా యథోత్తమశ్లోకజనాశ్రయా రతిః॥*

అంబరీషుడు తన మనస్సును నిరంతరము శ్రీకృష్ణుని పాదకమలములయందే లగ్నమొనర్చు చుండెడివాడు. ఆయన నాలుకపై శ్రీహరి గుణగణముల కీర్తనలే మెదలుచుండును. సర్వేశ్వరుని పూజామందిరమును శుభ్రపరచుటయందే, ఆయన కరకమలములు సార్థకములగుచుండెను. అచ్యుతుని దివ్యకథలను వినుటయందే ఆయన శ్రవణములు (చెవులు) ఆనందమును అనుభవించుచుండెను. ఎల్లప్ఫుడును శ్రీహరియొక్క దివ్యమంగళ విగ్రహమును, తదాలయమును దర్శించు చుండుట ఆయనకు నేత్రపర్వముగా నుండెను. ఆ అంబరీషుడు భగవద్భక్తుల శరీరములను స్పృశించినంతనే బ్రహ్మానందమును అనుభవించుచుండెను. శ్రీహరి పాదపద్మములయందు సమర్పింపబడిన తులసీదళములను ఆఘ్రాణించుట వలన అతని నాసికయు, ఆ స్వామికి నివేదించిన ప్రసాదములను స్వీకరించుటచే, ఆయన నాలుకయు పరమతృప్తిని పొందుచుండెను. అతడు సంతతము భగవంతుని క్షేత్రములను సేవించుటకే పాదయాత్రలు సలుపుచుండెను. ఆ దేవదేవుని పాదకమలములకు ప్రణమిల్లుటయందే, ఆయన శిరస్సు సార్థకమగుచుండెను. ఆ రాజేంద్రుడు స్రక్చందనాది భోగ్యవస్తువులను లౌకిక సుఖానందములకుగాక, భగవత్సేవలకే వినియోగించుచు ఆనందించుచుండెడివాడు. సర్వశ్రేష్ఠులైన పుణ్యమూర్తులను ఆశ్రయించుచు, అది తన మహద్భాగ్యముగా తలంచుచుండెడివాడు. వేయేల, ఆ మహాపురుషుని పవిత్రజీవనము లోకమునకు ఆదర్శప్రాయమైనది.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*97వ నామ మంత్రము*

*ఓం సమయాంతస్థాయై నమః*

ప్రాచీన వైదిక గ్రంథములందు నిర్ణయింపబడిన ఆంతరిక ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే వైదికులచే (సమయాచారులచే లేదా దక్షిణాచారులచే) ఆరాధింపబడు తల్లికి నమస్కారము.

హృదయ మధ్యమునందు గల దహరాకాశంలో భావింపబడిన శ్రీచక్రమునందలి పూజాదిక (సమయా) స్వరూపిణిగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సమయాన్తస్థా* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం సమయాంతస్థాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు ఆత్మానందానుభూతిని పొందితినని, తరించితినని ఆనందించును

శ్రీమాతను ఉపాసించుటలో 1) సమయాచారులు, 2) దక్షిణాచారుయు, 3) కౌళాచారులు, 4) వామాచారులు అని నాలుగు విధములైన ఉపాసనలుగలవు. అయినను ఇందులో సమయాచారులు, దక్షిణాచారులు అను ఈ రెండు ఉపాసనాక్రమములు స్థూలంగా ఒకే విధానము. అలాగే కౌలాచారులు, వామాచారులు అనినను కూడా ఇంచుమించుగా ఒకటే. సమయాచారమునందు ప్రాచీన వైదిక సాంప్రదాయ గ్రంథములందు ఆంతరిక ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే వైదికులచే శ్రీమాత ఉపాసింపబడుచున్నది. వీరినే సమయాచారులు లేదా దక్షిణాచారులు అని అందురు.

హృదయమధ్యమునందు గల దహరాకాశంలో శ్రీచక్రమున్నదని భావించి ఉపాసన చేయుదురు. దీనినే *సమయమని* యు, అలాపూజలందుకొను దేవత పేరే *సమయ* అనియు, ఈ ఉపాసకులనే సమయాచారులనియు అందురు. ఇంకను వసిష్ఠతన్త్రము, శుకతన్త్రము, సనకతన్త్రము, సనన్దనతన్త్రము, సనత్కుమారతన్త్రము అనే ఈ అయిదు తంత్రములు కూడా దహరశ్రీచక్ర భావనా పూజాదులను బోధించుచున్నవి. వీనికి కూడా *సమయము* అని అంటారు. దహరశ్రీచక్రపూజాదులందు ఉండుటచేతను, ఈ వసిష్ఠ, శుక, సనక, సనన్దన, సనత్కుమార అను ఈ తంత్రపంచకములో బోధింపబడుచున్నది గనుక శ్రీమాత *సమయాన్తస్థా* అను నామ మంత్రముతో స్తుతింపబడుచున్నది. సమయాచార ఉపాసనయందు దహరాకాశము నందు (హృదయాకాశము - అంతస్సూత్రంగా) మనలోనే ఉండి తనకు కావలసిన సమయములందు ఉపాసకులచే తనకు కావలసిన పనులు చేయించుకుంటుంది గనక శ్రీమాతను *సమయాంతస్థా* అని స్తుతించుచున్నాము. ఈ *సమయ* మను శబ్దముసందు శివశక్తులు ఇరువురును సామ్యమును అనగా కలియుటను పొందియున్నారని గ్రహింపదగును. ఈ శివశక్తుల సామ్యము ఐదు విధములు
*1) అధిష్ఠాన సామ్యము* - శ్రీచక్రమునందు శివశక్తులు ఇద్దరూ ఉండి ఉపాసింపబడతారు.

*2) అనుష్ఠాన సామ్యము* సృష్టి,, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనే పంచకృత్యములయందు సామ్యము.

*3) అవస్థాన సామ్యము* అనగా నాట్యాది క్రియలయందు సామ్యము.

*4) నామ సామ్యము* అనగా శివ-శివా, భైరవ-భైరవీ మొదలైన పేర్లలో ఇద్దరినీ తెలియజేయుట.

*5) రూప సామ్యము* అనగా ఇద్దరూ రూపవంతులే. అరుణవర్ణంగాని, తలపై నెలవంకగానీ, మూడుకన్నులు - ఇది రూపసామ్యము.

ఇన్ని కారణములచే జగన్మాత *సమయాన్తస్థా* లేదా *సమయాంతస్థా* అని స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సమయాంతస్థాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*674వ నామ మంత్రము*

*ఓం బ్రాహ్మణ్యై నమః*

అరటి పండు ఒలిచి తినిపించినట్లు ఎటువంటి విషయాన్నైనా విడమరచి చెప్పినట్లును, వేదోచిత కర్మానుష్ఠాన బద్ధుడైనట్లును ఉండే బ్రాహ్మణ స్వరూపుడైన పరమేశ్వరునికి భార్యయై, బ్రాహ్మణి స్వరూపిణిగా విరాజిల్లు జ్ఞానవిశేష స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బ్రాహ్మణీ* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం బ్రాహ్మణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించు భక్తునికి సుఖసంతోషములతోబాటు ఆత్మానందానుభూతిని ఆ తల్లి ప్రసాదించును.

బ్రాహ్మణుడు అనువాడు వేదోచిత కర్మానుష్ఠాస బద్ధుడై ఉండి, ఎటువంటి క్లిష్టతరమైస విషయమునైననూ అరటి పండు ఒలిచి తినిపించినంత హాయిగా అర్థమయేలా బోధించువాడై ఉండువాడే బ్రాహ్మణుడు కాగలడు. అటువంటి బ్రాహ్మణునకు సహధర్మచారిణి, పాతివ్రత్యాది గుణసంపదలు గలిగిన అతని భార్య *బ్రాహ్మణి* అందురు. అటువంటి లక్షణములు గలిగిన సద్బ్రాహ్మణ స్వరూపుడు అయిన పరమేశ్వరుడు బ్రాహ్మణుడు అయితే, ఆ పరమేశ్వరుని భార్య పరమేశ్వరి *బ్రాహ్మణి* అనిపించుకుంటుంది.

*శ్లో. బ్రాహ్మణో భగవాన్ సాంబో బ్రాహ్మణానాంహిదైవతమ్|*

*విశేషాత్ బ్రాహ్మణో రుద్రం ఈశానాం శరణం వ్రజే॥*

శంకరుడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణులకు దేవుడు. కనుక బ్రాహ్మణులు శంకరుని విశేషముగా శరణు పొందవలయును.

భాస్కరరాయలు వారు ఇంకను జగన్మాతనుగూర్చి ఇలా చెప్పారు.

*1) ఒక ఓషధీ విశేషస్వరూపురాలు*

*2) సంవిద్విశేషస్వరూపురాలు*

ఏది ఏమైనా

పరమేశ్వరుడు బ్రాహ్మణుడు మరియు పరమేశ్వరి ఆ బ్రాహ్మణుని భార్యయై *బ్రాహ్మణీ* అనియు, అట్టితల్లికి నమస్కరించునపుడు *ఓం బ్రాహ్మణ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*4.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఏవం సదా కర్మకలాపమాత్మనః పరేఽధియజ్ఞే భగవత్యధోక్షజే|*

*సర్వాత్మభావం విదధన్మహీమిమాం తన్నిష్ఠవిప్రాభిహితః శశాస హ॥7391॥*

సమస్త యజ్ఞములకు భోక్తయు (యజ్ఞపురుషుడును) ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడే. అంబరీషుడు షడ్గుణైశ్వర్యసంపన్నుడైన ఆ పరమపురుషునకే తన కార్యకలాపములను అన్నింటిని త్రికరణశుద్ధిగా సమర్పించు చుండెను. అనగా - అతడు తన సకల విధులను భగవదారాధనగా భావించుచు, వాటిని నిష్ఠతో నిర్వహించుచుండెడివాడు. అతడు భగవత్సేవలచే పునీతులైన వసిష్ఠాది బ్రాహ్మణోత్తముల ఆదేశానుసారము సప్తద్వీప శోభితమైన తన రాజ్యమును పరిపాలించు చుండెడివాడు.

*4.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ఈజేఽశ్వమేధైరధియజ్ఞమీశ్వరం మహావిభూత్యోపచితాంగదక్షిణైః|*

*తతైర్వసిష్ఠాసితగౌతమాదిభిర్ధన్వన్యభిస్రోతమసౌ సరస్వతీమ్॥7392॥*

వసిష్ఠుడు, అసితుడు, గౌతముడు మొదలగు మహర్షుల పర్యవేక్షణలో అంబరీషుడు సరస్వతీనదీ ప్రవాహముతో ఒప్పుచున్న ధన్వ అను పేరుగల ప్రదేశమునందు (ధన్వము అనగా నిర్జల ప్రదేశము, మరుభూమి) అపారమైన తన ఐశ్వర్యములకు తగినట్లుగా యజ్ఞాంగదక్షిణలతో పెక్కు అశ్వమేధయాగములను ఆచరించుచు యజ్ఞపురుషుడైన ఆ సర్వేశ్వరుని ఆరాధించు చుండెడివారు.

*4.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*యస్య క్రతుషు గీర్వాణైః సదస్యా ఋత్విజో జనాః|*

*తుల్యరూపాశ్చానిమిషా వ్యదృశ్యంత సువాససః॥7393॥*

ఆ ప్రభువు నిర్వహించుచున్న అశ్వమేధాది యాగముల యందు సదస్యులు, ఋత్విజులు, తదితర ప్రజలు చక్కని వస్త్రాభరణములను ధరించి, దేవతలతోసహా పాల్గొను చుండెడివారు. వారు అచటి కార్యకలాపములను రెప్పలార్పక తిలకించుచుండుటచే దేవతలవలె విరాజిల్లుచుండిరి.

*4.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*స్వర్గో న ప్రార్థితో యస్య మనుజైరమరప్రియః|*

*శృణ్వద్భిరుపగాయద్భిరుత్తమశ్లోకచేష్టితమ్॥7394॥*

అంబరీషుని పాలనలోనున్న ఆ దేశప్రజలు సంతతము భగవల్లీలలను వినుచు, కీర్తించుచు మహానందమును అనుభవించు చుండెడివారు. అందువలన వారు దేవతలకును ప్రాణప్రియమైన స్వర్గమును సైతము ఆశింపకుండిరి. ఏలనన, వారు ఇచట పొందెడి పరమానందము స్వర్గ సుఖముల కంటెను అతీతమైనది.

*4.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*సమర్థయంతి తాన్ కామాః స్వారాజ్యపరిభావితాః|*

*దుర్లభా నాపి సిద్ధానాం ముకుందం హృది పశ్యతః॥7395॥*

అచటి ప్రజలు మోక్షప్రదుడైన శ్రీహరిని తమ హృదయములలో దర్శించి, పరమానందమును అనుభవించుచుండిరి. కనుక యోగీశ్వరులకును దుర్లభములైన అణిమాది సిద్ధులుగూడ వారిని ఆకర్షింపజాలకుండెను. వారి ఆత్మానందము ముందు ఈ అణిమాదిసిద్ధులు తుచ్ఛములే అగుచుండగా, ఇక స్వర్గసుఖములను గూర్చి చెప్పనేల?

*4.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*స ఇత్థం భక్తియోగేన తపోయుక్తేన పార్థివః|*

*స్వధర్మేణ హరిం ప్రీణన్ సంగాన్ సర్వాన్ శనైర్జహౌ॥7396॥*

*4.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*గృహేషు దారేషు సుతేషు బంధుషు ద్విపోత్తమస్యందనవాజివస్తుషు|*

*అక్షయ్యరత్నాభరణాయుధాద ష్వనంతకోశేష్వకరోదసన్మతిమ్॥7397॥*

అంబరీషమహారాజు ఇట్లు భక్తియోగముచేతను, సాత్త్వికములైన శారీరక, వాచిక, మానసిక తపస్సులవలనను, స్వధర్మానుష్ఠానము చేతను, భగవంతుని ప్రసన్నుని జేసికొనుచు, లౌకికములగు వివిధములైన (ఐహిక-ఆముష్మిక) ఆసక్తులను క్రమముగా పరిత్యజించెను. ఆ రాజు గృహములను, భార్యాపుత్రులను, బంధువుల విషయమును, మేలైన రథగజాశ్వ సమూహములను, అపారములైన రత్నాభరణములను, పలువిధములైన ఆయుధములను, అనంతమైన సంపదలను (అంతులేని కోశాగారములను) వీటినన్నింటిని అసత్తుగా భావించెను. (ఇవి అన్నియును అనిత్యములని భావించి, వాటియెడ వైముఖ్యమును పొందెను).

*4.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*తస్మా అదాద్ధరిశ్చక్రం ప్రత్యనీకభయావహమ్|*

*ఏకాంతభక్తిభావేన ప్రీతో భృత్యాభిరక్షణమ్॥7398॥*

అనన్యభక్తిభావముతో సర్వదా తనను సేవించుచున్న అంబరీషునియెడ శ్రీహరి ప్రసన్నుడై, సుదర్శనచక్రమును అనుగ్రహించెను. అది శత్రువుల గుండెలలో దడ పుట్టించునది, భగవద్భక్తులు మొదలగు సత్పురుషులను రక్షించునట్టిది.

*4.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*ఆరిరాధయిషుః కృష్ణం" మహిష్యా తుల్యశీలయా|*

*యుక్తః సాంవత్సరం వీరో దధార ద్వాదశీవ్రతమ్॥7399॥*

అంబరీషుని ధర్మపత్నియు ఆయనవలె ఉత్తమురాలు, దైవభక్తిపరాయణ. నిరంతరము శ్రీకృష్ణభగవానుని ఆరాధించుటకే తన హృదయమును అంకితమొనర్చిన ఆ మహారాజు, తన భార్యతో గూడి ఒక సంవత్సరకాలము ద్వాదశీ ప్రధానమైన ఏకాదశీ వ్రతమును దీక్షతో ఆచరించెను.

*4.30 (ముప్పదియవ శ్లోకము)*

*వ్రతాంతే కార్తికే మాసి త్రిరాత్రం సముపోషితః|*

*స్నాతః కదాచిత్కాలింద్యాం హరిం మధువనేఽర్చయత్॥*

వ్రతాంతమున కార్తిక మాసమునందు మూడురాత్రులు *(నవమి, దశమి, ఏకాదశితిథుల యందు నియమముతో ఉపవసించి, ద్వాదశినాడు పారణచేయుటయే ఏకాదశీ వ్రతవిధానము)* ఉపవసించిన పిమ్మట, ఆ మహారాజు యమునానదిలో స్నానమాచరించి, మధువనము నందు (బృందావనము నందు) శ్రీహరిని ఆరాధించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*4.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*మహాభిషేకవిధినా సర్వోపస్కరసంపదా|*

*అభిషిచ్యాంబరాకల్పైర్గంధమాల్యార్హణాదిభిః॥7401॥*

*4.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*తద్గతాంతరభావేన పూజయామాస కేశవమ్|*

*బ్రాహ్మణాంశ్చ మహాభాగాన్ సిద్ధార్థానపి భక్తితః॥7402॥*

అంబరీషుడు మహాభిషేక విధానమున సమగ్రమైన ఉపచారములద్వారా అనన్యభక్తి భావముతో శ్రీమహావిష్ణువునకు అర్ఘ్యపాద్యాదులను సమర్పించెను. వస్త్రాభరణములు, గంధమాల్యములు మున్నగువానితో ధూపదీపనైవేద్యాదులతో (షోడశోపచారములతో) కేశవుని పూజించెను. అనంతరము మహాత్ములైన బ్రాహ్మణశ్రేష్ఠులను, భాగవతోత్తములను (సిద్ధపురుషులను) గూడ భక్తిశ్రద్ధలతో సేవించెను.

*సిద్ధపురుషులు సకల పురుషార్థములను పొందినవారు. నిత్యసంతుష్ఠులు. వారు ఎట్టిసేవలనూ కోరుకొనరు. కాని, ఇట్టి వ్రతాదులయందు భగవదారాధనతోపాటు, భాగవతుల (భగవద్భక్తుల) ఆరాధనము ఆచరణీయము*

*4.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*గవాం రుక్మవిషాణీనాం రూప్యాంఘ్రీణాం సువాససామ్|*

*పయఃశీలవయోరూపవత్సోపస్కరసంపదామ్॥7403॥*

*4.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*ప్రాహిణోత్సాధువిప్రేభ్యో గృహేషు న్యర్బుదాని షట్|*

*భోజయిత్వా ద్విజానగ్రే స్వాద్వన్నం గుణవత్తమమ్॥7404॥*

పిదప ఆ అంబరీష మహారాజు ద్విజోత్తములను షడ్రసోపేతమైన, రుచికరమగు కమ్మని భోజన పదార్థములతో తృప్తిపరచెను. అనంతరము అతడు వారికి చక్కని అవయవ సౌభాగ్యములతో రూపురేఖలతో విరాజిల్లుచున్న అరువది కోట్లపాడియావులను దానమొనర్చెను. ఆ గోవులు బంగారు తొడుగులుగల కొమ్ములతో, వెండి అలంకారములతో గూడిన గిట్టలతో చూడముచ్చట గొలిపెడి వస్త్రములతో, లేగ దూడలతో అలరారుచుండెను. అవి సాధుస్వభావము గలవి. సమృద్ధిగా పాలను ఇచ్చునవి. ఆ ధేనువులతోపాటు పాలను పితుకుటకు ఉపయుక్తములగు పాత్రలు మొదలగువాటిని గూడ ఇచ్చెను. అనంతరము అతడు ఆ గోవులను ఆ బ్రాహ్మణోత్తముల ఇండ్లకు పంపెను.

*4.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*లబ్ధకామైరనుజ్ఞాతః పారణాయోపచక్రమే|*

*తస్య తర్హ్యతిథిః సాక్షాద్దుర్వాసా భగవానభూత్॥7405॥*

మృష్టాన్న భోజనములతో, దక్షిణాది దానధర్మములతో సంతృప్తులై యున్న ఆ విప్రోత్తముల అనుమతిగైకొని, అంబరీషుడు ద్వాదశీపారణకు సన్నద్ధుడయ్యెను. ఇంతలో నిగ్రహానుగ్రహ సమర్థుడైన దుర్వాసమహర్షి అతిథిగా అచట ప్రత్యక్షమాయెను.

*4.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*తమానర్చాతిథిం భూపః ప్రత్యుత్థానాసనార్హణైః|*

*యయాచేఽభ్యవహారాయ పాదమూలముపాగతః॥7406॥*

వెంటనే ఆ మహారాజు ఆ మహామునికి స్వాగతసత్కారములను నెఱపి, సుఖాసీనునిగావించి, అతిథి మర్యాదలను గావించెను. పిమ్మట ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లి భోజనము చేయుటకు అభ్యర్థించెను.

*4.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*ప్రతినంద్య స తద్యాచ్ఞాం కర్తుమావశ్యకం గతః|*

*నిమమజ్జ బృహద్ధ్యాయన్ కాలిందీసలిలే శుభే॥7407॥*

అంతట దుర్వాసుడు అంబరీషుని ప్రార్థనను ఆమోదించి, నియమానుసారముగా మాధ్యాహ్నిక కృత్యములను ఆచరించుటకు యమునానదికి వెళ్ళెను. పిదప భగవద్ధ్యాన మొనర్చుచు ఆ కాళిందీ జలములలో మునిగెను.

*4.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*ముహూర్తార్ధావశిష్టాయాం ద్వాదశ్యాం పారణం ప్రతి|*

*చింతయామాస ధర్మజ్ఞో ద్విజైస్తద్ధర్మసంకటే॥7408॥*

అప్పటికి ద్వాదశి పారణ చేయుటకు ఒక గడియకాలము మాత్రమే మిగిలియుండెను. అంతట ధర్మజ్ఞుడైన (వ్రతధర్మములను బాగుగా ఎరిగిన) అంబరీషుడు ధర్మసంకటములోబడి, ఏమి చేయుటకును తోచక బ్రాహ్మణుల అభిప్రాయమును అడిగెను.

*4.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*బ్రాహ్మణాతిక్రమే దోషో ద్వాదశ్యాం యదపారణే|*

*యత్కృత్వా సాధు మే భూయాదధర్మో వా న మాం స్పృశేత్ ॥7409॥*

"విప్రోత్తములారా! అతిథియైన బ్రాహ్మణుని ఆహ్వానించి, ఆయన రాకముందే భోజనము చేయుట మహాపాపము. అట్లని సకాలములో ద్వాదశి పారణ చేయకుండుటయు దోషము. నాకు అధర్మదోషము అంటకుండునట్లుగా, ఇప్పుడు నేనేమి చేయవలయును?

*4.40 (నలుబదియవ శ్లోకము)*

*అంభసా కేవలేనాథ కరిష్యే వ్రతపారణమ్|*

*ప్రాహురబ్భక్షణం విప్రా హ్యశితం నాశితం చ తత్॥7410॥*

అంతట బ్రాహ్మణులు "రాజా! ఇప్పుడు నీవు తీర్థమును మాత్రము స్వీకరించుట యుక్తము. దానివలన వ్రతభంగము గలుగదు - అతిథిని అతిక్రమించుటయును గాబోదు. శ్రుతులుగూడ ఇట్లే చెప్పుచున్నవి" అని పలికిరి. అప్ఫుడు అంబరీషుడు 'నేను కేవలము ద్వాదశీతీర్థమును స్వీకరించి, వ్రతపారణను కావించెదను' అని నిశ్చయించుకొనెను.

*శ్రుతులు ఇట్లు చెప్ఫుచున్నవి:-*

*అపోఽశ్నాతి తన్నైవాశితం, నైవాఽనశితమ్* జలభక్షణము చేయుటవలన భుజించినట్లుగాదు, భుజింపకుండుటయు గాదు. (శ్రీధరీయము)

*బమ్మెర పోతనామాత్యుల వారి పద్యము*

*ఆటవెలది*

అతిథి పోయిరామి నధిప! యీ ద్వాదశి
పారణంబు మానఁ బాడి గాదు
గుడువకుంట గాదు కుడుచుటయును గాదు
సలిలభక్షణంబు సమ్మతంబు.

*తాత్పర్యము*

“వెళ్ళిన అతిథి రాకపోతే ద్వాదశి పారణ మానడం ధర్మం గాదు. నీళ్ళు తాగితే భోజనం చేసినట్టు కాదు. చేయనట్టు కాదు. అందుచేత నీళ్ళు తాగడం ధర్మసమ్మతమే.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*98వ నామ మంత్రము*

*ఓం సమయాచార తత్పరాయై నమః*

గురువుల వద్ద మహావేధ అను సంస్కారమును పొంది, షట్చక్రబేధనము, చతుర్విధైక్యసంధానము తెలిసికొని, ఆ క్రమములో శ్రీమాతను ఉపాసించు అంతర్యాగ క్రమము అనినచో (సమయాచారములందు) ఆసక్తిగలిగియున్న జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సమయాచార తత్పరా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీమాతను ఉపాసించు సాధకుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడై, భౌతిక సుఖసంతోషములతోపాటు, ఆధ్యాత్మికానందమును సంప్రాప్తము చేసికొని, ఆ పరాశక్తి సేవలో కొనసాగుచు ధన్యజీవియై తరించును.

సమయాచారము అనునది ప్రాచీన వైదిక సాంప్రదాయ గ్రంథములందు విపులీకరించిన విధానము. పూర్ణదీక్షను పొందిన సాధకునికి గురుకటాక్షము వలన షడ్విధైక్యము గాని, చతుర్విధైక్యముగాని అనుసంధానము చేయుశక్తి కలుగును. ఈ అనుసంధానము క్రమముగా దృఢపడి, మహానవమినాడు మహావేధయను ఒక సంస్కారము సంప్రాప్తించును.

*షడ్విధైక్యము అనిన ఏమిటి?*

ఇది ఆరువిధములు గనుక షడ్విధైక్యము అని చెప్పబడినది. ఇందులో 1) శ్రీచక్రము, 2) అకారాది క్షకారాంత వర్ణమాతృక, 3) పంచదశీవిద్య, 4) లలితాదేవత, 5) బ్రహ్మాండము, 6) పిండాండము. ఈ ఆరింటికి ఏకత్వమును పొందుటయే షడ్విధైక్యమగును. ఈ ఆరింటిలో ఎక్కడ ఈ ఐక్యమును ప్రారంభించవలెననునది కేవలం గురువులద్వారా తెలియవలసియున్నది.

*చతుర్విధైక్యము అనగా....*

1) పరదేవతా శ్రీచక్రములకు ఏకత్వము, 2) శ్రీచక్ర బ్రహ్మాండములకు ఏకత్వము, 3) బ్రహ్మాండ పిండాండములకు ఏకత్వము, 4) వర్ణమాతృకా దేవతల ఏకత్వము. ఇదికూడా గురుముఖతా తెలియవలసియుండును.

గురుకటాక్షము వలన చతుర్విధైక్యముగాని, షడ్విధైక్యముగాని అనుసంధానము చేయుశక్తి కలిగిన తరువాత, ఆ అనుసంధానము దృఢపడి మహావేధయను ఒక సంస్కారము మహానవమినాడు కలుగుతుంది. ఈ సమయాచారంలో మూలాధారమునుండి బయలుదేరిన కుండలినీ శక్తి మణిపూరచక్రమునకు చేరుతుంది. అక్కడ ఆ కుండలినీ శక్తికి పాద్యాది అలంకార సమర్పణమువరకు గల ఉపచారములచే పూజించి, అక్కడ నుండి అనాహత చక్రమందు భోజన తాంబూలాంతము వఱకు గల ఉపచారములతో పూజింపబడి, అక్కడ నుండి దేవిని (కుండలినీ శక్తి) విశుద్ధచక్రమునకు తీసికొనివెళ్ళి అచ్చట ఉన్న చంద్రకళా స్వరూపములైన మణులతో పూజించి అక్కడనుండి ఆజ్ఞాచక్రమున ప్రవేశింపజేసి, అచ్చట నీరాజనము సమర్పించి అక్కడనుండి తేనెటీగలతోను, మకరందము (మద్యము) తోను నిండియున్న సహస్రార కమలమున ప్రవేశింపజేసి, సహస్రారంలో ఉన్న సదాశివునితో ఐక్యముచేసి, ఆ శివ,శక్తులు కనుపించకుండునట్లు ఒక వస్త్రమును తెరగా ఉంచి, ఈ సాధకుడు మఱియొక గదిలో ఉండి, శ్రీమాత శంకరుని విడిచిపెట్టి, బయలుదేరి మూలాధారములో ప్రవేశించువరకూ అక్కడనే సాధకుడు *సమయము* కొఱకు వేచియుండట జరుగును. దీనినే సమయాచారము అందురు. ఇదియంతయు రుద్రయామళమందు పది పటలములతో ఉపదేశింపబడిన సమయాచారము అని యందురు.

దీనినే భాస్కరరాయలు వారు ఇలా అన్నారు.

*దీక్షగలవాడు (సాధకుడు) మూలాధారమునుండి సహస్రారమువరకూ దేవిని తీసుకొనివెళ్ళి శివునితో కలిపి, తెరవేసి, వేరొకచోటినుండి దేవి ఎప్పుడు వచ్చునో యని వచ్చుసమయము వరకు కనిపెట్టుకొని చేయు ఆచారమునందు ఆసక్తి గలిగినది శ్రీమాత*

సమయాచారమునందు కేవలం అంతర్ముఖధ్యానము, దీక్ష, శ్రద్ధ, ఏకాగ్రత ముఖ్యమైనవి. సమయాచారంలో అంతర్ముఖ సాధన తప్ప, భయంకరమనిపించే జంతువుల మెడలు నరకడం, అవి నేలపై విలవిలలాడుతుంటే కేరింతలు కొట్టడం, ఆ జంతువుల మాంసముతోబాటు కల్లు, గంజాయి వంటి మాదక ద్రవ్య సమర్పణ, పూనకములు, ఘటములు, గరగలు వంటి ఆవేశపూరిత చర్యలు ఉండవు. ఉపాసకుడు సమయాచార విధానములో చెప్పిన పూజా ద్రవ్యాలు ఉఫాసకుడిని సూక్ష్మలోకాలలో విహరింప జేయును. అందుకే *అంతర్ముఖసమారాధ్యా* (870వ నామ మంత్రము) *బహిర్ముఖ సుదుర్లభా* (871వ నామ మంత్రము) అను నామ మంత్రములలో అంతర్ముఖధ్యానంలో దేవి అనుగ్రహం ఎంత సులువుగా లభిస్తుందో బహిర్ముఖధ్యానంలో అంతకష్టము అని తెలియును.

ఇంతకు ముందు నామ మంత్రములో శివశక్తులకు పంచసామ్యమున్నదని చెప్ఫినది కూడా సమయాచారమే.

ఈ శివశక్తుల పంచసామ్యములు.

*1) అధిష్ఠాన సామ్యము* - శ్రీచక్రమునందు శివశక్తులు ఇద్దరూ ఉండి ఉపాసింపబడతారు.

*2) అనుష్ఠాన సామ్యము* సృష్టి,, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనే పంచకృత్యములయందు సామ్యము.

*3) అవస్థాన సామ్యము* అనగా నాట్యాది క్రియలయందు సామ్యము.

*4) నామ సామ్యము* అనగా శివ-శివా, భైరవ-భైరవీ మొదలైన పేర్లలో ఇద్దరినీ తెలియజేయుట.

*5) రూప సామ్యము* అనగా ఇద్దరూ రూపవంతులే. అరుణవర్ణంగాని, తలపై నెలవంకగానీ, మూడుకన్నులు - ఇది రూపసామ్యము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సమయాచార తత్పరాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*675వ నామ మంత్రము*

*ఓం బ్రాహ్మ్యై నమః*

బ్రహ్మయొక్క సృజనాత్మక స్వరూపురాలు, బ్రహ్మచైతన్య స్వరూపురాలు, వాక్స్వరూపురాలు, జ్ఞానస్వరూపురాలు తానై మువురమ్మల మూలపుటమ్మగా విరాజిల్లు అఖిలాండేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బ్రాహ్మీ* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం బ్రాహ్మ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని మిగుల భక్తిశ్రద్ధలతో సేవించు భక్తులకు సరస్వతీ స్వరూపిణియైన శ్రీమాత సాధకునకు తాను చేయు వృత్తి వ్యాపారాదులయందు వాక్పటిమనేర్పరచి, వాక్చాతుర్యముతో తన వృత్తిప్రవృత్తులయందు రాణించునటులు చేయును. అదేవిధముగా తన వాక్కులో పవిత్రత ఏర్పరచి శ్రీమాతా నామస్మరణలో నిరతము నిమగ్నమొనర్చి తరింపజేయును.

సృష్టియంతయు పరమేశ్వరి ప్రేరణ మాత్రమే. కారణము తానయితే బ్రహ్మ ఆ పనిని నెరవేర్చుచున్నాడు. ఈ సమస్త సృష్టిని చేయు బ్రహ్మ వేరు బ్రహ్మమువేరు. బ్రహ్మ అంటే చతుర్వేదములు, చతుర్ముఖుడు, బ్రాహ్మణుడు మరియు పురోహితుడు. కాని బ్రహ్మము అనేది వేదాంతమునకు, యోగము, తత్త్వము, తపస్సు, శాస్త్రములు మొదలగునవి. బ్రహ్మ యొక్కశక్తి బ్రాహ్మి. సప్తమాతృకలలో బ్రాహ్మి మొదటిది. ఈ సప్తమాతృకల గూర్చి కొంచం తెలుసుకుందాము.

బ్రాహ్మి ... మహేశ్వరీ ...కౌమారి'. వైష్ణవి ... వారాహి ... ఇంద్రాణి... చాముండి దేవతలను సప్త మాతృకలు అంటారు. దేవీ పురాణం ... బ్రహ్మవైవర్త పురాణం ... స్కంద పురాణం ... సప్తమాతృకల ఆవిర్భావం గురించి వాటి విశిష్టతను గురించి పేర్కొన్నాయి. పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడి ఆగడాలు మితిమీరడంతో, వాడిని సంహరించడానికి శివుడు సిద్ధమయ్యాడు. అంధకాసురుడితో రుద్రుడు పోరాడుతూ వుండగా ఆ రాక్షసుడి నుంచి చిందిన రక్త బిందువులు రాక్షసులుగా మారేవి. విషయాన్ని గ్రహించిన శివుడు ... మహేశ్వరిని రంగంలోకి దింపాడు. 'వృషభ' వాహనంపై ఆమె యుద్ధభూమిలోకి ప్రవేశించింది.

దాంతో బ్రహ్మ పంపిన బ్రహ్మణి 'హంస' వాహనంపై ... విష్ణుమూర్తి పంపిన వైష్ణవి 'గరుడ' వాహనం పై ... కుమార స్వామి పంపిన కౌమారీ 'నెమలి' వాహనం పై ... వరాహమూర్తి పంపిన వారాహి 'మహిష' వాహనం పై ... ఇంద్రుడు పంపిన ఇంద్రాణి 'ఐరావతం' పై ... యముడు పంపిన చాముండి 'శవ' వాహనం పై యుద్ధభూమికి చేరుకున్నాయి. ఈ శక్తి స్వరూపాల సాయంతో అంధకాసురుడిని శివుడు సంహరించాడు.

ఇంతే కాకుండా ఈ సప్తమాతృకల పేర్లు మనం నిత్యం పఠించు ఖడ్గమాలాస్తోత్రం లో ప్రథమావరణ దేవతలలో చెప్తాము. *బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండీ* కాని అక్కడ *మహాలక్ష్మీ* అని ఇంకొక మాతృక కూడా ఉన్నది కూడా ఊన్నది. ఈ విధంగా శ్రీచక్రములోని ప్రథమావరణ దేవతలలో గల *బ్రాహ్మీ* స్వరూపిణిగా శ్రీమాత విరాజిల్లుచున్నది. శ్రీమాత బ్రహ్మచైతన్యస్వరూపురాలైన *బ్రాహ్మీ* స్వరూపిణి. జగన్మాత వాక్స్వరూపురాలుగా *బ్రాహ్మీ* అని స్తుతింపబడుచున్నది. బ్రాహ్మీ స్వరూపిణి అయిన శ్రీమాత జ్ఞానస్వరూపిణి, *చతుష్షష్టికళా స్వరూపిణి*. అవిద్య అనగా అజ్ఞానమును మించిన జ్ఞానము గలిగినది. దేనివల్లనయితే ఈ భూతజాలమంతా ఉద్భవించుచున్నదో, వృద్ధి చెందుచున్నదో, దేనివలన లయం చెందుతున్నదో అది బ్రహ్మము. అట్టి బ్రహ్మమే ఈ బ్రాహ్మి. శుంభు నిశుంభులతో యుద్ధము చేయునపుడు పరమేశ్వరికి సహాయపడినది. మువురమ్మలకు మూలపుటమ్మ అనగా, లక్ష్మీ, సరస్వతి (బ్రాహ్మి), మహాకాళి (శ్రీమాత) అను త్రిశక్తులకు పరమేశ్వరియే మూలము అనుటచే జగన్మాత *బ్రాహ్మి* అని నామ ప్రసిద్ధమైనది.

జగన్మాతకు నమస్కరించు నపుడు *ఓం బ్రాహ్మ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*4.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*ఇత్యపః ప్రాశ్య రాజర్షిశ్చింతయన్ మనసాచ్యుతమ్|*

*ప్రత్యచష్ట కురుశ్రేష్ఠ ద్విజాగమనమేవ సః॥7411॥*

పరీక్షిన్మహారాజా! అంబరీషుడు బ్రాహ్మణులను విచారించిన పిమ్మట అట్లు నిశ్చయించుకొని, భగవంతుని ధ్యానించుచు తీర్థప్రాశమును చేసి ఆ మహర్షి రాకకై ఎదురు చూడసాగెను.

*వీరరాఘవీయ వ్యాఖ్య*

ఒకవేళ అతిథియైన దుర్వాసమహాముని రాకముందే అట్లు జలభక్షణము చేయుట దోషమేయగుచో, దాని నివారణకై ఆ మహారాజు భగవంతుని ధ్యానించుచు తీర్థమును స్వీకరించు యుండవచ్చును. ఏలయన, ధర్మము సుసూక్ష్మమైనది గదా!

*4.42 (నలుబది రెండవ శ్లోకము)*

*దుర్వాసా యమునాకూలాత్కృతావశ్యక ఆగతః|*

*రాజ్ఞాభినందితస్తస్య బుబుధే చేష్టితం ధియా॥7412॥*

*4.43 (నలుబది మూడవ శ్లోకము)*

*మన్యునా ప్రచలద్గాత్రో భ్రుకుటీకుటిలాననః|*

*బుభుక్షితశ్చ సుతరాం కృతాంజలిమభాషత॥7413॥*

దుర్వాసమహాముని యమునాతీరమున స్నానాది మధ్యాహ్న విధులను నిర్వర్తించుకొని, తిరిగి వచ్చెను. అంబరీషుడు ఆ మహర్షికి ఎదురుగా జని, సాదరముగా నమస్కరించెను. అప్పుడు దుర్వాసుడు తన బుద్ధిచే మహారాజు పారణము గావించినట్లు గ్రహించెను. అంతట మిక్కిలి ఆకలిగొనియున్న ఆ ముని మిగుల క్రోధముతో బొమముడివైచి,ఊగిపోసాగెను. అప్పుడు తన యెదుట అంజలి ఘటించియున్న అంబరీషుని వినమ్రతను సరకు గొనకయే ఆవేశముతో ఇట్లు నుడివెను.

*4.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*అహో అస్య నృశంసస్య శ్రియోన్మత్తస్య పశ్యత|*

*ధర్మవ్యతిక్రమం విష్ణోరభక్తస్యేశమానినః॥7414॥*

"అహో! జనులారా! చూచితిరా! ఈ క్షత్రియాధముడు ధన మదముతో కన్నుమిన్నుగానక యున్నాడు. ఇతడు నిజముగా విష్ణుభక్తుడు గాకున్నను, తనను ఒక మహాభక్తునిగా భావించుకొనుచు ధర్మవ్యతిక్రమమునకు ఒడిగట్టినాడు (ధర్మమును ఉల్లంఘించినాడు)

*4.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*యో మామతిథిమాయాతమాతిథ్యేన నిమంత్ర్య చ|*

*అదత్త్వా భుక్తవాంస్తస్య సద్యస్తే దర్శయే ఫలమ్॥7415॥*

నేను ఇచటికి అతిథిగా విచ్చేసితిని. ఇతడు నన్ను ఆతిథ్యమునకు ఆహ్వానించెను. కాని, ఇతడు నాకు ఆతిథ్యమును ఇయ్యకయే తాను భుజించెను. ధర్మమును ఉల్లంఘించిన ఫలితమును ఇప్పుడే ఇతనికి రుచి చూపెదను.

*4.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*ఏవం బ్రువాణ ఉత్కృత్య జటాం రోషవిదీపితః|*

*తయా స నిర్మమే తస్మై కృత్యాం కాలానలోపమామ్॥7416॥*

ఇట్లు పరుషముగా (దురుసుగా) మాట్లాడుచు, రోషముతో ఉడికిపోవుచున్న ఆ మహర్షి తన శిరస్సునుండి ఒక జడను లాగి, అబరీషుని శిక్షించుటకై ప్రళయకాలాగ్ని తుల్యమగు ఒక కృత్యను నిర్మించెను.

*4.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*తామాపతంతీం జ్వలతీమసిహస్తాం పదా భువమ్|*

*వేపయంతీం సముద్వీక్ష్య న చచాల పదాన్నృపః॥7417॥*

అంతట ఆ కృత్య ఖడ్గమును చేబూని భగభగమంటలను చిమ్ముచు, తన పాద ఘట్టనములకు భూమిని కంపింపజేయుచు అంబరీషుని మీదికి విజృభించెను. కాని, ఆ రాజర్షి ఆ కృత్యయొక్క భయంకరస్థితిని చూచియు ఏ మాత్రము చలింపకుండెను.

*4.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*ప్రాగ్దిష్టం భృత్యరక్షాయాం పురుషేణ మహాత్మనా|*

*దదాహ కృత్యాం తాం చక్రం క్రుద్ధాహిమివ పావకః॥7418॥*

పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన అంబరీషుని రక్షణకై ఇంతకు ముందే సుదర్శన చక్రమును ఆదేశించియుండెను. అప్పుడు ఆ దివ్య చక్రము, అగ్నిదేవుడు ఱెచ్చిపోయియున్న సర్పమునువలె ఆ కృత్యను దహించివేసెను.

*4.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*తదభిద్రవదుద్వీక్ష్య స్వప్రయాసం చ నిష్ఫలమ్|*

*దుర్వాసా దుద్రువే భీతో దిక్షు ప్రాణపరీప్సయా॥7419॥*

దుర్వాసుడు తాను కృత్యను ప్రయోగించుటకై పడిన ప్రయాస వ్యర్దమగుటను, శ్రీహరిచక్రము తనవైపుగా విజృంభించి వచ్చుచుండుటను చూచెను. అంతట అతడు భయముతో గజగజలాడుచు తన ప్రాణములను దక్కించుకొనుటకై నలుదిక్కులకును పారిపోసాగెను.

*4.50 (ఏబదియవ శ్లోకము)*

*తమన్వధావద్భగవద్రథాంగం దావాగ్నిరుద్ధూతశిఖో యథాహిమ్|*

*తథానుషక్తం మునిరీక్షమాణో గుహాం వివిక్షుః ప్రససార మేరోః॥7420॥*

భగవంతునిచే ప్రయుక్తమైన ఆ చక్రము, చెలరేగి మీదికి ఎగయుచున్న జ్వాలలతో గూడిన దావాగ్ని సర్పమును వెంబడించినట్లు, ఆ మునిని వెంటాడసాగెను. అప్పుడు దుర్వాసుడు తన వెంటబడుచున్న చక్రమును జూచి, వణుకుచు మేరుపర్వత గుహలో దాగికొనుటకై అటువైపుగా పరుగెత్తెను.

PVD Subrahmanyam చెప్పారు...

*4.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*దిశో నభః క్ష్మాం వివరాన్ సముద్రాన్ లోకాన్ సపాలాంస్త్రిదివం గతః సః|*

*యతో యతో ధావతి తత్ర తత్ర సుదర్శనం దుష్ప్రసహం దదర్శ॥7421॥*

అప్పుడు దుర్వాసుడు తన ప్రాణములను రక్షించుకొసుటకై సకలదిశలకును పరుగులు దీసెను, అంతరిక్షమునకు ఎగబ్రాకెను, భూమిలో జొచ్చెను, గుహలో దూరెను. సముద్రములలో మునిగెను, లోకపాలురతో ఒప్ఫుచున్న ముల్లోకముల యందును సంచరించెను. కడకు సురలోకమునకు చేరెను. తాను ఎక్కడికి పరుగెత్తినను దుస్సహమైన (తిరుగులేని) సుదర్శనచక్రము తనను వెంటాడుచుండుట అతడు గమనించెను.

*4.52 (ఏబది రెండవ శ్లోకము)*

*అలబ్ధనాథః స యదా కుతశ్చిత్సంత్రస్తచిత్తోఽరణమేషమాణః|*

*దేవం విరించం సమగాద్విధాతస్త్రాహ్యాత్మయోనేఽజితతేజసో మామ్॥7422॥*

ఆ మహర్షి ఎక్కడెక్కడ తిరిగినను ఆయనను రక్షించువారు కఱవైరి. దిక్కుతోచని స్థితిలోనున్న ఆ ముని మిగుల తత్తఱపడుచు తనను రక్షింపగలవారి శరణుజొచ్చుటకై నిర్ణయించుకొని బ్రహ్మదేవుని సన్నిధికి చేరి ఇట్లు మొరపెట్టుకొనెను- "స్వయంభువువైన విధాతా! తేజోమయమైన విష్ణుచక్రము నుండి నన్ను రక్షింపుము".

*బ్రహ్మోవాచ*

*4.53 (ఏబది మూడవ శ్లోకము)*

*స్థానం మదీయం సహవిశ్వమేతత్క్రీడావసానే ద్విపరార్ధసంజ్ఞే|*

*భ్రూభంగమాత్రేణ హి సందిధక్షోః కాలాత్మనో యస్య తిరోభవిష్యతి॥7423॥*

*4.54 (ఏబది నాలుగవ శ్లోకము)*

*అహం భవో దక్షభృగుప్రధానాః ప్రజేశభూతేశసురేశముఖ్యాః|*

*సర్వే వయం యన్నియమం ప్రపన్నాః మూర్ధ్న్యర్పితం లోకహితం వహామః॥7424॥*

*అప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకు ఇట్లు వివరించెను*- "మహర్షీ! నా స్థానముగూడ అనిత్యమైన ఈ విశ్వముతోడిదే- అనగా విశ్వసృష్టితోపాటే జరిగినది. ద్విపరార్థకాలమున అనగా - ప్రళయకాలమున కాలస్వరూపుడైన భగవంతుడు తన లీలలను సమాప్తి చేయు సమయమున తన కనుసన్న మాత్రముచేతనే ఈ లోకమును కనుమరుగు గావించును. నేనును, పరమశివుడు, దక్షుడు, భృగువు మొదలగు ప్రజాపతులు, భూతపతులు, ఇంద్రాది దేవతలు, మేమందరమును ఆయన పాదములనే శరణుజొచ్చిన వారము . ఆ స్వామి ఆదేశములను శిరసావహించి, ఈ లోకముల హితముకొరకే పాటు పడుచుందుము. కనుక, ఆయన భక్తులయెడ ద్రోహము తలపెట్టినవారిని రక్షించుటకు మాకు ఎవ్వరికిని శక్తి చాలదు".

*4.55 (ఏబది ఐదవ శ్లోకము)*

*ప్రత్యాఖ్యాతో విరించేన విష్ణుచక్రోపతాపితః|*

*దుర్వాసాః శరణం యాతః శర్వం కైలాసవాసినమ్॥7425॥*

సుదర్శన చక్రమువలన తాపమునకు తట్టుకొనలేకున్న దుర్వాసుడు బ్రహ్మదేవుని మాటలకు నిరాశపడి, కైలాస పతియైన పరమేశ్వరుని శరణుజొచ్చుటకై వెళ్ళెను.

*శ్రీరుద్ర ఉవాచ*

*4.56 (ఏబది ఆరవ శ్లోకము)*

*వయం న తాత ప్రభవామ భూమ్ని యస్మిన్ పరేఽన్యేఽప్యజజీవకోశాః|*

*భవంతి కాలే న భవంతి హీదృశాః సహస్రశో యత్ర వయం భ్రమామః॥7426॥*

*శంకరుడు పలికెను* "నాయనా! మహర్షీ! అనంతశక్తి సంపన్నుడైన ఆ పరమేశ్వరునియందే బ్రహ్మాది జీవులు, వారికి సంబంధించిస వేలకొలది బ్రహ్మాండములు; మేమందరము ఈ విశ్వసృష్టి కాలమున ప్రభవించి మసలుకొనుచుందుము. ప్రళయకాలమున లీనమగు చుందుము. వేలకొలదిగాగల ఇట్టి మేము ఎల్లరము అందే పరిభ్రమించుచుందుము. కనుక, మేము ఆ శ్రీహరి విషయమున ఏమియు చేయజాలము.

*4.57 (ఏబది ఏడవ శ్లోకము)*

*అహం సనత్కుమారశ్చ నారదో భగవానజః|*

*కపిలోఽపాంతరతమో దేవలో ధర్మ ఆసురిః॥7427॥*

*4.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)*

*మరీచిప్రముఖాశ్చాన్యే సిద్ధేశాః పారదర్శనాః|*

*విదామ న వయం సర్వే యన్మాయాం మాయయావృతాః॥7428॥*

*4.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)*

*తస్య విశ్వేశ్వరస్యేదం శస్త్రం దుర్విషహం హి నః|*

*తమేవం శరణం యాహి హరిస్తే శం విధాస్యతి॥7429॥*

దుర్వాసా! నేను, సనత్కుమారుడు, నారదుడు, బ్రహ్మదేవుడు, కపిలుడు, వ్యాసుడు, దేవలుడు, ధర్ముడు, ఆసురి, మరీచి ప్రముఖులు, ఇంకను మహాత్ములైన సిద్ధులు, దార్శనికులు - మేమందరము ఆ భగవానుని మాయను ఎఱుగజాలము. ఏలయన, మేము ఆయన మాయచేత కప్పబడియుండువారమే. మహిమాన్వితుడైన ఆ సర్వేశ్వరునియొక్క ఈ చక్రముధాటికి మేమును తట్టుకొనజాలము. ఇంక దానిని నిలువరింపగల శక్తి మాకెక్కడిది? కనుక, నీవు ఆ శ్రీహరినే శరణు జొచ్చుము. ఏలయన, ఆ దేవదేవుడు శరణాగతవత్సలుడు, ఆయనయే ఈ సంకటస్థితినుండి నిన్ను రక్షింపగలడు. నీకు శుభమును చేకూర్చగలడు".

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*99వ నామ మంత్రము*

*ఓం మూలాధారైక నిలయాయై నమః*

సుషుమ్నానాడి బయలుదేరు మూల స్థానమునందు చతుర్దళపద్మములో (మూలాధార చక్రమునందు) కుండలినీ శక్తి స్వరూపిణియై విలసిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మూలాధారైక నిలయా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం మూలాధారైక నిలయాయై నమః*
అని ఉచ్చరించుచూ ఆ జగన్నాతను అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో ఉపాసించు సాధకుడు నిశ్చయముగా ఆ శ్రీమాత కృపాకటాక్షములకు పాత్రుడై అద్వైత తత్త్వమును గ్రహించి బ్రహ్మానంద భరితుడగును.

షట్చక్రములలో మొదటిది మూలాధారచక్రము. గుద స్థానమునకు పైన, లింగ స్థానమునకు క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం *లం* మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము *(బిసతంతు తనీయసీ - 111వ నామ మంత్రము)* వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొని యున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

నాలుగు దళముల మూలాధార పద్మమందు కులకుండమను బిందువులో ముఖమును కప్పుకొని నిద్రావస్థలో నున్న కుండలినీ దేవి యుండును. సుషుమ్నానాడి బయలుదేరు మూలస్థానమునందు, కుండలినీదేవి యుండుటకు మూలాధారము కనుకను, ఉపాసకుడు తన యోగసాధనలో నిద్రాణమైయున్న కుండలినీ శక్తిని జాగృతముచేసి షట్చక్రముల నధిగమించి సహస్రారము చేర్చు సుషుమ్నామార్గముయొక్క మూలస్థానములో గల ఈ చతుర్దళ పద్మమునకు మూలాధార చక్రమనియు, షట్చక్రములలో మొదటిదైన కుండలినీశక్తి సాధకుడు జాగృతము చేయగా సహస్రారమువరకూ పయనించి మరియు మూలాధారమునకు తిరిగి చేరుటచే మూలాధారమే కుండలినీశక్తి స్వస్థానమగుటచేత కుండలినీ శక్తి రూపములో నున్న శ్రీమాత *మూలాధారైక నిలయా* అని నామ ప్రసిద్ధమైనది.

సాధారణముగా కుండలినీ శక్తి మూలాధారంలో నిద్రాణమై యుండును. అందుకే జీవుడు అరిషడ్వర్గములకు లోబడి, నేను, నాది అను భావనతో ప్రాపంచిక సుఖములవైపు ఊగులాడు చుండును. యోగసాధనలో కుండలినీ శక్తి జాగృతమై షట్చక్రములధిగమించి సహస్రారముచేరుటతో అక్కడగల అమృతధారలలో తడిసిముద్దయి పరమార్థం తెలిసి నేను, నాది అనే భ్రాంతి నశించి పరబ్రహ్మము వైపు తిరుగుతాడు.

సుషమ్నా మార్గమునకు మూలస్థానమగుటచేత, షట్చక్రములకు మొదటి చక్రమగుతట చేత, ఇక్కడ తొలి పూజలందుకొను విఘ్నేశ్వరుడు అగుటచేత ఈ చతుర్దళ పద్మము మూలాధారచక్రముగాను, అట్టి మూలాధారమునందు కుండలినీ శక్తి రూపంలో ఉండు దేవి *మూలాధారైకనిలయా* అని స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మూలాధారైకనిలయాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*677వ నామ మంత్రము*

*ఓం బ్రహ్మానందాయై నమః*

మానవానందం నుండి బ్రహ్మానందం వరకూ గల ఎన్నో ఆనందములలో అన్నిటికీ పరాకాష్ఠయైనది బ్రహ్మానందము. అట్టి బ్రహ్మానంద స్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బ్రహ్మానందా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం బ్రహ్మానందాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు అన్ని ఆనందములకూ పరాకాష్ఠయైన బ్రహ్మానందమునందుటకు అవసరమయిన యోగసాధనాశక్తి, పరాశక్తిని ప్రసన్నము చేయగలుగు అత్యంత భక్తితత్పరత సంప్రాప్తమై తరించును.

జగన్మాత బ్రహ్మానంద స్వరూపిణి. అంతర్ముఖ సమారాధనాాపరుడైన సాధకుడు మూలాధారంలో నిద్రాణస్థితిలోనున్న కుండలినీ శక్తిరూపంలో గల జగన్మాతను జాగృతంచేసి షట్చక్రములు దాటించి సహస్రారములో పరమేశ్వరుని వద్దకు చేర్చి అమృతధారలలో తన్మయింపజేస్తే జగన్మాత పొందే ఆనందం చెప్పనలవికాదు. ఆనందములలోకెల్లా పరాకాష్ఠగా నిలిచిన బ్రహ్మానందమును పొందుతుంది. అంతటి బ్రహ్మానందభరితురాలైన తల్లి సాధకునికి వరాలజల్లు కురిపిస్తుంది. ఆత్మానందానుభూతిని కలుగజేస్తుంది. అంతటి బ్రహ్మానందాని పొందుతుంది కనుకనే ఆ తల్లికి *బ్రహ్మానందా* అను నామ మంత్రముతో స్తుతింపబడుచున్నది.

జగన్మాతను 365వ నామ మంత్రములో *స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః* అని జగన్మాతను స్తుతించాము. అనగా బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము.. మొదలుగా గల ఆనందముల సమూహము గలిగిన తల్లి శ్రీమాత అని తెలియుచున్నది.

ఈ ఆనందాల సమూహం తైత్తరీయోపనిషత్తులో *ఆనందవల్లి* లో ఈ ఆనందములగూర్చి ఉన్నది.

ఒక ఆనందమునకు మరొక ఆనందమునకు మధ్యగల సంబంధం తెలియాలంటే ఒక ప్రమాణం కావాలి.

ఉదా. 1000 గ్రాములు ఒక కిలోగ్రాము. అలాగే 1000 కిలోగ్రాములు ఒక మెట్రిక్ టన్ను అన్నాము.

అలాగే ఇక్కడ ఆనందముల మధ్యగల సంబంధం తెలియాలంటే అది మానుషానందంతో ప్రారంభించాలి. ఆనందములన్నిటికీ పరాకాష్ఠగా చివరగా బ్రహ్మానందము వరకూ చెప్ఫాలి. అది ఎలాగంటే

1. వంద మనుష్యానందములు అయితే ఒక మనుష్య గంధర్వానందము.

2. వంద మానుష్య గంధర్వానందములు అయితే ఒక దేవ గంధర్వానందము.

3. వంద దేవ గంధర్వా నందములు అయితే ఒక చిరలోక పితరుల ఆనందము.

4. వంద చిరలోక పితరుల ఆనందములు అయితే ఒక అజానజ దేవానందము.

5. వంద అజానజదేవానందములు అయితే ఒక కర్మదేవానందము.

6. వంద కర్మదేవానందములు అయితే ఒక దేవానందము.

7. వంద దేవానందములు అయితే ఒక ఇంద్రానందము.

8. వంద ఇంద్రానందములు అయితే ఒక బృహస్పతి ఆనందము.

9. వంద బృహస్పతి ఆనందములము అయితే ఒక ప్రజాపతి ఆనందము.

10. వంద ప్రజాపతి ఆనందములు అయితే ఒక బ్రహ్మానందము.

జగన్మాత ఆనందం బ్రహ్మానందం. మరి అంతటి బ్రహ్మానందభరిత జగన్మాత కావాలంటే *లలితా సహస్రనామస్తోత్రం* తప్పులు లేకుండా పఠించుతూ అమ్మను అంతర్ముఖంగా దర్శించండి. లేదా పదినిమిషాలలో పఠించగలిగే ఖడ్గమాలా స్తోత్రాన్ని అమ్మను అంతర్ముఖంగా దర్శించుకుంటూ పఠించండి. ఇంకేది కుదరలేదు. అమ్మకు నమస్కరించుతూ *ఓం బ్రహ్మానందాయై నమః* అని అనండి. ఏదైనా అమ్మ *అంతర్ముఖ సమారాధ్య*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*5.1 (ప్రథమ శ్లోకము)*

*ఏవం భగవతాఽఽదిష్టో దుర్వాసాశ్చక్రతాపితః|*

*అంబరీషముపావృత్య తత్పాదౌ దుఃఖితోఽగ్రహీత్॥7442॥*

*శ్రీశుకమహర్షి పలికెను* సుదర్శన చక్రజ్వాలలకు తట్టుకొనలేక విలవిలలాడుచున్న దుర్వాసుడు శ్రీహరి ఆదేశమును శిరసావహించి, అంబరీషుని కడకేగి ఆయన పాదములపై బడెను.

*5.2 (రెండవ శ్లోకము)*

*తస్య సోద్యమనం వీక్ష్య పాదస్పర్శవిలజ్జితః|*

*అస్తావీత్తద్ధరేరస్త్రం కృపయా పీడితో భృశమ్॥7443॥*

దుర్వాసుడు ఆ విధముగా తన పాదములపై మోకరిల్లుటను చూచి, అంబరీషుడు మిగుల బిడియపడెను. పిమ్మట ఆ మహారాజు ఆయనపై మిగుల జాలిపడుచు శ్రీహరి చక్రమును స్తుతింపసాగెను.

*అంబరీష ఉవాచ*

*5.3 (మూడవ శ్లోకము)*

*త్వమగ్నిర్భగవాన్ సూర్యస్త్వం సోమో జ్యోతిషాం పతిః|*
.
*త్వమాపస్త్వం క్షితిర్వ్యోమ వాయుర్మాత్రేంద్రియాణి చ॥7444॥*

*అంబరీషుడు సుదర్శన చక్రమును ఇలా వేడుచున్నాడు*

"చక్రరాజమా! నీవే తేజోమూర్తియైన అగ్నివి, సర్వసమర్థుడైన సూర్యభగవానుడవు. నక్షత్రమండలమునకు అధిపతియైన చంద్రుడవు. పృథివ్యాపస్తేజో వాయువులు, ఆకాశము అనెడి పంచమహాభూతములును, తన్మాత్రలైన శబ్దస్పర్శ రూప రసగంధములును, సర్వేంద్రియములును నీ రూపములే.

*5.4 (నాలుగవ శ్లోకము)*

*సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుతప్రియ|*

*సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే॥7445॥*

సుదర్శన చక్రమా! నీకు నమస్కారములు. భక్తవత్సులుడైన శ్రీమన్నారాయణునకు నీ పైగల ప్రీతి అపారము. వేలకొలది అంచులుగల నీవు ఎంతటి శక్తిమంతములైన అస్త్రశస్త్రములను సైతము నిర్వీర్యమొనర్చెదవు. వేయేల? నీవు జగద్రక్షకుడవు. కనుక, ఈ బ్రాహ్మణుని రక్షింపుము (శుభములను గూర్చుము).

*5.5 (ఐదవ శ్లోకము)*

*త్వం ధర్మస్త్వమృతం సత్యం త్వం యజ్ఞోఽఖిలయజ్ఞభుక్|*

*త్వం లోకపాలః సర్వాత్మా త్వం తేజః పౌరుషం పరమ్॥7446॥*

*5.6 (ఆరవ శ్లోకము)*

*నమః సునాభాఖిలధర్మసేతవే హ్యధర్మశీలాసురధూమకేతవే|*

*త్రైలోక్యగోపాయ విశుద్ధవర్చసే మనోజవాయాద్భుతకర్మణే గృణే॥7447॥*

నీవు ధర్మస్వరూపుడవు. పరబ్రహ్మము నీవే. సత్యమును రక్షించువాడవు. యజ్ఞములను నిర్వహించువాడవు, యజ్ఞస్వరూపుడవు, యజ్ఞారాధ్యుడవు నీవే. నీవు జగద్రక్షకుడవు, జగత్స్వరూపుడవు. సమస్త జీవులలోనున్న తేజస్సు, శక్తి నీవే. సునాభా! సుదర్శనచక్రమా! నీవు సకలధర్మముల మర్యాదలను కాపాడువాడవు; ఆధర్మ స్వభావముగల అసురులను రూపుమాపువాడవు. ముల్లోకములను రక్షించువాడవు, నీ తేజస్సు నిరుపమానమైనది. మనోవేగముగల నీ కర్మలు అద్భుతములు. అట్టి నీకు ప్రణామములు. నా ప్రస్తుతిని స్వీకరించి ఈ మహర్షిని రక్షింపుము.

*5.7 (ఏడవ శ్లోకము)*

*త్వత్తేజసా ధర్మమయేన సంహృతమ్తమః ప్రకాశశ్చ ధృతో మహాత్మనామ్|*

*దురత్యయస్తే మహిమా గిరాం పతే త్వద్రూపమేతత్సదసత్పరావరమ్॥7448॥*

వేదపురుషా! ధర్మమయమైన నీ తేజస్సుతో లోకమునగల చీకట్లు, అజ్ఞానము పటాపంచలగును. సూర్యచంద్రాగ్నులను ప్రకాశింపజేయువాడవు నీవే. నీ మహిమ అపారము, అధిగమింపరానిది. నీవు (సత్+అసత్) సదసత్స్వరూపుడవు (చిదచిదాత్మకమైన ఈ జగత్తు నీ స్వరూపమే).

*5.8 (ఎనిమిదవ శ్లోకము)*

*యదా విసృష్టస్త్వమనంజనేన వై బలం ప్రవిష్టోఽజిత దైత్యదానవమ్|*

*బాహూదరోర్వంఘ్రిశిరోధరాణి వృక్ణన్నజస్రం ప్రధనే విరాజసే॥7449॥*

అజేయచక్రమా! జ్ఞానస్వరూపుడైన శ్రీహరి నిన్ను ఆదేశించినంతనే నీవు విజృంభించి,దైత్యదానవుల సేనలలో ప్రవేశించి, యుద్ధరంగమున వారి బాహువులను, ఉదరములను ఊరువులను (తొడలను), పాదములను, కంఠములను మిగుల వేగముగ తుత్తునియలు గావించుచు అన్నిచోట్ల నీవే అగుపడుచుందువు.

*5.9 (తొమ్మిదవ శ్లోకము)*

*స త్వం జగత్త్రాణఖలప్రహాణయే నిరూపితః సర్వసహో గదాభృతా|*

*విప్రస్య చాస్మత్కులదైవహేతవే విధేహి భద్రం తదనుగ్రహో హి నః॥7450॥*

సుదర్శనా, విశ్వరక్షకా! దుష్టులను శిక్షించి సాధువులను రక్షించుటకై గదాధరూడైన శ్రీమన్నారాయణునిచే నియుక్తుడవైన నీవు శరణాగతుల అపరాధములను అన్నింటిని సహించువాడవు. మా వంశసౌభాగ్యమును పరివృద్ధి చేయుటకై ఈ విప్రుని కాపాడుము (విప్రునకు హాని కలిగినచో మా వంశము నశించును) ఈ దుర్వాసుని రక్షించుటయే మమ్ములను అనుగ్రహించుటయగును.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*677వ నామ మంత్రము*

*ఓం బలిప్రియాయై నమః*

జ్ఞానులు, అరిషడ్వర్గములను జయించిన జితేంద్రియులనిన ప్రీతిగలిగిన జగన్మాతకు నమస్కారము.

ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి యనిన ప్రీతి గలిగిన పరమేశ్వరికి నమస్కారము.

పూజా సమయములో సమర్పింపబడు వివిధ పూజాద్రవ్యములనిన ఇష్టపడు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బలిప్రియా* అను నాలుగు అక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం బలిప్రియాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకునకు సర్వాభీష్ట సిద్ధిగలుగును.

జగన్మాతకు మనస్పూర్తిగా *పత్రం పుష్పం ఫలం తోయం* అని భగవద్గీతలో చెప్పినట్లు సమర్పించితే ఆ పూజాద్రవ్యమును అత్యంత ప్రీతిగా స్వీకరించి అమ్మ బ్రహ్మానందభరితురాలై అనుగ్రహిస్తుంది.

దేవీ భాగవతంలో కోడి, పంది, ఎనుబోతు, మేక వంటి జంతు బలులు ఈయవచ్చునని గలదు. ఆ ప్రకారం అటువంటి బలులు అనిన జగన్మాతకు అత్యంత ప్రీతిని కలిగించును.

వివిధ వర్ణముల వారు అమ్మవారికి సమర్పించు నివేదనలు: బ్రాహ్మణుడు గుమ్మడి పండును, క్షత్రియుడు చెఱకుగడలును, వైశ్యుడు మారేడు ఫలమును, శూద్రుడు నారికేళము సమర్పింతురు. వాటిని స్వీకరించి దేవి బ్రహ్మానందమునందును.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం బలిప్రియాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*677వ నామ మంత్రము*

*ఓం బలిప్రియాయై నమః*

జ్ఞానులు, అరిషడ్వర్గములను జయించిన జితేంద్రియులనిన ప్రీతిగలిగిన జగన్మాతకు నమస్కారము.

ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి యనిన ప్రీతి గలిగిన పరమేశ్వరికి నమస్కారము.

పూజా సమయములో సమర్పింపబడు వివిధ పూజాద్రవ్యములనిన ఇష్టపడు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బలిప్రియా* అను నాలుగు అక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం బలిప్రియాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకునకు సర్వాభీష్ట సిద్ధిగలుగును.

జగన్మాతకు మనస్పూర్తిగా *పత్రం పుష్పం ఫలం తోయం* అని భగవద్గీతలో చెప్పినట్లు సమర్పించితే ఆ పూజాద్రవ్యమును అత్యంత ప్రీతిగా స్వీకరించి అమ్మ బ్రహ్మానందభరితురాలై అనుగ్రహిస్తుంది.

దేవీ భాగవతంలో కోడి, పంది, ఎనుబోతు, మేక వంటి జంతు బలులు ఈయవచ్చునని గలదు. ఆ ప్రకారం అటువంటి బలులు అనిన జగన్మాతకు అత్యంత ప్రీతిని కలిగించును.

వివిధ వర్ణముల వారు అమ్మవారికి సమర్పించు నివేదనలు: బ్రాహ్మణుడు గుమ్మడి పండును, క్షత్రియుడు చెఱకుగడలును, వైశ్యుడు మారేడు ఫలమును, శూద్రుడు నారికేళము సమర్పింతురు. వాటిని స్వీకరించి దేవి బ్రహ్మానందమునందును.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం బలిప్రియాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*100వ నామ మంత్రము*

*ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః*

మూలాధారము నందు జాగృతమై బయలుదేరి స్వాధిష్ఠాన సంబంధమైన బ్రహ్మగ్రంథిని భేదిస్తూ, సాధకుని బుద్ధిని ఆవహించి యున్న మాయ తొలగి, స్వస్వరూపజ్ఞాన ప్రకాశమునకు సంకేతముగా విరాజిల్లు కుండడలినీ శక్తి స్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బ్రహ్మగ్రంథి విభేదినీ* అను (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః* అని ఉచ్చరిస్తూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకునికి ఆ తల్లి ఆత్మజ్ఞానానుభూతిని కలుగజేసి తరింపజేయును.

గ్రంథి అంటే ముడి.మూలాధారాది షట్చక్రములలో మూడు చక్రములందు ఆద్యంతములలో రెండేసి చొప్పున గ్రంథులు ఉండును. ఈ బ్రహ్మగ్రంథులు స్వాధిష్ఠాన చక్రమందుండును. అనగా మూలాధార స్వాధిష్థాన చక్రములు రెండింటికి పైన ఒక గ్రంథియు, స్వాధిష్ఠానచక్రమునకు క్రింద ఒక గ్రంథియు ఉండును. ఈ రెండు గ్రంథులకును కలిపి బ్రహ్మగ్రంథి యని పేరు. రెండేసి చక్రములకు ఒక్కొక్క గ్రంథియుండును. మానవుని బుద్ధిని ఆవహించి మాయ ఉండును. నేను, నాది, నావాళ్ళు అను మాయలో కొట్టుమిట్టాడుతూ భౌతిక సుఖములవైపు దృష్టి సారించి యుండును. ధనము సంపాదించాలి. వస్తు వాహనాలు కొనుక్కోవాలి. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అను దృష్టితప్ప వేరేమి ఎరుగని స్థితిలో ఉండును. సత్యమైనది, నిత్యమైనది పరమాత్మ ఒకటి గలదు. అక్కడ ఉండే ఆనందం ఈ భౌతికవ్యామోహములకన్నా అతీతమైనది అన్న ఆలోచన ఉండదు. సాధకుడు తన యోగశక్తితో మూలాధారమందు నిద్రాణమై, మూడున్నర చుట్టలు చుట్టుకొనియున్న కుండలినీ శక్తిని జాగృతము చేసి ఊర్ధ్వముఖముగా నడిపిస్తే ముందుగా భేదింపబడునది బ్రహ్మగ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి భేదింప బడడంతో బుద్ధిని ఆవహించి ఉన్న మాయ తొలగుతుంది. స్వస్వరూప జ్ఞానము కలుగుతుంది. సృష్ట్యాది సంబంధములు భేదింపబడతాయి. అన్ని ఆనందాలను మించిన బ్రహ్మానందము ఒకటి ఉందనియు, పునర్జన్మరహితమైన ముక్తి అక్కడ లభించుననియు గ్రహించుతాడు. కుండలినీ శక్తి రూపిణియైన జగన్మాత బ్రహ్మగ్రంథి భేదనము చేసి జీవునికి బుద్ధిని ఆవహించిన మాయను తొలగించి, స్వస్వరూప జ్ఞానమును కలిగించుతుంది గనుక ఆ పరమేశ్వరి *బ్రహ్మగ్రంథి విభేదినీ* యని స్తుతింపబడుతున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః* అని అనవలెను.

*5.10 (పదియవ శ్లోకము)*

*యద్యస్తి దత్తమిష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠితః|*

*కులం నో విప్రదైవం చేద్ద్విజో భవతు విజ్వరః॥7451॥*

*5.11 (పదకొండవ శ్లోకము)*

*యది నో భగవాన్ ప్రీత ఏకః సర్వగుణాశ్రయః|*

*సర్వభూతాత్మభావేన ద్విజో భవతు విజ్వరః॥7452॥*

చక్రమా! నేను దానధర్మములను, యజ్ఞయాగములను ఆచరించి యున్నచో, స్వధర్మపాలనమును చక్కగా అనుష్ఠించియున్నచో, మా వంశమువారు విప్రులసు దైవస్వరూపులుగా సేవించియున్నచో, ఈ బ్రాహ్మణుని తాపమును హరింపుము. మేము సకల ప్రాణులను దైవస్వరూపులుగా భజించు చుందుము. సకల కల్యాణగుణములకు నెలవైన దేవాది దేవుడైన విష్ణుభగవానుడు మాయెడ ప్రసన్నుడై యున్నచో, ఈ విప్రుని తాపము ఉపశమించుగాక.

*శ్రీశుక ఉవాచ*

*5.12 (పండ్రెండవ శ్లోకము)*

*ఇతి సంస్తువతో రాజ్ఞో విష్ణుచక్రం సుదర్శనమ్|*

*అశామ్యత్సర్వతో విప్రం ప్రదహద్రాజయాచ్ఞయా॥7453॥*

*5.13 (పదమూడవ శ్లోకము)*

*స ముక్తోఽస్త్రాగ్నితాపేన దుర్వాసాః స్వస్తిమాంస్తతః|*

*ప్రశశంస తముర్వీశం యుంజానః పరమాశిషః॥7454॥*

*శ్రీ శుకయోగి నుడివెను* ఇట్లు ప్రస్తుతించిన అంబరీషుని యెడ శ్రీహరి సుదర్శనచక్రము ప్రసన్నమయ్యెను. ఆ రాజు అభ్యర్థనను అనుసరించి విప్రుని తాపమును చల్లార్చెను, ఆయనకు అన్ని విధములుగా ప్రశాంతిని చేకూర్చెను. ఆ దుర్వాసుడు చక్రజ్వాలల తాపమునుండి విముక్తుడైన వెంటనే ఆయన చిత్తము మిక్కిలి స్వస్థతను పొందెను. పిమ్మట అతడు ఆ అంబరీషమహారాజును ఎంతయు కొనియాడుచు ఆయనకు శుభాశీస్సులు పలికెను.

*దుర్వాసా ఉవాచ*

*5.14 (పదునాలుగవ శ్లోకము)*

*అహో అనంతదాసానాం మహత్త్వం దృష్టమద్య మే|*

*కృతాగసోఽపి యద్రాజన్ మంగలాని సమీహసే॥7455॥*

*5.15 (పదునైదవ శ్లోకము)*

*దుష్కరః కో ను సాధూనాం దుస్త్యజో వా మహాత్మనామ్|*

*యైః సంగృహీతో భగవాన్ సాత్వతామృషభో హరిః॥7456॥*

*దుర్వాసుడు పలికెను* అంబరీష మహారాజా! ఆహా! భగవద్భక్తులయొక్క మహిమను నేను స్వయముగా చూచితిని. ఇది మిగుల ఆశ్చర్యకరము. నేను నీ యెడ అపరాధమొనర్చినను "నీవు నాకు శుభములనే కాంక్షించితివి. భక్తవత్సలుడైన శ్రీహరి పాదపద్మములనే త్రికరణ శుద్ధిగా నమ్ముకొనిన (దైవానుగ్రహమునకు పాత్రులైన), మహాత్ములకు ఈ లోకమున అసాధ్యము అనునదియే లేదు. అట్టి సత్పురుషులకు త్యజింపరానిదియే ఉండదు. ఏలయన భగవంతుడే వశుడై యున్నప్పుడు వారికి అనిత్యములైస ఐహిక వస్తువులతో పనియేమి?

*5.16 (పదహారవ శ్లోకము)*

*యన్నామశ్రుతిమాత్రేణ పుమాన్ భవతి నిర్మలః|*

*తస్య తీర్థపదః కిం వా దాసానామవశిష్యతే॥7457॥*

జగన్నాథుని పవిత్రనామమును విన్నంతమాత్రముననే మనుష్యుని పాపములన్నియును పటాపంచలగును. ఇంక గంగాది సకల పుణ్యతీర్థములకు ఆశ్రయములైన భగవంతుని పాదములను సేవించువారికి మఱియొక కర్తవ్యమేముండును? భగవత్సేవలలోనే వారు కృతార్థులగుదురు.

*5.17 (పదిహేడవ శ్లోకము)*

*రాజన్ననుగృహీతోఽహం త్వయాతికరుణాత్మనా|*

*మదఘం పృష్ఠతః కృత్వా ప్రాణా యన్మేఽభిరక్షితాః॥7458॥*

రాజా! దయార్ధ్రహృదయుడైన (మిగుల జాలిగుండె గల) నీవు నన్ను అనుగ్రహించితివి. అపరాధములను అపరాధములుగా లెక్కింపక నాకు ప్రాణభిక్ష పెట్టితివి.

*5.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*రాజా తమకృతాహారః ప్రత్యాగమనకాంక్షయా |*

*చరణావుపసంగృహ్య ప్రసాద్య సమభోజయత్॥7459॥*

*5.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*సోఽశిత్వాఽఽదృతమానీతమాతిథ్యం సార్వకామికమ్|*

*తృప్తాత్మా నృపతిం ప్రాహ భుజ్యతామితి సాదరమ్॥7460॥*

పరీక్షిన్మహారాజా! దుర్వాసుని రాకకొరకు నిరీక్షించుచు అంబరీషుడు ఆయన వచ్చునంతవరకును ఆహారమును స్వీకరింపకయే యుండెను. ఆ ముని వచ్చినంతనే ఆ మహాత్మునకు పాదాభివందనము గావించి, ప్రసన్నునిగా జేసికొని, ఆయనను షడ్రసోపేత భోజన పదార్థములతో సంతృప్తిపరచెను. అంబరీషుడు సాదరముగా సమకూర్చిన మృష్టాన్నభోజనమునకు ఆ మహాముని ఎంతయు సంతుష్టుడై, 'రాజా! నీవును సంతోషముతో భుజింపుము' అని నుడివెను.

PVD Subrahmanyam చెప్పారు...

*5.20 (ఇరువదియవ శ్లోకము)*

*ప్రీతోఽస్మ్యనుగృహీతోఽస్మి తవ భాగవతస్య వై|*

*దర్శనస్పర్శనాలాపైరాతిథ్యేనాత్మమేధసా॥7461॥*

*5.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*కర్మావదాతమేతత్తే గాయంతి స్వఃస్త్రియో ముహుః|*

*కీర్తిం పరమపుణ్యాం చ కీర్తయిష్యతి భూరియమ్॥7462॥*

ఆ మహర్షి ఇంకను ఇట్లనెను - మహారాజా! నీవు పరమభాగవతోత్తముడవు. నీ దర్శనస్పర్శనాదులకును, మధురాలాపములకును నేను మిగుల ముగ్ధుడనైతిని. నీవు భగవదర్పిత బుద్ధితో ఇచ్చిన ఈ ఆతిథ్యముచే నేను అనుగ్రహింపబడితిని. పరమ పవిత్రములైన నీ కీర్తి ప్రతిష్ఠలను ఈ భూలోకవాసులు అందరును బహుధా కీర్తింతురు. అంతేగాదు, ఆ దేవలోకమునగల భామినులు సైతముు నిర్మలమైన (ఉజ్జ్వలమైన) నీ చరితమును గానము చేయుదురు.

*శ్రీశుక ఉవాచ*

*5.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ఏవం సంకీర్త్య రాజానం దుర్వాసాః పరితోషితః|*

*యయౌ విహాయసామంత్ర్య బ్రహ్మలోకమహైతుకమ్॥7463॥*

*శ్రీశుకుడు పలికెను* ఆ మహారాజుయొక్క ఆతిథ్యమునకును, సౌజన్యమునకును సంతుష్టుడైన దుర్వాసుడు ఈ విధముగా అంబరీషుని మిక్కిలి కొనియాడెను. పిదప ఆ ముని ఆ మహారాజును వీడ్కొని, నిష్కామకర్మలచే లభ్యమగు బ్రహ్మలోకమునకును ఆకాశమార్గమున వెళ్ళెను.

*5.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*సంవత్సరోఽత్యగాత్తావద్యావతా నాగతో గతః|*

*మునిస్తద్దర్శనాకాంక్షో రాజాబ్భక్షో బభూవ హ॥7464॥*

పరీక్షిన్మహారాజా, దుర్వాసమహర్షి సుదర్శనచక్రము ధాటికి భీతిల్లి ఆత్మ రక్షణకై ఆయా లోకములకు తిరిగి వచ్చుటతో ఒక సంవత్సరము గడచెను. అంతవఱకును అంబరీషుడు ఆ మునిరాకకై నిరీక్షించుచు జలభక్షణము తోడనే గడపెను.

*5.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*గతేఽథ దుర్వాససి సోఽమ్బరీషో ద్విజోపయోగాతిపవిత్రమాహరత్|*

*ఋషేర్విమోక్షం వ్యసనం చ బుద్ధ్వా మేనే స్వవీర్యం చ పరానుభావమ్॥7465॥*

దుర్వాసుడు వెళ్ళినంతనే అంబరీషుడు, అతిథియై వచ్చిన ఆ మహాముని భుజింపగా మిగిలిన పవిత్రములైన ఆహార పదార్థములను స్వీకరించెను. ఆ మహర్షి దుఃఖమునకు లోనగుటయు, దానినుండి విముక్తుడగుటయును తనవలననే ఘటిల్లినను, అదంతయును భగవన్మహిమయే యని ఆ ప్రభువు తలపోసెను. సత్పురుషుల లక్షణమే అంత.

*5.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*ఏవం విధానేకగుణః స రాజా పరాత్మని బ్రహ్మణి వాసుదేవే|*

*క్రియాకలాపైః సమువాహ భక్తిం యయాఽఽవిరించ్యాన్నిరయాంశ్చకార॥7466॥*

ఇట్లు పెక్కు సద్గుణములకు నిధియైన అంబరీషుడు వర్ణాశ్రమోచితములైన తన ధర్మకార్యములను అన్నింటిని, పరాత్పరుడు, పరబ్రహ్మము ఐన వాసుదేవునియందలి అనన్యభక్తితోడనే నిర్వహించెను. అతడు బ్రహ్మలోకప్రాప్తి వఱకుగల సకలభోగములను (ఐహికాముష్మిక సుఖములను) నరకతుల్యములుగా భావించెను.

*5.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*అథాంబరీషస్తనయేషు రాజ్యం సమానశీలేషు విసృజ్య ధీరః|*

*వనం వివేశాత్మని వాసుదేవే మనో దధద్ధ్వస్తగుణప్రవాహః॥7467॥*.

జితేంద్రియుడైన అంబరీషుడు రాజ్యభారమును అంతయును తనవలె సచ్ఛీలురైన తన కుమారులకు అప్పగించి, వనములకు చేరెను. అక్కడ ఆత్మస్వరూపుడైన పరమాత్మయందే తన మనస్సును లగ్నమొనర్చి అతడు త్రిగుణాత్మకమైన సంసారము నుండి విముక్తు డాయెను

*5.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*ఇత్యేతత్పుణ్యమాఖ్యానమంబరీషస్య భూపతేః|*

*సంకీర్తయన్ననుధ్యాయన్ భక్తో భగవతో భవేత్॥7468॥*

ఈ అంబరీష మహారాజు యొక్క పవిత్రవృత్తాంతమును భక్తి శ్రద్ధలతో కీర్తించువారును, స్మరించువారును భాకవతోత్తములు అగుదురు.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే పంచమోఽధ్యాయః (5)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఐదవ అధ్యాయము (5)

PVD Subrahmanyam చెప్పారు...

*5.20 (ఇరువదియవ శ్లోకము)*

*ప్రీతోఽస్మ్యనుగృహీతోఽస్మి తవ భాగవతస్య వై|*

*దర్శనస్పర్శనాలాపైరాతిథ్యేనాత్మమేధసా॥7461॥*

*5.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*కర్మావదాతమేతత్తే గాయంతి స్వఃస్త్రియో ముహుః|*

*కీర్తిం పరమపుణ్యాం చ కీర్తయిష్యతి భూరియమ్॥7462॥*

ఆ మహర్షి ఇంకను ఇట్లనెను - మహారాజా! నీవు పరమభాగవతోత్తముడవు. నీ దర్శనస్పర్శనాదులకును, మధురాలాపములకును నేను మిగుల ముగ్ధుడనైతిని. నీవు భగవదర్పిత బుద్ధితో ఇచ్చిన ఈ ఆతిథ్యముచే నేను అనుగ్రహింపబడితిని. పరమ పవిత్రములైన నీ కీర్తి ప్రతిష్ఠలను ఈ భూలోకవాసులు అందరును బహుధా కీర్తింతురు. అంతేగాదు, ఆ దేవలోకమునగల భామినులు సైతముు నిర్మలమైన (ఉజ్జ్వలమైన) నీ చరితమును గానము చేయుదురు.

*శ్రీశుక ఉవాచ*

*5.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ఏవం సంకీర్త్య రాజానం దుర్వాసాః పరితోషితః|*

*యయౌ విహాయసామంత్ర్య బ్రహ్మలోకమహైతుకమ్॥7463॥*

*శ్రీశుకుడు పలికెను* ఆ మహారాజుయొక్క ఆతిథ్యమునకును, సౌజన్యమునకును సంతుష్టుడైన దుర్వాసుడు ఈ విధముగా అంబరీషుని మిక్కిలి కొనియాడెను. పిదప ఆ ముని ఆ మహారాజును వీడ్కొని, నిష్కామకర్మలచే లభ్యమగు బ్రహ్మలోకమునకును ఆకాశమార్గమున వెళ్ళెను.

*5.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*సంవత్సరోఽత్యగాత్తావద్యావతా నాగతో గతః|*

*మునిస్తద్దర్శనాకాంక్షో రాజాబ్భక్షో బభూవ హ॥7464॥*

పరీక్షిన్మహారాజా, దుర్వాసమహర్షి సుదర్శనచక్రము ధాటికి భీతిల్లి ఆత్మ రక్షణకై ఆయా లోకములకు తిరిగి వచ్చుటతో ఒక సంవత్సరము గడచెను. అంతవఱకును అంబరీషుడు ఆ మునిరాకకై నిరీక్షించుచు జలభక్షణము తోడనే గడపెను.

*5.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*గతేఽథ దుర్వాససి సోఽమ్బరీషో ద్విజోపయోగాతిపవిత్రమాహరత్|*

*ఋషేర్విమోక్షం వ్యసనం చ బుద్ధ్వా మేనే స్వవీర్యం చ పరానుభావమ్॥7465॥*

దుర్వాసుడు వెళ్ళినంతనే అంబరీషుడు, అతిథియై వచ్చిన ఆ మహాముని భుజింపగా మిగిలిన పవిత్రములైన ఆహార పదార్థములను స్వీకరించెను. ఆ మహర్షి దుఃఖమునకు లోనగుటయు, దానినుండి విముక్తుడగుటయును తనవలననే ఘటిల్లినను, అదంతయును భగవన్మహిమయే యని ఆ ప్రభువు తలపోసెను. సత్పురుషుల లక్షణమే అంత.

*5.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*ఏవం విధానేకగుణః స రాజా పరాత్మని బ్రహ్మణి వాసుదేవే|*

*క్రియాకలాపైః సమువాహ భక్తిం యయాఽఽవిరించ్యాన్నిరయాంశ్చకార॥7466॥*

ఇట్లు పెక్కు సద్గుణములకు నిధియైన అంబరీషుడు వర్ణాశ్రమోచితములైన తన ధర్మకార్యములను అన్నింటిని, పరాత్పరుడు, పరబ్రహ్మము ఐన వాసుదేవునియందలి అనన్యభక్తితోడనే నిర్వహించెను. అతడు బ్రహ్మలోకప్రాప్తి వఱకుగల సకలభోగములను (ఐహికాముష్మిక సుఖములను) నరకతుల్యములుగా భావించెను.

*5.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*అథాంబరీషస్తనయేషు రాజ్యం సమానశీలేషు విసృజ్య ధీరః|*

*వనం వివేశాత్మని వాసుదేవే మనో దధద్ధ్వస్తగుణప్రవాహః॥7467॥*.

జితేంద్రియుడైన అంబరీషుడు రాజ్యభారమును అంతయును తనవలె సచ్ఛీలురైన తన కుమారులకు అప్పగించి, వనములకు చేరెను. అక్కడ ఆత్మస్వరూపుడైన పరమాత్మయందే తన మనస్సును లగ్నమొనర్చి అతడు త్రిగుణాత్మకమైన సంసారము నుండి విముక్తు డాయెను

*5.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*ఇత్యేతత్పుణ్యమాఖ్యానమంబరీషస్య భూపతేః|*

*సంకీర్తయన్ననుధ్యాయన్ భక్తో భగవతో భవేత్॥7468॥*

ఈ అంబరీష మహారాజు యొక్క పవిత్రవృత్తాంతమును భక్తి శ్రద్ధలతో కీర్తించువారును, స్మరించువారును భాకవతోత్తములు అగుదురు.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే పంచమోఽధ్యాయః (5)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఐదవ అధ్యాయము (5)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*100వ నామ మంత్రము*

*ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః*

మూలాధారము నందు జాగృతమై బయలుదేరి స్వాధిష్ఠాన సంబంధమైన బ్రహ్మగ్రంథిని భేదిస్తూ, సాధకుని బుద్ధిని ఆవహించి యున్న మాయ తొలగి, స్వస్వరూపజ్ఞాన ప్రకాశమునకు సంకేతముగా విరాజిల్లు కుండడలినీ శక్తి స్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బ్రహ్మగ్రంథి విభేదినీ* అను (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః* అని ఉచ్చరిస్తూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకునికి ఆ తల్లి ఆత్మజ్ఞానానుభూతిని కలుగజేసి తరింపజేయును.

గ్రంథి అంటే ముడి.మూలాధారాది షట్చక్రములలో మూడు చక్రములందు ఆద్యంతములలో రెండేసి చొప్పున గ్రంథులు ఉండును. ఈ బ్రహ్మగ్రంథులు స్వాధిష్ఠాన చక్రమందుండును. అనగా మూలాధార స్వాధిష్థాన చక్రములు రెండింటికి పైన ఒక గ్రంథియు, స్వాధిష్ఠానచక్రమునకు క్రింద ఒక గ్రంథియు ఉండును. ఈ రెండు గ్రంథులకును కలిపి బ్రహ్మగ్రంథి యని పేరు. రెండేసి చక్రములకు ఒక్కొక్క గ్రంథియుండును. మానవుని బుద్ధిని ఆవహించి మాయ ఉండును. నేను, నాది, నావాళ్ళు అను మాయలో కొట్టుమిట్టాడుతూ భౌతిక సుఖములవైపు దృష్టి సారించి యుండును. ధనము సంపాదించాలి. వస్తు వాహనాలు కొనుక్కోవాలి. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అను దృష్టితప్ప వేరేమి ఎరుగని స్థితిలో ఉండును. సత్యమైనది, నిత్యమైనది పరమాత్మ ఒకటి గలదు. అక్కడ ఉండే ఆనందం ఈ భౌతికవ్యామోహములకన్నా అతీతమైనది అన్న ఆలోచన ఉండదు. సాధకుడు తన యోగశక్తితో మూలాధారమందు నిద్రాణమై, మూడున్నర చుట్టలు చుట్టుకొనియున్న కుండలినీ శక్తిని జాగృతము చేసి ఊర్ధ్వముఖముగా నడిపిస్తే ముందుగా భేదింపబడునది బ్రహ్మగ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి భేదింప బడడంతో బుద్ధిని ఆవహించి ఉన్న మాయ తొలగుతుంది. స్వస్వరూప జ్ఞానము కలుగుతుంది. సృష్ట్యాది సంబంధములు భేదింపబడతాయి. అన్ని ఆనందాలను మించిన బ్రహ్మానందము ఒకటి ఉందనియు, పునర్జన్మరహితమైన ముక్తి అక్కడ లభించుననియు గ్రహించుతాడు. కుండలినీ శక్తి రూపిణియైన జగన్మాత బ్రహ్మగ్రంథి భేదనము చేసి జీవునికి బుద్ధిని ఆవహించిన మాయను తొలగించి, స్వస్వరూప జ్ఞానమును కలిగించుతుంది గనుక ఆ పరమేశ్వరి *బ్రహ్మగ్రంథి విభేదినీ* యని స్తుతింపబడుతున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*101వ నామ మంత్రము*

*ఓం మణిపూరాంతరుదితాయై నమః*

బ్రహ్మగ్రంథి భేదన మనంతరము, మూలాధారస్వాధిష్ఠానములకు ప్రతీకయై దశదళములుగలిగి జలతత్త్వాత్మకముతో నాభిస్థానము నందుండు మణిపూరక చక్రమునందు వివిధ రకముల మణులతో సమయాచారులచే పూజలందుకొనుచూ తేజరిల్లుచున్న జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మణిపూరాంత రుదితా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం మణిపూరాంతరుదితాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తప్రపత్తులతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు సర్వాభీష్టసిద్ధిని పొంది ధన్యుడగును.

మూలాధారమునందు నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తిని సాధకుడు తన యోగదీక్షతో జాగృతమొనర్చగా, సుషుమ్నా మార్గములో ఊర్ధ్వముఖముగా పయనించుచూ స్వాధిష్ఠానము దాటి బ్రహ్మగ్రంథిని భేదించి మణిపూరక చక్రమునందు కుండలినీ శక్తిని ప్రవేశింపజేయును.
మూలాధార చక్రము నాలుగు దళముల పద్మము. స్వాధిష్ఠాన చక్రము ఆరుదళముల పద్మము. మణిపూరకచక్రము మూలాధారస్వాధిష్ఠాన చక్రములకు ప్రతీకగా పదిదళములుండును. మణిపూరక చక్రం నాభిస్థానము నందుండును. నాభిస్థానము అంటే తల్లీ బిడ్డల భౌతిక బంధమునకు ప్రతీక. అందుచేత పిండోత్పత్తి, గర్భస్థ శిశువు అభివృద్ధిచెందు గర్భాశయముకూడా ఇచ్చటనే ఉండును. గర్భస్థ శిశువు తొమ్మిదినెలల ఎదుగుదల మణిపూరక చక్రము వల్లనే జరుగుతుంది. ఇచ్చట కుండలినీ శక్తిరూపిణియైన శ్రీమాత సమయాచారులనుండి వివిధ రకముల మణులచే పూజలందు కొనును. మణిపూరక చక్రము పంచభూతాత్మక తత్త్వములలో అగ్నితత్ప్వమా లేక జలతత్త్వమా అన్నది రెండు విభన్న వాదనలు ఉన్నమాట వాస్తవమే. కాని ఇక్కడ ఆది శంకరుల ఈ క్రింది సౌందర్యలహరిలో 9శ్లోకం తీసుకుంటే జలతత్త్వముగానే భావించవలెను. కాని మణిపూరక చక్రము పదిదళములతో మూలాధార(4)+ స్వాధిష్ఠానముల (6) సంకేతముగా ఉన్నది గనుక స్వాధిష్ఠానము యొక్క అగ్నితత్త్వం కూడా కొందరు జోడించి మణిపూరక చక్రమునకు అగ్ని మరియు జలతత్త్వములను చెపుతారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సౌందర్యలహరి 9వ శ్లోకము.

*మహీం మూలాధారే - కమపి మణిపూరే హుతవహం*

*స్థితం స్వధిష్టానే - హృది మరుత మాకాశ ముపరి |*

*మనో‌உపి భ్రూమధ్యే - సకలమపి భిత్వా కులపథం*

*సహస్రారే పద్మే - స హరహసి పత్యా విహరసే ||*

అమ్మా..మూలాధార చక్రమందలి భూతత్వాన్ని దాటి , *మణిపూరక చక్రం లోని జలతత్వాన్ని దాటి*, *స్వాదిష్ఠాన చక్రంలోని అగ్నితత్వాన్ని* అధిగమించి,అనాహత చక్రంలోని వాయుతత్వాన్ని దాటి,విశుద్ద చక్రంలోని ఆకాశతత్వాన్ని దాటి, ఆజ్ఞాచక్రంలోని మనస్తత్వాన్ని దాటి,సుషుమ్నా మార్గమును ఛేదించి అలా పైకి ప్రయాణించి,సహస్రార పద్మచక్రంలో నీ భర్త అయిన పరమశివునితో కలసి సదా విహరించుచున్నావు.
(పంచభూతముల వరుస *పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్* అన్న ఆధారంతో ఆ తత్వముల వరుసతో ఇచట చక్రములను చూపుట జరిగినది. అసలు *మూలాధార,స్వాధిష్ఠాన,మణిపూరక,అనాహత,విశుద్ధ, ఆజ్ఞా* చక్రముల వరుసక్రమంలో అమ్మ మన శరీరంలో గుద లింగ,మధ్యస్థానాల్లో 3 చక్రాలు,హృదయ,కంఠ,భ్రూమధ్య స్థానాల్లో 3 చక్రాలు మొత్తం 6 చక్రముల పైన,బ్రహ్మరంధ్ర ప్రదేశములో ఉన్న సహస్రారచక్రంలో అమ్మ శివునితో కలసి విహరించుచుండును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మణిపూరక చక్రము సోమసూర్యాగ్నుల గుణం గలిగి ఉండడం చేత మణిలాగ ప్రకాశిస్తుంది గనకు మణిపూరక చక్రమని పేరు గలదని భావించవచ్చు.

పంచభూతాలలో మొదటిది పృథివీ తత్త్వము. ఇది మూలాధారము, పృథివీ తత్త్వాత్మకమైనది. రెండవది జలతత్త్వము, మణిపూరక చక్రము జలతత్త్వము గలది. అందుచే పంచభూతాల వరుసలో రెండవది మణిపూరక చక్రము అగుతుంది కాని షట్చక్రముల వరుసలో (సుషుమ్నా మార్గము వరుసలో) మూడవది.

సమయాచారులు చతుర్విధైక్యసంధానము చేసినవారికి జగన్మాత చతుర్భుజగాను, షడ్విధైక్య సంధానము చేసినవారికి దశభుజగాను దర్శనమిస్తుంది.

చతుర్విధైక్యము, షడ్విధౌక్యముల వివరణకు *సమయాచార తత్పరా*(98వ నామ మంత్రము చూడగలరు).

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మూలాధారైక నిలయాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*678వ నామ మంత్రము*

*ఓం భాషారూపాయై నమః*

సంస్కృత ప్రాకృతాది భాషలు స్వరూపముగా గలదిగాను, భక్తుల మనోభావములనే భాషలకు కూడా తానే స్వరూపిణియై, భాషలచే తానున్నానని నిరూపితమైన సాక్షాత్ వాగ్దేవీ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భాషారూపా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భాషారూపాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు పరిపూర్ణమైన సరస్వతీ కటాక్షము లభించి చతుష్షష్టి విద్యలలో తన వృత్తికిని ప్రవృత్తికిని సంబంధించిన విద్యలో ప్రావీణ్యతనందుకొనును. సుఖసంతోషములతో జీవనమును కొనసాగించుచూ, ఆ పరమేశ్వరీ నామ స్మరణలోకూడా నిమగ్నుడై జన్మ ధన్యతనందును.

శ్రీమాత మువురమ్మల మూలపుటమ్మ. అనగా లక్ష్మీ, వాణీ, పార్వతిల త్రిశక్తి స్వరూపిణి. అందుచే తనలో చదువుల తల్లి అయిన సరస్వతీ రూపము గూడా తనలో గలదు గనుక, సంస్కృత, ప్రాకృతాది భాషల స్వరూపిణిగా, *భాషారూపా* అని స్తుతింపబడుచున్నది.

ఒక తమిళుడు, ఒక ఉత్తర హిందుస్థానము వ్యక్తి, ఆంధ్రుడు కలిసి అమ్మవారి ఆలయానికి వెళ్ళారు. ముగ్గురూ వారి వారి భాషల్లో అమ్మవారికి నమస్కరిస్తారు. కోరికలు కోరుకుంటారు. మూడు భాషలవారినీ అమ్మవారు వారి ప్రార్థనలు స్వీకరించింది. ముగ్గురినీ అనుగ్రహిస్తుంది. ఇంకో మూగవాడు వచ్చి అమ్మవారికి సైగలతోనే ప్రార్థిస్తాడు. అమ్మ వారు ఆసైగలలో భావంకూడా తెలుసుకొని అనుగ్రహిస్తుంది. అంటే అమ్మవారికి ఆ ముగ్గురి భాషలే కాదు,సంస్కృత ప్రాకృతాది భాషలే కాక ఎన్నో భాషలు, తన దర్శనానికి వచ్చి ప్రార్థనచేసి మనసులోనే మౌనంగా వేడుకుంటారు. ఈ మౌనంలోని భావంకూడా గ్రహించి అనుగ్రహిస్తుంది. అలాగే ఏమీ కోరుకొనకపోయినా, తన భక్తులకేమికావాలో అనుగ్రహిస్తుంది. అమ్మకు అన్ని భాషలూ వచ్చు. సైగలు కూడా అర్థం చేసుకుంటుంది గనుక భాషభాషకూ తనస్వరూపాన్ని భక్తుల మనోభావాలలో ప్రకటింపజేస్తుంది. అందుకే జగన్మాత *భాషారూపా* అని స్తుతిస్తున్నాము.

జగదీశ్వరి మాతృకార్ణరూపిణి. అకారాది క్షకారాంత అక్షరములన్నీ పరమేశ్వరి రూపమే. భాషవేరైనా అక్షరాలు ఒకటే. భాషలోని భావంకూడా ఒకటే. అందుచేత జగన్మాతకు భాషల భేదంలేదు. ఆ తల్లి సర్వ *భాషారూప* అటువంటి తల్లికి నమస్కరించునపుడు *ఓం భాషారూపాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*6.1 (ప్రథమ శ్లోకము)*

*విరూపః కేతుమాన్ శంభురంబరీషసుతాస్త్రయః|*

*విరూపాత్పృషదశ్వోఽభూత్తత్పుత్రస్తు రథీతరః॥7469॥*

*శ్రీశుకుడు పలికెను* అంబరీషునకు విరూపుడు, కేతుమంతుడు, శంభువు అను మువ్వురు సుతులు కలిగిరి. వారిలో విరూపుని కుమారుడు పృషదశ్వుడు, అతని పుత్రుడు రథీతరుడు.

*6.2 (రెండవ శ్లోకము)*

*రథీతరస్యాప్రజస్య భార్యాయాం తంతవేఽర్థితః|*

*అంగిరా జనయామాస బ్రహ్మవర్చస్వినః సుతాన్॥7470॥*

*6.3 (మూడవ శ్లోకము)*

*ఏతే క్షేత్రే ప్రసూతా వై పునస్త్వాంగిరసాః స్మృతాః|*

*రథీతరాణాం ప్రవరాః క్షత్రోపేతా ద్విజాతయః॥7471॥*

రథీతరునకు సంతానము లేకుండెను. అంతట అతడు వంశాభివృద్ధికై (సంతానార్థము) అంగిరస మహర్షిని అర్థించెను. మహాతపస్వియైన ఆ మహానుభావుని అనుగ్రహమున రథీతరుని భార్యయందు బ్రహ్మతేజోనిధులైన పలువురు సుతులు ఉదయించిరి. అందు వలన వారు అంగిరసులుగాను, రథీతరవంశజులుగాను వ్యవహరింప బడిరి. ఈ విధముగ వీరు క్షత్రియ గోత్రముతో కూడుకొనిన బ్రాహ్మణులై రెండు వంశములు గలవారుగా ఐనారు.

*6.4 (నాలుగవ శ్లోకము)*

*క్షువతస్తు మనోర్జజ్ఞే ఇక్ష్వాకుర్ఘ్రాణతః సుతః|*

*తస్య పుత్రశతజ్యేష్ఠా వికుక్షినిమిదండకాః॥7472॥*

వైవస్వతమనువు తుమ్మినప్పుడు ఆయన నాసాగ్రమునుండి ఒక సుతుడు జన్మించెను. అతని పేరు ఇక్ష్వాకువు. ఆయనకు వికుక్షి, నిమి, దండకుడు మున్నగు వందమంది తనయులు కలిగిరి.

*6.5 (ఐదవ శ్లోకము)*

*తేషాం పురస్తాదభవన్నార్యావర్తే నృపా నృప|*

*పంచవింశతిః పశ్చాచ్చ త్రయో మధ్యేఽపరేఽన్యతః॥7473॥*

*6.6 (ఆరవ శ్లోకము)*

*స ఏకదాష్టకాశ్రాద్ధే ఇక్ష్వాకుః సుతమాదిశత్|*

*మాంసమానీయతాం మేధ్యం వికుక్షే గచ్ఛ మా చిరమ్॥7474॥*

పరీక్షిన్మహారాజా! ఆ నూఱుమంది పుత్రులలో ఇరువది ఐదుగురు ఆర్యావర్తమునందలి (వింధ్య పర్వతమునకు హిమాలయములకును నడుమగల ప్రదేశమునందలి) తూర్పు భాగమునగల వేర్వేఱు మండలములకు రాజులైరి. పశ్చిమభాగమునందలి వేర్వేఱు ప్రదేశములకు మఱియొక ఇఱువదియైదు మంది ప్రభువులైరి. జ్యేష్ఠులైన వికుక్షి, నిమి, దండకుడు అను మువ్వురు మధ్యభాగములకు పాలకులైరి. మిగిలిన నలుబది యేడుగురును తదితర ప్రదేశములను పాలించిరి. ఆ ఇక్ష్వాకు మహారాజు ఒకానొక సమయమున అష్టకశ్రాద్ధమును నిర్వహించుచూ తన పెద్ద కుమారుడగు వికుక్షిని ఇట్లు ఆదేశించెను. "వికుక్షీ! నీవు వెంటనే బయలుదేరి ఈ శ్రాద్ధమునకు వలసిన పవిత్ర జంతువుల మాంసము తీసికొని త్వరగా రమ్ము"

ఆర్యావర్తము: భారతదేశమునందుగల వింధ్యపర్వతమునకును, హిమగిరికిని మధ్యగల పుణ్యభూమిని *ఆర్యావర్తము* అని వ్యవహరింతురు. *ఆర్యావర్తః పుణ్యభూమిః మధ్యం వింధ్యహిమోఽగయోః* డ(అమరకోశము).

*6.7 (ఏడవ శ్లోకము)*

*తథేతి స వనం గత్వా మృగాన్ హత్వా క్రియార్హణాన్|*

*శ్రాంతో బుభుక్షితో వీరః శశం చాదదపస్మృతిః॥7475॥*

*6.8 (ఎనిమిదవ శ్లోకము)*

*శేషం నివేదయామాస పిత్రే తేన చ తద్గురుః|*

*చోదితః ప్రోక్షణాయాహ దుష్టమేతదకర్మకమ్॥7476॥*

అంతట వీరుడైన వికుక్షి వనమునకు వెళ్ళి శ్రాద్ధమునకు యోగ్యములైన మృగములను చంపి మిగుల డస్సిపోయెను. అప్పుడు మిక్కిలి ఆకలిగొనియున్న ఆ వికుక్షి ఆ నీరసస్థితిలో (శ్రాద్ధముకొరకై తాను జంతువులను హతమార్చిన విషయమును విస్మరించి) కుందేలు మాంసమును భక్షించెను. అందువలన అతనికి *శశాదుడు* అను పేరు ఏర్పడెను. శశము అనగా కుందేలు. శశమును భక్షించినవాడు శశాదుడు. వికుక్షి ఇంటికి చేరిన పిమ్మట, తాను తినగా మిగిలిన మాంస ఖండములను తండ్రికి సమర్పించెను. అప్పుడు ఇక్ష్వాకు మహారాజు ఆ మాంసఖండములపై మంత్రపూతములైన జలములను చల్లుటకై తమ వంశగురువగు వసిష్ఠుని ప్రార్థించెను. పిమ్మట ఆ మహర్షి 'ఈ మాంసము దూషితమైనది (అపవిత్రమైనది) కనుక ఇది శ్రాద్ధమునకు పనికిరాదు' అని వచించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*6.9 (తొమ్మిదవ శ్లోకము)*

*జ్ఞాత్వా పుత్రస్య తత్కర్మ గురుణాభిహితం నృపః|*

*దేశాన్నిఃసారయామాస సుతం త్యక్తవిధిం రుషా॥7477॥*

అంతట ఇక్ష్వాకు మహారాజు తన సుతుడగు వికుక్షి చేసిన దుష్కార్యమును గూర్చి గురువైన వసిష్ఠుని వలన ఎరింగెను. వెంటనే అతడు కోపగించి శాస్త్రీయవిధిని ఉల్లంఘించిన తన కుమారుని దేశమునుండి బహిష్కరించెను.

*6.10 (పదియవ శ్లోకము)*

*స తు విప్రేణ సంవాదం జాపకేన సమాచరన్|*

*త్యక్త్వా కలేవరం యోగీ స తేనావాప యత్పరమ్॥7478॥*

అనంతరము ఇక్ష్వాకువు గొప్ప తపస్వియగు వసిష్ఠునితో భగవంతుని విశిష్టగుణములను (తాత్త్విక విషయములను) గూర్చి చర్చించి యోగియయ్యెను. క్రమముగా ప్రారబ్ధ కర్మఫలములను అసుభవించి రాజ్య భోగములయందు విరక్తుడై తనువును త్యజించి, పరమపదమును చేరెను.

*6.11 (పదకొండవ శ్లోకము)*

*పితర్యుపరతేఽభ్యేత్య వికుక్షిః పృథివీమిమామ్|*

*శాసదీజే హరిం యజ్ఞైః శశాద ఇతి విశ్రుతః॥7479॥*

తండ్రియగు ఇక్ష్వాకుని మరణానంతరము వికుక్షి తన రాజ్యమునకు మరలివచ్చెను. అతడు రాజ్యపాలన మొనర్చుచు యజ్ఞముల ద్వారా శ్రీహరిని ఆరాధించెను. శ్రాద్ధార్థము సంపాదింపబడిన కుందేలు మాంసమును తినిన కారణముగా ఆ వికుక్షి *శశాదుడు* గా ప్రసిద్ధికెక్కెను.

*6.12 (పండ్రెండవ శ్లోకము)*

*పురంజయస్తస్య సుత ఇంద్రవాహ ఇతీరితః|*

*కకుత్స్థ ఇతి చాప్యుక్తః శృణు నామాని కర్మభిః॥7480॥*

పరీక్షిన్మహారాజా! వికుక్షి తనయుడైన పురంజయునకు ఇంద్రవాహుడు, కకుత్స్థుడు అను పేర్లు కూడ ఏర్పడెను ఆ నామాంతరములు వచ్చుటకు గల కారణములను గురించి తెలిపెదను వినుము.

*6.13 (పదమూడవ శ్లోకము)*

*కృతాంత ఆసీత్సమరో దేవానాం సహ దానవైః|*

*పార్ష్ణిగ్రాహో వృతో వీరో దేవైర్దైత్యపరాజితైః॥7481॥*

*6.14 (పదునాలుగవ శ్లోకము)*

*వచనాద్దేవదేవస్య విష్ణోర్విశ్వాత్మనః ప్రభోః|*

*వాహనత్వే వృతస్తస్య బభూవేంద్రో మహావృషః॥7482॥*

కృతయుగాంతమున దేవతలకు దానవులతో మహాసంగ్రామము సంభవించెను. ఆ యుద్ధమున దైత్యుల చేతిలో దేవతలు పరాజితులైరి. అప్పుడు ఆ అమరులు పురంజయుని జేరి ఆ యుద్ధమున తమకు సహాయపడ వలసినదిగా అభ్యర్థించిరి. అంతట పురంజయుడు 'ఇంద్రుడు నాకు వాహనమైనచో, నేను మీ ప్రార్థనను అంగీకరించెను' అని పల్కెను. ఇంద్రుడు మొదట అందులకు సమ్మతింపలేదు. కాని, సర్వసమర్థుడు, విశ్వాత్ముడు, దేవదేవుడు ఐన శ్రీమన్నారాయణుని యొక్క ఆదేశమును అనుసరించి ఇంద్రుడు వృషభరూపము అతనికి (పురంజయునకు) వాహనమయ్యెను.

*6.15 (పదునైదవ శ్లోకము)*

*స సన్నద్ధో ధనుర్దివ్యమాదాయ విశిఖాన్ఛితాన్|*

*స్తూయమానః సమారుహ్య యుయుత్సుః కకుది స్థితః॥7483॥*

*6.16 (పదహారవ శ్లోకము)*

*తేజసాఽఽప్యాయితో విష్ణోః పురుషస్య పరాత్మనః|*

*ప్రతీచ్యాం దిశి దైత్యానాం న్యరుణత్త్రిదశైః పురమ్॥7484॥*

పురుషోత్తముడు, మహాత్ముడు ఐన శ్రీమహావిష్ణువు పురంజయునిలో తన శక్తిని ఆవహింపజేసెను. పిమ్మట పురంజయుడు కవచమును ధరించి, దివ్యమైన ధనుస్సును, వాడియైన బాణములను గ్రహించెను. అప్పుడు దేవతలు స్తుతించుచుండగా సమరోత్సాహముతోనున్న ఆ వీరుడు వృషభముయొక్క మూపుపై నెక్కి యుద్ధ సన్నద్ధుడయ్యెను. అందువలన అతడు *కకుత్స్థుడు* అని ప్రసిద్ధికెక్కెను (కకుత్ అనగా వృషభము యొక్క మూపురము. దానిపై అధిష్ఠించినవాడు కకుత్స్థుడు. కకుది స్థితః కకుత్స్థః) పిమ్మట అతడు దేవతలతోగూడి పశ్చిమదిశనుండి దైత్యుల పురమును ముట్టడించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*6.1 (ప్రథమ శ్లోకము)*

*విరూపః కేతుమాన్ శంభురంబరీషసుతాస్త్రయః|*

*విరూపాత్పృషదశ్వోఽభూత్తత్పుత్రస్తు రథీతరః॥7469॥*

*శ్రీశుకుడు పలికెను* అంబరీషునకు విరూపుడు, కేతుమంతుడు, శంభువు అను మువ్వురు సుతులు కలిగిరి. వారిలో విరూపుని కుమారుడు పృషదశ్వుడు, అతని పుత్రుడు రథీతరుడు.

*6.2 (రెండవ శ్లోకము)*

*రథీతరస్యాప్రజస్య భార్యాయాం తంతవేఽర్థితః|*

*అంగిరా జనయామాస బ్రహ్మవర్చస్వినః సుతాన్॥7470॥*

*6.3 (మూడవ శ్లోకము)*

*ఏతే క్షేత్రే ప్రసూతా వై పునస్త్వాంగిరసాః స్మృతాః|*

*రథీతరాణాం ప్రవరాః క్షత్రోపేతా ద్విజాతయః॥7471॥*

రథీతరునకు సంతానము లేకుండెను. అంతట అతడు వంశాభివృద్ధికై (సంతానార్థము) అంగిరస మహర్షిని అర్థించెను. మహాతపస్వియైన ఆ మహానుభావుని అనుగ్రహమున రథీతరుని భార్యయందు బ్రహ్మతేజోనిధులైన పలువురు సుతులు ఉదయించిరి. అందు వలన వారు అంగిరసులుగాను, రథీతరవంశజులుగాను వ్యవహరింప బడిరి. ఈ విధముగ వీరు క్షత్రియ గోత్రముతో కూడుకొనిన బ్రాహ్మణులై రెండు వంశములు గలవారుగా ఐనారు.

*6.4 (నాలుగవ శ్లోకము)*

*క్షువతస్తు మనోర్జజ్ఞే ఇక్ష్వాకుర్ఘ్రాణతః సుతః|*

*తస్య పుత్రశతజ్యేష్ఠా వికుక్షినిమిదండకాః॥7472॥*

వైవస్వతమనువు తుమ్మినప్పుడు ఆయన నాసాగ్రమునుండి ఒక సుతుడు జన్మించెను. అతని పేరు ఇక్ష్వాకువు. ఆయనకు వికుక్షి, నిమి, దండకుడు మున్నగు వందమంది తనయులు కలిగిరి.

*6.5 (ఐదవ శ్లోకము)*

*తేషాం పురస్తాదభవన్నార్యావర్తే నృపా నృప|*

*పంచవింశతిః పశ్చాచ్చ త్రయో మధ్యేఽపరేఽన్యతః॥7473॥*

*6.6 (ఆరవ శ్లోకము)*

*స ఏకదాష్టకాశ్రాద్ధే ఇక్ష్వాకుః సుతమాదిశత్|*

*మాంసమానీయతాం మేధ్యం వికుక్షే గచ్ఛ మా చిరమ్॥7474॥*

పరీక్షిన్మహారాజా! ఆ నూఱుమంది పుత్రులలో ఇరువది ఐదుగురు ఆర్యావర్తమునందలి (వింధ్య పర్వతమునకు హిమాలయములకును నడుమగల ప్రదేశమునందలి) తూర్పు భాగమునగల వేర్వేఱు మండలములకు రాజులైరి. పశ్చిమభాగమునందలి వేర్వేఱు ప్రదేశములకు మఱియొక ఇఱువదియైదు మంది ప్రభువులైరి. జ్యేష్ఠులైన వికుక్షి, నిమి, దండకుడు అను మువ్వురు మధ్యభాగములకు పాలకులైరి. మిగిలిన నలుబది యేడుగురును తదితర ప్రదేశములను పాలించిరి. ఆ ఇక్ష్వాకు మహారాజు ఒకానొక సమయమున అష్టకశ్రాద్ధమును నిర్వహించుచూ తన పెద్ద కుమారుడగు వికుక్షిని ఇట్లు ఆదేశించెను. "వికుక్షీ! నీవు వెంటనే బయలుదేరి ఈ శ్రాద్ధమునకు వలసిన పవిత్ర జంతువుల మాంసము తీసికొని త్వరగా రమ్ము"

ఆర్యావర్తము: భారతదేశమునందుగల వింధ్యపర్వతమునకును, హిమగిరికిని మధ్యగల పుణ్యభూమిని *ఆర్యావర్తము* అని వ్యవహరింతురు. *ఆర్యావర్తః పుణ్యభూమిః మధ్యం వింధ్యహిమోఽగయోః* డ(అమరకోశము).

*6.7 (ఏడవ శ్లోకము)*

*తథేతి స వనం గత్వా మృగాన్ హత్వా క్రియార్హణాన్|*

*శ్రాంతో బుభుక్షితో వీరః శశం చాదదపస్మృతిః॥7475॥*

*6.8 (ఎనిమిదవ శ్లోకము)*

*శేషం నివేదయామాస పిత్రే తేన చ తద్గురుః|*

*చోదితః ప్రోక్షణాయాహ దుష్టమేతదకర్మకమ్॥7476॥*

అంతట వీరుడైన వికుక్షి వనమునకు వెళ్ళి శ్రాద్ధమునకు యోగ్యములైన మృగములను చంపి మిగుల డస్సిపోయెను. అప్పుడు మిక్కిలి ఆకలిగొనియున్న ఆ వికుక్షి ఆ నీరసస్థితిలో (శ్రాద్ధముకొరకై తాను జంతువులను హతమార్చిన విషయమును విస్మరించి) కుందేలు మాంసమును భక్షించెను. అందువలన అతనికి *శశాదుడు* అను పేరు ఏర్పడెను. శశము అనగా కుందేలు. శశమును భక్షించినవాడు శశాదుడు. వికుక్షి ఇంటికి చేరిన పిమ్మట, తాను తినగా మిగిలిన మాంస ఖండములను తండ్రికి సమర్పించెను. అప్పుడు ఇక్ష్వాకు మహారాజు ఆ మాంసఖండములపై మంత్రపూతములైన జలములను చల్లుటకై తమ వంశగురువగు వసిష్ఠుని ప్రార్థించెను. పిమ్మట ఆ మహర్షి 'ఈ మాంసము దూషితమైనది (అపవిత్రమైనది) కనుక ఇది శ్రాద్ధమునకు పనికిరాదు' అని వచించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*102వ నామ మంత్రము*

*ఓం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః*

సృష్ట్యాది రూప బ్రహ్మగ్రంథి భేదనము తరువాత మణిపూర చక్రమునందు సమయాచారులచే వివిధ రకములైన మణులచే పూజలనందుకొని, మణిపూరచక్రమునకు పైనగల జీవభావ విష్ణుగ్రంథిని భేదించి సాధకునికి స్థూలము వలే సూక్ష్మము కూడా అనిత్యమనే జ్ఞానమును కలిగించు కుండలినీ శక్తి స్వరూపిణి అయిన జగన్నాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విష్ణుగ్రంథి విభేదినీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లికరుణతో అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదను సంప్రాప్తము చేసికొని, భౌతిక పరమైన సుఖసంతోషములతోబాటు ఆధ్యాత్మికానందమును కూడా పొందును.

విష్ణుగ్రంథి మణిపూర అనాహత చక్రములకుపైన గలదు. ఇంతకు ముందు బ్రహ్మగ్రంథి భేదనమయినది. బ్రహ్మగ్రంథి పంచకోశములలో భౌతికత్వము కలిగి యున్న అన్నమయ కోశము మరియు స్థూల శరీరములకు సంబంధించినది. బ్రహ్మ గ్రంథి భేదనముతో బుద్ధిని ఆవహించియున్స మాయ తొలగును. భౌతిక ప్రపంచమంతా మాయ అనియు, ఈ పాంచభౌతిక శరీరము అనిత్యమనియు, నిత్యమైన పరబ్రహ్మము వేరొకటీ ఉందని తెలుస్తుంది. స్థూలశరీరంలోనే భౌతికత్వమునకన్నా మిన్నయైన సూక్ష్మశరీరం ఉన్నది. పంచకోశములలో ప్రాణమయ, మనోమయ, విజ్ఞానకోశములకు సంబంధించినదే విష్ణుగ్రంథి.

బ్రహ్మగ్రంథి భేదనమునకు ముందు ఈ శరీరం నాది, ఈ స్థూల శరీరం నుండి పుట్టిన సంతానము, ఈ స్థూల శరీరంకోసం దగ్గర అయిన భార్య అందరూ తన వారని, వారికి ఏవేవో ఏర్పరచాలని, ఇంకేవోవో తెచ్చి ఇవ్వాలని అనిపిస్తుంది. తన వారిపై మమకారం కూడా నిశ్చలంగా ఉంటుంది. బ్రహ్మగ్రంథి భేదనముతో ఆ మాయ పొరలు వీడి సూక్ష్మశరీర జ్ఞానం ఏర్పడుతుంది.

విష్ణుగ్రంథి భేదనముతో సూక్ష్మశరీరం కన్నా ఇంకేదో కారణ శరీరంగలదని తెలుస్తుంది. అంతవరకూ ఉన్న అరిషడ్వర్గములన్నియు వడగట్టబడి తనలో ఆత్మానందం కలుగుతుంది. అదే శాశ్వతమనియు, సత్యమనియు తెలిసి పరబ్రహ్మానంద భూతమయిన కారణ శరీరం వేరొకటి గలదనే సత్యం తెలుస్తుంది. విష్ణుగ్రంథి భేదనతో తనవలననే ఈ జగత్తు నడుస్తోంది అనే భావన నశిస్తుంది. అహంకారం, అజ్ఞానం పోతాయి. విష్ణుగ్రంథి భేదనతో మాయ తొలగి జగన్మాత అనుగ్రహానికి చేయవలసిన విధుల అన్వేషణ ప్రారంభిస్తాడు. జ్ఞానబోధ కొరకు సరైన గురునికోసం అన్వేషణలో నిమగ్నమౌతాడు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*679వ నామ మంత్రము*

*ఓం బృహత్సేనాయై నమః*

భండాసురాది రాక్షస సంహారమునకు సంపత్కరీ, అశ్వారూఢా, శ్యామల, జ్వాలామాలిని, నిత్యాదేవతలు మొదలైన సేనానులు, తన అంశయైన బాలాత్రిపుర సుందరి, చక్రరాజ-గేయచక్ర-కిరిచక్ర రథములతోను అసంఖ్యాకమైన భౌతిక సేనావాహినియు, అరిషడ్వర్గములు, అజ్ఞాన తిమిరములు మొదలైన దుష్టశక్తులనంతము చేయుటకు అనంతములైన వేదాలలోని ఋక్కులు, సామలు, యజుస్సులు మరియు తదితర మంత్రములు వంటి జ్ఞాన సేనావాహిని కలిగియున్న అఖిలాండేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర సామావళి యందలి *బృహత్సేనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం బృహత్సేనాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి అంతులేని జ్ఞానసంపద, భౌతిక సంపదలు ప్రసాదించును.

భండాసురుడు మొదలైన రాక్షసులను, వారి సైన్యాలను సంహరించడానికి అనంతమైన భౌతిక సేనావాహిని, అస్త్రశస్త్రములు, రథములు, ఆవరణములు గలవు.

ఆ భౌతిక సేనావాహిని ఏమిటో ఈ క్రింది నామ మంత్రాలలో ఒక సారి పరిశీలించుదాము.

*శక్తిసేనలు*

65 వ నామ మంత్రము. *భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా*

*గజ దళము- సంపత్కరీ దేవి*

66వ నామ మంత్రము *సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా*

*అశ్వదళము - అశ్వారూఢాదేవి*

67వ నామ మంత్రము *అశ్వారూఢాధిష్డితాశ్వ కోటి కోటిభి రావృతా*

*జ్వాలాప్రాకారం - జ్వాలామాలిని*

71వ నామ మంత్రము *జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా*

*నిత్యా దేవతలు*

73వ నామ మంత్రము *నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సకా*

*బాలా త్రిపుర సుందరి*

74వ నామ మంత్రము *భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా*

*(రాజ) శ్యామలా దేవి*

75వ నామ మంత్రము *మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా*

*వారాహి*

76వ నామ మంత్రము *విశుక్ర ప్రాణహరణా వారాహీ వీర్య నందితా*

*గణేశ్వరుడు*

78వ నామ మంత్రము *మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా*

*అమ్మవారు శస్త్రాలకు ప్రతిగా అస్త్రాలను వర్షింపజేసినది*

79వ నామ మంత్రము *భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ*

*నారాయణుని దశావతారములు*

80వ నామ మంత్రము *కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః*

*మహా పాశుపతాస్త్రం*

81వ నామ మంత్రము *మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా*

*కామేశ్వరాస్త్రము*

82వ నామ మంత్రము *కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా*

*ఆయుధములతో రథములు*

68వ నామ మంత్రము *చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా*

69వ నామ మంత్రము *గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా*

70వ నామ మంత్రము *కిరిచక్ర రథారూఢ దంఢనాథ పురస్కృతా*

ఇంకా భండుని పదిహేను సేనానాయకులకు ప్రతిగా తన సేనానులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఒకటేమిటి అనంతకోటి భౌతిక సేనాసంపదతో దుష్టులను పరిమార్చినది శ్రీమాత.

అమ్మవారి జ్ఞాన సేనావాహినికి సంబంధించిన కొన్ని నామ మంత్రములు మాత్రము ఇక్కడ చూపడమైనది.

89వ నామ మంత్రం *మూలమంత్రాత్మికా* సర్వమునకు మూలమైన పంచదశాక్షరీ స్వరూపిణి జగన్మాత.

204వ నామ మంత్రం *సర్వమంత్ర స్వరూపిణీ* సమస్త మంత్రముల స్వరూపిణి జగన్మాత.

205వ నామ మంత్రం *సర్వ యంత్రాత్మికా* సర్వ యంత్రముల స్వరూపిణి జగన్మాత.

206వ నామ మంత్రం *సర్వ తంత్రరూపా* సర్వ తంత్రముల స్వరూపిణి జగన్మాత.

236వ నామ మంత్రం *చతుష్షష్టి కళామయీ* అరవై నాలుగు కళలు లేదా తంత్రముల స్వరూపిణి జగన్మాత.

239వ నామ మంత్రం *చంద్రవిద్యా* పన్నెండు మంది దేవీ ఉపాసకులలో చంద్రుడు ఉపాసించు విద్యాస్వరూపిణి జగన్మాత.

301వ నామ మంత్రం *హ్రీంకారీ* సృష్ఠి,స్థితి,లయములను చేయు భువనేశ్వరీ మాత మంత్ర స్వరూపిణి జగన్మాత.

338వ నామ మంత్రం *వేదజననీ* వేదాలకు జనని అయిన జగన్మాత.

366వ నామ మంత్రం *పరా* పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరులను నాలుగు వాక్కులకన్నా పరావాక్కు స్వరూపిణి జగన్మాత.

368వ నామ మంత్రం *పశ్యంతీ* అన్నిటినీ తనలోనే చూసే పశ్యంతీ వాక్కు స్వరూపిణి జగన్మాత.

402వ నామ మంత్రం *విద్యావిద్యా స్వరూపిణీ* జ్ఞానం, అజ్ఞానం, నానాత్వభావం అన్నీ తానే అయిన జగన్మాత.

420వ నామ మంత్రం *గాయత్రీ* వేదమంత్రి అయిన గాయత్రీ స్వరూపిణి జగన్మాత.

587వ నామ మంత్రం *షోడశాక్షరీవిద్యా* శ్రీ తో కూడిన పదహారు అక్షరాలుగల షోడశాక్షరీ విద్యాస్వరూపిణి జగన్మాత.

చతురంగ బలాలతో కూడిన సైన్యము మరియు బ్రహ్మ-విష్ణు-మహేశ్వరములు-ఇంద్రాది దేవతల సమూహమే జగన్మాత యొక్క సైన్యమని బాహ్యార్థమయితే అనంతమైన వేదరాశి, వేదాంత జ్ఞానము లలితాంబిక యొక్క జ్ఞాన సంకేత సేనావాహిని అని అంతరార్థము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం బృహత్సేనాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*6.17 (పదిహేడవ శ్లోకము)*

*తైస్తస్య చాభూత్ప్రధనం తుములం లోమహర్షణమ్|*

*యమాయ భల్లైరనయద్దైత్యాన్ యేఽభియయుర్మృధే॥7485॥*

*6.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*తస్యేషుపాతాభిముఖం యుగాంతాగ్నిమివోల్బణమ్|*

*విసృజ్య దుద్రువుర్దైత్యా హన్యమానాః స్వమాలయమ్॥7486॥*

*6.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*జిత్వా పురం ధనం సర్వం సశ్రీకం వజ్రపాణయే|*

*ప్రత్యయచ్ఛత్స రాజర్షిరితి నామభిరాహృతః॥7487॥*

అనంతరము పురంజయునకు దైత్యులకును ఘోరసమరము జరిగెను. అది చూచెడివారికిని, వినెడి వారికిని గగుర్ఫాటును గలిగించుచుండెను. ఆ యుద్ధమున తనను ఎదిరించిన దైత్యులను అందరిని ఆ మహావీరుడు తన శరపరంపర ధాటికి గుఱిచేసి, యమపురికి పంపెను. అంతట అవిచ్ఛిన్నముగా వచ్చి పడుచున్న అతని శరముల వర్షము ప్రళయకాలాగ్నివలె దుస్సహమై యుండెను. ఎదురుగా నిలిచియున్న దానవ యోధులలో మిగిలినవారు (మృతులు కాగా మిగిలినవారు) ఆ బాణముల దెబ్బలకు నుగ్గునగ్గగుచు తాళలేక తమ నివాసములకు (పాతాళలోకమునకు) చేరిరి. దైత్యులపురమును జయించి, వారి ధనమును, తదితర సంపదలను వశమొనర్చుకొని, వాటి నన్నింటిని పురంజయుడు ఇంద్రునకు ఇచ్చివేసెను. దైత్యుల పురమును జయించుటచే ఆ రాజర్షికి *పురంజయుడు* అను పేరు స్థిరపడెను. ఈ విధముగా వికుక్షి (శశాద) సుతునకు, ఇంద్రుడు వాహనమగుటచే *ఇంద్రవాహనుడు* అనియు, కకుత్తుపై (వృషభముయొక్క మూపురముపై) అధివసించుటచే *కకుత్స్థుడు* అనియు, దానవుల పురమును జయించుటచే *పురంజయుడు* అనియు పేర్లు ఏర్పడెను.

*6.20 (ఇరువదియవ శ్లోకము)*

*పురంజయస్య పుత్రోఽభూదనేనాస్తత్సుతః పృథుః|*
.
*విశ్వగంధిస్తతశ్చంద్రో యువనాశ్వస్తు తత్సుతః॥7488॥*

*6.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*శ్రావస్తస్తత్సుతో యేన శ్రావస్తీ నిర్మమే పురీ|*

*బృహదశ్వస్తు శ్రావస్తిస్తతః కువలయాశ్వకః॥7489॥*

*6.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*యః ప్రియార్థముతంకస్య ధుంధునామాసురం బలీ|*

*సుతానామేకవింశత్యా సహస్రైరహనద్వృతః॥7490॥*

*6.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ధుంధుమార ఇతి ఖ్యాతస్తత్సుతాస్తే చ జజ్వలుః|*

*ధుంధోర్ముఖాగ్నినా సర్వే త్రయ ఏవావశేషితాః॥7491॥*

పురంజయుని సుతుడు అనేనసుడు. అతని పుత్రుడు పృథుచక్రవర్తి. అతని కుమారుడు విశ్వరంధి. ఆయన సూనుడు చంద్రుడు. ఈ చంద్రుని తనయుడు యవనాశ్వుడు. అతని పుత్రుడు శాబస్తుడు. అతడు శాబస్తి నగరమును నిర్మించెను. శాబస్తుని కుమారుడు బృహదశ్వుడు. అతని సుతుడు కువలయాశ్వకుడు. ఇతడు మిగుల బలశాలి. ఈ కువలయాశ్వకుడు ఉతంకమునికి ప్రీతిని గూర్చుటకై తన ఇరువదియొక్కవేల కుమారులతో గూడి *ధుంధువు* అను రాక్షసుని హతమార్చెను. అందువలన ఈ కువలయాశ్వకునకు *ధుంధుమారుడు* అను పేరు వచ్ఛెను. ధుంధువు యొక్క ముఖాగ్నిధాటికి కువలయాశ్వకుని కుమారులలో ముగ్గురు తప్ఫ తక్కినవారు అందరును దగ్ధమైపోయిరి.

*6.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*దృఢాశ్వః కపిలాశ్వశ్చ భద్రాశ్వ ఇతి భారత|*

*దృఢాశ్వపుత్రో హర్యశ్వో నికుంభస్తత్సుతః స్మృతః॥7492॥*

పరీక్షిన్మహారాజా! కువలయాశ్వకుని తనయులలో మిగిలిన ముగ్గురు - దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనువారు. దృఢాశ్వుని పుత్రుడు హర్యశ్వుడు. అతని సుతుడు నికుంభుడు.

*6.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*బర్హణాశ్వో నికుంభస్య కృశాశ్వోఽథాస్య సేనజిత్|*

*యువనాశ్వోఽభవత్తస్య సోఽనపత్యో వనం గతః॥7493॥*

*6.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*భార్యాశతేన నిర్విణ్ణ ఋషయోఽస్య కృపాలవః|*

*ఇష్టిం స్మ వర్తయాంచక్రురైంద్రీం తే సుసమాహితాః॥7494॥*

నికుంభుని సూనుడు బర్హణాశ్వుడు. అతని తనయుడు కృశాశ్వుడు. ఇతని కుమారుడు సేనజిత్తు. ఇతని సుతుడు యువనాశ్వుడు. ఇతడు సంతానహీనుడగుటచే దుఃఖితుడై తన వందమంది భార్యలతో గూడి వనములకు చేరెను. దయాళువులైన అచటి ఋషులు అతనికి సంతానప్రాప్తికై ఆ యువనాశ్వునిచే ఇంద్రునకు సంబంధించిన యజ్ఞమును (పుత్రకామేష్టిని) సావధానముగా నిర్వహింపజేసిరి.

PVD Subrahmanyam చెప్పారు...

*6.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*రాజా తద్యజ్ఞసదనం ప్రవిష్టో నిశి తర్షితః|*

*దృష్ట్వా శయానాన్ విప్రాంస్తాన్ పపౌ మంత్రజలం స్వయమ్॥7495॥*

అంతట ఆ రాజు రాత్రివేళ దప్పిగొన్నవాడై యజ్ఞశాలలో ప్రవేశిఃచెను. ఆ సమయమున విప్రులందరును గాఢనిద్రలో మునిగియుండిరి. అచట రాజపత్నులు త్రాగుటకై ఉంచబడిన మంత్రజలమును ఆ తొందరలో (పిపాసకారణముగా) తానే స్వయముగా త్రాగెను.

*6.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*ఉత్థితాస్తే నిశామ్యాథ వ్యుదకం కలశం ప్రభో|*

*పప్రచ్ఛుః కస్య కర్మేదం పీతం పుంసవనం జలమ్॥7496॥*

*6.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*రాజ్ఞా పీతం విదిత్వాథ ఈశ్వరప్రహితేన తే|*

*ఈశ్వరాయ నమశ్చక్రురహో దైవబలం బలమ్॥7497॥*

పరీక్షిన్మహారాజా! ఋషులు ప్రాతఃకాలమున మేల్కొనిన పిమ్మట కలశములో మంత్రజలము లేకుండుట గమనించిరి. పిదప వారు 'పుత్రప్రాప్తికై మంత్రపూతమైన జలము ఈ పాత్రలో ఉంచబడినది. దానిని ఎవరు త్రాగిరి' అని ప్రశ్నించిరి. విధివిలాసముచే రాజే ఆ పవిత్రజలమును త్రాగినట్లుగా తెలియగా, ఋషులు 'ఎంత ఆశ్చర్యము! దైవసంకల్పమే బలీయమైనది. దానిముందు మనుష్యశక్తి దేనికిని కొఱగాదు. *ఈశ్వరేచ్ఛ బలీయన్* అని ప్రాజ్ఞుల వచనము' అని పలుకుచు వారు పరమేశ్వరునకు నమస్కరించిరి.

*6.30 (ముప్పదియవ శ్లోకము)*

*తతః కాల ఉపావృత్తే కుక్షిం నిర్భిద్య దక్షిణమ్|*

*యువనాశ్వస్య తనయశ్చక్రవర్తీ జజాన హ॥7498॥*

*6.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*కం ధాస్యతి కుమారోఽయం స్తన్యం రోరూయతే భృశమ్|*

*మాం ధాతా వత్స మా రోదీరితీంద్రో దేశినీమదాత్॥7499॥*

*6.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*న మమార పితా తస్య విప్రదేవప్రసాదతః|*

*యువనాశ్వోఽథ తత్రైవ తపసా సిద్ధిమన్వగాత్॥7500॥*

కొంతకాలమునకు పిదప యవనాశ్వుని గర్భములో పెరుగుచున్న శిశువు ఆ రాజుయొక్క కుక్షికిగల కుడిభాగమును చీల్చుకొని బహిర్గతుడయ్యెను. ఆ శిశువు చక్రవర్తి కాదగిన శుభలక్షణములతో అలరారుచుండెను. అప్పుడు మునులు 'స్తన్యము కొరకు ఈ బాలుడు గుక్కపట్టిఏడ్చుచున్నాడు. ఇతనికి ఎవరు పాలిత్తురు?' అని పలికిరి. అంతట ఇంద్రుడు 'ఇతనికి (మాంధాతా) నేను పాలను సమకూర్చగలను' అసుచు సురపతి అమృతప్రదాయినియైన తన చూపుడు వ్రేలును ఆ శిశువు నోటిలో ఉంచెను. శిశూదయ సమయమున గర్భవిచ్ఛిత్తి జరిగినను భూసురోత్తముల అనుగ్రహముస యవనాశ్వుడు మరణింపలేదు. అనంతరము అతడు ఆ వనమునందే తపస్సొనర్చి సిద్ధి పొందెను.

*6.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*త్రసద్దస్యురితీంద్రోఽఙ్గ విదధే నామ యస్య వై|*

*యస్మాత్త్రసంతి హ్యుద్విగ్నా దస్యవో రావణాదయః॥7501॥*

*6.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*యౌవనాశ్వోఽథ మాంధాతా చక్రవర్త్యవనీం ప్రభుః|*

*సప్తద్వీపవతీమేకః శశాసాచ్యుతతేజసా॥7502॥*

పరీక్షిన్మహారాజా! ఈ మాంధాత .పెరిగి పెద్దవాడైన పిమ్మట, ఇతని పరాక్రమమునకు రావణాది దుష్టులు గూడ మిగుల భయపడుచుండిరి. అందువలన, ఇంద్రుడు ఈయనకు *త్రసద్దస్యుడు* అని పేరు పెట్టెను. యవనాశ్వుని కుమారుడైన ఆ మాంధాత తన శక్తిసామర్థ్యములచే ఏడు ద్వీపములతో గూడిన భూమండలమునకు చక్రవర్తి అయ్యెను. భగవంతుని తేజఃప్రభావమున అతడు ఎదురులేని మహావీరుడై తన రాజ్యమును చక్కగా పరిపాలించెను.

*6.35 (ముప్పదీ ఐదవ శ్లోకము)*

*ఈజే చ యజ్ఞం క్రతుభిరాత్మవిద్భూరిదక్షిణైః|*

*సర్వదేవమయం దేవం సర్వాత్మకమతీంద్రియమ్॥7503॥*

*6.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*ద్రవ్యం మంత్రో విధిర్యజ్ఞో యజమానస్తథర్త్విజః|*

*ధర్మో దేశశ్చ కాలశ్చ సర్వమేతద్యదాత్మకమ్॥7504॥*

ఆత్మజ్ఞానియైన మాంధాత ఆత్మజ్ఞానియైన ఇతనికి కర్మకాండలను ఆచరింపవలసిన ఆవశ్యకత లేకున్నను భూరిదక్షిణలతో క్రతువులను ఒనర్చుటద్వారా ఇంద్రియాతీతుడు, సకల ప్రాణులలో అంతర్యామి, సర్వదేవతా మయుడు, సకల దేవతలను తన అంగముల యందు ధరించినవాడు ఐన యజ్ఞస్వరూపుడగు శ్రీమహావిష్ణువును ఆరాధించెను. ద్రవ్యములు (చరువు, పురోడాశాది ద్రవ్యములు), వేదమంత్రములు, చోదనాత్మకములైన విధులు, యజ్ఞకర్తయు, ఋత్విజులు, యజ్ఞధర్మములు, యజ్ఞభూమి, కాలము ఇవి అన్నియును ఆ భగవంతుని స్వరూపములే.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*103వ నామ మంత్రము*

*ఓం ఆజ్ఞా చక్రాంతరాళస్థాయై నమః*

భ్రూమధ్యము నుండి శరీర మందలి అన్ని భాగములకు ఆజ్ఞలు జారీ చేయునదియు, ఇడ-పింగళ-సుషుమ్నా నాడుల సంగమము మరియు శబ్దోత్పత్తి జరుగు స్థానమును, ఓఢ్యాణపీఠము మరియు ప్రయాగ క్షేత్రము అనబడినదియు, ద్విదళ కమలము అయిన ఆజ్ఞాచక్రము మధ్యలో ఉన్న శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఆజ్ఞా చక్రాంతరాళస్థా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం ఆజ్ఞా చక్రాంతరాళస్థాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత శ్రద్ధాభక్తులతో ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే ఆత్మానందానుభూతిని పొంది తరించును.

ఆజ్ఞాచక్రము భ్రూమధ్యమున అనగా కనుబొమల మధ్యగలదు. ఆజ్ఞాచక్రము ద్విదళ పద్మము. గురుస్థానము. శరీరములోని అన్నిభాగములకు వలసిన ఆజ్ఞలను జారీచేయు గురువు ఉండే చోటు. మూలాధారాది చక్రములయందు దీక్షతో, మనసును నిమగ్నముచేసి సాధనచేసి కుండలినీ శక్తిని ఆజ్ఞాచక్రమునందు ప్రవేశపెడితే *ఆ* (కొంచము) *జ్ఞా* (జ్ఞానము) సంప్రాప్తమవుతుంది అనగా జ్ఞానస్పర్శను పొందును. ఆజ్ఞాచక్రము శబ్దోత్పత్తి స్థానము. సుషుమ్నా (కుండలినీ శక్తి మూలాధారము నుండి సహస్రారము చేరు మార్గము) మరియు ఇడ-పింగళ నాడుల సంగమస్థానము. ఇక్కడ సుషుమ్న మరియు ఇడ-పింగళ నాడుల సంగమ స్థానమును గంగ-యమున-సరస్వతీ నదుల సంగమస్థానముగా చెబుతూ ప్రయాగ క్షేత్రమనికూడా అన్నారు. ఆజ్ఞాచక్రమునకు ఓఢ్యాణపీఠమని కూడా పేరు గలదు. ఇక్కడ జగన్మాత ఓఢ్యాణబంధంలో (ఎడమ మోకాలు ఎడమ చంకలో ఉంచి) కూర్చునే స్థితిలో ఉంటుంది గనుక ఆజ్ఞాచక్రమును *ఓఢ్యాణపీఠము* అని అన్నారు. సులువుగా అర్థమయేలా చెప్పాలంటే ఇంచుమించుగా వేమన మహాకవి కూర్చున్న విధానమును ఓఢ్యాణబంధం అంటారు. *ఓఢ్యాణపీఠస్థానం* శ్రీచక్రంలోని కేంద్రస్థానంలో ఉంటుంది.

379వ నామ మంత్రము *ఓఢ్యాణపీఠనిలయా* శ్రీచక్రంలోని కేంద్రస్దానంలో ఓఢ్యాణపీఠమందు శ్రీమాత ఉన్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ఆజ్ఞా చక్రాంతరాళస్థాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*680వ నామ మంత్రము*

*ఓం భావాభావ వివర్జితాయై నమః*

ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ అను *భావములకు - (సత్)*, ప్రాక్+అభావ, ప్రధ్వంస+అభావ, అంత్యత+భావ, అన్యోన్యా+అభావ (ప్రాగాభావ,ప్రధ్వంసాభావ,అంత్యతాభావ, అన్యోన్యాభావ) అను *అభావములకు (అసత్)* - వీటికి అన్నిటికీ వేరుగా, అతీతముగా, వీటిచే వదలిపెట్టబడినదై ఉన్న జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భావాభావ వివర్జితా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం భావాభావ వివర్జితాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునికి భావాభావములకు గల వ్యత్యాసము, వాటి నిర్వచనము - జగన్మాత వీటన్నిటికీ అతీతము అను దానికి వివరములు తెలిసి ఆత్మానందభరితుడై తరించును.

*భావములు*: ద్రవ్యగుణాదులు. అవి ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయువులు. ఇవి సత్ అనగా సత్యము.

*అభావములు*
*ప్రాక్+అభావ ప్రాగాభావ* - వస్తువు తయారుకాక పూర్వం ఆవస్తువు లేని స్థితి.

*ప్రధ్వంస + అభావ - ప్రధ్వంసాభావ* - వస్తువు పూర్తిగా నాశనమైపోయిన తరువాత ఆ వస్తువు ఉండని స్థితి.

*అన్యోన్య+అభావ - అన్యోన్యాభావ* వస్తువు ఇంకొక వస్తువులాగ ఉండలేని స్థితి.

*అంత్యంత+అభావ అంత్యంతాభావ* నపుంసకుని సంతానము లేదా గొడ్రాలి బిద్డ అన్నది అసలు అవకాశమేలేనిది.

ఇలాంటి భావాభావములు ఉండడము గాని ఉండక పోవడము గాని మనకు. కాని పరాశక్తికి వీటితో సంబంధంలేదు. అన్నిటికీ అతీతమైనది. ఇలాంటి భావాభావముల తర్కము జగన్మాతకు వర్జింపబడినది. అందుచేత జగన్మాత *భావాభావ వివర్జితా* అని నామ ప్రసిద్ధమైనది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం భావాభావ వివర్జితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*6.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*యావత్సూర్య ఉదేతి స్మ యావచ్చ ప్రతితిష్ఠతి|*

*సర్వం తద్యౌవనాశ్వస్య మాంధాతుః క్షేత్రముచ్యతే॥7505॥*

సూర్యుడు ఉదయించు ప్రదేశమునుండి (ఉదయాద్రి నుండి) అస్తమించు స్థానమువరకు (అస్తాద్రి వరకు) గల భూమండలము అంతయును యువనాశ్వుని కుమారుడైన మాంధాత ప్రభువు యొక్క పరిపాలనలో ఉండెను.

*6.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*శశబిందోర్దుహితరి బిందుమత్యామధాన్నృపః|*

*పురుకుత్సమంబరీషం ముచుకుందం చ యోగినమ్|*

*తేషాం స్వసారః పంచాశత్సౌభరిం వవ్రిరే పతిమ్॥7506॥*

శశబిందువు యొక్క కూతురైన బిందుమతిని మాంధాత పరిణయమాడెను. ఆ దంపతులకు పురుకుత్సుడు, అంబరీషుడు (నాభాగుని కుమారుడైన అంబరీషుని కంటె ఇతడు వేఱైనవాడు) యోగియైన ముచుకుందుడు అను సుతులు కలిగిరి. ఈ మువ్వురికిని ఏబదిమంది తోబుట్టువులు (మాంధాతకు ఏబదిమంది కుమార్తెలు) కలరు. వారు అందరును *సౌభరి* అను ఋషిని పతిగా వరించిరి.

*6.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*యమునాంతర్జలే మగ్నస్తప్యమానః పరం తపః|*

*నిర్వృతిం మీనరాజస్య వీక్ష్య మైథునధర్మిణః॥7507॥*

*6.40 (నలుబదియవ శ్లోకము)*

*జాతస్పృహో నృపం విప్రః కన్యామేకామయాచత|*

*సోఽప్యాహ గృహ్యతాం బ్రహ్మన్ కామం కన్యా స్వయంవరే॥7508॥*

మహాతపస్వియైన సౌభరి ఒకానొకప్పుడు యమునానదీ జలములలో మునిగి తపమాచరించుచుండెను. ఆ సమయమున ఒక మహామీనము ఒక ఆడుమీనముతో గూడి సుఖించుచుండుట అతని కంటబడెను. ఆ దృశ్యమును చూచినంతనే, ఆయన మనస్సులో కామేచ్ఛ జాగృతమయ్యెను. వెంటనే ఆ సౌభరి మాంధాత మహారాజును జేరి, ఆ ప్రభువుయొక్క ఏబదిమంది పుత్రికలలో ఓ కన్యను తనకిచ్చి పెండ్లిచేయమని కోరెను. అప్పుడు మాంధాత 'విప్రోత్తమా! స్వయంవరములో నిన్ను వరించిన (నా కుమార్తెను) నీవు పెండ్లియాడుము' అని నుడివెను.

*6.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*స విచింత్యాప్రియం స్త్రీణాం జరఠోఽయమసన్మతః|*

*వలీపలిత ఏజత్క ఇత్యహం ప్రత్యుదాహృతః॥7509॥*

*6.42 (నలుబది రెండవ శ్లోకము)*

*సాధయిష్యే తథాఽఽత్మానం సురస్త్రీణామపీప్సితమ్|*

*కిం పునర్మనుజేంద్రాణామితి వ్యవసితః ప్రభుః॥7510॥*

అంతట ఆ విప్రుడు తనలో ఇట్లు తలపోసెను. 'ఇప్పుడు నేను వృద్ధుడను. నా చర్మము ముడుతలు పడియున్నది. కేశములు నెరసియున్నవి. తల కంపించుచున్నది. కనుక ఈ స్థితిలోనున్న నన్ను ఏ కన్యయు కోరుకొనదు'. ఈ విషయమును మనస్సులో ఉంచుకొనయే కాబోలు, మహారాజు తన కూతుళ్ళలో ఎవ్వరినీ ఇచ్చుటకు ఇష్టములేక, నా మాటను సూటిగా త్రోసిపుచ్చక అట్లు పలికియుండవచ్చును' . అది సరే! ఇప్పుడు నేను మానవకాంతలే గాక, సురభామినులు సైతము నన్ను (నా రూపరేఖలను) జూచి నాపై మోహపడునట్లు సుందరరూపమును పొందెదను అని నిర్ణయించుకొని, అతడు తన -తపఃప్రభావమున చక్కని రూపమును దాల్చెను.

*6.43 (నలుబది మూడవ శ్లోకము)*

*మునిః ప్రవేశితః క్షత్రా కన్యాంతఃపురమృద్ధిమత్|*

*వృతః స రాజకన్యాభిరేకః పంచాశతా వరః॥7511॥*

పిమ్మట మహారాజు ఆదేశముపై వచ్చిన రాజభటుని వెంట ఆ సౌభరి అందచందములతో మనోహరముగా ఉన్న రాజాంతఃపురమున ప్రవేశించెను. అప్పుడు ఏబదిమంది రాజకన్యలు గూడ ఆయననే (సౌభరినే) పతిగా వరించిరి.

*6.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*తాసాం కలిరభూద్భూయాంస్తదర్థేఽపోహ్య సౌహృదమ్|*

*మమానురూపో నాయం వ ఇతి తద్గతచేతసామ్॥7502॥*

పిమ్మట ఆ కన్యలు తమ సోదరీత్వమునుగూడ మరచి 'ఇతడు నాకే తగినవాడు (ఇతనికి నేనే తగిన వధువును) నీకు తగినవాడు కాడితడు' ఈ సుందరునకు నీవు తగిన కన్యవు కావు అనుచు తమలో తాము కలహించుకొనసాగిరి.

*6.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*స బహ్వృచస్తాభిరపారణీయతపఃశ్రియానర్ఘ్యపరిచ్ఛదేషు|*

*గృహేషు నానోపవనామలాంభఃసరఃసు సౌగంధికకాననేషు॥7513॥*

*6.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*మహార్హశయ్యాసనవస్త్రభూషణస్నానానులేపాభ్యవహారమాల్యకైః|*

*స్వలంకృతస్త్రీపురుషేషు నిత్యదా రేమేఽనుగాయద్ద్విజభృంగవందిషు॥7514॥*

ఆ రాజకన్యల కోరికలను అనుసరించి ఋగ్వేద పారంగతుడైన సౌభరి వారిని అందరిని పెండ్లియాడెను. అపార తపొధనుడైన అతడు తన పత్నులతోగూడి తనివిదీర విహరింపసాగెను. సిరిసంపదలతోను, అమూల్యములైన వస్తువాహనములతోను, వివిధములగు ఉపవనములయందు, నిర్మల జలములుగల సరస్సులతోను, పరిమళభరితములైన శృంగారవనములతోడను మనోహరముగానున్న భవనములయందు వారు వినోదించిరి. ఆ గృహములయందు అమూల్యములైన తల్పములు, ఆసనములు, వస్త్రాభరణములు, స్నానచందనాది - అనులేపములు, కమ్మని భోజన పదార్థములు, కనువిందు గావించెడి మాలికలు మొదలగునవి కొల్లలుగా ఒప్పుచుండెను. చక్కగా అలంకరించుకొనిన స్త్రీ పురుషులు అందు సంచరించు చుండిరి. మధురగానములు కొనసాగుచుండెను. పక్షుల కిలకిలారావములు, తుమ్మెదల ఝంకారములు, వందిమాగధుల స్తోత్రపాఠములు వీనులవిందు గావించు చుండెను. ఇట్టి అద్భుత సౌధములయందు వారి విహారము కొనసాగుచుండెను.

PVD Subrahmanyam చెప్పారు...

*6.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*యద్గార్హస్థ్యం తు సంవీక్ష్య సప్తద్వీపవతీపతిః|*

*విస్మితః స్తంభమజహాత్సార్వభౌమశ్రియాన్వితమ్॥7515॥*

సప్తద్వీప శోభితమైన భూమండలమునకు అధిపతియైన మాంధాత చక్రవర్తి, సౌభరి గృహస్థ సుఖజీవనమును జూచి మిగుల ఆశ్చర్యపడుచుండెను. "నేను గొప్ప సార్వభౌమ సంపదలుగల చక్రవర్తిని' అను గర్వముగూడ ఆయననుండి తొలగిపోయెను.

*6.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*ఏవం గృహేష్వభిరతో విషయాన్ వివిధైః సుఖైః|*

*సేవమానో న చాతుష్యదాజ్యస్తోకైరివానలః॥7516॥*

ఈ విధముగ ఆ సౌభరి గృహస్థ సంబంధమైన వివిధములగు విషయసుఖములయందు మునిగి తేలుచుండెను. పరిచారకుల సేవలను అందుకొనుచుండెను. ఐనను, ఆజ్యధారలతో అగ్ని తృప్తిచెందనట్లు, అతడు ఇంద్రియసుఖలోలుడై ఎంతకును సంతుష్టి చెందకుండెను.

*6.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*స కదాచిదుపాసీన ఆత్మాపహ్నవమాత్మనః|*

*దదర్శ బహ్వృచాచార్యో మీనసంగసముత్థితమ్॥7517॥*

ఒకనాడు ఋగ్వేద విద్వాంసుడైన సౌభరి ఏకాంతముగా కూర్చొని, మీనముల సంగమమును చూచిన ప్రభావమున కలిగిన భగవచ్చింతనకు విరుద్ధమైన తన విషయసుఖ చాంచల్యమును గూర్చి నివ్వెరపాటుతో ఆలోచింపసాగెను.

*6.50 (ఏబదియవ శ్లోకము)*

*అహో ఇమం పశ్యత మే వినాశం తపస్వినః సచ్చరితవ్రతస్య|*

*అంతర్జలే వారిచరప్రసంగాత్ప్రచ్యావితం బ్రహ్మ చిరం ధృతం యత్॥7518॥*

*6.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*సంగం త్యజేత మిథునవ్రతినాం ముముక్షుః సర్వాత్మనా న విసృజేద్బహిరింద్రియాణి*

*ఏకశ్చరన్ రహసి చిత్తమనంత ఈశే యుంజీత తద్వ్రతిషు సాధుషు చేత్ప్రసంగః॥7519॥*

ఔరా! నీటిలోపల మీనముల కామక్రీడను చూచిన కారణమున చిరకాలమునుండియు నేనొర్చిన తపోదీక్షకు భంగము వాటిల్లినది. దివ్యమైన నా నిష్ఠ అంతయును భ్రష్ఠమై పోయినది. జనులారా! తదేక నిష్ఠతో తపోదీక్షలోనున్న నాకు దాపురించిన ఈ పతనస్థితిని చూడుడు. *బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమసికర్షతి* బలీయమైన ఇంద్రియములు ఎంతటి విద్వాంసుని ఐనను పతనోన్ముఖుని జేయును (మనుస్మృతి). మోక్షమును కోరుకొనువాడు భోగలాలసులైన వారి సాంగత్యమును విడిచిపెట్టవలెను. అట్టివారితో సాంగత్యమే చేయరాదు. క్షణిక సుఖములకై వివేకమును కొల్పోయి ఇంద్రియములను శబ్దాది విషయ భోగములవైపు పోనీయరాదు.

ఏకాంతమునందు మనస్సును సర్వశక్తిమంతుడైన భగవంతుని మీదనే లగ్నము చేయవలెను. ఎప్పుడైనను ఇతరుల సాంగత్యమును (చెలిమిని) కోరుకొనినచో, భగవంతునియెడ అనన్యమైన భక్తిశ్రద్ధలుగల సత్పురుషులతో మాత్రమే సఖ్యము చేయవలెను.

*6.52 (ఏబది రెండవ శ్లోకము)*

*ఏకస్తపస్వ్యహమథాంభసి మత్స్యసంగాత్పంచాశదాసముత పంచసహస్రసర్గః|*

*నాంతం వ్రజామ్యుభయకృత్యమనోరథానాం మాయాగుణైర్హృతమతిర్విషయేఽర్థభావః॥7520॥*

మొట్టమొదట తపస్సాధనయందే మనస్సును లగ్నమొనర్చి యున్నప్పుడు నేను ఒక్కడనై యుంటిని. మత్స్యముల కామక్రీడను చూచిన పిమ్మట వివాహేచ్ఛ కలుగుటతో భార్యలతో చేరి ఏబదిమందితో కూడిన వాడనైతిని. సంతానాభివృద్ధితో ఐదువేలమందితో సంబంధము ఏర్పడినది. విషయసుఖములలొ మునిగిపోవుటవలన త్రిగుణాత్మకమైన మాయ నా బుద్ధిని హరించివేసినది. ఫలితముగా, నా మనస్సు స్త్రీ పురుషసంబంధ సుఖముల వలలో చిక్కుకొని అందుండి బయటపడలేకున్నది.

*6.53 (ఏబది మూడవ శ్లోకము)*

*ఏవం వసన్ గృహే కాలం విరక్తో న్యాసమాస్థితః|*

*వనం జగామానుయయుస్తత్పత్న్యః పతిదేవతాః॥7521॥*

ఈ విధముగి తర్కించుకొనిన పిమ్మట కొంతకాలము వరకు గృహస్థజీవనమునే కొనసాగించుచు విరక్తుడైన సౌభరిముని కామ్యకర్మలను త్యజించి, వనమునకు చేరెను. పతినే సర్వస్వముగా భావించుకొనుచున్న అతని భార్యలుగూడ అతనిని అనుసరించి వనమునకు చేరిరి.

*6.54 (ఏబది నాలుగవ శ్లోకము)*

*తత్ర తప్త్వా తపస్తీక్ష్ణమాత్మదర్శనమాత్మవాన్|*

*సహైవాగ్నిభిరాత్మానం యుయోజ పరమాత్మని॥7522॥*

అచట మిక్కిలి సంయమియైన సౌభరి ఆత్మసాక్షాత్కారమునకు సాధనమగు తీవ్రమైన తపస్సును ఆచరించెను. ఆ నిష్ఠాజీవన కారణముగా అతని శరీరము కృశించిపోయెను. కడకు ఆహవనీయాది అగ్నిత్రయముతో పాటు, తన ఆత్మను పరమాత్మయందు లీనమొనర్చెను.

*6.55 (ఏబది ఐదవ శ్లోకము)*

*తాః స్వపత్యుర్మహారాజ నిరీక్ష్యాధ్యాత్మికీం గతిమ్|*

*అన్వీయుస్తత్ప్రభావేణ అగ్నిం శాంతమివార్చిషః॥7523॥*

పరీక్షిన్మహారాజా! అతని పత్నులు అందరును ఆ మహర్షి పరమాత్మలో లీనమగుటను చూచిరి. పిమ్మట, శాంతించిన జ్వాలలు అగ్నిలో లీనమైనట్లు సహగమనమొనర్చి, వారును ఆ మహర్షి తపఃప్రభావమున ఆయనవలెనే ముక్తిని పొందిరి.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే షష్ఠోఽధ్యాయః (6)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఆరవ అధ్యాయము (6)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*7.1 (ప్రథమ శ్లోకము)*

*మాంధాతుః పుత్రప్రవరో యోఽమ్బరీషః ప్రకీర్తితః|*

*పితామహేన ప్రవృతో యౌవనాశ్వశ్చ తత్సుతః|*

*హారీతస్తస్య పుత్రోఽభూన్మాంధాతృప్రవరా ఇమే॥7524॥*

*శ్రీశుకుడు నుడివెను* మాంధాతయొక్క మువ్వురు కుమారులలో అంబరీషుడు శ్రేష్ఠుడు. ఈ అంబరీషుడు తన పితామహుడగు యువనాశ్వునకు దత్తపుత్రుడయ్యెను. ఈ అంబరీషుని సుతుడు యౌవనాశ్వుడు. ఇతని తనయుడు హరీతుడు. కనుక, అంబరీషుడు, యౌవనాశ్వుడు, హరీతుడు అను మువ్వురును మాంధాత గోత్రజులలో ప్రముఖులైరి.

*7.2 (రెండవ శ్లోకము)*

*నర్మదా భ్రాతృభిర్దత్తా పురుకుత్సాయ యోరగైః|*

*తయా రసాతలం నీతో భుజగేంద్రప్రయుక్తయా॥7525॥*

*నర్మద* అను నాగకన్యను ఆమె సోదరులగు నాగులు పురుకుత్సునకు ఇచ్చి వివాహము చేసిరి. తన సోదరులగు నాగ ప్రముఖుల ప్రేరణతో నర్మద (నాగకన్య) తన భర్తయగు పురుకుత్సుని రసాతలమునకు తీసికొనిపోయెను.

*7.3 (మూడవ శ్లోకము)*

*గంధర్వానవధీత్తత్ర వధ్యాన్ వై విష్ణుశక్తిధృక్|*

*నాగాల్లబ్ధవరః సర్పాదభయం స్మరతామిదమ్॥7526॥*

విష్ణుశక్తి సంపన్నుడైన పురుకుత్సుడు శిక్షార్హులైన గంధర్వులను వధించెను. అందువలన నాగరాజు 'ఈ వృత్తాంతమును స్మరించినవారికి సర్వభయము ఉండదు' అని పురుకుత్సునకు వరమును ఇచ్చెను.

*7.4 (నాలుగవ శ్లోకము)*

*త్రసద్దస్యుః పౌరుకుత్సో యోఽనరణ్యస్య దేహకృత్|*

*హర్యశ్వస్తత్సుతస్తస్మాదరుణోఽథ త్రిబంధనః॥7527॥*

పురుకుత్సుని పుత్రుడు త్రసద్దస్యుడు. అతని సుతుడు అనరణ్యుడు. వాని తనయుడు హర్యశ్వుడు. ఆ హర్యశ్వుని సూనుడు అరుణుడు. అతని తనూజుడు త్రిబంధనుడు.

*7.5 (ఐదవ శ్లోకము)*

*తస్య సత్యవ్రతః పుత్రస్త్రిశంకురితి విశ్రుతః|*

*ప్రాప్తశ్చాండాలతాం శాపాద్గురోః కౌశికతేజసా॥7528॥*

*7.6 (ఆరవ శ్లోకము)*

*సశరీరో గతః స్వర్గమద్యాపి దివి దృశ్యతే|*

*పాతితోఽవాక్శిరా దేవైస్తేనైవ స్తంభితో బలాత్॥7529॥*

త్రిబంధనుని పుత్రుడు సత్యవ్రతుడు. అతడు *త్రిశంకు* నామముతో ప్రసిద్ధి వహించెను. అతడు తన తండ్రియగు త్రిబంధనుని శాపముచే చండాలత్వమును పొందెను. కాని, విశ్వామిత్రుని తపఃప్రభావమున అతడు ఆ రూపముతోనే సశరీరముగా స్వర్గలోకమునకు చేరెను. దేవతలు అతనిని దివినుండి క్రిందికి పడద్రోసిరి. కాని, విశ్వామిత్రుడు తన తపశ్శక్తిచే, అతనిని ఆకాశమునందే స్థిరముగా ఉండునట్లు చేసెను. అతడు ఇప్పటికిని ఆకాశము నందు తలక్రిందులుగా కనబడుచునే యుండును.

*7.7 (ఏడవ శ్లోకము)*

*త్రైశంకవో హరిశ్చంద్రో విశ్వామిత్రవసిష్ఠయోః|*

*యన్నిమిత్తమభూద్యుద్ధం పక్షిణోర్బహువార్షికమ్॥7530॥*

ఈ త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్రుడు. అతని కారణముగనే విశ్వామిత్రుడు, వసిష్ఠుడు పోట్లాడుకొని, పరస్పరము శపించుకొని కొంతకాలము పక్షులైయుండిరి.

*7.8 (ఎనిమిదవ శ్లోకము)*

*సోఽనపత్యో విషణ్ణాత్మా నారదస్యోపదేశతః|*

*వరుణం శరణం యాతః పుత్రో మే జాయతాం ప్రభో॥7531॥*

*7.9 (తొమ్మిదవ శ్లోకము)*

*యది వీరో మహారాజ తేనైవ త్వాం యజే ఇతి|*

*తథేతి వరుణేనాస్య పుత్రో జాతస్తు రోహితః॥7532॥*

సంతానము కలుగకుండుటచే దుఃఖితుడైయున్న హరిశ్చంద్రుడు నారదుని ఆదేశమును అనుసరించి, వరుణుని శరణుజొచ్చెను. పిమ్మట, అతడు - 'దేవా! పుత్రలాభము కలుగునట్లు నన్ను అనుగ్రహింపుము. నాకు వీరుడైన పుత్రుడు కలిగినచో అతనిని యజ్ఞపశువుగా జేసి నిన్ను ఆరాధింతును' అని ప్రార్థించెను. పిదప వరుణుని అనుగ్రహముతో ఆయనకు (హరిశ్చంద్రునకు) పుత్రుడు కలిగెను. అతని పేరు రోహితుడు.

*7.10 (పదియవ శ్లోకము)*

*జాతఃసుతో హ్యనేనాంగ మాం యజస్వేతి సోఽబ్రవీత్|*

*యదా పశుర్నిర్దశః స్యాదథ మేధ్యో భవేదితి॥7533॥*

అంతట వరుణుడు హరిశ్చంద్రునితో 'రాజా! నీకు కుమారుడు కలిగినాడు గదా! ఇక నీవు ఇచ్చిన మాట ప్రకారము అతనిని యజ్ఞపశువుగా జేసి, నన్ను ఆరాధింపుము' అని నుడివెను. అప్పుడు హరిశ్చంద్రుడు ఇట్లనెను - 'దేవా! ఈ పసికందునకు పదిదినములు గడచిన తరువాత ఇతడు యాగపశువుగా అగుటకు అర్హుడగును.

PVD Subrahmanyam చెప్పారు...

*7.11 (పదకొండవ శ్లోకము)*

*నిర్దశే చ స ఆగత్య యజస్వేత్యాహ సోఽబ్రవీత్|*

*దంతాః పశోర్యజ్జాయేరన్నథ మేధ్యో భవేదితి॥7534॥*

పది దినములు గడిచిన పిదప, వరుణుడు మరల వచ్చి - 'ఇప్పుడు నీవు యజ్ఞమును ఆచరింపుమని హరిశ్చంద్రునకు గుర్తుచేసెను. అప్పుడు అతడు "దంతములు వచ్చిన తరువాత ఇతడు యజ్ఞపశువు కాదగును" అని ప్రత్యుత్తరమిచ్చెను.

*7.12 (పండ్రెండవ శ్లోకము)*

*జాతా దంతా యజస్వేతి స ప్రత్యాహాథ సోఽబ్రవీత్|*

*యదా పతంత్యస్య దంతా అథ మేధ్యో భవేదితి॥7535॥*

ఆ బాలునకు దంతములు వచ్చిన తరువాత వరుణుడు తిరిగివచ్చి- "హరిశ్చంద్రా! ఇప్పుడు నీ వాగ్దానము ప్రకారము యజ్ఞము చేయుము' అని పలికెను. అనంతరము అతడు - "పాలపండ్లు ఊడిపోయిన పిమ్మటనే ఇతడు యజ్ఞపశువు అగుటకు అర్హుడగును" అని నుడివెను.

*7.13 (పదమూడవ శ్లోకము)*

*పశోర్నిపతితా దంతా యజస్వేత్యాహ సోఽబ్రవీత్|*

*యదా పశోః పునర్దంతా జాయంతేఽథ పశుః శుచిః॥7536॥*

కొంతకాలమునకు పిమ్మట వరుణుడు తిరిగి వచ్చి 'ఇతని పాలపండ్లు ఊడిపోయినవి గదా! ఇప్పుడైనను యజ్ఞమొనర్పుము' అని వచించెను. అప్పుడు హరిశ్చంద్రుడు "మరల ఇతనికి దంతములు వచ్చిన పిదప మాత్రమే ఇతడు యజ్ఞపశువు అగుటకు యోగ్యతను పొందును' అని సమాధానమిచ్చెను.

*7.14 (పదునాలుగవ శ్లోకము)*

*పునర్జాతా యజస్వేతి స ప్రత్యాహాథ సోఽబ్రవీత్|*

*సాన్నాహికో యదా రాజన్ రాజన్యోఽథ పశుః శుచిః॥7537॥*

అనంతరము మరల వచ్చిన వరుణుడు "ఈ బాలునకు మరల దంతములు వచ్చినవి గదా! యజ్ఞమొనర్పుము' అని పలికెను. అప్పుడు హరిశ్చంద్రుడు 'దేవా! క్షత్రియుడు ఆయుధమును చేబూనిన పిమ్మట యజ్ఞపశువగుటకు యోగ్యుడు అగును' అనెను.

