9, మార్చి 2026, సోమవారం

మూడు గుణాల గురించి

  మానవశరీరం నందలి మూడు గుణాల గురించి సంపూర్ణ వివరణ -

మానిషి యొక్క శరీరం నందు ప్రధాన పాత్ర వహించునవి మూడు ధాతువులు అవి .

1 . వాతం 2 .పిత్తం. 3 . శ్లేష్మం .

మనుష్యుని యొక్క తల భాగం నుంచి రొమ్ము భాగం వరకు శ్లేష్మ సంబంధ శరీరం ఉండును. రొమ్ము క్రింద నుంచి నడుము పైభాగం వరకు ఉండునది పిత్త శరీరం . నడుము క్రింద భాగం నుంచి పాదాల వరకు ఉండునది వాత శరీరం. ప్రతి ఒక్కరిలోనూ ఇదే విధముగా ఉండును. అవి తమయొక్క స్థానాన్ని దాటి ప్రకోపించినప్పుడు మనుష్యునికి ఆయా సంబంధ వ్యాధులు కలుగును. అనుభవం గల వైద్యుడు సరిగ్గా సమస్యని గుర్తెరిగి వైద్యం చేయవలెను . ఇప్పుడు ఈ మూడు ధాతువులు గురించి సంపూర్ణంగా వివరిస్తాను.

• వాతము -

    కన్ను మూసి తెరవాలి అన్నను , ముక్కుతో శ్వాస పీల్చి వదలాలి అన్నను, కాళ్ళు చేతులు కదల్చాలన్న , రక్తం శరీరం అంతా ప్రవహించాలన్న , జీర్ణక్రియ సంపూర్ణంగా జరగాలన్నా వాయువు సహాయం కావలెను. ఇక్కడ వాతమునకు మరొక పేరే వాయవు. శరీరంలో నాడుల ద్వారా ఈ క్రియలు అన్నియు జరుగును. ఎప్పుడైనా ఈ క్రియలలో ఆటంకం కలిగి నొప్పులు వచ్చాయి అంటే అది పూర్తిగా వాతసంబంధమైన సమస్యగా పరిగణించాలి. ఈ వాతం శారీరక క్రియలనే కాకుండా మానసిక క్రియలను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక మనిషి అతిగా ఆలోచించడం మరియు పిచ్చిపట్టడానికి కూడా ఈ వాతమే కారణం. శరీరంలోని వాతం విపరీతంగా ప్రకోపించి తలకు ఎక్కినప్పుడు మనుష్యునికి పిచ్చిపట్టును. తీవ్రమైన భాధ, విచారం కలిగి ఉండును. ఆయుర్వేద గ్రంధాలలో వాతం యొక్క హెచ్చుతగ్గులు వలన కలిగే రోగాలను 80 రకాలుగా వివరించారు. వాటిని అశీతివాతాలు అంటారు. ఈ వాత వ్యాధులను నయం చేయాలి అంటే నాడుల్లో ఉండే మాలిన్యాలను తొలగించే ఔషధ సేవన అత్యుత్తమం .

• పైత్యం - 

   పిత్తమునే పైత్యంగా వ్యవహరిస్తారు . మనము తీసుకున్న ఆహార పదార్ధాలు అన్ని జీర్ణం కావాలంటే వేడి అవసరం . దేహము నందు ఉండే మాలిన్యాలు అన్నింటిని బయటకు వెడలించుటకు కూడా వేడి అవసరం . శరీరం నందు ఉండు మాలిన్యాలను దహించుటకు కూడా పిత్తం ఎంతో అవసరం . ఈ పిత్తం దేహాన్ని చురుకుగా , చలాకీగా ఉంచుటకు కూడా అవసరం. దేహము యెక్క వేడి నందు హెచ్చుతగ్గులు కలిగినను , భాధలు కలిగినను పైత్యం యొక్క పరిమితిలో సమస్యలు మొదలు అయినవని గ్రహించాలి. ఆకలి లేకున్నను , మితము తప్పిన ఆకలి ఉన్నను , మలమూత్రాదులు ఎక్కువ ఉన్నను, లేకున్నను , చెమట ఎక్కువ పోసినా , పొయ్యకున్నను అది పైత్య సంబంధ సమస్యగా గుర్తించాలి. పైత్యం అనగా అగ్నిసంభంధమైనది. దేహములో ఎక్కడైనను మంటలు పుట్టినాయి అంటే అది ఖచ్చితంగా పైత్య ప్రభావంగా గుర్తుంచుకోవాలి. దేహంలో యే భాగమైనా కాంతి

తగ్గినను, దేహంలో ఎక్కడైనా గడ్డకట్టినను జరిగింది అంటే అది పైత్యం తక్కువ కావడం వలన సంభవించిందిగా భావించాలి. దేహం పైన ఎక్కడైనా కురుపు లేచింది అంటే శరీరంలో పైత్యం పెరిగింది అని తెలుసుకోవలెను. ఈ పైత్య వ్యాధుల నివారణ కొరకు శరీరంలో ఉండు వేడిలో హెచ్చుతగ్గులు లేకుండా సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి.

