ఆవుతో అధ్బుత వైద్యం -
రక్తపైత్య రోగానికి -
• రక్తపైత్య రోగం అనగా నోటివెంట దగ్గినప్పుడు రక్తం పడటం .నాటు ఆవుపాలు పావు లీటరు తీసుకుని గిన్నెలో పోసి దానిలో మంచినీరు 1 1/4 లీటరు కలిపి చిన్న మంట పైన నీరంతా ఇగిరిపోయి పాలు మిగిలే వరకు మరగబెట్టి దించి చల్లారిన తరువాత ఆ పాలను ప్రతిరోజూ తాగుతూ ఉంటే దగ్గులో రక్తం పడే రక్త పిత్త వ్యాధి కొద్దిరోజులలోనే తగ్గిపోవును .ఇంత సులువైన మందు యే వైద్య విధానంలో లేదు .
• విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి -కాచిన ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో పటికబెల్లం పొడి 30 గ్రా , ఆవునెయ్యి 20 గ్రా , లక్కపొడి 2 గ్రా కలిపి ఒక మోతాదుగా రోజు రెండుపూటలా తాగిస్తూ ఉంటే ఒకటి లేక రెండు వారాలలో విరిగిపోయిన ఎముకలు తప్పకుండా అతుక్కుంటాయి.
• అతి కఫం హరించుట కొరకు -రోజు రెండు పూటలా పావు లీటరు ఆవుపాలలో ఒక గ్రాము మిరియాల పొడి , పటికబెల్లం పొడి 20 గ్రాములు కలిపి తాగుతూ ఉంటే ప్రకోపించిన అతి కఫం అదృశ్యం అవుతుంది.
• పాండు రోగం , క్షయ హరించుట కొరకు -ఇనుప పాత్రలో కాచబడిన ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో తగినంత కండ చక్కర పొడి కలిపి రోజు పరగడపున సేవిస్తూ ఉంటే క్రమంగా పాండురోగం పారిపోయి రక్త వృద్ది కలుగుతుంది. క్షయవ్యాధి బహు త్వరగా పారిపోతుంది.
• ఎక్కిళ్లు వెంటనే తగ్గుట కొరకు -కాచిన ఆవుపాలు పావు లీటరు మోతాదుగా పటికబెల్లం పొడి కలిపి గోరువెచ్చగా కొంచంకొంచం తాగుతూ ఉంటే అప్పటికప్పుడే ఎక్కిళ్లు తగ్గుతాయి
• పిల్లల ఆరోగ్యానికి -అప్పటికప్పుడు చిలికిన మజ్జిగ నుంచి తీసిన ఆవువెన్న ని పసిపిల్లల అన్నప్రాసన రోజు నుంచి ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం వేళ్ళల్లో వయసుని బట్టి పూటకు ఒక గ్రాము నుంచి పెంచుకుంటూ 10 గ్రాముల వరకు తినిపిస్తుంటే ఆ పిల్లల శరీరం ఉక్కులా బలంగా తయారు అయ్యి అవయవాలు అందంగా ఉంటాయి. తెలివి పెరుగును.
• సంభోగ సుఖం కొరకు -గోరువెచ్చని ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో పటికబెల్లం పొడి 25 గ్రా కలిపి మొదటిసారి సంభోగం అయ్యాక వెంటనే సేవిస్తే ఆ సంభోగం తాలుకు నీరసం తగ్గిపోవడమే కాక తిరిగి త్వరగా మరలా సంభోగం చేయగల శక్తి లభించును.
అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి