8, జూన్ 2024, శనివారం

*శ్రీ నెల్లితీర్థ సోమనాథేశ్వర గుహలయం*

 🕉 *మన గుడి : నెం 342*


⚜ *కర్నాటక  :-*


*నెల్లితీర్థ - దక్షిణ కన్నడ ప్రాంతం*


⚜ *శ్రీ నెల్లితీర్థ సోమనాథేశ్వర గుహలయం*



💠దేశంలోని చరిత్ర, సంస్కృతి, మతపరమైన ప్రాముఖ్యత మరియు ప్రకృతి సౌందర్యం గురించి వివరంగా తెలుసుకునే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి. 

మీరు ఆధ్యాత్మికత మరియు ప్రకృతి వైభవాన్ని ఏకకాలంలో ఆస్వాదించగల అటువంటి ఆలయానికి మీరు ఎన్నడూ వెళ్లకపోతే, మీరు రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ గుహ దేవాలయాలలో ఒకటైన నెల్లితీర్థ గుహ దేవాలయాన్ని సందర్శించాలి.


💠 ఈ ప్రాంతంలోని అత్యంత గౌరవనీయమైన శివాలయాలలో ఒకటి, నెల్లితీర్థ గుహ దేవాలయం, దీనిని శ్రీ సోమనాథేశ్వర గుహ దేవాలయం అని కూడా పిలుస్తారు.

ఇది 15వ శతాబ్దం చివరలో స్థాపించబడిందని నమ్ముతారు.


💠 నెల్లితీర్థ,  నెల్లి అంటే ఉసిరి (జామకాయ) మరియు తీర్థం అంటే పవిత్ర జలం. శతాబ్దాలుగా పడుతున్న నీటి బిందువులు ఇప్పుడు గుహ మరియు శివలింగం లోపల సరస్సును సృష్టిస్తున్నాయని, అవి జామకాయ లేదా ఉసిరికాయ పరిమాణంలో ఉన్నాయని చెబుతారు. అందుకే ఆ పేరు వచ్చింది.


💠 సరస్సు నీరు పవిత్రమైనదని మరియు అక్కడ ఉన్న బురదలో చికిత్సా లక్షణాలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు, అవి రోగాలు   నయం చేస్తాయి. భక్తులు కొంత గుహ మట్టిని ఇంటికి తీసుకెళ్లడం సాధారణ దృశ్యం.


💠 200 మీటర్ల పొడవైన నెల్లితీర్థ గుహ సహజ కొలను మరియు శివలింగం ఉన్న ప్రాంతానికి దారి తీస్తుంది. 

లోపలి గర్భగుడిని చేరుకోవడానికి, అంటే శివలింగాన్ని చేరుకోవడానికి, గుహలో నడవడానికి లేదా సౌకర్యవంతంగా వంగడానికి కూడా చాలా ఇరుకైనది.


💠 గుహలోపల ఉన్న సరస్సు మరియు శివలింగం శతాబ్దాల తరబడి నిరంతరంగా పడిపోతున్న నీటి బిందువుల ఫలితమేనని చెప్పడం సులభం. 


💠 నెల్లితీర్థంలోని పురాతన గుహను జాబాలి అనే మహర్షి ఉపయోగించినట్లు చెబుతారు. 

ఈ గుహలోనే జాబాలి మహర్షి తపస్సు చేయడం వల్ల దుర్గా పరమేశ్వరి దేవి చాలా సంతోషించింది. అతను తపస్సు చేయడం వెనుక కారణం ఏమిటంటే, 


💠 జాబాలి మహర్షిని ఒకప్పుడు అరుణాసురుడు అనే అసురుడు అతనికి పవిత్రమైన గాయత్రీ మంత్రాన్ని ఇవ్వమని మోసగించాడని నమ్ముతారు , దానిని ఆ అసురుడు దుర్వినియోగం చేశాడు. 

జాబాలి మహర్షి చేసిన తపస్సుకి మెచ్చి అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తానని అతనికి హామీ ఇచ్చింది. తర్వాత ఆమె కందిరీగ ఆకారాన్ని తీసుకొని నందిని నది ఒడ్డున అతన్ని చంపింది. 


💠 ఆ ప్రదేశంలో నేడు దుర్గాపరమేశ్వరి దేవి యొక్క అందమైన ఆలయం ఉంది మరియు ఈ ప్రదేశం కటీల్ అని చాలా ప్రసిద్ధి చెందింది .


💠 ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ సోమనాథేశ్వరుడు (శివుడు). 

ఈ ఆలయంలో మహాగణపతి మరియు జాబాలి మహర్షి కూడా ఇక్కడ దేవతలుగా ఉన్నారు.

 నిజానికి జాబాలి మహర్షి బృందావనాన్ని ఇటీవలే నిర్మించారు. 


💠 విలక్షణమైన తుళు-నాడు సంప్రదాయంలో, ఆలయంలో " భూతాలు " కూడా ఉన్నాయి . భూతాలను " గణాలు " లేదా దేవతల యోధుడు-సహాయకులుగా పరిగణిస్తారు . నెల్లితీర్థ దేవాలయంలోని ప్రధాన భూతాలు పిలి-చాముండి (పిలి అంటే తుళులో పులి), క్షేత్రపాల, రక్తేశ్వరి మరియు దూమావతి.