• శ్లేష్మము - 

   మనము తినిన ఆహారం అంతయు జీర్ణావయవముల యందు వచనమై రసముగా మారును. ఈ రసముకే ఆంగ్లము నందు "లింఫ్ " అందురు. జీర్ణశయం నందలి కోట్లాదిగా వ్యాపించి ఉన్న శోషరసకేశ నాళికలు ద్వారా ఈ రసం స్వీకరించబడి శోషరస వాహికలలో చేరుచున్నది.దేహము నందు రక్తనాళాలు ఎట్లు వ్యాపించి ఉండునో ఈ శోషరస వాహికలు దేహమంతా వ్యాపించి ఉండును. ఈ రస వాహికలకు శ్లేష్మరస వాహికలు అని పేరు . మన శరీర కదిలికల వలన శరీరం నందలి అతిగా వేడి పుట్టకుండా కాపాడునది ఈ శ్లేష్మము యంత్రం పనిచేయునప్పుడు యంత్రభాగాల యందు వేడి జనించకుండా కందెన ఎలా ఉపయోగపడునో అదేవిధంగా శ్లేష్మం పనిచేయును. శరీరం నందు శ్లేష్మం తక్కువైనచో శరీరభాగాలు తీవ్రవేడికి గురి అగును. హెచ్చుతగ్గులు లేని శ్లేష్మం వలన శ్వాసనాళాలు సాఫీగా పనిచేయును . శ్లేషం దేహమునకు సరిపోనంత ఉండిన నిరుత్సాహము , అలసట , నిస్తేజము వంటి మానసిక ఆందోళనలు యే కాక దేహము నందు వేడి , దేహము యొక్క చివరలు , పాదములు , చేతులు మంటలుగా ఉండటం, కండ్లు తిరుగుట, శోష, దప్పిక , గాబరా , దాహాము మొదలయిన దుర్గుణాలు కనిపించును. ఈ శ్లేష్మము దేహావసరాలకు మిగిలియున్నప్పుడు తరువాత వాడుకొనుటకు కొంతభాగం మేధముగా మారును . దీనినే కొవ్వు అనుదురు. ఈ మేధము ఉదరము నందు , రొమ్ముల యందు , పిరుదల యందు చేరి నిలువ ఉండును. సరైన ఆహారం దొరకనప్పుడు , ఉపవాస సమయాల్లో ఈ కొవ్వుని శరీరం తన క్రియలకు ఉపయోగించుకొనును. ఈ శ్లేష్మం అధికమైనప్పుడు ముక్కునుంచి చీమిడి కారడం, కురుపు నుంచి వెలువడే చీము, పురుషుల్లో కలిగే శుక్లనష్టం, స్త్రీలలో వచ్చు తెల్లబట్ట, గడ్డలలో గట్టిగా ఉండు పదార్థం , మోకాలి సంధి యందు నొప్పి కలుగును. కావున పైన చెప్పిన మూడు ధాతువులలో హెచ్చుతగ్గులు జరగకుండా మంచి ఆహారపు అలవాట్లు ఏర్పరుచుకోవాలి.

ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .

గమనిక -

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .

 ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం . ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు . 

         కాళహస్తి వేంకటేశ్వరరావు

      అనువంశిక ఆయుర్వేద వైద్యులు

                  9885030034

ఆవుతో అధ్బుత వైద్యం -

 ఆవుతో అధ్బుత వైద్యం -

రక్తపైత్య రోగానికి -

• రక్తపైత్య రోగం అనగా నోటివెంట దగ్గినప్పుడు రక్తం పడటం .నాటు ఆవుపాలు పావు లీటరు తీసుకుని గిన్నెలో పోసి దానిలో మంచినీరు 1 1/4 లీటరు కలిపి చిన్న మంట పైన నీరంతా ఇగిరిపోయి పాలు మిగిలే వరకు మరగబెట్టి దించి చల్లారిన తరువాత ఆ పాలను ప్రతిరోజూ తాగుతూ ఉంటే దగ్గులో రక్తం పడే రక్త పిత్త వ్యాధి కొద్దిరోజులలోనే తగ్గిపోవును .ఇంత సులువైన మందు యే వైద్య విధానంలో లేదు .

• విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి -కాచిన ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో పటికబెల్లం పొడి 30 గ్రా , ఆవునెయ్యి 20 గ్రా , లక్కపొడి 2 గ్రా కలిపి ఒక మోతాదుగా రోజు రెండుపూటలా తాగిస్తూ ఉంటే ఒకటి లేక రెండు వారాలలో విరిగిపోయిన ఎముకలు తప్పకుండా అతుక్కుంటాయి.

• అతి కఫం హరించుట కొరకు -రోజు రెండు పూటలా పావు లీటరు ఆవుపాలలో ఒక గ్రాము మిరియాల పొడి , పటికబెల్లం పొడి 20 గ్రాములు కలిపి తాగుతూ ఉంటే ప్రకోపించిన అతి కఫం అదృశ్యం అవుతుంది.

• పాండు రోగం , క్షయ హరించుట కొరకు -ఇనుప పాత్రలో కాచబడిన ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో తగినంత కండ చక్కర పొడి కలిపి రోజు పరగడపున సేవిస్తూ ఉంటే క్రమంగా పాండురోగం పారిపోయి రక్త వృద్ది కలుగుతుంది. క్షయవ్యాధి బహు త్వరగా పారిపోతుంది.

• ఎక్కిళ్లు వెంటనే తగ్గుట కొరకు -కాచిన ఆవుపాలు పావు లీటరు మోతాదుగా పటికబెల్లం పొడి కలిపి గోరువెచ్చగా కొంచంకొంచం తాగుతూ ఉంటే అప్పటికప్పుడే ఎక్కిళ్లు తగ్గుతాయి

• పిల్లల ఆరోగ్యానికి -అప్పటికప్పుడు చిలికిన మజ్జిగ నుంచి తీసిన ఆవువెన్న ని పసిపిల్లల అన్నప్రాసన రోజు నుంచి ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం వేళ్ళల్లో వయసుని బట్టి పూటకు ఒక గ్రాము నుంచి పెంచుకుంటూ 10 గ్రాముల వరకు తినిపిస్తుంటే ఆ పిల్లల శరీరం ఉక్కులా బలంగా తయారు అయ్యి అవయవాలు అందంగా ఉంటాయి. తెలివి పెరుగును.

• సంభోగ సుఖం కొరకు -గోరువెచ్చని ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో పటికబెల్లం పొడి 25 గ్రా కలిపి మొదటిసారి సంభోగం అయ్యాక వెంటనే సేవిస్తే ఆ సంభోగం తాలుకు నీరసం తగ్గిపోవడమే కాక తిరిగి త్వరగా మరలా సంభోగం చేయగల శక్తి లభించును. 

  అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .

 గమనిక -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

     కాళహస్తి వేంకటేశ్వరరావు  

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

         9885030034

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*ఆదివారం 8 మార్చి 2026*

``

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

1️⃣5️⃣7️⃣&1️⃣5️⃣8️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``

        *సంపూర్ణ మహాభారతము*

          *157,158 వ రోజు*                   

*వన పర్వము సప్తమాశ్వాసము*

*యక్షప్రశ్నలు*```

అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరం ఉన్న పాండవుల వద్దకు ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి “అయ్యా! నేను నా అరణిని చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని కొమ్ములకు నా అరణి తగులుకుంది. ఆ లేడి నా అరణితో పారి పోయింది. దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇవ్వండి” అని ధర్మరాజును అడిగాడు. 

ధర్మరాజు విల్లంబులు పట్టుకుని తమ్ములతో ఆ లేడిని వెంబడించాడు. కాని అతను వేసిన బాణములు ఒక్కటి కూడా ఆ లేడికి తగలలేదు. అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తి మాయం అయింది. పాండవులు అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి 

“అన్నయ్యా! మనం ఉన్నత వంశంలో పుట్టాము. ధర్మశాస్త్రాలు చదువుకున్నాము. అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాము. కాని ఇంతటి దుర్గతి రావడానికి కారణం ఏమిటి? " అని అడిగాడు. 

ధర్మరాజు నవ్వి "నకులా! సుఖం కాని దుఃఖం కాని మనకు కలగడానికి కారణం మన చేసుకున్న కర్మే. వేరే ఏమి కాదు" అన్నాడు. 

భీముడు నకులుని చూసి “తమ్ముడూ! ఆ రోజు పాత్రిగామి ద్రౌపదిని కొలువు కూటమికి తీసుకు వచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి" అన్నాడు. 

నకులుడు "అన్నయ్యా భీమా! అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికి వారి వలె అడవులకు వచ్చామే. అదే అసలు కారణం. అన్నయ్యలూ! ఆ రోజే మాయజూదం ఆడిన శకునిని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా” అన్నాడు సహదేవుడు. 

ఆ మాటలు వింటున్న ధర్మరాజు 

“తమ్ముడూ! ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు” అన్నాడు.```

*దాహార్తులై పాండవులు కొలను చేరుట*```

నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కలా చూసి కొంచం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు. 

ధర్మరాజు "అయితే నీవు పోయి నీరు త్రాగి మాకు కొంత నీరు తీసుకురా" అన్నాడు. 

నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. నీళ్ళు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది. “అన్నా! ఈ తటాకము నాది. నీవు ఈ తటాకములో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వాలి” అన్న మాటలు వినిపించాయి. 

నకులుడు దానిని పట్టించుకోకుండా నీరు త్రాగాడు. కొలను బయటకు వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. 

నీళ్ళకు వెళ్ళిన నకులుడు ఎంతకీ రాకపోయే సరికి ధర్మరాజు సహదేవుని చూసి "సహదేవా! నీ అన్నయ్య నకులుడు నీళ్ళు తీసుకు రావటముకు వెళ్ళి ఎంతకూ రాలేదు. నీవు పోయి చూసి రా” అని చెప్పి పంపించాడు. 

సహదేవుడు నకులుడు వెళ్ళిన దిశగా వెళ్ళి నీళ్ళు త్రాగటానికి కొలనులో దిగపోయే సమయంలో 

“మహానుభావా! ఈ కొలను నాది. సాహసంతో ఇందులో దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత నీరు త్రాగు” అన్న మాటలు వినిపించాయి. 

సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. నకులుని లాగానే స్పృహతప్పి పడి పోయాడు. పోయిన ఇద్దరూ ఎంతకీ రాక పోయే సరికి ధర్మరాజు అర్జునిని చూసి “అర్జునా! నీ తమ్ములు నీళ్ళకు వెళ్ళి ఎంతకూ రాలేదు. ఏం జరిగిందో చూసి రా” అని చెప్పి పంపించాడు. 

అర్జునుడు కొలను సమీపించగానే అశరీరవాణి "ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే స్పృహతప్పి పడిపోతారు” అన్నాడు. 

అర్జునుడు “ఎవడురా నువ్వు? చాటుగా మాట్లాడు తున్నావు. ఉండు నిన్ను సంహరిస్తాను" అంటూ శబ్ధవేది బాణాన్ని ప్రయోగించాడు. 

మరలా అవే మాటలు వినిపించాయి. అర్జునుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. 

అర్జునుడు కూడా స్పృహతప్పి పడి పోయాడు. 

వెళ్ళిన ముగ్గురూ రాకపోయే సరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముని చూసి “భీమా వెళ్ళిన ముగ్గురూ తిరిగి రాలేదు. ఏమి జరిగిందో చూసిరా" అని పంపాడు. 

భీముడు కొలను సమీపించగానే మరలా అదే అశరీరవాణి 

“ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు నీకు శక్తి ఉంటే నాప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్ళు త్రాగు" అన్నది. 

భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీళ్ళు త్రాగి స్పృహతప్పి పడి పోయాడు.```

               *సశేషం*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 

*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*ఆదివారం 8 మార్చి 2026*

        *శ్రీ మహావిష్ణు పురాణం*                        

                 *19వ భాగం*

*ఏకాదశ రుద్రులు - దశ బ్రహ్మ మానస పుత్రుల జననం - శివుడి ఆవిర్భావం:*```

ముల్లోకాలలో నివసించే వారిని సృష్టించిన బ్రహ్మకు తృప్తి కలుగ లేదు. వారికి ధర్మము బోధించి ధర్మమార్గంలో నడిపించే వారు ఎవరు అని ఆలోచించాడు. బ్రహ్మ నుంచి ఒకనిట్టూర్పువెలువడింది. ఆ నిట్టూర్పు నుండి ఒక దివ్య పురుషుడు అవతరించాడు.