*7.15 (పదునైదవ శ్లోకము)*

*ఇతి పుత్రానురాగేణ స్నేహయంత్రితచేతసా॥7538॥*

*కాలం వంచయతా తం తముక్తో దేవస్తమైక్షత॥7538॥*

ఈ విధముగా పుత్రునిపై గల మమకారములో మునిగియున్న హరిశ్చంద్రుడు, ఆ స్నేహపాశమునుండి బయట పడలేక ఎప్పటికప్పుడు కాలయాపనము చేయుచు వచ్చెను. వరుణుడును హరిశ్చంద్రుని మాటలను కాదనక అతడు చెప్పిన సమయమునకై నిరీక్షించుచు వచ్ఛెను.

*7.16 (పదహారవ శ్లోకము)*

*రోహితస్తదభిజ్ఞాయ పితుః కర్మ చికీర్షితమ్|*

*ప్రాణప్రేప్సుర్ధనుష్పాణిరరణ్యం ప్రత్యపద్యత॥7539॥*

రోహితుడు కొంత పెద్దవాడైన పిదప తన తండ్రి చేయదలచిన (అనగా తనను యజ్ఞపశువుగా జేసి వరుణుని ఆరాధింపదలచిన) కార్యమును ఎఱింగి, తన ప్రాణములను దక్కించుకొనుటకై ధనుర్బాణములను చేబూని అడవులకు చేరెను.

*7.17 (పదిహేడవ శ్లోకము)*

*పితరం వరుణగ్రస్తం శ్రుత్వా జాతమహోదరమ్|*

*రోహితో గ్రామమేయాయ తమింద్రః ప్రత్యషేధత॥7540॥*

*7.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*భూమేః పర్యటనం పుణ్యం తీర్థక్షేత్రనిషేవణైః|*

*రోహితాయాదిశచ్ఛక్రః సోఽప్యరణ్యేఽవసత్సమామ్॥7541॥*

పలుమారులు తనను వంచించిన హరిశ్చంద్రునిపై వరుణుడు కుపితుడయ్యెను. ఫలితముగా హరిశ్చంద్రుడు మహోదరవ్యాధికి లోనయ్యెను. ఇట్లు తండ్రి వ్యాధిగ్రస్తుడైన విషయము తెలిసినంతనే రోహితుడు తన నగరమునకు తిరిగివచ్చుటకు సిద్ధమాయెను. అంతట ఇంద్రుడు 'నగరమునకు వెళ్ళవలదు' అని అతనిని నివారించుచు ఇట్లనెను "రోహితా! నీవు యజ్ఞపశువై మృతిచెందుటకంటె దివ్యములైన తీర్థములను, క్షేత్రములను సేవించుచు భూమండలమున సంచరించుట మేలు. అది మిగుల పవిత్రకార్యము" అను ఇంద్రుని ఆదేశానుసారము రోహితుడు అరణ్యమున ఒక సంవత్సరము నివసించెను.

*7.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*ఏవం ద్వితీయే తృతీయే చతుర్థే పంచమే తథా|*

*అభ్యేత్యాభ్యేత్య స్థవిరో విప్రో భూత్వాఽఽహ వృత్రహా॥7542॥*

ఇట్లు రోహితుడు ఐదు సంవత్సరములపాటు ప్రతి సంవత్సరము తన తండ్రికడకు వెళ్ళుటకై ఆలోచించుచు వచ్చెను. ఎప్పటికప్పుడు ఇంద్రుడు వృద్ధబ్రాహ్మణరూపములో వచ్చి అతని ప్రయత్నమును ఆపివేయుచుండెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*104వ నామ మంత్రము*

*ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః*

హృదయంలోని అనాహతచక్రానికి చెందిన రుద్రగ్రంథులను భేదించి తద్ద్వారా సాధకునికి సాధకునికి లయాదులు తొలగింపజేసి, సహస్రారంలో చిదానంద స్థితిని అనుగ్రహించు కుండలినీ శక్తి స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రుద్రగ్రంథి విభేదినీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరీ ఆరాధనలో నిమగ్నమైన భక్తునకు బుద్ధివికాసము, వివేకోదయంగలిగి ఆత్మానందానుభూతిని పొందును.

హృదయమునందు గల అనాహతచక్రమునకు సంబంధించిన రెండు గ్రంథులు గలవు. వీటికే రుద్రగ్రంథులు అనిపేరు.

బ్రహ్మగ్రంథియందు బ్రహ్మ, విష్ణుగ్రంథి యందు విష్ణువు, ఈ రుద్రగ్రంథి యందు రుద్రుడు అధిష్టానులై ఉంటారు. రుద్రుడు లయకారకుడు. రుద్రగ్రంథి ఛేదనముతో సర్వమూ లయంచేసి కుండలినీ శక్తిస్వరూపిణి అయిన శ్రీమాత సాధకునికి అమృతత్త్వాన్ని ప్రసాదింపజేస్తుంది.

శ్రీవిద్యా మంత్రమయిన షోడశాక్షరిలో పదహారు బీజాక్షరములుండును. పంచదశీ మంత్రము పదిహేను అక్షరములయితే ఆ మంత్రానికి చివర శ్రీం బీజము చేర్చబడితే ఆ మంత్రం షోడశాక్షరీ మంత్రం అవుతుంది.

పంచదశీ మంత్రములో

1) వాగ్భవకూటము, 2) కామరాజకూటము, 3) శక్తికూటము

పంచదశీ మంత్రానికి చివర *శ్రీం* బీజం చేర్చితే పదహారక్షరముల (షోడశాక్షరీ) మంత్రమవుతుంది. ఈ షోడశాక్షరీ మంత్రములో నాలుగుకూటములు (ఖండములుగా) ఉన్నవి. అవి 1) ఆగ్నేయము (అగ్ని), 2) సౌరము(సూర్య), 3) సౌమ్య, 4) చంద్రకళ అని పేర్లు గలవు. వీటికే 1) వాగ్భవకూటము, 2) కామరాజకూటము, 3) శక్తికూటము, 4) తురీయాకూటము అని పేర్లు గలవు. ఈ నాలుగు కూటములలో మొదటి మూడీంటికి హృల్లేఖలు ( *హ్రీం* - బీజము) గలవు. ఈ మూడు హృల్లేఖలే మూడు గ్రంథులు. అవి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఈ మూడింటిని కుండలినీ శక్తి రూపంలో జగన్మాత భేదించుతోంది అంటే ఆ ముడిని (గ్రంథిని) ఛేదిస్తూ అందులోకి ప్రవేశిస్తుంది.

దత్తాత్రేయ సంహితలో చతుర్థప్రకరణములో షట్చక్రములకు కులమనియు, మరియు వీనిలో మూడు దేవీ చక్రములు గలవు. ఆ మూడింటినే బ్రహ్మ,విష్ణు,రుద్రగ్రంథులని అందురు. బ్రహ్మగ్రంథికి గల రెండు చక్రములు ఒకటి పృథివీ రూపము, రెండవది జలరూపము, ఆ పైన గల విష్ణుగ్రంథికి గలదు. ఆ విష్ణుగ్రంథికి గల రెండుచక్రములకు ఒకటి వహ్నిమయ చక్రము, సూర్యమయ చక్రము, తేజోమయ చక్రములు గలవు ఇవి సకల సిద్ధులను కలిగించును. తరువాత రుద్రగ్రంథి గలదు. ఈ రుద్రగ్రందికి ఆకాశరూప, వాయురూపచక్రములు గలవు. బ్రహ్మగ్రంథిని భేదించితే సృష్టిజన్మాదులను, విష్ణుగ్రంథిచే జీవద్దశ, రుద్రగ్రంథిచే లయాదులు నశించి, సహస్రారము చేరినంతనే చిదానంద స్థితిని కలుగ జేయును. ఇది యోగసాధకులకు మాత్రమే సాధ్యము. అందుకే గ్రంథిభేదనము చేసిన యోగులను దర్శించితే పుణ్యం కలుగుతుంది. వారిని స్పర్శిస్తే పాపప్రక్షాళనమౌతుంది.

ఇంతవరకూ *నిద్రావస్థ* లో నున్న కుండలినీ శక్తి *ప్రయాణావస్థ* లో రుద్రగ్రంథి ఛేదనముతో సహస్రారంలో శివునితో చేరి *సుఖావస్థ* కు చేరుతుంది

అట్టి కుండలినీ స్వరూపిణీకి నమస్కరించునపుడు *ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులైన కీ.శే శ్రీ కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతుడను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*682వ నామ మంత్రము*

*ఓం సుఖారాధ్యాయై నమః*

సామాన్యముగా నిత్యపూజా క్రమంలో ఏ విధమైన కాయకష్టముగాని, ఉపవాసములుగాని, నియమ నిష్ఠలుగాని లేకుండ కేవలము మానసికముగా తలచుచూ, పత్రం-పుష్పం-ఫలం-తోయం వంటివి భావనామాత్రముగా సమర్పించుచూ సులభతరముగా ఆరాధించువారిని కూడా అనుగ్రహించు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సుఖారాధ్యా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సుఖారాధ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ కరుణామయిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించితే ఆ తల్లి కరుణించి అన్నవస్త్రములకు లోటులేక, సుఖసంతోషములకు కొదువ లేక, నానాటికి ఇనుమడించిన భక్తిశ్రద్ధలతో జగన్మాతసేవలో జీవించి తరించును.
కాయకష్టము గాని, ఉపవాసములు గాని, ఆర్భాటమయిన పూజాద్రవ్యములు గాని అవసరము లేకుండా కేవలము అంతర్యాగ విధానంలో, అంతర్ముఖంగా ఆ పరమేశ్వరీ ఆరాధనలో త్రికరణశుద్ధిగా, ఆత్మసమర్పణా తత్త్వంతో నిమగ్నమయితే ఆ తల్లి ఆనందిస్తుంది. బ్రహ్మానందాన్ని పొందుతుంది. సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది. ఆ తల్లి *అంతర్ముఖ సమారాధ్య* ఆ తల్లి *సుఖారాధ్య*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
భక్తుడు తనతాహతుకు తగినట్లుగా భక్తితో ఏం సమర్పించినా తీసుకుంటాను. నా భక్తుడ్ని అనుగ్రహిస్తాను అన్న భావంతో శ్రీకృష్ణ పరమాత్మ
*భగవద్గీత - తొమ్మిదవ అధ్యాయం, 26వ శ్లోకం* అన్నారు.

*పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి|*

*తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః॥*

భక్తితో ఒక ఆకును, ఒక పువ్వును.. అవి లేకపోతే ఓ పండును.. అదీ లేకపోతే నీటిని సమర్పిస్తే చాలు సంతోషిస్తా అంటాడు కృష్ణభగవానుడు. దేవుణ్ని పూజించడానికి ఖరీదైన సామగ్రి అక్కర్లేదని, భక్తితో ఏది సమర్పించినా చాలని అర్థం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
భక్తికి కావలసింది నోటితో మాటకాదు, శాస్త్రాలు చదవడంకాదు, నోరులేని జీవాలకు కూడా ఆత్మసమర్పణ బుద్ధి ఉంటేచాలు అనడానికి ఈ పద్యం పరిశీలించుదాము.

ఏ వేదంబు పఠించె లూత , భుజగం బే శాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనం బొనర్చె గరి , చెంచే మంత్ర మూహించె , బో
ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా ? కావు , మీ పాద సం
సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా !

ఓ ఈశ్వరా ! జ్ఞాన సముపార్జనకు ప్రాణులకు విద్య అవసరం లేదు. నీ పాదసేవయే సమస్తజ్ఞానమును కల్గించును . ఎట్లనగా నిన్ను సేవించిన సాలెపురుగు ఏ వేదాధ్యయనము చేసి,జ్ఞానమును సముపార్జించినది . నిన్ను సేవించిన సర్పము ఏ శాస్త్రమును చదివినది . నిను పూజించిన ఏనుగు ఏ విద్య నభ్యసించినది . బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును చదివి నిన్ను సేవించి ముక్తి పొందినాడు . కావున నీ పాదములను సేవించాలనే కుతూహలమే సమస్త జ్ఞానమును కల్గించును ప్రభూ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అందరికీ మంత్రాలురాకపోవచ్చు. పూజావిధానం తెలియకపోవచ్చు. కనీసం ఆ పరమాత్మకు ఏం నివేదన చేయాలో కూడా తెలియక పోవచ్చు. కేవలం వారికి దైవము - ఆ దైవం మీద భక్తి - మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలనే తపన తప్ప వేరేమీ ఉండదు. ఆ పరమాత్మకు కూడా అదేకావాలి. అంతర్ముఖంగా (మనసులోనే)ఆరాధనే కావాలి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కీర్తి శేషులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు బాలాత్రిపుర సుందరీ ఉపాసకులు. సాక్షాత్తు బాలాత్రిపుర సుందరి ఆయన కుమార్తెగా వారింట్లో తిరిగింది. ఆయన మామూలుగా *అమ్మా* అంటే, *ఏం నాయనా నన్ను పిలిచావా... ఇక్కడే ఉన్నానుగా* అనేదట.

ఆయన తొలిరోజుల్లో నిరుపేద. భోజనానికి కూడా ఇబ్బంది పడిన రోజులు. దేవతార్చనలో అమ్మవారికి ఉద్దరిణతో ఉదకం మాత్రమే నివేదించేవారు. అదే పాయసంలాగ అమ్మ స్వీకరించిందట. ఒక రోజున పిడికెడు బంగారు అక్షతలు ఇచ్చిందట. అలా ఇచ్చిందో లేదో తెలియదు గాని, శాస్త్రిగారి ఇల్లు పెద్దదేవాలయం అయిపోయింది. ఒక పెద్ద వేదాధ్యయన పాఠశాల కూడా అయింది. అంతకన్నా మించి నిత్యము వచ్చేపోయే అతిథులకు సంతృప్తిగా భోజనం పెట్టడానికి అన్నపూర్ణాలయం అయింది. జగన్మాత *సుఖారాధ్యా* అని చెప్పడానికి ఇంకేం దృష్టాంతం కావాలి?
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
జగన్మాతను అతి సులభరీతిలో ఉపాసించవచ్చు అని కూర్మపురాణంలో చెప్పబడింది.

అటు వంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సుఖారాధ్యాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*7.20 (ఇరువదియవ శ్లోకము)*

*షష్ఠం సంవత్సరం తత్ర చరిత్వా రోహితః పురీమ్|*

*ఉపవ్రజన్నజీగర్తాదక్రీణాన్మధ్యమం సుతమ్॥7543॥*

*7.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*శునఃశేఫం పశుం పిత్రే ప్రదాయ సమవందత|*

*తతః పురుషమేధేన హరిశ్చంద్రో మహాయశాః॥7544॥*

*7.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ముక్తోదరోఽయజద్దేవాన్ వరుణాదీన్ మహత్కథః|*

*విశ్వామిత్రోఽభవత్తస్మిన్ హోతా చాధ్వర్యురాత్మవాన్॥7545॥*

*7.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*జమదగ్నిరభూద్బ్రహ్మా వసిష్ఠోఽయాస్యసామగః|*

*తస్మై తుష్టో దదావింద్రః శాతకౌంభమయం రథమ్॥7546॥*

రోహితుడు ఆరవ సంవత్సరమున గూడ ఆ వనమునందే సంచరించుచు గడిపెను. పిదప, అతడు అజీగర్తుడను నిరుపేద బ్రాహ్మణునికి ధనమిచ్చి, అతని నడిమి కుమారుడగు శునశ్శేపుని క్రయముగా తీసికొని తన నగరమునకు చేరెను. అనంతరము, అతడు ఆ విప్రసుతుని తన తండ్రియగు హరిశ్చంద్రునకు అర్పించి, ఆయనకు నమస్కరించెను. అప్పుడు మహాయశస్వియైన హరిశ్చంద్రుడు పురుషమేధము (యజ్ఞము) ద్వారా వరుణాది దేవతలను ఆరాధించెను. వాసిగాంచిన ఆ హరిశ్చంద్రుడు ఆ దేవతల అనుగ్రహముతో తీవ్రమైన తన ఉదరవ్యాధినుండి బయటపడెను. ఆ యజ్ఞమునందు హోతగా (ఋగ్వేద ప్రతినిధిగా) విశ్వామిత్రుడు, అధ్వర్యుడు (యజుర్వేద ప్రతినిధిగా) ఆత్మజ్ఞాని (పరమసంయమి) యైన జమదగ్నియు, ఉద్గాతగా (సామవేద ప్రతినిధిగా) అయాస్యమహర్షియు పాల్గొనిరి. వసిష్ఠుడు బ్రహ్మగానుండి ఆ యజ్ఞమును నిర్వహింపజేసెను. అట్లు యజ్ఞమొనర్చిన హరిశ్చంద్రునియెడ ఇంద్రుడు ప్రసన్నుడై ఆయనకు బంగారు రథమును అనుగ్రహించెను.

*7.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*శునఃశేఫస్య మాహాత్మ్యముపరిష్టాత్ప్రచక్ష్యతే|*

*సత్యసారాం ధృతిం దృష్ట్వా సభార్యస్య చ భూపతేః॥7547॥*

*7.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*విశ్వామిత్రో భృశం ప్రీతో దదావవిహతాం గతిమ్|*

*మనః పృథివ్యాం తామద్భిస్తేజసాపోఽనిలేన తత్॥7548॥*

*7.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*ఖే వాయుం ధారయంస్తచ్చ భూతాదౌ తం మహాత్మని|*

*తస్మిన్ జ్ఞానకలాం ధ్యాత్వా తయాజ్ఞానం వినిర్దహన్॥7549॥*

శునశ్శేపుని మహత్త్వమును గూర్చి మున్ముందు వివరింపబడును. సాధ్వీమణియైన భార్యతోగూడి హరిశ్చంద్రుడు యజ్ఞమును ఆచరించెను. హరిశ్చంద్రుని సత్యనిష్ఠకు విశ్వామిత్రుడు పరితృప్తుడై ఆయనకు శాశ్వతమైన ఆత్మజ్ఞానమును ప్రసాదించెను. మహాత్ముడైన విశ్వామిత్రుని జ్ఞానోపదేశమును అనుసరించి, హరిశ్చంద్రుడు తన మనస్సును పృథివియందును! పృథ్విని జలమునందును, జలమును తేజస్సునందును (అగ్నియందును), తేజస్సును వాయువునందును, వాయువును ఆకాశమునందును స్థిరమొనర్చి, ఆకాశమును అహంకారములో లీనమొనర్చెను. పిదప అహంకారమును మహత్తత్త్వమునందు లీనమొనర్చి, దానియందు జ్ఞానకళను (అనగా జ్ఞానాంశమును) ధ్యానించి, ఆ జ్ఞానాంశముచే ఆత్మను ఆవరించిన అజ్ఞానమును భస్మమొనర్చెను.

*7.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*హిత్వా తాం స్వేన భావేన నిర్వాణసుఖసంవిదా|*

*అనిర్దేశ్యాప్రతర్క్యేణ తస్థౌ విధ్వస్తబంధనః॥7550॥*

అనంతరము అతడు నిర్వాణసుఖానుభూతిద్వారా ఆ జ్ఞానకళను గూడ పరిత్యజించి, సమస్తబంధములనుండియు విముక్తుడై స్వస్వరూపమునందు స్థితుడయ్యెను. అది అనిర్వచనీయము, అనూహ్యము.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే సప్తమోఽధ్యాయః (7)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఏడవ అధ్యాయము (7)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*8.1 (ప్రథమ శ్లోకము)*

*హరితో రోహితసుతశ్చంపస్తస్మాద్వినిర్మితా|*

*చంపాపురీ సుదేవోఽతో విజయో యస్య చాత్మజః॥7551॥*

*8.2 (రెండవ శ్లోకము)*

*భరుకస్తత్సుతస్తస్మాద్వృకస్తస్యాపి బాహుకః|*

*సోఽరిభిర్హృతభూ రాజా సభార్యో వనమావిశత్॥7552॥*

*శ్రీశుకుడు వచించెను* రోహితుడు కుమారుడు హరితుడు. అతని తనయుడు చంపుడు. అతడు తన పేరుతో చంపానగరమును నిర్మించెను. చంపుని సుతుడు సుదేవుడు. అతని పుత్రుడు విజయుడు. విజయుని తనూజుడు భరుకుడు. ఇతని సుతుడు వృకుడు. వృకుని పుత్రుడు బాహుకుడు. బాహుకుని రాజ్యమును శత్రువులు ఆక్రమింపగా అతడు (బాహుకప్రభువు) భార్యాసహితుడై వనములకు చేరెను.

*8.3 (మూడవ శ్లోకము)*

*వృద్ధం తం పంచతాం ప్రాప్తం మహిష్యనుమరిష్యతీ|*

*ఔర్వేణ జానతాఽఽత్మానం ప్రజావంతం నివారితా॥7553॥*

వృద్ధుడైన బాహుకమహారాజు మృతుడు కాగా, అతని పట్టమహిషి సహగమనమునకు సిద్ధపడెను. ఆమె గర్భవతిగా ఉన్నట్లు గ్రహించిన ఔర్వమహర్షి ఆ ప్రయత్నమునుండి ఆమెను నివారించెను.

*8.4 (నాలుగవ శ్లోకము)*

*ఆజ్ఞాయాస్యై సపత్నీభిర్గరో దత్తోఽన్ధసా సహ|*

*సహ తేనైవ సంజాతః సగరాఖ్యో మహాయశాః॥7554॥*

బాహుకుని సతి గర్భవతియగుటజూచి ఓర్వలేక (అసూయతో) సవతులు ఆమెచే విషాన్నమును(గరము, గరళము అనగా విషము) తినిపించిరి. ఐనను, ఆ విషప్రభావము ఏ మాత్రమూ పడక గర్భస్థశిశువు క్షేమముగా జన్మించెను. తల్లి కడుపులో గరము (విషము) తో గూడియున్నందున అతడు సగరుడుగా వాసికెక్కెను.

*8.5 (ఐదవ శ్లోకము)*

*సగరశ్చక్రవర్త్యాసీత్సాగరో యత్సుతైః కృతః|*

*యస్తాలజంఘాన్ యవనాంఛకాన్ హైహయబర్బరాన్॥7555॥*

*8.6 (ఆరవ శ్లోకము)*

*నావధీద్గురువాక్యేన చక్రే వికృతవేషిణః|*

*ముండాన్ శ్మశ్రుధరాన్ కాంశ్చిన్ముక్తకేశార్ధముండితాన్॥7556॥*

సగరుడు చక్రవర్తియై (సప్తద్వీపములకు అధిపతియై) మిగుల ఖ్యాతికెక్కెను. అతని పుత్రులు తండ్రి ఆదేశముపై భూమిని త్రవ్వి సముద్రమును నిర్మించిరి. సగరపుత్రులచే నిర్మింపబడుటవలన సముద్రమునకు *సాగరము* అని పేరు వచ్చెను. సగరుడు తన గురువగు ఔర్వుని ఆదేశమును పాటించి, తాలజంఘులుగా వ్యవహరింప బడుచున్న యవనులను, శకులను, హైహయులను, బర్బరులను చంపక వారిని వికృత రూపులనుగా చేసెను. వారిలో కొందరికి శిరోముండనము గావించి, కేవలము మీసములను, గడ్డములను మాత్రము మిగిల్చెను. కొందరి తలలు సగము కొరిగించెను. మరికొందరిని జుట్టు విరబోసికొనిన వారినిగా జేయించెను.

*8.7 (ఏడవ శ్లోకము)*

*అనంతర్వాససః కాంశ్చిదబహిర్వాససోఽపరాన్|*

*సోఽశ్వమేధైరయజత సర్వవేదసురాత్మకమ్॥7557॥*

*8.8 (ఎనిమిదవ శ్లోకము)*

*ఔర్వోపదిష్టయోగేన హరిమాత్మానమీశ్వరమ్|*

*తస్యోత్సృష్టం పశుం యజ్ఞే జహారాశ్వం పురందరః॥7558॥*

సగరుని శాసనము మేరకు వారిలో కొందరు కేవలము ఉత్తరీయములసు ధరించిరి. మరికొందరు ఉత్తరీయములు లేకుండ వస్త్రములను మాత్రము ధరించిరి. ఆ సగరుడు ఔర్వమహర్షి ఆజ్ఞను అనుసరించి, సర్వవేదమయుడు, సకలదేవతా స్వరూపుడు, సర్వాంతర్యామియు, సర్వేశ్వరుడు ఐన శ్రీహరిని అశ్వమేధయజ్ఞములద్వారా ఆరాధించెను. ఆ రాజు నూరవ అశ్వమేధయాగమును పురస్కరించుకొని వదిలిన అశ్వమును ఇంద్రుడు అపహరించెను.

*105వ నామ మంత్రము*

*ఓం సహస్రారాంబుజారూఢాయై నమః*

బ్రహ్మవిష్ణురుద్ర గ్రంథులు ఛేదించుకుంటూ, షట్చక్రములు దాటి, సహస్రారము అను వేయిరేకుల కమలమునధిష్ఠించియున్న కుండలినీ శక్తి స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సహస్రారాంబుజారూఢా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సహస్రారాంబుజారూఢాయై నమః* అని ఉచ్చరించుచు ఆ పరాశక్తిని అత్యంత నిష్ఠాగరిష్ఠుడై ఉపాసించు సాధకుడు నిజంగా పునర్జన్మరహితుడౌతాడు. ఇష్టార్థసిద్ధి కలుగుతుంది.

సాధకుడు తన గురువు నుండి సంప్రాప్తము చేసుకున్న అద్భుత యోగా శక్తితో, అత్యంత నిష్ఠతో మూలాధారము నందు నిద్రావస్థయందున్న కుండలినీశక్తి స్వరూపిణి అయిన జగన్మాతను జాగృతము చేసి, సుషుమ్నా మార్గంలో ఇడ,పింగళ నాడులిరువైపుల ఉండి చైతన్యమును మరింత ఇనుమడింప జేస్తూంటే పంచభూతాత్మకమైన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ చక్రములను దాటుకుంటూ, బ్రహ్మ,విష్ణు,రుద్రగ్రంధులను ఛేదించుకొని, ఆజ్ఞాచక్రమునకావల గల సహస్రారమునకు చేర్చును.

సహస్రారము అనునది చక్రము అంటారు కాని, సహస్రార పద్మము అనడమే సరైనది. ఎందుకంటే సహస్రారము అష్టదళ పద్మము. ఆ అష్టదళములకు ఒక్కొక్క దళమునంధు మరల నూట ఇరువదిఐదు చొప్ఫున నూటఇరువది ఐదు చొప్పున రేకులు ఉంటాయి. ఆవిధంగా ఒక్కొక్క దళమునకు నూటఇరువది ఐదు అయితే ఎనిమిది దళములకు వెయ్యి దళములు ఉంటాయి. అంటే సహస్రారము వేయిదళములు కలిగిన ఒకపద్మము.ఈ సహస్రదళ పద్మము బ్రహ్మరంధ్రమునకు కొంచము దిగువలో ఉంటుంది. ఈ సహస్రారము పౌర్ణమి చంద్రునివలె ప్రకాశిస్తూ చల్లని కాంతికిరణములు సూర్యకిరణములవలె ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఈ సహస్రారంలో కళంకరహితుడైన చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రమండలం మధ్య గల త్రికోణం ఒక మహాశూన్యమువలె ఉండగా ఆ శూన్యంలో పరమేశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరుని వద్దకు కుండలినీశక్తి స్వరూపిణియైన శ్రీమాత చేరుతుంది. వేయిరేకుల సహస్రకమలమును సహస్రారము అంటాము. అటువంటి సహస్రారంలో దేవి, పరమేశ్వరునితో కలసి ఉంటుంది గనుక *సహస్రారాంబుజారూఢా* అనగా వేయిదళములు గలిగిన సహస్రదళ కమలమునందు శ్రీమాత ఉంటున్నది అని అర్థము. ఈ సహస్రారము ఒక పద్మము అనిఅన్నాంగదా! ఇది ఒక విజ్ఞానప్రకాశ ప్రసారకేంద్రము. ఎప్పుడైతే శ్రీమాత కుండలినీ శక్తిరూపంలొ ప్రవేశించినదో అంతటితో సాధకుడు ఒక మహాయోగి అయితీరుతాడు. బ్రహ్మజ్ఞానముచే ప్రకాశిస్తాడు. బ్రహ్మానందమును పొందుతాడు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సహస్రారాంబుజారూఢాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులైన కీ.శే శ్రీ కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతుడను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*682వ నామ మంత్రము*

*ఓం శుభకర్యై నమః*

పాత్రాపాత్రములౌచిత్యములకు తగినట్లుగా, శుభములొన గూర్చునవి ఏవైనను భక్తుల కోరికలను నెరవేరునట్లు జేయు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శుభకరీ* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం శుభకర్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరికి పూజలు చేయు భక్తులకు ఆ తల్లి కరుణించి సర్వాభీష్టసిద్ధి కలిగించును.

జగన్మాత భక్తులకు శుభములనుకలుగజేయును. తన భక్తుల కోరికలలోని ఔచిత్యముననుసరించి, పాత్రతకు తగినట్లుగా సిద్ధింపజేయును. భక్తుల కోరికలలో ధర్మబద్ధత, వారి అర్హతను అనుసరించి నెరవేర్చును. ఒక దొంగ వచ్చి అమ్మా నేను ఫలానా కోటీశ్వరుడు ఇంటికి దోపిడీకి వెళుతున్నాను. తనపని దిగ్విజయంగా పూర్తిచేయునట్లు అనుగ్రహించమంటే జగన్మాత ఆ కోరికను సిద్ధింప జేస్తుందా? చేయదు. అలాగే తల్లి తన బిడ్డను అనారోగ్యమునుండి కాపాడమంటే కాపాడుతుంది. ఒక తండ్రి తన కుమార్తెకు వివాహం ఆటంకం లేకుండా జరిగేలా అనుగ్రహించమంటే అనుగ్రహిస్తుంది.

వెర్రిగొల్ల కాళిదాసుకు విద్యకావాలి అని కాళికాదేవిని అడగడంకూడా రాక, *కాళీబిద్దె* అని అడిగాడు. ఆ తల్లి అనుగ్రహించి కాళిదాసును ఒక మహాకవిగా మార్చింది. అలా అతనికి శుభకరము కలుగజేసింది.

పాండవులు అజ్ఞాతవాసానికి విరాట్ రాజు కొలువుకు వెళ్ళేముందు ద్రౌపది *జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి* అని శుభములొనగూర్చమని కోరింది. మరి వారికి అజ్ఞాతవాసము శుభప్రదమయిందికదా. విరాటరాజు కూతురు ద్రౌపదికి కోడలయిందికదా. కీచక సంహారం జరిగిందికదా.

ఆ తల్లిని తలచుకుంటూ అమ్మా! శ్రీమాతా! శుభకరీ! కరుణించు తల్లీ అని వేడుకుంటే మనకు ఏ శుభం జరగాలో మనం అడగకుండానే కలుగజేస్తుంది. ఆ జగన్మాత *సుఖారాధ్య*. అంతర్ముఖంగా తలుచుకుంటే చాలు, మనకు శుభములే జరుగుతాయి. అందుకనే ఆ తల్లికి నమస్కరించునపుడు *ఓం శుభకర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

SRI SARMADA చెప్పారు...

#త్రైలింగ_స్వామి

పుట్టింది తెలుగు దేశం లో అయినా ,ఆయన గడిపిన కాలమంతా కాశీ లోనే .ఆయన చూపించిన మహిమలు అపారం .వారు పొందిన సిద్దులనేకం .వారి దివ్య విభూతి అనంతం .ఆయనే త్రైలింగ స్వామి .అసలు పేరు శివ రామయ్య .విశాఖ పట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామం లో జన్మించారు .తండ్రి నరసింహారావు ,తల్లి విద్యావతి ,సంపన్న బ్రాహ్మణ కుటుంబం .ఆయన జననం 19 -12 -1607 తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడి మీద పడటం ఆమె చూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు .చిన్నప్పటి నుంచి ఐహిక వాంచల మీద కోరిక లేదు .నలభై ఏళ్ళకు తండ్రి ,యాభై రెండో ఏట తల్లి చని పోయారు .శ్మశానాన్నే ఇల్లు గా చేసుకొని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చేసి ,అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళు గడిపాడు.

స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానం లో బస్తుర్ చేరాడు ..అక్కడ భాగీరధి స్వామి తో పుష్కర తీర్దానికి వెళ్ళాడు .ఆయన దీక్షను ఇచ్చి గణపతి స్వామి అనే దీక్షా నామం ఇచ్చాడు .అప్పటికి అయ్యగారి వయస్సు డెబ్భై ఎనిమిది .గురు సమక్షం లో పదేళ్ళ సాధన చేసి అద్భుత శక్తుల్ని సంపాదించు కొన్నాడు .గురువు మరణించిన తర్వాత తీర్ధ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరాడు ..అక్కడ స్వంత ఊరి వారు కని పించి ఇంటికి రమ్మని కోరినా వెళ్ళ లేదు ..రామేశ్వరం లో ఒక బ్రాహ్మణ బాలుడు చని పోతే శవాన్ని తీసుకొని వెళ్తూ తలిదండ్రులు విలపిస్తుంటే ,గుండె కరిగి కమండలం లోని నీరు వాడి మీద చల్లాడు .వెంటనే బాలుడు బ్రతికి అందర్నీ ఆశ్చర్య పరచాడు ..ఆయన మహత్తు అందరికి తెలిసి సాక్షాత్తు శ్రీ రామ లింగేశ్వరుడే గణ పతి స్వామి అనుకోన్నారందరూ .అక్కడి నుండి నేపాల్ చేరాడు .అక్కడ అడవి లో తపస్సు చేస్తుంటే ఒక పులి వచ్చి ఆయన కు ఎదురు గుండా కదల కుండా కూచుని పోయింది .రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి చకితుడై నాడు పులిని చంపటానికి ప్రయత్నిస్తే వారించాడు .ఆయన రాజుకు ఈ విషయం చెప్పాడు .నేపాల్ రాజు వచ్చి సాష్టాంగ పడి అనేక కానుక లిస్తే తీసుకో కుండా జంతు హింస చేయ వద్దని హితవు చెప్పాడు స్వామి .అక్కడి నుంచి టిబెట్ ,తరువాత మానస సరోవరం సందర్శించి ,దారిలో ఎన్నోఅద్భుతాలను చూపి హిమాలయాలలో చాలా కాలమ్ తపస్సు చేసి నర్మదా నదీ తీరం లో మార్కండేయ ఆశ్రమం లో ”ఖాఖీ బాబా”అనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించాడు ..ఒక రోజూ తెల్ల వారు జామున నర్మదా నది లో పాలు ప్రవహిస్తున్నట్లు ,ఈ స్వామి దాన్ని తాగుతున్నట్లు ఖాఖీ బాబా చూశారు .గణపతి లోని మహిమేమిటో గ్రహించారు .విషయం తెలిస్తే ఆయన ఇక అక్కడ ఉండరు.

SRI SARMADA చెప్పారు...

1733 లో . ప్రయాగ చేరారు .తపో నిష్టలో ఉండగా ఒక సారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తారణ భట్టా చార్య ఆశ్రమం లోకి పోదామని చెప్పినా కదల లేదు .దూరం లో ఒక పదవ మునిగి పోతోందని దాన్ని రక్షించాలని సంజ్న చేశారు .అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగు తుంటే .దిగంబర స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించాడు .శిష్యుడు ఆశ్చర్యం ప్రకటించగా ప్రతి వాడి లోను మహాశక్తులు అజ్ఞాతం గా ఉంటాయని వాటిని గుర్తించే వారు తక్కువ అని తెలిపారు.

1737 లో కాశీ చేరారు దిగంబర గణ పతి స్వామి .అప్పటికి ఆయనకు 130 ఏళ్ళు .కాశీ లో 150 ఏళ్ళు గడి పాడు .ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహం .గడ్డాలు ,మీసాలు పెరిగి దీర్ఘ శరీరం తో దిశ మొలతో .మెడ లో పెద్ద రుద్రాక్ష మాల తో ,పెద్ద బాన పొట్ట తో కాశీ నగర వీధుల్లో సంచ రించే వాడు .గంటల సేపు గంగా జలం పై పద్మాసనం లో తేలి ఉండే వాడు .అలాగే గంటల కొద్దీ కాలమ్ నదీ గర్భం లో మునిగి ఉండే వాడు .అంటే కుంభక విద్య లో అద్భుత మైన నేర్పు ఆయనకు ఉండేదాన్న మాట ..కుష్టు రోగులకు సేవ చేసి వారి ని ఆదరించాడు బాబా .వెద వ్యాస ఆశ్రమం చేరి అక్కడ సీతా నాద బంద్యో పాద్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి ,హనుమాన్ ఘాట్ చేరాడు .ఒక మహారాష్ట్ర స్త్రీ రోజూ విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తు ఈ దిగంబర స్వామిని రోజూ చూస్తూ ఏవగించు కొనేది .ఆమె భర్త కు రాచ పుండు .ఆమెకు అందరు దిగంబర స్వామిని అర్ధించ మని కోరారు .కానీ తాను తూల నాడిన ఆయన దగ్గరకు వెళ్ళ టానికి సందేహించింది .చివరికి వెళ్లి కాళ్ళ మీద పడింది .ఆయన ఇచ్చిన విభూతి తో జబ్బు మాయ మైంది

కాశే మహా నగరం లో ఎందరో తెలుగు వారు ఉపాధ్యాయులు గా అధ్యాపకులు గా ఉన్నారు .వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించారు .ఆయనకు ”త్రైలింగ స్వామి ”అనే పేరు పెట్టారు .తెలుగు దేశం అంటే త్రిలింగ దేశమే కదా .అప్పటి నుంచి ఆ పేరే స్థిర పడి పోయింది .1800 లో తన మకాం ను దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవం కు మార్చారు.

ఎప్పుడూ మౌనమే ,ధ్యానమే ,తపస్సు యోగ సమాధే .అనుకే ఆయన్ను ”మౌన బాబా ”అన్నారు .కాశీ రాజు వీరిని తన పడవ లోకి ఆహ్వానిస్తే వెళ్ళారు .రాజు బ్రిటిష్ వారు బహుమతి గా ఇచ్చిన కత్తి ని స్వామి చూడాలని ముచ్చట పడితే ఇచ్చారు .అది పొరపాటున గంగలో జారి పడి పోయింది .రాజుకు కోపం వచ్చి తిట్టాడు .స్వామి తన చెయ్యి గంగా నది లో పెట్టి ఒకే రకం గా ఉండే రెండు కత్తులను తీసి అందు లో రాజుదేదో గుర్తించి తీసుకో మన్నాడు .రాజు గుర్తించ లేక పోతే తానె గుర్తించి చెప్పి ఇచ్చాడు .రెండో దాన్ని గంగలోకి విసిరేశారు స్వామి.

దిగంబరం గా తిరగటం కొంత మందికి నచ్చక కేసు పెట్టారు .కోర్టు లో కేసు నడి చింది .ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని మేజిస్ట్రేట్ ఆర్డర్ వేశాడు .అలాగే తెచ్చారు .ఆయన మహిమలను అధికారులు ఆయన కు వివ రించారు .ఆయన తాను తినే మాంసం స్వామి తింటే శిక్షించను అన్నాడు .స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు .వెంటనే తన చేతి లో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని తినేశారు .మతి పోయింది మేజిస్ట్రేట్ కు .అయితే సుగంధ పరి మళం కోర్టు అంతా వ్యాపించింది .స్వామి మహిమ తెలిసి దిగంబరం గా తిరిగే హక్కు ఇచ్చాడు.
ఒక సారి ఒక ఆకతాయి దుండగులు కొందరు సున్న పు తేట ఇచ్చి పాలు అని చెప్పారు .శుభ్రం గా తాగేశాడు స్వామి . .వెంటనే మూత్ర రూపం లో దాన్ని అంతట్ని విసర్జించాడు.

SRI SARMADA చెప్పారు...

శ్రీ రామ కృష్ణ పరమ హంస 1868 లో కాశీ వచ్చి నప్పుడు తన మేనల్లుడు హృదయ నాద్ తో కలిసి మౌన స్వామిని దర్శించారు .ఆయనకు బాబా నశ్యం వేసు కొనే కాయ కానుక గా ఇచ్చారు .స్వామిని ”నడయాడే విశ్వనాధుడు ”అని చెప్పారట పరమ హంస ..ఇంకో సారి అర్ధ మణుగు పాయసం వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తిని పించారట .పరమ హంస స్వామిని” ఈశ్వరుడు ఏకమా అనేకమా ”అని ప్రశిస్తే -సమాధి స్తితి లో ఏకం అనీ ,వ్యావహారిక దృష్టి లో అనేకం అని సైగల తోనే చెప్పారు స్వామి .పరమ హంస స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు .ఇద్దరు మహా పురుషులే .పరమ హంసలే .ఒకరి విషయం రెండో వారికి తెలుసు .ఎన్నో అద్భుతాలు చేసిన రామ కృష్ణులు స్వామిని అంత గా గౌర విన్చా రంటే బాబా ఎంత మహిమాన్వితుడో తెలుస్తోంది ..ఒక సారి రాజ ఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించటానికికేదార్ ఘాట్ లో ఉన్న మన స్వామి దగ్గరకు వచ్చారు .ఇద్దరు గాడ్హం గా ఆలింగనం చేసుకొన్నారు .కాసేపట్లో అందరు చూస్తుండ గానే ఇద్దరు మాయమైనారు .అరగంట తర్వాత స్వామి తిరిగి వచ్చారు .తాను ఆయన్ను రాజ ఘాట్ లో దింపి వచ్చాను అని స్వామి అందరి సందేహాల్ని తీర్చారు.

పంచ గంగా ఘట్టం లో చిన్న భూ గృహం నిర్మింప జేసుకొని 32 ఏళ్ళు సేవ చేసి ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండు నెలల గడువు కావాలని కోరితే మరణాన్ని వాయిదా వేసుకొని ,భక్తుడైన మంగళ దాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధి లో ఉంది ,తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనం లో కూర్చుండి ,బ్రహ్మ రంధ్రాన్ని చేస్దించుకొని 26 -12 -1887
న సర్వజిత్ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమ వారం త్రైలింగ స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించు కొన్నారు .ఆయన శరీరాన్ని చెక్క పెట్టె లో పెట్టి ఆయన కోరిన విధం గానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహం లో వదిలారు .ఆ రోజూ నుండి ఈ రోజూ వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం పూజా జరుగు తాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్ లోని మఠం లో జరగటం విశేషం .పతంజలి యోగం లో విభూతి పాదం లో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు ,కుంభక యోగం లో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకొన్నారు .ఆయన సంస్కృతం లో రాసిన ”మహా వాక్య రత్నావళి ”కి వ్యాఖ్యను బెంగాలి లో రాశారు.

కాని మన తెలుగు వారి ద్రుష్టి ఇంకా దాని పై పడక పోవటం విచారకరం అంటారు బాధతో రామ రాజు గారు .280 సంవత్సరాలు జీవించి ,స్వచ్చంద మరణాన్ని పొంది ,యోగ సిద్దులలో త్రివిక్రములై ఆశ్రిత జన కల్ప వృక్షమై మౌన ముద్రాలన్కారులై తెలుగు వారై ఉండి ఉత్తర దేశం లో అందులోను కాశీ మహా క్షేత్రం లో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రైలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించటానికి .

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*683వ నామ మంత్రము*

*ఓం శోభనాసులభాగత్యై నమః*

శోభనములైన పురుషార్థముల స్వరూపిణిగను, పురుషార్ఠములు సుఖోపాస్యమగు గమ్యస్థానముగను, పురుషార్థమలు
సులభతరముచేయు జ్ఞానస్వరూపిణిగను, పురుషార్థములు సులభగతిని లభింపజేయునదిగను, పునర్జన్మరాహిత్యము నొనగూర్చునదిగను తేజరిల్లు శ్రీమాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శోభనాసులభాగతిః* అను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం శోభనాసులభాగత్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసన చేయు సాధకుడు నిశ్చయంగా చతుర్విధ పురుషార్థములను పొందు సులభగతిని సాధించి ముక్తసంగుడై తరించును.

ధర్మార్ధ కామమోక్షములు అను చతుర్విధ పురుషార్థములనే శోభనములు అంటారు. వీటిని అతి సులువుగా తన భక్తులకు సంప్రాప్తింపజేస్తుంది. ఇంతకు నామ మంత్రములో *సుఖారాధ్యా* అని (681వ నామ మంత్రములో) స్తుతించాము. అంటే జగన్మాతను ఆరాధించడానికి కఠోరమైన ఉపవాసములు, వనాంతరసీమలకు పోయి ఘోర తపస్సులు చేయనక్కరలేదు. *శ్రీమాత్రే నమః* అని స్మరిస్తూ, అంతర్ముఖంగా ధ్యానించితే సరిపోతుంది. సర్వశుభములు కలుగజేసి తరింపజేస్తుందనడానికి ఆ తల్లిని *శుభకరీ* అని (682వ నామ మంత్రములో) స్తుతిస్తున్నాము. ఇప్పుడు ఈ 683వ) నామ మంత్రములో *శోభనాసులభాగతిః* అని స్తుతిస్తున్నాము. చతుర్విధపురుషార్థములలో ధర్మార్థకామములు సక్రమమైన పద్ధతిలో నిర్వర్తిస్తే నాలుగవ పురుషార్థము అసంకల్పితముగానే సంప్రాప్తిస్తుంది. *ధర్మము* ఉత్తమగతులు పొందడాని దైవధ్యానము, సాటిమనిషికి సహాయపడడము, ధానధర్మములాచరించుట వంటి సత్కార్యములు చేయుచు తన కుటుంబమును నిర్వహించుటలో తన ధర్మమును తాను నిర్వర్తించుట అనననది పురుషార్థములలో మొదటిది.

*అర్థము* అష్టైశ్వర్యములు (ఎనిమిది విధములైన ఐశ్వర్యములు: 1. దాసీ జనము. 2. భృత్యులు. 3. పుత్రులు. 4. మిత్రులు. 5. బంధువులు. 6. వాహనములు. 7. ధనము. 8. ధాన్యము) ఇవి మానవునికి కావలసినవి. ధర్మబద్ధమైన పద్ధతిలో సంప్రాప్తింపజేసుకోవాలి.

*కామము* కామిగాక మోక్షకామిగాడు అన్నట్లు పున్నామ నరకమునుండి కాపాడబడుటకు, దైవము తనకొసగిన ఒక విధిప్రకారము సృష్టివికాసానికి కారకుడగుటకు సంతానమును పొందడము - ఇవన్నీ సక్రమంగా నిర్వహిస్తే పరబ్రహ్మము గూర్చి తెలుసుకోవాలని, పునర్జన్మరహితమైన దైవ సాన్నిధ్యమును పొందాలనే కామనలు తీర్చుకొనుదిశగా జీవనపదంలో ముందుకు సాగుట.

*మోక్షము* ఈ ధర్మార్థకామములు ఎప్పుడైతే పైన చెప్పిన విధంగా మానవుడు నిర్ణయించాడో అప్ఫుడే పరమాత్మ ఆ మానవునికి ఏవిధమైన మోక్షమునివ్వాలో నిర్ణయించుకోవడం జరుతుంది. ఈ దర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములే శోభనములు. ఇవి పొందాలంటే జగన్మాత సులభమైన మార్గాన్ని ఇస్తుంది గనుక ఆతల్లిని *శోభనాసులభాగతిః* అని స్తుతిస్తున్నాము.

'ధర్మార్థకామములను ఈ మూడు పురుషార్థములను నీ పూర్వవాసనలకనుగుణంగా, క్రమం తప్పక ఆచరించు. నేను నాలుగవ పురుషార్థమైన మోక్షాన్ని నేను ఇస్తాను. అది నువ్వు ఆచరించవలసినదికాదు. నేను *సుఖారాధ్యను* ఎందుకంటే భోళా శంకరుని భార్యను. ఆయనలో సగం గుణాలు నాకు వచ్చాయి. అందుకని సులువుగా ఆరాధింపబడతాను. గోరంత ఆరాధిస్తే కొండంత ఇచ్చేటంత *భోళాశాంకరి* ని. నీకు అన్నీ శుభకరమే అవుతాయి ఎందు కంటే నేను శుభకరిని. నాభర్త శంకరుడు *శుభంకరుడు*. నేను ఆయన భార్యను గనుక *శుభంకరి* ని' అని జగన్మాత అంటుంది. అనడమేకాదు *శోభనాసులగతిః* అనిపించు కుంటూ ధర్మార్థకామమోక్షములు అను శోభనములను సులభతరంగా పొందే మార్గాన్ని చూపిస్తుంది.

అమ్మవారిని (96వ శ్లోకంలో) 462వ నామ మంత్రంలో *శోభనా* అని విశేషించాము.

అలాగే 178వ శ్లోకంలో 'సువాసిన్యర్చనప్రీతాఽ *శోభనా* ' అన్నాము.

ఇన్ని సార్లు అమ్మను ఒకే పదాన్ని విశేషంగా చెపుతూ స్తుతిస్తున్నామంటే జగన్మాత సర్వశుభకారిణి.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శోభనాసులభాగత్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*684వ నామ మంత్రము*

*ఓం రాజరాజేశ్వర్యై నమః*

దేవేంద్రుడు, బ్రహ్మోపేంద్రమహేంద్రాదుల వంటి రాజులు, కుబేరుడు, చంద్రుడు మొదలైనవారికే ఈశ్వరిగా, శ్రీవిద్యాషోడశాక్షరీమంత్రవిద్యాధి దేవతాస్వరూపిణిగా తేజరిల్లు జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రాజరాజేశ్వరీ* అను ఆరక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును *ఓం రాజరాజేశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమదయాస్వరూపిణి అయిస లలితాంబనుఅత్యంత భక్తిశ్రద్ధలతో పూజించు భక్తునకు రాజరాజేశ్వరీ స్వరూపిణి అయిన జగన్మాత కరుణతో సాధకునికి సర్వాభీష్టసిద్ధియును, పరాతత్త్వ జ్ఞానామృతమును సంప్రాప్తింపజేసి తరింపజేయును.

జగన్మాత తన ప్రేమలోక సామ్రాజ్యాధినేత అయిన శివునికి ప్రాణేశ్వరి, అర్ధాంగి.

దేవేంద్రుడు (సురలోకాధిపతి - రాజు) అయిన ఇంద్రునకు, బ్రహ్మోపేంద్రమహేంద్రాదులకు (త్రిమూర్తులకు), కుబేరుడు (యక్షులకు రాజు), చంద్రునకును (రాజు అనగా చంద్రుడు - రేరాజు) ఈ రాజులందరికీ జగన్మాత ఈశ్వరి (రాజరాజేశ్వరి). చతుర్దశ భువనాల కధిపతులై పరిపాలించు రాజులందరికీ, అష్టదిక్పాలకు, కూడా ఆ పరాశక్తి ఈశ్వరి గనుక *రాజరాజేశ్వరి*

మంత్రరాజమైన శ్రీవిద్యా షోడశాక్షరీమంత్ర విద్యాధిదేవతా స్వరూపిణిగా జగన్మాత విరాజిల్లుచున్నది. సర్వమంత్రాలకు, సర్వతంత్రాలకు, సర్వమంత్రాలకు శక్తిగా, అధినేత్రిగా, ఈశ్వరిగా విరాజిల్లుచున్నది గనుక, జగన్మాత *రాజరాజేశ్వరి*.

*శ్రీలలితా సహస్రనామస్తోత్ర* ఫలశ్రుతిలో

*లౌకికా ద్వచనాన్ముఖ్యం విష్ణునామాను కీర్తనమ్|*

*విష్ణునామ సహస్రాచ్చ శివనామైక ముత్తమమ్|*

*శివనామ సహస్రాచ్చ దేవ్యా నామైక ముత్తమమ్॥*

అనగా లోక వాక్యాల కంటే విష్ణునామ సంకీర్తనం,అలాటి విష్ణు సహస్రసామముల కంటె శివనామము, శివసహస్రనామాల కన్నా శ్రీలలితా నామం ఒక్కటి ఎంతో మహిమగలది అంటే వీటన్నిటికీ శ్రీమాతా నామ మంత్రం *ఈశ్వరి* వంటిది. అందుకే జగన్మాత *రాజరాజేశ్వరీ* అని స్తుతింపబడుచున్నది.

అటువంటి ఈశ్వరి అయిన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం రాజరాజేశ్వర్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*106వ నామ మంత్రము*

*ఓం సుధాసారాభివర్షిణ్యై నమః*

యోగసాధనా ప్రక్రియలో షట్చక్రములను ప్రచోదనము చేస్తూ, బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను ఛేదిస్తూ బ్రహ్మరంధ్రమునకు దిగువభాగంలో గల సహస్రారకమలంలో, చంద్రమండలమందు ప్రవేశించినతోడనే ఆహ్లాదకరమైన అమృత (సుధా) ధారలను కురిపించి షట్చక్రములను, గ్రంథిత్రయమును, సమస్తనాడీ మండలమును ఆ అమృతధారలలో తడిపి సాధకుని పరిపూర్ణమైన ఆత్మానందమును అనుభవింపజేయు కుండలినీ శక్తి రూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సుధాసారాభివర్షిణీ* అను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం సుధాసారాభివర్షిణ్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు ఆత్మానందానుభూతిని పొంది అమృతత్త్వ స్థితికి చేరుకుని జన్మరాహిత్యం పొందగలడను సంతృప్తి కలిగి ఉంటాడు.

సాధకుడు తన యోగసాధనా ప్రక్రియలో మూలాధారమందు నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తిస్వరూపిణి అయిన జగన్మాతను జాగృతముచేసి సుషుమ్నా మార్గంలో షట్చక్రములను సందర్శింజేస్తూ, బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులను ఛేదింపజేస్తూ సహస్రారకమలమును చేర్చుతాడు. సహస్రారకమల కర్ణిక అంతయు చంద్రమండలము. అంతయు హిమవన్నగమంతటి శీతలస్థితిలో ఉంటుంది. చంద్రుడు సుధాకరుడు గదా. అక్కడ ఉన్న సుధాసాగరమంతయు ఘనీభవించిన స్థితిలో ఉంటుంది. సాధకుడు ప్రవేశపెట్టిన కుండలినీ శక్తి అగ్నితత్త్వముయిన కారణముచే అక్కడ ఘనస్థితిలోనున్న సుధాసాగరము ద్రవిస్తుంది. అమృత ధారలు ఎడతెగకుండా జాలువారుతూ ఉంటాయి. ఈ సుధా (అమృత) ధారలు కుండలినీ శక్తి స్వరూపిణి అయిన శ్రీమాత అడుగు పెట్టుటతోడనే సుధాధారలు వృష్టిగా కురిసిన కారణంచేత జగన్మాత *సుధాసారాభివర్షిణీ* అని అన్నాము. సాధకుడు మూలాధారం నుండి సహస్రారం చేరు వరకూ కఠోరమైన సాధన చేసి అలసి ఉంటాడు.ఈ సుధాధారలు షట్చక్రములపైనా, బ్రహ్మగ్రంథుల పైనా, సమస్తనాడీ మండలము పైనా పడుటతో అంతులేని ఆనందానుభూతిని చెందుతాడు. పరమానందమునందుతాడు. తాదాత్మ్యతనంది, అమృతత్త్వ స్థితికి చేరుకుంటాడు. జన్మరాహిత్యం లభిస్తుంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కుండలినీ శక్తిస్వరూపిణిని సుధాసాగరమునకు చేర్చుటతో సాధకుడు పరమేశ్వరీ తాధాత్మ్యం చెంది అమృతత్త్వ స్థితీకి చేరుకుంటాడు. జన్నరాహిత్యం తొలగుతుంది.

శ్రీ లలితా సహస్రనామస్తోత్ర ఫలశ్రుతిలో ఇలా చెప్పబడింది:-

*చరమే జన్మని శ్రీవిద్యోపాసకో భవేత్*

చివరి జన్మలో శ్రీవిద్యోపాసకుడవుతాడు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సుధాసారాభివర్షిణ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*107వ నామ మంత్రము*

*ఓం తటిల్లతా సమరుచ్యై నమః*

మెఱుపు వలె వేగముగా మిఱుమిట్లుగొలుపు కాంతిపుంజముతో, అజ్ఞానమను చీకట్లను పారద్రోలు దివ్యమేఘజ్యోతి స్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *తటిల్లతా సమరుచిః* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం తటిల్లతా సమరుచ్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తుడు జ్ఞానవంతుడై, పదిమందికి అజ్ఞానచీకట్లను తొలగించు జ్యోతిస్వరూపుడై, సుఖసంతోషములతో అన్నిటికీ మించిన పరమేశ్వరీ పాదసంసేవా తత్త్వముతో జన్మ చరితార్థమునొందిన ఆత్మానందానుభూతిని పొందును.

రెండు మేఘములమధ్య ఉత్పన్నమయే విద్యుదుత్పత్తిలో వెలువడే మెఱుపుతీగతో అమ్మవారు పోల్చబడినది. మెఱుపు కేవలం క్షణికమే. కాని ఆ మెఱుపు వేగంలో మిఱుమిట్లుగొలుపు ఆ కాంతిపుంజమువలె జగన్మాత అజ్ఞానమను మాయను, చీకటిని పారద్రోలు దివ్యమేఘజ్యోతి స్వరూపిణి. దీనినే మంత్రపుష్పంలో *నీలతోయద మధ్యస్థా ద్విద్యుల్లే ఖేవ భాస్వరా* అనబడింది.అనగా కంటికి మెఱుపుతీగ ఎంతటి కాంతపుంజాన్ని ఇస్తుందో, అంతటి జ్ఞానప్రకాశాన్ని సాధకునకు జగన్మాత సంప్రాప్తింపజేస్తుంది.

ఆది శంకరులు సౌందర్యలహరిలో 21వ శ్లోకంలో ఈ విషయం ఇలాచెప్పార:-
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*తటిల్లేఖాతన్వీం - తపన శశి వైశ్వానర మయీం*

*నిషణ్ణాంషణ్ణామ - ప్యుపరి కమలానాం తవ కలామ్ |*

*మహాపద్మాటవ్యాం - మృదిత మలమాయేన మనసా*

*మహాంతః పశ్యంతో - దధతి పరమాహ్లాద-లహరీమ్ || 21 ||*

ఈ సహస్రారపద్మకర్ణికాంతర్గత చంద్రమండలంలో ఉండే *సదాఖ్య* అనబడే అమ్మయొక్క దివ్యమైన కళ ఎలాటిదంటే, అది  *తటిల్లేఖా తన్వీం* అని చెప్పారు శ్రీశంకరులు.   *తటిత్* అంటె మెఱుపు.   *తట్టిల్లేఖ* అంటే మెఱుపు తీగె. అటువంటి తనువు అనగా ఆకారం కలదని.  ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయి, మొదటిది మెఱుపుతీగలాగా అత్యంత దీర్ఘంగా సన్నగా ఉంటుందనేది. కాగా, రెండవది, మెఱుపు తీగ లాగా కేవలం క్షణకాలం మాత్రమే దర్శనభాగ్యం అనుగ్రహించేది అని.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
జ్ఞానజ్యోతి స్వరూపిణి అయిన అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం తటిల్లతా సమరుచ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*8.9 (తొమ్మిదవ శ్లోకము)*

*సుమత్యాస్తనయా దృప్తాః పితురాదేశకారిణః|*

*హయమన్వేషమాణాస్తే సమంతాన్న్యఖనన్ మహీమ్॥7550॥*

*8.10 (పదియవ శ్లోకము)*

*ప్రాగుదీచ్యాం దిశి హయం దదృశుః కపిలాంతికే|*

*ఏష వాజిహరశ్చౌర ఆస్తే మీలితలోచనః॥7560॥*

సగరుని భార్యయైన సుమతి యొక్క అరువదివేలమంది తనయులు బలగర్వితులై యుండిరి. వారు తండ్రి యాజ్ఞను అనుసరించి, యజ్ఞాశ్వము కొరకై భూమండలమంతయును వెదకిరి. వారికి ఎక్కడను ఆ అశ్వము జాడయే తెలియకుండెను. అప్ఫుడు వారు భూగర్భమున అన్వేషించుటకై పృథ్విని త్రవ్వసాగిరి. ఇట్లు త్రవ్వుచుండగా ఈశాన్య దిశయందు రసాతలమున తపమొనర్చుచున్న కపిలమహర్షి సమీపమునందు ఇంద్రునిచే ఉంచబడిన యజ్ఞాశ్వము వారికంట పడెను. అప్పుడు అఱువది వేలమందియు 'యజ్ఞాశ్వమును అపహరించిన దొంగ ఇతడే. కనులు మూసికొని దొంగజపము చేయుచున్నాడు. ఈ పాపిని చంపుడు, చంఫుడు' అని పలుకుచు ఆయుధములను పైకెత్తి ఆ మునిమీదకు దాడి చేసిరి. ఇంతలో కపిలుడు కనులు తెరిచెను.

*8.11 (పదకొండవ శ్లోకము)*

*హన్యతాం హన్యతాం పాప ఇతి షష్టిసహస్రిణః|*

*ఉదాయుధా అభియయురున్మిమేష తదా మునిః॥7561॥*

*8.12 (పండ్రెండవ శ్లోకము)*

*స్వశరీరాగ్నినా తావన్మహేంద్రహృతచేతసః|*

*మహద్వ్యతిక్రమహతా భస్మసాదభవన్ క్షణాత్॥7562॥*

దేవేంద్రుని కారణముగా ఆ అరువదివేలమంది బుద్ధులును భ్రష్టమయ్యెను. అందువలన వారు మహాపురుషుడైన కపిలునియెడ అవమానకరముగా (ధూర్తత్వముతో) ప్రవర్తించిరి. ఫలితముగా వారు తమ శరీరములనుండి పెల్లుబికిన అగ్నిజ్వాలలకు గుఱియై తత్ క్షణమే భస్మమైపోయిరి.

*8.13 (పదమూడవ శ్లోకము)*

*న సాధువాదో మునికోపభర్జితా నృపేంద్రపుత్రా ఇతి సత్త్వధామని|*

*కథం తమో రోషమయం విభావ్యతే జగత్పవిత్రాత్మని ఖే రజో భువః॥7563॥*

*8.14 (పదునాలుగవ శ్లోకము)*

*యస్యేరితా సాంఖ్యమయీ దృఢేహ నౌర్యయా ముముక్షుస్తరతే దురత్యయమ్|*

*భవార్ణవం మృత్యుపథం విపశ్చితః పరాత్మభూతస్య కథం పృథఙ్మతిః॥7564॥*

సగరమహారాజు యొక్క కుమారులు కపిలమహర్షి యొక్క కోపాగ్ని ప్రభావమున భస్మమైపోయిరని కొందరందురు. అట్లు అనుట ఏమాత్రమును సమంజసము కాదు. వారు (సగరుని సుతులు) స్వయంకృతాపరాధమువలననే మృత్యుముఖమునకు చేరిరనుట యుక్తము. ఏలయన, కపిలమహర్షి సత్త్వగుణ సంపన్నుడు. ఆ మహాత్ముడు జగత్తునే పుసీతమొనర్పగల ప్రతిభాశాలి. భూమికి సంబంధించిన ధూళి ఆకాశమును చేరుట సంభవము కానట్లు, తమోగుణాత్మకమైన రోషము ఆ సత్పురుషుని అంటజాలదు. దీనిని తరించుట (దీనినుండి బయటపడుట) అసాధ్యము. కాని, కపిలమహర్షి *సాంఖ్యశాస్త్రము* అను దృఢమైన నావను ఈ లోకమునకు ప్రసాదించెను. దీని సహాయమున ముముక్షువులు (మోక్షమును కోరుకొనువారు) ఎల్లరును ఈ సంసార సముద్రమును అలవోకగా దాటగలరు. కపిలమహాముని సర్వజ్ఞుడు, అంతేగాదు, లోకానుగ్రహకాంక్ష గలవాడు. అట్టి మహాపురుషునకు 'ఇతడు మిత్రుడు. ఇతడు శత్రువు' అను భేదబుద్ధి ఎట్లుండును?

*8.15 (పదునైదవ శ్లోకము)*

*యోఽసమంజస ఇత్యుక్తః స కేశిన్యా నృపాత్మజః|*

*తస్య పుత్రోంఽశుమాన్ నామ పితామహహితే రతః॥7565॥*

సగరునియొక్క రెండవ భార్యయగు కేశినియందు జన్మించినవాడు *అసమంజసుడు*. అతని కుమారుడు అంశుమంతుడు. అతడు తన తాతయగు సగరుని సేవించుటలో నిరతుడు. సగరుని శాసనము ఆయనకు శిరోధార్యము.

*8.16 (పదునారవ శ్లోకము)*

*అసమంజస ఆత్మానం దర్శయన్నసమంజసమ్|*

*జాతిస్మరః పురా సంగాద్యోగీ యోగాద్విచాలితః॥7566॥*

*8.17 (పదిహేడవ శ్లోకము)*

*ఆచరన్ గర్హితం లోకే జ్ఞాతీనాం కర్మ విప్రియమ్|*

*సరయ్వాం క్రీడతో బాలాన్ ప్రాస్యదుద్వేజయన్ జనమ్॥7567॥*

అసమంజసుడు తన దుడుకు చేష్టలచే లోకమును (జనులను) ఆందోళనకు గుఱిచేయు చుండెడివాడు. పూర్వజన్మలో ఇతడు ఒక యోగి, కాని దుష్టుల సాంగత్యముచే యొకభ్రష్టుడాయెను. ఈ జన్మయందు ఇతడు పూర్వజన్మ సంస్కార ప్రభావమున లోక గర్హితములైన పనులను చేయుచుండెను. అందువలన ఇతని కృత్యములన్నియును బంధుమిత్రులకు అప్రియమును గూర్చుచుండెను. ఒక్కొక్కప్పుడు ఇతడు ఆటలాడుకొనుచున్న బాలురను సరయూనదిలో పడవేయుచుండెడివాడు. ఇతని పిచ్చిపనులను జూచి జనులు ఆందోళన పడసాగిరి.

*8.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*ఏవంవృత్తః పరిత్యక్తః పిత్రా స్నేహమపోహ్య వై|*

*యోగైశ్వర్యేణ బాలాంస్తాన్ దర్శయిత్వా తతో యయౌ॥7568॥*

తన కుమారుని దుష్ప్రవర్తనకు విసిగి వేసారిన సగరుడు పుత్రునిపైగల మమకారముసు చంపుకొని, అసమంజసుని దేశ బహిష్కృతిని గావించెను. అంతట అతడు తాను సరయూనదీ జలములలో పడవేసిన. బాలురను తన యోగబలముచే పునర్జీవితులను గావించెను. ఆ బాలురను వారి తల్లిదండ్రులకు చూపించి, అతడు (అసమంజసుడు) వనములకు వెళ్ళెను.

PVD Subrahmanyam చెప్పారు...

*8.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*అయోధ్యావాసినః సర్వే బాలకాన్ పునరాగతాన్|*

*దృష్ట్వా విసిస్మిరే రాజన్ రాజా చాప్యన్వతప్యత॥7569॥*

పరీక్షిన్మహారాజా! మరల ప్రాణములతో తిరిగివచ్చిన బాలురను జూచి అయోధ్యా వాసులందరును ఆశ్చర్యపడిరి. సగరమహారాజు గూడ విస్మయము చెందుచు- 'అయ్యో! ఇతని (అసమంజసుని) ప్రభావమును ఎఱుగక రాజ్యమునుండి వెళ్ళగొట్టితి గదా! అని పశ్చాత్తాపపడెను.

*8.20 (ఇరువదియవ శ్లోకము)*

*అంశుమాంశ్చోదితో రాజ్ఞా తురంగాన్వేషణే యయౌ|*

*పితృవ్యఖాతానుపథం భస్మాంతి దదృశే హయమ్॥7570॥*

అసమంజసుని కుమారుడు ఐన అంశుమంతుడు తన తాతయగు సగరమహారాజుయొక్క ఆదేశముచే యజ్ఞాశ్వమును వెదకుటకై బయలుదేరెను. అతడు తన పినతండ్రులు త్రవ్విన మార్గమును అనుసరించుచు వెళ్ళగా, ఒక భస్మరాశి సమీపమున అతనికి యజ్ఞాశ్వము కనబడెను.

*8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*తత్రాసీనం మునిం వీక్ష్య కపిలాఖ్యమధోక్షజమ్|*

*అస్తౌత్సమాహితమనాః ప్రాంజలిః ప్రణతో మహాన్॥7571॥*

అచ్చట అతడు అవతారపురుషుడైన కపిలమహామునిని చూచెను. పిమ్మట సరళహృదయుడైన అంశుమంతుడు అంజలి ఘటించి, ప్రణమిల్లి, ఏకాగ్రచిత్తుడై ఆ మహర్షిని ఇట్లు స్తుతింపసాగెను.

*అంశుమానువాచ*

*8.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*న పశ్యతి త్వాం పరమాత్మనోఽజనో న బుధ్యతేఽద్యాపి సమాధియుక్తిభిః॥*

*కుతోఽపరే తస్య మనఃశరీరధీవిసర్గసృష్టా వయమప్రకాశాః॥7572॥*

*అంశుమంతుడు నుడివెను* "మహానుభావా! అజుడైన బ్రహ్మదేవుడును పరమాత్ముడవైన నిన్ను దర్శింపజాలడు. అంతేగాదు, ఆ పరమేష్ఠి సమాధియుక్తులచేత గూడ నేటికిని నిన్ను తెలిసికొనజాలకున్నాడు. ఇక మేమైతే, ఆ బ్రహ్మదేవుని యొక్క మనస్సు, శరీరము, బుద్ధిద్వారా సృష్టింపబడిన వారము, అజ్ఞానులము. అందువలన నిన్ను మేము ఎట్లు తెలిసికొనగలము?

*8.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*యే దేహభాజస్త్రిగుణప్రధానా గుణాన్ విపశ్యంత్యుత వా తమశ్చ|*

*యన్మాయయా మోహితచేతసస్తే విదుః స్వసంస్థం న బహిఃప్రకాశాః॥7573॥*

ఈ లోకమునందలి దేహధారులందరును సత్త్వరజస్తమోగుణములతో ఒప్పుచుండెడి వారే. వారు జాగ్రత్ స్వప్నావస్థలయందు కేవలము శబ్దాది గుణమయములైన పదార్థములను, విషయములను చూడగలరు. సుషుప్త్యవస్థయందు కేవలము అజ్ఞానులుగా మిగిలిపోవుదురు.ఏలనన, వారు నీ మాయచే మోహితులై బాహ్యవస్తువులనే తెలిసికొనగలరు. కాని, తమ హృదయములయందే ఉన్న నిన్ను ఎఱుంగజాలము.

*8.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*తం త్వామహం జ్ఞానఘనం స్వభావప్రధ్వస్తమాయాగుణభేదమోహైః|*

*సనందనాద్యైర్మునిభిర్విభావ్యం కథం హి మూఢః పరిభావయామి॥7574॥*

ప్రభూ! నీవు జ్ఞానఘనుడవు. ఆనందస్వరూపుడవు. ఆత్మస్వరూపానుభవముచే మాయాగుణ జనితములైన భేదభావమును, దానికి మూలమైన అజ్ణానమును పారద్రోలిన సనందనాది మహర్షులు గూడ నిన్ను తమ ధ్యానముద్వారా గ్రహింపగలరుగాని, ప్రత్యక్షముగా చూడజాలరు. ఇక మాయామోహములకు లోబడి మూఢుడనై యున్న నేను మనస్సుచే నైనను ఎట్లు ఎఱుంగగలను?

*8.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*ప్రశాంతమాయాగుణకర్మలింగ మనామరూపం సదసద్విముక్తమ్|*

*జ్ఞానోపదేశాయ గృహీతదేహం నమామహే త్వాం పురుషం పురాణమ్॥7575॥*

స్వామీ! నీకు సత్త్వాది మాయాగుణములును, వాటికారణముగా ఏర్పడిన కర్మలను, అట్టి కర్మలను సంస్కార జనితమైన లింగశరీరమూ లేవు. నీవు నామ, రూపరహితుడవు. శుభాశుభఫలితములు నిన్ను బంధింపవు. సుఖదుఃఖానుభవముల కొరకు గాక, కేవలము లోకమునకు జ్ఞానోపదేశము చేయుటకొరకే నీవు కపిల మహర్షిగా అవతరించితివి. అట్టి పురాణ పురుషుడవైన నీకు నమస్కారము.

PVD Subrahmanyam చెప్పారు...

*8.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*త్వన్మాయారచితే లోకే వస్తుబుద్ధ్యా గృహాదిషు|*

*భ్రమంతి కామలోభేర్ష్యామోహవిభ్రాంతచేతసః॥7576॥*

దేవా! ఈ ప్రపంచము నీ మాయచేతనే రూపొందినది. దీనిని సత్యముగా భావించి కామము, లోభము, ఈర్ష్య, మోహము మొదలగు వికారములచే బద్ధులైన జనులు గృహాదులయందు (భార్యాపుత్రాది మమకారములయందే) పరిభ్రమించుచుందురు. ఆ కారణముగా వారు జననమరణ చక్రములో చిక్కుకొనుచుందురు.

*8.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*అద్య నః సర్వభూతాత్మన్ కామకర్మేంద్రియాశయః|*

*మోహపాశో దృఢశ్ఛిన్నో భగవంస్తవ దర్శనాత్॥7577॥*

సకల ప్రాణులయందును అంతర్యామివై విలసిల్లుచుండెడి పరమాత్ముడవగు ఓ ప్రభూ! నేను నీ దర్శనమువలన కామ్యములు, కర్మలు, ఇంద్రియానుభవములు మొదలగు వానికి కారణమైన దృఢమగు మోహపాశము, విచ్ఛిన్నమైపోయినది.

*శ్రీశుక ఉవాచ*

*8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*ఇత్థం గీతానుభావస్తం భగవాన్ కపిలో మునిః|*

*అంశుమంతమువాచేదమనుగృహ్య ధియా నృప॥7578॥*

*శ్రీశుకుఢు పలికెను* పరీక్షిన్మహారాజా! అంశుమంతుడు భగవంతుడైన కపిలుని ప్రభావమును (మహత్త్వమును) గూర్చి ఇట్లు కీర్తింపగా, ఆ మహర్షి అతనియెడ అనుగ్రహబుద్ధితో ఇట్లనెను.

*శ్రీభగవానువాచ*

*8.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*అశ్వోఽయం నీయతాం వత్స పితామహపశుస్తవ|*

*ఇమే చ పితరో దగ్ధా గంగాంభోఽర్హంతి నేతరత్॥7579॥*

*కపిలభగవానుడు నుడివెను* "నాయనా! అంశుమంతా! ఇదిగో! మీ తాతగారి యజ్ఞాశ్వము. దీనిని తీసికొనిపొమ్ము. ఇచట భస్మమై పడియున్న మీ పినతండ్రులు గంగాజలస్పర్శతో మాత్రమే ఉద్ధరింపబడుదురు. మరియొక మార్గము లేదు".

*నేతరత్ నాన్యథా విస్తార ఇత్యర్థః|* (నిస్తారః = నిస్సరణమ్, ఉద్ధారః॥) అనగా ఉద్ధరింపబడుటకు మరియొక మార్గము లేదని అర్థము = శ్రీధరీయటీకా.

*8.30 (ముప్పదియవ శ్లోకము)*

*తం పరిక్రమ్య శిరసా ప్రసాద్య హయమానయత్|*

*సగరస్తేన పశునా క్రతుశేషం సమాపయత్॥7580॥*

*8.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*రాజ్యమంశుమతే న్యస్య నిఃస్పృహో ముక్తబంధనః|*

*ఔర్వోపదిష్టమార్గేణ లేభే గతిమనుత్తమామ్॥7581॥*

అనంతరము అంశుమంతుడు కపిలమహామునిని ప్రసన్నుని జేసికొని, ఆయనకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి, హయమును తీసికొనివెళ్ళెను. అంతట సగరచక్రవర్తి ఆ యజ్ఞపశువుద్వారా మిగిలిన క్రతువును పూర్తిచేసెను. పిమ్మట, ఆ మహారాజు ఐహిక సుఖములయెడ విరక్తుడై అహంకార మమకారములను త్యజించి, రాజ్యభారమును అంశుమంతునకు అప్పగించెను. పిదప అతడు ఔర్వమహర్షి ఉపదేశించిన మార్గమున ముక్తిని (ఉత్తమగతిని) పొందెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టమోఽధ్యాయః (8)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఎనిమిదవ అధ్యాయము (8)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*9.1 (ప్రథమ శ్లోకము)*

*అంశుమాంశ్చ తపస్తేపే గంగానయనకామ్యయా|*

*కాలం మహాంతం నాశక్నోత్తతః కాలేన సంస్థితః॥7582॥*

*శ్రీశుకుడు పలికెను* అంతట అంశుమంతుడు తన పినతండ్రులను తరింపజేయుటకై గంగానదిని భూతలమునకు తీసికొనివచ్చు సంకల్పముతో దీర్ఘకాలము తపస్సొనర్చెను. ఐనను, అతడు తన ప్రయత్నమున సఫలీకృతుడు కాకముందే మృత్యువుపాలయ్యెను.

*9.2 (రెండవ శ్లోకము)*

*దిలీపస్తత్సుతస్తద్వదశక్తః కాలమేయివాన్|*

*భగీరథస్తస్య పుత్రస్తేపే స సుమహత్తపః॥7583॥*

అంశుమంతుని కుమారుడైన దిలీపుడుగూడ తన తండ్రివలెనే గంగావతరణమునకై పెద్దకాలము తపమొనరించెను. కాని, తన ప్రయత్నము నెరవేరకముందే అతడు మృతిచెందెను. పిదప దిలీపుని తనయుడైన భగీరథుడును తన తండ్రితాతల వలెనే అందులకై తీవ్రముగా తపమాచరించెను.

*9.3 (మూడవ శ్లోకము)*

*దర్శయామాస తం దేవీ ప్రసన్నా వరదాస్మి తే|*

*ఇత్యుక్తః స్వమభిప్రాయం శశంసావనతో నృపః॥7584॥*

కొంతకాలమునకు గంగాదేవి భగీరథుని తపస్సును మెచ్చుకొని ఆయనకు ప్రత్యక్షమై - 'నీకు ఏ వరము కావలెనో కోరుకొనుము' అని పలికెను. అప్ఫుడు భగీరథుడు వినమ్రుడై "దేవీ నీవు భూలోకమునకు విచ్చేయవలెను' అనుచు తన అభిప్రాయమును ప్రకటించెను.

*9.4 (నాలుగవ శ్లోకము)*

*కోఽపి ధారయితా వేగం పతంత్యా మే మహీతలే|*

*అన్యథా భూతలం భిత్త్వా నృప యాస్యే రసాతలమ్॥7585॥*

పిమ్మట గంగాదేవి ఆయనతో ఇట్లు వచించెను. - "భగీరథ మహారాజా!నీ ప్రార్థనమేరకు నేను భూతలమున ప్రవహింతును.అప్ఫుడు నా వేగమును ఎవరో ఒకరు నిలువరింపవలసి యుండును. లేనిచో, నేను భూమిని చీల్చుకొని రసాతలమునకు వెళ్ళెదను.

*9.5 (ఐదవ శ్లోకము)*

*కిం చాహం న భువం యాస్యే నరా మయ్యామృజంత్యఘమ్|*

*మృజామి తదఘం కుత్ర రాజంస్తత్ర విచింత్యతామ్॥7586॥*

అంతేగాదు, రాజా! నేను భూతలమునకు రాకుండుటకు మరియొక కారణముగూడ గలదు. నేను అచట ప్రవహించినచో, జనులు నా జలములలో మునిగి తమ పాపములను ప్రక్షాళన మొనర్చుకొందురు. వారి పాపముల నుండి నేను బయటపడుట ఎట్లు? దీనిని గూర్చియు నీవు ఆలోచింపుము".

*భగీరథ ఉవాచ*

*9.6 (ఆరవ శ్లోకము)*

*సాధవో న్యాసినః శాంతా బ్రహ్మిష్ఠా లోకపావనాః|*

*హరంత్యఘం తేఽఙ్గసంగాత్తేష్వాస్తే హ్యఘభిద్ధరిః॥7587॥*

*భగీరథుడు నుడివెను* "గంగామాతా! భూతలమున పెక్కుమంది సాధుపురుషులు గలరు. వారు కామ్యకర్మలను త్యజించినవారు, జితేంద్రియులు, బ్రహ్మజ్ణానులు. అందువలన, వారు లోకములనే పవిత్రము చేయగలమహానుభావులు. ఆ మహాత్ములు నీ జలములలో స్నానమొనర్చుటవలన (వారి శరీర స్పర్శప్రభావమున) నీ పాపములన్నియును దూరమగును. ఏలనన, సకల పాపములను హరించువేయునట్టి (రూపుమాపునట్టి) శ్రీహరి వారి హృదయములలో ఎల్లప్పుడును నివసించుచుండును.

*9.7 (ఏడవ శ్లోకము)*

*ధారయిష్యతి తే వేగం రుద్రస్త్వాత్మా శరీరిణామ్|*

*యస్మిన్నోతమిదం ప్రోతం విశ్వం శాటీవ తంతుషు॥7588॥*

సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడుగా ఉండెడి ఆ పరమశివుడు నీ వేగమును ధరింపగలడు (నీ జలప్రవాహ వేగమును అడ్డుకొని నిన్ను నిలువరింపగలడు). ఏలయన వస్త్రమునందలి దారములవలె, ఈ విశ్వమంతయును అతనిలో ఓతప్రోతమై యున్నది (సకల శరీరముల యందును ఆ పరమశివుడు అంతర్యామియై యున్నాడు. విశ్వమంతయును ఆయనలోనే యున్నది. అనగా అతడే విశ్వమునకు ఆత్మ - విశ్వమును ధరించువాడును అతడే. కనుక, అంతా శివమయము)".

*9.8 (ఎనిమిదవ శ్లోకము)*

*ఇత్యుక్త్వా స నృపో దేవం తపసాతోషయచ్ఛివమ్|*

*కాలేనాల్పీయసా రాజంస్తస్యేశః సమతుష్యత॥7589॥*

పరీక్షిన్మహారాజా! గంగాదేవితో ఇట్లు పలికిన పిదప భగీరథుడు తపస్సొనర్చి మహాదేవుడైన శివుని సంతుష్టుని గావించెను. స్వల్పకాలమునకే ఆ పరమేశ్వరుడు అతని యెడ ప్రసన్నుడయ్యెను.

*9.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తథేతి రాజ్ఞాభిహితం సర్వలోకహితః శివః|*

*దధారావహితో గంగాం పాదపూతజలాం హరేః॥7590॥*

సకలలోకములకును శుభములను గూర్చెడి శివుడు ఆ రాజుయొక్క కోరికను ఆమోదించెను. పిమ్మట, శ్రీమన్నారాయణుని పాదస్పర్శచే పునీతమైన గంగాప్రవాహమును శివుడు సావధానుడై (నిశ్చలుడై) తన జటాజూటమునందు ధరించెను.

*9.10 (పదియవ శ్లోకము)*

*భగీరథః స రాజర్షిర్నిన్యే భువనపావనీమ్|*

*యత్ర స్వపితౄణాం దేహా భస్మీభూతాః స్మ శేరతే॥7591॥*

అంతట రాజర్షియైన భగీరథుడు భువనపావనియైన గంగానదిని తన పితరుల శరీరములు భస్మరాశియై పడియున్న ప్రదేశమునకు తీసికొనివచ్చెను.

PVD Subrahmanyam చెప్పారు...

*8.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*త్వన్మాయారచితే లోకే వస్తుబుద్ధ్యా గృహాదిషు|*

*భ్రమంతి కామలోభేర్ష్యామోహవిభ్రాంతచేతసః॥7576॥*

దేవా! ఈ ప్రపంచము నీ మాయచేతనే రూపొందినది. దీనిని సత్యముగా భావించి కామము, లోభము, ఈర్ష్య, మోహము మొదలగు వికారములచే బద్ధులైన జనులు గృహాదులయందు (భార్యాపుత్రాది మమకారములయందే) పరిభ్రమించుచుందురు. ఆ కారణముగా వారు జననమరణ చక్రములో చిక్కుకొనుచుందురు.

*8.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*అద్య నః సర్వభూతాత్మన్ కామకర్మేంద్రియాశయః|*

*మోహపాశో దృఢశ్ఛిన్నో భగవంస్తవ దర్శనాత్॥7577॥*

సకల ప్రాణులయందును అంతర్యామివై విలసిల్లుచుండెడి పరమాత్ముడవగు ఓ ప్రభూ! నేను నీ దర్శనమువలన కామ్యములు, కర్మలు, ఇంద్రియానుభవములు మొదలగు వానికి కారణమైన దృఢమగు మోహపాశము, విచ్ఛిన్నమైపోయినది.

*శ్రీశుక ఉవాచ*

*8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*ఇత్థం గీతానుభావస్తం భగవాన్ కపిలో మునిః|*

*అంశుమంతమువాచేదమనుగృహ్య ధియా నృప॥7578॥*

*శ్రీశుకుఢు పలికెను* పరీక్షిన్మహారాజా! అంశుమంతుడు భగవంతుడైన కపిలుని ప్రభావమును (మహత్త్వమును) గూర్చి ఇట్లు కీర్తింపగా, ఆ మహర్షి అతనియెడ అనుగ్రహబుద్ధితో ఇట్లనెను.

*శ్రీభగవానువాచ*

*8.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*అశ్వోఽయం నీయతాం వత్స పితామహపశుస్తవ|*

*ఇమే చ పితరో దగ్ధా గంగాంభోఽర్హంతి నేతరత్॥7579॥*

*కపిలభగవానుడు నుడివెను* "నాయనా! అంశుమంతా! ఇదిగో! మీ తాతగారి యజ్ఞాశ్వము. దీనిని తీసికొనిపొమ్ము. ఇచట భస్మమై పడియున్న మీ పినతండ్రులు గంగాజలస్పర్శతో మాత్రమే ఉద్ధరింపబడుదురు. మరియొక మార్గము లేదు".

*నేతరత్ నాన్యథా విస్తార ఇత్యర్థః|* (నిస్తారః = నిస్సరణమ్, ఉద్ధారః॥) అనగా ఉద్ధరింపబడుటకు మరియొక మార్గము లేదని అర్థము = శ్రీధరీయటీకా.