💠 శ్రీ సోమనాథేశ్వరుని లింగం స్వచ్ఛమైన శాలిగ్రామ శిలతో తయారు చేయబడింది మరియు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. 

ఆలయంలో మరియు చుట్టుపక్కల ఉన్న ఇతర కళాఖండాలు ఈ ప్రదేశం యొక్క గత వైభవాన్ని సూచిస్తాయి. 

వాటిలో “ అరసులే మంచా ” (రాజు సీటు), “ అరసులే మంటప ” (రాజు నివాసం) మరియు “ జిన విగ్రహం ” (జైన్ విగ్రహం) ఉన్నాయి. 

శ్రీ మహాగణపతి ఆలయం ఇటీవల పునర్నిర్మించబడింది మరియు దానికదే అద్భుతంగా ఉంది.


💠 ఆలయం యొక్క అత్యంత అందమైన అంశం గుహ.

 " నాగప్ప కెరె " ఆలయానికి ఉత్తరాన ఉన్న ఒక చిన్న చెరువు. ఈ సహజ చెరువు, దాని మతపరమైన ప్రాముఖ్యతతో పాటు, సుందరమైన ప్రదేశం కూడా. 

రుతుపవనాలు (అక్టోబర్-డిసెంబర్) తర్వాత సరస్సు ఉత్తమంగా ఉంటుంది, దాని స్పటిక స్పష్టమైన నీరు ఈతగాళ్లకు ఆనందాన్ని ఇస్తుంది.


💠 గుహలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది సంవత్సరానికి దాదాపు 6 నెలల పాటు మూసివేయబడి ఉంటుంది. 

ఈ గుహ అక్టోబర్ మరియు ఏప్రిల్ మధ్య మాత్రమే తెరవబడుతుంది. 

దీనితో సంబంధం ఉన్న మతపరమైన కారణాలు ఉన్నప్పటికీ (ఈ గుహ మానవులకు సంవత్సరానికి 6 నెలలు తెరిచి ఉంటుందని మరియు మిగిలిన 6 నెలలు దేవతలు మరియు ఋషుల కోసం ఉద్దేశించబడిందని చెప్పబడింది), ప్రతి సంవత్సరం 6 నెలల విరామం గుహకు సహాయపడుతుంది. "పునరుజ్జీవనం". నీరు తాజాదనాన్ని పొందుతుంది మరియు లోపల ఉన్న జంతువులు ఇబ్బంది లేకుండా ఆనందిస్తాయి.


💠 నెల్లితీర్థానికి సమీప విమానాశ్రయం మంగళూరులో 15 కి.మీ దూరంలో ఉంది.

Panchaag


 

స్వస్తిక్

 *ఈ స్వస్తిక్ అనెది మనం పూజా మందిరాలలో వేస్తుంటాము కాని దీనికి ఓ పద్ధతి ఉంది.*



*ఇలా plus మాదిరిగా రాయకూడదు మరియు మధ్య నుంచో లేక అడ్డు గీత నిలువు గీతలు గీయకూడదు అనగా బ్రహ్మ స్థానం నుంచి మొదలు పెట్టకూడదు అలా చేస్తే మనం చేసే పూజ nagative ఔతుంది అట...కాబట్టి*

*కేవలం నాలుగు దిక్కుల నుంచి మధ్యకి అనగా గీత బయట నుంచి లోపలికి ఒక్కొక్క గీత గీయవలెను అది వీడీయోలో చూపించారు...అలా + మాదిరిగా....అవి నాలుగు గీతాలు  ధర్మం, అర్థం, కామ, మోక్షం అని అర్థాలు....అటు తర్వాత ఈ నాలుగు గీతాలకు నాలుగు చివర్లో  వీడియోలో చూపించిన విధంగా పొడిగించాలి...అలా పొడిగించిన గీతలు ముక్తి స్థానాలు... ఇక అలా పొడిగించిన గీతలకు కొనలు అంటె చిన్న మలుపు పెట్టాలి అవె మన యొక్క మనసు, బుద్ది, అహంకారం మరియు చేతన.   తర్వాత చుక్కలు కూడా గడియారం తిరిగే లాగానే పైనుంచి మొదలు పెట్టాలి ఆ చుక్కలే మనుష్యులలొ ఉండే రకాలు శ్రద్దా, విశ్వాసం , ప్రేమ మరియు సమర్పణ*

*ఇదంతా వీడియోలో చూస్తు చదివితె అర్థమౌతుంది ఆ విధంగా చేసి సత్ఫలితాలు పొందవఛ్చు...జై శ్రీ రామ్...*

ముడుపు

 🙏🛕🙏🛕

ముడుపు అంటె ఏమిటే అది ఎలా కడతారు.

🛕🛕🛕🛕🛕

పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇల వేలుపు, ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామి వారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టే వాళ్ళు . 


ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే... వివాహంకోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగ కుండా చేతికి రావాలి అని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసుని కి ముడుపు కడతారు.