అతడే కర్దమ ప్రజాపతి. 

బ్రహ్మ కర్దముని చూసి “పుత్రా! కర్దమా! తగిన కన్యను వివాహమాడి మానవ సంతతిని వృద్ధిచేయము" అని ఆదేశించాడు. 

కర్దముడు బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! మీ ఆజ్ఞను పాటిస్తాను. కానీ ముందుగా విష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేస్తాను. ఆయన ప్రత్యక్షం కాగానే తగిన కన్యను వివాహానికి చూపించమని అడిగి, 

ఆ కన్యను వివాహమాడ తాను" అని తపస్సుకి వెళ్లి పోయాడు.

బ్రహ్మ కర్దముని నిర్ణయంలో గల ధర్మబద్దతను గమనించి మౌనంగా ఉండిపోయాడు. సృష్టి తను అను కున్నట్టు సాగకపోవడంతో బ్రహ్మకు తనమీద తనకే ఆగ్రహం కలిగింది. ఆగ్రహంతో రుద్రుడైనబ్రహ్మ లలాటంనుంచి మధ్యాహ్నసూర్య తేజంతో ప్రజ్వరిల్లే రుద్రుడు ఉద్భ వించాడు. రుద్రుడి కాలాగ్ని ఉచ్ఛ్వా సల నుండి రుద్రునితో సమానులైన మహాత్ముడు, మతిమంతుడు, భీషణుడు, భయంకరుడు, ఋతధ్వజుడు, ఊర్థ్వకేశుడు, పింగళాక్షుడు, రుచి, శుచి, కాలాగ్ని అనే రుద్రాంశ సంభూతులు జన్మించారు. పదిమందిని తీసుకుని లయకారుడైన రుద్రుడు కైలాసానికి వెళ్లి పోయాడు.

ఏకాదశ రుద్రులు అలా వెళ్లి పోయేసరికి బ్రహ్మ మరింత చింతనలో పడ్డాడు. అప్పుడు బ్రహ్మ మానసము నుండి మరీచి, కుడి చెవి నుండి పులస్త్యుడు, ఎడమ చెవి నుండి పులహుడు, కుడి కన్ను నుండి అత్రి, ఎడమ కన్ను నుండి క్రతువు, నాసిక నుండి వసిష్టుడు, నోటి నుండి అంగీరసుడు, కుడి పార్శ్వము నుండి భృగువు, ఎడమ పార్శ్వము నుండి దక్షుడు, కంఠం నుండి నారదుడు అవతరించారు. 

బ్రహ్మ వారిని చూసి "పుత్రులారా! నా మానసములో ఏర్పడిన చింతన నుండి మీరు జన్మించి నా మానస పుత్రులు అయ్యారు. మిమ్మల్ని నేను ప్రజాపతులుగా నియమిస్తున్నాను. మీరు తగిన కన్యలను వివాహమాడి సంతానం పొంది సృష్టిని వృద్ధిచేయండి" అని ఆదేశించాడు.

నారదుడు బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! మనసా వాచా కర్మణా నేను నారాయణుని సేవకు అంకితమవుతాను. నారాయణ నామస్మరణం, గానం, తపస్సు, దర్శనం, స్పర్శనం, సేవాభాగ్యం తప్ప వేరే కార్యం చేయలేను. నన్నుమన్నించండి. నాకు సంసార సంతాన ఇచ్ఛలేదు. స్థిరంగా ఒక

చోట ఉండి నారాయణ సేవ చేసు కునే వరం ప్రసాదించండి" అని ప్రార్ధించాడు.

నారదుడి మాటలు బ్రహ్మకు ఆగ్రహం కలిగించాయి. "నారదాజన్మ నిచ్చిన తండ్రి ఆజ్ఞనే ధిక్కరించావా? సృష్టికర్తనైన నామాట కాదన్నందుకు నిన్ను శపిస్తున్నాను. "ఒక చోట స్థిరంగా నిలువకుండా ముల్లోకాలు నారాయణ నామ స్మరణ చేస్తూ తిరుగుతూ "త్రిలోక సంచారి" వై జీవించుము" అని శపించాడు.

నారదుడు మరింత ఆనందం పొంది "తండ్రీ! ముల్లోకాలు నారాయణ నామ స్మరణ చేస్తూ సంచరించేభాగ్యం ను కలిగించారు. నా జన్మ చరితార్థమైంది" అని నమస్కరించి నారాయణ నామ గానం చేసుకుంటూ వెళ్లి పోయాడు. మిగిలిన తొమ్మిది మంది మానస పుత్రులను చూసి బ్రహ్మ అసహనంగా "మీ సంగతి ఏమిటి? నారదునిలా శాపం పొందుతారా! లేక నా ఆదేశం పాటిస్తారా!" అని అడిగాడు.

మరీచి మొదలైనవారు భయభక్తులతో బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! మీ ఆదేశం ప్రకారమే సృష్టిని వృద్ధి చేస్తాము. మాకు తగిన కన్యలు లభించే వరకు మమ్మల్ని తపస్సు చేసుకోవడానికి అనుమతించండి" అని బ్రహ్మదేవుడు అనుమతి పొంది తపస్సుకి వెళ్లి పోయారు.

బ్రహ్మ తను అనుకున్నట్టుగా సృష్టి జరగక పోవడంతో అసహనం చెంది "సృష్టిలో తనకు సహకరించేవారు ఒక్కరు లేరు" అనుకుంటూ గట్టిగా తొడపై చేతితో చరిచాడు (కొట్టుకున్నాడు). మరుక్షణం ఆయన తొడ5 నుండి అఖండ తేజస్సుతో ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే "నాకు నామకరణం చెయ్యి" అంటూ ఏడవ సాగాడు.