*8.30 (ముప్పదియవ శ్లోకము)*

*తం పరిక్రమ్య శిరసా ప్రసాద్య హయమానయత్|*

*సగరస్తేన పశునా క్రతుశేషం సమాపయత్॥7580॥*

*8.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*రాజ్యమంశుమతే న్యస్య నిఃస్పృహో ముక్తబంధనః|*

*ఔర్వోపదిష్టమార్గేణ లేభే గతిమనుత్తమామ్॥7581॥*

అనంతరము అంశుమంతుడు కపిలమహామునిని ప్రసన్నుని జేసికొని, ఆయనకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి, హయమును తీసికొనివెళ్ళెను. అంతట సగరచక్రవర్తి ఆ యజ్ఞపశువుద్వారా మిగిలిన క్రతువును పూర్తిచేసెను. పిమ్మట, ఆ మహారాజు ఐహిక సుఖములయెడ విరక్తుడై అహంకార మమకారములను త్యజించి, రాజ్యభారమును అంశుమంతునకు అప్పగించెను. పిదప అతడు ఔర్వమహర్షి ఉపదేశించిన మార్గమున ముక్తిని (ఉత్తమగతిని) పొందెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టమోఽధ్యాయః (8)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఎనిమిదవ అధ్యాయము (8)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*685వ నామ మంత్రము*

*ఓం రాజ్యదాయిన్యై నమః*

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, దిక్పాలకులు మొదలైన దేవతలకు, తన భక్తులకు, ఉపాసకులకు దీక్షాబలము, సామర్థ్యముల ననుసరించి రాజ్యములను, నగరములను ఇచ్చి, వారిని అధిపతులను జేసిన అఖిలాండేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రాజ్యదాయినీ* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం రాజ్యదాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని పూజించు భక్తులకు సకలాభీష్టసిద్ధిని ప్రసాదించి అనుగ్రహించును.

జగన్మాత సృష్టిస్థితిలయకారిణి. దుష్టరాక్షసులను సంహరించి వారి నుండి రాజ్యములను కైవశముచేసికొని, రాక్షసులచేతిలో అపజయము పొంది వాటిని పోగొట్టుకొనిన ఇంద్రాది దేవతలకు తిరిగి ఇచ్చినది. బ్రహ్మకు సత్యలోకము, విష్ణుమూర్తికి వైకుంఠము, మహేశ్వరునకు కైలాసమును ఇచ్చినది. ఇంకను ఉపాసకులకు, శ్రేష్ఠులకు, భక్తులకు వారి వారి దీక్షాబలము, తపోబలము, ఉపాసనాబలము, పరిపాలనాదక్షత ననుసరించి రాజ్యములు, నగరములు ఇచ్చినది. అధిపతులను చేసినది జగన్మాత. ఉపాసనా సిద్ధి ఉన్న సాధకునకు, సాధనచేయు విద్యయను సామ్రాజ్యాధినేతను చేసి, జనహిత కార్యక్రమములు చేయనిర్దేశించినది. ఇంద్రునకు స్వర్గాధిపత్యము నిచ్చినది. కుబేరునకు ధనాధిపత్యము, అగ్నికి తేజోవతి నగరము, యముడికి సంయమని నగరము, నైరుతికి కృష్ణాంగన నగరము, వరుణునికి శ్రద్ధావతి నగరము, వాయువుకు గంధావతి నగరము, ఈశానుడికి యశోవతి నగరము ఇలా అందరికీ చతుర్దశ భువనములను ఇచ్చి, కార్యక్రమములు నిర్వహింపజేసినది. తాను సృష్టించిన జగత్తును రాజ్యములుగా చేసి, ఆయా విభాగములకు సామర్థ్యత గలిగిన వారిని అధిపతులను జేసి *రాజ్యదాయినీ* అని నామ మంత్రముతో స్తుతింప బడుతున్నది. అటు వంటి జగదీశ్వరికి నమస్కరించునపుడు *ఓం రాజ్యదాయిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*9.11 (పదకొండవ శ్లోకము)*

*రథేన వాయువేగేన ప్రయాంతమనుధావతీ|*

*దేశాన్ పునంతీ నిర్దగ్ధానాసించత్సగరాత్మజాన్॥7592॥*

వాయువేగముతో సాగిపోవుచున్న భగీరథుని రథమును అనుసరించుచు, గంగానది తన జలములతో మార్గమునగల ప్రదేశములను పునీతమొనర్చుచు పురోగమించి, దగ్ధమై పడియున్న సగరపుత్రుల భస్మరాశిన తడిపెను.

*9.12 (పండ్రెండవ శ్లోకము)*

*యజ్జలస్పర్శమాత్రేణ బ్రహ్మదండహతా అపి|*

*సగరాత్మజా దివం జగ్ముః కేవలం దేహభస్మభిః॥7593॥*

బ్రహ్మర్షియగు కపిలుని యెడ మహాపరాధములను ఒనర్చి పూర్తిగా భస్మరాశిగా పడియున్న సగరుని కుమారులు గంగాజలము తాకినంతమాత్రముననే స్వర్గమునకేగిరి.

*9.13 (పదమూడవ శ్లోకము)*

*భస్మీభూతాంగసంగేన స్వర్యాతాః సగరాత్మజాః|*

*కిం పునః శ్రద్ధయా దేవీం యే సేవంతే ధృతవ్రతాః॥7594॥*

పరీక్షిన్మహారాజా! భస్మీభూతులై (బుగ్గియై) పడియున్న సగర తనయులు కేవలము గంగాజలములు స్పృశించినంత మాత్రముననే స్వర్గమున చేరిరి. ఇంక దృఢదీక్ష పూని, శ్రద్ధగా ఆ దేవిని సేవించినవారి యొక్క విషయమును గూర్చి చెప్పవలసిన పని ఏమున్నది?

*9.14 (పదునాలుగవ శ్లోకము)*

*న హ్యేతత్పరమాశ్చర్యం స్వర్ధున్యా యదిహోదితమ్|*

*అనంతచరణాంభోజప్రసూతాయా భవచ్ఛిదః॥7595॥*

*9.15 (పదునైదవ శ్లోకము)*

*సన్నివేశ్య మనో యస్మింఛ్రద్ధయా మునయోఽమలాః|*

*త్రైగుణ్యం దుస్త్యజం హిత్వా సద్యో యాతాస్తదాత్మతామ్॥7596॥*

అనంత మహిమాన్వితుడైన శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములనుండి ఉద్భవించుటచే పునీతయైన గంగానది సంసార బంధములను పూర్తిగా ఛేదించివేయగలదు. అట్టి సురనది మహిమను గూర్చి ఇచట బహుధా ప్రశంసించుట ఏ మాత్రము ఆశ్చర్యకరముగాదు. ఏలనన, శ్రీహరియందే తమ మనస్సులను నిలిపి, భక్తిశ్రద్ధలతో ఆ పరమాత్ముని సేవించిన మునులు పవిత్రులగుదురు. అట్టి మునులు సులభముగా అధిగమింపరాని త్రిగుణములను త్యజించి (త్రిగుణాతీతులై) భగవదనుగ్రహముతో వెంటనే సాయుజ్యముక్తిని పొందుదురు. శ్రీహరి అనుగ్రహమునకు పాత్రులైనవారి మహిమలు అట్టివి.

*9.16 (పదహారవ శ్లోకము)*

*శ్రుతో భగీరథాజ్జజ్ఞే తస్య నాభోఽపరోఽభవత్|*

*సింధుద్వీపస్తతస్తస్మాదయుతాయుస్తతోఽభవత్॥7597॥*

*9.17 (పదిహేడవ శ్లోకము)*

*ఋతుపర్ణో నలసఖో యోఽశ్వవిద్యామయాన్నలాత్|*

*దత్త్వాక్షహృదయం చాస్మై సర్వకామస్తు తత్సుతః॥7598॥*

భగీరథుని కుమారుడు శ్రుతుడు. అతని పుత్రుడు నాభుడు. ఇతడు ఇదివరలో తెలుపబడిన నాభునికంటె వేరైనవాడు. నాభుని సుతుడు సింధుద్వీపుడు. అతని తనయుడు అయుతాయువు. అయుతాయువు యొక్క సూనుడు ఋతుపర్ణుడు. అతడు నలమహారాజునకు మిత్రుడు. ఋతుపర్ణుడు నలమహారాజునకు అక్షహృదయ విద్యను (జూదమాడుటలో గల నైపుణ్యమును) బోధించి, ఆయననుండి అశ్వహృదయ విద్యను (రథాశ్వములను వేగముగా నడుపుటలో గల రహస్యములను) పొందెను. ఋతుపర్ణుని సుతుడు సర్వకాముడు.

*9.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*తతః సుదాసస్తత్పుత్రో మదయంతీపతిర్నృపః|*

*ఆహుర్మిత్రసహం యం వై కల్మాషాంఘ్రిముత క్వచిత్|*

*వసిష్ఠశాపాద్రక్షోఽభూదనపత్యః స్వకర్మణా॥7599॥*

పరీక్షిన్మహారాజా! సర్వకాముని సుతుడు సుదాసుడు. సుదాసుని కుమారుడు సౌదాసుడు. సౌదాసుని భార్యపేరు ముదయంతి. సౌదాసునకు మిత్రసహుడు, కల్మాషపాదుడు అను పేర్లు గలవు. అతడు స్వయం కృతాపరాధమువలన వసిష్ఠుని శాపమునకు గుఱియై రాక్షసుడై సంతానములేని వాడయ్యెను.

*రాజోవాచ*

*9.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*కిం నిమిత్తో గురోః శాపః సౌదాసస్య మహాత్మనః|*

*ఏతద్వేదితుమిచ్ఛామః కథ్యతాం న రహో యది॥7600॥*

*పరీక్షిన్మహాారాజు నుడివెను* "మహర్షీ! సౌదాసుడు మహాత్ముడైన వసిష్ఠుని శాపమునకు గుఱియగుటకు గల కారణమేమి? నాకు దానిని గూర్చి తెలిసికొనవలయునను కుతూహలము గలదు. రహస్యముగానిచో దానిని తెలుపుము.

*శ్రీశుక ఉవాచ*

*9.20 (ఇరువదియవ శ్లోకము)*

*సౌదాసో మృగయాం కించిచ్చరన్ రక్షో జఘాన హ|*

*ముమోచ భ్రాతరం సోఽథ గతః ప్రతిచికీర్షయా॥7601॥*

*9.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*స చింతయన్నఘం రాజ్ఞః సూదరూపధరో గృహే|*

*గురవే భోక్తుకామాయ పక్త్వా నిన్యే నరామిషమ్॥7602॥*

*శ్రీశుకుడు నుడివెను* "పరీక్షిన్మహారాజా! మిత్రసహుడు అను పేరుగల సౌదాసుడు ఒకానొకప్పుడు వేటకై అడవికి వెళ్ళి, అచట ఒక రాక్షసుని చంపెను. కాని, ఆ రాజు ఆ రాక్షసునియొక్క సోదరుని మాత్రము చంపకుండ విడిచిపెట్టి తన భవనమునకు చేరెను. తన సోదరుని సౌదాసునిపై రాక్షసునకు (రాక్షస సోదరునకు) లోలోపల పగ బుసలుకొట్టుచునే యుండెను. అందువలన, అతడు రాజుపై ప్రతీకారము తీర్చుకొనదలచి వంటవాని వేషములో రాజభవనమున ప్రవేశించెను. సౌదాసునకు వంశ గురువగు వసిష్ఠుడు భోజనమునకై ఆ రాజసౌధమునకు రాగా, ఆ వంటవాడు (రాక్షససోదరుడు) ఆ మహర్షికి నరమాంసమును వడ్డించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*9.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*పరివేక్ష్యమాణం భగవాన్ విలోక్యాభక్ష్యమంజసా|*

*రాజానమశపత్క్రుద్ధో రక్షో హ్యేవం భవిష్యసి॥7603॥*

*9.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*రక్షఃకృతం తద్విదిత్వా చక్రే ద్వాదశవార్షికమ్|*

*సోఽప్యపోఽఞ్జలిమాదాయ గురుం శప్తుం సముద్యతః॥7604॥*

*9.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*వారితో మదయంత్యాపో రుశతీః పాదయోర్జహౌ|*

*దిశః ఖమవనీం సర్వం పశ్యన్ జీవమయం నృపః॥7605॥*

అంతట మహాత్ముడైన వసిష్ఠుడు తన భోజనపాత్రయందు వడ్డించిన పదార్థము అభక్ష్యము (భక్షింపదగినది) అని తన యోగదృష్టిచే గ్రహించెను. వెంటనే ఆ మహాముని మిగుల క్రుద్ధుడై - 'ఇట్లు అపచారమొనర్చినందులకు నీవు రాక్షసుడవు కమ్ము' అని సౌదాసుని శపించెను. పిదప ఆ మహర్షి 'ఇందు సౌదాసుని దోషమేమియును లేదనియు, వంటవాడుగా ఉన్న రాక్షసుడే దీనికి కారకుడనియు' ఎఱింగెను. అందువలన ఆ వసిష్ఠుడు తన శాపప్రభావమును పండ్రెండు సంవత్సరములకు పరిమితమొనర్చెను (పన్నెండు సంవత్సరములు ముగియగనే అతనికి శాపవిముక్తి కలుగునని పలికెను) అంతట సౌధాసుడు గూడ క్రుద్ధుడై, గురువును (వసిష్ఠుని) శపించుటకై సిద్ధపడి దోసిట జలమును గ్రహించెను. అప్ఫుడు అతని భార్యయగు *మదయంతి* ఆయనను వారించెను. పిమ్మట సౌదాసుడు 'ఈ దిశలు, ఆకాశము, భూమి - అన్నియును జీవమయములే' ఈ తీక్షణమైన (మంత్రపూతమగుటచే ప్రభావాన్వితమైన) జలమును ఎచట వదలవలయును? అని ఆలోచించి, కడకు ఆ నీటిని తన పాదములపై విడిచిపెట్టెను.

*9.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*రాక్షసం భావమాపన్నః పాదే కల్మాషతాం గతః|*

*వ్యవాయకాలే దదృశే వనౌకోదంపతీ ద్విజౌ॥7606॥*

*9.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*క్షుధార్తో జగృహే విప్రం తత్పత్న్యాహాకృతార్థవత్|*

*న భవాన్ రాక్షసః సాక్షాదిక్ష్వాకూణాం మహారథః॥7607॥*

*9.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*మదయంత్యాః పతిర్వీర నాధర్మం కర్తుమర్హసి|*

*దేహి మేఽపత్యకామాయా అకృతార్థం పతిం ద్విజమ్॥7608॥*

శపించుటకై మంత్రించిన జలములు అతని పాదములపై బడుటవలన ఆ పాదములు కలుషితములయ్యెను (నల్లబాఱెను). అందువలన, ఆయనకు *కల్మషపాదుడు* అను పేరు గూడ వచ్చెను. ముని శాపప్రభావమున సౌదాసుడు రాక్షసరూపమును పొంది వనములకు చేరెను. అచట అతడు రతిక్రీడలలో నిమగ్నులైయున్న వనౌకసులగు బ్రాహ్మణ దంపతులను చూచెను. మిక్కిలి ఆకలితో నకనకలాడుచున్న కల్మాషపాదుడు (రాక్షసుడు) ఆ బ్రాహ్మణుని తినుటకై అతనిని పట్టుకొనెను. రతిసుఖమును పూర్తిగా పొందని ఆ ద్విజపత్ని ఆ రాక్షసునితో ఇట్లనెను - "అయ్యో! నీవు రాక్షసుడవు కావు. సాక్షాత్తుగా ఇక్ష్వాకువంశమునకు చెందిస మహారాజువు. మదయంతీదేవియొక్క భర్తవు, బలపరాక్రమములు గలవాడవు. వీరుడా! నీవు ఇట్లు అధర్మమునకు పాల్పడుట తగదు. నేను సంతానమును కోరుకొనుచున్నాను. ఇంకను మా కోరిక ఫలింపలేదు. కనుక, నా పతిని నాకు ఇచ్చివేయుము".

*9.28 (ఇరువది ఐదవ శ్లోకము)*

*దేహోఽయం మానుషో రాజన్ పురుషస్యాఖిలార్థదః|*

*తస్మాదస్య వధో వీర సర్వార్థవధ ఉచ్యతే॥7609॥*

మహారాజా! ఈ మానవదేహము ఉత్తమమైనది, సకల పురుషార్థములకును సాధనము. మహావీరా! అందువలన ఈయనను (నా భర్తను) వధించుట మా సకల పురుషార్థములను ధ్వంసమొనర్చుటయే అగును.

*9.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*ఏష హి బ్రాహ్మణో విద్వాంస్తపఃశీలగుణాన్వితః|*

*ఆరిరాధయిషుర్బ్రహ్మ మహాపురుషసంజ్ఞితమ్|*

*సర్వభూతాత్మభావేన భూతేష్వంతర్హితం గుణైః॥7610॥*

*9.30 (ముప్పదియవ శ్లోకము)*

*సోఽయం బ్రహ్మర్షివర్యస్తే రాజర్షిప్రవరాద్విభో|*

*కథమర్హతి ధర్మజ్ఞ వధం పితురివాత్మజః॥7611॥*

ఇతడు బ్రాహ్మణోత్తముడు, విద్వాంసుడు, మహాతపస్వి, సచ్ఛీలుడు. సద్గుణవంతుడు. అంతేగాదు వేర్వేఱు గుణములచే సకల ప్రాణులయందును అంతర్హితుడై యుండెడి పరమపురుషుడగు పరబ్రహ్మను సకల ప్రాణులలో ఆత్మస్వరూపునిగా భావించి ఇతడు ఆరాధించుచుండును. రాజా! నీవు ప్రభుడవు, ధర్మజ్ఞుడవు. తండ్రివలన కొడుకువలె రాజశ్రేష్ఠుడవైన నీవలన బ్రహ్మర్షి ప్రవరుడైన ఇతడు వధార్హుడు కాడు.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*685వ నామ మంత్రము*

*ఓం రాజ్యదాయిన్యై నమః*

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, దిక్పాలకులు మొదలైన దేవతలకు, తన భక్తులకు, ఉపాసకులకు దీక్షాబలము, సామర్థ్యముల ననుసరించి రాజ్యములను, నగరములను ఇచ్చి, వారిని అధిపతులను జేసిన అఖిలాండేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రాజ్యదాయినీ* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం రాజ్యదాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని పూజించు భక్తులకు సకలాభీష్టసిద్ధిని ప్రసాదించి అనుగ్రహించును.

జగన్మాత సృష్టిస్థితిలయకారిణి. దుష్టరాక్షసులను సంహరించి వారి నుండి రాజ్యములను కైవశముచేసికొని, రాక్షసులచేతిలో అపజయము పొంది వాటిని పోగొట్టుకొనిన ఇంద్రాది దేవతలకు తిరిగి ఇచ్చినది. బ్రహ్మకు సత్యలోకము, విష్ణుమూర్తికి వైకుంఠము, మహేశ్వరునకు కైలాసమును ఇచ్చినది. ఇంకను ఉపాసకులకు, శ్రేష్ఠులకు, భక్తులకు వారి వారి దీక్షాబలము, తపోబలము, ఉపాసనాబలము, పరిపాలనాదక్షత ననుసరించి రాజ్యములు, నగరములు ఇచ్చినది. అధిపతులను చేసినది జగన్మాత. ఉపాసనా సిద్ధి ఉన్న సాధకునకు, సాధనచేయు విద్యయను సామ్రాజ్యాధినేతను చేసి, జనహిత కార్యక్రమములు చేయనిర్దేశించినది. ఇంద్రునకు స్వర్గాధిపత్యము నిచ్చినది. కుబేరునకు ధనాధిపత్యము, అగ్నికి తేజోవతి నగరము, యముడికి సంయమని నగరము, నైరుతికి కృష్ణాంగన నగరము, వరుణునికి శ్రద్ధావతి నగరము, వాయువుకు గంధావతి నగరము, ఈశానుడికి యశోవతి నగరము ఇలా అందరికీ చతుర్దశ భువనములను ఇచ్చి, కార్యక్రమములు నిర్వహింపజేసినది. తాను సృష్టించిన జగత్తును రాజ్యములుగా చేసి, ఆయా విభాగములకు సామర్థ్యత గలిగిన వారిని అధిపతులను జేసి *రాజ్యదాయినీ* అని నామ మంత్రముతో స్తుతింప బడుతున్నది. అటు వంటి జగదీశ్వరికి నమస్కరించునపుడు *ఓం రాజ్యదాయిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*9.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*తస్య సాధోరపాపస్య భ్రూణస్య బ్రహ్మవాదినః|*

*కథం వధం యథా బభ్రోర్మన్యతే సన్మతో భవాన్॥7612॥*

ఇతడు పరమసాధువు, ఏ పాపమును ఎఱుగనివాడు (నిరపరాధి). నిరంతరము వేదాధ్యయనమును చేయుచుండెడివాడు. కపిలధేనువును చంపుట భావ్యము కానట్లే సత్పురుషులకు ఆదరణీయుడవైన నీవు ఈ శ్రోత్రియ బ్రాహ్మణుని చంపదలంచుట యుక్తముగాదు.
*(భ్రూణః = శ్రోత్రియః* - శ్రీధరీయ వ్యాఖ్య)

*9.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*యద్యయం క్రియతే భక్షస్తర్హి మాం ఖాద పూర్వతః|*

*న జీవిష్యే వినా యేన క్షణం చ మృతకం యథా॥7613॥*

రాజా! నీవు ఈయనను భక్షించుటకే నిర్ణయించుకొనినచో మృతప్రాయనైన నన్ను ముందుగా తినివేయుము. ఏలయన ఈయన లేకుండ నేను ఒక్క క్షణము గూడ జీవింపజాలను".

*9.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*ఏవం కరుణభాషిణ్యా విలపంత్యా అనాథవత్|*

*వ్యాఘ్రః పశుమివాఖాదత్సౌదాసః శాపమోహితః॥7614॥*

ఈ విధముగా ఆ విప్రుని సతి దిక్కులేని దానివలె మిగుల దయనీయముగా విలపించుచున్నప్పటికిని, ఆమె గోడును ఏమాత్రమూ పట్టించుకొనక, శాపగ్రస్తుడైన ఆ సౌదాసుడు (రాక్షసుడు), ఒక పెద్దపులి పశువును ఆరగించినట్లు ఆ విప్రుని భక్షించెను.

*9.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*బ్రాహ్మణీ వీక్ష్య దిధిషుం పురుషాదేన భక్షితమ్|*

*శోచంత్యాత్మానముర్వీశమశపత్కుపితా సతీ॥7615॥*

అంతట తనకు సంతానమును ప్రసాదించుటకు పూనుకొనిన తన పతిని రాక్షసుడు భక్షించుట చూచి, ఆ విప్రసతి మిగుల పరితపించుచు పట్టరాని కోపముతో ఆ రాజును ఇట్లు శపించెను-

*9.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*యస్మాన్మే భక్షితః పాప కామార్తాయాః పతిస్త్వయా|*

*తవాపి మృత్యురాధానాదకృతప్రజ్ఞ దర్శితః॥7616॥*

"ఓరీ! పాపాత్ముడా! కామార్తురాలనైయున్న నాతో సంగమించుచున్న నా భర్తను నీవు భక్షించితివి. అందువలన వివేక శూన్యుడవైన నీవు నీ కాంతతో సంగమించుటకుసిద్ధపడినప్పుడు నీకును మృత్యువు ప్రాప్తించుగాక"

*9.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*ఏవం మిత్రసహం శప్త్వా పతిలోకపరాయణా|*

*తదస్థీని సమిద్ధేఽగ్నౌ ప్రాస్య భర్తుర్గతిం గతా॥7617॥*

ఈ విధముగా మిత్రసహుని (సౌదాసుని) శపించిన ఆ విప్ర స్త్రీ తన పతిలోకమును పొందగోరినదై ప్రజ్వలించు అగ్ని (చితి) యందు తన భర్తయొక్క అస్థికలను ఉంచి తానును సహగమనమొనర్చి, తన పతిని చేరెను.

*9.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*విశాపో ద్వాదశాబ్దాంతే మైథునాయ సముద్యతః|*

*విజ్ఞాయ బ్రాహ్మణీశాపం మహిష్యా స నివారితః॥7618॥*

పన్నెండు సంవత్సరములు ముగియగనే శాపవిముక్తిని పొందిన సౌదాసుడు తన పట్టమహిషితో సంగమించుటకు ఉద్యుక్తుడాయెను. అప్పుడు ఆయన భార్యయగు మదయంతి విప్రసతి పెట్టిన శాపమును గుర్తునకు దెచ్చి, తన పతిని ఆ ప్రయత్నమునుండి నివారించెను.

*9.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*తత ఊర్ధ్వం స తత్యాజ స్త్రీసుఖం కర్మణాప్రజాః|*

*వసిష్ఠస్తదనుజ్ఞాతో మదయంత్యాం ప్రజామధాత్॥7619॥*

అటు పిమ్మట సౌదాసుడు స్త్రీసుఖమును పూర్తిగా త్యజించెను. స్వయంకృతాపరాధము వలన సంతానహీనుడైన ఆ రాజు తన వంశాభివృద్ధికై అభ్యర్థింపగా, వసిష్ఠుడు మదయంతియందు గర్భాధానమొనర్చెను.

*9.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*సా వై సప్త సమా గర్భమబిభ్రన్న వ్యజాయత|*

*జఘ్నేఽశ్మనోదరం తస్యాః సోఽశ్మకస్తేన కథ్యతే॥7620॥*

ఆమె గర్భవతియై ఏడు సంవత్సరములు గడచినను సంతానోదయము కాకుండెను. గర్భస్థ శిశువు బహిర్గతుడు కాకుండెను. అంతట వసిష్ఠుడు ఒక రాతితో ఆమె గర్భముపై కొట్టగా ఆమెకు పుత్రుడు ఉదయించెను. అందువలన అతడు *అశ్మకుడు* అని వ్యవహరింపబడెను. అశ్మము అనగా ఱాయి, అశ్మముతో అనగా ఱాతితో కొట్టుటవలన బహిర్గతుడైన కారణముగా అతడు అశ్మకుడు అయ్యెను.

*9.40 (నలుబదియవ శ్లోకము)*

*అశ్మకాన్మూలకో జజ్ఞే యః స్త్రీభిః పరిరక్షితః|*

*నారీకవచ ఇత్యుక్తో నిఃక్షత్రే మూలకోఽభవత్॥7621॥*

అశ్మకునివలన కలిగినవాడు మూలకుడు. ఆ సమయమున పరశురాముడు భువిపై క్షత్రియులు లేకుండా వారిని నిర్మూలించుచుండగా, అంతఃపుర స్త్రీలు అతనిని దాచిపెట్ట పరిరక్షించిరి. అందువలన అతనికి *నారీకవచుడు* అనియు నామాంతరము ఏర్పడెను. పరశురాముడు భువిపైగల క్షత్రియులందరినీ నిర్మూలించుటచే, తరువాతి క్షత్రియ వంశములకు ఇతడు మూలపురుషుడయ్యెను. క్షత్రియ వంశప్రవర్తకుడగుట వలన ఇతనికి మూలకుడు అను పేరు గూడ స్థిరపడెను.

PVD Subrahmanyam చెప్పారు...

*9.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*తతో దశరథస్తస్మాత్పుత్ర ఐడవిడిస్తతః|*

*రాజా విశ్వసహో యస్య ఖట్వాంగశ్చక్రవర్త్యభూత్॥7622॥*

*9.42 (నలుబది రెండవ శ్లోకము)*

*యో దేవైరర్థితో దైత్యానవధీద్యుధి దుర్జయః|*

*ముహూర్తమాయుర్జ్ఞాత్వైత్య స్వపురం సందధే మనః॥7623॥*

మూలకుని సుతుడు దశరథుడు. అతని కుమారుడు ఐడవిడుడు. ఇతని పేరు *ఇలబిలుడు* అని విష్ణుపురాణము పేర్కొనుచున్నది. ఇతని తనయుడు విశ్వసహుడు. విశ్వసహుని పుత్రుడు ఖట్వాంగుడు. ఇతడు చక్రవర్తియై ప్రసిద్ధిగాంచెను. శత్రువులకు అజేయుడైన ఈ ఖట్వాంగుడు దేవతల అభ్యర్థనపై యుద్ధరంగమున దైత్యులను హతమార్చెను. తన ఆయువు ఇక రెండు గడియలు (48 నిమిషములు) మాత్రమే మిగిలియున్నదని అతనికి దేవతలవలన తెలిసెను. వెంటనే అతడు తన పురమునకు చేరి తన మనస్సును భగవంతునిపై నిలిపెను.

ఖట్వాంగుడు దైత్యులను పరిమార్చి, దేవతలకు సహాయపడెను. అప్పుడు వారు ప్రసన్నులై 'ఖట్వాంగా! ఒక వరమును కోరుకొనుము' అని నుడివిరి. అంతట అతడు తన ఆయుర్దాయము ఎంత మిగిలియున్నదో తెలుపవలసినదిగా కోరెను. పిమ్మట వారు అతని ఆయుర్దాయము ఒక ముహూర్తము మాత్రము మిగిలియున్నట్లు తెలిపిరి. వెంటనే ఆ ఖట్వాంగుడు దేవతలు అనుగ్రహించిన విమానముపై తన పురమునకు చేరి, తన మనస్సును భగవంతునిపై లగ్నమొనర్చెను. (శ్రీధరీయ వ్యాఖ్య).

*9.43 (నలుబది మూడవ శ్లోకము)*

*న మే బ్రహ్మకులాత్ప్రాణాః కులదైవాన్న చాత్మజాః|*

*న శ్రియో న మహీ రాజ్యం న దారాశ్చాఽతివల్లభాః॥7624॥*

*9.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*న బాల్యేఽపి మతిర్మహ్యమధర్మే రమతే క్వచిత్|*

*నాపశ్యముత్తమశ్లోకాదన్యత్కించన వస్త్వహమ్॥7625॥*

అటు పిమ్మట అతడు తన మనస్సున ఇట్లు అనుకొనెను. "నాకు సిరిసంపదలకంటెను, రాజ్యభోగములకంటెను, భార్యాపుత్రులకంటెను, కడకు నా ప్రాణములకంటెను భాగవతోత్తములే ప్రీతిపాత్రులు, పూజ్యులు. బాల్యము నందును నా బుద్ధి అధర్మమార్గమున ప్రవర్తింపలేదు. చరచరాత్మకమైన ఈ ప్రపంచమునందు జగదారాధ్యుడైన భగవంతుడు తప్ఫ మఱియొక శ్రేష్థమైన వస్తువునే నేను చూచి ఎఱుగను. అనగా ఈ విశ్వమునందలి ప్రతి వస్తువు నందును ఆ భగవత్స్వరూపమే నాకు గోచరమగుచున్నది.

*9.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*దేవైః కామవరో దత్తో మహ్యం త్రిభువనేశ్వరైః|*

*న వృణే తమహం కామం భూతభావనభావనః॥7626॥*

ముల్లోకాధిపతులైన దేవతలు 'సర్వోత్కృష్టమైన వరమును కోరుకొనుము' అని నన్నడిగిరి. అప్పుడు సకలప్రాణులలో అంతర్యామియై వెలుగొందుచున్న ఆ సర్వేశ్వరుడే నా మనస్సున మెదలుచుండుటచే ఐహికములైన భోగములలో దేనినీ కోరకుంటిని.

*9.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*యే విక్షిప్తేంద్రియధియో దేవాస్తే స్వహృది స్థితమ్|*

*న విందంతి ప్రియం శశ్వదాత్మానం కిముతాపరే॥7627॥*

సత్త్వగుణ సంపన్నులైన దేవతలు సైతము దేహాత్మాభిమానులై స్వర్గాది సుఖములే మిన్నయని భావించుచుండు వారగుటచే, శ్రేయోదాయకుడైన పరమాత్మ నిరంతరము తమ హృదయములలో నివసించుచున్నప్పటికిని ఆయనను ఎఱుంగలేకున్నారు. ఇక రజొగుణ తమోగుణాత్మకులైన వారి సంగతి చెప్పనేల?

*9.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*అథేశమాయారచితేషు సంగం గుణేషు గంధర్వపురోపమేషు|*

*రూఢం ప్రకృత్యాఽఽత్మని విశ్వకర్తుర్భావేన హిత్వా తమహం ప్రపద్యే॥7628॥*

అందువలన దైవమాయవలన ఏర్పడిన గంధర్వనగరము వలె మిథ్యయైన (అనిత్యమైన) శబ్దాది విషయములయందును, ప్రకృతి పరిణామశీలమైన ఈ దేహమునందును ఆసక్తిని త్యజించి, విశ్వకారకుడైన భగవంతునియందే మనస్సును నిలిపి, అనన్రభక్తితో ఆ పరమేశ్వరునే సేవించెదను".

*గంధర్వనగరము అనగా భూమిపై ఎండమావులవలె ఆకాశమున కనబడెడి మిథ్యానగరము* (శ్రీధరీయ వ్యాఖ్య).

*9.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*ఇతి వ్యవసితో బుద్ధ్యా నారాయణగృహీతయా|*

*హిత్వాన్యభావమజ్ఞానం తతః స్వం భావమాశ్రితః॥7629॥*

*9.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*యత్తద్బ్రహ్మ పరం సూక్ష్మమశూన్యం శూన్యకల్పితమ్|*

*భగవాన్ వాసుదేవేతి యం గృణంతి హి సాత్వతాః॥7630॥*

పరీక్షిన్మహారాజా! ఖట్వాంగుని మనస్సు మొదటినుండియు భగవత్పరమై (శ్రీమన్నారాయణునియందే నిమగ్నమై) యుండెను. అందువలన అతడు ఈ చరమదశ యందును అజ్ఞానమూలకమగు దేహాత్మభావము లేనివాడై, వాస్తవికమైన ఆత్మస్వరూపమునందే స్థితుడైయుండెను. ఆ ఆత్మస్వరూపము సాక్షాత్తుగా పరబ్రహ్మమే, అది సూక్ష్మాతి సూక్ష్మమైనది, (అణోరణీయాన్), శూన్యమైనదిగా తోచునుగాని, అది శూన్యముగాదు, పరమసత్యము. భాగవతోత్తములు ఆ పరతత్త్వమును భగవంతుడైన వాసుదేవునిగా కీర్తించు చుందురు.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే నవమోఽధ్యాయః (9)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు తొమ్మిదవ అధ్యాయము (9)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*686వ నామ మంత్రము*

*ఓం రాజ్యవల్లభాయై నమః*

త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, ఇంద్రాదులందరూ తానొసగిన చిన్న చిన్న రాజ్యములకు అధిపతులై, వివిధశాఖాధీశులుగా తన కనుసన్నలలోనే పరిపాలన కొనసాగించుచుండగా, ఆ రాజ్యములకన్నిటికీ తానే సర్వాధినేతయై, శ్రీమహారాజ్ఞిగా, శ్రీమత్సింహాసనేశ్వరిగా విరాజిల్లు అఖిలాండేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రాజ్యవల్లభా* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం రాజ్యవల్లభాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు భక్తిసామ్రాజ్యాధినేతయై, శ్రీచక్రాధీశ్వరి కరుణతో విశేషమైన బ్రహ్మజ్ఞానసంపదతోబాటు, భౌతిక సుఖసంతోషములు కూడా సంప్రాప్తించి ఆనందమందును.

జగన్మాత ఈ సమస్త విశ్వసామ్రాజ్యమునకు ప్రభ్వి. సృష్టిస్థితిలయకారిణి. సమస్తభువనమండలములకు అధినేత్రియై స్వర్గసామ్రాజ్యమునకు దేవేంద్రుని, సత్యలోకమునకు చతుర్ముఖ బ్రహ్మను, వైకుంఠమునకు శ్రీమహావిష్ణువును, కైలాసమునకు త్రినేత్రుడిని పరిపాలనకు నియమించి, అష్టదిక్పాలకులను, నవగ్రహదేవతలను వివిధ నగరములకు అధిపతులను జేసి పరిపాలనను వికేంద్రీకరణము జేసి, సర్వాధిపత్యము తానే వహిస్తూ శిష్టజన రక్షణ, దుష్టజన శిక్షణ, సృష్టిస్థితిలయకార్యములకు విఘాతము కలుగకుండా అత్యంతసమర్థవంతంగా పరిపాలించు విశ్వజన సామ్రాజ్యాధికారిణిగా *రాజ్యవల్లభా* అసు నామమునకు సార్థకత చేకూర్చు తల్లి ఆ పరాశక్తి. జగన్మాత శ్రీచక్రసామ్రాజ్యానికి అధినేత్రియై నవావరణలు అను సామంతరాజ్యములకు ప్రకటయోగిని, గుప్తయోగిని, గుప్తతరయోగిని, సంప్రదాయయోగిని, కులోత్తీర్ణయోగిని, నిగర్భయోగిని, రహస్యయోగిని, అతిరహస్యయోగిని, పరాపర రహస్యయోగిని అను సామంత రాజ్యాధినేతలను నియమించి నవచక్రేశ్వరియై, బిందుమండలమందు కామేశ్వరునితో కూడి సార్వభౌమత్వమును నిర్వహించు చున్నది. ఆ తల్లి ఆ రాజ్యాధినేతలనిన అత్యంత ప్రీతికలిగియున్నది. గనుకనే జగన్మాతను *రాజ్యవల్లభా* అని నామ మంత్రముతో స్తుతించుచున్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం రాజ్యవల్లభాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*109వ నామ మంత్రము*

*ఓం మహాసక్త్యై నమః*

సహస్రారమునందు శివశక్తిల సంయోగ రూపోత్సవమునందు ఆసక్తి గలిగి యుండు శక్తిస్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కారము.

అగ్నితేజస్సునందు ఆసక్తిని చూపించు శ్రీమాతకు నమస్కారము.

బ్రహ్మమునకు అభేదమై తేజరిల్లు జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాసక్తిః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహాసక్త్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు పరమేశ్వరీ తత్త్వమును పరిపూర్ణముగా అర్థంచేసుకొని, దీక్షలో నిమగ్నుడై బ్రహ్మజ్ఞానసంపన్నుడు యలరారును.

మహా అంటే బ్రహ్మము. ఆసక్తిః అంటే ఆసక్తి కలిగి యున్నది. *అంటే పరమేశ్వరి బ్రహ్మమునందు ఆసక్తి కలిగియున్నది*.

పరబ్రహ్మము అంటేనే బ్రహ్మము. పరాశక్తి పరబ్రహ్మస్వరూపిణి. అందుచే తాను ఆసక్తి కనబరిచే బ్రహ్మము అంటే ఆపరమేశ్వరియే. *అంటే బ్రహ్మముతో జగన్మాత అభేదమైనది*

ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు గంగా, యమునా, సరస్వతులు. సుషుమ్నా నాడి అగ్నితత్త్వముగలది. కుండలినీ శక్తి స్వరూపిణీ అయిన అమ్మవారు కూడా అగ్నితత్త్వమే. ఎందుకంటే సుధాసాగరంలో ఘనీభవించిన సుధలు, అమ్మవారు (అగ్నితత్త్వ స్వరూపిణి) సహస్రారంలో అడుగిడగానే, ఘనీభవన స్థితిలో ఉన్న సుధలు కరిగి అమృతధారలు జాలువారాయి అని చెప్ఫుకున్నాంకదా. *మహా* అంటే బ్రహ్మ, బ్రహ్మయొక్కరాణి సరస్వతి *మహాశక్తి* సుషుమ్నా (అగ్మితత్త్త్వం) నాడి సరస్వతీ స్వరూపిణి *మహాశక్తి* అని అంటే అగ్నితత్త్వమున్న అమ్మవారుకూడా *మహాశక్తి* అవుతుంది.అనగా *మహాసక్తిః* అనగా *మహాశక్తి* *అనగా సరస్వతీ మరియు శ్రీమాతలకు అవినాభావ సంబంధమున్నదని* గ్రహించదగును

*ఎవ్వరి చేజనించు, జగమెవ్వరి లోపలనుండు లీనమై, ఎవ్వరి యందు డిందు పరమేశ్వరి ఎవ్వరు, మూలకారణం బెవ్వరు* (ఎవ్వనిచేజనించు అని పోతనా మాత్యులవారన్నారు. సందర్భోచితముగా ఎవ్వరిచేజనించు...అని మార్చుకొని యున్నాను) అని ప్రశ్నిస్తే సృష్తిస్థితిలయకారకు లెవ్వరు అనగా ఆ పరబ్రహ్మమే.
అటువంటి బ్రహ్మమునందు ఆసక్తిగలది పరబ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారు. ఆ పరబ్రహ్మమే అమ్మవారు అనికూడా అనవలసి వస్తుంది. *అందరికన్నా మహత్తు గలవారెవ్వరు అంటే అమ్మవారే*

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మహాసక్త్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*10.1 (ప్రథమ శ్లోకము)*

*ఖట్వాంగాద్దీర్ఘబాహుశ్చ రఘుస్తస్మాత్పృథుశ్రవాః|*

*అజస్తతో మహారాజస్తస్మాద్దశరథోఽభవత్॥7631॥*

*శ్రీశుకుడు పలికెను* ఖట్వాంగుని సుతుడు దీర్ఘబాహువు. అతని కుమారుడు రఘుమహారాజు. అతడు మిగుల ఖ్యాతి వహించెను. రఘువుయొక్క తనయుడు అజమహారాజు. ఈ అజుని పుత్రుడే దశరథుడు.

*10.2 (రెండవ శ్లోకము)*

*తస్యాపి భగవానేష సాక్షాద్బ్రహ్మమయో హరిః|*

*అంశాంశేన చతుర్ధాగాత్పుత్రత్వం ప్రార్థితః సురైః|*

*రామలక్ష్మణభరతశత్రుఘ్నా ఇతి సంజ్ఞయా॥7632॥*

సాక్షాత్తుగా పరబ్రహ్మయైన శ్రీమన్నారాయణుడు దేవతల ప్రార్థనను మన్నించి, నాలుగు అంశలతో దశరథమహారాజునకు నలుగురు పుత్రులుగా అవతరించెను. వరుసగా రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు అనునని వారి పేర్లు.

*10.3 (మూడవ శ్లోకము)*

*జానకీజీవనస్మరణం జయ జయ రామ రామ*

*తస్యానుచరితం రాజన్నృషిభిస్తత్త్వదర్శిభిః|*

*శ్రుతం హి వర్ణితం భూరి త్వయా సీతాపతేర్ముహుః॥7633॥*

ఆ రామచంద్ర భగవానుని యొక్క అవతారలీలలను తత్త్వదర్శనులైన (అవతారమహత్త్వమును బాగుగా ఎఱిగిన) వాల్మీక్యాది ఋషులు విపులముగా వర్ణించిరి. ఆ మహిత వృత్తాంతమును నీవును పెక్కుమార్లు వినియుంటివి. అందువలన దానిని గూర్చి సంగ్రహముగా తెలిపెదను వినుము.

*10.4 (నాలుగవ శ్లోకము)*

*గుర్వర్థే త్యక్తరాజ్యో వ్యచరదనువనం పద్మపద్భ్యాం ప్రియాయాః పాణిస్పర్శాక్షమాభ్యాం మృజితపథరుజో యో హరీంద్రానుజాభ్యామ్|*

*వైరూప్యాచ్ఛూర్పణఖ్యాః ప్రియవిరహరుషారోపితభ్రూవిజృంభ త్రస్తాబ్ధిర్బద్ధసేతుః ఖలదవదహనః కోసలేంద్రోఽవతాన్నః॥7634॥*

శ్రీరామచంద్రప్రభువు పితృవాక్యమును శిరసావహించి (తండ్రిమాటను నిలబెట్టి, ఆయనను సత్యసంధుని గావించుటకై) రాజ్యభోగములను త్యజించి, వనములకు వెళ్ళెను. సీతాదేవియొక్క కోమలములైన కరకమలముల స్పర్శకును కందిపోవునంత సుతిమెత్తని పాదములుగలవాడు ఆ స్వామి. అట్టి సుకుమారములైన పాదములతో వనములలో ఆ ప్రభువు సంచరించుచున్నప్పుడు హనుమంతుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు సేవలొనర్చుచు ఆయనకు మార్గాయాసమును దూరమొనర్చిరి. కామవికారములకు లోనైన శూర్పణఖ తమ దగ్గరకు వచ్చి వెకిలిచేష్టలు చేసినప్పుడు శ్రీరాముని సూచనపై లక్ష్మణుడు ఆమెయొక్క ముక్కుచెవులను కోసి, విరూపను గావించెను. తీరని అవమానమునకు లోనైన శూర్పణఖ కోపముతో బుసలుకొట్టుచు రావణుని ఉసిగొల్పగా, ఆ లంకాధిపతి తన మాయోపాయముచే సీతాదేవిని అపహరించెను. ఆ కారణమున శ్రీరాముడు తనకు ప్రాణతుల్యమైన సీతాదేవియొక్క వియోగమును గూడ సహింపవలసి వచ్చెను. దుర్భరమైన అట్టి విరహములో నున్న రఘురాముడు కనుబొమలు ముడిచినంతనే సముద్రుడు గడగడవణుకుచు దారికివచ్చెను. నలుడు మొదలగు వానరుల సహాయమున సముద్రముపై సేతువును నిర్మింపజేసి, లంకకు జేరి ఆ రఘువీరుడు దుష్టులైన రావణాదులను శిక్షించి (వధించి) ధర్మపరిరక్షణ గావించెను. అట్టి శ్రీరామచంద్ర ప్రభువు మనలను బ్రోచుగాక.

*10.5 (ఐదవ శ్లోకము)*

*విశ్వామిత్రాధ్వరే యేన మారీచాద్యా నిశాచరాః|*

*పశ్యతో లక్ష్మణస్యైవ హతా నైరృతపుంగవాః॥7635॥*

శ్రీరాముడు యాగరక్షణకై విశ్వామిత్ర మహర్షి వెంటవెళ్ళుచు మార్గమధ్యమున దుర్మార్గురాలైన తాటకను వధించెను. యాగ సమయమున సుబాహుడు మొదలగు రాక్షసులను పరిమార్చెను. మారీచునకు బుద్ధి చెప్పెను. ఆ సందర్భమున అన్నకు తోడుగా యాగరక్షణకు పర్యవేక్షణలోనున్న లక్ష్మణుడు నిశాచర ప్రముఖులను హతమొనర్చెను.

*10.6 (ఆరవ శ్లోకము)*

*యో లోకవీరసమితౌ ధనురైశముగ్రం సీతాస్వయంవరగృహే త్రిశతోపనీతమ్|*

*ఆదాయ బాలగజలీల ఇవేక్షుయష్టిం సజ్జీకృతం నృప వికృష్య బభంజ మధ్యే॥7636॥*

జనకమహారాజు మిథిలానగరమున సీతాదేవి స్వయంవరసభను ఏర్పాటు చేసెను. లోకములోని వీరాధివీరులందరును ఆ సభకు విచ్చేసిరి. అప్పుడు బలశాలులైన మూడువందలమంది యోధులు శివధనుస్సు తీసికొనివచ్చి ఆ సభామధ్యమున నిలిపిరి. ఆ విల్లు మిగుల బలమైనది. అంతట మహావీరుడైన శ్రీరాముడు ఆ శివధనుస్సును చేబూని, నారిని సంధించెను. పిమ్మట ఆ ప్రభువు దానిని లాగి, ఏనుగుగున్న చెఱకుగడనువలె అవలీలగా ఆ వింటిని రెండు ముక్కలు గావించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*10.7 (ఏడవ శ్లోకము)*

*జిత్వానురూపగుణశీలవయోఽఙ్గరూపాం సీతాభిధాం శ్రియమురస్యభిలబ్ధమానామ్|*

*మార్గే వ్రజన్ భృగుపతేర్వ్యనయత్ప్రరూఢం దర్పం మహీమకృత యస్త్రిరరాజబీజామ్॥7637॥*

శ్రీమన్నారాయణుని అంశతో అవతరించినవాడు శ్రీరాముడు. ఆ శ్రీహరి వక్షస్థలమున విరాజిల్లుచుండెడి లక్ష్మీదేవి సీతాదేవిగా అవతరించెను. తరుణవయస్సులో తళతళ మెఱయుచున్న రామచంద్రప్రభువు సద్గుణములచే, ఉత్తమశీల సంపదచే, వయోవైభవముచే, అంగసౌష్ఠవముచే, రూపసౌభాగ్యముచే తనకు అన్నివిధములుగా తగిన సీతాదేవిని (శివధనుర్భంగ మొనర్చుటద్వారా) జయించి, ఆమెను చేపట్టెను. శ్రీరాముడు సీతాదేవితోగూడి సపరివారముగా మిథిలనుండి అయోధ్యకు వెళ్ళుచున్నప్పుడు, మార్గమధ్యమున ఆ ప్రభువునకు పరశురాముడు నిలువరించెను. ఆ భార్గవరాముడు ఇదివరలో ఇరువదియొక్కమారులు క్షత్రియులపై దాడిచేసి భూమిపై వారి వంశములను రూపుమాపియుండెను. అట్టి గర్వముతో ఒప్పుచున్న భార్గవుడు తనను అడ్డగింపగా రఘువీరుడు ఆ మహామహునిలో పాతుకొనియున్న దర్పమును నిర్మూలించెను.

*10.8 (ఎనిమిదవ శ్లోకము)*

*యః సత్యపాశపరివీతపితుర్నిదేశం స్త్రైణస్య చాఽపి శిరసా జగృహే సభార్యః|*

*రాజ్యం శ్రియం ప్రణయినః సుహృదో నివాసం త్యక్త్వా యయౌ వనమసూనివ ముక్తసంగః॥7638॥*

*శ్రీరాముడు తన తండ్రి (దశరథమహారాజు) కైకేయికి ఇచ్చినమాటను* నిలబెట్టుటకై వనములకేగెను. ఆ మహారాజు తన భార్యయగు కైకేయి ప్రభావమునకు లోనైయున్నను, అతడు తన తండ్రిని సత్యసంధుని గావించుటకై తదాదేశమును శిరసావహించెను. సర్వసంగ పరిత్యాగి ప్రాణములను వీడినట్లుగా, అప్పుడు ఆ స్వామి రాజ్యసుఖములను, సకల సంపదలను, తనకు ఆత్మీయులైన బంధుమిత్రులను, భవనములను త్యజించి, భార్యా సహితుడై (సీతా, లక్ష్మణులతో గూడి) వనములకు చేరెను.

*శ్రీరాముడు తన తండ్రి (దశరథమహారాజు) కైకేయికి ఇచ్చినమాట*

పూర్వము ఒకానొకప్పుడు యుద్ధసమయమున కైకేయి దశరథునకు సహాయపడి యుండెను. అందులకు సంతోషించిన దశరథుడు ఆమెకు రెండు వరములను ఇచ్చియుండెను. అప్పుడు ఆరాజు ఇచ్చిన వాగ్దానమును గుర్తుచేయుచు శ్రీరాముని యువరాజు పట్టాభిషేక సమయమున కైకేయి 1) భరతుని పట్టాభిషిక్తుని గావింపవలసినదిగను, 2) శ్రీరాముని వనములకు పంపవలసినదిగను తన భర్తను కైకేయి కోరుకొనెను.

*10.9 (తొమ్మిదవ శ్లోకము)*

*రక్షః స్వసుర్వ్యకృత రూపమశుద్ధబుద్ధేస్తస్యాః ఖరత్రిశిరదూషణముఖ్యబంధూన్|*

*జఘ్నే చతుర్దశసహస్రమపారణీయకోదండపాణిరటమాన ఉవాస కృచ్ఛ్రమ్॥7639॥*

రావణుని చెల్లెలు, కామాతురయైన శూర్పణఖను శ్రీరాముడు వికృతరూపను గావించెను. ఆ రాక్షసి ప్రేరణవలన (శూర్పణఖ గగ్గోలును జూచి ఆవేశపూరితులైన) ఖరుడు, త్రిశిరుడు, దూషణుడు మున్నగు పదునాలుగువేల మంది రాక్షసులు శ్రీరామునిపై దాడికి దిగిరి. అప్పుడు ఆ రఘువీరుడు తిరుగులేని తన కోదండమును చేబూని, ఆ రాక్షసబలములను పూర్తిగా తుడిచిపెట్టెను. పిమ్మట, ఆ రాఘవుడు వనములయందు అంతటను సంచరించుచు అనేకములైన కష్టములను వహించెను.

PVD Subrahmanyam చెప్పారు...

**10.10 (పదియవ శ్లోకము)*

*సీతాకథాశ్రవణదీపితహృచ్ఛయేన సృష్టం విలోక్య నృపతే దశకంధరేణ|*

*జఘ్నేఽద్భుతైణవపుషాఽఽశ్రమతోఽపకృష్టో మారీచమాశు విశిఖేన యథా కముగ్రః॥7640॥*

పరీక్షిన్మహారాజా! శూర్పణఖ వలన అపూర్వమైన రూప, గుణ, సౌందర్యాదులను వినినప్పటి నుండి ఆమెయెడ రావణుని హృదయములో కామవికారములు చెలరేగెను. అంతట రావణుని ఆదేశముతో మారీచుడు బంగారు లేడి రూపమున శ్రీరాముని పర్ణకుటీర సమీపమునందు తిరుగసాగెను. ఆ బంగారు లేడికై సీతాదేవి ఆపేక్షపడగా శ్రీరాముడు ఆ హరిణమును పట్టుకొనుటకై దానిని వెంబడించెను. అది ఆయనను చాలదూరము తిసికొనిపోయెను. అప్పుడు వీరభద్రుడు దక్షప్రజాపతినివలె శ్రీరామచంద్రుడు తన వాడియైన బాణముచే మారీచుని ప్రాణములను హరించెను.

*10.11 (పదకొండవ శ్లోకము)*

*రక్షోఽధమేన వృకవద్విపినేఽసమక్షం వైదేహరాజదుహితర్యపయాపితాయామ్|*

*భ్రాత్రా వనే కృపణవత్ప్రియయా వియుక్తః స్త్రీసంగినాం గతిమితి ప్రథయంశ్చచార॥7641॥*

బంగారు లేడిని తీసికొనివచ్చుటకై శ్రీరాముడు వెళ్ళిన పిమ్మట ఆందోళనకు గుఱియైన సీతాదేవి ఆయన సమాచారమును తెలిసికొనిరమ్మని లక్ష్మణుని ఒత్తిడి చేసెను. విధిలేని పరిస్థితిలో లక్ష్మణుడు తన అన్నకొరకై కుటీరమును వీడి వెళ్ళెను. ఆ సమయమున రాక్షసాధముడైన రావణుడు తోడేలు మేకనువలె, ఆ వనమునుండి సీతాదేవిని అపహరించుకొని లంకకు వెళ్ళెను. సీతాదేవి (భార్యా) వియోగమునకు గుఱియైన శ్రీరాముడు దీనునివలె సోదరుడగు లక్ష్మణునితోగూడి వనములయందు సంచరింప సాగెను. 'స్త్రీలయెడ ఆసక్తి గలవారికి ఇట్టి దుస్థితులు తప్పవు' అని శ్రీరాముడు ఈ విధముగా లోకమునకు చాటెను.

*10.12 (పండ్రెండవ శ్లోకము)*

*దగ్ధ్వాఽఽత్మకృత్యహతకృత్యమహన్ కబంధం సఖ్యం విధాయ కపిభిర్దయితాగతిం తైః|*

*బుద్ధ్వాథ వాలిని హతే ప్లవగేంద్రసైన్యైః వేలామగాత్స మనుజోఽజభవార్చితాంఘ్రిః॥7642॥*

రావణుని నుండి సీతాదేవిని రక్షించుటద్వారా శ్రీరామునకు సహాయపడుటకై గృధ్రరాజగు జటాయువు ఆ రాక్షసునితో పోరాడి ఆయువులను కోల్పోయెను. తన కొరకై ప్రాణార్పణ చేసిన ఆ పక్షీంద్రునకు శ్రీరాముడు పుత్రునివలె అంత్యక్రియలొనర్చి, అతనికి మోక్షమును ప్రసాదించెను. అచటినుండి కొంత ముందునకు సాగిన పిమ్మట ఆ ప్రభువు తమయెడ అపరాధమొనర్చిన కబంధుని కడతేర్చెను. తదుపరి సుగ్రీవాది వానర ప్రముఖులతో మైత్రిని నెఱపెను. అధర్మమునకు ఒడిగట్టిన వాలిని సంహరించెను. వానరుల ద్వారా తనకు ప్రాణప్రియమైన సీతాదేవి జాడను తెలిసికొనెను. బ్రహ్మరుద్రాదులకును ఆరాధ్యుడైన శ్రీమన్నారాయణుని యొక్క అంశతో మానవుడై అవతరించిన శ్రీరాముడు వానరసైన్యముతోగూడి సముద్రతీరమునకు చేరెను.

*687వ నామ మంత్రము*

*ఓం రాజత్కృపాయై నమః*

సృష్టియందలి జీవజాలానికి కాలానుగుణముగా ఋతుధర్మముల ననుసరించి కూడు, గూడు, గుడ్డ వంటి అవసరములయందు, దుష్టశిక్షణ, శిష్టరక్షణాది కార్యకలాపముల నిర్వహణయందు బాధ్యతపడి సమస్త విశ్వమును మాతృమూర్తివలె అనురాగపు జల్లులలో ఆనందింపజేస్తూ విరాజిల్లు శ్రీమహారాజ్ఞికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రాజత్కృపా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం రాజత్కృపాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తునకు ఆ జగన్మాతయొక్క సంపూర్ణ కరుణా కటాక్షములు లభించి సర్వాభీష్ట సిద్ధి కలుగును.

*రాజ్యవల్లభా* అను 686వ నామ మంత్రములో జగన్మాత అఖిలాండేశ్వరి. సర్వాధినేత్రి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులకు సత్యలోకము, వైకుంఠము, కైలాసము మరియు అష్టదిక్పాలకులకు వారి వారి నిర్దేశిత విధులను బట్టి వివిధరాజ్యములను ఇచ్చి, ఆ రాజ్యములకు అధిపతులను జేసి, సార్వభౌమత్వమును తాను వహిస్తూ లోకేశ్వరి, అఖిలాండేశ్వరిగా విరాజిల్లుచున్నది జగన్మాత. సర్వాధినేత్రిగా జగన్మాతకు బాధ్యత ఇంకను చాలా ఉన్నది. అదేమిటంటే కాలధర్మములు, ఋతుధర్మములు, జీవుల జీవనవిధానములు వాటికనుగుణంగా నెలకు మూడు వానలు, గాదులనిండా ధాన్యములు, కడవలనిండా పాడి, చెరువుల నిండా నీళ్ళు, నదులు అదుపుతప్పకుండా ప్రవహించుట, పనిచేసే బసవన్నలు ఆరోగ్యంగా ఉండుట, స్త్రీమూర్తులు మాంగల్య శోభతో, ప్రాణంపెట్టే పతిదేవుళ్ళతో, రత్నమాణిక్యములవంటి సంతానముతో, ఆ సంతానము చతుష్షష్టి కళానైపుణ్యముతో, వజ్రవైఢూర్యాది నవరత్నములు కుంచములతో కొలిచి ఇచ్చే సిరిసంపదలతో....శోభనముల (పురుషార్థముల) నాచరించుటలో సమన్యాయముతో, స్త్రీమూర్తులు అష్టలక్ష్మీ సమానులై ఆరాధింపబడుతూ ఉంచవలసిన బాధ్యత ఆ జగన్మాతకు గలదు. ఈ బాధ్యతలను సమర్థవంతముగా నిర్వహిస్తూ, దుష్టశిక్షణ, శిష్టరక్షణాది కార్యక్రమములను నిర్వహిస్తూ, సమస్త సృష్టిలోని జీవజాలమునకు తానొక మాతృమూర్తియై, కృపాకటాక్షములనెడి సుధాధారలను వర్షింపజేస్తూ విరాజిల్లుతూ రాజిల్లుచున్నది గనుక జగన్మాత *రాజత్కృపా* అను నామప్రసిద్ధమైనది. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం రాజత్కృపాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*10.1 (ప్రథమ శ్లోకము)*

*ఖట్వాంగాద్దీర్ఘబాహుశ్చ రఘుస్తస్మాత్పృథుశ్రవాః|*

*అజస్తతో మహారాజస్తస్మాద్దశరథోఽభవత్॥7631॥*

*శ్రీశుకుడు పలికెను* ఖట్వాంగుని సుతుడు దీర్ఘబాహువు. అతని కుమారుడు రఘుమహారాజు. అతడు మిగుల ఖ్యాతి వహించెను. రఘువుయొక్క తనయుడు అజమహారాజు. ఈ అజుని పుత్రుడే దశరథుడు.

*10.2 (రెండవ శ్లోకము)*

*తస్యాపి భగవానేష సాక్షాద్బ్రహ్మమయో హరిః|*

*అంశాంశేన చతుర్ధాగాత్పుత్రత్వం ప్రార్థితః సురైః|*

*రామలక్ష్మణభరతశత్రుఘ్నా ఇతి సంజ్ఞయా॥7632॥*

సాక్షాత్తుగా పరబ్రహ్మయైన శ్రీమన్నారాయణుడు దేవతల ప్రార్థనను మన్నించి, నాలుగు అంశలతో దశరథమహారాజునకు నలుగురు పుత్రులుగా అవతరించెను. వరుసగా రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు అనునని వారి పేర్లు.

*10.3 (మూడవ శ్లోకము)*

*జానకీజీవనస్మరణం జయ జయ రామ రామ*

*తస్యానుచరితం రాజన్నృషిభిస్తత్త్వదర్శిభిః|*

*శ్రుతం హి వర్ణితం భూరి త్వయా సీతాపతేర్ముహుః॥7633॥*

ఆ రామచంద్ర భగవానుని యొక్క అవతారలీలలను తత్త్వదర్శనులైన (అవతారమహత్త్వమును బాగుగా ఎఱిగిన) వాల్మీక్యాది ఋషులు విపులముగా వర్ణించిరి. ఆ మహిత వృత్తాంతమును నీవును పెక్కుమార్లు వినియుంటివి. అందువలన దానిని గూర్చి సంగ్రహముగా తెలిపెదను వినుము.

*10.4 (నాలుగవ శ్లోకము)*

*గుర్వర్థే త్యక్తరాజ్యో వ్యచరదనువనం పద్మపద్భ్యాం ప్రియాయాః పాణిస్పర్శాక్షమాభ్యాం మృజితపథరుజో యో హరీంద్రానుజాభ్యామ్|*

*వైరూప్యాచ్ఛూర్పణఖ్యాః ప్రియవిరహరుషారోపితభ్రూవిజృంభ త్రస్తాబ్ధిర్బద్ధసేతుః ఖలదవదహనః కోసలేంద్రోఽవతాన్నః॥7634॥*

శ్రీరామచంద్రప్రభువు పితృవాక్యమును శిరసావహించి (తండ్రిమాటను నిలబెట్టి, ఆయనను సత్యసంధుని గావించుటకై) రాజ్యభోగములను త్యజించి, వనములకు వెళ్ళెను. సీతాదేవియొక్క కోమలములైన కరకమలముల స్పర్శకును కందిపోవునంత సుతిమెత్తని పాదములుగలవాడు ఆ స్వామి. అట్టి సుకుమారములైన పాదములతో వనములలో ఆ ప్రభువు సంచరించుచున్నప్పుడు హనుమంతుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు సేవలొనర్చుచు ఆయనకు మార్గాయాసమును దూరమొనర్చిరి. కామవికారములకు లోనైన శూర్పణఖ తమ దగ్గరకు వచ్చి వెకిలిచేష్టలు చేసినప్పుడు శ్రీరాముని సూచనపై లక్ష్మణుడు ఆమెయొక్క ముక్కుచెవులను కోసి, విరూపను గావించెను. తీరని అవమానమునకు లోనైన శూర్పణఖ కోపముతో బుసలుకొట్టుచు రావణుని ఉసిగొల్పగా, ఆ లంకాధిపతి తన మాయోపాయముచే సీతాదేవిని అపహరించెను. ఆ కారణమున శ్రీరాముడు తనకు ప్రాణతుల్యమైన సీతాదేవియొక్క వియోగమును గూడ సహింపవలసి వచ్చెను. దుర్భరమైన అట్టి విరహములో నున్న రఘురాముడు కనుబొమలు ముడిచినంతనే సముద్రుడు గడగడవణుకుచు దారికివచ్చెను. నలుడు మొదలగు వానరుల సహాయమున సముద్రముపై సేతువును నిర్మింపజేసి, లంకకు జేరి ఆ రఘువీరుడు దుష్టులైన రావణాదులను శిక్షించి (వధించి) ధర్మపరిరక్షణ గావించెను. అట్టి శ్రీరామచంద్ర ప్రభువు మనలను బ్రోచుగాక.

*10.5 (ఐదవ శ్లోకము)*

*విశ్వామిత్రాధ్వరే యేన మారీచాద్యా నిశాచరాః|*

*పశ్యతో లక్ష్మణస్యైవ హతా నైరృతపుంగవాః॥7635॥*

శ్రీరాముడు యాగరక్షణకై విశ్వామిత్ర మహర్షి వెంటవెళ్ళుచు మార్గమధ్యమున దుర్మార్గురాలైన తాటకను వధించెను. యాగ సమయమున సుబాహుడు మొదలగు రాక్షసులను పరిమార్చెను. మారీచునకు బుద్ధి చెప్పెను. ఆ సందర్భమున అన్నకు తోడుగా యాగరక్షణకు పర్యవేక్షణలోనున్న లక్ష్మణుడు నిశాచర ప్రముఖులను హతమొనర్చెను.

*10.6 (ఆరవ శ్లోకము)*

*యో లోకవీరసమితౌ ధనురైశముగ్రం సీతాస్వయంవరగృహే త్రిశతోపనీతమ్|*

*ఆదాయ బాలగజలీల ఇవేక్షుయష్టిం సజ్జీకృతం నృప వికృష్య బభంజ మధ్యే॥7636॥*

జనకమహారాజు మిథిలానగరమున సీతాదేవి స్వయంవరసభను ఏర్పాటు చేసెను. లోకములోని వీరాధివీరులందరును ఆ సభకు విచ్చేసిరి. అప్పుడు బలశాలులైన మూడువందలమంది యోధులు శివధనుస్సు తీసికొనివచ్చి ఆ సభామధ్యమున నిలిపిరి. ఆ విల్లు మిగుల బలమైనది. అంతట మహావీరుడైన శ్రీరాముడు ఆ శివధనుస్సును చేబూని, నారిని సంధించెను. పిమ్మట ఆ ప్రభువు దానిని లాగి, ఏనుగుగున్న చెఱకుగడనువలె అవలీలగా ఆ వింటిని రెండు ముక్కలు గావించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*687వ నామ మంత్రము*

*ఓం రాజత్కృపాయై నమః*

సృష్టియందలి జీవజాలానికి కాలానుగుణముగా ఋతుధర్మముల ననుసరించి కూడు, గూడు, గుడ్డ వంటి అవసరములయందు, దుష్టశిక్షణ, శిష్టరక్షణాది కార్యకలాపముల నిర్వహణయందు బాధ్యతపడి సమస్త విశ్వమును మాతృమూర్తివలె అనురాగపు జల్లులలో ఆనందింపజేస్తూ విరాజిల్లు శ్రీమహారాజ్ఞికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రాజత్కృపా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం రాజత్కృపాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తునకు ఆ జగన్మాతయొక్క సంపూర్ణ కరుణా కటాక్షములు లభించి సర్వాభీష్ట సిద్ధి కలుగును.

*రాజ్యవల్లభా* అను 686వ నామ మంత్రములో జగన్మాత అఖిలాండేశ్వరి. సర్వాధినేత్రి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులకు సత్యలోకము, వైకుంఠము, కైలాసము మరియు అష్టదిక్పాలకులకు వారి వారి నిర్దేశిత విధులను బట్టి వివిధరాజ్యములను ఇచ్చి, ఆ రాజ్యములకు అధిపతులను జేసి, సార్వభౌమత్వమును తాను వహిస్తూ లోకేశ్వరి, అఖిలాండేశ్వరిగా విరాజిల్లుచున్నది జగన్మాత. సర్వాధినేత్రిగా జగన్మాతకు బాధ్యత ఇంకను చాలా ఉన్నది. అదేమిటంటే కాలధర్మములు, ఋతుధర్మములు, జీవుల జీవనవిధానములు వాటికనుగుణంగా నెలకు మూడు వానలు, గాదులనిండా ధాన్యములు, కడవలనిండా పాడి, చెరువుల నిండా నీళ్ళు, నదులు అదుపుతప్పకుండా ప్రవహించుట, పనిచేసే బసవన్నలు ఆరోగ్యంగా ఉండుట, స్త్రీమూర్తులు మాంగల్య శోభతో, ప్రాణంపెట్టే పతిదేవుళ్ళతో, రత్నమాణిక్యములవంటి సంతానముతో, ఆ సంతానము చతుష్షష్టి కళానైపుణ్యముతో, వజ్రవైఢూర్యాది నవరత్నములు కుంచములతో కొలిచి ఇచ్చే సిరిసంపదలతో....శోభనముల (పురుషార్థముల) నాచరించుటలో సమన్యాయముతో, స్త్రీమూర్తులు అష్టలక్ష్మీ సమానులై ఆరాధింపబడుతూ ఉంచవలసిన బాధ్యత ఆ జగన్మాతకు గలదు. ఈ బాధ్యతలను సమర్థవంతముగా నిర్వహిస్తూ, దుష్టశిక్షణ, శిష్టరక్షణాది కార్యక్రమములను నిర్వహిస్తూ, సమస్త సృష్టిలోని జీవజాలమునకు తానొక మాతృమూర్తియై, కృపాకటాక్షములనెడి సుధాధారలను వర్షింపజేస్తూ విరాజిల్లుతూ రాజిల్లుచున్నది గనుక జగన్మాత *రాజత్కృపా* అను నామప్రసిద్ధమైనది. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం రాజత్కృపాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*111వ నామ మంత్రము*

*ఓం బిసతంతు తనీయస్యై నమః*

తామరతూడులోని సన్నని దారము వలె సూక్ష్మాతి సూక్ష్మమైన శరీరముతో భాసిల్లు కుండలినీ శక్తి స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బిసతంతు తనీయసీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం బిసతంతు తనీయస్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ కుండలినీ శక్తిస్వరూపిణి అయిన జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు సహస్రారమందలి అమృతధారలలో ఓలలాడిన బ్రహ్మానందానుభూతిని పొందుటయేగాక, సుఖసంతోషములతో భౌతిక జీవనమును కూడా కొనసాగించును.

తామర తూడులోని దారము వలెను, సూర్యకిరణమువలెను, నివ్వరి ధాన్యపు అంకురము వలెను సూక్ష్మాతి సూక్ష్మముగాను, చుట్టుకొని, నోటితో తోకను పట్టుకొనిన సర్పమువలె మూలాధారమందు నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తి స్వరూపము ఈ నామమంత్రములో తెలియజేయబడినది.

తామరతూడు విరిచి చూడగా అతిసన్నని దారపుపోగులు చూస్తాము. అంతటి సూక్ష్మశరీరముతో, నోటితో తోకను కరచి పట్టుకున్న సర్పమువలె మూలాధారచక్రంలో కుండలినీ శక్తి ఉంటుంది. ఇక్కడ తామర తూడులోని దారము అన్నది ఒక ఉపమానం మాత్రమే.

భాస్కరరాయలు వారు ఇంకొక శ్రుతి వాక్యం ఉటంకించారు *నీవారసూకవత్తన్వి పీతా భాస్వ త్యణూపమా* అనగా నివ్వరిధాన్యపు ముల్లువలె మిక్కిలి కృశించినది, స్వచ్ఛమైనది, అణువుతో సమానమయినది, ప్రకాశించునది. ఈ కుండలినీ శక్తి తామరతూడులోని దారము తామరదుంపను కరచిపట్టినట్లే, మూలాధారమును తన పడగకొసతో కరచిపట్టి ఉండును. అదే నోటితో తోకనుకూడ కరచిపట్టి ఉండును. నిద్రావస్థలో యుండును.

సాధకుడు స్వస్థుడై పద్మాసనస్థుడై గుదమును కొంచము వంచి వాయువు ఊర్ధ్వముగా పంపుచు కుంభకమును జేయవలెను. అప్పుడా వాయువుయొక్క తాకిడికి స్వాధిష్ఠానమునందు అగ్ని జనించును. అంతట ఈ వాయువు తాకిడికి, అగ్నితాకిడికి నిద్రాణములోనున్న కుండలినీశక్తి రూపమునందున్న సర్పము మేల్కాంచి సుషుమ్నా మార్గంలో బయలుదేరి,వరుసగా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి లను భేదించుతూ, షట్చక్రములను దాటుతూ సహస్రారకమలమందున్న శివుని పొంది ఆనందించును. ఇటువంటి స్థితి సాధకునకు అత్యంత ఉత్కృష్టమయినది. అరుణోపనిషత్తులో ఇలా చెప్పబడినది "ఓ శ్రీవిద్యోపాసకులారా! ఊపాసనాక్రమమునందు ఉండండి. సోమరులై కాలాన్ని వృధాచేయకండి. స్వాధిష్ఠానచక్రము నందలి అగ్నితేజోమయమై విరాజిల్లు కుండలినీ శక్తిని, కోరిక అను దండముతో కొట్టి లేపండి. అనాహత, విశుద్ధిచక్రముల మధ్యనున్న సూర్యునితో స్వాధిష్ఠానాన్ని కలపండి. దానిచే సహస్రారమందలి చంద్రమండలాంతర్గతుడగు రాజరాజేశ్వరుని కరిగించండి లేదా రాజరాజేశ్వరితో గూడిన రాజరాజేశ్వరుని వద్దకు చేర్చండి. అక్కడ ఆరాజరాజేశ్వరుని కలయికతో అమృతము స్రవించును. దానిచే మీరు తృప్తిని పొందుడు" అని గలదు. ఫలితముగా స్వాధిష్ఠానమందలి అగ్నికుండలినిని లేపి,సూర్యకుండలినితో కలిపి, చంద్రమండలమందు సామరస్యమును పొందియున్న శివశక్తి స్వరూపమును ద్రవింపజేసి దాని నుండి బయలుదేరిన అమృతధారలచే డెబ్బది రెండువేల నాడుల మార్గములను నిండించి, తృప్తిని పొందుడని భావము.

కుండలినీ శక్తికి 1) నిద్రావస్థ, 2)ప్రయాణావస్థ, 3) సుఖావస్థ. ఈ మూడు అవస్థలను 1) కౌమారావస్థ, 2) యోషిదావస్థ, 3) పతివ్రతావస్థ. మొదటి దశ మూలాధారంలో భూతత్త్వము. మంద్రస్వరంతో కుండలిని శబ్దం చేస్తుంది. అంటే మూలాధారంలో కుమారిగా ఉంటుంది. అక్కడనుండి బయలుదేరి అనాహతము చేరుసరికి రెండవ అవస్థ యోషిద (వనిత) అవుతుంది. అక్కడ నుండి బయలుదేరి రుద్రగ్రంథిని దాటి సహస్రారంలో చేరి, తన పతి అయిన పరమేశ్వరునితో చేరుసరికి *పతివ్రత* లేదా భర్తవద్ద సుఖపడుతుంది. భర్తవద్ద సుఖపడడమనేది కులసతి *(కులాంగన)* లక్షణము. అందుచేతనే పతివ్రతావస్థ అన్నారు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం బిసతంతు తనీయస్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*688వ నామ మంత్రము*

*ఓం రాజపీఠ నివేశిత నిజాశ్రితాయై నమః*

తనను ఆశ్రయించిన బ్రహ్మోపేంద్రమహేంద్రాదులు, దిక్పాలకులు, ఉపాసకులు, యోగులు మొదలైన వారికి వారి వారి యోగ్యతానుసారము రాజపీఠ(యోగ)మును సంప్రాప్తింప జేసిన శ్రీమహారాజ్ఞికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రాజపీఠ నివేశిత నిజాశ్రితా* అను పండ్రెండక్షరముల (ద్వాదశాక్షరీ) నామ మంత్రమును *ఓం రాజపీఠ నివేశిత నిజాశ్రితాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ రాజశ్యామలా స్వరూపిణిని ఉపాసించు సాధకులకు తప్పక రాజయోగము, పలువురిలో ముఖ్యస్థానము లభించును. కీర్తిప్రతిష్టలు ఇనుమడించును.

అలనాడు బ్రహ్మోపేంద్రమహేంద్రాదులకు తన మహాసామ్రాజ్యమునుండి శాఖాపరమైన రాజ్యాధిపత్యమును ఇచ్చి వారికి యోగ్యమైన సింహాసనములను కూడ ఇచ్చినది జగన్మాత. అలాగే తనను ఉపాసించిన మహాయోగులు, సిద్ధులు, భక్తులకు వారి యోగాభ్యాసములననుసరించి యోగసామ్రాజ్యములకు, ఆధ్యాత్మిక సామ్రాజ్యములకు అధినేతలను చేసి యోగ్యమైన పీఠములందు అధిష్టింప జేసిన శ్రీమహారాజ్ఞీ స్వరూపిణి జగన్మాత.

ఛత్రపతి శివాజీకి భవానీమాత ఖడ్గమునిచ్చి రాజ్యాధిపత్యమునందు మహాచక్రవర్తిని చేసినదని చరిత్రలు చెపుతున్నాయి.

మహాకాళీ భక్తుడు కాళిదాసు ఒకప్పుడు నిరక్షరకుక్షి. మేకల కాపరి. కాళిదాసును మహాకవియనే అబద్ధంతో రాజకుమార్తెకు ఇచ్చి పెళ్ళిచేస్తారు. విషయం తెలిసిన రాజకుమార్తె అవమానం భరించలేక, తన భర్తను నిజముగానే ఒకమహాకవిగా అనుగ్రహించమని మహాకాళిని శరణువేడుకొంటుంది. కాని అతనికి ఏడుజన్మలవరకూ అంతటి మహాయోగం అసంభవమని మహాకాళి రాజకుమార్తెకు చెప్పినది. రాజకుమార్తె ఆ తల్లిపాదాలను తన కన్నీటితో అభిషేకించి అలాగే ఉండిపోయింది. కాళీస్వరూపిణి అయిన జగన్మాత అతనికి అప్పటికప్పుడే ఏడు జన్మలు జననమరణములతో సంభవింపజేసి, ఎనిమిదవ జన్మలో అతని నాలుకపై వాగ్భవబీజములు వ్రాసి సంస్కృతవాఙ్మయ సామ్రాజ్యాధినేతగా, ఒకమహాకవిగా మార్చినది.

దేవేంద్రుడు తారకాసురుడు, మహిషాసురులు అను రాక్షసులవలన రాజ్యభ్రష్టుడవగా, జగన్మాత వారిని సంహరించి తిరిగి అమరావతీ పీఠంపై దేవేంద్రుడిని అధిష్టింపజేసినది.

ధ్రువుడు ఐదు సంవత్సరముల వయసులోనే తండ్రి ప్రేమసామ్రాజ్యంలో చోటులేకుండా సవతితల్లిచే నెట్టివేయబడతాడు. అకుంఠిత దీక్షతో అడవులకు వెళ్ళి తపస్సుచేసి శాశ్వత ధ్రువతారగా నేటికీ వెలుగుతున్నాడంటే సృష్టిస్థితిలయకారిణి, మహాసామ్రాజ్ఞి అయిన జగన్మాత సంకల్పం, శ్రీమహావిష్ణువు అనుగ్రహమేకదా.

ఇలా చెప్పుకుంటూపోతే ఆ శ్రీచక్రసామ్రాజ్ఞి గురుంచి దేవీభాగవతమే చదవాలి మనము.

రాజపీఠమంటే ఏదో రాజసింహాసనము, రాజ్యాధికారము మాత్రమేకాదు. పదిమందిలో ఒక ప్రత్యేకత, అధినాయకత్వము కలిగియుండుట.

అటువంటి శ్రీచక్రసామ్రాజ్ఞికి నమస్కరించునపుడు *ఓం రాజపీఠ నివేశిత నిజాశ్రితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*10.13 (పదమూడవ శ్లోకము)*

*యద్రోషవిభ్రమవివృత్తకటాక్షపాతసంభ్రాంతనక్రమకరో భయగీర్ణఘోషః |*

*సింధుః శిరస్యర్హణం పరిగృహ్య రూపీ పాదారవిందముపగమ్య బభాష ఏతత్॥7643॥*

అచట శ్రీరామచంద్రుడు మూడురాత్రులు ఉపవసించి, దారి ఇమ్మని సముద్రుని ప్రార్థించెను. అందులకు సముద్రుడు స్పందించకపోవుటచే ఆ ప్రభువు లీలగా క్రోధమును ప్రదర్శించెను. ఆ స్వామియొక్క రోషవీక్షణములు పడినంతనే సముద్రజలముల యందలి మొసళ్ళు, చేపలు మొదలగు జలచరములన్నియును భయభ్రాంతములయ్యెను. ఎగసిపడుచున్న తరంగముల ఘోష (సముద్రఘోష) శాంతించెను. పిదప సముద్రుడు ప్రసన్నభావముతో మానవాకృతిని దాల్చి, అర్ఘ్యపాద్యాది ద్రవ్యములను శిరస్సున ధరించి ఆ స్వామిని సమీపించెను. అనంతరము అతడు ఆయన పాదములకు ప్రణమిల్లి, శరణాగతుడై ఇట్లు విన్నవించుకొనెను-

*10.14 (పదునాలుగవ శ్లోకము)*

*న త్వాం వయం జడధియో ను విదామ భూమన్ కూటస్థమాదిపురుషం జగతామధీశమ్|*

*యత్సత్త్వతః సురగణా రజసః ప్రజేశా మన్యోశ్చ భూతపతయః స భవాన్ గుణేశః॥7644॥*

"స్వామీ! మేము అజ్ఞానులము. అందువలన నీ మహత్త్వమును తెలిసికొనలేకపోయితిని. నిజముగా నీవు నిర్వికారుడవు. ఆదిపురుషుడవు, జగదీశ్వరుడవు. సత్త్వరజస్తమో గుణములు త్రిలోకపూజ్యుడవైన నీ అధీనములో ఉండును. నీ సత్త్వగుణము వలన సురగణములు, రజోగుణమువలన ప్రజాపతులు, తమోగుణమువలన రుద్రగణములు ఉత్పన్నము లగుచుండును.

*10.15 (పదునైదవ శ్లోకము)*

*కామం ప్రయాహి జహి విశ్రవసోఽవమేహం త్రైలోక్యరావణమవాప్నుహి వీర పత్నీమ్|*

*బధ్నీహి సేతుమిహ తే యశసో వితత్యై గాయంతి దిగ్విజయినో యముపేత్య భూపాః॥7645॥*

మహావీరా! నీవు ఇక స్వేచ్ఛగా ఈ సముద్రజలములను దాటిపొమ్ము విశ్రవసుని కుమారులలో దుష్టుడు, త్రిలోక కంటకుడు ఐన రావణుని జయింపుము (వధింపుము). నీ ధర్మపత్నిని (సీతాదేవిని) మరల స్వీకరింపుము. కాని, నా ఈ మనవిని ఆలకింపుము. నీవు లంకకు చేరుటకు నిజముగా ఈ సముద్రజలములు ఏ మాత్రమూ ప్రతిబంధకములు కాజాలవు. ఐనను, నాపై (ఈ సముద్రజలములపై) సేతువును నిర్మింపుము. దీనివలన నీ కీర్తప్రతిష్ఠలు ఇనుమడించును. నీవు ఒనర్చిన ఈ అద్భుత కార్యమును జూచి, పేరు మోసిన చక్రవర్తులు సైతము మున్ముందు నీ యశస్సును వేనోళ్ళ కొనియాడుదురు".

*10.16 (పదహారవ శ్లోకము)*

*బద్ధ్వోదధౌ రఘుపతిర్వివిధాద్రికూటైః సేతుం కపీంద్రకరకంపితభూరుహాంగైః|*

*సుగ్రీవనీలహనుమత్ప్రముఖైరనీకైర్లంకాం విభీషణదృశాఽఽవిశదగ్రదగ్ధామ్॥7646॥*

సముచితములగు సూచనలను ఇచ్చినందులకు శ్రీరాముడు సముద్రుని అభినందించెను. పిమ్మట వానర శ్రేష్ఠులు పెకలించి తీసుకువచ్చిన వివిధములగు మహావృక్షముల కొమ్మలతోడను, పెద్దపెద్ద పర్వత శిఖరములతోను ఆ ప్రభువు సముద్రముపై సేతువును నిర్మింపజేసెను. అనంతరము సుగ్రీవుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు ప్రముఖ వానరులతో, సైన్యములతోగూడి శ్రీరామచంద్రుడు విభీషణుడు తెలిపిన మార్గమున లంకలో ప్రవేశించెను. ఆ లంకానగరము ఇంతకుముందే సీతాన్వేషణ సమయమున మహానుభావుడైన హనుమంతునిచే కొంతమేరకు దగ్ధమై యుండెను.

*10.17 (పదిహేడవ శ్లోకము)*

*సా వానరేంద్రబలరుద్ధవిహారకోష్ఠశ్రీద్వారగోపురసదోవలభీవిటంకా|*

*నిర్భజ్యమానధిషణధ్వజహేమకుంభశృంగాటకా గజకులైర్హ్రదినీవ ఘూర్ణా॥7647॥*

అంతట మహాయోధులతో నిండిన వానర సైన్యములు లంకానగరము నందలి విహారవనములను, ధాన్యాగారములను, ధనాగారములను, గృహద్వారములను, పురద్వారములను, సభామందిరములను, ప్రాసాదాది (రాజభవనములు మొదలగువాటి) పురోభాగములను, పావురములు నివసించెడి ప్రదేశములను (విటంకములను) చుట్టుముట్టెను. ఇంకను ఆ సేనలు అచటి వేదికలను, ధ్వజపతాకములను, భవనములపై గల బంగారు కలశములను, రాజవీధుల కూడళ్ళను ధ్వంసమొనర్చెను. అప్ఫుడు ఆ నగరము ఏనుగుల గుంపులచే కల్లోలితమైన నదివలె ఒప్పారెను.