ముడుపు ఎలా కట్టాలి ...


వెంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పము నెరవేరాలి అని కోరుకొని, ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టినా బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు మనసుపూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి, కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే మాటఇవ్వాలి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం , గోవిందా నామాలు చదువుకొని స్వామి కి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉండాలి..కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి...


ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పబడుతుంది.

🙏🙏🙏🙏🙏

ఎంగిలి దోషం....

 నోటిలోఎక్కడ,ఏదితగిలినాఅది లాలాజలం తగిలిదానిలో బాక్టీరీయా/వైరస్ ఉంటేఅంటుకుంటుంది.దానికిఎంగిలిఅనిపేరుపెట్టారు పెద్దలు.                           వేద సంస్కృతి లో

ఎంగిలి దోషం.......


మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి 'ఎంగిలి దోషం' అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు. 


ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే. 


ఇంతెందుకు ! స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది, అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం.. 


పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు. 


పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు. 


ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది. 


పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు, వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు. ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి. వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది. ఇంకొన్ని ఇళ్ళలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్ధమైందా మనము పూజల్లో వెండి వస్తువులకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తామో ?! 


వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం. 


కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు. 


ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధ చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు. 


*పలు సందర్భంలో నోటిద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు. 


** ఎంగిలి దోషం అంటని మూడుపదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.


1. చిలక కొరికిన పండు,

2. తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె.

3 దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు.


వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కోసం పాటిద్దాం...


       సర్వే జనాః సుఖినో భవంతు .


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కార్యసాధనకు

 *కార్యసాధనకు ప్రయత్నం అవసరం*

ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు , కర్మేంద్రియములు అని అర్ధం . వాటిలో మనస్సు కూడా ఒక ప్రధానమైన ఇంద్రియం . అదే కర్మలకు కారణమైన ప్రధాన ఇంద్రియం . తనకు ఇష్టమైనదానికోసం పోవటం మనస్సు యొక్క సహజ లక్షణం . అది దానికి ఇష్టంలేని దానిమీదికి పోదు . ఎందుచేతనంటే దానివలన మనస్సుకు ప్రయోజనం లేదుకనుక . అలాంటప్పుడు ఎందుకు శ్రమపడాలి ? కాబట్టి మనస్సుకు ( ఇంద్రియానికి ) ఏది ఆకర్షణగా ఉంటుందో , దేనివలన తాను కోరుకున్న అనందం కలుగుతుందో దానిమీదనే ఆసక్తి ప్రసరిస్తుంది . అది లౌకికమైన తాత్కాలిక ఆనందం , కష్టసాధ్యమైన పారమార్ధిక విషయాల వైపు మనస్సు పోదు . అటువంటి మనస్సును నిగ్రహించి దానిని పారమార్ధికమైన విషయాలవైపు మళ్ళించటం కష్టసాధ్యమైన కార్యం . ఆ విధంగా మనస్సును మళ్లించగల శక్తిని సమకూర్చుకోవటాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు . 

కాబట్టి లౌకిక సుఖాన్ని కాదనుకుని నిత్యమైన పారమార్ధిక సుఖానికై మానవుడు ప్రయత్నం చేయాలి . ఈ ప్రయత్నం నిరంతరం సాగుతూనే ఉండాలి . కార్యసాధనకు ప్రయత్నం అవసరం , ముఖ్యం . లేకపోతే మనస్సును నిగ్రహించి కార్యోన్ముఖంగా చేయటం ఎట్లా సంభవిస్తుంది . కాబట్టి కార్యసాధనకు తీవ్రమైన ప్రయత్నం చేయాలి , ఆలోచన చేయాలి . ఆలోచన అంతర్ముఖం చేసుకొని మనస్సు ఏ విషయాలకు లోనవుతుందో వాటిని నిరోధించుకునే ప్రయత్నం చేయాలి . 


మనకు ఇష్టంలేని ప్రస్తావన తీవ్రమైనప్పుడు మనకు కోపం వస్తుంది . క్రోధం అంతః శత్రువు . హద్దు మీరుతుంది . చేయకూడని పని చేయిస్తుంది . మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తుంది . దీనివలన అనర్ధం జరుగుతుంది . అది తనకూ మంచిది కాదు . ఎదుటివారికీ ప్రయోజనం కలిగించదు . అటువంటి క్రోధాన్ని ప్రయత్నపూర్వకంగా నిరోధించాలి . 


సహనం , వివేకం జీవితంలో అలవరుచుకోవాలి . మనకు అనుకోని విధంగా ఒక ఆపద ఏర్పడింది అనుకుందాము . త్రోవను పోయే ఒకనిని హఠాత్తుగా పాము కాటువేసింది అనుకుందాము . అది ఆకస్మికమైన విపత్తు . దానికి ఏడ్చి పొడబొబ్బలు పెట్టి , ఇతరులను నిందించి , పాముపై క్రోధం పెరిగి , దానిని చంపటానికి ప్రయత్నించి , అది కనపడకుండా పోయి , భయము పెంచుకుంటూపోతే చేయవలసిన కార్యం మరచి సమయం వ్యర్ధమవుతుంది తప్ప ఉపయోగం ఉండదు . అటువంటి ఆపద సమయములలోనే మనము సహనము , వివేకముతో కూడిన కార్యము తలపెట్టాలి .

