14, జులై 2026, మంగళవారం

నిర్లక్ష్యమా నీ అంతం ఎప్పుడు 6*

  *నిర్లక్ష్యమా నీ అంతం ఎప్పుడు 6*




*3) త్రిచక్ర వాహనములు ii* సాధారణ ఆటో రిక్షాలతో (నలుగురు మాత్రమే = 3+1) బాటు OLA మరియు RAPIDO సంస్థల ఆటోలు గూడా అధిక సంఖ్యలో దివారాత్రములు ప్రజలకు అందుబాటులో ఉండడం వలన రహదారులకు విశ్రాంతి ఉండదు. రహదారులపై ఎప్పుడుజనాల సందడి ఉంటూనే ఉంటుంది. *పెద్ద ఆటో రిక్షాలు* ఈ రవాణా వాహనాలలో డ్రైవర్ ప్రక్కన ఇద్దరు (1+2=3), ఆటో అంతర్ భాగంలో ఆరుగురికి (7) స్థానం కల్పిస్తారు (నిబంధనలకు విరుద్ధమైనా), గమ్యస్థానాలు చేరుస్తారు. ఇటువంటి పెద్ద ఆటో రిక్షాలు హైదరాబాద్ నగరంలో అధికంగా అగుపడ్తాయి. *పాఠశాల విద్యార్థుల రవాణా ఆటోలు* ఈ ఆటోలలో కూడా దాదాపు ఆరుగురు (1+6) విద్యార్థుల వరకు ప్రయాణింపజేస్తారు. 

 *LPG cylinder ఆటోలు* దాదాపు అన్ని LPG సంస్థలు గృహ, ఉపాహార/ఫలహార (Hotels), భోజనశాలల (Restaurants), వసతి గృహాల (Lodges), పారిశ్రామిక సంస్థల అవసరాలకు LPG cylinder లను ఆటో రిక్షాలలో చేరవేస్తూ ఉంటారు. వీటి అగ్రభాగాన ఇనుప పంజరం (net) లాంటి అమరికలు ఉండనందున, ఒక్కొక్కసారి సిలిండర్లు క్రిందపడి ప్రమాదాలకు హేతువులవుతుంటాయి. ఈ సంఘటనలన్నీ కనిష్ట స్థాయిలో ఉన్నా ప్రమాదాలు ప్రమాదాలే. *Trailor trolley auto లు* త్రిచక్ర వాహనాలకే వెనుక వైపు Trolley లు అమర్చి గృహ, దుకాణ సముదాయ, వాణిజ్య మరియు దినసరి సరుకులు రవాణా చేస్తూ ఉంటారు.


ప్రయాణ ఆటో రిక్షాల అతి వేగము, అదాట్టు (sudden) మళ్లింపులు, రహదారిలో ఇతర వాహనాల మధ్యలో దూరడం, నియమ నిబంధనలు పాటించకుండా ఆటోలను పరుగెత్తించడం వలన ప్రమాదాలు అధికమవుతాయి.


*విజ్ఞప్తి:-* రహదారిలోనున్న తోటి జనుల నిరాసక్తత, నిర్లక్ష్యం, నిస్తేజం రహదారి ప్రమాదాలను ప్రోత్సహించేవిగా ఋజువవుతాయి. బుద్ధి జీవులందరు ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలి. *ప్రతి సమస్య రక్షక భటులే ఆరి కట్టాలి అని భీష్మించుకుని ఉండరాదు*.


ధన్యవాదములు

*(సశేషం)*

నీవు ఎవరు?*

 *నీవు ఎవరు?* 


ఈ ఒక్క ప్రశ్నకు ఆది శంకరుని సమాధానమే "ఆత్మ షట్కం" లేదా "నిర్వాణ షట్కం". 8 ఏళ్ల బాలుడిగా ఆయన చెప్పిన 6 శ్లోకాలలో మనం పొరపాటుగా "నేను" అనుకుంటున్నవన్నీ ఒక్కొక్కటిగా తొలగిస్తాడు.




*1. నేను శరీరం, మనస్సు కాదు*  

మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం – ఇవి నన్ను గమనించే పరికరాలు. నేను వాటిని చూసే "సాక్షిని".


*2. నేను ఇంద్రియాలు, శరీర వ్యవస్థలు కాదు*  

ఆరోగ్యం, అనారోగ్యం, ఆకలి, నిద్ర – ఇవి శరీరానివి. నేను వాటికి అతీతుడిని.


*3. నేను భావాలు, లక్ష్యాలు కాదు*  

కోపం, ప్రేమ, లోభం, ధర్మ-అర్థ-కామ-మోక్షం – ఇవన్నీ వచ్చిపోయేవి. నేను స్థిరంగా ఉండే సత్యాన్ని.


*4. నేను పుణ్య-పాపం, మతాచారాలు కాదు*  

నేను తినేవాడిని కాదు, తినేది కాదు, తిండి కాదు. నేను ఏ కర్మకు కట్టుబడి లేను.


*5. నేను బంధాలు, పాత్రలు కాదు*  

తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు – ఇవి జీవితంలోని పాత్రలు మాత్రమే. నా అసలు స్వరూపం వీటితో నిర్వచించబడదు.


*6. నాకు బంధం లేదు, మోక్షం కూడా అవసరం లేదు*  

ఎందుకంటే నేను ఇప్పటికే స్వేచ్ఛగా, పూర్ణంగా, ఆనంద స్వరూపుడిని.


 నేటికి దీని అర్థం ఏమిటి?

పని, సంబంధం, డబ్బు, ఆరోగ్యం – ఏది విఫలమైనా "నేను విఫలమయ్యాను" అనకు. "పరిస్థితి అలా ఉంది, కానీ నేను మాత్రం మారను" అని గుర్తుంచుకో. నువ్వు నీ పాత్ర కాదు. నువ్వు పాత్ర పోషిస్తున్నవాడివి.


ఆచరణ: 

శివోహం

"శివ" = పవిత్ర ఆనందం, "అహం" = నేను  

రోజూ 5 నిమిషాలు కళ్లు మూసి, ప్రతి శ్వాసతో "శివోహం" అనుకో. ఆలోచనలు వచ్చినా వదిలేసి మళ్లీ దానికే రా. నెమ్మదిగా నువ్వు ఎవరో అర్థమవుతుంది.


*ఒక్క వాక్యంలో:*  

నువ్వు శరీరం, మనసు, పేరు, హోదా కాదు. నువ్వు శాశ్వతమైన, సాక్షి రూపమైన, పవిత్ర ఆనందానివి. అదే "శివోహం".


శంకరుడు 8 ఏళ్లకే చెప్పాడు. మనం ఇప్పుడైనా గుర్తుచేసుకుందాం...


శ్రీ సద్గురు పీఠం....✍️


శివోహం 🙏