*10.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*రక్షఃపతిస్తదవలోక్య నికుంభకుంభధూమ్రాక్షదుర్ముఖసురాంతకనరాంతకాదీన్|*

*పుత్రం ప్రహస్తమతికాయవికంపనాదీన్ సర్వానుగాన్ సమహినోదథ కుంభకర్ణమ్॥7648॥*

అప్పుడు రాక్షస రాజైన రావణుడు మిగుల దెబ్భతిని అల్లకల్లోలమైయున్న లంక పరిస్థితిని జూచి, నికుంభుడు, కుంభుడు, ధూమ్రాక్షుడు, దుర్ముఖుడు, సురాంతకుడు, నరాంతకుడు, ప్రహస్తుడు, అతికాయుడు, వికంపనుడు మున్నగు యోధులను, పిమ్మట తన కుమారుడైన ఇంద్రజిత్తును, వారి వారి అనుచరగణములతో సహా వానరయోధులను ఎదుర్కొనుటకై పంపెను. పిమ్మట తన సోదరుడైన కుంభకర్ణుని గూడ యుద్ధరంగమునకు పంపెను.

PVD Subrahmanyam చెప్పారు...

*10.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తాం యాతుధానపృతనామసిశూలచాపప్రాసర్ష్టిశక్తిశరతోమరఖడ్గయదుర్గామ్|*

*సుగ్రీవలక్ష్మణమరుత్సుతగంధమాదనీలాంగదర్క్షపనసాదిభిరన్వితోఽగాత్॥7649॥*

ఖడ్గములను, శూలములను, ధనుస్సులను, ఈటెలను, కత్తులను, బల్లెములను బాణములను, ఇనుపగుదియలను, మహాఖడ్గములను చేబూనిన అపారమగు రాక్షససైన్యము రావణపక్షమున పోరాడుటకు యుద్ధరంగమున నిలిచి యుండెను. ఆ సేనలను ఎదుర్కొనుటకై సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు, గంధమాదనుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, పనసుడు మొదలగు మహాయోధులతో గూడి శ్రీరాముడు ఆ సమరభూమియందు సర్వసన్నద్ధుడై యుండెను.

*10.20 (ఇరువదియవ శ్లోకము)*

*తేఽనీకపా రఘుపతేరభిపత్య సర్వే ద్వంద్వం వరూథమిభపత్తిరథాశ్వయోధైః|*

*జఘ్నుర్ద్రుమైర్గిరిగదేషుభిరంగదాద్యాః సీతాభిమర్శహతమంగలరావణేశాన్॥7650॥*

సమరరంగమున శ్రీరాముని పక్షమున నిలిచియున్న అంగదాది సేనానాయకులు రాక్షసపక్షమునందలి రథాశ్వగజపదాతిదళ యోధులతో (చతురంగబలములతో) భీకరయుద్ధమునకు తలపడిరి. సీతాదేవిని స్పృశించుటతో అధోగతిపాలైన రావణునియొక్క అనుచరులగు నికుంభాదులపై ఆ అంగదాది వానరవీరులు వృక్షములతో, పర్వతములతో, గదలతో, బాణములతో దెబ్బతీసి, వారిని పరిమార్చిరి.

*10.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*రక్షఃపతిః స్వబలనష్టిమవేక్ష్య రుష్ట ఆరుహ్య యానకమథాభిససార రామమ్|*

*స్వఃస్యందనే ద్యుమతి మాతలినోపనీతే విభ్రాజమానమహనన్నిశితైః క్షురప్రైః॥7651॥*

అప్పుడు రావణుడు కదనరంగమున అపారమైన తన సైన్యము నేలపాలగుట చూచి ఎంతయు క్రుద్ధుడయ్యెను. పిమ్మట, అతడు పుష్పకవిమానమును అధిరోహించి, రాముని ఎదుర్కొనెను. ఇంద్రుని ఆదేశముతో మాతలి తీసికొనివచ్చిన దివ్యరథమునందు విరాజమానుడై యున్న రఘువీరునిపై ఆ రాక్షసరాజు వాడియైన తన అర్ధచంద్రాకార శరములతో విజృభించి ఆయనను దెబ్బతీయ సాగెను.

*10.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*రామస్తమాహ పురుషాదపురీష యన్నః కాంతాసమక్షమసతాపహృతా శ్వవత్తే|*

*త్యక్తత్రపస్య ఫలమద్య జుగుప్సితస్య యచ్ఛామి కాల ఇవ కర్తురలంఘ్యవీర్యః॥7652॥*

తనపై శరపరంపరతో విజృభించుచున్న రావణునితో శ్రీరాముడు ఇట్లనెను- "ఓరీ! రాక్షసాధమా! దుష్టుడవైన నీవు, మేము (నేను, మా తమ్ముడగు లక్ష్మణుడు) లేని సమయము చూచుకొని, ఒక కుక్కవలె మా కుటీరమును సమీపించి, నా భార్యయగు సీతాదేవిని అపహరించుకొని వచ్చితివి. నేను తిరుగులేని పరాక్రమశాలిని, నీ పాలిటి మృత్యుదేవతను (మృత్యుదేవత ఆయా వ్యక్తులొనర్చిన శుభాశుభ కర్మలకు తగిన ఫలములను తప్పక ఇచ్చును) సిగ్గువిడిచి, నీవు ఒడిగట్టిన ఈ జుగుప్సిత కృత్యమునకు (దుష్కార్యమునకు) తగిన ఫలమును ఇప్పుడే ఇచ్చెదను" (రుచిచూపెదను).

*10.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ఏవం క్షిపన్ ధనుషి సంధితముత్ససర్జ బాణం స వజ్రమివ తద్ధృదయం బిభేద|*

*సోఽసృగ్వమన్ దశముఖైర్న్యపతద్విమానాద్ధాహేతి జల్పతి జనే సుకృతీవ రిక్తః॥7653॥*

శ్రీరామచంద్రప్రభువు రావణుని ఈ విధముగా ఆక్షేపించుచు, ధనుస్సునందు బాణమును సంధించి అతనిపై ప్రయోగించెను. ఆ శరము వజ్రాయుధమువలె ఆ రాక్షసరాజుయొక్క హృదయమును బ్రద్దలుగావించెను. అంతట ఆ అధముడు తన పదిముఖములనుండి రక్తమును గ్రక్కుచు, క్షీణపుణ్యుడు (పుణ్యము నశించినవాడు) దివినుండి భువిపై పడినట్లు పుష్పకవిమానమునుండి నేలకు రాలెను. ఆ సమయమున అతని అనుచరులు అందరును ఒనర్చిన హాహాకారములు మిన్నుముట్టెను.

*తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణపుణ్యే మర్త్యలోకం విశంతి* (గీత. 9/21)

*10.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*తతో నిష్క్రమ్య లంకాయా యాతుధాన్యః సహస్రశః|*

*మందోదర్యా సమం తస్మిన్ ప్రరుదత్య ఉపాద్రవన్॥7654॥*

అంతట మండోదరి మొదలగు వేలకొలది రాక్షసస్త్రీలు లంకనుండి బయలుదేరి, బిగ్గరగా లబలబ మొత్తుకొనుచు, సమరభూమియందు రావణుడు పడియున్నచోటికి వచ్చిరి.

*10.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*స్వాన్ స్వాన్ బంధూన్ పరిష్వజ్య లక్ష్మణేషుభిరర్దితాన్|*

*రురుదుః సుస్వరం దీనా ఘ్నంత్య ఆత్మానమాత్మనా॥7655॥*

అప్పుడు ఆ రాక్షస వనితలు లక్ష్మణుని బాణములకు హతులైన తమతమ బంధువులను (బంధువుల కళేబరములను) కౌగలించుకొని, గుండెలు బాదుకొనుచు దైన్యముతో బిగ్గఱగా ఇట్లు విలపింపసాగిరి.

*10.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*హా హతాః స్మ వయం నాథ లోకరావణ రావణ|*

*కం యాయాచ్ఛరణం లంకా త్వద్విహీనా పరార్దితా॥7656॥*

"ప్రభూ! రావణా! ఇదివరలో లోకములన్నియును నీకు భయపడి గడగడలాడినవి. నీవు హతుడవగుటతో మేము మృతప్రాయులము ఐతిమి. లంక పరులవశమైనది. నిన్ను కోల్పోయిన ఈ లంకవాసులు ఇప్పుడు ఎవరిని శరణువేడవలెను?

PVD Subrahmanyam చెప్పారు...

*10.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*నైవం వేద మహాభాగ భవాన్ కామవశం గతః|*

*తేజోఽనుభావం సీతాయా యేన నీతో దశామిమామ్॥7657॥*

రాజా! నీవు సకల సుఖసంపదలలో తేలియాడినవాడవు. నీకు ఎట్టి లోటును లేకుండెను. ఐనను సీతాదేవియొక్క తేజఃప్రభావమును గుర్తింపలేక కామవశుడవై ఆమెను అపహరించుకొని వచ్చితివి. ఆ అపరాధమువలననే నీకు ఈ దుర్దశ దాపురించినది.

*10.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*కృతైషా విధవా లంకా వయం చ కులనందన|*

*దేహః కృతోఽన్నం గృధ్రాణామాత్మా నరకహేతవే॥7658॥*

రాక్షసులకు సంతోషమును గూర్చుచు పాలించిన మహారాజా! నీ మృతితో ఈ లంకయు, మేమును దిక్కులేనివారమైతిమి. ఇట్లు పడియున్న నీ శరీరము - గ్రద్దలు మొదలగు పక్షులకు ఆహారమైసది. నీ ఆత్మ నరకయాతనల పాలైనది".

*శ్రీశుక ఉవాచ*

*10.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*స్వానాం విభీషణశ్చక్రే కోసలేంద్రానుమోదితః|*

*పితృమేధవిధానేన యదుక్తం సాంపరాయికమ్॥7659॥*

*శ్రీశుకుడు పలికెను* - పిమ్మట, విభీషణుడు శ్రీరాముని అమోదముతో (ఆదేశముతో) పితృయజ్ఞ విధానమును అనుసరించి, (శాస్త్రోక్త ప్రకారము) స్వజనులైన రావణాదులకు అంత్యక్రియలను ఆచరించెను.

*10.30 (ముప్పదియవ శ్లోకము)*

*తతో దదర్శ భగవానశోకవనికాశ్రమే|*

*క్షామాం స్వవిరహవ్యాధిం శింశపామూలమాస్థితామ్॥7660॥*

తరువాత మహాత్ముడైన శ్రీరామచంద్రుడు అశోకవనమున శింశుపావృక్షచ్ఛాయలో కూర్చొనియున్న సీతాదేవిని చూచెను. ఆమె పతివియోగముచే మిగుల కృశించి యుండెను.

*10.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*రామః ప్రియతమాం భార్యాం దీనాం వీక్ష్యాన్వకంపత|*

*ఆత్మసందర్శనాహ్లాదవికసన్ముఖపంకజామ్॥7661॥*

రఘురాముడు ప్రాణప్రియయైన తన అర్ధాంగియొక్క దైన్యస్థితిని జూచి కంపించిపోయెను. అప్పుడాయన హృదయము కనికరముతో నిండిపోయెను. తన పతిదేవుని చూచినంతనే సీతాదేవి ముఖకమలము వికసించెను. ఆమెలో ఆనందము వెల్లివిరిసెను.

*10.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*ఆరోప్యారురుహే యానం భ్రాతృభ్యాం హనుమద్యుతః|*

*విభీషణాయ భగవాన్ దత్త్వా రక్షోగణేశతామ్॥7662॥*

*10.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*లంకామాయుశ్చ కల్పాంతం యయౌ చీర్ణవ్రతః పురీమ్|*

*అవకీర్యమాణః సుకుసుమైర్లోకపాలార్పితైః పథి॥7663॥*

పిదప, రామచంద్రభగవానుడు విభీషణుని రాక్షసులకు రాజునుగా చేసెను (లంకా రాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించెను). కల్పాంతమువరకు లంకారాజ్యము సుభిక్షముగా ఉండునట్లు అనుగ్రహించెను. అనంతరము సీతాదేవిని పుష్పకవిమానమున కూర్చుండబెట్టి, లక్ష్మణునితో, హనుమంతునితో, వాలి తమ్ముడగు సుగ్రీవునితో, రావణుని అనుజుడగు విభీషుణినితో గూడి సపరివారముగా విమానముపై బయలుదేరెను. పదునాలుగు సంవత్సరముల వనవాసదీక్ష పూర్తి యగుటతో (పితృవాక్యపరిపాలన మొనర్చిన యనంతరము) అయోధ్యానగరమునకు పయనించుచుండగా బ్రహ్మాది లోకపాలురు ఆ పరమపురుషునిపై పుష్పవృష్టి కురిపించిరి.

*10.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*ఉపగీయమానచరితః శతధృత్యాదిభిర్ముదా|*

*గోమూత్రయావకం శ్రుత్వా భ్రాతరం వల్కలాంబరమ్॥7664॥*

*10.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*మహాకారుణికోఽతప్యజ్జటిలం స్థండిలేశయమ్|*

*భరతః ప్రాప్తమాకర్ణ్య పౌరామాత్యపురోహితైః॥7665॥*

*10.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*పాదుకే శిరసి న్యస్య రామం ప్రత్యుద్యతోఽగ్రజమ్|*

*నందిగ్రామాత్స్వశిబిరాద్గీతవాదిత్రనిఃస్వనైః॥7666॥*

*10.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*బ్రహ్మఘోషేణ చ ముహుః పఠద్భిర్బ్రహ్మవాదిభిః|*

*స్వర్ణకక్షపతాకాభిర్హైమైశ్చిత్రధ్వజై రథైః॥7667॥*

*10.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*సదశ్వై రుక్మసన్నాహైర్భటైః పురటవర్మభిః|*

*శ్రేణీభిర్వారముఖ్యాభిర్భృత్యైశ్చైవ పదానుగైః॥7668॥*

*10.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*పారమేష్ఠ్యాన్యుపాదాయ పణ్యాన్యుచ్చావచాని చ|*

*పాదయోర్న్యపతత్ప్రేమ్ణా ప్రక్లిన్నహృదయేక్షణః॥7669॥*

శ్రీరామచంద్రప్రభువు సపరివారముగా అయోధ్యకు ఏతెంచుచున్న శుభవార్త భరతునకు చేరెను. వెంటనే అతడు మిగుల సంతోషముతో రఘురాముని పాదుకలను శిరస్సునదాల్చి, పౌరులతోను, ఆమాత్యులతోడను, పురోహితులతోడను గూడి నందిగ్రామమునందలి తన శిబిరమునుండి అన్నగారికి స్వాగతమర్యాదలను నెఱపుటకై బయలుదేఱెను. ఆ సందర్భమును పురస్కరించుకొని వీణావేణుమృదంగ తాళములతో గీతములు ఆలపింపబడు చుండెను. సంప్రదాయజ్ఞులైన బ్రాహ్మణోత్తములు వేదమంత్రములను సస్వరముగా పదక్రమములతో పఠించుచుండిరి. బంగారు తొడుగులతో విరాజిల్లుచున్న ధ్వజపతాకముల రెపరెపలు శోభలను గూర్చుచుండెను. అందమైన రథములు, బంగారు జీనులుగల మేలుజాతి గుర్రములు వారివెంట నడచుచుండెను. స్వర్ణకవచములను ధరించిన భటులు, పురప్రముఖులు, వారాంగనలు, సేవకులు మున్నగువారు పాదచారులై వారిని అనుసరించుచుండిరి. కొందరు రాజమర్యాదలకు అనుగుణముగా ఛత్రపతాకములను కలిగియుండిరి. మరికొందరు అమూల్యములైన వస్తువులను, రుచికరములైన ఆహార పదార్థములను తీసికొని వచ్చుచుండిరి. శ్రీరాముని దర్శనమైనంతనే భరతుని హృదయము ప్రేమానురాగములతో ఉప్పొంగిపోయెను. కనులనుండి ఆనందబాష్పములను రాల్చుచు భరతుడు అన్నకు దండ ప్రణామములనాచరించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*10.40 (నలుబదియవ శ్లోకములు)*

*పాదుకే న్యస్య పురతః ప్రాంజలిర్బాష్పలోచనః|*

*తమాశ్లిష్య చిరం దోర్భ్యాం స్నాపయన్ నేత్రజైర్జలైః॥7670॥*

పిమ్మట భరతుడు శ్రీరామచంద్రుని పాదుకలు ఆ ప్రభువు ముందుంచి, కన్నీరుగార్చుచు అంజలి ఘటించి ఎదుట నిలబడెను. అంతట ఆ స్వామి తమ్ముడగు భరతుని ఆప్యాయతతో అక్కున జేర్చుకుని పరవశించిపోయెను. అప్పుడు శ్రీరాముని ఆనందభాష్పములలో భరతుడు తడిసిపోయెను.

*10.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*రామో లక్ష్మణసీతాభ్యాం విప్రేభ్యో యేఽర్హసత్తమాః|*

*తేభ్యః స్వయం నమశ్చక్రే ప్రజాభిశ్చ నమస్కృతః॥7671॥*

పిమ్మట సీతారామలక్ష్మణులు బ్రాహ్మణోత్తములకును, పూజ్యులైన గురువర్యులకును భక్తితో నమస్కరించిరి. పిదప అచటి పౌరులు అందరును వారికి వినమ్రతతో ప్రణమిల్లిరి.

*10.42 (నలుబది రెండవ శ్లోకము)*

*ధున్వంత ఉత్తరాసంగాన్ పతిం వీక్ష్య చిరాగతమ్|*

*ఉత్తరాః కోసలా మాల్యైః కిరంతో ననృతుర్ముదా॥7672॥*

ఉత్తరకోసలదేశ ప్రజలెల్లరును చిరకాలమునకు తిరిగివచ్చిన తమ ప్రభువును గాంచి, పూలవాన కురిపించుచు, ఉత్తరీయములను ఊపుచు పట్టరాని సంతోషముతో నృత్యములొనర్చిరి.

*10.43 (నలుబది మూడవ శ్లోకము)*

*పాదుకే భరతోఽగృహ్ణాచ్చామరవ్యజనోత్తమే|*
.
*విభీషణః ససుగ్రీవః శ్వేతచ్ఛత్రం మరుత్సుతః॥7673॥*

*10.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*ధనుర్నిషంగాన్ శత్రుఘ్నః సీతా తీర్థకమండలుమ్|*

*అబిభ్రదంగదః ఖడ్గం హైమం చర్మర్క్షరాణ్నృప॥7674॥*

పరీక్షిన్మహారాజా! శ్రీరాముడు నందిగ్రామమునుండి అయోధ్యలో ప్రవేశించునపుడు ఆ ప్రభువుయొక్క పాదుకలను భరతుడు, శ్రేష్ఠములైన వింజామరలను విభీషణుడు, వ్యజనములను (వీవనలను) సుగ్రీవుడు, శ్వేతచ్ఛత్రమును హనుమంతుడు, ధనుస్సును, తూణీరములను (అమ్ములపొదులను) శత్రుఘ్నుడు, తీర్థకమండలమును సీతాదేవి, బంగారు ఖడ్గమును అంగదుడు, డాలును జాంబవంతుడు పట్టుకొనిరి.

*10.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*పుష్పకస్థోఽన్వితః స్త్రీభిః స్తూయమానశ్చ వందిభిః|*

*విరేజే భగవాన్ రాజన్ గ్రహైశ్చంద్ర ఇవోదితః॥7675॥*

అంతట శ్రీరామచంద్ర ప్రభువు భరతాదులందరితోగూడి పుష్పక విమానమునందు ఆసీనుడయ్యెను. ఆ స్వామిచుట్టును స్త్రీలు చేరియుండిరి. వందిమాగధులు స్తోత్రములను పఠించుచుండిరి. అప్పుడు ఆ మహాత్ముడు గురు, శుక్రాది గ్రహములతో గూడి ఉదయించుచున్న పూర్ణచంద్రునివలె విరాజిల్లెను.

*10.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*భ్రాతృభిర్నందితః సోఽపి సోత్సవాం ప్రావిశత్పురీమ్|*

*ప్రవిశ్య రాజభవనం గురుపత్నీః స్వమాతరమ్॥7676॥*

ఈ సోదరుల అభినందనలను స్వీకరించుచు శ్రీరాముడు అయోధ్యాపురమునందు ప్రవేశించెను. అప్పుడు ఆ పురము సర్వాలంకారశోభితమై ఆనందోత్సాహములతో కనుల పండువుగా ఉండెను.

*10.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*గురూన్ వయస్యావరజాన్ పూజితః ప్రత్యపూజయత్|*

*వైదేహీ లక్ష్మణశ్చైవ యథావత్సముపేయతుః॥7677॥*

ఆ రఘురాముడు అచటగల అందరి మన్ననలను అందుకొనిన పిమ్మట క్రమముగా మాతృమూర్తులగు కౌసాల్యాదేవిని, సుమిత్రాదేవిని, కైకేయీదేవిని, గురువులను పూజించెను. పిదప ఉత్తమవంశములకు చెందిన బంధుమిత్రులను, చిన్నవయస్సులవారిని యథాయోగ్యముగా ఆదరించెను.

*10.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*పుత్రాన్ స్వమాతరస్తాస్తు ప్రాణాంస్తన్వ ఇవోత్థితాః|*

*ఆరోప్యాంకేఽభిషించంత్యో బాష్పౌఘైర్విజహుః శుచః॥7678॥*

తమ పుత్రులను చూడగానే కౌసల్యాది మాతలకు ప్రాణములు లేచివచ్చినట్లయ్యెను. పిదప వారు ఆత్మీయతతో తమ సుతులను ఒడిలోనికి చేర్చుకొని, ఆనందబాష్పములతో వారిని అభిషేకించుచు తమ దుఃఖములను మఱచిపోయిరి.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*112వ నామ మంత్రము*

*ఓం భవాన్యై నమః*

భవుని (శివుని) భార్యగా, మహాదేవుని జీవింపజేయునదిగా, సంసారమును (లోకాలను) జీవింపజేయునదిగా, మన్మథుని (భవుని) పాలిట సంజీవనౌషధిగా, జలరూపుడైన భవుని జీవింపజేసినదిగా *భవానీ* యను నామముతో విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భవానీ* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం భవాన్యై నమః* అని ఉచ్చరించుచూ, మహేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకుని జగన్మాత అత్యంత కరుణా హృదయంతో ఆయురారోగ్యములు, అన్నవస్త్రములు, సుఖసంతోషములు ప్రసాదించి ఆధ్యాత్మిక జ్ఞానసంపదతో తరింపజేయును.

మహేశ్వరుని భవుడు అని కూడా అంటారు. అందుచే జగన్మాత భవుని భార్య గనుక *భవానీ* అని చెప్పబడినది.

*రుద్రో భవోభవః కామోభవః సంసారసాగరః|*

*తత్ప్రాణనా దియం దేవీ భవానీ పరికీర్తితా॥*

అని దేవీపురాణంలో చెప్పబడినది. రుద్రుడు అంటే భవుడు. మన్మథుడుని కూడా భవుడు అంటారు. అలాగే సంసారసాగరమును కూడా భవము అంటాము. *రుద్రుని, మన్మథుని, సంసారసాగరమును జీవింపజేయునది* గనుక జగన్మాత *భవానీ* అన్నాము.

వాయుపురాణంలో ఇలా ఉన్నది.

*యస్మాద్భవంతి భూతాని తాభ్య స్తా భావయంతి చ|*

*భవనాద్భావనాచ్చైవ భూతానాం స భవ స్మృతః॥*

ఎవని వలన భూతములు ఉద్భవించుచున్నవో, ఏ జలముల వలన భావనలు కలుగుచున్నవో అతడే భవుడు. అగుచున్నాడు. అట్టి భవుని జీవింపజేసినది.

శివుని అష్టమూర్తులు:

1) భవుడు, 2) శర్వుడు, 3) ఈశానుడు, 4) పశుపతి, 5) రుద్రుడు, 6) ఉగ్రుడు, 7) భీముడు, 8) మహాదేవుడు

అష్టమూర్తులలో భవుడుని జలమూర్తి అని కూడా అంటారు. అట్టి భవుని జీవింపజేసినది గనుక *భవానీ* అగుచున్నది.

పద్మపురాణమునందు అష్టోత్తరశతదేవీతీర్థ మాలాధ్యాయమంధు "స్థానేశ్వరమందు *భవాని* అను పేరుగల దేవతయు, బిల్వపీఠమందు నామపుత్రికయను దేవియు గూడ *భవానీ*" అని చెప్పబడినది.

అట్టి *భవానీ* యని నామ ప్రసిద్ధమైన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భవాన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*689వ నామ మంత్రము*

*ఓం రాజ్యలక్ష్మ్యై నమః*

పాడిపంటలతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యములతో , నిత్యకళ్యాణము పచ్చతోరణమై, వైభవంగా, ఆధ్యాత్మిక పరిపుష్టి కూడా తోడై, సర్వ సుసంపన్నమై తన రాజ్యములోనెల్లడలా మహదానంద భరితమగు ప్రజారంజకమైన పాలననందించు శ్రీమహారాజ్ఞిగా, ఒక మహాసామ్రాజ్యలక్ష్మిగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రాజ్యలక్ష్మీ* అను నాలగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం రాజ్యలక్ష్మ్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి కరుణచే సర్వాభీష్టసిద్ధియు, ఆధ్యాత్మిక జ్ఞానప్రాప్తియు లభించును.

జగన్మాత ఒక మహాసామ్రాజ్ఞి. తనచే సృష్టింపబడిన విశ్వములకన్నిటికీ మహా సామ్రాజ్ఞియే కాక శ్రీచక్రనగరసామ్రాజ్ఞాధినేత్రిగా కూడా విరాజిల్లుచున్నది. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, అష్టదిక్పాలకులు, స్వర్గాధినేత ఇంద్రుడు పరిపాలించు రాజ్యముల యందేగాక, యోగులకు, సాధకులకు, భక్తులకు సంప్రాప్తమైన ఆధ్యాత్మిక జ్ఞాన సామ్రాజ్యములు, భక్తిసామ్రాజ్యములు, యోగసామ్రాజ్యముల యందుగూడ తనదంటూ ఒక గణనీయమైన పరిపాలనా సరళిని ఏర్పరచినది. ఆయా సామ్రాజ్యములలో నుండువారికి మంగళకరము, శోభస్కరము, సౌభాగ్యకరమగు ఉనికిని కలుగజేయుచున్నది. లౌకిక రాజ్యములో శాంతిసౌభాగ్యములు, పాడిపంటలు, సిరిసంపదలకు కొఱతలేకుండుట, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఆధ్యాత్మికత, దైవచింతన, భగవదుపాసనలు - ఇవన్మీ లక్ష్మీకరము. తన సామ్రాజ్యములో నెలకొల్పిన శుభకరము లయిన వన్నియూ కూడా మనసుకు శాంతిసౌభాగ్యముల పరిపుష్టిని కలుగజేయును. ఎక్కడైతే తృప్తి, నిండుతనము నెలకొనియుంటుందో అదే లక్ష్మీకరము. ఆ విధముగా తాను పాలన చేయు సామ్రాజ్యములందు మహదానందకరమును కలుగజేసిన జగన్మాత మహాసామ్రాజ్ఞి లక్ష్మీస్వరూపురాలు, రాజ్యలక్ష్మీస్వరూపురాలు. రాజుకు ప్రజలకు గల సంబంధాన్మి సూచిస్తూ ఆధ్యాత్మికంగా ఆత్మకు మనస్సుకు గల సంబంధాన్ని కూడా జగన్మాత సూచిస్తున్నది. ఆ విధంగా రాజుకు-ప్రజలకు గల సంబంధమునందు గాని, ఆధ్యాత్మికంగా ఆత్మకు-మనస్సుకు గల సంబంధమునందుగాని పరిపూర్ణత నెలకొనినట్లైతే అదే శుభకరము, లక్ష్మీకరము. అట్టి లక్ష్మీకరమైన సంబంధవైభవాన్ని నెలకొల్పినది రాజ్యలక్ష్మీ స్వరూపురాలైన జగన్మాత.

అట్టి రాజ్యలక్ష్మీస్వరూపిణికి నమస్కరించునపుడు ఓం *రాజ్యలక్ష్మ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*10.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*జటా నిర్ముచ్య విధివత్కులవృద్ధైః సమం గురుః|*

*అభ్యషించద్యథైవేంద్రం చతుఃసింధుజలాదిభిః॥7679॥*

అనంతరము వంశగురువైన వసిష్ఠమహర్షి కులవృద్ధులతో గూడి, ఆ సోదరుల జడలను తొలగింపజేసెను. పిదప ఆ మహాముని చతుస్సాగరములనుండియు, గంగాది పవిత్రనదుల నుండియు తెప్పించిన జలములతో బృహస్పతి ఇంద్రునకువలె శ్రీరామచంద్రప్రభువునకు అభిషేకమొనర్చెను.

*10.50 (ఏబదియవ శ్లోకము)*

*ఏవం కృతశిరఃస్నానః సువాసాః స్రగ్వ్యలంకృతః|*

*స్వలంకృతైః సువాసోభిర్భ్రాతృభిర్భార్యయా బభౌ॥7680॥*

అభిషేకోత్సవము ముగిసిన పిమ్మట శ్రీరాముడు దివ్యములగు వస్త్రాభరణములతోను, పూలదండలతోను అలంకృతుడయ్యెను. తరువాత చక్కని అలంకారములతో, వస్త్రాభరణములతో తేజరిల్లుచున్న ధర్మపత్నియగు సీతాదేవితోడను, అనుంగు సోదరులతోడను గూడి విరాజమానుడయ్యెను.

*10.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*అగ్రహీదాసనం భ్రాత్రా ప్రణిపత్య ప్రసాదితః|*

*ప్రజాః స్వధర్మనిరతా వర్ణాశ్రమగుణాన్వితాః|*

*జుగోప పితృవద్రామో మేనిరే పితరం చ తమ్॥7681॥*

అనంతరము తనకు ప్రణమిల్లిన భరతుని ప్రార్థనను మన్నించి, రామచంద్రప్రభువు రాజ్యసింహాసనమును అధిష్ఠించెను. దేశప్రజలెల్లరును తమ తమ ధర్మములయందు నిరతులై, వర్ణాశ్రమోచితములైన పంచమహాయజ్ఞములను నెఱపసాగిరి. అంతట ఆ ప్రభువు ప్రజలను తన కన్నబిడ్డలవలె ఆదరించుచు పరిపాలించెను. వారును ఆ స్వామిని పితృభావముతో గౌరవింపదొడంగిరి.

*10.52 (ఏబది రెండవ శ్లోకము)*

*త్రేతాయాం వర్తమానాయాం కాలః కృతసమోఽభవత్|*

*రామే రాజని ధర్మజ్ఞే సర్వభూతసుఖావహే॥7682॥*

ధర్మజ్ఞుడైన శ్రీరామునియొక్క పరిపాలనలో సకలప్రాణులను సుఖశాంతులతో వర్ధిల్లుచుండెను. శ్రీరామచంద్రుని చల్లని ధర్మపాలనతో పరిఢవిల్లుచున్న ఆ త్రేతాయుగము పూర్తిగా కృతయుగమును తలపింపజేయుచుండెను.

*త్రిపాద్ధర్మ యుక్తే త్రేతాయుగే ప్రవర్తమానేఽపి|*

*చతుష్పాద్ధర్మయుక్త కృతయుగతుల్యః కాలోబభూవ॥*

సాధారణముగా ధర్మము త్రేతాయుగమున మూడు పాదములతోను, కృతయుగమున నాల్గుపాదములతోను నడచుచుండును. కాని శ్రీరాముడు త్రేతాయుగమున పరిపాలించుచున్నను, ఆయన మహత్మ్యముతో కృతయుగమునందువలె ధర్మము నాల్గుపాదములతో ప్రవర్తిల్లుచుండెను.(వీరరాఘవీయ వ్యాఖ్య)

PVD Subrahmanyam చెప్పారు...

*10.53 (ఏబది మూడవ శ్లోకము)*

*వనాని నద్యో గిరయో వర్షాణి ద్వీపసింధవః|*

*సర్వే కామదుఘా ఆసన్ ప్రజానాం భరతర్షభ॥7683॥*

పరీక్షిన్మహారాజా! ధర్మమూర్తియైన శ్రీరాముని పర్యవేక్షణలో ప్రకృతియంతయును ప్రజలకు సుఖదాయకమై పరిఢవిల్లుచుండెను. వనములు పుష్పములను, ఫలములను సమకూర్చుచుండెను, నదులు నిరంతరము మధుర జలములతో ప్రవహించుచు పాడిపంటలు అభివృద్ధికి తోడ్పడుచుండెను. పర్వతములు దివ్యౌషధములు అందించుచుండెను. సకాలములో వర్షములు కురియుచుండెను. ద్వీపములు, సముద్రములు తమవంతు తోడ్పాటును అందించుచు లోకోపకారకములై ఒప్పుచుండెను.

*10.54 (ఏబది నాలుగవ శ్లోకము)*

*నాధివ్యాధిజరాగ్లానిదుఃఖశోకభయక్లమాః|*

*మృత్యుశ్చానిచ్ఛతాం నాసీద్రామే రాజన్యధోక్షజే॥7684॥*

ఇంద్రియాతీతుడై (అవాఙ్మానసగోచరుడైన) శ్రీరామచంద్రుడు పరిపాలించుచున్నప్ఫుడు ప్రజలకు ఆధివ్యాధులును, వార్ధక్యబాధలను, గ్లానియు, దుఃఖశోకములుసు, భయభ్రాంతులును, ప్రయాస జీవనములును లేకుండెను. అంతేగాదు, అకాలమరణములు సైతము సంభవింపకుండెను.

అధి = మనస్తాపములు, వ్యాధి = శారీరకబాధలు, దుఃఖమ్ = సంతానపరమైన వియోగదుఃఖములు, శోకః = ఇష్టమైన వస్తువుల వినాశము, భయమ్ = మున్ముందు ఎట్టి ప్రమాదములు కలుగనున్నవో అను భీతి, క్లమః = శారీరక, మానసక ప్రయాసలు, అనిచ్ఛామరణమ్ = అకాలమృత్యువు (వీరరాఘవీయ వ్యాఖ్య)

*10.55 (ఏబది ఐదవ శ్లోకము)*

*ఏకపత్నీవ్రతధరో రాజర్షిచరితః శుచిః|*

*స్వధర్మం గృహమేధీయం శిక్షయన్ స్వయమాచరత్॥*

ఏకపత్నీవ్రతము (ధర్మబద్ధముగా చేపట్టిన భార్యతో జీవితాంతము సుఖదుఃఖములను పంచుకొనుట), రాజర్షి చరితము (రాజర్షివలె లౌకిక సుఖములయెడ అనాసక్తి), రాగద్వేషములు లేని పవిత్ర జీవనము, స్వధర్మాచరణములతో గూడిన గృహస్థజీవితము మున్నగు ఉత్తమములైన ఆశయములను తాను ఆచరించుచు లోకమునకు మార్గనిర్దేశము చేసిన ధర్మప్రభువు ఆ రఘురాముడు.

*యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః|*

*స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥*

శ్రేష్ఠుడైన పురుషుని యొక్క ఆచరణమునే (ప్రవర్తననే) ఇతరులును అనుసరింతురు.అతడు నిల్పిన (ప్రతిష్ఠించిన) ప్రమాణములనే లోకులందరును పాటించెదరు.

వ్రీడ, లజ్జ, బిడియము®= *అకార్యప్రవృత్తౌ మనస్సంకోచః|*
అధర్మకార్యమును నెఱపుటయందు విముఖతను కలిగియుండుట (భర్తృహరి సుభాషిత వ్యాఖ్య)

*10.56 (ఏబది ఆరవ శ్లోకము)*

*ప్రేమ్ణానువృత్త్యా శీలేన ప్రశ్రయావనతా సతీ|*

*భియా హ్రియా చ భావజ్ఞా భర్తుః సీతాహరన్మనః॥7686॥*

ప్రేమానురాగములు, పరిచర్యలు, చక్కని సౌశీల్యము, వినయవిధేయతలు, భయభక్తులు, అనువగు బిడియము మొదలగునవి సీతాదేవికి పెట్టని సొమ్ములు (సహజగుణములు). ఆ సతీశిరోమణి తన భర్తయొక్క భావములను గుర్తించి (మనస్సెఱిగి) మసలుకొనుచు ఆ ప్రభువుయొక్క మనస్సును చూరగొనుచుండెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే దశమోఽధ్యాయః (10)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పదియవ అధ్యాయము (10)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*113వ నామ మంత్రము*

*ఓం భావనాగమ్యాయై నమః*

న్యాస, జప, హోమ, అర్చన, అభిషేకములు ఉపాసనా పంచకముచే సాక్షాత్కరింప దగిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భావనాగమ్యా* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం భావనాగమ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తితత్పరుడై ఉపాసించు సాధకుడు ఆ జగన్మాతను కనీసం తన భావనలయందైనా దర్శించుకొని తనదీక్షకు తగినట్టి వరములను సంప్రాప్తింపజేసికొనును.

భావనా అనగా భావించుట, తలచుట. ఇక్కడ ధ్యానించుటచేత, గమ్యా అనగా పొందదగినది అనగా సాక్షాత్కరింప దగినది. భావన+అగమ్యా అని కూడా తీసుకుంటే ధ్యానమాత్రమున పొందదగనిది అనగా సాక్షాత్కరింపదగనిది.

ముందుగా పొందదగనిది, అనగా అనుగ్రము పొందదగనిది లేదా సాక్షాత్కరింప దగనిది. బ్రహ్మముఖము నుండి వచ్చినట్లుగనే అనునది

1) *శాబ్దీభావన* గురువులు ఉచ్చరించిన విధముగా వారి ఇష్టము వచ్చినట్లు ఉచ్చరించుట ప్రవర్తించుట.

*2) అర్థీభావన* అనగా కేవలం వేదవిహిత కర్మానుష్ఠాన మాత్రముచే పొందదగనది. కార్యకారణ సంబంధమైనది.

కూర్మపురాణమునందు

*బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ తథై వాక్షరభావనా|*

*తిస్రస్తు భావనా రుద్రే వర్తన్తే సతతం ద్విజా॥* (సౌభాగ్య భాస్కరం 319వ పుట)

బాహ్మీ, మాహేశ్వరీ, అక్షర భావన అని బ్రాహ్మణులు మూడురకములుగా శివుని భావిస్తారు.

*1) బ్రాహ్మీభావన* - దీనినే వ్యక్తస్వరూపభావన అనగా విగ్రహంలో భగవంతుని భావించేదే బ్రాహ్మీభావన.

2) *మాహేశ్వరీ భావన* అనగా అవ్యక స్వరూపభావన. అనగా అంతర్ముఖంగా పరమాత్మను భావిస్తూ చేసేది. ఇది సాత్విక భావన అనికూడా అనవచ్చు.

3) *అక్షరభావన* - సగణు స్వరూప భావన అనికూడా అంటాము. మంత్రంలోని అక్షరాలను అర్థతాత్పర్యములతో హృదయంలో భావిస్తూ చేసేది. లలితా సహస్రనామస్తోత్రం పారాయణచేస్తున్నాము. ఉదాహరణకు: 85వ నామ మంత్రమును లేదా 34వ శ్లోకం రెండవ పాదం ఇలా చదివాము *శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా* (16 అక్షరముల నామము మధ్యలో విరవకుండా) అని చదివాము. మన మనసులో ఆ నామ మంత్రానికి అర్థం భావించుకోవాలి. ఏమని? *పంచదశీ విద్యలో మొదటి (క, ఏ, ఈ, ల, హ్రీం) అను ఐదు అక్షరములు - 'వాగ్భవకూటము' అనుననది జగన్మాత ముఖకమలము*

ఈ భావనలచే ఆ తల్లి సాక్షాత్కారింప దగినది.

ఈ విషయమునే కూర్మ పురాణములోనే భగవంతుడైన కూర్మావతారుడు ఇంద్రద్యుమ్న మహారాజుతో ఇలా అన్నాడు "ఓ బ్రాహ్మీ భావనగలవాడా! భావన మూడువిధములు 1) అవ్యక్త స్వరూప భావన, 2) వ్యక్తస్వరూప భావన, 3) సగుణ స్వరూప భావన.

యోగినీ హృదయమునందు చెప్పబడిన మూడు భావములు 1) సకల, 2) సకల నిష్కల, 3) నిష్కల.

*ఆజ్ఞాంతం సకలం ప్రోక్తం తతస్సకల నిష్కలం|*

*ఉన్మన్యన్తం పరేస్థానం నిష్కలం చ త్రిధా స్థితం॥* (సౌభాగ్య భాస్కరం. 320వ పుట).

1) *మూలాధారచక్రం నుండి ఆజ్ఞాచక్రాంతమువరకు* చేయునది సకలభావన.

2) *ఆజ్ఞాచక్రంనుండి ఉన్మన వరకు* సకల నిష్కల భావన.

3) *పరస్థానంలో భావన* అనగా ఉన్మనికి చివరనున్న పరస్థానమందు (మహా బిందువులో) చేయు భావన. నిష్కల.

ఇంకను ఉపాసనా పంచకముచే భావనచేయునది కూడా సాధారముగా చెపుతూ ఉంటాము.

ఉపాసనా పంచకము 1) న్యాస, 2)జప, 3) హోమ, 4) అర్చన, 5) అభిషేకము.

ఈ విధంగా జగన్మాత *భావనాగమ్యా* అను నామ మంత్రము కలిగి ఉన్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భావనాగమ్యాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*690వ నామ మంత్రము*

*ఓం కోశనాథాయై నమః*

అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అను పంచకోశములకు అధికారిణిగా విరాజిల్లుచున్న జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కోశనాథా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కోశనాథాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తుడు సకల సంపదలతోనూ, ఆధ్యాత్మికా సౌరభములు వెలయు జీవన విధానముతో విలసిల్లి తరించును.

జగన్మాత మహాసామ్రాజ్ఞి. రాజ్యలక్ష్మీస్వరూపురాలు. అటువంటి తల్లి తన సామ్రాజ్యంలో అందరూ భౌతికానందము మరియు ఆధ్యాత్మికానందముతో ఉండాలంటే తగిన వనరులు కావాలి. అటువంటి వనరులు ఉంచగలుగు ప్రదేశములకే కోశములు. అందురు. ఉదాహరణ: కోశాధికారి అంటే మన భాషలో ఆర్థికవ్యవహారములు (ధనసంబంధమైన లావాదేవీలు) నిర్వహించు అధికారి అంటాము. కాని జగన్మాత సిరిసంపదల నిర్వహణ మాత్రమే చేయదు. ఆ తల్లి నిర్వహించునవి ఎన్నియో గలవు. పాడిపంటలు, పుష్కలమైన జలసంపద, ఆయురారోగ్యములు, చతుష్షష్టికళలు..ఇలా ఎన్నోఉన్నాయి. సిరిసంపదలకు లక్ష్మీస్వరూపురాలు, ఆ సిరులు నిక్షిప్తము చేయు ధనాగారములకు, కోశాధికారిగా కుబేర స్వరూపురాలు, ఆయురారోగ్యములకు ధన్వంతరీ స్వరూపురాలు, పచ్చనిపంటలకు జలకళనిచ్చు వరుణ స్వరూపురాలు, హోమములందు సమర్పించిన హవ్యము లారగించు సాక్షాత్ ఆ భగవత్స్వరూపురాలు, పితృయజ్ఞములందు సమర్పించు కవ్యములనారగించు పితృదేవతాస్వరూపురాలు. శివుడు, విష్ణువు మరియు సర్వ దేవతా స్వరూపిణి.

జగన్మాత ఉండేదే మణిద్వీపంలో చింతామణిగృహం. సర్వం మణిమయం. అంతటి తల్లి నవరత్నకోశములకు, కాంచన కోశములకు అధిపతి.

అన్నింటికి మించినకోశములు మనలోనే ఉన్నవి. అవి:-

ప్రశ్నోపనిషత్తులో పిప్పిలాద మహర్షి చెప్పినట్లుగా, ఆత్మ మానవుడి యందు అయిదు కోశాలచేత ఆవరించబడి వుంటుంది. అవి 1.శరీరం (అన్నమయ కోశం) 2. జీవశక్తులచేత ఏర్పడిన ప్రాణమయ కోశం, 3. మనస్సు (మనోమయ కోశం), 4. బుద్ధి విజ్ఞాన మయ కోశం 5. అజ్ఞానంచేత ఏర్పడిన ఆనందమయ కోశం.

1. *అన్నమయ కోశము:-* ఇది పైకి కనిపించే స్థూల శరీరమే. గింజను పైపొట్టు కప్పి వుంచినట్లు, గర్భస్త పిండమును మాయ కప్పి ఉంచినట్లు, స్థూల శరీరమైయున్నది.
*అన్నాద్‌భవన్తి భూతాని వర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః* (3-14) అని భగవద్గీతలో చెప్పినట్లు, అన్నము (ఆహారము)వల్ల ఏర్పడిన మన శరీరము ప్రకాశవంతమైన ఆత్మను కవచం వలె కప్పి వుంచుతుంది. అందువల్ల స్థూల భౌతిక శరీరమే అన్నమయకోశం అనబడుతోంది.

2. *ప్రాణమయ కోశము:-* ప్రాణ అనగా స్థిరముగా నిరంతరము మన శరీరంలో ప్రవహించే జీవశక్తి. దీనిని ఓజస్సు అని కూడ అనుకోవచ్చు. మన శరీరంలోని 72000 నాడుల (వీటిలో 14 ముఖ్యమైనవి అందులో పింగళ, ఇడ, సుషుమ్న అతి ముఖ్యమైనవి) ద్వారా ఈ ప్రాణశక్తి శరీరమంతా వ్యాపించి ఉంటుంది. పంచవాయువులు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు) గా పంచ ప్రాణములుగా సంచరిస్తూంటుంది. ఇది ప్రాణంతో తయారైంది కాబట్టి దీన్ని ప్రాణమయ కోశమన్నారు.

3. *మనోమయ కోశం:-* పంచ జ్ఞానేంద్రియములు, మనసు. ఇది ప్రాణమయ కోశమునకు లోపల ఉండి, దుఃఖమోదాది అరిషడ్వర్గములు లేని ఆత్మను, అవి ఉన్నట్టు కప్పి ఉంచును. ఈ కోశము సూక్ష్మమైనది. ఇది భౌతిక శరీరానికి జ్ఞానవంతమైన ఆత్మకు మధ్య ఉంటుంది.

4. *విజ్ఞానమయ కోశము:-* ఇది పంచ జ్ఞానేంద్రియములు మరియు బుద్ధికలిసి ఏర్పడుతుంది. నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనే (అహంభావం) నేను అనే భావన కలిగించి, తెలియరానట్టి, ఆత్మను, తెలియబరిచే దానిగా ఆవరించి ఉంటుంది. అట్టి విజ్ఞానంవల్ల ఏర్పడింది కాబట్టి, విజ్ఞానమయకోశమన్నారు.

5. *ఆనందమయ కోశము:-* ఆత్మ, సుఖ దుఃఖములు, ప్రియాప్రియములు మొదలగు ద్వంద్వాలకతీతముగా ఉంటుంది. అట్టి ఆత్మను అవన్నీకలల దానినిగా భ్రమింపచేస్తుంది. అందువల్ల దీన్ని ఆనందమయ కోశమన్నారు.

ఇన్ని కోశాలకు అధిపతిగనుకనే జగన్మాత *కోశనాథా* అని స్తుతించుచున్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కోశనాథాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*11.1 (ప్రథమ శ్లోకము)*

*భగవానాత్మనాఽఽత్మానం రామ ఉత్తమకల్పకైః|*

*సర్వదేవమయం దేవమీజ ఆచార్యవాన్ మఖైః॥7687॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! పరమ పురుషుడైన శ్రీరాముడు సర్వదేవమయుడు (సఖలదేవతలను తనలో కలిగియున్న విరాట్ పురుషుడు). ఆ మహాత్ముడు వసిష్ఠుని ఆచార్యునిగా జేసికొని, ఆ బ్రహ్మర్షి పర్యవేక్షణలో కల్పోక్తవిధానములను అనుసరించి, సకలవస్తు సమృద్ధితో పెక్కు యజ్ఞములను ఆచరించెను. యజ్ఞపురుషుడైన ఆ మహానుభావుడు యాగములను ఆచరించుటద్వారా తనను తానే అర్చించుకొనెను.

*11.2 (రెండవ శ్లోకము)*

*హోత్రేఽదదాద్దిశం ప్రాచీం బ్రహ్మణే దక్షిణాం ప్రభుః|*

*అధ్వర్యవే ప్రతీచీం చ ఉదీచీం సామగాయ సః॥7688॥*

*11.3 (మూడవ శ్లోకము)*

*ఆచార్యాయ దదౌ శేషాం యావతీ భూస్తదంతరా|*

*మన్యమాన ఇదం కృత్స్నం బ్రాహ్మణోఽర్హతి నిఃస్పృహః॥7689॥*

ఆ రామచంద్రప్రభువు యజ్ఞదక్షిణగా రాజ్యమునందలి తూర్పుభాగమును హోతకును (ఋగ్వేదప్రతినిధికిని) దక్షిణ భాగమును బ్రహ్మకును, పడమర భాగమును అధ్వర్యునకును, (యజుర్వేద ప్రతినిధికిని), ఉత్తర భాగమును ఉద్గాతకును (సామవేద ప్రతినిధికిని) దానము చేసెను. మధ్యగల సమస్త భూమిని ఆచార్యునకొసంగెను. ఐహిక విషయములయందు ఎట్టి ఆసక్తియులేని ఆ రఘురాముడు 'ఈ సమస్త భూమండలమును స్వీకరించుటకు అన్ని విధములుగా బ్రాహ్మణుడే అర్హుడు' అను దృఢనిశ్చయమును కలిగి యుండెను.

*11.4 (నాలుగవ శ్లోకము)*

*ఇత్యయం తదలంకారవాసోభ్యామవశేషితః|*

*తథా రాజ్ఞ్యపి వైదేహీ సౌమంగల్యావశేషితా॥7690॥*

శ్రీరాముడు తాను ధరించియున్న వస్త్రములను దప్ప తక్కిన వస్తుజాలమును అంతయును దానమొనర్చెను. అట్లే భర్త యొక్క అభిప్రాయమును గుర్తించి సీతాదేవియు తాను ధరించిన వస్త్రములను, పతికి ప్రతిరూపమైన మాంగల్యమును తప్ప మిగిలిన ఆభరణాదులను అన్నింటిని దానము చేసెను.

*11.5 (ఐదవ శ్లోకము)*

*తే తు బ్రహ్మణ్యదేవస్య వాత్సల్యం వీక్ష్య సంస్తుతమ్|*

*ప్రీతాః క్లిన్నధియస్తస్మై ప్రత్యర్ప్యేదం బభాషిరే॥7691॥*

బ్రాహ్మణులను దైవస్వరూపులుగా భావించునట్టి శ్రీరాముని యొక్క అపారమైన వాత్సల్యమును జూచి, ఆ బ్రాహ్మణులు ఎంతయో సంతృప్తులైరి. వారి హృదయములు ద్రవించెను. పిదప వారు అందరును తాము దానముగా స్వీకరించిన సమస్త భూమండలమును తిరిగి ఆ ప్రభువునకే అర్పించి, ఇట్లు పలికిరి-

*11.6 (ఆరవ శ్లోకము)*

*అప్రత్తం నస్త్వయా కిం ను భగవన్ భువనేశ్వర|*

*యన్నోఽన్తర్హృదయం విశ్య తమో హంసి స్వరోచిషా॥7692॥*

"పరమపురుషా! సర్వేశ్వరా! నీవు మా హృదయములలో ప్రవేశించి, నీ దివ్య తేజస్సుతో మా అజ్ఞానాంధకారమును రూపుమాపిన మహానుభావుడవు. ఇంక నీవు మాకు ఇయ్యనిది ఏమున్నది? నీవు అనుగ్రహించిన జ్ఞానముతో మేము సర్వస్వమును పొందిన వారమైతిమి.

*11.7 (ఏడవ శ్లోకము)*

*నమో బ్రహ్మణ్యదేవాయ రామాయాకుంఠమేధసే|*

*ఉత్తమశ్లోకధుర్యాయ న్యస్తదండార్పితాంఘ్రయే॥7693॥*

సత్పురుషులకు పరమాశ్రయుడవైన శ్రీరామా! నీవు అపారమైన జ్ఞానమునకు నిధివి (జ్ఞానస్వరూపుడవు). అపూర్వమైన కీర్తిప్రతిష్టలు గలవారిలో నీవు మేటివి. తపస్సంపన్నులైన మహర్షులు సైతము నీ పాదపద్మములకు ప్రణమిల్లుచుందురు. మహాత్మా! నీకు నమస్కారములు".

*11.8 (ఎనిమిదవ శ్లోకము)*

*కదాచిల్లోకజిజ్ఞాసుర్గూఢో రాత్ర్యామలక్షితః|*

*చరన్ వాచోఽశృణోద్రామో భార్యాముద్దిశ్య కస్యచిత్॥7694॥*

ఒకానొకప్పుడు శ్రీరాముడు ప్రజల స్థితిగతులను గ్రహించుటకై ఎవ్వరును తెలిసికొన లేకుండునట్లుగా మారువేషములలో రాత్రివేళ నగరమునందు సంచరించుచుండెను. అప్పుడు ఒకడు వాని భార్యతో పలికిన మాటలు ఆయన చెవినబడెను.

*11.9 (తొమ్మిదవ శ్లోకము)*

*నాహం బిభర్మి త్వాం దుష్టామసతీం పరవేశ్మగామ్|*

*స్త్రీలోభీ బిభృయాత్సీతాం రామో నాహం భజే పునః॥7695॥*

ఓసీ! నీవు ఇతరుల ఇండ్లలో (స్వేచ్ఛగా) తిరిగివచ్చిన దుష్టురాలవు. కులటవు. కనుక నిన్ను నేను ఏలుకొనను. లంకలోనుండి వచ్చిన సీతను రాముడు స్త్రీ వ్యామోహియై పరిగ్రహించెను. కాని, నేను అట్లు చేయను".

*11.10 (పదకొండవ శ్లోకము)*

*ఇతి లోకాద్బహుముఖాద్దురారాధ్యాదసంవిదః|*

*పత్యా భీతేన సా త్యక్తా ప్రాప్తా ప్రాచేతసాశ్రమమ్॥7696॥*

*11.11 (పదకొండవ శ్లోకము|*

*అంతర్వత్న్యాగతే కాలే యమౌ సా సుషువే సుతౌ|*

*కుశో లవ ఇతి ఖ్యాతౌ తయోశ్చక్రే క్రియా మునిః॥7697॥*

లోకములో మూర్ఖులకు లోటు ఉండదుకదా! పెక్కుమంది నోట ఇట్టి మాటలను వినిన పిమ్మట శ్రీరాముడు లోకాపవాదమునకు వెరచి, తన ధర్మపత్నియగు సీతాదేవిని పరిత్యజించెను. ఆ తల్లి వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు చేరెను. ఆ సమయమున సీతాదేవి గర్భవతిగా ఉండెను. క్రమముగా నెలలు నిండిన పిమ్మట ఆ జానకీమాత ఇద్దరు కవల శిశువులకు జన్మనిచ్చెను. అంతట వాల్మీకి మహాముని వారికి జాతకర్మాది సంస్కారములను జరిపి *కుశలవులు* అని నామకరణము చేసెను.

PVD Subrahmanyam చెప్పారు...

*11.12 (పండ్రెండవ శ్లోకము)*

*అంగదశ్చిత్రకేతుశ్చ లక్ష్మణస్యాత్మజౌ స్మృతౌ|*

*తక్షః పుష్కల ఇత్యాస్తాం భరతస్య మహీపతే॥7698॥*

*11.13 (పదమూడవ శ్లోకము)*

*సుబాహుః శ్రుతసేనశ్చ శత్రుఘ్నస్య బభూవతుః|*

*గంధర్వాన్ కోటిశో జఘ్నే భరతో విజయే దిశామ్॥7699॥*

పరీక్షిన్మహారాజా! లక్ష్మణస్వామికి అంగదుడు, చిత్రకేతువు అను ఇరువురు కుమారులు కలిగిరి. తక్షుడు, పుష్కలుడు అనునవి భరతుని సుతుల పేర్లు. శత్రుఘ్నుని తనయులు - సుబాహువు, శ్రుతసేనుడు. భరతుడు దిగ్విజయయాత్ర ఒనర్చుచు కోట్లకొలది గంధర్వులసు హతమార్చెను.

*11.14 (పదునాలుగవ శ్లోకము)*

*తదీయం ధనమానీయ సర్వం రాజ్ఞే న్యవేదయత్|*

*శత్రుఘ్నశ్చ మధోః పుత్రం లవణం నామ రాక్షసమ్|*

*హత్వా మధువనే చక్రే మథురాం నామ వై పురీమ్॥7700॥*

పిమ్మట అతడు ఆ గంధర్వుల సంపదలను తీసికొనివచ్చి శ్రీరామచంద్ర ప్రభువునకు సమర్పించెను. శత్రుఘ్నుడు మధురాక్షసకుమారుడైన లవణాసురుని చంపి, అతని మధువనమునందు మథురాపురమును నిర్మించెను.

*11.15 (పదునైదవ శ్లోకము)*

*మునౌ నిక్షిప్య తనయౌ సీతా భర్త్రా వివాసితా|*

*ధ్యాయంతీ రామచరణౌ వివరం ప్రవివేశ హ॥7701॥*

శ్రీరామునిచే త్యజింపబడి, వాల్మీకి ఆశ్రమమున సీతాదేవి తన ఇరువురు కుమారులను ఆ మునీశ్వరునకు అప్పగించెను. పిదప ఆ సాధ్వి తన పతిదేవుడగు రామచంద్రప్రభువు యొక్క పాదపద్మములను ధ్యానించుచు తన తల్లియైన భూదేవి గర్భమున ప్రవేశించెను.

*11.16 (పదహారవ శ్లోకము)*

*తచ్ఛ్రుత్వా భగవాన్ రామో రుంధన్నపి ధియా శుచః|*

*స్మరంస్తస్యా గుణాంస్తాంస్తాన్నాశక్నోద్రోద్ధుమీశ్వరః ॥7702॥*

ఆ వార్తను (భూదేవి గర్భమున సీతాదేవి ప్రవేశించిన వార్తను) వినినంతనే శ్రీరాముడు మానసికముగా మిగుల ఖిన్నుడయ్యెను. ఆ మహాత్ముడు ఆ దుఃఖమును నిగ్రహించుకొనుటకు సర్వసమర్థుడేయైనను, తన ధర్మపత్నియగు సీతాసాధ్వియొక్క ఆయా ఉదాత్తగుణములు పదేపదే (తెరలు తెరలుగా) స్మృతికి వచ్చుచుండుటచే ఆ బాధను ఆపుకొనలేకుండెను.

*11.17 (పదునేడవ శ్లోకము)*

*స్త్రీపుంప్రసంగ ఏతాదృక్ సర్వత్ర త్రాసమావహః|*

*అపీశ్వరాణాం కిముత గ్రామ్యస్య గృహచేతసః॥*

పరస్పరము ప్రేమానురాగములతో పెనవైచుకొనిన స్త్రీ పురుషులు సైతము అతీతులు కారు. ఇక సాంసారిక విషయములే సర్వస్వము అనుకొనెడి పామరుని విషయము చెప్పనేల?

*11.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*తత ఊర్ధ్వం బ్రహ్మచర్యం ధారయన్నజుహోత్ప్రభుః|*

*త్రయోదశాబ్దసాహస్రమగ్నిహోత్రమఖండితమ్॥7704॥*

అటుపిమ్మట శ్రీరామచంద్రప్రభువు బ్రహ్మనిష్ఠాపరుడై పదమూడువేల సంవత్సరముల వఱకును అవిచ్ఛన్నముగా యజ్ఞయాగాది అగ్నికార్యములను నెరవేరపుచునే వచ్చెను.

*శ్రీమద్రామాయణమునందు -*

*శ్లో. దశవర్షసహస్రాణి దశవర్ష శతాని చ|*

*రామోరాజ్యముపాసీత్|*

శ్రీరామచంద్రప్రభువు పదకొండువేల సంవత్సరములు రాజ్యపాలనము ఒనర్చెను అని వాల్మీకి రామాయణమునందు పేర్కొనబడినది. ఇచ్చట ఆ పురుషోత్తముని యొక్క పాలనము 13వేల సంవత్సరములుగా తెలుపబడినది. ఇట్లనుట రామాయణమునందలి ప్రస్తావనకు, విరుద్ధము గదా! కాని సూక్ష్మముగా పరిశీలించి చూచినచో ఇందు ఎట్టి వైరుధ్యమూ కన్పట్టదు. పదివేల సంవత్సరముల వఱకును శ్రీరాముడు సీతాదేవితో కూడియే రాజ్యపాలనమొనర్చినట్లు భావింపనగును. మిగిలిన వేయి సంవత్సరముల కాలములో సీతాదేవితో ఎడబాటు కారణముగా ఆ ప్రభువునకు ప్రతివంద సంవత్సరములు మూడువందల సంవత్సరములుగా అనిపించెను. అనగా క్షణమొక యుగముగా గడపినాడన్నమాట. ఇట్టి సమన్వయముతో వైరుధ్యము తొలగిపోయినట్లే. (వీరరాఘవీయ వ్యాఖ్య. సూక్ష్మసమన్వయము)

*11.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*స్మరతాం హృది విన్యస్య విద్ధం దండకకంటకైః|*

*స్వపాదపల్లవం రామ ఆత్మజ్యోతిరగాత్తతః॥7705॥*

అంతట ఆ స్వామి తన వనవాస సమయమున దండకారణ్యమునందలి కంటకములకు వసివాడిన తన పాదపల్లవములను (చిగురుటాకువలె కోమలములైన తన పాదములను), తనను అనుక్షణము స్మరించెడి సాధుజనుల హృదయముల యందు నిలిపి, జ్యోతిర్మయమైన పరంధామమునకు చేరెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*114వ నామ మంత్రము*

*ఓం భవారణ్య కుఠారికాయై నమః*

జననమరణ చక్రములనెడు కొండ చిలువలతోను, మోహబంధములనెడు లతలతోను, అరిషడ్వర్గములనెడు కౄరమృగములతోను, అజ్ఞానమనెడు చీకట్లతోను నిండియున్న సంసారారణ్యములకు కుఠారిక (గొడ్డలి) వంటి శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భవారణ్య కుఠారికా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం భవారణ్య కుఠారికాయై నమః* అని ఉచ్చరించుచూ మిగుల భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే భౌతికసంబంధమైన సుఖసంతోషములు పొందుతాడు. అదే క్రమంలో పరమేశ్వరీ ఆరాధనలో ఆధ్యాత్మికానందమును కూడా పొంది తరించును.

పుట్టడం చావడం మరల పుట్టడం అనేది ప్రతీజీవికి ఒక సహజమైన లక్షణం.

*పునరపి జననం పునరపి మరణం*

*పునరపి జననీ జఠరే శయనం|*

*ఇహ సంసారే బహుదుస్తారే*

*కృపయాపారే పాహి మురారే||*

పుట్టడం, చావడం మళ్ళీ పుట్టడం చావడం, తల్లి గర్భంలో మలమూత్రాదుల నడుమ శయనించడం వంటి ఈ జననమరణ చక్రంలో చిక్కుకున్నాను. ఈ సంసార బంధములనుండి నుండి బయట పడలేక పోవుచున్నాను. ఓ తల్లీ! నన్నీ సంసారము నుండి బయటపడవేయుము విష్ణుస్వరూపిణి అయిన జగన్మాతా!

ఈ సంసారమనే అరణ్యంలో అజ్ఞామనే చీకట్లు, అరిషడ్వర్గములనే కౄరమృగములను దాటి వెలుపలికి రాలేక తీగలు, లతల వంటి మాయా మోహ బంధములలో చిక్కుకుపోయి పుట్టుట, చచ్చుట, మరల తల్లి గర్భమందు తొమ్మిది నెలలు వాసము జేయుట జన్మలకు జన్మలు గడుపడం జరుగుతున్నది.
సంసారంలో భౌతిక బంధముల కన్నను, మానసిక బంధమే అనేక ఇబ్బందులకు కారణమౌతుంది. జ్ఞానస్వరూపిణి అమ్మవారు. జ్ఞానమనేదే ఒక గొడ్డలి వంటిది. ఈ అపార దుఃఖమయమైన భవారణ్యమునకు జగన్మాత ధ్యానము ఒక్కటే సాధనము. ఆ తల్లియందు ఎనలేని భక్తిప్రపత్తులతో ఉపాసించినచో ఆ జగన్మాత ఈ భవారణ్యమును ఛేదించుటకు జ్ఞానమను ఒక గండ్రగొడ్డలిని అనుగ్రహించును. ఆ జ్ఞానమను గండ్రగొడ్డలి అరిషడ్వర్గములను ఛేదిస్తుంది. తద్ద్వారా సాధకునిలో ఎనలేని సత్త్వగుణం, పరచింతన వృద్ధి అవుతుంది. నిరంతర సాధనతో జగన్మాతను సాక్షాత్కరింప జేసుకోవడం జరుగుతుంది. పునర్జన్మ నశించి మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుకనే ఈ సంసారమను అరణ్యమునకు జగన్మాత కుఠారిక (గండ్రగొడ్డలి) వంటిది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భవారణ్య కుఠారికాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*691వ నామ మంత్రము*

*ఓం చతురంగబలేశ్వర్యై నమః*

రథ-గజ-తురగ-పదాతి రణరంగ బలములకు, వామదేవ-ప్రద్యుమ్న-అనిరుద్ధ-సంకర్షణ అను విష్ణు వ్యూహములకు, శివవ్యూహములకు, శక్తివ్యూహములకు అధిపతిగను, శరీరపురుషుడు-ఛందఃపురుషుడు-వేదపురుషుడు-మహాపురుషుడు అను చతుర్విధ పురుష స్వరూపిణిగను విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చతురంగబలేశ్వరీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం చతురంగబలేశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు తనలోని అరిషడ్వర్గములను అంతరింప జేసికొని, ఆ పరమేశ్వరీ ధ్యానచింతలో నిమగ్నుడై, భౌతిక సుఖసంతోషములతోబాటు ఆధ్యాత్మికానందమును కూడా పొంది తరించును.

ఇంతకు ముందు నామములలో జగన్మాత మహాసామ్రాజ్ఞి అని అన్నాము. కోశనాథా అని కూడా స్తుతించాము. ఒక మహాసామ్రాజ్యంలో ధనాగారములు, ధాన్యాగారములు ఇంకా కాపాడుకోవలసిన సంపదలు అనేకం ఉంటాయి. అటువంటప్పుడు సైన్యంకూడా ఉండాలి. ఆ సైన్యమే చతురంగబలము అంటాము. ఎందుకంటే వాయుసేన, నౌకాసేన, పదాతిసేన అని నేటి భారతసైన్యంలో ఉన్నట్లు నాడు రాచరికంలో కూడా రథ,గజ,తురగ,పదాతి దళములు ఉన్నాయి. చక్రరాజరథము, గేయచక్ర రథము, కిరిచక్ర రథము అనునవి జగన్మాత రథములు. సంపత్కరీదేవి గజబలమునకు నాయకురాలు. ఆశ్వారూఢాదేవి తురంగ సేనకు నాయకురాలు. పదాతి దళములలో శక్తిసేనలు, జ్వాలామాలిని, వారాహి,శ్యామలాదేవి, నిత్యాదేవతలు ఉన్నారు. అంతేనా? తన అంశలో బాలాత్రిపురసుందరి, గణేశ్వరుడు కూడా ఉన్నారు. అమ్మవారి దగ్గర శత్రువుల అస్త్రాలకు తగిన మంత్రయుక్త శస్త్రములున్నాయి. పాశుపతాస్త్రము, కామేశ్వరాస్త్రము వంటి శతఘ్నులు కూడా ఉన్నాయి. ఇవి చాలదన్నట్లు జగన్మాత తన చేతి పది వ్రేళ్ళ గోళ్ళ సందులనుండి నారాయణుని దశావతారములు సృష్టించి దుష్టులను తుదముట్టించినది. ఇంకను విష్ణువ్యూహములు (వామదేవ, ప్రద్యుమ్మ, అనిరుద్ధ, సంకర్షణ వ్యూహములు), శివవ్యూహములు, శక్తివ్యూహములు ఉన్నవి. జగన్మాత తానే చతుర్విధ పురుషస్వరూపిణి (శరీరపురుషుడు, ఛందఃపురుషుడు, వేదపురుషుడు, మహాపురుషుడు).
ఇంతవరకూ చెప్పినవి కేవలం భౌతిక సైన్య సంపద.

అజ్ఞానాధ్వాంతమును (అజ్ఞానమనే చీకట్లను) తెగటార్చడానికి చతుర్వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, హోమములు, జపములు, ఉపాసనలు మొదలైనవి ఎన్నో ఆధ్యాత్మిక బలసంపద ఉన్నది.

అంతటి చతురంగ బలేశ్వరికి నమస్కరించునపుడు *ఓం చతురంగబలేశ్వర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*11.1 (ప్రథమ శ్లోకము)*

*భగవానాత్మనాఽఽత్మానం రామ ఉత్తమకల్పకైః|*

*సర్వదేవమయం దేవమీజ ఆచార్యవాన్ మఖైః॥7687॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! పరమ పురుషుడైన శ్రీరాముడు సర్వదేవమయుడు (సఖలదేవతలను తనలో కలిగియున్న విరాట్ పురుషుడు). ఆ మహాత్ముడు వసిష్ఠుని ఆచార్యునిగా జేసికొని, ఆ బ్రహ్మర్షి పర్యవేక్షణలో కల్పోక్తవిధానములను అనుసరించి, సకలవస్తు సమృద్ధితో పెక్కు యజ్ఞములను ఆచరించెను. యజ్ఞపురుషుడైన ఆ మహానుభావుడు యాగములను ఆచరించుటద్వారా తనను తానే అర్చించుకొనెను.

*11.2 (రెండవ శ్లోకము)*

*హోత్రేఽదదాద్దిశం ప్రాచీం బ్రహ్మణే దక్షిణాం ప్రభుః|*

*అధ్వర్యవే ప్రతీచీం చ ఉదీచీం సామగాయ సః॥7688॥*

*11.3 (మూడవ శ్లోకము)*

*ఆచార్యాయ దదౌ శేషాం యావతీ భూస్తదంతరా|*

*మన్యమాన ఇదం కృత్స్నం బ్రాహ్మణోఽర్హతి నిఃస్పృహః॥7689॥*

ఆ రామచంద్రప్రభువు యజ్ఞదక్షిణగా రాజ్యమునందలి తూర్పుభాగమును హోతకును (ఋగ్వేదప్రతినిధికిని) దక్షిణ భాగమును బ్రహ్మకును, పడమర భాగమును అధ్వర్యునకును, (యజుర్వేద ప్రతినిధికిని), ఉత్తర భాగమును ఉద్గాతకును (సామవేద ప్రతినిధికిని) దానము చేసెను. మధ్యగల సమస్త భూమిని ఆచార్యునకొసంగెను. ఐహిక విషయములయందు ఎట్టి ఆసక్తియులేని ఆ రఘురాముడు 'ఈ సమస్త భూమండలమును స్వీకరించుటకు అన్ని విధములుగా బ్రాహ్మణుడే అర్హుడు' అను దృఢనిశ్చయమును కలిగి యుండెను.

*11.4 (నాలుగవ శ్లోకము)*

*ఇత్యయం తదలంకారవాసోభ్యామవశేషితః|*

*తథా రాజ్ఞ్యపి వైదేహీ సౌమంగల్యావశేషితా॥7690॥*

శ్రీరాముడు తాను ధరించియున్న వస్త్రములను దప్ప తక్కిన వస్తుజాలమును అంతయును దానమొనర్చెను. అట్లే భర్త యొక్క అభిప్రాయమును గుర్తించి సీతాదేవియు తాను ధరించిన వస్త్రములను, పతికి ప్రతిరూపమైన మాంగల్యమును తప్ప మిగిలిన ఆభరణాదులను అన్నింటిని దానము చేసెను.

*11.5 (ఐదవ శ్లోకము)*

*తే తు బ్రహ్మణ్యదేవస్య వాత్సల్యం వీక్ష్య సంస్తుతమ్|*

*ప్రీతాః క్లిన్నధియస్తస్మై ప్రత్యర్ప్యేదం బభాషిరే॥7691॥*

బ్రాహ్మణులను దైవస్వరూపులుగా భావించునట్టి శ్రీరాముని యొక్క అపారమైన వాత్సల్యమును జూచి, ఆ బ్రాహ్మణులు ఎంతయో సంతృప్తులైరి. వారి హృదయములు ద్రవించెను. పిదప వారు అందరును తాము దానముగా స్వీకరించిన సమస్త భూమండలమును తిరిగి ఆ ప్రభువునకే అర్పించి, ఇట్లు పలికిరి-

*11.6 (ఆరవ శ్లోకము)*

*అప్రత్తం నస్త్వయా కిం ను భగవన్ భువనేశ్వర|*

*యన్నోఽన్తర్హృదయం విశ్య తమో హంసి స్వరోచిషా॥7692॥*

"పరమపురుషా! సర్వేశ్వరా! నీవు మా హృదయములలో ప్రవేశించి, నీ దివ్య తేజస్సుతో మా అజ్ఞానాంధకారమును రూపుమాపిన మహానుభావుడవు. ఇంక నీవు మాకు ఇయ్యనిది ఏమున్నది? నీవు అనుగ్రహించిన జ్ఞానముతో మేము సర్వస్వమును పొందిన వారమైతిమి.

*11.7 (ఏడవ శ్లోకము)*

*నమో బ్రహ్మణ్యదేవాయ రామాయాకుంఠమేధసే|*

*ఉత్తమశ్లోకధుర్యాయ న్యస్తదండార్పితాంఘ్రయే॥7693॥*

సత్పురుషులకు పరమాశ్రయుడవైన శ్రీరామా! నీవు అపారమైన జ్ఞానమునకు నిధివి (జ్ఞానస్వరూపుడవు). అపూర్వమైన కీర్తిప్రతిష్టలు గలవారిలో నీవు మేటివి. తపస్సంపన్నులైన మహర్షులు సైతము నీ పాదపద్మములకు ప్రణమిల్లుచుందురు. మహాత్మా! నీకు నమస్కారములు".

*11.8 (ఎనిమిదవ శ్లోకము)*

*కదాచిల్లోకజిజ్ఞాసుర్గూఢో రాత్ర్యామలక్షితః|*

*చరన్ వాచోఽశృణోద్రామో భార్యాముద్దిశ్య కస్యచిత్॥7694॥*

ఒకానొకప్పుడు శ్రీరాముడు ప్రజల స్థితిగతులను గ్రహించుటకై ఎవ్వరును తెలిసికొన లేకుండునట్లుగా మారువేషములలో రాత్రివేళ నగరమునందు సంచరించుచుండెను. అప్పుడు ఒకడు వాని భార్యతో పలికిన మాటలు ఆయన చెవినబడెను.

*11.9 (తొమ్మిదవ శ్లోకము)*

*నాహం బిభర్మి త్వాం దుష్టామసతీం పరవేశ్మగామ్|*

*స్త్రీలోభీ బిభృయాత్సీతాం రామో నాహం భజే పునః॥7695॥*

ఓసీ! నీవు ఇతరుల ఇండ్లలో (స్వేచ్ఛగా) తిరిగివచ్చిన దుష్టురాలవు. కులటవు. కనుక నిన్ను నేను ఏలుకొనను. లంకలోనుండి వచ్చిన సీతను రాముడు స్త్రీ వ్యామోహియై పరిగ్రహించెను. కాని, నేను అట్లు చేయను".

*11.10 (పదకొండవ శ్లోకము)*

*ఇతి లోకాద్బహుముఖాద్దురారాధ్యాదసంవిదః|*

*పత్యా భీతేన సా త్యక్తా ప్రాప్తా ప్రాచేతసాశ్రమమ్॥7696॥*

*11.11 (పదకొండవ శ్లోకము|*

*అంతర్వత్న్యాగతే కాలే యమౌ సా సుషువే సుతౌ|*

*కుశో లవ ఇతి ఖ్యాతౌ తయోశ్చక్రే క్రియా మునిః॥7697॥*

లోకములో మూర్ఖులకు లోటు ఉండదుకదా! పెక్కుమంది నోట ఇట్టి మాటలను వినిన పిమ్మట శ్రీరాముడు లోకాపవాదమునకు వెరచి, తన ధర్మపత్నియగు సీతాదేవిని పరిత్యజించెను. ఆ తల్లి వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు చేరెను. ఆ సమయమున సీతాదేవి గర్భవతిగా ఉండెను. క్రమముగా నెలలు నిండిన పిమ్మట ఆ జానకీమాత ఇద్దరు కవల శిశువులకు జన్మనిచ్చెను. అంతట వాల్మీకి మహాముని వారికి జాతకర్మాది సంస్కారములను జరిపి *కుశలవులు* అని నామకరణము చేసెను.

PVD Subrahmanyam చెప్పారు...

*11.20 (ఇరువదియవ శ్లోకము)*

*నేదం యశో రఘుపతేః సురయాచ్ఞయాత్తలీలాతనోరధికసామ్యవిముక్తధామ్నః |*

*రక్షోవధో జలధిబంధనమస్త్రపూగైః కిం తస్య శత్రుహననే కపయః సహాయాః॥7706॥*

పరీక్షిన్మహారాజా! ఆ శ్రీమన్నారాయణుడే దేవతల అభ్యర్థనపై లీలామానుషవిగ్రహుడై ఈ భూతలమున శ్రీరాముడు అవతరించెను. ఆ పురుషోత్తమునితో సమానులైన ప్రతిభాశాలురు ఎవ్వరును లేరు. ఇక ఆ స్వామిని మించినవారు ఎట్లుందురు? అపారమైన సముద్రముపై సేతువును నిర్మించుటయు, తన అస్త్రపరంపరచే రాక్షసులను వధించుటయు సర్వశక్తిమంతుడైన ఆ ప్రభువునకు పెద్ద విషయములు కానేకావు. వీటివలన ఆ మహాత్మునకు అదనముగా వచ్చిన కీర్తిప్రతిష్ఠలునూ లేవు. ఇవి అన్నియును ఆయనయొక్క అవతారలీలావిశేషములే. శత్రు (రాక్షసాది) సంహార విషయమున వానరుల సహాయమును స్వీకరించుటగూడ ఆ పరాత్పరుని లీలలలో ఒక భాగమే.

*11.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*యస్యామలం నృపసదఃసు యశోఽధునాపి గాయంత్యఘఘ్నమృషయో దిగిభేంద్రపట్టమ్|*

*తం నాకపాలవసుపాలకిరీటజుష్టపాదాంబుజం రఘుపతిం శరణం ప్రపద్యే॥7707॥*

ఆ రఘురాముని యశస్సు నిర్మలమైనది, అది సకలపాపములను రూపుమాపును. దిగ్గజములకు ఆభరణ రూపమైనది. అనగా దిగంతముల వరకును పరివ్యాప్తమైనది. అట్టి మహిత యశస్సు నేటికిని రాజసభల యందు మహర్షులచే కొనియాడబడుచున్నది. పవిత్రములైన ఆ స్వామి పాదపద్మములకు ఇంద్రాదిదేవతలు, వాసిగాంచిన భూపతులు (చక్రవర్తులు) తమ కిరీటములు తాకునట్లుగా ప్రణమిల్లుచుందురు. అట్టి రఘువరుని నేను శరణు వేడెదను.

*11.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*స యైః స్పృష్టోఽభిదృష్టో వా సంవిష్టోఽనుగతోఽపి వా|*

*కోసలాస్తే యయుః స్థానం యత్ర గచ్ఛంతి యోగినః॥7708॥*

కోసలదేశవాసులందరును శ్రీరామచంద్ర ప్రభువును స్పృశించుటవలనను, ప్రత్యక్షముగా దర్శించుట చేతను, సేవించుటవలనను, అనుసరించుటచేతను పునీతులైరి. అందువలన వారు శ్రీరాముని అనుగ్రహమున,యోగీశ్వరులు పొందునట్టి పరంధామమును చేరిరి.

*11.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్|*

*ఆనృశంస్యపరో రాజన్ కర్మబంధైర్విముచ్యతే॥7709॥*

పరీక్షిన్మహారాజా! శ్రీరామవృత్తాంతమును చెవులార (తనివితీర) విన్నవారు సత్త్వగుణసంపన్నులై సౌమ్యభావమును పొందుదురు. అంతేగాదు, వారు సమస్త కర్మబంధముల నుండియు విముక్తులగుదురు.

*రాజోవాచ*

*11.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*కథం స భగవాన్ రామో భ్రాతౄన్ వా స్వయమాత్మనః|*

*తస్మిన్ వా తేఽన్వవర్తంత ప్రజాః పౌరాశ్చ ఈశ్వరే॥7710॥*

*పరీక్షిన్మహారాజు నుడివెను* మహాత్ముడైన శ్రీరామచంద్రుడు స్వయముగా తన సోదరులయెడ ఎట్లు మసలుకొనుచుండెడివాడు? భరతాది సోదరులు, అయోధ్యాపురవాసులు, కోసలదేశ ప్రజలు ఆ ప్రభువునెడ ఎట్లు ప్రవర్తించుచుండెడివారు?

*శ్రీశుక ఉవాచ*

*11.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*అథాదిశద్దిగ్విజయే భ్రాతౄంస్త్రిభువనేశ్వరః|*

*ఆత్మానం దర్శయన్ స్వానాం పురీమైక్షత సానుగః॥7711॥*

*శ్రీశుకుడు నుడివెను* శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన పిమ్మట తన ఆజ్ఞానువర్తులైన సోదరులను దిగ్విజయయాత్రకై ఆదేశించెను. ఆ ప్రభువు తన ప్రజలందరికిని ఆత్మీయతతో దర్శనమిచ్చుచుండెడివాడు. అనుచరులతోగూడి పురమును (పౌరులను) రక్షించుచుండెడి వాడు.

*11.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*ఆసిక్తమార్గాం గంధోదైః కరిణాం మదశీకరైః|*

*స్వామినం ప్రాప్తమాలోక్య మత్తాం వా సుతరామివ॥7712॥*

ఆ ప్రభువు పాలన కొనసాగుచున్నప్పుడు వీధులన్నియును సుగంధజలములతో, మదపుటేనుగుల మదజలములతో తడుపబడుచుండెను. శ్రీరాముడు ప్రభువగుటతో ఆ నగరమంతయును (పౌరులు అందరును) మిగుల సంతోషముతో పరవశించిపోవు చుండిరి.

*11.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*ప్రాసాదగోపురసభాచైత్యదేవగృహాదిషు|*

*విన్యస్తహేమకలశైః పతాకాభిశ్చ మండితామ్॥7713॥*

రాజసౌధములు, పురద్వారములు మొదలగువాటిపై స్థాపితములైన బంగారు కలశములు తళతళ మెరయుచుండెను. ధ్వజపతాకముల రెపరెపలతో ఆ నగరశోభ ఇనుమడించుచుండెను.

PVD Subrahmanyam చెప్పారు...

*11.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*పూగైః సవృంతై రంభాభిః పట్టికాభిః సువాససామ్|*

*ఆదర్శైరంశుకైః స్రగ్భిః కృతకౌతుకతోరణామ్॥7714॥*

పత్ర, పుష్ప, ఫలములతో గూడిన పోకచెట్లతోడను, అరటిస్తంభముల తోడను, చిత్ర విచిత్రములగు పతాకములతోడను, అద్దములతోడను, ఇంపైన వస్త్రములతోడను, పూలదండల తోడను, చక్కని తోరణములతోడను అలంకృతమైన ఆ అయోధ్య మిక్కిలి మనోహరముగా ఉండెను.

*11.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*తముపేయుస్తత్ర తత్ర పౌరా అర్హణపాణయః|*

*ఆశిషో యుయుజుర్దేవ పాహీమాం ప్రాక్ త్వయోద్ధృతామ్॥7715॥*

నగరవాసులు వివిధములగు కానుకలను తీసికొని రాముని సమీపించుచుండిరి. వారు ఆ ప్రభువునకు శుభములను పలుకుచు - 'ఓ దేవా! పూర్వము నీవు వరాహావతారమున ఈ భూమండలమును ఉద్ధరించిన మహానుభావుడవు. ఇప్పుడు దీనిని నీవే పరిపాలింపుము' అని ప్రార్థించుచుండిరి.

*11.30 (ముప్పదియవ శ్లోకము)*

*తతః ప్రజా వీక్ష్య పతిం చిరాగతం దిదృక్షయోత్సృష్టగృహాః స్త్రియో నరాః|*

*ఆరుహ్య హర్మ్యాణ్యరవిందలోచనమతృప్తనేత్రాః కుసుమైరవాకిరన్॥7716॥*

శ్రీరాముని దర్శనమునకై అచటి ప్రజలు మిక్కిలి కుతూహలముతో ఉవ్విళ్ళూరుచుండిరి. చాలాకాలమునకు పిమ్మట తమ చెంతకు వచ్చుచున్న ఆ ప్రభువును దర్శించుటకు ఉబలాటపడుచు స్త్రీ పురుషులు అందరును పరుగుపరుగున ఇండ్లనుండి బయటికి వచ్చిరి, కొందరు తమ గృహముల పై భాగములకు చేరిరి. ఆ కమలాక్షుని చూచినంతనే వారు ఆ స్వామిపై పూలవర్షమును కురిపించిరి. ఆ దివ్యమంగళమూర్తిని ఎంతగా దర్శించినను వారి కన్నుల కరవు దీరకుండెను.

*11.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*అథ ప్రవిష్టః స్వగృహం జుష్టం స్వైః పూర్వరాజభిః|*

*అనంతాఖిలకోషాఢ్యమనర్ఘ్యోరుపరిచ్ఛదమ్॥7717॥*

*11.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*విద్రుమోదుంబరద్వారైర్వైదూర్యస్తంభపంక్తిభిః|*

*స్థలైర్మారకతైః స్వచ్ఛైర్భాతస్ఫటికభిత్తిభిః॥7718॥*

ఈ విధముగా ప్రజలకు దర్శనమిచ్చిన అనంతరము ఆ మహాత్ముడు తన రాజభవనమున ప్రవేశించెను. ఆ వంశమునకు చెందిన ఇక్ష్వాకు ప్రభృతి పూర్వమహారాజు లందరును ఆ సౌధమును సేవించియుండిరి. ఆ రాజాంతఃపురము అపారమైన రత్నములు మొదలగు సంపదలుగల కోశములతో విలసిల్లుచుండెను. అమూల్యములైన వస్తువాహనములతో విరాజిల్లుచుండెను. అచటి ద్వారములు మేడిచెక్కలతో నిర్మితములై, పగడములతో చెక్కబడియుండెను. వరుసగానున్న (బారులు తీరియున్న) అచటి స్తంభములు వైడూర్యమణి ఖచితములైయుండెను. ఆ అంతఃపురమునందలి ప్రదేశములు (నేలలు) అన్నియును స్వచ్ఛమైన మరకతమణులతో తాపబడియుండెను. గోడలకు చెక్కిన స్ఫటికముల కాంతులు మిరుమిట్లు గొలుపుచుండెను.