ఏ కార్యం జరగటానికైనా ఒక కారణం ఉంటుంది . ఆ పాము కాటు వేయటానికి ఒక ప్రేరణ ఉంది ఉంటుంది . అదియే దైవ ప్రేరణ . దీనినే మనం లౌకికంగా ఒక సామెతగా కూడా వాడుతూవుంటాము  . అట్లా విచారణచేయటమే వివేకం . ఈ విచారణను వివేకముచే స్థిరపరచుకుని నిర్ణయం చేసుకోగలుగుతున్నాము . ఈ విధమైన విచక్షణచేయగలగటానికి ఎన్నో కఠినమైన పరిస్థితులను , అవరోధాలను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది . నీటిని సహనంతో అధిగమించాలి . దీనినే తితిక్ష అని కూడా అంటారు . తితిక్ష కలవాడే వేదాంత శిక్షణకు అర్హుడు , యోగ్యుడు . అటువంటివానికే శాస్త్రము యెడల శ్రద్ధ కలుగుతుంది . శాస్త్రంలో శ్రద్ధ అంటే విశ్వాసం . శాస్త్రం అనేది ఏది నిర్దేశిస్తుందో అది చేయాలి . ఆ విధంగా శాస్త్రం ఎందుకు చెప్పింది అన్న దానిపై పరిశోధన చేయకూడదు . శాస్త్రంపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి , విశ్వాసం ఉంటే చాలదు , శాస్త్రం చెప్పిన విధంగా ఆచరించి తీరాలి .  


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు* .

అపూజ్యా యత్ర పూజ్యంతే*

 శ్లో𝕝𝕝 *అపూజ్యా యత్ర పూజ్యంతే*

*పూజ్యానాం చ వ్యతిక్రమః|*

*త్రీణి తత్ర భవిష్యంతి*

*దుర్భిక్షం మరణం భయమ్||*

*_(कार्तिकपुराणम्)_*


తా𝕝𝕝 *_అర్హత లేని వాళ్ళని పూజించడం, అర్హులైన వారిని పూజించకపోవడం... జరిగే చోట భయంకరమైన కరువు, మరణము, భయము - అనే మూడూ సంభవిస్తాయి కదా ||_*


యత్ర - ఎక్కడైతే, 

అపూజ్యాః - పూజార్హత లేని వాళ్ళు, 

పూజ్యంతే - పూజింపబడతారో,

చ- మరియును,

పూజ్యానాం - పూజింపదగిన వారికి,

వ్యతిక్రమః - అవమానం కలుగుతుందో,

తత్ర - అక్కడ,

దుర్భిక్షం - పెద్ద కరువు, 

మరణం - మరణమును, 

భయం - భయము అనే,

త్రీణి - మూడు, 

భవిష్యంతి - సంభవిస్తాయి||

కనకధారా స్తవం*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *శ్రుత్యై నమోఽస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై*

       *రత్యై నమోఽస్తు రమణీయ గుణార్ణవాయై*,

       *శక్యై నమోఽస్తు శతపత్ర నికేతనాయై*

       *పుష్యై నమోఽస్తు పురుషోత్తమ వల్లభాయై* (11)


               { _/  *కనకధారా స్తవం* _/ } 


తాత్పర్యం: యజ్ఞయాగాది పుణ్యకర్మలన్నింటికి ప్రయోజనం సమకూర్చు వేదస్వరూపిణి అయిన శ్రీమహాలక్ష్మికి నమస్కారం. వాత్సల్య, కారుణ్య, సౌశీల్యాది సద్గుణాలకు సముద్ర మగుచు, ఆనంద స్వరూపిణి అయినట్టి శ్రీమహాలక్ష్మికి చేతులు జోడిస్తున్నాను. తామరలం దుండెడు ముద్దరాలు, శక్తి స్వరూపిణి అయిన ఇందిరా దేవికి అభివందనం. *పరమపురుషుడైన శ్రీమహావిష్ణువునకు ప్రియురాలై, సర్వసమృద్ధితో నొప్పు భార్గవికి ప్రణామం*.

ఒత్తిడి

 ఒత్తిడి..