బ్రహ్మ ఆ శిశువుని ఊరడిస్తూ "శిశువుగా జన్మించిన నీకు శివుడు అని నామకరణం చేస్తున్నాను. నిన్ను భక్తితో కొలిచినవారికి, ఆశ్ర యించినవారికి దుఖములు తొలగించి సకల సుఖములు ఇస్తాను. చివరలో కైవల్యం ప్రసాదిస్తావు" అని వరమిచ్చాడు. 

శిశువు సంతోషపడకుండా ఏడుసార్లు బిగ్గరగా ఏడ్చాడు. ఏడ్చిన ప్రతిసారి ఒక్కొక్క నామంతో నామకరణం చేస్తూ బ్రహ్మ సముదాయించాడు.

భవుడు, శర్వుడు, మహేశ్వరుడు, పశుపతి, భీముడు, మహాదేవుడు, ఉగ్రుడు అనే ఏడు పేర్లు ఆ శిశువుకి వచ్చాయి. తరువాత బ్రహ్మ శిశువుకి శరీరాలుగా సూర్యుడు, చంద్రుడు, పృధ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, యజమాని అనే అష్టభూతములను నియ మించి శివుని అష్టమూర్తిగా చేశాడు.

అష్టమూర్తి అయిన శివుని చూసి "భూలోకానికి గల అష్ట దిక్కులు నీకు ఆధీనం చేస్తున్నాను. అష్ట దిక్కుల మధ్య నున్న భూమండ లానికి ఆయురారోగ్య ప్రదాతవై విరాజిల్లుము" అని దీవించాడు. వెంటనే శివుడు శిశురూపంవదలి పూర్ణ రూపం దాల్చి "బ్రహ్మదేవా! భూలోకంలోని అష్ట దిక్కులకు నన్ను అధిపతిని చేసి నీకు ఏ దిక్కు లేకుండా చేసుకున్నావు. ఫలితంగా నీకు భూలోకంలో ఆలయాలు ఉండవు. నీ విగ్రహ మూర్తికి ప్రతిష్టాపనలు, పూజలు ఉండవు" అని అదృశ్యమయ్యాడు. శివుడి మాటలకు బ్రహ్మ నిశ్చేష్టు డయ్యాడు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*

దక్షత

  దక్షత' అంటే సమర్ధత అనే అర్ధం మనం సాధారణంగా తీసుకుంటాము. ఒక ఉద్యోగం ఎవరికైన ఇవ్వాలంటే ముందుగా వ్రాత పరీక్ష పెట్టి తరువాత మౌఖిక పరీక్ష పెట్టి ఆ అభ్యర్థి సమర్ధత కలిగి ఉన్నాడా లేదా అని పరీక్షించిన తరువాత ఉత్తీర్ణత సాధించిన వారికి వారి ఉత్తీర్ణతల స్థాయిలను బట్టి ఉద్యోగాలు ఇవ్వటం పరిపాటి. అంటే ఏదైనా ఉద్యోగం ఒక వ్యక్తికీ ఇవ్వాలంటే ఆ ఉద్యోగ బాధ్యతలను సదరు వ్యక్తి దక్షతతో నిర్వహించగలడు అని అధికారులకు కలిగిన తరువాతే ఎంపిక చేస్తారు. ఇది మనం నిత్యం చూస్తున్నాము. 

దక్షత అంటే సామర్థ్యం, నైపుణ్యం, లేదా పనిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి అని అర్థం. ఇది పరిపాలనలో చురుకుదనాన్ని, బాధ్యతను, మరియు పనితీరులోని పరిణితిని సూచిస్తుంది. ఇది సాధారణంగా వ్యాపార, పరిపాలనా, లేదా వ్యక్తిగత సామర్థ్యాన్ని తేలియచేస్తుంది. దక్షత కేవలం ఉద్యోగంలోనేనా లేక ఇతర విషయాలలో కూడా అవసరమా అంటే నిత్యజీవితంలో ప్రతి కార్యం సమర్ధవంతంగా చేయటానికి దక్షత అవసరం ఉంటుంది అని చెప్పవచ్చు. మనకు ఒక సామెత వున్నది అదేమిటంటే మట్టికి పోయిన ఇంటివాడే పోవాలి. నిజానికి మట్టిని తేవటం అనేది చాలా చిన్న పని. అక్కడ ఎటువంటి దక్షత అవసరం లేదు. కానీ అదే దక్షుడు అయిన సొంతమనిషి వెళితే చక్కటి మట్టిని వెతికి తీసుకొని వస్తాడు అనే భావంతో దీనిని వాడుతారు. ఒక సంసారి ఇంటిని నిర్వహించటానికి కూడా దక్షత అవసరం అని అంటాడుభాస్కర శతక కవి. 

దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోట నుండి వే

లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁగల్ల గాదు ప్ర

త్యక్షము వాగులున్ వరద లన్నియు వచ్చిన నీరు నిల్చునే

యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!

ఏరకంగా అయితే కట్టలు తెగిన చెరువులోని నీరు నిలవకుండా పడుతుందో అదే రకంగా ఇంటి యజమాని సమర్ధుడు కాకపొతే ఇంట్లోని ద్రవ్యం మొత్తం వృధాగా ఖర్చు అయి ఆ యిల్లు కష్టాల పాలు అవుతుందని చెపుతున్నాడు కవి. 

దక్షుని లక్షణాలు ఎలా వుంటాయో కూడా ఏనుగు లక్ష్మణ కవి సుభాషితాలలో తెలిపాడు. 

ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జపై,

నొకచోశాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం, అర్ధం

బొక్కచో బొంత ధరించు, నొక్కొక తఱిన్ యోగ్యాంబర శ్రేణి, లె

క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్

అనగా కార్యసాధకుడైన వాడు తన సౌకర్యములను గూర్చి గాని, లేదా వ్యవస్థను గూర్చి గాని చింతించడు. క్లిష్టమైన పరిస్తితులైన లేక చాలా సౌకర్యమైన పరిస్తితులైన అన్నిటిని సమానంగా చూస్తూ కేవలం తన ద్రుష్టి మాత్రం తాను నిర్వహించవలసిన కార్యం మీద మాత్రమే నిలుపుతూ కార్యాలను సాధిస్తాడని అంటున్నాడు కవి. 