*11.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*చిత్రస్రగ్భిః పట్టికాభిర్వాసోమణిగణాంశుకైః|*

*ముక్తాఫలైశ్చిదుల్లాసైః కాంతకామోపపత్తిభిః॥7719॥*

*11.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*ధూపదీపైః సురభిభిర్మండితం పుష్పమండనైః|*

*స్త్రీపుంభిః సురసంకాశైర్జుష్టం భూషణభూషణైః॥7720॥*

చిత్రవిచిత్రములైన పూలమాలలతోడను, పతాకములతోడను, మణులకాంతులతో విరాజిల్లుచున్న వస్త్రములతోడను, కాంతిపుంజములను విరజిమ్ముచున్న ముత్యాలతోడను ఆ అంతఃపురము కనువిందు గావించుచుండెను. ఇంకను అది మనోహరమైన భోగసామాగ్రితో శోభిల్లుచుండెను. పరిమళ భరితములైన పుష్పమాలలతో, ధూపదీపములతో దాని వైభవము అద్వితీయముగా ఉండెను. ఆభరణములకే వన్నెగూర్చెడి అచటి స్త్రీ పురుషులు దేవతలవలె విరాజిల్లుచు అచట సేవలొనర్చుచుండిరి.

*11.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*తస్మిన్ స భగవాన్ రామః స్నిగ్ధయా ప్రియయేష్టయా|*

*రేమే స్వారామధీరాణామృషభః సీతయా కిల॥7721॥*

ఆత్మారాములైన జితేంద్రియులలో శ్రేష్ఠుడగు శ్రీరామచంద్రస్వామి తన భవనమున ప్రవేశించి, తనకు ప్రాణతుల్యయు, మిక్కిలి అనురాగవతియు, సౌందర్యరాశియు ఐన సీతాదేవితో గూడి అచట సుఖశాంతులతో విహరింపసాగెను.

*11.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*బుభుజే చ యథాకాలం కామాన్ ధర్మమపీడయన్|*

*వర్షపూగాన్ బహూన్ నౄణామభిధ్యాతాంఘ్రిపల్లవః॥7722॥*

భక్తిశ్రద్ధలతో తన పాదపద్మములను ఆరాధించుచున్న స్త్రీ పురుషుల సేవలను అందుకొనుచు, శ్రీరాముడు ధర్మనిరతుడై (వర్ణాశ్రమ ధర్మములను కాపాడుచు) కాలానుగుణముగా సుఖభోగానుభవములతో పెక్కు సంవత్సరములు గడపెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ఏకాదశోఽధ్యాయః (11)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పదకొండవ అధ్యాయము (11)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*115వ నామ మంత్రము*

*ఓం భద్రప్రియాయై నమః*

పసుపు, కుంకుమ, గాజులు, పుష్పములు, మంగళాభరణముల యందును, భక్తులకు శుభములు, మంగళకరమొనరించుట యందును ఆసక్తి కలిగినదియు, లోకములకే సర్వమంగళము చేకూర్చుటకు పరమశివునిచే గరళమును సేవింపజేసినదియు అయిన మంగళగౌరీ స్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భద్రప్రియా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భద్రప్రియాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని పూజించు భక్తులకు భౌతిక జీవనము సర్వమంగళకరమై, శుభప్రదమై, ఆధ్యాత్మిక చింతనయందు మంగళప్రదమైన ఆ పరమేశ్వరీ పాదసేవాతత్తరతతో తరింతురు.

భద్ర అనగా మంగళకరము, శుభప్రదము అని అంటాము. జగన్మాత తానే మంగళగౌరీ స్వరూపిణి. జగన్మాతను బమ్మెర పోతనామాత్యులవారు *సర్వమంగళ* అని స్తుతించారు. ఎందుకంటే అమృతమథనసమయములో వెలువడిన హాలాహలమునకు దేవాసురులు భీతావహులై గడగడలాడారు. లోకములన్నియు ఆ హాలాహలాగ్నికి తల్లడిల్లిపోయినవి. ఆ ఆపద నుండి కాపాడాలంటే త్రిమూర్తులలో మహేశ్వరుడే సమర్దుడు అని తెలిసికొని, తమను కాపాడమని ఆ మహాశివుని ప్రార్థించారు. ఆయనచూస్తే సగంశరీరం జగదాంబకు సమర్పించుకున్నారు. హాలాహలం సేవించాలంటే జగదాంబ ఏమంటుందో అని ఆ తల్లివంక ఓరగా, చిరునవ్వుతో ఒకసారి చూశాడు 'ఏంచేద్దాం?' అన్నట్లు. అప్పుడు ఆతల్లి మంగళగౌరీ స్వరూపిణి. జగములకే శుభములు చేకూర్చుతల్లి. హాలాహలం వలన అమంగళకరమవుతుందంటే తట్టుకోగలదా. అలాగని పరమేశ్వరుడిని ప్రళయాగ్నికన్నా భయంకరమైన హాలాహలాన్ని మ్రింగమని చెప్పి ఆయనను ఇబ్బంది పెట్టగలదా. ఏది ఏమైనా మంగళగౌరీస్వరూపిణి అయిన జగదీశ్వరికి తన మంగళసూత్రం ఎంత గట్టిదో తెలుసు. అలాగే పరమేశ్వరుడు ఎంతటి శక్తిమంతుడోకూడాతెలుసు. ఇంకేముంది! శివశక్తులైక్య మయాయి. హాలాహలాన్ని శివుడు భక్షించాడు. అప్పుడు ఆ సన్నివేశంలోని బమ్మెర పోతనామాత్యుల వారి పద్యములు చూద్దాం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*బమ్మెర పోతనామాత్యులవారి పద్యములు*

*కంద పద్యము*

మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!

*తాత్పర్యం*

ఆమె *సర్వమంగళ* కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.

*ఆ హాలాహలమును పరమ శివుడు గ్రోలినప్పుడు*

*మత్తేభ విక్రీడితము*

కదలం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు పు
ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్;
వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
బదిలుండై కడి జేయుచోఁ దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్.

*తాత్పర్యము*

మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, దానిని సమిపించే టప్పుడు కానీ, పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ, నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మ్రింగే టప్పుడు కానీ, ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు; చెమటలు గ్రమ్మ లేదు; కన్నులు ఎఱ్ఱబార లేదు; సిగలోని చంద్రుడు కందిపోలేదు; ఆయన ముఖ పద్మం వడల లేదు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఆ పరమేశ్వరి సర్వమంగళకారిణి. మంగళగౌరీ స్వరూపిణి.

*భద్ర* అను పదమునకు చాలా అర్థములు ఉన్నవి.

*భద్రుడు* - వసుదేవుని కొడుకు కాని ఇక్కడ శివుడు. జగన్మాతకు శివుడనిన ఇష్టము కదా. అందుకు ఆ తల్లి *భద్రప్రియా*

*శుభము, శ్రేష్ఠము* - ఇవంటే జగన్మాతకు ఇష్టము. అందుకే అమ్మవారు *భద్రప్రియా*.

*సంపత్కరీ దేవి వద్ద ఉన్న ఏనుగులలో ఒకజాతి ఏనుగు* - అమ్మవారికి భద్రగజము అంటే చాలా ఇష్టము. అందుకే ఆ పరాశక్తి *భద్రప్రియా*

*వీరభద్రుడు*- దక్షయజ్ఞ వినాశనానికి శివుని జటాజూటమునుండి వెడలిన మరో రుద్రస్వరూపుడు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భద్రప్రియాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*692వ నామ మంత్రము*

*ఓం సామ్రాజ్య దాయిన్యై నమః*

రాజాధిరాజులకు సామ్రాజ్యములను, బ్రహ్మవిద్యను (ఆత్మవిద్యను) అభ్యసించిన వారికి ఆత్మసామ్రాజ్యమును, యోగనిష్ఠాగరిష్ఠులైన వారికి యోగసామ్రాజ్యమును, భక్తులకు మోక్షసామ్రాజ్యమును ప్రసాదించు శ్రీచక్రనగరసామ్రాజ్ఞికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సామ్రాజ్యదాయినీ* అను ఆరు అక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును *ఓం సామ్రాజ్యదాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు భౌతికజీవనమునందు సుఖసంతోషముల నందుతూ, ఆధ్యాత్మికసామ్రాజ్యమునందు కూడా ఆత్మానందానుభూతిని పొంది తరించును.

చిన్న చిన్న నగరములు, పల్లెలతో రాజ్యములేర్పడును. అట్టి రాజ్యములన్నియు కలిపి సామ్రాజ్యమవును. అట్టి సామ్రాజ్యములన్నియు చేరితే మహాసామ్రాజ్యమయితే, జగన్మాత సామ్రాజ్యాధీశ్వరి అవుతుంది. తన మహా సామ్రాజ్యములోని సామ్రాజ్యములను దేవతలకు ఇచ్చి పరిపాలనా వికేంద్రీకరణము గావించి అత్యంత సామర్థ్యవంతమైన మహాసామ్రాజ్యాధినేతగా జగన్మాత విరాజిల్లినది. దేవతలకు తన మహాసామ్రాజ్యములోని సామ్రాజ్యములు ఇచ్చినది గనుక *సామ్రాజ్యదాయినీ* అని నామప్రసిద్ధమైనది.

జగన్మాత రాజ్యాధిపతులను గావించిన షోడశమహారాజులు వీరే అనికూడా చెప్పవచ్చును:

షోడశమహారాజులు:

1) గయుడు, 2) అంబరీషుడు, 3) శశిబిందువు, 4) అంగుడు, 5) పృథువు, 6) మరుతి, 7) సహోత్రుడు, 8) పరశురాముడు, 9) శ్రీరాముడు, 10) భరతుడు, 11) దిలీపుడు, 12) నృగుడు, 13 ) రంతిదేవుడు, 14) యయాతి, 15 ) మాంధాత, 16) భగీరథుడు.

సామ్రాజ్యాధిపతులను చక్రవర్తులంటారు. వారు దేవలోకంలో మను, చంద్ర, కుబేరుడు మొదలైనవారు అయితే, భూలోకంలో షట్చక్రవర్తుల పేరిట 1) హరిశ్చంద్రుడు, 2) నలుడు, 3) పురుకుత్సవుడు, 4) పురూరవుడు, 5) సగరుడు, 6) కార్తవీర్యార్జనుడు - అనువారు గలరు.

*హరిశ్చంద్రో నలో రాజ,పురుకుత్స:పురూరవా:I*

*సగర: కార్త వీర్యశ్చ,షడేత్తే చక్రవర్తిన:II*

ఇంకను కవిచక్రవర్తులు కవిసామ్రాజ్యాలకు, ఆత్మవిద్యనభ్యసించిన వారు ఆత్మసామ్రాజ్యములకు,యోగాభ్యాసమొనరించినవారు యోగసామ్రాజ్యములకు, భక్తితో సేవించినవారు మోక్షసామ్రాజ్యములకు ఆ జగన్మాత అనుగ్రహంతో అధిపతులై విరాజిల్లినవారై యున్నారు.

జగన్మాత శ్రీచక్రనగరసామ్రాజ్యాధినేత కూడా అన్న సంగతి మనం మరింత ముఖ్యంగా తెలిసియుండాలి.

అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సామ్రాజ్యదాయిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*11.20 (ఇరువదియవ శ్లోకము)*

*నేదం యశో రఘుపతేః సురయాచ్ఞయాత్తలీలాతనోరధికసామ్యవిముక్తధామ్నః |*

*రక్షోవధో జలధిబంధనమస్త్రపూగైః కిం తస్య శత్రుహననే కపయః సహాయాః॥7706॥*

పరీక్షిన్మహారాజా! ఆ శ్రీమన్నారాయణుడే దేవతల అభ్యర్థనపై లీలామానుషవిగ్రహుడై ఈ భూతలమున శ్రీరాముడు అవతరించెను. ఆ పురుషోత్తమునితో సమానులైన ప్రతిభాశాలురు ఎవ్వరును లేరు. ఇక ఆ స్వామిని మించినవారు ఎట్లుందురు? అపారమైన సముద్రముపై సేతువును నిర్మించుటయు, తన అస్త్రపరంపరచే రాక్షసులను వధించుటయు సర్వశక్తిమంతుడైన ఆ ప్రభువునకు పెద్ద విషయములు కానేకావు. వీటివలన ఆ మహాత్మునకు అదనముగా వచ్చిన కీర్తిప్రతిష్ఠలునూ లేవు. ఇవి అన్నియును ఆయనయొక్క అవతారలీలావిశేషములే. శత్రు (రాక్షసాది) సంహార విషయమున వానరుల సహాయమును స్వీకరించుటగూడ ఆ పరాత్పరుని లీలలలో ఒక భాగమే.

*11.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*యస్యామలం నృపసదఃసు యశోఽధునాపి గాయంత్యఘఘ్నమృషయో దిగిభేంద్రపట్టమ్|*

*తం నాకపాలవసుపాలకిరీటజుష్టపాదాంబుజం రఘుపతిం శరణం ప్రపద్యే॥7707॥*

ఆ రఘురాముని యశస్సు నిర్మలమైనది, అది సకలపాపములను రూపుమాపును. దిగ్గజములకు ఆభరణ రూపమైనది. అనగా దిగంతముల వరకును పరివ్యాప్తమైనది. అట్టి మహిత యశస్సు నేటికిని రాజసభల యందు మహర్షులచే కొనియాడబడుచున్నది. పవిత్రములైన ఆ స్వామి పాదపద్మములకు ఇంద్రాదిదేవతలు, వాసిగాంచిన భూపతులు (చక్రవర్తులు) తమ కిరీటములు తాకునట్లుగా ప్రణమిల్లుచుందురు. అట్టి రఘువరుని నేను శరణు వేడెదను.

*11.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*స యైః స్పృష్టోఽభిదృష్టో వా సంవిష్టోఽనుగతోఽపి వా|*

*కోసలాస్తే యయుః స్థానం యత్ర గచ్ఛంతి యోగినః॥7708॥*

కోసలదేశవాసులందరును శ్రీరామచంద్ర ప్రభువును స్పృశించుటవలనను, ప్రత్యక్షముగా దర్శించుట చేతను, సేవించుటవలనను, అనుసరించుటచేతను పునీతులైరి. అందువలన వారు శ్రీరాముని అనుగ్రహమున,యోగీశ్వరులు పొందునట్టి పరంధామమును చేరిరి.

*11.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్|*

*ఆనృశంస్యపరో రాజన్ కర్మబంధైర్విముచ్యతే॥7709॥*

పరీక్షిన్మహారాజా! శ్రీరామవృత్తాంతమును చెవులార (తనివితీర) విన్నవారు సత్త్వగుణసంపన్నులై సౌమ్యభావమును పొందుదురు. అంతేగాదు, వారు సమస్త కర్మబంధముల నుండియు విముక్తులగుదురు.

*రాజోవాచ*

*11.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*కథం స భగవాన్ రామో భ్రాతౄన్ వా స్వయమాత్మనః|*

*తస్మిన్ వా తేఽన్వవర్తంత ప్రజాః పౌరాశ్చ ఈశ్వరే॥7710॥*

*పరీక్షిన్మహారాజు నుడివెను* మహాత్ముడైన శ్రీరామచంద్రుడు స్వయముగా తన సోదరులయెడ ఎట్లు మసలుకొనుచుండెడివాడు? భరతాది సోదరులు, అయోధ్యాపురవాసులు, కోసలదేశ ప్రజలు ఆ ప్రభువునెడ ఎట్లు ప్రవర్తించుచుండెడివారు?

*శ్రీశుక ఉవాచ*

*11.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*అథాదిశద్దిగ్విజయే భ్రాతౄంస్త్రిభువనేశ్వరః|*

*ఆత్మానం దర్శయన్ స్వానాం పురీమైక్షత సానుగః॥7711॥*

*శ్రీశుకుడు నుడివెను* శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన పిమ్మట తన ఆజ్ఞానువర్తులైన సోదరులను దిగ్విజయయాత్రకై ఆదేశించెను. ఆ ప్రభువు తన ప్రజలందరికిని ఆత్మీయతతో దర్శనమిచ్చుచుండెడివాడు. అనుచరులతోగూడి పురమును (పౌరులను) రక్షించుచుండెడి వాడు.

*11.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*ఆసిక్తమార్గాం గంధోదైః కరిణాం మదశీకరైః|*

*స్వామినం ప్రాప్తమాలోక్య మత్తాం వా సుతరామివ॥7712॥*

ఆ ప్రభువు పాలన కొనసాగుచున్నప్పుడు వీధులన్నియును సుగంధజలములతో, మదపుటేనుగుల మదజలములతో తడుపబడుచుండెను. శ్రీరాముడు ప్రభువగుటతో ఆ నగరమంతయును (పౌరులు అందరును) మిగుల సంతోషముతో పరవశించిపోవు చుండిరి.

*11.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*ప్రాసాదగోపురసభాచైత్యదేవగృహాదిషు|*

*విన్యస్తహేమకలశైః పతాకాభిశ్చ మండితామ్॥7713॥*

రాజసౌధములు, పురద్వారములు మొదలగువాటిపై స్థాపితములైన బంగారు కలశములు తళతళ మెరయుచుండెను. ధ్వజపతాకముల రెపరెపలతో ఆ నగరశోభ ఇనుమడించుచుండెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*12.1 (ప్రథమ శ్లోకము)*

*కుశస్య చాతిథిస్తస్మాన్నిషధస్తత్సుతో నభః|*

*పుండరీకోఽథ తత్పుత్రః క్షేమధన్వాభవత్తతః॥7723॥*

*12.2 (రెండవ శ్లోకము)*

*దేవానీకస్తతోఽనీహః పారియాత్రోఽథ తత్సుతః|*

*తతో బలస్థలస్తస్మాద్వజ్రనాభోఽర్కసంభవః॥7724॥*

*శ్రీశుకుడు వచించెను* - పరీక్షిన్మహారాజా! కుశుని కుమారునిపేరు అతిథి. అతని సుతుడు నిషధుడు. నిషధుని పుత్రుడు నభుడు. అతని తనయుడు పుండరీకుడు. పుండరీకుని సూనుడు క్షేమధన్వుడు. అతని తనూజుడు దేవానీకుడు. దేవానీకుని పుత్రుడు అనీహుడు. అతని కుమారుడు పారియాత్రుడు. పారియాత్రుని పుత్రుడు బలస్థలుడు. అతనికి సూర్యాంశమున వజ్రనాభుడు జన్మించెను.

*12.3 (మూడవ శ్లోకము)*

*ఖగణస్తత్సుతస్తస్మాద్విధృతిశ్చాభవత్సుతః|*

*తతో హిరణ్యనాభోఽభూద్యోగాచార్యస్తు జైమినేః॥7725॥*

*12.4 (నాలుగవ శ్లోకము)*

*శిష్యః కౌసల్య ఆధ్యాత్మం యాజ్ఞవల్క్యోఽధ్యగాద్యతః|*

*యోగం మహోదయమృషిర్హృదయగ్రంథిభేదకమ్॥7726॥*

వజ్రనాభునివలన కలిగినవాడు ఖగణుడు, అతనికి పుట్టినవాడు విధృతి. విధృతి తనయుడు హిరణ్యనాభుడు. అతడు జైమిని మహర్షికి శిష్యుడై యోగాచార్యుడయ్యెను. కోసలదేశవాసియైన యాజ్ఞవల్క్యమహర్షి హిరణ్యనాభునకు శిష్యుడై అధ్యాత్మయోగమును అధ్యయనము చేసెను. ఈ యోగము భోగవాసనారూపమగు హృదయగ్రంథిని ఛేదించునట్టిది (అజ్ఞానమును రూపుమాపునట్టిది). పరమ సిద్ధిని ప్రసాదించునట్టిది.

*12.5 (ఐదవ శ్లోకము)*

*పుష్యో హిరణ్యనాభస్య ధ్రువసంధిస్తతోఽభవత్|*

*సుదర్శనోఽథాగ్నివర్ణః శీఘ్రస్తస్య మరుః సుతః॥7727॥*

*12.6 (ఆరవ శ్లోకము)*

*యోఽసావాస్తే యోగసిద్ధః కలాపగ్రామమాశ్రితః|*

*కలేరంతే సూర్యవంశం నష్టం భావయితా పునః॥7728॥*

హిరణ్యనాభుని కుమారుడు పుష్యుడు. అతని సుతుడు ధ్రువసంధి. ధ్రువసంధి వలన కలిగినవాడు సుదర్శనుడు. అతని పుత్రుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని తనయుడు శీఘ్రుడు. శీఘ్రునివలన పుట్టినవాడు మరువు. ఇతడు యోగసాధనవలన సిద్ధిని పొందినవాడు. ఇప్పటికిని ఇతడు కలాపగ్రామమును ఆశ్రయించి నివసించుచున్నాడు. కలియుగాంతమున సూర్యవంశము నష్టముకాగా, ఇతనివలన వృద్ధి పొందిన పుత్రపౌత్ర పరంపరతో అది మరల ఉత్తేజితమగును.

*12.7 (ఏడవ శ్లోకము)*

*తస్మాత్ప్రసుశ్రుతస్తస్య సంధిస్తస్యాప్యమర్షణః|*

*మహస్వాంస్తత్సుతస్తస్మాద్విశ్వసాహ్వోఽన్వజాయత॥7729॥*

*12.8 (ఎనిమిదవ శ్లోకము)*

*తతః ప్రసేనజిత్తస్మాత్తక్షకో భవితా పునః|*

*తతో బృహద్బలో యస్తు పిత్రా తే సమరే హతః॥7730॥*

ఆ మరుత్తు (మరువు) వలన ప్రసశ్రుతుడు పుట్టెను. అతని వలన కలిగినవాడు సంధి. సంధియొక్క తనయుడు అమర్షణుడు. అమర్షణుని సుతుడు మహస్వంతుడు. అతని పుత్రుడు విశ్వసాహ్వుడు. విశ్వసాహ్వుని తనూజుడు ప్రసేనజిత్తు. అతనివలన జన్మించినవాడు తక్షకుడు. అతని కుమారుడు బృహద్బలుడు. రాజా! ఈ బృహద్బలుడు నీ తండ్రియగు అభిమన్యుని చేతిలో మరణించెను.

*12.9 (తొమ్మిదవ శ్లోకము)*

*ఏతే హీక్ష్వాకుభూపాలా అతీతాః శృణ్వనాగతాన్|*

*బృహద్బలస్య భవితా పుత్రో నామ బృహద్రణః॥7731॥*

*12.10 (పదియవ శ్లోకము)*

*ఊరుక్రియః సుతస్తస్య వత్సవృద్ధో భవిష్యతి|*

*ప్రతివ్యోమస్తతో భానుర్దివాకో వాహినీపతిః॥7732॥*

*12.11 (పదకొండవ శ్లోకము)*

*సహదేవస్తతో వీరో బృహదశ్వోఽథ భానుమాన్|*

*ప్రతీకాశ్వో భానుమతః సుప్రతీకోఽథ తత్సుతః॥7733॥*

*12.12 (పండ్రెండవ శ్లోకము)*

*భవితా మరుదేవోఽథ సునక్షత్రోఽథ పుష్కరః|*

*తస్యాంతరిక్షస్తత్పుత్రః సుతపాస్తదమిత్రజిత్॥7734॥*

పరీక్షిన్మహారాజా! ఇక్ష్వాకు వంశమున ఇంతవఱకును వర్ధిల్లిన మహారాజులను గూర్చి నీకు వివరించితిని. ఇంక రాబోవువారిని గురుంచి తెలిపెదను వినుము. బృహద్బలునకు కలుగనున్న పుత్రుడు బృహద్రణుడు. అతని తనయుడు ఉరుక్రియుడు (ఉరుక్షుతుడు) ఈ ఉరుక్రియుని తనూజుడు వత్సవృద్ధుడు. అతని కుమారుడు ప్రతివ్యోముడు. ఈ ప్రతివ్యోముని పుత్రుడు భానువు. భానుని కుమారుడు దివాకుడు. ఇతడు అపారమైన సేనకు అధిపతి. దివాకుని తనయుడు సహదేవుడు. అతడు గొప్ప వీరుడు. సహదేవుని వలన కలిగినవాడు బృహదశ్వుడు. అతని సుతుడు భానుమంతుడు. భానుమంతునకు పుట్టినవాడు ప్రతీకాశుడు. అతని కుమారుడు సుప్రతీకుడు. సుప్రతీకుని తనూజుడు మరుదేవుడు. అతని వలన కలిగెడివాడు సునక్షత్రుడు. అతని సుతుడు పుష్కరుడు. పుష్కరుని పుత్రుడు అంతరిక్షుడు. అతని కుమారుడు సుతపుడు. అతని సూనుడు అమిత్రజిత్తు.

PVD Subrahmanyam చెప్పారు...

12.13 (పదమూడవ శ్లోకము)*

*బృహద్రాజస్తు తస్యాపి బర్హిస్తస్మాత్కృతంజయః|*

*రణంజయస్తస్య సుతః సంజయో భవితా తతః॥7735॥*

*12.14 (పదునాలుగవ శ్లోకము)*

*తస్మాచ్ఛాక్యోఽథ శుద్ధోదో లాంగలస్తత్సుతః స్మృతః|*

*తతః ప్రసేనజిత్తస్మాత్క్షుద్రకో భవితా తతః॥7736॥*

*12.15 (పదునైదవ శ్లోకము)*

*రణకో భవితా తస్మాత్సురథస్తనయస్తతః|*

*సుమిత్రో నామ నిష్ఠాంత ఏతే బార్హద్బలాన్వయాః॥7737॥*

*12.16 (పదహారవ శ్లోకము)*

*ఇక్ష్వాకూణామయం వంశః సుమిత్రాంతో భవిష్యతి|*

*యతస్తం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్స్యతి వై కలౌ॥7738॥*

అమిత్రజిత్తుయొక్క తనయుడు బృహద్రాజుడు. అతని కుమారుడు బర్హి. బర్హి కొడుకు కృతంజయుడు. కృతంజయుని తనయుడు రణంజయుడు. అతనివలన కలిగెడివాడు సంజయుడు. అతని తనయుడు శాక్యుడు. శాక్యుని సుతుడు శుద్ధోదనుడు. అతని వలన పుట్టెడివాడు లాంగలుడు. లాంగలుని తనయుడు స్మృతుడు. అతని తనూజుడు ప్రసేనజిత్తు. అతని కుమారుడు క్షుద్రకుడు. క్షుద్రకుని కొడుకు రణకుడు. అతని సుతుడు సురథుడు. సురథుని తనయుడు సుమిత్రుడు. అతడు ఆ వంశమునకు చివరివాడగును. బృహద్భలునకు పిమ్మట ఆ వంశము ఇట్లు వర్ధిల్లును. ఇక్ష్వాకువంశజుల పరంపర సుమిత్రునితో ముగియును. ఏలనన, సుమిత్రుడు రాజగుటతో కలియుగమున ఆ వంశము పరిసమాప్తమగును.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ద్వాదశోఽధ్యాయః (12)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పండ్రెండవ అధ్యాయము (12)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*13.1 (ప్రథమ శ్లోకము)*

*నిమిరిక్ష్వాకుతనయో వసిష్ఠమవృతర్త్విజమ్|*

*ఆరభ్య సత్రం సోఽప్యాహ శక్రేణ ప్రాగ్వృతోఽస్మి భోః॥7739॥*

*13.2 (రెండవ శ్లోకము)*

*తం నిర్వర్త్యాగమిష్యామి తావన్మాం ప్రతిపాలయ|*

*తూష్ణీమాసీద్గృహపతిః సోఽపీంద్రస్యాకరోన్మఖమ్॥7740॥*

*శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను* నిమి ఇక్ష్వాకుని తనయుడు. అతడు ఒక యజ్ఞమును చేయదలంచి, ఋత్త్విజునిగా ఉండుటకై వసిష్ఠుని ప్రార్థించెను. అప్పుడు ఆయనతో వసిష్ఠుడు ఇట్లువచించెను. 'నిమి మహారాజా! ఇంద్రుడు తాను చేయబూనిన యాగమునకు ఋత్విజునిగా ఉండుటకై నన్ను కోరియున్నాడు. ఆ దేవేంద్రుని యజ్ఞమును పూర్తిగావించి, నీకడకు రాగలను. అంతవరకు నా కొరకై నిరీక్షింపుము'. ఆ మహర్షి మాటలను విన్న పిమ్మట నిమిచక్రవర్తి మారు పలకక మిన్నకుండెను. పిదప వసిష్ఠుడు ఇంద్రుని యాగమును నిర్వహింపజేయుటకు వెళ్ళిపోయెను.

*13.3 (మూడవ శ్లోకము)*

*నిమిశ్చలమిదం విద్వాన్ సత్రమారభతాత్మవాన్|*

*ఋత్విగ్భిరపరైస్తావన్నాగమద్యావతా గురుః॥7741॥*

అంతట విద్వాంసుడైన నిమిచక్రవర్తి ఈ జీవితము క్షణభంగురము. గురువుయొక్క రాకకై నిరీక్షించుటకు వలను పడదు' అని తలపోసి అతడు వసిష్ఠుని కొరకై ఆగక, ఇతర ఋత్విజుల పర్యవేక్షణలో తన యజ్ఞకార్యమును ప్రారంభించెను.

*13.4 (నాలుగవ శ్లోకము)*

*శిష్యవ్యతిక్రమం వీక్ష్య నిర్వర్త్య గురురాగతః|*

*అశపత్పతతాద్దేహో నిమేః పండితమానినః॥7742॥*

ఇంతలో వసిష్ఠుడు ఇంద్రుని యాగమును పూర్తిచేయించి, తిరిగి వచ్చెను. అప్పటికే నిమిచక్రవర్తి యజ్ఞమును ప్రారంభించి యుండుట అతడు గమనించెను. శిష్యుడయిన ఆ నిమి తన మాటను గౌరవింపక (నిర్లక్ష్యభావముతో) యజ్ఞమును ప్రారంభించి నందులకు కుపితుడై 'ఓయీ! నీ పాండిత్య గర్వముతో నా మాటను పాటించవైతివి. నా యెడ నిర్లక్ష్యవైఖరిని ప్రదర్శించితివి. కనుక, నీవు నీ దేహమును కోల్పోవుదువు గాక' అనీ శపించెను.

*13.5 (ఐదవ శ్లోకము)*

*నిమిః ప్రతిదదౌ శాపం గురవేఽధర్మవర్తినే|*

*తవాపి పతతాద్దేహో లోభాద్ధర్మమజానతః॥7743॥*

గురువైన వసిష్ఠుడు తొందరపడి ధర్మవిరుద్ధముగా తనను అట్లు శపించినందులకు బాధపడుచు 'మహామునీ! ధనలోభము వలన (యజ్ఞదక్షిణకై ఆశపడి) ధర్మమును విస్మరించితివి. కావున, నీవును దేహమును కోల్పోదువుగాక' అని ప్రతిశాపమును ఇచ్చెను.

*13.6 (ఆరవ శ్లోకము)*

*ఇత్యుత్ససర్జ స్వం దేహం నిమిరధ్యాత్మకోవిదః|*

*మిత్రావరుణయోర్జజ్ఞే ఉర్వశ్యాం ప్రపితామహః॥7744॥*

అంతట ఆత్మవిద్యాకుశలుడైన నిమి తన దేహమును త్యజించెను. వసిష్ఠుడు తన దేహమును వీడి మిత్యావరుణులవలన ఊర్వశియందు జన్మించెను.

*13.7 (ఏడవ శ్లోకము)*

*గంధవస్తుషు తద్దేహం నిధాయ మునిసత్తమాః|*

*సమాప్తే సత్రయాగేఽథ దేవానూచుః సమాగతాన్॥7745॥*

అప్పుడు ఋత్విజులుగా ఉన్న అచటి మునీశ్వరులు నిమి యొక్క దేహమును గంధతైలములయందు (పరిమళద్రవ్యములతో) భద్రపరచి, ఆ యాగమును పూర్తిచేసిరి. పిదప వారు ఆ యజ్ఞమునకు విచ్చేసియున్న దేవతలతో ఇట్లనిరి-

*13.8 (ఎనిమిదవ శ్లోకము)*

*రాజ్ఞో జీవతు దేహోఽయం ప్రసన్నాః ప్రభవో యది|*

*తథేత్యుక్తే నిమిః ప్రాహ మా భూన్మే దేహబంధనమ్॥7746॥*

*13.9 (తొమ్మిదవ శ్లోకము)*

*యస్య యోగం న వాంఛంతి వియోగభయకాతరాః|*

*భజంతి చరణాంభోజం మునయో హరిమేధసః॥7747॥*

*13.10 (పదియవ శ్లోకము)*

*దేహం నావరురుత్సేఽహం దుఃఖశోకభయావహమ్|*

*సర్వత్రాస్య యతో మృత్యుర్మత్స్యానాముదకే యథా॥7748॥*

"మహాత్ములారా! మీరు సర్వసమర్థులు. మీరు ప్రసన్నులైనచో (అనుగ్రహించినచో), నిమిచక్రవర్తియొక్క ఈ దేహము తిరిగి అసువులను పొందుగాక". అంతట దేవతలు *తథాఽస్తు* అని పలికిరి. అంతట నిమి ఇట్లు నుడివెను- 'నాకు ఈ దేహ బంధములు వలదు. మానవులు దేహసంబంధము ఉన్నంతవరకు అది ఎప్పుడు పతనమగునో యని భయపడుచునే యుందురు (మరణభీతితో ఉందురు). అందువలన శ్రీహరియందు భక్తితత్పరులైన మునులు దేహసంబంధమునకై అర్రులు చాచక శ్రీమన్నారాయణుని ధ్యానించుచు మోక్షప్రాప్తినే కాంక్షించుచుందురు. జలములలో జీవించుచుండెడి మత్స్యములకు ఇతర జలజంతువులవలన ఎల్లప్పుడును మృత్యుబాధ తప్పనట్లు, దేహధారులకు నిరంతరము మృత్యుభయము వెంటాడుచునే యుండును. అందువలన నేను సర్వదా దుఃఖశోకభయములకు మూలమైన ఈ దేహమును ఎంతమాత్రమూ కోరుకొనను".

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*693వ నామ మంత్రము*

*ఓం సత్యసంధాయై నమః*

నిత్యము, సత్యము అయిన పరబ్రహ్మస్వరూపిణిగా, సత్యవాక్పరి పాలకులయందు సత్యస్వరూపిణిగా, సత్యమందు ప్రతిజ్ఞ కలిగినదిగా, భక్తజనులకు సత్యవాక్పరిపాలనా మహాత్మ్యమును తెలియజేయునదిగా విరాజిల్లు సత్యస్వరూపిణి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సత్యసంధా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సత్యసంధాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ జగన్మాతను ఆరాధిస్తే ప్రప్రథమంగా సాధకుడు సత్యసంధతకు ప్రాధాన్యమిస్తాడు, అంతర్ముఖారాధనతో జగన్మాత అనుగ్రహంకోసం సాధనను మరింతజేసి తరించుతాడు.

పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాత నిత్యమైనది. సత్యమైనది. సత్యసంధతయందు తాను మాత్రమే ప్రతిజ్ఞాపాలనాబద్ధురాలుగాక, తన ఆరాధకులనుగూడా సత్యసంధత బోధించి నిబద్ధతయందుంచును. అదే కారణం కావచ్చు సత్యహరిశ్చంద్రుడు, అతని సతీమణి సత్యసంధతకు ఎంతటి నిబద్ధతనిచ్చారో అందరూ వినినదేగదా. బహుశా శ్రీరామచంద్రుడు కూడా పితృవాక్పరిపాలనయందు సత్యసంధత కనబరిచాడు...మరి! శ్రీరాముడు నారాయణుని దశావతారములలో ఒకటికదా. ఆ నారాయణుని దశాకృతులు జగన్మాత చేతి పదివ్రేళ్ళ గోళ్ళసందునుండి వచ్చినవిగదా *(కరాంగుళినఖోత్పన్న నారాయణదశాకృతిః)* జగన్మాత సత్యసంధత శ్రీరామునికి కూడా పూర్తిగా తాకిందేమో.. అలా అనిపిస్తుంది. జగన్మాత సత్యసంధతకున్న ప్రభావం అంతటిది. సత్యసంధత అనే మాట గుర్తుకు వస్తే ముందు జగన్మాతనే తీసుకోవాలి. ఎందుకంటే దేవతలందరూ రాక్షసుల బారినుండి తమను కాపాడమంటే...వారికి మాట ఇచ్చి చతురంగబలములతోటి, చతుర్వేద ఆధ్యాత్మిక శక్తితోటి, మంత్రాస్త్రములనుపయోగించి రాక్షసులను సంహరించి దేవతల రాజ్యములు దేవతలకు ఇప్పించినది. దక్షప్రజాపతి పరమశివుడిని అవమానిస్తే తన తనువును అగ్నిజ్వాలలో ఆహుతిచేసుకొని, ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ...అను వైవాహిక ప్రమాణాన్ని పాటించుటలో తన సత్యసంధతను జగన్మాత నిరూపించుకున్నది. నిత్యము, సత్యము అయిన పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతే సత్యస్వరూపిణి అయి ఉన్నది. అటువంటి సత్వస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సత్యసంధాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*116వ నామ మంత్రము*

*ఓం భద్రమూర్త్యై నమః*

పసుపు, కుంకుమ, గాజులు, పుష్పములు, మంగళాభరణములన్నియునూ తానై, సహస్రారమందు సుధాసాగరంలో భద్రపీఠమందు విరాజిల్లు భద్రమూర్తి (మంగళ) స్వరూపిణి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భద్రమూర్తిః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భద్రమూర్త్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు తాను తలంచిన సత్కార్యములయందు శుభకరములు, మంగళకరములు సంప్రాప్తించి ఇష్టకామ్యార్థసిద్ధిని పొందును.

జగన్మాత మంగళ స్వరూపిణి. సర్వమంగళ. పరబ్రహ్మస్వరూపిణి. అట్టి పరబ్రహ్మస్వరూపిణిని విష్ణుపురాణంలో *బ్రహ్మమే మంగళము* అని చెప్పబడినది. ఆ బ్రహ్మము మంగళములన్నింటికంటె మంగళము అని భారతంలో ప్రస్తావింపబడినది. ఈ బ్రహ్మరూప మంగళమును పొందినవారికి అమంగళములు కలుగవు.

సృష్టిమొత్తం పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాత నుండే సృష్టించబడినది. సహస్రారంలో, సుధాసాగరం మధ్యలో భద్రపీఠమందు *భద్రమూర్తి* గా విరాజిల్లుచున్నదని వేదాలలో చెప్పబడింది.

జగన్మాత ముత్యములయందు, శంఖములందు, శివలింగముల యందు భద్రమూర్తిగా ఉంటున్నది. స్త్రీల పాపిటియందు భద్రమూర్తిగా విలసిల్లుతున్నది కనుకనే ఆడవారు పాపిట సిందూరమును ధరిస్తారు. అది ముత్తైదువులకు ఐదవతన చిహ్నము. ఐదవతనము అంటే ఐదు శుభ, మంగళ కర వస్తువులను కలిగి ఉండుట.

1) మంగళసూత్రము, 2) పసుపు, 3) కుంకుమ, 4) గాజులు, 5) మట్టెలు.
ఈ అయిదు మంగళ కర వస్తువులందు జగన్మాత మంగళగౌరీ స్వరూపిణిగా ఉంటుంది. అందుకే మన హిందూ స్త్రీలు సర్వదా ఈ అలంకారములుగా ధరించుతూ ఉంటారు.

*సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే*

*శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే*

మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ జగన్మాతా, ఓ దుర్గాదేవీ, ఓ నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భద్రమూర్త్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*దేవా ఊచుః*

*13.11 (పదకొండవ శ్లోకము)*

*విదేహ ఉష్యతాం కామం లోచనేషు శరీరిణామ్|*

*ఉన్మేషణనిమేషాభ్యాం లక్షితోఽధ్యాత్మసంస్థితః॥7749॥*

*దేవతలు నుడివిరి* "మునులారా! దేహము లేకున్నను ఈ నిమిచక్రవర్తి సకల ప్రాణులయొక్క నేత్రములయందు తన ఇచ్ఛానుసారము నివసించుచు, సూక్ష్మశరీరముతో భగవంతుని ధ్యానించుచునే యుండును. ప్రాణులు తమ కనులను తెరచుకొనుచు, మూసికొనుచు ఉండుట ద్వారా వాటియందలి అతని అస్తిత్వము బోధపడును. ఇతనికి స్థూలదేహముతో సంబంధము లేకున్నను మీ అభిలాష నెరవేరినట్లేయగును"

*13.12 (పండ్రెండవ శ్లోకము)*

*అరాజకభయం నౄణాం మన్యమానా మహర్షయః|*

*దేహం మమంథుః స్మ నిమేః కుమారః సమజాయత॥7750॥*

*13.13 (పదమూడవ శ్లోకము)*

*జన్మనా జనకః సోఽభూద్వైదేహస్తు విదేహజః|*

*మిథిలో మథనాజ్జాతో మిథిలా యేన నిర్మితా॥7751॥*

అంతట మహర్షులు రాజు లేని రాజ్యమున కల్లోల పరిస్థితులు (అనర్థములు) ఏర్పడునను భయముతో నిమిచక్రవర్తి దేహమును మథించిరి. అందుండి ఒక కుమారుడు జన్మించెను. జన్మచేత *జనకుడు* అనియు, విదేహుని కుమారుడగుటవలన *వైదేహుడు* అనియు, మథించుటచే పుట్టుటవలన *మిథిలుడు* అనియు అతనికి వ్యవహార నామములు స్థిరపడెను. అతడు మిథిలానగరమును నిర్మించెను. మిథిలునిచే నిర్మింపబడుట వలన అది మిథిలానగరముగా ప్రసిద్ధికెక్కెను.

*13.14 (పదునాలుగవ శ్లోకము)*

*తస్మాదుదావసుస్తస్య పుత్రోఽభూన్నందివర్ధనః|*

*తతః సుకేతుస్తస్యాపి దేవరాతో మహీపతే॥7752॥*

*13.15 (పదిహేనవ శ్లోకము)*

*తస్మాద్బృహద్రథస్తస్య మహావీర్యః సుధృత్పితా|*

*సుధృతేర్ధృష్టకేతుర్వై హర్యశ్వోఽథ మరుస్తతః॥7753॥*

*13.16 (పదహారవ శ్లోకము)*

*మరోః ప్రతీపకస్తస్మాజ్జాతః కృతరథో యతః|*

*దేవమీఢస్తస్య పుత్రో విశ్రుతోఽథ మహాధృతిః॥7754॥*

*13.17 (పదిహేడవ శ్లోకము)*

*కృతిరాతస్తతస్తస్మాన్మహారోమాథ తత్సుతః|*

*స్వర్ణరోమా సుతస్తస్య హ్రస్వరోమా వ్యజాయత॥7755॥*

పరీక్షిన్మహారాజా! జనకునిపుత్రుడు ఉదావసుడు, అతని కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుని సుతుడు సుకేతువు. అతని తనయుడు దేవరాతుడు. దేవరాతునివలన జన్మించినవాడు బృహద్రథుడు. అతని సూనుడు మహావీర్యుడు. మహావీర్యుని కుమారుడు సుధృతి. సుధృతి కొడుకు ధృష్టకేతువు. అతని సుతుడు హర్యశ్వుడు. హర్యశ్వుని పుత్రుడు మరువు. మరువు వలన పుట్టినవాడు ప్రతీపకుడు. అతని తనయుడు కృతిరథుడు. కృతిరథుని వలన కలిగిన వాడు దేవమీఢుడు. అతని సూనుడు విశ్రుతుడు. విశ్రుతునకు పుట్టినవాడు మహాధృతి. అతని కుమారుడు కృతిరాశుడు. కృతిరాశుని తనయుడు మహారోముడు. అతని తనూజుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని వలన జన్మించినవాడు హ్రస్వరోముడు.

*13.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*తతః సీరధ్వజో జజ్ఞే యజ్ఞార్థం కర్షతో మహీమ్|*

*సీతా సీరాగ్రతో జాతా తస్మాత్సీరధ్వజః స్మృతః॥7756॥*

హ్రస్వరోముని కుమారుడు సీరధ్వజుడు. అతడు యజ్ఞము నిమిత్తమై భూమిని దున్నుచుండెను. అప్పుడు ఆ నాగలి చాలు నుండి సీతాదేవి జన్మించెను. అందువలన ఆయనకు సీరధ్వజుడు అనుపేరు సార్థకమయ్యెను.

*13.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*కుశధ్వజస్తస్య పుత్రస్తతో ధర్మధ్వజో నృపః|*

*ధర్మధ్వజస్య ద్వౌ పుత్రౌ కృతధ్వజమితధ్వజౌ॥*

*13.20 (ఇరువదియవ శ్లోకము)*

*కృతధ్వజాత్కేశిధ్వజః ఖాండిక్యస్తు మితధ్వజాత్|*

*కృతధ్వజసుతో రాజన్నాత్మవిద్యావిశారదః॥*

సీరధ్వజుని కుమారుడు కుశధ్వజుడు. అతని పుత్రుడు ధర్మధ్వజుడు. ధర్మధ్వజునకు కృతధ్వజుడు, మితధ్వజుడు అను ఇరువురు పుత్రులు గలిగిరి. కృతధ్వజునకు కేశిధ్వజుడు, మితధ్వజునకు ఖాండిక్యుడు అను సుతులు కలిగిరి. మహారాజా, కృతధ్వజుని కుమారుడైన కేశిధ్వజుడు ఆత్మవిద్యావిశారదుడు. అనగా బ్రహ్మవిద్యయందు ప్రవీణుడు.

PVD Subrahmanyam చెప్పారు...

*13.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఖాండిక్యః కర్మతత్త్వజ్ఞో భీతః కేశిధ్వజాద్ద్రుతః|*

*భానుమాంస్తస్య పుత్రోఽభూచ్ఛతద్యుమ్నస్తు తత్సుతః॥7759॥*

*13.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*శుచిస్తత్తనయస్తస్మాత్సనద్వాజస్తతోఽభవత్|*

*ఊర్ధ్వకేతుః సనద్వాజాదజోఽథ పురుజిత్సుతః॥7760॥*

కర్మకాండము నందు నిష్ణాతుడైన ఖాండిశ్యుడు కేశిధ్వజునకు భయపడి పారిపోయెను. కేశిధ్వజుని తనయుడు భానుమంతుడు. భానుమంతుని సుతుడు శతద్యుమ్నుడు. అతని తనూజుడు శుచి. శుచియొక్క పుత్రుడు సనద్వాజుడు. సనద్వాజుని కుమారుడు ఊర్ధ్వకేతువు. అతని సుతుడు అజుడు. అజుని తనయుడు పురుజిత్తు.

*13.23 (ఇరువధి మూడవ శ్లోకము)*

*అరిష్టనేమిస్తస్యాపి శ్రుతాయుస్తత్సుపార్శ్వకః|*

*తతశ్చిత్రరథో యస్య క్షేమధిర్మిథిలాధిపః॥7761॥*

*13.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*తస్మాత్సమరథస్తస్య సుతః సత్యరథస్తతః|*

*ఆసీదుపగురుస్తస్మాదుపగుప్తోఽగ్నిసంభవః॥7762॥*

పురుజిత్తునకు పుట్టినవాడు అరిష్టనేమి. అతని వలన జన్మించినవాడు శ్రుతాయువు. శ్రుతాయువు యొక్క తనయుడు సుపార్శ్వకుడు. అతని కుమారుడు చిత్రరథుడు. చిత్రరథుని తనూజుడు క్షేమధి (క్షేమాద్రి). అతడు మిథిలాపతులలో సుప్రసిద్ధుడు. క్షేమధి యొక్క పుత్రుడు సమరథుడు. అతని సుతుడు సత్యరథుడు. సత్యరథుని వలన జన్మించినవాడు ఉపగురువు. ఉపగురువు యొక్క తనయుడు ఉపగుప్తుడు. అతడు అగ్నిదేవుని అంశతో పుట్టెను.

*13.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*వస్వనంతోఽథ తత్పుత్రో యుయుధో యత్సుభాషణః|*

*శ్రుతస్తతో జయస్తస్మాద్విజయోఽస్మాదృతః సుతః॥7763॥*

*13.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*శునకస్తత్సుతో జజ్ఞే వీతహవ్యో ధృతిస్తతః|*

*బహులాశ్వో ధృతేస్తస్య కృతిరస్య మహావశీ॥7764॥*

ఉపగుప్తుని పుత్రుడు వస్వనంతుడు. అతని కుమారుడు యుయుధుడు. యుయుధుని సూనుడు సభాషణుడు. అతనికి పుట్టినవాడు శ్రుతుడు. శ్రుతుని సుతుడు జయుడు. జయుని కొడుకు విజయుడు. అతని తనయుడు ఋతుడు. ఋతుని సూనుడు శునకుడు. అతని తనయుడు వీతిహవ్యుడు (వీతహవ్యుడు). అతని పుత్రుడు ధృతి. ధృతి కుమారుడు బహులాశ్వుడు. బహులాశ్వుని తనూజుడు కృతి. అతని వలన *మహావశి* అనువాడు జన్మించెను.

*13.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*ఏతే వై మైథిలా రాజన్నాత్మవిద్యావిశారదాః|*

*యోగేశ్వరప్రసాదేన ద్వంద్వైర్ముక్తా గృహేష్వపి॥7765॥*

పరీక్షిన్మహారాజా! మిథిలానగరమును పరిపాలించిన ఈ రాజులు అందరును ఆత్మవిద్యయందు ఆరితేరినవారు (తత్త్వవేత్తలు). యోగేశ్వరుడైన భగవంతునియొక్క అనుగ్రహముచే గృహస్థులై ఉన్నప్పటికిని సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతులై మసలుకొనిరి.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే త్రయోదశోఽధ్యాయః (13)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పదమూడవ అధ్యాయము (13)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*117వ నామ మంత్రము*

*ఓం భక్త సౌభాగ్య దాయిన్యై నమః*

భక్తులకు తనతో ఐక్యము (సాయుజ్యము), ఇంద్రియ నిగ్రహము, సౌభాగ్య ద్రవ్యములు పొందు అదృష్టమును అనుగ్రహించు పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భక్తసౌభాగ్యదాయినీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం భక్త సౌభాగ్య దాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే సౌభాగ్యము, సిరిసంపదలు పొంది భౌతికజీవనము ఆనందమయముగాను, బ్రహ్మజ్ఞాన సంపదతో ఆత్మానందానుభూతిని పొంది తరించును.

*భక్తులు అనగా నాలుగు రకములవారు*

*ఆర్తులు* బాధలను తొలగింపమని భక్తితో పరమాత్మను వేడుకొనేవారు

*జిజ్ఞాసులు* పరమాత్మను గూర్చి తెలియగోరి సేవించువారు

*అర్థార్ధి* ధర్మార్థకామమోక్షములను (కోరికలు) కోరి భక్తితో సేవించువారు.

*జ్ఞానులు* కేవలం జ్ఞానముతో (నిష్కాములై) పరమాత్మను సేవించువారు.

జగన్మాత సౌభాగ్యదేవతా స్వరూపిణి. తన భక్తులను తనలో ఐక్యముచేసుకొని సాయుజ్యప్రాప్తిని కలుగజేయును.

పద్మపురాణమునందు చెప్పిన సౌభాగ్యాష్టకము అను ఎనిమిది సౌభాగ్యద్రవ్యములు లభింపజేయును. సౌభాగ్యద్రవ్యములనగా 1) ఇక్షువులు (చెఱకు), 2) తరురాజము (పారిజాతము), 3) నిష్పావములు, 4) జీలకర్ర, 5) ధాన్యములు (ధనియాలు, వడ్లు మొదలైనవి), 6) గోఘృతము గాని వెన్న గాని), 7) కౌసుంభపుష్పము, 8) లవణము - ఈ ఎనిమిది వస్తువులు ఉండుచోట సర్వసౌభాగ్యములు కలుగును.

తన భక్తులకు ఇంద్రియ నిగ్రహము కలుగజేయును. ఇంద్రియ నిగ్రహము వలన అరిషడ్వర్గములు (కామ, క్రోధ, లోభ,మోహ, మద, మాత్సర్యములు) నియంత్రణయందుండి విశేషమైన గౌరవము, వాక్సుద్ధి లభించును. *సు,భ,గ* అను అక్షరములతో ఏర్పడు *సుభగ* అను విశేషణమునే *సౌభాగ్యం* అందురు. *సు* అనగా మంచితనము, *భ* అనగా వైభవము, *గ* అనగా గమనము లేదా ప్రవర్తన. ఈ మూడు లక్షణములు సౌభాగ్యలక్షణములు.
పైన చెప్పిన నాలుగు రకముల భక్తులకూ కూడా జగన్మాత సౌభాగ్యముసు అనుగ్రహించును గనుక *సౌభాగ్యదాయినీ* అని నామముతో స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భక్తసౌభాగ్యదాయిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*694వ నామ మంత్రము*

*ఓం సాగరమేఖలాయై నమః*

సమస్త సృష్టియును తన విశ్వరూపమై, సాగరములన్నీ తన కటిసూత్రము (ఒడ్డాణముగా) ఒప్పు విరాడ్రూపిణి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సాగరమేఖలా* అను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం సాగరమేఖలాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని పూజించు సాధకుడు ఆ తల్లి కరుణచే సర్వాభీష్టసిద్ధిని పొంది ఆత్మానందానుభూతిని పొందగలడు.

జగన్మాత భూస్వరూపురాలు, విరాడ్రూపిణి. జగన్మాత విరాడ్రూపిణి అయితే ఆ తల్లికటిప్రదేశమే సమస్త సాగరసంపద ఉన్న భూలోకము. దుచే జగన్మాత కటిభాగము సముద్రములచే చుట్టబడియుండుటచే ఆ విరాడ్రూపిణికి *సాగరమేఖలా* అనగా సాగరములే జగన్మాతకు ఒడ్డాణమై ఒప్ఫుచున్నవి. దేవీభాగవతంలో జగన్మాత విరాడ్రూపము ఇలా వర్ణింపబడినది. అమ్మవారి శిరస్సు, సత్యలోకం. నయనములు - సూర్యచంద్రులు. కర్ణములు - దిక్కులు. కడగంటి చూపు - సృష్టి. పైపెదవి - లజ్జ. క్రింధి పెదవి - లోభము. ఉదరము - సముద్రము.

అటు వంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సాగర మేఖలాయై నమః* అని అనవలెను.
������������������������
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
������������������������
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
������������������������

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*118వ నామ మంత్రము*

*ఓం భక్తిప్రియాయై నమః*

తన సన్నిధిలో అత్యంత తాదాత్మ్యస్థితిని పొంది ఉండు భక్తులనిన మరియు అట్టి భక్తి యనిన ప్రియము కలిగియుండు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భక్తిప్రియా* అను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం భక్తిప్రియాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ పరమేశ్వరి అనుగ్రహముతో ఆ తల్లి వాత్సల్యమునకు, ప్రేమకు పాత్రుడై సర్వాభీష్ట సిద్ధినందుటతో బాటు, ఆత్మానందానుభూతితో తరించును.

ఈ నామ మంత్రము *భక్తిప్రియా* అని కొందరు *భక్తప్రియా* అని కొందరూ చదువుచుందురు. *భక్తిప్రియా* అంటే తన భక్తులయొక్క భక్తి అనియు, *భక్తప్రియా* అంటే పరమాత్మ సన్నిధిలో భక్తులు తాదాత్మ్యస్థితికిజేరియుండు *భక్తులు* అనియు సమన్వయించుకొనవచ్చును. రెండిటిలోని పరబ్రహ్మతత్త్వం ఒకటిగానే భావించవచ్చును.

భక్తులను నాలుగు రకములుగా తెలుసుకోవచ్చునని *భక్తసౌభాగ్యదాయినీ* అను 117వ నామ మంత్రము యొక్క వ్యాఖ్యానములో ప్రస్తావించడం జరిగియున్నది. అదే మరల ఇచ్చట చెప్పడం జరుగుతున్నది.

శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో భక్తులను *1) ఆర్తులు, 2) జిజ్ఞాసులు, 3) అర్థార్థులు, 4) జ్ఞానులు* అని నాలుగు విధములుగా చెప్పడం జరిగినది.

1) *ఆర్తి* తో గజేంద్రుడు, ద్రౌపది వంటివారు భగవంతుని ప్రార్థించారు.

2) *జిజ్ఞాస* తో ఉద్ధవుడు భగవంతుని ప్రార్థించాడు.

3) *అర్థార్తి* తో ధ్రువుడు భగవంతుని ప్రార్థించాడు.

4) *జ్ఞానము* తో ప్రహ్లాదుడు భగవంతుని ప్రార్థించాడు.

ఆ పరమాత్మ అనుగ్రహం పొందడానికి *నవవిధభక్తిమార్గం* గలదని శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో బమ్మెర పోతనామాత్యులవారు ప్రహ్లాదుడు చెప్పాడని ఇలా చెప్పారు

*మత్తేభ విక్రీడితము*

తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

*తాత్పర్యము*

రాక్షసరాజా! భక్తి మార్గాలు తొమ్మిది; అవి
1) *సఖ్యం,* 2) *శ్రవణం*, 3) *దాస్యం*, 4) *వందనం*, 5) *అర్చనం*, 6) *సేవనం*, 7) *ఆత్మనివేదనం*, 8) *కీర్తనం*, 9) *చింతనం*

ఈ నవ విధ భక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలను మనోవాక్కాయకర్మల (మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ, త్రికరణశుద్ధిగా) సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది.

శివపురాణంలో భక్తులు బాహ్యంగా గాని, అంతర్గతంగా గాని చేసే సేవలకు అనుగ్రహం ప్రసాదిస్తానని పరమేశ్వరుడు అన్నాడు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భక్తిప్రియాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*695వ నామ మంత్రము*

*ఓం దీక్షితాయై నమః*

సర్వమంత్రాత్మికగా, ఒక గురువుగా తన భక్తులకు బ్రహ్మజ్ఞానమును సంప్రాప్తింపజేయు పూర్ణదీక్షా స్వరూపిణిగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *దీక్షితా* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం దీక్షితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకునకు ఆ తల్లి కరుణతో అనంతమైన బ్రహ్మజ్ఞానసంపదలిచ్చి, నిత్యమును, సత్యమును అయిన ఆత్మానందమును సంప్రాప్తింపజేయును.

మూలమంత్రాత్మిక అయిన జగన్మాత పూర్ణదీక్షాస్వరూపిణి. పూర్ణదీక్షాపరులకు అన్ని మంత్రాలమీద అధికారం ఉంటుంది. *సర్వమంత్రస్వరూపిణీ* అని 204వ నామ మంత్రంలో అన్నాము. సప్తకోటి మహామంత్రస్వరూపిణి జగన్మాత అని భాస్కరరాయలువారు అని ఈ నామ మంత్రానికి భాష్యం చెప్పారు. ఆ జగన్మాత సర్వమంత్రస్వరూపిణి గనుకనే *పూర్ణదీక్షా స్వరూపిణి* అనియు, పూర్ణదీక్షాస్వరూపిణి గనుకనే *దీక్షతా* అని నామము కలిగియున్నది. పూర్ణదీక్షాస్వరూపిణి అయిన జగన్మాత గురువు రూపంలో శిష్యుడికి మంత్రదీక్ష ఇస్తుంది, ఆ శిష్యుని పాపములను పొగొడుతుంది గనుకనే జగన్మాత *దీక్షితా* అని అన్నాము. మంత్రోపదేశం అనేది సద్గురువు వద్ద తీసుకుంటే ఆ మంత్రం సిద్ధిస్తుంది. అందుకు సద్గురువును ఎన్నుకోవడమే ఒక ప్రధాన ప్రక్రియ. శ్రీవిద్యోపాసనకు దీక్ష అవసరం మరియు ఆ దీక్షవలన శిష్యుని శక్తి పెరుగుతుంది. సద్గురువు శిష్యుని తలపై చేయి ఉంచి దీక్షనివ్వడంతో గురువుయొక్క శక్తి ఆమేరకు తగ్గుతుంది. శిష్యుడు అంతటితో కృతార్థుడౌతాడు.

జగన్మాత తన భక్తులకు వారి అర్హతలననుసరించి అనుగ్రహించే దీక్షకలిగి యున్నది. అందుకే దేవతలు కోరినంతనే అసురుల సంహారానికి తన శక్తిసైన్యములతో కదలి అత్యంత మహిమాన్వితమైన కామేశ్వరాస్త్రము, మహాపాశుపతాస్త్రముల వంటి దివ్యాస్త్రములనుకూడా చేతబట్టి *దేవకార్యసముద్యతా* అని స్తుతింపబడినది. *శ్రీమహారాజ్ఞి* గా దేవతలకు రాజ్యములను ప్రసాదించి *రాజ్యదాయినీ* అయినది. వారికి అధికారములిచ్చి *రాజపీఠనివేశితనిజాశ్రితా* అయినది. ఒక తల్లి తన పసిబిడ్డకు ఏ సమయంలో శరీరానికి నూనిపెట్టాలో, ఎప్పుడు స్నానంచేయించాలో, ఎప్పుడు ఉగ్గు పట్టాలో, ఎప్పుడు స్తన్యమివ్వాలో ఎవరు చెపితే చేస్తుంది. ఆబిడ్డను సాకడంలో ఆ మాతృస్వరూపిణి ఒక దీక్షాస్వరూపిణి. అలాగే ఆ పరాత్పరి విశ్వంలోని సమస్తజీవజాలమునకు ఏమికావాలో, ఏ సమయంలో ఏమి అవసరమో, దుష్టశిక్షణ, శిష్టరక్షణకూ జగన్మాత యొక్క పరబ్రహ్మాత్మకమైన ఒక దీక్షయే కారణం. అందుకే ఆ పరమేశ్వరి *దీక్షితా* అనబడుచున్నది. తన భక్తులను కావడంలో దీక్షవహించిన తల్లి కనుకనే *దీక్షితా* యని స్తుతింప బడుచున్నది. జనహిత కార్యక్రమములు, ఆర్తజన పరాయణత్వ నిర్వహణ చేయువారికి దృఢదీక్షారూపిణిగా విరాజిల్లు తున్నది గనుకనే జగన్మాత *దీక్షితా* అని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం దీక్షితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*14.1 (ప్రథమ శ్లోకము)*

*అథాతః శ్రూయతాం రాజన్ వంశః సోమస్య పావనః|*

*యస్మిన్నైలాదయో భూపాః కీర్త్యంతే పుణ్యకీర్తయః॥7766॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! ఇంతవరకును సూర్యవంశ ప్రభువులను గూర్చి వివరించితిని. ఇక, పవిత్రమగు చంద్రవంశమునకు చెందిన మహారాజులను గురించి తెలిపెదను వినుము. ఈ వంశమునందు బలుడు (ఇలాదేవి కుమారుడు/ఇలా బుధుల పుత్రుడు) అనగా పురూరవుడు మొదలగు రాజులు పుణ్యపురుషులుగా ఖ్యాతివహించిరి.

*14.2 (రెండవ శ్లోకము)*

*సహస్రశిరసః పుంసో నాభిహ్రదసరోరుహాత్|*

*జాతస్యాసీత్సుతో ధాతురత్రిః పితృసమో గుణైః॥7767॥*

*14.3 (మూడవ శ్లోకము)*

*తస్య దృగ్భ్యోఽభవత్పుత్రః సోమోఽమృతమయః కిల|*

*విప్రౌషధ్యుడుగణానాం బ్రహ్మణా కల్పితః పతిః॥7768॥*

సహస్రశీర్షుడు (విరాట్ పురుషుడు) ఐన శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలము నుండి బ్రహ్మదేవుడు జన్మించెను. బ్రహ్మయొక్క కుమారుడు అత్రి. అతడు సద్గుణములచే తండ్రియంతటివాడు. ఆ అత్రి నేత్రముల నుండి చంద్రుడు జన్మించెను. అతడు అమృతకిరణుడు. అనగా అమృతము వలె చల్లని కిరణములు గలవాడు. బ్రహ్మదేవుడు ఆ చంద్రుని బ్రాహ్మణులకును, ఓషధులకును, నక్షత్రగణములకును అధిపతిని గావించెను.

*14.4 (నాలుగవ శ్లోకము)*

*సోఽయజద్రాజసూయేన విజిత్య భువనత్రయమ్|*

*పత్నీం బృహస్పతేర్దర్పాత్తారాం నామాఽహరద్బలాత్॥7769॥*

*14.5 (ఐదవ శ్లోకము)*

*యదా స దేవగురుణా యాచితోఽభీక్ష్ణశో మదాత్|*

*నాత్యజత్తత్కృతే జజ్ఞే సురదానవవిగ్రహః॥7770॥*

*14.6 (ఆరవ శ్లోకము)*

*శుక్రో బృహస్పతేర్ద్వేషాదగ్రహీత్సాసురోడుపమ్|*

*హరో గురుసుతం స్నేహాత్సర్వభూతగణావృతః॥7771॥*

*14.7 (ఏడవ శ్లోకము)*

*సర్వదేవగణోపేతో మహేంద్రో గురుమన్వయాత్|*

*సురాసురవినాశోఽభూత్సమరస్తారకామయః॥7772॥*

అతడు (చంద్రుడు) ముల్లోకములను జయించి రాజసూయ యాగమును ఒనర్చెను. అందువలన అతడు గర్వోన్మత్తుడై బృహస్పతి భార్యయగు తారను బలవంతముగా అపహరించెను. అంతట దేవతలకు గురువైన బృహస్పతి తన భార్యను తనకు అప్పగింపుమని పదేపదే కోరెను. కాని, గర్వాంధుడై యున్న చంద్రుడు ఆమెను అప్పగింపకుండెను. ఆ కారణమున దేవదానవుల మధ్య తగవు ఏర్పడెను. బృహస్పతి యందు వైరభావముతో ఉన్న శుక్రుడు తన అసురగణములతో గూడి చంద్రపక్షమున నిలిచెను. పరమశివుడు ఆచార్యుడైన అంగిరసుని యొక్క కుమారుడగు బృహస్పతిపైగల గౌరవభావముచే భూతగణములతో గూడి ఆయన పక్షము వహించెను. మహేంద్రుడు కూడ వివిధములగు దేవగణములతో గూడి తనకు గురువైన బృహస్పతి పక్షముననే నిలబడెను. తార కారణముగా ఆ ఇరుపక్షముల మధ్య ఘోరమైన సమరము జరిగి సురాసురుల వినాశము సంభవించెను.

*14.8 (ఎనిమిదవ శ్లోకము)*

*నివేదితోఽథాంగిరసా సోమం నిర్భర్త్స్య విశ్వకృత్|*

*తారాం స్వభర్త్రే ప్రాయచ్ఛదంతర్వత్నీమవైత్పతిః॥7773॥*

*14.9 (తొమ్మిదవ శ్లోకము)*

*త్యజ త్యజాశు దుష్ప్రజ్ఞే మత్క్షేత్రాదాహితం పరైః|*

*నాహం త్వాం భస్మసాత్కుర్యాం స్త్రియం సాంతానికః సతి॥7774॥*

అంగిరసుడు విజ్ఞాపన చేసిన పిమ్మట బ్రహ్మదేవుడు చంద్రుని మందలించెను. అంతట చంద్రుడు తారను ఆమె భర్తయగు బృహస్పతికి అప్పగించెను. అప్పటికే ఆమె గర్భవతిగా ఉన్నట్లు గమనించి, బృహస్పతి ఆమెతో ఇట్లు నుడివెను-"దుష్టురాలా! నా భార్యవగు నీయందు ఇతరులవలన గర్భము ఏర్పడినది. దానిని వెంటనే త్యజింపుము. అందులకు నీవు భయపడవలదు. నిన్ను ఏమియు చేయను. నిన్ను భస్మమొనర్పను. ఏలనస, నీవు స్త్రీవి. పైగా నాకును సంతానేచ్ఛగలదు.

*14.10 (పదియవ శ్లోకము)*

*తత్యాజ వ్రీడితా తారా కుమారం కనకప్రభమ్|*

*స్పృహామాంగిరసశ్చక్రే కుమారే సోమ ఏవ చ॥7775॥*

*14.11 (పదకొండవ శ్లోకము)*

*మమాయం న తవేత్యుచ్చైస్తస్మిన్ వివదమానయోః|*

*పప్రచ్ఛురృషయో దేవా నైవోచే వ్రీడితా తు సా॥7776॥*

అప్పుడు తార బంగారు కాంతులతో వెలుగొందుచున్న కుమారుని కనెను. జరిగిన దానికి ఆమె సిగ్గుపడి ఆ శిశువును త్యజించెను. కాన, ఆ చక్కని శిశువును చూచిన పిమ్మట బృహస్పతియు, చంద్రుడును అతనిపై మోహమును పొందిరి. అంతట ఇతడు 'నావాడు, నీవాడుకాదు' అని బృహస్పతియు, చంద్రుడును పరస్పరము వివాదముసకు దిగిరి. అంతట మునులు, దేవతలు 'ఈ బాలుడు ఎవరి సంతానము' అని తారను అడిగిరి. అందులకు ఆమె ఏమియు మాటాడక సిగ్గుతో తలవంచుకొనెను.

PVD Subrahmanyam చెప్పారు...

*14.12 (పండ్రెండవ శ్లోకము)*

*కుమారో మాతరం ప్రాహ కుపితోఽలీకలజ్జయా|*

*కిం న వోచస్యసద్వృత్తే ఆత్మావద్యం వదాశు మే॥7777॥*

పిమ్మట, ఆ కుమారుడు (ఆ శిశువు) కోపముగా తల్లితో ఇట్లనెను- "దుష్టురాలా! నీవు సిగ్గును నటించుచు ఏం మాట్లాడుటలేదు. మౌనమును వీడి నీవు నీ తప్పు పనిని గూర్చి నాకు వెంటనే తెలుపుము'".

*14.13 (పదమూడవ శ్లోకము)*

*బ్రహ్మా తాం రహ ఆహూయ సమప్రాక్షీచ్చ సాంత్వయన్|*

*సోమస్యేత్యాహ శనకైః సోమస్తం తావదగ్రహీత్॥7778॥*

పిదప, బ్రహ్మదేవుడు తల్లిని ఆక్షేపించుచున్న ఆ కుమారుని జూచి, రహస్యముగా (ఏకాంతముగా) తారను పిలిచి, ఊరడించుచు 'ఈ బాలుని తండ్రి ఎవరు? యథార్థమును తెలుపుము' అని అడిగెను. అప్ఫుడు తార సిగ్గుతో తిన్నగా 'చంద్రుడు' అని తెలిపెను. అనంతరము బ్రహ్మదేవుని అనుమతితో చంద్రుడు ఆ కుమారుని స్వీకరించెను.

*14.14 (పదునాలుగవ శ్లోకము)*

*తస్యాత్మయోనిరకృత బుధ ఇత్యభిధాం నృప|*

*బుద్ధ్యా గంభీరయా యేన పుత్రేణాపోడురాణ్ముదమ్॥7779॥*

రాజా! పిమ్మట బ్రహ్మదేవుడు ఆ శిశువుయొక్క బుద్ధి గాంభీర్యమును (చురుకుదనమును) గమనించి అతనికి *బుధుడు* అని నామకరణము చేసెను. అప్ఫుడు తన కుమారుని జూచి చంద్రుడు మిగుల సంతసించెను.

*14.15 (పదునైదవ శ్లోకము)*

*తతః పురూరవా జజ్ఞే ఇలాయాం య ఉదాహృతః|*

*తస్య రూపగుణౌదార్యశీలద్రవిణవిక్రమాన్॥7780॥*

*14.16 (పదహారవ శ్లోకము)*

*శ్రుత్వోర్వశీంద్రభవనే గీయమానాన్ సురర్షిణా|*

*తదంతికముపేయాయ దేవీ స్మరశరార్దితా॥7781॥*

*14.17 (పదిహేడవ శ్లోకము)*

*మిత్రావరుణయోః శాపాదాపన్నా నరలోకతామ్|*

*నిశమ్య పురుషశ్రేష్ఠం కందర్పమివ రూపిణమ్|*

*ధృతిం విష్టభ్య లలనా ఉపతస్థే తదంతికే॥7782॥*

పరీక్షిన్మహారాజా! ఆ బుధుని వలన ఇలాదేవి యందు పురూరవుడు జన్మించెను. ఈ వృత్తాంతమును గూర్చి ఇంతకుముందే నీకు తెలిపియుంటిని. ఆ పురూరవుని రూపవైభవమును, గణౌన్నత్యమును, ఔదార్యమును, ఉత్తమశీలమును, సంపదలను, బలపరాక్రమములను గూర్చి దేవర్షియగు నారదుడు ఇంద్రసభలో బహుధా ప్రశంసించెను. ఆ మాటలను వినినంతనే ఊర్వశి ఆ పురూరవునిపై మిగుల మరులుగొని, అతని చెంతకు చేరెను. ఇంతకు ముందే మిత్రావరుణులు 'మర్త్యలోకమున జన్మింపుము' అని ఊర్వశిని శపించియుండిరి. అది ఈ రూపమున సంభవించినది. చక్కని అందచందములతో మన్మథునివలె తేజరిల్లుచున్న ఆ పురుషశ్రేష్ఠుని (పురూరవుని) జూచినంతనే ఊర్వశి ధైర్యముతో అతనియొద్దకు చేరెను.

*14.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*స తాం విలోక్య నృపతిర్హర్షేణోత్ఫుల్లలోచనః|*

*ఉవాచ శ్లక్ష్ణయా వాచా దేవీం హృష్టతనూరుహః॥7783॥*

ఆ అందాల రాశిని చూచినంతనే పురూరవ మహారాజుయొక్క నేత్రములలో సంతోషము వెల్లివిరిసెను. శరీరము పులకించెను. వెంటనే అతడు ఆమెతో మధురముగా ఇట్లు వచించెను.

*రాజోవాచ*

*14.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*స్వాగతం తే వరారోహే ఆస్యతాం కరవామ కిమ్|*

*సంరమస్వ మయా సాకం రతిర్నౌ శాశ్వతీః సమాః॥7784॥*

*పురూరవుడు ఇట్లు పలికెను* "సుందరీ! నీకు స్వాగతము. ఆసీనురాలవు కమ్ము. నీకు ఎట్టి సేవలు ఒనర్పవలయును? నీవు నాతో తనివిదీర విహరింపుము. మన విహారక్రీడలు కలకాలము కొనసాగుగాక".

*ఉర్వశ్యువాచ*

*14.20 (ఇరువదియవ శ్లోకము)*

*కస్యాస్త్వయి న సజ్జేత మనో దృష్టిశ్చ సుందర|*

*యదంగాంతరమాసాద్య చ్యవతే హ రిరంసయా॥7785॥*

*14.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఏతావురణకౌ రాజన్ న్యాసౌ రక్షస్వ మానద|*

*సంరంస్యే భవతా సాకం శ్లాఘ్యః స్త్రీణాం వరః స్మృతః॥7786॥*

*14.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ఘృతం మే వీర భక్ష్యం స్యాన్నేక్షే త్వాన్యత్ర మైథునాత్|*

*వివాససం తత్తథేతి ప్రతిపేదే మహామనాః॥7787॥*

*అంతట ఊర్వశి ఇట్లనెను* "సౌందర్యనిధీ! నీ దివ్యాకారమును గాంచిన పిమ్మట ఏ స్త్రీ మనస్సు పరవశింపదు? ఏ తరుణి కనులలో ఆనందము పొంగి పొరలదు? నీతో క్రీడించుటకై తహతహపడుచు నీ బిగికౌగిలికి చేరిన ఏ స్త్రీ నీకు దూరమగును? మిక్కిలీ కీర్తిప్రతిష్ఠలుగల మహారాజా! రూపగుణ వైభవములచే ఒప్పెడి పురుషునే స్త్రీలు కోరుకొందురు. కనుక నీతో మనస్ఫూర్తిగా క్రీడించెదను. ఐతే, నాదొక ఒడంబడికకు నీవు కట్టుబడి యుండవలయును. నాకు ఎంతయు ప్రీతిపాత్రములైన ఈ రెండు గొర్రెపోతులను నీయొద్ద న్యాసముగా ఉంచెదను. వీటిని నీవు రక్షించుచుండవలెను. వీరుడా! నేను కేవలము ఘృతమునే (అమృతమునే) ఆహారముగా స్వీకరింతును. రతిక్రీడా సమయమున దప్ప, మఱి ఏ సమయమునందునను, నేను నిన్ను నగ్నముగా చూడను. ఈ నిబంధనలను నీవు ఉల్లంఘించినచో, నేను వెళ్ళిపోయెదను". మనస్వియైన పురూరవుడు అందులకు పూర్తిగా సమ్మతించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*696వ నామ మంత్రము*

*ఓం దైత్యశమన్యై నమః*

అధర్ములు, అవైదికులు, అజ్ఞానులు అయిన దైత్యులను, దైత్యభావనలు గల దుష్టులను తుదముట్టించి ధర్మసంస్థాపనమొనర్చిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *దైత్యశమనీ* అను ఐదు అక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం దైత్యశమన్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులు ఆ తల్లి కరుణచే వారిలో గల అరిషడ్వర్గములను దైత్యభావనలు తొలగి ఎడతెగని భక్తిభావనతో, నిష్కాములై, నిష్కపట హృదయంతో కేవలం జన్మరాహిత్యమైన మోక్షమే వారి భక్తికి గమ్యమని తెలిసి ఆత్మానందానుభూతితో తరింతురు.

లోక కంటకులైన రాక్షసులను ఎందరినో తుదముట్టించి ధర్మసంస్థాపనము చేసినది జగన్మాత.

కశ్యపమహామునికి దితియందు దైత్యులు, అదితికియందు దేవతలు, దనువునందు దానవులు కుమారులుగా కలిగిరి. వీరందరూ ఒక మహాముని సంతానమే. శక్తి, యుక్తి, పరాక్రమములలో అందరూ సమానమైసవారే. కాని దేవతలు కేవలం ధర్మమార్గము నందు నడచువారు. కాని మిగిలిన వారు అధర్మవర్తనులు. అవైదికులు. అరిషడ్వర్గములచే జ్ఞానము కమ్ముకొనిపోయి, అజ్ఞానులుగా మెలగుతూ దైవభక్తులను, స్త్రీలను, పసివారిని హింసించుటయే పనిగా ఉన్నవారు. వారిలో కూడా భక్తితత్పరులే కాని వారి భక్తి క్షుద్ర మాంత్రికుని తంత్రజ్ఞానము వంటిది. కఠోరమైన తపస్సు చేసి కోరరాని వరములు కోరుకొని, దేవతలమీద దండెత్తారు. మహామునుల తపస్సులు భగ్నం కావించారు. స్త్రీలను చెరబట్టారు. లోకకంటకులైపోయారు. చివరకు ధర్మపరులైన దేవతలు జగన్మాతను ఆశ్రయించగా జగన్మాత *దేవకార్యసముద్యత* గా దీక్షతో వారిపై తన శక్తిసైన్యాన్ని పంపింది *(భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్వితా)* తన అంశనుండి బాలాత్రిపురసుందరిని సమరంలోనికి *(భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమనందితా)* పంపినది. సంపత్కరీదేవి *(సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా)*, ఆశ్వారూఢాదేవి *(అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభి రావృతా)*, జ్వాలామాలినీ *(జ్వాలామలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా)*, నిత్యాదేవతలు *(నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా)*, శ్యామలాదేవి *(మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా)*, వారాహి *(విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా)*, మహాగణేశుడు *(మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా)*- వీరందరూ దైత్యసంహారంలో జగన్మాతకు సహాయపడ్డారు. జగన్మాత శ్రీమన్నారాయణుని పది అవతారములను తన చేతి వ్రేళ్ళ గోళ్ళనుండి సృజించి దైత్యసంహారములో నారాయణుని సహాయము కూడా స్వీకరించినది *(కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః)*. జగన్మాత తానే రణరంగమున దిగి రాక్షసుల అస్త్రములకు మంత్రయుక్తమైన ప్రత్యస్త్రములు వేసి తన పరాక్రమమును చూపించి దైత్యులను గడగడలాడించినది *(భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ)*. మహాపాశుపతాస్త్రముతో రాక్షస సైన్యమును భస్మీపటలము కావించినది *(మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా)*. రాక్షసులను, వారి స్థావరములను సమూలంగా కామేశ్వరాస్త్రముతో దగ్ధముచేసినది *(కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా)*.
ఆ విధముగా దైత్యులను తుదముట్టించి *దేవకార్యసముద్యతా* యని బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవతలచే స్తుతింపబడినది *(బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా)*

PVD Subrahmanyam చెప్పారు...

జగన్మాత దుష్టశిష్టణ నిమిత్తమై నవదుర్గలుగా అవతరించినది.

1. *శైలపుత్రి*

సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి.

2. *బ్రహ్మచారిణి*

*బ్రహ్మచారిణి* యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది. కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.

3. *చంద్రఘంట*

ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు *చంద్రఘంట* యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.

ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.

4. *కూష్మాండ*

దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి *కూష్మాండ* అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము లోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.

*అష్టభుజాదేవి* అని కూడా అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లు చుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.

భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.

5. *స్కందమాత*

కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో ఐదవ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, *పద్మాసన* యనబడు ఈమెయు సింహవాహనయే.

స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.

PVD Subrahmanyam చెప్పారు...

6. *కాత్యాయని*

*కాత్యాయనీ మాత* బాధ్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులములోని గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.

ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.

7. *కాళరాత్రి*

*కాళరాత్రి* శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.

కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను *శుభంకరి* అనియు అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.

కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.

8. *మహాగౌరి*

అష్టవర్షా భవేద్గౌరీ - *మహాగౌరి* అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును.ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము.

పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు *మహాగౌరి* యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును.

9. *సిద్ధిధాత్రి*

సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.

ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.

ఇంకను జగన్మాత దుష్టశిక్షణకు శిష్టరక్షణకు ఎన్నో రూపాలలో అవతరించి దైత్యులను, దైత్యభావాలను నాశనమొనర్చి *దైత్యశమని* యని నామ ప్రసిద్ధమైనది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం దైత్యశమన్యై నమః* అని అనవలెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*119వ నామ మంత్రము*

*ఓం భక్తిగమ్యాయై నమః*

నిష్కామమైన, నిష్కల్మషమైన భక్తికి గమ్యము తాను తప్ప అన్యమైనదేదీ కాదు అని అనిపించు జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భక్తిగమ్యా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భక్తిగమ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు తనలోని భక్తికి గమ్యము జగన్మాత పాదపద్మములు, ఆ పాదపద్మములవద్ద లభించు బ్రహ్మానందము దక్క అన్యమేదీ లేదని భావించి తరించును.

అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసిస్తే జగన్మాత ప్రత్యక్షమవుతుంది. బ్రహ్మదేవుడు తాను సృష్టించిన ఇంద్రియములు జగత్తుసు చూడడానికే గాని పరమాత్మను చూడడానికి కాదు. కాని ఉపాసకుడు తన భక్తికి గమ్యం కేవలం జన్మరాహిత్యమైన మోక్షము అని గ్రహించి, తన ఇంద్రియములను జగత్తు నుండి మళ్ళించి,అంతర్ముఖుడై పరమాత్మను కనుగొనుచున్నాడు. స్మృతి కూడా యోగులు పరమాత్మను వారి యోగశక్తిచే పరమాత్మను చూచుచున్నారని చెప్పుచున్నది. బ్రహ్మసూత్రము కూడా అవ్యక్తమయిన బ్రహ్మము కూడా భక్తిచే ప్రత్యక్షము చేయగలగ వచ్చని చెప్పినది. ప్రహ్లాదుడు చెప్పిన నవవిధ భక్తిమార్గములలో పరమాత్మను చేరడానికి ఏదైనా ఒకటే. కాని ఆ భక్తి నిష్కామమైనది, నిష్కపటమైనది ఐతే ఆ భక్తుడు చతుర్విధ భక్తులలో *జ్ఞానుల* కోవకు చెందుతాడు. భక్తులలో ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్ధులు అను ఈ భక్తులు నిష్కపటులు కావచ్చేమోగాని, నిష్కాములు మాత్రం గాదు. అప్పులు బాధలు తీరాలని, ఆస్తితగాదాలు కొలిక్కిరావాలని, ఎన్నికలలో గెలవాలని మ్రొక్కుకుని తిరుమల వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి, హుండిలో కానుకలు వేసేసి వచ్చేస్తారు. మళ్ళీ తరువాత ఇంకో అర్జీతో వెళతారు. కాని అన్నమాచార్యులవారి భక్తి అలాంటి దికాదు. కేవలం పరమాత్మ సాయుజ్యమే కోరుకున్నాడు. ఎన్నోవేల కీర్తనలు వ్రాశాడు. పరబ్రహ్మమును వివరించాడు. ఇక భక్తి అనేది వ్యాపారం కాదు. భక్తి అనే పెట్టుబడికి, కోరికలు తీరడం అనేది ఆ పెట్టుబడికి లాభం కాకూడదు. భక్తికి గమ్యము పరమాత్మయే కావాలి. నిష్కపటంగా, నిష్కామంగా జగన్మాతను ప్రార్థిస్తే ఆ తల్లి భక్తికి తానే గమ్య మనియు, గమ్యస్థానము కేవలం ముక్తి, పునర్జన్మ రాహిత్యమైన మోక్షము మాత్రమే అని తెలియజేస్తుంది. సాధకుడు మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతంచేసి, సుషుమ్నామార్గంలో పయనింపజేస్తూ, గ్రంథిత్రయమును ఛేదింపజేసి, షట్చక్రముల కావలగల సహస్రారంలో సుధాసాగరం చేర్చితే అక్కడ ఆ కుండలినీ శక్తి కురిపించిస అమృతధారలలో సాధకుడు ఓలలాడి, శివకామేశ్వరిల ఐక్యాన్ని దర్శించి అంతటితో అదే చాలంటాడనేది *భక్తిగమ్యా* అను నామానికి అసలైన అర్థం. అంతేగాని సహస్రారంలో సుధాసాగరంలో కాంచనరాశుల కోసంకాదు, రత్నఖచితమైన ఆభరణముల కోసంకాదు, ఆకాశమునంటే విలాసవంతమైన భవనములు, రంభా ఊర్వశిలను మించు రమణీలలామలతో రాసక్రీడలు కాదు. కేవలం బ్రహ్మజ్ఞాన సంపద, జన్మరాహిత్యమైన మోక్షమే సాధకుని లక్ష్యమని సమయాచారం తెలిజేస్తోంది. మూలాధారం నుండి బయలుదేరిన సాధన సహస్రారంలో, సుధాసాగరం చేరిన తరువాత అమృతధారలతో తడిసిముద్దయి ఆ బ్రహ్మానందమును అనుభవించుటయే *భక్తిగమ్యా* అను నామ మంత్రములో ఉన్న భావమని గ్రహింపదగును.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భక్తిగమ్యాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*14.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*అహో రూపమహో భావో నరలోకవిమోహనమ్|*

*కో న సేవేత మనుజో దేవీం త్వాం స్వయమాగతామ్॥7788॥*

పిమ్మట అతడు ఊర్వశి ఇట్లనెను - "దేవీ! నీ సౌందర్యము అత్యద్భుతము. నీ భావములు అపూర్వములు (అలౌకికములు). ఇవి పురుషులను పారవశ్యములో ముంచెత్తును. అట్టి నీవు స్వయముగా కోరుకొని వచ్చినపుడు నిన్ను ఏ పురుషులు సేవింపరు?"