సాధారణ జీవితం గడిపే వారికి అంటే ఉదయం లేచి తన పని తాను చేసుకొని తర్వాత తన కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆఫీసు ఇతర పనులు చేసుకుంటూ ఎవరు ఏది అడిగినా ఇదిగో నేను ఫలానా ఈ టైంలో ఎక్కడున్నాను ఇది చేస్తున్నాను ఈ టైం లో ఇది జరిగింది అని ఉన్నది ఉన్నట్టు బతకడం సాధారణ జీవితం వీరికి అనారోగ్య సూచనలు చాలా తక్కువ


కొందరు ఉంటారు వారు చీటికిమాటికి అవసరం ఉన్నా లేకున్నా అబద్ధం చెప్పేస్తారు పలానా కారణం అంటూ ఏదీ ఉండదు కానీ అబద్ధం చెప్పేస్తారు చాలా తేలిక చాలా తేలికగా అబద్ధాలు చెబుతారు చెబుతున్నామని ఆలోచన కూడా లేకుండా అవలీలగా అబద్ధాలు చెప్పేస్తారు నిజాలు లోపల ఉండి పోవడం మూలాన జాలన్నీ తొక్కబడి లోలోన ఒత్తిడి పెరిగిపోయి దేహంలో ఉన్న రకరకాల అవయవాలపై ఒత్తిడి పెరిగి లేనిపోని సమస్యలన్నీ అక్కడ క్రియేట్ అవుతున్నాయి దీనివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి బీపీలు షుగర్లు వీటి ఫలితంగానే దీర్ఘకాలిక రోగాలు గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు వంటి అనేక అనారోగ్యాలు చుట్టుముట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. 


ఇదంతా కేవలం నిజాన్ని దాచి పెట్టి అబద్ధాలు చెప్పి కాలం గడపడం వల్ల. మోసం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడే ఈ అబద్ధాలు ఎక్కువవుతాయి ఇవి ఎక్కువైనప్పుడు ఆరోగ్యం మందగిస్తుంది. చిన్న లాజిక్. ఇవన్నీ ఏదో జన్మలో చేసుకున్న కర్మలు కాదు ఈ జన్మలో మనం అబద్ధం ఆడటం వల్ల మోసాలు చేయడం వల్ల వస్తున్న సమస్యలు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.


ఇంట్లో ఏదో పనిలో మీరు ఉన్నారు. అంతలో ఒక ఫోన్ కాల్ వచ్చింది మీరు పనిలో ఉండటం వల్ల మీ పిల్లలకి లేదా పిల్లాడికి లేదా బాబు పాప కి ఇంట్లో లేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పిస్తారు. వాస్తవానికి ఈ అబద్ధం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు అయితే ఇది మీ పిల్లల చిన్నవాళ్ళు కావడంతో అది అబద్దమా నిజమా వాళ్ళకి తెలీదు దీన్నే వాళ్ళు ఫాలో అవుతారు తెలియకుండా. రేపు ఏదైనా అవసరం వచ్చినప్పుడు తెలియకుండానే అబద్ధాలు చెప్పేస్తారు మీ ఆడిన చిన్న అబద్ధం వాళ్ల లైఫ్ స్టైల్ చేంజ్ చేసేస్తుంది. వాళ్ళు అలా మారటానికి ఆరోజు మీరు ఆడిన అబద్ధం. వీళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. 


చాలా సింపుల్ ఒక చిన్న అబద్ధం ఎవరికి ఇబ్బంది కలగని అబద్ధమే ఇంత ప్రభావం చూపితే మరి మనం చేసే మోసాలు కావాలని చెప్పే అబద్ధాలు మన జీవితం ఎంత ప్రభావం చేయాలి ఆలోచించండి మీకు అర్థమవుతుంది. ఈ ఒత్తిడికి మూల కారణం ఇదే.

జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

పాపములు - వ్యాదులు

 పాపములు  -  వ్యాదులు  -  పరిహారములు.


ప్రస్తుత కాలం లో  కొన్ని పాపాలు తెలిసో తెలియకో చేయడం జరుగుతుంది. ఆ పాపాలు మనల్ని రోగాల రూపం లో  వెంటాడుతుంది. కొన్ని రకాల జబ్బులకి మనం ఎంత మందులు వాడినా అవి తగ్గవు . అటువంటప్పుడు జబ్బులకి ముందు మందులు వాడాలి . తగ్గకపోతే రెండో ప్రయత్నం గా దానాలు ఇవ్వాలి . మూడో ప్రయత్నం గా మంత్ర జపం చెయించాలి, నాలుగో ప్రయత్నం హొమం చేయాలి .


 * గ్రహణ కాలం లో సంభోగం  చేయడం మహా పాపం గా పరిగణించబడుతుంది  . గురువులని  ద్వేషించుట, బ్రాహ్మణులని  హింసించుట , ( బ్రాహ్మణ  శబ్దమును కు అర్ధం జన్మను బట్టి ఆ కులంలో పుట్టడం కాదు.). ఇవి చేయడం వలన క్షయ, కాన్సర్ వంటి భయంకర  వ్యాధులు  వస్తాయి . 

 

 రేమిడి - 

 

  విష్ణు సహస్ర నామ స్తోత్రం  భక్తి శ్రద్ధలతో  1116 సార్లు చేయాలి . లేదా రుద్ర సూక్తం 1116 సార్లు చేయాలి . ఆ తరువాత హోమం  చేసి వస్త్రాలు దానం చేయాలి . 


   బ్రాహ్మణుడు అంటే ఎవరు ?


 * దేవత్పత్యుపనయనాది సంస్కారాలు అనబడే రెండు జన్మలు గలవాడు.

 

 * బ్రహ్మ వర్చస్సు చేత ప్రకాశించే వాడు.


  * బడబాగ్ని వలె తృప్తి లేనివాడు.