దక్షత కలిగిన వాడే చేసే ప్రతి పని ఎంతో నైపుణ్యం గా పరిపూర్ణంగా ప్రశంసాత్మకంగా సత్వరం జరిగేటట్లుగా ఉంటుంది అని వేరే చెప్పనవసరం లేదు. ఏ పనిలో ఆయన ఆ పని చేసే విధానంలోనే చేసే వాడి యొక్క దక్షత తెలుస్తుంది మనం ఎంతో చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉండేటటువంటి పెద్ద పెద్ద భవంతులని చూస్తూ ఉంటాం అంత చక్కటి భవంతులు కట్టాలంటే ఆ నిర్మించిన మేస్త్రీలు తప్పకుండా దక్షులై ఉండాలి అని వేరే చెప్పనవసరం లేదు. అదే పెద్ద చిన్న పనిలో కూడా దక్షత ఎంతో అవసరం ఒక కార్యంలో చక్కగా వంట చేయడం కూడా ఒక దక్షత గమనించవచ్చు రాజ్యాంగ మనం ఏ పెళ్లిళ్లలో కానీ ఫంక్షన్లలో కానీ వెళ్లి భోం చేస్తే అక్కడ వంట ఎవరు చేశారు చాలా బాగా చేశారు అని వంట చేసిన వారిని మెచ్చుకోవటం పరిపాటి ఎంతో ఖర్చుపెట్టినా ఆ ఫంక్షన్ నిర్వహించిన యజమానిని అస్సలు చదవాలి అదే వంట సరిగా చేయకపోతే ఆ యజమాని ఎంత ఖర్చు పెట్టినా అందరి చేత మాట పడాల్సి వస్తుంది అందుకని వంటవారు ఎక్కువ అడిగినా గాని పేరు ఉన్న వంట వాళ్ళని ఎంచుకొని కార్యాలలో వంటలు చేయించడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఒక కార్యాలయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆ కార్యాలయపు అధికారి దక్షుడు అయి ఉండాలి దక్షుడు అయినటువంటి అధికారి ఉంటే కార్యాలయంలోని అన్ని పనులు సక్రమంగా సమయానుకూలంగా జరుగుతూ ఉంటాయి అదే దక్షుడు కానటువంటి అసమర్ధుడు అయినటువంటి సోమరిపోతు అయినటువంటి అధికారి గనక ఉంటే ఆ కార్యాలయంలో పనిచేసే వాళ్లు కూడా సక్రమంగా పనిచేయకుండా పనులన్నీ వాయిదా వేస్తూ ఆ కార్యాలయం మొత్తం ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ కార్యాలయపు పై అధికారి అది గమనిస్తే వెంటనే ఈ కార్యాలయం అధికారిని ఒక తక్కువ పని తక్కువ దక్షతగా నిర్వహించే స్థలానికి బదిలీ చేయటం పరిపాటి

ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై

యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్

ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై

ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్ |

ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని నిర్వహించాలని అనుకుంటే దానిని మూడు రకాల మనుషులు చేయ పూనుకుంటారు సమర్ధుడు అన్నవాడు ఆ కార్యం పూర్వపరాలు పూర్తిగా పరిశీలించి వాటిలోని ఒడిదుడుకులను సమన్వయపరచుకొని ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా వాటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఆ కార్యాన్ని చేస్తాడని అదే మద్యములు ఆ కార్యాన్ని ప్రారంభించి కొంత మటుకు నిర్వహించి ఇక తమ వంతు పని అయిపోయిందని పూర్తి కార్యం చేసే సమర్థత తమకు లేదని మధ్యలోనే జారుకుంటారని నీచ మానవులు ఆ కార్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయటానికి కూడా కోనుకోవాలని అవి అభిప్రాయపడుచున్నాడు మనం సమాజంలో కూడా ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ చూస్తూ ఉంటాం కొంతమంది శక్తికి మించిన పనిని కూడా చాకచక్యంగా తమ తోటి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని నిర్వహించటం చూస్తూ ఉంటాం అదే కొంతమంది పని కొంత మటుకు మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన వారు ఉంటారు మనం అక్కడక్కడ కొన్ని గృహాలు సగం మటుకు నిర్మించబడి ఉండి వదిలేసిన చూస్తుంటాం దీనికి ఇది ఒక ఉదాహరణ అదే కొంతమందికి ఎంత ధనం ఉన్నా కూడా ఒక గృహాన్ని కూడా కొనలేరు ఎందుకంటే వాళ్లంతాటి వాళ్ళే అనుకుంటారు ఈ గృహాన్ని కొనటం అనేది తమ శక్తికి మించిన దాన్ని భావించి వాటి జోలికే పోరు ఆ ధనాన్ని ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో వాళ్లు తమ జీవితాన్ని గడుపుతారు ఇటువంటి వారు వాళ్ళు సుఖపడలేరు ఎదుటి వాళ్ళను కూడా సుఖపెట్టలేరు అనేది జీవిత సత్యం ప్రతి మనిషి ఒక దక్షిణంగా ప్రవర్తించి ప్రతి కార్యాన్ని నిర్వహిస్తే తన కుటుంబాన్ని అదేవిధంగా సమాజాన్ని చక్కగా అనుసంధానం చేసుకుంటే సమాజంలో అందరూ సుఖసంతోషాలతో ఉండదక్షత' అంటే సమర్ధత అనే అర్ధం మనం సాధారణంగా తీసుకుంటాము. ఒక ఉద్యోగం ఎవరికైన ఇవ్వాలంటే ముందుగా వ్రాత పరీక్ష పెట్టి తరువాత మౌఖిక పరీక్ష పెట్టి ఆ అభ్యర్థి సమర్ధత కలిగి ఉన్నాడా లేదా అని పరీక్షించిన తరువాత ఉత్తీర్ణత సాధించిన వారికి వారి ఉత్తీర్ణతల స్థాయిలను బట్టి ఉద్యోగాలు ఇవ్వటం పరిపాటి. అంటే ఏదైనా ఉద్యోగం ఒక వ్యక్తికీ ఇవ్వాలంటే ఆ ఉద్యోగ బాధ్యతలను సదరు వ్యక్తి దక్షతతో నిర్వహించగలడు అని అధికారులకు కలిగిన తరువాతే ఎంపిక చేస్తారు. ఇది మనం నిత్యం చూస్తున్నాము. 