*14.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*తయా స పురుషశ్రేష్ఠో రమయంత్యా యథార్హతః|*

*రేమే సురవిహారేషు కామం చైత్రరథాదిషు॥7789॥*

*14.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*రమమాణస్తయా దేవ్యా పద్మకింజల్కగంధయా|*

*తన్ముఖామోదముషితో ముముదేఽహర్గణాన్ బహూన్॥7790॥*

ఆ పురూరవమహారాజు అతిలోకసుందరియైన ఊర్వశితో గూడి దివ్యములైన చైైత్రరథము (కుబేరుని ఉద్యానవనము) నందును, నందనవనము (ఇంద్రుని వనము) నందలి పారిజాతవృక్ష చ్ఛాయలయందును యథేచ్ఛగా కామశాస్త్రరీతులలో క్రీడించుచు విహరించెను. ఊర్వశి తనువు పద్మకేసరముల సువాసనలతో గుబాళించుచుండెను. ఆ మహారాజు ఆ సుందరితో క్రీడించుచు, ఆమె ముఖపరిమళములకు ముగ్ధుడగుచు పారవశ్యముతో దినముల కొలది ఆమెతో గడపెను.

*14.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*అపశ్యన్నుర్వశీమింద్రో గంధర్వాన్ సమచోదయత్|*

*ఉర్వశీరహితం మహ్యమాస్థానం నాతిశోభతే॥7791॥*

*14.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*తే ఉపేత్య మహారాత్రే తమసి ప్రత్యుపస్థితే|*

*ఉర్వశ్యా ఉరణౌ జహ్రుర్న్యస్తౌ రాజని జాయయా॥7792॥*

ఇంద్రుడు తన సభలో ఊర్వశి లేకుండుటను గమనించెను. వెంటనే ఆ మహేంద్రుడు 'ఊర్వశి లేకుండుటచే నా సభ వెలవెలబోవుచున్నది. వెంటనే వెదకి ఆమెను తీసికొనిరండు' అని గంధర్వులను పంపెను. వెంటనే గంధర్వులు అటనుండి బయలుదేరి, గాడాంధకారముతో నిండియున్న అర్ధరాత్రివేళ, ఊర్వశీపురూరవుల ఏకాంత మందిరము కడకు చేరిరి. వారు ఆ దివ్యభామినిచే ఆ మహారాజు దగ్గర న్యాసముగా ఉంచవలసిన గొర్రెపోతులను అపహరించిరి.

*14.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*నిశమ్యాక్రందితం దేవీ పుత్రయోర్నీయమానయోః|*

*హతాస్మ్యహం కునాథేన నపుంసా వీరమానినా॥7793॥*

*14.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*యద్విశ్రంభాదహం నష్టా హృతాపత్యా చ దస్యుభిః|*

*యః శేతే నిశి సంత్రస్తో యథా నారీ దివా పుమాన్॥7794॥*

అంతట ఊర్వశిచే పుత్రులతో సమానముగా పెంచుకొనబడిన ఆ మేషములను గంధర్వులు దొంగిలించుకొని పోవుచుండుటచే, అవి బిగ్గరగా ఆక్రందించెను. అప్పుడు ఆమె (ఊర్వశి) వాటి అరుపులను విని ఎంతయు ఆందోళనకు గురియయ్యెను. పిమ్మట ఆమె 'ఈ పిరికివానిని భర్తనుగా జేసికొని నేను మోసపోయితిని. ఇతడు తనను 'వీరుడుగా' భావించుకొనుచున్నాడుగాని, పూర్తిగా అసమర్థుడు. నా మేషములను గూడ రక్షించలేకపోయెను. ఇతని నమ్ముకొని నేను మిగుల నష్టపోయితిని. దొంగలు నా పిల్లలను (గొర్రెపోతులను) అపహరించుకొనిపోయిరి. ఇతడు పగటివేళ పురుషునివలె ప్రవర్తించును. కాని, రాత్రి సమయమున స్త్రీవలె భయముతో నిద్రించుచుండును' అని గగ్గోలు పెట్టెను.

*14.30 (ముప్పదియవ శ్లోకము)*

*ఇతి వాక్సాయకైర్విద్ధః ప్రతోత్త్రైరివ కుంజరః |*

*నిశి నిస్త్రింశమాదాయ వివస్త్రోఽభ్యద్రవద్రుషా॥7795॥*

ఈ విధముగా ఊర్వశి బలమైన అంకుశముచే ఏనుగునువలె పదునైన తన వాగ్బాణములచే పురూరవుని హృదయమును గాయపఱచెను. వెంటనే అతడే కోపముతో ఒక ఖడ్గమును చేబూని, నగ్నముగనే ఆ రాత్రివేళ పరుగెత్తెను.

*14.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*తే విసృజ్యోరణౌ తత్ర వ్యద్యోతంత స్మ విద్యుతః|*

*ఆదాయ మేషావాయాంతం నగ్నమైక్షత సా పతిమ్॥7796॥*

అంతట ఆ గంధర్వులు ఆ మేషములను అక్కడనే విడిచిపెట్టిరి. అప్పుడు వారి దేహకాంతులు మెఱపుతీగవలె తళుక్కున మెఱయుటతో ఆ గొర్రెపోతులను తీసికొనివచ్చుచు నగ్నముగా నున్న తన పతిని ఊర్వశి చూచెను. పురూరవుడు మాట తప్పిన వాడగుటతో ఊర్వశి ఆ మహారాజును విడిచిపెట్టి వెళ్ళిపోయెను.

*14.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*ఐలోఽపి శయనే జాయామపశ్యన్ విమనా ఇవ|*

*తచ్చిత్తో విహ్వలః శోచన్ బభ్రామోన్మత్తవన్మహీమ్॥7797॥*

పురూరవుడు (ఐలుడు) తిరిగివచ్చి చూచినంతనే తన శయ్యపై ఊర్వశి కనబడకపోవుటతో అతడు ఎంతయో దుఃఖమునకు లోనయ్యెను. ఆ సుందరినే తన సర్వస్వముగా భావించుచుండుటతో ఈ సంఘటనవలన అతని మనస్సు చలించెను. ఆ దెబ్బతో అతడు విహ్వలుడైయ్యెను. పట్టరాని దుఃఖముతో అతడు ఒక ఉన్మత్తునివలె అటునిటు తిరుగసాగెను.

PVD Subrahmanyam చెప్పారు...

*14.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*స తాం వీక్ష్య కురుక్షేత్రే సరస్వత్యాం చ తత్సఖీః|*

*పంచ ప్రహృష్టవదనాః ప్రాహ సూక్తం పురూరవాః॥7798॥*

ఇట్లు తిరుగుచూ ఒకనాడు ఆ పురూరవుడు కురుక్షేత్రమునందలి సరస్వతీ నదీ తీరమునకు చేరెను. అచట అతడు ఐదుగురు చెలికత్తెలతో కేరింతలు కొట్టుచు విహరించుచున్న ఊర్వశిని చూచెను. వెంటనే ఆయనకు ప్రాణములు లేచివచ్చినట్లయ్యెను. అప్పుడు పురూరవుడు ప్రసన్నవదనుడై ఊర్వశితో ప్రియముగా ఇట్లు పలికెను.

*14.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*అహో జాయే తిష్ఠ తిష్ఠ ఘోరే న త్యక్తుమర్హసి|*

*మాం త్వమద్యాప్యనిర్వృత్య వచాంసి కృణవావహై॥7799॥*

*14.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*సుదేహోఽయం పతత్యత్ర దేవి దూరం హృతస్త్వయా|*

*ఖాదంత్యేనం వృకా గృధ్రాస్త్వత్ప్రసాదస్య నాస్పదం॥7800॥*

"ప్రియురాలా! ఆగుము. ఆగుము. తీరని దుఃఖమున ముంచి (ఒంటరివానిని చేసి) నన్ను ఇట్లు విడిచిపెట్టుట న్యాయముగాదు. ఇంకను (ఏకాంత) సరససల్లాపములతో మనకు తనివితీరలేదు. రమ్ము. ముద్ధుమురిపెములు తీరునట్లుగా మనము ముచ్చటించుకొందము. దేవీ! నా ఈ కోమలదేహమును త్రోసిరాజని వచ్చితివి. నీవు నన్ను చేరదీయనిచో,ఇక నా ప్రాణములు నిలువవు (నా దేహము ఇక్కడనే పడిపోవును). అప్పుడు ఈ దేహము తోడేళ్ళు, గృధ్రములు మొదలగువాటి పాలగును. కనుక నేను (ఈ దేహము) నీ అనుగ్రహమునకు దూరముకారాదు.

*ఉర్వశ్యువాచ*

*14.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*మా మృథాః పురుషోఽసి త్వం మా స్మ త్వాద్యుర్వృకా ఇమే|*

*క్వాపి సఖ్యం న వై స్త్రీణాం వృకాణాం హృదయం యథా॥7801॥*

*ఊర్వశి పలికెను* "పురూరవా! నీవు పురుషుడవు. అధైర్యపడవలదు. నీవు అసువులను కోల్పోవవలదు. నీ దేహమును ఈ తోడేళ్ళు తినివేయజాలవు. స్త్రీలయొక్క చెలిమి స్థిరముగా ఉండునది కాదు. వారి హృదయము తోడేళ్ళకువలె చంచలమైనది.

*14.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*స్త్రియో హ్యకరుణాః క్రూరా దుర్మర్షాః ప్రియసాహసాః|*

*ఘ్నంత్యల్పార్థేఽపి విశ్రబ్ధం పతిం భ్రాతరమప్యుత॥7802॥*

"ఆర్యా! స్త్రీలు నిర్దయులు, క్రూరత్వము వారికి సహజము. వారు చిన్న విషయమునకు గూడ చిందులు వేయుదురు (కినుక వహింతురు). స్వసుఖములకై సాహసములకు ఒడిగట్టుదురు. స్వల్పమైన లాభము కొఱకును తనను నమ్మిన పతిని, సోదరుని గూడ చంపివేయుటకు వెనుకాడరు.

*14.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*విధాయాలీకవిశ్రంభమజ్ఞేషు త్యక్తసౌహృదాః|*

*నవం నవమభీప్సంత్యః పుంశ్చల్యః స్వైరవృత్తయః॥7803॥*

జారిణుల హృదయములయందు నిజమైన ప్రేమకు చోటు ఉండదు. వారు తమ స్వభావమును ఎఱుగని అమాయకులయెడ కపట ప్రేమను ఒలకబోయుచు, వారిలో విశ్వాసమును పాదుకొలుపుదురు. వారి ప్రవర్తన విశృంఖలమైనది. వారు ఎప్పటికప్పుడు క్రొత్తవారిని కోరుకొనుచుందురు. కావున నా చెలిమిని (నన్ను) మరచిపొమ్ము.

*14.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*సంవత్సరాంతే హి భవానేకరాత్రం మయేశ్వర|*

*వత్స్యత్యపత్యాని చ తే భవిష్యంత్యపరాణి భోః॥7804॥*

పురూరవ నరేంద్రా! నీవు మహారాజువు. దిగులు పడవలదు. సంవత్సరమునకు ఒక పర్యాయము నిన్ను చేరుచుందును. ఒక రాత్రి నీవు నాతో గడపగలవు. ఆ విధముగా నీకు ఇంకను సంతానము కలుగును".

*14.40 (నలుబదియవ శ్లోకము)*

*అంతర్వత్నీముపాలక్ష్య దేవీం స ప్రయయౌ పురమ్*

*పునస్తత్ర గతోఽబ్దాంతే ఉర్వశీం వీరమాతరమ్॥7805॥*

*14.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*ఉపలభ్య ముదా యుక్తః సమువాస తయా నిశామ్|*

*అథైనముర్వశీ ప్రాహ కృపణం విరహాతురమ్॥7806॥*

అంతట ఊర్వశి గర్భవతిగా ఉన్న విషయమును గమనించి, పురూరవుడు తన పురమునకు వెళ్ళిపోయెను. మరల ఆ ఊర్వశి సంవత్సరాంతమునకు వీరపుత్రునితో గూడి ఆయన కడకు తిరిగివచ్చెను. ఆమె మరల తనను చేరినందులకు పురూరవుడు ఎంతయు సంతసించెను. ఆ రాత్రి అంతయును అతడు ఆమెతో గడపెను. తెల్లవారిన పిమ్మట ఆమె వెళ్ళిపోవుటకు సిద్ధపడుచుండగా అతడు మిగుల ఖిన్నుడాయెను. అప్పుడు ఊర్వశి అతని దైన్యస్థితిని చూచి ఇట్లనెను-

*697వ నామ మంత్రము*

*ఓం సర్వలోక వశంకర్యై నమః*

సమస్త లోకాలను తన వశమందుంచుకొని, చతుర్దశభువనములలోని సర్వప్రాణులను తన భక్తుల శములో ఉంచు పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సర్వలోకవశంకరీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సర్వలోక వశంకర్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ అఖిలాండేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆరాధనా సిద్ధి లభించి ఆ భక్తులను పీడించు భూతప్రేతపిశాచాదులు భయకంపితమై వారికి వశమగును (బంధింపబడతాయి). అలాగే తమ ధర్మబద్ధమైన కోర్కెలకు గ్రహశక్తులు అనుకూలించి సర్వాభీష్టసిద్ధికి మార్గమును సుగమంచేస్తాయి.

సృష్టియంతయూ జగన్మాత వశమైయుండును. జగన్మాత అదుపు, ఆజ్ఞలకు లోనైయుండును. తన భక్తులకు వారి ధర్మబద్ధమైన కోర్కెలకనుగుణంగా సృష్టిలోని ఆయాశక్తులను జగన్మాత వారి వశంలో ఉంచి సర్వాభీష్టసిద్ధిని కలుగజేయును.

చతుర్దశ భువనములలోని జీవులను (శక్తులను) తన ఉపాసకులకు (భక్తులకు) వారి వారి దీక్షాసామర్థ్యముననుసరించి వశముచేయును.

జగన్మాతను ఆరాధించు సాధకుడు ముల్లోకాలను సమ్మోహనంలో ముంచి తనకు కావలసినది (ధర్మబద్ధమైనది) రాబట్టుకుంటాడు.

జ్ఞానార్థి జ్ఞానశక్తిని, ధనార్థి ధనపతి అయిన కుబేరుని, పాడిపంటలకు వరుణుని, వాయుప్రకంపనలు లేకుండా ప్రశాంతమైన వాయుప్రసారమునకు వాయుదేవుని, నిర్విఘ్నతకు విఘ్నేశ్వరుని, అకాలమృత్యు నివారణమునకు మృత్యుంజయుని జగన్మాత మనకు అనుగ్రహిస్తుంది.

PVD Subrahmanyam చెప్పారు...

అత్యంత భక్తి ప్రపత్తులతో ఖడ్గమాలా స్తోత్ర పఠనం కారణంగా బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మిలు (అష్టమాతృకలు), అణిమ,లఘిమ, గరిమా, మహిమా, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, భుక్తి, ఇచ్ఛా, ప్రాకామ్య మొదలైన సిద్ధులు వశమౌతాయి. ఇంకను శ్రీచక్ర నవావరణాధి దేవతలు మనభక్తికి వశమై శుభములు చేకూర్చుతారు.

సందర్భం వచ్చినది గనుక సిద్ధులగురుంచి పరిశీలిద్ధాము.

*అష్ట సిద్ధులు*

*అణిమ*– అతి చిన్న వాడిగా మారిపోవడం

*మహిమ* – పెద్ద రూపం పొందడం

*గరిమ* – బరువుగా మారడం

*లఘిమ*– తేలికగా మారిపోవడం

*ప్రాప్తి* - ఇంద్రియాల అధిష్ఠాన దేవతల్ని దర్శించడం, ఏదౖైెనా ఎక్కడైనా పొందగలగడం

*ప్రాకామ్య* – కోరుకున్న పదార్థాల్ని దర్శించి అనుభవించే సామర్థ్యం పొందడం

*ఈశిత్వ* – జ్ఞాన వీర్యాదుల ప్రకోప శక్తి, సృష్టిపై ఆధిపత్య శక్తి

*వశిత్వ* – విషయ భోగాల నుంచి రక్తిని పొందడం, అన్నిటిపై ముఖ్యంగా పంచ భూతాలపై నియంత్రణ
కామావసాయత- సమస్త కోరికల ఉపశమనం

ఈ అష్ట సిద్ధులను పురాణ పురుషులు ప్రదర్శించారు.
*అణిమా* సిద్ధిని హనుమంతుడు సీతాన్వేషణకు లంకలో ప్రవేశించేటపుడు చిన్న వాడిగామారి ప్రదర్శించాడు.

*మహిమా* సిద్ధిని హను మంతుడు సముద్రోల్లంఘన సమయంలో ప్రదర్శించాడు. ఇక సురస నోరు తెరిచినపుడు పెద్దవాడుగా మారి ఒక్క సారిగా చిన్నవాడిగా మారి అణిమా మహిమా సిద్ధుల్ని ఒక దాని వెంట ఒకటి ప్రదర్శిం చాడు. ఇంకా ఎన్నో చోట్ల ఆయన కాయాన్ని పెంచ డం కనిపిస్తుంది.

ఇక వామనావతారంలో విష్ణువు మూడడు గులతో భూమ్యా కాశాలను ఆవరించిన పుడు కూడా ఇదే విధంగా పెరిగాడు.
*గరిమా* సిద్ధిని కృష్ణుడు చిన్నతనంలో తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకు పోవడానికి వచ్చినపుడు అతనితో బాటు పైకెగిరి వాడి భుజాల మీద కూర్చుని బరువుగా మారడంతో వాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వాడిని కృష్ణుడు చంపివేశాడు.

భీముడు సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు వెళ్లినపుడు హనుమంతుడుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మార్చాడు.

*లఘిమా* అంటే తేలికగా అయిపో వడం. ఆకాశగమనం వంటివి కూడా దీనితో అనుబంధంగా వచ్చే శక్తులని చెబుతారు.

ఈ సిద్ధుల ప్రదర్శన మనకు రామాయణ, భాగవతాదుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది.
ఒక్క సిద్ధి సరైన గురువు వద్ద పొండానికే 40 సంవత్సరాలు పడుతుందని చెబుతారు.

*దీనికి సంబందించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆది శంకరులకు ఒక పర్యాయం ఒక సిద్ధుడు తారసపడ్డాడు. తనకు ఉన్న ఆకాశ గమన విద్యను ఆయన ముందు ప్రర్శించాడు. అది సాధించేందుకు ఎంత కాలం పట్టిందని ఆయన అడిగారు. 40 ఏళ్లు పట్టిందని చెప్పాడు.*
*ఆ విద్య పొందేందుకు నీ జీవితంలో 40 ఏళ్లు ఖర్చు పెట్టావు. ఏ సత్పు రుషుడిని దూషించినా కాకివై పుట్టి పుట్టుకతోనే ఆకాశగమనం సాధించేవాడివి కదా అని ఆయన ఎద్దేవా చేసినట్టు చెబుతారు😁😁😁*
సిద్ధులు సాధించడం అనవసరమని, అందుకు జీవితం లో అంత కాలం వృధా చేయకుండా జగన్మాత అనుగ్రహం వల్ల ఉత్తమ గతులు పొందితే బాగుండుననేది ఆయన ఉద్దేశం.

కాని జగన్మాతను ఆరాధిస్తే మనకు ఏవి అవసరమో, ఏ శక్తులు వశంచేస్తే మనకు ఉపయోగము ఉంటుందో, మన దీక్షా సామర్థ్యం ఎంత ఉందో ఆ మేరకు ఆతల్లి అనుగ్రహిస్తుంది. ఏ కోర్కె అయినా ధర్మబద్ధంగా ఉండాలి.

అటు వంటి సర్వలోకవశంకరి అయిన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సర్వలోకవశంకర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*120వ నామ మంత్రము*

*ఓం భక్తివశ్యాయై నమః*

రాగద్వేషములకు అతీతముగా అన్ని ప్రాణులలోను భగవంతుని చూచుటయే పరాకాష్ఠకు చేరిన భక్తి అయితే,అటువంటి భక్తికి వశమగునట్టి జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భక్తివశ్యా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భక్తివశ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిపరవశముతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుని భక్తికి ప్రసన్నయైన ఆ కరుణామయి అయిన జగన్మాత ఆ సాధకుని భక్తికి వశమై అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదను అనుగ్రహించి జన్మరాహిత్యమైన ముక్తిని ప్రసాదించును.

ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్ధులు, జ్ఞానులు అను చతుర్విధభక్తులు నవవిధభక్తిమార్గములలో ఏమార్గమునందైనను అత్యంత భక్తిపారవశ్యముతో ఆరాధించుచూ, ఆ పరమేశ్వరిని సకల ప్రాణులలోను చూడగలిగినచో ఆ భక్తి పరాకాష్ఠకు చేరినదని అర్థము. అంత భక్తితత్పరుడైన ఆ సాధకుని భక్తికి పరవశించి ఆ సాధకునికి పునర్జన్మ రాహిత్యమైన ముక్తిని ప్రసాదించును.

కఠోర యోగ సాధనలో సాధకుడు మూలాధారమందు నిద్రావస్థలో నున్న కుండలినీ శక్తిని జాగృతము చేసి, సుషుమ్నా మార్గముద్వారా పయనింపజేసి, బ్రహ్మవిష్ణురుద్రగ్రంథులను ఛేదింపజేస్తూ, షట్చక్రములను వివిధ స్థాయిలలో ఆరాధిస్తూ, కుండలినీ శక్తిని సహస్రారమునకు చేర్చగా, సహస్రారంలోని సుధాసాగరంలో అడుగిడిన కుండలినీ శక్తి తన అగ్నితత్త్వముతో, సుధాసాగరంలోని చల్లదనమునకు ఘనస్థితిలోనున్న అమృతమును కరిగించగా, ఆ అమృతధారలు సాధకుని నాడీ మండలముపై వర్షించి బ్రహ్మానందమును పొందిన సాధకుడు తనలోని అజ్ఞాన తిమిరములు విచ్ఛిన్నమవగా పరబ్రహ్మమంటే ఏమిటో తెలియడం జరుగుతుంది. ఇదే కదా జ్ఞానుల భక్తిపారవశ్యత. ఆ భక్తి పారవశ్యతకు పరబ్రహ్మ స్వరూపిణి పరవశయై అమృతధారలలో ఓలలాడించి, సుధాసాగరంలో శివశక్త్యైక్యమును సందర్శింపజేయడమనేదే పరమేశ్వరి యొక్క *భక్తివశ్యా* అను నామ మంత్రమునకు పరమార్థము!

PVD Subrahmanyam చెప్పారు...

ఆర్తితో గజేంద్రుడు ప్రార్థించినపుడు గజేంద్రుని భక్తికి పరవశించి మొసలిబారినుండి భగవంతుడు రక్షించాడు.

ఎలా రక్షించాడు? వైకుంఠంనుంచి సుదర్శనాది ఆయుధములను గజేంద్రుని రక్షణకు పంపాడా? లేదు. గజేంద్రుని రక్షించిన విధం బమ్మెర పోతనామాత్యులు ఇలా చెప్పారు.

*శార్దూల విక్రీడితము*

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

*తాత్పర్యము*

"దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!"

అని గజేంద్రుడు ఎలుగెత్తి ఆర్తితో ప్రార్థింపగా, ఆ ప్రార్థన వైకుంఠంలో లక్ష్మీదేవితో వినోదించు శ్రీమన్నారాయణుని చెవులకు వినబడింది. వెంటనే ఆ భగవంతుడు, గజేంద్రుని రక్షించడానికి ఎలా బయలుదేరాడో పోతనగారు ఎలాచెప్పారో చూద్దాం.

*మత్తేభ విక్రీడితము*

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

*తాత్పర్యం*

గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.

అలాశ్రీమన్నారాయణుడు బయలుదేరగా, ఆయనవెంట వైకుంఠమే కదిలి వెడలగా గజేంద్రుడు రక్షింపబడ్డాడు. గజేంద్రునిలోని అరిషడ్వర్గములు నశించి ముక్తిని పొందాడు.ఆ విధంగా పరమాత్మ భక్తుని భక్తికి వశమవడం జరుగుతుంది.

*ఉద్థవుడు* జిజ్ఞాసతో భగవంతుని లీలలను తెలుసుకోవాలను కున్నాడు. అదేమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాము.

శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్దవుడు మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని జిజ్ఞాసతో ఉద్ధవుడు కొన్ని ప్రశ్నలను అడిగాడు. అవి ఏమిటంటే, నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా ధర్మరాజు జూదం ఆడకుండా ఆపవచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండవచ్చు కదా అని అడుగగా అప్పుడు దానికి శ్రీకృష్ణుడు, ఉద్దవా ! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు.

ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటె వేరేలా ఉండేది, కాని అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరి కదా, నేను అటువైపు రాకూడదని ప్రార్ధించాడు. అతని ప్రార్ధన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలిగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా అని జవాబు ఇచ్చాడు.

పరమాత్మ భక్తులకు ఎలా వశమగునో ఈ దృష్టాంతములు చాలుగదా!

జగన్మాత సాక్షాత్తు నారాయణి. రాగద్వేషాలకు అతీతంగా తనను సేవించు భక్తుల పారవశ్యతకు వశమై *భక్తివశ్యా* అని స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భక్తివశ్యాయై నమః* అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*14.42 (నలుబది రెండవ శ్లోకము)*

*గంధర్వానుపధావేమాంస్తుభ్యం దాస్యంతి మామితి|*

*తస్య సంస్తువతస్తుష్టా అగ్నిస్థాలీం దదుర్నృప|*

*ఉర్వశీం మన్యమానస్తాం సోఽబుధ్యత చరన్ వనే॥7807॥*

ప్రభూ! ఈ గంధర్వులను స్తుతించి, వారిని ప్రసన్నులను చేసికొనుము. అప్పుడు వారు నన్ను నీకు అప్పగింతురు". పరీక్షిన్మహారాజా! అంతట పురూరవుడు గంధర్వులను కొనియాడగా, వారు సంతుష్టులై ఒక అగ్నిపాత్రను (అగ్నిస్థాపనచేయుటకు ఉపయుక్తమగు పాత్రను) ఆయనకు ప్రసాదించిరి. అతడు ఆ పాత్రనే ఊర్వశినిగా (ఊర్వశిని పొందుటకు సాధనముగా) భావించి వనమున సంచరించుచుండెను.

*14.43 (నలుబది మూడవ శ్లోకము)*

*స్థాలీం న్యస్య వనే గత్వా గృహానాధ్యాయతో నిశి|*

*త్రేతాయాం సంప్రవృత్తాయాం మనసి త్రయ్యవర్తత॥7808॥*

పిమ్మట ఆ మహారాజు ఆ అగ్నిపాత్రను వనముననే ఉంచి, తన భవనమునకు వెళ్ళెను. రాత్రి వేళలయందు ఊర్వశినే తలంచుకొనుచు గడపెను. త్రేతాయుగారంభమున అతని మనస్సునందు మూడు (ఋగ్యజుస్సామ) వేదములు మెదలెను.

*14.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*స్థాలీస్థానం గతోఽశ్వత్థం శమీగర్భం విలక్ష్య సః|*

*తేన ద్వే అరణీ కృత్వా ఉర్వశీలోకకామ్యయా॥7809॥*

*14.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*ఉర్వశీం మంత్రతో ధ్యాయన్నధరారణిముత్తరామ్|*

*ఆత్మానముభయోర్మధ్యే యత్తత్ప్రవ్రజనం ప్రభుః॥7810॥*

అనంతరము అతడు అగ్నిపాత్రను ఉంచిన ప్రదేశమునకు చేరగా అచ్చట జమ్మివృక్షము మధ్య ఒక రావిచెట్టు ఉండుట ఆయనకు గోచరించెను. అప్పుడు ఆ రాజు ఆ అశ్వత్థవృక్షమునుండి రెండు అరణులను సిద్ధపఱచు కొనెను. వాటిలో క్రింది అరణిని ఊర్వశిగాను, మీది అరణిని తననుగాను, మధ్యనున్న కర్రను పుత్రునిగాను భావించుచు ఊర్వశీలోకమును చేరు కోరికతో విహితములగు మంత్రములను పఠించుచు వాటిని మథింపసాగెను.

*14.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*తస్య నిర్మంథనాజ్జాతో జాతవేదా విభావసుః|*

*త్రయ్యా స విద్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పితస్త్రివృత్॥7811॥*

*14.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*తేనాయజత యజ్ఞేశం భగవంతమధోక్షజమ్|*

*ఉర్వశీలోకమన్విచ్ఛన్ సర్వదేవమయం హరిమ్॥7812॥*

అందుండి *జాతవేదుడు* అను అగ్నిపుట్టెను. పురూరవుడు ఆ అగ్ని దేవతను త్రయీవిద్య (వేదత్రయ మంత్రముల) ద్వారా దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని మూడు భాగములుగా చేసి, పుత్రరూపమున స్వీకరించెను. అనంతరము ఆ రాజు ఊర్వశీలోకమును చేరు కోరికతో ఆ మూడు అగ్నులద్వారా, సకలదేవతా స్వరూపుడు, ఇంద్రియాతీతుడు, యజ్ఞేశ్వరుడు అగు శ్రీమన్నారాయణుని గూర్చి యజ్ఞమును ఆచరించెను.

*14.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*ఏక ఏవ పురా వేదః ప్రణవః సర్వవాఙ్మయః|*

*దేవో నారాయణో నాన్య ఏకోఽగ్నిర్వర్ణ ఏవ చ॥7813॥*

పరీక్షిన్మహారాజా! త్రేతాయుగమునకు ముందు అనగా కృతయుగమునందు ప్రణవమే (ఓంకారమే) వేదముగా ఉండెను. సకల వేదశాస్త్రములును అందులోనే అంతర్భాగములై యుండెను. శ్రీమన్నారాయణుడు ఒక్కడే సకలదేవతాస్వరూపుడు. అగ్నియు (మూడురూపములుగా గాక) హంసవర్ణముతో ఒకే రూపమున ఉండెను.

*14.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*పురూరవస ఏవాసీత్త్రయీ త్రేతాముఖే నృప|*

*అగ్నినా ప్రజయా రాజా లోకం గాంధర్వమేయివాన్॥7814॥*

రాజా! ముఖ్యముగా కృతయుగమునందు అందరును సత్త్వగుణ ప్రధానులై యుండిరి. వేదప్రతిపాదితము, రజోగుణ ప్రధానము ఐన కర్మమార్గము త్రేతాయుగమునుండి పురూరవుని వలన ప్రకటితమైనది. పురూరవుడు అగ్నిని సంతాన రూపమున స్వీకరించి, గంధర్వలోకమును పొందెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్దశోఽధ్యాయః (14)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పదునాలుగవ అధ్యాయము (14)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*15.1 (ప్రథమ శ్లోకము)*

*ఐలస్య చోర్వశీగర్భాత్షడాసన్నాత్మజా నృప|*

*ఆయుః శ్రుతాయుః సత్యాయూ రయోఽథ విజయో జయః॥7815॥*

*శ్రీశుకుడు నుడివెను* - పురూరవునివలన ఊర్వశియందు ఆరుగురు కుమారులు కలిగిరి. ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, జయుడు అనునవి వారి పేర్లు.

*15.2 (రెండవ శ్లోకము)*

*శ్రుతాయోర్వసుమాన్ పుత్రః సత్యాయోశ్చ శ్రుతంజయః|*

*రయస్య సుత ఏకశ్చ జయస్య తనయోఽమితః॥7816॥*

*15.3 (మూడవ శ్లోకము)*

*భీమస్తు విజయస్యాథ కాంచనో హోత్రకస్తతః|*

*తస్య జహ్నుః సుతో గంగాం గండూషీకృత్య యోఽపిబత్|*

*జహ్నోస్తు పూరుస్తత్పుత్రో బలాకశ్చాత్మజోఽజకః॥7817॥*

శ్రుతాయువు పుత్రుడు వసుమంతుడు. సత్యాయువు యొక్క కుమారుడు శ్రుతంజయుడు. రయుని సుతుడు ఏకుడు. జయుని తనయుడు అమితుడు. విజయుని కొడుకు భీముడు. భీముని వలన పుట్టిన వాడు కాంచనుడు. అతని సుతుడు హోత్రకుడు. హోత్రకుని తనూజుడు జహ్నువు. గంగానదిని (గంగాప్రవాహమును) పుక్కిటబట్టినవాడు ఈ జహ్నుమహర్షియే. జహ్నువు కుమారుడు పూరువు. అతని పుత్రుడు బలాకుడు. బలాకుని తనయుడు అజకుడు.

*15.4 (నాలుగవ శ్లోకము)*

*తతః కుశః కుశస్యాపి కుశాంబుస్తనయో వసుః|*

*కుశనాభశ్చ చత్వారో గాధిరాసీత్కుశాంబుజః॥7818॥*
అజకునకు కలిగినవాడు కుశుడు. కుశునకు కుశాంబుడు, తనయుడు, వసువు, కుశనాథుడు అను నలుగురు కుమారులు జన్మించిరి. వీరిలో కుశాంబుని కొడుకు గాధి.

*15. 5 (ఐదవ శ్లోకము)*

*తస్య సత్యవతీం కన్యామృచీకోఽయాచత ద్విజః|*

*వరం విసదృశం మత్వా గాధిర్భార్గవమబ్రవీత్॥7819॥*

గాధియొక్క పుత్రికయైన సత్యవతిని ఋచీకుడు అను బ్రాహ్మణుడు కోరుకొనెను. భృగువంశజుడైన ఋచీకుడు తన పుత్రికకు తగినవరుడు కాడని భావించి, గాధి అతనితో ఇట్లు నుడివెను-

*15. 6 (ఆరవ శ్లోకము)*

*ఏకతః శ్యామకర్ణానాం హయానాం చంద్రవర్చసామ్|*

*సహస్రం దీయతాం శుల్కం కన్యాయాః కుశికా వయమ్॥7820॥*

"మునివరా! మేము కుశిక వంశజులము. నా కూతురును భార్యనుగా పొందుట అంత సులభముగాదు. ఆమెను పెండ్లియాడవలెనన్న ఒక వైపున శ్యామవర్ణముతో ఒప్ఫెడి చెవిగల తెల్లని గుర్రములను వేయింటిని కన్యాశుల్కముగా మాకు సమర్పింపవలయును".

*15. 7 (ఏడవ శ్లోకము)*

*ఇత్యుక్తస్తన్మతం జ్ఞాత్వా గతః స వరుణాంతికమ్|*

*ఆనీయ దత్త్వా తానశ్వానుపయేమే వరాననామ్॥7821॥*

గాధియొక్క అభిప్రాయమును ఎరిగిన ఋచీకుడు వరుణదేవుని కడకు వెళ్ళెను. ఆయన అనుగ్రహముతో అట్టి అశ్వములను పొంది, వాటిని తీసికొని వచ్చి, ఋచీకుడు గాధికి సమర్పించి, ఆయన కుమార్తెయగు సత్యవతిని వివాహమాడెను.

*15. 8 (ఎనిమిదవ శ్లోకము)*

*స ఋషిః ప్రార్థితః పత్న్యా శ్వశ్ర్వా చాపత్యకామ్యయా|*

*శ్రపయిత్వోభయైర్మంత్రైశ్చరుం స్నాతుం గతో మునిః॥7822॥*

*15.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తావత్సత్యవతీ మాత్రా స్వచరుం యాచితా సతీ|*

*శ్రేష్ఠం మత్వా తయాయచ్ఛన్మాత్రే మాతురదత్స్వయమ్॥7823॥*

గాధికి పుత్రసంతానము లేకుండెను. అంతట ఒకనాడు ఋచీకమహర్షిని, అతని భార్యయగు సత్యవతియు, అతని అత్తగారును - 'స్వామీ! మీ తపః ప్రభావమున మాకు పుత్రసంతానము కలుగునట్లు అనుగ్రహింపుడు' అని ప్రార్థించిరి. అప్పుడు అతడు రెండు చరు పాత్రలను సిద్ధపరచెను (అన్నము ఉంచబడిన పాత్రలను సిద్ధపరచెను). వాటిలో ఒకదానిని తన భార్యకొరకై బ్రాహ్మమంత్రములతోను, మరియొకదానిని తన అత్తగారి కొరకై క్షాత్రమంత్రములతోను అభిమంత్రించెను. పిదప అతడు స్నానము చేయుటకై (నదీతీరమునకు) వెళ్ళెను. అప్పుడు ఋచీకుడు తన భార్యయగు సత్యవతికై చరువును (చరుపాత్రను)శ్రేష్ఠమంత్రములతో మంత్రించి యుండవచ్చునని భావించి, దానిని సత్యవతి తల్లి (ఋచీకుని అత్తగారు) కోరుకొనెను. అంతట సత్యవతి తన కొరకై బ్రాహ్మమంత్రములతో అభిమంత్రింపబడిన అన్నపాత్రను తన తల్లికి ఇచ్చెను. తన తల్లి కొఱకై క్షాత్రమంత్రములతో అభిమంత్రింపబడిన అన్నపాత్రను తాను స్వీకరించెను. ఋచీకుడు స్నానమాచరించి వచ్చునంతలో వారు ఆ హవ్యాన్నములను భక్షించిరి.

*15.10 (పదియవశ్లోకము)*

*తద్విజ్ఞాయ మునిః ప్రాహ పత్నీం కష్టమకారషీః|*

*ఘోరో దండధరః పుత్రో భ్రాతా తే బ్రహ్మవిత్తమః॥7824॥*

జరిగిన పొరపాట్లను గ్రహించిన ఋచీకుడు తన భార్యతో ఇట్లనెను- "అర్ధాంగీ! పెద్దప్రమాదమే జరిగినది. మీ తప్పిదములవలన ఇప్పుడు నీకు కలుగబోవు పుత్రుడు జనులను దండించు ఘోరస్వభావముగల వాడగును. మీ తల్లి కడుపున జన్మించువాడు సాత్త్విక స్వభావముగల బ్రహ్మవేత్త కాగలడు".

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*15.1 (ప్రథమ శ్లోకము)*

*ఐలస్య చోర్వశీగర్భాత్షడాసన్నాత్మజా నృప|*

*ఆయుః శ్రుతాయుః సత్యాయూ రయోఽథ విజయో జయః॥7815॥*

*శ్రీశుకుడు నుడివెను* - పురూరవునివలన ఊర్వశియందు ఆరుగురు కుమారులు కలిగిరి. ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, జయుడు అనునవి వారి పేర్లు.

*15.2 (రెండవ శ్లోకము)*

*శ్రుతాయోర్వసుమాన్ పుత్రః సత్యాయోశ్చ శ్రుతంజయః|*

*రయస్య సుత ఏకశ్చ జయస్య తనయోఽమితః॥7816॥*

*15.3 (మూడవ శ్లోకము)*

*భీమస్తు విజయస్యాథ కాంచనో హోత్రకస్తతః|*

*తస్య జహ్నుః సుతో గంగాం గండూషీకృత్య యోఽపిబత్|*

*జహ్నోస్తు పూరుస్తత్పుత్రో బలాకశ్చాత్మజోఽజకః॥7817॥*

శ్రుతాయువు పుత్రుడు వసుమంతుడు. సత్యాయువు యొక్క కుమారుడు శ్రుతంజయుడు. రయుని సుతుడు ఏకుడు. జయుని తనయుడు అమితుడు. విజయుని కొడుకు భీముడు. భీముని వలన పుట్టిన వాడు కాంచనుడు. అతని సుతుడు హోత్రకుడు. హోత్రకుని తనూజుడు జహ్నువు. గంగానదిని (గంగాప్రవాహమును) పుక్కిటబట్టినవాడు ఈ జహ్నుమహర్షియే. జహ్నువు కుమారుడు పూరువు. అతని పుత్రుడు బలాకుడు. బలాకుని తనయుడు అజకుడు.

*15.4 (నాలుగవ శ్లోకము)*

*తతః కుశః కుశస్యాపి కుశాంబుస్తనయో వసుః|*

*కుశనాభశ్చ చత్వారో గాధిరాసీత్కుశాంబుజః॥7818॥*
అజకునకు కలిగినవాడు కుశుడు. కుశునకు కుశాంబుడు, తనయుడు, వసువు, కుశనాథుడు అను నలుగురు కుమారులు జన్మించిరి. వీరిలో కుశాంబుని కొడుకు గాధి.

*15. 5 (ఐదవ శ్లోకము)*

*తస్య సత్యవతీం కన్యామృచీకోఽయాచత ద్విజః|*

*వరం విసదృశం మత్వా గాధిర్భార్గవమబ్రవీత్॥7819॥*

గాధియొక్క పుత్రికయైన సత్యవతిని ఋచీకుడు అను బ్రాహ్మణుడు కోరుకొనెను. భృగువంశజుడైన ఋచీకుడు తన పుత్రికకు తగినవరుడు కాడని భావించి, గాధి అతనితో ఇట్లు నుడివెను-

*15. 6 (ఆరవ శ్లోకము)*

*ఏకతః శ్యామకర్ణానాం హయానాం చంద్రవర్చసామ్|*

*సహస్రం దీయతాం శుల్కం కన్యాయాః కుశికా వయమ్॥7820॥*

"మునివరా! మేము కుశిక వంశజులము. నా కూతురును భార్యనుగా పొందుట అంత సులభముగాదు. ఆమెను పెండ్లియాడవలెనన్న ఒక వైపున శ్యామవర్ణముతో ఒప్ఫెడి చెవిగల తెల్లని గుర్రములను వేయింటిని కన్యాశుల్కముగా మాకు సమర్పింపవలయును".

*15. 7 (ఏడవ శ్లోకము)*

*ఇత్యుక్తస్తన్మతం జ్ఞాత్వా గతః స వరుణాంతికమ్|*

*ఆనీయ దత్త్వా తానశ్వానుపయేమే వరాననామ్॥7821॥*

గాధియొక్క అభిప్రాయమును ఎరిగిన ఋచీకుడు వరుణదేవుని కడకు వెళ్ళెను. ఆయన అనుగ్రహముతో అట్టి అశ్వములను పొంది, వాటిని తీసికొని వచ్చి, ఋచీకుడు గాధికి సమర్పించి, ఆయన కుమార్తెయగు సత్యవతిని వివాహమాడెను.

*15. 8 (ఎనిమిదవ శ్లోకము)*

*స ఋషిః ప్రార్థితః పత్న్యా శ్వశ్ర్వా చాపత్యకామ్యయా|*

*శ్రపయిత్వోభయైర్మంత్రైశ్చరుం స్నాతుం గతో మునిః॥7822॥*

*15.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తావత్సత్యవతీ మాత్రా స్వచరుం యాచితా సతీ|*

*శ్రేష్ఠం మత్వా తయాయచ్ఛన్మాత్రే మాతురదత్స్వయమ్॥7823॥*

గాధికి పుత్రసంతానము లేకుండెను. అంతట ఒకనాడు ఋచీకమహర్షిని, అతని భార్యయగు సత్యవతియు, అతని అత్తగారును - 'స్వామీ! మీ తపః ప్రభావమున మాకు పుత్రసంతానము కలుగునట్లు అనుగ్రహింపుడు' అని ప్రార్థించిరి. అప్పుడు అతడు రెండు చరు పాత్రలను సిద్ధపరచెను (అన్నము ఉంచబడిన పాత్రలను సిద్ధపరచెను). వాటిలో ఒకదానిని తన భార్యకొరకై బ్రాహ్మమంత్రములతోను, మరియొకదానిని తన అత్తగారి కొరకై క్షాత్రమంత్రములతోను అభిమంత్రించెను. పిదప అతడు స్నానము చేయుటకై (నదీతీరమునకు) వెళ్ళెను. అప్పుడు ఋచీకుడు తన భార్యయగు సత్యవతికై చరువును (చరుపాత్రను)శ్రేష్ఠమంత్రములతో మంత్రించి యుండవచ్చునని భావించి, దానిని సత్యవతి తల్లి (ఋచీకుని అత్తగారు) కోరుకొనెను. అంతట సత్యవతి తన కొరకై బ్రాహ్మమంత్రములతో అభిమంత్రింపబడిన అన్నపాత్రను తన తల్లికి ఇచ్చెను. తన తల్లి కొఱకై క్షాత్రమంత్రములతో అభిమంత్రింపబడిన అన్నపాత్రను తాను స్వీకరించెను. ఋచీకుడు స్నానమాచరించి వచ్చునంతలో వారు ఆ హవ్యాన్నములను భక్షించిరి.

*15.10 (పదియవశ్లోకము)*

*తద్విజ్ఞాయ మునిః ప్రాహ పత్నీం కష్టమకారషీః|*

*ఘోరో దండధరః పుత్రో భ్రాతా తే బ్రహ్మవిత్తమః॥7824॥*

జరిగిన పొరపాట్లను గ్రహించిన ఋచీకుడు తన భార్యతో ఇట్లనెను- "అర్ధాంగీ! పెద్దప్రమాదమే జరిగినది. మీ తప్పిదములవలన ఇప్పుడు నీకు కలుగబోవు పుత్రుడు జనులను దండించు ఘోరస్వభావముగల వాడగును. మీ తల్లి కడుపున జన్మించువాడు సాత్త్విక స్వభావముగల బ్రహ్మవేత్త కాగలడు".

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*120వ నామ మంత్రము*

*ఓం భక్తివశ్యాయై నమః*

రాగద్వేషములకు అతీతముగా అన్ని ప్రాణులలోను భగవంతుని చూచుటయే పరాకాష్ఠకు చేరిన భక్తి అయితే,అటువంటి భక్తికి వశమగునట్టి జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భక్తివశ్యా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భక్తివశ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిపరవశముతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుని భక్తికి ప్రసన్నయైన ఆ కరుణామయి అయిన జగన్మాత ఆ సాధకుని భక్తికి వశమై అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదను అనుగ్రహించి జన్మరాహిత్యమైన ముక్తిని ప్రసాదించును.

ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్ధులు, జ్ఞానులు అను చతుర్విధభక్తులు నవవిధభక్తిమార్గములలో ఏమార్గమునందైనను అత్యంత భక్తిపారవశ్యముతో ఆరాధించుచూ, ఆ పరమేశ్వరిని సకల ప్రాణులలోను చూడగలిగినచో ఆ భక్తి పరాకాష్ఠకు చేరినదని అర్థము. అంత భక్తితత్పరుడైన ఆ సాధకుని భక్తికి పరవశించి ఆ సాధకునికి పునర్జన్మ రాహిత్యమైన ముక్తిని ప్రసాదించును.

కఠోర యోగ సాధనలో సాధకుడు మూలాధారమందు నిద్రావస్థలో నున్న కుండలినీ శక్తిని జాగృతము చేసి, సుషుమ్నా మార్గముద్వారా పయనింపజేసి, బ్రహ్మవిష్ణురుద్రగ్రంథులను ఛేదింపజేస్తూ, షట్చక్రములను వివిధ స్థాయిలలో ఆరాధిస్తూ, కుండలినీ శక్తిని సహస్రారమునకు చేర్చగా, సహస్రారంలోని సుధాసాగరంలో అడుగిడిన కుండలినీ శక్తి తన అగ్నితత్త్వముతో, సుధాసాగరంలోని చల్లదనమునకు ఘనస్థితిలోనున్న అమృతమును కరిగించగా, ఆ అమృతధారలు సాధకుని నాడీ మండలముపై వర్షించి బ్రహ్మానందమును పొందిన సాధకుడు తనలోని అజ్ఞాన తిమిరములు విచ్ఛిన్నమవగా పరబ్రహ్మమంటే ఏమిటో తెలియడం జరుగుతుంది. ఇదే కదా జ్ఞానుల భక్తిపారవశ్యత. ఆ భక్తి పారవశ్యతకు పరబ్రహ్మ స్వరూపిణి పరవశయై అమృతధారలలో ఓలలాడించి, సుధాసాగరంలో శివశక్త్యైక్యమును సందర్శింపజేయడమనేదే పరమేశ్వరి యొక్క *భక్తివశ్యా* అను నామ మంత్రమునకు పరమార్థము!

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*120వ నామ మంత్రము*

*ఓం భక్తివశ్యాయై నమః*

రాగద్వేషములకు అతీతముగా అన్ని ప్రాణులలోను భగవంతుని చూచుటయే పరాకాష్ఠకు చేరిన భక్తి అయితే,అటువంటి భక్తికి వశమగునట్టి జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భక్తివశ్యా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భక్తివశ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిపరవశముతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుని భక్తికి ప్రసన్నయైన ఆ కరుణామయి అయిన జగన్మాత ఆ సాధకుని భక్తికి వశమై అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదను అనుగ్రహించి జన్మరాహిత్యమైన ముక్తిని ప్రసాదించును.

ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్ధులు, జ్ఞానులు అను చతుర్విధభక్తులు నవవిధభక్తిమార్గములలో ఏమార్గమునందైనను అత్యంత భక్తిపారవశ్యముతో ఆరాధించుచూ, ఆ పరమేశ్వరిని సకల ప్రాణులలోను చూడగలిగినచో ఆ భక్తి పరాకాష్ఠకు చేరినదని అర్థము. అంత భక్తితత్పరుడైన ఆ సాధకుని భక్తికి పరవశించి ఆ సాధకునికి పునర్జన్మ రాహిత్యమైన ముక్తిని ప్రసాదించును.

కఠోర యోగ సాధనలో సాధకుడు మూలాధారమందు నిద్రావస్థలో నున్న కుండలినీ శక్తిని జాగృతము చేసి, సుషుమ్నా మార్గముద్వారా పయనింపజేసి, బ్రహ్మవిష్ణురుద్రగ్రంథులను ఛేదింపజేస్తూ, షట్చక్రములను వివిధ స్థాయిలలో ఆరాధిస్తూ, కుండలినీ శక్తిని సహస్రారమునకు చేర్చగా, సహస్రారంలోని సుధాసాగరంలో అడుగిడిన కుండలినీ శక్తి తన అగ్నితత్త్వముతో, సుధాసాగరంలోని చల్లదనమునకు ఘనస్థితిలోనున్న అమృతమును కరిగించగా, ఆ అమృతధారలు సాధకుని నాడీ మండలముపై వర్షించి బ్రహ్మానందమును పొందిన సాధకుడు తనలోని అజ్ఞాన తిమిరములు విచ్ఛిన్నమవగా పరబ్రహ్మమంటే ఏమిటో తెలియడం జరుగుతుంది. ఇదే కదా జ్ఞానుల భక్తిపారవశ్యత. ఆ భక్తి పారవశ్యతకు పరబ్రహ్మ స్వరూపిణి పరవశయై అమృతధారలలో ఓలలాడించి, సుధాసాగరంలో శివశక్త్యైక్యమును సందర్శింపజేయడమనేదే పరమేశ్వరి యొక్క *భక్తివశ్యా* అను నామ మంత్రమునకు పరమార్థము!

PVD Subrahmanyam చెప్పారు...

*15.11 (పదకొండవ శ్లోకము)*

*ప్రసాదితః సత్యవత్యా మైవం భూదితి భార్గవః|*

*అథ తర్హి భవేత్పౌత్రో జమదగ్నిస్తతోఽభవత్॥7825॥*

అప్పుడు జరిగిన పొరపాటునకు మిగుల చింతించి- 'స్వామీ! అట్లు జరుగకుండ కనికరింపుము' అనుచు పలురీతుల తన భర్తను ప్రార్థించెను. అంతట ఋచీకుడు ప్రసన్నుడై- 'దేవీ! నీ పౌత్రుడు మాత్రము కఠిన స్వభావము గల వాడగును. అంతట సత్యవతికి *జమదగ్ని* జన్మించెను.

*15.12 (పండ్రెండవ శ్లోకము)*

*సా చాభూత్సుమహత్పుణ్యా కౌశికీ లోకపావనీ|*

*రేణోః సుతాం రేణుకాం వై జమదగ్నిరువాహ యామ్॥7826॥*

పిమ్మట సత్యవతి లోకములనే పునీతమొనర్పగల *కౌశికి* అను పవిత్రనదిగా మారెను. జమదగ్ని రేణుమహాముని కుమార్తెయగు రేణుకను వివాహమాడెను.

*15.13 (పదమూడవ శ్లోకము)*

*తస్యాం వై భార్గవఋషేః సుతా వసుమదాదయః|*

*యవీయాన్ జజ్ఞ ఏతేషాం రామ ఇత్యభివిశ్రుతః॥7827॥*

భృగువంశజుడైన జమదగ్నివలన రేణుకకు వసుమంతుడు మొదలగు కుమారులు కలిగిరి. వారిలో చిన్నవాడైన *రాముడు* లోకప్రసిద్ధుడయ్యెను.

*15.14 (పదునాలుగవ శ్లోకము)*

*యమాహుర్వాసుదేవాంశం హైహయానాం కులాంతకమ్|*

*త్రిఃసప్తకృత్వో య ఇమాం చక్రే నిఃక్షత్రియాం మహీమ్॥7828॥*

*15.15 (పదునైదవ శ్లోకము)*

*దుష్టం క్షత్రం భువో భారమబ్రహ్మణ్యమనీనశత్|*

*రజస్తమోవృతమహన్ ఫల్గున్యపి కృతేంఽహసి॥7829॥*

ఆ రాముడు విష్ణ్వంశతో అవతరించినవాడని పేర్కొందురు. అతడు హైహయరాజైన కార్తవీర్యుని వంశమును రూపుమాపెను. ఆ రాముడు ఇరువదియొక్క మారులు భూమండలము నందు అంతటను సంచరించి భూతలమున క్షత్రియులు లేకుండచేసెను. ఏలయన, వారు (క్షత్రియులు) రజస్తమోగుణములతో ఒప్పుచు దుష్టులై బ్రాహ్మణులను ద్వేషింపసాగిరి. ఆ విధముగా వారు భూమికి భారమైపోయిరి. వారొనర్చిన దోషము స్వల్పమే యైనప్పటికిని, భూభారమును తొలగించుటకై శ్రీహరి యంశతో జన్మించిన పరశురాముడు వారిని పూర్తిగా నిర్మూలించెను.

*రాజోవాచ*

*15.16 (పదునారవ శ్లోకము)*

*కిం తదంహో భగవతో రాజన్యైరజితాత్మభిః|*

*కృతం యేన కులం నష్టం క్షత్రియాణామభీక్ష్ణశః॥7830॥*

*పరీక్షిన్మహారాజు ప్రశ్నించెను* "మహర్షీ! ఆకాలములో నిజముగా క్షత్రియులు (రాజన్యులు) విషయసుఖములలో మునిగి దుష్టులైయుండవచ్చును. కాని, పరశురాముడు పదేపదే వారిపై దాడి చేసి నిర్మూలించుట వారు ఆయన యెడ చేసిన అపరాధమేమి?

*శ్రీశుక ఉవాచ*

*15.17 (పదిహేడవ శ్లోకము)*

*హైహయానామధిపతిరర్జునః క్షత్రియర్షభః|*

*దత్తం నారాయణస్యాంశమారాధ్య పరికర్మభిః॥7831॥*

*15.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*బాహూన్ దశశతం లేభే దుర్ధర్షత్వమరాతిషు|*

*అవ్యాహతేంద్రియౌజః శ్రీతేజోవీర్యయశోబలమ్॥7832॥*

*15.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*యోగేశ్వరత్వమైశ్వర్యం గుణా యత్రాణిమాదయః|*

*చచారావ్యాహతగతిర్లోకేషు పవనో యథా॥7833॥*

*శ్రీశుకుడు ఇట్లు చెప్పదొడగెను* - "పరీక్షిన్మహారాజా! క్షత్రియులలో శ్రేష్ఠుడైన కార్తవీర్యార్జునుడు హైహయవంశజులలో ప్రముఖుడు. అతడు శ్రీమన్నారాయణుని అంశావతారమైన దత్తాత్రేయుని వివిధములగు సేనలతో ఆరాధించెను. ఆ స్వామి అనుగ్రహమున కార్తవీర్యార్జునుడు వేయిబాహువులను, శత్రువులను అజేయుడుగా నుండునట్టి శక్తిని వరముగా పొందెను. ఇంకను అతడు తిరుగులేని ఇంద్రియ బలమును, బుద్ధిబలమును, సంపదను, తేజస్సును, పరాక్రమమును, యశస్సును, శరీరపాటవమును సంపాదించెను. యోగబలముతో సకలైశ్వర్యములను, అణిమాది అష్టసిద్ధులను సాధించెను. అట్టి యోగశక్తి వలన కార్తవీర్యార్జునుడు వాయువువలె ఎదురులేని గమనముతో సకలలోకములయందును సంచరింపసాగెను.

*15.20 (ఇరువదియవ శ్లోకము)*

*స్త్రీరత్నైరావృతః క్రీడన్ రేవాంభసి మదోత్కటః|*

*వైజయంతీం స్రజం బిభ్రద్రురోధ సరితం భుజైః॥7834॥*

ఒకానొకనాడు కార్తవీర్యార్జునుడు వైజయంతీమాలను ధరించి, రమణీమణులతోగూడి, నర్మదా (రేవా) నదీ జలములలో క్రీడింపదొడంగెను. మదోన్మత్తుడైన ఆ ప్రభువు తన వేయి బాహువులతో జలప్రవాహమును నిరోధించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*15.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*విప్లావితం స్వశిబిరం ప్రతిస్రోతఃసరిజ్జలైః|*

*నామృష్యత్తస్య తద్వీర్యం వీరమానీ దశాననః॥7835॥*

*15.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*గృహీతో లీలయా స్త్రీణాం సమక్షం కృతకిల్బిషః|*

*మాహిష్మత్యాం సన్నిరుద్ధో ముక్తో యేన కపిర్యథా॥7836॥*

వీరమానియైన (తనను తానే మహావీరునిగా భావించుకొను వాడైన) రావణుడు దిగ్విజయయాత్రకై వచ్చి ఆ సమయమున ఆ సమీపముననే ఒక శిబిరమున శివపూజ చేసికొనుచు ఉండెను. కార్తవీర్యునిచే నిరోధింపబడిన నదీజల ప్రవాహము వెనుదిరిగి ప్రవహించుటచే రావణుని శిబిరము మునిగిపోయెను. కార్తవీర్యార్జునుని పరాక్రమమును సహింపలేక రావణుడు అతనిపై దాడికి దిగెను. అప్పుడు కార్తవీర్యార్జునుడు అకారణముగా తనమీద దాడిచేసిన రావణుని తన వనితల సమక్షముననే అవలీలగా ఒక కోతివలె బంధించి, తన మహిష్మతీ నగరముసకు తీసికొనిపోయెను. అనంతరము అతడు రావణుని మందలించి, పులస్త్యుని ప్రమేయముతో బంధవిముక్తుని గావించెను.

*15.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*స ఏకదా తు మృగయాం విచరన్ విపినే వనే|*

*యదృచ్ఛయాఽఽశ్రమపదం జమదగ్నేరుపావిశత్॥7838॥*

ఒకానొకప్పుడు కార్తవీర్యుడు ఒక నిర్జన వనమునకు చేరి, అచట వేటాడుచు సంచరింపసాగెను. యాదృచ్ఛికముగా అతడు జమదగ్ని ఆశ్రమమున ప్రవేశించెను.

*15.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*తస్మై స నరదేవాయ మునిరర్హణమాహరత్|*

*ససైన్యామాత్యవాహాయ హవిష్మత్యా తపోధనః॥7838॥*

తపస్సంపన్నుడైన జమదగ్ని మహామునికడ కామధేనువు కలదు. దాని ప్రభావమున ఆ మహర్షి ఆ మహారాజునకును, అతని సైన్యములకును, మంత్రులకును, వాహనములకును చక్కని ఆతిథ్యమును సమకూర్చెను.

*15.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*స వీరస్తత్ర తద్దృష్ట్వా ఆత్మైశ్వర్యాతిశాయనమ్|*

*తన్నాద్రియతాగ్నిహోత్ర్యాం సాభిలాషః స హైహయః॥7839॥*
*15.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*హవిర్ధానీమృషేర్దర్పాన్నరాన్ హర్తుమచోదయత్|*

*తే చ మాహిష్మతీం నిన్యుః సవత్సాం క్రందతీం బలాత్॥7840॥*

అంతట కార్తవీర్యార్జునుడు మహర్షియొక్క ఐశ్వర్యము తన ఐశ్వర్యముకంటె మించియుండుట గమనించెను. అప్పుడు అతడు ఆ ముని ఇచ్చిన ఆతిథ్యవైభవమును జూచి సహింపలేక (అసూయపరుడై) అంతటి వైభవమునకు మూలమైన ఆ కామధేనువును కాజేయదలచెను. కాని దురభిమాన కారణముగా మాటమాత్రము ఆ మునిని అడుగకుండగనే ఆ ప్రభువు 'ఆ కామధేనువును తీసికొని పొండు' అని తన భటులను పురమాయించెను. వెంటనే ఆ భటులు ఆ క్రందించుచున్న ఆ కామధేనువును దూడతో సహా బలవంతముగా మహిష్మతీ పురమునకు లాగుకొనిపోయిరి.

*15.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*అథ రాజని నిర్యాతే రామ ఆశ్రమ ఆగతః|*

*శ్రుత్వా తత్తస్య దౌరాత్మ్యం చుక్రోధాహిరివాహతః॥7841॥*

*15.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*ఘోరమాదాయ పరశుం సతూణం వర్మ కార్ముకమ్|*

*అన్వధావత దుర్మర్షో మృగేంద్ర ఇవ యూథపమ్॥7842॥*

కార్తవీర్యార్జునుడు వెళ్ళినంతనే (అంతకుముందు కార్యాంతరమున ఆశ్రమమునకు దూరముగా వెళ్ళియున్న) పరశురాముడు (ఆశ్రమమునకు) తిరిగివచ్చెను. హైహయరాజొనర్చిన దుష్కార్యమును గూర్చి విననంతనే అతడు తోకత్రొక్కిన (దెబ్బతిన్న) త్రాచుపామువలె క్రుద్ధుడాయెను. తత్ క్షణమే పరశురాముడు భయంకరమైన తన గండ్రగొడ్డలిని, ధనుర్భాణములను (తూణీరములను), డాలును చేబూని, ఎదిరింపరానివాడై, సింహము మదపుటేనుగు మీదికివలె కార్తవీర్యార్జునుని వెంటాడెను.

*15.29 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*తమాపతంతం భృగువర్యమోజసా ధనుర్ధరం బాణపరశ్వధాయుధమ్|*

*ఐణేయచర్మాంబరమర్కధామభిర్యుతం జటాభిర్దదృశే పురీం విశన్॥7843॥*

అంతట మాహిష్మతీ పురమున ప్రవేశించుచున్న హైహయుడు శరవేగముతో తనను వెంటాడి వచ్చుచున్న పరశురాముని చూచెను. అప్పుడు ఆ భార్గవరాముడు ధనుర్బాణములను, గండ్రగొడ్డలిని చేబూని యుండెను. ఆ మృగచర్మాంబరధారి సూర్యకిరణములవలె తేజరిల్లుచున్న జడలను ధరించి భీకరుడై యుండెను.

*15.30 (ముప్పదియవ శ్లోకము)*

*అచోదయద్ధస్తిరథాశ్వపత్తిభిర్గదాసిబాణర్ష్టిశతఘ్నిశక్తిభిః|*

*అక్షౌహిణీః సప్తదశాతిభీషణాస్తా రామ ఏకో భగవానసూదయత్॥7844॥*

వెంటనే కార్తవీర్యార్జునుడు గదలను, ఖడ్గములను, ధనుర్బాణములను, చిన్నకత్తులను, శతఘ్నులను, బల్లెములను కలిగియున్న చతురంగ బలములను (రథగజాశ్వములను, కాల్బలములను) పరశురాముని ఎదుర్కొనుటకై పంపెను. పదునేడు అక్షౌహిణుల సంఖ్యలో భీకరముగానున్న ఆ సేనలను సర్వశక్తిసంపన్నుడైన పరశురాముడు ఒక్కడే క్షణములో హతమార్చెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*121వ నామ మంత్రము*

*ఓం భయాపహాయై నమః*

రోగములవలన, జంతువులవలన, అతివృష్టిఅనావృష్టిలవలన, సన్నిహితులవలన, జరామృత్యువులవలన కలుగు భయములు పోగొట్టి, కర్మఫలములనుభవించు నపుడు మనసు చిక్కుకోనీయక తన భక్తులను కాపాడు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భయాపహా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భయాపహాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తునకు జరుగుచున్న వాటికి భయపడకుండా, కర్మఫలములనుభవించువేళ మనస్సు అదుపుతప్ప నీయకుండా అనుగ్రహించును మరియు ఆధ్యాత్మిక చింతనలపై మనసు నిలిపియుంచును.

జన్మించిన ప్రతీ జీవికి ప్రతీ నిమిషము ఏదో ఒక భయము వెంటాడుచునే యుండును. బ్రహ్మానందమును పొందినవాడు భయమును పొందడు. అట్టి బ్రహ్మానందము పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతను నిష్కపటమైనట్టి భక్తితో సేవించడం వలన కలుగుతుంది. *భక్తివశ్యా* అని స్తుతింపబడు శ్రీమాత భయమును పోగొట్టే బ్రహ్మానందమును ప్రసాదిస్తుంది గనుక అమ్మవారిని *భయాపహా* అని అన్నాము. ఆధివ్యాధులు (మానసిక మరియు శారీరక వ్యాధులు) సంభవించినపుడు, అరణ్యములో సర్పములు, క్రూరజంతువులు, కార్చిచ్చు మొదలైన వాటివలన కలిగేభయము, ప్రకృతి విలయముల వలన భయము, ఎడారి, నీరు, మెట్ట, వ్యాఘ్రము, కుంభీరము (మొసలి), దొంగలు మరియు సంసారములో తరచు ఏర్పడే కలతల వలన కలిగే భయములకు మనసు వశము తప్పనీయక కేవలము జగన్మాత నామస్మరణమే విశేషముగా పఠించినచో ఆ దేవియే అన్నిటికీ బాధ్యత వహించుతుంది. అందుచేతనే శ్రీమాతను *భయాపహా* అని అన్నాము.

రాక్షసులవలన దేవతలు భీతి చెందారు. జగన్మాత రాక్షససంహారంచేసి వారిభయాన్ని పోగొట్టింది.

సంపద ఉన్నవారికి చోరులభయము, రాజులకు శత్రుభయము, రోగులకు మరణభయము, గాడాంధకారములో పిశాచభయము, విద్యార్ధికి పరీక్షభయము, ప్రయాణము చేయువానికి వాహనభయము, రైతుకు అతివృష్టి-అనావృష్టి భయము, కొలువులో యజమానిభయము, సంసారంలో కలతల భయము, గర్భిణీకి ప్రసవభయము, కప్పకు పాము భయము ఇలా ఎన్నో అడుగడుగునా భయము వెంటబడుతూనే ఉంటుంది. ధైర్యము చిక్కబట్టుకోవాలన్నా, మనసు వశంతప్పక ఉండాలన్నా ఆ పరమేశ్వరీ ధ్యానంతో సమస్తభయములు పటాపంచలవుతాయి. అందుకే ఆ తల్లి *భయాపహా* అని స్తుతిస్తున్నాము.

కర్మఫలాలు ప్రతీజీవికి సహజం. అవి తప్పవు. కర్మఫలాన్ని కాదనే ధైర్యము పరమేశ్వరునికి కూడాలేదు. అలాంటి సమయాలలో మనసు వశంతప్పకుండా ఉండాలి, ధైర్యముకలగాలి అంటే జగన్మాత నామస్మరణమే శరణ్యం. కర్మఫలాలను అనుభవించుటలో కావలసిన ధైర్యాన్ని ఆ పరాత్పరి ఇస్తుంది. అందుకే ఆ పరమేశ్వరి *భయాపహా* అని నామ ప్రసిద్ధి చెందియున్నది.

కొన్ని సమయాలలో దుష్టసంకల్పంచేత, అరిషడ్వర్గములు ఆవహించడం చేత పాపకర్మలు చేస్తే ఫలితం భయానకంగా ఉంటుంది. ఆ శ్రీమాత నామస్మరణ మనలో దుష్టసంకల్పములు దరిచేరనీయక, అరిషడ్వర్గములను అదుపులో ఉంచగల సత్సంకల్పములు అ సంకల్పితంగా మనలో ఏర్పడతాయి.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భయాపహాయై నమః* అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*698వ నామ మంత్రము*

*ఓం సర్వార్థదాత్ర్యై నమః*

ధర్మార్థకామమోక్షములు అను చతుర్విధ పురుషార్థములను, సర్వాభీష్టసిద్ధియు తన భక్తులకు కలుగజేయు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సర్వార్థదాత్ర్రీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం సర్వార్థదాత్ర్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తి శ్రద్ధలతో జగన్మాతను ధ్యానిస్తే చతుర్విధ పురుషార్థములను సంప్రాప్తింపజేసి, ఆ పురుషార్థములలోని ధర్మసూక్ష్మములపై అవగాహన నేర్పరచి ఎల్లప్పుడు సత్సంకల్పభరితమైన చింతనయే కలిగియుండునట్లు ఆ శ్రీమాత అనుగ్రహిస్తుంది.

ధర్మార్థకామమోక్షములనునవి చతుర్విధ పురుషార్థములు. వీటిని సంప్రాప్తింపజేయునది శ్రీమాత గనుక ఆ తల్లిని *సర్వార్థదాత్రీ* అని అన్నాము.

చతుర్విధ పురుషార్థాలు: ధర్మార్థకామమోక్షాలు (ధర్మం, అర్థం, కామం, మోక్షం).

పురుషార్ధాలు అంటే ప్రతీ వ్యక్తికి కావలసినవి ఇవియే:

*ధర్మము*: నియమములకు కట్టుబడి జీవించడము. ధర్మం వలన మనము రక్షింపబడతామనిగాని, సాటివారు ధర్మపరులు గనుక మనంకూడా అలా ఉండాలని గాని, ధర్మంగా ఉండకపోతే పాపం వస్తుందని, ధర్మంగా ఉండాలనే నిబంధసతోనూ ధర్మాన్ని ఆచరించకూడదు. ధర్మము అనేది పురుషార్థములలో అది ఒకటి అని తెలియవలెను.

*అర్థము* సంపదలు మాత్రమేకాదు. ప్రయోజనం పొందడంకూడా. అది కేవలం డబ్బుతోనే కాకపోవచ్చు. ధర్మబద్ధమైన చేతలు కూడా కావచ్చు. కీర్తిప్రతిష్టలను సంపాదించుకొనుట అనేది న్యాయబద్ధముగా, ఒరులకు హానికలగని రీతిలో, కష్టపడి లేదా ఒకరి నుండి అర్ధింపబడి తెచ్చుకోవలెను. సంపదలను సంపాదించుటలో మోసము, దొంగతనము అనేవి కూడదు.

*కామము* శారీరక లేక ఇంద్రియ లేక లౌకిక సుఖాలు మాత్రమే కాదు. ఏదైనా ధర్మబద్ధముగా పొంది అనుభవించుట. అన్యపురుషుడుని గాని అన్యస్త్రీనిగాని ఒప్పించి రప్పించుకోవడం ధర్మబద్ధం కానేరదు. కేవలం తనను చేపట్టిన జీవితభాగ స్వామితో మాత్రమే సంతానేచ్ఛకు, లౌకికానందమునకూ ప్రవర్తించవలయును. పురుషునికి అన్యస్త్రీ సంపర్కము, స్త్రీకి అన్యపురుషుని సాంగత్యము ధర్మవిరుద్ధము, నరక కారణము.

*మోక్షము*: ధర్మార్థకామములు అను పై మూడును ధర్మబద్ధముగా నిర్వహించినచో మోక్షము అనునది శ్రీమాతయే సంప్రాప్తింపజేయును. పునర్జన్మ రాహిత్యము లేక సంసారచక్రము నుండి విడుదల అనే మోక్షమును కలుగ జేయును.

ధర్మార్థకామములు అనేవి గృహస్థు దంపతులిరువురూ కలసి సాధించవచ్చు కాని మోక్షం వ్యక్తిగతం. అందుకే పెళ్ళి ప్రమాణాల్లో *ధర్మేచ-అర్థేచ-కామేచ నాతిచరామి* అని అంటారే గాని *మోక్షేచ* అన్నది కలిపి చెప్పరు. మరి కొందరు పురోహితులు చెపుతారేమో గాని అది *ధర్మవిరుద్ధము*

సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము, కైవల్యము అనునవి ముక్తిపంచకము లనబడును.

జగన్మాత *సర్వార్థదాత్రీ* అన్నాము. అనగా పురుషార్థములతో బాటు భక్తులకు సర్వాభీష్టసిద్ధియు కలుగజేయును.

ఇంతకు ముందునామ మంత్రముల ప్రస్తావనలో అనుకున్నట్లు భక్తులు నాలుగు విధములైన వారుందురు.

ఆర్తితో ప్రార్థిస్తే ఆపదలు తొలగిపోతాయి.

జగన్మాత తత్త్వాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసతో ప్రార్థిస్తే ఆ తల్లి తాను సృష్టించిన జగత్తులను ఒక *శ్రీమహారాజ్ఞి* గా ఎలా నిర్వహిస్తోందో, బ్రహ్మత్త్వం ఎలా సిద్ధిస్తుందో ఇత్యాది విషయాలు తెలియజేస్తుంది.

అర్థార్థికి చతుర్విధ పురుషార్థములలో తాను కోరినది చేకూర్చును. ధ్రువుడు భగవంతుని ప్రార్థించి తన పినతల్లి నిరాకరించిన తండ్రి అంక సీమకన్నను అత్యున్నతమైన శాశ్వతమైన నక్షత్రమండలమును, అందులో ధ్రువతారగా దిక్కులు తెలియనివానికి దిక్కులు తెలియజేసినవానిగా విరాజిల్లినాడు.

పూర్వజన్మసుకృతమైన జ్ఞానముతోనూ, తల్లిగర్భములో నుండగానే హరికీర్తన మహత్తత్త్వమును నారదుని ద్వారా గురుబోధనను పొందిసవాడై తన తండ్రికి సద్గుతులకోసమే ప్రార్థించాడు. పలువురికి పరమాత్మ తత్త్వమును బోధించాడు.

జగన్మాత *సర్వార్థదాత్రి* గనుక తన భక్తులకు వారి వారి దీక్షాసామర్థ్యము ననుసరించి పురుషార్థప్రాప్తియు, సర్వాభీష్ట సిద్ధియు కలుగజేయును. జగన్మాత *పురుషార్థప్రదాయనీ* అని 291వ నామ మంత్రంలో స్మరిస్తున్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సర్వార్థదాత్ర్యై నమః* అని అనవలెను.

PVD Subrahmanyam చెప్పారు...

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*15.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*యతో యతోఽసౌ ప్రహరత్పరశ్వధో మనోఽనిలౌజాః పరచక్రసూదనః|*

*తతస్తతశ్ఛిన్నభుజోరుకంధరా నిపేతురుర్వ్యాం హతసూతవాహనాః॥7845॥*

శత్రుసేనలను చీల్చిచెండాడుటలో తిరుగులేనివాడైన భార్గవరాముడు వాయువేగ మనోవేగములతో విజృభించుచు శత్రుసేనలను దెబ్బతీయుచుండెను. ఆ మహావీరుని పరశువు తాకినంతనే శత్రుయోధుల యొక్క భుజములు ముక్కలగుచుండెను. ఊరువులు చీలికలై పోవుచుండెను. మెడలు తెగిపడుచుండెను. సారథులు కూలిపోవుచుండిరి. వాహనములు ఛిన్నాభిన్నములగు చుండెను. ఆ విధముగా శత్రుసేనలన్నియును మట్టికరచెను.

*15.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*దృష్ట్వా స్వసైన్యం రుధిరౌఘకర్దమే రణాజిరే రామకుఠారసాయకైః|*

*వివృక్ణచర్మధ్వజచాపవిగ్రహం నిపాతితం హైహయ ఆపతద్రుషా॥7846॥*

రణరంగమున పరశురాముని గండ్రగొడ్డలి దెబ్బకు, బాణముల ధాటికి తన సైనికులయొక్క కవచములు, ధ్వజములు, ధనుస్సులు, శరీరములు (స్వరూపములు) తుత్తునియలైపోగా, ఆ సైన్యమంతయును బురద బురదగా మారిన రక్తపుమడుగులో పడియుండుటను కార్తవీర్యార్జునుడు చూచెను. వెంటనే అతడు మిగుల .కృద్ధుడై ఆ భార్గవరాముని మీద విరుచుకొనిపడెను.

*15.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*అథార్జునః పంచశతేషు బాహుభిర్ధనుఃషు బాణాన్ యుగపత్స సందధే|*

*రామాయ రామోఽస్త్రభృతాం సమగ్రణీస్తాన్యేకధన్వేషుభిరాచ్ఛినత్సమమ్॥7847॥*

అప్పుడు కార్తవీర్యార్జునుడు ఒక్కసారిగా ఐదువందల చేతులలో ధనుస్సులను, ఐదువందల చేతులలో బాణములను ధరించి, పరశురామునిపై ప్రయోగించెను. అంతట ధనుర్ధారులలో మేటియైన భార్గవరాముడు ఒకే ఒక్క ధనుస్సునందు సంధించిన బాణములతో వాటినన్నింటిని ఒక్కపెట్టున ముక్కలు ముక్కలు గావించెను.

*15.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*పునః స్వహస్తైరచలాన్ మృధేఽఙ్ఘ్రిపానుత్క్షిప్య వేగాదభిధావతో యుధి|*

*భుజాన్ కుఠారేణ కఠోరనేమినా చిచ్ఛేద రామః ప్రసభం త్వహేరివ॥7848॥*

*15.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*కృత్తబాహోః శిరస్తస్య గిరేః శృంగమివాహరత్|*

*హతే పితరి తత్పుత్రా అయుతం దుద్రువుర్భయాత్॥7849॥*

పిమ్మట ఆ హైహయవీరుడు తన వేయి చేతులతో మహా పర్వతములను, పెద్దపెద్ద వృక్షములను పెకలించి తీసికొని, సమరభూమియందు అతివేగముగా పురోగమించుచు పరశురామునిపై దూకెను. అప్పుడు ఆ భార్గవవీరుడు పదునైన అంచులుగల తన కుఠారముతో సర్పములవలె ఒప్పుచున్న ఆ హైహయుని బాహువులను బలముకొలది ఛేదించెను. పరశురాముడు ఆ విధముగా హైహయుని సహస్రబాహువులను ఛేదించి, గిరిశిఖరమువలెనున్న అతని శిరస్సునుగూడ ఖండించెను. కార్తవీర్యుడు రణభూమికి బలియైనంతనే అతని పదివేలమంది పుత్రులును భీతిల్లి బ్రతుకుజీవుడా యనుచు పిక్కబలము చూపిరి.

*15.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*అగ్నిహోత్రీముపావర్త్య సవత్సాం పరవీరహా|*

*సముపేత్యాశ్రమం పిత్రే పరిక్లిష్టాం సమర్పయత్॥7850॥*

శత్రుసంహారదక్షుడైన భార్గవరాముడు శత్రువుల పరమై దుఃఖితుయైయున్న కామధేనువును, దాని దూడసు దగ్గరకు తీసికొని, తిన్నగా ఆశ్రమమునకు చేరెను. పిమ్మట అతడు ఆ హోమధేనువును తన తండ్రియగు జమదగ్నిమహర్షికి సమర్పించెను.

*15.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*స్వకర్మ తత్కృతం రామః పిత్రే భ్రాతృభ్య ఏవ చ|*

*వర్ణయామాస తచ్ఛ్రుత్వా జమదగ్నిరభాషత॥7851॥*

తదుపరి పరశురాముడు సమరరంగమున తానొనర్చిన ఘనకార్యమును (కార్తవీర్యార్జునుని, అక్షౌహిణుల కొలదిగాగల అతని సైన్యమును హతమార్చిన తీరును) తన తండ్రికిని, సోదరులకును పూర్తిగా వివరించి చెప్పెను. అంతట జమదగ్ని మహాముని ఇట్లు నుడివెను-

*15.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*రామ రామ మహాబాహో భవాన్ పాపమకారషీత్|*

*అవధీన్నరదేవం యత్సర్వదేవమయం వృథా॥7852॥*

అయ్యయ్యో! పరశురామా! నీవు ఎంతటి పాపమొనర్చితివి? నిజముగా నీవు భుజబలము గలవాడవే. ఐనను, *దైవాంశతో ఒప్పెడి* మహారాజును వృథాగా చంపితివి.

*దైవాంశతో ఒప్పెడి* అనగా *నాఽవిష్ణుః పృథివీ పతిః* దైవాంశలేనివాడు రాజు కాజాలడు. అనగా దైవాంశగలవాడే రాజగును.

PVD Subrahmanyam చెప్పారు...

*15.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*వయం హి బ్రాహ్మణాస్తాత క్షమయార్హణతాం గతాః|*

*యయా లోకగురుర్దేవః పారమేష్ఠ్యమగాత్పదమ్॥7853॥*

నాయనా! రామా! మనము బ్రాహ్మణులము. సహనము వలననే మనకు పూజ్యత కల్గినది. ఈ క్షమాగుణ ప్రభావముననే బ్రహ్మదేవుడు పరమేష్ఠి పదమును పొందెను, లోకగురువయ్యెను.

*15.40 (నలుబదియవ శ్లోకము)*

*క్షమయా రోచతే లక్ష్మీర్బ్రాహ్మీ సౌరీ యథా ప్రభా|*

*క్షమిణామాశు భగవాంస్తుష్యతే హరిరీశ్వరః॥7853॥*

బ్రాహ్మణులు క్షమాగుణమును కలిగియున్నప్పుడు లోకముస వర్ధిల్లుదురు. అప్పుడే వారు సూర్యునివలె తేజోమూర్తు లగుదురు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు, పరమేశ్వరుడు ఐన శ్రీహరి క్షమామూర్తులయెడ శీఘ్రముగా ప్రసన్నుడగుచుండును.

*15.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*రాజ్ఞో మూర్ధాభిషిక్తస్య వధో బ్రహ్మవధాద్గురుః|*

*తీర్థసంసేవయా చాంహో జహ్యంగాచ్యుతచేతనః॥7854॥*

నాయనా! పరశురామా! పట్టాభిషిక్తుడైన మహారాజును వధించుట బ్రహ్మహత్యను మించిన పాపకృత్యము. కనుక, నీవు శ్రీహరిధ్యాన తత్పరుడవై గంగాదితీర్థములను సేవించి నీ పాపములను ప్రక్షాళితమొనర్చుకొనుము".

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే పంచదశోఽధ్యాయః (15)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పదునైదవవ అధ్యాయము (15)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*16.1 (ప్రథమ శ్లోకము)*

*పిత్రోపశిక్షితో రామస్తథేతి కురునందన|*

*సంవత్సరం తీర్థయాత్రాం చరిత్వాఽఽశ్రమమావ్రజత్॥7855॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! పరశురాముడు తన తండ్రియాదేశమును శిరసా వహించి, ఒక సంవత్సరకాలము తీర్థయాత్రలను గావించి మరల ఆశ్రమమునకు చేరెను.

*16.2 (రెండవ శ్లోకము)*

*కదాచిద్రేణుకా యాతా గంగాయాం పద్మమాలినమ్|*

*గంధర్వరాజం క్రీడంతమప్సరోభిరపశ్యత॥7856॥*

*16.3 (ముడవ శ్లోకము)*

*విలోకయంతీ క్రీడంతముదకార్థం నదీం గతా|*

*హోమవేలాం న సస్మార కించిచ్చిత్రరథస్పృహా॥7857॥*

*16.4 (నాలుగవ శ్లోకము)*

*కాలాత్యయం తం విలోక్య మునేః శాపవిశంకితా|*

*ఆగత్య కలశం తస్థౌ పురోధాయ కృతాంజలిః॥7858॥*

ఒకానొక సమయమున రేణుకాదేవి జలములను తీసికొని వచ్చుటకై గంగానదికి వెళ్ళెను. అప్పుడు చిత్రరథుడను గంధర్వుడు పద్మముల మాలను ధరించి, అప్సరసలతోగూడి జలక్రీడలాడుచుండగా ఆమె (రేణుకాదేవి) చూచెను. అంతట వారి వినోదక్రీడలను చూచుచున్న సమయమున ఆమె మనస్సు ఆ గంధర్వునియెడ ఆకర్షితమయ్యెను. తన మనస్సును ఆకట్టుకొనిన ఆ దృశ్యమును చూచుటలో మునిగి, ఆమె పతిదేవుని అగ్నికార్యసమయమునే మరచిపోయెను. కొంతతడవునకు కాలతీతమైనట్లు గ్రహించుటతో ఆమె తస విలంబమునకు ఆగ్రహించి ముని (తన భర్తయగు జమదగ్ని) శపించునేమోయని భయపడుచు ఆశ్రమమునకు చేరెను. పిదప ఆమె జలకలశమును తన పతియెదుట ఉంచి అంజలి ఘటించి నిలబడెను.