  * తనని తాను పాపం నుండి రక్షించు కొనుచు ఇతరులుని కుడా రక్షించు వాడు.


  * పరబ్రహ్మ యందు నిష్ఠ కలవాడు.

 

 * బ్రహ్మ జ్ఞానం గలవాడు.


     జన్మ వలన అందరు శుద్రులే, " కర్మ " వలన ద్విజుడు అవుతున్నాడు. వేదం నేర్వడం వలన విప్రుడు అనిపించు కుంటున్నాడు. బ్రహ్మ జ్ఞానం పొందిన వాడే బ్రాహ్మణుడు  అవుతున్నాడు . అటువంటి వారిని హింసించ రాదు . అని అర్దం.


 * అన్నం గాని ఏ ఇతర ఆహార పదార్ధాన్ని గాని దొంగిలించరాదు . ఇతరులు తింటున్న ఆహరాన్ని లాగుకోకుడదు. ఇలాంటి పాపం చేయడం వలన శరీరం క్షీణించి పోయే వ్యాధి వస్తుంది. 


 రేమిడి - 

     

          శివుని బొమ్మ ను దానం చేయడం . శివుని బొమ్మ అనగా మట్టితో చేసిన బొమ్మైన కావొచ్చు. గాని దానం చేసే ముందు "ఓం నమః శివాయ " అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 5 వేల సార్లు జపించాలి.


 * ఈ జన్మ లో కుష్టు రోగానికి కారణం బ్రాహ్మణుడిని  హత్య చేయడం , గురుపత్ని సంగమం, మందులని దొంగతనం గా అమ్మడం , నమ్మిన వానికి విషం ఇచ్చి చంపుట.


 రేమిడి - 


         రుద్ర, ఆయహు          సూక్తములని పారయణం చేయడం , సూర్యునిది, ఒక ఎద్దుది బంగారం తో బొమ్మలు చేయించి దానం ఇవ్వవలెను.

 

 దానం అనేది ఇచ్చేవారి ఆర్థిక స్తోమత్తు ను బట్టి ఉంటుంది . బంగారు ప్రతిమలు దానం చేయడం అనేది ఆ రొజులలొ బంగారం చౌకగా ఉండేది కాబట్టి చెప్పబడింది.ఈ రోజుల్లో ఇది సాధ్యపడదు. అందువలన వెండితో ఈ ప్రతిమలు చేయించి కుష్మాండ హొమం జరిపించి పుణ్యాత్ములకు దానం ఇవ్వాలి .కుష్టు రోగం రావడానికి ఇతర కారణాలు ఉన్నాయి . పెద్ద మొత్తం లో  దూది కట్టలు అమ్మి డబ్బు తినివేయుట , ఇతరుల బట్టలను దొంగిలించుట, అంతే కాక కంచు అనే లోహంతో చేసిన గిన్నెలను దొంగిలించుట ఇవి కుడా కారణములే.


* దైవం యెక్క ధనం దొంగిలిస్తే పాండురోగం వస్తుంది.


 

  రేమిడి - 


             కూష్మాండ హొమం చేయవలెను .


 

  * పండితుల యెక్క , గుడ్డి వారి యెక్క డబ్బు దొంగిలించినా, లేదా నిషేధింపబడిన రొజులలో  సంభోగం చేసినా భగన్ధరమ్ అనే రోగం వస్తుంది. ఆవులను చంపినా ఈ వ్యాధికి గురికావలసిందే.


 రేమిడి - 

 

   వెండితో ఆవు ప్రతిమ చేయించి దానం ఇవ్వవలెను.


 * నేత్ర రోగములు రావడానికి కారణం కృతఘ్నత  , ఇతరుల కళ్ళను పోడిపించడం , పర స్త్రీలను కామం తో చూడటం .


 రేమిడి - 

  

          పాలు పెసరపప్పు కలిపి నేతితో పాయసం చేసి దానం చేయాలి . గరుక్మంతుని ప్రతిమ రాగిది కాని వెండిది కాని దానం ఇవ్వవలెను. " నేత్ర రక్షా సూత్రం" చదువుతూ హొమం చేయవలెను . 


* సద్బ్రాహ్మణులను  సన్మార్గులైన వారిని విమర్శించుట , తిట్టుట, తల్లితండ్రులను ద్వేషించుట , ఇంకొకరి ఆహరం ను దొంగిలించుట ఇవన్ని వాతరోగం లేక కీళ్ళ నొప్పుల రోగమునకు కారణం .


 రేమిడి - 


       రాగితో లేడి బొమ్మ తయారు చేసి దానిని కొత్త బట్టలతో సహా వాయుసుక్తం చదువుతూ దానం ఇవ్వవలెను.


 * శూల  నొప్పి ( colic trouble ) కారణం కన్యలను పాడు చేయుట, జంతు సంభోగం  , పని చెసే స్త్రీ ( servent maid ) తో సంబొగం, కొన్ని కొన్ని శాస్త్రోక్తమైన క్రియలు చేయకుండా ఉండుట .ఒకరికి విషం ఇచ్చి చంపుట, లేదా పదునైన ఆయుధం ద్వారా హతమార్చుట, ఇవన్ని కుడా శూల నొప్పి రావడానికి కారణాలు.


 " పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేన పీడితః "

అనే సూక్తి ఉన్నది. దాని వలెనే రోగాలు కలుగుతున్నాయి అనే నమ్మకం అయితే పైన చెప్పిన పాపాలకు దీని క్రింద చెప్పిన విరుగుడు చాలా చిన్నది. రెండొవది పాపమనే ది దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణం గా అర్దం మారినది. ఇందులొ విషం ఇచ్చి చంపడం, పదునైన అయుధాల ద్వారా చంపడం ఇవి పాపాలు కావు. రేమిడి లలొ నువ్వులు దానం చేయాలనీ ఉన్నది. పద్మములు దానం చెయవచ్చు. అలాగే  త్రిశూలం వెండితో కాని బంగారం తో కాని చేయించి దానం ఇవ్వడం  దీనిని జగ్రత్తగా పరిశిలిస్తే శూల నొప్పికి త్రిశూలం దానం చేయడానికి సంభందం ఉన్నదా ? శూల నొప్పిలో ప్రధాన పాత్ర వహించె వాడు శని. నొప్పిని పెంచి ఇబ్బంది పెట్టేవాడు కుజుడు. అందువలన ఈ రెండింటికి సంభందించిన వస్తువులు దానం చేయలి 


 * 8 కిలోల మినుములు శనివారం సూర్యోదయ  వేళలో ప్రారంబించి వృద్ధ బ్రాహ్మణులకు  దానం ఇయ్యవలెను.ఈ దానం శివాలయం లొ ఇస్తే  మంచిది.


 * 6 కిలొల ఎర్రటి మసూర్ పప్పు మంగళవారం సూర్యోదయ  వేళలో సుబ్రమణ్య స్వామి కోవెలలో  యవ్వనవంతులు  అగు యువతులకు దానం ఇవ్వవలెను.


* 14 కిలొల నువ్వులు నవగ్రహాల ఆలయానికి వెళ్లి శని వారం ఉదయం ముసలి బ్రాహ్మణులకు  దానం చేయాలి . వారు 8 మంది ఉంటే మంచిది.

 

* 8 సెం .మీ  గాని  8 అంగుళాల పొడవు గల వెండి త్రిశూలం చేయించి దానికి "ఓం నమః శివాయ " అను పంచాక్షరి మంత్రం తో 1116 సార్లు జపించి ధారపోసి ఆతర్వాత దానం ఇవ్వడం మంచిది .


మధుమేహమునకి గోదానం వరుణ మంత్రోచ్చారణ తో చేస్తే మధుమేహం పొతుంది.  


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

దత్తపది

 *పుచ్చ  - రేగు-  పణస- వెలగ (దత్తపది) ఫలరాజము మామిడిపండు గురించి స్వేచ్ఛా ఛందం లో*


*మామిడిపండు*


కాలము వ్యర్థపుచ్చకుము కాయలు పక్వము వచ్చు వేళలో


వేలము రేగుచున్నపుడు వేగమె బేరము చేసి తెమ్మురా!


చాలినయన్ని పండ్లకు రసాలములున్  పణసంత పెద్దవౌ


మేలిమి జాతివౌ, కొనుము మేకొనుచున్ వెలగట్టి గంపతోన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

పరతంత్రుండు రహించు

 *పరతంత్రుండు రహించు దీనజన కల్పద్రు ప్రభావోన్నతిన్*

ఈ సమస్యకు నాపూరణ. 


పరపంచన్ పలుబాధలన్ గుమిలి సంప్రాప్తించు కష్టాలతో


దరి జేరంగను దారి యేదొ గనకే ధైర్యంబు గోల్పోవడే


 పరతంత్రుండు - రహించు దీనజన కల్పద్రు ప్రభావోన్నతిన్


అరులన్ నొంచెడు వాడు వీరుడయి యాటంకంబులన్ దోలడే.



అల్వాల లక్ష్మణ మూర్తి.

హనుమజ్జయంతి ప్రత్యేకం - 8

 ॐ         హనుమజ్జయంతి ప్రత్యేకం - 8

       (ఈ నెల 1వ తేదీ హనుమజ్జయంతి) 


VIII. హనుమ - చేసిన ప్రార్థనలు 


అ) సముద్ర లంఘనానికి ముందు చేసిన ప్రార్థన 


హనుమ 

  - సూర్యునికి, 

  - మహేంద్రునికి, 

  - వాయుదేవునికి, 

  - బ్రహ్మకు, 

  - పంచభూతాలకీ నమస్కరించి ప్రయాణానికి సిద్ధపడ్డాడు. 

    తన తండ్రియైన వాయుదేవునికి మరల నమస్కరించి, దక్షిణ దిక్కుకు పోవు ఉద్దేశంతో తన శరీరాన్ని పెంచాడు. 