దక్షత అంటే సామర్థ్యం, నైపుణ్యం, లేదా పనిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి అని అర్థం. ఇది పరిపాలనలో చురుకుదనాన్ని, బాధ్యతను, మరియు పనితీరులోని పరిణితిని సూచిస్తుంది. ఇది సాధారణంగా వ్యాపార, పరిపాలనా, లేదా వ్యక్తిగత సామర్థ్యాన్ని తేలియచేస్తుంది. దక్షత కేవలం ఉద్యోగంలోనేనా లేక ఇతర విషయాలలో కూడా అవసరమా అంటే నిత్యజీవితంలో ప్రతి కార్యం సమర్ధవంతంగా చేయటానికి దక్షత అవసరం ఉంటుంది అని చెప్పవచ్చు. మనకు ఒక సామెత వున్నది అదేమిటంటే మట్టికి పోయిన ఇంటివాడే పోవాలి. నిజానికి మట్టిని తేవటం అనేది చాలా చిన్న పని. అక్కడ ఎటువంటి దక్షత అవసరం లేదు. కానీ అదే దక్షుడు అయిన సొంతమనిషి వెళితే చక్కటి మట్టిని వెతికి తీసుకొని వస్తాడు అనే భావంతో దీనిని వాడుతారు. ఒక సంసారి ఇంటిని నిర్వహించటానికి కూడా దక్షత అవసరం అని అంటాడుభాస్కర శతక కవి. 

దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోట నుండి వే

లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁగల్ల గాదు ప్ర

త్యక్షము వాగులున్ వరద లన్నియు వచ్చిన నీరు నిల్చునే

యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!

ఏరకంగా అయితే కట్టలు తెగిన చెరువులోని నీరు నిలవకుండా పడుతుందో అదే రకంగా ఇంటి యజమాని సమర్ధుడు కాకపొతే ఇంట్లోని ద్రవ్యం మొత్తం వృధాగా ఖర్చు అయి ఆ యిల్లు కష్టాల పాలు అవుతుందని చెపుతున్నాడు కవి. 

దక్షుని లక్షణాలు ఎలా వుంటాయో కూడా ఏనుగు లక్ష్మణ కవి సుభాషితాలలో తెలిపాడు. 

ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జపై,

నొకచోశాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం, అర్ధం

బొక్కచో బొంత ధరించు, నొక్కొక తఱిన్ యోగ్యాంబర శ్రేణి, లె

క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్గ

అనగా కార్యసాధకుడైన వాడు తన సౌకర్యములను గూర్చి గాని, లేదా వ్యవస్థను గూర్చి గాని చింతించడు. క్లిష్టమైన పరిస్తితులైన లేక చాలా సౌకర్యమైన పరిస్తితులైన అన్నిటిని సమానంగా చూస్తూ కేవలం తన ద్రుష్టి మాత్రం తాను నిర్వహించవలసిన కార్యం మీద మాత్రమే నిలుపుతూ కార్యాలను సాధిస్తాడని అంటున్నాడు కవి. 

దక్షత కలిగిన వాడే చేసే ప్రతి పని ఎంతో నైపుణ్యం గా పరిపూర్ణంగా ప్రశంసాత్మకంగా సత్వరం జరిగేటట్లుగా ఉంటుంది అని వేరే చెప్పనవసరం లేదు. ఏ పనిలో ఆయన ఆ పని చేసే విధానంలోనే చేసే వాడి యొక్క దక్షత తెలుస్తుంది మనం ఎంతో చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉండేటటువంటి పెద్ద పెద్ద భవంతులని చూస్తూ ఉంటాం అంత చక్కటి భవంతులు కట్టాలంటే ఆ నిర్మించిన మేస్త్రీలు తప్పకుండా దక్షులై ఉండాలి అని వేరే చెప్పనవసరం లేదు. అదే పెద్ద చిన్న పనిలో కూడా దక్షత ఎంతో అవసరం ఒక కార్యంలో చక్కగా వంట చేయడం కూడా ఒక దక్షత గమనించవచ్చు రాజ్యాంగ మనం ఏ పెళ్లిళ్లలో కానీ ఫంక్షన్లలో కానీ వెళ్లి భోం చేస్తే అక్కడ వంట ఎవరు చేశారు చాలా బాగా చేశారు అని వంట చేసిన వారిని మెచ్చుకోవటం పరిపాటి ఎంతో ఖర్చుపెట్టినా ఆ ఫంక్షన్ నిర్వహించిన యజమానిని అస్సలు చదవాలి అదే వంట సరిగా చేయకపోతే ఆ యజమాని ఎంత ఖర్చు పెట్టినా అందరి చేత మాట పడాల్సి వస్తుంది అందుకని వంటవారు ఎక్కువ అడిగినా గాని పేరు ఉన్న వంట వాళ్ళని ఎంచుకొని కార్యాలలో వంటలు చేయించడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఒక కార్యాలయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆ కార్యాలయపు అధికారి దక్షుడు అయి ఉండాలి దక్షుడు అయినటువంటి అధికారి ఉంటే కార్యాలయంలోని అన్ని పనులు సక్రమంగా సమయానుకూలంగా జరుగుతూ ఉంటాయి అదే దక్షుడు కానటువంటి అసమర్ధుడు అయినటువంటి సోమరిపోతు అయినటువంటి అధికారి గనక ఉంటే ఆ కార్యాలయంలో పనిచేసే వాళ్లు కూడా సక్రమంగా పనిచేయకుండా పనులన్నీ వాయిదా వేస్తూ ఆ కార్యాలయం మొత్తం ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ కార్యాలయపు పై అధికారి అది గమనిస్తే వెంటనే ఈ కార్యాలయం అధికారిని ఒక తక్కువ పని తక్కువ దక్షతగా నిర్వహించే స్థలానికి బదిలీ చేయటం పరిపాటి

ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై

యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్లు

ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై

ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్ |

ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని నిర్వహించాలని అనుకుంటే దానిని మూడు రకాల మనుషులు చేయ పూనుకుంటారు సమర్ధుడు అన్నవాడు ఆ కార్యం పూర్వపరాలు పూర్తిగా పరిశీలించి వాటిలోని ఒడిదుడుకులను సమన్వయపరచుకొని ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా వాటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఆ కార్యాన్ని చేస్తాడని అదే మద్యములు ఆ కార్యాన్ని ప్రారంభించి కొంత మటుకు నిర్వహించి ఇక తమ వంతు పని అయిపోయిందని పూర్తి కార్యం చేసే సమర్థత తమకు లేదని మధ్యలోనే జారుకుంటారని నీచ మానవులు ఆ కార్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయటానికి కూడా కోనుకోవాలని అవి అభిప్రాయపడుచున్నాడు మనం సమాజంలో కూడా ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ చూస్తూ ఉంటాం కొంతమంది శక్తికి మించిన పనిని కూడా చాకచక్యంగా తమ తోటి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని నిర్వహించటం చూస్తూ ఉంటాం అదే కొంతమంది పని కొంత మటుకు మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన వారు ఉంటారు మనం అక్కడక్కడ కొన్ని గృహాలు సగం మటుకు నిర్మించబడి ఉండి వదిలేసిన చూస్తుంటాం దీనికి ఇది ఒక ఉదాహరణ అదే కొంతమందికి ఎంత ధనం ఉన్నా కూడా ఒక గృహాన్ని కూడా కొనలేరు ఎందుకంటే వాళ్లంతాటి వాళ్ళే అనుకుంటారు ఈ గృహాన్ని కొనటం అనేది తమ శక్తికి మించిన దాన్ని భావించి వాటి జోలికే పోరు ఆ ధనాన్ని ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో వాళ్లు తమ జీవితాన్ని గడుపుతారు ఇటువంటి వారు వాళ్ళు సుఖపడలేరు ఎదుటి వాళ్ళను కూడా సుఖపెట్టలేరు అనేది జీవిత సత్యం ప్రతి మనిషి ఒక దక్షిణంగా ప్రవర్తించి ప్రతి కార్యాన్ని నిర్వహిస్తే తన కుటుంబాన్ని అదేవిధంగా సమాజాన్ని చక్కగా అనుసంధానం చేసుకుంటే సమాజంలో అందరూ సుఖసంతోషాలతో ఉండగలుగుతారు 

గుతారు 

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - షష్ఠి - విశాఖ -‌‌ ఇందు వాసరే* (09.03.2026)

ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పాపకర్మలవలన ప్రజలు

 శ్రీరామ (106)

                             శుభోదయం.

🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

పాపకర్మలవలన ప్రజలు దుఃఖాలను అనుభవిస్తున్నారు అన్నది సామాన్యంగా అందరూ అనేదే.

కానీ నిజానికి సరైనబోధ లేక ప్రజలు దుఃఖాలను అనుభవిస్తున్నారు.

" లాభస్తేషాం, జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః, ఏషా మిందీవరశ్యామో హృదయస్థో 

జనార్దనః "

(నల్లకలువ ఛాయవంటి మేనిఛాయకలిగిన జనార్దనుడు ఎవరి హృదయంలో ఉంటాడో, వారిదే లాభం, వారిదే జయం.వారికి పరాభవం సంభవించటం అనే మాటే లేదు)

మొదలగు శాస్త్రవాక్యములు భగవంతునియందు మనస్సు లగ్నం చేస్తే సమస్త శుభ ఫలితములు లభిస్తాయని తెలియజేస్తున్నాయి.

ఈ బోధను పట్టించుకోనందువల్లే మనకు దుఃఖాలు.

' సూతసంహిత ' ఈవిధంగా చెబుతోంది.

" ఎవని మనస్సు బ్రహ్మ విచారణయందు క్షణకాలమైనను స్థిరముగా నుండునో అతడు భూమండలములోని సమస్త తీర్థజలములందు స్నానము చేసినవాడగును.

సమస్త భూమిని దానం చేసినవాడగును.

వేయి యజ్ఞములు చేసినవాడును,

సకల దేవతలను పూజించినవాడును,

తన పితరులను సంసారమునుండి ఉద్ధరించినవాడును, అగును.

అతడు మూడులోకములందును పూజింపబడు వాడగును.

ఎవని మనస్సు అపార జ్ఞానానంద సాగరమగు పరబ్రహ్మ యందు లీనమగునో,

 అతనిచే వంశమంతయు పవిత్రమగును.

అతని తల్లి కృతార్థురాలగును.

అతడు నివసించే భూమి పుణ్యభూమి యగును.

(శ్లో// స్నాతం తేన సమస్త తీర్థ సలిలే సర్వా ౽ పి దత్తావని /

ర్యజ్ఞానాం చ సహస్ర మిష్ట మఖిలా దేవాశ్చ సంపూజితాః /

సంసారాచ్చ సముద్ధృతాః స్వ పిత‌ర స్త్రైలోక్య 

పూజ్యో ౽ ప్యసౌ /

యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాత్ /

కులం పవిత్రం, జననీ కృతార్థా, విశ్వంభరా పుణ్యవతీ చ తేన /

అపార సంవిత్సుఖ సాగరే ౽ స్మిన్ లీనం పరేబ్రహ్మణి యస్య చేతసః //

(సూతసంహిత - 2 - 20 - 45)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

9-3-'26.