*16.5 (ఐదవ శ్లోకము)*

*వ్యభిచారం మునిర్జ్ఞాత్వా పత్న్యాః ప్రకుపితోఽబ్రవీత్|*

*ఘ్నతైనాం పుత్రకాః పాపామిత్యుక్తాస్తే న చక్రిరే॥7859॥*

*16.6 (ఆరవ శ్లోకము)*

*రామః సంచోదితః పిత్రా భ్రాతౄన్ మాత్రా సహావధీత్|*

*ప్రభావజ్ఞో మునేః సమ్యక్ సమాధేస్తపసశ్చ సః॥7860॥*

అప్పుడు జమదగ్ని తన భార్యయొక్క మానసిక వ్యభిచారమును ఎఱింగి, మిగుల క్రుద్ధుడై తన కుమారులతో 'ఈ పాపాత్మురాలిని వధింపుడు' అని పలికెను. కాని, వారు అందులకు సిద్ధపడక మిన్నకుండిరి. అప్పుడు ఆ మహాముని తన చిన్నకుమారుడైన పరశురాముని 'ఓయీ! పాపాత్మురాలైన మీ తల్లిని, నా ఆజ్ఞను ఉల్లంఘీంచిన మీ సోదరులను వధింపుము' అని ఆదేశించెను. పరశురాముడు తన తండ్రియొక్క యోగనిష్ఠను, తపశ్శక్తిని వాటి ప్రభావమును బాగుగా ఎఱిగినవాడు. అందువలన, అతడు తన పిత్రాజ్ఞను తలదాల్చి, వెంటనే తన తల్లిని, సోదరులను వధించెను.

*16.7 (ఏడవ శ్లోకము)*

*వరేణ ఛందయామాస ప్రీతః సత్యవతీసుతః|*

*వవ్రే హతానాం రామోఽపి జీవితం చాస్మృతిం వధే॥7861॥*

సత్యవతిసుతుడైన జమదగ్ని తన కుమారుడైన పరశురాముని పితృభక్తికి మిక్కిలీ సంతోషించి 'వరమును కోరుకొనుము' అని పలికెను. అంతట పరశురాముడు 'తండ్రీ! మా మాతృమూర్తిని, సోదరులను పునర్జీవితులను గావింపుము, నేను వధించిన విషయము వారికి తెలియకుండునట్లు అనుగ్రహింపుము' అని కోరుకొనెను.

*16.8 (ఎనిమిదవ శ్లోకము)*

*ఉత్తస్థుస్తే కుశలినో నిద్రాపాయ ఇవాంజసా|*

*పితుర్విద్వాంస్తపోవీర్యం రామశ్చక్రే సుహృద్వధమ్॥7862॥*

అంతట పరశురాముని తల్లియు, సోదరులును నిద్రనుండి మేల్కొనినవారివలె లేచి కూర్చుండిరి. లోకజ్ఞుడైన భార్గవరాముడు తన తండ్రియొక్క తపోమహిమను పూర్తిగా ఎఱిగినవాడైనందుననే సమస్ఫూర్తితో తన ఆత్మీయులను వధించెను. ప్రతిభామూర్తియనగా పరశురాముడే.

*16.9 (తొమ్మిదవ శ్లోకము)*

*యేఽర్జునస్య సుతా రాజన్ స్మరంతః స్వపితుర్వధమ్|*

*రామవీర్యపరాభూతా లేభిరే శర్మ న క్వచిత్॥7863॥*

పరశురాముని పరాక్రమమునకు భయపడి పారిపోయిన ఆ హైహయుని కుమారులకు వారి తండ్రియొక్క దుర్మరణ సంఘటన పదేపదే గుర్తునకు వచ్చుచుండెను. దానిని వారు విస్మరింపలేకుండిరి. వారలో ప్రతీకారవాంఛ క్షణక్షణమునకు పెల్లుబుకుచుండెను. అందువలన వారి మనస్సులు ప్రశాంతికి దూరమగుచుండెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*699వ నామ మంత్రము*

*ఓం సావిత్ర్యై నమః*

లోకములను సృష్టించిన పరమశివుని భార్యగాను, సూర్యునికి ప్రకాశమును కలిగించునదిగాను, వేదశబ్ద ప్రయోగముతో దేవతలచే సేవింపబడుట చేతను, భావశుద్ధి కలిగియుండుటచేతను, పుష్కరాధిష్ఠాన దేవతగా తేజరిల్లుట చేతను సావిత్రీ యను నామముతో తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సావిత్రీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును
*ఓం సావిత్ర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు చక్కని తేజోవంతమైన శరీరకాంతితోను, ఆయురారోగ్యములతోను, ఆధ్యాత్మిక జ్ఞానంతోను తేజరిల్లుచూ ఆ పరమేశ్వరి కరుణను అపారముగా పొందగలుగును.

సర్వ జగత్తు సృష్టించినవాడు పరమశివుడు (ప్రసవించువాడు అని చెప్పబడినది) గాన ఆయనకు *సవిత* అను నామము గలదు. ఆయన భార్య అయిన జగన్మాత *సావిత్రి* అని నామ ప్రసిద్ధమయినది.

జీవుల యొక్క బుద్ధిని, కర్మను ప్రేరేపించువాడు *సవిత* అనబడతాడు. అలా ప్రేరేపించువాడు పరమశివుడు. అట్టి పరమశివుని భార్య *సావిత్రి* అని నామ ప్రసిద్ధమయినది.

PVD Subrahmanyam చెప్పారు...

జగన్మాత గాయత్రీ స్వరూపిణి. అట్టి గాయత్రీ స్వరూపిణిని త్రికాల సంధ్యావందనములలో ఆరాధిస్తాము. ప్రాతఃకాల సంధ్యావందనమప్పుడు

ప్రాతఃకాల తర్పణంలో

*సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||* అని జగన్మాతను గాయత్రిస్వరూపిణిగా ఆరాధస్తాము.

*గాయత్రీ వ్యాహృతి స్సంధ్యా ద్విజబృంద నిషేవితా* (శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలో 90వ శ్లోకము, 2వ పాదము)

మధ్యాహ్న తర్పణంలో

*సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||*

*సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానంద రూపిణీ* (శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలో 136వ శ్లోకము, 2వ పాదము)

*సాయంకాల తర్పణం*

*సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||* అని జగన్మాతను సరస్వతీ స్వరూపంగా ఆరాధిస్తాము.

*సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ* (శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలో 137వ శ్లోకము, 2వ పాదము)

సావిత్రి దేవతలచే పూజింపబడినది. యోగంలో ఆరాధింపబడింది. స్మృతలచేత కూడా కొనియాడబడే *సావిత్రి* శుద్ధమైనది.

*సావిత్రీ పుష్కరే నామ్నా తీర్థానాం ప్రవరే శుభా*(సౌభాగ్యభాస్కరం - 808వ పుట)

సావిత్రి పుష్కరతీర్థంలో దేవత.

జగన్మాతకు నమస్కరించినపుడు *ఓం సావిత్ర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*122వ నామ మంత్రము*

*ఓం శాంభవ్యై నమః*

శంభుని (శివుని) భార్యగా, శాంభవీ దిక్షాస్వరూపిణిగా, శాంభవీ ముద్రాస్వరూపిణిగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శాంభవీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం శాంభవ్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణచే సర్వాభీష్టసిద్ధి, శాంతి, సౌఖ్యములు లభించును.

శంభుడు అనగా శంకరుడు. ఆ శంభుని భార్యగా *శాంభవీ* యను నామము కలిగియున్నది. శాంభవీ అనగా ఎనిమిది సంవత్సరముల బాలిక. శారదానవరాత్రులలో ఆశ్వయుజ సప్తమి, అనగా శరన్నవరాత్రులలో ఏడవ రోజున ఎనిమిది సంవత్సరముల బాలికకు పూజచేయుదురు. ఈ పూజనే కుమారీ పూజ అనికూడా అంటారని దేవీభాగవతంలో చెప్పబడినది. జగన్మాత కుమారీ స్వరూపిణిగా పూజింపబడుతూ *శాంభవీ* అని స్తుతింపబడుచున్నది.

యోగశాస్థ్రములో *శాంభవీ* అను యోగముద్ర గలదు.

*అంతర్లక్ష్యం బహిర్దృష్టిః నిమేషోన్మేషవర్జితా|*

*ఏషా సా శాంభవీముద్రా సర్వతంత్రేషు గోపితా॥॥* అని కల్పసూత్రంలో గలదు.

కన్నులు బాహ్యప్రపంచమును చూచుచున్నట్లు కనబడిననూ, ఆ కన్నుల రెప్పలు ముడుచుట తెరచుట లేక, (అరమోడ్పు కన్నులు), ఆ దృష్టి సహస్రారంలోని బిందువు వద్ద కేంద్రీకృతమై ఉండే ఈ యోగ స్థితిని *శాంభవీ* ముద్ర అంటారు.

కల్పసూత్రములలో చెప్పిన ప్రకారము మూడు రకాల దీక్షలు. అవి 1) శాక్తి, 3) శాంభవి, 3) మాంత్రి. సద్గురువు యోగ్యుడని భావించు శిష్యునకు ఇచ్చు దీక్షలలో శాంభవీ దీక్ష ఒకటి. పరమ శివుడిని *శం* కరుడు. అని *శం* అను అక్షరాన్ని ప్రత్యేకంగా విశేషిస్తే, *శం* అనగా శాంతి, సుఖము అని అర్థం. మానసిక, శారీరక రుగ్మతలకు యోగా చేయమని అంటారు. అలా మనం యోగదీక్షలో ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో *ఓం* అనేది మాత్రమే ఉంటే మనకు కలిగే అనుభూతిని *శం* అవుతుంది. ఈ *శం* అనేదే మనకు కలిగే శాంతి, సౌఖ్యముల అనుభూతి. అరిషడ్వర్గములు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు) మనపై ప్రభావం చూపుతున్నప్పుడు, ఈ ప్రభావాన్ని అదుపు చేయడానికి కావలసినది *శమము* అను పదము *శం* నుండి వచ్చినదే. శాంతి, సుఖములు శంభుని వద్ద లభిస్తాయి. శంభుడు అంటే అయ్యవారు వ్యక్తంకానివన్నీ ఆయనే అయితే ఆయనవద్ద వ్యక్తమయే *శం* అను (శాంతి,సౌఖ్యముల) రూపమే వ్యక్తమయే ప్రతీదీ అయిన అమ్మవారు. అందుకే ఆ జగన్మాత *శాంభవీ* అని అన్నాము.

శాంతి,సౌఖ్యముల ప్రతిరూపమైన ఆ తల్లికి నమస్కరించునపుడు *ఓం శాంభవ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*700వ నామ మంత్రము*

*ఓం సచ్చిదానంద రూపిణ్యై నమః*

సత్యము, జ్ఞానము, ఆనందము అను మూడు లక్షణముల కలయికతో *సచ్చిదానందస్వరూపిణి* గా విరాజిల్లు పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సచ్చిదానంద రూపిణీ* యను ఎనిమిది అక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సచ్చిదానంద రూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతను ఉపాసించు సాధకుడు సత్యము, నిత్యమైన ఆ పరబ్రహ్మముయొక్క వైనము తెలిసి ఆత్మానందానుభూతితో అన్యమేమీ అవసరములేని స్థితికి చేరగలుగును.

జగన్మాత యొక్క స్వరూపం ఆపాదమస్తకం ఎన్నో నామ మంత్రములలో వర్ణింపబడినది.

*ఇక్కడ కొన్ని నామ మంత్రములు మనం ఒకసారి జ్ఞాపకంచేసుకుందాము.

6వ నామ మంత్రములో *ఉద్యద్భానుసహస్రాభా* ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతిని బోలునది జగన్మాత.

7వ నామ మంత్రము *చతుర్బాహుసమన్వితా* నాలుగు బాహువులు కలిగియున్న జగన్మాత.

14వ నామమంత్రము *కురువిందమణి శ్రేణీ కనత్కోటీరమండితా* జగన్మాత కిరీటము పద్మరాగమణులతో ప్రకాశించుచున్నది.

ఇలా అమ్మవారి లలాటము, ముఖబింబము, ముఖ కాంతిప్రవాహంలో చలించే మీనములతో బోలిన నయనములు, సంపంగివంటి నాసాదండము, శుక్రనక్షత్రకాంతిని బోలిన ముక్కెర, సూర్యచంద్రులనదగిన అమ్మవారి చెవికమ్మలు, పద్మరాగశిలలను, అద్దాన్ని తిరస్కరించే కపోలము, కచ్ఛపీవీణా మాధుర్యాన్ని మరిపించే మధురాతి మధురమైన పలుకులు....ఇలా మణులతో కూడి, మంజులమైన సవ్వడులు వినిపించే కాలియందెలు గల పాద పద్మములవరకూ నామ మంత్రములు గలవని మనకు తెలుసు

అన్నిటికీ మించి జగన్మాత *మూలమంత్రాత్మిక* అనగా పంచదశీ మంత్రము *(క, ఏ, ఈ, ల, హ్రీం, హ, స, క, హ, ల, హ్రీం, స, క, ల, హ్రీం)* లోని మొదటి ఐదు అక్షరములు - *క, ఏ, ఈ, ల, హ్రీం* (వాగ్భవకూటము) ముఖపద్మముగను, మధ్యనున్న ఆరు అక్షరములు - *హ, స, క, హ, ల, హ్రీం* (కామరాజకూటము) కంఠము క్రిందనుండి కటివరకూ గల ప్రదేశముగను, చివరి నాలుగక్షరములు *స, క, ల, హ్రీం* (శక్తికూటము) కటి దిగువ నుండి పాదముల వరకు గల ప్రదేశమును చెప్పడం జరిగినది. *మూలకూటత్రయకళేబరా* అనగా వాగ్భవ, కామరాజ, శక్తికూటములే జగన్మాత శరీరము.

కాని *(సచ్చిదానంద రూపిణీ)* అనే ఈ నామ మంత్రానికి ఇతర మంత్రములవలె కాదు. ఆ తల్లి సచ్చిదానందములు (సత్, చిత్, ఆనందము) స్వరూపములు గలది. ఆ స్వరూపము సాధకుడు సాధనలోనే తెలియగలడు (అనుభవైకవేద్యము) గాని, ఇతర మంత్రములతో చెప్పబడలేదు. ఈ స్వరూపమును ఊహించుతూ జగన్మాతను ఉపాసిస్తే లభించేది పరమసుఖమే అంటే సచ్చిదానందమే. బ్రహ్మము సత్యము. జగన్మాత *పరబ్రహ్మస్వరూపిణి*. ఆ పరబ్రహ్మము సత్యము కనుక జగన్మాత *సత్యస్వరూపిణి*. ఆ తల్లి *చిదగ్నికుండసంభూత* అనగా శుద్ధచైతన్యం నుండి ఉద్భవించింది గనుక *జ్ఞానస్వరూపిణి*. ఈ లక్షణముల కలయిక అయిన *సత్, చిత్, ఆనంద* ములే *సచ్చిదానందరూపిణి* గా జగన్మాత నామ ప్రసిద్ధి చెందినది.

అటువంటి తల్లికి నమస్కరించునపుడు *ఓం సచ్చిదానందరూపిణ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*123వ నామ మంత్రము*

*ఓం శారదారాధ్యాయై నమః*

సరస్వతీ దేవిచే ఆరాధింపబడునదిగా, శరదృతువునందు ఉపాసింపబడునదిగా, వశిన్యాది వాగ్దేవతలచే పూజింపబడునదిగా, వసంత నవరాత్రులలో సేవింపబడునదిగా విరాజిల్లు జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శారదారాధ్యా* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం శారదారాధ్యాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు సాధకునకు ఎనలేని బ్రహ్మజ్ఞానసంపదతో బాటు భౌతికపరమైన సుఖసంతోషములు కూడా సంప్రాప్తమగును.

*సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా* (శ్రీలలితా సహస్రనామ స్తోత్రం, 123వ శ్లోకం, 614వ నామ మంత్రము) జగన్మాత తనకు ఎడమకుడిప్రక్కల లక్ష్మీ, సరస్వతులచే సేవింపబడినది అనికలదు. అనగా శారదా (సరస్వతీ) దేవిచే ఆరాధింపబడినది కనుక శ్రీమాతను *శారదారాధ్యా* అని స్తుతించాము. శారదానవరాత్రులు అని దశరానవరాత్రులను అంటాము. శరదృతువులో తొలి పదిరోజులలో ఈ నవరాత్రులు వస్తాయి. శారత్ ఋతువులో ఆరాధింపబడునది గనుక శ్రీమాతను *శారదారాధ్యా* అని అన్నాము.

కాళికా పురాణంలో

*శరత్కాలే పురాయస్మాన్నవమ్యాం బోధితా సురైః|*

*శారదా సా సమాఖ్యాతా పీఠే లోకే చ నామతః॥*

అని చెప్పబడిసది. అనగా పూర్వము దేవతలచే శరత్కాల నవమినాడు మేల్కొల్పబడినది అగుటచే శారదా పీఠమనియు, ఆ పీఠమందుగల శ్రీమాత *శారద* అని పిలవబడుచున్నది. శరత్ అంటే సంవత్సరమని అమరంలో గలదు. సంవత్సరమునకు ప్రారంభంలో అనగా చేసిన దేవీపూజ మహాపూజ అవుతుంది అని మార్కండేయ పురాణమందు చెప్పబడినది. అందుచే శ్రీదేవిని *శారదారాధ్యా* అను నామ మంత్రముతో ఆరాధిస్తున్నాము. వసంత ఋతువులోని నవరాత్రులలో దేవిని పూజించ వలెనని రుద్రయామళమందు చెప్పబడినది. శారద అను శబ్దమునకు శాలీనుడు, ప్రతిభగలవాడు అని మేదినీ నిఘంటువు ప్రకారం చెబుతారు. కొందరు పండితులు సభలకు వెళ్ళక శాలలోనే ఉండి అన్తర్ముఖులై దేవిని ఆరాధింతురు. అట్టి శాలీనులచే ఆరాధింపబడు శ్రీమాతను *శారదారాధ్యా* అని అన్నారు. వశిన్యాది దేవతలు సాక్షాత్ సరస్వతీ (శారదా) రూపులు. అటువంటి వశిన్యాదులచే శ్రీమాత ఆరాధింపబడుచున్నది గనుక *శారదారాధ్యా* అని అన్నారు.

అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శారదారాధ్యాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*16.10 (పదియవ శ్లోకము)*

*ఏకదాఽఽశ్రమతో రామే సభ్రాతరి వనం గతే|*

*వైరం సిసాధయిషవో లబ్ధచ్ఛిద్రా ఉపాగమన్॥7864॥*

*16.11 (పదకొండవ శ్లోకము)*

*దృష్ట్వాగ్న్యగార ఆసీనమావేశితధియం మునిమ్|*

*భగవత్యుత్తమశ్లోకే జఘ్నుస్తే పాపనిశ్చయాః॥7865॥*

*16.12 (పండ్రెండవ శ్లోకము)*

*యాచ్యమానాః కృపణయా రామమాత్రాతిదారుణాః|*

*ప్రసహ్య శిర ఉత్కృత్య నిన్యుస్తే క్షత్రబంధవః॥7866॥*

ఒకానొక సమయమున పరశురాముడును, ఆయన సోదరులును ఆశ్రమమునకు దూరముగా వనమునకు వెళ్ళియుండిరి. అప్పుడు పగదీర్చుకొనుటకు ఎదురు చూచుచున్న కార్తవీర్యుని పుత్రులు అదను చూచుకొని, జమదగ్ని ఆశ్రమమునకు చేరిరి. అప్పుడు జమదగ్ని మహర్షి అగ్నిహోత్ర శాలయంధు ఆశీనుడై , జగన్నాథుడైన సర్వేశ్వరుని యందే మనస్సును నిలిపి ధ్యానముద్రలో ఉండెను. అంతట పాపకృత్యములకు ఒడిగట్టవచ్చిన ఆ హైహయసూనులు వెంటనే ఆ మహామునిని చంపివేసిరి. అంతట పరశురాముని తల్లియైన రేణుకాదేవి దైన్యముతో ఎంతగా వేడుకొనుచున్నను దయచూపక ఆ క్షత్రియాధములు మిగుల దారుణముగా ఆ మహాముని (జమదగ్ని) శిరస్సును ఖండించి తీసికొని పోయిరి.

*16.13 (పదమూడవ శ్లోకము)*

*రేణుకా దుఃఖశోకార్తా నిఘ్నంత్యాత్మానమాత్మనా|*

*రామ రామేతి తాతేతి విచుక్రోశోచ్చకైః సతీ॥7867॥*

అంతట రేణుకా సాధ్వి పతి వధింపబడి నందులకు తట్టుకొనలేక దుర్భరమైన దుఃఖశోకములతో విలవిలలాడుచు గుండెలు బాదుకొనుచు *నాయనా! రామా! రామా! (పరశురామా!) రమ్ము! రక్షింపుము!* అని పల్కుచు బిగ్గరగా గగ్గోలు పెట్టెను.

*16.14 (పదునాలుగవ శ్లోకము)*

*తదుపశ్రుత్య దూరస్థో హా రామేత్యార్తవత్స్వనమ్|*

*త్వరయాఽఽశ్రమమాసాద్య దదృశే పితరం హతమ్॥7868॥*

ఆశ్రమమునకు దూరమున ఉన్న పరశురామునకు 'హా! రామా! హా! రామా!' అను ఆర్తనాదములు వినబడెను. వెంటనే అతడు త్వరత్వరగా ఆశ్రమమునకు చేరి, అచట తన తండ్రి దారుణహత్యకు గురియైయుండుట చూచెను.

*16.15 (పదునైదవ శ్లోకము)*

*తద్దుఃఖరోషామర్షార్తిశోకవేగవిమోహితః|*

*హా తాత సాధో ధర్మిష్ఠ త్యక్త్వాస్మాన్ స్వర్గతో భవాన్॥7869॥*

*16.16 (పదునారవ శ్లోకము)*

*విలప్యైవం పితుర్దేహం నిధాయ భ్రాతృషు స్వయమ్|*

*ప్రగృహ్య పరశుం రామః క్షత్రాంతాయ మనో దధే॥7870॥*

అంతట భార్గవరాముడు అంతులేని పరితాపమునకు లోనయ్యెను. ఆయనలో క్రోధశోకములు ముప్పిరిగొనెను. ఆర్తితో రోదించుచు అతడు 'అయ్యో! తండ్రీ! నీవు గొప్ప మహాత్ముడవు, ధర్మనిరతుడవు. పూజ్యుడైన నీవు మమ్ములను అందరను ఇచటనే వీడి స్వర్గమును జేరితివి' అని విలపించెను. కొంతవడి ఇట్లు దుఃఖించిన పిమ్మట ఆ భార్గవరాముడు తన తండ్రి కళేబరమును సోదరుల రక్షణలో ఉంచి, స్వయముగా పరశువును చేబూని, క్షత్రియ వంశములను పరిమార్చుటకై దృఢముగా నిశ్చయించుకొని, అందులకు సన్నద్నుడయ్యెను.

*16.17 (పదిహేడవ శ్లోకము)*

*గత్వా మాహిష్మతీం రామో బ్రహ్మఘ్నవిహతశ్రియమ్|*

*తేషాం స శీర్షభీ రాజన్ మధ్యే చక్రే మహాగిరిమ్॥7871॥*

*16.18 (పదునారవ శ్లోకము)*

*తద్రక్తేన నదీం ఘోరామబ్రహ్మణ్యభయావహామ్|*

*హేతుం కృత్వా పితృవధం క్షత్రేఽమంగలకారిణి॥7872॥*

*16.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*త్రిఃసప్తకృత్వః పృథివీం కృత్వా నిఃక్షత్రియాం ప్రభుః|*

*సమంతపంచకే చక్రే శోణితోదాన్ హ్రదాన్ నృప॥7873॥*

పరీక్షిన్మహారాజా! వెంటనే పరశురాముడు మాహిష్మతీపురమున ప్రవేశించెను. బ్రహ్మహత్యలుకు పాల్పడిన హైహయుల కారణముగా, ఆ నగరము కళావిహీనమై యుండెను. పిమ్మట ఆ భార్గవరాముడు కార్తవీర్యార్జునుని కుమారులను తన గండ్రగొడ్డలికి బలియిచ్చెను. ఖండితములైన వారి శిరస్సులు నగరమధ్యమున పర్వతప్రమాణములో రాశిగా పడియుండెను. వారి దేహములనుండి స్రవించిన రక్తము ఏఱులై పాఱెను. ఆ భయానక దృశ్యమును చూచిన బ్రాహ్మణద్రోహుల గుండెలు దడదడలాడెను. తమకు తిరుగులేదను భావముతో ఆనాటి క్షత్రియులు ఒనర్చెడి ఆగడములకు అంతులేకుండెను. ఆ కారణముగా ఆగ్రహోదగ్రుడైన పరశురాముడు తన తండ్రి హత్యను కారణముగా చేసికొని, భూమండలమునగల క్షత్రియులపై ఇరవది యొక్కమారులు దాడిచేసి వారి వంశములను రూపుమాపెను. ఆ స్వామి విజృంభణ కారణముగా స్రవించిన ఆ క్షత్రియుల రక్తము కురుక్షేత్రమునందలి శమంతకపంచక ప్రదేశమున ఐదు మడుగులుగా ఏర్పడెను.

*16.20 (ఇరువదియవ శ్లోకము)*

*పితుః కాయేన సంధాయ శిర ఆదాయ బర్హిషి|*

*సర్వదేవమయం దేవమాత్మానమయజన్మఖైః॥7874॥*

అనంతరము పరశురాముడు తన తండ్రి శిరస్సును తీసికొనివచ్చి, ఆయన కళేబరముతో జతపఱచి, దానిని దర్భలపై ఉంచెను. పిమ్మట ఆ మహాత్ముడు సర్వదేవమయుడైన పరమాత్మను యజ్ఞముల ద్వారా ఆరాధించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*దదౌ ప్రాచీం దిశం హోత్రే బ్రహ్మణే దక్షిణాం దిశమ్|*

*అధ్వర్యవే ప్రతీచీం వై ఉద్గాత్రే ఉత్తరాం దిశమ్॥7875॥*

*16.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*అన్యేభ్యోఽవాంతరదిశః కశ్యపాయ చ మధ్యతః|*

*ఆర్యావర్తముపద్రష్ట్రే సదస్యేభ్యస్తతః పరమ్॥7876॥*

పిదప భార్గవరాముడు తాను జయించిన భూమండలము యొక్క తూర్పుభాగమును హోతకును, దళిణభాగమును బ్రహ్మకును (యజ్ఞమును నిర్వహింపజేసిన గురువునకును), పశ్చిమభాగమును అధ్వర్యునకును, ఉత్తరభాగమును ఉద్గాతకును సమర్పించెను. ఇతర ఋత్విజులకు ఆగ్నేయ-నైరృతి-వాయవ్య-ఈశాన్య భాగములను దానమొనర్చెను. మధ్యభాగమును కశ్యపమహర్షికి ఇచ్చివేసెను. ఆర్యావర్తమును *ఉపద్రష్ట* అను ఋత్విజునకును, ఇంకను మిగిలియున్న భూమిని సదస్యులకును (సభలోనున్న ఇతరులకును) దానమిచ్చెను.

*అవబృథస్నానము* = యజ్ఞదీక్షానంతరము చేసెడి స్నానమును *అవబృథస్నానము* అని యందురు.

*16.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*తతశ్చావభృథస్నానవిధూతాశేషకిల్బిషః|*

*సరస్వత్యాం బ్రహ్మనద్యాం రేజే వ్యబ్భ్ర ఇవాంశుమాన్॥7877॥*

పిమ్మట పరశురాముడు పవిత్ర నదీజలములలో అవబృథస్నానమొనర్చి పాపరహితుడయ్యెను. పిదప దివ్యమైన సరస్వతీ నదీతీరమున ఆ మహాత్ముడు మేఘములులేని ఆకాశమునందు సూర్యభగవానునివలె తేజరిల్లెను.

*16.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*స్వదేహం జమదగ్నిస్తు లబ్ధ్వా సంజ్ఞానలక్షణమ్|*

*ఋషీణాం మండలే సోఽభూత్సప్తమో రామపూజితః॥7878॥*

అంతట జమదగ్ని మహర్షి సంకల్పమయ శరీరమును పొంది, పరశురాముని పూజలను అందుకొనిన పిమ్మట, సప్తర్షి మండలములో ఒకడై లోకమునకు ఆరాధ్యుడయ్యెను.

*శ్లో. కశ్యపోఽత్రిర్భరద్వాజో విశ్వామిత్రోఽథగౌతమః| జమదగ్నిర్వశిష్ఠశ్చ సప్తైతే ఋషయస్తథా॥*

కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు - అనువారు *సప్తఋషులుగా* ఖ్యాతి గాంచినవారు. నవదంపతులు తమ వివాహదీక్షానంతరము ఈ మహాత్ములను విధ్యుక్తముగా ఆరాధింతురు.

*16.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*జామదగ్న్యోఽపి భగవాన్ రామః కమలలోచనః|*

*ఆగామిన్యంతరే రాజన్ వర్తయిష్యతి వై బృహత్॥7879॥*

*16.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*ఆస్తేఽద్యాపి మహేంద్రాద్రౌ న్యస్తదండః ప్రశాంతధీః|*

*ఉపగీయమానచరితః సిద్ధగంధర్వచారణైః॥7880॥*

పరీక్షిన్మహారాజా! జమదగ్ని కుమారులలో ప్రముఖుడు, కమలలోచనుడు ఐన పరశురామ భగవానుడు రాబోవు మన్వంతరమున సావర్ణి వేదప్రవర్తకులైన, సప్తర్షులలో ఒకటై వేదములను విస్తరింపజేసి ఖ్యాతి వహించును. ఆ స్వామి ఎవ్వరినీ ఏమాత్రము దండింపక, ప్రశాంతచిత్తుడై నేటికిని మహేంద్రగిరిపై విలసిల్లుచున్నాడు. సిద్ధులు, గంధర్వులు, చారణులు మున్నగు దివ్యజాతులవారు ఆ మహానుభావుని చరితమును మధురస్వరములతో గానము చేయుచుందురు.

*16.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*ఏవం భృగుషు విశ్వాత్మా భగవాన్ హరిరీశ్వరః|*

*అవతీర్య పరం భారం భువోఽహన్ బహుశో నృపాన్॥7881॥*

విశ్వాత్ముడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, సర్వసమర్థుడు ఐన శ్రీమన్నారాయణుడు భూభారమును తొలగించుటకై భృగువంశజులలో పరశురాముడై అవతరించి, గర్వోన్మత్తులైన పెక్కుమంది రాజులను తుదముట్టించెను.

ఈ శ్లోకమున ప్రయుక్తమైన *బహుశః* అను పదమును గూర్చి వ్యాఖ్యానించుచూ *వీరరాఘవీయము* ఇట్లు తెలుపబడినది.

*బహుశ ఇత్యనేన కశ్చిదవశేషితః స్యాత్ - ఇతి సూచ్యతే తదేవోక్తం పురస్తాత్*

*శ్లో. అశ్మకాన్మూలకోజజ్ఞే యః స్త్రీభిః పరిరక్షితః| నారీకవచ ఇత్యుక్తో నక్షత్రే మూలకోఽభవత్॥*

'బహుశ - అను పదముద్వారా క్షత్రియులు ఇంకను మిగిలియున్నట్లు సూచింపబడుచున్నది. అశ్మకుని వలన కలిగినవాడు మూలకుడు. పరశురాముడు క్షత్రియ వంశములను నిర్మూలించునప్పుడు ఈ మూలకుని అంతఃపుర స్త్రీలు పరిరక్షించిరి. అందువలన ఇతనికి *నారీకవచుడు* అను పేరు ప్రసిద్ధమయ్యెను. తరువాతి క్షత్రియ వంశములకు మూలముగా నిల్చినవాడు. గావున ఇతడు మూలకుడుగా గూడ వాసికెక్కెను.

*16.28 (ఇరువది ఐదవ శ్లోకము)*

*గాధేరభూన్మహాతేజాః సమిద్ధ ఇవ పావకః|*

*తపసా క్షాత్రముత్సృజ్య యో లేభే బ్రహ్మవర్చసమ్॥7882॥*

గాధివలన విశ్వామిత్రుడు జన్మించెను. అతడు ప్రజ్వలించుచున్న అగ్నివలె మహాతేజస్వి, ఆ మహాత్ముడు క్షాత్రధర్మమును వీడి, తీవ్రముగా తపస్సొనర్చి బ్రహ్మర్షియయ్యెను.

*16.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*విశ్వామిత్రస్య చైవాసన్ పుత్రా ఏకశతం నృప|*

*మధ్యమస్తు మధుచ్ఛందా మధుచ్ఛందస ఏవ తే॥7883॥*

పరీక్షిన్మహారాజా! విశ్వామిత్రునకు వందమంది పుత్రులు కలిగిరి. వారిలో నడిమివాడు మధుచ్ఛందుడు సుప్రసిద్ధుడు. అందువలన అందరును మధుచ్ఛందులుగా వ్యవహరింపబడిరి.

*16.30 (ముప్పదియవ శ్లోకము)*

*పుత్రం కృత్వా శునఃశేపం దేవరాతం చ భార్గవమ్|*

*ఆజీగర్తం సుతానాహ జ్యేష్ఠ ఏష ప్రకల్ప్యతామ్॥7884॥*

భృగువంశజుడు అజీగర్తుని కుమారుడు ఐన శునశ్శేపుని విశ్వామిత్రుడు తన కుమారునిగా స్వీకరించెను. అతడు తన నూరుగురు కుమారులతో 'ఇతనిని మీ పెద్దన్నగా భావింపుడు' అని పలికెను. ఈ శునశ్శేపునకు దేవరాతుడు అనియు నామాంతరము గలదు.

*16.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*యో వై హరిశ్చంద్రమఖే విక్రీతః పురుషః పశుః|*

*స్తుత్వా దేవాన్ ప్రజేశాదీన్ ముముచే పాశబంధనాత్॥7885॥*

*16.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*యో రాతో దేవయజనే దేవైర్గాధిషు తాపసః|*

*దేవరాత ఇతి ఖ్యాతః శునఃశేపః స భార్గవః॥7886॥*

క్షామబాధలకు తట్టుకొనలేక అజీగర్తుడు తన కుమారుడగు శునశ్శేపుని హరిశ్చంద్రునకు అమ్మెను. ఆ మహారాజు శునశ్శేపుని యజ్ఞపశువుగా జేసి, యూపస్తంభమునకు బంధించెను. అప్పుడు అతడు విశ్వామిత్రుని శరణు జొచ్చెను. పిమ్మట శునశ్శేపుడు విశ్వామిత్రునిచే ఉపదేశింపబడిన మంత్రమును జపించుచు అట్లేయుండెను. అంతట బ్రహ్మాది దేవతలు అతనియెడ ప్రసన్నులై, హరిశ్చంద్రునకు యజ్ఞఫలమును అనుగ్రహించి, అతనిని బంధవిముక్తుని గావించిరి. దేవతలనుద్దేశించి చేయబడిన ఆ యాగమునందు దేవతలచే బంధవిముక్తుడైనందున భృగువంశజుడైన శునశ్శేపుడు దేవరాతుడుగా ప్రసిద్ధి వహంచెను. విశ్వామిత్రునిచే కొడుకుగా చేరదీయబడినందున అతడు గాధివంశజులలో ఒకడై మసలుకొనెను.

*16.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*యే మధుచ్ఛందసో జ్యేష్ఠాః కుశలం మేనిరే న తత్|*

*అశపత్తాన్ మునిః క్రుద్ధో మ్లేచ్ఛా భవత దుర్జనాః॥7887॥*

విశ్వామిత్రుడు ఆదేశించినప్పటికిని మధుచ్ఛందులు (విశ్వామిత్రుని కుమారులు) శునశ్శేపుని తమ పెద్దన్నగా పరిగణించుటకు నిరాకరించిరి. అందువలన కుపితుడైన విశ్వామిత్రుడు- "మీరు నా ఆదేశమును పాటింపనందున అందరును దుర్జనులగు మ్లేచ్చులు కండు" అని వారిని శపించెను.

*16.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*స హోవాచ మధుచ్ఛందాః సార్ధం పంచాశతా తతః|*

*యన్నో భవాన్ సంజానీతే తస్మింస్తిష్ఠామహే వయమ్॥7888॥*

అంతట విశ్వామిత్రుని పుత్రులలో నడిమివాడగు మధుచ్ఛందుడు తన ఏబదిమంది తమ్ములతోగూడి, తండ్రితో 'తండ్రీ! నీవు ఆదేశించినరీతిగా మేము అందఱము ఈ శునశ్శేపుని జ్యేష్ఠభ్రాతగా గౌరవించెదము' అని పలికెను.

*16.35(ముప్పది ఐదవ శ్లోకము)*

*జ్యేష్ఠం మంత్రదృశం చక్రుస్త్వామన్వంచో వయం స్మ హి|*

*విశ్వామిత్రః సుతానాహ వీరవంతో భవిష్యథ|*

*యే మానం మేఽనుగృహ్ణంతో వీరవంతమకర్త మామ్॥7889॥*

పిమ్మట వారు శునశ్శేపునితో - 'మంత్రద్రష్టవైన నీవు మాకు పెద్దన్నవు. మేము నీ తమ్ములమై నిన్ను అసుసరించెదము' అని తెలిపిరి. అందులకు విశ్వామిత్రుడు సంతృప్పుడై 'మీరు శునశ్శేపుని అన్నగా గుర్తించితిరి. మీ వలన నేను ఒక సుపుత్రుని పొంది ధన్యుడనైతిని. కనుక, మీరును సుపుత్రులను పొందుదురు గాక' అని మధుచ్ఛందాదులను (ఏబదిమందిని) ఆశీర్వదించెను.

*16.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*ఏష వః కుశికా వీరో దేవరాతస్తమన్విత|*

*అన్యేచాష్టకహారీతజయక్రతుమదాదయః॥7890॥*

*16.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*ఏవం కౌశికగోత్రం తు విశ్వామిత్రైః పృథగ్విధమ్|*

*ప్రవరాంతరమాపన్నం తద్ధి చైవం ప్రకల్పితమ్॥7891॥*

పిదప విశ్వామిత్రుడు వారితో ఇంకను ఇట్లనెను- 'కుశిక వంశజులారా! ఈ శునశ్శేపుడు దేవరాతుడను పేర కౌశికగోత్రజుడేయగును. అతని ఆజ్ఞను మీరు పాలించగలరు. పరీక్షిన్మహారాజా! విశ్వామిత్రుని పుత్రులలో అష్టకుడు, హారీతుడు, జయుడు, క్రతుమంతుడు మొదలగువారును గలరు. ఈ విధముగా విశ్వామిత్రుని పుత్రులవలన కౌశికగోత్రములో అనేక ప్రవరలు (శాఖలు) ఏర్పడినవి. దేవరాతుడు జ్యేష్ట కుమారుడగుటవలన కౌశికగోత్ర ప్రవరలో రెండవవాడయ్యెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే షోడశోఽధ్యాయః (16)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పదహారవ అధ్యాయము (16)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*17.1 (ప్రథమ శ్లోకము)*

*యః పురూరవసః పుత్ర ఆయుస్తస్యాభవన్ సుతాః|*

*నహుషః క్షత్రవృద్ధశ్చ రజీ రంభశ్చ వీర్యవాన్॥7892॥*

*17.2 (రెండవ శ్లోకము)*

*అనేనా ఇతి రాజేంద్ర శృణు క్షత్రవృధోఽన్వయమ్|*

*క్షత్రవృద్ధసుతస్యాసన్ సుహోత్రస్యాత్మజాస్త్రయః॥7893॥*

*17.3 (మూడవ శ్లోకము)*

*కాశ్యః కుశో గృత్సమద ఇతి గృత్సమదాదభూత్|*

*శునకః శౌనకో యస్య బహ్వృచప్రవరో మునిః॥7894॥*

*శ్రీశుకుడు పలికెను* - పురూరవుని కుమారుడు ఆయువు. అతనికి నహుషుడు, క్షత్రవృద్ధుడు, రజి, పరాక్రమశాలియైన రంభుడు, అనేనసుడు అను ఐదుగురు తనయులు గలిగిరి. పరీక్షిన్మహారాజా! వినుము. క్షత్రవృద్ధుని సుతుడు సుహోత్రుడు. అతనికి కాశ్యుడు, కుశుడు, గృత్స (గృత్స్న) మదుడు - అను ముగ్గురు పుత్రులు కలిగిరి. గృత్స (గృత్స్న) మదుని సూనుడు శునకుడు. అతని పుత్రుడు శౌనకుడు. ఇతడు ఋగ్వేదులలో శ్రేష్ఠునిగా వాసిగాంచెను.

*17.4 (నాలుగవ శ్లోకము)*

*కాశ్యస్య కాశిస్తత్పుత్రో రాష్ట్రో దీర్ఘతమః పితాః|*

*ధన్వంతరిర్దైర్ఘ తమ ఆయుర్వేదప్రవర్తకః॥7895॥*

కాశ్యుని కుమారుడు కాశి. అతని సుతుడు రాష్ట్రుడు. రాష్ట్రుని పుత్రుడు దీర్ఘతముడు (దీర్ఘతపుడు). దీర్ఘతముని కుమారుడు ధన్వంతరి. ఇతడు ఆయుర్వేద ప్రవర్తకుడు. ధన్వంతరి శ్రీహరి అంశతో జన్మించినవాడు. యజ్ఞములయందు ఆహుతులను స్వీకరించువాడు. ఈయన పేరును స్మరించినంతమాత్రమున సకలరోగములును తొలగిపోవును.

*17.5 (ఐదవ శ్లోకము)*

*యజ్ఞభుగ్వాసుదేవాంశః స్మృతమాత్రార్తినాశనః|*

*తత్పుత్రః కేతుమానస్య జజ్ఞే భీమరథస్తతః॥7896॥*

*17.6 (ఆరవ శ్లోకము)*

*దివోదాసో ద్యుమాంస్తస్మాత్ప్రతర్దన ఇతి స్మృతః|*

*స ఏవ శత్రుజిద్వత్స ఋతధ్వజ ఇతీరితః|*

*తథా కువలయాశ్వేతి ప్రోక్తోఽలర్కాదయస్తతః॥7897॥*

ధన్వంతరి తనయుడు కేతుమంతుడు. ఆయన కుమారుడు భీమరథుడు. భీమరథుని పుత్రుడు దివోదాసుడు. దివోదాసుని పుత్రుడు ద్యుమంతుడు. ఈ ద్యుమంతునికే ప్రతర్దనుడనే పేరుగలదు. ఇతనికి శత్రుజిత్తు, వత్సుడు, ఋతధ్వజుడు, కువలయాశ్వుడు అను నామాంతరములు గలవు. ఈ ద్యుమంతునకు కలిగిన సుతులు అలర్కుడు మొదలగువారు.

*17.7 (ఏడవ శ్లోకము)*

*షష్టివర్షసహస్రాణి షష్టివర్షశతాని చ |*

*నాలర్కాదపరో రాజన్ మేదినీం బుభుజే యువా॥7898॥*

అలర్కుడు తన రాజ్యమును అరువదియారువేల సంవత్సరములు పరిపాలించెను. అంతటి దీర్ఘకాలము రాజ్యపాలనమొనర్చిన మరియొక రాజు లేడు.

*17. (ఏడవ శ్లోకము)*

*అలర్కాత్సంతతిస్తస్మాత్సునీథోఽథ సుకేతనః|*

*ధర్మకేతుః సుతస్తస్మాత్సత్యకేతురజాయత॥7899॥*

*ధృష్టకేతుః సుతస్తస్మాత్సుకుమారః క్షితీశ్వరః|*

*వీతిహోత్రస్య భర్గోఽతో భార్గభూమిరభూన్నృపః॥7900॥*

అలర్కుని కుమారుడు సంతతి. సంతతి పుత్రుడు సునీథుడు. అతని తనయుడు సుకేతనుడు. సుకేతుని సూనుడు ధర్మకేతువు. అతని వలన కలిగినవాడు సత్యకేతువు. సత్యకేతుని వలన దృష్టకేతువు జన్మించెను. సుకుమార మహారాజు ఈ దృష్టకేతుని తనయుడు. సుకుమారుని వలన వీతిహోత్రుడు, అతని వలన భర్గుడు కలిగిరి. భర్గుని కుమారుడు భార్గభూమి. ఇతడు మహారాజుగా ఖ్యాతిగన్నవాడు.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*124వ నామ మంత్రము*

*ఓం శర్వాణ్యై నమః*

పరమశివుని అష్టమూర్తులలో భూమిమూర్తి అయిన శర్వుని భార్యయై, శర్వాణి యను నామముతో విరాజిల్లు జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శర్వాణీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం శర్వాణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు అన్నవస్త్రములు, ఆయురారోగ్యములు, సుఖసంతోషములు, కీర్తిప్రతిష్టలకు లోటులేక భౌతికపరముగానూ, ఆధ్యాత్మికపరముగాను జీవించి, అంతిమమున ఆనాయాసముగా జగన్మాత పాదపద్మములకు చేరి పునర్జన్మరహితులగుదురు.

*శర్వుడు* అనునది పరమేశ్వరుని అష్టమూర్తులలో ఒకటి. అట్టి శర్వుని భార్యగా జగన్మాత *శర్వాణీ* యను నామ ప్రసిద్ధమైనది.

శివుని అష్టమూర్తులు:

శివపురాణంలో స్తుతించబడిన రుద్ర స్తోత్రమందు శివుని అష్టమూర్తి నిరూపణము ఇలా జరిగినది. అదియే మనకు ప్రత్యక్ష ప్రమాణంగా తెలియగలము.

1. మొదటి మూర్తి *శర్వుడు* భూమిని అధిష్టించి ఉంటాడు. అనగా భూమిమూర్తిగా కలిగి ఉంటాడని అర్థం.

2. జలాధిష్ఠాన మూర్తి *భవుడు*

3. అగ్నులకు మూర్తి రూపుడు *రుద్రడు*

4. లోపలా బయటా నిరంతరం చలించే వాయు రూపుడు *ఉగ్రుడు*

5. ఐదోవాడు - పంచభూతాత్మకుడు - ఆకాశరూపుడు భీముడు.

6. క్షేత్రజ్ఞుడై, జీవాత్మలో వసించే మూర్తి రూపుడు *పశుపతి*

7. సూర్యాంతర్వర్తియై ప్రకాశించే సప్తమూర్తి *ఈశానుడు*

8. సచ్చిదానంద మయుడైన యజమాన రూపుడై విరజిల్లువాడు *శివుడు*

లింగపురాణంలో ఇలా చెప్పబడినది:

*చరా చరాణాం భూతానాం ధాత విశ్వంభరాత్మకః*

*శర్వ ఇత్యుచ్యతే దేవః సర్వశాస్త్రార్థపారగైః*

*విశ్వంభరాత్మన స్తస్య శర్వస్య పరమేష్ఠినః*

*సుకేశీ కథ్యతే పత్నీ తనుజోఽంగారక స్మృతః॥*
(సౌభాగ్యభాస్కరం - 332వ పుట)

ఈ చరాచర జగత్తును భరించువాడు *శర్వుడు*. అట్టి శర్వుని భార్య అయిన జగన్మాత *శర్వాణి* యను నామముతో విరాజిల్లుతున్నది.

భూమిమూర్తి అయిన శర్వుని (శివుని) భార్య *శర్వాణి* కాగా ఈమెను *సుకేశి* అని అంటారు. సుకేశికి పుట్టినవాడు *కుజుడు*

*శర్వస్వయా ద్వితీయా తు నామభూమి తనుస్మృతా* (సౌభాగ్య భాస్కరం - 332వ పుట)

పైన చెప్పబడిన శర్వునికి రెండవ రూపము భూమి.

*శర్వుని* భార్యగా ఆరాధించు జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శర్వాణ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*702వ నామ మంత్రము*

*ఓం సర్వగాయై నమః*

సర్వజీవులలోను, సమస్త వస్తుజాలమునందును, సకల ప్రదేశములలోను, ఇందు, అందు అనక ఎందైననూ సర్వాంతర్యామియై యుండు అఖిలాండేశ్వరియైన ఆ జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సర్వగా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రముసు *ఓం సర్వగాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు ఆ జగన్మాత కరుణతో అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదతోబాటు, భౌతికపరమైన సుఖసంతోషములు కూడా ప్రసాదించును. సాధకుడు ఆధ్యాత్మికపరమైన జీవనము గడిపి తరించును.

ఇంతకు ముందు (701వ నామమంత్రములో) *దేశకాలాపరిచ్ఛిన్నా* అని చెప్పాము. జగన్మాత అందు, అందు అనక ఎందైనా ఉంటుందనియు (దేశాపరిచ్ఛిన్నము లేనిదనియు) , అలాగే ఇప్ఫుడు, తరువాత రాబోయే కాలంలో, ఇంతకుముందు, ఎప్పుడో? అని కాకుండా, సృష్టికి ముందు, సృష్టి తరువాత, లయం తరువాత కూడా ఉంటుంది అంటూ కాలాపరిచ్ఛేదం లేనిదిగా సర్వదా ఉండునని అన్నాము. అనగా *దేశకాలాపరిచ్ఛిన్నా* - ప్రదేశపరంగాను, కాలపరంగాను విభజించుట గాని కొలుచుటగాని వీలు లేనిది. అందుచే జగన్మాత *సర్వగా* *(సర్వ* అనగా సర్వదేశ కాలములందు, *గా*) అంతర్యామిగా ఉంటుంది.

దేవి తానే సృష్టిరూపిణియై శ్వేతపర్వతముపై బ్రహ్మగూర్చి తపస్సు చేసెను. బ్రహ్మపత్యక్షమై కావలసిన వరము కోరుకొనుము అని చెప్పెను. అప్పుడు సృష్టిస్వరూపిణి అయిన దేవి బ్రహ్మతో 'నేను ఒకచోటు అని కాకుండా అన్నిచోట్లా, సర్వాంతర్యామిగా ఉందును.అట్లు వరమీయము' అని అనగా బ్రహ్మ అట్లే వరమిచ్చెను.

శ్రీమద్భాగవతంలో ప్రహ్లాదుడు ఆ సర్వాంతర్యామి అయిన పరమాత్మ ఎందైనా గలడని ఈ క్రింది పద్యముద్వారా చెప్పబడెను.

*బమ్మెర పోతనామాత్యులవారి పద్యుము*

*కంద పద్యము*

ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."

భావం

ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!

ఈ సంఘటన కేవలం భగవానునికేకాదు, సర్వాంతర్యామియైన జగన్మాతకు కూడా అన్వయింపబడుతుంది. ఎందుకంటే సృష్టిని నిర్వహించడాని శ్రీమాత త్రిమూర్తులను నియమించింది. వారు సర్వాంతర్యాములయి ఉన్నారు. మరి *శ్రీమహారాజ్ఞి* అయిన అఖిలాండేశ్వరి కూడా సర్వాంతర్యామియే గదా! అందుచే జగన్మాత *సర్వగా* అని నామప్రసిద్ధమైసది. బ్రహ్మదేవుడు శ్రీమాతకు వరమిచ్చునపుడు ఆమెను *సర్వరూప* అని సంబోధించెను. అంటే సృష్టిలో సర్వజీవులయందు, సర్వవస్తు జాలములయందు, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో, ఎప్పుడు, ఎలా చూడాలంటే అలా దర్శనమిస్తుంది. జగన్మాత *మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితా* (లలితా సహస్రనామస్తొత్రమందు 58వ శ్లోకము, 2వ పాదము మరియు శ్రీలలితా సహస్రనామావళి యందు 237వ నామ మంత్రము) అరవైనాలుగు కోట్ల యోగినులచే లేదా శక్తి గణములచే సేవింపబడుచున్నది. అనగా జగన్మాత అన్నికోట్లరూపాలలో మనచే ఆరాధింపబడుచున్నది. శక్తిపీఠాలు, గ్రామదేవతలు ఇలా ఎన్నో రూపాలలో, సృష్టిలోని సర్వజీవులచే సేవింపబడుతోంది. కాబట్టీ జగన్మాత *సర్వగా* అని నామ ప్రసిద్ధమైనది. జగన్మాత అన్నిటితో అభేదమును పొందియుండుట, అన్ని శరీరములందు సగుణ స్వరూపముతో ఉండుట, అంతర్యామిరూపముగా ఉండుట యగుటచే *సర్వగా* యను నామముతో ప్రసిద్ధి నందినది. దేవీ పురాణములో ఇలా చెప్పబడినది - "వేదములు, యజ్ఞములు, స్వర్గము శ్రీమాతయే అయి ఉన్న అభేదరూపము. స్థావరజంగమాత్మకమయిన జగత్తు అంతటను దేవియే వ్యాపించియున్నది. ఇది అంతర్యామిత్వము అన్నపాన స్వరూపురాలుగా స్తుతింపబడి, పూజింపబడుచున్నదని చెప్పుట. వృక్షము, భూమి, వాయువు, ఆకాశము, నీరు, అగ్ని వీటిలో నామరూపములతో వ్యాపించియున్నది శ్రీమాత. వీటిలో స్థులరూపమున శాస్త్రప్రకారము పూజింపదగినది" అందుచే శ్రీమాత *సర్వగా* యని స్తుతింప బడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సర్వగాయై నమః* అని అనవలెను.

PVD Subrahmanyam చెప్పారు...

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*125వ నామ మంత్రము*

*ఓం శర్మదాయిన్యై నమః*

జీవులకు తమతమ పూర్వజన్మ పుణ్యమునకు తగినట్లుగా పరబ్రహ్మాత్మికమైన శాశ్వత సుఖములను, జన్మరాహిత్యమైన ముక్తిని అనుగ్రహించు పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శర్మదాయినీ* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం శర్మదాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తునకు సత్యము, నిత్యమైన సఖములను ప్రసాదించును, పునర్జన్మరహితమైన మోక్షమును ప్రసాదించును.

శర్మ అనగా సుఖము. శర్మదాయినీ అంటే సుఖమును ఇచ్చేది. పారలౌకికానందమును చేకూర్చే శాంతి అనగా చిత్తనిశ్చలతను సంప్రాప్తింపజేస్తుంది.

*సుఖం దధాతి భక్తేభ్యః తేనైషా శర్మదాయినీ* (సౌభాగ్యభాస్కరం - 332వ పుట)

భక్తులకు సుఖమునిచ్చేది జగన్మాత. అందుచేత ఆ తల్లి *శర్మదాయినీ* అని స్తుతింపబడుచున్నది.

తన కుటుంబం బాగుండాలి, తన భార్య, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు విద్యా బుద్ధులలో మేటిగా మెలగాలి, తన వృత్తి, వ్యాపారములలో అపారమైన ధనలాభములు పొందాలి. ఇల్లు, పొలము, ధనము, ఆభరణములు ఏర్పరచుకోవాలి, హంసతూలికా తల్పంపై పరుండాలి, దాసదాసీ జనములతో సేవలు పొందాలి, తన ఇల్లు బంధుమిత్రులతో కళకళ లాడాలి, అలా ఉంటే తను ఆనందంగా ఉండవచ్చు, సుఖసంతోషములు పొందవచ్చు. ఇవన్నీ భౌతిక పరమైన సుఖములు. ఇవన్నీ తనువులోని ఆత్మ ఉన్నంతవరకే. ఇవన్నీ క్షణికములు. అలాగే తను అనుకున్న ఈ భౌతిక సుఖములు వీటిలో ఏవి లభించకపోయినా అశాంతి, నిద్రలేమి, అసౌఖ్యము ఏర్పడతాయి. కొన్ని క్షణాలలో ప్రాణం పోతుంది అంటే తన సంపాదనలో తెచ్చుకున్న తన హంసతూలికా తల్పంకూడా తనది కాదు. ఆరుబయట గడ్డిమీద పడేస్తారు.గడ్డిమీద పడేసిన తరువాత, ప్రాణం ఉండి స్పృహ ఉంటే ఆస్తుల వివరాలు, రావలసిన బాకీల వివరాలు, వీలునామాల వివరాలు తనవారు అడుగుతారు.

సుఖములు అంటే తనువునుండి ఆత్మ వెడలిన తరువాత కావలసినవి. జన్మరాహిత్యమైన ముక్తి, పారలౌకికానందం. ఇవన్నీ తన భక్తులకు తమతమ పూర్వజన్మ పుణ్యఫలాన్ననుసరించి శాశ్వతమైన సుఖాన్ని శ్రీమాత అనుగ్రహిస్తుంది గనుక ఆ తల్లి *శర్మదాయినీ* అని అనబడుతున్నది.

బ్రాహ్మణులకు పేరు చివర శర్మ అని ఉంటుంది. అంటే శాంతి లక్షణం ఉన్నవారని అర్థం. ఎంతమందికి శాంతి లక్షణం ఉంది? అసహనం చేత, అసంతృప్తి చేత తీవ్రమైన అశాంతికి లోనై ఉంటూంటారు. మరి వారి పేరు చివర శర్మ అనేది ఎంతవరకూ న్యాయము? అలా పేరు చివర శర్మ అని లేక పోయినా, వారు నిత్యం సంధ్యావందనం చేస్తున్నవారైతే (సంధ్యావందనం అంటేనే తెలియని వారు కోకొల్లలు), సంధ్యావందనంలో సంకల్పంలో తమ పేరుకు చివర శర్మ అనేది చేర్చి చెబుతారు. అంటే బ్రాహ్మణులకు శాంతి లక్షణం ఉండాలి కదా. జగన్మాత అటువంటి వారికి కూడా వారి దీక్షా సామర్థ్యాన్ననుసరించి శాంతిని అంటే *చిత్తనిశ్చలతను* ప్రసాదిస్తుంది గనుక ఆ తల్లి *శర్మదాయినీ* అని అనదగును. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమంటే బ్రాహ్మణునికి బ్రాహ్మణత్వమును (శర్మ అని సంకల్పంలో చెబుతున్నారు గనుక) ప్రసాదిస్తుంది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శర్మదాయిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*17.10 (పదియవ శ్లోకము)*

*ఇతీమే కాశయో భూపాః క్షత్రవృద్ధాన్వయాయినః*

*రంభస్య రభసః పుత్రో గంభీరశ్చాక్రియస్తతః॥7901॥*

*17.11 (పదకొండవ శ్లోకము)*

*తస్య క్షేత్రే బ్రహ్మ జజ్ఞే శృణు వంశమనేనసః|*

*శుద్ధస్తతః శుచిస్తస్మాత్త్రికకుద్ధర్మసారథిః॥7902॥*

ఇంతవరకు క్షత్రవృద్ధుని వంశములోనివారగు కాశి మొదలగువారిని గూర్చి వివరింపబడినది. ఇక రంభుని వంశమును గుఱించి తెలిపెదను. రంభుని కుమారుడు రభసుడు. అతని పుత్రుడు గంభీరుడు. గంభీరుని తనయుడు అక్రియుడు. అక్రియుని భార్యయందు బ్రాహ్మణవంశ మేర్పడెను. ఇక అనేనసుని వంశమును గూర్చి వినుము. అనేనసుని కుమారుడు శుద్ధుడు. అతని సుతుడు శుచి. శుచివలన త్రికకుదుడు, అతని వలన ధర్మసారథి జన్మించిరి.

*17.12 (పండ్రెండవ శ్లోకము)*

*తతః శాంతరయో జజ్ఞే కృతకృత్యః స ఆత్మవాన్|*

*రజేః పంచశతాన్యాసన్ పుత్రాణామమితౌజసామ్॥7903॥*

*17.13 (పదమూడవ శ్లోకము)*

*దేవైరభ్యర్థితో దైత్యాన్ హత్వేంద్రాయాదదాద్దివమ్|*

*ఇంద్రస్తస్మై పునర్దత్త్వా గృహీత్వా చరణౌ రజేః॥7904॥*

*17.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఆత్మానమర్పయామాస ప్రహ్లాదాద్యరిశంకితః|*

*పితర్యుపరతే పుత్రా యాచమానాయ నో దదుః॥7905॥*

*17.15 (పదునైదవ శ్లోకము)*

*త్రివిష్టపం మహేంద్రాయ యజ్ఞభాగాన్ సమాదదుః|*

*గురుణా హూయమానేఽగ్నౌ బలభిత్తనయాన్ రజేః॥7906॥*

*17.16 (పదహారవ శ్లోకము)*

*అవధీద్భ్రంశితాన్ మార్గాన్న కశ్చిదవశేషితః|*

*కుశాత్ప్రతిః క్షాత్రవృద్ధాత్సంజయస్తత్సుతో జయః॥7907॥*

ధర్మసారథి కుమారుడు శాంతరయుడు. అతడు సంతాన అపేక్షలేనివాడై, ఆత్మజ్ఞానముతో కృతార్థుడయ్యెను ఆయువు తనయుడైన రజి వలన కలిగినవారు ఐదువందలమంది. వారు అందరును తేజోమూర్తులు. రజసుడు దేవతల అభ్యర్థనపై పెక్కుమంది దైత్యులను సంహరించి, ఇంద్రునకు స్వర్గాధిపత్యమును నిలిపెను. అంతట ఇంద్రుడు ప్రహ్లాదాది శత్రువులవలన ప్రమాదమును శంకించుచు స్వర్గాధికారమును తిరిగి రజసునకే అప్పగించి, ఆయన పాదములను ఆశ్రయించెను. అంతేగాక అతడు (దేవేంద్రుడు) తన రక్షణభారమును గూడ ఆ రజసుని పైననే ఉంచెను. రజసుని మరణానంతరము ఇంద్రుడు కోరినప్పటికిని రజసుని పుత్రులు స్వర్గాధిపత్యమును ఆయనకు అప్ఫగింపలేదు. అంతేగాక, యజ్ఞభాగములను గూడ వారే అనుభవింపసాగిరి. పిమ్మట, దేవతల గురువగు బృహస్పతి ఇంద్రుని ప్రార్థనపై అభిచార హోమములను నడిపెను. దాని ప్రభావమున రజసుని కుమారులు ధర్మమార్గ భ్రష్టులైరి. పిమ్మట, ఇంద్రుడు వారిని అనాయాసముగా తుదముట్టించెను. వారిలో ఒక్కరుగూడ మిగులలేదు. క్షత్రవృద్ధుని మనుమడు (పౌత్రుడు) ఐన కుశునకు *ప్రతి* అనువాడును, *ప్రతి* కి సంజయుడు, అతనికి జయుడు జన్మించిరి.

*17.17 (పదిహేడవ శ్లోకము)*

*తతః కృతః కృతస్యాపి జజ్ఞే హర్యవనో నృపః|*

*సహదేవస్తతో హీనో జయసేనస్తు తత్సుతః॥7908॥*

జయుని తనయుడు కృతుడు. అతని పుత్రుడు హర్యవనమహారాజు. అతని సూనుడు సహదేవుడు, సహదేవుని తనయుడు హీనుడు. అతని సుతుడు జయసేనుడు.

*17.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*సంకృతిస్తస్య చ జయః క్షత్రధర్మా మహారథః|*

*క్షత్రవృద్ధాన్వయా భూపా శృణు వంశం చ నాహుషాత్॥7909॥*

జయసేనునివలన సంకృతి జన్మించెను. సంకృతికి జయుడు కలిగెను. జయుడు మహాశూరుడు, మహారథి. వీరందరును క్షత్రవృద్ధుని వంశమువారు. ఇక నహుషుని వలన వర్ధిల్లిన పరంపరను గూర్చి తెలిపెదను వినుము.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే సప్తదశోఽధ్యాయః (17)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పదిహేడవ అధ్యాయము (17)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*18.1 (ప్రథమ శ్లోకము)*

*యతిర్యయాతిః సంయాతిరాయతిర్వియతిః కృతిః|*
.
*షడిమే నహుషస్యాసన్నింద్రియాణీవ దేహినః॥7910॥*

*శ్రీశుకుడు నుడివెను* దేహికి షడింద్రియములవలె నహుషునకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అను ఆరుగురు పుత్రులు విలసిల్లిరి.

*18.2 (రెండవ శ్లోకము)*

*రాజ్యం నైచ్ఛద్యతిః పిత్రా దత్తం తత్పరిణామవిత్|*

*యత్ర ప్రవిష్టః పురుష ఆత్మానం నావబుధ్యతే॥7911॥*

నహుషుడు తన పెద్దకుమారుడైన *యతి* కి రాజ్యపాలన భారమును అప్పగించదలచెను. కాని, అతడు (యతి) అందులకు సమ్మతించలేదు. 'రాజ్యపాలనమునందే పూర్తిగా మునిగిపోయినచో, దుఃఖములే దప్ప సుఖములు సున్న, అంతేగాక, ఆత్మజ్ఞానమును పొందుటకు దూరము కావలసివచ్చును' అను భావముతో అతడు రాజ్యాధికారమును స్వీకరింపలేదు.

*18.3 (మూడవ శ్లోకము)*

*పితరి భ్రంశితే స్థానాదింద్రాణ్యా ధర్షణాద్ద్విజైః|*

*ప్రాపితేఽజగరత్వం వై యయాతిరభవన్నృపః॥7912॥*

ఇంద్రుని పట్టమహిషియైన శచీదేవిపై మోహపడి, దౌష్ట్యమునకు పాల్పడినందున నహుషుడు బ్రాహ్మణోత్తముల శాపమునకు గురియై, తన ఇంద్రపదవిని కోల్పోవుటయే గాక కొండచిలువయై పోయెను. అనంతరము యయాతి తన తండ్రిస్థానములో మహారాజయ్యెను.

ఆయువుయొక్క కుమారుడు నహుషుడు. ఇతని తల్లిపేరు స్వర్భానవి. ఇతని భార్య ప్రియంవద. ఇతడు నూరు యజ్ఞములను ఆచరించెను. బ్రహ్మహత్యయొనర్చిన (విశ్వరూపుని చంపిన) కారణముగా ఇంద్రుడు తన పదవిని (స్వర్గాధిపత్యమును) కోల్పోయెను. అప్పుడు నహుషుడు ఇంద్రపదవిని (స్వర్గాధిపత్యమును) పొందెను. అంతట అతడు గర్వోన్మత్తుడై శచీదేవిపై మోహితు డయ్యెను. బృహస్పతితో ఆలోచించిన పిమ్మట శచీదేవి అందులకు ఆమోదించెను. బ్రహ్మరథముపై తన భవనమునకు వచ్చినచోనహుషుని పొందుదునని అని తెలిపెను. బ్రహ్మరథముపై బయలుదేరిన నహుషుడు 'త్వరగా నడువుడు' అనుచు ('సర్ప సర్ప' అని పలుకుచు) రథమును మోయుచున్న అగస్త్యుని కాలితో తన్నెను. వెంటనే అగస్త్యమహర్షి అతనిని "సర్పోభవ' అనుచు (సర్పమై పొమ్ము అని) శపించెను. ఆ శాపఫలితముగా నహుషుడు కొండచిలువ అయ్యెను. (బ్రహ్మరథము = బ్రాహ్మణులు లాగెడి రథము).

*18.4 (నాలుగవ శ్లోకము)*

*చతసృష్వాదిశద్దిక్షు భ్రాతౄన్ భ్రాతా యవీయసః|*

*కృతదారో జుగోపోర్వీం కావ్యస్య వృషపర్వణః॥7913॥*

యయాతి తన తమ్ములైన సంయాతి, ఆయాతి, వియతి, కృతి అను నలుగురిని నాలుగు దిక్కులకు (నాలుగు దిక్కులయందుగల రాజ్యములకు) పరిపాలకులనుగా జేసెను. అతడు దైత్యులకు గురువైన శుక్రాచార్యుని యొక్క కూతురగు దేవయానిని, దైత్యప్రభువైన వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్ఠను పెండ్లియాడి రాజ్యమును పాలింపసాగెను.

*రాజోవాచ*

*18.5 (ఐదవ శ్లోకము)*

*బ్రహ్మర్షిర్భగవాన్ కావ్యః క్షత్రబంధుశ్చ నాహుషః|*

*రాజన్యవిప్రయోః కస్మాద్వివాహః ప్రతిలోమకః॥7914॥*

*పరీక్షిన్మహారాజు అడిగెను*- "మునీంద్రా! పూజ్యుడైన శుక్రాచార్యుడు బ్రహ్మర్షి (బ్రాహ్మణుడు), యయాతి క్షత్రియుడు. క్షత్రియుడైన యయాతి బ్రాహ్మణ కన్యయైన (శుక్రాచార్యుని కూతురైన) దేవయానిని చేపట్టుట ప్రతిలోమ వివాహమగును గదా! అది ఎట్లు సంభవించెను?

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శుద్రులు - అను నాలుగు వర్ణముల వారిలో అగ్రకుల కన్యతో వివాహము ప్రతిలోమ విధానము.

*శ్రీశుక ఉవాచ*

*18.6 (ఆరవ శ్లోకము)*

*ఏకదా దానవేంద్రస్య శర్మిష్ఠా నామ కన్యకా|*

*సఖీసహస్రసంయుక్తా గురుపుత్ర్యా చ భామినీ॥7915॥*

*18.7 (ఏడవ శ్లోకము)*

*దేవయాన్యా పురోద్యానే పుష్పితద్రుమసంకులే|*

*వ్యచరత్కలగీతాలినలినీపులినేఽబలా॥7916॥*

*శ్రీశుకుడు పలికెను* దానవరాజైన వృషపర్వునకు *శర్మిష్ఠ* అను కుమార్తె గలదు. ఆ కన్యకామణి ఒకనాడు తన గురుపుత్రియగు దేవయానితోడను, ఇంకను వేలకొలది చెలులతోడను గూడి నగరోద్యానవనమునందు విహరించుచుండెను. ఆ వనము చక్కని పూలచెట్లతో నిండియుండెను. ఆ వనమునగల సరస్సులో వికసించిన కమలములపై తుమ్మెదలు ఝంకారములు చేయుచుండెను. అచటి ఇసుక తిన్నెలపై వారు విహరించుచుండిరి.

*18.8 (ఎనిమిదవ శ్లోకము)*

*తా జలాశయమాసాద్య కన్యాః కమలలోచనాః|*

*తీరే న్యస్య దుకూలాని విజహ్రుః సించతీర్మిథః॥7917॥*

*18.9 (తొమ్మిదవ శ్లోకము)*

*వీక్ష్య వ్రజంతం గిరిశం సహ దేవ్యా వృషస్థితమ్|*

*సహసోత్తీర్య వాసాంసి పర్యధుర్వ్రీడితాః స్త్రియః॥7918॥*

ఆ చక్కనిచుక్కలు (శర్మిష్ఠ మొదలగు కన్యలు) సరోవరమును సమీపించి,తమ వస్త్రములను ఒడ్డున ఉంచి, నీళ్ళలోనికి దిగి, పరస్పరము జలములను చల్లుకొనుచు క్రీడింపసాగిరి. ఇంతలో పరమేశ్వరుడు పార్వతీదేవితో గూడి నందివాహనముపై అటునుండి వెళ్ళుచుండెను. ఆ కన్యలు శంకరుని జూచి సిగ్గుతో నీళ్ళలోనుండి బయటికి వచ్చి, త్వరత్వరగా తమవస్త్రములను ధరించిరి.

PVD Subrahmanyam చెప్పారు...

*18.10 (పదియవ శ్లోకము)*

*శర్మిష్ఠాజానతీ వాసో గురుపుత్ర్యాః సమవ్యయత్|*

*స్వీయం మత్వా ప్రకుపితా దేవయానీదమబ్రవీత్॥7919॥*

*18.11 (పదకొండవ శ్లోకము)*

*అహో నిరీక్ష్యతామస్యా దాస్యాః కర్మ హ్యసాంప్రతమ్|*

*అస్మద్ధార్యం ధృతవతీ శునీవ హవిరధ్వరే॥7920॥*

ఆ తొందరలో శర్మిష్ఠ పొరపాటున గురుపుత్రియగు దేవయాని యొక్క వస్త్రములను తనవే యనుకొని ధరించెను. అప్పుడు దేవయాని మిగుల కుపితయై ఇట్లు పలికెను "చెలులారా! ఈ దాసి (శర్మిష్ఠ) చేసిన అనుచితమైన పనిని చూచితిరా? యజ్ఞమునందలి హవ్యమును కుక్క తినినట్లుగా, ఈమె నా వస్త్రములను ధరించినది. ఇది ఏమాత్రమూ క్షమింపరానిపని.

*18.12 (పండ్రెండవ శ్లోకము)*

*యైరిదం తపసా సృష్టం ముఖం పుంసః పరస్య యే|*

*ధార్యతే యైరిహ జ్యోతిః శివః పంథాశ్చ దర్శితః॥7921॥*

*18.13 (పదమూడవ శ్లోకము)*

*యాన్ వందంత్యుపతిష్ఠంతే లోకనాథాః సురేశ్వరాః|*

*భగవానపి విశ్వాత్మా పావనః శ్రీనికేతనః॥7922॥*

*18.14 (పదునాలుగవ శ్లోకము)*

*వయం తత్రాపి భృగవః శిష్యోఽస్యా నః పితాసురః|*

*అస్మద్ధార్యం ధృతవతీ శూద్రో వేదమివాసతీ॥7923॥*

ఈ (మా) బ్రాహ్మణ వంశము భృగువు మొదలగు మహర్షుల తపఃప్రభావముచే ఏర్పడినది. ఇది పరమపురుషుడైన భగవంతుని యొక్క ముఖమునుండి ఆవిర్భవించినది. బ్రాహ్మణులు జ్యోతిస్వరూపుడైన పరమాత్మను సర్వదా తమ హృదయములయందు నిలుపుకొని ఉపాసించుచుందురు. వారు (బ్రాహ్మణులు) నిర్దేశించిన వైదికమార్గము లోకమునకు (సకలప్రాణులకును) శుభంకరమైనది. దిక్పాలురును, ఇంద్రాదిదేవతలును బ్రాహ్మణులకు ప్రణమిల్లుచుందురు. వారిని సేవించుచుందురు. అంతేగాదు, పరమపావనుడు, విశ్వాత్ముడు, పరమాత్మయు ఐన ఆ రమాపతికి గూడ బ్రాహ్మణులు పూజ్యార్హులు. అట్టి బ్రాహ్మణులలో భృగువంశజులు సర్వశ్రేష్ఠులు. అట్టి భృగువంశమునకు చెందిన వారము మేము. ఈ శర్మిష్ఠ తండ్రి అసురుడు, పైగా మాకు (మా తండ్రికి) శిష్యుడు. అట్టి ఈ దుష్టురాలు శూద్రుడు వేదములను వల్లించినట్లు మా వస్త్రములను ధరించినది".

*18.15 (పదునైదవ శ్లోకము)*

*ఏవం శపంతీం శర్మిష్ఠా గురుపుత్రీమభాషత|*

*రుషా శ్వసంత్యురంగీవ ధర్షితా దష్టదచ్ఛదా॥7924॥*

గురుపుత్రియగు దేవయాని తనను ఇట్లు తూలనాడుటతో శర్మిష్ఠ మిగుల క్రోధముతో ఊగిపోయెను. దెబ్బతిన్న ఆడుపామువలె బుసలు కొట్టసాగెను. అంతట పండ్లు పటపట కొఱుకుచు శర్మిష్ఠ ఆమెతో ఇట్లనెను-

*18.16 (పదహారవ శ్లోకము)*

*ఆత్మవృత్తమవిజ్ఞాయ కత్థసే బహు భిక్షుకి|*

*కిం న ప్రతీక్షసేఽస్మాకం గృహాన్ బలిభుజో యథా॥7925॥*

"ఓ భిక్షుకీ! నీ స్దాయిని తెలిసికొనక (విస్మరించి) నోటికి వచ్చినట్లు వాగుచున్నావు. కాకులు, కుక్కలవలె నీవు నాలుగు మెతుకులు కొఱకు (ఉదరపోషణకై) మా ఇంటిచుట్టును తిరుగుచున్నదానవు కావా?"

*18.17 (పదిహేడవ శ్లోకము)*

*ఏవంవిధైః సుపరుషైః క్షిప్త్వాచార్యసుతాం సతీమ్|*

*శర్మిష్ఠా ప్రాక్షిపత్కూపే వాస ఆదాయ మన్యునా॥7926॥*

శర్మిష్ఠ ఈ విధముగా ఇంకను పలువిధములగు దురుసుమాటలతో దేవయానిని ఆక్షేపించుచు కోపముతో ఆమెనుండి తన వస్త్రములను లాగికొని, ఆమెను ఒక బావిలో పడద్రోసెను.

*18.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*తస్యాం గతాయాం స్వగృహం యయాతిర్మృగయాం చరన్|*

*ప్రాప్తో యదృచ్ఛయా కూపే జలార్థీ తాం దదర్శ హ॥7927॥*

*18.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*దత్త్వా స్వముత్తరం వాసస్తస్యై రాజా వివాససే|*

*గృహీత్వా పాణినా పాణిముజ్జహార దయాపరః॥7928॥*

పిదప శర్మిష్ఠ (తన చెలులతో గూడి) ఇంటికి చేరెను. కొంతతడవునకు యయాతి మహారాజు వేటాడి, అలసిపోవుటతో మిగుల దప్పికగొనియుండెను. నీటికొఱకై అతడు యాదృచ్ఛికముగా ఆ బావిసమీపమునకు వచ్చి, ఆ కూపములో వివస్త్రగానున్న దేవయానిని చూచెను. పిమ్మట మృదుస్వభావముగల యయాతి, ఆమె ధరించుటకై తన ఉత్తరీయమును ఆమెకు ఇచ్చివేసెను. అనంతరము ఆ మహారాజు చేయూతనిచ్చి (ఆమె చేతిని తన చేతితో పట్టుకొని) ఆమెను ఆ బావినుండి పైకితీసెను.

PVD Subrahmanyam చెప్పారు...

*18.20 (ఇరువదియవ శ్లోకము)*

*తం వీరమాహౌశనసీ ప్రేమనిర్భరయా గిరా|*

*రాజంస్త్వయా గృహీతో మే పాణిః పరపురంజయ॥7929॥*

*18.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*హస్తగ్రాహోఽపరో మాభూద్గృహీతాయాస్త్వయా హి మే|*

*ఏష ఈశకృతో వీర సంబంధో నౌ న పౌరుషః|*

*యదిదం కూపలగ్నాయా భవతో దర్శనం మమ॥7930॥*

*18.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*న బ్రాహ్మణో మే భవితా హస్తగ్రాహో మహాభుజ|*

*కచస్య బార్హస్పత్యస్య శాపాద్యమశపం పురా॥7931॥*

అంతట దేవయాని ప్రేమ పరవశయై , వీరుడగు యయాతితో మృదుమధురముగా ఇట్లనెను - "అజేయుడవైన ఓ మహారాజా! మొదఠిసారిగా ఇటుల నీవు నా చేతిని పట్టుకొంటివి. నీవు గ్రహించిన నా ఈ పాణిని మరియొకడు పట్టుకొనరాదు. ఈ ప్రాణిని గ్రహించుటకు వేరొకడు అర్హుడు కాడు. పరాక్రమాశాలీ! బావిలో పడియున్న నాకు అప్రయత్నముగా నీ దర్శనమైనది. ఈ సంఘటన (మన ఇరువురి సంబంధము) దైవికము. ఇది మనుష్య ప్రయత్నముతో జరిగినదికాదు. మహాబాహూ! నేనును, బృహస్పతి కుమారుడైన కచుడును పరస్పరము శపించుకొంటిమి. అతని శాపకారణముగా బ్రాహ్మణుడు నాకు భర్త కాబోడు.

కచుడు బృహస్పతి కుమారుడు. అతడు దైత్యులకు గురువైన శుక్రాచార్యునికడ *మృతసంజీవని* అను విద్య నభ్యసించెను. దేవయాని కచునిపై మనసు పడియుండెను. అతడు చదువు పూర్తిచేసికొని ఇంటికి వెళ్ళునప్పుడు దేవయాని తనను పెండ్లియాడుమని అతనిని కోరెను. గురుపుత్రియగు దేవయానిని వివాహము చేసికొనుటకు అతడు తిరస్కరించెను. అందులకు కుపితయైన దేవయాని "నీవు నేర్చిన విద్య నీకు పనిచేయకుండుగాక" అని అతనికి శాపమిచ్చెను. అంతట కచుడును 'బ్రాహ్మణుడెవ్వడును నిన్ను పత్నిగా స్వీకరించకుండునుగాక' అని ఆమెకు ప్రతిశాపమిచ్చెను.

*18.23 (ఇరువది రెండవ శ్లోకము)*

*యయాతిరనభిప్రేతం దైవోపహృతమాత్మనః|*

*మనస్తు తద్గతం బుద్ధ్వా ప్రతిజగ్రాహ తద్వచః॥7932॥*

అంతట యయాతి 'ఈ వివాహము శాస్త్రవిరుద్ధమే యైనను విధినిర్ణయము కావచ్చును. పైగా నా మనస్సుగూడ ఆమె వైపు ఆకర్షితమైనది' అని తలంచి ఆమె కోరికను ఆమోదించెను.

*18.24(ఇరువది నాలుగవ శ్లోకము)*

*గతే రాజని సా వీరే తత్ర స్మ రుదతీ పితుః|*

*న్యవేదయత్తతః సర్వముక్తం శర్మిష్ఠయా కృతమ్॥7933॥*

వీరుడైన యయాతి అచటినుండి వెళ్ళిపోయిన పిమ్మట దేవయాని ఏడ్చుచు తన తండ్రి కడకు వెళ్ళెను. అనంతరము శర్మిష్ఠ చేసిన దష్కృత్యమును గూర్చి తండ్రికి పూర్తిగా తెలిపెను.

*18.25(ఇరువది ఐదవ శ్లోకము)*

*దుర్మనా భగవాన్ కావ్యః పౌరోహిత్యం విగర్హయన్|*

*స్తువన్ వృత్తిం చ కాపోతీం దుహిత్రా స యయౌ పురాత్॥7934॥*

*18.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*వృషపర్వా తమాజ్ఞాయ ప్రత్యనీకవివక్షితమ్|*

*గురుం ప్రసాదయన్ మూర్ధ్నా పాదయోః పతితః పథి॥7935॥*

తన గారాలపట్టియగు దేవయాని మాటలను విన్నంతనే పూజ్యుడగు శుక్రాచార్యుని మనస్సు వికలమై మిగుల పరితాపమునకు లోనయ్యెను. పిమ్మట అతడు 'వృషపర్వునికడ పౌరోహిత్యమొనర్చుటకంటె, ఉంఛవృత్తి ద్వారా జీవించుటయే మేలు' అని తలంచెను. అనంతరము శుక్రాచార్యుడు నగరమును విడిచిపెట్టి వెళ్ళిపోవుటకు నిశ్చయించుకొని, తన కుమార్తెతోగూడి అచటినుండి బయలుదేరెను. ఈ విషయము వృషపర్వునకు తెలిసెను. అప్పుడు అతడు 'ఈ శుక్రాచార్యుడు శత్రుత్వము వహించునేమో? తద్ద్వారా తనను శత్రువులు జయింతురేమో? లేదా ఆయన నన్ను శపించునేమో?' అని శంకించెను. వెంటనే అతడు మార్గమధ్యముననే ఆయనకడకు చేరి, ఆయనను ప్రసన్నుని జేసికొనుటకై పాదములపై బడెను.

ఉంఛవృత్తి = ధాన్యందంపుడు రోళ్ళవద్ద పడిన గింజలు ఏరుకొని అవి తిని బ్రతుకుట. లేదా పంట కోసిన తరువాత పంట అక్కడనుండి తీసికొనిపోయిన తరువాత పొలంలో పడిన గింజలు ఏరుకుని భుక్తి గడపుట.

*18.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*క్షణార్ధమన్యుర్భగవాన్ శిష్యం వ్యాచష్ట భార్గవః|*

*కామోఽస్యాః క్రియతాం రాజన్ నైనాం త్యక్తుమిహోత్సహే॥7936॥*

PVD Subrahmanyam చెప్పారు...

*18.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*తథేత్యవస్థితే ప్రాహ దేవయానీ మనోగతమ్|*

*పిత్రా దత్తా యతో యాస్యే సానుగా యాతు మామను॥7937॥*

అప్పుడు శుక్రాచార్యుని కోపము ఒక అరక్షణకాలములోనే శాంతించెను. పిమ్మట పూజ్యుడైన ఆ భార్గవుడు వృషపర్వునితో ఇట్లనెను. "రాజా! నా ముద్దులపట్టియగు దేవయానిని విడిచిపెట్టి ఉండజాలను. కనుక, ఆమె కోరినరీతిగా నడచుకొనవలెను. అప్పుడు నేను నీ నగరమునకు వచ్చెదను' అందులకు వృషపర్వుడు ఆమోదించెను. దేవయాని తన మనసులోని మాటను ఇట్లు వెల్లడించెను. 'మా తండ్రి నన్ను ఎవరికైనను ఇచ్చి పెండ్లిచేసినను, లేక, నేను ఎచటికి వెళ్ళినను శర్మిష్ఠ నా వెంటనే ఉండి నన్ను సేవించుచుండవలెను".

*18.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*స్వానాం తత్సంకటం వీక్ష్య తదర్థస్య చ గౌరవమ్|*

*దేవయానీం పర్యచరత్స్త్రీసహస్రేణ దాసవత్॥7938॥*

అంతట శర్మిష్ఠ తన మాతాపితరులకు ఎదురైన సంకటపరిస్థితిని గమనించెను. దేవయాని కోరినట్లు చేయుటవలన కలిగెడి ప్రయోజనములను, లోతుపాతులను బాగుగా ఆలోచించెను. పిమ్మట ఆమె తన వేయిమంది పరిచారికలతోగూడి దేవయానికి సేవలు చేయసాగెను.

*18.30 (ముప్పదియవ శ్లోకము)*

*నాహుషాయ సుతాం దత్త్వా సహ శర్మిష్ఠయోశనా|*

*తమాహ రాజన్ శర్మిష్ఠామాధాస్తల్పే న కర్హిచిత్॥7939॥*

అనంతరము శుక్రాచార్యుడు దేవయానిని యయాతి మహారాజునకు ఇచ్చి పెండ్లి చేసెను. ఆమెతో శర్మిష్ఠను గూడ దాసిగా పంపుచు అతడు యయాతితో ఇట్లనెను. "రాజా! శర్మిష్ఠను ఎట్టి పరిస్థితిలోను తల్పముపై చేరనీయరాదు".

«అన్నిటి కంటే పాతది ‹పాతవి   360లో 1 – 200   కొత్తది» సరి కొత్తది»