స సూర్యాయ మహేంద్రాయ  

పవనాయ స్వయంభువే I 

భూతేభ్య శ్చాంజలిం కృత్వా 

చకార గమనే మతిమ్ ॥ 

అంజలిం ప్రాఙ్ముఖః కుర్వన్ 

పవనా యాత్మయోనియేI 

తతోఽభివవృధే గంతుం 

దక్షిణో దక్షిణాం దిశమ్ ॥ 

       ( - సుందరకాండ 1/8,9 ) 


  - సరియైన బుద్ధికై సూర్యుని, 

  - ఇంద్రియాలకై ఇంద్రుని, 

  - ప్రాణాది వాయువులకై వాయుదేవుని, 

  - ఆలోచనా సృష్టికై సృష్టకర్త అయిన బ్రహ్మకీ, 

  - పాంచభౌతికమైన దేహమూ, ప్రపంచానికీ సంబంధించి పంచభూతాలకీ అంజలి ఘటించాడు. 

      వాయుదేవుడైన తండ్రికి మరొకసారి  ప్రార్థన. 


ఫలితం


    సూర్యుడు తాపంలేకుండా చూడడమే కాక, బుద్ధి సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకునేటట్లు అనుగ్రహించాడు. 

    ఇతర దేవతలు కూడా వారివారి స్థానాలకి సంబంధించి అనుగ్రహించారు.


ఆ) సీతాదర్శనం కాక విచారిస్తున్నప్పుడు చేసిన ప్రార్థన 


    లక్ష్మణునితో గూడిన రామునకు నమస్కారము. 

    జనక సుతయైన సీతకు నమస్కారము. 

    రుద్ర - ఇంద్ర - యమ - వాయువులకు నమస్కారము. 

చంద్ర - సూర్య - మరుద్గణములకు కూడా నమస్కారము. 


నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ 

దేవ్యై చ తస్యై జనకాత్మజాయై I 

నమోఽస్తు  రుద్రేంద్రయమానిలేభ్యో 

నమోఽస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ॥ 

         ( - సుందరకాండ 13/59 ) 


    ఋషిగణములతో పాటు దేవతలు గూడ నాకు కార్యసిద్ధి కలిగింతురు గాక! 

    బ్రహ్మయు, దేవతలు, అగ్నియు, వాయువు, వజ్రపాణియైన ఇంద్రుడునూ నాకు కార్యసిద్ధి కలిగింతురు గాక! 

    పాశహస్తుడైన వరుణుడును, చంద్రసూర్యులును, అశ్వనీ దేవతలును, శివుడును నాకు కార్యసిద్ధి కలిగింతురు గాక! 

    సర్వభూతములును, భూతముల కధిపతియైన మహావిష్ణువును, దారిలో కనిపించెడి - కనిపించని భూతములన్నియు నాకు కార్యసిద్ధిని ప్రసాదింతురు గాక! 


సిద్ధిం మే సంవిధాస్యంతి 

దేవా స్సర్షిగణా స్త్విహ ॥ 

బ్రహ్మా స్వయంభూ ర్భగవాన్ 

దేవాశ్చైవ దిశంతు మే I 

సిద్ధి మగ్నిశ్చ వాయుశ్చ 

పురుహూతశ్చ వజ్రభృత్ ॥ 

వరుణః పాశహస్తశ్చ 

సోమాదిత్యౌ తథైవ చI 

అశ్వినౌ చ మహాత్మానౌ 

మరుత శ్శర్వ ఏవ చ ॥ 

సిద్ధిం సర్వాణి భూతాని 

భూతానాం చైవ యః ప్రభుః I దాస్యంతి మమ యే చాన్యే 

హ్యదృష్టాః పథి గోచరాః ॥ 

         ( - సుందరకాండ 13/64 నుండి 67 వరకు )


    సీతారామలక్ష్మణులకూ ముఖ్య దేవతలకూ నమస్కరించాడు. 

    అందఱికీ ప్రభువుతో కూడిన పరివార దేవతలతో సహా అందఱూ తన ప్రయత్నం సఫలీకృతం చేయడంలో అనుగ్రహించవలసినదని ప్రార్థించాడు. 


ఫలితం 


    ఆ ప్రయత్నంలో సఫలుడై, అశోకవనంలో సీతా దర్శనం పొందగలిగాడు. 


    మనం హనుమను ప్రార్థిస్తే, 

  - ఎప్పుడెప్పుడేదేది కావాలో అప్పుడప్పుడు అదే అదే, 

  - ఎక్కడెక్కడ ఏదేది కావాలో అక్కడక్కడ అదే అదే, 

  - ఎంతెంత అవుసరమో అంతంతా, 

  - ఎలాఎలా మనకి అవుసరమో అలాఅలా అనుగ్రహిస్తాడు. 

    మనకి ఏది హితమో అదే ఇస్తూ, తానే స్వయంగా సర్వమూ చూసుకుంటాడు. 


బుద్ధిర్బలం యశో ధైర్యం 

నిర్భయత్వం అరోగతా I 

అజాడ్యం వాక్పటుత్వంచ 

హనుమత్స్మరణా  భవేత్ ॥ 

    

               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - జే‌ష్ట మాసం - శుక్ల పక్షం  -‌ ద్వితీయ  - ఆర్ద్ర -‌‌  స్థిర వాసరే* (08.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*